బండి భాను చందర్ poet
నిర్వహణ
వీరా గుడిపల్లి
సమన్వయం
శివునూరి లలితాకృష్ణ
***********************
భాను చందర్ కవిత్వం
************************
1
[29/09, 7:30 AM] బండి భానుచందర్: పేరు : బండి భానుచందర్
శీర్షిక : మనస్సులో మాట
కవిత : 1
అక్షరమై నిలిచాను కవితవై అల్లుకోవా
అంబరమై వేచిఉన్నాను వెన్నెలవై చేరుకోవా
ఉదయమై నిలిచిఉన్నాను వెలుగువై తరలిరావా
నాకు నీ చెయ్యి అందిస్తే చితిలో ఉన్నా బ్రతికోస్తా
ప్రేమించావంటే కనురెప్పనై కనుపాపను కాస్త
నా జతగా నడుస్తానంటే మువ్వనై నీ పాదముపై నిలుస్తా నీవు నడిచే దారిలో పూలతోటనై వికసిస్తా
దారి పొడుగునా కావలి కాస్తా
చెలియా!.. అవునని చెప్పు నా అనువనువు నీదే
నేనే నీవని చెప్పు నా ఊపిరంతా నీకే!..
- భాను
2
[29/09, 7:30 AM] బండి భానుచందర్:
శీర్షిక : తొలిప్రేమ
తన నవ్వుల వలలో చిక్కుకుంది నా నయనం
తన నవ్వుల వెల్లువలో మునిగింది నా పయనం
తనే శ్వాసగా నిలిచింది నా ప్రాణం
తనే లేకుంటే నేనే శూన్యం
ఓ అందచందాల నిధి
నిన్ను నిలుప చాలునా నా మది
ఎరుగని శిల్పమా
ఎదుట నిలిచిన స్వప్నమా
ఎదను మీటుతున్న ప్రేమా
ఓ పూవ్వుల వనమా
నా విన్నపము వినవే భామా!..
[29/08, 12:50 PM] బండి భానుచందర్: పేరు : బండి భానుచందర్
3.
శీర్షిక: నీకై ఈ నిరీక్షణ
నా పెదవి అంచులపైన నిరీక్షిస్తూంది ఓకమాట నీకు తెలుపే సంశయంలో మనసు పట్టెను ఊహలబాట
నా హృదయస్థలంలో నీకై కట్టాను ప్రేమకోట
ఆ కోటలో విరబూసెను ఆశలతోట
ఆ తోటలో కోయిల పాడెను నీ పాట
అది వింటూ నీ తలపులో నేను మరిచాను నేనన్నమాట
[29/08, 3:09 PM] బండి భానుచందర్: పేరు : బండి భానుచందర్
4. శీర్షిక : జీవితమే ఓక ఆట
ఆట
గెలుపు, ఓటమిల మధ్య ఓ జీవితానికి ఆట
ఎన్నో కష్టాల నడుమ సాగే ఆట
ఏనాడు మోదలయిందో తెలీదు కాని
ఎందరినో విజయశిఖరాలను చేర్చింది
ప్రతిభ అన్నది ప్రతి మనిషికి సోంతమే
ఆ ప్రతిభను నిరూపించుకోనుటకు దారులెన్నో
ఆట ఏదైనా కావచ్చు
యుద్ధం ఎవరితోనైనా కావచ్చు
అలపోచ్చిన శ్రమ విడువకూడదు
అలలు అడ్డుగా ఉన్నా
అంబుధిని చేరే వరకు
ఆగకూడదు ఏ పరుగు
[09/09, 8:24 PM] బండి భానుచందర్: 5 .
పేరు : బండి భానుచందర్
శీర్షిక : ప్రేమకావాలి
నాకోసం ఎదురు చూసే రెండు కనులు కావాలి
ఆ కనులను చూస్తూ నేను ప్రపంచాన్ని మరువాలి
నాకోసం ఓక నవ్వు కావాలి
ఆ నవ్వులే నాలో నిండిపోవాలి
నా పేరును ప్రేమతో పలికే
రెండు పెదవులు కావాలి
ఆ పెదవులు మౌనంగా నను చూస్తున్నవేళ నా గుండె సందడి నాకు వినిపించాలి....
ఆ గుండెసందడి కంటే తననే ఎక్కువగా ప్రేమించాలి!..
[16/09, 6:41 AM] బండి భానుచందర్: 6.
పేరు : బండి భానుచందర్
శీర్షిక : కనికరములేని వర్షము
మేఘానికి మతి చెడినదా
ఆకాశం యాదమరిచి నిదురించినదా
చినుకుకు చిర్రెత్తినదా
చలిగాలికి చెలగాటమైనదా
ఏమిటో కనికరము లేని వర్షపు స్థితి
దినకరుడు దినచర్య తప్పి
ఏ దిక్కులోనైనా విశ్రాంతి తీసుకుంటున్నాడా
చంద్రుడు మేఘాల నడుమ చిక్కుకుని
పగలు ఏదో, రేయి ఏదో, తెలియని తికమకలో ఉన్నాడా
ఏమిటో కనికరము లేని వర్షపు స్థితి
మూడు దినములైంది నేలపై తడి ఆరకుంది
అవనే అంబుధిలా తలపిస్తుంది
వరదలు వాడ వాడను వనికిస్తుంది
అయినను అంబురము దయచూపకుంది
ఏమిటో కనికరములేని వర్షపు స్థితి
[17/09, 8:20 AM] బండి భానుచందర్: 7. పేరు : బండి భానుచందర్
శీర్షిక : మేఘమా తోలిగిపో!..
వానచినుకులకు హద్దులేదా
మేఘమా ఇకనైనా నిద్దురపోరాదా
ఆకాశమా కరుణ చూపరాదా
మాపై మీకు జాలి కలుగదా!..
మనుషులు పడే వ్యధలు చూసిన గగనం గుండె తల్లడిల్లి తన నయనము నుండి జారవిడుచు కన్నీరనుకోవాలా!.
లేక
మనుషుల కష్టాలను చూసిన ఆనందంలో గగనం కంటి నుండి అలవోకగా జారిపడుతున్న ఆనందభాష్పాలనుకోవాలా !.
ఏమనుకోవాలి !..నేటి స్థితిని పరిస్థితిని
మతిస్థిమితం లేనివారై ప్రవర్తించు మీ మేఘాల పరంపరనీ.
మాపై దయచూపించి,
సూర్యుడి దర్శనం కలిగించగా
ఓ మేఘమా తోలిగిపో !.ఇకనైనా
[18/09, 4:05 PM] బండి భానుచందర్: 8. బండి భానుచందర్
శీర్షిక : ఓ మనసా
కనుల నుండి ప్రవాహమై జారే కన్నీటిని చూడగలిగిన కనులు
కలత సంద్రమున చిక్కిన గుండెను చూడగలవా!.
బాధపడవద్దు అని చెప్పగలిగిన పెదవులు
తనకు కలిగితే ఆ బాధను సంకెళ్లై ఆపగలవా!. ప్రతి మనస్సు ఆనందం ఎంతగా ఉన్నా
ఓక్క చిన్న బాధను కూడా తట్టుకోలేదు
ఏమిటో!..
[19/09, 10:41 AM] బండి భానుచందర్: 9. బండి భానుచందర్
శీర్షిక : నీ సమాధానముకై
అంతుచిక్కని ప్రశ్నవై ఎదురయ్యావు, సమాధానముకై ఎక్కడని అన్వేషించ సాగను!..
నీ కనుల అన్వేషణలో నిదురమరిచిన నా నయనాలనడుగు నీపై ప్రేమెంత ఉందో!.
కలలా మెదివలన రూపాన్ని నింపుకున్న నా హృదయాన్ని అడుగు ప్రతి ఉదయము నీ తలపే మోదలవుతుందని చెబుతుంది. నీపై ఉన్న ప్రేమ బయటపెట్టలేక నీతో చెప్పలేక మౌనము దాల్చిన నా పెదవులనైనా అడుగు చెలీ అంతలేని ప్రేమ సంగతులను తెలుపుతుంది. ఈ మౌనపు యుద్దము ఇకనైనా చాలించు చెలి!.. నన్ను నీ మదిలో సవ్వడిలా బంధించు చెలి
[23/09, 8:43 AM] బండి భానుచందర్: 10.
పేరు : బండి భానుచందర్
శీర్షిక :తల్లిదండ్రుల ప్రేమ
నాన్న ఓక గొడుగు అయితే
అమ్మ అందులో ప్రేమనే నీడ
అమ్మ మనకు జన్మను ఇస్తే
నాన్న వేళుపట్టి నడిపాడు
అమ్మనే ప్రేమకు ప్రతిరూపం
ఆ రూపం దేవుని మరోరూపం
నాన్న మనకు తొలి గురువు
అతనే నడవటం నేర్పేది
మనిషికి ఉన్న దివ్యవరం
ప్రేమా !..ఆరంభం తల్లిదండ్రులే.
[25/09, 4:55 PM] బండి భానుచందర్: 11
పేరు : బండి భానుచందర్
శీర్షిక : మూగబోయిన గానం
ఓ గంధర్వగానమా మూగబోయావా
నీ గానమును ఇక మేము వినలేమా!.
ఇది మేము జీర్ణించుకోగలమా!.
నీ స్వరంతో మనస్సులను కదిలించి
ఆడించి, పాడించి
చివరికి,
కన్నీటిని కనులలో నిలిపి
సంగీత లోకానికి శోకాన్ని మిగిల్చి
తిరిగిరాని లోకమును చేరితివా!.
మా మనస్సులకు శోకపు సంద్రంలో తోసితివా!..
[28/09, 5:22 PM] బండి భానుచందర్: 12 బండి భానుచందర్
శీర్షిక :. గురుశిష్యుల ప్రేమ
తల్లి యొక్క స్వచ్చమైన ప్రేమ
తన బిడ్డలకే అది దక్కుతుంది
తండ్రి క్రమశిక్షణ నైపుణ్యం
తన బిడ్డలకే నేర్పిస్తాడు
స్నేహితుడు పంచే ఆత్మీయత
కొందరికి మాత్రమే సొంతం
గురుశిష్యులకు మధ్య ప్రేమ
మనిషికి ఉన్న బంధాలకు
అన్నిటికంటే గొప్పదైతుంది
అందుకే గురువే నిజదైవం
[29/09, 7:18 AM] బండి భానుచందర్:
13
పేరు: బండి భానుచందర్
శీర్షిక : మనసుకు ఓక రోజు
మనసుకు ఏమి కావాలో అడగలేము
మనసులో ఏముందో కనుక్కోలేము
మనసుకు ఏమి నచ్చుతుందో తెలుసుకోలేము
మనసు ఏ మనసులో చిక్కుకుందో వెతకలేము!..
మనసుంటే మార్గముంది
ఇతరుల మనసును తెలుసుకోవటానికే మార్గం లేదు !..
ఎన్ని కథలు
ఎన్ని వ్యధలు
తనలో దాచుకుందో!..
ఎంత వేదనతో
ఎంత రోదనలో
తాను మునిగిపోయిందో!..
ఏ మనుసుకు మాత్రం తెలుసు మనసా!..
ఆ మనసుకు కూడా తెలుసో తెలియదో రోజు ఈ రోజు "ప్రపంచ మనస్సు దినోత్సవమనే రోజు "
14
[29/09, 8:13 AM] బండి భానుచందర్:
14. బండి భానుచందర్
శీర్షిక : ఆగకు - ఆపకు
కలలు కనాలి వాటిని సాకారం చేసుకోవాలి
కలలు మాత్రమే కంటూ నిరాకారముగా నిలిచిపోకూడదూ!..
ఆకాశం చూస్తూ ఆలోచన సాగించాలి
ఆకాశం చూస్తూనే ఆగిపోకూడదూ!..
వెటకారం చేస్తున్నారని
వెనక్కి తగ్గకూడదు!..
సహకారం లేదని
సంకోచిచవద్దూ!..
తనకు తానుగా ఏది రాదు
నీలో నువ్వు మొదలు కానంత వరకు !..
