ప్లవనామ ఉగాది 2021

నిర్వహణ: శివునూరి లలితాకృష్ణ

************

నిర్వహణ:

వీరా గుడిపల్లి 

శివునూరి లలితాకృష్ణ


************

కవి వరుల జాబితా

ఇప్పటివరకూ....


1.కొప్పుల ప్రసాద్ గారు

2.నల్లి సాయిబాబు తెలుగు  అధ్యాపకులు 

3.రాథోడ్ శ్రావణ్ గారు

4.వలిపే సత్యనీలిమ గారు

5.పేరు:కొలచన విజయ భారతి గారు

6.తాతపూడి సోమశేఖరశర్మ గారు

7. శిరీష.వింజరపు   గారు

8.డా.సయ్యద్ సమీపాన పర్విన్ గారు

9.శివపురపు అనురాధ గారు

10.అన్నాప్రగడ వేంకట నరసింహారావు గారుు

11.గాజుల భారతీ శ్రీనివాస్ గారు

12.ఉండవిల్లి వెంకట నారాయణ మూర్తి గారు

13.పి.వి.బైరవన్ శర్మ గారు

14.ఉమశేషారావు వైద్య గారు

15.వేమూరి కమలాకర్ సుజాత  గారు

16.క్యాస సంతోష్ కుమార్ గారు

17.బేతి నాగలక్ష్మి గారు

18.లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు

19.పేరు;--డా!!హనీఫ్చంద్ర MD

20.ఇంద్రవత్ రాహుల్ గారు

21.ఆళ్ళ నాగేశ్వరరావు గారు

22.సంజన కృతజ్ఞ గారు

23.కవిత దాస్యం గారు

24.భరద్వాజ గారు

25.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు

26.చేబియ్యం శ్రీనివాసరావు గారు

27.ఆపరాజిత్ గారు

28.ప్రమోద మునిమడుగు గారు

29.తిప్పావఝల నరసింహమూర్తి

30.బాసరాజు యాదగిరి గారు

31గొర్రెపాటి శ్రీను గారు

32.నారు మంచి వాణి ప్రభాకరి గారు

33.డాక్టర్. బల్లూరి ఉమాదేవి గారు

34. వురిమళ్ళ సునందగారు

35. వినీల దుర్గ గారు

36. మహేందర్ జవ్వాజి గారు

37. ఖలీమ్ పాషా గారు

38. కె. సి. నరసయ్య గారు

39. వడ్డి సుధాకర్ గారు

40..పోచంసుజాత గారు

41. మన్నె పిన్నక లలిత గారు

42. జోగు కృష్ణయ్య గారు

43. తూపురాణి వేంకటకృష్ణమాచార్యులు గారు

44. వై. రమ్య గారు

45. వేదాంతం విశ్వప్రసాద్ గారు

46. చిన్నెల్లి యాదయ్య గారు

47. షేక్ రహీమ్ సాహెబ్ గారు

48. వనపర్తి గంగాధర్ గారు

49. ఆనం ఆశ్రిత రెడ్డి గారు

50. గుండ్ల రాజు గారు

51. జ్ఞాన ప్రసూనశర్మ గారు

52. భార్గవరామ్ గారు

53. కందూరి సుజాతా రాణి గారు

54. పి. సుష్మ గారు

55. ముడుంబ తిరువేంకటాచార్యులు గారు

56. మర్రి జయశ్రీ గారు

.................

***

*************

 [08/04, 5:50 PM] 

ప్రకటన

 ✴️✴️✴️✴️✴️✴️✴️✴️

సమూహసభ్యులకు

శుభసాయంత్రం

*ప్లవనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని*

పురస్కరించుకుని


 *వీరాస్ కవిసమయం*

కవితలకు ఆహ్వానం పలుకుతుంది.


కవితలు పంపిన ప్రతీ ఒక్కరికీ  ప్రశంసా పత్రం  అందజేయబడుతుంది 

కవిత 


1. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని  రాసినదై ఉండాలి.


2. తమ స్వంత రచనగా హామీ పత్రం తప్పక జతపరచాలి 


3.మన సమూహం కోసం మాత్రమే రాసినదై ఉండాలి.

ఎక్కడా పోస్ట్ చేయకూడదు.


4. పేరు, గ్రామం,జిల్లా, కవితతో పాటు ఫోటో పంపించవలెను


*చివరి తేదీ : 11ఏప్రిల్,2021*


గమనిక :ఎలాంటి ఇతర సందేశాలు ఫోటోలు ఆడియోలు వీడియోలు

యూ ట్యూబ్ లింక్ లు పంపకూడదు.

ఉగాది కవితలు మాత్రమే 

పంపవలెను.


************వీరాగుడిపల్లి 

                     లలితాకృష్ణ


✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

1

[08/04, 5:51 PM] 

Koppula Prasad Poet: పేరు:కొప్పుల ప్రసాద్

ఊరు:నంద్యాల

జిల్లా: కర్నూల్

సెల్:9885066235

శీర్షిక:నవ వసంతం వచ్చే...


సృష్టికి నవ వసంతము వచ్చేను

నూతన తేజోమయ యశస్సుతో

రాలిన ఆకులు చిగురించి

కొత్త శోభను అలంకరించుకుని...


ప్రకృతి పచ్చగా వికసించెను

భూమాత బంగారు చీర ధరించెను

వసంతుడికి ఆహ్వానం పలుకుతు

కొత్త వస్త్రాలతో ముస్తాబయ్యే..


తెలుగువారికి తొలిరోజు

సృష్టికి మొదలయ్యే ఆదిరోజు

పండగ పరమాన్నం పంచెను

హృదయంలో అమృతము నిండెను..


ఆరు రుచుల మానవ జీవితం

నిత్య ఆనంద భరితం

వైవిధ్యమైన బ్రతుకు ప్రయాణం

సాగిపోవడమే మనిషి ప్రమాణం


లేత చిగురాకుల చెట్టుపై

కూనిరాగాలు కోయిలమ్మ

కొత్త రాగాలు ఆలపించే

ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం పలికే..


మామిడికాయల రుచులు మాని

మధుర ఫలములు మకరందమును

జివ్వ ఆస్వాదించేందుకు ఎదురుచూసే

చిలుకమ్మ పలుకుల్లో మధురు ద్రవించే..


హామీ పత్రం: ఈ కవిత నా స్వీయ రచన,దేనికి అనుకరణ కాదు . సమూహం కొసం

మాత్రమే  రాసిన...

కొప్పుల ప్రసాద్,

నంద్యాల

2

[08/04, 5:52 PM] +91 99084 54667: 

శ్రీ ప్లవనామ  ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని   వీరాస్ కవిసమయం వారికి 

ఉగాది కవితల పోటీ కొరకు 


పేరు:  నల్లి.సాయిబాబు తెలుగు  అధ్యాపకులు 

ఊరు:  సీతారాంపురం 


కవితా శీర్షిక  : తెలుగు   వారి నూతన పండుగ "ఉగాది "


వసంత రుతువు వచ్చింది 

కొంగ్రొత్త చైతన్యం తెచ్చింది 

శ్రీ ప్లవనామ  సంవత్సరం 

చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చింది 

ఆరోజే నూతన పనులకు శ్రీకారం 

నల్లని కోయిలమ్మ నవీన రాగాలతో 

ఉగాదికి స్వాగతం పలుకుతోంది 

లేలేత చిగుళ్లతో చెట్లు నాట్యమాడుతున్నాయి 

ప్రకృతితన సోయగాలతో శోభిస్తుంది 

తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలను తెలుపు తుంది 

తరువులు తెలుపు తున్నాయి ఆనంద హేలలు 

పుడమి తల్లి పచ్చని మైదానాలతో మెరుస్తున్నది

భానుడి కిరణాలతో కలువలు తమ పూలరేకులను విప్పాయి 

మల్లెల గుబాళింపుతో ప్రకృతి 

పరవ శించి పోతుంది  

మామిడి పూత పిందెలు గా పక్వపు కాయలుగా మారతాయి 

మనిషి మేధస్సు ఈ నాటికీ పిందె గానే ఉంది 

జ్ఞానం ఉన్న మనిషికి ప్రాంతీయ భేదాలు 

ఈ రోజే ఈర్ష్య ద్వేషాలను విడిచి మంచిని ఆస్వాదిద్దాం 

అన్ని రుచుల పచ్చడి ని ఈరోజే ఆస్వాదిద్దాం 

కుల మత విద్వేషాలు మరువాలి

భావితరాల వారి కి పండుగల వైశిష్ట్యం తెలుపుదాం

  

ఈ కవిత నాసొంత రచన అని హామీ ఇస్తున్నాను 

రచన : నల్లి.సాయిబాబు తెలుగు అధ్యాపకులు సీతారాంపురం నరసాపురం మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ 

చరవాణి -9908454667


 కవి పేరు: నల్లి.సాయిబాబు తెలుగు అధ్యాపకులు సీతారాంపురం నరసాపురం మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ -534280

చరవాణి -8500144889

3

[08/04, 5:59 PM] +91 94914 67715: 

*ప్లవనామ ఉగాది వచన  కవిత ముత్యాలహారం నూతన  కవిత ప్రక్రియలో*

వీ రా స్ ఉగాది కవి‌ సమ్మేళనం కొరకు

ఈవీవీ

ఉగాది పచ్చడి రుచులు

కొత్తగ  వచ్చేపూతలు

వచ్చే పండ్లు కాయలు

ప్రకృతి కొత్త లక్షణాలు


ఉగాది పంచాంగాలు

రోజున కొత్త బట్టలు

మధురమైన క్షణాలు

పులకరించే స్నేహాలు


ఉగాది శుభాకాంక్షలు

ఆత్మియానుబంధాలు

మదిన ఆనందక్షణాలు

అందమైన దృశ్యాలు 


కోయిల కుహు రాగాలు

కొత్త చిగురుల ఆశలు

పులకరించె భావాలు

వసంత రంగు వల్లులు


ఇంటికి అలంకారాలు

పెట్టెను నుదుటన బొట్టులు

సాంప్రదాయ దుస్తులు

కళకళలాడే యువతులు


ఉగాదిన పంచాంగాలు

దర్శన దేవాలయాలు

కలిగెను పుణ్యఫలాలు

ఇది గ్రహాల ఫలితాలు

 

మధురమైన క్షణాలు

పులకరించే స్నేహాలు

భగవంతుని పూజలు

పోందేను దివ్వెనలు


*రాథోడ్ శ్రావణ్*

*ఉసావే పూర్వ అధ్యక్షులు*

*ముత్యాలహారం రూపకర్త*

*ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా*9491467715

r.sravan21@gmail.com

4

[08/04, 6:06 PM] 

కె. సత్యనీలిమ 


వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: వీరాస్ కవిసమయం

పేరు:వలిపే సత్యనీలిమ

ఊరు:వనపర్తి

మండలం:వనపర్తి

జిల్లా:వనపర్తి

*శీర్షిక:ఉగాది*


ప్లవనామ సంవత్సరం

కావాలా నందకరం

ఉన్న దోషాలన్నిటిని

చేయాలిక సంహారం


మన ఉగాది పర్వదినం

షడ్రుచుల సమ్మేళనం

ప్రతిమనిషి  ఎదుగుటకు

అందించును విజ్ఞానం


మామిడి తోరణాలు

కోయిలమ్మ పాటలు

అంబరాన్నంటేవి

ఉగాది సంబరాలు


కరోనా వైరసంట

కొత్తగా వచ్చెనంట

ఉగాది సంబరాలను

దూరం చేసేనంట


హామీ పత్రము:ఈకవిత నాస్వీయరచన. ఎవరిని అనుకరించలేదు.

5

[08/04, 6:36 PM]

 కొలచన విజయ భారతి Poetess: 

"ప్లవ " ఉగాదిని పురస్కరించుకుని ఉగాది కవితల పోటీ కోసం



పేరు:కొలచన విజయ భారతి

ఊరు:హైదరాబాద్

రంగారెడ్డి జిల్లా

****************

    శీర్షిక: ఉగాది హేల

    ******************

ఎన్నో ఆనందాలను హరించి

శిశిరాలు రాల్చిన శార్వరి

తరలి వెళ్ళింది


కొత్త  ఆశల పల్లవుల తొడుక్కొని "ప్లవ"తరలి వచ్చింది

గున్న మామిడి గుబురుల

దాగిన ఎల కోయిల

కుహు కుహు రాగాలతో

వసంతాన్ని పిలుచుకొచ్చింది


తెలుగింటి లోగిళ్ళన్నీ

మావి కొమ్మల తోరణాలు

గుమ్మాల తగిలించుకుని

కొత్త ఉగాదికి స్వాగతం పలికాయి


వేప పూత, మామిడి కాయ

కొత్త చింతపండు,బెల్లం ముక్క

మిరపకాయ ,ఉప్పు కల్లు కలిసికట్టుగా చేరి తీపి,పులుపు, ఉప్పు,కారం,వగరు,చేదు, కలయికగా చేరి

ఉగాది పచ్చడిగా ఒదిగి పోయి

జీవితం షడ్రుచుల సమ్మేళనమే

అని తెలియ చెప్పాయి


వేద పండిత  గోష్ఠులు, పంచాంగ శ్రవణాలు

పెళ్ళి ముహూర్తపు సంబరాలతో

కొత్త సంవత్సరపు  ఆనందోత్సవాల్ని

తరలించుకు రమ్మని

ప్రతి హృదయం

ప్లవ ఉగాదిని వేడుకుంది

      ☘️☘️☘️☘️☘️


హామీ పత్రం:

ఈ కవిత రచన పూర్తిగా నా స్వంతమేనని దేనికీ అనువాదం, అనుసరణ, అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను

        ధన్యవాదాలు

6

[08/04, 6:38 PM] +91 83280 79336:

 శీర్షిక.. ఉగాది 

కవిత.. తెలుగింటి తొలిపండుగ 

తాతపూడి సోమశేఖర శర్మ 

యానాం, పాండిచేరి 

చరవాణి.. 8328079336

***********************

తెలుగింటి  తొలి పండుగ 

ఉగాది మన ప్రియపండుగ 


వెచ్చనిఎండలో పురుడు పోసుకుని 

పచ్చని పండుగలా వస్తుంది ఉగాదిపండుగ.... 


భూమాతవళ్ళంతా చిలకాకుపచ్చ చీరలతో... 

నిండుగా పచ్చపరుపు పరచినట్లు 

ఉంటుందీ పండుగ 


మామిడిపిందెలసందుల్లో పరవశించి 

పాడుతూ.... 

ఊయలలూగే కోయిల రూపంలో 

కనిపిస్తుందీ పండుగ 


వేపపువ్వు అందాలతో ప్రకృతి సాక్షిగా 

క్రొత్త బంగారు లోకానికి స్వాగత 

మిస్తున్నట్లుందీ పండుగ....


కలిమిలేములు కష్టసుఖాలుసైతం 

కలిసుండాలిని... 

