గాండీవం 2020

 పాల్వంచ హరికిషన్ గారి గాండీవాలు

*********************************

గాండీవం

 (  అర్జున కవ"నానీ"యం..  ) 

1. గాండీవం 


ఆశకు.. 

హద్దు లేదంటే 

పతనానికి..  

పందిరేసిన్నట్లే


2. గాండీవం 


వంకతో బయటకొస్తే 

చంకనాకిపోతారు.. 

ఇంట్లోనే ఉంటే

మిగిలిపోవొచ్చు.. 


3.  గాండీవం 


ఆడంబరాలకు పోతే.. 

ఆదరణ కోల్పోతారు..! 

ఆచి తూచి అడుగేస్తే 

ఆసరాకు మిగులుతరు 


4.  గాండీవం


ఆశను అదుపులో 

ఉంచకపోతే.. 

విస్తరి కూడా 

విసుక్కుంటది..! 


5.   గాండీవం 


కనిపించని కరోనా

నన్నేంచేస్తదనుకోకు.. 

కరెంట్ కనబడదుగా 

ఫిలమెంట్ ఎగరదూ.. 


6.  గాండీవం


కరోనాకు బ్రేక్.. 

జీవితాలకు  దివాళి 

లాక్ బ్రేకయ్యిందిగా 

కరోనాదే ఖవ్వాలి 


7.   గాండీవం 


  సోపతి పేరుతో 

  బయటికెళ్తివో.. 

  ఆపతికి అడ్డంగా 

  దొరికిపోతవ్.. 


8.   గాండీవం 


కనిపించేదే 

నిజమనుకుంటే.. 

కనిపించని దానితో 

కనుమరుగైతవ్ 


9.  గాండీవం 


చిన్నప్పుడు 

పట్టుకుని నిలబడ్డట్టే.. 

పెద్దయ్యాక 

తట్టుకుని నిలబడు.. 


10.  గాండీవం 


బడా సాములకు

ఇచ్చేవి రాయితీలు..

సామాన్యులకు మాత్రం

కోతలు, వాతలు..! 


11.  గాండీవం


తోసినవాడికి 

తోరణాల భాజా.. 

తోయబడిన వాడికే 

మడత కాజా... 


12.  గాండీవం 


ఉద్యోగస్థులకు కట్ 

కరువు భత్యం.. 

నాయకులకు మాత్రం

కరోనా పత్యం 


13.  గాండీవం 


రైతులను వదలదే 

దళారుల పీడ..  

కాలాన్ని వదులునా 

కరోనా ఛీడ..!


14.  గాండీవం 


హృదయ విదారకం 

కరోనాతో మరణం..  

శవ దహనానికీ కూడా

నోచని తరుణం..! 


15.  గాండీవం 


కలం కన్నెర్రజేస్తే 

రాజ్యం కకావికలం..  

హలం ఆగ్రహిస్తే 

భోజ్యం అతలాకుతలం.. 


16.  గాండీవం 


కవిత్వం చిందాలంటే 

మనసు చిలకాలి 

లక్ష్యం చేరాలంటే 

ఆత్మశక్తిని కెలకాలి 


17.  గాండీవం 


అత్తదొకరోజు 

కోడలిదొకరోజు కాలం..   

ఇప్పుడు కరోనాదే 

ఎవరిదీ శాశ్వతం..  


18.  గాండీవం 


మెట్టెల ఖరీదు వేలు 

ధరించేది కాలి వేలు 

కుంకుమ ఖరీదు తాలు 

తరించేది నుదురే కాబోలు 


19.  గాండీవం 


ఎంతుంటేనేం 

అక్కరకు రానప్పుడు 

కరోనాతోనైనా తెలిసింది

ప్రాణమే విలువైందని 


20.  గాండీవం


ఆకలి, ఆలోచన 

ఏది గొప్పంటారు

కరోన నేర్పింది కదా  

బతకడమే గొప్ప అని 


21.  గాండీవం 


అహమాహాలు లేని

రక్షణ వ్యూహాలు.. 

కరోనాను కడతేర్చు

శానిటైజర్లు..


22  గాండీవం 


కరోనాకు లేనేలేవు 

జాతి వర్గ బేధాలు 

మనిషికి మాత్రమే 

అందుకే ఆపదలు 


23. గాండీవం 


గాడిద తన్నిందని

తిరిగి తన్నలేం

దుష్టులకు దూరంగా 

ఉంటేనే మేలు.. 


24.   గాండీవం 


అందరి శత్రువొక్కటే 

అయినా మారని మనిషి 

ఇంకనూ ఐక్యత లేకుంటే 

కరోనాతోనే మసి.. 


25.  గాండీవం 


ధర్మం పరిధి

చాలా సూక్ష్మం

మంచికి మంచి

చెడుకు చెడు 


26.    గాండీవం


వైద్యులు..

కర్తవ్య పరాయణులు

తమకు ప్రమాదమైనా

వైద్యో నారాయణ కదా


27.   గాండీవం 


అబధ్ధం అలవడితే 

నిజం నిష్టూరమే 

భ్రమల్లో బతికేవారు

కళ్ళున్న కబోధులు


28.  గాండీవం 


గుడ్డి నమ్మకాలు 

గుడ్డివైనవి కాబోలు 

కరోనా కరాళ నృత్యం 

కళ్ళెదుట కనిపిస్తుంటే.. 


29.  గాండీవం 


కరోనా.. 

వాస్తవ దృశ్యం 

మంత్రాలకు రాలని 

చింతకాయ చిత్రం 


30.  గాండీవం 


పంచాంగం పత్తాలేదు 

కరోనా అంటుకుందేమో 

అన్ని రాశులవారికీ 

అదృష్టం అటకెక్కింది


31. గాండీవం 


క్షవరానికెళితే..  

కరోనా హాయంది

దానికేం తెలుసు 

తాను వైరస్ నని


32. గాండీవం 


వ్యవసాయం.. 

రైతుకు అగ్నిపరీక్ష 

నాగలి నలిగేది.. 

దళారీ చేతుల్లోనే


33. గాండీవం 


మనిషేనా..

శవాలూ అనాథలే 

కరోనాతో పోతే

బంధాలు బండలాయె 


34. గాండీవం


పొగిడారని

సంబరపడొద్దు 

ముంచేసాక 

బాధపడొద్దు కదా 


35. గాండీవం


రాజ్యం రాజుది

సామ్రాజ్యం సామ్రాట్టుది

బలిదానమే..

బహుజనులదయ్యింది


36. గాండీవం 


కబళిస్తే గానీ

కళ్ళు తెరువరేం.. 

విపత్తొస్తుందని 

కాలమే చెప్పాలా.. 


37. గాండీవం


అద్దం పగిలింది..