మొదటి యుద్దం నీ మనసుతో చేయ్యాలి
మొదటి ప్రయాణం నీ కన్నీటితో సాగించాలి
మొదటి గెలుపు నీ కష్టంతో పోందాలి
[30/09, 9:38 AM] బండి భానుచందర్:
15.
పేరు : బండి భానుచందర్
శీర్షిక : సౌందర్య రూపము
కనులు మూసి కలగంటి చెలి నీ సౌందర్యరూపము
అది మనసులో వెలిగిన వెన్నెలదీపము !..
నిరంతరమూ నీ స్మరణము
నాకది అనంత వరము!..
నా హ్రుదయంలో నిర్జీవముగా పడివున్న భావము
ఊహల రూపమై పోసుకు వచ్చినవి జీవము
అది ఆశల గీతమై
తొలిసారి కలిగే నీ ప్రేమలో జననము
[30/09, 2:38 PM] బండి భానుచందర్
: 16.
బండి భానుచందర్
శీర్షిక :నిను మించినదేది లేదు
గగనానికి ఉందో సందేహం!.
తనతో మాటైనా చెప్పకుండా
ఏ తార క్రిందికి జారి
నేలపై నడియాడుతుందేమిటని !..
వెన్నెలకి ఉందో సందేహం!..
తన ప్రతిబింబం తారలో మెదులుతుందేమిటని!..
గాలికి ఉందో సందేహం
ఆ తార తళుకులో
వెన్నెల వెలుగులో
నన్ను గమనాన్ని ఆపినది ఎవరని!..
గగనం, వెన్నెల, గాలి కలిసి వచ్చి ఇలా నన్నడిగినవి!.చెలియా!..
అపుడు నేను :
ఆ మిలమిల మెరుపుల తారకే నా చెలి !..
అని గగనంతో అన్నాను!..
ఆ మెరుపు నడుమ నీ ప్రతిబింబమే
నా చెలి రూపం!.. .
అని వెన్నెలతో అన్నాను!..
ఆ తారక తళుకులో
వెన్నెల వెలుగులో
నీ గమనాన్ని ఆపినది
నా చెలి నవ్వు!..
గాలితో అన్నాను!..
నిను పోల్చుకునేదేది ఈ స్రుష్టిలోనే లేదన్నాను!..
[01/10, 5:31 AM] బండి భానుచందర్:
17
బండి భానుచందర్
శీర్షిక : ప్రియతమా! ..
నీ కనుపాపను కాపుకాసే కంటిరెప్పనవ్వనా !..
లేక
ఆ కనురెప్ప కాపుకాసే కనుపాపనవ్వనా!..
లేక
ఆ కనురెప్ప చాటున కంటిపాప చూసే కలనవ్వనా!..
లేక
ఆ రెప్పచాటున కంటిపాప దాచే కన్నీరవ్వనా!.
కనులకు వెలుగవ్వనా!.
కలలకు ప్రియమవ్వనా!..
[01/10, 5:34 AM] బండి భానుచందర్:
18
బండి భానుచందర్
శీర్షిక : శివా!..
ఆకాశ గంగను మోసితివి
ఆనందమున చిందులు వేసితివి
ఆహారమువలె హాలహలము నీవు సేవించితివి
ఆరోగ్యమును మాకు ప్రసాదించితివి
ఆవేశమున కామున్ని తుంచితివి
ఆధారమై నీవు నిలిచితివి
ఆదిశక్తినే సతిగా స్వీకరించితివి
ఆయువును మాకు ప్రసాదించితివి
నిను వెతుక చూసి పిచ్చివాడినయ్యానా శివా!..
నీవు నిజముగా దివ్యజ్యోతివై నాలోనే వెలుగుతున్నావా !..శివా!..
[02/10, 8:39 AM] బండి భానుచందర్:
19
బండి భానుచందర్
శీర్షిక: నిశి మాటున శోకం
ఇది విన్న గగనము నిశిలో తలదాచుకుంది
ఇది గన్న పవనములో సుడిగాలుల ఆవేదన కలిగింది!.
ఇది తెలిసిన మేఘము రౌద్రముతో ఉడుకెక్కి నల్లని రూపము దాల్చి పరుగెత్తుతు వస్తోంది!.
ఇది విన్న సంద్రము హ్రుదయములో సుడిగుండాలు చెలరేగగా.. అలలతో మనిషిని ఛీ..కొడుతుంది!..
తన గుండెలపైన జరిగే అక్రుత్యాలకు
అవని తల్లి విలవిలలాడుతోంది!..
గుండెల మాటున కన్నీటి సంద్రమై కదలక మెదలక నిలిచి ఉంది!..
ఆ తల్లి గుండెలోని సంద్రమును చేరి ఓదార్చటానికి
చినుకూ చినుకూ చేతులు కలిపి నేల జారి అవని గుండెను ఓదార్చుతోంది !..
[02/10, 8:40 AM] బండి భానుచందర్:
20
బండి భానుచందర్
శీర్షిక : జీవితయానం
రుధిరములో తడిసి రోదన చేస్తూ కనులు
తెరిస్తే జననము!..
రుధిరము కూడా కనుల నుండి జారేలా రోధింపజేస్తే మరణము!..
జననము ఆనందాన్నిస్తే
మరణము తీరని ఆవేదననని కలిగిస్తుంది!..
ఎందుకు పుట్టాలి!?..
ఎందుకు బంధుప్రీతి కలగాలి?.
ఎందుకు ఆశలు కలగాలి?..
ఎందుకు వాటి వెంట పరిగెత్తాలి ?..
ఎందుకు కష్టంలో కరగాలి?..
ఎందుకు కన్నీటిలో తడవాలి?..
ఎందుకు మరణించాలి?..
ఎందుకు?.. ఎందుకు?.. ఎందుకు?..
ఎందుకు అన్న సందేహంలో చివరికి మిగిలేది ప్రశ్న మాత్రమే!..
సమాధానము దొరకదు!..
లేనిపోని ప్రశ్నల వెంట వెళ్లక?.
అనవసర ఆలోచనల్లో మనసును పడదోయక?..
ఉన్న జీవితాన్ని కోనసాగించూ!..
నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు!..
[03/10, 8:22 AM] బండి భానుచందర్:
21
బండి భానుచందర్
శీర్షిక : నిష్కల్మశ హ్రుదయుడు
సత్యం అతని గమ్యం
అహింస అతని గమనం
స్వచ్చం అతని మనసు
ప్రేమ అతని పలుకు
స్వరాజ్య సాధనలో వయసును కూడా లెక్క చేయ్యలేదు !..
ఆటంకాలు ఎన్ని ఎదురయిన కట్టుకదలలేదు, వెనకడుగు వేయ్యలేదు!..
అడ్డంకులు ఎన్ని వచ్చిన పట్టు వదలలేదు
కట్టు విడువలేదు!..
ఆంగ్లేయుల ఆయుధాలను ప్రేమతో ఎదురుకున్నాడు!..
ఆనంద సామ్రాజ్యాన్ని అర్థరాత్రి తెచ్చాడ!.
దేశానికే ప్రేమచక్రవర్తిగా నిలిచాడు.
చిరునవ్వుల చిరంజీవి
నిష్కల్మశ హ్రుదయ బాపూజీ
ఆ మహాత్ముడు గాంధీజీ!..
[03/10, 8:37 AM] బండి భానుచందర్:
22
బండి భానుచందర్
శీర్షిక : ఆదర్శనేత శాస్త్రీజీ
అవని కన్న ఆదర్శనేత
అందరు మెచ్చిన మహనీయనేత
పదవుల ఆశించలేదు
ప్రజల నాలుకల మీద మెదిలాడు
ప్రజాశాంతి కాంక్షకై పోరాడాడు
చిన్న వయసులోనే తనవంతు క్రుషిగా
స్వతంత్ర పోరాటంలో పాల్గోన్నాడు
చిన్నవయసులోనే జైలుజీవితాన్ని అనుభవించాడు!..
పదవిని అతను కోరకున్నా
పదవులే వాటంతట అవి వరించాయి!..
గాంధీజీ ప్రియ భక్తుడుగా
నెహ్రూకి ప్రియ స్నేహితుడిగా నడవడిక సాగించాడు!..
స్వతంత్ర దేశానికే ద్వితీయ ప్రధాని అయ్యాడు
అద్వితీయ మహనీయుడుగా ప్రజాపాలన చేసాడు
సమాజచైతన్యం మెరుగుపరచటంలో తనవంతు క్రుషిచేసాడు!..
లాల్ బహదూర్ శాస్త్రీ!..
[31/01, 6:50 PM] బండి భానుచందర్: 20 బండి భానుచందర్
శీర్షిక : జీవితయానం
రుధిరములో తడిసి రోదన చేస్తూ కనులు
తెరిస్తే జననము!..
రుధిరము కూడా కనుల నుండి జారేలా రోధింపజేస్తే మరణము!..
జననము ఆనందాన్నిస్తే
మరణము తీరని ఆవేదననని కలిగిస్తుంది!..
ఎందుకు పుట్టాలి!?..
ఎందుకు బంధుప్రీతి కలగాలి?.
ఎందుకు ఆశలు కలగాలి?..
ఎందుకు వాటి వెంట పరిగెత్తాలి ?..
ఎందుకు కష్టంలో కరగాలి?..
ఎందుకు కన్నీటిలో తడవాలి?..
ఎందుకు మరణించాలి?..
ఎందుకు?.. ఎందుకు?.. ఎందుకు?..
ఎందుకు అన్న సందేహంలో చివరికి మిగిలేది ప్రశ్న మాత్రమే!..
సమాధానము దొరకదు!..
లేనిపోని ప్రశ్నల వెంట వెళ్లక?.
అనవసర ఆలోచనల్లో మనసును పడదోయక?..
ఉన్న జీవితాన్ని కోనసాగించూ!..
నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు!..
[31/01, 6:50 PM] బండి భానుచందర్: 21 బండి భానుచందర్
శీర్షిక : నిష్కల్మశ హ్రుదయుడు
సత్యం అతని గమ్యం
అహింస అతని గమనం
స్వచ్చం అతని మనసు
ప్రేమ అతని పలుకు
స్వరాజ్య సాధనలో వయసును కూడా లెక్క చేయ్యలేదు !..
ఆటంకాలు ఎన్ని ఎదురయిన కట్టుకదలలేదు, వెనకడుగు వేయ్యలేదు!..
అడ్డంకులు ఎన్ని వచ్చిన పట్టు వదలలేదు
కట్టు విడువలేదు!..
ఆంగ్లేయుల ఆయుధాలను ప్రేమతో ఎదురుకున్నాడు!..
ఆనంద సామ్రాజ్యాన్ని అర్థరాత్రి తెచ్చాడ!.
దేశానికే ప్రేమచక్రవర్తిగా నిలిచాడు.
చిరునవ్వుల చిరంజీవి
నిష్కల్మశ హ్రుదయ బాపూజీ
ఆ మహాత్ముడు గాంధీజీ!..
[31/01, 6:50 PM] బండి భానుచందర్: 22 బండి భానుచందర్
శీర్షిక : ఆదర్శనేత శాస్త్రీజీ
అవని కన్న ఆదర్శనేత
అందరు మెచ్చిన మహనీయనేత
పదవుల ఆశించలేదు
ప్రజల నాలుకల మీద మెదిలాడు
ప్రజాశాంతి కాంక్షకై పోరాడాడు
చిన్న వయసులోనే తనవంతు క్రుషిగా
స్వతంత్ర పోరాటంలో పాల్గోన్నాడు
చిన్నవయసులోనే జైలుజీవితాన్ని అనుభవించాడు!..
పదవిని అతను కోరకున్నా
పదవులే వాటంతట అవి వరించాయి!..
గాంధీజీ ప్రియ భక్తుడుగా
నెహ్రూకి ప్రియ స్నేహితుడిగా నడవడిక సాగించాడు!..
స్వతంత్ర దేశానికే ద్వితీయ ప్రధాని అయ్యాడు
అద్వితీయ మహనీయుడుగా ప్రజాపాలన చేసాడు
సమాజచైతన్యం మెరుగుపరచటంలో తనవంతు క్రుషిచేసాడు!..
