తిరు వేంకటాచార్యులు KS 6
నిర్వహణ ః వీరా గుడిపల్లి
![]() |
| వీరా గుడిపల్లి |
![]() |
| తిరు వేంకటాచార్యులు గారు |
********* వీరా'స్ కవిసమయం********
[05/08, 5:34 PM] Tiru Venkatacharyulu Ks6: ⭐కవి సమయంలో నా కవితల ప్రస్థానం:
1. కవిత అంటే...!(6/5/20)
2. కవిహృదయం.(6/5/20)
3. కవనకృషీవలుడు.(7/5/20)
4. కవిత్వం - జడత్వం. (7/5/20)
5. లిపి.(8/5/20)
6. కరోనా - ఎయిడ్స్.(8/5/20)
7. కోటు - గోచీ. (9/5/20)
8. బడుగుజీవులు.(10/5/20)
9. అహం - ఇహం.(11/5/20)
10. కాలం పరిగెడుతోంది.(12/5/20)
11. ఎక్కడుంటాడు?(13/5/20)
12. రాజకీయా ధములు.(14/5/20)
13. ధనికస్వామ్యం - క్షుధార్తస్వామ్యం.(15/5/20)
14. వివాహబంధం.(16/5/20)
15. సృష్టి ధర్మం.(17/5/20)
16. రైతే రాజట! నిజమా?(18/5/20)
17. క్లుప్తాలు.(20/5/20)
18. ఆకలియుగంలో రాజ్యాధినేతలు.(19/5/20)
19. అంకెలపాట.(21/5/20)
20. జీవచ్చవాలు - దర్శకరత్నాలు.(22/5/20)
21. భారత నారి.(23/5/20)
22. శ్రీరామ కీర్తనామృతం.(24/5/20)
23. కవి - కిసాను - జవాను.(25/5/20)
24. ప్రతీకలు.(26/5/20)
25. బాలల దేశభక్తి గేయం.(27/5/20)
[05/08, 6:28 PM] Tiru Venkatacharyulu Ks6: 26. నేనూ కవినై నిలవాలి.(28/5/20)
27. మాస్కు - ఓ మస్కా!. మరి క్షేమమేనా?(29/5/20)
28. కరోనాకట్టడి - పరిమితులు. (30/5/20)
29. సెల్ ఫోన్ - సర్వాంతర్యామి.(31/5/20)
30. బాలకృష్ణుని లాలిపాట.(31/5/20)
31. నా దేశం - నా జాతి.(2/6/20).
32. జాతీయపతాకం.(3/6/20)
33. చంద్రహాస!(పద్యాలు) 4/6/20.
34. అంతటానీవే.(5/6/20)
35. మాబడిలో మఱ్ఱిచెట్టు -I (6/6/20)
36. మాబడిలో మఱ్ఱిచెట్టు -II (7/6/20)
37. మరణశయ్యపై మనోవ్యధ.(8/6/20)
38. తెలంగాణ తల్లులకు వందనం.(9/6/20)
39. మనోభీప్సితం.(10/6/20)
40. జాతి ఐక్యత - అవసరం.(11/6/20)
41. భగినీహస్తభోజనం.(11/6/20)
42.అవినీతి నేతలు.(12/6/20)
43. ఎందుకు విస్తరిస్తున్నది? (13/6/20)
44. స్నేహాతిశయం.(14/6/20)
45. వ్యసనం!?(16/6/20)
46. ప్రేరణ.(16/6/20)
47. పూజలు - నోములు - మొక్కులు.(17/6/20)
48. పూలకోరిక.(18/6/20)
49. వీరతిలకం దిద్దండి.(18/6/20)
50. చైనా కుట్టింది.(19/6/20).
[05/08, 6:48 PM] Tiru Venkatacharyulu Ks6: 51. సైనికుడు.(20/6)20)
52. తెలుగంటే..!(19/6/20)
53. అమృతభాషలు.(20/6/20) .
54. ప్రకృతి భేదం.(21/6/20)
55. జీవన్మృత్యువు.(24/6/20)
56. తెలుగు పూదోట.(24/6/20)
57. సత్యం - అసత్యం.(25/6/20)
58. సమకాలీన భారతం. (25/6/20)
59. హీరోలు - పెద్ద జీరోలు.( 26/6/20)
60. హరిత(సం)హారం.(27/6/20)
61. వ్యక్తిగతం "గోప్యం" సుమా!(28/6/20)
62. ఆజీవన అంతరాలు.(28/6/20)
63. స్వయంకృషి - వికాసం.(30/6/20)
64. అన్ లాక్ 2.0(మీ ఆరోగ్యం మీ చేతుల్లో) 30/6/20.
65. జీవిత పర్యంతం. (1/7/20)
66. జ్ఞాపకాల దొంతరలు. (1/7/20)
67. గతస్మృతులు.(3/7/20)
68. ఆర్తి.(4/7/20)
69. పసిమనసుల ప్రపంచం.(4/7/20)
70. విదేశీ జీవనయానం.(5/7/20)
71. జీవితమే పాఠశాల.(7/7/20)
72. మానవుడు.(8/7/20)
73. సాగరమధనం.(10/7/20)
74. కలలు - కోరికలు.(11/7/20)
75. మొలకెత్తుతున్న ఆశలు.(12/7/20)
[05/08, 7:09 PM] Tiru Venkatacharyulu Ks6: 76. ఒట్లు, ప్రమాణాలు, బాసలు.(14/7/20)
77. ముసలమ్మ ముచ్చట్లు.(16/7/20)
78. విలువ.(18/7/20)
79. ముసుగు(19/7/20)
80. ఉద్యోగ విరమణ - I. (19/7/20)
81. పల్లెటూళ్లే పట్టుగొమ్మలు,.. దేనికైనా!(20/7/20)
82. ఋతు పరిణామానికి స్వాగతం.(21/7/20)
83. సమరతిమిర0.(22/7/20)
84. కుసుమపరాగమ్ - వసంతగా నం.(23/7/20)
85. జీవిత గణితం.(24/7/20)
86. మనసు - మాట.(25/7/20)
87. స్పందనలు. (25/7/20)
88. రక్షణ.(25/7/20)
89. పరోపకార మే జీవనం.(28/7/20)
90. మావూరి చెరువందాలు.(28/7/20)
91. నిజాయితీ.(29/7/20)
92. నిర్లక్ష్యపు నీడలో.(29/7/20)
93. కలిసి ఉంటే...?(30/7/20)
94. వ్యష్టి - సమష్టి.(31/7/20)
95. ప్రాణమిత్రుడు.(31/7/20)
96. జీవనమే వలయం.(31/7/20)
97. ఇది కరోనాకాల0.(1/8/20)
98. నీ జీవితం నీదే.(1/8/20)
99. ధృతరాష్ట్రుడు.(4/8/20).
100. ఉద్యోగ విరమణ -II (4/8/20).
******""""
సమూహం: వీరా'స్ కవిసమయం.
1
౦౬-౦౫-౨౦౨౦.
శీర్షిక: 'కవిత' అంటే ...!?
మనసులోని భావాలకు
అద్దంపట్టే అక్షరసుమాలను
కలంద్వారా కాగితంపై
పూయించేదే 'కవిత'.
కవితాసంఖ్య:1.
2
కవితసంఖ్య :౨ తేదీ:౦౬-౦౫-౨౦౨౦.
శీర్షిక: కవిహృదయం
కలం-గాండీవం
ఆలోచన-పాశుపతం
శైలి-సమ్మోహనం
అంశం-వజ్రాయుధం
కవనం-రామబాణం
తరచీ-వెరశీ
కవిహృదయం-కదనరంగం.
3
కవితసంఖ్య 3.(7va తేదీన పోస్ట్ చేయబడింది).
శీర్షిక : కవనకృషీవలుడు
కలం హలం చేతబట్టి ,
కాగితక్షేత్రసేద్యం చేస్తూ ,
ఆలోచనల సంచీవిప్పి ,
భావాక్షరాల విత్తనాలు చల్లుతూ ,
పాళీనోటినుండి సిరాసలిలం ప్రవహింపజేసి , అనుభవ-స్పందనల ఎరువేసి ,
కవనవనాన్ని పండించి ,
ఫలసాయానందుకొనే పాఠకజనావళికి
రసాస్వాదనను అనుభవైకవేద్యం చేస్తూ , ఆలోచనానందానుభూతుల్లో తేలిస్తూ ,
అలుపెరుగక పరిశ్రమిస్తూ ,
ఆలోచనలచుట్టూ పరిభ్రమిస్తూ ,
ఈ అనంతవిశ్వంలో 'రవి' కానని ,
'పవి'కి లొంగని
ప్రతీ అంశాన్నీ పైకెత్తిచూపుతూ ,
లోకాన్ని నడిపే కృషీవలుడు ... కవి !
**** శీర్షిక : కవనకృషీవలుడు.
*********వీరా'స్ కవిసమయం************
4
కవితసంఖ్య :౪
తేదీ: 07-05-2020
శీర్షిక :కవిత్వం- జడత్వం
మెరుపు మెరిస్తే
ఉరుము అరిస్తే
నేల తడిస్తే -వర్షం.
మనసు మురిస్తే
బాధ మరిస్తే
కళ్ళు మెరిస్తే -హర్షం.
మదిని కదిపితే
హృదిని తడిమితే
కలం సాగితే - కవిత్వం
హృదయం ద్రవించకుంటే
దేనికీ స్పందించకుంటే
పక్కవాడిని పట్టించుకోకుంటే - జడత్వం
పై కవితలన్నీ (౧ 2, 3, 4@ కవిసంఖ్య 6) ముడుంబ తిరువేంకటాచార్యులు అను నేను స్వయంగా రచించినవి .ఇతరుల రచనలకు అనుకరణలూ , అనువాదాలూ కాదు. ఇంతవరకు ఎక్కడా ప్రచురించడానికి పంపలేదు.... అని హామీ ఇస్తున్నాను.
5
*********వీరా'స్ కవిసమయం**********
6. ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్
కవితసంఖ్య :౫.
తేదీ :౦౮-౦౫-౨౦౨౦.
శీర్షిక : లిపి
రాసినారాతకు అందం-చందం
అపురూప శిల్పసౌందర్యానికి
సమతుల్యం.
ఆ అందమైనరాత
చదవబోతే
అన్నీ 'అప్పు తచ్చులే'.
రాసిందంతా రసరమ్యం ,
అద్భుతం, భావగర్భితం.
శైలి-హాయినిగొలిపే శీతలసమీరం.
కానీ ఆ రాసిందేమైనా అర్థమైతేగదా
చదువరిమదిలో రసాస్వాదనానందం కలిగేది!?
Ee కవిత
నా స్వంతరచన. ఏ ఇతరుల రచనకూ అనుకరణ , నుసరణ , అనువాదమూ కాదని హామీ ఇస్తున్నాను.
6
*********వీరా'స్ కవిసమయం**********
ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్
కవితసంఖ్య :౬.
తేదీ :౦౮-౦౫-౨౦౨౦.
శీర్షిక : కరోనా-ఎయిడ్స్.
కొత్త కొత్త రుచులను
కోరుతుంది జిహ్వ. //ఏ కొత్త రుచిలో ఏముందో//
ఏ రుచితో ఏ చావుందో !? (కరోనా)//
తన జిహ్వయె తనమిత్రుడు
తన జిహ్వయె తనకురక్ష
తన జిహ్వయె తనశత్రువు
తన జిహ్వయె మరణమండ్రు తథ్యము నరుడా!
Kottha కొత్త అనుభవాలు
కోరుతుంది మనసు.
ఏ కొత్తరుచిలో ఏముందో
ఏ పుట్టలో ఏ పాముందో!? (ఎయిడ్స్) //తనమనసే సంతోషం
తనమనసే సంతాపం
తనమనసే ప్రమోదం
తనమనసే ప్రమాదం.
ఈ రచన నా స్వంతం. యితరుల రచనకు అనుణ , అనుసరణ , అనువాదం కాదని హామీ ఇస్తున్నాను.
7
ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్
కవితసంఖ్య :౭
తేదీ : 09-05-2020.
శీర్షిక : కోటు- గోచీ.
ధనవంతుని దసలీకోటు* (పట్టులో ఒకరకం)
దరిద్రుల ఆకలికి చేటు.
కలిమాయల కప్పిపుచ్చే
కలిమికలలకు చాటు.
బిచ్చగాడి అతుకులగోచీ
దైన్యానికి సూచీ.
బతుకుమెతుకుల లేమికి
'బాధ'రాయణ సాక్షి.
**మిడిబతుకుల చూపించే (మధ్యతరగతి) పైమెరుపుల ***ఉడుపులు (దుస్తులు)
అందీ అందని కోర్కెల
సూచించే తోటలు.
******
Ee కవిత నా స్వంతరచన. ఇతరుల కవితలకు అనుకరణ , అనుసరణ , అనువాదం కాదు... హామీ ఇస్తున్నాను.
8
*******వీరా'స్ కవిసమయం**********
6. ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్.
కవితసంఖ్య : 8.
తేదీ : 10-05-2020.
శీర్షిక : బడుగుజీవులు.
మారుతున్నకాలంతో సాగలేనిమానవులం
బ్రతుకు బండి నీడ్వలేని కష్టజీవులం.
పెరుగుతున్న ధరలతో పెరగలేని శ్రామికులం పెరుగుతున్న విజ్ఞానం ఎదగలేదు జీవనం.
ఆశలెన్నో పెంచుకుంటే అడియాసే శేషము
కలలెన్నో కంటున్నా కన్నీళ్లే ప్రాప్తము.
మానవీయ కోర్కెలన్ని ఆకలిలో లుప్తము. స్వార్థపరుల మోసాలకు బాలి అయ్యే జీవులం రాజకీయ రాబందుల చదరంగపు పావులం.
***
ఈ కవిత నా స్వీయరచన. ఇతరుల రచనకు అనుకరణ , అనుసరణ , అనువాదము కాదు. ఇంతవరకు ప్రచురణకై పంపబడలేదు... అని హామీ ఇస్తున్నాను
9
********వీరా'స్ కవిసమయం************ముడుంబ తిరువేంకటాచార్యులు ,
వరంగల్
కవితసంఖ్య : 9.
తేదీ : 11-05-2020.
శీర్షిక : అహం -ఇహం (రచించినతేదీ౧౧-త్రీ-'౯౮)
తలనెంత ఎగరేసినా
నింగినందుకోలేవు
ఒక్కసారి తలొంచిచూడు
నేల నిన్నుముద్దాడు.
పదుగురికి మేలుచేసి
స్నేహాలను పెంచుకో.
ఇహం నిన్ను మెచ్చకుంటే
పరం లేదని తెలుసుకో.
ఈ కవిత నా స్వీయరచన. ఇతరుల కవితలకు అనుకరణ , అనుసరణ , అనువాదం కాదు ...అని హామీ ఇస్తున్నాను.
10
********వీరా'స్ కవిసమయం *********
ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్
కవితసంఖ్య :౧౦.
తేదీ : 12-05-2020.
శీర్షిక :కాలం పరుగెడుతోంది.
కాలం పరుగెడుతోంది.
ప్రకృతితో పందెంకట్టి ,
నువ్వా? నేనా?
ముందెవ్వరంటూ ...కాలం పరుగెడుతోంది.
నాగరికత ముసుగులో
జరిగే మోసాల్ని
భరించలేక
విధ్వంసాల్ని సృష్టిస్తూ
... కాలంపరుగెడుతోంది .
దేశీయ వైషమ్యాలనూ
అంతర్జాతీయ ఈర్ష్యాద్వేషాలనూ
ఛీత్కరిస్తూ ... కాలంపరుగెడుతోంది .
ప్రకృతి వైపరీత్యపు
కరాళదంష్ట్రల మధ్య
నలిగిన జీవితాలను
శిథిలాలకొదిలేసి ... కాలంపరుగెడుతోంది.
మానవ మేధను
సవాలుచేస్తూ
నరుడా! నీకేం తెలుసని
వెక్కిరిస్తూ ... కాలంపరుగెడుతోంది.
ఆపత్సమయంలో
అందరూ ఒక్కటేనని నినదిస్తూ
అందరూ ఏకమవ్వాలని
ఆదేశిస్తూ ... కాలంపరుగెడుతోంది.
*** *** *** *** ***
ఈ కవిత నా స్వీయరచన. ఇతరులకవితలకు అనుకరణ , అనుసరణ అనువాదమూ కాదు. ఇంతవరకు ప్రచురణకై పంపబడలేదు. ...అని హామీ ఇస్తున్నాను.
11
*********వీరా'స్ కవిసమయం********** ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్
కవితసంఖ్య : 11.
తేదీ : 13-05-2020.
శీర్షిక : ఎక్కడుంటాడు?
తను పంట పొలాలకు నీరందించలేకుంటే
జలాశయం జలజలా రోదిస్తుంది.
యజమానికి తను పాలివ్వలేకుంటే
గోవు అంబా అని శోకిస్తుంది.
రైతుకోసం తనలో సస్యం ఫలించకుంటే
నేల తన గోడు ఎండమావితో చెప్పుకుంటుంది.
నింగీ , నేలా , నీరూ ,
నిప్పూ , గాలీ , ధూళీ , ...
అన్నీ తమ అస్తిత్వం
మానవాళి మనుగడకోసమే అనుకుంటాయి.
స్వార్థపరుడైన మనిషి మాత్రం
తానే వాటికి కర్తననీ ,
తానులేకుంటే అవి నిరర్థకాలనీ
విర్రవీగుతుంటాడు.
ఏదో ఒకనాడు అవి మేలుకొని
కలసికట్టుగా దాడిచేస్తే
'మనిషి' ఎక్కడుంటాడు?
***
Ee కవిత నా స్వీయరచన. ఇతరులకవితకు అనుకరణ , అనుసరణ , అనువాదము కాదు... అని హామీ ఇస్తున్నాను.
12
Ks6: వీరా'స్ కవిసమయం
ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్
కవితసంఖ్య : 12.
తేదీ : 14-05-2020.
శీర్షిక : రాజకీయాధములు .
హలం పట్టి , పొలం దున్ని
ఫలం విత్తి , జలం పెట్టి ,
అందినంత అప్పు చేసి ,
ఎరువేసీ , మందుచల్లి ,
దేహబాధలు లెక్కచేయక ,
దివారాత్రాలు శ్రమించినా ,
ప్రాణానికి ప్రాణంగా పెంచినపైరు
నకిలీరక్కసికోరలకూ ,
ప్రకృతిమాత రోషాగ్నులకూ ,
ప్రళయకాలప్రభంజనాలకూ
సమిధలా ఆహుతైపోతే ,
పెట్టినఖర్చుకు *ఫలితం దక్కక , (గిట్టుబాటు) ఆకలిమంటల , కాలేకడుపుల
ఆర్తిని చల్లార్చుకునేందుకు
దూరపుకొండల పట్టణవాసపు
కూలీనాలీ జీవితాలకై
పరుగులెత్తి , అలసిపోయి ,
ఎక్కడా ఓదార్పులభించక ,
బ్రతుకుబాటపై ఆశలుచావక
ముందడుగేసే ప్రయత్నాలలో
అడుగులుతడబడి దారితప్పితే ,
మాటువేసిన మానవమృగాలు
స్వార్థంకోసం సమిధల్లా వాడుకొని , రాజకీయబలిపీఠంపైకినెట్టి ,
రిక్తహస్తాలుచూపి ,
ఆత్మాహుతులకు ప్రేరేపిస్తే ,
రెక్కాడినా డొక్కాడక ,
ఆకలిరక్కసికోరలకు
బలిపశువయ్యే రైతే
ఈ 'దేశానికి వెన్నెముక'ని
వేదికలెక్కి వక్కాణించే
'రా'వణ 'జ'రాసంధ 'కీ'చక *'య'వనాధములున్నంతవరకు
(కాలయవనుడు ; కృష్ణునికి బద్ధవిరోధి)
ఓ మహాకవీ ! ఓ మహాత్మా !
ఈ దేశమేగతి బాగుపడునోయ్?
**** **** ****
ఈ కవిత నా స్వీయరచన. సుమారు పది సంవత్సరాలక్రితం రాసినది. ఇతరులకవితకు అనుకరణ , అనుసరణ , అనువాదమూ కాదు. ఇంతవరకు ప్రచురణకొరకు ఏ పత్రికకూ పంపబడలేదు అని ధృవీకరిస్తున్నాను. ఆక్షేపణలకు నేనే బాధ్యత వహిస్తాను.
13
***వీరా'స్ కవిసమయం*****
6. ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్
కవితసంఖ్య : 13.
తేదీ : 15-05-2020
శీర్షిక : ధనికస్వామ్యం
ఈ పుణ్యభూమిలో ,
చెట్టుకింద చింకిచాపపై ,
చిరుగుబ్రతుకుతో ,
సంతానలక్ష్మిని పోషిస్తూ... ఒక బిర్లా !
ఈ భూతలస్వర్గంలో ,
కుండీపక్కన కుష్టువ్యాధితో ,
జనారణ్యంలో - జనానికిదూరంగా ,
అందరి ఛీత్కారాలనూ ,
సమానంగా-మౌనంగా స్వీకరిస్తూ... ఒక టాటా !
ఈ కర్మభూమిలో , సంపాదనలేక ,
పనిదొరకక , తిండిలేక ,
పూరిపాకలో ముడుచుక్కూర్చుని ,
ఆకలిబాధను భరిస్తూ... ఒక అంబానీ !
ఈ ధర్మభూమిలో ,
అక్షరజ్ఞానం అక్కరకురాక ,
అధికవ్యయానికి తాళలేక ,
ఆకలిబాధలకోర్వలేక ,
అధర్మమార్గం అవలంబిస్తూ... ఒక హిందూజా !
ఈ ప్రజారాజ్యంలో ,
ఆశలపల్లకిలో ఊరేగుతూ ,
ఏదోచేయాలన్న కసీ-తపనా కలగలసి ,
అందినంత అప్పుచేసి ,
పలాయనం చిత్తగిస్తూ... ఒక మాల్యా ,
ఒక నీరవ్ , ఒక మోహుల్ !!!
ఈ ప్రజాస్వామ్యంలో ఆకలిదీ అర్థరాజ్యం. ..
అటూ- ఇటూ ,
ధనికస్వామ్యం-క్షుధార్తస్వామ్యం*
ప్రేరేపించిన పర్యవసానం ,
దానా-దీనా ,
ఛోటా-మోటా ,
అందరూ ...
టాటా-బిర్లా ,
అంబానీ-హిందూజా ,
మాల్యా-మోహుల్ లే. (*ఆకలిరాజ్యం)
@నేను స్వయంగా రాసిన ఈ కవిత సుమారు 15 సంవత్సరాల నాటిది. ఈ కవితలోని 5va పేరా మాత్రం ఇప్పుడే రాసింది. ఇతరులకవితకు
అనుకరణ , అనుసరణ , అనువాదమూ కాదు. ఈ కవిత పై వచ్చే ఆక్షేపణలకు నేనే జవాబుదారుణ్ని. ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు.
14
***వీరా'స్ కవిసమయం********
ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్
కవితసంఖ్య :౧౪.
తేదీ : 16-05-2020.
శీర్షిక : వివాహబంధం(హాస్యకవిత(౨౨-౪-౨౦౦౧)
పడుచుదనపు 'వారంట్' పుచ్చుకొని ,
పెళ్లిచూపుల 'సెర్చింగ్' లలో
సరిజోడీ 'క్రిమినల్'ను వెదకి పట్టుకొని , లగ్నపత్రికల 'ఎఫ్.ఐ.ఆర్.' వ్రాయించుకొని
పెళ్ళిpanditlo పరస్పరం 'అరెస్ట్' చేసుకొని , స్వచ్చందంగా 'ఒకే సెల్'లో అనుభవించే
'లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్'.
ఈ కవిత నేను స్వయంగా రాసింది. (౨౦సంవత్సరాలక్రితం) హాస్యం కోసమే కానీ వివాహవ్యవస్థను కించపరచడం నా అభిమతం కాదు.
15
*********వీరా'స్ కవిసమయం********** 6. ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్
కవితసంఖ్య : 15.
తేది : 17-05-2020.
శీర్షిక : సృష్టిధర్మం (నా మొదటి కవిత 1989).
ఒక ఆకు నేల రాలుతూ తన తల్లిచెట్టును ఇలా ప్రశ్నిచింది.
'అమ్మా! ,
నాకు జన్మనిచ్చి ,
నీలో భాగమైన నన్ను
పెంచి పోషించావు ఇన్నాళ్ళూ !
నన్ను రక్షిస్తూ ,
నా క్షేమానికి కృషిచేస్తూ ,
నీ అభివృద్ధిని కూడా సాధించావు ఈనాడు.
నాలో జవసత్వాలుడిగినవేళ ,
నిర్దాక్షిణ్యంగా దులపరించుకొని ,
నేల రాల్చావు ! నీకిది న్యాయమేనా?
చెట్టు తల్లి ఏడుస్తూ ఇలా జవాబిచ్చింది.
"బిడ్డా !
లోకమెప్పుడూ కొత్తదనానికి చోటిస్తుంది.
పాత తనంత తాను తప్పుకోవాల్సివస్తుంది.
ఇప్పుడు నీవంతు , మరికొన్నాళ్ళకు నావంతు.
నీ తర్వాత వచ్చే కొత్తదనాన్ని
నీవెందుకాహ్వానించవు?
విదిలించి పారేశానని ,
నీవనుకొంటున్నది కాదు సత్యం.
జీవకోటి ప్రాణాధారం (గాలి) ,
తన బలప్రయోగంతో నన్నొక్కసారిగా కుదిపేస్తే ఎదిరించే శక్తిలేక నేనూగిసలాడినవేళ ,
శక్తులుడిగిన నీవు ఆ ధాటికి తాళలేక ,
నా నుండి దూరమైనావు.
నిన్ను దూరం చేసుకోవడం నాకూ బాధగానే ఉంది. నేనూ నీకోసం మూగగా రోదిస్తున్నాను.
కానీ ఏం చేయగలను? ఇది కాలధర్మం , ఇదింతే!'
1989 లో రాసిన ఈ నా మొట్టమొదటికవిత ఇతరులకవితకు అనుసరణ , అనుకరణ , అనువాదమూ కాదు. అని హామీ ఇస్తున్నాను.
16
వరంగల్
కవితసంఖ్య : 16.
తేదీ : 18-05-2020.
శీర్షిక : రైతే రాజట ! నిజమా?
ఆధునిక యంత్రాఙ్గమ్ వచ్చింది.
హలం విరిగిపోయింది-కాడెడ్లు కబేళాలకెళ్తున్నాయ్. రాజకీయమంత్రాఙ్గమూ హెచ్చింది.
