బాటసారి KS 12


అడ్రస్

BATAASARI,  KAVI
3-240
ZEE GUTHA THANDA
POTHIREDDYPALLY
[POST] PALEM
MANDAL, THIMMAJIPET
DIST, NAGAR KURNOOL
TELANGANA STASTE
509215
9440174050
9440704050
batasari2016@gmail.com
--------------------------
కవి పేరు :-బాటసారి
జిల్లా       :-నాగర్ కర్నూల్
కవిత సంఖ్య :-01
కవి క్రమ సంఖ్య :-12
-------------------------------

•••కాటేస్తున్న కరోనా•••

ఈశాన్య దిక్కున చైనా గర్భాన  జన్మించి విష గాలి జగతినంతా ఆవరిస్తున్నది
ధనిక పేద వర్గ వైశమ్యం లేకుండా
ముసలి ముతక ఎవరిని వదలక...
ప్రపంచ దేశాలను చుట్టి...
ఇప్పుడు...
మాతృదేశానికి కాటేయడానికి
కంకణం కట్టుకుంది...

బడులు బంద్  చేయడానికి గుడులలో ధూప నైవేద్యాలను మింగడానికి
కార్ఖానాలో కార్మికుల పచ్చి రక్తం పీల్చడానికి
పార్కులలో మాట్లాడి కరచాలనం చేయడానికి పబ్బులలో  డ్యాన్స్ చేయడానికి

నా మాతృదేశాన్ని
ఉక్కిరిబిక్కిరి చేయడానికి
ఊపిరాడకుండా చేయడానికి
కరోనా కోరలు చాచింది

పెళ్లిళ్లు, పేరంటాలు, సభలు,
సమావేశాలు,  ర్యాలీలు, నిరసనలు
బార్లు రెస్టారెంట్లు హోటళ్లలో ప్రార్థన మందిరాల్లో  రైల్వేస్టేషనలలో పలుకరించి
అనకొండలా మింగేయడానికి...

సమూహాలుగా వద్దండి
సింగిల్గానే ముద్దండి
మందులు విందులు వద్దండోయ్
దోస్తులకు దూరంగా ఉండాలోయ్  ప్రయాణాలు రద్దు చేయాలోయ్
కరచాలనం వద్దండీ
భారతీయ సంస్కృతికి
చిహ్నమైన సంస్కారమైన
నమస్కారం ముద్దండి

స్వయం నియంత్రణ పాటించండి
మాస్కులు ధరించండి
కరోనాని అరికట్టండి

      ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[19/05, 11:43 AM] బాటసారి 25: వీరాస్  కవి సమయం

---------------------------
కవి పేరు :-బాటసారి
జిల్లా :-నాగర్ కర్నూల్
కవి క్రమ సంఖ్య :-12
కవిత సంఖ్య     :-02
------------------------------
మారుమూల పల్లెటూరు పోరుబందర్లో పుట్టి
అహింస ఆయుధం చేతపట్టిన చైతన్యమూర్తి
భారతావనికి బానిససంకెళ్లు తెంచినవాడు గాంధీజీ

స్వదేశీ వస్త్ర ఉద్యమానికి ఊతకర్రయై   విదేశీవస్త్రాలను బహిష్కరించినవాడు                                  చరఖాపట్టి ఖద్దరు నేసినవాడు గాంధీజీ

దండి ఉప్పు సత్యగ్రహోద్యమంలో
దేశానికి చీమలదండును కట్టినవాడు
తెల్లదొరలను తరిమినవాడు గాంధీజీ

గోచిగుడ్డ కట్టి కర్ర పట్టుకొని దేశమంతా     
ఒంటిపై గుడ్డలేక తిరిగి జాగృతం చేశాడు
భారతదేశ చెర విముక్తి చేసినవాడు గాంధీజీ
                                                                               పాదయాత్రలు చేసి పల్లెలను నిద్రలేపి
గల్లీ నుండి ఢిల్లీదాక పోరుబాట పట్టించాడు
తెల్లదొరలను ఉరికించినవాడు గాంధీజీ                 


   ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[19/05, 11:43 AM] బాటసారి 25: వీరాస్ కవి సమయం

-----------------------------
కవి పేరు :-బాటసారి
జిల్లా   :-నాగర్ కర్నూల్
కవి క్రమ సంఖ్య :-12
కవిత సంఖ్య     :-03
శీర్షిక :-
• తెగిపోతున్న బంధాలు••
 ----------------------------------------                                                 