లాల్ బహదూర్ శాస్త్రీ!..
[31/01, 6:51 PM] బండి భానుచందర్: 23 బండి భానుచందర్
శీర్షిక : ఏమో!..నిజమగునేమో
పాల్కడలిని చిలికి అమ్రుతం పొందిన సురులు ,
ఏ కడిలిని చిలుకకుండానే నీ సుందరహాసామ్రుతం పొందిన నన్ను చూసి కుళ్లుకుందురేమో!..
ఓకపక్షం తరిగి, మరో పక్షం పెరిగే వెన్నెల వున్న ఆకాశం,
ఎల్లప్పటికి తరగని వెలుగుల సౌందర్యరూపము సొంతం చేసుకున్న నన్ను చూసి పూలవర్షం మనపై కురిపించునేమో !..
ఎప్పుడో ఓకప్పుడు కూసే కోకిల స్వరము కన్నా,
నిరంతరం గానమై మధురంగా వినిపించే నీ పలుకులను విన్న కోకిలా!..
తనగానము మరిచి, కాలమును, మాసమును మారిచి
నీ నామమునునే గానముగా ఈ లోకానికి వినిపించునేమో!..
తమ నడక తమకు నచ్చక రాజహంసలే తరలి వచ్చి ,
నీ నడకను నేర్చుకోటానికి నీ శిష్యురికం స్వీకరిస్తాయేమో!..
నువు తాకిన పూలకే ప్రాణం వస్తే
నువు నడిచే దారిలో
నీ పాదాలు క్రింద పడి ఉంటామని తరలివస్తాయేమో!..
నీపై ఈ కవిత రాసే కలమే తాను ఎంత పుణ్యము చేసుకోనెనో అనుకోందునేమో!..
ఈ కవిత చదివే కనులే కలలలోకంలో విహరించగా, మనసుతో ఎటో తరలివెళ్లిపోతాయేమో!..
ఏమో!.. ఏమో!. ఏమో!..
ఇది నిజమే అగునేమో !..
ప్రియతమా!..
[31/01, 6:51 PM] బండి భానుచందర్: 24. బండి భానుచందర్
శీర్షిక : కవి హ్రుదయము
వీరాస్ కవిసమయము
ప్రతి కవిలోని భావాలను నింపుకునే హ్రుదయము !..
వీరాస్ కవిసమయం
ప్రతి కవికి నేనున్నాని చెప్పే ధైర్యము !..
వీరాస్ కవిసమయం
కవితాలోకానికి తొలి గమ్యము !..
వీరాస్ కవిసమయము
ఎందరో కవిస్నేహితుల పరిచయము !.
వీరాస్ కవిసమయము
కవితలను నింపుకునే మరోలోకము !..
వీరాస్ కవిసమయము
కవి హ్రుదయాన్ని తెరిపించు భావము
- బండి భానుచందర్
[31/01, 6:51 PM] బండి భానుచందర్: 26 బండి భానుచందర్
శీర్షిక : గెలుపు
గెలువాలనే తపనుంటే సరిపోదు మిత్రమా!.
ఎలా గెలవాలో తెలుసుండాలి !..
ఆటలో నువ్వు ఓడిపోవచ్చు మిత్రమా!.
ఆత్మవంచన చేసుకోకు
మరోమారు ప్రయత్నం చేయకుండా నిలిచిపోకు!.
నిన్ను నీవు గెలవాలి
మొదటి గెలుపు నీతోనే మొదలవ్వాలి !.
[31/01, 6:51 PM] బండి భానుచందర్: 25 బండి భానుచందర్
శీర్షిక: ఓక్కసారి
ఒక్కసారి నీ మనసుతో వినిచూడు
నా మనసులోని ప్రతిభావం సంగీతమై వినిపిస్తుంది!..
ఒక్కసారి నీ మనసు కనులు విప్పి చూడు
నా కనులు కంటున్న నీ కలల వెలుగు కనిపిస్తుంది !.
ఒక్కసారి మనసు అడుగుపెట్టి చూడు
నిరంతరం నీ గుండెచప్పుడై ఉంటాను నీకు తోడు!!
ప్రియతమా!..
[31/01, 6:52 PM] బండి భానుచందర్: 27 బండి భానుచందర్
శీర్షిక : నేల - నింగి
నింగి నేలకు ఎంత దూరమో
నేల కూడా నింగికి అంతే దూరము!.
నింగిలోని తారలను, వెన్నెలను, సూర్యుడిని,
నల్లమబ్బును, ఇంద్రధనస్సును చూసిన నేల తనంకంటే నింగే ఆనందంగా ఉంది అనుకుంటుంది!..
నేలపైన పచ్చదనం, జలపాతాలు, పక్షుల కిలకిలరావాలు చూసిన నింగి తనంకంటే నేలనే ఆనందంగా ఉంది అనుకుంటుంది!..
మరి
నేలకు తెలుసా నింగి సూర్యుడి సెగలలో నిరంతరం కాలుతుందని,
నేలకు తెలుసా నింగిలోని అర్థభాగం చీకటే అని,
నేలకు తెలుసా భరించలేని నల్లమబ్బుల ఉరుముల శబ్దాలు ,మెరుపుల వెలుగులు
మరి
నింగికి మాత్రం తెలుసా
నేలలోని ప్రకృతి వైపరిత్యాలు,
నింగికి మాత్రం తెలుసా
నేల మోసే జీవరాశుల బరువు!..
నింగికి తెలుసా
నేల దాచుకున్న కుళ్లిన శరీర కళేబరాలు
నింగికి తెలుసా
నేలను చీల్చిన, నేలను తన్నినా, వైపరిత్యాలు స్రుష్టించిన చలించని తనువుపై
మాననిగాయాలు !..
నింగికి తెలుసా!.. నేలకు తెలుసా!..
దూరపు కొండలు నునుపు అని!..
[31/01, 6:52 PM] బండి భానుచందర్: 28 బండి భానుచందర్
శీర్షిక : కన్నీరు
గుండెలోని బాధలు మెలితిరగితే
కనుల వెనుక జరిగిన కథ
తరుముకు వచ్చిన బాధ
కంటిపాపను చేరితే
ఆ కంటిపాప వెనుక దాగిన స్వప్నాన్ని దాటుకుంటూ
దుఃఖపు సెగలలో కాగిన నీరు
ఓక్కసారిగా కంటిరెప్పల తలుపులను బద్దలుకొట్టుకుని బయటికి వచ్చి నునుపు చెంపపైన జారతూ నేలరాలుతుంది కన్నీరు!.
[31/01, 6:52 PM] బండి భానుచందర్: 29. బండి భానుచందర్
శీర్షిక : ఊహలలేఖ
నా ఎద ఓక కాగితము
ఆ కాగితముపై రాసుకున్న భావాల అక్షరాలతో ఊహలలేఖ!.
విరహాల వడగాలులు చెలరేగగా
ఆ ఊహలలేఖ నను వీడీపోయి
నిను చేరగా రెపరెపలాడుతూ వచ్చింది..
నిను చేరకా!.. నినుచూడక !..
నీకై తపించిపోయిన
నా కనులు కురింపించిన కన్నీటి వర్షంలో
ఆ ఊహలలేఖ తడిసి ముద్దయ్యింది !..
తిరిగి ఏ కలల కలముపట్టి ఆ లేఖను తిరిగి రాయను!..
[31/01, 6:52 PM] బండి భానుచందర్: 30 .బండి భానుచందర్
శీర్షిక : రెప్పపాటే జీవితం
కనురెప్పల తలుపులు తెరిచి
కనుపాపతో లోకాన్ని చూచి
కన్నుల కలలను శోధించి
కలలాంటి జీవితంలో జీవించే నువ్వు!..
కష్టాలను తలచి
రెప్ప పాటు స్వప్నాలను
కనుపాప సంద్రంలో నుంచి చెలరేగే
ఉప్పునీటి ఉప్పెనతో
రెప్పపాటు స్వప్నాలు చిగురించనీయ్యకుండా
ముంచివేస్తావా!.. నేస్తం!..
కష్టం లేకుంటే!..
ఇష్టం ఎలా తెలుస్తుంది!..
కనులు తెరవగా జననం
కనులు మూయ్యగా మరణం
రెప్పపాటు జీవితంలో
ఉప్పునీటి కష్టాలే తోడూ నీడ!..
[31/01, 6:53 PM] బండి భానుచందర్: 32 బండి భానుచందర్
శీర్షిక : పరీక్షలు కావు ఇవి
పరీక్షలు వచ్చేసాయ్
పరుగులు పెట్టిస్తున్నాయి!..
పుస్తకం తీసింది ఏనాడో
శోధించి తీయాలి ఈనాడు!..
పుస్తకం పుటలను తిప్పింది ఏనాడు
ఇప్పుడు వాటికి పట్టిన బూజును దులపాలి ఈనాడు!..
ప్రశ్నలు తెలియవు
జవాబులు తెలియవు
నిరీక్షించక మనం
పరీక్షల కోసం చదవాలి!..
ఉపేక్షించక మనం
అక్షరాలను మెదడులో నింపాలి !..
ఉన్నట్టుండి పిడుగులాంటి వార్త ఇది
చదవుట ఎలాగో తెలియక తికమకగా నున్నదీ
"పరీక్షలు కావు ఇవి మెదడుకు శిక్షలు "
[31/01, 6:53 PM] బండి భానుచందర్: 31 బండి భానుచందర్
శీర్షిక : నిలిచిపో!..
నిజములో నిన్ను వెతికినా
కలతగా నేను నిదురించినా
కలలో నిన్ను చేరినా
ప్ర్రియతమా!..
ఊహలలో పయనించినా
ఆశలనే ఆహ్వానించినా
మనస్సులో నిన్ను నిలిపినా
ప్రియతమా!..
గాలిలో గంధం నువ్వు
పూలకే అందం నువ్వు
నిశిలో వెన్నెల నువ్వు
ప్రియతమా!..
కవితలో అక్షరమై
కావ్యంలో భావమై
హ్రుదయానికి చప్పుడువై
నన్ను చేరి నిలిచిపో
ప్రియతమా!..
[31/01, 6:53 PM] బండి భానుచందర్: 33. బండి భానుచందర్
శీర్షిక : నా మనసు నాకు తోడు
నా కనులు కన్నీటి సంద్రంలోని ఎదురీతను ఆపేదెన్నడో!..
కలల తీరం చేరేదన్నడో!..
కన్నీటి ప్రవాహము నా మదిని తడిపెను
గుండెలోని ఆశలను ముంచెను!..
ఉపేక్షుంచని నా హ్రుదయం అలజడులు మోదలయ్యెను
ఊపిరి పోరాటాల సెగలపొగలా పైకోచ్చెను
ఉడికే రక్తం ఉబికి పిడికిలి బిగించెను
గుండెచప్పుడే డమరుకనాథమై ధ్వనించెను
నేనున్నానంటుూ నా మనసు నాకు చెప్పెను
ముందుకు నడవమని నాకు చెప్పెను
[31/01, 6:53 PM] బండి భానుచందర్: 34 : బండి భానుచందర్
శీర్షిక : కరోనా రాక్షసి
కరోనా
ఉన్నట్టుండి గగనం నుండి జారిపడ్డ పిడుగులా సమయం చూసి మీదికి దూకిన మృగములా
ఈ సమాజ వ్యవస్థపై పడిందీ!..
పోట్ట కూటికోసం వచ్చిన కూలీల కడుపుకోట్టి,
పేద బ్రతుకుల కడుపుకోట్టి ,
ఆకలికై అలమటించే అన్నార్థులపై రాళ్లు రువ్విందీ ,
తీరని శోకం మిగిల్చిందీ.
బంధాలు, బంధువులను మరవమని,
ఓంటరితనం ఇకనైనా అలవాటు చేసుకోమని, నీకు నువ్వు బ్రతకమని
చెప్పకనే చెబుతుందీ.
ప్రభుత్వాన్నే పడకోట్టి
ప్రజలనే భయపెట్టి
పట్టువదలని విక్రమార్కుడిలా
పంతము వీడనంటున్నదీ!..