కమతాలుకాస్తా 'సెజ్జు'లై వెలిశాయ్.
ఆహారసేద్యం పూజ్యమవుతోంది.*(సున్నా) వాణిజ్యసేద్యం పూజనీయమైంది.
విత్తననిల్వ ఎప్పుడో మరిచారు.
టెర్మినేటర్ విత్తనాన్నే వలచారు.
సేంద్రియ ఎరువును త్రోసిరాజని
'రసేంద్రియం' రాజ్యమేలుతోంది.
'సందిట్లో సడేమియా'లా అన్నిట్లో
'కల్తీ' విరాజిల్లుతోంది.
పర్యవసానం !
వాణిజ్యలాభాపేక్ష నింగినంటి
వేసినపంటే మళ్లీవేస్తూ ,
భూసారం పీల్చిపిప్పి అయింది.
వేసిన పంటకు నీరందించలేని 'బోర్లు'.
కల్తీ ఎరువులతో 'టెర్మినేటర్'లు మొలకెత్తక మొలకెత్తినవీ ఫలించక ,
ఆశించిన దిగుబడిరాక ,
చేతికొచ్చినపంటకు 'గిట్టుబాటు' ధరలేక , ఆరుగాలం చిందించిన ' స్వేదం'.
నీరుగార్చే ఆదాయంకాస్తా అప్పుల 'మిత్తీ'లకే తుడిచిపెట్టుకుపోగా , అప్పు తీరక ,
కొత్త అప్పు లభించక ,
జాలి చూపుల బోరూ-చేనూ ...
దిక్కుతోచని 'దృక్కు' లతో నల్దిక్కులుచూస్తూ ఉసురుబాసిన 'కిసాను' భాయీ !
నీ మరణాన్ని 'పావు'లా వాడుకొని ,
'రైతే రాజ'ని 'సన్నాయి నొక్కులు' నొక్కుతూ 'రాజకీయ'వ్యాపారంలో లాభంకోసం వెంపర్లాడే 'యం'త్రాగమున్నంతవరకు
ఓ తపస్వీ ! ఓ కృషీవలా !
ఈ దేశమేగతి బాగుపడునోయ్?
*** *** *** *** ***
ఈ కవిత నా స్వీయరచన. ఇతరులకవితకు అనుసరణ , అనుకరణ , అనువాదమూ కాదు... అని ధృవీకరిస్తున్నాను.
17
[21/05, 6:35 AM] Tiru Venkatacharyulu Ks6: ******వీరా'స్ కవిసమయం*******
6. ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్
కవితసంఖ్య : 18
తేదీ : 20-05-2020
శీర్షిక : క్లుప్తాలు (చిన్న కవితలు)
(1) సన్మానదంభాలు
క్షీరాభిషేకాలూ పాదాభిషేకాలూ పుష్పవర్షాలూ కాదు. బక్కరైతుకు కావలసింది
కాస్తంత దన్ను ,
ధైర్యమిచ్చే ధర.
మొదటిది మిధ్యాపాదం- రెండోది రిక్తహస్తం.
(2) ప్రజలు-నేతలు
గొర్రెదాటు జనాలకు - కప్పదాటు నేతలు రెంటికిరెండూ సరిజోడీ , దొందూ దొందే ఇక ఢీఢీ !
(3) కవితలక్ష్యం
వెచ్చనికైతలు పూయించి నెచ్చెలిమెప్పింపగ
నేమి ఘనము? ...ఓ బైరన్నా !
చిచ్చులుగ్రక్కెడు బందూకునోట
నచ్చుగ శాంతినాదము వినిపించు... గద్దారన్నా !
(4) ఆదర్శం
కడుపునిండినవాడు వల్లించేది ,
కడుపుమండినవాడు ఆక్రోశించేది.
(5) తీర్పు
మనకనుకూలమైతే న్యాయం జరిగింది.
ప్రతికూలమైతే అమ్ముడుపోయింది.
**** ***** *****
ఈ క్లుప్తాలు నా స్వీయరచనలు. ఇతరులకవితకు అనుసరణ , అనుకరణ , అనువాదమూ కాదు... అని హామీ ఇస్తున్నాను.
18
శీర్షిక : 'ఆకలి'యుగంలో రాజ్యాధినేతలు
(1980-90 మధ్యలో రాసిన కవిత)
తెలుగింటివాకిట విరిసిన వెన్నెలలో
సఖుని రాకను గుర్తించిన సిరిమల్లెల సింగారి చిరుదరహాసపు సవ్వడులూ;
మరుమల్లెల సొగసులతో ,
మరువపుగుబాళింపులతో
మారుని మత్తెక్కించే మదనకామిని వయ్యారాలు; సరససాహిత్య సంగీతరసధునిలో
వీనులవిందైన విద్వత్కవనాలూ;
సుల్తాన్‌షాహీ రాజమహలులో
రసాస్వాదనజలధిని బంధించే
కనులవిందైన ఖవ్వాలీ ప్రదర్శనలూ ,
..... ..... ..... ..... ..... .....
పొట్టవీపుకు అతుక్కుపోయి చలత్ప్రేతంలానడుస్తూ , లోతుకుపోయినకళ్ళతో జనారణ్యంలోజీవచ్ఛవంలా , క్షుధార్తరవంతో నూతిలో కప్పలా
పిడికెడుముద్దకోసం అర్థించే
భిక్షు'కుల' ఆర్తనాదాల్ని వినపడనీయవు.
.... .... .... .... .... .... ....
ఈ కలియుగంలో సౌందర్యానిదే రాజ్యం!
ఆకలిదీ 'అర్థ'రాజ్యమైనా ;
అన్నార్తుల ఆకలిపిలుపులు
సౌందర్యపిపాసులముందు బధిరశంఖారావాలే!
***** ***** ***** ******
ఈ కవిత నా స్వీయరచన . ఇతరులకవితకు అనుసరణ , అనుకరణ , అనువాదమూ కాదు...అని హామీ ఇస్తున్నాను.
19
వరంగల్
కవితసంఖ్య : 19.
తేదీ : 21-05-2020.
శీర్షిక : అంకెలపాట(బాలలకోసం@16-10-1996).
(తడబడుఅడుగుల బుడిబుడినడకల జిలిబిలిపలుకుల ముద్దుముద్దుమాటల
ముద్దులబుజ్జాయిలూ!ఈ అంకెలపాట మీకోసమే).
ఒకటీ వన్నెలచిలకా ,
రెండూ రెక్కలపురుగూ ,
మూడూ మువ్వలరవళీ ,
నాలుగు నవ్వులజల్లూ ,
ఐదూ ఐరావతమూ ,
ఆరూ ఆమడదూరం ,
ఏడూ ఏనుగుతొండం ,
ఎనిమిది ఎండాకాలం ,
తొమ్మిది తొలకరివానా ,
పదీ పలకాబలపం.
***** ***** ***** *****
ఈ పాట నేను స్వయంగా రాసింది... అని హామీ ఇస్తున్నాను.
20
వరంగల్
కవితసంఖ్య :౨౦
తేదీ : 22-05-2020.
శీర్షిక : జీవచ్ఛవాలు-దర్శకరత్నాలు
అర్థరాత్రి-రైల్వేస్టేషన్లో ,
వచ్చిపోవలసిన రైళ్లేవీ లేని లూజ్ టైం లో ,
స్పేర్ ట్రాక్ పై వున్న ఖాళీబోగీల్లో , అర్థాకలికడుపులతో నిద్రకుపక్రమిస్తున్నవి , .... జీవం ఉండీ జీవకళలేని ముఖాలు !
నిలువలేనట్లుగా ఉండే సజీవ కళేబరాలవి !
ఎందుకు జీవిస్తున్నారో తమకే తెలియక ,
ఎవరికీ తమ అవసరం లేక ,
లక్ష్యరహిత , మూల్యరహిత ,
కళావిహీన , బలహీనప్రాణాలను
చచ్చేవరకూ కాపాడుకోవాలనే తపనతో ,
పారేసిన ప్రతీవస్తువులోనూ భోజనాన్ని వెతుక్కుంటూ ఆశ , అడియాసలమధ్య కొట్టుమిట్టాడుతూ , నిరాశానిట్టూర్పులతో నిస్సత్తువగా మూల్గుతూ , అందరిమొహాల్లోకి చూస్తూనే , ఎవరినీపట్టించుకోక , ఎవరికీ పట్టక , మింగమెతుకులేక
నిలువనీడలేక , కడుపుమాడ్చుకోలేక ,
గుక్కెడునీళ్ళే మృష్టాన్నంగా సరిపుచ్చుకొని , నిద్రకానినిద్రలో జోగుతూ ,
ఒంటికీ , ఉడుపులకూ తేడాలేనివిధంగా , మాసిపోయి , చిరిగిపోయి , మురికినిండి , దైన్యాన్ని కళ్లకుకడుతూ , ..... ...... శవాలుకావవి ! జీవచ్ఛవాలు ! ..............
అవినీతీ , ద్రవ్యప్రీతి , అవకాశవాదాలతో , జీర్ణమైన , విదీర్ణమైన , రుజాగ్రస్తమైన ప్రస్తుతవ్యవస్థకే దృష్టాంతాలుగా ఉన్నవి
ఆ చలత్ప్రేతాలు ,
.......... ...........
ఇంకాచెప్పాలంటే ,
పదవే పరమలక్ష్యంగా , ఓట్లకోసం వెంపర్లాడే
బు. లే. రా. నా. లనూ ,
అంధులుగా , బధిరులుగా ...
నటింపజేసే దర్శకరత్నాలవి !
****** ****** ****** ****** *******
ఈ నా స్వీయరచన ఇతరులకవితకు అనుసరణ , అనుకరణ , అనువాదమూ కాదు. ... అని హామీ ఇస్తున్నాను.
21
కవితసంఖ్య :౨౧.
తేదీ : 23-05-2020.
శీర్షిక : భారతనారి.
నేను ,
భారతమహిళను.
నా జాతి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకను. నుదుటన తిలకం , పాపిటసిందూరం , సిగలోపూలు , చేతిగాజులు , మెడలో తాళి , కాలికిమెట్టెలు , పాదాలకు పారాణి , ...
నా మాతృభూమికి పరచిన పచ్చనిపైరుతో
నా చీరకట్టు సోయగం పోటీపడుతుంది.
ప్రపంచమే నన్ను చూసి
ముచ్చటపడుతుంది , గౌరవిస్తుంది.
ఇది నా దేశసంస్కృతికి రక్షాకవచం. ,.....
నేను , ఏ పనైనా చేయగలను.
ఇంటిపనులు , మట్టిపనులు ,
పొలంపనులు , ఒకటేమిటి ,....
నా సంతానానికి నేనే సరస్వతిని.
నా కుటుంబానికి నేనే లక్ష్మినే
నా దేశరక్షణకై నేనే దుర్గను.
కలం పడితే మొల్లను ,
కత్తి పడితే రుద్రమను.
ఏ ఉపాధి చేపట్టినా నేను లక్ష్మినే.
మైత్రికోరి వచ్చినవారిని
అమ్మనై , అక్కనై , చెల్లినై ఆదరిస్తాను.
మోసకారికి అపరచండిని.
కుట్రదారుకు అపరకాళిని.
దెబ్బతీయాలని చూస్తే 'ఇటుకపెళ్ళకు రాళ్లదెబ్బను'. శివాజీ , నేతాజీల కన్నతల్లిని నేను.
అవును నేను భారతమాతను. ********'''''*********'''''********
ఈ నా స్వీయరచన 'నా' హిందీ రచనకు స్వేచ్చానువాదం. ఇతరులరచనలకు అనుసరణ , అనుకరణ , అనువాదమూ కాదు. ... అని హామీ యిస్తున్నాను.
22.
Veeraa's kavisamayam 6. Mudumba tiruvenkatacharyulu warangal kavithasankhya: 22. Date: 24-05-2020. Sheershika : *********శ్రీరామకీర్తనామృతం************
Pallavi:మముబ్రోవుమయా! మముబ్రోవుమయా కరుణాకర! దశరథరామా!ఇనవంశకులాంబుధిసోమ!జానకిరామా! /mamu/
చ.౧. మునియాగముగాచునీవు విభుడవురామా/౨/గౌతంసతిబ్రోచు పరమపురుషుడవయ్యా!
శివుఁవిల్లు విరిచిన నిను వరించె సీత , /౨/
ఆ సీతజాడకానక నువు వగచితివయ్యా! /మము/
చ.౨. కపులగూడి లంకజేరి పోరాడితివయ్యా /౨/ దశముఖునిజంపి సీతగూడి ముదమొందితివీ! చవులూరగ నీకథ నాలింతుమురామా /౨/ ధర్మమూర్తి విమలకీర్తి శివనుతరామా!! /మము/
చ.3. నీ భక్తులనూ దీనులనూ బ్రోవుమురామా/౨/ శరణాగతదీనబంధు! దయాసాగరా! అయోధ్యపురినివాస! ఆపద్బాంధవా! /౨/
రామా! రామా! రామాయని
ముమ్మారు తలతు మోక్షదరామా!! /మము/
*********""""**********"""""******* I assure that this devotional song is written by me, and not copied nor followed nor translated from others scripts. Thank you.
23
*********వీరా'స్ కవిసమయం*********** 6. ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్
కవితసంఖ్య :౨౩.
తేదీ : 25-05-2020.
శీర్షిక : కవి-కిసాను-జవాను.
కలం పట్టి , కవితలల్లి , కాలాన్నే శాసిస్తూ , జగాలనేలి , జనాన్నిలేపే కవీశ్వరుల కవనధారలకు ఖరీదు కట్టే షరాబులేడోయ్ ధరాతలంలో.
తలపాగా చుట్టి పలుగూ-పారా పట్టి ,
ప్రకృతితో మమేకమై , ధరాతలాన్నే దివిగామార్చే శ్రమైకజీవికి తురాయిపెట్టే నవాబులేడోయ్
ఇలాతలంలో.
మంచుకొండల్లో , మండుటెండల్లో ,
ముళ్లకంపల్లో , బండరాళ్ళల్లో ,
కారడవుల్లో , కటికచీకట్లో ,
పగలూరాత్రీ తేడాలేక ,
వొళ్లంతాగాయాలతో కుళ్లుతున్నా ,
సరిహద్దుల్లో గస్తీ కాస్తూ ,
నిద్రకానినిద్రే తమ విరామమనుకొని ,
ప్రాణాలను పణంగాపెట్టి దేశరక్షకుడై తేజరిల్లే జవానుభాయికి ఛత్రంపట్టే
జనాలులేరోయ్ మహీతలంలో.
***********†****†******************
Ee కవిత నా స్వీయరచన... అని ధృవీకరిస్తున్నాను.
24.
*********వీరా'స్ కవిసమయం********** 6. ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్
కవితసంఖ్య : 24.
తేదీ : 26-05-2020.
శీర్షిక : ప్రతీకలు (మాలవీయ-పటేల్-నిజాం)
1. ఉప్పొంగు శ్రీలుగల భారతఖండమునందు
నొప్పుగా యలరారు తెలంగాణమునందు ,
చెప్పు విసిరిన నైజాము గర్వమడచ , నా
చెప్పునే వేలమాడె 'మదనమోహనుడు'.
అట్లు ,
2. సేకరించిన ధనము తనకెగ్గుగా దలచి ,
మోకరిల్లె 'నక్క' మదనుని పాదమంటి.
సకలహంగులతోడ కట్టించె మదనుడు
సకల'విశ్వ'జన 'హిందు' విద్యాలయమ్ము.
3. తెలంగాణ ప్రజల కట్టుబానిసల జేసి ,
తులతూగు నైజాము తోకముడిచెఁ.
'వల్లభుని'దెబ్బకు సకుటుంబీకుడై పారె ,
కలలోను 'భాయి'ని గాంచ భయభీతుడై.
4. 'ఉక్కుమనిషి' యను బిరుదాంకితుడొకరు ,
నిస్స్వార్థజీవియగు దేశసేవకుడొకరు ,
నరరూపరాక్షస 'నియంత'గా పేరు
మూటగట్టుకున్న 'ముసలినక్క' యొకడు.
***************** *****************
Ee కవిత నా స్వీయరచన. ఇతరులకవితకు అనుసరణ , అనుకరణ , అనువాదమూ కాదు... అని హామీ ఇస్తున్నాను. ఈ రోజే రాసింది. 🙏
25
వీరా'స్ కవిసమయం
6. : ముడుంబ తిరువేంకటాచార్యులు , వరంగల్. కవితసంఖ్య : 25.
తేదీ : 27-05-2020.
శీర్షిక : బాలల దేశభక్తిగేయము(౨౧-౧౨-౧౯౯౩).
ప: భారతమాతబిడ్డలమూ మేమూ -
మాకు చల్లనీ తల్లి భరతావనీ /భరతమాత/
చ.౧.అమ్మఒడివిశాలము-ఇక్కడెంతోహాయిమాకు/౨/
అలుపెరుగకఆడుకొందుమీచల్లనివొడిలో/భరతమాత/
చ.౨. మాతృభూమినందనం-చేసేమూవందనం/౨/
విరులన్నీ అర్పింతుము మాతల్లిపాదాలకు/భరత/
చ. 3. ఒక్కటిగాఆడుతాం-ఒక్కరమైపాడుతాం/౨/
భరతజాతికిలలోపలసరిలేదనిచాటుతాం/భరతమాత/
చ.౪. *అలుగులెన్నిగ్రుచ్చినా-వెరపెరుగకసాగుతాం/౨
మాతృభూమిసేవచేయకదలిముందుకేగుతాం/భరత/
*అలుగులు=బాణాలు.
********* , అని హామీ ఇస్తున్నాను.
26
*********వీరా'స్ కవిసమయం************ 6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్ కవితసంఖ్య :౨౬.
తేదీ : 28-05-2020.
శీర్షిక : నేనూ కవినై నిలవాలి.
నేనూ కవినై పోవాలి.
ఏదో ఒకా కవిత రాస్తూనే ఉండాలి.
నా కలం నిరంతరం సాగుతూనే ఉండాలి.
నా ఆలోచనలకు పదునుపెట్టాలి.
నా కవిత కొంగ్రొత్తగా ఉండాలి.
నాకే ముద్దొచ్చేలా ఉండాలి.
కవులంతా మెచ్చేలావుండాలి.
కొత్త విషయాలెత్తి రాయాలి.
విషయం కొత్తగా చెప్పాలి.
మనసులకు హత్తుకునేలా ఉండాలి.
మళ్ళీ మళ్ళీ చదివిన్చేలా ఉండాలి.
విసిగించేలా ఉండొద్దు.
నన్ను తిట్టుకొనేలా ఉండొద్దు.
ఎవ్వరి మనసూ నొప్పించొద్దు.
ఎప్పటికప్పుడు కొత్త కవితలు రాయాలి.
నా కలం సాగుతూనే ఉండాలి.
నేనూ కవినై నిలవాలి.
***†*†************'*''''
Ee కవిత నాస్వంతం ...అముద్రితం... అని హామీ ఇస్తున్నాను.
27
********వీరా'స్ కవిసమయం************ 6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్ కవితసంఖ్య : 27. తేదీ :౨౯-౦౫-౨౦౨౦.
శీర్షిక : మాస్కు-ఓ మస్కా....మరి క్షేమమేనా?
యుద్ధం మొదలైంది. 'కరోనాచైవదాతవ్యం'
(కరచాలనం వద్దు) అంటూ. శుభ్రత గురించి నినాదాల హోరు మొదలైంది.
1.0 లో మాస్కులు, శానిటైజెర్ల కొరత. 1000 లోపు కేసులు. మనమేనయమంటూ చంకలు గుద్దుకున్నాం.
2.0 లో 10,000 లోపు కేసులు. శానిటైజర్ లభ్యం. 3.0 లో మాస్కులు కూడా లభ్యం.
కానీ వైద్యులకు కూడా దొరకనంత గిరాకీ. 50,000 లోపు కేసులు.
4.0 లో అన్నీ లభ్యం. కానీ వైద్యులు కరోనాకు బలయ్యారు. 1,50,000 దాటిన కేసులు.
చైనాను దాటేసిన భారత్.
తరచిచూస్తే
మాస్కులు పెట్టుకుని తిరిగేవారు అతిస్వల్పం. ఇక పెట్టుకు తిరిగేవారి సంగతో!?
కొంతమందికది కంఠాభరణం. స్టేతోస్కోపులాగా. ముక్కూ , మూతీ ఓపెనే
కొంతమందికది చుబుకాభరణం.( గదుమ)
ముక్కూ , మూతీ ఓపెనే
కొంతమందికి మూతి మాత్రమే కవరింగ్.
ముక్కు ఇంకా ఓపెనే.
అతికొద్దిమంది మాత్రమే
భయంవల్ల 'జాగ్రత్త' పడుతున్నారు.
ఏమంటే,
'కరోనాతో సహజీవనం చేయాల్సిందే' ముఖ్యమంత్రుల ఉవాచ.
'ఎక్కువ పరీక్షలు చేస్తే బహుమతులివ్వరు'
ఓ మంత్రి ముందడుగు మాట.
మరి , కరోనాను స్వాగతిస్తున్నారా!
వీడ్కోలు పలికే ప్రయత్నమేదైనా కనుగొన్నారా? ప్రభుత్వాలు చేతులెత్తేసినట్లే.
ప్రజలే తేల్చుకోవాలి.
పోరాటమా? సహజీవనమా? మరిన్ని బలిదానాలా?
ఒక్కటి గుర్తుంచుకో!
పోతే నీవొక్కడివే పోవడంలేదు.
'సహేంద్ర తక్షకాయస్వాహా!' అన్నట్లు
కుటుంబాలు , వీధులు , వాడలు , పేటలు కలగలిపి ఊడ్చిపెట్టుకుపోతాయి. .....
తస్మాత్ జాగ్రత్త!
తగినన్ని జాగ్రత్తలు తీసుకుని
కరోనాకు 'వీడ్కోలు' పలకండి.
మాస్కులు ముక్కుకు , మూతికి పెట్టుకోండి.
మెళ్ళో ఆభరణంగా కాదు.
'శుభం భూయాత్'.
**************##@##***************
Ee కవిత నా స్వీయరచన. అముద్రితము ... అని హామీ ఇస్తున్నాను.
: 28.
తేదీ :౩౦-౦౫-౨౦౨౦.
శీర్షిక : కరోనా కట్టడి - పరిమితులు .
కారులో అనుమతి ముగ్గురికే.
నాలుగో వాడెక్కితే కరోనాకు చిక్కుతాడు!
బైకుపై ఒక్కరే వెళ్ళాలి.
వెనకెవరైనా ఎక్కి కూచుంటే
వాడిని కరోనా పట్టుకుంటుంది!
బస్సులో ముప్పై మంది ఎక్కాలి.
ముప్పైఒకటో వాడెక్కితే ,
వాడు కరోనాకు బలి!
ఉదయం 7 నుండి రాత్రి 7 వరకే బయటతిరగాలి. కాదని రాత్రి తిరిగావా , కరోనా నిన్ను కొరికేస్తుంది! గుంపులు గుంపులు ఎగబడి
వైన్ షాపుల్లో మద్యం కొనుక్కోవచ్చు.
బార్లో ఒక్కడివే కూచొని తాగినా
కరోనా నీ అంతు చూస్తుంది!
రెడ్జోన్లోనైనా సరే! పాసుంటే ఇష్టమొచ్చినట్టు తిరుగు. పాస్ లేకుంటే గ్రీన్జోన్లో తిరిగినా కరోనా కాటేస్తుంది! చిన్నషాపుల్లో గుమిగూడికొన్నా ఏంకాదు.
షాపింగ్ మాల్‌కు వెళ్ళావా , విలయతాండవమే! నేతలు పుట్టినరోజులు , ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేసినా , ఎంతపెద్ద గుంపు చేరినా , మాస్కులు పెట్టుకోకున్నా ఏమీ కాదు.
కానీ సామాన్యుడు పక్కవారితో కలిసి పండగ చేసుకుంటే కరోనా వాడిపని పట్టేస్తుంది! ప్రార్థనాలయాలలో , ఆధ్యాత్మికకేంద్రాల్లో , విద్యాలయాల్లో భౌతికదూరం పాటించినా ,
అసలు తెరిచివుంచినా ముప్పే!
కానీ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఏమీకాదు! హోమ్ డెలివరీ ఫుడ్ తినేయండి. ఏంకాదు.
కానీ అదే హోటల్‌కు వెళ్లి కూచొని తింటే మాత్రం కరోనా మీతో ఆటాడుకుంటుంది!
ప్రముఖులింట్లో పెళ్ళికి వందలు ,
వేలమంది హాజరైనా కరోనాకు అక్కండుండే దమ్ము లేదు. కానీ , పేదోడింట్లో చావుకైనా ,
పదిమంది చేరితే ముప్పే!
వలసకూలీల్ని రైళ్లలో కుక్కి ,
పైకెక్కించి , పంపినా ఏంకాదు.
కానీ ఎక్స్ ప్రెస్ రైల్లో రిజర్వేషన్ చేయించుని వెళ్లినా మీకు స్వర్గం/నరకం వెళ్లేందుకు
ఏ.సి. బెర్త్ ఖరారైనట్లే.
ఏతా వాతా చెప్పేదేమంటే
సామాన్యులూ! మీ క్షేమమే మా ధ్యేయం.
కాబట్టి జాగ్రత్త. మిమ్మల్ని మీరే కాపాడుకోండి. ఎక్కడి వారు అక్కడే పడి ఉండండి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ , ప్రభుత్వాలు పంపే పలహారాల కోసం ఎదురుచూస్తూ , ఉండండి.
*************#@#**************
ఈ కవిత నా స్వీయరచన. అముద్రితము అని హామీ ఇస్తున్నాను.
29
[31/05, 7:15 PM] Tiru Venkatacharyulu Ks6: *********వీరా'స్ కవిసమయం*********** 6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్
తేదీ : 31-05-2020.
కవితసంఖ్య : 29.
శీర్షిక : సెల్ ఫోన్-సర్వాంతర్యామి.
అలారంతో సుప్రభాతం.
స్వామి నిద్రలేవడం మాత్రం సూర్యోదయానంతరమే. ముందుగా దర్శనం చేసుకునేది సెల్లు ముఖమే. సూర్యనమస్కారం మాట దేవుడెరుగు ఎండకన్నెరుగని అసూర్యంపశ్యలవుతున్నారు.
లేచినవెంటనే నెట్ ఆన్.
నోట్లో బ్రష్షు చేతిలో సెల్లు.
ఇక్కడ మొదలవుతుంది సెల్లు ఆ'పరేషాన్'.
ఫేస్బుక్ వాట్సాప్‌లలో లైకులు
కామెంట్ల కోసం వెతుకులాట.