షడ్ రుచులపచ్చడి రుచిచూపుతుందీ 

పండుగ 


శార్వరిలోనికష్టాలను శాంభవీమాతతీరుస్తూ 

ప్లవనామ సంవత్సరంమనకు 

పండువెన్నెలలా చల్లగాసంతోషంగా 

ఆయురారోగ్యంగా ఉంచికాపాడమని  మనసారా ప్లవపార్వతిని కోరుతూ 

కొత్త ఉగాదికి కొత్తదనాల స్వాగతం 

******************************


ఈ కవిత నా స్వీయ రచన అని  హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం, 8328079336

7

[08/04, 7:25 PM] +91 91545 04539: పేరు:శిరీష.వింజరపు                  ఊరు:చీపురుపల్లి.            మండలం:చీపురుపల్లి.          జిల్లా:విజయనగరం.         శీర్షిక:ఉగాది పండుగ.              కవిత: నూతన సొబగులు అద్దుకున్న ఉగాది.... కాల్చే కార్చిచ్చు లాంటి కరోనాను దాటుకుంటూ వచ్చింది ఉగాది.... బడుగుజీవుల జీవితంలో ఉప్పెనై వచ్చింది....  వలసకూలీల బ్రతుకులలో పూత పూసిన ఉగాది.... చేదు నిజాలను దాట వేసి కొత్తబెల్లం రుచులను తెచ్చింది.... వగరు మన జీవితాలలో సహజమని కొత్త చిగురు తొడగమని చెప్పింది.... తీపి కబురును మోసుకొచ్చెను టీకా రూపంలో.... పులుపు గలసిన బ్రతుకులలో.... కారమంటిన మనసులలో మమకారమును తట్టి లేపినది ఉగాది....షడ్రుచుల సంగమమైనది ఉగాది...     హామీ పత్రం:ఈ కవిత నా స్వీయారచన.ఎవరిని అనుకరించలేదు,ఏ సమూహములో కూడా పెట్టలేదు.

8

[08/04, 7:44 PM] +91 99082 48734: 

ఉగాది కవితల పోటీకి


డాక్టర్ సయ్యద్ 

సమీనా పర్వీన్

ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

ఉగాది కవితల పోటీకి


కవిత శీర్షిక


ఓ ప్లవ నామ ఉగాది


ఉగాది అంటే ఉషస్సులు వసంతాలు


పంచాంగ శ్రవణాలు


షడ్రుచుల ఉగాది పచ్చడి 


ఈ ఉగాది పండుగ కు ప్రత్యేకం


ఇది తెలుగువారి కొత్త సంవత్సరం పండుగ


తీపి జ్ఞాపకాల ముత్యాలను పోస్తూ


చేదు గుర్తులు లాంటి ఓటమి ముఖచిత్రాన్ని చెరిపేస్తూ


పొగరు అనే వర్గ వైషమ్యాలు సంకుచిత భావాలకు కత్తెర 


వే టు ల


క్రూరత్వం ఇటుకలతో నిర్మితమైనది కారమనే అహంకార కోటను అమాంతంగా పటాపంచలు చేస్తూ


పులుపు అనే ప్రేమ లాంటి పిలుపుతో




ఉప్పు అనే ఉత్తేజం విచ్చేసిన



ప్లవ నామ ఉగాది కి


శతకోటి హారతులతో స్వాగతం సుస్వాగతం


సహజమైన ప్రకృతి పరమైన పండుగ ఇది


మానవాళి లో నూతన ఉత్సాహాన్ని 




పెంచే శుభదినం ఈ పండుగ


నీ రాకతో 


చెట్లన్ని చిగురించాయి


పక్షుల కిలకిల రావాలతో


కోయిలమ్మ కుహు కుహు రాగాలతో


చిలుకమ్మ చిలుక పలుకుల తో


భారతీయులందరూ ఆనందంగా ఉన్నారు


మా జీవితాలలో కూడా నూతన ఉత్సాహం సిరిసంపదలు జ్ఞాన వివేక పేరు ప్రతిష్ఠలు ప్రసాదించు ఆశీర్వదించు


ఓ 


ఉగాది అమ్మ


భవిష్యత్ అంతా


భవ్యంగా


రమ్యంగా


నవ్యంగా


ఉండేలా నీ నిండు దీవెనలతో మాకు తోడై ఉండు


ఉగాది అమ్మ



హామీ పత్రం


ఇది నా సొంత రచన




కరీంనగర్


9908248734

9

[08/04, 7:54 PM] +91 97043 33150:

 పేరు : శివపురపు అనురాధ 

గ్రామం: మియాపుర్ 

ఊరు: హైదరాబాద్

కవితా శీర్షిక: ఉగాది

తేదీ :- 8--04-2019


గున్నమామిడి

కొమ్మల మధ్యన దాగి

మామిడి రుచులు

ఆస్వాదిస్తూ,

కోకిల కుహూ కుహూ

మధుర రాగాలు

ఆలపించే వేళ......


ఉగాది పండుగ రానే వచ్చింది

కొత్త జీవితానికి చిగురులు వేస్తూ

స్వాగతాలు పలుకుతూ....


షడ్రుచుల పచ్చడిలో

జీవిత మధురిమలు

షడ్రుచులతో

కలబోసినట్లు

చెరుకు రసాల మధురిమలు తో

వేపపూల చేదుతో

మామిడి పులుపుతో

కలబోసి ఔషదమే (అమృతం)

ఉగాదిపచ్చడి...


హామీ పత్రము:

ఈ రచన నా  స్వకీయం, దేనికి అనువాదము కానీ, అనుసరణ కానీ, వేరే ఏ వెబ్సైట్లు పత్రికల్లో కానీ ప్రచురింపబడలేదు

10

[08/04, 8:00 PM] +91 93900 99056: పేరు.. అన్నాప్రగడ వేంకట నరసింహారావు

(ఉగాది కవిత)


అంశం...యుగాది

శీర్షిక.. జాతకఫలాలు


దిగులుచెందకు దిగులుచెందకు నీ జాతకం సరిలేదని..

ఆదాయం సరిలేదని, వ్యయము హెచ్చు వుండునని..


రావి ఆకుకు శ్రీకారం అద్ది పూజచేయగా..

శివుని చెంత ఉంచిన గుప్పెడు బియ్యము ధనరాశి చెంత నుంచగా...

భాగ్యలక్ష్మి ధనయంత్రపూజ చేయగా..

తల్లి ధనధాన్య లక్ష్మి చల్లంగా చూడదా...


దిగులుచెందకు దిగులుచెందకు నీ జాతకం సరిలేదని..

పూజ్యము అల్పమని,అవమానము అధికమని..


అన్ని బాధలు,అనుభూతులు అనుభవాలేగా...

చేదును చేరతీసేది,

జిల్లన్నను పుల్లందనాన్ని ఆస్వాదించేది...

కొంచం కారం,  కొంచం ఉప్పు, కొంచం మాధుర్యాన్ని జోడిస్తున్నది...

వగరుకూ తిరుగులేదని నమ్ముతున్నది,

షడ్రుచులను కలబోసి స్వీకరిస్తున్నది...


దిగులుచెందకు దిగులుచెందకు నీ జాతకం సరిలేదని...


వసంత ఋతువు వచ్చేవేళ...

మామిచిగురు పూచేవేళ...

కోకిలగానం వినిపించే వేళ...

పూవులు విరివిగా పూచేవేళ...

చిరునవ్వులు చిందిస్తూ జీవించేవేళ...

నూతన వత్సర ఆరంభపు వేళ...


దిగులుచెందకు దిగులుచెందకు నీ జాతకం సరిలేదని దిగులుచెందకు...


✒అన్నాప్రగడ వేంకట నరసింహారావు

గుంటూరు

హామీ పత్రం..ఈ కవిత స్వీయ రచన.దేనికి అనువాదము,అనుకరణ కాదు

11


[08/04, 8:06 PM] Gajula Bharati KS 20: ఉగాది పండుగ కవిత పోటీ కొరకు


పేరు:గాజుల భారతి శ్రీనివాస్

ఊరు:ఖమ్మం

జిల్లా:ఖమ్మం

చరవాణీ: 9849788108


 శీర్షిక: నవక్రాంతి



శర్వారి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ

ప్లవనామ వత్సరానికి సుస్వాగతం పలుకుతూ

ఆనంద వసంతోత్సవాలలో

సరదాలు,సంతోషాలలో తేలియాడుతూ

సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన

ముచ్చటైన పర్వదినం

తొలితెలుగు పండుగ

మన ఆది..ఉగాది శుభదినం

ఇల్లంతా చిన్నా, పెద్ద కొలహాలలతో

ఘుమ ఘుమలాడే పిండివంటల ఆనందోత్సవాలతో

నిండు ధాన్యగార రాశులతో

ఇంటిముందు రంగవల్లులతో

పసుపు కుంకుమ గడపలతో

ముంగిట్లో మామిడి తోరణాలతో

కోయిలా గానాలతో

షడ్రుచుల ఆస్వాదనలతో

పంచంగాల పలకరింపులతో

ఆనంద ఆలింగనాలతో

స్వాంతనలేని జీవితాలలో

సంతోషసాగరంలో నింపే

తెలుగువారి కొత్త సంవత్సర వేడుక రావాలని

ఉషోదయపు ఉషస్సులు తేవాలని

ప్రతీ ఇల్లు ఆనంద హరివిల్లులతో వెల్లివిరియాలని

ప్రతీ మది, హృది

తెలుగువారి ఆది..ఉగాదికి మనసారా ఆహ్వానం పలుకుదాం

జగమంతా..జనమంతా ఆనందిద్దాం





***(***********

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.దేనికి అనుకరణ,అనువాదం కాదని హామీ ఇస్తున్నానుు

12


[08/04, 8:07 PM] +91 74166 05529: ✳️✳️✳️✳️✳️✳️

*ఒకరు ఒక్క కవిత మాత్రమే post చేయాలి* 


*ఈ క్రింది ఫార్మాట్ లో మీ మీ కవితలను post చేయగలరు.*

👇 


*Format*


*వీరాస్ కవి సమయం*

*పేరు ః*ఉండవిల్లి వెంకట నారాయణ మూర్తి

*ఊరు ః*విశాఖపట్నం

*మండలం ః*భీమిలి

*జిల్లా ః*విశాఖపట్నం

 

*శీర్షిక ః*ప్లవనామ సంవత్సరం

*కవిత ః

ఒక నటుణ్ణి చూస్తే నటుడిని అవలేదమని


ఒక గాయకుణ్ణి చూస్తే పాటకాణ్నీ ఎందుకవలేదని


ఒక ఆటగాణ్ణి చూసి ఎందుకలా కాలేకపోయేనని


ఒక అద్భుతమైన నాయకుణ్ణి చూసి అయ్యో అలా ఎందుకు కాలేకపోయానని


ఒక బిలియనీర్ ని చూసి ఎందుకు ఆ అవకాశం రాలేదని


ఇలా ఈ ఆశలు ‌షడ్రుచులకన్నా రుచికరమైనవి


మనం చెప్పుకోవాల్సిన ఏడో రుచి అత్యాశే


కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం


మరి శ్రీప్లవనామ సంవత్సరం ఇస్తుందా ఆ భోగం


చూశారా ఇక్కడ కూడా ఆశే...అత్యాశే

-------------------------------------

*హామీ పత్రం:*పైన నేను రాసిన ఉగాది కవిత"ప్లవనామ సంవత్సరం"నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను

*ఫోటో*:





వచన కవిత లైతే

 *పన్నెండు వరుసలు  పైబడి* ,

*ఇరవై నాలుగు  వరుసలు* మించకుండా రాయాలి.

*పద్యాలు లేదా మినీ లైతే* కనీసం *నాలుగు  పద్యాలు తగ్గకుండా,*

 *ఆరు పద్యాలు దాటకుండా రాయాలి*.


✳️✳️✳️✳️✳️✳️

13

[08/04, 8:09 PM] +91 83675 24003: 

విరాస్ కవి సమయం

పేరు - పి.వి.భైరవన్ శర్మ

ఊరు- లింగంపల్లి

జిల్లా- హైదరాబాద్


శీర్షిక- ఉగాది కి స్వాగతం


ప్లవనామ సంవత్రమా  మాకు సిరులు ఇవ్వు

చైత్రమాసపు అందాలు ధాత్రికివ్వు



ఆరు రుచులతో మనిషికి ఆశపోక

స్వార్థమును రుచిమదిగీత వాడిపోయె

డబ్బ డబ్బని జబ్బతో గబ్బుకొట్టి

మమత మానవతను  నేడు మంట గలిపె.


అందుకే " కరోనా" నేడు హడలగొట్టె

మా రజో. తపో. గుణముల మాడ్చివేసి

మనిషి కికనైన మంచిని మమతనిచ్చి

సకలజనుల ఉగాదివై శాంతినిచ్చి

ఓ...ఉగాది రావమ్మ మాకు వరముయ్య..




           పి.వి.భైరవన్ శర్మ

                హైదరాబాద్ సెల్   నెం8367524003.