నిజాన్ని దాయలేక

అబద్దమాడడం 

దానికేం ఎరుక.. 


38. గాండీవం 


ఎవరి చేతలు.. 

వారి తలరాతలు 

పరుల నాశనం కోరితే 

తామే అయినట్లు.. 


39. గాండీవం 


ఏడు తరాలు 

కూర్చొని తినొచ్చనేవారు 

మనం ఏడో తరమేమో

ఇప్పుడు చేస్తుందదే 


40. గాండీవం 


ఆయుధ దళపతి ఒకరు

ఉగ్రవాద పరపతి ఒకరు

కరోనా వరపతి ఇంకొకరు

జీవన స్థపతి మనమేనేమో 


41. గాండీవం 


కడుపు నిండినోనికి 

లాక్ డౌన్ సరే.. 

కడుపు మండినోనికి 

బతుకెట్ల గడవాలో.. 


42. గాంఢీవం 


రెక్కాడితే గాని   

డొక్కాడనిదెందరో.. 

రెక్కాడకున్నా 

సుఖపడేదీ అందరే.. 


43. గాండీవం 


కరోనాతో.. 

దేశాలు కకావికలం 

మూలం కనిపెడితే 

సకలం కుశలం..  


44. గాండీవం 


లాక్ డౌన్.. 

పద్మవ్యూహమే 

వలస కూలీలే..  

అభిమన్యులైరి


45.   గాండీవం 


ఉత్తర క్రియలకు 

నోచని శవాలు 

కరోనా అంటునన్న

అమానవీయ వీచికలు 


46. గాండీవం 


ఆప్తులున్నా 

దిక్కులేని చావులు 

మానవత్వానికి

కరోనా అంటుకుంది 


47. గాండీవం 


చూస్తున్నోడికి సరదా 

అంటినోడికి పరదా 

కరోనా కరవాలం 

వాస్తవ దర్పణం 


48.  గాండీవం 


పేదవాడిగా పుడితే 

కాళ్ళల్ల కట్టే..

ఉన్నవాడుగా పుడితే 

నెత్తిన గుట్టే.. 


49. గాండీవం 


పాలకులు మారితే 

పాలనా మారదా

రాజులు లేకపోవొచ్చు

రాజ్యాలు మారినవంతే! 


50.  గాండీవం 


లేనోడు పోకుండా 

అన్నం పెట్టరు కాని

ఉన్నోడు పోతే విగ్రహం 

మాలేసే మానవోత్తములు 


51.  గాండీవం 


చెప్పులు లేవని 

ఏడ్చుడెందుకు 

కాళ్ళు లేనోన్ని చూడు.. 

అదృష్టమెవరిదో? 


52.  గాండీవం 


మోసేది బరువనుకుంటే 

దించేయొచ్చు 

బాధ్యత అనుకుంటే 

మోసేయొచ్చు.. 


53.  గాండీవం 


నాకేంటి అనుకుంటే..  

ఒక్కరిగా మిగులుతరు

నేను కూడా అంటే..  

అందరిలో కలుస్తరు 


54.  గాండీవం 


అహం తగ్గిన రోజు 

ఆప్యాయత తెలుస్తుంది 

గర్వం పోయిన రోజు 

గౌరవం పిలుస్తుంది 


55.  గాండీవం 


రూపం చూసి మోసపోతే 

రూపాంతరమే.. 

రూపాయి చూసి మురిస్తే 

ఛూమంతరమే.. 


56.   గాండీవం 


అక్రమంగా.. 

ఏమి సంపాదించినా 

సక్రమంగా.. 

నిద్రను పొందలేరు 


57.   గాండీవం 


కోపంతో ధనం.. 

సంపాదించలేము

ద్వేషంతో గుణం.. 

సంపాదించలేము 


58.  గాండీవం 


మంచి కోసం మారితే 

మనిషంటారు

అవసరం కోసం మారితే 

మారీచుడంటారు 


59.  గాండీవం 


నటించే వాడినే.. 

మంచివాడంటారు 

మంచితనాన్ని గుర్తించే 

మంచితనం ఎక్కడుంది 


60.  గాండీవం 


అభిమానం.. మనిషిని 

దేవునిగా మార్చగలదు 

అవమానం మనసుని 

ఏమార్చగలదు..! 


61.  గాండీవం 


శ్రమ దోపిడిని 

పెకిలిస్తున్నది.. గళమే 

దళారీ దోపిడికి 

బలవుతున్నది.. హలమే 


62.  గాండీవం 


కవిత్వమంటే

కరవాలమే..

నిర్భయంగా..

నిజం చెప్తుంది 

 

63.  గాండీవం 


వ్యవహారం.. 

ఆశించి చేసేది 

ఆశించకుండా చేస్తే

సహాయమే.. 


64. గాండీవం


ఆశకు.. 

హద్దు లేదంటే 

పతనానికి..  

పందిరేసిన్నట్లే 


65. గాండీవం


తప్పు చేస్తే 

సంతోషం కరువు.. 

మోసం చేస్తే 

మనశ్శాంతి కరువు.. 


66.  గాండీవం 


జుట్టు పెరిగితే..  

తలకే భారం 

దూరం పెరిగిందో..

బంధమే భారం  


67.   గాండీవం 


లాక్ డౌన్..  

కొందరికి పండగ 

పేదలకేముంది

ఖాళీ కడుపుండగ  


68. గాండీవం


మానవ వనరులు 

పెరిగి ఏం లాభం

నిరుద్యోగానికి

నివారణ లేదాయె


69. గాండీవం


కమ్మగుంటే 

కదలనిస్తుందా.. 

కలిసుంటే 

కలుగనిస్తుందా.. 


70. గాండీవం 


నేతలకు వరం 

పెయిడ్ ఆర్టిస్ట్లు 

సభలు ర్యాలీలు

కళకళలాడొద్దా.. 


71. గాండీవం 


అతిగా స్పందించే

సెన్సిటివ్ తను

గుండె నిండా

తడి నింపుకున్నది


72. గాండీవం 


పవనాలు బలంగా

వీస్తున్నాయి

అవినీతి స్వార్థం 

అంతమొందునట్లు 


73.గాండీవం


మానవ వనరులు 

పెరిగి ఏం లాభం

నిరుద్యోగానికి

నివారణ లేనిది 


74. గాండీవం 


నిర్లక్ష్యంతో.. 

వైరస్ కొద్దు బలి 

స్వీయ నియంత్రణతో

కావొచ్చు కబాలి.. 


75.  గాండీవం 


కరోనాది.. 

అల్లకల్లోలమే.. 

మరి మనిషి 

చేస్తున్నదేమిటి.. 


76.  గాండీవం 


కరోనాకు..  

ఎజెండా ఏముంది 

ఆయువు హరించడమే 

మనుషులకు ఎన్నో.. 