నిన్నటి పోస్టుకు కనీసం లైకులు రాకుంటే
అదేదో కొంపమునిగినట్టు.
'షేర్' మార్కెట్ దభేలుమని కూలినట్టు ఫీలింగులు.
ఇక్కడే మొదలవుతుంది ఫ్రస్ట్రేషన్.
ఈ చికాకు ఇంటిల్లిపాది మీద.
ఏ పని చెప్పినా అగ్గి మీద గుగ్గిలమే.
సెల్లులోంచి తలతీయకుండానే నెమ్మదిగా
టీ టిఫిన్లు కానిచ్చేసి ఏ మిట్టమధ్యాహ్నానికో గుర్తుకొచ్చి లేదా ఇంట్లోవాళ్ళు అరిచి గుర్తుచెస్తే గబగబా వాల్ క్యూరింగ్ చేసినట్టు స్నానంకానిచ్చేసి మళ్ళీ సెల్ ఫోన్ లో తలదూర్చి
ఏం తింటున్నామో కూడా పట్టించుకోకుండా మధ్యాహ్నభోజనం కానిచ్చేసి గూగుల్ యూట్యూబ్ వీడియోలు టెలిగ్రామ్ ...ఇంకా ఏవేవో యాప్‌లు
వాటి పిండాకూడు ... మనిషిని తనకు బానిసగా చేసుకున్న ప్రాణంలేని వస్తువుల్లో ప్రముఖంగా చెలామణి అవుతున్న సెల్ ఫోన్.
మెదడు దెబ్బతింటుందని ఎంతమంది హెచ్చరించినా ఎన్ని మెసేజ్ లు వీడియో లు పెట్టినా
ఈ బానిస బ్రతుకులు వినిపించుకోవు.
మనిషిని తన అసలు పనినుండి దూరంచేసి
వాడిని బద్ధకస్తుడినిచేసి తానే అన్నీ అయ్యి ప్రపంచాన్ని పక్కదారి పట్టిస్తున్న చరవాణి
నిజంగా మానవాళిపై ఏనాటిపగనో తీర్చుకుంటున్నది. **** @@@@@ **** @@@@ **** @@@@ ****
ఈ నా స్వీయరచన ఇప్పుడే నేరుగా ఫోన్ లో అక్షరబద్ధం చేసింది... అని హామీ ఇస్తున్నాను.
30
[31/05, 8:06 PM] Tiru Venkatacharyulu Ks6: అమ్మపాట :
హాయీ! హాయీ!! హాయీ గోకులబాలా గోపాలా!ఆటలాడీ అలసినావు నిదురపోగదరా!
ఆటలాడీ అలసినావు జోలపాడెదరా //హాయీ//
1. రాధనిన్నూ చంకనెత్తీ మందకేగెనురా /రాధ/
వీధివీధీ త్రిప్పేనేమో దిష్ఠితాకెనురా! దిష్ఠితాకెనురా!
//Haayee//
(ఇంతవరకు అమ్మపాడేది. మిగతా నేను కూర్చినది)
2. తల్లినీపై కోపగించీ రోటగట్టేనురా! /తల్లి/ వేణువూదగ పరవశించీ ముద్దులాడెనురా! ముద్దులాడెనురా!! //హాయీ//
3. భామలిండ్ల పాలుపెరుగూ వెన్నదోచితివో /భామ/ గోపకాంతలు స్నానమాడగ రవ్వజేసితివో!రవ్వజేసితివో //హాయీ//
4. మాయాగోపికచన్నుగుడుప అసువులూడ్చితివో
/మాయ/
నీటదూకి కాలనాగు గర్వమడచితివో!గర్వమడచితివో! //హాయీ//
5. గోటిమీద గిరినిఎత్తి వ్రజులగాచితివో /గోటి/ సురలరాజు గర్వమడచి మహిమజూపితివో! మహిమజూపితివొ!! //హాయీ//
6. లీలలెన్నో చూపినావు చిన్నిబాలుడవా!? /లీల/ నీవెమాకు రక్షకుడవు మమ్ముబ్రోవుమురా! మమ్ముబ్రోవుమురా!! //హాయీ//
*************@@@@@@@@**************
6. Mudumba tiruvenkatacharyulu , Warangal . Kavithasankhya: 30. Sheershika: baalakrishnuni laalipaata.
This song is my own script. Neither copied nor translated.
31
వీరా'స్ కవిసమయం
కవిసంఖ్య : 6.
ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్
తేదీ : 02-06-2020.
కవితసంఖ్య : 31.
శీర్షిక : నాదేశం-నాజాతి
నాదేశమే నందనవనం ,
నాజాతి కుసుమగుచ్ఛం ,
ఈనేల నాకు కన్నతల్లి ,
నా జాతి నాకు కల్పవల్లి ,
సర్వమతాల సోదరభావమే
భారతజాతి సమైక్యనాదం.
మతములెన్నో , భాషలెన్నో ,
యాసలెన్నో , వేషధారణాలెన్ని రీతులో ,
అయినా మేమందరమొకటే ,
మేమందరమూ అన్నదమ్ములం.
దేశమొకటే , జాతియొకటే ,
జండా ఒకటే , శపథమొకటే.
కలసికట్టుగా ముందడుగేద్దాం ,
ప్రగతిపథంలో పయనిద్దాం.
************@@@@@@@****************
.
Ee కవిత నా స్వీయరచన. ఇతరులకవితకు అనుకరణ , అనుసరణ , అనువాదమూ కాదు , అముద్రితము అని ధృవీకరిస్తున్నాను.
32
వీరా'స్ కవిసమయం
కవిసంఖ్య : 6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్ తేదీ :౦౩-౦౬-౨౦౨౦.
కవితసంఖ్య :౩౨. శీర్షిక : జాతీయపతాకం.
వినువీధుల ఎగరాలీ మువ్వన్నెల మనజండా , గర్వంగా ఎగరాలీ ముచ్చటైన మనజండా.
కాలానికి నిలిచిన త్యాగం-కాషాయం ,
శాంతి అహింసల సాక్ష్యాధారం-శ్వేతవర్ణం , సస్యశ్యామల ధాన్యాగారం-హరితవర్ణం ,
ధర్మరక్షణే ధ్యేయస్వరూపం- ధర్మచక్రం.
స్వరాజ్యసమరయోధులెందరో
త్యాగధనుల రుధిరప్రవాహం ,
మహాత్ముడే చేబూనిన అస్త్రం
సత్యాగ్రహమే ఆయుధం ,
గంగయమునగోదావరికృష్ణల
పరీవాహకవరప్రసాదం ,
అశోకుడేలిన అహింసావ్రతము , బుద్ధంశరణంగచ్చామి ,
సంఘంశరణంగచ్చామి ,
ధర్మంశరణంగచ్చామి.
మువ్వన్నెల మనజండా ఉన్నతమై ఎగరాలి ,
జండాస్ఫూర్తితో మనజాతి ఉజ్జ్వలమై ఎదగాలి.
***************@@@@****************
Ee కవిత నా స్వీయరచన. ఇతరులకవితకు అనుసరణ , అనుకరణ , అనువాదమూ కాదు , అముద్రితము అని ధృవీకరిస్తున్నాను.
33
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు , వరంగల్ తేదీ : 04-06-2020.
కవితసంఖ్య : 33. శీర్షిక : చంద్రహాస! (మకుటం)
మధ్యతరగతి కుటుంబీకుడ!
మిధ్యయగు కలలేల కందువోయి?
సాధ్యాసాధ్యముల యోచించు మదినీవు వేషభూషభాస! చంద్రహాస(౧) కలలన్ని నినునీవు మైమరచిపోవుటకె ,
ఇలలోకి నాకమ్మి దిగిరాదు సుమ్ము ,
అలవోకగానేది సాధ్యపడదు నిజమ్ము , వేషభూషభాస! చంద్రహాస! (౨) మొదటనినునీవు పరికించుకొనుము.
పిదప పరిసరమ్ముల దెలిసికొనుము.
తదుపరి సాధ్యమౌ స్వప్నాల రాసుకొనుము.
తుదకు శ్రమియింపవలెనోయి! చంద్రహాస! (త్రీ)
మొయిలు నీరు నమ్మి , బానవొలకబోసి , వానలేమి జూచి వగచినట్లు ,
రాని ధనమాశించి ఋణబాధలేలరా?
వేషభూషభాస! చంద్రహాస(౪) ధనములేని వాని దరిద్రుడనరాదు ,
ధనమున్న ప్రతివాడు దాతగాడు.
దాతగానివాని దరిద్రుడనవచ్చు ,
వేషభూషభాస! చంద్రహాస(౫) గండశిలను దెచ్చి శునకవాలముగట్ట ,
ఉసరుబాయు గాని వంకబోదు.
మలినహృదయుమార్చ మరియెవరి తరమురా? వేషభూషభాస! చంద్రహాస(౬) అవసరమున నాదుకొనని బంధుమిత్రజనుల్ ,
తన మనమెరిగి మెలగని దారాసుతుల్ ,
తా బొందు సేవలకగు భృతినీయని దొరయు
మనః kleశ హేతువులు గదా! చంద్రహాస! (౭)
Ee పద్యకవితలు నా స్వంతరచన. ఈ మకుటంతో మరికొన్ని పద్యాలను రాయగలనని నా నమ్మకం.
34
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు , వరంగల్. తేదీ : 05-06-2020.
కవితసంఖ్య : 34. శీర్షిక : అంతటా నీవే.
ఎదురుచూపుల నా కనులలో నీవే ,
ఎదలోన కదలాడు ఊసులలో నీవే ,
నిదురలో మెదిలేటి కలలోన నీవే ,
నిదుర రాకున్నచో కనుపాపలో నీవే , చిగురుటాకులొలుకు చిరునవ్వు నీవే , దరహాసమొలికించు విరితావి నీవే ,
ఝుమ్మనిపాడేటి తుమ్మెదపాట నీవే ,
రమ్మని పిలిచేటి తెమ్మెరగాలి నీవే ,
అరచేతి రేఖల వలయమ్ము నీవే ,
అరవిచ్చు విరిభామ అందము నీవే ,
లేలేతకిరణాల ఉదయరవి నీవే ,
మచ్చలేని నిండు జాబిల్లి నీవే ,
అలలపై సాగేటి చిరునావ నీవే ,
గలగలా పారేటి సెలయేరు నీవే ,
ఉదయాన విరిసిన కమలము నీవే ,
రాతిరి విరిసిన కలువభామ నీవే ,
కాలిమువ్వల చిరుసవ్వడి నీవే ,
గోపాలుడూదిన మురళి నీవే ,
మురళీనాదము నీవే , ....
సఖీ! ఏమని చెప్పను?
ఎచ్చోట కాంచిన అచ్చోట నీవే!
కానీ , నిజముగా నీవెదురైన సమయాన
భ్రమలోనచరియించు నే , నిను కాంతునో లేదో! కన్నుల చిప్పిల్లు బాష్పాశ్రువులలోన
నీ రూపు నే గుర్తింతునో లేదో!
నా చూపు కుంచించుకోక మునుపే ,
నా యాశలడుగంటుకోకమునుపే ,
నా యుసురు గాలిలో కలిసిపోవకమునుపే ...
ఒకసారి నీ రూపు కనుపట్టనిమ్ము ,
కడసారి వీడ్కోలు పలికిపొమ్ము.
నీ వొడిలో తృప్తిగా కనుమూయనిమ్ము.
***************@@@@@***************
Ee కవిత నా స్వంతరచన. ఇతరులకవితకు అనుసరణ , అనుకరణ , అనువాదమూ కాదు , .... అముద్రితము అని ధృవీకరిస్తున్నాను. (ముందుగా రాసుకున్నది కాదు. నేరుగా టైపు చేసాను.)
35
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు , వరంగల్.
తేదీ : 06-06-2020.
కవితసంఖ్య : 35.
శీర్షిక : మా బడిలో మర్రిచెట్టు. (భాగం- 1).
మాబడిముందు ఇరువైపులా ద్వారపాలకుల్లా ,
ఒక వైపు మర్రిచెట్టు , మరోవైపు రేలచెట్టు. రేలచెట్టుపై తాటిచెట్టు.
దానిపై తాటిచెట్టు ఎలా మొలిచిందా
అని ఎన్నోమార్లు ఆలోచిస్తూనే
ఆచెట్లనీడల్లో నా ఎనిమిదోతరగతివరకు పూర్తయింది. ఎన్నోమార్లు ఆచెట్లనీడలే మా తరగతిగదులు.
ఆ చెట్లనీడలే మా ఆటస్థలం. ఇసుకలో గుజ్జనగూళ్ళు , తాత-ఉత్తరం , కబడ్డీ ,
బిల్లా-గొనె , గోళీలాటలు , తొక్కుడుబిళ్ల ,
దస్తీ-బిస్తీ , పిచ్చిబంతీ , చిక్కుచిక్కుపుల్ల , ...ఎన్నో ఆటలు ; బాలురు , బాలికలు అనే తేడా లేకుండా కలిసి ఆడుకునేవాళ్ళం.
ముఖ్యంగా మర్రిచెట్టుతో అనుబంధం మరువలేనిది. జ్ఞాపకాలు ఎన్నో ...,
దానిపై ఎన్నో జీవరాసులు ,
ఎప్పటినుంచో నివాసాలేర్పరచుకునేవి.
అప్పుడప్పుడు కొత్తకొత్తపక్షులు కనిపించేవి.
ఆచెట్టుకు ఎన్నేళ్లో?
కనీసం వందేళ్లవయసైనా ఉండొచ్చు.
బల్లులు , తొండలు , ఉడతలు తిరిగేవి.
చెట్టు పండ్లను తిన్నంతతిని , కింద పారేసేవి.
ఎన్నో పక్షులు వచ్చివాలేవి.
కాకులు గూళ్ళు కట్టుకొని కాపురాలు ఉండేవి.
ఆయా ఋతువుల్లో వచ్చే పక్షుల కిలకిలారావాలు ఎంతో ఆహ్లాదంగా వినిపించేవి.
చెట్టుతల్లికెంత ప్రేమ? ఎంత క్షమ?
ఎన్ని జీవరాసులొచ్చి చేరినా
తన సంతానంగానే ఆశ్రయమిచ్చి ఆదరించింది.
బాగా పండిపోయి కిందపడ్డ పండ్లను
కొందరు పిల్లలు ఏరుకొని తినేవారు.
చెట్టుకింద తొర్రల్లో బల్లులుండేవి.
అప్పుడప్పుడూ చెట్టుపైనుండి ఇంతింత కనుగుడ్లేసుకొని మనల్నే చూస్తున్నట్టుగా అనిపించేది. ఓ సారి ఓ పెద్దబల్లిని చూసి , భయమేసి ,
దాన్ని తరిమేయడానికి బాల్యచేష్టతో
ఓ రాయి విసిరాను. ఆ వెంటనే
దాని తోక కిందపడి గిలగిలకొట్టుకొంటూ కనిపించింది. తప్పు అర్థమై చాలా బాధపడ్డాను.
రాయి సూటిగా వెళ్లి తగిలిందేమోనని.
కాలాంతరంలో తెలిసింది ,
ప్రమాదమెదురైనప్పుడు బల్లి
స్వీయరక్షణకోసం తనతోకను కొరికి తెంపి
కిందపడేసి శత్రువు దృష్టి మళ్ళిస్తుందని ,
మళ్ళీ తోకను పెంచుకుంటుందనీ.
విషయం తెలిసాక స్థిమితపడ్డాను.
నా రాయి దానికి తగల్లేదని.
Maa ఊరినుండి పై చదువులకోసం వెళ్ళాక , పన్నెండేళ్లతరువాత ఊరీని చూడాలనిపించి వచ్చాను. బడివైపుకు వెళ్లాను , నా ఫ్రెండ్స్ తో కలిసి.
చెట్లు లేవు. బడి చాలా మారిపోయింది. పెద్దగాలివానకు మర్రిచెట్టు కూలిపోయిందని చెప్పారు. అర్థరాత్రి వేళలో , ఎవరూ లేని సమయంలో ,
అదీ చుట్టూ ఉన్న ఏ ఇంటిమీదా పడకుండా , ఎవరికీ హాని , నష్టమూ కలుగకుండా పూర్తిగా దారివారగా పడిపోయింది.
చెట్టమ్మకెంతదయ ఈ మనుషులపైన?
ఈ మనుషులకెప్పటికీ అర్థంకాదేమోగానీ
చెట్టుకు ప్రాణమే కాదు హృదయమూ ఉంటుందని ఋజువవుతూనే ఉంది ఇలాంటి అనేక సంఘటనల్లో.
ఇక రేలచెట్టును బడిగదుల కట్టుబడుల
విస్తరణలో భాగంగా తీసేసారుట!
ఇదీ , మనుషుల గొప్పతనమా లేక
దోషగుణమా? అనిపించింది.
***** ***** ***** ***** ***** *****
ఈ కవిత నా స్వ౦తరచన. ఇప్పుడే నేరుగా ఫోనులో టైపు చేసింది.
36
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్ . తేదీ : 07-06-2020. కవితసంఖ్య : 36.
శీర్షిక : మాబడిలో మఱ్ఱిచెట్టు. (భాగం- 2).
డిగ్రీ పట్టాపుచ్చుకొని ,
ఉపాధ్యాయశిక్షణ పూర్తిచేసుకొని ,
ఉపాధికోసం ప్రివటుబడుల్లో పనిచేస్తూ ,
ప్రభుత్వ ఉపాధికై నిరీక్షిస్తూ , ఎట్టకేలకుసాధించి , ఐదేళ్ల సర్వీసు తరువాత పదోన్నతి పొంది , తదుపరి బదిలీల్లో భాగంగా దామెరబడికొచ్చిన నాకు అక్కడి చెట్లను చూసి ప్రాణం లేచొచ్చింది.
ఓ ప్రక్కగా మఱ్ఱిచెట్టు.
చూసి నా చిన్నప్పుడు చదువుకున్న బడిలో మఱ్ఱిచెట్టు జ్ఞాపకాలు మదిలో ముసురుకున్నాయి. బడిపిల్లలు తమ మధ్యాహ్న భోజనం
చెట్టుకిందే కానిచ్చేవారు.
కొన్నిసార్లు టీచర్లు పిల్లలకు పాఠాలు కూడా
చెట్టుకిందే బోధించేవారు.
అప్పుడప్పుడు చెట్టుకింద కూర్చుని పిల్లల ఆటలను చూస్తూ విరామసమయాల్ని గడిపేవాళ్ళం.
నాలుగేళ్లు గడిచాయి. ఓ వానాకాలం , అర్థరాత్రి గాలివానకు పిల్లలూ , మేమూ కూర్చొనే వైపు పెద్దకొమ్మలు విరిగిపోయాయి.
అక్కడి వరకు తొలగించెసి ,
మిగిలిన భాగం అలా వదిలేసారు.
చెట్టు మళ్లీ ఊపిరిపోసుకుని చిగురించసాగింది.
మళ్లీ ఆశలు చిగురించాయి.
కానీ మరో మూడేళ్లకు మళ్లీ గాలివాన. మిగిలినకొమ్మలు కూడా పూర్తిగా విరిగిపోయి ,
బోదె మాత్రం నిలిచి ఉంది. ఇక మళ్లీ చెట్టు చిగురించి ఎదిగే అవకాశాలు కనిపించలేదు.
అక్కడ చెట్టుందేదనదానికి గుర్తుగా ఒక అడుగు ఎత్తునదిమ్మ మాత్రం ప్రస్తుతానికి మిగిలి ఉంది.
నా స్మృతిలో మాత్రం మఱ్ఱిచెట్లు
సజీవంగానే ఉన్నాయి. ఉంటాయి కూడా.
*************@@@@@@***************
this script is my own creation. Neither copied nor translated.
37
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు , వరంగల్.
తేదీ : 08-06-2020. కవితసంఖ్య : 37.
శీర్షిక : మరణశయ్యపై మనోవ్యధ. (పాట)
రేయి తెలవారినా , బతుకు తెల్లారునా? ....
ఈ రేయి తెలవారినా ,
నా బతుకు తెల్లారునా? ఊరుపొమ్మంటుంటే , కాడురావద్దంటే ,
గుండె గొంతుకలోన కొట్టాడుతుంటేను /ఈ రేయి/
కాలు కదపా లేను , పక్కకొరగలేను , పక్కంత తడిచేను ఏమిచేతు? కంట్లోకునుకురాదు , గతము మరపురాదు , దేవుడా నన్నెందుకు దేీస్కపోవు?
పుట్టి0టి గారాలపట్టినై ,
అన్నల గారాబుచెల్లినై ,
అందరికళ్ళల్లో కనుపాపనై పెరిగి ,
ముద్దుముద్దుగా పెరిగిననేను ,
ఎనిమిదేండ్లకే ఇల్లాలినై ,
పెద్ద బలగంలో బండచాకిరితో, గానుగలో పిప్పినై నలిగిపోతీ. అత్తగారిప్రేమఆకులోవక్కాయే పంటనలగదాయే ,
బయటి కుయ్య లేను ,
నమిలి మింగలేను ,
పేదరికము మాకు పాఠాలు నేర్పింది , పొట్ట తిప్పలకొరకు పల్లెటూరి బతుకు ,
ఇంటిదైవానికీ వెన్నీళ్లు , చన్నీళ్లై చేసినపనులేన్నో , గుట్టుగ బతుకీడ్వ కిటుకులు నేర్పింది ,
కన్నకడుపులను కంటికిరెప్పోలే బువ్వకు ,బట్టకు లోటు లేకుండా సాదుకుంటీ ,
పెద్ద సంతునిచ్చి నా పసుపుకుంకుమ , దేవున్ని జేరింది , నా బతుకునేమో నట్టేట ఉంచింది , కష్టకాలమొచ్చే కాపాడు దేవుడా! కరుణించుమని నేను వెడుకుంటి ,
ఏ మూలనున్నడో , నామొర విన్నడో నాకొడుకులే నాకు ప్రాణమైరీ , కష్టకాలములోన బుద్ధిమంతులై అన్నింటా కష్టించి పైకొచ్చిరీ , ప్రాణంలో ప్రాణంగా నన్ను జూసు కుంటు , కంటిరెప్పోలే సాకు తుండ్రు. ముదిమివయసులోన మంచాన పడినాక , చాత నైనంతలో సేవజేస్తున్నరు , కాల్జేతులాడవు, లేచికుసొలేను ,
ఎందుకీ బతుకు ఓరి దేవుడా? ఇంకా నన్నెందుకు దీస్కపోవు? , కొడుకులు , కోడళ్ళు , బిడ్డలు , మనుమల్లు , ఎందరున్నగాని నా ఆర్తి దీరదు , నా బాధ వినరారు , ఏమిజేతు? వొళ్ళంతా నొప్పాయే , పచ్చిపుండ్లాయే దేవుడా దయలేద నా మీద నీకు? ఎన్నాళ్ళు ఆయుష్షు రాసిపెట్టి నావు , ముసలిజీవి మీద జాలి లేదా? ఎందుకయ్యా సామి ఇట్లేడిపిస్తావు? నీకేమి లాభము ఈ కట్టెతో? /ఎందు కయ్య సామి ఇట్లేడిపిస్థావు? ఇంకేమి లాభము ఈ కట్టేతో? (3సార్లు)
********#####******** ఈ పాట నా స్వీయరచన. ఇతర రచనలకు అనుసరణ ,అనుకరణ ,అనువాదము కాదు... అని dhruveekaristhunnaanu. నేరుగా టైపు చేసినది.
38
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్. తేదీ : 09-06-2020. కవితసంఖ్య : 38.
శీర్షిక : తెలంగాణ తల్లులకు వందనం.
తెలంగాణతల్లులార! వందనాలు మీకు.
అన్నింటా మీరే ముందు.
మీకు మీరే సాటి.
చదువుల్లో సరస్వతులు
శక్తిలో దుర్గలు
సంపాదనలో లక్ష్ములు
పరాక్రమంలో రుద్రమలు
పోరాటపటిమలో ఐలమ్మలు
ఏ సాధనలో అయినా
మీకు మీరే సాటి.
రజాకార్లనెదిరించీ
సాయుధపోరాటంతో
నిజామునే వణికించి
మీ పోలికేకలతో ఢిల్లీని పిలిపించి
ముసలినక్కను తరిమికొట్టిన పోరాటంలో
మీ భాగస్వామ్యానికి వేనవేల వందనాలు.
పుట్టింట్లో బతుకమ్మలు
మెట్టింట్లో లక్ష్మమ్మలు
బడులలో విశారదలు.
వ్యవసాయంలో మీరే
వ్యాపారంలో మీరే
సాహిత్యంలో మీరే
సాంకేతికవిప్లవంలో మీరే
రణరంగంలో మీరే
రాజకీయంలో మీరే,...
కదురుతో పత్తి వడికింది మీరే వెదురుతో బుట్టలల్లింది మీరే బీడీలు చుట్టేది మీరే
విస్తల్లు కుట్టేది మీరే
వండి వార్చేది మీరే
బండి నడిపేది మీరే
మిషను కుట్టేది మీరే
మట్టిపని చేసేది మీరే
ప్రభువుల ప్రలోభాలకు బానిసలై పురుషులు
చేవచచ్చి చేష్టలుడిగి
చాపలుచుట్టేసే వేల కష్టాలనేదిరించి
కుటుంబ పోషణకు
నడుము బిగించి
ముందుకురికేది మీరే, ... అందుకే అందుకోండి
వేనవేల వందనాలు.🙏🙏🙏... ... ... ...
ఇది నా స్వంత రచన. ఇతరుల కవితలకు అనుసరణ ,అనుకరణ , అనువాదము కాదు... అని dhruveekaristhunnaanu. ఇది నిన్న పంపవలసిన కవిత, వీలుకాలేదు.
39
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు , వరంగల్
తేదీ : 10-06-2020. కవితసంఖ్య 39.
శీర్షిక : మనోభీప్సితం.(మనసులోని కోరిక)
నా మనసులో ఏవేవో కోరికలు , _హృదయా0తరాలలో_ ఎన్నో మధురోహలు.
నా మనసులోని ఆశ,
సాకార మవ్వాలని ,
నే నడచిన ప్రతిబాట ,
ఒక పూ బాట కావాలని ,
నా ఊహల ప్రపంచమే
ఒక పూ దోట కావాలని , ఆ తోటలో ప్రతి పూవు శ్రీగ0ధమొలికించాలనీ , నా స్వప్న కుటీరాన
అరవిరిసిన మందారాలే ,
ఈ జగతికి ఆనందాలు, అందాలూ అందించాలని ,...