ఎప్పుడు చక్కబడునో పరిస్థితులు
ఎప్పుడు చల్లారునో ఈ స్తితిగతులు
ఎప్పుడో.. ఇంకెప్పుడో...
[31/01, 6:54 PM] బండి భానుచందర్: 35.బండి భానుచందర్
శీర్షిక :నిను చేరెను నా మనసు
నువ్వంటే నాకిష్టం
ఈ మాట నీతో చెప్పటం కష్టం
చెప్పాలని మనసంటున్నా
పెదవి గడప దాటి మాటరానంటుంది
చెప్పలేకున్నా
చెప్పలేక తప్పుకోలేకున్నా
నువ్వంట ఇష్టమంటున్నా
నీతో మాటకూడా కష్టమంటున్నా
ఊహలు పెంచగా చెంతకు వస్తావు
ఊపిరి ఆపగా దూరమవుతావు
ఊహవైనా, ఊపిరైనా
నువ్వేనని చెప్పాలని ఉంది
చెప్పుటకే మాట నను దాటి రాకుంది
నా మనసెపుడో నిను చేరుకుంది!..
[31/01, 6:54 PM] బండి భానుచందర్: 37. బండి భానుచందర్
శీర్షిక : నీకు తెలిసేదెలా!..
నీ కనురెప్పల చప్పుడు కూడా ప్రియగానమై నాకు వినిపిస్తుంది!..
నా గుండెలచప్పుడే నీ రాగమై నను తరుముతోంది!..
ఆ చప్పుడురాగాల గానమే నా గుప్పెడు గుండెల్లో ప్రేమగీతమై పల్లవిస్తోందీ!..
పల్లవించిన రాగమే నదిలా నాలో ప్రవహిస్తోంది!..
ప్రేమ సంద్రమై నను ముంచేస్తోంది!..
ఆ ముంచేసే సంద్రపు కెరటాల ధ్వనులే నీ పేరుగా నాకు వినిపిస్తోంది!..
ఇది నీకెలా తెలుస్తుంది
అనే ఆలోచన కూడా నను కంగారు పెట్టేస్తోంది!..
[31/01, 6:54 PM] బండి భానుచందర్: 36.బండి భానుచందర్
శీర్షిక : నేను నీ వాడిని
గాలినైయ్యుంటే నీ ఊపిరిగా బ్రతికుండేవాడిని ,
పూవ్వునై ఉంటే నీ కురులలో తలదాచుకునేవాడిని ,
నేలనైనా అయ్యుంటే నిను మోసేవాడిని,
చీకటినైనా అయ్యుంటే పగలు నీ నీడనై ఉండేవాడిని,
మువ్వనైనా అయ్యుంటే నీ పాదాలను చుట్టుకుని ముద్దాడేవాడిని,
ఇవేవి కాకున్నా చెలి నేను నీ వాడిని!..
చూడగలవా నా గుండెలోని నీ గుడిని!..
[31/01, 6:54 PM] బండి భానుచందర్: 38.బండి భానుచందర్
శీర్షిక : నీ ఊహలతోనే
కనులు మూసిన నీవే కనబడుతుంటే
కడలై పొంగిన నా హృదయం
కనులు తెరిచినప్పుడు నిజమై ఎదురు పడుతున్నా
కంగారు పడుతుంది నా హృదయం
మౌనపు వలలో చిక్కిన మాట
ప్రాణం పోయే ఆరాటం
ఆ మాటే నీకు తెలపాలన్న నా మనసు
నీ ఊహలతోనే ఉప్పోంగిపోతోంది
[31/01, 6:54 PM] బండి భానుచందర్: 39. బాలసుబ్రమణ్యం
సంగీత సామ్రాజ్యానికి రాజాధిరాజు
అతని స్వరము వింటే కోయిలలు చిన్నబోవును
అతనే ఓ నిలువెత్తు సంగీతం!..
హృద్యంగా సాగే గానమైనా
విప్లవంగా సాగే గానమైనా
శృంగారం చిలిపి గానమైనా
అతను పాడాడంటే కాలమైనా ఓక్కక్షణం నిలబడి వినాల్సిందే!..
భక్తిరసమైన
భావ కవిత్వమైనా
అతను పాడాడంటే మనసు కనులు తెరచి ఏకధాటిగా వింటుంది!..
అంతటి వ్యక్తి గురించి చెప్పడానికి మాటలు చాలవు!..
అతని గురించి రాయటానికి ఆకాశము చాలదు!..
ఇంతకీ అతను ఎవరో కాదు...
గానసంగీత సామ్రాజ్య చక్రవర్తి
గానగంధర్వ బిరుదు గలవాడు
సరస్వతీ పుత్రుడు
అతడే S. P బాలసుబ్రమణ్యం గారు
నేను అతనికి అభిమానిని.. అయినను అతనికి అభిమాని కాని తెలుగువాడు ఉంటాడా!..
ఆయన గురించి ఇందులో రాయాలి రాయాలి అనుకుంటూ ఈనాటికి రాసాను ఆయన గురించి నాలుగు మాటలు!..
జై హింద్ !..
[31/01, 6:54 PM] బండి భానుచందర్: 40 .బండి భానుచందర్
శీర్షిక : మగువా!.
మగువనైనందుకు మనసును చంపుకుని తిరగాలా!..
నాకంటూ కలలుండవా.. వాటిని చేరుకోవాలని ఆశవుండదా!..
ఎన్ని ఆశలు నాలో ఉన్నా వాటిని చంపుకు తిరగాలి.. ఎందుకంటే నేను మగువను కదా!..
నా కలలు ఆకాశాన్ని చూస్తున్నా ..
వాటిని
ప్రోత్సహించని ప్రపంచంతో పోరాడిన కన్నుల కలలు కన్నీళ్లై నేలరాలుతున్నాయి!.
ఎందుకంటే నేను మగువను కదా!..
మగువకు సాధ్యం కానిది ఏది!..
మగాడు మాత్రం సాధించేది ఏమి!..
ఆడుదానిగా పుట్టినందుకు అనిచివేతలు తప్పవా!.
ఆడుదంటే లోకానికెందుకు లోకువా!..
ఆడుదానిగా పుట్టటమే ఈ జన్మకు శిక్ష!..
ఎందుకు మగువకీ కఠినపరీక్ష!..
[31/01, 6:54 PM] బండి భానుచందర్: 41.బండి భానుచందర్
శీర్షిక : ఎలా ఎలా తెలుపను!..
మల్లెల నవ్వుల రోజాపూవ్వా!.
అందాలకే అందం నువ్వా!..
పరిమళగంధం మదిపై పూసి
అందాల ముళ్లునే గుచ్చేసావు!..
కలువకన్నులతో చూపుల బాణాలు వేసి
గుండెకే తీపిగాయం చేసేసావు!.
నీ మువ్వల సవ్వడుల మోహనరాగం
గుండెసడిని చేరుకోని వినిపించెను ఓ ప్రియగానం!..
ఆ గానం నిన్ను చేరేవరకు నిలునంది చెలి నాలోని ప్రాణం!..
చెప్పాలన్న ఆరాటం నాలో
మౌనంతోనే పోరాటం లోలో!..
ఎలా మనసును విప్పాలో!..
ఎలా ఈ ఊసులు చెప్పాలో!..
[31/01, 6:55 PM] బండి భానుచందర్: 42. బండి భానుచందర్
శీర్షిక : సౌందర్య
వెన్నెల వదనము
కలువ నయనము
కన్నుల కుసుమము
సొగసు స్వర్ణశిల్పము
మనసు మహాస్వచ్చము
నవ్వుల చంద్రబింబము
రువ్వు మల్లెలవర్షము
పలుకే మధురగీతి
కులుకు రంభా,ఊర్వశి సమేతి
అపూర్వ సౌందర్యమే ఆమెకు ఆభరణము
అందుకే గలదు
ఆమెకు సౌందర్య అను నామము!..
[31/01, 6:55 PM] బండి భానుచందర్: 41.బండి భానుచందర్
శీర్షిక : ఎలా ఎలా తెలుపను!..
మల్లెల నవ్వుల రోజాపూవ్వా!.
అందాలకే అందం నువ్వా!..
పరిమళగంధం మదిపై పూసి
అందాల ముళ్లునే గుచ్చేసావు!..
కలువకన్నులతో చూపుల బాణాలు వేసి
గుండెకే తీపిగాయం చేసేసావు!.
నీ మువ్వల సవ్వడుల మోహనరాగం
గుండెసడిని చేరుకోని వినిపించెను ఓ ప్రియగానం!..
ఆ గానం నిన్ను చేరేవరకు నిలునంది చెలి నాలోని ప్రాణం!..
చెప్పాలన్న ఆరాటం నాలో
మౌనంతోనే పోరాటం లోలో!..
ఎలా మనసును విప్పాలో!..
ఎలా ఈ ఊసులు చెప్పాలో!..
[31/01, 6:55 PM] బండి భానుచందర్: 43. పేరు: బండి భానుచందర్
ఉదయాన వెలిసిన వెన్నెలవో
హ్రదయాన నిండిన ప్రేమచప్పుడువో
అందాలకే అంతుచిక్కని అందము నువ్వో
అందానికే అపురూపము నువ్వో
నిశిలో ఉషస్సువు
శశివెలుగుల రూపమై మనస్సులో నిండావు!..
స్వప్నమై చేరావు
సత్యమై ఎదుట నిలిచావు!..
సత్యమైనా!.. స్వప్నమైనా!..
సంభాషించలేదు నా మనసు నీతో ఎందుకో!..
అది నీ ప్రేమ మత్తులో తేలుతున్నందుకో!..
లేక నను వీడి నిను చేరుకున్నందుకో
ఎందుకో!.. అది ఎందుకో తెలియాలి!.
ఎలగైనా నిన్ను అందుకోవాలి!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 44
పేరు : బండి భానుచందర్
శీర్షిక : నిను వీడని నా మనసు
ఎటు చూసినా నీవే కవిపిస్తావు
ఎటు నడిచినా కలతవై తోడోస్తావు
మనసునే తోడేస్తావు!..
ఎదలోతులో నిన్నే దాచినా
ఆశగా ఆరాధించినా
నీవు నను వీడినా
నా మనసు నిను వీడకుందీ
నిన్నే నిన్నే మళ్ళీ మళ్లీ కోరుకుంటోంది!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 45. బండి భానుచందర్
శీర్షిక :ప్రియలేఖ
అదిగో అది నా హ్రుదయ ఆకాశం
అది వేచెను నీ వెన్నెల వెలుగుల కోసం
చెలియా నీవన్నది నాకోసం అనుకుంటుంటే
గుండెలో విరసెను మధుమాసం
నీ చూపుల భాషలు తెలియక
ఈ మౌనభాషలతో వేగలేక
రాసాను మది ఊహలతో ప్రియలేఖ
అందుకో చెలి అభిసారిక !..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 46. బండి భానుచందర్
శీర్షిక : నీకోసం మనసన్నది
నా గుండెలో దాచిన ప్రేమ
నీ గుండెకు చేరువచేసేదెలాగమ్మ
ఊహగీతం పాడుతుంది మనసు
నీ తలపుల ఊయలలో పరవిస్తోంది మనసు
మనసంతా నువ్వే నిండావు
నన్నే నేను మరిచేలా చేసావు
నిన్నే ధ్యానించేలా చేసావు
నీకోసం మనసున్నది
నీవులేక లేనన్నది
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 47. బండి భానుచందర్
శీర్షిక: జై హనుమాన్
అంజలి సుత !.అభయహస్త !.
ఆపద్భాందవ !.వాయుపుత్ర!..
రాక్షససంహార !..రామభక్త !..
వజ్రదేహా!. వానరనాయక !..
కడలిని దాటి,రాక్షసుల త్రుంచితివి
సీతను చూచి, కలతను తోలిగించితివి!.
రావణుడిని ఎదురించి, లంకను కాల్చితివి!.
రాముడి స్నేహితుడివైనా, రామభక్తుడనంటివి
సీతారాముల కలిపి, రామరాజ్యం తీసుకోచ్చితివి!..
పిలిచితే పలికెదవు,
కష్టాన్ని ఎదురించే ధైర్యం ఇచ్చెదవు!..
