విజయ లక్ష్మి KS 38


విజయ లక్ష్మి గారి కవిత్వం
**********************
1
[02/06, 5:48 PM] Vijayalakshmi Ch KS 38: సమూహం :వీరాస్ కవి సమయం
తేది :09-05-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :01
అంశం :అమ్మ
శీర్షిక :గౌరవిద్దాం

*****************
అమ్మా.. అన్న పిలుపుకు అమరత్వం
అందించింది ఆమె ప్రేమామృతం
తల్లి ప్రేమలో వుంది సేవాతత్వం
అలుపెరుగని శ్రమజీవి
కుటుంబానికి వెన్నెముక
నాన్న సంపాదన ఆచి తూచి వెచ్చించే ఆర్ధిక మంత్రి
ఉన్నంతలో బిడ్డల అవసరాలు తీర్చే కల్పవల్లి
ఏ లోటూ లేకుండా చూసుకునే సమన్వయకర్త
తాను పస్తున్నా బిడ్డ బొజ్జ నింపే అన్నపూర్ణ
అనారోగ్యం లో అసహ్యించుకోకుండా
అమిత ప్రేమతో సహనంతో పరిచర్యలు చేసే పరిచారిక
బిడ్డ ఉన్నతి కోసం పాటు పడే ఆశా జీవి
భర్త కోపానికి గురి కాకుండా కాపాడే రక్షణ కవచం
అమ్మ తాను కరిగి పోతూ కుటుంబానికి వెలుగు నిచ్చే దివ్వె
ఆమె సేవలు అమోఘం అజరామరం అమూల్యం
అయినా దక్కదు సరైన గౌరవం
ఆమెను గుర్తిద్దాం ప్రేమ పంచుదాం
మన గుండెల్లో దాచు కుందాం
2
[02/06, 5:49 PM] Vijayalakshmi Ch KS 38: సమూహం :వీరాస్ కవి సమయం
అంశం :విజేతవై వెలుగు
కవి పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :02
ఊరు :-బీర్కూర్
జిల్లా :కామారెడ్డి

************************************
అదృశ్య రూపాన అంతటా వ్యాపించి తారతమ్యము లేక
విజ్ఞుల కందక విచ్చుకత్తులు లేక కుత్తుకలు కోయుచూ
విజృభించి కుదేలు చేయుచూ పకపకా నవ్వేను మహమ్మారి
స్వీయ రక్షణ తురగ మధిరోహించి సాంఘిక దూరమను
కరవాల ఘాతాన మట్టు పెట్ట వలెను మనుజులంతా
పరిశుభ్రతే నారాయణాస్త్రముగా నమ్మి ఎక్కుపెట్టి
సమర శంఖాన్ని పూరించి పీచమణచి దునుము కరోనాని
లాక్ డౌను ఏమంటు లాభమేమి టంటూ ప్రశ్నించవలదు మన ప్రభుత్వాల
స్వంత క్షేమము మరచి ప్రజల క్షేమమెంచి సేవలందించేటి ప్రత్యక్ష దైవాల త్యాగనిరతి మదినెంచి చూడు
బ్రతికుంటే బలుసాకు బుక్కి బ్రతుకగ వచ్చు బయట కాలు పెట్టక బ్రతుకు పై ఆశతో బ్రతికి జయించి వెలుగు మహిని విజేతవై

హామీ పత్రం -----ఈ కవిత నా స్వంత రచన, ఎక్కడా ప్రచురింప బడలేదు.

3
[13/05, 2:22 PM] Vijayalakshmi Ch KS 38: గ్రూప్ :వీరాస్ కవిసమయం
అంశం :తేనెటీగ
తేది :13-05-2020
క్రమ సంఖ్య :-38
పేరు :సి. హెచ్ విజయలక్ష్మి (స్త్రీ )
కవితాసంఖ్య :03
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :దారి మారాలి --మార్చాలి
************************************
కాయ కష్టం జేయు బడుగు జీవి వాడు
మధ్య తరగతోడు ఆశాజీవి వాడు
తినీ తినక రూక రూక కూడగట్టినాడు
కొడుకు ముందు సదువు కోసం వాడు
బిడ్డ పెండ్లి జేయ తలసి ఇంకొకడు
సిన్న ఇల్లు గట్ట కల యైన వాడొకడు
మధుపము చందాన సీటి గట్టినాడు
తేనెటీగ లెక్క మదుపున బెట్టినాడు
అవసరాలు దీర ఆశ బెట్టినాడు
అవసరమొచ్చి చేరబోయినాడు
బోరఁడు తిప్పి వాడు పారిపోయినాడు
ఏమి చేయను దిక్కు తోచని పక్షి ఐనాడు
కన్న కలలు యన్ని కల్లలైపాయే
కట్నమీయలేక పెండ్లి ఆగిపాయె
సీటు కొనలేక ఆశ సచ్చిపాయే
మధ్యతరగతి బతుకు సిద్రమైపాయె
కూలి నాలి బతుకు ఆగమైపాయె
పెట్టిన పట్టు (తేనెపట్టు=దాచిన డబ్బు )దోచి మనిషి బతుకుడాయె
దోపిడి మనుషుల దారి ఐ పాయె
నేడు మనిషి మనిషిని దోచి బతుకుడు ఆయే
ఎప్పుడు ఇడుసునో మనిషి స్వార్ధపు చింత
పక్కోడి కష్టం పంచుకుకొనే టంత
ఎదుటోడి బాగునూ కోరుకొనేటంత
మనిషి మనిషి లాగ బతికే టంత
బాడుగోడు లేకుంటే ఎదురు తిరగాలింక
మోసగాళ్ల ఆట కట్టించాలింక
మోసగాళ్లు దారి మార్చుకోవాలిo క
[19/05, 3:03 PM] Vijayalakshmi Ch KS 38: గ్రూప్ :-వీరాస్ కవి సమయం
తేది :19-05-2020
4
క్రమసంఖ్య :38
పేరు :ch.విజయలక్ష్మి, బీర్కూర్
కవిత సంఖ్య :04
ఓ.... స్నేహ మయీ...
నీ నిర్మల.. నిరాడంబర....
కోమల.. హృదయం...
కోరింది.. నా చెలిమి...
నీ రాక.... మార్చింది....
నా జీవన సరళి మనోహరంగా..
నీ ఆప్యాయతా మలయ వీచికల..
నా మానసాన కురిసింది తేనెల జల్లు..
నీ ప్రేమ మాధురి....
నా మనో తటాకపు వేదనా తరంగాల
నణచి చేకూర్చింది సాంత్వన
నీ అనుభవవిజ్ఞాన వీచికలు
నా జీవన మార్గపు తెరచాపలు
నా లో విరిసే ప్రతి చిరునవ్వు
నీ స్నేహ సుగంధపు విరి జల్లు
నీ స్నేహం నా అమృత హస్తం
నిలవాలి రమ్యంగా కలకాలం
పూవూ... తావిలా.....
జాబిలీ.... వెన్నెలలా.....
జ్యోతి.... కాంతిలా....
వీడని నీడలా......
ఆత్మ... శరీరంలా...
విడదీయ రాని... వీడిపోలేని....
వినీలాకాశపు తారలా...
వెలుగొందాలి.. ప్రకాశవంతంగా.....
5
[23/05, 1:51 PM] Vijayalakshmi Ch KS 38: సమూహం :వీరాస్ కవి సమయం
తేది :23--05-2020
క్రమసంఖ్య :38
పేరు :ch.విజయలక్ష్మి
కవిత సంఖ్య :05
*********************
సాధించాలనుకున్నా... నేననుకున్నది.
కలలు కన్నా... ఆశల అంబరాన్ని చేరాలని
అడుగడుగునా ఆటంకాలు అడ్డుపడుతున్నా
ఆడపిల్లకు ఆ చదువు ఎందుకంటూ..
అమ్మా నాన్నల సహకారం లేకున్నా
అక్కున చేర్చు కున్న ప్రభుత్వ ఒడి న
అహర్నిశలు చదువే ద్యేయంగా
అందుకున్నా డిగ్రీ పట్టా ఆనందంగా
వ్రాసా పోటీ పరీక్షలు పట్టుదలగా
సాధించా ప్రభుత్వ కొలువు బహుమతిగా
అర్ధమైంది అందరికి పట్టు మహిమ కదా
మెచ్చుకుంటుంన్నారు అందరూ నన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు మా వాడకట్టులోని పిల్లలంతా
ఇదే కదా ఒక ఘనత సంతోషించారంతా
కొన సాగిస్తా ఉద్యోగం ఆదర్శ ప్రాయంగా
అందరికి మేలు కలిగేలా
నాకు హాయి కలిగేలా
అమ్మానాన్నను చూసుకుంటా
కంటికి రెప్పలా....
6

గ్రూప్ :-వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :06
అంశం -తావి
తేది :-23-05-2020
పేరు :-ch. విజయలక్ష్మి

శీర్షిక :-ప్రకృతి నెలవు
*********************************
సృష్టిలో ప్రతి సృజన
వినుతి కెక్కు తన గుణమున