అందరూ బాగు0డా లని ,
ఆ అందరిలో నేను0డా లనీ చిన్నిచిన్ని ఆశ.
*************@@@@****
ఇది నా స్వంత రచన. ఇతర రచనలకు అనుసరణ, అనుకరణ, అనువాదం కాదు అని dhruveekarఇస్తున్నాను.
40
వీరాస్ కవిసమయం
6. ముడుంబ
తిరువేంకటాచార్యులు , వరంగల్.
తేదీ : 11-06-2020.
కవితసంఖ్య : 40.
శీర్షిక : జాతిఐక్యత- అవసరం.
రెండు కాకులు,
మిద్దె మీద నుండి
ఆహారం కోసం వెతుకుతూ చుట్టూ చూస్తున్నాయి. అల్లంత దూరంలో
రొట్టెముక్క కనపడింది. క్షణంలో రెండూ రివ్వునవెళ్ళి దాన్ని చెరోవైపు ముక్కున
కరచిపట్టుకున్నాయి. "దీన్ని నేను ముందుచూసాను. ఇది నాదే", "దీన్ని నేనే ముందు పట్టుకున్నాను,
నువ్వే నాకు వదిలేయ్". వాదులాట. చివరకు
'చెరి సగం పంచుకుందాం.'
అని ఒప్పందానికొచ్చాయి.
మరి త్రాసు కావాలి కదా,
పిల్లి దగ్గర త్రాసు ఉంది పిల్లినే పంచివ్వమందాం.
రెండూ వెళ్లాయి.
పిల్లికి రొట్టేనిచ్చి పంచమన్నాయ్.
పిల్లికి పండగే.
రొట్టెను రెండుముక్కలు చేసి, ఒక్కోపల్లెంలో ఒకటి వేసింది. త్రాసు ఒకవైపు కు ఒరిగింది.
' దీంట్లో కొంచెం ఎక్కువైన ట్లుంది.' అంటూ ఆ వైపు రొట్టె తుంచి నోట్లో వేసుకుంది. కాకులు చూస్తున్నాయి. త్రాసు ఈసారి రెండో వైపు ఒరిగింది.
' ఈసారి ఇటెక్కువైంది.' అటు త్రుంచి నోట్లో వేసుకుంది. కాకులు చూస్తూనే ఉన్నాయి. అలా పిల్లి
' సమన్యాయం ' చేయడానికి
"ప్రయత్నిస్తూనే" ఉంది. చివరకు ఒక పల్లె0 ఖాళీ. కాకులు చూస్తూనే ఉన్నాయి, దేబ్యం మొహాలేసుకుని.
' అయ్యో! నీ ముక్క మొత్తం త్రాసులో నే అయిపోయింది.' అంటూనే రెండో పళ్ళెంలో ముక్కనూ
నోట్లో పెట్టుకుంది పిల్లి. అప్పటిదాకా
ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు దేబ్యాలకు.
"మోసం, మోసం" అంటూ
పిల్లితోగొడవకు దిగాయి.
ఆ అవకాశం ఇవ్వకుండానే పిల్లి తన పంజాతో గట్టిగా చెరి దెబ్బ వేసింది. ' ఇప్పుడు పిల్లికి రెట్టింపు ఆహారం దొరికింది.'
"స్వజాతివైరం శత్రువుకు వరం కాకూడదు."
' కలసివుంటే కలదు సుఖం,
కలహిస్తే కల్లోలం'.
' స్వజాతిపక్షులు కొట్టుకొని వైరిజాతి పిల్లికి అవకాశం ఇవ్వద్దు'.
"జాతి ఐక్యత దేశానికి మహాయుధం."
*********@@@@********
ఇది నా స్వంతరచన. పాతకథలోని నీతిని కవిత్వీకరించడానికి ప్రయత్నించాను.
41
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్
తేదీ: 11-06-2020. 41. భగినీహస్తభోజనం.
రక్తం పంచుకు పుడుతుంది.
కలిసి తింటుంది.
కలిసి కయ్యాలాడుతుంది.
కలిసి చదువుకుంటుంది.
పనుల్లో పాలుపంచుకుంటుంది.
పేచీలూ పెడుతుంది.
ఒక్కోసారి అమ్మలా అన్నంపెడుతుంది. ఆకలిచూస్తుంది. ఆదరిస్తుంది.
అవసరమైతే సలహాలిస్తుంది.
పెళ్ళైఅత్తారింటికి వెళ్ళేటప్పుడు
గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది.
ఆ ఏడుపు కరకురాతి గుండెను కూడా కరిగిస్తుంది. తన ఇంటికి వెళ్ళినప్పుడు
ఆనందంతో కమలంలా
ముఖం వెల్లివిరుస్తుంది.
బతుకమ్మ ఆడటానికి పుట్టింటికి వచ్చి
ఆనందపు వెలుగులను నింపుతుంది.
ఒక్కచీర పెట్టినా రవిక ముక్క పెట్టినా
వంద రూపాయలు పెట్టినా సంతోషిస్తుంది.
రాఖీకట్టి కష్టకాలంలో
రక్షగా రమ్మంటూ సూచిస్తుంది.
అమ్మకు , తనకూ తేడా లేదని నిరూపిస్తుంది.
... ... ... ... ... ... ... ...
అందుకే మన సంస్కృతిలో
సోదరి చేతి వంట తినడంకోసం
'భగినీహస్తభోజనం' అనే
పర్వదినాన్ని నెలకొల్పారు. (సంస్కృతంలో భగినీ అంటే సోదరి అని అర్థం).
**************@@@@@@**************
ఇది నా స్వీయరచన. అముద్రితము అని ధృవీకరిస్తున్నాను.
42
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్.
తేదీ : 12-06-2020. కవితసంఖ్య : 42.
శీర్షిక : అవినీతి నేతలు.
అవినీతితో నందల మెక్కునొకడు ,
నందలమెక్కి అవినీతి చేయ్యునొకడు ,
తన ప్రాపు కాపాడుకొనుటకై
అవినీతి నందలమెక్కించునొకడు.
ప్రలోభాలతో జనతనూరించునోక్కడు , జనతన్ తనదు బానిసల జేసికొని యూరేగునొకడు ,
అనిశా కు జిక్కేనో యన్యాయమనుచును
భృత్యుల నేగదోసి గీపెట్టునొకడు.
ఎన్నిమార్లు చిక్కి చెరసాల పాలైన
శునకవాలపు బుద్ధి వదలకుండా
మరల యందలమెక్క యత్నింతురేగాని
నీతి మాటలు రావు మచ్చుకైన.
నీతిపరుడెవడైన గద్దెనెక్కినఁగాని
నిప్పుతొక్కిన కోతులై యరచు చుంద్రు.
దేశభక్తి యంత తమహక్కు భుక్తమనినట్లు కలుద్రావినకోతులై ఎగురుచుంద్రు.
దేశ సంపద నెల్ల దేశాలు దాటించి
తమ వంశజుల రాజభోగాలకొరకు
వెలలేని యాస్తుల కూడగట్టి తాము
పట్టుబడి చెరసాల యనుభవింత్రు.
శునకవాలములబోలు నిట్టి నేతల
పాదములంటి బ్రదుకు జనతకు
ఏ రీతి చెల్లు తరతరాల యీ బానిసతనము ? నీవైన బాపవే! దేవదేవ!
***************@@@@@***************
ఇది నా స్వ౦తరచన. అముద్రితము అని ధృవీకరిస్తున్నాను. నేరుగా టైపు చేయబడినది.
43
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు , వరంగల్. తేదీ : 13-06-2020. కవితసంఖ్య : 43.
శీర్షిక : ఎందుకు విస్తరిస్తున్నది?
"నియంత్రణలో మనమే ఉత్తమం." 'నిజమే!?'
మరి రెండే నెలల్లో మూడులక్షలు దాటేశాం? "కారణాలువెతకొద్దు.
ముందు బాగానే చేశాం.
లాక్ డౌనుల సంఖ్యతో పాటు సడలింపులెక్కువయ్యాయి.
రోగులసంఖ్యా పెరుగుతూ వచ్చింది."
లక్ష కిట్లు , కొట్లకొద్దీ మాస్కులు
శానిటైజెర్లు ఏర్పాటు చేశాం.
'మరి ఏమి జరిగింది?'
కారణం కాకిలెక్కలు.
జనారోగ్యం లెక్కలోకి రాలేదు.
కేంద్రం కేటాయించిన నిధులను
రాష్ట్రాలు 'పొదుపు' చేస్తున్నాయి. "నువ్వెలాచెబుతున్నావ్?"
'మేం అందరికీ టెస్టులను చేయలేం.'
'ఎవరికి వారు సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలి.'
'ఎక్కువ పరీక్షలు చేస్తే బహుమతులివ్వరు.'
'జలుబు , జ్వరం దగ్గు వస్తే
మందులేస్కొండి. ఆస్పత్రికి రావద్దు'.
"పౌరుల,.. క్షమించండి.. ఓటర్ల ప్రాణాలకు విలువలేదా?
మరి మంత్రిగారి నౌకరుకు
పాజిటివ్ వస్థే మంత్రిగారి కుటుంబమందరికీ పరీక్షలే౦దుకు? అధికార గణంలో ఒక్కరికొస్తే మంత్రిగారి కార్యాలయం అందరూ భయపడుతున్నారు? మళ్లీ ఎన్నికలొస్తే
మీ ఓటర్లైనా మిగలాలా? అక్కర్లేదా?"
'తరాలతరబడి కూచొని తినేంత
సంపాదించాలంటే , మళ్లీ గెలవాలంటే ఓటర్లెక్కన్నుంచి వస్తారు? .... '
ఇప్పుడు మనమంతా ఆలోచించాల్సిందే ...
నిలదీద్దామా? వేధింపులకు భయపడి వదిలేద్దామా?
**************@@@@*************
ఇది నా స్వీయరచన. అముద్రితము. ఆక్షేపణలకు నేనే బాధ్యున్ని.
44
Veeraa's kavisamayam 6. Mudumba tiruvenkatacharyulu Warangal. 14-06-2020. 44. స్నేహాతిశయం.
కడగండ్లపాలబడి కుటుంబము నీదలేక, పిడికెడు యటుకుల మూటగట్టుకొని వెడలెను బాపడు మధురకు, తన కడగండ్లు బాపుట కర్థింప హరిన్.
తడబడు యడుగులజేరెను మధురకు,
తడబాటుగనే గలిసే మిత్రుని కడుబీద తనమునకు తనను తాను నిందల
బెడగుచు విప్పడు మూట ముడిని.
నెచ్చెలికాడరు దెంచిన సంతసమున, నేమి దెచ్చితివి? నాకని యడుగగ మోమాటమునన్
దెచ్చిన మూటని విప్పడు యెగ్గని దలచు,
చెచ్చెర యా మూట లాగి విప్పి యారగించె నా గృష్ణుండున్.
వచ్చిన పనిజెప్పడు, తానడుగడు వెన్నుడు, చెలికా డొచ్చిన సంబరమున, గౌగిలి వీడడు, గుచేలుండును విచ్చిన యాగృష్ణు మోము మనమున దలచుచు వచ్చినదారి బట్టే, దన మైమరపుకు జింతించుచున్.
అడుగకనే అన్ని యిచ్చి , యిడుములబాపెను వెన్ను డు బడుగుబాపని కడగండ్లు దీర్పగ,
యడుగకనే మదినెరింగి యాదు కొనుటయే చెలిమియని జగతికి జూపెన్.
**********@@@@@*****
ఇది నా స్వీయరచన. అముద్రితము. నేరుగా టైపు చేసినది.
🙏. (ఇది ఆదివారం నాటి నా రెండవ కవిత. తమ అనుమతితో)
వీరా స్ కవిసమయం
6. ముడుంబ
తిరువేంకటాచార్యులు, వరంగల్. 16-06-2020.
45. వ్యసనం!?
ఆకర్షించిన విషయవాసనలపై మోహం అతిశయించి, దానినుండి దృష్టి మరల్చ లేక, దానికి బానిసగా మారితే
అది వ్యసనం.
జూద0, మద్య0 , మాంస0, వేశ్యాలౌల్యం, వేట, చౌర్యం, పరస్త్రీవ్యామోహం, ధూమపానం, వ్యసానాలన్నారు శాస్త్రకారులు.
కొత్తగా చేరింది మత్తుపదార్థ సేవనం.
ఇవన్నీ వ్యక్తిని ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ - సమాజ గౌరవ పరంగా నిర్వీర్యం చేస్తున్నాయ్.
వీటన్నిటి రారాజు/పెద్దన్న ఎవరో తెలుసా!? తెలుసుకోవాలని ఉందా?
...
...
...
అలసత్వం... నిర్లక్ష్యం, బద్ధకం..
దీని పర్యాయ పదాలు.
ఇది పైవాటిలో ఒకదాన్ని ముందు పంపి, వాటిద్వారా తన మార్గం సుగమం చేసుకుంటుంది.
వ్యసన బృందాన్ని
శాసిస్తుంది, పోషిస్తుంది.
దీన్ని కూడా శాసిస్తూ, పెంచి పోషిస్తున్న రా ' రాణి' ఏదో తెలుసా!?
.... ....
....
..
.
అది, ....
చర వాణీ లోలత్వం.
********@@@@******* ఇది నా స్వీయరచన. నేరుగా టైపు చేసినది, కావున ముద్రితం.
46
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్
16-06-2020. (45.) ప్రేరణ.
ఎన్నో కలలు.
కొన్ని సాకారం.
కొన్ని అసంపూర్ణం.
పుట్టేదొక చోట.
మరోచోట జీవన౦.
లక్ష్యంగా పెట్టుకున్నదొకటి.
చేరిన చదువొకటి.
చివరకు వేరేదో ఆకర్షణకు లోబడి
చదువుకు స్వస్తి చెప్పి అక్కడ రాణిస్తే ,
మొదట్లో జీవితం రంగులమయంగా
కనిపించిందని అదే కొనసాగిస్తే ,
అక్కడ ఎక్కే నిచ్చెనలు మాత్రమే
కంటికి కనిపిస్తున్నా ,
మింగడానికి పొంచి ఉన్న
సర్పాలను గమనించలేక అది
ఒక వైకుంఠపాళి ఆట అని గమనించక ...,
తమ కనుసన్నల్లో లేడని ,
తమ శాసనాలను పాటించలేదని ,
తమ వలలో చిక్కలేదని
పగబట్టిన మాఫియా మాయాజాలాన్ని గుర్తించలేక , దాన్ని చేదించలేక ,
అవకాశాలను పొందలేక ,
కన్నకలలన్నీ కల్లలుకాగా ,
ఆశాసౌదాలు పేకమెడలై కూలిపోగా
సినీ వినీలాకాశంలో త్రిశంకుస్వర్గంలో నిలబడలేక నువ్వు బలవన్మరణం పొందితే ,
ప్రేమ విఫలమైందని ,
కెరీర్ దెబ్బతీసి మనస్తాపం చెందావని
కల్లబొల్లి కారణాలతో తమ ఉనికిని
కప్పిపుచ్చుకొనే మాఫియా మహమ్మారి
నీలాంటి ఎందరినో బలి తీసుకున్నది.
ఇంకెందరో బలి అయ్యే ప్రమాదం పొంచివుంది.
'అటు వెళితే ప్రమాదం' అని చెప్పేవాళ్ళు లేరు. చెప్పినా వినేవారు అంతకంటే లేరు.
ఎందరో ' యువభారత ' ఆణిముత్యాల
అంతానికి 'ప్రేరణ' అవుతున్న
మాఫియా వ్యవస్థకు అంతమెన్న డో ?
*************@@@@@@****************
ఈ నా స్వీయరచన , నేరుగా టైపు చేసినది , అముద్రితము. ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన హిందీ సినీ హీరో 'సుశాంత్'( వెండితెర ధోనీ) కు అశ్రునివాలి.
47
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్
17-06-2020.
( 46 ) పూజలు-నోములు-మొక్కులు.
పండుగలొస్తే నోములు ,
శుభకార్యాల్లో పూజలు ,
కష్టాలోస్థే మొక్కులు ,
తప్పులు చేసి వారంలో ఒకసారి
దేవునిముందు లెంపలేసుకోడం ,
బుద్ధిపుట్టినప్పుడు యాత్రలకు వెళ్ళి
దేవుని దర్శనానికై తహతహలాడే జనం
రోజుకు మూడు పూజలు ,
ఐదు నమాజులు , ప్రవచనాలు ,
మనిషి కనపడ్డచోటల్లా పనిగట్టుకొని
బైబిలు సూక్తులు వినిపించటం ,
.... .... ....
మతమేదని కాదు, కులమేదనీ ,
నమ్మకమెంటని అసలే కాదు.
ఎవరి నమ్మకం వారిది ,
ఎవరి భయభక్తులు వారివి ,
పోయినచోటల్లా
నాకు ,నా వాళ్లకు
మంచి జరగాలని
కోరుకోవడమే గాని ,
నాకు మంచి మనసివ్వమని ,
అందరూ నావారెనన్న భావన నివ్వమని ,
మనిషిగా పుట్టినందుకు మానవతా విలువలు
నాలో చిగురింపజేయమని ,
అందరి బాగును ప్రసాదించమని
ఏ ఒక్కరూ ప్రార్ధించరు ఎందుకో?
ఇది స్వార్థానికి పరాకాష్టా? లేక మానవనైజమా లేక కలియుగ ప్రభావ మా ? అనిపిస్తుంది.
**************@@@@@@***************
ఈ నా స్వీయరచన ఇప్పుడే నేరుగా నా మనసులోని భావాలకు అక్షరరూపం ఇచ్చింది. అముద్రితము.
48
వీరా' స్ కవిసమయం
6. ముడుంబ తిరువెంకటాచార్యులు వరంగల్. 18-06-2020.
( 47 ) పూల కోరిక.
పూలు కోయడానికి వచ్చిన తోటమాలి,
ఆ పూలనుండి ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరైనాడు :
ఒక పూవు అడిగింది.
" ఓయీ! తోటమాలి!
నన్ను ఎందుకు కోస్తున్నావు? "
' నిన్ను నా సఖి సిగలో అలంకరిద్దామని,...'
"అయితే నన్ను వదిలేయ్. నాకిష్టం లేదు."
రెండో పూవూ అదే ప్రశ్న.
' నిన్ను ఓ పండితుని సన్మానించడానికి,..'
"అయితే వేరే పూవును కోసుకో, వెళ్ళు".
కాస్త కరకుగా అన్నది.
మూడో పువ్వూ అదే అడిగింది.
' నిన్ను రాజు గారికి బహుమతిగా ఇద్దామని,...'
" వదిలేయ్ నన్ను, వేరే పూవును చూసుకో, " విసుగూ, నిరాశా ముందుకొస్తున్నాయి తోటమాలి కి.
చివరి ప్రయత్నంగా నాలుగో పూవును సమీపించాడు.
అదే ప్రశ్న ఎదురైంది.
' నిన్ను నా ఇష్టదైవాన్ని పూజించడానికి కోస్తున్నా.' అన్ని పూలూ ఒక్కసారిగా అరిచాయ్. " నీ హృదయాన్ని కోసివ్వలేక పోయావా? మా ప్రాణాలెందుకు తీస్తావ్?" ఒక్కసారిగా గుండె చెదిరినట్టైంది.
" మా జీవితాలు దేశం కోసం పోరాడుతున్న వీరుల పాదాలకు అర్పిస్థాం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల సమాధికై సమర్పిస్తాం." అప్పుడు అర్థ మైంది తోటమాలి కి,
తన బ్రతుకు ఎంత తుచ్చమైందీ అని.
*******@@@@@*******
ఈ నా స్వీయరచన
' amaraveerudu ' సంతోష్ బాబు కు అంకిత
49
వీరా స్ కవిసమయం
6. ముడుంబ తిరువెంకటా చార్యులు. వరంగల్. 18-06-2020.
(49) వీర తిలకం దిద్దండి.
జాతి రత్నములై జనించిన ఉడుకురక్తం యువజనానికి దేశరక్షణ విశేషలక్ష్యముగ వీరతిలకం దిద్దిపంపండి.
కుటిలయుక్తుల చీనాకు దీటుగా రణముసలుపగ ధర్మరీతిని పోరాడి గెలువగ యువకిశోరముల జూలు దువ్వండి.
దేశమందు నిస్స్వార్తశక్తులకు దన్నుగా నిలిచీ సేవలందించి, స్వార్థపరులౌ గుంటనక్కల ఆటకట్టండి, మీ దేశభక్తిని ఎలుగెత్తి చాటండి.
మును స్వాతంత్ర్యసమరపు ప్రతినలోకపరి గురుతుపట్టండి
స్వదేశఉద్యమస్ఫూర్తినిపుడు ప్రతి ఇంట చాటండి.
స్వదేశవస్తుక్రయమును మీరే ప్రోత్సహించండి,
దేశీయ ఆర్థిక ప్రగతిబాటకు చేయూతనివ్వండి. విదేశవస్తువాడకములిక మానిపించండి, మీరూ మానివేయండి.
శాంతిమంత్రము అన్నివేళల చదవబోకండి, ఇటుకపెళ్లకు రాతిదెబ్బతో ప్రతిఘటించండి, నేతాజీనాదము జాతిజనులలో నింపరారండి, భరతమాతకు కంఠమాలల కాంతులై మెరవండి.
********@@@@@*******
ఈ నా sweeyarachana ఇప్పుడే నేరుగా చరవానిలో తుపుచేసినది .
50
వీరా స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్. 19-06-2020. (50) చైనా కుట్టింది.
చీమ తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కుట్టంగనే చావాలని కోరుకుంది
మనిషి మీద కసితో.
తథాస్తు అన్నాడు మహాదేవుడు.
అప్పటి నుండి ప్రతిచీమా కుట్టీ కుట్టకమునుపే చస్తోంది.
ఇప్పుడు చైనా కుడుతోంది మనను.
శివుణాజ్ఞ ఎప్పుడో మరి!
త్వరగా ఈయమని మొక్కుదాం.
*********@@@@********
ఇదీ నా స్వీయరచనే. ఇప్పుడే మదిలో మెదిలిన ఆలోచన.
51
వీరా స్ కవిసమయం
6. ముడుంబ
తిరువెంకటాచార్యులు
వరంగల్. 20-06-2020.
(51) సైనికుడు.
నేను అంటే అహంకారం, నావాళ్లు అంటే మమకారం, నా పొరుగు అంటే సహకారం, నా వూరు అంటే ఉపకారం, నా సమాజం అంటే బాధ్యత, నా జాతి అంటే ఐక్యత,
నా దేశం అంటే గర్వం.
దేశం కోసం పోరాడతానని, దేశం కోసం అన్నీ వదిలేస్తానని, దేశం కోసం ప్రాణాన్నైనా ఇస్తానని
ప్రతిజ్ఞ చేసి , తనజీవితాన్ని పణంగా పెట్టే
త్యాగధనుడే సైనికుడు.
అతనికి ఈ జాతి ఏమి చేసినా , ఎంత ఇచ్చినా ఋణం తీరదు.
**********@@@********
ఈ నా స్వీయరచన, ఇప్పుడే నేరుగా మనసులో నుండి చరవాని లో ముద్రించినది.
52
[15/07, 3:38 PM] Tiru Venkatacharyulu Ks6: వీరాస్ కవిసమయమ్
6. ముడుంబ తిరువేంకటాచార్యులు, వరంగల్. 20-06-2020. (52) తెలుగంటే...
తెలుగంటే
పసిపాపకు జోలపాట,
పరమాత్మకు లాలిపాట.
తెలుగంటే
కమ్మనైన అమ్మపాట, తీయదనపు తేనె వూట.
తెలుగంటే
ఆమనిలో పూలతావి, గోపాలుని పిల్లనగ్రోవి.
తెలుగంటే
పడుచుగుండెవలపుపాట
కొత్తజంట జంటపాట.
తెలుగంటే
పసిపాపల కిలకిలకేరింత అమ్మవొడిలో ఆనందపు పులకింత.
తెలుగంటే
ఏడురంగుల రంగవల్లులు పైరుపచ్చల పంటపొలాలు
తెలుగంటే హరిదాసుల రామకీర్తన, బసవయ్యల ఆనందనర్తన.
తెలుగంటే సప్తవర్ణవసంతాల హోళీ, సంక్రాంతి ముగ్గులలో గొబ్బెమ్మల రంగోలీ. తెలుగంటే
ఆరురుచుల ఉగాది పండుగ, కన్నయ్యల
ఉట్ల పండుగ.
తెలుగంటే
ఊరూరా చవితి పండుగ,
ఆడపడుచు గౌరమ్మల బతుకమ్మల పండుగ.
"దశమి" నాటి జమ్మిపూజ, పాలపిట్ట. తెలుగంటే
యాదాద్రి నరసన్నపాదాలు,
భద్రాద్రి రామయ్య సీతమ్మలు.
తెలుగంటే
శివదేవుని కోటి లింగాలు, శ్రీశైల మల్లన్న భ్రమరాంబ దీవెనలు.
తెలుగంటే
బెజవాడ కనకదుర్గమ్మ, పానకాల నరసన్న. తెలుగంటే
యముడాలరాజన్నకు మొక్కులు, సప్త గిరుల వెంకన్నకు "నీలాల" మొక్కులు.
ఎందరో దైవాలు కొలువైననేల ఇది, అందరికీ తెలుగుజాతి జోతలు అర్పిస్తున్నది.
******************
53
6. ముడుంబ తిరువెంకటాచార్యులు వరంగల్. 20-06-2020.
(53) అమృతభాషలు
అద్విదుదేదో దౌ వక్రతమౌ చ కగ చజ ట డ ణ త ద న ప బ మ య ర ల వ శష సహ లంతు హ ల్వర్గః! ...అని దేవభాషాక్షరాలు 30.
మరో 26 ద్రవిడ భాశాక్షారాలు కలుపుకొని ఏర్పడిన భాష మన తెలుగు.
ఎన్ని కావ్యాలెన్ని ప్రబంధాలెన్ని చరితములెన్ని ఖండికలెన్ని నాటకములేన్ని గల్పికలెన్ని కల్పనలెన్ని శిల్పములు?
ఎన్ని శాస్త్రము, లెన్ని ప్రయోగము, లేన్ని ప్రక్రియ, లెన్ని వ్యాకరణ నియమము, లెన్ని ఛందస్సు, లెన్ని యలంకారములు? ....
ఎన్నో యాసలున్నూ,...
పద్యము, వచనము, ద్విపద, నాటిక, కథానిక, కథ, నవల, ఖండకావ్యం, అవధానం, కీర్తన,వ్యాజస్తుతి, వెడికోలు, లాలిపాట, మంగళహారతి, జోలపాట, పదకవితా, ఉయ్యాలపాట, పద్యకవిత, వచనకవిత, హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, చిందుభాగవతం, యక్షగానం, ...