77. గాండీవం 


జీవం లేని కరోనా..

దుష్ట ప్రయోగ ఫలితం

రేపటి ప్రపంచానికిది 

జీవాయుధ జ్వలితం.. 


78. గాండీవం


విలువ లేని వారితో 

వాదించొద్దు..

వారి విలువ

పెంచడమెందుకు.. 


79.  గాండీవం 


గెలవడమంటే..

కష్టాన్నెదుర్కోవడం

ఎలాగైనా గెలవడం

దారి తప్పడమే..


80.  గాండీవం 


అన్న మాట.. 

నోరు మరువొచ్చు

విన్న చెవి విడువదు  

మాటకు మీటుండాలి.. 


81. గాండీవం 


బంధం..

బాధ పంచుకోవాలి 

పెంచుకున్నదంటే.. 

బంధించబడినట్లే 


82.  గాండీవం 


ప్రతీ విజేత..  

ముందు పరాజితుడే

నేర్చుకోవడమనే 

వారధి దాటొస్తాడు.. 


83.  గాండీవం 


బంధాలను..  

మరచిన మనిషి

ఒంటరైతున్నడు

తోడెవరు మిగలక.. 


84.   గాండీవం 


పనిపాట లేక..

ఉన్నోడు పొద్దెరుగడు 

పని దొరకక.. 

లేనోడు వృధ్ధెరుగడు.. 


85. గాండీవం 


మనసుకు.. 

గాయం అయితే

మనిషికి దూరమెందుకు 

కారణం తెలియంది.. 


86.  గాండీవం 


పుట్టినపుడు పేరు..

గిట్టినపుడు ఊపిరుండవు

వారధి.. 

జీవితమే కదా  


87. గాండీవం 


బ్రేక్ దొరికిందని 

సంబరపడి.. 

శాశ్వతం కాకుంటే  

బాధపడడమెందుకు.. 


88.  గాండీవం 


ఒక్కసారి వెనక్కు 

తిరిగి చూడు.. 

గతం తెలుస్తది 

తిరిగి రాదని కూడా.. 


89. గాండీవం 


నేల చల్లగుంటేనే 

మనకు బతుకు

ఎందరికి తెలుసు

నేల కన్నతల్లని.. 


90.  గాండీవం 


విస్తరి..

తిన్న తర్వాత పడేస్తాం 

మనిషి కూడా 

ఊపిరున్నంత వరకే.. 


91. గాండీవం 


గెలవాలంటే 

యుధ్ధం చేయాల్సిందే..  

కానీ ఒంటరిగా..   

చేసేది కరోనాతో కదా 


92.  గాండీవం 


హలాహలం పోయి 

అమృతం రాదేమో

అంటరానితనం 

అటకెక్కనందాక


93.  గాండీవం 


కర్షకులు..  

వ్యవసాయం చేస్తే

కర్మ సాయం.. 

కార్మికులదవ్వదా


94  గాండీవం 


కరచాలనమే 

ఇప్పుడు సింహస్వప్నం 

మనిషిని మింగే  

మెత్తని ఆయుధం 


95.  గాండీవం 


కరోనాకు..

కనికరం లేదు

ఇంకా మనిషికి.. 

కనువిప్పు కలగదేం


96. గాండీవం 


ఈదడం నేర్చుకో 

కష్టాల కడలిని.. 

కరోనా నేర్పిన 

గుణపాఠంతోనైనా.. 


97. గాండీవం 


దేనికోసం.. 

ఆరాటం ఇంకా

కరోనా నేర్పలేదా 

బతికితే చాలని 


98.  గాండీవం 


ప్రపంచమంతా 

అతలాకుతలం 

కలి మాయ కాదిది 

కరోనా ఛాయ.. 


99.  గాండీవం 


డబ్బున్నోళ్ళ వెనుకే

నువ్వు ఉంటే.. 

నీ వెనుక ఎవరుంటారు 

ఆలోచించవా.. 


100.  గాండీవం 


మగవారి తలరాత 

బ్రహ్మ రాసేది

పెళ్ళయ్యే వరకే.. 

తర్వాత భార్య రాస్తుంది.. 


101. గాండీవం 


లాక్ డౌన్ 

మినహాయింపులు 

జనం స్లీప్ డౌన్ కు 

చదివింపులే.. 


102. గాండీవం 


మూర్ఖులతో వాదన 

మృతదేహానికి వైద్యమే.. 

వైద్యానికి అది 

స్పందించదు కదా.. 


103. గాండీవం 


లేనోడికి..  

కావాలన్న ఆశ

ఉన్నోడికి.. 

దురాశ ఎక్కువ మరి


104. గాండీవం 


ఓడిన వాడు 

గెలుపు చూడాలి 

గెలిచిన వాడికి 

స్థాయి కూడాలేమో


105. గాండీవం 


గడిచిన కాలం.. 

బాగనిపిస్తుంది 

తిరిగి రానిదది 

అనుభవం పాఠమే.. 


106. గాండీవం 


పోయే కాలం 

దాపురించింది.. 

చేసిన పాపం 

పండిందన్నట్లు.. 


107. గాండీవం 


ఏ కాలమైనా.. 

ఇంట్లోనే ఉంటారా 

ఇప్పుడున్నారంటే..  

మాయరోగం వస్తుందనే 


108. గాండీవం 


ఎవరో చెప్పడం

నువ్వు వినడం కాదు

నీకు నచ్చింది చెయ్.. 

నీ భవితనెరిగి..! 


109. గాండీవం 


కష్టం రాకపోతే.. 

సుఖం విలువ తెలియదు 

సుఖానికే అలవాటైతే 

కష్టమే మరి..! 


110. గాండీవం 


మనసులో కుళ్ళు

గొంతులో విషంతో

నడత వద్దు.. 

స్వయం వంచనే అది.. 


111. గాండీవం 


గుడి బయట.. 

అడుక్కునేవారు

లోపల మొక్కేవారూ 

ఇద్దరూ యాచకులే


112.  గాండీవం 


కళ్ళకు నచ్చితే 

మరచిపోతారు

మనసుకు నచ్చితే 

చచ్చినా మరువరే.. 


113. గాండీవం 


చేసిన చెడ్డపని..

వెంటాడుతుంది 

మంచిపని మాత్రం..

కాపాడుతుంది 


114. గాండీవం 


నిజం నిప్పులాంటిది 

కాల్చుతుంది 

అబధ్ధం అప్పులాంటిది 

పీల్చుతుంది 


115. గాండీవం 


గురువు తరువు 

ఒక్క తానులే 

జీవన నావకు 

చుక్కానీలే కదా 


116. గాండీవం 


కరోనాతో.. 

ప్రపంచం లాక్ డౌన్ 

మనిషి చేతలతో..