ఒకే గర్భంలో పుట్టి
పేగుబంధంతో పెనవేసుకున్నాము
నీవు వేసుకున్న అంగీ, లాగు
నేవేసుకున్నాను

నీవు తొడిగిన చెప్పులు నేతొడిగాను
ఒకే రొట్టెలో  చెరి సగము తిన్నాము
అవ్వ కుట్టిన బొంతలో నిద్రపోయాము
నా చేతగాక నా పుస్తకాల బస్తా
నీవు  మోస్తివి

నాకు బువ్వ తినిపిస్తివి
*కారమైతే నోట్లో నోరు పెట్టి ఊదుతివి*
పంతులు పలక బలపం లేక బడి నుంచి వెళ్ళ గొడితే
నాకిచ్చి
*నీవు దెబ్బలు తింటివి*

కంచం ఒకటే మంచం ఒకటే
బడిలో కడుపునొప్పితో
దొడ్డికి పెట్టితే
*ముడ్డి కడిగితివి*
*మూతి తుదిస్తివి*

ముక్కు జారుతుంటే  ఛీదరించక
*నీ అంగీతో తూడిస్తివి*
నేను ఏడిస్తే నువ్వు ఏడిస్తివి
వానొచ్చిందంటే నీ పుస్తకాల సంచి
గొడుగు చేస్తివి
నేనవ్వితే నువ్వు ఆకాశమంత నవ్వితివి
అ ఆలు దిద్ద రాకపోతే *వేలుపట్టి దిద్దిపిస్తివి*

నీవు రాసిన పెన్నుతో
*నా రాతను  మారుస్తివి*
నా కాళ్లకు పల్లేరుకాయ గుచ్చుకుని
*వలవలా ఏడుస్తుంటె*
చూడ లేక  నీవు *ఏడిస్తివి*

పెరిగి పెద్దయ్యాక బంధాలన్ని
దూరం అయ్యాయి...

బహు దూరం అయ్యాయి...
అవ్వ కథలు...
తాత్తయ్య సామెతలు...
మంచం కోళ్ళ కథలు....
నేడు *కనుమరుగయ్యాయి*...
ఇంటి బంధాలు  *బంధువైయ్యాయి*...

అనుబంధాలు
*కలుషితమవుతున్నాయి*....
ప్రేమా లేదు ఆప్యాయత అసలే లేదు
అంత డబ్బుమయం ఇదో విష వలయం
*విష వలయం చేధించలేక*
*గిలగిలా కొట్టుకుంటూ*.......
ఒంటరై పోతున్నాము...

ఆస్తి కోసం  అమ్మ,  నాన్న,  అన్న, చెల్లి  తమ్ముడు  బంధాలు తెగిపోతున్నాయి
అనుబంధాలు మాయమవుతున్నాయి
అనురాగాలు *రాలిపోతున్నాయి*
ప్రేమ సంబంధాలు *కుప్పకూలి పోతున్నాయి*

జారిపోతున్న బంధాలకు *జన్మనిద్దాం*
తెగిపోతున్న సంబంధాలకు *ప్రాణం పోద్దాం*

        ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[19/05, 11:43 AM] బాటసారి 25: వీరాస్ కవి  సమయం
------------------------------
కవి పేరు :-బాటసారి
జిల్లా :-నాగర్ కర్నూల్
కవి క్రమ సంఖ్య :-12
కవిత సంఖ్య     :-04
శీర్షిక :- మేడే-నేడే
 -----------------------------                                     
దినంలో మార్పు లేదు
జీవితమే చిలుక జోస్యము
శ్రామిక శక్తి
అలుపెరుగనిపోరాట యుక్తి
ముక్తి కోసం
తరతరాల శ్రమ దోపిడిలో
తండ్లాటలో తల్లడిల్లుతున్న
కార్మిక జీవులు

 నాటి నుండి నేటి వరకు
చెమట ధారలుగా ఏరులై
పనిచేసే సత్తువ సచ్చిన
సిద్ధాంతాలను తొక్కిపట్టి
శ్రామికుల పచ్చి నెత్తురు తాగుతుంటే