ఎన్నెన్నో నూతన ఆవిష్కరణలు, ...
ఎవరెవరో వచ్చారు, తెలుగు నేర్చుకున్నారు, తెలుగుకు మరిన్ని వన్నెలద్దారు, అద్దుతోనే ఉన్నారు,
ఎన్నో భాషలు వచ్చి కలిశాయి. ఎన్నో సంస్కృతులు కలగలసిసాగుతున్నాయి.
అన్నిటినీ , అందరినీ కలుపుకొని పవిత్ర గంగానదిలా సాగుతోంది మన భాష, మన సంస్కృతి. ఇలా అన్నిటినీ కలుపుకుంటూనే తన ఉనికిని చాటుకునే భాష ,బహుశా ప్రపంచంలో మరొకటి లేదు.
ఎవరండీ తెలుగుకు ప్రమాదం ముంచుకొస్తోంది అన్నది? నిరంతర జీవనది మనభాష.
********@@@@********
ఇది నా స్వ0తరచన. నేరుగా చరవానిలో ముద్రితం.
54
వీరా స్ కవిసమయం
6. ముడుంబ తిరువెంక టా చార్యులు
వరంగల్. 21-06-2020.
(54) ప్రకృతి భేదం
తూరుపు కొండలనడుమ భానూదయ కిరణాలు ప్రకృతిని తట్టిలేపుతాయి చైతన్యం వెల్లివిరిసే సమయమయిందని తెలియజేస్తూ.
లేజివురుటాకులు నెమ్మదిగా వళ్లువిరిచి చూస్తాయి,
తెలవారిందొచ్ అనుకుంటూ. విరిబాలలు నెమ్మదిగా కళ్ళు విప్పార్చి కళ్ళు నులుముకుని భానునికి కైమోడ్పులిడతాయి ఉల్లాసంగా.
లేలేత కిరణాలు సోకిన0తనే బద్ధకంగా రెక్కలార్చుకున్న భ్రమరాది కీటములు
అప్పుడే విప్పారిన విరిబాలల వైపు ఉత్సాహంగా పయనిస్తున్నాయి.
ఉషోదయ కాంతుల రాకను ముందే పసిగట్టిన పక్షిగణాలు ఆనందంగా గగన విహారం చేస్తున్నాయి.
గహనాంతరసీమల వసించే జంతుగణం ఆహారంకోసం పురోగమిస్తున్నాయి.
ఎటొచ్చీ మానవమాత్రుడు మాత్రం ' అబ్బా! అప్పుడే తెల్లారిందా? ' అంటూ పక్క మీద కళ్ళు నులుముకుంటూ బద్ధకంగా లేచి కూర్చున్నాడు.
*********@@@@********
ఈ నా స్వంతరచన అముద్రితము అని dhruveekaristhunnaanu.
55
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్.
24-06-2020.
( 55 ) జీవన్మృత్యువు.
అరిషడ్వర్గాలు, సప్తవ్యసనాలు,
భేషజాలు,
దురభిమానాలు ,....
కూడబలుక్కుని
మనిషిని మనిషిగా
బ్రతుకనివ్వడం లేదు,
లోపలి మరో రూపాన్ని తట్టిలేపుతున్నాయి. ఫలితంగా ఆవేశకావేశాలకు లోనైన మనిషిలో మానసిక రుగ్మతల పర్యవసానం మనిషిని మనిషిగా చూడలేక
కక్ష లు , కార్పణ్యాల తో ఈర్ష్యాసూయాద్వేషా లతో మనిషిలోని మానవుడు మృగ్యమవుతున్నాడు.
మరి,
మనిషి దేహంలోని మానవుడు మాయమైనప్పడు అతడు జీవన్మృతుడే కదా!
********@@@@@*******
ఈ కవిత నా స్వంతరచన. ఆముద్రితము అని హామీ ఇస్తున్నాను. ( ఈరోజు ఉదయం పంపిన ఆదివారం నాటి నా రెండవ కవిత (56 ) అని పొరబాటుగా టైపు అయినది. కావున ఈ కవితని 55 గా pariganinchagalaru).
56
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్.
21-06-2020.
( 56 ) తెలుగు పూదోట.
'తె 'లివెన్నెల ' రాతిరి చల్లదనం తెలుగు.
కు' లు 'కులొలుకు విరిబాలల నయగారం తెలుగు.
'గు 'లాబీల సోయగాల నిగారింపు తెలుగు.
'పూ 'బాలలపై తెల్లని తుషారం తెలుగు.
'దో 'సిళ్లనిండా ఎర్రని గోరింటాకు తెలుగు.
పా'ట 'కోయిల తీయని కలస్వనం తెలుగు.
తెలుగుభాష సోయగం, పదారణాల పడుచుదనం. తెలుగుభాష రాజసం, నవరసాల పోషణం.
*******@@@@@@******
ఈ కవిత నా స్వంతరచన. ఆముద్రితము. అని హామీ ఇస్తున్నాను. (ఇది ఆదివారం నాటి నా రెండవ కవిత. సమయ ప్రతికూలతలు వలన మంగళవారం కూడా కవితలు పంపడం కుదరలేదు. వీలైతే ఈ రోజు మరో రెండు కవితలు పంపడానికి అనుమతిని కోరుతున్నాను.)
వీరా'స్ కవిసమయం
57
6. ముడుంబ తిరువేంకటాచార్యులు , వరంగల్. 25-6-2020. ( 57 ) సత్యం - అసత్యం.
ఈ లోకంలో
సత్యమే ఈశ్వరుడు.
సత్యం చేతనే
ధర్మం ప్రతిష్ఠింపబడుతుంది.
సత్యమే చెప్పాలి.
అదీ వినేవాళ్లకు
ప్రియంగా ఉండేటట్టు చెప్పాలి.
అప్రియమైన సత్యాన్ని చెప్పకూడదు.
ప్రియంగా ఉండేదే అయినా
అసత్యాన్ని చెప్పకూడదు.
ఇవన్నీ సూక్తులు.
మరి ఇప్పుడున్న ఈ కాలంలో
ఇవి పనికొస్తాయా?
నిజం నిద్ర లేచేలోగా
అబద్ధం అనంతవిశ్వాన్ని చుట్టివస్తుంది.
అబద్ధాన్ని నమ్మడం సులభం.
ఎందుకంటే
ఒకే అబద్ధాన్ని
ప్రియంగా చెప్పి
అదే నిజమని
పదిమందిని నమ్మించవచ్చు.
కానీ ,
అసలు నిజాన్ని చెప్పి
నమ్మించడం అసాధ్యం.
నిజమెవ్వరికీ రుచించదేందుకోమరి!
అబద్ధానికి ఋజువులవసరం లేదు.
కానీ ,
నిజాన్ని నిజంగా నమ్మాలంటే
దానికి సవాలక్ష సాక్ష్యాధారాలు కావాలి. సాక్ష్యాధారాలు లేనిది నిజమే కాదు.
ఇది చాలా విచిత్రంగా కదా!
నిజాన్ని నిలబెట్టే సాక్ష్యాధారాలు
కాలగర్భంలో కలిసి పోయి ,
అబద్ధం సృష్టించిన సాక్ష్యాలు
ఇప్పుడు రాజ్య మేలుతుంటే ,
నిజం నిప్పలాంటిది అని ,
సత్యమే జయిస్తుంది అని
నమ్మినవాడు కూడా మూగబోయి ,
కాలగర్భంలో కలిసి పోవలసిందేనా?
*************@@@@@@@***************
ఈ నా స్వీయరచన అముద్రితము అని హామీ ఇస్తున్నాను.
################################
58
25-06-2020.( 58 ) సమకాలీనమహాభారత0.
నాటి భారతకథకు ,
నేటి భారత వ్యవస్థకు
సామీప్యాలు ఎన్నో!
వ్యాసమహర్షి భారతకథను
రచిస్తే ,
అంబేడ్కరుడు భారత వ్యవస్థకు విధివిధానాలు రచించాడు.
శంతనుడు సత్యవతిని మోహించి పెళ్ళాడితే , వివాహ వ్యవస్థలో కులమతాలసంకెళ్ళు తెగిపోతున్నాయి. ధృతరాష్ట్రుడు ఏలిన రాజ్యం పదేళ్ల పాటు మొన్నమొన్నటి వరకూ కొనసాగింది. గాంధారీపుత్రులు నేటికీ దర్శనమిస్తున్నారు.
ఎందరో తల్లులు తమ సంతానాన్ని ఎక్కడో వదిలేసి వారికి కర్ణుని తలరాతలను రాస్తున్నారు.
రెండు దశాబ్దాల క్రితం నిండు సభలో మహిళలకు జరిగిన అవమానాలను చూసాం. ఇప్పటికీ వ్యవస్థలో ఆనాటి దురాత్ములను చూస్తూనే ఉన్నాం.
గతంలో ప్రపంచ యుద్ధాల పేరిట రెండు కురుక్షేత్ర సంగ్రామాలనూ చూసాం. శకుని మామలనూ చూస్తూనే ఉన్నాం.
.... ...... ..... ...... ..... ..... ....
మాటమీద నిలబడి స్వచ్ఛంద మరణాన్ని పొందిన గంగాసుతులను మాత్రం చూడలేకపోతున్నా0. అందుకేనేమో మంచివాళ్ళకి తగిన గౌరవం లభించడం లేదు.
ఏదేమైనా యుగం, యుగధర్మం మారినా వ్యవస్థ పోకడలు మాత్రం కేవలం రూపాంతరం చెందుతున్నాయి. పాత్రధారులు మాత్రమే మారుతున్నారు.
*********@@@@********
ఈ నా స్వీయరచన అముద్రితము అని హామీ ఇస్తున్నాను.
59
వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువెంకటాచార్యులు వరంగల్. 26-06-2020.
(59) హీరోలు - పెద్ద జీరోలు.
చెత్త వూడ్చి , మొక్క నాటి ఫోటోలకు ఫోజులిచ్చినట్లు , వ్యాపార ప్రకటనలకూ , సినిమా పత్రికలకూ ఫోజులిచ్చి, సమాజహితాన్ని పక్కన బెడుతూ ధనార్జనే పరమావధిగా నీతికి విలువీయని, స్త్రీని గౌరవించని అశ్లీల చిత్రాల్లో నటిస్తూ, వేలకోట్ల సంపదను కూడగట్టి, ఆదాయపన్ను ఎగ్గొట్టి, సమాజం ఆపదలో ఉన్నప్పుడు కనీస సాయం చేయడానికి కూడా ముందుకురాని కథానాయకులు మన హీరోలు. కేవలం రీల్ లైఫ్ హీరోలు, వీరిలో కొందరు నిజజీవితంలో విలన్లు కూడా. ఇలాంటి వారికోసం కటౌట్లు, బ్యానర్లు, ఊరేగింపులు చేసి ఆవేశంతో ఊగిపోతూ చొక్కాలు చింపుకొనే యువతరం ఉన్నంతకాలం సమాజపురోగతి పట్ల పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలే.
*********@@@@********
ఈ నా స్వీయరచన అముద్రితము అని హామీ ఇస్తున్నాను.
60
[27/06, 7:47 PM] Tiru Venkatacharyulu Ks6: వీరాస్ కవిసమయం
6. ముడుంబ
తిరువెంకటాచార్యులు వరంగల్. 27-06-2020. (60). హరిత(సం)హారం.
రాష్ట్రాన్ని హరితమయం చేసి, సస్య శ్యామలం చేసి, ముక్కారు పంటలు పండించి, కరువు కాటకాలకు, ఆకలిచావులకు తావులేకుండా చేసి,
నిత్యజీవనదులతో కళకళలాడే
దక్షిణభారత ధాన్యాగారంగా తీర్చిదిద్దాలనే సంకల్పం
చాలా గొప్పది.
మరి, ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి గెలుపుకోసం సభ నిర్వహించేందుకు స్థలం కోసం ఒక్కొక్కటి డెబ్బై ఏళ్ల వయసున్న వేయి చెట్లను నరికించడం, దేనికి స్ఫూర్తి? ఇది హరితహారమా? లేక హరిత సంహారమా?
********@@@@@*******
ఈ నా స్వీయకవిత amudrithamu అని హామీ ఇస్తున్నాను.
61
[28/06, 6:36 AM] Tiru Venkatacharyulu Ks6: వీరా'స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్.
28-06-2020.
( 61 ) వ్యక్తిగతం 'గోప్యం' సుమా!
నీ జీవితశుభతరుణాలను 'గ్రూపు'లలో పంచుకోకు. నీ పిల్లల విజయాలనూ 'గ్రూపు' లలో పంచుకోకు. నీవు కొన్న వస్తుసంపదను 'గ్రూపు'లో ప్రదర్శించకు.
వాస్తవాన్ని గ్రహించి మసలుకో.
నీ అభివృద్ధి పట్ల ఎవరు సంతోషిస్తారో ,
ఎందరు ఈర్శ్యపడతారో
నీకు తెలిసే అవకాశం లేదు.
'ముఖస్తుతి'కై చేసే 'అభినందన' లలో
నిజాయితీ పాలు ఎంతుందో నీకు తెలియదు.
ఎవరి 'దృష్టి' నీ కుటుంబంపై
ఎలా ఉంటుందో తెలియదు.
నీకు తెలియకుండానే
నీ జీవితంలోకి తొంగిచూసే అవకాశం
ఎవరికి కల్పిస్తున్నావో నీకే తెలియదు.
నీ జీవనచిత్రాలను ఎవరెవరు
'నిక్షిప్తం' చేస్తున్నారో తెలియనే తెలియదు. నిన్నెవరెవరు స్వలాభానికి
వాడుకోజూస్తున్నారో తెలియదు.
ఎవరు , ఎప్పుడు నీ కుటుంబ భవిష్యద్రేఖలను ఎలా మార్చేస్తారో తెలియదు.
ఎందుకంటే ,
ఇప్పుడున్న 'సామాజిక మాధ్యమ' పంచేంద్రియాలు
మంచిని వంచించి , చంపేంత క్రూరమైనవి.
తస్మాత్ జాగ్రత్త!
నీ వ్యక్తిగతగోప్యతే నీకు శ్రీరామరక్ష.
*************@@@@@*****************
ఈ నా స్వీయరచన అముద్రితము అని హామీ ఇస్తున్నాను.
62
వీరాస్ కవిసమయం
6. ముడుంబ తిరువే0కటాచార్యులు warangal 28-06-2020. (62) ఆజీవన అంతరాలు.
పూరిగుడిసే చల్లదనపు నీడలో ఉన్నప్పుడు
కాంక్రీటు కప్పున్న ఇంట్లో ఎప్పుడు ఉంటామా అని ఉబలాట పడేవాన్ని,
ఆ కప్పు కింద భరించలేని వేడి ఉంటుందని అప్పుడేం తెలుసు?
పచ్చని చెట్ల మధ్య
సహజమైన గాలీవెలుతురులో ఆడుకున్నపుడేం తెలుసు?
కాంక్రీటు కప్పుకింద కృత్రిమమైన వెలుగులో, వేడికి తాళలేక గాలికోసం తపిస్తామనీ,
ఈ కృత్రిమ గాలీవెలుతురులలో సహజసిద్దమైన ఆరోగ్యం పణంగా పెడతామనీ,
కాంక్రీటు కీకారణ్యంలో వెలుగుజిలుగులలో, వాహనాలరొదల్లో, పంచేంద్రియాలు శక్తిని కోల్పోయి , చివరకు ప్రశాంతత కూడా కోల్పోయి, మానసిక రోగుల్లా , శారీరక రుగ్మతలతో పాటు, మనిషికి మనిషి పట్టని సామాజిక జీవచ్చవాల్లా బ్రతుకీడ్వ వలసి వస్తుందని? నాకిప్పుడు
' గతజలసేతుబంధనం ',
' చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ' అనే పదబంధాలు గుర్తుకొస్తున్నాయి.
*******@@@@@********
ఈ నా స్వీయరచన అముద్రితం అని హామీ ఇస్తున్నాను.
63
[30/06, 3:20 PM] Tiru Venkatacharyulu Ks6: వీరా ' స్ కవిసమయం
6. ముడుంబ
తిరువెంకటాచార్యులు, వరంగల్. 30-06-2020.
(63) స్వయంకృషి - వికాసం.
ఇతరులపై ఆధారపడి ఎదగాలనుకోకు, నీకై నీవు ఎదగాలని ప్రయత్నించు. ఇతరుల నీడలో ఉంటే మర్రినీడలో మొక్కవవుతావు, స్వయంకృషితో ఎదిగితే నీవే మహావృక్షమవుతావు.
మొక్క స్వయంగా భూమిపొరలను చీల్చి ఎదుగుతుంది, ఎదగలేక పోతోందని దాని దళాలను విప్పార్చాలని ప్రయత్నిస్తే, మొక్క వాడిపోతుంది.
పూవు దానంతటదే విచ్చుకోవాలి, ఆతృత పడి రిక్కలను విప్పార్చాలని చూస్తే, అదీ వాడిపోతుంది. సీతాకోకచిలుక దానంతటదే గూడు చీల్చుకొని బయటకు వచ్చి రెక్కార్చుకొంటే,
గాలిలొ స్వేచ్చగా ఎగురుతూ
పువ్వు, పువ్వునూ పలకరించగలుగుతుంది, అది బయటికి వచ్చేలోగా జాలిపడి నీవేదో సాయం చేయబోయావనుకో, హంతకుడవవుతావు.
ఏదైనా తెలియదని చెప్పేముందు నీ అంతరాత్మ నడుగు, అబద్ధం చెప్పదు.
ఎదురుదెబ్బ తాకినపుడు నాకో కొత్తపాఠం నేర్చుకొనే అవకాశం వచ్చిందని సంతోషించు, ఎందుకంటే ప్రతి అనుభవం పాఠం నేర్పుతూ నిన్ను సరైన దారిలో పెడుతుంది.
తప్పును ఒప్పుకోవడానికి వెనుకంజ వేయకు.
నీవు ఒప్పుకోకుంటే, పంచభూతాలు సాక్ష్యమిస్తాయి.
పగతీర్చుకోడం ప్రకృతికి బాగా తెలుసని మరచిపోకు,
నువ్వు భూమండలాన్ని ప్లాస్టిక్ తో నింపావు, నిన్నిప్పుడు అదే ప్లాస్టిక్ లో చుట్టేస్తున్నది, గమనించావా?
అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకు, దాన్ని రక్షించుకోడానికి మరిన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అదే, ఎప్పుడూ నిజమే చెప్పావనుకో!, ఆ నిజం నిన్ను ప్రతి ఆపదనుండి రక్షిస్తుంది.
*********@@@@********
ఈ నా స్వీయరచన అముద్రిత ము అని హామీ ఇస్తున్నాను.
64
[01/07, 7:37 AM] Tiru Venkatacharyulu Ks6: వీరా స్ కవిసమయం
6. ముడుంబ తిరువే0కటాచార్యులు వరంగల్. 30-06-2020.
64. అన్ లాక్ 2.0 ( మీ ఆరోగ్యం మీ చేతుల్లో ).
ఆనకట్ట కట్టి నీటిని నిల్వచేసి, వానాకాలం వరద ఉద్ధృతికి కట్ట తెగిపోకుండా కాపాడుకోడానికి, ఒక్కోగేటు ఎత్తివేస్తే ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఆపగలం.
అదే సూత్రాన్ని అన్నివిషయాల్లో అనువర్తించడం అనుసరణీయం అవుతుందా?
ఉద్ధృతిపెరిగేకొద్దీ ఆసుపత్రుల్లో
వసతులు తగ్గుతుంటే
పౌరుల పరిస్థితి ఏమిటి? ఆసుపత్రికి వచ్చే వారందరికీ పరీక్షలు చేయక, చేర్చుకున్నవారికీ సరైన వైద్యం అందక, వైద్యులే రోగులుగా మారుతున్నా వసతుల విషయం పట్టించుకోని వైనం.
ఆసుపత్రులలో వసతులలేమిని కళ్ళకు కట్టినట్టు చూపొద్దట.
ఏమైనా ఆలస్యంగా చేరినట్టు చెప్పి తప్పుకోవడానికి తరుణోపాయం,
మరైతే ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగికి ప్రాణవాయువు
ఎలా తీస్తారు?
అప్పుడు తమరే రోగిని కైలాసానికి పంపినట్టు కాదా?
సరైన వసతులు లేవని
వైద్యులు చెప్పినా తమను తాము సమర్థించుకొంటూ ప్రజలముఖాలపై మసిపూసి "ఇది మారేడు కాయ" అని చెపుతున్న సర్ ' కారు ' వారి లీలలను ఏమని వర్ణించగలం?
వైద్యులకు రక్షణ లేదు. రోగి ప్రాణాలకు భరోసా లేదు.
సర్ ' కారు ' పట్టింపు
అసలే లేదు.
ప్రజలారా!
పౌరులారా!
ఓటరులారా! వింటున్నారుగదా!
చూస్తున్నారుగదా! ఇంకా సినిమా తీసి చూపించాలా? సీరియల్ తీసి చూపించాలా? నమ్ముకున్న నేతాగణం
నట్టేట ముంచుతున్నారని ఇప్పటికైనా అర్తమైందనుకుంటాను.
మీ ప్రాణాలకు మీరే భరోసా ఇచ్చుకోవాలి.
మిమ్మల్ని మీరే కాపాడుకోండి. నలతగా ఉంటే
వేడి నీరు త్రాగండి, ఎన్నిసార్లయినా సరే!
నీటి ఆవిరిని శ్వాసించండి. ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినండి.
కాసేపైనా సూర్యోదయాన్ని వీక్షించండి.
ఆయన నమస్కారప్రియుడు, ఆరోగ్య ప్రదాత. సూర్యనమస్కారాలు చేయండి. కుటుంబవైద్యుల సలహాలు పాటించండి.
మీ ఆరోగ్యం, మీ కుటుంబ సంక్షేమం మీ చేతుల్లోనే ఉన్నాయని గమనించండి. మన జాగ్రత్తలో మనం లేకుంటే
ఎవరొచ్చీ ఏమీ చేసేది లేదని తెలుసుకోండి.ఇకనైనా కళ్ళు తెరవండి.
**********@@@********* .ఈ నా
65
sweeyarachana amudrithamu అని హామీ ఇస్తున్నాను.
[01/07, 12:43 PM] Tiru Venkatacharyulu Ks6: వీరా స్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటా చార్యులు, వరంగల్.
( 65). జీవిత పర్యంతం.
జుట్టు రంగేసినా, విగ్గుపెట్టేసినా,
తెల్లజుట్టాగునా?
బట్టతల దాగునా?
పళ్ల కట్టేసినా,
ఫేసియల్ చేసినా, బోసినోరేదాగునా?
ముదిమి రాకుండునా?
******* *******
బాల్యంలో హీరోలం,
యౌవనంలో నాయకులం, కొత్త కొత్త ఊహలలో మునిగితేలుతూ
అంతా మనకే తెలుసని విర్రవీగుతూ,
అన్నిటికీ ముందుకురికి,
అన్నింటా తలదూర్చి, అప్పుడప్పుడూ చతికిలపడి
కూడా నాదే పైచేయంటూ సమర్థించుకుంటూ, గొప్పతనం చాటుకునే విశ్వప్రయత్నం.
సంసారమనే సాగరంలో కావాలని దూకి, బరువుబాధ్యతలన్నిటిని సనుక్కుంట, గొణుక్కుంట
పూర్తి చేసుకుంట, బతుకుజట్కా బండిని ఈడ్చుకుంటూ వెళ్లే జవనాశ్వాలం.
జుట్టు నెరిసి ముగ్గుబుట్టై, లేకుంటే ఊడిపోయి బట్టతలై, అప్పుడే ముసలోల్లం ఐపోయామా?
అనుకుంటూ సిగ్గుపడి, ముదిమి దాచుకోడానికి కలరేసీ, విగ్గుపెట్టి,
ఊడుతున్న దంతాలను పళ్ళకట్టుతో దాచిపెడుతు, వంగుతున్న నడుమునేమో బెల్టులతో చక్కబెట్టి, ఇంకా వయసైపోలేదని ఎవరికి చూపిస్థామిక?
మనకు తెలియదా?
మన ఆత్మకు తెలియదా?
లేక పరమాత్మకు తెలియదా?
ఈ మాటంటే
ఎవరేమనుకుంటారో గానీ, పుట్టినతేదీ తెలిసినప్పుడు వయసు తెలియదా? బాధ్యతలయిపొలేదా? వారసులున్నారుగా!
పెద్దరికం నిలుపుకునే పనులేవైనా చేస్తూ, వినేవాళ్ళకే సలహాలిస్తూ, ఆజీవనసాఫల్యాలను నెమరేసుకుంటూ పరమాత్ముని పిలుపుకోసం నిత్యస్మరణ చేస్తూ,
జీవితంలో పొందలేని ప్రశాంతతను,
చరమాంకంలోనైనా పొందేందుకు ప్రయత్నించి ధన్యతనొందుము నరుడా!
🙏🙏🙏
ఈ నా స్వీయరచన ఎవరినీ ఉద్దేశించి కాదు. సరదా ఆలోచనతో మొదలుపెట్టి చివరివరకూ వాస్తవాలను పలికించాలనే ప్రయత్నించాను. ఇప్పుడే నేరుగా ఆలోచనలను టైపు చేశాను. ఎవరినీ నా కవిత నొప్పించబోదని ఆశిస్తాను.
66
[01/07, 7:04 PM] Tiru Venkatacharyulu Ks6: వీరా' స్ కవిసమయం
6. ముడుంబ తిరువెంకటా చార్యులు, వరంగల్. 01-07-2020.
(66) జ్ఞాపకాల దొంతరలు.
ఎక్కడో పుట్టి,
ఎక్కడో పెరిగి,
ఎక్కడెక్కడో తిరిగి
ఎవరెవరినో కలుసుకుంటాము.
ఎందరో సహృదయులు, సమహృదయులు తారసపడతారు,
స్నేహితులవుతారు, ఆడుకుంటారు, ఆదుకుంటారు.
ఏదో ఒక సమయంలో ఒక్కొక్కరి నుండి విడివడి జీవనగమ్యాన్ని వెదుక్కుంటూ దూరంగా బ్రతుకుతుంటాం. పసివయసు నుండి పెద్దయ్యేదాకా ఎందరో స్నేహితులు, ఆత్మీయులు. అందరికీ దూరంగా ఒంటరితనపు జీవితం. అందరూ గుర్తోస్తుంటారు, ఎవరెవరు ఎక్కడున్నారో,
ఏం చేస్తున్నారో తెలియదు. విడిపోయే నాటికి ఫోన్లు లేవు, అప్పటి చిరునామాలో ఇప్పుడు లేరు.