పరిమళాల వివిధ విరులు
పరిఢ విల్లు ప్రకృతి ఝరులు

సంగీతానశృతి లయలు
సుస్వరాల రస గుళికలు

చిత్ర చిత్ర చిత్తరువులు
చిత్తగించు మధుర మనో వీచికలు

శిల్ప కళా సౌందర్య తోరణాలు
చాటును చరితల ఘన చరితలు

నర్తన నట నయగారాలు
నటియించు నవరస వయారాలు

మనిషి సుగుణ సిరి సుగంధాలు
మానవతా హృదయ మకరంద విరులు

పడతికి మాతృత్వ మమకారము
సుదతికి సోభాగ్య సౌరభము

ప్రకృతి పొదిగే నొక ప్రముఖత
ప్రతి జీవి పొదివె తన ఘనత

తావులు యెంచగ ద్వివిధములు
చీకటి వెలుగుల తీరులు

ప్రకృతి వరణ మెపుడు వెలుగులైన
అవసరమే కద తిమిరమైన

తమమునకును కలదు కద ప్రాముఖ్యము
వివిధ కార్యముల కొనగూర్చును విశ్రమము

ప్రకృతి కాంత ఒడిలోన
ప్రతి జీవము తమ తావుల విలసిల్లిన
ప్రభవించును తుల్యత విరి ప్రకృతి తనువున
ప్రకృతి కాంత మురిసి  వెలుగునవ పల్లవముల
జగతిన సంతోష కాంతి వెల్లి విరియు
నవ శకమున నాంది వెలయు
7

వీరాస్ కవి సమయం
క్రమ సంఖ్య :38
కవిత సంఖ్య :07
తేది :02-06-2020
పేరు :ch.విజయ లక్ష్మి (స్త్రీ )
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
*********************************
వూహానునపుట్టి
విశ్వ మంతా మెట్టి
మనుజుల మట్టుబెట్టి
వినోదించు విస్ఫోటనమ్ము

తుదముట్టించగప్రతినబూని
మసులుకొనుము మంచి నడత తోడ
దునుము దాని దూరము పాటించి
మాస్కు గట్టి చిట్టి మదముననచు

కరముల తరచుగకడుగుకొనుచు
కొవ్వుపొరను కరగబెట్టి కడతేరగను
వేడి వేడి కషాయ సేవనం చేయుచు
మట్టుబెట్టు మహమ్మారి కరోనాను

జనహితము కొరకై జనతా కర్ఫ్యూ
లక్ష్యం కోసమై లాకుడౌనo టూ
ప్రజల కోసమే ప్రభుత్వo పడేను పాట్లు
చేసేను ఎన్నో నియంత్రణ ఏర్పాట్లు

శిక్ష యంచు నీవు వగచ వలదు
శ్రీ రామ రక్ష గ తలచ వలయు
స్వీయ రక్షణ మది నెంచ వలయు
సూక్ష్మ జీవి నెదిరి నిలువ వలయు

8.
వీరాస్ కవి సమూహం
తేది :07-06-2020
కవి సంఖ్య :38
కవిత సంఖ్య :08
పేరు :ch. విజయలక్ష్మి
టీచర్, కామారెడ్డి
============
ప్రశ్న లకు వివరణ లే జవాబులు
ఎందుకు? ఏమిటి? ఎలా?
వంటి ప్రశ్న లనేకం.

సృష్టి ఆదిగా మానవుని మదిని మెలకెత్తిన
సందేహాల ప్రతిరూపమే ప్రశ్న
సందేహాల నివృత్తి రూపమే జవాబు

ఆది మానవునికి సందేహకడలి మథనం
అందించింది విజ్ఞాన అమృత కలశం
మానవ మేధో దధిని ప్రశ్నల కవ్వముచే
మదించగా శాస్త్రాల నవనీతముదయించె

ఆది మానవుని డెందం నందు చెలరేగిన ప్రశ్నలకు
సమాధానమే.......... నేటి మానవ.. ప్రగతి......
ఆలోచనలకు అక్షర రూపమిచ్చినా
అక్షరాలే అయినవి భాషలు
వేదాలు ఉపనిషత్తులు కావ్యాలు
గ్రంధాలు పురాణాలు అనేకానేక శాస్త్రాలు
పుట్టుకకు కారణాలు

కట్టుబాట్లు సంప్రదాయాలు
సంస్కృతి ఆచారాలు నిబంధనలు
కట్టుబొట్టు అన్నీ మానవ సృజనేగా

కాలినడక గగన యాత్ర అయినా
గుహలు ఆకాశహర్మ్యాలైనా
వేట నుండి వ్యవసాయానికి ఎదిగినా
నగ్నత్వం నుండి నాగరికుడైనా
పచ్చిమాంసం నుండి బహు పచనాల నెరిగినా
నాటి నుండి నేటి వరకు
మానవ విజయపరంపరలమూల హేతువు
ప్రశ్న... మథనం... ఫలితం /జవాబు.... ప్రగతి...
ఇదే మానవ జీవనయాత్రా విశేషాల పల్లకి

మానవుడెంత ప్రగతి సాధించినా లేదు తృప్తి
అతడు నిత్య అన్వేషి
నిరంతర బాటసారి
విశ్వ శోధన విశ్వానంతరాళాల పరిశీలన అనంతములై ఊరిస్తూ సవాలు విసురుతున్నాయి
తృప్తి లేక సుఖం లేదట
తృప్తి పడితే ప్రగతి లేదట
ప్రగతి లేనిదే మనుగడ లేదట
మనుగడ ప్రశ్నార్థకమైతే........
అదేగా..... నేటి స్థితి....
సూక్ష్మ జీవి వటుడింతై అన్నట్లు ఉప్పెనై కమ్ముకొస్తుంటే
ఎదుర్కొనే ప్రయత్నం లో మానవుడు విరుగుడు కోసం అన్వేషణ ఆరంభం
అతని ప్రశ్నకు సమాధానం లభించి మానవ సమాజం
రక్షించబడి ఆనందతీరం చేరి యధాస్థితి పొందాలని
ఆకాంక్షిద్దాo.

యతో ప్రశ్న తథో సమాధానం
యతో సమాధానం తథో ప్రగతి
యతో ప్రగతి తథో సంతోషం

సంతోషం సగం బలం
సర్వే�

9
గ్రూప్ :వీరాస్ కవి సమయం
అంశం :గిజిగాడు
తేది 07-06-2020
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య 09
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
టీచర్, కామారెడ్డి
శీర్షిక :నేర్పరి
***************************************
ఓయి......... ఓ గిజిగాడా.................
ఏ దేవుడిచ్చిన వరమోయి నీది
ఆబ్రహ్మ యిచ్చిన నైఫుణే నీది
ఎగిరెగిరి పోయేవు యెంత దూరమైనా
ఏరుకొచ్చేవు మేటైన గరకలు
ఎంతొ తెలివిగా అల్లేవు గూడు
వర్ణించ తరమా నీ వ ల్లు తీరు
ఎంత గాలొచ్చి నా నీగూడు నిలిచుండు
ఎంత వానొచ్చినా ఒక్క చుక్కైనచొరదు
ఎంతొ కష్టించి బిడ్డల సాకేవు
రూపులో చినైనా నేర్పులో మేటివి
ముచ్చట గనుండు నిన్ను చూడంగా
విశ్వ కర్మయే చినబోవు నీ ముందు
ఎంత చదివిన గాని ఎంతెత్తు ఎదిగిన
ఎన్ని శోధించినా అంబరాన్నంటినా
ఏ యొక్క మానవుడు కట్టునా గూడు నీతీరు
నీనేర్పు చూసి మేం సిగ్గుపడియేము
కొంతైన నేర్పవే నీనేర్పు మాకు
అప్పుడైన మరి మా ఇంజనీరులు
కూలిపోని గట్టి కట్టడాలు నిర్మింతురో ఏమో?

10
వీరాస్ కవి సమయం
అంశం :గడప
క్రమ సంఖ్య :38
కవిత సంఖ్య :10
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :గడప మాలక్ష్మి
********************-*************
గడప మహాలక్ష్మీ నివాసం
శాస్త్రోక్తంగా స్థాపించబడిన శాసనం
మంచిని స్వాగతించే మణిహారం
చెడును నిలువరించే అస్త్రం
గడప లేని గృహం లేదు
భాధ లేని మనిషి లేడు
గడప గడపకో కధ
మనిషి మనిషికో వ్యధ
పసుపు కుంకుమల వెలుగు
పచ్చని తోరణాల అలరారు
పండుగైనా, వ్రతమైనా, నోమైనా, యే క్రతువైనా
ముచ్చటగా ముస్తాబై దేదీప్యమానంగా ప్రకాశించు
ముచ్చటలన్నీ ముడిపడి ఉండేది గడపతోనే
పాపాయి గడప దాటితే వండేది గారెలే
పదుగురికి పంచి పొందేది దీవెనలే
తల్లిగారిల్లు దాటే వధువు కంట నీరు నిండేది
పుట్టినింటి గడపతో పెనవేసిన బంధం బాయలేకే
మెట్టింట వధువు దాటిన గడప వేస్తుంది విడరాని బంధం
భర్త ఆగమనానికై నిరీక్షిస్తుదృష్టిసారించేది గడప వైపే
తుది యాత్ర మొదలై య్యే ది గడప నుంచే
ఎన్ని కలతల్లోనైనా, కష్టాల్లోనైనా ఆలుమగలకలిపే బంధం గడపే
మమతానురాగాల కష్టసుఖాల కోలబోతగా కుటుంబాలు వర్ధిల్లేది అనుబంధాల అలరారు గడపున్న గృహాల్లోనే
గుడి, బడి కూడా గడప లేక మనలేవు
ఎక్కడైనా తొలి పూజ లందే ది గడప మాలాక్ష్మీ
ఆజన్మాంతం గడప తోనే అందగించు అనుబంధం.
11