        * హామీ పత్రము*


ఈ కవిత నా స్వీయరచన ఎక్కడా కాపీగానీ ప్రచురుణ గానీ కాలేదని తమరికి హామీఇస్తున్నాను



       పి.వి.భైరవన్ శర్మ

        హైదరాబాద్

సెల్ నెం- 8367524003

నా ఫోటో👇👇👇👇👇👇👇👇👇👇👇

14

[08/04, 8:17 PM] +91 94404 08080: పేరు. ఉమశేషారావు వైద్య

గ్రామం.లింగాపూర్, కామారెడ్డి మండలం&జిల్లా

తెలంగాణ

సెల్.9440408080

 ఖతం అవ్వాలి

  ఉగాది ఇది తెలుగు వారి అది పండుగ 

చైత్రం లో వచ్చి పాల్గుణం వరకు సాగె ఉగాది

తెలుగు వారి సంస్కృతి సౌరభాలు

రాశి తెలిపే  భవిత పండుగ

 కాలగమనం లో గ్రహాల స్థితులు 

ఆదాయ వ్యయాలు

వాతావరణ స్థితులు

తెలిపే పంచాంగ శ్రావణం

ఊరు దేవతల చుట్టూ తిరిగే ఎడ్ల బండ్ల ప్రదర్శన

ఆరోగ్య సిరి నిచ్చే

షడ్రుచులు పచ్చడి

జీవిత మర్మాన్ని చేదు తీపి

వగరు,పులుపు,ఉప్పు,కారం ల కాలంతో మనిషికి

ఉన్న బంధాన్ని జీవిత గమనం లోస్థితి గతులను

తెలిపే తెలుగు వారి పండుగ

విటమిన్లు ప్రోటీన్లు,కార్బోహైడ్రేట్లు

వంటి వంటలు

మన సంస్కృతే

మనకు శ్రీ రామ రక్ష

వసంతోత్సవాలు కోయిల రాగాల్లో శోభించాలని

కరోనా ను నియమాలతో

నిలువరించి  లక్డౌన్ లేకుండా లాక్ చేద్దాం

ఆంగ్ల సంత్సరాది లో తాగుబోతుల చిందులు తప్ప సంస్కృతి లేదు

సంస్కృతి,ఆరోగ్యం ఇచ్చే

ఉగాది లోని మర్మాన్ని గ్రహిద్దాం

  ఇది పూర్తిగా నా స్వీయారచన అని హామీ ఇస్తున్నాను

15

[08/04, 9:10 PM] Vemuri Kamalaker Sujata: వేమూరి కమలాకర్ సుజాత 

రాజేంద్రనగర్ మండలం 

రంగారెడ్డి జిల్లా 

వచన కవిత ప్రక్రియ

అంశం : షడ్రుచుల ఉగాది  

శీర్షిక  : ప్లవంగ నామ ఉగాది 

-----------------------------------------------

గత వసంతపు శార్వరి నామ ఉగాది కరోనా కాలంగా సర్పమై కాటేసింది/

చేదు అనుభవాలనేన్నింటిన్నో చవి చూపించింది  /   

సంతోషాలకు సరదాల తియ్యద

నాలకు దూరం చేసింది/ 

అన్ని రంగాల్ని అతలాకుతలం చేసి వగరు పుట్టించింది/ 

ప్రాణ భయాల కారు (రం)మంటల్ని

రేకెత్తించింది/

బంధాలు,అనుబంధాల రుచి చూడ

నీయకుండా లవణమోతాదు

నెక్కువేసింది/

ఆర్థిక రంగాన్ని పుల్లబొడిచి కుదిపే

స్తుంది/

లోకం షడ్రుచులలోచనలను హెచ్చు

తగ్గులతో సతమతంలో పడేసింది/  

జీవితాల్ని రసహీనం చేసి గాడి తప్పించింది /

గత కాలపు గాయల్ని రూపు మాపంగా వస్తుంది /

అని లోకమంతా ఈ ఏటి ప్లవంగ నామ ఉగాదికి ఘన స్వాగతం 

పలుకుతుంది /

కోకిల వసంతగానంలో కమ్మని రాగాల్ని పలికిస్తుందని/

కోటి ఆశలతో విశ్వమంతా ఎదురు చూస్తుంది /

షడ్రుచుల సమ్మేళనాలను సమంగా

పంచిస్తుందని/

పంచంగ శ్రవణంలో శుభ ఫలితాలను ప్రకటిస్తుందని/

-----------------------------------------------

హామీ పత్రం  : పై వచన కవిత నా స్వీయరచనలని హామీ ఇస్తున్నాను 

వేమూరి కమలాకర్ సుజాత 

రాజేంద్రనగర్ మండలం 

రంగారెడ్డి జిల్లా 

8801197747

-16

వీరాస్ కవి సమయం


క్యాస సంతోష్ కుమార్

ఖానాపూర్

జిల్లా:నిర్మల్

9441710618


కవిత:ఉగాది పర్వదినం

శీర్షిక: వి"ప్లవ"నామo వర్ధిల్లాలి


యుగానికి ఆది ఉగాది

ఆది నుంచి ఇది సంవత్సరాది

ఉన్న వాడికి ఉగాది

లేనోనికి ఇది శివరాత్రి

పచ్చని మామిడాకులు

విరగబూసిన వేపపూత లు

కమ్మని కోకిల కూతలు

చైత్రమాస సంకేతాలు

మనసు పులకరించే దృశ్యాలు

గతం తాలూకా అనుభూతులు

ఉప్పు తింటే ఉష్ణం

పప్పు తింటే పైత్యం

అన్నట్టు సాగుతున్న జీవితం

ఆది నుంచి తడబడి

సాంకేతికత తిరగబడి

వడి వడి అడుగులు మూలబడి

పొంచి ఉన్న కర్కశ కరోనాపై

ఈ వి"ప్లవ"నామ సంవత్సరంలో

వి"ప్లవ"శంఖం పూరించాలి

అందరి జీవన పయనంలో

ఆనంద ఉగాదులు ఉషస్సుల్లా వెలగాలి

అందరి పంచాంగం

అంగాoగం శ్రవనానందం కావాలి

పచ్చడి షడ్రుచులతో కరోనా చిత్తడి కావాలి

మాస్కుల మాటున దాగిన నవ్వులు

షానీటైసర్ లా శుభ్రత పువ్వులు పూయాలి


         ౼హామీ పత్రం౼

పై ఉగాది కవిత నా స్వంత రచన ఇందు నిమిత్తం రాయడం జరిగింది ఇది ఏలాంటి అనువాదం అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను


క్యాస సంతోష్ కుమార్

ఖానాపూర్


[08/04, 9:12 PM] Vemuri Kamalaker Sujata: వేమూరి కమలాకర్ సుజాత 

రాజేంద్రనగర్ మండలం 

రంగారెడ్డి జిల్లా 

వచన కవిత ప్రక్రియ

అంశం : షడ్రుచుల ఉగాది  

శీర్షిక  : ప్లవంగ నామ ఉగాది 

-----------------------------------------------

గత వసంతపు శార్వరి నామ ఉగాది కరోనా కాలం సర్పమై కాటేసింది/

చేదు అనుభవాలనేన్నింటిన్నో చవి చూపించింది  /   

సంతోషాలకు సరదాల తియ్యద

నాలకు దూరం చేసింది/ 

అన్ని రంగాల్ని అతలాకుతలం చేసి వగరు పుట్టించింది/ 

ప్రాణ భయాల కారు (రం)మంటల్ని

రేకెత్తించింది/

బంధాలు,అనుబంధాల రుచి చూడ

నీయకుండా లవణమోతాదు

నెక్కువేసింది/

ఆర్థిక రంగాన్ని పుల్లబొడిచి కుదిపే

స్తుంది/

లోకం షడ్రుచులలోచనలను హెచ్చు

తగ్గులతో సతమతంలో పడేసింది/  

జీవితాల్ని రసహీనం చేసి గాడి తప్పించింది /

గత కాలపు గాయల్ని రూపు మాపంగా వస్తుంది /

అని లోకమంతా ఈ ఏటి ప్లవంగ నామ ఉగాదికి ఘన స్వాగతం 

పలుకుతుంది /

కోకిల వసంతగానంలో కమ్మని రాగాల్ని పలికిస్తుందని/

కోటి ఆశలతో విశ్వమంతా ఎదురు చూస్తుంది /

షడ్రుచుల సమ్మేళనాలను సమంగా

పంచిస్తుందని/

పంచంగ శ్రవణంలో శుభ ఫలితాలను ప్రకటిస్తుందని/

-----------------------------------------------

హామీ పత్రం  : పై వచన కవిత నా స్వీయరచనలని హామీ ఇస్తున్నాను 

వేమూరి కమలాకర్ సుజాత 

రాజేంద్రనగర్ మండలం 

రంగారెడ్డి జిల్లా 

8801197747

17

[08/04, 9:20 PM] Nagalaxmi Poetess Ks 43: విరాస్  కవిసమయం. 

పేరు. బేతి నాగలక్ష్మి 

ఊరు.ఆలేరు 

మండలం.ఆలేరు  

జిల్లా. యాదాద్రి  

కవిత. ఉగాది 

శీర్షిక. నూతనం 

🌿🌿🌿🌿🌿

🥭🥭🥭🥭🥭


నూతన సంవత్సరానికి స్వాగతం. 

షడ్రుచుల సమ్మేళనం 

తొలకరి చిగురు వసంతం 

మావి చిగురుల తరుణం 

వసంత వనముల హరితం 

పచ్చదనానికి పండుగ పరువం 

వేకువజామున తలస్నానాలు

 నూతన వస్త్రాలంకరణలు 

పూజారాదనలు, మామిడి తోరణాలు 

కొత్త కుండలో ఆరు రుచుల

 మేళవింపుతో ఉగాది పచ్చడి 

బొబ్బట్లు, భక్షాలు తీపి వంటకాలు 

కొత్త ఆవకాయ పచ్చళ్ళు 

పంచాంగ శ్రవణాలు 

ఆ రోజంతా పండగ సందడి మరి 

ఆనంద హేలీ  అందమైన ఆనందమైన ఉగాది.


ఈ కవితా నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. 

ధన్యవాదములు. 🙏🙏

18

[08/04, 9:47 PM] +91 98663 28747: **********************

*వీరాస్ కవి సమయం*

పేరు.. *లక్ష్మీ పద్మజ దుగ్గరాజు*

ఊరు.. *నాగార్జున సాగర్*

జిల్లా.. *నల్గొండ*

అంశం.. *ఉగాది* 

శీర్షిక... *అసమాన ప్లవ*

*************************


శిశిరంలో మోడువారిన చెట్లన్నీ

కొత్త చివురులు తొడిగి

ప్రకృతి కాంత కొత్త అందాలతో

మనసు మురిపించే వసంతం !


విధాత సృష్టి మొదలు పెట్టిన రోజు

యుగానికి మొదటిరోజు

యుగాది ఉగాదిగా పేరొందిన

పరవడిరోజు !


శార్వరిలోని సమస్యలన్నీ

ప్లవ లో పటాపంచలై..

కొత్త ఊహలకు, ఆశలకు

పంచవన్నెల రెక్కలొచ్చి

వినీలాకాశంలో విహంగాలై

ఎగరాలి...

షడ్రుచుల ఉగాది పచ్చడి వోలె

జనజీవనం సాగాలి !


పంచాంగ శ్రవణం వీనుల వినోదం

భవిష్య వాణి కడు రమణీయం 

ఆదాయ, వ్యయాల చిట్టా

ఆర్ధిక ప్రణాళికలకు ఆనకట్ట..

రాజపూజ్యం, అవమానం పట్టిక 

నోటి మంచి, దురుసుతనాల శీర్షిక  !!


 *హామీ పత్రం*

✍️ ఈ కవిత నా స్వీయ రచన,, దేనికి అనువాదం కాదు, ఎక్కడా ప్రచురించబడలేదు.. అని హామీ ఇస్తున్నాను 🙏

19

[08/04, 9:59 PM] +91 96187 33806: #వీరాస్ కవి సమయం.. ఉగాది కవితా పోటీకి

       #పేరు;--డా!!హనీఫ్చంద్ర MD

       #ఊరు:--విజయవాడ(అర్బన్)

       #జిల్లా;---కృష్ణా...

#శీర్షిక;---ఉగ,ఉగల ఉగాది...


#కవిత:---వచ్చింది వచ్చింది ఉగ ఉగల ఉగాది


ప్రకృతి శోభాయమాన వింత వింత వినోదాల

షడ్రుచుల పచ్చని పరికిణీ పైటవేసిమా గడపకు,

ఉగ ఉగల కేరింతలకు సూర్యచంద్రాదులు ఉలిక్కి పడేలా ఊరు ఊరంతా సంతోషాలసమాహారంతో..


సంస్కృతీ సాంప్రదాయాల రంగవల్లి తోరణాల

సరిగమల ఆరు రుచుల ఆహార నియమాలతో

అంగరంగ మామిడి తోరణాల మాలలల్లి చింత

చీకులు పారద్రోలి పసుపు, పచ్చల హరితహారమై.!


వసంతుడికి ఆహ్వానం పలికే వయ్యారి భామై

వనకొంగున కోకిల గారాల రాగాలు మూటకట్టి

మనసున మామిడి మల్లి ఘుమ ఘుమలతో

చైత్రమాస చింత చిగురు పొగరు సుగంధ సుందరై!


#తీపి;-పంచదార తేనె #పులుపు:-నిమ్మ, నారింజ

#చేదు;-వేప,పసుపు మెంతులు#కారం:.మిరియం

#వగరు:-చిక్కుడు, మినుము #ఉప్పు;..లవణపు

#షడ్రుచుల సుందర సుకుమార స్వరూపియై

#సంసార సరిగమల సంగీత నృత్యాలు నేర్ప

శ్రీ ప్లవ నామసంవత్సర ఊసుల *ఉగాది*యై

ప్రజలకు సుఖసంతోషాలు పంచ పాంచజన్యమై..!!


*********

హామీపత్రం;--పైన కవిత పోటీకోసం ప్రత్యేకంగా రాసినది ధృవపరుస్తూ #డా!హనీఫ్చంద్ర MD

విజయవాడ..8-4-21..కృష్ణా జిల్లా.9618733806

20

[08/04, 10:04 PM] Indravat Rahul Poet Ks 11: *"వీరాస్ కవి సమయం"*

➖🌺➖🌺➖🌺➖🌺➖


*అంశం :* ఉగాది 

*శీర్షిక :* మార్పు రావాలి 

*తేది :* 08/04/2021



🌿🌿🌿🌿🌿🌿


   *మార్పు రావాలి*



మానవుడిలో మార్పు రావాలి 

ప్రకృతి పచ్చదనంతో 

అరణ్యంను నాశనం చేస్తూ 

వనరులను వాడుతూ 

ప్లాస్టిక్ భూతాన్ని వదిలి 

రంగు రంగులా విగ్రహాలను 

భూగోళంకు అగ్గి పెడుతూ 

నాకేంటి అంటూ నిర్లక్ష్యంగా 

 వ్యవహరిస్తున్నాడు మానవుడు

పచ్చని మామిడి తోరణాలు 

ప్రతి గడపకు స్వాగతం పలికే

ఉషోదయ కాంతులతో 

ఆంగ్ల సంవత్సరంను జరిపి

తెలుగు సంవత్సరంను మరిచే 

గతాన్ని వదిలి, బాధలకు 

స్వస్తి చెప్పి కొత్త కొత్త ఊహల్లో 

కొత్త ఆశలను చిగురిస్తూ 

ప్రకృతినీ ద్వాంసం చేస్తూ 

సంస్కృతి, సంప్రదాయంను 

వదిలి నూతన జీవనంపై 

అడుగు పెట్టి తెలుగును మారుస్తున్నాడు మానవుడు

ఈ ఉగాదితో నైనా రావాలి మార్పు.


*హామీ పత్రం :* స్వీయరచన 

  

       ధన్యవాదములు.. 🙏🌹


*ఇంద్రావత్ రాహుల్*

       కొత్తపేట్ 

    నిజామాబాద్ 

   9848054079

21.

[08/04, 10:27 PM] +91 94404 08080: పేరు. ఉమారాణి వైద్య

అంగన్వాడీ టీచర్

గ్రామం.లింగాపూర్

మండలం. కామారెడ్డి

జిల్లా. కామారెడ్డి

సెల్.9000346200

    ఉగాది కి  స్వాగతం 

ప్లవన నామ సంత్సరమా

నీలోనే ఉంది నీరు అనే అర్థం అది జీవనాధారం

జగతిలో ,పంచ భూతాల్లో కీలకం

జనవరి దండుగా ఉగాది ఉండగా

తెలుగు నేల పై

ప్రకృతి జీవ వైవిధ్యం పై

ఆధారపడి సంస్కృతి తో

ముడి పాడి 

బంధాల్ని అనుబంధాలు

మేళవించే పండుగ

ఉగాది తెలుగు వారి అధిపండుగా

ఎండల్లో చాలువను పెంచే

ఉగాది పచ్చడి

షడ్రుచుల సమ్మేళనం

ఆరోగ్య ప్రదాయిని

సాంస్కృతిక వినోధోని

కాలగమని 

కృతులు రుతువులు

మధ్య వాతావరణం

భవితకు పంచాంగం

కోలాటం

దాసరి నాటకం

పచ్చడి పంచుకోవడం లో

సమత దృష్టి

బాక్ష్యాలు,పోలేలు 

తీపివంటలు

ముగాజీవల ను చంపక

అందరూ శాకాహారమే తినే పండుగ ఉగాది

బ్రహ్మ దృష్టిలో ఒక కల్పం

అందులో నారదమహర్షి

60 మంది సంతానం ఒక్క పేర్లతో వచ్చే ఉగాది

శ్రేష్టం ఒక యోగం ఒక యాగం.