జీవనం బ్యాక్ డౌన్ 


117. గాండీవం 


ప్రతీ విషయం

గుడ్డిగా నమ్మొద్దు

మోసపోతే గానీ

అర్థమవ్వదు మరి.. 


118. గాండీవం 


నీ ఆలోచన ..

కళ్ళలో కాంతి నింపాలి 

భ్రాంతి నిండిందంటే.. 

నీలో వివేచన లేనట్లే..!


119. గాండీవం 


ఎక్కువయ్యినప్పుడే

డబ్బు.. 

వస్తుంది చులకన చేసే

జబ్బు.. 


120. గాండీవం 


మధ్య తరగతికి

ప్రభుత్వాలు దూరం 

వలస తరగతుల

బతుకే భారం 


121. గాండీవం 


ఆణిముత్యాలు 

దొరకాలంటే.. 

ఆగాథాలు 

తొలచి చూడాలి.. 


122. గాండీవం 


సడలింపు..  

సంబురమే కావొచ్చు

తెలుస్తుంది.. 

కరిగే కర్పూరమని 


123. గాండీవం 


వైరస్ తో.. 

కలిసే జీవించాలి 

మనుగడ కోసమైనా 

మత్తు వదలాలి.. 


124.  గాండీవం 


ఫిజికల్ ఎక్సిటే.. 

మెంటల్ పీస్ ఎంట్రన్స్ 

కరోనా అవ్వాలి..

సోషల్ డిస్టన్స్ 


125. గాండీవం 


గాండీవం.. 

పదునైన కవనం 

మెరుగు పెట్టింది 

జిరసమే మరి..!


126. గాండీవం 


అగ్గిపుల్ల చాలు.. 

అడవి మండేందుకు 

జీవాయుధంతో.. 

ప్రపంచం మండతుంది.. 


127.  గాండీవం 


గౌరవం వచ్చాక 

గతం మరువకు 

అవసరం తీరాక 

హితుల విడువకు 

     

128.  గాండీవం 


ఆరడుగుల దూరం

పాటించకుంటే 

ఆరడుగుల గొయ్యే 

కరోనా చెప్పిందదే 


129.  గాండీవం 


గుడ్డిగా నమ్మడం

బ్యాడ్ హాబిట్.. 

నమ్మకాన్నివ్వడమే

గుడ్ హాబిట్.. 


130. గాండీవం 


ఆస్తిపాస్తులు కాదు.

గొప్పతనమంటే..

పదుగురి మనసులు 

సంపాదించడం.. 


131.  గాండీవం 


బంధమంటే.. 

బాగున్నప్పుడు కాదు 

ఏమీ లేనప్పుడూ..  

తోడుండడం 


132.  గాండీవం 


ఐశ్వర్యమంటే.. 

డబ్బు కాదు 

ఇతరుల అభిమానం 

సంపాదించడం.. 


133.  గాండీవం 


జీవితమంటే.. 

మన కోసమే కాదు 

ఇతరుల కోసం కూడా 

బ్రతకడం.. 


134.  గాండీవం 


ప్రేమంటే.. 

డబ్బు అందం కాదు 

ఎదుటి వ్యక్తిపై 

ఉండే నమ్మకం..  


135. గాండీవం 


జీవితంలో

మనశ్శాంతిగా 

బతకాలా.. 

గతం మర్చిపో మరి.. 


136. గాండీవం 


మాటకు 

విలువ లేని చోట 

మౌనం మంచిది.

గొప్పతనం తెలిసేదాక..  


137.  గాండీవం 


మనిషికి 

గౌరవం లేనప్పుడు 

దూరం మంచిది 

విలువ తెలియాలిగా..  


138. గాండీవం 


ఏడ్పుతో మొదలై 

ఏడ్పించడంతో 

ముగిసేదే 

అనురాగ బంధం.. 


139. గాండీవం 


లేదని కృంగిపోకు 

ఉన్నదని పొంగిపోకు 

జరిగేదేమైనా.. 

నీ కర్మను అనుసరించే..  


140. గాండీవం 


జీవితంలో ఏదైనా 

కొనొచ్చనుకుంటారు.. 

కన్నీళ్ళను కొనగలరేమో 

ప్రయత్నించండి.. 


141. గాండీవం 


అడుగడుగునా.. 

అందమనే వారున్నా

అందమైన మనసు.. 

అరుదుగా ఉంటుంది 


142. గాండీవం 


ఎవడో ఇస్తే రాదు 

నీకు విలువ..  

నీ జీవితమే.. 

నీకు విలువైనది 


143. గాండీవం 


ఆశించడం.. 

ఎక్కువైనపుడు

బాధ కూడా.. 

ఎక్కువే వుంటుంది 


144. గాండీవం 


ఒంటరితనమూ.. 

అదృష్టం కావొచ్చు 

బ్రతుకు మీద 

ఆశ లేనపుడు.. 


145. గాండీవం 


తేలికైన పని..  

సలహాలివ్వడం

ప్రవర్తన..  

నేర్పడమే కష్టం 


146. గాండీవం 


ఒంటరితనం

నేర్వాల్సిందే..

జీవితాంతం..

తోడెవరుంటారు 


147. గాండీవం 


నీదనుకున్నది.. 

నీతో ఉండదేమో 

ఆశపడడం..

మానేస్తే పోలే.. 


148. గాండీవం 


నీ ప్రాణం ఒకరోజు 

నిన్ను వదిలేస్తుంది 

నీవాళ్ళనుకున్నోళ్ళు

నిన్నొదిలేయరా.. 


149. గాండీవం 


అంతరాత్మ 

చెప్పింది చెయ్యి.. 

ఎప్పటికీ..  

మోసం చేయనిదదే 


150. గాండీవం 


కొత్త పరిచయంతో

మారిపోకు..  

పాత అనుబంధాన్ని 

వదులుకోకు.. 


151. గాండీవం 


నువ్వు చెప్పేది 

నిజమే కావొచ్చు.. 

ఎదుటి వారిదీ.. 

అబద్ధం కాకపోవచ్చు.. 


152. గాండీవం 


నిన్ను పొగిడి.. 

పాడు చేసేవారి కన్నా 

నీ మంచి కోరి.. 

విమర్శించేవారే మిన్న 


153. గాండీవం 


అడిగే ప్రశ్నకు.. 

పద్ధతి ఉంటే 

చెప్పే జవాబుకు.. 

సంస్కారం ఉంటుంది 


154. గాండీవం 


గుడిసెలో ఉన్నా.. 

ఆనందమే 

గుండెలో పెట్టుకునే 

భాగస్వామి దొరికితే.. 


155. గాండీవం 


ఇంట్లో పరిస్థితులు 

చేదుగా ఉన్నాయి.. 

వేపచెట్టు.. 