వీరాస్ కవిసమయం
అంశం :గంగానది
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :11
పేరు :సి. హెచ్. విజయలక్ష్మ
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :తల్లి గంగమ్మ
*************************-*********
దివి నుండి భువికి యేతెంచే భగీరధి
భగీరథుని తపః ఫలం పుణ్య జలధి
శివ ఝటా ఝూటం నుండి వూరికె భువికి గంగా
సగర పుత్రుల కొసగె కైవల్య పధము పవిత్ర గంగా
దివికి దిగిన జనని ఆయె పతిత పావనంగా
యమున, సరస్వతుల తోడుగ త్రివేణియై సాగే వేగంగా
బ్రహ్మ కమండలానా జనియించెను భవాని గంగ
దేవ ప్రయాగ నుండి గంగ గా పిలువబడియె పావని
హిందు వుల జీవనాన పెనవేసిన పవిత్ర జనని
అందరు కొలుతురు భక్తిగ గంగమ్మ తల్లియని
ప్రేమ మీర తల్లి ఒసగు మోక్షము తన బిడ్డల
తల్లి పేరు తలచినంత మనములు పులకించు
తల్లి మేను తాకినంత పాపాలు హరియించు
తల్లి పయనించు త్రోవ వెలిసెనెన్నో పుణ్య క్షేత్రాలు
జనుల ముక్తి నిచ్చు కైవల్య క్షేత్రాలు
తల్లీ నీ ఒడిలో పరిఢవిల్లు నగరాలు
దాహార్తిని తీర్చు నీదు అమృత జలములు
నీ జలముల వసియించును వివిధ జీవరాశులు
నీ జలముల తోడుగా నేలతల్లి ఒసగు గ్రాసము సకల జీవుల
నీవు లేక మనగలరా సకల జీవరాసులు
తల్లి పాలు త్రాగి తల్లి రొమ్ము గ్రుద్దినట్లు
నరులంతా నీ జలముల కలుషితం చేస్తున్నా
పావని గంగను జీవ నదీమ తల్లిని నిర్జీవిగ మార్చినా
తల్లీ విడిపోదుగా నీ దయ నీ బిడ్డలమీద
నీలో మునక వేసినంత కారుణ్యము కురిపింతువే
మాభస్మము, అస్తికలు నీలో కలుపుకొని చేర్చేవు పుణ్యలోకాలు
పొగడ తరమ నాతల్లి నీ మహిమ.

12
 :వీరాస్ కవి సమయం
అంశం :చేదు నిజం
తేది :10-06-2020
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :12
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :నిజం.... ఇది.. చేదు నిజం.... !!
***************--*******************
ప్రేమ ప్రేమ యంచు వెంట బడెడి యట్టి
ప్రేమ పక్షుల ప్రేమ నిలుచునెంత
మోజు తీరగానే ముఖము చాటు చేయు
ప్రేమ యంత కాదె చేదు నిజము

సుతుడు సుతుడు యంచు
ప్రేమ పంచు వారి కన్న కలలన్నియును
కల్లలుగా జేయు చూ
కాసు పంచు కొనుట పరమావధి కాగ
పట్టెడన్నము పెట్టని పుత్రుల రీతి గనక
పున్నామ నరకమ్ముఁ తప్పించు వారంటూ
నమ్ము జనని జనకుల కదియె చేదు నిజము

ఆలి తానంతయై సంసార సౌథాన
దాసి తీరుగ జేయు సేవలంతా
పతియె దైవముగ నెంచి చూపించు భక్తి ని
అత్త మామల సేవ అనురక్తితో జేయు
సంతు తా గాచును పెట్టోలే రక్షయై
ఇంట బయటా తాను మెలగు నాల్కోలే
ఎంత చేసిన గాని యేమి ఫలము
తీసివైతురు తనను కరివేప చందాన
తట్టుకొనునె యింతి యీ చేదు నిజము

అమ్మ నాన్న లన్న ప్రేమ మెండుగ నుండు
అన్న దమ్ము లన్న అభిమానముండు
ఆడు బిడ్డగ తాను ఆడంబరముగాను
అందుకొనును సారె ఆనందముగను
పుట్టినింట ప్రీతి పెక్కుగా జూపును
ఆడుబిడ్డలన్న తోడికోడలు యన్న
అత్త మామ లన్న అలుసు గాదె
అతివ కిట్టి బుద్ది పుట్టినప్పుడే వచ్చు
మెట్టినింటి జనుల మెచ్చ రెపుడు
లోక రీతి యిదియే నిక్కంబుగా మహిని
నొక్కి వక్కాణింతు నిదియె చేదు నిజము

నిజము ఎల్లప్పుడూ చేదు గానే నుండు
నీల కంధరుని గళపు విషము వోలె
భరియించుటే గాని తప్పింపగలమే
నిజము ఒప్పు కొనుము మానవుండా....... !!!!
13

వీరాస్ కవి సమయం
అంశం :గలాటా
తేది :11-06-2020
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :13
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :ఇందు గల దందు లేదను సందేహం వలదు
*****************************************
ఆస్తుల పంపకాన సోదరీ సోదరులనడుమ
సామరస్యం లోపించిన కుటుంబాల నడుమ
అధికారకాంక్ష కొరకు వేయు ఎత్తులు పైయెత్తుల
అనుమానం భూతం పట్టి పీడింప బడే ఆలుమగల దాంపత్య బంధాన
చెడు అలవాటుల పాలబడ్ద కుటుంబాల
నాయకులాడే ఆటల చేయు రాస్తా రోకోల్లో
నిత్య జీవన స్రవంతిలో నీటి కొరకు
బస్సులో రైలులో సీటు కొరకు
ఆశయసాధనకోసం పాటు పడే పోరాటం
కూడు కొరకు గుడ్డ కొరకు
భూమి కొరకు భుక్తి కొరకు
మతం పేర కులం పేర
వివేకం లేనిచోట
ఆవేశం ఉన్న చోట
డబ్బు దస్కం కోసం
పేరు కొరకు కీర్తి కొరకు
కోరిక తీరుట కొరకు
ప్రేమ కొరకు పగ తీరుట కొరకు
ఇది అది అని ఏది చెబుదు
ప్రతి ఒక్కరి జీవనాన
గ్రామాల నడుమ దేశాల నడుమ
నిత్యం జరిగే సంఘర్షణ
కాదా గలాటా
గలాటాలా గమ్యం అభద్రతా అశాంతులేగా
కనుకనే ఆశిద్దాం శాంతి
సమరసత భావంతో గాలాటాల నాపేద్దాం
ప్రశాంతంగా జీవిద్దాం.

14

గ్రూప్ :వీరాస్ కవి సమయం
అంశం :ప్రపంచ సముద్ర దినోత్సవం
తేది :13-06-2020
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య 14
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :సముద్రం
********************************
నదీమ తల్లుల గమ్య స్థానం
నిత్య సౌందర్యవిలసితమౌ మహా జలనిధి
వీనుల విందుగ అమృత సంగీత ఝరులు
నిరంతరం వినిపించు ముగ్ధ మోహనమగు అలలు

అనంత రహస్యాలు దాగిన అపురూప ఖని
మానవ సాధ్యమే.? ... శోధించి సాధింపగా... !

అనేకానేక జీవరాసుల నిలయమై
అభయమిచ్చి దాహార్తి ని దీర్చు
మేఘమాలికల వర్ష ధారలకు మూల హేతువై
మానవ మనుగడకు మూలాధారమై
ఇలను  నాల్గింట మూడొంతులు నీవేయై
నిలిచావు ఘన వర ప్రదాయనివై


పవిత్ర చరిత గల రత్న గర్భవు
జీవన దాత వగు నిన్ను
కాలుష్య కాసారముగా మార్చె
మూర్ఖ మానవుడు తన అత్యాశతో
తన గోతి ని తానే త్రవ్వుకొనే తీరు తో

మేలుకో మానవా.....
ప్రకృతి వనరుల నన్నింటిని కలుషితం చేయుచూ
మనగలవా.. ఈ భువిని....
ప్రకృతి కోపించి ప్రకోపించితే.... తట్టు కోగలవా...?
ప్రకృతి వైపరీత్యాలనూ.... !
సునామీలనూ... !అడ్డుకోగలవా....?
కాలుష్య కోరలు పీకేసి....
ప్రకృతిని రక్షించి...
స్వీయ రక్షణ పొందాలోయ్..
15

వీరాస్ కవి సమయం
అంశం :చీర
తేది :14-06-2020
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :15
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :ఘనత కలది
******************************
భారతీయ సంస్కృతికి అద్దం పట్టు
ప్రపంచమంతా మెచ్చు చీర కట్టు
చీర కట్టు ముందు ఏదైనా తీసికట్టు

పడతి మనసు మెచ్చు పట్టు చీర
పట్టు నందు కంచి పట్టు మేటి

చీర కట్టి బొట్టు పెట్టి
వాలు జడలో పూలు పెట్టి
హంస నడకల నారి నిలిచిన
అందరి చూపులు నిలుచు ఆమె వైపు
గౌరవం తో పెట్టుదురే దండం
అదియే కదా చీర లోని కనికట్టు

చీర లోనే సింగారం
మేని కద్దు బంగారం
ఒలికించును ఒయ్యారం
కలిగించును నిండుతనం

నార చీర నేత చీర
ఆకాలం పేరు గాంచె
అలనాడే మన చీరలు
లోకాన వాసి కెక్కె
మన నేతన్నలు నేసిరి
అగ్గి పెట్టె పట్టు తీరు
పొగడ తరమ
వారి పటిమ

మంగళ గిరి వెంకట గిరి
బనారస్ అంటూ వచ్చే
నేడు రక రకాలు
దోచు ను కన్నెల మనసులు
దాచు ను వారి సొగసులు
చీర కట్టి న పడతులు
మురిపింతురు మగని మనసు

తల్లి తుడుచు బిడ్డ పెదవి
జోల కట్టి తనివి తీర జోల పాడు
ఆట లాడ గా దాచు కొంగు చాటు
వానైనా ఎండైనా కాయు కొంగు మాటు

ఆడుబిడ్డ లందరు కోరుదురే సారె చీర
ఆనందిం తు రు మెండుగా
నాగరీకు లైనా కోరుకుందురు చీరనే
నూతన పోకడలు పోయె డి వారలైన గాని
పండుగల పబ్బాల ధరియింతురు చీరనే

అదియే... కాదా... చీర.. గొప్ప తనము
అప్పటికి.. ఇప్పటికి... ఎప్పటికి.....
చీర... ఘనత..... పొగడ తరమా...... !!!!!!!