లెండిరా ముందుకు పదండిరా
యువ శక్తి  పదండిరా
ఉడుకు రక్తం ఉప్పేనైతె
కార్మిక చట్టాల కోసం అగ్గి పుట్టించిన
కార్మిక లోకానికి వెలుగు చూపిన యోధుల్లారా
కార్మిక జనం కబంధాలు తెంచిన
ఎర్ర సూర్యుల్లారా  సెల్యూట్ చేద్దాం

         ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[19/05, 11:43 AM] బాటసారి 25: వీరాస్ కవి  సమయం
-----------------------------
కవి పేరు :-బాటసారి
జిల్లా :-నాగర్ కర్నూల్
కవి క్రమ సంఖ్య :-12
కవిత  సంఖ్య    :-05
శీర్షిక :-సురవరం మొగ్గలు
--------------------------------
తెలంగాణలో కవికులం లేరన్న అపవాదును                                                                  సవాలుగా తీసుకుని కవులసంచికను తీశాడు
ఆంధ్రులకు ధీటుగా సమాధానమిచ్చిన సురవరం

వలసల జిల్లా పాలమూరులో జన్మించి
తెలంగాణకు సాహితీ కిశోరమైనవాడు                                      తెలంగాణ ఆణిముత్యం సురవరం

ప్రజా చైతన్యకెరటమై దూసుకుపోతూ     
జగతిని జాగృతం చేసినవాడు                               తెలంగాణ జాతిరత్నం సురవరం

మారుమ్రోగిన గోల్కొండ పత్రికకు
సంపాదకుడిగా సేవలందించినవాడు
ప్రజాసమస్యలపై గళంవిప్పిన పులి సురవరం

ప్రజాపక్షమున ప్రజాక్షేత్రంలో ఎన్నో
ఎదురొచ్చిన సవాళ్లను ఎదుర్కొన్నాడు                             ఎత్తైన హిమాలయశిఖరం సురవరం

  ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[19/05, 11:43 AM] బాటసారి 25: వీరాస్ కవి సమయం
----------------------------
కవి పేరు :-బాటసారి
జిల్లా :-నాగర్ కర్నూల్
కవి క్రమ సంఖ్య :-12
కవిత సంఖ్య :-    06
శీర్షిక :-  ఎందుకో మరి
 -----------------------------                                       
అనుకున్నది ఒకటి
కలగన్నది మరొకటి
నేను అనుకున్నది
కలగన్నది ఏవి కావు,
రావు?   ఎందుకో మరి!
జ్ఞానం వచ్చినప్పటి
నుంచి ఇదే సూత్రం మరి!

అనుకున్నది ఒక్కటి
అవుతుంది మరొకటి
జీవితమంతా చీకటి చీకటి.....

ఎప్పుడూ చదువు సక్కగా చదవుకోలే
వీడు చదవుకి పనికిరాడన్ని
పశువుల కాడికి దోలిరి
నేనేమో చిన్నవాని
పశువుల మంద  పెద్దది
ఇరుకై బాటలో కంచె దూకి
చేను మేస్తుంటే
నేనేమీ  చేయలేని హీనస్థితి...

కాళ్లకు పల్లేరు
కాయలు గుచ్చుకొని
నెత్తురు ధారలా కారుతుంటే
ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే
ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఆవిరౌతుంటే

ఏమి రానా కొడకా
పటపట పండ్లు కొరికి
కండ్లల్లో రక్తం చిమ్ముతూ
ఊరి దొర పచ్చి
చింతకాయ బరుగుతో వాతలు పెట్టినయి  ఇంకా పచ్చిగానే ఉన్నాయి

బందరు దొడ్డికి పశువులు
ఉరికి ఉరికి నాన్నతో జెప్పగా
గడెం వదిలి మాసిన పంచే
చిరిగిన ఆంగితో
దొర కాళ్ళు మీద పడిన
కనుకరించపాయే....

కొరడాతో నాన్నకి వాతలు పెట్టి
ఒకటికి ఐదు రూపాయల
జరిమానా విధించే

ఆ జరిమానాకి
ఒక ఏడాది గాసం నాకు బహుమతి

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[19/05, 11:43 AM] బాటసారి 25: వీరాస్ కవి సమయం
------------------------------
కవి పేరు :-బాటసారి
జిల్లా :-నాగర్ కర్నూల్
కవి క్రమసంఖ్య :-12
కవిత సంఖ్య    :-07
శీర్షిక :-      బుడుగులం
    -----------------------------                             
 పిల్లలం బడి పిల్లలం
 పిడుగులం మేము బుడుగులం
 చక్కగా చదువులు చదివేస్తాం
 విద్యలెన్నో నేర్చేస్తాo
 బాధ్యతలను మేం గుర్తిస్తాం
 భవితకు పునాది నిర్మిస్తాం