లేనందువల్లనేమో 


156. గాండీవం 


మాటల్లో తీపి 

కరువైందంటే.. 

ఒంట్లో తీపి 

ఎక్కువందన్నట్లు


157. గాండీవం 


కళ్ళకు నచ్చింది

మరచిపోవొచ్చు..

మనసుకు నచ్చింది 

జీవితంలో మరువరు.. 


158. గాండీవం 


నీలో నువ్వో.. 

నలుగురితో నవ్వో 

నిర్ణయం.. 

అనుభవపూర్వకం 


159. గాండీవం 


మానవత్వం లేదు

సమానత్వం రాదు

మనిషికే లేవవి 

మహమ్మారికేల.. 


160. గాండీవం 


భారమైనవారు..  

బాధ పడుతారేమో

బాధ్యతున్నవారు.. 

భారమనుకోలేరుగా 


161. గాండీవం 


లాక్ డౌన్..

ఎవరు పాటించారు 

నటించడం తప్ప..

అందరూ నటులే 


162. గాండీవం 


టేకిట్ ఈజీ అని

లాక్ డౌన్ తీసేస్తే..  

క్యాచిట్ ఈజీ అని 

కరోనా లాకప్ చేసింది.. 


163. గాండీవం 


నిర్లక్ష్యం వీడలేదు 

మనుషులు.. 

అందుకే తీరలేదు

కరోనా దాహమూ..  


164. గాండీవం 


కనపడకుండా 

పట్టేసింది వైరస్ 

కనిపించే మనిషే

ప్రీతిపాత్రుడైనట్లు.. 


165. గాండీవం 


మహమ్మారి తాగింది

కలికాలం కాఫీ..  

అందుకే చేయనంటుంది

మన రుణం మాఫీ.. 


166.  గాండీవం 


వెక్కిరిస్తుంది వైరస్

తన పాల పడకుండా

మనం పడే 

అవస్థలు చూసి.. 


167. గాండీవం


ఎదగనివ్వరు..

సాయం కోరుతారు 

ఓపికతోనే.. 

మొక్క వృక్షమయ్యేది 


168. గాండీవం 


గురువు.. 

విశ్వ దార్శనికుడు 

జ్ఞాన దానం 

చేసే కర్ణుడు కదా..



169. గాండీవం 


ఉనికి ఉండొద్దా.. 

ఉరుకురికి పోతవు 

ఆదమరిస్తే.. 

కరోన కలెబెడుతవు 


170. గాండీవం 


మనిషికి మనిషికి 

దూరమే లౌక్యం 

మాస్కు ధరిస్తేనే 

ప్రాణానికి సౌఖ్యం 


171. గాండీవం 


మూతికి మూత 

చేతికి పూత.. 

దూరం చేత 

లేదంటే మృత్యు వాత.. 


172. గాండీవం 


ఇప్పుడు పడుతుంది 

ముసురే.. 

తడిస్తే ఏమౌతుంది 

తుప్పు వదులుతుందంతే.. 


173. గాండీవం 


వర్షం కాదది..  

వైరస్ తుంపర 

తడిసారో.. 

ఒడిసారన్నట్లే 


174. గాండీవం 


ఎన్నిసార్లు రాసినా 

పాసవని పరీక్ష 

ఈ సారికి గట్టెక్కె.. 

కరోనా పాస్ చేసింది 


175. గాండీవం 


బతికుంటేనే 

బంధువులం..  

కరోనాతో పోతే 

ఎవరూ లేని అనాథలం.. 


176. గాండీవం 


అందరు బాగుంటెనే 

మనం బాగుంటం 

అందుకే చేరనీయొద్దు 

కరోనాను అం..దరికి


177. గాండీవం 


గత పురాణం 

మనకు స్మరణం 

చెల్లించొద్దు ఎవరం 

కరోనాకు భరణం 


178. గాండీవం 


ప్రతీ ఒక్కరి ప్రాణం 

విలువైందే మరి.. 

అందుకే తరమాలి 

కరోనాను దూరం.. 


179. గాండీవం 


పవనాలు బలంగా

వీస్తున్నాయి

అవినీతి స్వార్థం 

అంతమొందునట్లు 


180. గాండీవం 


నాయకులే కానీ.. 

గులాంగిరీ.. అయినా 

ఇప్పుడు కరోనాకే 

సలాం మరి.. 


181. గాండీవం 


మానవాళి జీవనం 

కకావికలం.. 

విపరీత చర్యలే 

కరోనాకు మూలం 


182. గాండీవం 


ముందు నుయ్యి 

వెనుక గొయ్యి 

సామాన్యుడికే 

నిబంధనల వొయ్యి 


183. గాండీవం 


మత్త గజం చైనా 

మథమణచరే.. 

కుంభ స్థలం 

అగుపించలేదేమో.. 


184. గాండీవం 


డ్రాగన్ ఆటలు 

ముద్దొస్తున్నాయేమో.. 

పైన తల కింద కాలు 

దువ్వుతున్నారుగా.. 

 

185. గాండీవం 


కరోనానే ప్రేమిస్తానంటే

ఎందుకొద్దంటాను.. 

అదెవరినీ.. 

ప్రేమించకుంటే చాలు 


186. గాండీవం 


అహం తగ్గినపుడే 

ఇహం నిలుస్తుంది 

గర్వం తగ్గినపుడే  

పర్వం పిలుస్తుంది 


187. గాండీవం 


నిద్ర.. మాయలమారి 

వస్తే అన్నీ మరిపిస్తుంది 

రాకపోతే మాత్రం..

గతాన్ని కురిపిస్తుంది 


188. గాండీవం 


మరిచే స్నేహం 

చేయకూడదు.. 

చేసే స్నేహం 

మరువకూడదు.. 


189. గాండీవం 


కాలి గాయం 

నడవడం నేర్పితే 

బతకడం నేర్పేది

మనసు గాయం 


190. గాండీవం 


శరం లేనోడు 

ఎన్నైనా శెప్తడు

ఇనేటోడు

లోకువ మరి.. 


191. గాండీవం 


  చేతులే.. 

  మనకు రక్ష 

  చేతలతో.. 

  వేసుకోవద్దు శిక్ష 


192.గాండీవం 


అది ఇష్టపడితే 

తుమ్మొస్తుంది 

కానీ ప్రతీ తుమ్ము 

కరోనాది కాదు.. 


193.గాండీవం 


నిర్జీవే కావొచ్చు 

కరోనా.. 

సజీవంగుండాలంటే 

జెర సునోనా.. 


194.గాండీవం 


నువ్వు కలిసే వారిని

నిర్ణయించేది కాలం 

నీతో ఉండే వారిని.. 

నీ ప్రవర్తనే.. 