16
[16/06, 3:03 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమ సంఖ్య :38
కవిత సంఖ్య :16
పేరు :ch. విజయలక్ష్మి
టీచర్, బీర్కూర్, కామారెడ్డి
అంశం :కాలం
*************************
నీవొక అద్భుతం నీవు అనంతం
నీవొక ఆశ్చర్యం నీవు శాశ్వతం
గెలుపోటముల సంగమం
ఆశనిరాశల కాలవాలం
బంధాలను కలిపేది కాలం
అనుబంధాలను తుంచేదీ కాలమే
గతాన్ని గుర్తుకు తెచ్చేది కాలం
వర్తమానంలో తోడుండేది కాలం
భవిష్యత్తు నిర్ధేశించేది కాలం
చరిత్ర పుటల్లో నిలిపేది కాలం
చరిత్రహీనుల్ని చేసేదీ కాలం
మనిషిని అందలం ఎక్కించేది కాలం
అధః పాతాళానికి తోసేసేదీ కాలమే
అయినా ఆగదు మన పయనం
కాలంతో పాటుగా... కాలం తోడుగా.....
17
[16/06, 4:19 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :17
పేరు :ch. విజయలక్ష్మి
టీచర్, బీర్కూర్, కామారెడ్డి
*************************
అయ్య లారా...... !అమ్మలారా....... !
పిల్లల్ని అతి గారాబంగా పెంచకండి
గారాబం తో పనికిరాని వారిగా చేయకండి
కస్టపడి చదవండి కష్టపడి చదవండి అనకండి
ఇష్ట పడి చదవడం అలవాటు చేద్దాం
చదవడం మాత్రమే కాదు...
చదవడం తో పాటు పనులూ నేర్పాలి
ఇంటికి వచ్చిన వారిని గౌరవించడం నేర్పాలి
ఇంటబయటా పెద్దవారి ని గౌరవించడం నేర్పాలి
ఇతరులకు సహాయం చేయడం నేర్పాలి
పంచుకోవడం నేర్పాలి
ఇవ్వడం నేర్పాలి
తీసుకోవడం నేర్పాలి
సర్దుబాటు ధోరణి నేర్పాలి
అవసరం అన్న /ఉన్న చోట ఎదిరించడం నేర్పాలి
గెలవడం సంతోషం ఇస్తుంది కానీ
ఓటమి గెలుపు కు బాటలు వేస్తుందని  తెలియజేయాలి
కుటుంబం తో ఉండడం లో ఆనందాన్ని చవి చూపాలి
సమాజాన్ని ప్రేమించడం లో ని హితాన్నితెలియ జెప్పాలి
సంతృప్తి ని నేర్పాలి
సంపాదించడం నేర్పాలి
పొదుపు చేయడం నేర్పాలి
మితంగా ఖర్చు చేయడం నేర్పాలి
విలువలు నేర్పాలి
విలువలు పాటించేలా తీర్చి దిద్దాలి
జీవించడం నేర్పాలి
జీవించనివ్వడం నేర్పాలి
జీవనమాధుర్యాన్ని చవి చూసేలా ప్రోత్సహించాలి
ఆడవారిని గౌరవించడం నేర్పాలి
సంతోషం గా ఉండేలా ఆస్వాదించేలా తయారు చేయాలి
సంస్కారం పరిమళాలు వికసింప జేయాలి
దేశభక్తి, దైవభక్తి మనసున మకరందాలై పొంగి పొర్లాలి
వినయం, విధేయత లతో మానవత్వం మొగ్గలు తొడగాలి
విజ్ఞత, విచక్షణ వెల్లి విరియాలి
ఒకటేమిటి అన్ని విధాల పరిపూర్ణుని గా ఎదగ నివ్వాలి
స్వీయ రక్షణ కవచ ధారిగా ధైర్యాన్ని నింపాలి
ఆడై నా మగైనా సమాన దృష్టితో పెంచాలి
ఉత్తమ పౌరులు గా మలచ గలగాలి
అప్పుడే.... కానరావు అనాధాశ్రమాలు
ఉనికి కోల్పోవు వృద్ధాశ్రమాలు
మాయమౌను భయాలు బాధలు
ఉదయించును భద్రతతో కూడిన సమాజము
వెల్లి విరియును ఆనందాల హరివిల్లు
ఇలా జరగాలo టే మనం మారాలి
మార్పుకు కారణం మనమే కావాలి
మరి ప్రయత్నిద్దామా............... !
ఆ అందాల ఆనందాల తీరాన్ని.....అందుకుందామా.... !!!

18
            వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :18
పేరు :ch. విజయలక్ష్మి
టీచర్, birkoor, కామారెడ్డి
అంశం :జవాన్
****************************
జాతి రక్షణకై జన్మ నెత్తితి నంటు
దేశ రక్షణ జేయు జాతి తనది
జన్మ జన్మల తాను జవానుగా నిట ను
జనియించ వలెనను మతము తనది

ఎండ చలి వానంటు లెక్క చేయడు తాను
జంకు లేక తాను ఎదురు నిలుచు
దేశ రక్షణయె తన కర్తవ్య మనుచు తన
ప్రాణంబు తృణ ప్రాయంబగా యవని కర్పించు

భారతావని తన యిల్లంచు మురియు చూ
భారతీయులకంతా సోదర ప్రేమ పంచు చూ
భరత మాత సేవ బాగ్యంబుగా నెంచీ
భయము లేక చేయు దేశ రక్ష

దేశమంతయు హాయి నిదరోవు వేళలో
సూన్యమౌ నిద్రల కాపుకాయు ను మనల
పండుగ పబ్బాల ఆనంద పడువేళ మనము
మనమునెంచవలె వారి త్యాగ నిరతి

సొంత బంధాల విడచి సౌఖ్యాల మరచి
సరిహద్దుల రక్షణ కవచమై యలరి
కాచేరు బాహ్య శత్రువులఎదురు నిలిచి
తర తమ బేధాలు ఎంచరే వారలు
వారి చలువ చేత నే మన.. జన జీవనాలు
ఏచింతయూ భీతియూ లేక కొనసాగు చున్నవీ

బాహ్య పీడనల పోరాడు జవానులు వారు
అంతః కలహాల రేగేటి చిచ్చుల నార్పు  వారెవ్వరు?
సంఘవిద్వేషాల, విశృంఖల అకృత్యాల
అరికట్టు వారెవరు?
బూడిద పోసిన పన్నీరు రీతినా..
వారి త్యాగనిరతి కారాదు వ్యర్థం...


దేశ రక్షణ యందు అసువులు బాసినా వారినీ
జై జవానంటు నీకెవరు సాటంటూ
పొగిడితే .... చాలునా........?

ప్రతి వ్యక్తి సంఘాన స్వీయ జవానుగా మారి
సాంఘిక నేరాల అకృత్యాల ఎదిరించి దునిమి
మత కుల ప్రాంత వైషమ్యాలను  మరచి
శాంతి సౌబ్రాతృత్వాల మెలిగినా నాడు
సుఖ సౌఖ్యాల తో తులతూగు నాడు
పేదరికమన్నదే కాంచలేనీ నాడు
ఒకరి కొకరై క్షేమము కాంక్షించునాడు
ఆకలని యే ఒక్కరూ అలమటించనీ నాడు
నిజమైన శాంతి సౌఖ్యాల భారతావని విలాసిల్లు నాడు

అదియె కాదా.....?
సమస్త భారతావని నిండు మనముతో
వీర జవాను త్యాగనిరతి కిచ్చు
నిజమైన ఆత్మీయ ఘన నివాళి.
జై జవాన్ జై.. జై... జై.... జవాన్
మిమ్మె పుడు మరువము మేము.
మా గుండె గుడిలో దివ్య జ్యోతిగా నుంచీ                           నిరతమూ మిమ్ములస్మరియించుతాము.

19
వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :19
పేరు :ch. విజయలక్ష్మి
టీచర్, బీర్కూర్, కామారెడ్డి
అంశం :ఆకాంక్ష
**********************
నీ మృదు పలుకుల ఝరిలో
హృది మడి తడిసిమురిసిన తరుణంలో
ఉప్పొంగిన ఉత్తేజం ఉరకలు వేస్తుంటే
చేజారిన ఆనంద హేల....
అక్కున చేరమంటూ చేరవచ్చిన సమయాన
ఎందుకో మరి...?
అనేకానేక సందేహాల సంద్రాలు
తప్పో ఒప్పో తెలియక
డోలాయమానమైన మదిలో
నీ ప్రేమావేశపు అలలపై తేలిన మనస్సు
మరు జన్మకైనా.. నీ ప్రేమ మాధుర్యం
నా సొంతం కావాలంటూ
మౌనంగా వేడుతోంది..
ఆవిధాత.. దివ్య సముఖాన
20

వీరాస్ కవి సమయం
క్రమ సంఖ్య :38
కవిత సంఖ్య :20
పేరు :ch. విజయలక్ష్మి
టీచర్, బీర్కూర్. కామారెడ్డి
అంశం :ఎవరు కురూపి
*************************
ఆత్మ శుద్ధి లేని అందమైన రూపం
అనురాగాల నందించని బంధం
దయాదాక్షిణ్యాలు లేని సంపద
కురూపం కాక మరేమిటి..?

