గాండీవం 2020
పాల్వంచ హరికిషన్ గారి గాండీవాలు ********************************* గాండీవం ( అర్జున కవ"నానీ"యం.. ) 1. గాండీవం ఆశకు.. హద్దు లేదంటే పతనానికి.. పందిరేసిన్నట్లే 2. గాండీవం వంకతో బయటకొస్తే చంకనాకిపోతారు.. ఇంట్లోనే ఉంటే మిగిలిపోవొచ్చు.. 3. గాండీవం ఆడంబరాలకు పోతే.. ఆదరణ కోల్పోతారు..! ఆచి తూచి అడుగేస్తే ఆసరాకు మిగులుతరు 4. గాండీవం ఆశను అదుపులో ఉంచకపోతే.. విస్తరి కూడా విసుక్కుంటది..! 5. గాండీవం కనిపించని కరోనా నన్నేంచేస్తదనుకోకు.. కరెంట్ కనబడదుగా ఫిలమెంట్ ఎగరదూ.. 6. గాండీవం కరోనాకు బ్రేక్.. జీవితాలకు దివాళి లాక్ బ్రేకయ్యిందిగా కరోనాదే ఖవ్వాలి 7. గాండీవం సోపతి పేరుతో బయటికెళ్తివో.. ఆపతికి అడ్డంగా దొరికిపోతవ్.. 8. గాండీవం కనిపించేదే నిజమనుకుంటే.. కనిపించని దానితో కనుమరుగైతవ్...