జై హనుమాన్!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 48.
పేరు : బండి భానుచందర్
శీర్షిక : కదిలే జీవితంలో..!..
కదిలే ఈ జీవితంలో కదిలించే కథలెన్నో
కన్నీరు పెట్టించే వ్యధలెన్నో
ఆకలి తీర్చుకోవటం కోసం ఎదురుచూసే కనులెన్నో!.
ఆకలి తీరక అలమటించే ప్రాణాలెన్నో
వాకిలి కూడా లేని జీవితాలెన్నో
మాకు దారేదని
సాగిలపడి అర్థించిన చేతులెన్నో !..
గుర్తించిన వానికి గుండెకరుగదు!..
కరిగిన గుండె కడుపునింపదు !..
చీకటిలో బ్రతికే జీవితాలు
వెలుగు నింపవు ఏ కాగితాలు!..
అంబరాన్నంటిన సంపద ఉంటే చాలని
అదే సంబరమని సమాజం మురిసిపోతోంది!.
జబ్బు గలవానికి డబ్బు కావాలి
డబ్బే జబ్బు గలవానికి వైద్యంలేదు!..
సంపదలు, సత్కారాలు ఎంతకాలం!.
డబ్బు నీ వెంట నడిచే నలుగురి మనుషులు తీసుకురాగలదేమోకాని,
నీకోసం కన్నీరు పెట్టే మనుషులను కాదు!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 49.బండి భానుచందర్
శీర్షిక : అందాలగ్రంథం
గుండె లోగిల్లలోనా
నిన్ను దాచేసుకుంటా!..
మది కోవెలలోనా
నిన్ను పూజించుకుంటా!..
ఆశల పూలతోనా
నిన్ను అర్చించుకుంటా!..
ఊహల దారాలతోనా
ఊయలచేసి
నీకు డోలికసేవ చేస్తా!..
భాషలు చాలని భావాలతోనా
నీకు మంత్రాలు వల్లిస్తా!..
గుండెలోని సవ్వడ్లతోనా
నీకు కీర్తనలు చేసేస్తా!..
కనులు చూడని లోకాలలోనా
నీకు కనువిప్పు కలిగిస్తా!..
నా కనులు రాసిన కవితలు అన్ని
నీకు మాలగా వేసేస్తా!..
కలలో కనిపించిన మైమరుపుల మెరుపులన్ని
నీకు చేతి గాజులుగా,
నాలో కదిలిన రాగాలన్ని
నీ కాలి మువ్వలుగా మార్చేస్తా!..
నాలో మరిగిన రుధిరము
నీవు జలకాలాడే ప్రేమనదిగా!.
నువ్వే నాలో ఉండేలా
నన్నే నీకు గదిగా చేసేస్తా!..
నా ఆరాధ్యదేవతవు నీవు
నీ వరమే నాకు అందిస్తే
ప్రాణాన్ని కలముగా చేసి
ఊపిరి కాగితాలు పేర్చి
ఓ అందాలగ్రంథం రాసేస్తా!.. ప్రియతమా!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 51.
**ఆంధ్రకేసరి *
అన్యాయాలు అతిక్రమించుట సహించనిదై కదిలింది ఓ సింహం
ప్రజాచైతన్యానికి పునాది కొరకు గుండెను గుండుకు అడ్డుపెట్టింది ఆ సింహం
దేశభక్తిని గుండెనిండా నింపుకుని అక్రమాన్ని అనుచుటకై ఉక్కుపాదం మోపింది ,
ఏ ఆయుధం లేకున్నా తెల్లదోరలకు పరాక్రమం చూపింది ,
స్వాతంత్ర్య ధ్యేయమే లక్ష్యంగా ప్రజాబలగాన్ని వెంటబెట్టుకొని కదిలింది,
తెల్లదోరల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది
ఆ సింహం పేరులోనే ఉంది తేజం
ఆ తేజమే దేశమంతటా వ్యాపించింది
ఆ సింహం పేరు
ఆంధ్రకేసరిని పిలిచే ప్రకాశం పంతులు.
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 50.బండి భానుచందర్
శీర్షిక :నిశిరాత్రితో స్నేహం!..
నిశిరాత్రి వేళలో
వెన్నెలను చూసి మురిసిన మన మనసే
వెంటాడే వేదనలో అలిసిపోతుంది!..
చీకటిని చూసి భయపడిన మనమే
చివరికి తనతో స్నేహం చేయ్యవలసి వస్తుంది!..
చిట్టచివరి వరకు నీతోనే ఉంటానని చెప్తూ,
చీకటి మాటున కుతంత్రం చేసే మనుషుల కంటే!..
చీకటితోనే స్నేహం చేయటం మంచిది, కన్నీటిని దాస్తుంది!..
కలలకు దారి చూపిస్తుంది!.
తన నుండి వెలుగుకు దారి చూపిస్తుంది!.
మన ఆవేశాన్ని అది కనబడనీవ్వదు!..
మన ఆనందాన్ని దాగనివ్వదు!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 53.బండి భానుచందర్
శీర్షిక : బ్రతుకు కన్నీరు పెట్టింది
బ్రతుకు కన్నీరు పెట్టింది
ఆకలి తీరని నా ఆవేదనను చూసి,
కనులు నిదుర మరిచాయి
కునుకేసినా వచ్చే నాలుగు మెతుకులు దోరకవేమోనని ,
చేతులు జోడించి ప్రార్థిస్తూనే ఉండిపోయాయి
ఆ అర్థించే చేతులు చూస్తేనైనా
అర్థము ఇచ్చే చేతులకి
నా ఆరాధన అర్థమవుతుందేమోనని ,
నేల రాలిన కన్నీటి బొట్టు నేలను అడిగింది
నువు ఇచ్చిన ఫలము కోందరిదేనా అని,
ఆకలి చావుల ఆర్థనాదం
మనుషులకు వినబడవా అని,
బ్రతకాలని నాకున్నా
బ్రతుకునే చావుగా చేసావు!..
సాటి మనిషికి రాతిగుండెనిచ్చావు!..
అంటూ
బ్రతుకు కన్నీరు పెట్టింది
ఆకలి పోరాటంలో
జీవన ఇరకాటంలో!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 55.బండి భానుచందర్
శీర్షిక : దయాగుణమే దారిద్యానికి అంతం!..
ధనమున్నవాడికి అరగనికడుపు తంట ,
దారిద్యమున్నవాడికి ఆకలికడుపు మంట !.
ధనమున్న వాడికి సోకుల షికారు కారు
దారిద్యమున్న వాడికి తడియారని కన్నీరు !.
ధనమున్న వాడికి అందాల అద్దాల మేడ ,
దారిద్యమున్న వాడికి చిన్నిగుడెసెలో మనుగడ !..
ధనమున్న వాడికి పట్టు పరుపు మంచం ,
దారిద్యమున్న వాడికి పట్టెడన్నమున్నతోనైనా నిండని కంచం!.
ధనమున్న వాడికి అభిమానపు పొగడ్తలు
దారిద్యమున్న వాడికి అవమాన చీవాట్లు!.
ధనమున్న వాడికి దారిద్ర్యమున్న వాడికి లోకువ,
దారిద్ర్యమున్న వాడికి ధనమున్న వాడు లోకువ!.
ఎవరికేది ఉన్నా, చివరికి మిగిలేది సున్నా!..
పుట్టుకతో తెచ్చినదేది లేదు,
మరణముతో తీసుకెళ్లేది లేదు!..
ధనమున్న వాడిలో దయాగుణము పుట్టినపుడే ,
దారిద్ర్యాన్ని అంతంచేయ్యగలగేది!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 52.
శీర్షిక : తెలుగు భాష
తెలుగు భాష
వెన్నెల వెలుగుభాష
సంభాషణకు మధురము భాష
సప్తస్వరాల కలగలిసిన భాష
కాగితమునకు పరవశమిచ్చుభాష
కవితకు ప్రాణమిచ్చు భాష
అక్షరాలకే అందమిచ్చు భాష
అవనిపైన పచ్చదనము నా భాష
చిలుక పలుకులలో
కోయిల గానములలో
హాయి కలిగించు భాష
నా తెలుగుభాష
ఎందరో కవులకు విజయమిచ్చిన భాష
రాబోయే మహనీయులకు మార్గమవును నా భాష
అమ్మ పిలుపులో రమ్యముగల్గించు భాష
నాన్న పలుకుని కావ్యముగా చిత్రించు భాష
మాటాడుటకు మంత్రమవును నా భాష
తెలుగుభాష
విన్న మనస్సులో పరవశమిచ్చు
ప్రతి నిమిషము మనస్సున పల్లవించు భాష
ఎన్ని జన్మల ఫలమో ఈ భాష
ఎన్ని తేనె బిందువుల కలయికనో ఈ భాష
ధనము మనకేలా తెలుగుధనము చాలు
సంపదలు మనకేలా తెలుగుపదము చాలు
కీర్తి,ప్రతిష్టలు మనకేలా తెలుగుకీర్తనము చాలు
భవనములప మనకేలా తెలుగు అన్న భావము చాలు
చాలు చాలు ఇక ఇది చాలు తెలుగుతోటి స్నేహము చాలు
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 54. బండి భానుచందర్
శీర్షిక :
ఎవరో!.. ఆ ఎవరు!.. ఎవరో!..
ఎవరు గీసిన చిత్రం
ఈ సమస్తం!.
ఎవరు చేసిన మట్టిబొమ్మలో
ఈ సమస్తకోటిప్రాణులు !..
ఎవరు రాసిన కథలో
కల్పితమైన పాత్రలు!..
ఎవరు ఆడిస్తున్న రంగస్థలము ఈ జీవితం!..
ఎవరు!.. ఆ ఎవరు?..ఎవరు!..
ఉన్నడట ఓకడున్నాడట
కనిపించడట, వినిపించడట!..
ఆడిస్తుంటాడట!..ఆడుకుంటూండాట!..
మట్టి బోమ్మలుగా చేసెనట,
మైనపు కాలం ఇచ్చేనట,
జీవితాగ్ని రగిలించెనట,
సంసార మత్తులోకి పారదోసెనట,
స్మశాన మట్టికి సొంతం చేసెనట!..
ఎవరు! ..ఆ ఎవరు!.. ఎవరు!..
ఇంకెవరయ్యా!.. ఆ పరమేశ్వరుడు
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 57.బండి భానుచందర్
శీర్షిక : వింత నా మది
ఎన్నెన్నో తారకలకు ఓకటే వెన్నెల
ఎన్నెన్నో ఊహలకు ఓకటే మనసు !..
ఎన్ని అందాలున్నా నీవే కదా నా మనసునా!..
నాలో రేగే ఎన్నో వింత భావాలకు ఓకటే భాష!.
ప్రతిభావం నీవని నీకు చెప్పాలని ఆశ
తెలుసా!. మనసా!.
ఉదయములోని ఉషస్సు నీవని,
తెలుసా మనసా!..
హ్రుదయములోని మనస్సు నీదని,
చెప్పలేని వింత భావన నాది,
చెప్పుటకు తడబాటెందుకో!..
వింత నా మది,
విరహాల వేదికైనది!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 60. బండి భానుచందర్
శీర్షిక : తొలిక్షణం
మదిలోని ఆశవు నువ్వే
మది పలకని మౌనభాషవు నువ్వే
నిదురలో కలవు నువ్వే
నిదుర మరిచిన తలపు నువ్వే
కనులలో నిరీక్షణం నువ్వే
కలవరించిన మదిలో నువ్వే
పెదవి దాటని మాటవు నువ్వే
మది దాచిన భావము నువ్వే
నాలో అనువనువు నువ్వే
నా ప్రతి అడుగున నువ్వే
విరహమో లేక మోహమో తెలియని వైనం
నిన్నే చేరాలనే తపించెను నా ప్రాణం
నీ ధ్యాసలో నిండెను నా మౌనం
నిన్ను చూసిన ఆ తొలిక్షణం ప్రియతమా!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 56.బండి భానుచందర్
శీర్షిక :స్వప్నసౌందర్యమా!..