ఆత్మీయత నటిస్తూ గోతులు తీయటం
నమ్మిన వారిని మోసగించడం
పెద్దరికం మాటున రాక్షసతత్వం
పేదరికంపై చిన్నచూపు చూడడం
కురూపం కాక మరేమిటి...?

కోడలిపై అత్త చూపే పెత్తనం
పనివారిపైనఅధికారులు చేసే ఆగడాలు
అధికారఅహంతో చేసే అన్యాయాలు
కురూపం కాక మరేమిటి...?

తెలివితో విద్యాధికులు చేసేటి సైబర్ నేరాలు
రోగాలను తగ్గించలేని వైద్యులూ /వైద్యవిధానాలు
న్యాయాన్నమ్ముకొనే న్యాయవాదులూ
కురూపం కాక మరేమిటి..?

ఓటును కొనుక్కొనీ
జనాల ను పాట్ల పాలు జేసే రాజకీయాలు
అమాయకత్వంతో ఓటు నమ్ముకొనీ
జీవితాలను తాకట్టు పెట్టే ఓటర్లూ
కురూపం కాక మరేమిటి...?

అమ్మ పాలు త్రాగి రొమ్ము గుద్దే విశ్వాసఘాతకత్వం
బంధుత్వం ముసుగులో చేసే అక్రమాలు
పసిపిల్లలను సైతం లైంగికంగా వేధించే అమానవీయులు
అంగనల అంగడి బొమ్మల జేయు దుర్మార్గాలు /దుర్మార్గులు
కురూపం కాక మరేమిటి...?

సహృదయమూ దయాగుణమూ
సమభావమూ, సోదర భావమూ
సేవాభావమూ, ప్రేమతత్వమూ
నిస్వార్ధమూ, పరోపకారమూ
నీతీ, నిజాయితీ
దేశ భక్తీ, దైవభక్తీ కలిగిన
మానవుడే కాదా....? మహనీయుడు.....
ఆమహనీయుడు.. కురూపియైనా.... !
కాడా...? తానే..... రూపవంతుడూ....?

21
వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవితసంఖ్య :21
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :మహిళ
*************************
మహిళసృష్టికి మూలం
ఆమె లేక మనలేదు జగం

ప్రేమ త్యాగాల సాగరం
ఓర్పు సహనాల కాలవాలం

అనుబంధాలకు ఆధారం
ఆనందాలకు సాకారం

కృషి పట్టుదల ఆమె సొంతం
భాద్యతలో సగం సగం

ఆదిశక్తి అవతారం
ఆదరణలో అన్నపూర్ణ రూపం

పుట్టినింటి మెట్టినింటి వారధి
సంసార ప్రగతి రథ సారథి

అన్ని రంగాల యునికి చాటు ముదిత
ఆకాశ మే హద్దుగ జయం సాధించు వనిత

అన్ని లక్షణాలున్న వనితను పొందిన పురుషుని జన్మ పొందు ధన్యత
అనుకూలుడైన భర్తను పొందిన మహిళజన్మకది యె భాగ్యము మహా భాగ్యము

గ్రూప్ :వీరాస్ కవి సమయం
22
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :22
అంశం :చెదలు
తేది 20-06-2020
పేరు :విజయలక్ష్మ
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :చెదలు లేని దెక్కడ?
*****************************
టి. వి. లు, సినిమాలు, తెలియనితనం
విద్యార్థులచదువుకు పట్టే చెదలు

అధికారకాంక్ష స్వలాభం బంధు ప్రీతి
రాజకీయాలకు పట్టిన చెదలు

మద్యపానం రాయితీలు ఉచితాలు
ఓటు హక్కు కు పట్టిన చెదలు

మమకారం ఉన్నతి కోసం పేరాశ
బిడ్డల ఇష్టా యిష్టా లకు ఆంక్షల చెదలు

అనుమానం చెప్పుడు మాటలు
అనుబంధాలకు పట్టే చెదలు

అభిజాత్యాలు అహంకారాలు
ఆలు మగలఅనుబంధాలకు పట్టే చెదలు

విద్రోహం విధ్వంశం మతం కులం
దేశ ప్రగతికి పట్టే చెదలు

చిరు ప్రాయంలోని ఆకర్షణలు అమాయకత్వం
యువత పెడదారిని పెట్టే చెదలు

ఆస్తులు హక్కులు బాధ్యతలు
కుటుంబ సభ్యులకు పట్టే చెదలు

మానవత్వపు ముసుగు తెరలచెదలు
సాంఘిక అకృత్యాలకు మార్గాలు

మానవ తప్పిదాలకు మూలాలు
మెదడుకు పట్టిన చెదలే

చెట్టుకు పట్టే చెదలు చెట్టుకే చేటు
మనిషి బుద్దికి పట్టే చెదలు విశ్వ మనుగడకే చేటు

ప్రకృతిలో ఏ ప్రాణి కి లేని పశు గుణం మనిషికే ఎందుకో?

చెడు చేసే గుణాల చెదలను చంపి
మంచిని పంచి మానవత్వం పెంచి
విలువలను వలువలు జేసి
ఉగ్గు పాలతో పై వన్నీ సాధిస్తూ
ప్రతి మనిషీ పయనిస్తే
అన్నీ శుభాలేగా.... అంతటా శాంతి సౌభాగ్యాలేగా...

23
వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :23
పేరు :ch. విజయలక్ష్మి
టీచర్, బీర్కూర్, కామారెడ్డి
అంశం :వీర జవాన్
*****************************
తండ్రి ఆనతిని రామునిలా తలదాల్చీ
దేశ సేవకు తరలిన ఓ దేశ భక్తుడా.... !
మంజులమ్మ దంపతుల గర్భ కిశోరమా... !
భరత మాత గన్న వీర పుత్రుడా.. !
సరిహద్దున నిలిచిన రక్షణ కవచమా... !
డ్రాగను కుతంత్రాల దాడికి ఎదురు నిలిచిన వీర సింహమా... !
తుది రక్తపు బొట్టు వరకూ...
బెదరక...... తొణకక....
అలుపెరుగక.. ఎగిసిన పోరాటకెరటమా.... !
బాంధవ్యాల ను, బంధాలనూ.....
తృణప్రాయముగా.. తలచీ....
దేశరక్షణయే... ద్యేయంగా... మదినెంచీ....
లక్ష్యసాధనలో... అసువుల నర్పించిన.... ఓ... అరుణ కిరణమా..... !
ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలమయ్యా......?
నీ త్యాగనిరతికిమెచ్చి.. ఆ నింగి వేల్పులే... పరవశులై
వర్షధారల కురిపించిరి అశ్రునివాళి అనగా.... !
భారతావని రెక్కలు విదిల్చిమింటికెగిసె..
నీ ఊపిరులే తనకు ఊపిరులూదగా.....
స్వేచ్ఛా విహంగమై.....
ప్రతి భారతీయుడూ... తన మది గుడిలో....
నీ ధైర్య సాహసాలనూ....
నీ అపూర్వ దేశభక్తి నీ...
త్యాగనిరతినీ......
కలకాలం... మరువక.....
ప్రతిష్టించి గుర్తుంచుకునే తీరునుగా... !
నింగిలో తారవై వెలుగుతూ...
భరతమాత రక్షణ కై.. అమరుడవైన...
సంతోష్ సోదరా... !అందు కోవయ్యా... !
నీ భారతీయ సోదరుల అభినందనమందారమాలలు
జోహార్... జోహార్.. జోహార్....
ఓ భా రతవీర కిశోరమా.... !
జోహార్... జోహార్.. జోహార్..
24

వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :24
అంశం :చదువు -సంస్కారం
తేది :20-06-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :కావు జంట పదాలు
******************************
చదువది ఎంత చదివిన
రసజ్ఞత ఇంచుక చాల కున్న
ఆ చదువది నిరర్ధకంబు
అన్నట్లు.......
అక్షరాల సంకలనం కాదు చదువు
అవగాహనకు అక్షర రూపం చదువు
అవగాహన కూర్చు సంస్కారం
చదువు సంస్కారం ఏ ఒక్కరి సొత్తు కాదు
చదువు సంస్కారం జంట పదాలైన
ఉండవు జతగా.....

