Posts

Showing posts from April, 2021

అనామికా శతకం విట్టుబాబు గారు

Image
  అనామికా శతకం రచన విట్టుబాబు గారు రోజు రెండు పద్యాల చొప్పున కవితా గానం సమూహం లో పోస్ట్ చేయబడుతున్నవి ************* శ్రీలఁ గురిపింౘు మురిపింౘుఁ జెలిమిఁ బంౘు నడిగినప్పుడె చెప్పిన యట్టిమాట! ఫలితమేదైన భరియింపఁ దలచినాడ నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౧ నిర్గుణుండని యందుము నిలుపువాని కోహమని సృష్టికర్త సంకోచపడడె యహము లేకున్నచో పుట్టదిహము కూడ! యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౨ తనకుఁ దోచిన యట్టులే తరులు గిరులుఁ దనకుఁ దోచిన దంతయుఁ దగవు సొబగుఁ దనకుఁ దోచిన ధర్మమే మనువు ౘనవు నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౩ మునిగితేలుట ముచ్చట లనుట కనుట యనిన దానిని పదుగుర కంపుకొనుట వలను చిక్కుట మురియుట బలపరౘుట యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౪ పగలు రాతిరి లేదట పగల వగల చెలగి వారల వీరల వెలుగు తెరల పొరల పొరలుౘు నుండును మరల మరల నడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౫ నదుల కానకట్టలు గట్టి నగము తొలిచి పశుల నాడించి క్రీడించి పరవశించి వాడుకొందురు సర్వమ్ము పాప మనక యడుగకున్నను జెప్పెద నవని తెఱఁగు! ౬ మేటి నుడులందుఁ బ్రవచింత్రు మేళ్ళు గొనుచుఁ గూటికై కుత్సితములందుఁ గూరుకొంద్రు చెప్పుటకుఁ జేతలకు భేదసిద్ధి యిదియ...

ప్లవనామ ఉగాది 2021

నిర్వహణ: శివునూరి లలితాకృష్ణ ************ నిర్వహణ: వీరా గుడిపల్లి  శివునూరి లలితాకృష్ణ ************ కవి వరుల జాబితా ఇప్పటివరకూ.... 1.కొప్పుల ప్రసాద్ గారు 2.నల్లి సాయిబాబు తెలుగు  అధ్యాపకులు  3.రాథోడ్ శ్రావణ్ గారు 4.వలిపే సత్యనీలిమ గారు 5.పేరు:కొలచన విజయ భారతి గారు 6.తాతపూడి సోమశేఖరశర్మ గారు 7. శిరీష.వింజరపు   గారు 8.డా.సయ్యద్ సమీపాన పర్విన్ గారు 9.శివపురపు అనురాధ గారు 10.అన్నాప్రగడ వేంకట నరసింహారావు గారుు 11.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 12.ఉండవిల్లి వెంకట నారాయణ మూర్తి గారు 13.పి.వి.బైరవన్ శర్మ గారు 14.ఉమశేషారావు వైద్య గారు 15.వేమూరి కమలాకర్ సుజాత  గారు 16.క్యాస సంతోష్ కుమార్ గారు 17.బేతి నాగలక్ష్మి గారు 18.లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు 19.పేరు;--డా!!హనీఫ్చంద్ర MD 20.ఇంద్రవత్ రాహుల్ గారు 21.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 22.సంజన కృతజ్ఞ గారు 23.కవిత దాస్యం గారు 24.భరద్వాజ గారు 25.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 26.చేబియ్యం శ్రీనివాసరావు గారు 27.ఆపరాజిత్ గారు 28.ప్రమోద మునిమడుగు గారు 29.తిప్పావఝల నరసింహమూర్తి 30.బాసరాజు యాదగిరి గారు 31గొర్రెపాటి శ్రీను గారు 32.నారు...