ఏ అందాలను కీర్తించగా ఇన్ని భాషలు పుట్టుకోచ్చాయో తెలియదు!..
కానీ,
నీ అందాలను కీర్తించగా
ఎన్ని వేలభాషలు పుట్టుకోచ్చునో!..
మన్మధుడు ఏ ఊహతో మైమరిచి రాసిన కవితవో,
మేఘము నుండి నేలదిగివచ్చిన మెరుపుకాంతివో,
పగడాలు ఇమిడిన బంగారు శిల్పానివో,
పగలే తళతళ మెరిసేటి తారకవో,
తారకలో నడుమ నిలిచేటి వెన్నెలవో,
ఎవరో!. నీవేవరో,మనసున నిలిచిన మైమరుపువో,
కనుల మాసిన వేళ కలలో కనిపించి మురిపిస్తావు,
నన్ను మైమరపించి మురిపిస్తావు,
కల నుండి ఇల చేరి రావేమి ప్రియతమా!.
ఊహల సంకెళ్ల నుండి విడిపించవేమి స్వప్నసౌందర్యమా!.
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 59.బండి భానుచందర్
శీర్షిక : సొగసు చూడతరమా!.
సొగసు చూడతరమా ,
నా మనసు విప్ప వశమా!..
పరువపు పసిడి శిల్పమా
నీ పలుకే పరవశవచనమా
నీ చూపు వలపు కలమా ,
నా మదిపై రాయు ప్రణయకావ్యమా!..
ఊహలు గీసిన చిత్రమా
నా శ్వాసను అల్లుకున్న బంధమా!.
స్వర్గము వీడిన అందమా
నీ స్వరమే మధురగానమా
హంస నడకల వయ్యారమా
నిను వర్ణింప ఏ భాషచాలదు !..ప్రియతమా!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 58.బండి భానుచందర్
శీర్షిక : నాలోని ప్రేమ నీకంకితం!..
నిరీక్షిస్తున్నాను ప్రతి ఉదయం
నా హృదయం నీకు నివేదిస్తూ!..
నిరంతరం నాలో కలవరమయం
నిన్నే తలచి వేచిచూస్తూ !..
నాలో విరహాల ప్రళయం
నిన్నే ప్రియముగా ఊహిస్తూ !..
నాలో వలపుల సంగీతం
నిన్నే ప్రాణముగా భావిస్తూ!.
నాలో ఏదో తెలియని సందేహం
ఇంకా తీరని దాహం
నీవు నిజమో, కలవో అని అనుమానిస్తూ !..
నాలో అనురాగమంతా నీకే ధారపోస్తూ!.
నిన్నే దూరముగా చూస్తూ..
నిర్జీవముగా భావించేలా జీవిస్తూ!..
నీ నామమేమిటో తెలియక చస్తూ,
అడగలేక వెనుకడుగు వేస్తూ,
అయినను నాలో నేను ఆనందిస్తూ...
నామమైనా తెలియని నీకు
మనసే చేసా నీకు చిరునామా,
ఊహలతో నింపి అంకితమిస్తున్నా నాలోని ప్రేమా!..
ప్రియతమా!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: బండి భానుచందర్
61. ఇది నీ మహిమా
మనసుకు నవోదయం నీ పరిచయం
ఉషస్సులో మురళి గానం నీ మౌనం
నిదురలో వసంతమే నీ రూపం
ఏమిటో తెలియని వైనం
ఎందుకో చిలిపితనం
నను వీడి సాగిన ప్రాణం
నీలో దాగెనని నా అనుమానం
ప్రియతమా!.. ఇది నీ మహిమా!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: బండి భానుచందర్
62. ప్రేమంటే చూపావు
ఉషోదయపు తోలివేకువలా నన్ను చేరావు
ఊహల ఊపిరితో మనసుకు ప్రాణం పోసావు
ఉప్పెనలా నీవు నా గుండెచప్పుడు శ్రుతిలో
చప్పున నీవు కలిసావు !.
తప్పుకునే దారిలేక నీ చూపుకు తలవంచాను
నిన్నే తలిచాను !
నీకై తపించాను !
నీ కలలప్రపంచంలో నన్ను తోసి ఓంటరివాడిని చేసావు !.
ప్రేమంటే చూపావు!.
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 63. నీదీ నాదీ ఓకే కథ
నిన్నటి కలలే చెదిరినా
నేడు నిజమై వచ్చింది ప్రేమ !.
నిరాశ చీకటి కమ్మిన
ఆశల వెలుగు తెచ్చింది ప్రేమ!.
మనసుంటే మార్గముంది
మనకు ప్రేమే తోడయ్యింది
ఓకరికి ఓకరం ఇపుడే ఓకటై సాగుదామా !.
నీదీ నాదీ ఓకే కథ !.
మన ప్రేమే మరో జగతిని చూపదా!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 65.
బండి భానుచందర్
*****************
నీ ఆలోచనలో!.....
ఏదో మాయ జరిగినది
నాలో నాకే తెలియనిదీ!.
అది నీ మహిమని తెలిసీ
నా మనసే నీవైపే వస్తున్నది!.
నీ చూపుల బాణం తగిలి
నా మనసే మౌనం దాల్చినదీ!.
నీ నవ్వుల జల్లే కురిసి
నా గుండె పూవ్వుల తడిసినదీ!.
నీ మౌనరాగాలు వినబడి
నా మదిలో భావాలు పలికినవి !.
హ్రుదయం నిదురించక నీ చెంతకే చేరాలంది
ఉదయం ఉదయించక నీ వేకువ కావాలంది
నీ పేరు పలుకనిదే వేకువజాము మేలుకోననందీ
నిన్ను చేరనిదే ఈ విరహం నన్ను వదలనందీ
కదలదు కాలం నీ ఆలోచనలో..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 64. బండి భానుచందర్
శీర్షిక : ప్రేమకు లేదు మరుపు
కనులు మూసినవేళ మదిలో నీ తలపు
నా మనసున ఉదయించెను నీ కలలమెరుపు
నాలో ఏదో తెలియని వింత వలపు
నీవులేక లేదన్నది మనసు జీవితానికే గెలుపు
నీతో నిండిపోయే నా ప్రతి తలపు
నీకై తెరిచి ఉంచాను నా మది తలుపు
ఏనాటికి రాదు చెలి ప్రేమకు మరుపు
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 67. బండి భానుచందర్
******************
శీర్షిక : నీ ఓకమాట చాలు
********************
ఓ చెలి!..
కిలకిలమని నగువులతో, సుకుమారమైన పాదములతో నా స్వప్నసీమపై పరుగెడకు!..
పూవ్వు వంటి నీ పాదము కందితే
నిరంతరం నిన్ను మోసెడి
నా మనసు ఓర్వనంటుంది!.
అలాగని నీవు కనబడక దాగిపోకు ,
కలలమందిరము విడిచిపోకు ,
గుండెకు కలవరం పెంచమాకు
నా ఆశలనే తుంచమాకు,
శ్వాసనే బ్రతికించు నీ ఓకమాట చాలు నాకు !.
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 66. బండి భానుచందర్
****************
ఏ మాయ చేసావో!.
***************
ఏ మాయ చేసావే ఓ ప్రేమ
నీ వెంటే వస్తుంది నా మనసమ్మా
గుండెలోని ప్రాణం నువ్వే
ప్రాణానికి ఊపిరి నువ్వే
ఊపిరి శ్వాసల ఆయువు నువ్వే
ఆయువు పెంచే ఆశవు నువ్వే
నువ్వే నువ్వే నాలో సగమే నువ్వే
ఈ జన్మకు అర్థం నువ్వే
ప్రతి జన్మబంధం నువ్వే
వరమై వచ్చావు
సిరులే తెచ్చావు
మనసే గుచ్చావు మాటతో!.
తారలా వచ్చావే
ఈ తీరుగా నిల్చావే
ఏ తీరం చేరుస్తావే నీ ప్రేమతో!.
పూవ్వులా పూచావే
నవ్వులే విరిసావే
జివ్వుమని లాగావే నీ సోగసుతో!.
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 68.బండి భానుచందర్
శీర్షిక : బాలకులే రేపటిపౌరులు
చిరుచిరు నడకల చిన్నారులు
చిరునవ్వుల వెలుగుదివ్వెలు
అంబరాన్నంటే సంబరంవారిది
కల్మశాన్ని ఎరుగనిది వారిమది
ముద్దు ముద్దు మాటల బాలలు
హద్దులేని ఆటలాడే లేడిపిల్లలు
చెంగున ఎగిరే లేగిదూడలు
చిరుబుర్రులాడే కప్పపిల్లలు
పాటలు పాడే కోయిలలు
పోటిపడే చిన్నిగుర్రాలు
పిల్లలు కాదు పిడుగులు
తారాలోకంలో తారజువ్వలు
నలుదిక్కుల వ్యాపించే వెలుగుదివ్వెలు
బాలకులు రేపటిపౌరులు !..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 71. బండి భానుచందర్
*అందాలగోదారీ **
నింగిలోని చందమామ నాకోసం వచ్చిందా
జానతెలుగు జాబిలమ్మ నీ వేషం వేసిందా!
నీ మధురమాటలతో మధుమాసం పూసిందా
నిశి ఎరుగని వెలుగే నీ దరహాసంలో వెలిసిందా
ఆకాశం మరిచిన తారలే నీ సోగసులో తలదాచుకున్నాయా
అవకాశం కోరే అప్సరసలే నీ నడకలో నర్తిస్తున్నాయా!.
పరిహాసం చేసే కోకిలలే నీ స్వరంలో గానం చేస్తున్నాయి
వనవాసం వదిలిన చిరుగాలులే నీ శ్వాసలో చేరాయి!.
నీ అదరాలు ఇచ్చిన వరమే మందార ఎరుపు
నీ నవ్వు చేసిన పుణ్యమే మల్లెల తెలుపు
నీ కనులలో మౌనరాగాల పిలుపు
మదికి వినిపించి కలిగే ప్రేమ తలపు
అందాల గోదారీ!. చూపవే నా ప్రేమకు ఓక దారి!.
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 70. బండి భానుచందర్
***నిన్ను చూసి మనసు మురిసే *****
అందాల ఆకాశమా
నా ప్రాణ స్వప్నమా
శశి వెలుగుల రూపమా
చిగురించే ఆశల గీతమా
నిన్ను విడువ నా వశమా!.
వెన్నెల వనమా
వన్నెల కలువమా
నన్ను చేరిన ఆనందాల తీరమా
ఆశగా అడుగుతున్న ఓక్కమాట
ఊసులే చెప్పమని ప్రతిపూట
భాషలే నేర్వని నీ మాట
వినబడుతుంటే ప్రతిచోట!.
పసిడిపరువాల ఓ కాంత
నన్ను నేను మరుచుట ఓ వింత
నువ్వే నిండావని మనసంతా
నేనే వాలాను నీ చెంత
జాబిలమ్మ చూసి నవ్విన జాజికోమ్మలా
నిన్ను చూసి నా మనసు మురిసింది!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 73. బండి భానుచందర్
* ఆకాశమంతటి ప్రేమ **
ఆకాశమై వచ్చావే చెలియా
పరవశమే తెచ్చావే సఖియా
నా కనులకు నీవు కనిపించిన సూర్యోదయం
నీ పూలనవ్వుల పెదవులతో పలికినపుడే చంద్రోదయం
నీ సింగారాల సొగసు కిరణాలు తగిలి వెలిగెనే నా హృదయం
నీ అధరపు మధురమాటలు పోందుటకై మనసే తుమ్మెదై పోయినది
హృదయవనంలో భావాలల దారిలో ప్రేమవేకువ వైపుగా నడిచే పాలరాతిబోమ్మ !.
నీ తలపే ఓక ప్రణయమమ్మ!.
లెక్కించలేని ప్రేమనాలో
నీకే ఎలా చెప్పాలో
మనసు మురుసే నీ చెంత
నా ప్రేమ ఆకాశమంతా !..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 69. బండి భానుచందర్
**నువ్వోస్తావనీ... ***
నింగిలోని శశివి నువ్వేనని పసిపాపలా చూస్తున్నా
కనులతో....