చదువున్నా సంస్కారహీనుడు పామరుడే అనిపించు
సంస్కారమున్న ప్రతి వారు గుణవంతుడు అనిపించు
సంస్కారహీను లకు తిరస్కార మే ప్రతిఫలం
సంస్కారవంతులు ఎండుబోయినా పొందు గౌరవం

నేర్చు కుంటే అబ్బును చదువు
పుట్టుకతో వచ్చును సంస్కారం
పువ్వుకు తావి అబ్బినటుల
చదువు అద్దు సంస్కారానికి మెరుగు
చదువు లేకున్నను మన వచ్చును లోకాన
సంస్కారం లేకున్నా మర్యాద సున్న

వర్తమానం లో సంపాదిస్తున్నారు డిగ్రీల చదువులు
సంస్కారంతో మెలిగేది ఎందరు?
చదువుల డిగ్రీలు ఆర్జించే మార్గాలు
సుఖాల నిచ్చే సోపానాలు
సంస్కారపవనాలు హాయి నిచ్చు ఆనంద వనాలు

నేటి సమాజం లో యాంత్రి క జీవనం సాగించే మర బొమ్మలకు
సంస్కార మిచ్చే సుగుణాలు యిచ్చును ప్రాణం
చదువు సంస్కారం అ విభక్త కవలల్లా
కలిసుంటేనే మనిషికి మనుగడ

చదువు విజ్ఞానం వెర్రి తలలు వేస్తూ సమాజానికి చీడ పీడల్లా పట్టి పీడిస్తు న్నాయి
విచక్షణ వివేకం మానవత్వం సమాజ హితం పెంపొంది తే ఆరోగ్య వంతమైన భద్ర సమాజం సాధ్యమవు తుంది

చదువున్న సంస్కారం కానరాదు
సంస్కారం ఉన్న చదువు గుండు సున్న

చదువు -సంస్కారం రెండూ కలిగిన
మానవుడే మహనీయుడు
మనీషై గెలుచును మనసులు
అందరికీ ఆదర్శ ప్రాయుడై
మహిని తారకయై వెలుగుతూ
నిలిచి పోవును ఆ చంద్ర తారార్కము
ఆ చంద్ర తారా ర్కం.
25

[21/06, 5:17 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :25
అంశం :జన్మ
తేది :21-06-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :చరిత్రలో నిలిచి పో...
***********************************
దేవుడిచ్చిన గొప్ప వరం
మానవ జన్మ అపూర్వం
అద్వితీయం అజరామరం
ఎందుకంటె..............
సృష్టిలో జీవులెన్నున్నా
ఏ జీవికి లేని ప్రత్యేకత నీది
ఆలోచన కలిగిన బుద్ధ జీవివి  నీవు
అన్ని జీవులను చేసుకున్నావు పాదాక్రాంతం
సంపాదించావు అన్ని జీవులపై ఆధిపత్యం
మార్చుకున్నావు అన్నిటిని నీ కనుకూలం
సుఖమయం చేసుకున్నావు నీ జీవితం..
కానీ...........
ఎంత విజ్ఞానివైనా అజ్ఞానంలో పడి పోతున్నావ్
నీతోటి వాడిని దోచుకుంటూ దాచుకుంటూ
ఎదుటివాడి బలహీనతని బలం చేసుకుంటూ
నీ పాపఫలాన్ని పెంచుకుంటూ
అందలాలే చందమామలని భ్రమలో బ్రతుకుతున్నావ్
అది కాదు నీ జన్మకు సార్ధకత
నీ తోటి వారిని ప్రేమించు
సహాయంతో చేయూత నివ్వు
బ్రతకడానికి గాలి నీరు కూడు గుడ్డా చాలవా
సృష్టిలో మహోన్నతుడు కావాలంటే
భోగాలే అక్కరలేదు
బ్రతుకు బ్రతికించు అనే సూత్రాన్ని పాటించు
అప్పుడే ఆనందం గా ఉంటావ్
అందరిలో నీవుంటావ్
ఆదేవుని యిస్టుల లిస్టులో నీవుంటావ్
చరిత్రలో మిగిలి పోతావ్.
26
[21/06, 5:43 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :26
అంశం :చంటిపాప
తేది :21-06-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మ
టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :మాయ
*************************************
చంటి పాపలు కంటి వెలుగులు
దాంపత్యపు వలపు పంటలు
బోసి నవ్వుల బుజ్జి పాపలు
చిరు నవ్వుల సిరి మల్లెలు
మురిపాల మంచి ముత్యాలు
ఆనందాల నిచ్చు హరి విల్లులు
కన్న వారి కలల పంటలు
వంశ వృద్ధికి మూల విత్తులు
భవిత కొసఁగు వెలుగులు
మాతృ హృదయ సంతోషాలు
పితృ హృదయ ఆనందాలు
పాప లున్న లోగిళ్ళు ఆనందాల విలసిల్లు
పసి పాప దోగాడని ఇల్లు విషాదాల నెలవు
పసిపాప తో ఒడి నిండాలని వనిత చేయు తపసు
పది మాసాలు మోసి కని మురియు తల్లి మనసు
పెంచి పోషించి వృద్ధి యొసఁగి గర్వ పడును తండ్రి మనసు
పెళ్లి చేసి వారి సంతోషాల తేలు దురే ఇద్దరూ
పిదప కాల మొచ్చి నేడు సంతానమే
తల్లి తండ్రుల మేలు మరచి పట్టని వారై
వృద్ధాశ్రమాలపాలు జేసి వేడుక చూతురే
తమ గతి అదే యని తలువ రెందుకే
ఎన్ని వెతలు చూసినా
బాధలెన్ని పడినా
ఎంత ఎదిగినా
పట్టించు కోకున్నా
ప్రతి బిడ్డా మాతా పితరుల మనసున చంటి పాపాలేగా..... !
ఎల్లప్పుడూ కోరుదురే బిడ్డల క్షేమమునే ....... !!
సిద్ధంగా ఉందురు కదా....? ఎంతటి త్యాగానికైనా...... !!!
అది యె కాదే....? ప్రకృతి ధర్మం.... !!
మనసు మాయ.... !!!!!!=
27


[23/06, 5:28 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :26
అంశం :తరుణి
తేది :23-06-2020
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :నిరంతర పోరాటం
*********************************
విశ్వమంతయు తానై వ్యాపించిన శక్తి
విశ్వ మూర్తులకైనా అమ్మైనఆదిశక్తి

ఆమె రూపం అపురూపం భువనైక మోహనం
ఆమె  శక్తి నిరుపమానం అనిర్వచనీయం

ఆరాధిస్తే అమ్మై పంచుతుంది అమృతం
అలుసుగచూస్తే దాల్చుతుంది ఉగ్రరూపం

జీవన పథంలో ధరించును వివిధ భూమికలు
యే పాత్రైనా ఒదిగి వెలిగి ఒసగు కాంతులు

గృహ సేవ కంకితమై తరియించె అబలన్న కాలంలో
అంబరాన్నంటే ఘనత చాటు నేడు వివిధ రంగాలలో

ఘనత గన్న వీరుల వీరమాత నాడు
ఘనుల చేతులలో కీలు బొమ్మైన నిర్భాగ్య వనిత నేడు

మహా మహిమాన్విత శక్తిగ త్రిలోక పూజిత నాడు
అంగడి సరకై అంగాగ ప్రదర్శనల మూలమాయె నేడు

పరిమళాలెన్నివెదజల్లినా పురుష పాదాక్రాంతమే కదా ఆమె జీవితం
పదిలంగా కాపాడితే కల్పవల్లిగ కటాక్షించు కరుణామయిగా

యుగాలు గడిచినా సాధికారతే లక్ష్యంగా
ఉనికి చాటంగచేస్తుంది నిరంతర పోరాటం
28
[24/06, 9:33 AM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :28
అంశం :జానకి
తేది :24-06-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :అగ్ని పునీత
***********-*********************
శ్రీమహాలక్ష్మియే హరిని ఎడబాయక
శ్రీరామునికి తోడుగా అయోనిజయై వచ్చే ఇలకు

జనకుని కొమరితయై సీత యను నామాన
శుక్ల పక్ష చంద్రుని రీతి దిన దిన వృద్ధి నొందె

చిరుత ప్రాయము నుండే సతతము చేయునే హరినామ స్మరణ
శివ ధనుర్భంగానరాముని నాధునిగవరించె కమలనయని

రఘు వంశము మెట్టి రఘువంశ యశము వర్ధిల్లజేసెను రమాదేవి
పరివారమునెల్ల తల్లియై అనురాగ పాశాల పాలించిన మాతృప్రేమ

తండ్రి ఆనతిన వనవాస సహచరియై పతిననుసరించిన ధర్మనిరత
రావణుని లంకలో పతి స్మరణ బాయక పాతివ్రత్యము చాటిన పరమసాద్వి

రావణ సంహారమైనంత అగ్ని ప్రవేశాన అకుంఠిత పతిభక్తి చాటిన అగ్ని పునీత
పట్టాభి రాముని పట్టపు రాణియై రామరాజ్యమునేలిన కల్పవల్లి

మూర్ఖ చాకలివాని మతిలేని వాక్కుల రాజనీతి శృంఖలాల బలియై వనవాస బాట వెడలె నిండుచూలాలు
వాల్మీకి ఆశ్రమమున లవకుశులకు విద్యాబుద్ధులు గరపి విలసిల్లె భూజాత వీరమాత

అశ్వ మేధయాగ మొనరించిన తరి శ్రీరామునెదిరించ లవకుశుల వారించి తండ్రి చెంత చేర్చె పుణ్యచరిత
పడిన నింద బాప భూదేవి ఒడి చేరి జన్మను త్యజియించి ధన్యత నొందిన ధన్యచరిత

సీత వంటి పుత్రి, జానకి వంటి కోడలు ఇలను లేరంచు
ప్రేమమయి, సహనశీలి, ధీరవనిత, త్యాగశీలి, పతివ్రత, స్వాభిమాని, అకుంఠిత దీక్ష దక్షత, వీర పత్ని వీర మాత సుగుణాల రాశి యై రామాయణకావ్యాన వాసి గాంచి వినుతి కెక్కిన పుణ్య చరిత అగ్ని పునీత చరిత వినినంత కలుగును పుణ్యరాశి
29
[24/06, 7:09 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :29
అంశం :దిన పత్రిక
తేది :24-06-2020
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, కామారెడ్డి
శీర్షిక :సమాజ దర్పణం
*************************
దిన దినం పలుకు శుభోదయం
మేల్కొలిపే హరిదాసు కోసం
చకోర పక్షి లా వేచే సమయం
కాఫీ తో పాటు వార్తల సేవనం
మోదమొందు మహత్తర తరుణం
లేకుంటే ఆగును కాలం

నాలుగు దిక్కుల జరుగు సంఘటనల సమాహారం
అరచేతిలో ఇమిడే విశ్వ సందర్శనం
ప్రకృతి ప్రపంచం ఎదుటే సాక్షాత్కారం
అద్భుతాల హర్షాతి రేకం