 తల్లి తండ్రి గురువు దైవం
 భక్తి భావములను కలిగుంటాo
 అన్నా అక్క చెల్లి తమ్ముడు
 ప్రేమను మేము పంచేస్తాం

 కలతలు లేని రేపటి కోసం
 ఆశల సౌధం  కట్టేస్తాం
 సమతా మమతను పంచేస్తాo
 మానవత్వమును చాటేస్తాo

         ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[19/05, 11:43 AM] బాటసారి 25: వీరాస్ కవి సమూహం
--------------------------------
కవి పేరు :-బాటసారి
జిల్లా       :-నాగర్ కర్నూల్
కవి క్రమ సంఖ్య :-12
కవిత సంఖ్య     :-08
శీర్షిక :    "బంజారా పిల్లలం"   ----------------------------                                     

మేము పిల్లలం - గిరిజన తండాల్లో
ఉండెటోళ్లం
మేము పిల్లలం-అల్లరి పిడుగులం
భరత మాత పిల్లలం-భావి భారత పౌరులం

కల్లా కపటం ఎరుగని -మల్లె పువ్వులం
గుట్ట చెట్టు పుట్టలెక్కేటోళ్లం
లొంక లోయలో ఉండెటోళ్లం
ఎత్తయిన రాళ్ళను
కొండలనెక్కి గోనె సంచీ కట్టుకొని
తేనే పట్టు తీసెటోళ్లం
కాయలు పండ్లు ఆకులలములతో
ఆకలి తీర్చుకొనెటోళ్లం

బురద మట్టిలో పుట్టిన ఆయుధాలం
సేవాలాల్  సైనికులం
ఒంటికి సరిగ్గా గుడ్డలే లేనొళ్లం
అడవితల్లి బిడ్డలం
ఏమి ఎరుగని అమాయకులం
రోజుకు  రెండు పూటలా బువ్వలేని
అకలితో అలమటించే అభాగ్యులం

చదువుకొనికే  మైళ్ల దూరం నడిచి నడిచి కాళ్ళ పిక్కల దాకా లాగుతున్న......
బస్త సంచిలో పుస్తకాలు మోసి మోసి
వెన్నెముకలు  నొప్పులు పుట్టినా....
ఓర్చుకొని
మా రాతలు ఇంతేనా అని అనుకునేటోళ్లం
బాల్య చట్టాలకి మా తండా దారులే తెలియకపాయె

మా తండాకి  బడి వచ్చేది ఎప్పుడు
మా బతుకు చీకట్లు వెలిగేది ఎప్పుడు
మా బతుకంతా ఆకలి పోరు
మా హక్కులు సాధించేవరకు
రాజీలేని పోరాటమే మా జీవితము

         ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను



10
----------------------------
కవి పేరు :-బాటసారి
కవి సంఖ్య :-12
కవిత సంఖ్య :-10
శీర్షిక :-పసి తనం
-----------------------------
బాల్యం మసక బారుతుంది
బాల్యం మరిగిపోతుంది
బాల్యం బందీ కానాల
కింద బలౌతుంది
బాల్యం బందరు దొడ్డిలో
బందీలై విలపిస్తుంది

లేత గులాబీ మొక్కలు
వాడి పోతున్నాయి
లేత చిగురు బుగ్గలు
మాడిపోతున్నయి
బాల్యం పత్తి తోటలో
నలిగిపోతున్నది

పసి తనం
కుమ్మరి కొలిమిలో
సెగలౌతున్నది
గొర్లకాడ బర్లకాడ
చెట్టు పుట్ట గుట్టలకు
వేలాడుతున్నాయి

బాల్యం ఇటుక బట్టీల్లో
ఇనుప కంచెలో
కంపు కాలువలో
ఎక్కి ఎక్కి ఏడ్చి
ఓదార్పు లేక
కండ్లల్లో నీళ్ళు
ఆవిరై పోతున్నాయి

చాయ కప్పులతో
చిరిగిన బట్టలతో
అరిగిన చెప్పులతో
చిన్నారి చిట్టీ చేతులు
కాయలు కాసి
కాలిన వాసనతో
నలిగిపోతున్నాయి