ఆనాటి మధుర స్మృతులతో మనసు మైమరచి పోతుంటే, ఆ రోజులు మరలి రావని గుర్తొచ్చి హృదయం తల్లడిల్లుతు0ది.
తడిమి చూసుకుంటున్న మనస్తత్వం,
తరుముకొస్తున్న దేహతత్వం, ఈ రెండిటి మధ్య పోరాటంలో ఆరాటమెక్కువై, ద్వైదీభావనలు నిలువనీయక, కాలు కదపనీయని
శరీర బాధలు తోడై, నైరాశ్యంలో కూరుకుపోతున్న వృద్ధాప్యానికి
చేయూతనివ్వాల్సిన యువతరం తమ మనసుకు నచ్చిన గమ్యంవైపుకు సాగే క్రమంలో మారుతున్న కాలం వెంట పరుగులు తీయలేని తరం; ఏ చేదోడు, వాదోడు లేక కాలగర్భంలో కలిసి పోవలసిందేనా?
*****@@@@@*****
ఈ నా స్వీయరచన అముద్రితము అని హామీ ఇస్తున్నాను.
67
[03/07, 7:32 PM] Tiru Venkatacharyulu Ks6: వీరా స్ కవిసమయం
6. ముడుంబ
తిరువే0కటాచార్యులు వరంగల్. 03-07-2020.
(67) గతస్మృతులు.
మరపురాని మధురస్మృతులవి,
బ్రతుకు దారిలో తరలిపోయిన,
తిరిగిరాని రోజులవి.
కన్నులు కాయలు కాయగ,
కన్నీరు ధారలై వర్షించగ,
ఎంత నిరీక్షించినను, తిరిగిరాని జ్ఞాపకాల దొంతరలవి.
మరచిపోవుదమని యత్నించిన కొలది,
మరల మరల గురుతొచ్చే మాయని అనురాగాలవి.
ఎవరిదారి వారిదైన, ఆజీవనపర్యంతము
ఆ సాహచర్యమే కోరెను మది, పగలంతా పనిపాటలో
ఆ గురుతులే, రేయంతా
ఆ గురుతులే కలలోనైనా,
నిదురే రాకున్నా ఆ తలపులే నిశీధిలోనూ.
నా దారిని పూబాటగ
పరచిన ఆ ఆత్మీయులు,
వారి ప్రేమ వెంటాడెను, బాధించెను ఆ స్మృతులు. నడిచొచ్చిన పూదారులే,
నాకై నిరీక్షించేను,
వెనుదిరిగిన ఆ దారులే కంటికసలు కానరావు.
నా ఎదురుచూపులలో
పగలే చీకట్లు క్రమ్మె,
ఎటుచూసిన నా నీడే తోడై కనిపిస్తున్నది.
గతమంతా నా దారికి వెలుగిస్తూ కరిగిపోయే, ఆ వెలుగున ఆత్మీయుల వెతుకుతూ వేసారినాను, వెలుగు కూడా కరిగిపోయే, గతములోన ఆత్మీయులు, నీడలై మిగిలినారు.
*******@@@@********
ఈ నా స్వీయరచన అముద్రితము అని హామీ ఇస్తున్నాను.
68
[04/07, 3:04 PM] Tiru Venkatacharyulu Ks6: వీరా స్ కవిసమయం
6. ముడుంబ తిరువే0కటాచార్యులు, వరంగల్. 04-07-2020.
(68) ఆర్తి.
తోటలోని పూలన్నీ రిక్కలు విచ్చుకుని,
నీకై వెతుకుతున్నవి.
కదలాడే ప్రతి రెమ్మా , నిను రారమ్మని
సైగలు చేస్తున్నది. ఎగురుతున్న ప్రతి తుమ్మెద నిన్నే ఝుమ్మని పిలుస్తున్నది. ఊగులాడు ప్రతికొమ్మా నీకోసం వింజామర వీస్తున్నది. ప్రతిచెట్టూ నీవొస్తావని, విశ్రమిస్తావని తన నీడ పరచి నిను ఆహ్వానిస్తున్నది. చెట్టుమీద ప్రతి పిట్టా
నీపేరే తలుస్తున్నది.
కొమ్మల్లో కోయిలమ్మ లు నీగానమే చేస్తున్నవి. పుట్టమీద నెమలిపిట్ట నీ రాకను చూసిందేమో, ఆనంద తాండవం చేస్తున్నది.
వనమంతా నీ రాకను సైగలతో చెబుతున్నది.
మరి నా కనుదోయికి నీవెందుకు కానరావు?
నీ వేణుగాన రసాస్వాదన నాకెందుకు అందించవు? మనిషి జన్మనెత్తినందుకేనా నాకీ శిక్ష?
ఒక్కసారి కనిపించి
నాకళ్లను తీసుకో,
వేణు నాదం వినిపించి వినికిడినీ తీసుకో. నీ చరణారవిందముల మ్రోల కైమొడ్పులిడనిమ్ము,
కృష్ణా!
నా ఆత్మను నీలో ఐక్యము చేసికొమ్ము.
*******@@@@*******
ఈ నా స్వీయరచన అముద్రితము అని హామీ ఇస్తున్నాను.
69
వీరా స్ కవిసమయం
6. ముడుంబ తిరువే0కటాచార్యులు వరంగల్. 04-07-2020.
(69) పసిమనసుల ప్రపంచం.
అమ్మపేగు తెంచుకుని అప్పుడే విడివడి కళ్ళు తెరిచిన పసిపాపకు
అమ్మే ప్రపంచం.
అమ్మే ఒక పుస్తకం.
అమ్మశ్వాస తన వీవన.
అమ్మస్తన్యం తన పానం. అమ్మమాటే చిటివీణ.
అమ్మ జోలపాటే వేణుగానతరంగం. స్వర్గమంటే ఏమిటో,
అదెలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మఒడి
దానికన్నా ఎంతో మిన్న.
తన ఏడుపు అమ్మకు కన్నీరు. తన చిరునవ్వే
అమ్మకు స్వర్గం.
ఒకటేమిటి,
తన "హృదయస్పందన" అమ్మ "హృదయ"స్పందన. అమ్మ పలకరింపులు,
చేతి గోరుముద్దలు తనకు అమృతగులికలు.
తన బుడిబుడినడకలు అమ్మకు ఆనందడోలికలు.
అమ్మే తన ప్రపంచం, అమ్మవొడే తన స్వర్గం, అమ్మ చీరకొంగే తనకు పవళింపు శయ్య.
********@@@@*******
ఈ నా స్వీయరచన అముద్రితము అని హామీ ఇస్తున్నాను.
70
=వీరా స్ కవిసమయం
6. ముడుంబ తిరువే0కటాచార్యులు. వరంగల్. 05-07-2020.
(70) విదేశీయ జీవనయానం.
ఆసుపత్రిలో పుట్టుక,
క్రెస్ట్ లో పెరగడం, కాన్వెంటులో చదువు, అక్కడినుండి యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్,
ఆపైన చేస్తే జాబ్, లేకుంటే అండర్ గ్రౌండ్ సంస్కృతి.
బడివేళలు తక్కువ,
బయట తిరుగుడెక్కువ, బడిలో చెప్పేది తక్కువ, ప్రయోగాలు చేయించేదెక్కువ, నైతిక బోధన అసలే లేదు, మంచీ చెడూ అని
చెప్పేవారు లేరు,
చుట్టూ జరిగేదే
చూసి నేర్చుకోవడం, ఆవేశాలను అదుపు చేసే వ్యవస్థ లేదు,
పెద్దా చిన్నా ఆలోచనలు లేవు,
మనసుకు నచ్చింది చేయడమే,
గన్ కల్చర్,...
పిచ్చెక్కిన కోతిలా కనిపించిన వారిని కాల్చేయడం,
వయసు ప్రేరేపించిన దూకుడులో కనిపించిన వారితో జతకట్టడం,
ఆ జతలో ఏ చిన్న పొరపొచ్చాలు పొడసూపినా ఆ బంధం అక్కడితో తెంపుకోడం, చివరాఖరికి మానసికరోగిగా మారడం,
బంధాలు, అనుబంధాలకు అక్కడ నిర్వచనాలు లేవు,
ఎవరు ఎవరికి ఏమవుతారో తెలియని స్థితి,
ఆ అవసరమేలేని వ్యవస్థ,
చివరికి ఒంటరి జీవిత చరమాంకంలో ఎవడిపాడె(బాక్స్) వాడు ముందే సిద్ధంచేసి
ఉంచుకోవాల్సిన అవస్థ.
టపా కట్టేసినట్లు తెలిసినా, ఐనవాళ్ళంటూ
ఎవరైనా ఉన్నా,
వాళ్ళ సెలవు రోజునే వచ్చి క్రియలు పూర్తి చేస్తారు. అప్పటిదాకా
మంచుపెట్టెలో
ఒదగాల్సిందే.
విదేశ పోకడలను
తనకు తానుగా సంతరించుకున్న
మన వ్యవస్థలో కూడా
ఈ "నాగరికత" రాబోతోంది.
తస్మాత్ జాగ్రత్త!
********@@@@********
ఈ నా స్వీయరచన
అముద్రితము అని హామీ ఇస్తున్నాను.
71
[07/07, 5:56 PM] Tiru Venkatacharyulu Ks6: వీరా స్ కవిసమయం
6. ముడుంబ తిరువే0కటాచార్యులు వరంగల్. 07-07-2020.
(71) జీవితమే పాఠశాల.
జీవితమనే పాఠశాలలో నేర్చుకొనే పాఠాలేన్నో.
చివరిగంట కొట్టే
ముందుక్షణం వరకూ..
నేర్చుకున్న పాఠాలన్నీ ఎంతో బాగున్నాయనిపిస్తాయి. జీవనగమనాన్ని నిర్దేశిస్తాయి.
కొండొకచో ఇతరులకూ నేర్పితే బాగుంటుందనిపిస్తాయి. ముఖ్యంగా మన ఆత్మీయులనుకున్నవాళ్ళకు. కానీ,
ఇక్కడ సామెత తిరగబడుతుంది.
చెప్పేవాడే, వినేవాడికి లోకువవుతాడు.
చెబుతుంటే విన్నట్టు నటించేవారు కొందరు, మొహంమీద గుద్దినట్టు సూటిగా వ్యతిరేకించేవారు కొందరు,
నోటనవ్వుతూ, నొసటన విసుగు ప్రదర్శించేవారు కొందరు,
వింటూనే మధ్యలో లేచి పోయేవారు కొందరు.
ఏతావాతా,
చెప్పినదాన్ని విని చెవికెక్కించుకొనేవారు, వేయిమందిలో ఒక్కరైనా ఉంటారో లేదో! (?)
అదీ ప్రశ్నార్థకమే!
ఇదీ ఒక జీవితపాఠమే. ఇతరుల జీవితపాఠం వేరొకరికి నచ్చదు, నప్పదు. ఎవరికివారు, తమ జీవితాన్నే పాఠశాలగా చేసుకోవాలి. ఎవరి జీవితపాఠాలను
వారే నేర్చుకోవాలి.
నీ జీవితం నీకే పాఠశాల, ఇతరులకు కాదు. గుర్తుంచుకో!,
నీ జీవిత పాఠశాలలో నీవొక్కడివే విద్యార్థివి, నీవే బోధకుడివి.
********@@@@*********
ఈ నా స్వీయరచన
అముద్రితము అని హామీ ఇస్తున్నాను.
72
72.
[08/07, 2:15 PM] Tiru Venkatacharyulu Ks6: వీరా స్ కవిసమయం
6. ముడుంబ తిరువే0కటాచార్యులు, వరంగల్. 08-07-2020.
(72) మానవుడు.
బతుకు బండికి
ఆలోచనలు, ఆచరణలే చక్రాలు.
బతుకు దారిలో
గతుకులు, గుంటలే సమస్యలు, ఆటంకాలు.
గతుకులు ఉన్నాయని
బండి పయనమాగదు. గుంటలున్నాయని
వాటిలో దిగబడి
అలాగే ఉండిపోదు.
గతుకులను, గుంతలను దాటుకుంటూ తన పయనం సాగిస్తుంది.
అలాగే బతుకు దారిలో ఏర్పడే అవరోధాలను అధిగమించి ముందుకు సాగడమే మానవకర్తవ్యం.
"శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలను అన్వేషిస్తూ ముందుకు సాగడమే జీవితం".
********@@@@******** .
ఈ నా స్వీయరచన అముద్రితం అని హామీ ఇస్తున్నాను.
73
వీరాస్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్, తేదీ : 10-07-2020.
(73) సాగరమధనం.
పాలకడలిని చిలికినప్పుడు
మొదట హాలాహలం ,
తరువాత కామధేనువు ,
కల్పవృక్షం , ఐరావతం ,
చందమామ , లక్ష్మీదేవి ,
చివరగా అమృతబాండం
వెలువడ్డాయి.
క్షారజలధిని చిలికితే
మొదట లభించేది ఉప్పు .
తరువాతనే గవ్వలు ,
ముత్యపుచిప్పలు ,
ముత్యాలు , పగడాలు ,...
ఇంకా అనేక సంపదలూ ప్రాప్తిస్తాయి.
ఏదైనా మధిస్తేనే ప్రాప్తిస్తుంది.
మొదట మాత్రం గరళం ,
లవణం లాంటి
కఠిన పదార్థాలు ప్రాప్తిస్తాయి.
మనసు కూడా కడలి లాంటిదే.
దాన్ని ఆలోచనల కవ్వంతో
చిలికినప్పుడు ,
'కీడెంచి మేలెంచమన్నట్టు'
అనేక శంకలూ ,
సందేహాలూ వస్తాయి.
వాటిని తొలగించుకుని
ముందుకుసాగితే
సత్ఫలితాలనిచ్చే
మంచి ఆలోచనలు వస్తాయి.
************************
Ee నా స్వీయరచన అముద్రితము .
74
[11/07, 5:26 PM] Tiru Venkatacharyulu Ks6: వీరాస్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్. 11-07-2020.
(74) కలలు-కోరికలు.
కలగన్నామని అది తప్పక
నిజమవ్వాలని లేదు.
కలలన్నీ కోరికలే కానవసరం లేదు.
తలచిన ప్రతి కోరికా
కలగా రానవసరం లేదు.
కోరుకున్నదేదైనా
కలగనగానే సాకారం కాదు.
మనిషన్నాక కోరికలుండాల్సిందే.
అవి తీరాలంటే పట్టుదల ఉండాలి.
పట్టుదలెంత తీవ్రమైతే
అంత తరచుగా కలై వస్తుంది.
అప్పుడిక అనుకోని కలలేవీ రావు. ప్రగాఢమైన కోరికే తరచుగా వచ్చే కలౌతుంది.
పట్టుదలతో స్వయంగా కృషిచేస్తే ఆ కల
తప్పక సాకారమౌతుంది.
*****************************
Ee నా స్వీయరచన అముద్రితము అని హామీ ఇస్తున్నాను.
75
[11/07, 8:00 PM] Tiru Venkatacharyulu Ks6: వీరాస్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్. 11-07-2020.
( 75 ) మొలకెత్తుతున్న ఆశలు.
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ,
కోట్లాది మంది గుండెల్లో
గుబులు రేపుతున్నది.
లక్షలాదిమందిని బలిగొన్నది.
ఇంకా ఆకలి చల్లారలేదన్నట్టు
దావానలంలా కోరలు చాస్తున్నది.
ప్రకృతి వైపరీత్యమో , మానవ తప్పిదమో , కొంటెతనమో , రాక్షసానందమో తెలిసితెలియని తుంటరితనమో
మానవాళి మొత్తాన్ని
జీవన్మరణ సమస్యల్లోకి నెట్టింది.
అధినేతల కట్టడి ప్రయత్నాలన్నీ
చేజారి మానవజగతిని
భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
ఇక భయపడ్డా ప్రాణాలకు
భరోసా లేదనుకున్న జనం
అన్ని జాగ్రత్తలూ వదిలేసి
విచ్చలవిడిగా తిరుగాడుతున్నారు.
ఇంట్లోంచి బయటికి రావడానికి
భయపడే జనం కూడా
ఎప్పుడేమవుతుందోనని
ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని
బతుకుతున్నారు.
కలికాలమా? ఇది కానికాలమా? యుగాంతకమా?
లేక విధి వైపరీత్యమా?
ఏదీ తెలియని అయోమయంలో
ప్రపంచం కొట్టుమిట్టాడుతున్నది.
ఈ సమయంలో ఎవరికీ తోచిన
ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
ఎవరిచ్చే సలహాలు , సూచనలు
వాళ్ళు చేస్తున్నారు.
ప్రయోగాలు ఫలించక పోతాయా?
ఏదో ఒక ఔషధం కనిపెట్టలేక పోతారా?
ఎవరో ఒక దేవుడు కరుణించకపోతాడా?
అని జనాలు కోటి ఆశలతో
గ్రహణం నుండి విడుదలయ్యే సమయం కోసం వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు.
ఏదేమైనా మానవాళిలో మార్పును ఆశించే ఇదంతా జరుగుతున్నదనుకోవాలి.
ఇకనైనా మారాలి మనమంతా.
చేస్తున్న ప్రయత్నాలు ,
ప్రజలlo మొలకెత్తుతున్న ఆశలకు
జీవం అందిస్తాయని పరిపూర్ణంగా విశ్వసిద్దాం. మనవిశ్వాసమే సాధకులకు పురోగామి బలం.
*****************************
Ee నా కవిత స్వీయరచన , అముద్రితము అని హామీ ఇస్తున్నాను.
76
వీరాస్ కవిసమయం
6. ముడుంబ తిరువెంకటాచార్యులు, వరంగల్. 14-07-2020.
(76) ఒట్లు, ప్రమాణాలు, బాసలు.
తప్పు చేయలేదని నమ్మించడానికి ' ఒట్టు '.
నిజాన్ని నిలబెట్టు కుంటానని నమ్మించడానికి
' ప్రమాణం '.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని నమ్మించడానికి ' బాస '.
ఇవన్నీ,...
వాటిమీద నమ్మకం
ఉన్న వాళ్ళకే.
నమ్మకం అనే విలువ పాటించని వారితో,
ఆ పదాన్నే
వమ్ము చేసేవారితో
' ఒట్టు ' పెట్టించుకుని,
' బాస ' చేయించుకుని,
' ప్రమాణం ' చేయించుకుని
దానికి వారు కట్టుబడి ఉంటారనుకోడం, ఉండాలనుకోవడం
ఒట్టి వెర్రితనం,
మన అమాయకత్వం.
అటువంటి ఆశలేవీ పెట్టుకోకుండా
నయానో , భయానో మాటకు కట్టుబడి ఉండేలా చేసుకోవడం తెలివైన పని.
*********************
ఈ నా స్వీయరచన అముద్రితము అని హామీ ఇస్తున్నాను.
77
వీరాస్ కవిసమయం
6.ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్ 16-07-2020. ( 77 )
ముసలమ్మ ముచ్చట్లు.
రైలు ప్రయాణం.
అది పాసింజర్ రైలు.
స్టేషన్లో ఆగింది.
ఎక్కి కూర్చున్నాను.
జనం అంతగా లేరు.
సీటు తేలిగ్గానే దొరికింది.
పక్కనే ముసలావిడ.
వొళ్లో పూలబుట్ట ,
పూలు దోసెడన్నే ఉన్నాయి.
అమ్ముడుపోగా మిగిలినవేమో.
ఎవరన్నా అవికూడా కొంటారేమోనని అందరివైపూ చూస్తూ కూర్చున్నది. ఉండబట్టలేక నేనే అడిగాను.
'అవ్వా! ఈ పూలు ఎంతకిస్తావ్?' దండకడితే రెండు మూరలవుద్ది నానా!
ఓ పది రూపాయలియ్యి.
సరేలెమ్మని పదిరూపాయలిచ్చాను.
పూలన్నీ కాగితంలో పోసి జాగ్రత్తగా , నలగకుండా పొట్లం కట్టి ఇచ్చింది.
తీసుకొని చేతిసంచీలో వేసుకున్నాను.
'జాగ్రత్త నాయన నలిగిపోతాయ్.'
పర్లేదులే అవ్వ! పైనే పెట్టాను.
Avvatho కాసేపు మాట్లాడుతూ
గమ్యస్థానం వచ్చేవరకు కాలక్షేపం చేద్దాం అనిపించి మాటలు కలిపాను.
'ఎన్నేళ్ళనుంచి అమ్ముతున్నావ్ ఈ పూలు?' చానా కాలంనుంచి అమ్ముతున్న నాయనా.
'ఏ కాలంలో పని అప్పుడే చేసుకోవాలె గదా నాయనా'.
'ఇంకా ఏమేం పనులు చేస్తావ్ అవ్వ?' 'ఎదో బతుకుదెరువు నాయనా! చానా పనులే చేసుకుంటా'
మాది చిన్న పల్లెటూరు నాయనా.
ముసలోని ఎనకటోళ్లందరూ అమ్ముకోంగా
పది గుంతల జాగా మిగిలింది.
దాంట్లనే కూరగాయలు పండిస్తాం , పూలచెట్లేసినం , రెండు బర్లున్నాయి , వాటికీ చాకిరీ చేసుకుంటాం ,
కాసిన కూరగాయలు , పూసిన పూలు , అయినప్పుడు పాలు , పెరుగు
పట్నం దెచ్చి అమ్ముకుంటం.
మేమిద్దరం ఎట్లానోగట్ల బతకాలి గదా నానా!
'ఇంత పని మీరిద్దరే చేస్తారా?'
ఉండబట్టలేక ఆశ్చర్యంగా అడిగాను. చిన్నప్పట్నుంచీ అన్ని పనులు
చేసినోళ్ళమే గదా నానా!
ఒంట్లో బలమున్నప్పుడు
తునికాకు ఏరబోయేది ,
పొద్దుగూక వచ్చేటప్పుడు
మోదుగాకులు బస్తనిండా తెచ్చుకొనేది ,
ఎండకుఁబోలేకపోయినప్పడు
ఇంట్లనే ఉండి బీడీలు సుట్టుకుంటానో ,
ఇస్తార్లు కుట్టుకుంటానో ఉంటాం.
'ఎదో చేసుకొని బతకాలి గదా నానా!'
'అవునవ్వా! మరి కొడుకులు , బిడ్డలు ఎక్కడున్నారు? ఎంజేస్తున్నారు?'
ఆమె వాక్ప్రవాహానికి అడ్డు తగులుతూ అడిగాను.
'ఉన్నారు నాయనా!
వాళ్ళ సదువులకోసం గూడ బూములమ్మినం.
ఇప్పుడాళ్లు పట్నంల ఉజ్జోగం చేసుకుంటూ దొరలెక్క ఉంటున్రు.'
మరివాళ్ళు మిమ్ములనుచూసుకోవచ్చు గదా! 'రమ్మంటారు నానా!
ఆడికి బోతే ఎం పని చేయినీకి ఉండదు.
ఓ మాట ముచ్చట చెప్పేటోళ్లు ఉండరు.
తిని కూచున్నట్టే ఉంటది.
పని లేకపోతే కాళ్ళు చేతులు గుంజుతుంటాయ్.
వాళ్లేమో పొద్దుగూక రాంగానే
కుర్షిలల్ల జేరగిలబడి
టివి జూస్కుంటా పొద్దుపుచ్చుతుంటారు.
మాకేమో కాళ్ళు చేతులాడాలనాయే. అక్కడుండలేక , కాళ్ళు చేతులాడినన్నాళ్లు ఈడనే ఉందామని గట్టిగ అనుకున్నాం నాయనా!'.
ఇక్కడుంటే గుడిసె నిండుగుంటాది. బర్లు , చెట్లు , ముసలోడు , నేను , సుట్టుపక్క అంత ఒకళ్లనొకలం ఆదుకుంటాం , ఎదో ఒక పని చేసుకుంటా సుకంగుంటం. పోయేకాలమొచ్చిన్నాడు ,
ఏదోక రకంగా పోవాల్సిందేగదా! ఎవరినెత్తినబడకుంట ,
ఎవ్వరిచేత చాకిరీ చేపిచ్చుకోకుండా తీస్కబొమ్మని బగమంతునికి మొక్కుకుంటాం.'
Kallu తుడుచుకుంటూ లేచింది.
మా వూరు బోయే టేసనొచ్చింది నాయనా!' అంటూ.
******************************
Ee నా స్వీయరచన అముద్రితము అని హామీ ఇస్తున్నాను
78
వీరాస్ కవిసమయం
6. ముడుంబ తిరువేంకటాచార్యులు వరంగల్ 18-07-2020. ( 78 ) విలువ
అందుబాటులో వున్నంతవరకు
విలువ తెలియదు , ...
వస్తువైనా, ఆస్తులైనా , మనిషైనా , మాటైనా ...
విలువ తెలుసుకునేలోగా
జారవిడుచుకుంటారు కొందరు... , వస్తువునైనా , ఆస్తినైనా , మనిషినైనా , మాటనైనా ,.. జాగ్రత్త ...
ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం చాల కష్టం
వస్తువునైనా , ఆస్తినైనా , మniషినైనా , మాటనైనా ...
*****@@@******
Ee నా స్వీయరచన అముద్రితము .
79
వీరాస్ కవిసమయం
6. ముడుంబ తిరువెంకటాచార్యులు , వరంగల్. 19-07-2020. (79) ముసుగు.
చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం,
ఇప్పుడూ చూస్తూనే వున్నాం,
నటుడు ఒకే సినిమాలో ఒకటికంటే ఎక్కువ పాత్రలు,
అదీ ఒకేసారి రెండు
లేదా అంతకంటే
ఎక్కువ పాత్రలు
ఒకేసారి తెరపై కనపడటం,
హావభావాలు పలికించడం ఎలా సాధ్యం?
అని ఆశ్చర్య పడేవాళ్ళం, తర్వాత్తెలిసింది అదే పోలికలు వచ్చేలా ముఖం ముసుగు తయారు చేసి, దాన్ని మరో మనిషి ముఖానికి తగిలించి, చూపరులను భ్రమింపచేసేవారని.
సమాజంలో కొంతమంది వ్యక్తులు తగిలించుకొనే ముసుగు అసలు బయటికి కనపడదు, ఊరికి ఉపకారిగా, మంచితనాన్ని ప్రదర్శిస్తూ, తమ చీకటి కోణాలను గుప్తంగా సాగించడంలో సాటిలేని నటనలో జీవిస్తుంటారు.
వారి నిజం
జీవితకాలంలో బయటపడొచ్చు,
తర్వాత బయటపడొచ్చు, లేదా ఎప్పటికీ
బయటకు రాకుండా కాలగర్భంలో కలిసిపోవచ్చు.