చిగురించే మామిల్లు

అప్పుడే పెరుగుతున్న మామిడికాయ లు

కొత్త చింత

వేప పువ్వులు

ఇలా ఎన్నో ఔషాధ గుణాల

పచ్చడి తో ఆరోగ్యం

కోయిల రాగాల వసంతోత్సవం సంగీత రస జూరిని మరిపించు

అచ్చం తెలుగు వారి పండుగ

ప్లవన నామ సంవత్సరం

నీకు స్వాగతం. సుస్వాగతం

ఇది పూర్తిగా నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను

22

[09/04, 7:23 AM] +91 74166 05529: శీర్షిక:పూర్ణ ప్రక్రియ

--------------------------

పాడ్యమి తొలి తిథినాడు శుభారంభం చేసి


విదియ వంటి విభవంతో


తదియనాడు తపోభంగంలేక


చవితి చందాన చలువతనంతో


పంచమవేదం ఆకళింపుతో


షష్ఠివలె చతుష్షష్టి కళలందు రాణింపుతో


సప్త ఋషులందూ గౌరవంతో


అష్టాదశ పురాణాల పఠణంతో


నవగ్రహాల అనుగ్రహానికై ధ్యానంతో


ఏకాదశ, రుద్రాభిషేకాల నిర్వహణతో


ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనంతో


త్రయోదశి,మాస శివరాత్రులు జరిపే ప్రయత్నంలో


చతుర్ధశి,అమావాస్యలు అని ఆరోపించని చిత్తశుద్ధితో


పౌర్ణమినాటి పూర్ణచంద్రునివలె పూర్ణ వ్యక్తిత్వంతో


జీవితం పూరించితే చాలు

----------------------------------------

రచన:ఉండవిల్లి సుజాతా మూర్తి,విశాఖపట్నం,

ఫోన్:74166 05529

21

[09/04, 8:29 AM] +91 74166 38823: వీరాస్ కవి సమయము

పేరు:  ఆళ్ల నాగేశ్వరరావు

ఊరు:తెనాలి

మండలం: తెనాలి

జిల్లా : గుంటూరు

శీర్షిక: నవ్య ఉగాది

కవిత:

ఆమని కోయిల  ఆలాపనలు

భవితను తెల్పే పంచాంగ శ్రవణాలు

అత్తారింట కొత్త అల్లుళ్ళ అలకలు

ఏడాదికో మారు జరిపే

పితృదేవతల సంతర్పణలు

ఇవే నవ ఉగాది ప్రత్యేకతలు!

షడ్రుచుల సమ్మేళనం 

ఉగాది ప్రసాదం

కష్టసుఖాల మిళితం

మానవ జీవితం!

అరువది ఏండ్ల ఆనక

అందరి అసలు ఈడేర్చగా

అమితోత్సాహంతో అరుదెంచుచున్నది

ప్లవ నామ ఉగాది లక్ష్మి!

ఉదయించే భానుడు

జగతికి అందించును కాంతిని

అరుదెంచె నవ్య ఉగాది

జనవళికి అందించును నవ్యక్రాంతిని!

............................................హామిపత్రం

పై కవిత నా స్వీయారచనేనని, ఇది ఎప్పుడు, ఎక్కడ ప్రచురణ ,ప్రసారం కాలేదని హామీ ఇస్తున్నాను.

............................................

22

[09/04, 8:43 AM] +91 78938 91528: వీరాస్ కవిసమయం 

💐💐💐💐💐💐

పేరు: సంజన కృతజ్ఞ 

ఊరు: కోదాడ 

జిల్లా సూర్యాపేట

 చరవాణి:7893891528

💐💐💐💐💐💐💐

 అంశం: ఉగాది

 శీర్షిక: నవ వసంతం

*****************

 చైత్రమాస ఆగమనం -ప్లవ నామసంవత్సరం !

భారతీయ సాంప్రదాయాల నిలయం- తెలుగువారి  ముంగిట సప్తవర్ణాల సంబరం! సంతోషాలకు ఆహ్వానం పలికే శుభ తరుణం!

 కమ్మని కోయిల గానం- పచ్చని తోరణాల నూతన ఉత్తేజం!

 రమణీయ ప్రకృతికి నిదర్శనం!

 షడ్రుచుల సమ్మేళనం- ఆరోగ్యాన్ని అందించే దివ్య ఔషధం !

కష్ట-సుఖాలు అనుభవిస్తేనే జీవితం!

 పండితులు చెప్తారు కొత్త పంచాంగం !

కొత్త -కొత్త ఆశలతో అందరి జీవితం రమణీయం !


వివిధ అనుభూతుల సమాహారం -బ్రతుకులో  పల్లవించవా వసంత గానం!

 తిమిరాన్ని తొలగించి రావాలి  ఫ్లవ నామ సంవత్సరం! జీవనశైలి నడవాలి యధాప్రకారం!

 ఓ ప్లవా స్వాగతం -ఓ ప్లవ స్వాగతం !

💐💐💐💐💐💐💐💐

ఇది  పూర్తిగా సొంత రచన అని హామీ ఇస్తున్నాను

*************************

23

[09/04, 10:51 AM] +91 94406 37267: 

వీరాస్ కవిసమయం 

*****************

పేరు: కవిత దాస్యం

 ఊరు :కోదాడ 

జిల్లా: సూర్యాపేట

 చరవాణి 9440637267

💐💐💐💐💐💐💐💐


అంశం :ఉగాది

 శీర్షిక :కలియుగారంభం 

💐💐💐💐💐💐💐

యుగ అంటే కొత్త సంవత్సరం ఆది అంటే మొదలు !

యుగం అంటే యోగం!

 చైత్ర శుద్ధ పాడ్యమి కలియుగ ప్రారంభ సమయం !

యుగ అంటే నక్షత్ర గమనం! బ్రహ్మదేవుడు ప్రతి యుగంలో  ప్రళయం వచ్చిన తర్వాత మరలా సృష్టి ప్రారంభించే సమయాన్ని ఉగాది అంటారు!

 ఈ ఉగాది మొదటి మాసమైన చైత్రమాసం శ్రద్ధ పాడ్యమి రోజు జరుపుకునే పర్వదినం! మోడువారిన చెట్లకు చిగుళ్లు తొడిగిన !

ఎక్కడ చూసినా మావి చిగురు పచ్చదనం !

మత్తెక్కిన కోయిలల  సరాగాలు !

వసంత -రుతువు పలకరింపులు !

షడ్రుచుల కలయికలు!

 తీపి- ఆనందానికి !పులుపు- పరిస్థితుల్ని నేర్పుగా వ్యవహరించాలని !

ఉప్పు జీవితంలో ఉత్సాహం- రుచికి సంకేతం !

కారం సహనం కోల్పోయినట్టు పరిస్థితులు !

చేదు బాధ కలిగించే పరిస్థితులు !వగరు కొత్త స వాళ్ళని ఎదుర్కోవటం!

 షడ్రుచుల కలయికే మన జీవితం ,అని అన్ని రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి ,అప్పుడే జీవిత భవిష్యత్తు ఉంటుందని అంచనా !

ఈరోజు సృష్టికి -మూలం బ్రహ్మదేవుడు కనుక అతనిని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం!

 ఈరోజు ఆనందంగా ఉంటే ఈ సంవత్సరం అంతా శుభంగా ఉంటుందని నమ్మకం!

 రాబోయే కాలంలో పరిస్థితులను పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు !

పంచాంగ శ్రవణం చేయడంవల్ల గో -దాన ఫలితం, గంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు!

 ఏ పనులు తలపెట్టిన దిగ్విజయంగా  పూర్తవుతాయి! అందుకే కొత్త పనులకు కొత్త వ్యాపారాలకు శ్రీకారం  చుడతారు !

గత చేదు -అనుభవాల్ని దాటేసి "ప్లవ నామ "సంవత్సరం రావాలని అందరి కళ్ళల్లో ఆత్రం!

💐💐💐💐💐💐💐

 ఇది నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను

💐💐💐💐💐💐💐💐

24

[09/04, 11:28 AM] భరద్వాజ గారు

: 🚹వీరాస్ కవిసమయం ♈  

అంశం:-ఉగాది పర్వదినం

శీర్షిక ఆనందపు ఉగాది  రావాలి 

పేరు- భరద్వాజ రావినూతల 

వూరు- కొత్తపట్నం 

9866203795

************************************

శ్రీప్లవనామ ఉగాదికి స్వాగతం 

ఉత్తరాయణ ,చైత్రమాసపునందనోద్యానవనాన-

శుద్ధ పక్ష పాడ్యమిన ,ప్రాక్  దిక్కున విరిసిన తొలికిరణం ఉగాది -

క్రమతప్పక కాలంగుండెల్లో పూస్తుంది ప్రతిఏడాది -

ప్లవా అనిపిలిచినా .శార్వరీ అనితలచినా -

ప్రారంభమయ్యేటి ఈనూతన సంవత్సరం -

తెలుగువాడి జీవితానందనోద్యానవనాన విరబూసేటిఉషోదయం -

సాగించాలికొత్తవ్యాపారాలు -

అభివృద్ధిచెందాలి జీవితాలు 

నూత నోతేజాలకు చేస్తుంది అంకురార్పణం -

రక్తసంబధీకులకు అనురాగాల తీపి -

బంధువర్గాలకు ఆప్యాతల పులుపు -

శత్రువర్గాలకు వెటకారపుకారము -

అంత:శత్రువులకు  కోపాలవగరు -

అనుభవాలమిశ్రమాలచేధు -

అనే  షడ్రుచుల సమ్మేళనంతో తయారయ్యే ఉగాది పచ్చడి 

తెలుగువాడిజివ్హాకు విందుచేస్తే -

పంచాంగశ్రవణం వీనులవిందు చేస్తే -

ప్లవకాదా ఆనందమయం -

తెలుగువాడిమధిలో పూ యదా నందనవనం -

అందుకే ఉగాది -

కాలే వర్షతు వర్జన్య ..... పృధివినవ్య శాలిని -

దేశోకాయం క్షోభరహితో రాజాన స్పంతు నిర్భయా ..!

*************************************

ఇదినాస్వీయరచన 

✍️భరద్వాజరావినూతల (RB)🖍️

25

[09/04, 12:04 PM] STTRao Kama Reddy Poet: వీరాస్ కవిసమయము

పేరు..సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు

ఊరు..కామారెడ్డి

మండలం..కామారెడ్డి

జిల్లా.. కామారెడ్డి

శీర్షిక..ఉగాది

కవిత..


ఉగాది యుగాది నుండి

ఉద్భవించిన ఆచారాల సంప్రదాయాల సంస్కృతికి పునాది

చైత్రమాసములో ఉదయించి జగానికి వెలుగు కాంతులు విరజిమ్ము ఆప్యాయతల అనురాగాల సంఘమం

మామిడాకుల తోరణాలతో ముంగిట రంగుల రంగుల ముగ్గులతో అలంకరించిన పండుగ దినము 

కోకిలమ్మ కుహూరాగాల గొంతులతో

పల్లవించి ఉగాదికి శుభోదయము పలికిన దినము

నవ్యకాంతుల నవ్యభరితమైన ఉషోదయము

షడ్చురుచులతో మానవునికి జీవిత

పరమార్ధము తెలుపుతుంది

కొత్త వత్సరము ఆనందదాయకము 

కావాలని 

అందరి జీవితాలు సుఖసంతోషాలతో వర్దిల్లాలి


హామీపత్రం

ఈకవిత నాస్వీయకవిత దేనికి అనువాదముగాని,అనుకరణకాదని హామీఇస్తున్నాను

[09/04, 12:04 PM] STTRao Kama Reddy Poet: సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు

కామారెడ్డి

26

[09/04, 1:32 PM] +91 76740 55482: ✳️✳️✳️✳️✳️✳️

*ఒకరు ఒక్క కవిత మాత్రమే post చేయాలి* 


*ఈ క్రింది ఫార్మాట్ లో మీ మీ కవితలను post చేయగలరు.*

👇 


*Format*


*వీరాస్ కవి సమయం*

*పేరు ః*చేబియ్యం శ్రీనివాసరావు 

*ఊరు ః*గుజరాతిపేట , శ్రీకాకుళం

*మండలం ః*శ్రీకాకుళం 

*జిల్లా ః*శ్రీకాకుళం 

 

*శీర్షిక ః*ఉగాది పర్వదినం 

*కవిత ః*తెలుగు నూతన సంవత్సరాది ఉగాది కి స్వాగతం



కోకిల కుహూ కుహూ లతో ,చిరు వెచ్చదనం వేడిమితో 

చక్కని గాలుల చల్లదనంతో, పుల్లని చింతబొట్టల రుచులతో 

తెల్లని వేప పూవులతో ,కొత్త మామిడి పంటతో 

తీయని బెల్లం గుమగుమలతో ,ఎర్ర మిరప ఘాటులతో 

కొత్త అల్లుళ్ల సందళ్లతో ,ఏరువాకకు సన్నద్ధతతో 

గుమ్మాన పచ్చటి పసుపు ముస్తాబుతో ,కుంకుమ బొట్టుల సౌభాగ్యముతో 

ఉప్పుతో మిళితమైన షడ్రుచుల ఉగాది పచ్చడితో, పండితుల పంచాంగ శ్రవణముతో 


భవిష్యత్తులు బాగుండాలని వేయిదండాల మొక్కులతో ,సన్నద్ధమైనాము స్వాగతముతో 

రావమ్మా ! రా ! రావమ్మా !అను పిలుపులతో 

'ప్లవ ' నామ తెలుగు నూతన సంవత్సరాది కి స్వాగత సత్కారాలతో 

పిలువగా రండమ్మా అని పాడుతున్నాము ఆర్తితో 

ఆరోగ్య దాతగా రావమ్మా అని పండగ చేస్తున్నాము ఆనందముతో 

కష్టం , బాధ , సుఖం , సంతోషం , ఎదుగుదల , ఆరోగ్యాల షడ్ విధములకు స్ఫూర్తిగా 

కారం , ఉప్పు , తీపి , పులుపు , వగరు , చేదు ల కలగలిపిన ఆరు రుచుల పచ్చడిగా 

తెలుగు సంవత్సరాది ప్రారంభముగా 

 నిన్ను పిలచి చేసుకొందుము పండుగగా              

సన్నద్ధమవగా , స్వాగతమమ్మా ప్లవ నామ సంవత్సరమా 

సుస్వాగతమ్మా రామ్మా 

అందరి జీవితాలలో సంతోషం నింపగా రావమ్మా 

అందరి కి ఆరోగ్యమీయగా రావమ్మా  


*హామీ పత్రం:*


ఇది నా స్వీయ రచన .ఈ పోటీ నిమిత్తము రాసింది 

 అని హామీ ఇస్తున్నాను .

27

[09/04, 3:01 PM] Aparajith: 

వీరాస్ కవి సమయం 


శీర్షిక:  ఉగాది పర్వదినం 

కవిత: ఉగాది ప్రత్యేకత 

పేరు: ఎం ఆపరాజిత్ రెడ్డి 

ఊరు:సూర్యాపేట 

జిల్లా:సూర్యాపేట 

ఫోన్ నంబర్ 9848532031


పల్లెటూరు జానపదుల నుండి 

నవీన నాగరికుల వరకు ఆచరించే 

తెలుగు సంవత్సరాది ఉగాది!

చైత్రశుద్ద పాడ్యమి నెలవంక పూయగా 

చెట్లు పచ్చని చిగుళ్లు లేత పసుపురంగు పూతలతో 

సింగారించుకున్న ప్రకృతి కన్యక!

గండుకోయిలల కుహు కుహూరవాలు 

వేసంగి పంటకోయు కాలం అరుదెంచి 

రైతులు కూలీలకు చేతినిండా పని 

రామచిలుకలు తెల్లని కొంగలు స్ట్వైర విహారం!

శడ్రుచుల సమ్మిళితం ఉగాది పచ్చడి 

ఆరు జీవనానుభూతుల సమ్మేళనం!

