బండి భాను చందర్ poet
నిర్వహణ వీరా గుడిపల్లి సమన్వయం శివునూరి లలితాకృష్ణ *********************** భాను చందర్ కవిత్వం ************************ 1 [29/09, 7:30 AM] బండి భానుచందర్: పేరు : బండి భానుచందర్ శీర్షిక : మనస్సులో మాట కవిత : 1 అక్షరమై నిలిచాను కవితవై అల్లుకోవా అంబరమై వేచిఉన్నాను వెన్నెలవై చేరుకోవా ఉదయమై నిలిచిఉన్నాను వెలుగువై తరలిరావా నాకు నీ చెయ్యి అందిస్తే చితిలో ఉన్నా బ్రతికోస్తా ప్రేమించావంటే కనురెప్పనై కనుపాపను కాస్త నా జతగా నడుస్తానంటే మువ్వనై నీ పాదముపై నిలుస్తా నీవు నడిచే దారిలో పూలతోటనై వికసిస్తా దారి పొడుగునా కావలి కాస్తా చెలియా!.. అవునని చెప్పు నా అనువనువు నీదే నేనే నీవని చెప్పు నా ఊపిరంతా నీకే!.. - భాను 2 [29/09, 7:30 AM] బండి భానుచందర్: శీర్షిక : తొలిప్రేమ తన నవ్వుల వలలో చిక్కుకుంది నా నయనం తన నవ్వుల వెల్లువలో మునిగింది నా పయనం ...