మరికొంతమంది మనొవ్యధలను
బయటికి చెప్పుకోలేక, చిరునవ్వులు చిందిస్తూ సమాజంలో ఒకలాగ, ఒంటరితనంలో మరోలాగ జీవిస్తుంటారు.
వీరు కూడా ముసుగు ధరించిన వారే కదా!
ఇక ఇప్పుడైతే దాదాపుగా అందరినీ ముసుగు ధరించేలా చేసిందీ మహమ్మారి.
ముఖమంతా ముసుగేసుకు తిరిగే వారిని సన్నిహితులుకూడా గుర్తించడం కష్టమే కదా!
"తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ!" అని అప్పిచ్చినవాడు గొనుక్కుంటాడు,
ఆపదలో ఆదుకొంటాడేమో
అని ఆశపడ్డ వాడు,
నిరాశకు లోనవుతాడు.
రఘుపతి రాఘవ రాజారాం, సబ్ కో సన్మతి దే భగవాన్!
*******@@@******
ఈ నా స్వీయరచన అముద్రితము.
80
వీరాస్ కవిసమయమ్,
6. ముడుంబ తిరు వేంకటా చార్యులు, వరంగల్. 20-07-2020.
(80) పల్లెటూల్ళే పట్టుగొమ్మలు,... దేనికైనా!
ఆత్మీయతానుబంధాలు, ఆప్యాయతలు, బంధుత్వాన్ని
కలిపి పిలుచుకోడం, పండుగలూ,
పర్వదినాలు కలిసిమెలిసి చేసుకోవడం,
ఆపదలలో
సానుభూతిని పంచుకోవడం,
పరస్పరం సహకరించుకోడం,
శ్రమైకజీవనసౌందర్యం, మట్టిపనిలో తమ జీవితానందాన్ని చూసుకోవడం, ఆహ్లాదకరమైన మాటలు, ప్రకృతిలో మమేకమైన జీవనం, నిర్మలమైన ఆనందాతిరేకాలు,
ప్రకృతి రక్షణ, జీవకారుణ్యం, ...
ఇవ్వన్నీ రుచిచూపించిన పల్లెప్రజలు ఇప్పుడు రాజకీయ మాయామోహితులై, విభిన్న కోణాలలో విభజించబడి,
కుల మత వర్ణ వర్గవివక్షలను సృష్టించుకొని గ్రామసింహాలవలె
తమలో తామే కలహించుకుంటున్నారు, పోరుగువారిని కాదుగదా!
తోడబుట్టిన వారినే బద్ధశత్రువులుగా చూస్తున్నారు. రాజకీయమే ఇంతపని చేసింది, చేస్తున్నది. అందుకే పల్లెటూల్ళే పట్టుగొమ్మలు, ... దేనికైనా!...
*******@@@******* ఈ నా స్వీయరచాన అముద్రితము.
81
వీరా స్ కవిసమయం
6,ముడుంబ తిరువెంకటా చార్యులు, వరంగల్. 21-07-2020.
(81). ఋతు పరిణామానికి స్వాగతం.
సూర్యపుష్పంపై శుకవిలాసం,
పంకజంపై
భ్రమర నాదం, మందారంపై
మధుప
' మధు ' సేవనం,
జాజి పూలపై తేనెటీగ విహారం,
మల్లేతోటలో సీతాకోకచిలుకల సోయగాలు,
గడ్డిపూలపై
తూనీగల సంబరాలు,
మావిచిగురు తిన్న గండుకోయిల రాగాలాపనలు, ...
తొలకరి చినుకుల్లో తడిసిన భూమాత పులకింతలు,
నేలరాలి నిదరోయిన బీజాలకు అంకురార్పణ0, కొత్త చిగురులకు, సరికొత్త ప్రకృతి పునరుజ్జీవనానికి శుభారంభం, ..... అదంతా వసంతగ్రీష్మాలలో,...
ఈ రోజుకు అదంతా
గతం.
నేటినుంచి
వర్షఋతువు ఆరంభం, పవనగమనమే
తన ఆలంబనగా,
మొలకలు తొడిగిన ప్రకృతి జాతులకు తానే ఆలంబనగా,
రైతు ఆశలకు దన్నుగా నీలిమేఘాలు విసిరే సౌందర్య'శంప'లతో, శంభుని డమరుధ్వానాల బోలిన నినాదాలతో వత్సరానికొకసారి పునరాగమనం చేస్తున్న వర్ష ఋతురాజమా! స్వాగతం.
******@@@@******
ఈ నా స్వీయరచన అముద్రితము.
82
వీరా స్ కవిసమయాం
6. ముడుంబా తిరువెంకటాచార్యులు, వరంగల్, 22-07-2020 (82) సమరతిమిరం.
యుద్దోన్మాదమా! నిలు!
నీ యుద్ధపిపాసకు సిగ్గుతో తల వంచుకో! యుద్ధమంటే ఏమనుకుంటున్నావు?
ఎదురుతిరిగి నవారిని పిట్టల్లా కాల్చిపారేయడం కాదు,
అన్నం పెట్టే రైతులని కూడా చూడక లక్షలాది మందిని నిలువునా ఊచకోత కోయడం కాదు, కుయుక్తులు పన్ని సరిహద్దులు ఆక్రమించడం కాదు, చేయి చేయి కలిపి ఆలింగనం చేసుకున్న మరునాడే చెలిమికి చరమగీతం పాడుతున్నావు, సహకారము పేరుతో తీవ్రవాదిని నీ పంచన చేర్చుకుని వేదభూమిని ఏదో చేయాలనుకున్నా వు,
ప్రజలంటే నీకు యంత్రాలతో సమానం కావచ్చు, సైనికుల ప్రాణాలకు మీవద్ద విలువ లేకపోవచ్చు, ఎంత మంది మరణిస్తే అంత జనభారం తగ్గిందని నీవనుకోవచ్చు.
నిజానికి నీకు యద్ధమంటే నిర్వచనం కూడా తెలియ దనుకుంటా! దొంగదెబ్బ తీయడమే యుద్ధమని నీవనుకుంటే, నీ కంటే మూర్ఖుడు వేరోకడుండడు, జననష్టమొక్కటే కాదు, ఆర్తికనష్టం, ఆహారనష్టం, పర్యావరణ నష్టం, యంత్రనాష్టం, ఆయుధనష్టం,
సాంకేతిక నష్టం, వ్యాపారనష్టం, దేశీయసంబంధాల నష్టం, వేలాది కుటుంబాల ఛిన్నాభిన్నం, శాత్రవాభివృద్ధి, ప్రపంచమంతా నిను చీ కొడుతుంటే నీ దేశాన్ని ఎలా పాలించగలవు? ఎలా అభివృద్ధి చేసుకొగలవు? నిన్ను నమ్మి నీతో చెలిమి చేసేదెవరు? శతాబ్దాల వెనుకబడి పోతావ్, ఒకవేళ నీవు గెలిచావనుకున్నా, యుద్ధంలో నీకూ
నష్టం కలిగించే అంశాలుంటాయి, యుద్దమంటే యుగాలవెనుకబాటు, యుద్ధమంటే చీకట్లోకి తోసివేత,
యుద్ధమంటే అజ్ఞానతిమిరంలో జీవనాన్ని కావాలని కోరుకోవడమే!
******@@@@****** ఈ నా స్వీయరచన అముద్రితము.
83
వీరా స్ కవిసమయం,
6. ముడుంబ తిరువేంకటా చార్యులు, వరంగల్. 23-07-2020. (83) కుసుమపరాగం- వసంతగానమ్.
కుసుమితద్రుమం, వికసితసుమం,
స్వాదు పరిమళం, వాయువాహనం, ప్రకృతివ్యాపనం,
నాసికాస్వాదనం, పులకితఃహృదయం, పంకజమిలితం, హర్షితభ్రమరం, భ్రమర నాదం, పరాగభోక్తం, మరంద పానం, వసంతాగానం, కుసుమపరాగం, హృదయసమ్మోహనం, ప్రకృతిసుందరం.
******@@@@*******
ఈ నా స్వీయరచన అముద్రితము.
84
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ తిరువెంకటా చార్యులు, వరంగల్. 24-07-2020. (84) జీవితగణితం.
తల్లిగర్భంలో చేరకముందు
నీకు అస్తిత్వం లేదు,(మైనస్)
చేరావని తెలిశాక కూడా నువ్వేవరో (m/f) తెలియదు గనుక
' సున్నా ' వే ఇంకా, వేదనపడి తనకు పునర్జన్మ అనదగిన
నీ ఉదయాన్ని
తను చూసుకుని పొంగిపోయే వేళ
నువ్వు ' ఒక ' (1)
పసి పాపవు,
నిజానికి నీ అస్తిత్వానికి ఆరంభం ఇక్కడే, క్షీరామృతధారలు గ్రోలుతూ ఎదుగుతున్న నువ్వు ఇక్కడి నుండి అన్నిటినీ సంకలనం చేసుకుంటూ సాగుతావు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, అనుబంధాలు, ఆత్మీయతలు, ఆప్యాయతలు, పరిచయస్తులు, అపరిచితులు,
చదువు, సంస్కారం, తెలివితేటలు,
జ్ఞానం, విజ్ఞానం,
వివేకం, విచక్షణ, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆస్తులు, అప్పులు, బాధ్యతలు, సమస్యలు,పరిష్కారాలు, ... ఇవన్నీ
నీ ఖాతాలో జమకూడేవే, (సంకలనం),
ఇక్కడినుండి ఒక్కొక్కటిగా వదిలించుకుంటూ వెళతావు, నువ్వొద్దనుకున్నా వడిలిపోయేవి చాలా వుంటాయి,(మైనస్)
చివరకు ఇంతకాలం మమకారంతో పోషించుకుంటూ వచ్చిన నీ దేహాన్ని కూడా
నువ్ భరించలేవు...,
ఎప్పుడో ఒకప్పుడు ఎవరికీ చెప్పకుండానే, దాన్నీ వదిలించుకోవలసిందే, అది మాత్రం నీ చేతుల్లో ఉండదు గాక ఉండదు,
ఒక్కటి గుర్తుంచుకో! దేన్నైనా గుణకారం గానీ, భాగహారం గానీ, చేయాలనుకోకు, చేయలేవుకూడ. ఎందుకంటే అలా చేయడానికి ప్రయత్నించిన వాళ్ళందరు
ఆ ' ఆశ ' కే " ఆహారమై" చరిత్రలో కలిసిపోయారు.
******@@@@****** ఈ నా స్వీయరచన అముద్రితము.
85
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ తిరువెంకటాచార్యులు, వరంగల్, 25-07-2020. (85) మనసు - మాట.
మనసు
గాజుపాత్ర కాదు,
కానీ రాళ్ళదెబ్బలవంటి మాటలకు తునాతునకలైపోతుంది, కొయ్యబొమ్మకూడా కాదు, కానీ గొడ్డలిపెట్టు లాంటి మాటలకు చిన్నాభిన్నమైపోతుంది, పలుచని కాగితం
కూడా కాదు,
కానీ కత్తెరవంటి మాటలకు ముక్కచెక్కలై పోతుంది, మట్టిముద్దకూడ కాదు, కానీ గునపాల్లాంటి మాటలకు చిద్రమపుతుంది, సుమసదృశమౌ సున్నితత్వం ఏమీ లేదు, కానీ రోకటిపోటుల్లాంటి మాటలకు నలిగిపోతుంది.
మాటలు
చాకుల్లాంటివి, బాకుల్లాంటివి, మేకుల్లాంటివి, ఈటెల్లాంటివి.
ఒకసారి దిగితే
తిరిగి తీయడానికి, గాయం మానడానికి
వీలు కానంత పదునైనవి.
"జారవలదు మాట జాగ్రత్త, జాగ్రత్త!"
*******@@@@******
ఈ నా స్వీయరచన అముద్రితము.
86
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ తిరువేంకటాచార్యులు, వరంగల్. 25-07-2020. (86) స్పందనలు.
(1) యౌవనంలో
ముఖంపై మచ్చల గురించి బెంగ.
(2) వృద్ధాప్యంలో
ముడుతల గురించి దిగులు.
(1) తగిన జోడీ కోసం వెతుకులాట.
(2) చేదోడు కోసం దిక్కులు చూడటం.
(1) ఏకాంతం కొరకు వెంపర్లాట.
(2) ఒంటరితనం భరించలేక అసహనం.
(1) ఎవరైనా సలహాలిస్తే చిరాకు.
(2) మాట వినేవారే కరువయ్యారని పరాకు.
(1) అందమైనలోకాన్ని వెతుక్కుంటూ విహారం.
(2) చుట్టూ ఉన్న వస్తువుల్లో అందాన్ని చూసుకుంటూ తృప్తిపడటం.
(1) ఈ జీవితం శాశ్వతమనే భావన.
(2) నాకూ చివరిఘడియలు సమీపిస్తున్నాయని
తెలిసి వేదన.
(1) సంతోషసమయాలను ఆస్వాదిస్తూ ఆనందంలో తేలిపోవడం.
(2) గతమధుర స్మృతులను నెమరేసుకోడం.
(1) ఉదయమే లేవడానికి బద్ధకించిన రోజులు.
(2) పగలూ రాత్రీ తేడా లేకుండా నిద్రపట్టని రోజులు.
(1) పడుచుగుండెల హృదయాలను కెలికిన రోజులు.
(2) గుండె లయ ఎప్పుడాగిపోతుందో నని వేదన పొందిన రోజులు.
(1) పెద్దవాళ్ళ ఆలోచనలను చాదస్తంగా కొట్టిపారేసిన రోజులు.
(2) తన మాటలను తీసిపారేస్తున్నారని వేదన చెందే రోజులు. ...
జీవితంలోని కీలక సమయాల్లో నిజం తెలుసుకోము,
అనుభవించి నేర్చుకోవలసిందే, వయసు, స్థాయి, స్థితి,... ముఖ్యం కాదు, జీవించడం ముఖ్యం, జీవితాన్ని ప్రేమిస్తూ.
******@@@@*******
ఈ నా స్వీయరచన అముద్రితము.
87
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ
తిరువెంకటాచార్యులు, వరంగల్. 25-06-2020. (87) రక్షణ.
ధనం సంపాదించి, సరైనమార్గంలో
సత్కార్యాలకు వినియోగిస్తే,
ధర్మం తాను రక్షించబడి, వ్యవస్థను రక్షిస్తుంది.
నిరంతరం జ్ఞానం ఆర్జిస్తూ,
అర్థులైన వారికి
వితరణ ( బోధన ) చేస్తుంటే,
జ్ఞానం తాను రక్షించబడి, జ్ఞానిని రక్షిస్తుంది.
రాజాజ్ఞకు
విధేయుడైన వాడు,
రాజు నుండి,
రాజు చేత రక్షింపబడతాడు.
యోగ్యురాలైన, బాధ్యతగల గృహిణి, గృహాన్ని( కుటుంబాన్ని) రక్షిస్తూ,
తానూ రక్షింపబడుతుంది.
ధనము, జ్ఞానము, సేవకత్వము, గృహినిత్వమూ,... ఇవి వినియోగము , వితరణ, విధేయత, సమర్థత లపై ఆధారితములు..
****"**@@@@*****
ఈ నా స్వీయరచన అముద్రితము.
88
వీరాస్ కవిసమయ౦
6. ముడుంబ తిరువెంకటాచార్యులు , వరంగల్. 28-07-2020.
( 88 ) పరోపకారమే జీవనం.
తోటలోని పూల పరిమళం ,
కడలి ప్రసాదమౌ వర్షధారలు ,
కోరుకోవు ప్రతిఫలం. సూర్యుడే ఉదయించని వేళ
నీవే దీపమై జ్వలించి ముందుకు సాగు,
పూలబాటలో సాగనీ ,
నిప్పుకనికలే కురియనీ ,
సత్యమేదారిగా పయనంసాగించు.
ప్రేమ మనసులను కలపాలి ,
ఇతరులకై స్పందించేదే హృదయం ,
మలయమారుత తరంగమై సాగాలి ప్రేమైకజీవనం , సత్యజీవనమార్గం అందరికీ పంచాలి ,
త్యాగమయజీవనం ఆదర్శం కావాలి , అనుసరించే వారి మదిలో కొలువై ఉండాలి.
************@@@@@@************
ఈ నా స్వీయరచన అముద్రితము.
89
వీరాస్ కవిసమయ0,
6. Mudumba తిరువేంకటా చార్యులు, వరంగల్. 28-07-2020. ( 89 )
మావూరి చెరువు అందాలు.
ఊరికి ఉత్తరాన, దూరంగా,
ఎడ్లబండ్లు వెళ్ళే దారిలో రెండు మైళ్లు నడిస్తే, కుడివైపు చిన్న గుట్ట, ఎడమవైపు పొడవైన గుట్టపై దట్టమైన అడవి, నడుమ నిలబడి ముందుకు చూస్తే, ఎదురుగా,
వానాకాలపు వరదనీటితో నిండు కుండలా,
అలుగు పోస్తూ ఆవలివైపు
నేల కనపడనంత విశాలంగా మావూరి చెరువు.
చిన్న గుట్టపై వందల యేళ్ళ నాటి "రాజన్న"గుడి,
' పులి తరుముకుంటూ వచ్చినా ఆ గుళ్ళోకి పోకూడదట ' అని
అమ్మ అనేది,
వైష్ణవుల0 గదా! ఇప్పుడంత లేదు. రాత్రుల్లో అడవి నుంచి పులులు వచ్చి,
ఆ గుళ్ళో పడుకుంటాయని అనేవారు. అప్పుడప్పుడూ వంటచెరకు కోసం, తునికాకు కోసం వూళ్ళల్లో జనం అడవికి వెళుతుంటారు.
చెరువు నిండినప్పుడు, చుట్టూ ఉన్న ఎత్తైన గుట్టలన్నీ తమఎత్తులు తగ్గించుకుని చిన్నగా కనపడతాయి, చెరువులోని నీళ్ళు
గుట్టల పాదాలను ముంచేస్తాయన్నమాట, ఆ చివరన ఉండే చిన్న పల్లెటూరు,
ఎండాకాలం కనపడేది, వానాకాలం దాని ఆనవాలు పట్టలేము.
మా వూరికి రావాలంటే వారికి చెరువుకట్ట ఒక్కటేదారి.
చెరువుకు తూర్పు వైపు పొడవైన, ఎత్తైన గుట్టలు, అవి ఎంతదూరం వ్యాపించి వున్నాయో తెలియదు,
ఎత్తైన చెట్లతో దట్టమైన అడవి, అప్పుడప్పుడూ "అన్నలు" తిరుగుతుంటారు అనేవారు. చెరువుకట్టపైన, చింతచెట్టుకింద "కట్టమైసమ్మ"కు పెద్దల మొక్కులు,
అలుగు నీళ్లలో పిన్నల ఈతలు, కేరింతలు.
నీటిలో ఈదుతూ, వేటాడుతూ శనగపిట్టలు, నీటిపక్షులు.
వేట దొరికిందా,
రెక్కలు టపటపలాడిస్తూ దూరంగా వెళ్లి
ఒకచోట కూర్చుని
ఆకలి తీర్చుకుంటాయి.
తోలిపూజలందుకునే లోకనాయకుని "నిమజ్జనం",
తెలంగాణ ఆడపడుచు "సద్దుల"ను అందుకునే బతుకమ్మకు వీడ్కోలు,
ఈ చెరువు ఒడిలోనే. ఊరిలోని బ్రతుకమ్మలందరికీ
ఇక్కడే "సద్ధులి"చ్చి వెనుదిరిగి ఆడవారు, తెలివెన్నెలలో
గుంపులు గుంపులుగా నడుస్తూ,
పాటలు పాడుకుంటూ, మళ్లీ వచ్చే యేటి దాకా "జ్ఞాపకాలను దాచుకుంటూ
ఇండ్లకు చేరతారు.
చిన్న గుట్టకు, చెరువుకట్టకు మధ్యలో అలుగునుండి పొలాలకు పారె నీరు,
దాదాపు వేయ్యేకరాలపంటకు ఆధారం.
కట్టకింద పొలాలు "చెరువుతల్లి"కి
పచ్చని చీర కట్టి,
ప్రకృతి అందాలను
ఇనుమడింప చేస్తుంటాయి.
ఆ ప్రాంతమంతటికీ నీరందిస్తు,
జనపదాలకు బ్రతుకుతెరువు నిచ్చే "చేరువుతల్లి"కి వందనాలు.
******@@@@@*****
ఈ నా స్వీయరచన అముద్రితము.
వీరాస్ కవిసమయం,
90
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ తిరువేంకటాచార్యులు, వరంగల్, 29-07-2020. (90) నిజాయితీ.
సాక్ష్యాలూ, ఆధారాలు చూపగలిగావా!
నీవు నిర్దోషివి,
నీ వాగ్ధాటితో నీ తప్పును ఒప్పుగా చెప్పగలిగావా! నీవు సమర్థుడివే, నిజాయితీగా నీ తప్పును ఒప్పుకున్నావా!
నీవు నేరస్తుడివి,
ఇకపై సమాజం
నిన్ను నమ్మదు,
నీవెన్ని మంచి పనులు చేసి ఉన్నా,
చేస్తూ ఉన్నా
అవేవీ లెక్కలోకి రావు,
నీ చుట్టు ప్రక్కల జరిగే ప్రతి తప్పుకు సమాజం నీవైపే అనుమానంగా చూస్తుంది,
ఆ చూపులు
నిన్ను నిలువునా దహించివేస్తున్నట్లు వుంటాయి,
నీలో కలిగే మంచి మార్పును ఎదగనీయవు, అనుక్షణం నీలో నీవే సంఘర్షణకు లోనౌతావు, నీలో సమాజంపై
ఈర్ష్యాద్వేషాలు
రగులు తుంటాయి,
నీవు ఎల్లవేళలా నిర్దోషిగా నిలబడగలిగితేనే సమాజం నిన్ను గుర్తిస్తుంది,
నిప్పులాగా ఉండగలగడం అనేది
ఒక ప్రత్యేక సహజాతం, నిజాయితీ అనేది మన ప్రవర్తన ద్వారా మాత్రమే తెలియబడే ప్రత్యేక ఆభరణం,
మొదటిది అందిపుచ్చుకునేది,
రెండోది మనం నిలుపుకోవాలి.
*******@@@@******
ఈ నా స్వీయరచన అముద్రితము.
91
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ తిరువెంకటాచార్యులు, వరంగల్. 29-97-2020.
(91) నిర్లక్ష్యపు నీడలో...
జనం "ప్రాప్తకాలజ్ఞత"కు అలవాటు పడ్డారు, "చెత్తబండి" వారికి దబ్బులియ్యాల్సొస్తుందని రాత్రిళ్ళు ఎవరూ చూడకుండా రోడ్డు వారగా "పారేసి" రావడం, దిక్కులు చూస్తూ నిర్లజ్జగా సైడు కాల్వలో
పోసి రావడం,
మనింటి మీది"దిష్టి" పోవాలని,
అర్థరాత్రి నడిరోడ్డుపై "తిప్పేసి" రావడం, పక్కింటి వాకిట్లోకి
చెత్త తోసి తలుపేసుకోడం,
ఎవరైనా అడిగితే ముఖం చాటేయడం, లేదా తెగించి గొడవకు దిగడం, రాత్రి జల్సాచేసి రోడ్డుపై సీసా పగలగొట్టడం, ఎవరూ అడగకుంటే "మాస్కు" లేకుండా తిరగడం,
వెనకాముందు చూడకుండా రయ్యిమని "రాంగ్ రూట్"లో వెళ్ళడం,...
...... ...... ...... ........
రోడ్డుమీద, సైడు కాల్వలో చెత్తేస్తే ఎవరికీ నష్టం? అంటువ్యాధులు ప్రబలితే ఎవరిది బాధ్యత?
"దిష్టి" మనింటి మీది నుండి పోయి, పక్కింటోడికో, సాటి మనిషికో తగులుకుంటె పరవాలేదా?
పక్కింటి వాళ్ళతో గొడవ సమాజ సంబంధాలను గట్టిపరుస్తుందా?
నీవు పగులగొట్టిన
సీసా ముక్కలు, దారిన పోయేవారికి గుచ్చుకుంటే నీకానందమా? "మాస్క్"పెట్టుకోకుండా, "అంటించుకుంటే" నీవొక్కడితోనేపోతుందా?
నియమాలను పాటించని "చోదకత్వం" ప్రమాదకారి కాదా? , ...
....... ........ ....... ......
ఇటువంటి "బాధ్యత" లెరుగని పౌరులున్న సమాజాన్ని స్వయంగా గాంధీజీ వచ్చిచీపురు పట్టి ఊడ్చినా,
ప్రధాన సేవకుడు
ఎన్ని బోధలు, ప్రయత్నాలు చేసినా
ఈ సమాజం మారుతుందా?
హతవిధీ!
జనాల్లో మార్పు వచ్చేదెట్లా?
"వసుధైక కుటుంబాన్ని" చూసేదెప్పుడు?
******@@@@*******
ఈ నా స్వీయరచన అముద్రితము.
92
6. ముడుంబ తిరువేంకటాచార్యులు, వరంగల్.
30-07-2020.
(92) కలిసివుంటే...?
కలిసి పోయి
తమను తాము గుణించుకుంటే
{(a+b) స్క్వేర్}
లబ్ధం రెట్టింపు లాభం {+2ab},
విడిపోయి
తమను తాము గుణించుకున్నా {(a-b)స్క్వేర్}
రెట్టింపు లబ్దం నష్టమే {-2ab}.
కనుకనే పెద్దలంటారు, "కలిసి ఉంటే కలదు సుఖము" అని.
విడిపోతే దుఃఖమే మరి!
*******@@@*******
ఈ నా స్వీయరచన అముద్రితము.
93
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ తిరువేంకటాచార్యులు, వరంగల్.
30-07-2020.
(93) వ్యష్టి - సమష్టి.