ఇంటిపెద్ద నాన్నగారే స్వయంగా తయారు చేసేను 

ఇంటి ఇల్లాలు కళ్లల్లో వెలుగుల జ్యోతులు 

పిల్లలందరు తలంటు స్నానం చేసి 

చిన్నా పెద్దా ఉగాది పచ్చడినారగించి 

అమ్మ చేసిన తీపి వంటకాలు 

ఆనందాల ఆరగింపుల తర్వాత 

గున్నమామిడి ఆకుల తోరణాల కింద పంచాగ శ్రవణం!

మండుటెండలకు చల్లచల్లని చలువ పందిళ్ళు 

వింత వింత సోయగాల ఆనందడోలికలు 

ఊరు ఊరంతా పండుగ వాతావరణం!

పేద సాద బీదవాళ్ళకు ఇళ్ళల్లో ఇల్లాళ్లు 

తాము చేసిన వంటలను వాళ్ళకింత పంచిఇచ్చే మమకారం!

ఉగాది సరికొత్త కాంతుల దివ్యజ్యోతి!!


ఆపరాజిత్ 


హామీ పత్రం: ఈ రచన పోటీకోసమే వ్రాయబడిన స్వీయ కవిత అని హామీ

28

[09/04, 4:48 PM]

 Pramoda Munimadugu Poetess:

 వీరాస్ కవి సమయం 


శీర్షిక:  ఉగాది పర్వదినం 

కవిత: ఉగాది ప్రత్యేకత 

పేరు: ప్రమోద ముని మడుగు 

ఊరు: సరూర్ నగర్ 

జిల్లా:రంగారెడ్డి 

ఫోన్ నంబర్ 9000251604


వసంతుని ఆగమనం తో

ప్రకృతి మాత పచ్చటి చీర కట్టు కున్నది

కోయిలమ్మ....కమ్మని పాటలతో

లోకమంతా కనువిందు చేస్తుంది

వేప పూతల, బొడ్డుమల్లెల గుభాలింపులు.....

పుల్లటి మామిడి కాయలతో..విరగ. కాసిన...మామిడి తోపులు...

ఓ..యుగాది పురుషా....

సకల చరాచర జాలము

నీకు ఆనంద స్వాగతం పలకాలని

సంబరంగా...ఎదురుచూస్తున్నాయి

మనుషులం  మాత్రం ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ....ఇలా

గతం తాలూకు చేదు జ్ఞాపకాలు

భవితవ్యాన్ని.... ప్రశ్నార్థకం చేస్తున్నాయి

ఉగాది పచ్చడి లోని షడ్రుచుల కలబోతనే

కదా....ఈ జీవితం          అన్నీసమపాళ్లలో ...ఉంటేనే....మధురం

కానీ.....

కనుమరుగు అవుతుందనుకున్న కరోనా మహమ్మారి...                   ..రెండో సారి కోర లు సాసింది కాటువేయడానికి...

ఇప్పటికే ఎన్నో జీవితాలు  అతలాకుతలం...

జీవాయుధ పోరాటాన్ని తలపిస్తున్నది  భూగోళం 

ఎక్కడివాళ్ళక్కడే... గప్ చుప్

అంటూ..... ఆంక్షలు

మరి ఈ ప్లవ నామసంవత్సరం

పరిస్థితులను.... చక్కదిద్దేనా?

కోటిఆశలతో..                       ఎదురుచూస్తున్నయువత ఆకాంక్షలు...నెరవేరేనా?

ఉందిలే.. మంచి కాలం ముందు ముందున అనే ఆశతో.... 

లోకాసమస్తా సుఖినో భవంతు అంటూ..నిన్నుస్వాగతిస్తున్నా!

ఎంతైనా మేం.........ఆశాజీవులం కదా!

29

[09/04, 8:27 PM] +91 94407 34907: 

వీరాస్ కవిసమయం

పేరు.తిప్పొవఝల నరసింహమూర్తి

ఊరు.బుచ్చిరెడ్డి పాలెం

మండలం.బుచ్చిరెడ్డి పాలెం

జిల్లా.నెల్లూరు


శార్వరిలొ  వచ్చింది ఊహకందని ఉపద్రవం/

కరోనాతో అయినాయి అందరి బతుకులు అతలాకుతలం/

ప్లవా!నీ రాకతో కావాలి అందరి జీవితాలలు ఆనందమయం/

కష్టాల ఆకులను రాల్చి ఆనందాల ఇగుర్లకు పొయాలి జీవం/

 కోకిలావాస చిగురును తిన్న గండుకోయిలల గానం

కరొనా బాధితులకు కావాలి పన్నీటి స్నానం/

జారుడు బల్ల పై నుంచి జారిన్నట్లు కుదేలైంది ఆర్థిక వ్యవస్థ/

ఈ వ్యవస్థను శిఖరాగ్రం చేర్చ డం నీ బాధ్యత /

పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యునిలా అయినారు సామాన్య జనం/

వారిని గట్టున పడేయడం నీ తక్షణ కర్తవ్యం/

రోడ్డున పడ్డ వలస కార్మికుల జీవితాలలో నింపాలి వసంతం/

ఛిద్రమైన మధ్యతరగతి బతుకులు కావాలి తీపిమయం/

ధర్మ పోరాటం చేస్తున్న రైతులకు అందిచాలి నీ సహకారం/

సమస్యల తోరణాలతో పలుకుతున్నాం స్వాగతం/

చుపించాలి తప్పక పరిష్కారం అందుకోవాలి మా పురస్కారం.


హామీ పత్రం. 

                  ఈ కవిత నా సొంత రచన.ఈ గ్రూపు కొరకు మాత్రమే వ్రాయబడ్డాది. ఏ మాధ్యమంలో ప్రచురింపబడలేదు.

                            తిప్పావఝల నరసింహమూర్తి -9440734907.

[09/04, 8:41 PM

30

] Basaraju Yadagiri: వీరాస్ కవి సమయం


పేరు            : బాసరాజు యాదగిరి

వృత్తి           : ఉపాధ్యాయుడు 

చరవాణి     : 9866255775

ఊరు          : రామన్నపేట 

మండలం    : రామన్నపేట 

జిల్లా           : యాదాద్రి భువనగిరి 

 

శీర్షిక    :          యుగాది 


కవిత  :      ప్లవ నామ సంవత్సరం

                 విప్లవ నామమై

                 మార్పుకు శ్రీకారమై

                 ప్రపంచ మానవాళికి

                 శుభకరమై

                 విష వైరస్ ల నుండి

                 కాపాడే ఉద్దీపన యై

                 ఏకాకులయిన లోకాన్ని

                 ఏకం చేసే ప్రేరణయి

                 విశ్వ శ్రేయస్సు కోరే 

                 ఉగాది ఆరంభమై

                 జనహితమై

                 ఉన్నత ప్రమాణాలు

                 ఆచరించే సమాజ

                 నిర్మాణాన్ని కాంక్షించే

                 ఉత్ప్రేరకమై

                 ఆదర్శవంతమైన

                 జీవితాన్ని గడపాలని

                 నిర్దేశించే సూచికయి

                 ఉగాది ఉండాలని

                 ఆకాంక్షిస్తూ..........

31

          [10/04, 7:38 AM] +91 99082 48734: ఉగాది కవితల పోటీకి


డాక్టర్ సయ్యద్ 


సమీనా పర్వీన్


ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

ఉగాది కవితల పోటీకి


కవిత శీర్షిక


ఓ ప్లవ నామ ఉగాది


ఉగాది అంటే ఉషస్సులు వసంతాలు


పంచాంగ శ్రవణాలు


షడ్రుచుల ఉగాది పచ్చడి 


ఈ ఉగాది పండుగ కు ప్రత్యేకం


ఇది తెలుగువారి కొత్త సంవత్సరం పండుగ


తీపి జ్ఞాపకాల ముత్యాలను పోస్తూ


చేదు గుర్తులు లాంటి ఓటమి ముఖచిత్రాన్ని చెరిపేస్తూ


పొగరు అనే వర్గ వైషమ్యాలు సంకుచిత భావాలకు కత్తెర 


వే టు ల


క్రూరత్వం ఇటుకలతో నిర్మితమైనది కారమనే అహంకార కోటను అమాంతంగా పటాపంచలు చేస్తూ


పులుపు అనే ప్రేమ లాంటి పిలుపుతో




ఉప్పు అనే ఉత్తేజం విచ్చేసిన



ప్లవ నామ ఉగాది కి


శతకోటి హారతులతో స్వాగతం సుస్వాగతం


సహజమైన ప్రకృతి పరమైన పండుగ ఇది


మానవాళి లో నూతన ఉత్సాహాన్ని 




పెంచే శుభదినం ఈ పండుగ


నీ రాకతో 


చెట్లన్ని చిగురించాయి


పక్షుల కిలకిల రావాలతో


కోయిలమ్మ కుహు కుహు రాగాలతో


చిలుకమ్మ చిలుక పలుకుల తో


భారతీయులందరూ ఆనందంగా ఉన్నారు


మా జీవితాలలో కూడా నూతన ఉత్సాహం సిరిసంపదలు జ్ఞాన వివేక పేరు ప్రతిష్ఠలు ప్రసాదించు ఆశీర్వదించు


ఓ 


ఉగాది అమ్మ


భవిష్యత్ అంతా


భవ్యంగా


రమ్యంగా


నవ్యంగా


ఉండేలా నీ నిండు దీవెనలతో మాకు తోడై ఉండు


ఉగాది అమ్మ



హామీ పత్రం


ఇది నా సొంత రచన




కరీంనగర్


9908248734

32

[10/04, 8:10 AM] +91 96528 32290: వీరాస్ కవి సమయం

పేరు : గొర్రెపాటి శ్రీను

ఊరు : హైదరాబాద్

శీర్షిక : "మన ఉగాది "


చైత్ర శుక్ల పాడ్యమినాడు విశ్వాన్ని బ్రహ్మ సృష్టించడం తో ఉగాది ఆరంభమయ్యిందని ప్రతీతి !

వసంత ఋతువు ఆగమనంతో ప్రకృతి పచ్చగా వర్ధిల్లుతుంటే..

కోయిలమ్మలు కమ్మని 'కుహు కుహూ' రాగాలు ఆలపిస్తూ మురిపిస్తుంటే..

అరుదెంచే తెలుగువారి ప్రియమైన పండుగ ఉగాది !

షడ్రుషులతో ఉగాది పచ్చడి..

జీవితంలో ఎదురయ్యే విభిన్న అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుంది !

ఉగాది అంటే..నవ్యతకు నెలవు !

ఉగాది అంటే..చైతన్యానికి మారుపేరు !

పంచాంగ పఠనములతో వేద బ్రాహ్మణులు భవిష్యత్ గమనాన్ని సూచిస్తుంటే..

సత్ సంకల్పాలని శుభప్రదంగా ప్రారంభించే సుదినం ..ఉగాది !

కొత్త ఆశలు ఎన్నో చిగురిస్తుంటే..

ఆశయాల తోరణాలు జీవితాలకు వెలుగునిస్తుంటే..

ఆనందోత్సాహాలు వెల్లువిరుస్తుంటే..

తెలుగువారమైన మనమంతా సంబురంగా జరుపుకునే పండుగ.. ఉగాది !


"మన ఉగాది" అను కవిత నా స్వంతమని హామీఇస్తున్నాను.

 _గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్) 9652832290.

33

[10/04, 8:22 AM] +91 98494 81823: వీ రాస్ కవి సమయం

నారు మంచి వాణి ప్రభా కరి

ఊరు తణుకు

మండలం తణుకు

జిల్లా ప గో జిల్లా


శీర్షిక ఉగాది శుభాాంక్షలు

[10/04, 8:23 AM] +91 98494 81823: వీరాస్ ఉగాది కవి సమ్మేళనం


సూర్యోదయ సమయాన కోకిల

స్వాగతం పలుకుతూ ఉగాది

శుభాకాంక్షలు తెలుపుతుంది

అది డానికి భగవంతు డీ చ్చిన


వరము మధుర స్వరంతో పలికే

గానం మనకు ఎంతో ఆనందం

మామిడి చిగురులు తిని,తన స్వరం మరి  శ్రావ్య త చెందిందే



మామిడి కొమ్మలు మామిడి కాయల గుత్తుల్తో నిండి,ఉండి

వేప పూల సుగంధ సౌరభాలు

చెరకు  తీపి ,కొత్త చింతపండు


 ష ట్ రుచుల సమ్మేళన పచ్చడి

మనాజీవితాల్లో సర్వ సౌభాగ్యాలు సమకూర్చి. ప్రగతి

అందించాలని ఆకాంక్షిద్దాం  శుభము


నారు మంచి వాణి ప్రభా కరి

ఊరు తణుకు

చర వాణి 9849481823

34


హామీ పత్రం[10/04, 11:40 AM] Balloori Umadevi Poetess: వీరాస్ కవి సమయం*

*పేరు ః*డా.బల్లూరి ఉమాదేవి

*ఊరు ః*కామవరం

*మండలం ః*ఆదోని

*జిల్లా ః*కర్నూల్

 

*శీర్షిక ః*ఉగాదికి స్వాగతం


ఆమని రాకతో

పరవశిస్తోంది ప్రకృతికాంత

సరికొత్త సోయగాలతో

పచ్చని తరులతలతో 

పులకరించి పోతుంది

పుడమితల్లి ఆనందంగా

పండిన/ఎండిన ఆకులు రాలుస్తూ

మా ఋతుధర్మం పూర్తయిందంటూ

సెలవు పుచ్చుకోంటుంది శిశిరం

ఇదిగో 

నేనున్నానంటూ

అందరినీ ఆహ్లద పరచడానికై

సుగంధాలు వెదజల్లుతూ

వచ్చేస్తోంది చైత్రమాసం

తెస్తోంది పర్వదిన శోభను

వేపపూతతో గుబాళిస్తోంది వనమంతా

పిందెలతో  ఉగాదిపచ్చడికి 'నేను'సిద్ధం

అంటోంది సహకార వృక్షం

మరెందుకాలస్యం

మామిడాకుల తోరణాలు కడదామూ

షడ్రుచులతో కూడిన పచ్చడిని 

సకుటుంబంగా రుచిచూద్దామా

"ప్లవ"నామ సంవత్సరాన్ని

ఆహ్వానిద్దామా!


హామీ పత్రం:*



*ఉగాదికి స్వాగతం *అను కవిత నా స్వీయ రచన ఇది దేనికి అనుకరణ కాని అనుసరణ కాదని హామీపత్రం చున్నాను ధన్యవాదములు 


డాక్టర్ బల్లూరి ఉమా దేవి

విశ్రాంత ఉపన్యాసకులు.

35

[10/04, 1:21 PM] సునంద వురిమళ్ళ గారు: *వీరాస్ కవి సమయం*

*పేరు:వురిమళ్ల సునంద*

*ఊరు::ఖమ్మం*

*మండలంఃఖమ్మం టౌన్*

*జిల్లాఃఃఖమ్మం*

 *శీర్షికఃఃచెప్పవే కోయిలా*!

*********************

శ్రీ శ్రీప్లవనామ సంవత్సరాదికి

కుహూ కుహూ రాగాలతో

స్వాగతం పలుకుతున్న కోయిలా!


కరోనాతో అతలాకుతలం చేసిన

శార్వరి నామ సంవత్సర 

చేదు జ్ఞాపకాల తడి ఆరక ముందే

మరో సారి కోవిడ్  బూచి భయపెడుతుంటే...