అందాల రాశివి నువ్వేనని ప్రేమలేఖ పంపుతున్నా
మనసుతో..
కనులకి అందని కలవో
కలము రాయని కవితవో
ఎవరో నీవెవరో
లేలేత పూలగంధాలు మనసుకి పూసావు
పూసిన గంధాలకే పరిమళం ఇచ్చావు
పరిమళంతోనే నన్ను పరవశున్ని చేసావు
మనసు తోటలో
ప్రేమకోట కట్టాను!.
ఆ ప్రేమకోటకే
పూలబాట వేశాను?.
నువ్వోస్తావనీ!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 72.బండి భానుచందర్
*నువ్వై నిలిచా**
పరువాల వాన
కురిసింది జాన
నా గుండెపైన!.
ప్రేమసాగరాన
మదితీరాన
నేను వేచి ఉన్నా!.
కురిసే వానలో పులకింతలెందుకో
తడిసే గుండెలో తపనలు ఎందుకో
ఎందుకో మరి ఎందుకో నేనే నువ్వై నిలిచా ఎందుకో!.
ప్రేమసాగరాన అలజడి ఎందుకో
మది తీరాన పరవశం ఎందుకో
నేనే నువ్వై నిలిచినది ఎందుకో
మనసు మురిసే ఎందుకో
వరుస మార్చే ఎందుకో
ఎందుకో మరి ఎందుకో నేనే నువ్వై నిలిచా ఎందుకో!.
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 74. బండి భానుచందర్
*నిలకడ లేని భావం *
నీ చిరునవ్వుల చిరుజల్లులో తడిసి
మనసు మురిసే చెలీ!.
నీ మాటకు తాళం వేసే పెదవులు చూసి నాలో మౌనం విరిసే చెలి!.
తొలిసారి తడిసే వానలో పూవ్వుకెంత ఆనందమో!. నీ తొలిప్రేమలో మునిగిన వేళ నా వయసుకంత మురిపెము చెలీ!.
వేకువ కిరణాల తాకిడికి వికసించిన తామర మొగ్గలా
నీ చూపు తగిలి నా మనసు వికసించెనే చెలీ!.
ఆకాశ శోధన ఎంత అసాధ్యమో
నీపై నా ప్రేమశోధన అసాధ్యమే!.
పరుగులు తీసే నదిలా.
పరవళ్లు తొక్కే సెలయేటిలా
ఉప్పొంగు సంద్రపు అలలా
నా మనసు భావాలు నాలో నిలకడగా లేవు!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 75. బండి భానుచందర్
*సువర్ణాక్షరాలప్రేమ *
ఊహల గానాల స్వరమా
ఊపిరి ప్రాణాల వరమా
తొలిప్రేమ మధురమా
మరుమల్లెల పూలకోమ్మ
కుందనపు బొమ్మ
నిన్నే తలిచినా వేకువరేయి అయిపోతుందీ
నువ్వే కనిపించిన రేయి వేకువలా అనిపిస్తుందీ
మధురం నా ప్రేమ నీకోసం దాచానమ్మా
అందిన ఆకాశమా!. నాకు దొరికిన వరమా!.
ఆశగా ఎదురుచూసే నా కళ్లు
నా ఆశవు నువ్వనీ !.
హ్రుదయంలో ప్రతిక్షణం ఉదయమై ఉదయిస్తావు!.
నీ చూపుల కిరణాలతో పదేపదే పరవశం తెప్పిస్తావు!.
వెన్నెలలా కనిపిస్తావు
ప్రియవేదనలే మిగిలిస్తావు
వర్ణించలేని అందాలభామా
నీకై దాచాను ఈ సువర్ణాక్షరాల ప్రేమ!.
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 76.బండి భానుచందర్
*పుణ్యభూమి నా దేశం*
ఎందరో మహానుభావులు పుట్టినదేశం
ఎన్నో చరితలకు మూలం నాదేశం
తెల్లదోరల పారద్రోలి
తెలుగుజెండాను ఎగురువేసాము,
అనిచివేసే బానిసతత్వాన్ని తిప్పికోట్టి ,
స్వతంత్ర హక్కును తిరిగి తెచ్చుకున్నాము ,
మూడురంగుల జెండా పట్టుకుని
వందేమాతరం నినాదమే ఊపిరిగా
కదిలిన దేశపౌరుల తలుస్తుంటే
రోమాల నిక్కపోడపుతో కదిలి
మరోమారు మన చరితను తిరుగరాద్దాం
మన దేశఖ్యాతిని చాటి చెప్పుదాం.
భారతీయుడుగా పుట్టుక ఓక వరం
వందేమాతరం వందేమాతరం
కావాలి మనకు సరికొత్త యువతరం !..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 77. బండి భానుచందర్
*రంగుల జీవితం *
అందరిదీ ఈ జీవితం
కష్టసుఖాలకు పరిమితం
నువ్వు తలిస్తే పరహితం
లోకం తలుస్తుందీ నీ హితం!.
ఈ జీవితమనెడది ఓక కాగితం
సంతోష రంగులతో నిండాలి ఆ కాగితం
కష్టాలకు కలదు అంతం
ఏదీ కాదు ఓకరికే సొంతం
ఆలోచనలతో కాకు అధోగతం
మధ్యలో కానివ్వకు అస్తవ్యస్థం
కాలం ఓక పుస్తకం
జీవితం ఓక కాగితం
సంతోషరంగులతో నిండాలి ఆ కాగితం
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 79. బండి భానుచందర్ చిరునామా
* తననే తలచిన ప్రాణం
నీలి నీలి కనుల చిన్నది
తోలిచూపులో దోచింది నా మది!.
నిశిలోని ఉషోదయం తన నవ్వు
అందుకే వేచెను నా మదిపూవ్వు
వీలుపడదంటూ వాలుకనులతో
మౌనభాషలో వీలునామ రాసింది!.
ఇలా నన్ను పులకింతలలో తేల్చింది!.
ఎన్నడు ఎరుగని వైనం
మదికెందుకో మౌనం
నిరంతరం వలపుల గానం
తననే తలిచే నా ప్రాణం!.
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 80. బండి భానుచందర్
* మైమరపు
ఆ చిలిపి కనులు నావైపు చూపుతూ
అలపు లేని ఆశలే రేపావే!.
మౌనాలు కూడా పిలుపుగా వినబడగానే
నీ ఓడిలో నిదురించగా పరుగున వచ్చే మనసు!.
సరసన మీటావు నవ్వుల వీణ
సరస్సులా పోంగెను గుండెకోనా!.
నీ చూపు చాలు ప్రపంచంమరిచేలా!.
నీ నవ్వు చాలు వెన్నెలయేలా!. 0
ఆకాశం పొందని వెలుగే నాకు అందుతున్న వేళ!.
గుండెలో ఏదో తెలియని జ్వాలా!.
ప్రతిక్షణం నీ తలపే
ఇంకెన్నాళ్లు ఈ మైమరపే!.. ప్రియతమా!.
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 78.* బండి భానుచందర్
*సుందర సుమధురప్రేమ
ఆశలు చెప్పే ఊసులు ప్రేమ
భాషలు నేర్వని భావం ప్రేమ
మాటలకందని మౌనం ప్రేమ
సుందరం ప్రేమ!..
సుమధురం ప్రేమ!.
పూలకందని పరిమళం ప్రేమ
పుడమి చూడని హరివిల్లు ప్రేమ
సుందరం ప్రేమ!.
సుమధురం ప్రేమ!.
ప్రేమన్న భావం చాలు
భాష ఏలా!.
ప్రేయసి కనుచూపు చాలు
మాటయేలా!. పాటయేలా!..
సుందరం ప్రేమ!.
సుమధురం ప్రేమ!.
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 82. బండి భానుచందర్
*నువ్వుంటే చాలు
ఆశలే తాకాయే అంబరం
ఊసుగా వింటుంటే నీ స్వరం
గుండెలో మొదలాయే సంబరం
నిండుగా ఇచ్చావే నీ వరం
మదిలో మొదలాయే కలవరం
నిన్ను చూడక పెరిగెను మదిలో భారం
నీ ఆలోచనలే నాకు ఆహారం
నీకోసమే చేస్తున్న ఊహల విహారం
నీ నవ్వే నా మనసుకు కారాగారం
ప్రతిరోజూ చేస్తుంది వయసే నీ జాగారం
నీ చూపే అల్లింది గుండెకు దారం
నీ వైపే తెరిచి ఉంచాను హ్రుదయద్వారం
ఎగిసి పడదా భావపు అలలసంద్రం
అందుకోవాలని నీ సొగసుల తీరం
సిరిసిరి నవ్వుల సిరిమల్లి
నువ్వుంటే చాలే చెలి
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 81. బండి భానుచందర్
*నేను నీకోసం
మనసు పిలిచిన మగువా
ఏ జన్మకి నిను విడువా!.
అంతన్నది లేక పోంగెను ఆశలే వెల్లువై
చెంతచేరక నిలిచెను మాటలు బరువై!.
ఏ తోటలో పూయ్యని పూవ్వు
అందాల నీ నవ్వు!.
ఏ తోటకి చెందని రాణివి నువ్వు
నా ప్రతిపూటకి తోడుగ రావా!.
నా ఊహలన్ని నీకోసం
నా ఆశలన్ని నిను చేరు క్షణం కోసం
నువ్వు నాకోసం
నేను నీకోసం!.. ప్రియతమా!.
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 83. బండి భానుచందర్
*నీ మాట తెలుపే
తొలిసారి చూసానూ నీ చూపే
ప్రతిసారి వస్తుందీ మది నీ వైపే!..
వెన్నెలంత వెలుగే నీ రూపే..
నా కనులన్ని కళలుగా నిను చూపే!..
నీ మాటలే నాకు మధురతీపే
మనసే వాలిందీ నీ వైపే!..
నీ అధరాలలోనీ నిండిన ఎరుపే..
ఓ మధురానుభూతులనే నాకు తెలిపే!..
నా ఊహలన్నీ ఊయలలో నను ఊపే మోహమాటాలు విడిచి నీ మాట తెలుపే !... చెలీ !..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 84. బండి భానుచందర్
*ఎదురు చూస్తుందే మనసు
నీ నవ్వుల అలజడి
నిండిన మనసుతో
ఓడిఓడిగా అడుగులు వేస్తూ
నీ వైపే వస్తున్నా!... నువు కనిపిస్తావనీ!....
నీ చూపులే బాణాలై!..
ఎదసడికి చేసిన తీపిగాయముతో
నా గుండె గుడి తలుపులు తెరిచి నీకైఎదురుచూస్తున్నా!.. నువు వస్తావనీ!..
కదిలే బొమ్మలా కదలివస్తుంటే
కనుబొమ్మ కూడా కదలక నిన్నే చూస్తున్నా ....నేనే ఎటూ కదలక కదలని బొమ్మ లా నీకై నిల్చున్నా!...
నువు కరుణిస్తావనీ!..
ఎదురుచూస్తుందే నా మనసూ!... ...
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 85. బండి భానుచందర్
* చెప్పవే ప్రేమ
అటు ఇటు చూస్తూ మనసెటు వెళ్లిందో!..
అది ఇది వింటూ నీలో ఉండిపోయిందో!...ఏమో తెలియని వైనం!..
ఏమౌనో నా ప్రాణం!...
విడవవే చెలి ఈ మౌనం!..
వినిపించవే నీ ఊసుల గానం!..
నా గుండె తలుపులు తెరచి ఉంచా నీకోసం!.. నీ నిండువెన్నెల వలపులు దాచుకుంటావనీ!... నా హ్రుదయ లేఖ నీకు రాసా!..
ప్రతి ఉదయం వేకువై ఉండమనీ!...
బదులు చెప్పని నీ చూపుల తాకిడీ తగిలి తాళలేక పోతోందే నా మనసే!...
ఇకనైనా చెప్పవే ప్రేమా !... ...
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 86.బండి భానుచందర్
* ఇది నీకు తెలుసా! నీ
నాలో ప్రేమకు భావమై
నను మైమరిపించే ఊహవై!.
సడిచేయక గుండెలో చేరావే చెలీ!.
