Posts

Showing posts from June, 2020

నాయుడు మాట

Image
నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet సమన్వయం శివునూరి లలితాకృష్ణ గారు *******"*************"**** లక్ష్మీ నాయుడు లొగిశ గారు 1 28/02, 6:30 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: వైధవ్యంపొందిన స్త్రీ ఎదురు మంచిది కాదట.ఒకవేళ అలాంటి అమ్మ ఎదురొస్తే?అమ్మ ఎవరికైనా అమ్మ కాదా? -డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం. 2 [29/02, 6:40 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: శత్రువులు ప్రాణమిత్రులుగా...ప్రాణమిత్రులు ఆగర్భశత్రువులుగా మారడమే కాలంచేసే మాయాజాలమంటే! -డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం. 3 [01/03, 6:53 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: మండిపోతున్న ఎండనుండి ఇంటికొచ్చాను.ధుమధుమలాడుతూ మావిడ. ఎండేనయం. -డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం. 4 [02/03, 6:24 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: అమ్మని అనాధాశ్రమంలో చేర్చి వస్తుంటే వెనుకనుండి చెబుతోంది"నువ్వు జాగ్రత్త నాయనా" -డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం. 5 [03/03, 6:18 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: చేపల్నిమింగిన కొంగనయం....వాటిఆత్మశాంతికోసం జపం చేస్తుంది.మనిషే....మింగి మరిచిపోతున్నాడు. -డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం. 6 [...