పాదాలకు జారిన ధైర్యం 

కనువిందు చేసే ప్రకృతి అందాలను

ఆగమిస్తున్న  చైత్ర మాస శోభను

ఆస్వాదించలేక పోతోంది!


మండే ఎండలు గుండెల్లో గుబులు పుట్ఠిస్తుంటే

గున్న మావి పొత్తిళ్ళలో ఊయలూగుతున్న బుజ్జి పిందెల సోయగం  కానీ..


పూల పూల చీర కట్టుకుని

కొమ్మల చేతులతో 

చల్లని మమతలు పంచుతున్న

వేప చెట్టు నీడ గానీ..

అలుముకున్న నిరాశా చీకట్లను

తొలగించలేక పోతోంది!


చెప్పవే కోయిలా!

కష్టాలేవీ కలకాలం ఉండవనీ

మనోధైర్యమే మనకు విజయాన్ని కలిగిస్తుందనీ

ఆరు రుచులు సమ్మిళిత

జీవితంలో

అన్నీ సమపాళ్లలో ఉండవనీ

తిమిరంతో సమరం చేసేందుకు

వేకువ తోడుగా వస్తుందని..


తెలిసిన ఈ నిజాన్ని

చెప్పవే కోయిలా! మనసుకు హత్తుకునేలా!


  *హామీ పత్రం* 

ఈ కవిత నా స్వీయ రచన ఎక్కడా ప్రచురింపబడలేదు దేనికి అనువాదం అనుకరణ కాదు.

 *వురిమళ్ల సునంద, ఖమ్మం* 

36

9441815722

[10/04, 1:48 PM] Vineelamma: వీరాస్ కవిసమయం

పేరు : వినీలదుర్గ

ఊరు : నెల్లూరు

మండలం : నెల్లూరు అర్భన్

జిల్లా : నెల్లూరు

శీర్షిక : కొత్తసంవత్సరం


శార్వరీ చీకటి పరదాలను

వేసి

జనజీవనానికి అంధకారాన్ని

దోసిలతో పంచి

రేపటిని ప్రశ్నార్థకం చేసింది....!!


ప్రతి క్షణం పోరాడుతూ

ఆత్మస్థైర్యం మాస్క్ తో అడుగేసే

తరుణాన

రక్కసిలా కాటేస్తూ స్వైర విహారం

విడ్కోలు బహుమతిగ....!!


రాలిన ఆశలను కూడగట్టుకొని

చేదు జ్ఞాపకాలను దులుపుకొని

చైత్రమా నీతో ఆగమనమయ్యే

ఫ్లవనామ ఉగాది కై

గోరంత ఆశల చూపుల స్వాగతాలు.....!!


కొత్త ఆశలను కొంగున ముడికట్టుకొని

సంతోష తరంగాలను చుట్టుకొని

గాలిలో రెపరెప లాడుతున్న మానవాళి జీవితాలకు

కొత్తసంవత్సరమా భరోసాగా రావమ్మా అంటూ

ప్రతి హృదయము ఆరాటపడె ఉగాది కై....!!



ఇది నా స్వీయరచన.వీరాస్ కవిసమయం కోసం రాసినది.

                                వినీల

[10/04, 3:11 PM] Lalita Sister: ✴️✴️✴️✴️✴️✴️✴️✴️





*ప్లవనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని*

పురస్కరించుకుని


 *వీరాస్ కవిసమయం*

కవితలకు ఆహ్వానం పలుకుతుంది.


కవితలు పంపిన ప్రతీ ఒక్కరికీ  ప్రశంసా పత్రం  అందజేయబడుతుంది 

కవిత 


1. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని  రాసినదై ఉండాలి.


2. తమ స్వంత రచనగా హామీ పత్రం తప్పక జతపరచాలి 


3.మన సమూహం కోసం మాత్రమే రాసినదై ఉండాలి.

ఎక్కడా పోస్ట్ చేయకూడదు.


4. పేరు, గ్రామం,జిల్లా, కవితతో పాటు ఫోటో పంపించవలెను


*చివరి తేదీ : 11ఏప్రిల్,2021*


గమనిక :ఎలాంటి ఇతర సందేశాలు ఫోటోలు ఆడియోలు వీడియోలు

యూ ట్యూబ్ లింక్ లు పంపకూడదు.

ఉగాది కవితలు మాత్రమే 

పంపవలెను.




************వీరాగుడిపల్లి 

                     లలితాకృష్ణ


✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

37

[10/04, 3:12 PM] Mahender Javvaji: *శీర్షిక:-బతుకు పోరు*

మనసులో ఎన్నెన్నో ఆశలు

తీర్చుకోవాలని కోరిక

భయటికెల్తే భయం ,బాధ్యత..


తప్పని బతుకు పోరు

అనునిత్యం ఆకలి ఆర్తనాదాలు పెరిగిన ధరలు

కొనలేం తినలేం


మన కలంగళం పధును పెడదాం మానవాళికి మహమ్మారి పై అవగాహన పెంచుదాం..



"కవిత్వం రమ్మంది

కరోనా కోరలుజాచింది

అయినా పోదాం మాస్కులు, సానిటైజర్ వాడుకుంటూ"


శార్వరిచేదునింపె

ప్లవనామ సంవత్సరం

సకలంపదిలెమని చెప్పె సుమా


ఈకవిత పోటీ నిమిత్తం రాసిన దేనని ఇంతవరకు ఏ దినపత్రికలో గాని పోటీ సమూహం లలోఎక్కడగాని ప్రచురితం కాలేదని ఇది నా సొంత కవిత అని హమీ...


మహేందర్ జవ్వాజి✍️✍️🤝🤝

గ్రామం.తుర్కలశాపూరం

మం.గుండాల.

జిల్లా. యాదాద్రి భువనగిరి

చరవాణీ.8978503203

తెలంగాణ రాష్ట్రం.

38

[10/04, 3:47 PM] +91 88016 90939: వీరాస్ కవిసమయం

పేరు : ఖలీమ్ పాషా

ఊరు : మడికొండ

మండలం : ఖాజీపేట

జిల్లా : వరంగల్ అర్బన్


శీర్షిక : కొత్తసంవత్సరం


షడ్రుచుల మేళవింపు ఉగాది పచ్చడి, 

కేవలం రుచికాక, ఔషద గుణాలతో,    

తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం అనే ఆరురుచులు జీవితములో సుఖాలు, కష్టాలు, జీవితంలో అన్ని  అనుభూతులకి తార్కాణం 

సుఖాలకు పొంగి పోకు 

దుఃఖానికి కృంగి పోకు

సుఖదుఃఖాలు సమభావం తో స్వీకరించు

రోగశాంతి, ఆరోగ్యపుష్టి కూడా చేకూరు.

జీవునకు చైతన్యం కలిగించేది కాలం

ఆ కాలాన్ని నిర్వచించేది పంచాంగ శ్రవణం

గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, 

నెలలు, ఋతువులు, ఆయనాలు, 

జీవితం ఆచరణలోనికి తీసుకొనివచ్చేనే 

కార్యక్రమాల ఆలోచనలు చేయవచ్చెనే


(ఇది నా స్వీయరచన.వీరాస్ కవిసమయం కోసం రాసినది మాత్రమే అని హామీ ఇస్తున్నాను)

                                ఖలీమ్ పాషా

39


[10/04, 4:09 PM] KC Narsaiah KS 26: *వీరాస్ కవి సమయం*

*పేరు ః*         కెసి నరసయ్య

*ఊరు ః*        బోదులబండ

*మండలం ః* నేలకొండపల్లి

*జిల్లా ః*         ఖమ్మం

 

*శీర్షిక ః*         ఫ్లవ పలకరింపు



యుగాల ఆగమనం 

ఏడాదికో పయనం 

కోయిలమ్మ గానం

ఆకాశం ఆనందం

చిగురించిన నేలమ్మ 

మార్పుకు శ్రీకారం

ప్రకృతి పర్వదినం

చెడుకు సంకెళ్ళు

మానవత్వ పరిమళం

షడ్రుచుల సమ్మేళనం

కాలచక్రం పరుగులో 

తిరుగులేని పలకరింపు

ఆకు రాల్చిన శిశిరం

చెట్లు చిగురించిన వసంతం

ప్రకృతి శోభాయమానం

తెలుగువారి సొంతం

కరోనాతో పోరాడిన శార్వరీ

సూక్ష్మాతి సూక్ష్మ క్రిమి

అంతు తేల్చనున్న ఫ్లవనామం


*హామీ పత్రం*: ప్లవ పలకరింపు కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను

40


[10/04, 6:10 PM] +91 99082 87127: *వీరాస్ కవి సమయం* 

*పేరు* వడ్డి సుధాకర్

ఊరు: హుస్సేన్ పురం

జిల్లా : అనంతపురం జిల్లా 

శీర్షిక: *నాంది* 


కవిత: 

తెలుగువారి తొలిపండుగ ఉగాది 

కొత్త పనులు ప్రారంభించడం పరిపాటి 

ప్రాతఃకాలానే లేచి 

ఇంటిని ఒంటిని శుభ్రపరచి 

గుమ్మానికి మామిడి తోరణాలు 

ఒంటికి నూతన వస్త్రాలు ధరించి  

షడ్రుచుల మేళవింపుతో ఉగాది పచ్చడి చేసి 

తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే రుచులను జీవితానికి అన్వయించి 

ఎదురయ్యే మంచిచెడులను సంయమనంతో స్వీకరించాలని 

ఉగాది పచ్చడి తెలిపే 

కోయిలల కుహు కుహు రాగాలతో 

చిగురించిన మామిడి వేప పిందెలతో 

అలరించి ఆకర్షించు ప్రకృతి అందాలతో 

మైమరుస్తూ జరిపే ఉత్సవమే ఉగాది 

తెలుగు ప్రజల జీవనానికి నాంది.

హామీ: ఈ కవిత పూర్తిగా నా స్వీయరచన

41

[10/04, 6:51 PM] +91 77991 14450: వీరాస్ కవి సమయము

పేరు: పోచం సుజాత ఊరు : ఉప్పల్ అర్బన్

హైదరాబాద్

మండలం : ఉప్పల్

జిల్లా : మేడ్చల్

శీర్షిక : కోటికాంతులతో

 

కవిత


వసంత రుతువు 

రాకతో చెట్టుమీద కోయిలమ్మ కూ..అంటూ 

తీయని రాగాలు 

ఆలపిస్తున్న వేళల్లో..

ఆ రాగాల సవ్వడికి మనమంతా మైమరచి వంత పాడమని మది కోరుతున్న వేళల్లో.. 

గుత్తులు గుత్తులుగా లేత మామిడి పిందెలు జివ్వహాను 

ఊరిస్తున్న వేళల్లో..

గగనంలో ఉన్న తారల్లా శ్వేతవర్ణ వేపపూత వెలుగు కనులను దర్శిస్తున్న వేళల్లో.. 

ప్రకృతిలోని చెట్లన్నీ.. చిగురాకులు తొడిగి హరిత వర్ణాన్ని తలపిస్తున్న వేళల్లో.. 

షడ్రుచుల మిళితమైన 

యుగ ఆదిగా.. 

కోటికాంతులతో... 

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉప్పెనలా వస్తున్న వేళల్లో... 

తీపి,చేదు పులుపు, వగరు,కారం,ఉప్పు కలయికల ఉగాది పచ్చడి సేవిస్తున్న వేళల్లో.. ఆయురారోగ్యాలతో అందరం ఏకమై సాయం సమయంలో 

పంచాంగ శ్రవణం   శ్రావ్యంగా... 

వింటున్న వేళల్లో..  

శుభాలను తీసుకొని తెప్పలా...మన జీవితాల్లోకి వస్తున్న 

శ్రీ  ప్లవనామ సంవత్సరానికి

మనసారా స్వాగతం


హామీ పత్రం:

ఈ కవిత నా స్వీయరచన 

వీరాస్ కవిసమయం కోసం రాశాను.ఎక్కడ

ప్రచురింపబడలేదు

దేనికి అనువాదము అనుకరణకాదు.

ధన్యవాదములు🙏

 

పోచం సుజాత ✍️ ఉప్పల్ హైదరాబాద్

42


[10/04, 7:38 PM] మన్నె లలిత గారు కవయిత్రి: వీరాస్  కవిసమయం

 పేరు : మన్నె పిన్నక లలిత

 ఊరు :హైదరాబాద్ 

 జిల్లా :మేడ్చల్ మల్కాజ్ గిరి

   శీర్షిక:  శ్రీ ప్లవ నామ ఉగాదీ...!? నూతన సంవత్సరమా....!??

*****************************************************


 శ్రీ ప్లవనామ ఉగాది అరుణోదయ శుభవేళ

 ముంగిట్లో ముత్యాల ముగ్గులు తీర్చి 

గుమ్మాలకు పసుపు, కుంకుమ పెట్టి 

పచ్చటి ద్వార తోరణాలు కట్టాలనుకున్నా

 అక్షరాలతో అక్షరమాలికలల్లి తోరణాలు కట్టి 

ఆచంద్రార్కం కవితల గుబాళింపులు

 కలకాలం గుర్తుండేలా కవితలందిద్దామనుకున్నా 

   కానీ కలికాలం.... కాలం తిరగబడింది.

 తినటానికి మావిచిగురు లేని కోయిలలు

  పీల్చటానికి సహజవాయువు లేని మానవులు

 కల్మషులైన   మనుష్యులు

 మరువని గత సంవత్సర చేదు జ్ఞాపకాలు

 నూతన సంవత్సరంలోనూ ఆరోగ్య జాగ్రత్తలు

  తీసుకోకుండా ఎండలకు చీమలలా

 బలైపోతున్న భవిష్యత్తు వారసులు

 బ్రతుకును మూన్నాళ్ళ ముచ్చట చేయక

బ్రతుకులో పరమార్ధాన్ని వెతుక్కుని 

నలుగురికి సాయపడుతూ

 శ్రీ ప్లవ నామ ఉగాదిలో సాగిపో

 తగు జాగ్రత్తలు తీసుకొని నిర్భయంగా సాగిపో

 శ్రీ ప్లవనామ ఉగాదీ! పదుగురికి సంతోషం పంచు

 తెలుగు ఉగాది పర్వదినమా! స్వాగతం!! సుస్వాగతం!!!

*************************************************

 హామీ పత్రం 

ఈ కవిత నా  స్వీయ రచన . ఇది దేనికి అనువాదం కాని, అనుకరణ కాని కాదు .ఎక్కడా ప్రచురింపబడలేదు. దేనికి  ప్రచురణకు పంపి ఉండలేదు అని హామీ ఇస్తున్నాను.

మన్నె పిన్నక లలిత .

 హైదరాబాద్ .

 చరవాణి సంఖ్య:741 686 32 89.

43

[10/04, 9:51 PM] +91 94418 64640: 1. *పేరు*: జోగు కృష్ణయ్య 

2. *ఊరు*: నానక్ నగర్ గ్రామం, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా

3. *అంశం*: ఉగాది

4. *చరవాణి*: 9441864640


             శీర్షిక:


*యుగాది వచ్చినా తీరుమారలేదు*

******************************


ఎన్ని యుగాదులు పోలేదు

యెన్ని ఉషస్సులు రాలేదు

ఈ నరుల భరత మేదిననీ..!?