మానవ విజయాల విజయోత్సాహం
వివేకవికాసాల కాసారం
విజ్ఞాన సకల సందర్శన గవాక్షం
నూతన ఆవిష్కరణల పరిచయం

సమాజ శ్రేయస్సు కు మార్గదర్శనం
వివక్ష లేని విషయప్రదర్శనం
స్ఫూర్తి నిచ్చు విజేతల కథనం
సమకూర్చు ఉద్యోగసమాచారం
వంటా వార్పుల ప్రహసనo
సౌందర్య ఆరోగ్య చిట్కాల లేపనం
పంచాంగ ప్రభల అవలోకనం
ఎన్నో ఎన్నెన్నో విభిన్న విషయాలపరిచయం
ఉన్నదా స్పృశించని కోణం


నవరరస వార్తల సమూహం
ఇస్తావు ఆనందాలు పెక్కు
దించేస్తావు విషాద విషయాలతో ఆ కిక్కు
యే విషయాన్నైనా నిర్భయంగా
నిర్మొహమాటం గా తెస్తావు వెలుగులోకి

చక్కని చిక్కని నిర్భయ నిజాయితీ వెల్లడికి
కావాలి ఉండాలి మంచి సంపాదకీయం
రవి లా ప్రకాశించే జర్నలిజం
రాజకీయాల కతీతమైన నిర్భయయతత్వం

ఎవరికి తలవొగ్గని వ్యక్తిత్వం
అప్పుడే అవుతుంది పత్రిక
సమాజ దర్పణం
నిజానికి ప్రతీక
విశ్వ హితం
దానికై నా నిరీక్షణం
30
[25/06, 12:17 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :30
తేది :25-06-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :నా జీవితం... అయింది పూల తేరు
********************************
నా నడక కాదు సుగంధ భరిత పూల దారి
నా బాల్యం కాదు చిరునవ్వుల చిలిపి జ్ఞాపకం
అడుగడు గునా ఆకలి మంటల కేకలు
అలవిగాని అవరోధాల సర్పాల కాటులు
ఆధారంలేని చితికిన బతుకులు
ఆకాశాన్నంటే ఆశల నిచ్చెనలు
పట్టెడన్నం కోసం ఆశగా వేచిన రోజులు
చాలీ చాలని కూలీతో  గడచినదినాలు
కటికనేలే పట్టెమంచం గా మురిసి తడిచిన గతాలు
ముసిరే దోమల కాట్లకు నిద్ర కరవైన రాత్రులు
ఆసమయాన మమ్ము కాచిన మా దేవుళ్ళు
స్వచ్ఛంద సంస్థల మరువలేని సేవలు
చదువు ప్రాముఖ్యాన్ని విశదీకరించికలిగించిన చైతన్యాలు
ప్రభుత్వబడి ఉచితాల ఒనగూర్చిన సౌకర్యాలు
అయిష్టంగానైనా కూటి కోసం బడికి పంపిన అయ్య అవ్వలు
కష్టంగా బడి చేరినా చదువుని లక్ష్యం గా మార్చిన గురువులు వ్యక్తి త్వవికాసపరిమళాన్ని పెంపొందించిన ప్రభుత్వపాఠశాలలు
ప్రభుత్వపధకాలఆసరా బాసటగా పట్టా పుచ్చు కున్న మధుర క్షణాలు
అందిన ఉచిత శిక్షణా తరగతుల సహాయాలు
సాధించి పెట్టింది చక్కని ప్రభుత్వ కొలువు
నేడు కదా మారింది నా జీవన నౌక పూల తేరుగా......
అందర్నీ ఆకర్షించేలా.....
ఆకాశంలో వెలిసిన హరివిల్లులా.....
ఆశల తీరం చేరిన నావలా....
ఆనంద మలయ మారుతంలా...
చిగురులు తొడిగిన మోడులా.

పుష్పించిఫలించిన తరువులా
ఆనందాలకు నెలవులా.....
కుటుంబానికి చేయూత నిచ్చేలా.......
నలుగురు మెచ్చేలా.....
సంఘాన స్థానం పొందేలా....
నాలాంటి వారికి బాసటగా నిలిచేలా...

ప్రభుత్వ బడిలోనే చదవండి... చదివించండి
చదువుతో పాటు సర్వతోముఖవ్యక్తి త్వ వికాసాన్ని పొందండి
ఆదర్శ భావి పౌరులై బాసిల్లండి
భారత దేశాన్ని అగ్ర స్థానం లో నిలపండి 🙏
31

వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :27
అంశం :చరిత్ర
తేది :23-06-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :చరిత్ర అనంతం
*********************************
చరిత్ర............
భూత కాల సమన్వితం
సంఘటనలసమాహారం
ఎన్నో చరిత్ర ల సంకలనం
నేటి వర్తమానం
రేపటి భవిష్యత్ చరిత్ర
మారును మరల చరిత్రగా...
చరిత్ర.........తెలుపును
కాలగమన చక్రాన కనుమరుగై
గతించిన జీవన విధానాలు
వివిధ పండుగల ప్రాశస్యవిశేషాలు
వివిధ సంస్కృతి సంప్రదాయాలు
ప్రాంతీయ వివిధ కళల గొప్పతనం

చరిత్ర తెలుపును
భగవంతుని లీలా వినోద దృశ్యమాలికలు
దశావతారకథలు తెలుపును
దుష్టు లెపుడు నశింతురే  యని !
రామాయణసారం
ఆచరణ యోగ్యం
మహాభార త o పంచమ వేదం
పంచునెంతో విజ్ఞానం

చరిత్ర తెలుపును
ఎందరో వీరుల విజయగాథలు
శాస్త్ర వేత్త ల ఆవిష్కరణలు
రాజుల రాజ్యాల ఘన చరితలు
చరిత్ర హీను లైన వారి చేదు నిజాలు
అవగతం చేస్తుంది గతం
అన్వయిస్తుంది వర్తమానం

చరిత్ర లో గలవు తార్కాణాలు
భూమి పుట్టుక
జీవం పుట్టుక
ఆది మానవుని ఆవిర్భావం
అభివృద్ధి చెందిన నాగరికత లకు
మానవ మేధస్సు పరిణామంలకు

భగవద్గీత భగవానుని ఉపాచ
అందించును ప్రపంచానికంతా
పాటించదగిన విషయవిజ్ఞానo

ఎందరో నాయకులచరిత్రలు
మహాత్ముల జీవన చరితలు
స్వాతంత్రోద్య మ గాథలు
ఎన్నో పోరాటాలు వాటి ఫలితాలు
ఆధ్యాత్మిక గాథలు
ఆత్మ కథలు
విజయగాధలు (సుధాచంద్రన్  వంటి వారివి )
స్ఫూర్తి కలిగించు
ఆత్మ శక్తి పెంచు
వ్యక్తి త్వం వికసించు
భావితరాలకు మార్గం చూపు

చరిత్ర లే కుంటే లేదు వర్తమానం, లేదు భవిష్యత్తు,
ఎందుకు? ఏమిటి? ఎలా?
ఎప్పుడు? ఎక్కడ? వంటి
ప్రశ్నలకు లభించును సమాధానం
చరిత్ర పఠనంవలన పొందగలము సమాచారం
సమాచార విశ్లేషణతో వికసించును విజ్ఞానం.
32
వీరాస్ కవి సమయం
క్రమ సంఖ్య :38
కవిత సంఖ్య :32
అంశం :ప్రపంచ సైకిల్ దినోత్సవం
తేది:26-06-2020
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :మంచి నేస్తం
*********************************
ఓ.... నేస్తమా.... ఎలా ఉన్నావు....
గుర్తున్నానా.. నేను...
గంతులేసావు నన్ను చూసి చిన్న నాడు
బువ్వ తిననన్నావు లేకున్న నేను
లేచింది మొదలు నీ ఆటా పాటా నాతోనే
నీతో పాటూ నేనూ పెరిగి ఉన్నాను నీతోనే
నీవెంటే బడికి, గుడికి, ఆట కు నాతోనే
నీవెక్కడికెళితే అక్కడికి నీవెంటే నేను
నీ ప్రేమకోసం కూడా నేనేగా నీవెంట
నేను కాలుష్య నివారిణిని
ఆరోగ్య వర ప్రసాదాన్ని
నాలోని ప్రతి అణువు సమన్వయానికి గుర్తు
నాలో ఏది లోపించినా పోలేను ముందుకు
నీ ప్రేమ గాలి ఉంటే చాలు...
నీ స్నేహముంటే చాలు.. ఆహారమే అవసరం లేదు (ఇంధనం )
నీకోసం అలుపెరుగక పయనిస్తాను ఎంత దూరమైనా...
తలచాను నీ బిడ్డలనే.. నా బిడ్డలుగా...
వేరేది కోరలేదు నీ నేస్తం తప్ప...
కానీ... మారిందిగా.. కాలం.. నేస్తమా..
నన్ను వదిలావు పేదనని
ఐశ్వర్యం రాకతో దర్పం చూపాలని
ఆఘమేఘాలపై తేలాలని
నా తమ్ముడితో కట్టావు దోస్తానా..
మారింది సోదరా.. నీ రూపం....
ఆయాస పడుతున్నావ్.. ఏమైంది సోదరా
మరల వచ్చిందా నా అవసరం...
ఆరోగ్యం కోసం..... ఓ.. నేస్తమా...
కల్మషం లేని (కాలుష్యం పెంచని )
నిరాడంబర (తక్కువ ధర )
ధారుడ్యం పెంచే (వ్యాయామం )
ఆరోగ్యమిచ్చే (కొవ్వు కరిగించిగుండెకుచేయుమంచి )
దాన్నని తెలిసికొని మళ్ళీ నన్ను కలవాలని...
నాతో స్నేహం చేయాలని...
తరలి వచ్చావా...
మేను పులకరించేను ఆనందాన..
పద... నేస్తం.....
అలా... తిరిగి వద్దాం...
మళ్ళీ గతాన్ని నెమరు వేస్తూ...
ఆకసాన్ని తాకుదాం...
ఆరోగ్యాన్ని పొందుదాం...
పర్యావరణాన్ని కాపాడుదాం...
33
వీరాస్ కవి సమయం
క్రమ సంఖ్య :38
కవిత సంఖ్య :33
తేది :28-06-2020
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, కామారెడ్డి
శీర్షిక :నీదు భాగ్యమే భాగ్యము
*************************
బాల భానుడు లేలేత కిరణాల
పుడమి తల్లిని తట్టి లేపు వేళ
పుణ్య మూర్తి కాంతుల మేలు కొని
ధరణి మురియు వేళ
పూబాలలు కళ్ళు తెరచి
శుభోదయమనుచు స్వాగతించు వేళ
పారాణి పాదాల చిట్టితల్లి
సాంప్రదాయమొలికెడు లేత కొమ్మ
అందాలొలుకు అపరంజి బొమ్మ
ప్రభాత పూజ కొరకు ప్రియమారగ
భక్తి భావము తొణికిసలాడగా
కొమ్మ కొమ్మ తారల వలె తళుకుమనే
విరి బాలల సుతి మెత్తగా
ఎడబాటును చేయుచున్న తరి
నా తప్పును మన్నించమనుచు
తరువు తల్లిని వేడుకొనుచు
భగవంతుని సేవలోన తరియించే
తమ భాగ్యమే భాగ్యమనుచు
విరి బాలల కనులు తుడిచి
దుఃఖ భావము వీడగా
మోదమే  సమ కూరగా
కిల కిల మని నవ్వుచున్న
పుష్ప బాలల కూర్చె బాల
సజ్జ నిండుగ ముదమున
భగవంతుని పూలతో నర్చింపగ
సంతృప్తి నిండిన హృదయము తోడ
34

