Posts

Showing posts from May, 2020

విజయ లక్ష్మి KS 38

విజయ లక్ష్మి గారి కవిత్వం ********************** 1 [02/06, 5:48 PM] Vijayalakshmi Ch KS 38: సమూహం :వీరాస్ కవి సమయం తేది :09-05-2020 పేరు :సి. హెచ్. విజయలక్ష్మి క్రమసంఖ్య :38 కవిత సంఖ్య :01 అంశం :అమ్మ శీర్షిక :గౌరవిద్దాం ***************** అమ్మా.. అన్న పిలుపుకు అమరత్వం అందించింది ఆమె ప్రేమామృతం తల్లి ప్రేమలో వుంది సేవాతత్వం అలుపెరుగని శ్రమజీవి కుటుంబానికి వెన్నెముక నాన్న సంపాదన ఆచి తూచి వెచ్చించే ఆర్ధిక మంత్రి ఉన్నంతలో బిడ్డల అవసరాలు తీర్చే కల్పవల్లి ఏ లోటూ లేకుండా చూసుకునే సమన్వయకర్త తాను పస్తున్నా బిడ్డ బొజ్జ నింపే అన్నపూర్ణ అనారోగ్యం లో అసహ్యించుకోకుండా అమిత ప్రేమతో సహనంతో పరిచర్యలు చేసే పరిచారిక బిడ్డ ఉన్నతి కోసం పాటు పడే ఆశా జీవి భర్త కోపానికి గురి కాకుండా కాపాడే రక్షణ కవచం అమ్మ తాను కరిగి పోతూ కుటుంబానికి వెలుగు నిచ్చే దివ్వె ఆమె సేవలు అమోఘం అజరామరం అమూల్యం అయినా దక్కదు సరైన గౌరవం ఆమెను గుర్తిద్దాం ప్రేమ పంచుదాం మన గుండెల్లో దాచు కుందాం 2 [02/06, 5:49 PM] Vijayalakshmi Ch KS 38: సమూహం :వీరాస్ కవి సమయం అంశం :విజేతవై వెలుగు కవి పేరు :సి. హెచ్. విజయల...