కుటుంబమంతా కలిసి బంధాలు, అనుబంధాలు కలిగివుండేది సమష్టి, బంధుత్వాలు
బలంగా పెనవేసుకున్న
తీయని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఇంటికి బాధ్యత వహించే పెద్దరికాన్ని ధిక్కరించే స్వరాలు పుట్టుకొచ్చి, స్వార్థం ప్రేరేపించిన ఆర్థిక స్వావంబన "మిష", సమష్టి తత్వాన్ని కాలరాచిన దుర్ముహూర్తం,
ఆర్థికపుష్టి మాటేమో గానీ,
సరదాల పేరుతో వ్యసనాలకు బానిసలను చేసింది,
ప్రతీ సంబంధాన్ని ఆర్థిక కోణంలో చూడటం నేర్పింది,
కుటుంబ ఐకమత్యాన్ని దెబ్బతీసింది, తల్లిదండ్రులను వంతులేసుకుని
పోషించే వ్యవస్థను, లాభనష్టాలను బేరీజు వేసుకునే సమాజాన్ని సృష్టించింది,
బంధాలను, బంధుత్వాలను మరపించే స్థాయికి తెచ్చింది,
ప్రశాంత మనసనేది కాగడాక్కూడా కనపడకుండా పోయింది, బంధువులెవరో, వరసకేమవుతారో తెలియని అయోమయాన్ని పాదుకొల్పింది. "హమ్ ఆప్కే హై కౌన్" వాతావరణాన్ని తెచ్చింది.
********@@@*******
ఈ నా స్వీయరచన అముద్రితము.
94
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ
తిరువేంకటాచార్యులు, వరంగల్.
31-07-2020.
(94) ప్రాణమిత్రుడు.
నా హృదయస్పందన వినండి,
వాడి మాటలు వినిపిస్తున్నాయి కదూ! వాడొక పెద్ద వైద్యుడు తెలుసా!
మందులతో కాకుండా మాటలతో ఉల్లాసపరచి నాకు చికిత్స చేస్తాడు,
నా ఆపత్సమయంలో కూడా ప్రతిక్షణం
నా తోడై ఉంటాడు,
నేను కప్పుకున్న
వయసు దుప్పటి
లాగి పారేసి,
నన్ను నిత్య యవ్వనున్ని చేస్తాడు,
వారసుడు ఆస్తిని, బంధువు నా అంతస్తును చూస్తారంటారు,
కానీ వాడు
నా హృదయపు లోతుల్లోకి ప్రవేశించి,
నా ఆర్తిని చూస్తాడు,
నా హృదయస్పందనను వింటాడు,
ఎల్లప్పుడూ నా ప్రాణానికి ప్రాణమై ఉంటాడు, కుటుంబాన్ని, బంధువులను దేవుడు నిర్ణయిస్తాడని అంటారు కదా! కానీ నా స్నేహితుణ్ణి నేనే ఎంచుకున్నాను.
********@@@*******
ఈ నా స్వీయరచన అముద్రితము.
95
వీరాస్ కవిసమయమ్
6. ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్ , 31-07-2020
( 95 ) జీవనమే వలయం.
ఏడాది వయసులో
ఏ ఆసరా లేకుండా
నువ్వడుగులేసినపుడు
అది నీ మొదటి గెలుపని
అమ్మ మురిసిపోతుంది ,
ఏడెనిమిదేళ్ళ వయసులో
ఒక్కడివే బడి నుండి ఇంటికి
తిరిగి రాగలిగినప్పుడు
అమ్మకు మరింత ఆనందం ,
పన్నెండేళ్ల వయసులో
నీ దోస్తులను ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళలో నీ బాల్యచేష్టలను చూస్తుంది ,
పద్దెనిమిదేళ్లు దాటాక
తనను వెనుక ఎక్కించుకొని
బండి నడిపినప్పుడు
సంతోషిస్తూనే జాగ్రత్తలు చెబుతుంది ,
నువు డిగ్రీ పట్టా చూపిస్తే
ఆ డిగ్రీ తనదే అన్నంతగా
ఎవరెస్ట్ శిఖరంపై నిల్చున్నంత ఆనందిస్తుంది , నీ మొదటి సంపాదనతో
తనకు చీరె తెచ్చిచ్చినప్పుడు
నువు ప్రయోజకుడివయ్యావని
మురిసిపోతూ ఆ చీరెను
అందరికీ చూపిస్తుంది ,
నీకో కుటుంబాన్ని ఏర్పాటు చేశాక
నీ చేతిని మరో స్త్రీ/పురుషుడి చేతిలో పెడుతుంది ,
నీ బాగోగులు చూసుకోమని.
అప్పుడు నీకంటూ
అసలైన బాధ్యతలు జతకూడి
నిన్ను సంపాదనవైపుకు దారి మళ్ళిస్తాయి , నలభై ఐదేళ్లొచ్చే వరకు యువకుడిగానే కనపడతావు ,
ఫీలౌతావు కూడా ,
నీ సంతానాన్ని మంచిగా చదివించి వాళ్ళను తీర్చిదిద్దేలోగా 'ఫిఫ్టీపూర్తి' వాళ్ళ
క్లబ్బులో చేరిపోతావు ,
ఉద్యోగవిరామం సమీపిస్తోందని తెలిసి
కౌంట్‌డౌన్ మొదలెడతావు ,
విశ్రాంత జీవితాన్ని
ఆరోగ్యంగా కొనసాగిస్తే చాలని ఒక వైపు , ఇప్పటివరకు త్యాగం చేసిన మానసిక తృప్తిని తిరిగి పొందాలని మరొకవైపు
నీ మనసు ఊగిసలాడుతుంటుంది ,
ఇంట్లో ఎవరికీ భారం కాకూడదని అనుకుంటుంటావు ,
పాతస్నేహితులను కలుసుకోవాలని
ప్రయత్నిస్తావు ,
ఎనభైయవ దశకంలో ఇంటికి దారి వెతుక్కోవడంలో ,
ఆసరా లేకుండా నడవడంలో
ఇబ్బంది పడతావు ,...
జీవితంలోని దశలు
పునరావృతమవుతాయి ,
అప్పుడు అమ్మ ఉన్నది
కాబట్టి సంతోషించింది ,
ఇప్పుడు పునరావృతమైన
నీ జీవిత దశలను
చూసే నీ వాళ్ళలో
చిరాకు పడేవారు , శాపనార్థాలు పెట్టేవారే ఎక్కువ. జీవితం వలయమే , ద్వితీయార్థ మే భారం మనకూ , మనవారికీ...
*********@@@@@@@**********
ఈ నా స్వీయరచన అముద్రితము.
96
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ
తిరువేంకటాచార్యులు, వరంగల్.
31-07-2020.
(94) ప్రాణమిత్రుడు.
నా హృదయస్పందన వినండి,
వాడి మాటలు వినిపిస్తున్నాయి కదూ! వాడొక పెద్ద వైద్యుడు తెలుసా!
మందులతో కాకుండా మాటలతో ఉల్లాసపరచి నాకు చికిత్స చేస్తాడు,
నా ఆపత్సమయంలో కూడా ప్రతిక్షణం
నా తోడై ఉంటాడు,
నేను కప్పుకున్న
వయసు దుప్పటి
లాగి పారేసి,
నన్ను నిత్య యవ్వనున్ని చేస్తాడు,
వారసుడు ఆస్తిని, బంధువు నా అంతస్తును చూస్తారంటారు,
కానీ వాడు
నా హృదయపు లోతుల్లోకి ప్రవేశించి,
నా ఆర్తిని చూస్తాడు,
నా హృదయస్పందనను వింటాడు,
ఎల్లప్పుడూ నా ప్రాణానికి ప్రాణమై ఉంటాడు, కుటుంబాన్ని, బంధువులను దేవుడు నిర్ణయిస్తాడని అంటారు కదా! కానీ నా స్నేహితుణ్ణి నేనే ఎంచుకున్నాను.
********@@@*******
ఈ నా స్వీయరచన అముద్రితము.
95
వీరాస్ కవిసమయమ్
6. ముడుంబ తిరువేంకటాచార్యులు
వరంగల్ , 31-07-2020
( 95 ) జీవనమే వలయం.
ఏడాది వయసులో
ఏ ఆసరా లేకుండా
నువ్వడుగులేసినపుడు
అది నీ మొదటి గెలుపని
అమ్మ మురిసిపోతుంది ,
ఏడెనిమిదేళ్ళ వయసులో
ఒక్కడివే బడి నుండి ఇంటికి
తిరిగి రాగలిగినప్పుడు
అమ్మకు మరింత ఆనందం ,
పన్నెండేళ్ల వయసులో
నీ దోస్తులను ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళలో నీ బాల్యచేష్టలను చూస్తుంది ,
పద్దెనిమిదేళ్లు దాటాక
తనను వెనుక ఎక్కించుకొని
బండి నడిపినప్పుడు
సంతోషిస్తూనే జాగ్రత్తలు చెబుతుంది ,
నువు డిగ్రీ పట్టా చూపిస్తే
ఆ డిగ్రీ తనదే అన్నంతగా
ఎవరెస్ట్ శిఖరంపై నిల్చున్నంత ఆనందిస్తుంది , నీ మొదటి సంపాదనతో
తనకు చీరె తెచ్చిచ్చినప్పుడు
నువు ప్రయోజకుడివయ్యావని
మురిసిపోతూ ఆ చీరెను
అందరికీ చూపిస్తుంది ,
నీకో కుటుంబాన్ని ఏర్పాటు చేశాక
నీ చేతిని మరో స్త్రీ/పురుషుడి చేతిలో పెడుతుంది ,
నీ బాగోగులు చూసుకోమని.
అప్పుడు నీకంటూ
అసలైన బాధ్యతలు జతకూడి
నిన్ను సంపాదనవైపుకు దారి మళ్ళిస్తాయి , నలభై ఐదేళ్లొచ్చే వరకు యువకుడిగానే కనపడతావు ,
ఫీలౌతావు కూడా ,
నీ సంతానాన్ని మంచిగా చదివించి వాళ్ళను తీర్చిదిద్దేలోగా 'ఫిఫ్టీపూర్తి' వాళ్ళ
క్లబ్బులో చేరిపోతావు ,
ఉద్యోగవిరామం సమీపిస్తోందని తెలిసి
కౌంట్‌డౌన్ మొదలెడతావు ,
విశ్రాంత జీవితాన్ని
ఆరోగ్యంగా కొనసాగిస్తే చాలని ఒక వైపు , ఇప్పటివరకు త్యాగం చేసిన మానసిక తృప్తిని తిరిగి పొందాలని మరొకవైపు
నీ మనసు ఊగిసలాడుతుంటుంది ,
ఇంట్లో ఎవరికీ భారం కాకూడదని అనుకుంటుంటావు ,
పాతస్నేహితులను కలుసుకోవాలని
ప్రయత్నిస్తావు ,
ఎనభైయవ దశకంలో ఇంటికి దారి వెతుక్కోవడంలో ,
ఆసరా లేకుండా నడవడంలో
ఇబ్బంది పడతావు ,...
జీవితంలోని దశలు
పునరావృతమవుతాయి ,
అప్పుడు అమ్మ ఉన్నది
కాబట్టి సంతోషించింది ,
ఇప్పుడు పునరావృతమైన
నీ జీవిత దశలను
చూసే నీ వాళ్ళలో
చిరాకు పడేవారు , శాపనార్థాలు పెట్టేవారే ఎక్కువ. జీవితం వలయమే , ద్వితీయార్థ మే భారం మనకూ , మనవారికీ...
*********@@@@@@@**********
ఈ నా స్వీయరచన అముద్రితము.
96
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ
తిరువేంకటాచార్యులు, వరంగల్.
01-07-2020.
(96) ఇది కరోనాకాలం.
ఎండాకాలం ధాటికి ఏ సీ గదిలోంచి బయటికి రాలేకపోయామని
గుర్తుచేసుకునే
అవసరం లేదు, వానాకాలం వానలకు ముఖ్యమైన పనులకోసం కూడా బయటకు వెళ్ళలేక పోయామని బాధపడే అవసరం లేదు, శీతాకాలం చలిపులికి భయపడి బద్దకించి దుప్పటి ముసుగువేసుకు పడుకుంటామేమోనని ఇప్పటినుండే ఆలోచించే పని లేదు, నిజానికిది వెనకటి కాలం కానేకాదు, అంతగా వానలు లేవు, చలి కూడా అంతే. ఉన్నదంతా ఎండాకాలమే.
భౌతికదూరం పాటిస్తూ ఇంట్లోనే ఉండండి, వైద్యులు చెప్పే జాగ్రత్తలూ తీసుకోండి, స్వీయనిర్బంధం లో ఉండండి, మీకు నచ్చిన, వ్యాపకంతో కాలక్షేపం చేయండి,
"రక్కసి" ని తరిమేయడానికి
మీరూ యోధులై ప్రచ్ఛన్నయుద్ధం చేయండి,
ఎందుకంటే,...
ఇది "కరోనాకాలం".
*******@@@*******
ఈ నా స్వీయరచన అముద్రిత0.
6. ముడుంబ
తిరువేంకటాచార్యులు, వరంగల్.
01-07-2020.
(96) ఇది కరోనాకాలం.
ఎండాకాలం ధాటికి ఏ సీ గదిలోంచి బయటికి రాలేకపోయామని
గుర్తుచేసుకునే
అవసరం లేదు, వానాకాలం వానలకు ముఖ్యమైన పనులకోసం కూడా బయటకు వెళ్ళలేక పోయామని బాధపడే అవసరం లేదు, శీతాకాలం చలిపులికి భయపడి బద్దకించి దుప్పటి ముసుగువేసుకు పడుకుంటామేమోనని ఇప్పటినుండే ఆలోచించే పని లేదు, నిజానికిది వెనకటి కాలం కానేకాదు, అంతగా వానలు లేవు, చలి కూడా అంతే. ఉన్నదంతా ఎండాకాలమే.
భౌతికదూరం పాటిస్తూ ఇంట్లోనే ఉండండి, వైద్యులు చెప్పే జాగ్రత్తలూ తీసుకోండి, స్వీయనిర్బంధం లో ఉండండి, మీకు నచ్చిన, వ్యాపకంతో కాలక్షేపం చేయండి,
"రక్కసి" ని తరిమేయడానికి
మీరూ యోధులై ప్రచ్ఛన్నయుద్ధం చేయండి,
ఎందుకంటే,...
ఇది "కరోనాకాలం".
*******@@@*******
ఈ నా స్వీయరచన అముద్రిత0.
97
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ
తిరువేంకటాచార్యులు, వరంగల్. 01-08-2020.
(97) నీ జీవితం నీదే.
తమ సంతానం చక్కగా ఎదిగి, ప్రయోజకులవ్వాలని కన్నవారి ఆశ,
ఆ తరువాత వారిని
ఓ ఇంటివాళ్ళను చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని తపన, ఏది చేసినా పెద్దలు
మన మంచికే చేస్తారని నమ్మకం సంతానానికి.
ఇదంతా గతం, ఇప్పుడంతా
స్వతంత్ర ఆలోచనల యుగం,
ఎవరి నిర్ణయాలు వారివి, కన్నవారే పరాధీనులు, సంతానం ఎలా చెబితే అలా చేయాలి,
ఏమైనా అంటే ఇది నా జీవితానికి సంబంధించిన విషయం,
మీ జోక్యం వద్దు,
నిజమే నీ జీవితం నీదే, ఆలోచనలు, నిర్ణయాలు కూడా నీవే,
తదుపరి పరిణామాలకు, పర్యవసానాలకు బాద్యత నీదే,
అప్పుడు ఇతరులను నిందించడానికేమీ ఉండదు,
ఎందుకంటే నీ జీవితం నీది, ...
నీ జీవితమంతా సుఖమయం కావాలని దీవిస్తున్నాం,
ఎందుకంటే
మా సంతానం నీవు.
********@@@*******
ఈ నా స్వీయరచన అము ద్రితము.
98
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ తిరువేంకటాచార్యులు, వరంగల్.
04-08-2020.
(98) ధృతరాష్ట్రుడు.
కళ్లద్దాలు పగిలితేనేమి? కళ్ళు మరీ గుడ్డివి కాదు గదా!
కళ్ళు గుడ్డివైతే మాత్రమేమి?
మనసు గుడ్డిది కాదు కదా!
మరి మనసెప్పుడు గుడ్డిదౌతుంది?
వ్యామోహం అతిశయించినప్పుడు.
వాస్తవాన్ని చూసీ, చూడనట్టు నటించే వాడు,
అసలు వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించని వాడు, నిజమైన గుడ్డివారు.
*******@@@*******
ఈ నా స్వీయరచన అముద్రిత0.
99
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ
తిరువేంకటాచార్యులు, వరంగల్.
04-08-2020.
(99) ఉద్యోగ విరమణ -2.
ఆ రోజుల్లో ఎవరైనా
58 యేళ్లు వచ్చేవరకు ఉద్యోగం చేసి "రిటైర్" ఔతున్నారంటే,
ఆ రోజు స్కూల్లో ఆడంబరం
అంతాఇంతా కాదు, బడిపిల్లలకు ఎక్కడలేని సంతోషం, ఎందుకంటే, ..
ఆ రోజంతా పాఠాలకోసం క్లాస్‌రూం లోనే కూర్చొని ఉండాల్సిన పనిలేదు, బడి ఆవరణంతా ఇష్టారాజ్యంగా కలియదిరగొచ్చు,
ఎంతో కాలంగా తమకు పాఠాలు చెప్పిన సారు/మేడం రిటైర్ అవుతుంటే బడి, వేదిక అలంకరణలో ఉత్సాహంగా పాల్గొనొచ్చు,
సార్/మేడం కోసం గిఫ్టులు, పూలదండలు మొదలైనవి తయారుచేయడంలో తలమునకలై ఉంటారు, టీచర్లు అందరూ సార్‌ను/మేడం ను సాదరంగా వేదికపైకి తీసుకొచ్చి, ప్రత్యేక కుర్చీల్లో కూర్చోపెట్టి సన్మానిస్తారు, ఆ తరువాత తరగతులవారీగా విద్యార్థులు తాము చేసిన పూలదండలు, గిఫ్టులు బహూకరిస్తారు,
సార్/మేడం వాళ్ళ బంధువులు, మిత్రులు, తనతో కలిసి పనిచేసిన వేరే స్కూళ్ల టీచర్లు కూడా వచ్చి, సన్మానించి,
సార్/మేడంతో తమకు గల సాన్నిహిత్యం, వారితో పెంచుకున్న అనుబంధం గుర్తు చేసుకుంటారు,
చివరలో సార్/మేడం గారు వృత్తి రీత్యా చేసిన సేవలను కొనియాడుతూ రాసిన సన్మానపత్రం చదువుతారు, ముఖ్యఅతిథి గారి ప్రసంగం తర్వాత "సన్మాన గ్రహీత" ప్రసంగం,
తన జీవితంలో అనుభవాలు,
వృత్తి రీత్యా ఎదురైన సంఘటనలు,
పని చేసిన పాఠశాలలలో పొందిన విజయాలు,... మొదలైన విషయాలెన్నో వేదిక ద్వారా అందరితో పంచుకుంటారు, టీచర్లతో, మిత్రులతో, విద్యార్థులతో ఫోటోలు దిగుతారు,
అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేయించి,
ఆ అనుభూతులను మనసులో నింపుకొని తనకొచ్చిన గిఫ్టులు, శాలువాలు తీసుకొని వెళతారు.
ఇప్పుడంతా తలక్రిందులైంది, రిటైర్మెంట్ తేదీ దగ్గరౌతున్న కొద్దీ మదిలో ఆందోళన, ఈ కరోనా "ఆ" రోజుకల్లా పోతుందా? బడులు తెరుస్తారా? అంతా సవ్యంగా జరుగుతుందా?
లేక ఇంట్లోనే ఉండి
రిటైరై పోవలసి వస్తుందా? ఈ మాయదారి మహమ్మారి ఇప్పుడే విజృంభించాలా?
ఈ టైంలో రిటైర్ ఔతున్నవారిని చూస్తుంటే,
ఇంతకాలం సర్వీస్ చేసి, ఇంత నిస్సారంగా ఉద్యోగం ముగించాల్సి వస్తున్నందుకు ఎంతబాధపడుతున్నారో కదా! ఆ వేడుకలు లేవు, హడావిడి లేదు,
అందరూ తనను ప్రశంసిస్తుంటే ఒక్కసారైనా వినాలని ఎవరికుండదు? "సన్మానపత్రం"లో
తనను పొగుడుతూ ఉపయోగించిన పదాలు మళ్లీ మళ్లీ చదువుకొని ఆనందించడం ఎంత తృప్తిగా ఉంటుంది? ఇవేవీ లేకుండా
ఇంట్లో కూర్చుని రిటైరవ్వడమంటే జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనదేదో పోగొట్టుకున్న అసంతృప్తి కొట్టొచ్చినట్టు తెలుస్తుంది.
*******@@@********
ఈ నా స్వీయరచన అముద్రితము. ఋణం
100
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ
తిరువేంకటాచార్యులు, వరంగల్.
05-08-2020.
(100) సెంచరీ - గెలుపు.
సింగిల్స్,
డబుల్స్,
ఫోర్స్,
సిక్సర్స్, ...
ఎన్ని కొట్టామన్నది కాదు, సెంచరీ సాధించడం అనేది ముఖ్యం,
బ్యాటుకు తగిలిందా, గ్లోవ్స్ కు తగిలిందా,
చేతికి తగిలిందా,
హెల్మెట్‌కు తగిలిందా, అని కాదు,
బై స్ వచ్చాయా,
లెగ్ బైసా,
వైడ్సా,
నో బాల్సా
అనేది కూడా కాదు, పరుగులొచ్చాయన్నదే ముఖ్యం,
ఎన్ని పరుగులు చేసామన్నదీ కాదు, గెలుపే ముఖ్యం.
*******@@@******** ఈ నా స్వీయరచన అముద్రితము.
99
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ
తిరువేంకటాచార్యులు, వరంగల్.
04-08-2020.
(99) ఉద్యోగ విరమణ -2.
ఆ రోజుల్లో ఎవరైనా
58 యేళ్లు వచ్చేవరకు ఉద్యోగం చేసి "రిటైర్" ఔతున్నారంటే,
ఆ రోజు స్కూల్లో ఆడంబరం
అంతాఇంతా కాదు, బడిపిల్లలకు ఎక్కడలేని సంతోషం, ఎందుకంటే, ..
ఆ రోజంతా పాఠాలకోసం క్లాస్‌రూం లోనే కూర్చొని ఉండాల్సిన పనిలేదు, బడి ఆవరణంతా ఇష్టారాజ్యంగా కలియదిరగొచ్చు,
ఎంతో కాలంగా తమకు పాఠాలు చెప్పిన సారు/మేడం రిటైర్ అవుతుంటే బడి, వేదిక అలంకరణలో ఉత్సాహంగా పాల్గొనొచ్చు,
సార్/మేడం కోసం గిఫ్టులు, పూలదండలు మొదలైనవి తయారుచేయడంలో తలమునకలై ఉంటారు, టీచర్లు అందరూ సార్‌ను/మేడం ను సాదరంగా వేదికపైకి తీసుకొచ్చి, ప్రత్యేక కుర్చీల్లో కూర్చోపెట్టి సన్మానిస్తారు, ఆ తరువాత తరగతులవారీగా విద్యార్థులు తాము చేసిన పూలదండలు, గిఫ్టులు బహూకరిస్తారు,
సార్/మేడం వాళ్ళ బంధువులు, మిత్రులు, తనతో కలిసి పనిచేసిన వేరే స్కూళ్ల టీచర్లు కూడా వచ్చి, సన్మానించి,
సార్/మేడంతో తమకు గల సాన్నిహిత్యం, వారితో పెంచుకున్న అనుబంధం గుర్తు చేసుకుంటారు,
చివరలో సార్/మేడం గారు వృత్తి రీత్యా చేసిన సేవలను కొనియాడుతూ రాసిన సన్మానపత్రం చదువుతారు, ముఖ్యఅతిథి గారి ప్రసంగం తర్వాత "సన్మాన గ్రహీత" ప్రసంగం,
తన జీవితంలో అనుభవాలు,
వృత్తి రీత్యా ఎదురైన సంఘటనలు,
పని చేసిన పాఠశాలలలో పొందిన విజయాలు,... మొదలైన విషయాలెన్నో వేదిక ద్వారా అందరితో పంచుకుంటారు, టీచర్లతో, మిత్రులతో, విద్యార్థులతో ఫోటోలు దిగుతారు,
అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేయించి,
ఆ అనుభూతులను మనసులో నింపుకొని తనకొచ్చిన గిఫ్టులు, శాలువాలు తీసుకొని వెళతారు.
ఇప్పుడంతా తలక్రిందులైంది, రిటైర్మెంట్ తేదీ దగ్గరౌతున్న కొద్దీ మదిలో ఆందోళన, ఈ కరోనా "ఆ" రోజుకల్లా పోతుందా? బడులు తెరుస్తారా? అంతా సవ్యంగా జరుగుతుందా?
లేక ఇంట్లోనే ఉండి
రిటైరై పోవలసి వస్తుందా? ఈ మాయదారి మహమ్మారి ఇప్పుడే విజృంభించాలా?
ఈ టైంలో రిటైర్ ఔతున్నవారిని చూస్తుంటే,
ఇంతకాలం సర్వీస్ చేసి, ఇంత నిస్సారంగా ఉద్యోగం ముగించాల్సి వస్తున్నందుకు ఎంతబాధపడుతున్నారో కదా! ఆ వేడుకలు లేవు, హడావిడి లేదు,
అందరూ తనను ప్రశంసిస్తుంటే ఒక్కసారైనా వినాలని ఎవరికుండదు? "సన్మానపత్రం"లో
తనను పొగుడుతూ ఉపయోగించిన పదాలు మళ్లీ మళ్లీ చదువుకొని ఆనందించడం ఎంత తృప్తిగా ఉంటుంది? ఇవేవీ లేకుండా
ఇంట్లో కూర్చుని రిటైరవ్వడమంటే జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనదేదో పోగొట్టుకున్న అసంతృప్తి కొట్టొచ్చినట్టు తెలుస్తుంది.
*******@@@********
ఈ నా స్వీయరచన అముద్రితము. ఋణం
100
వీరాస్ కవిసమయం,
6. ముడుంబ
తిరువేంకటాచార్యులు, వరంగల్.
05-08-2020.
(100) సెంచరీ - గెలుపు.
సింగిల్స్,
డబుల్స్,
ఫోర్స్,
సిక్సర్స్, ...
ఎన్ని కొట్టామన్నది కాదు, సెంచరీ సాధించడం అనేది ముఖ్యం,
బ్యాటుకు తగిలిందా, గ్లోవ్స్ కు తగిలిందా,
చేతికి తగిలిందా,
హెల్మెట్‌కు తగిలిందా, అని కాదు,
బై స్ వచ్చాయా,
లెగ్ బైసా,
వైడ్సా,
నో బాల్సా
అనేది కూడా కాదు, పరుగులొచ్చాయన్నదే ముఖ్యం,
ఎన్ని పరుగులు చేసామన్నదీ కాదు, గెలుపే ముఖ్యం.
*******@@@******** ఈ నా స్వీయరచన అముద్రితము.


This comment has been removed by the author.
ReplyDelete