కారుగారుకు మన కర్మభూమిలో

పురుటి నొప్పుల పేరు బలాలు

బాపని పంతులు పంచాంగపు వాక్కులు

నరుల పాలిట నిలిచినవా..!వెలసినవా..!?


రెక్కాడితే గాని డొక్కాడని

అంధకారపు జీవితాలలో

వెలుగులు నిస్వార్థంగా వెలుగొందేనా..!?

పాలకులు నిస్వార్థంగా గెలుపొందేనా..!?


ప్రజల వెతలను వెలికి తీయుటలో

ప్రజల నిజానిజాలు నిరూపించుటలో

కవుల కలాలు ఆవైపు ఆగిపోయినవి

కవుల గళాలు ఆవైపు మూగబోయినవి

ప్రకృతి పర్యంతమై సాగుతున్నవి

నిరుపేదల గాథలు విస్మరిస్తున్నవి


సత్తువ సచ్చిన సిరాచుక్కలతో

నిర్వాహకుల పలు ఆంక్షలతో

ప్రతి అక్షరం ప్రజాపక్షం కాజాలక

పిరికితనంతో పరుగెడుతున్నది


అయినా...!

ఈ బడుగుల బ్రతుకు కోసం

ఎన్ని యుగాదులు వచ్చినా

యెన్ని ఉషస్సులు వచ్చినా

తీరుమారలేదు ఈ భరత మేదినీ..!?


************************************


*హామీపత్రం*:


ఇది నా స్వీయరచన ఎందులోనూ,ఎక్కడా ముద్రితం కాలేదని హామీ ఇస్తున్నాను.

దేనికి అనువాదం అనుకరణ కాదని హామీ పత్రం పంపుతున్నాను      


                      ********

హామీ పత్రం : ఇది నా స్వీయ రచన, ఎక్కడ

                    కాపీ చేయలేదని, ఏ పత్రిక లో

                    ప్రచురింప బడలేదని హామీ.

44

[11/04, 7:46 AM] +91 94937 55741: వీరాస్ కవి సమయం


పేరు:

తూపురాణి వేంకటకృష్ణమాచార్యులు

ఊరు: సూర్యాపేట

మండలం: సూర్యాపేట

జిల్లా: సూర్యాపేట

చరవాణి: 9493755741


శీర్షిక:

ప్లవ వసంతమా! సుస్వాగతమ్ము!!


1). తే.గీ.

పసిమి పంటలనారోగ్య భాగ్యమొసగి

ఏలుకోవమ్మ నవవర్ష! శ్రీలుగలుగ

బాధలను బాపి జనుల సౌభాగ్యమెరయ

మనకు నిడుగాత శుభతర మంగళములు!!


2). తే.గీ.

మంచితనమంత హృదయాన మరలునట్లు

మహిమ తెలిపెడి భావనల్ మదినినింప

రమ్య వాసంత సౌఖ్యాల గమ్యమొసగ

రమ్ము ప్లవనామ వత్సరా! రమ్యమొప్ప!!


3). తే.గీ.

హర్షము తఱిగి జగతిలో హత్యలెగసి

విలువల వలువలు విప్పగ వికృతమొందె!

శాంతి కూర్చగ నరులకు క్రాంతినిడగ!

కదలి రావె వసంతమా! ఎదలు విరియ!!


4). తే.గీ.

శ్రేష్ట సాహితీ పథమందు శ్రేయమిడగ

మేటి ధార్మికరంగాన మేలుగూర్చ

భవ్య నైతికవిలువలు పాదుగొల్ప 

రమ్ము ప్లవవర్ష! సుస్వాగతమ్ము పలుక!!


5). తే.గీ.

వర్తమాన జీవనరేఖ వర్ధమాన

మగుచు, భవితయేమొ ప్రవర్థమానమగుచు

ప్లవ వసంతమా! రమణీయ ప్రగతి గాంచ!

నిత్య నూత్న చైతన్య సందీప్తశోభ!!


హామీపత్రం:

       ప్లవ వసంతమా! సుస్వాగతమ్ము!! అనే శీర్షికతో విరచితమైన కవిత నా స్వీయరచన. దేనికీ అనుకరణం, అనుసరణం కాదని తెలియజేయుచున్నాను.

45

[11/04, 10:48 AM] +91 99513 07281: పేరు:వై.రమ్య

ఊరు: డోర్నకల్

మండలం: డోర్నకల్

జిల్లా: మహబూబాబాద్

శీర్షిక: ""ఉగాది""


నవ్యమైన కాలానికి 

స్వాగతం పలుకుతూ

ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చినా

గతకాలనికి వీడ్కోలు పలికే వేళ

విప్లవ వసంతం వచ్చే శుభాతరుణం

తోలి ఉషోదయంలా" ఉగాది"

తెలుగు సంస్కృతి సంప్రదాయాలను" ఉగాది"

షడ్రుచుల మిళితమైన "ఉగాది "

ప్రకృతితో మమేకమైది "ఉగాది"

కోయిలమ్మ రాగంతో ..

ఆనందాల హరివిల్లును తెచ్చినది" ఉగాది"

అనుబంధాలను మాలికగా ""ఉగాది""

కొత్త  బట్టలు కొలహలమే"ఉగాది"

సప్తవర్ణాల ఆశ తోరణమే"ఉగాది"

సుఖదుఃఖాలు కలయికతో

సవాళ్ళను స్వీకరిస్తూ...

జయాపజయాలను నేర్పుతూ

జీవిత సారాన్ని తెలిపేను" ఉగాది"


హామీ పత్రం

 నేను పంపుతున్న ఈ ఉగాది అనే కవిత నా స్వీయ రచన అని హామీ ఇవ్వగలను.

46

[11/04, 12:37 PM] +91 99124 17417: వీరాస్ కవి సమయం


పేరు: వేదాంతం. విశ్వప్రసాద్

ఊరు: చెన్నూర్

మండలం: చెన్నూర్

జిల్లా: మంచిర్యాల

శీర్షిక:ప్లవా నీకు శతకోటి వందనాలు


కవిత:


శార్వరి చేదుజ్ఞాపకాలు చెరిపేస్తూ


కరోనా రక్కసిని కర్కశంగా అణిచేస్తూ


ప్రపంచానికి శాంతి సౌభాగ్యాల్ని ప్రసాదిస్తూ


విప్లవాత్మక మార్పులకు బీజం వేస్తూ


ప్లవ నామ సంవత్సర ఉగాది వస్తుంది


ప్రమోదాలెన్నో తన వెంట మోసుకు వస్తుంది


ఆరు రుచుల పచ్చడితో ఆరోగ్యాన్ని పెంచుతుంది


ఆహ్లాదకర వాతావరణం తో ఆనందాన్ని పంచుతుంది


పంచాంగ శ్రవణాలతో భవితను వివరిస్తుంది


పుష్కలంగా వానల్ని పుడమిపై కురిపిస్తుంది


పాడి పంట లతో రైతన్నల మురిపిస్తుంది


కరువు కాటకాలను కాలరాస్తుంది


ఆనందోత్సాహాలతో ప్లవను సాదరంగా ఆహ్వానిద్దాం


శత కోటి మంగళ హారతులతో స్వాగతిద్దాం



హామీ పత్రం:

ఈ కవిత నా స్వంత రచన అని గతంలో ఎక్కడా ప్రచురితం కాలేదని హామీ ఇస్తున్నాను.వేదాంతం.విశ్వప్రసాద్

47

[11/04, 1:00 PM] +91 73309 38773: అంశం :  ఉగాది

పేరు:షేక్ రహీమ్ సాహెబ్

ఊరు:పొన్నూరు

జిల్లా:గుంటూరు

చర వాణి:7330938773

శీర్షిక : ఉగాది ఉషస్సు


ఉషోదయపు కాంతుల ఉషస్సులో

కొంగొత్త ఆశలు ఆశయాలతో

పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ

గత కాలపు వీక్షణలు గుర్తు చేసుకుంటూ

శార్వరి నామ సంవత్సరపు వింతలను నెమరువేసుకుంటూ

ప్లవ నామ సంవత్సరం పుష్పించే పరిమళాల వలే

ప్రజలందరూ సుఖ సంతోషాలతో భాసిల్లుతూ

షడ్రుచుల కొత్తదనపు వీచికలై

అను నిత్యం ప్రతినిత్యం అందరూ ఆనందంతో

మోడువారిన చెట్టు చిగురించినట్లు

ప్రతి మనిషి జీవితం సాగాలని

ఆటు పోట్లుకు తట్టుకుంటూ

ఉత్తేజమైన నవ విజ్ఞానులై

వినయ విధేయతలు పెంపొందించుకోవాలనీ

కాలపు పరుగులతో కదిలే పక్షుల్లా

బంధాలను వీడకుండా బాధ్యులై

ప్లవనామ సంవత్సరంలో పయనించాలని

శుభ సంకల్పాలను ప్రసరింపజేయాలని

జగ జగాన ఉగాది జయ కేతనం ఎగర వేయాలని

అందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని

అందరం బాగుండాలి అందులో మనముండాలంటూ

వత్సరానికో నవ ఉగాది ఉషస్సు తో శోభిల్లాలని....


ఇది నా స్వీయ రచన ఎక్కడ ప్రచురణ గానీ ఆమోదం గానీ లేదని హామీ ఇస్తున్నాను

48


[11/04, 3:01 PM] +91 94401 46435: *వీరాస్ కవిసమయం వారి ఉగాది కవితల పోటీ కోసం*

**************************

*పేరు:వనపర్తి గంగాధర్*

ఊరు:హన్మకొండ

జిల్లా:వరంగల్ అర్బన్

*శీర్షిక:ప్లవము ప్రమోదము*


అప్పుడే గడిచింది 'శార్వరి' సంవత్సరము

ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చి

ఆనందాలను దూరం చేసి

విషాద వధనంతో వెళ్లిపోతోంది 'శార్వరి'


'శార్వరి' మిగిల్చిన చేదు జ్ఞాపకాలను

దూరం చేయాలని ఆశగా వస్తుంది

నూతన వత్సరం'ప్లవ' నామ ఉగాది

ఆరు రుచుల ఆనందాలను పంచాలని

'కరోనా'విషాదాలను తుషారాలుగా మార్చాలని

చేదు జ్ఞాపకాలను తీపి రుచులుగా

చేయడానికి వస్తుంది నూతన వత్సరమై ఉగాదిలా...


బాధల బందీలుగా మారిన మానవులకు

ప్రమోదాల వెల్లువెను తెస్తుంది

ప్రతి మనసుకు ఆనందం పంచాలని

పుడమిపై పుష్కలంగా పాడి పంటలు ఇవ్వాలని

ప్రతి హృదయాన్ని సంతోష సాగరం చేయాలని

వస్తుంది ప్లవ నూతన వత్సరమై


ఓ ప్లవమా ... మా బతుకున

భరోసా వసంతాలను నింపాలని

శుభ సంకల్పాలను ప్రసాదించాలని

అందరూ బాగుండాలని నిన్ను ఆహ్వానిస్తున్నాం

వేకువ జాములమై,ఉషస్సు కిరణాలమై.....



హామీపత్రం:

                  ఈ కవిత నా స్వీయ రచన అనువాదం అనుసరణ కాదని హామీ ఇస్తున్నాను

49


[11/04, 3:46 PM] +91 95027 09070: *వీరస్ కవి సమయం వారి ఉగాది కవితల పోటీ కోసం*

పేరు: *ఆనం ఆశ్రిత రెడ్డి*

ఊరు: *ఆచెర్లగూడెం*

జిల్లా: *ఖమ్మం*

చరవాణి: 9502709070


శీర్షిక: *ఉగాది వేడుక*


కవిత:

తెలుగువారి పండుగ ఉగాది 

తెలుగు మనసులో శాశ్వత పునాది 

ఉగాది పండుగ ఒక అందం 

అదే తెలుగువారికి ఆనందం

ఉగాది నాడు ఉగాది పచ్చడి విందు

అది తింటే సంతృప్తి పొందు 

ఉగాది ఒక గొప్ప పండుగ 

దాన్ని మనిషి జరుపుకుంటారు ఎంతో నిండుగ 

ఉగాది అనుబంధాల హరివిల్లు 

ఉగాది సంతోషాల పొదరిల్లు 


హామీ పత్రం: ఇది నా సొంత రచన ఎలాంటి అనువాదం,అనుకరణ కాదు అని హామీ ఇస్తున్నాను

50


[11/04, 4:05 PM] Gundla Raju Sir: *వీరాస్ కవి సమయం*

పేరు: *గుండ్లరాజు*

ఊరు: *సిద్దిపేట*

మండలం: *సిద్ధిపేట*

జిల్లా: *సిద్ధిపేట*


శీర్షిక: *స్వాగతమమ్మా ఉగాది*


మళ్ళీ ఎప్పటిలాగే

ఆమని అందాలను అలంకరించుకొని

అందంగా ముస్తాబై

వచ్చింది ఉగాది తల్లి...


ఏమని వ్రాయను ఉగాది మాతా??

ప్రతి సారి వ్రాస్తున్నదేగా!!


అయినా...

షడ్రుచుల సమ్మేళనంలో

మా నవ పరిమళం

పులుముకునే దాకా రాస్తాను...


లేలేతగా చిగురేసిన లేజిగుళ్లను

మేసిన కోయిల చేదు నిజాలను

తియ్యగా కూస్తుందని వ్రాయనా!

పాత మాటలకే కొత్త స్వరాలను కూర్చి

సంగీత కచేరీ చేస్తుందని వ్రాయనా!


శార్వరి మోసుకొచ్చిన

కొత్త కొత్త పదాలను

మా మనసు పొరల్లో నుండి

జన సందోహం మురిసేలా...

నీవైనా తొలగిస్తావా??

హృదయ వికాసం జరిపిస్తావా!

నవోదయం చూపిస్తావా!


కాలం వేసిన కాటుకు

రెక్కలు తెగిన పక్షుల్లా

గువ్వపిట్టల్లా గుడులోనే ఉండిపోయిన

వలస జీవులహృదయాలలో

ప్లవనామ వత్సరం పల్లవించాలి...

వేకువ పువ్వులు పూయించాలి...

తొలి ఉషస్సులనందించాలి...


హామీ పత్రము: ఇది వీరాస్ కవిసమయం ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్బంగా వ్రాసినది. దేనికి అనుసరణకాదు, అనువాదం కాదు అని తెలియ చేస్తున్నాను.

చరవాణి: 9885257050.

51

[11/04, 7:18 PM] +91 91217 16068: పేరు : జ్ఞానప్రసూనాశర్మ ఎల్లికంటి

ఊరు: కడ్తాల

జిల్లా::  రంగారెడ్డి

చరవాణి  9493112429

అంశం : *ఉగాది*

శీర్షిక:: *నవవసంతం*

----------------------------------------


ఓ వసంతమా !ఓ వసంతమా!

నవయుగాది  శోభగూర్చ నడచిరావమ్మా!!ఓ!!


1.కోకిలమ్మ పాటలే ఆహ్వాన గీతికలై

  కొత్తచిగురు అందాలు మెత్తని పరుపులుపరువ

  కోటిఆశలునింపే కోమలివై తరలిరా

  నడయాడే నవయుగాది వై!!ఓ!!


2. తుమ్మెద నాదంమధురనాదస్వరమై పిలువ

     వాకిటవేసినముగ్గులు  పాదాలకు పసుపుపూయ

      పూవులపుప్పొడినుదుట కుంకుమయైశోభిల్లగా

       నడయాడే నవయుగాదివై!!ఓ!!