195.గాండీవం 


మనిషి పొరపాట్లు

సహజం 

సరిచేసుకోవడమే 

హ్యూమనిజం 


196.గాండీవం 


సజీవ ఐక్యత 

సుదర్శనం..! 

నిర్జీవమైతేనే.. 

సంఘర్షణం.. 


197.గాండీవం 


ఇస్తే మాట.. 

నమ్మినా 

నమ్మకపోయినా 

దాటొద్దు గీత 


198.గాండీవం 


జీవించి యున్నా 

ఫలితమేల.. 

జీవితం విలువ 

తెలియని వేళ.. 


199.గాండీవం 


తట్లకు ఓర్చితే 

ఉన్నతుడే 

ఉలి దెబ్బలకు 

శిల శిల్పమైనట్లు 


200.గాండీవం 


చోద్యం మద్యంల 

పొత్తు.!

బడుగుల జీవితాలు 

చిత్తు.! 


201.గాండీవం 


చీకటిని చీల్చేది 

కిరణమే.. 

ఆపదను కూల్చేది 

తరుణమే.. 


202.గాండీవం 


దానవత్వం 

కలబడుతోంది.. 

మానవత్వం 

తిరగబడిందేమో.. 


203.గాండీవం 


నెలవు..  

చెరువవ్వొద్దా ? 

తరువులతో..

కరువు తీర్చు మరి 


204.గాండీవం 


నేర్వాలంటే.. 

మదిలో తలవాలి 

గెలవాలంటే.. 

బరిలో నిలవాలి 


205.గాండీవం 


ప్రభువులు..  

ప్రజాబంధు కాకుంటే 

రాజ్యాలు..  

రాబందుల పాలేగా 


206.గాండీవం 


నెలవును 

విలయంగ మార్చింది 

వికృతమై వికారి 

పోయే కసితోనేమో.! 


207.గాండీవం 


మీ ప్రాణాలు.. 

మీ చేతల్లోనే ఉన్నాయి

రక్షకులో.. 

లేక భక్షకులో.. 


208.గాండీవం 


అదృష్టం..  

ఒక యాదృఛ్ఛికం

ఆత్మ విశ్వాసముంటే.. 

అదృష్టంతో పన్లేదు 


209.గాండీవం


మరణం.. 

వద్దన్నా వచ్చేదే 

ఎవరికిష్టం అది

పదవి కాదుగా.! 


210.గాండీవం 


అన్యాయమైనా.. 

శృతి మించడం

పతనానికి 

సంకేతమే మరి.! 


211.గాండీవం 


తప్పు చేస్తే..  

సంతోషం కరువు 

మోసం చేస్తే..

మనశ్శాంతి అరువు 


212.గాండీవం 


బలం బలహీనతలకు 

మూలం బంధమే.. 

అశాశ్వతమైనా 

ఆరాటం ఎక్కువే.!


 213.గాండీవం 


మాస్కే కదా అని

మడిచి జేబులెట్టకు 

బిస్తరేస్తవు

నువ్వే మడతపడి..


214.గాండీవం


పద్ధతి లేనిది పైసా

అంతం లేనిది ఆశ 

ఎక్కువైతే.. లేదు

మనశ్శాంతికి వీసా.! 


215.గాండీవం 


నిజాయితీగా ఉంటే  

ఒంటరి అయినట్లే.. 

అబద్ధానికే

ఆత్మీయులెక్కువ 


216.గాండీవం 


అవసరముందంటే.. 

తేనెలూరు మాట 

తీరిందో..కుట్టే తేలే.!

మనిషి స్వభావమిదే.! 


217.గాండీవం 


లేక దేహీ అనేవాడు

బిచ్చగాడు..  

అధర్మంగా ఆశిస్తే 

బిచ్చగాడే కదా.. 


218.గాండీవం


మంచివారు ఎదిగితే

శత్రుత్వం ఎదుగును     

చెడ్డవారికి..  

సన్నిహితులెక్కువ 


219.గాండీవం 


జనం నమ్మేది.. 

ముంచేవాడినే 

గొర్రె కసాయిని 

నమ్మినట్లుగా.. 


220.గాండీవం


కష్టాన్ని నమ్మితే

కడుపారా తినొచ్చు

ఎంత సంపాదిస్తేనేం.. 

కంటికి నిద్రుండదు.! 


221.గాండీవం 


అన్నం లేకపోతే 

పేదరికమా..

సమాజంలో ఆదరణ

లేకపోవడం కూడా.! 


222.గాండీవం 


పొరపాటుతో..  

బంధం బద్దలవ్వొచ్చు 

క్షమాపణతో.. 

భద్రమవ్వొచ్చు 


223.గాండీవం 


తండ్లాడి తల్లి..  

బిడ్డకు ఊపిరి పోస్తే

ఆసరవ్వకుంటే.. 

ఉసురు తగలదా 


224.గాండీవం 

  

ప్రయత్నం 

ఆపనంత వరకూ.. 

ఓడిపోనట్లే

పోరాడి గెలవాలి మరి..! 


225.గాండీవం

 

దేహానికి.. 

ఒక్కసారే మరణం 

మనసుకు..

తప్పు చేసినప్పుడల్లా 



226.గాండీవం


ఆరోగ్యం ఉంటేనేమి 

ఆయుష్షుండాలి 

స్నేహితుడుంటేనేమి 

అవసరానికుండాలి 


227.గాండీవం 


బంధుత్వం.. 

వంధత్వం పాలైంది 

కరోనా వల్లనే.. 

ఐరన్ లెగ్గు.. జాగ్రత్త.! 


228.గాండీవం 


జోడీ లేదంటే.. 

ఎంత ఖరీదైనా 

చెప్పు.. చెత్తబుట్టలోకే  

జీవితమూ అంతే.! 


229.గాండీవం


నిస్వార్ధ సాయం 

మానవత్వం.. 

ఆశించి చేసేది 

వ్యాపార తత్వం .! 



230.గాండీవం 


క్షణంలో జీవితం 

మారదేమో..  

ఆ క్షణం నిర్ణయం 

జీవితాన్ని మారుస్తుంది.! 


231. గాండీవం 


పూచే పూవు..

రాలే ఆకు..

అంతరార్థం ఒక్కటే 

జీవితం క్షణభంగురమే 


232.గాండీవం 


మనిషికి తోడు 

తన గుండె ధైర్యమే..

జీవితాంతం..

అసలైన నేస్తమదే.! 


233.గాండీవం 


అప్పు చేసి 

గొప్పలకు పోతారు 

గంజి తాగి 

గౌరవంగా బ్రతకలేరు.! 


234.గాండీవం 


తప్పు చేసి..

తల దించుకోకు 

నీతిగా ఉండి..

తలెత్తుకు బ్రతుకు.! 