మైమరిపించే కనులభాష తెలియక
తికమక పడుతుంది నా మనసు
చెప్పలేని భావాన్ని తెలుపక తెలుపవు
ఆ భావాన్ని ఎలా అర్ధం చేసుకోను!.
అర్థం కాని వేదనలే నన్ను పదేపదే
గుచ్చుతున్నాయి మనసా!.
ఇది నీకు తెలుసా!.
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 87. బండి భానుచందర్
* కలలను వేడుకుంటున్నా
నా ప్రాణమా నువ్వెక్కడనీ...
గుండెచప్పుడు నిను వెతుకుతున్నదీ...
నా మౌనమా నీవేలేక
నేను నిలువలేనంటూ మనసు
నను నీవైపు లాగుతోందీ...
నీ చూపులే కలవరింతలై
పదేపదే నను వేదిస్తూ వెంటాడుతుంటే
కాలం కదలికలు కూడా మానేసాయీ...
నిన్ను చూడాలని ఆశతో ..
నిన్నే తలుస్తూ నిదురమరుస్తున్నా!....
కనులు మూసి కలలను వేడుకుంటున్న
నీ దరికి నన్ను చేర్చమనీ!....
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 89. బండి భానుచందర్
*జీవితము నీవే
ప్రేమలో తొలిజననం
ఆ ప్రేమలోనే తొలిమరణం
నాలో నిలువని నా ప్రాణం
తనకే బహుమానం!.
మదిలోని భావం
తనపై ప్రేమరాగం!.
సుమధుర కావ్యం
పలుకని తన మౌనం!.
ఊహలకందని ఊహవు నీవే
భాషలకందని భావం నువ్వే
వర్ణించచాలని వనితవు నీవు
నా జీవితము నీవే!.
కనులకు కాంతివి నీవే
గుండెలో భావమై కదిలే బంతివే నీవే
ప్రాణం ఉన్న పాలరాతి శిల్పానివో
మదికే ప్రాణం పోయగవచ్చిన దేవకన్యవో
ప్రియతమా!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 90. బండి భానుచందర్
*నీవెవరో!..
నీ చూపులే నా శ్వాసగా నాలో నిలిచే ఆశగా
హృదయ ఘోషగా తెలియని భాషగా
ఊహల ఊసుగా నాలోకి కదిలివస్తోందని నేడే తెలిసెగా!..
నీ ఊహే నాలో రేపెను తెలియని సెగ
నీ మాటే నను చేరెను సంగీతముగా
నీ తలపే నాలో ఆశల గీతముగా
నీ కనులకు బందీగా పడి ఉన్నది నా మనసేగా!..
అందానికే సవితివో
అందని మాలతివో
అందుకున్న జీవితమువో
అందమే రూపముగా దిగివచ్చిన అతివవో!..
ఎవరో నీవెవరో తెలిసేదెలాగా.... ప్రియతమా!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 88. బండి భానుచందర్
*వెర్రి మనసు *
హ్రుదయంలో ఉదయించిన భావాలెన్నో
ఆ భావాలు కన్న కలలెన్నో
ఆ కలలు చూపించిన నిజాలెన్నో
ఆ నిజాలే కల్లల్లుగా మిగిలినవి ఎన్నో ఎన్నెన్నో!..
హ్రుదయంలో ప్రియమైనభావం పొంగిన వేళ
తనను తానే మరిచేంతలా అనుభూతి చెందుతుంది!..
అదే భావమే దుఃఖం అయితే
పెదవులు మెదపక
కనుల వెనుక కన్నీటిని దాచి
అంతులేని వింత రోదనను భరిస్తూ
తనలో తాను కుమిలి కుమిలి చస్తూ బ్రతుకుతుంది
ఏమిటో!.. ఈ వెర్రి మనసు!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 91. బండి భానుచందర్
**నీ చూపే నా ప్రాణం
అందమే అలకరించుకున్న శిల్పమే నడిచి వచ్చిందా !.
ఆనందమే అపురూపమై కదలివచ్చిందా !..
తారలన్ని తన అందాన్ని చూస్తే కుల్లుకోవా!..
జాబిల్లి తన నవ్వు చూసి మబ్బుల చాటున దాగిపోదా!..
వేకువే తన చూపులలో కోలువుండిపోదా!..
చీకటే చూపులవెలుగులో కాటుకగా నిలిచిపోదా!..
తనను పిలువటానికి కవితలన్ని తరలిరావా!.
తనలో నిలిచిపోటానికి చిరుగాలి వెంటపడి వేచిచూస్తుందీ!..
నాలో కదిలే ఊహలకు తన చూపేగా ప్రాణం!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 92. బండి భానుచందర్
**నీకై సాగిన మనసు
ప్రాణం పాడిన పాట
మౌనం తెలిపిన మాట
నువ్వు విన్నవా!..
ఊహలు కట్టిన కోట
ఆశలు పట్టిన బాట
నువ్వు చూసావా!..
మదికి నీ చూపు వినిపించిన భావం ఏమిటో
మనసు నీకై రాసిన కవిత ఏమిటో..
నువు చదివావా!..
నీ పాదం క్రింద నలిగే నా ప్రాణం
నీ పెదవు అంచుకే అంటికుని పడివున్న నా మౌనం
నువు చూస్తున్నావా!..
నిను ఆశగా అర్థించిన నా మనసు శ్వాసలనే వదిలి నీ నిశ్వాసల ఉచ్వాసలకై సాగిందీ!.
నీకు తెలుసునా!..ప్రియతమా!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 93. బండి భానుచందర్
**నీతోనే నా ప్రేమ
ప్రతిక్షణం నీ స్మరణం
క్షణ క్షణం అది నాకు మరణం
నిరంతరం నీ ధ్యానం
నా అంతరంగంలో వినిపించే నీ గానం!..
నా మది నిను చూపే దర్పణం
అది నీకే సమర్పణం
నువ్వే నా జీవనం
నీవు లేక నిలువదు ప్రాణం!..
నీ నవ్వు పూలవనం
నీ చూపుల చిలిపితనం
నీ తలపే కమ్మదనం
నీ పేరే తియ్యదనం!..
నీవు లేక సాగదు పయనం
నీతోనే నా తొలిప్రేమ కథనం!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 95.బండి భానుచందర్
*ప్రియతమా *
నీ కనుపాపను కాపుకాసే కంటిరెప్పనవ్వనా !..
లేక
ఆ కనురెప్ప కాపుకాసే కనుపాపనవ్వనా!.
ప్రియతమా!..
కనురెప్ప చాటున కంటిపాప చూసే కలనవ్వనా!..
లేక
ఆ రెప్పచాటున కంటిపాప దాచే కన్నీరవ్వనా!.
హ్రుదయమా!..
కనులకు వెలుగవ్వనా!.
కలలకు ప్రియమవ్వనా!.. ప్రణయమా!..
నీ కథనవ్వనా
నీ వ్యథనవ్వనా
నీ కథలోని వ్యథలను పంచుకుని నీ సగమవ్వనా..స్వప్నమా!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 94. బండి భానుచందర్
**నువు వాలవెందుకే మనసా
కనులు మూసిన నువ్వే
కనులు తెరచిన నువ్వే
ప్రతీక్షణం నీ నవ్వే
గుండెలో పూవ్వై పూస్తుందే!..
అటు వైపు నువ్వే
ఇటు వైపు నువ్వే
ప్రతిచోటా నువ్వే నువ్వే
మదిలో భావమై మెదిలావే!..
నిదురుంచు నా నయనాలకు కలవై మెలుకువ తెప్పిస్తావు!..
మెలుకువ ఉన్న కనులకు స్వప్నమై కనిపిస్తావు!..
అంతలో మైమరిపిస్తావు!.
ఇంతలో నన్నే మరిపిస్తావు!..
వింతగా మురిపిస్తావు
చెంతగా నువు వాలవెందుకే మనసా!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 96
ఏమిటో ఆ చూపు నాలో కలిగిన తొలివలపు!..
ఏమిటో ఆ చూపు నాకు కలిగిన మైమరపు!..
నా కనులకు నిదురమరపు
కలలకు ఆత్మీయ పిలుపు
ఊహల ఊరేగింపు
ఏమిటో ఆచూపు!..
ఆశల ఆహ్వానింపు
ఊసుల మరపు
ఊపిరికి ఊరడింపు
ఏమిటో ఆచూపు!..
విరహాల నిట్టూర్పు
విరులకది తలుపు
వెన్నెలకు కవ్వింపు
ఏమిటో ఆ చూపు!..
ఉషస్సులో మేలుకొలుపు
తమస్సులో వెలుగుల కూర్పు
మనస్సులో విస్మయింపు
ఏమిటో ఆ చూపు!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 98. బండి భానుచందర్
* తొలిక్షణంలో
ఇరువురి నయనాలు కలిసిన తొలిక్షణాలలో మన హృదయాలు చేసిన పయనాలెన్నో...
ఆ పయనాలకు గమ్యం తెలీదు
ఆ భావానికి అర్థము తెలీదు
తెలియని భావమే తెలిసినట్టు మనల్ని చేరేను
కవ్వించెను, కలలను పంచెను...
ఆ కలలు చేరిన నా మది నీ కవితే రాసెను..అది నీ చూపులపాటలో పల్లవై పలికెను..
ఆ పాటల పల్లవిలో మన మనస్సులు సందడుల సంబురములు చేసేను..
ఆ సంబురాన్ని నిలుపలేని నా మనస్సు అంబరాన్ని చేరెను...
చేరిన నా మది నిను వెతికి నీ ఎదలో పవళించెను...
నా మది జాడ
నాకు నేడే తెలిసెను....
[31/01, 7:05 PM] బండి భానుచందర్: 97. బండి భానుచందర్
* సౌదామిని
సూటిగా చూడవద్దు
ఆశనే పెంచవద్దు
నీ ఆలోచనలో ముంచవద్దు
ప్రేమకు ఆకాశం సరిహద్దు
ఈ జన్మకు నువ్వే నా తోలిపోద్దు
నీ మాటలే నాకు ముద్దు
నన్ను ఓంటరిగా ఉంచవద్దు
నువు దరిచేరితే మదికి వినిపించిన గానాలెన్నో
నువు దూరం వెళితే మదికి తగిలిన గాయాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఊహల జడిలో నేను తడిసిపోని
నువ్వే నా ప్రేమకు దోరసాని
నీ తలపే నాకు హృదయవాణి
చేరవే చెలి సౌదామిని!...
[31/01, 7:05 PM] బండి భానుచందర్:
100.
బండి భానుచందర్
* తెలిసీ తెలియని భావమిదా !!.
నీ చూపే పొడుపుకథ
విప్పలేకపోయెను నాఎద
అందుకే నాకీ వ్యధ
ఇది నీకు తెలియనిదా!...
ఓహో!.. మౌనరాగల సుధ
చెప్పవే నీ మూగసైగల కథ
తెలుపవే నీ కనులభాషల గాథ
ఏమిటో..ఇది నీకు తెలియనిదా!..
ఇదీ నీకు తెలియనిదా..లేక తెలిసినదా!..తెలిసీ తెలియనదా!..నీకు తెలిసి తెలుపనిదా!..
నీకు తెలియనిదీ, నాకు తెలియనిదీ...ఏమిటో ఈ భావమిది....సరికొత్తగా ఉంది...
నిజంగా ఎవరికీ తెలియని భావమిదా!..
[31/01, 7:05 PM] బండి భానుచందర్:
99.
బండి భానుచందర్
* ప్రేమలో ముంచావు
ఊహ పెంచకే
ఊపిరి ఆపకే
ఊయలూపకే
హృదయమా!.
తపన పెంచకే
తనువు కాల్చకే
తగదని చెప్పకే
స్వప్నమా...
గుండెల్లో ఆశవై
గాలుల్లో శ్వాసవై
నాలోని ప్రాణమై....నిలిచావు
నీ చూపుకే కాటుకలా
నీ నవ్వుకే వెన్నెల్లా
నీ పెదవుల రంగులా...నన్ను మలిచావు
ప్రేమలో సాగరంలో ముంచావు ..ప్రియతమా!....

Comments
Post a Comment