3.పచ్చనైన ప్రకృతే పట్టుచీరయి మెఱియు

  మామిడాకు తోరణాలు మంగళహారతులీయ

  వేపచిగురు  మధురవేణుగామై పిలువ

  నడయాడే నవయుగాది వై!!ఓ!!


4.షడ్రుచులకలపోతయే సమ్మోహనమై పిలువా

  చల్లని పానీయంబే ఉల్లాసమ్మును నింప

  మధుర రుచులనారగించి మంగళకరమై నిలుచు

  నడయాడే నవయుగాదివై!!ఓ!!


 హామీ పత్రం

**********

ఈ రచన నా సొంతం దేనికీఅనువాదం కాదు .ఎవరి రచనకూ కాపీ కాదు.

52

[11/04, 7:19 PM] +91 93465 39248: ✳️✳️✳️✳️✳️✳️


*వీరాస్ కవి సమయం*

*పేరు ః*భార్గవ రామ్ 

*ఊరు ః*యర్రగుంట్ల 

*మండలం ః*గార్లదిన్నె 

*జిల్లా ః*అనంతపురం 

 

*శీర్షిక ః*ఉగాది 

*కవిత ః  

శార్వరి 'కటిక చీకటి 'ని చీల్చే మిణుగురే వి'ప్లవ'మై

రాలిన ఆకులు అడియాశలే! కొత్త కొత్త లేలేత చిగురులతో వసంత రూపమై

నలుపంటే 'కలుపు' కాదు, కొత్త వలపును కలిపే స్వరం కోకిలదై

సకల సత్కార్య కారకమై, ఉత్ప్రేరకమై

ఆది గా నిలిచినదే ఉగాది


మండుతున్న ఎండలెన్నున్నా, నీకు తోడుగా నీడనై

గుబురుగా పెరిగి పల్లె వాసుల కబుర్లకు చోటునై

నా కొమ్మలను నరికినా, నా రూపును చెరిపినా

మీ 'కొమ్మ'ల, చెల్లమ్మల సిగలో పువ్వునై

ఇన్ని కనువిందుల రూపమై,

మా ఊరంతా సంతగా, మా మనసంతా వసంతమైదే ఉగాది


ఉగాది పచ్చడి  పరమౌషధం

నేటి సంకల్పం  జీవితానికి రూపకల్పన

పంచాంగ శ్రవణం ఆశాజనకం

కొత్త బట్టలు కొత్త ఆలోచనలు

ఈ మిశ్రమ రూపమే ఉగాది


తెలుగోడి రుచికి, శుచికి

తెలుగు జాతికి, ఖ్యాతికి

తెలుగు సంస్కృతి కి, సాంప్రదాయానికి

తెలుగోడి ఔన్నత్యానికి, ఔదార్యానికి

నిదర్శన రూపమే ఉగాది


 తైలాభ్యంగనం దారిద్ర్య దహనం

ఇంద్రపూజ మనోనిబ్బరం

షడ్రుచుల మిశ్రమం వాత పిత్త కఫ దోష నివారణం

ఆచారాలే కాదు నిగూఢ శాస్త్ర నియమాలు

మన ఉగాది చరిత తెలుగోడి ఘనత 


*హామీ పత్రం:*ఈ కవిత నాదే అని, దేనికి అనువాదం కాదని, మరెక్కడా పోస్ట్ చెయ్యలేదని హామీ ఇస్తున్నాను....



✳️✳️✳️✳️✳️✳️

53

[11/04, 7:43 PM] కందూరి సుజాత Poetess: విరాస్ కవి సమయం


కందూరి సుజాతారాణి 

కవయిత్రి రచయిత్రి 

సామాజిక సేవాకర్త.. 

రాజంధ్రనగర్, హైదరాబాద్ 

రంగారెడ్డి 

939216282🌷

................  ........  .....

అంశం.. ఉగాది 

శీర్షిక.. 🌷వసంత పుష్పం 🌷

.............   .........  .......

ఉగాది ఉగాది తెలుగు శుభాదీి .

ప్రకృతి పైట కొంగుమాటు దాగినా తెలుగు  సాంబ్రాణీ. 

తారలు దిగి వచ్చి దీవెనలు ఇచ్చు తిథీ.

యుగాల కదిలించూ  తరాల తరలించూ 

ఉగాది యాత్రలో తెలుగు జాతరా.


సంప్రదాయ ఆహార్యం  పోలెల ఆహారo . ఊహించని కలయిక సమ్మోహన ప్రక్రియా షడ్రుచుల పచ్చడి అమృతమూ .

మంగళ పంచాంగ పఠన పీఠములూ.

ఖుషి ఖుషి ఊయలా జాతక గీతాలూ.

నాంది సంవత్సర ప్రార్థన గీతమూ. 

అనాది పండుగల  గంటారామమూ. 

ఉగాది చైత్రమూ ఫ్లవనామ సుప్రభాతమూ 


గున్నమామి కొమ్మ ల్లో పుల్ల మావిల్లూ

కోకిల గానములూ .

గుబురు పొదరింట్లో  పెళ్లి బాజలూ

వలపు చూపులూ. 

ఉగాది వాకిట్లో వధూవరుల కొత్త కాపురమూ. 


ఉగాది వీధులూ

సిగ్గుల సీతమ్మ  కోదండ రామయ్య పెళ్లి  తలంబ్రాల తరుణమూ.

ఏటికేడు ఇదే తీరు వర్ణము. 

నింగిని తాకుతున్న భక్తి ఉరుస్సూ. 

పుణ్యఃఫలముల రట్నమూ

తెలుగు పండుగల సరస్సూ. 


ఉగాది ఉగాది ఉత్సవ కెరటమూ

నవ వసంత పుష్పమూ .

..............  .............  .......

హామీ.. పై కవిత  నా స్వీయ రచన.

54

[11/04, 8:00 PM] +91 99597 05519: అనగనగా

_________________

నీలిగా ఉండే ఆకాశం ఏవరి స్వార్థనికో రంగు మార్చుకుంది/

చేతుల కొమ్మలు కొట్టేసిన కొన్ని చెట్లు అంగవైకల్యాన్ని మోస్తూ/

ఆశగా చిగురించే ఆకుల కోసం ఆరాతీస్తున్నాయి/

స్వేచ్ఛగా తిరిగే గాలంతా కలుషితంలో గల్లంతయ్యి/

ధూళి పొగలో ఊపిరి పోసుకుంటుంది/

అగ్ని గోళంలా మండుతున్న నీ స్వార్థానికి/

అమాయకంగా అడవంతా కాలిపోయింది/

అప్పుడు కాలం కర్మఫలితం అని ఎర్రగా నవ్వుతుంది/

అక్కడ 

 ఆశల రెక్కలు కట్టుకున్న నీలాగే/

ఆకలి రెక్కలు కట్టుకుని ఎగిరే పక్షులున్నాయి/

సంకెళ్ళు లేకుండా యధేచ్ఛగా తిరగాలనుకున్న నీలాగే/

స్వాతంత్య్రన్ని కోరుకునే జంతువులున్నాయ్/

తరానికి తరానికి మధ్య నాగరికతంటూ  ఓ నగరాన్ని  నిర్మిస్తూ నవ్వుతావు/

నిశ్చ్వాసమైన దేహన్ని దాచడానికి నేల కరువని నువ్వెప్పుడూ తెలుసుకుంటావ్/

వాళ్ళు,వీళ్ళు అవి ఇవి అంటూ వేరుగా ఏవి లేవు/

అందరి గుండెచప్పుడులు ఒక్కటే/

కాలం రంగులు మారుస్తూ ఆరు ఋతువులిచ్చింది/

నిమిషానికో రంగు మార్చే నీకోసమొక్కటే కాదు/

గుర్తుంచుకో

అనగనగా ఒక రోజు అని ఒక కథ చెప్పెముందు/

అనాథగా నువ్వు మాత్రమే మిగిలుంటావ్/

అంతా అయిపోయాక ఆయువు పోయాడానికి ఆర్థించే నీ చేతుల మధ్య కాలం కరిగిపోకముందే/

ప్రకృతి దీపానికి ప్రాణం పోయి/

రంగు రంగుల ప్రపంచాన్ని చూసేది/

నిస్వార్థమైన కళ్ళు నీకుంటేనే అని ఎప్పటికి మర్చిపోకు/


పి.సుష్మ

మక్తల్

నారాయణపేట జిల్లా

9959705519 

psreddy9959@gmail.com 


హామీ పత్రం 

****************

నేను రాసిన పై  కవితను  వీరాస్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న కవితల పోటీకి పంపుతన్నాను. ఈ రచన పూర్తిగా నా సొంతం. ఈ రచన మొత్తం కానీ, ఇందులో భాగాలు కానీ ఏ ఇతర రచనకూ కాపీ, అనుసరణ, అనువాదం కాదని హామీ  ఇస్తున్నాను. నా రచన మరే ఇతర రచయితల/ ప్రచురణకర్తల కాపీరైట్‌లనూ ఉల్లంఘించడం లేదు.

55

[11/04, 8:20 PM] Tiru Venkatacharyulu Ks6: వీరాస్ కవిసమయం

ముడుంబ తిరువేంకటా చార్యులు మానుకోట. 


' ప్లవ ' నామ ఉగాదికి స్వాగతం. 


అశ్విన్యాది నక్షత్రములిరువదియేడు , అమవసనిశినుండి పూర్ణిమా యుక్తముగ తిథులు షోడశములు , ద్వాదశరాశులలో దినకరునిగమనమును బట్టి సౌరమాసములు , పూర్ణిమతో కలసివచ్చు నక్షత్రనామములతో చాంద్రమాసములు , 

వేనికవే పునరావృతమవుతున్నా 

షడృతు పరిణామములతో కలసివస్తూ , తొలినక్షత్రమగు అశ్వినితో కలిసి ఉండే శుక్లపాడ్యమి ' ఉగాది ' లేదా 

' యుగాది ' లేదా ' సంవత్సరాది ' అవుతున్నది. 

'ఉగ'మనగ నక్షత్రము , తొలి ' ఉగము ' తో కూడిన తొలి తిథియే  

' ఉగాది '. 

ఏ వత్సరానికైనా , ఏ యుగానికైనా ఇదే తొలి రోజు. 


మరల మరల వచ్చు అరువది వత్సరములలో ముప్పదియైదవ వత్సరముగా అడుగిడుతున్నది 

' ప్లవ ' నామ యుగాది. 

' ప్లవ ' మనగా ' తేలిపోవుట ' లేదా 

' ఎగురుట ', 

' కప్ప ' లేదా ' కోతి ' యని నానార్థములు. 

' ప్లవంగము ' డనగ 

' కర్మసాక్షి ' సూర్యభగవానుడే. 

ఈ వత్సరము ప్రజలెల్లరు 

ఆ ' ప్లవంగముని ' ఆశీస్సులతో ఆటంకములన్నియు అధిగమించి , 

కలుద్రావిన ' ప్లవంగము ' la వలె చిందులు వేయుటగాక , మరి 

' మండూకము ' ల వలె 

అటునిటు దుముకుటయు గాక 

' స్థిరచిత్తము ' న నిలిచి , 

సద్బుద్ధుల నడచి , 

సదాచారముల పాటించి , 

' కంకణబద్ధులై ' కరోనా క్రిమిని పారద్రోలి , ఆనందాతిరేకముల తెలియాడెదరు గాక ! 

******* ******* ******* 

ఈ రచన నా స్వంతము . ఈ ఉగాదికి , వీరాస్ కవిసమయము కొరకే ప్రత్యేకముగా రాయబడినది. ధృవీకరిస్తున్నాను. 


MTV ఆచార్య మానుకోట.

56

[11/04, 8:54 PM] మర్రి జయశ్రీ: వీరాస్ కవిసమయం

పేరు.. మర్రి జయశ్రీ

ఊరు..మోత్కూర్

మండలం..మోత్కూర్

జిల్లా...యాదాద్రి

శీర్షిక...ఏమని చెప్పను.?





అమ్మా! ఉగాది!

ఏమని చెప్పను..?

వసంత ఋతువు ఊసులు ఉత్సాహంతో చెప్పనా!

నీ సోదరి  శార్వరి వస్తూనే

మోసుకొచ్చిన విపత్తుల లీలలు వర్ణించనా!

యంత్రంలా తిరిగే మనుషులను

ఏకాంత పంజరాల్లో బంధించి

మనిషికి మనిషినే దూరం చేసిన మానని గాయాలను విన్నవించినా!

ప్రకృతితో చెలగాటం ఆడిన పాపానికి మళ్ళీ మళ్ళీ ప్రతీకార జ్వాలలు రగులుతున్న వింతలు వివరించనా

మూగజీవులను బాధించి ఊసురుమంటూ ప్రాణాలు తీసిన  పాపానికేనేమో

మూతికి మాస్క్ లేకుండా 

బ్రతకలేని స్థితి కొని తెచ్చుకున్న నిజాలన్నీ వివరించనా!

స్వార్థం పొరలు కమ్ముకొని

భూమిని కబ్జా చేస్తూ

రియల్ దందాలతో మోసం చేసిన  మనిషికి నేడు

ఆరడుగుల నేలే కరువై0దని 

ఎలా తెలుపను తల్లీ!

చీకటి వెంటే వెలుతురు అన్నది నిజమేనని నా మదికి  తోస్తుంది!

ఫ్లవ నామ సంవత్సరం

మార్పులెన్నో చేస్తుందిని

కమ్మిన కారు చీకట్లు తొలగించి

మన ఆకాంక్షలు నెరవేరుస్తుందని!

 కోటి కాంతులు ప్రసరింపజేస్తుందని!!

57

పేరు: చిన్నెల్లి యాదయ్య                                            ఊరు: కేరూర్                                                                                          మండలం:వట్ పల్లి                                                                        జిల్లా:సంగారెడ్డి                                                                                   ----------------------------------------       శీర్షిక: ఉగాది పర్వదినం                                            ----------------------------------------     శార్వరి కటిక చీకటి                                                                    కరోన కాటుతొ కాలం గడిచిన                                   ప్లవనామ ఉప్పెన పై                                                                 తెప్ప వలె సాగాలని                                                            ఉగ అనగా నక్షత్ర గమనం                                   ఆది అనగా మొదలు                                                             అందుకే అయింది ఉగాది                                           చైత్ర శుక్ల పాడ్యమి రోజున                                                యుగాది పండుగ పర్వదినం                              తీపి,కారం,పులుపు,వగరు                                   లవణం,చేదు ఉగాది పచ్చడి                                   శిశిరంలో ఆకులు రాలి                                                      వసంతంలో చెట్లు చిగురించు                               ప్రకృతి కాంత శోభాయమానం                         కోయిలల కుహు కుహు రాగం                     తెలుగు వారి తొలి పర్వదినం                      ఈ నవ వసంత ఉగాది.                                                 ----------------------------------------          హామీ పత్రం                                                                                                    ఇది నా స్వీయ రచన ఎక్కడ             కూడ ముద్రితం కాలేదని నేను        హామీ ఇస్తున్నాను.






ఈ కవిత నా స్వీయరచన.ఎక్కడ ప్రచురించబడలేదు.సమూహం కోసమే రాయబడినదని హామీ ఇస్తున్నాను.

Comments

Popular posts from this blog

తిరు వేంకటాచార్యులు KS 6

బాటసారి KS 12

అనామికా శతకం విట్టుబాబు గారు