235.గాండీవం 


జిందగీలో ఉంది 

జీవించడం 

గందగీ ఆలోచనలు 

విసర్జించినపుడే 


236. గాండీవం 


మంచి మనిషి పట్ల 

హద్దు మీరొద్దు 

అద్దం పగిలితే 

ఆయుధమవుతుంది 

 

237.గాండీవం 


చట్టం ఎప్పటికీ

చుట్టం కాదు..  

పరగాశమాడేది 

పరిస్థితులే.. 


238.గాండీవం 


ఎదిగిన కొద్ది 

ఒదిగి ఉండాలి..

గౌరవం గర్వమైతే 

పతనం పాతాళానికే.. 


239.గాండీవం 


మనిషితో ప్రకృతి 

ఆడుకుంటుంది సరే

ప్రకృతిని వికృతంగా 

మార్చిందెవరు మరి..? 


240.గాండీవం


పేదల ఆశలు 

పెద్దల పాలు.. 

చీమల పుట్టలు 

పాముల పాలైనట్లు.. 


241.గాండీవం


చీమకు చింత 

దాచుకోవడమే 

మనిషికి.. అంతా

దోచుకోవడమే.! 


242.గాండీవం 


ఓ "సు..ధీక్ష"

ఆగిపోయింది 

రాక్షస క్రీడ 

రాజ్యమేలినందుకే..!  


243.గాండీవం


సమజుగానివాడు 

సణుగుతడు 

తనకు రాదన్నది 

బయట పడొద్దనే 


244.గాండీవం 


ఆస్థిపాస్తులు కాదు.

గొప్పతనమంటే..

పదుగురి మనసులు 

సంపాదించాలి కదా.!.


245.గాండీవం 


నమ్మకం ఉంటే 

మౌనం కూడా 

అర్థమౌతుంది 

లేదంటే..అపార్ధమే 


246.గాండీవం 


ఎంత చదివావో

నీ మెమోలో ఉంటే.. 

ఎంత నేర్చావన్నది

నీ ప్రవర్తనలోనే.. 


247.గాండీవం 


హలం కలం 

మోడుబారితే..  

జీవన ఫలం 

బీడుబారినట్లే..! 


248.గాండీవం 


ఇతరుల బాధను 

ఆనందించడం..

తమ భవిష్యత్తును 

ముందుగా వీక్షించడమే.. 


249.గాండీవం 


కష్టమొస్తే..

సాయం చేయడం 

గొప్పనుకుంటారు

పొందడమే గొప్ప 


250.గాండీవం 


నేనూ బాగుండాలనే 

ఆశ అర్ధవంతం

నేనే బాగుండాలనే 

అత్యాశ వ్యర్ధవంతం


251.గాండీవం 


జీవించడం కోసం 

సంపాదించొచ్చు..  

సంపాదన కోసమే 

జీవించొద్దు.. 


252.గాండీవం 


ఎంతో అందమైంది 

యవ్వనం.. 

మనసు మందమైతే 

ప్రమాదమే మరి.! 


253.గాండీవం 


కండబలం లేకున్నా.. 

గుండె బలముండాలి 

దాశరథి, కాళోజీలకు 

ఉన్నది అదేకదా.! 


254 గాండీవం 


రక్షకుడు..

రంది రానియ్యడు 

వచ్చిందంటే

తక్షకుడే కదా..! 



255.గాండీవం 


శ్రమను గౌరవిస్తే 

పైకెదుగుతారు

కిందున్నారంటె..

పనిమంతులు కారు


 256.గాండీవం 


నిగూఢమైంది..  

చెప్పుటలో నేర్పుండాలి 

గోడలకు..  

చెవులుంటాయి మరి 


257. గాండీవం 


పద్ధతి లేనిది పైసా

అంతం లేనిది ఆశ 

ఎక్కువైతే.. లేదు

మనశ్శాంతికి వీసా


258. గాండీవం


ముల్లు తొలగితే 

పాదానికి సౌకర్యం

అహం తొలగితే 

మనసుకు కూడా..! 


259. గాండీవం 


గొప్పలకు పోతే  

తిప్పలు తప్పవు 

ఎంత చెట్టుకు 

అంతే గాలి కదా..! 


260.గాండీవం 


ఒకడి సుఖము 

మరొకడి కష్టము 

ఎంకి పెళ్ళి 

సుబ్బి చావుకొచ్చినట్లు 


261.గాండీవం 


అవసరానికి ఆదరింపు

తీరితే చీదరింపు 

డబ్బుకు.. 

లోకం దాసోహం ! 


262.గాండీవం 


అబద్ధానికే.. 

ఆత్మీయులుంటారు

నిజమెప్పుడూ 

నిష్టూరమైంది మరి 


263.గాండీవం 


బెదిరించే వాని 

ఆట సాగేది

ఎదిరించేవాడు 

ఎదురుపడకనే 


264.గాండీవం 


తెలంగాణం..  

నోమిన నోము 

బూరెలు..

నోచుకున్నదెవరు? 


265.గాండీవం 


జన్మించడం

మరణించడం

మధ్య ప్రయాణమే

మనిషి జీవితం 


266.గాండీవం 


కన్నవారి ఆస్థి..

పేగు బంధానిదే

బాధ్యత..

బరువనుకోనపుడే


267.గాండీవం 


పుణ్యం ఫలం..

పాపం శల్యం

రవి ఉదయించాలంటే

అస్తమించాలి కదా..!


268.గాండీవం 


వినేవారు.. 

చెప్పేవారికి లోకువే 

చెప్పిందల్లా..

వింటున్నారని కాబోలు 


269.గాండీవం 


అత్త మాట.. 

కోడలు వింటలేదు

తానూ భావి అత్తనని 

తెలియదుగా.. 


270.గాండీవం 


మాట తప్పనివాడు

నాయకుడు.. 

తప్పాడంటే..

రాజకీయ నాయకుడే ! 


271.గాండీవం 


సుఖ సంతోషాలు

లభిస్తే అదృష్టం

చెయ్యిస్తేనే..

దురదృష్టం మరి 


272.గాండీవం 


కనిపించని దైవాన్ని 

పూజిస్తారు.. 

అమ్మానాన్నలు 

కనిపించే దైవాలు కాదా 


273.గాండీవం 


పరుల చేతలను 

విమర్శిస్తారు

తమను తాము 

సంసారనుకొని.!! 


274.గాండీవం 


ఎవరు ఎవరినైనా

విమర్శించొచ్చు

తన నడత 

సక్రమమైనప్పుడే


275.గాండీవం 


విలువ లేని వారితో 

వాదించొద్దు..

వారి విలువ

పెంచడమెందుకు.. 


276.గాండీవం 


అందవనుకున్నవీ.. 