ప్రభుత్వాలు మారినా
అధికారులు మారినా
బాల్యపు రాతలు మారలే

పథకాలు ఎన్ని ఇచ్చినా 
పంచేవోడు పంచుకున్నాడు
తినేవోడు  బలిసిపోతున్నాడు

గిరిజన గూడల్లో
తండాల్లో తన్లాడుతున్నరు
చిన్నారుల బతుకులు ఆగమై  విలవిలలాడుతున్నాయి

దొరగాని దొడ్డి కాడ
దొరసాని  కాళ్ళు  పిసుకుడు
దొరసాని లంగాలు ఉతుకుడు
వాళ్ళు తిన్నా గిన్నెలు కడుగుడు

ఎన్నాళ్ళు ఈ పసి బాల్యపూ
చెరిగిపోని రక్తపూ మరకలు
విముక్తి ఎన్నాళ్ళు?
బాల్యం విముక్తి కావాలి
పక్షిలా విహరించాలి

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

11
----------------------------
కవి పేరు :-బాటసారి
కవి సంఖ్య :-12
కవిత సంఖ్య :-11
శీర్షిక :-నా తోబుట్టువులు
-----------------------------
నా పుట్టుకతో నువ్వు
నా నెత్తురులో నువ్వు
నా మాటలలో నువ్వు
నా నడకలో నువ్వు
నా చదువులో నువ్వు
నా బువ్వ కంచంలో నువ్వు

మా ఇంటి తోరణం నువ్వు
మా ఇంటి హరివిల్లు నువ్వు
మా ఇంటి పొదరిల్లు నువ్వు
మా ఇంటి వాకిట్లో సిరిమల్లెచెట్టు
పువ్వు నువ్వు

మా ఇంటి పేరడిలో పూసిన
బంతి పువ్వు నువ్వు
మా ఇంటి దీపం నువ్వు
మా ఇంటి పాపవు నువ్వు
మా ఇంటి వెలుగు నువ్వు

మా ఇంటి ఇలావేల్పు నువ్వు
మా ఇంటి కష్టాసుఖాల వారధి నువ్వు
నీ బతుకు బతుకమ్మలా ఉండాలి
నీ కాపురం ఇంద్రధనుస్సులా ఉండాలి

జగతిలో  చెల్లివై
మరో జన్మకి తల్లివై
చిరంజీవిగా వెలుగొందాలి
12
-------
కవి పేరు :-బాటసారి
కవి సంఖ్య :-12
కవిత సంఖ్య :-12
శీర్షిక :-ఇరుకైనా బతుకులు
-----------------------------------
చూస్తే రంగురంగుల పూలతో అంలంకారం
అంతా రబ్బరు పూలే
చూస్తే ఆకాశమంతా అద్దాల మేడలు
లోపలంతా లోటారం
పైనా పెట్టారం
మేడ కింద పేడలు

మూసి నది ఒడ్డున మురిసిపోతూ0టరూ
కంప్యూటర్లో కాలం గడుపుతున్నారు
సెల్ ఫోన్లో సిగ్గు లేకుండా రొమాన్స్
రొచ్చులో మునిగి తెలుతున్నారు

కంపు వాసనలు
సొంపు జీవితాలు
ఇరుక్కులో ఈదుతున్నరూ

ఉరుకులు పరుగులు పెడుతున్న
కాలం జీవితన్నీ దుర్భరమైన 
దుఃఖానికి చేటు
పక్కనే వున్న ఇంటిలో
చావు మేళం మోగిన
పలకరించారు కదా సరి
పందులా మేక్కుతుంటరు
విశాలమైన మనస్సులు
పంజరంలో బందీలు

ఇరుకైనా గోడల మధ్య
కష్టమైనా, నష్టపోయిన ఇరుక్కుని
తండ్లాటలో తలదాచుకు0తున్నారు

పట్నం బతుకులు బాగుంటాయని
దోస్తీ చేపితే
మూట మూల్లే
పెట్టె సుట్ట 
చాప బొంత సుట్టుకొని
కలలు కంటూ పట్నం
పయనమైతే
పట్నం అంటే ఇరుకైనా
జీవితాల్ని ఇప్పుడే తెలిసి0ది

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

Comments

Popular posts from this blog

తిరు వేంకటాచార్యులు KS 6

అనామికా శతకం విట్టుబాబు గారు