అందుతాయి 

పట్టుదలతో 

ప్రయత్నించాలి కదా 


277.గాండీవం 


అనుకున్నది..

పొందే కసి ఉంది

ఎవరేమన్నారో.. 

అహం దెబ్బతిన్నది 


278.గాండీవం 


ఎంత చెప్పినా 

వినడం లేదుగా

చెవిటోడి ముందు 

శంఖం ఊదడమెందుకు 


279.గాండీవం 


గుడ్డివాడి చేతిలో

కందిలి ఎందుకు

వచ్చేవెలుగుతో

ఉపయోగం లేదుగా 


280.గాండీవం 


అతిగా స్పందించే

సెన్సిటివ్ తను

గుండె నిండా

తడి నిండింది మరి 


281. గాండీవం


మనిషి ఆశే.. 

అవినీతికి శ్వాస 

హద్దుంటేనే. 

జీవితానికి పొద్దు


282. గాండీవం


డబ్బు..

మనిషిని మార్చదు..

నిజ స్వరూపాన్ని 

బయటేస్తుంది.. 



283. గాండీవం 


మనిషికి.. 

మనీ అవసరమే.. 

మనసుకు ప్రశాంతత

కూడా అవసరం..


284. గాండీవం


గొంతు మాట 

విలువ ఎరుగదు 

ఉరుము పంట  

మనసు ఎరుగదు 


285. గాండీవం 


ఇంటిలో మోగేది 

ఈగల మోత 

పల్లకీ జాత 

వీధిలో సాగినట్లు 


286. గాండీవం 


కన్నీరు దాగుండేది..

"కనుపాప" మాటునే 

అవసరమైతే.. 

"హలాహల"మైతది 


287. గాండీవం 


కులం మతం..

గతమయితేనే 

జనం భవిత..

హితమవుతుంది 


288. గాండీవం 


బతికున్నపుడే 

నీ నీడ నీకు తోడు 

చచ్చినా.. 

నీ కూడా రాదు


289. గాండీవం 


అపార్ధం చేసుకొని 

అలుగుతారు 

నిజం తెలిశాక 

నీలుగుతారు మళ్ళీ


290. గాండీవం 

 

తరువు.. 

ప్రకృతి గురువు

పెంచినా తుంచినా 

సమానత్వ చూపే 


 291. గాండీవం


రూపం రూపాయి 

అశాశ్వతమైనవి 

ఉందని మిడిసిపడి 

పోయాక బాధపడొద్దు


292. గాండీవం 

   

మొక్క నాటితే..

మనిషికి పుట్టగతి

చెట్టు నరికితే..

తప్పదు అధోగతి 


293. గాండీవం 


చీకటిని తరిమి

కొవ్వొత్ది కరిగింది

రేయి మాత్రం

వెలుతురు చిమ్మింది.


294. గాండీవం 


రెక్కలు విరిచినా

గొంతు కోసినా 

చెట్టో పిట్టో చస్తుందేమో..

అది అక్షరం..!


295. గాండీవం 


మరణం...

ఎంత అందమైనదో

ఒక్కసారి కలిస్తే...

జీవించడం మరుస్తారు


296. గాండీవం 


జల చిత్రం..  

జీవాన్ని ముంచడం

కాయాన్ని తేల్చడం

ప్రకృతి నియమం మరి


297. గాండీవం 


బతుకంతా వాడేరు..

ఇష్టమైన బ్రాండు

పాడెక్కితే మాత్రం

ఒక్కటే బ్యాండు..


298. గాండీవం 


ఆవేశం ఉన్నవారు 

మోసం చేయరు

చేసేవారు...

ఆవేశంతో ఉండరు 


299. గాండీవం 


జన హితమే

తన మతమంటే       

మనసుకు..

వైకల్యం ఎక్కడిది


300. గాండీవం 


మేధావి.. 

వేదనకు వెరవడు

ధైర్యం నిండున్న 

తొనకని కుండ 


301. గాండీవం 


మాటలకు.. 

చెప్పుడు మాటలకు

తేడా లేదా

నిజానికి నీడకు మల్లే..! 


302. గాండీవం


డబ్బున్న ప్రేమ..

దీపం లాంటిది

నూనె ఉన్నంత వరకు

వెలుగుతుంది..! 


303. గాండీవం 



మంచి  చెపితే.. 

చెవికెక్కుతుందా 

కషాయం కంటే.. 

కాఫీ రుచి కదా 


304. గాండీవం 


వ్యవసాయం.. 

చేసేది కర్షకులు

కర్మ సాయం 

చేసేది కార్మికులే.. 


305. గాండీవం 


ఆశనొదలకుంటే 

అందలం అందును 

ఆకాశ చందమామ 

అంది వచ్చినట్లుగా 


306. గాండీవం 


అక్షరమే అనుకుంటే 

ఆటాడిస్తుంది..! 

యాసే అనుకుంటే 

రఫ్ఫాడిస్తుంది..!! 


307. గాండీవం 


నివ్వెర పోతే 

నీరసానికి దారి 

పట్టుదల వీడితే 

ఓటమికి సుఫారి 


308. గాండీవం 


ప్రయత్నం.. 

లక్షణం అయితే 

చేర వస్తుంది.. 

అనుకున్న లక్ష్యం 


309. గాండీవం 


అధైర్యం.. 

అన్వేషణకు అడ్డు

సమస్య

పరిష్కారానికైనా 


310.  గాండీవం 


అన్యాయం.. 

అంతరించేదెలా

న్యాయం కండ్లకు 

గంతలు కడితే 


311.  గాండీవం 


సామాన్యుడు 

అందరికీ దేవుడే ..

అవకాశ వాదం 

రాజ్యమేలుతుంది  


312. గాండీవం 


నవ్విన నాప చేను 

పండుతుంది 

ఎండి నేలపాలు 

కావడం ఇష్జం లేక.. 


313. గాండీవం 


కాపాడితినని

దీపాన్ని ముట్టుకుంటే

కాల్చక మానదు 

కరమును మంటై 


314. గాండీవం 


కాలుష్యపు కోరల్లో 

ఓజోన్ విలవిల 

కాపాడుకోకుంటే 

మాడేరు మలమల 


315. గాండీవం 


కన్నెర్ర జేస్తే 

ప్రకృతి.. 

మానవాళికి ఉండదు 

నిష్కృతి..


(యాదాద్రి జిరసం ద్వారా సంకలనం నిమిత్తం ) 


🙏🌱🙏🌱🙏🌱🙏🌱🙏🌱🙏

 --✍️అర్జున ( కలం )

   పాల్వంచ హరికిషన్ 

   రామన్నపేట 

   9501451780

Comments

Popular posts from this blog

తిరు వేంకటాచార్యులు KS 6

బాటసారి KS 12

అనామికా శతకం విట్టుబాబు గారు