[28/06, 7:00 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :34
అంశం :జిహ్వ
తేది :28-06-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :మాటతో గెలువఁగ వచ్చు
***********************************
జిహ్వ.... ఒక.. త్రిశూలం... త్రినేత్రి...
వాక్కు.... రుచి...... శస్త్రం....
జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి
నరం లేని నాలుక ఎటైనా తిరుగు నుగా.. !
పెదవి దాటితే పృధివి దాటుతుంది
ఈ సామెతలు ఊరకే పుట్టాయా..?

జిహ్వ చాపల్యం లేని వాడెవ్వడు?
పసి వారి నుండి పండు ముసలి దాకా
ఆవకాయ నుండి బిర్యాని వరకు
అనకాపల్లి నుండి అమెరికా వరకు
యే ప్రాంతమైనా యే దేశ మైనా
పసందైన రుచులే వైనా..
రుచి చూడ లేని జిహ్వ.. జిహ్వయే... !
ఆస్వాదించని మనసు... మనసే... !
కాకుంటే... జర.. ఆరోగ్యం.. భద్రం... గురూ.. !

వాగ్భూషణం..... భూషణం.....
మంచి మాటను మించిన అలంకారం లేదు
బ్రహ్మ నాల్క నిలిచి శ్రీ వాణి విధిని లిఖించు
మనిషి నాల్క తన వశమున ఉన్న పెంచు మంచి అనుబంధాలు
పదునైన మాట కత్తికన్నా పదను
భక్తి భావము పెంచు ప్రేమ బంధము నిల్పు
శాంతిని నెలకొల్పు అశాంతి రేపు
మేలు చేయగవచ్చు కీడు తల పెట్టగవచ్చు
తేనే చిలుక వచ్చు విషము చిమ్మ వచ్చు
పరస్పర విరుద్ధభావాల నెన్నయినా పుట్టించ వచ్చు

సాహతీ గీతాల మాయ చేయగవచ్చు
ఉత్తేజ గీతాలతో
నిదుర పుచ్చగవచ్చు... నిదుర లేపగ వచ్చు....
అలనాటి గీతాలే.. పుట్టించెను స్వా తంత్ర్య జ్వాల...
తెగ త్రుంచె ను ఆంగ్లేయ బానిస శృంఖలాలు
సకల జనుల సమ్మె సాధించెను బంగారు తెలంగాణ
కరోనా మహమ్మారి విజృంభించిన నేడు...
దృశ్య శ్రవణ సంగీత మాధ్యమాల ప్రబోధాలతో ...
స్వీయ రక్షణ కవచ జాగృతీ గీతాలతో ....
సకల జనుల నెల్లఇంటికి  పరిమితం చేసెనుగదా...,!
మన ప్రధాన, ముఖ్య మంత్రుల వాక్కులే ....
రామ బాణాలై మనలను  రక్షింపగా నిలిచెను కవచమై
ఎదురేది మనకు... ఏమి చేయు కరోనా....
విజయులమై మనము మనల గెలిచెదము
[28/06, 8:13 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమ సంఖ్య :38
కవిత సంఖ్య :35
అంశం :జాబిల్లి
తేదీ :28-06-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :జాబిల్లి
*********************--*********
జాబిల్లి అందము
లాగును నా డెందము
విరియును ఆనందము
కురియును సంతోషము

అమ్మ పాటల ఆర్తివే నీవు
ప్రేయసి ప్రియుల విరహాగ్ని రేపేవు
ఎంకి పాటల్లో ఒదిగి పోయేవు
కవిత లల్లగ ప్రేరణ య్యేవు

నీ వెన్నెల కిరణాల తో
వికసించు పుష్పాల
పరిమళముల తో యిలను
పరవశింతురు  జనులు
డెంద మూగును  డోల


నీ కిరణ ప్రాభవము చేత
సంద్రాన పుట్టును ఆటు పోటులు
నీ వెండి వెన్నెలల వర్షధారల తడిసి
ప్రేమికుల మనసులే
రాగ రంజిత మగును
నీ చల్లని కౌముది కిరణాల చేత నే
అవని పులకితయై సౌందర్య మొప్పు

నీ అమృత కాంతుల మహిమతో
ఓషధులెన్నో విలసిల్లును మహిని
నీ వెండి వెన్నెలలు విరబూసినంత
లోక మంతా వెలుగు బహు సుందరముగా

రాముడే రామచంద్రుడాయె
శంకరుడు శశి దరుడాయె
తిమిరాన్ని తరిమేవే
నింగి బొట్టుగమెరిసేవే
రేయి నింగిన దివ్వెవే
తారల తోడుగా నింగి నేలేవే

చుక్కలకు రాజువై ప్రేమ పంచేవే
పాపలకు మామవై మురిసి పోయేవే
ప్రేయసీ ప్రియుల ప్రేమ బంధువు నీవే
ఆలుమగల మరులు జనియింపజేతువే

ప్రేయసి అందముజాబిల్లి తీరనుచు
పాప వదనము చంద్రబింబమనుచు
నీరూపు రేఖలతో పోల్చుదురు కవులు
పెరిగినా తరిగినా నీ అందచందములు
అమోఘము అద్వితీయము అజరామరము
నీసౌందర్య లహరుల ను
వర్ణించగా !నా తరమే...?
[30/06, 4:09 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
వరుస సంఖ్య :38
కవిత సంఖ్య :36
అంశం :గంధం
తేది :30-06-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్.
శీర్షిక :మేటి
**********************************
గంధమనే మాటలో వుంది సుగంధం
మల్లె జాజుల కన్నా మేటి సుగంధం
సుగంధమున పొందే జగాన ప్రసిద్ధం
నల్లమల శేషాచల కానల నభివృద్ది
నెల్లూరు చిత్తూరు కడపల కలుగు లబ్ది
అందిన వారికి కలుగును సంపద వృద్ధి
సాన పైన సాన పెట్టి తీసిన గంధము
ఉత్తమోత్తమము ఆమోదయోగ్యము
భగవదారాధనలో కడు ఉపయుక్తము
సువాసినిల వ్రతాలకిది ఆలవాలము
సింహాద్రి అప్పన్నకు చందన లేపనమే ప్రియము
నొసటన ధరియించిన చల్లదనం వుండు
తలను దాల్చిన మనసున ఏకాగ్రత మెండు
లలాటాన పెట్టిన సంకల్పశక్తి మది నిండు
అగ్రస్థానము పొందే ఆలయమునందు
తగ్గించు కనుల ఎఱుపు మంటలు
తొలగించు శిరో భారవేదనలు
దరిచేరవు చర్మ వ్యాధులు
నయంచేయ మొటిమెలు మచ్చ లు
ఎర్రచందనం హన్నా కోట్ల విలువ పలుకు
ఎగుమతౌను జపాన్ చైనా దేశాలకు
బొమ్మల వస్తువుల కొనగూర్చును సరుకు
అన్నింట తానుండి నడిపించు ఆనందాల చెంతకు
సౌందర్యసాధనాల మగువ కిచ్చు మేని మెరుపు
ఉదర బాధలకు మరి ఉపశమనము ను కూర్చు
దగ్గుమందున నుండి దగ్గుదమ్ము మాన్పు
యాంటీ సెప్టిక్ గ రుధిర శుద్ధి చేయ నేర్చు
ఆయుర్వేద మూలికై బహు ప్రయోజనాల కూర్చు
గొప్పోళ్ళతుది పయనాన ఘనత చేర్చు
యింతటి ఘన చరితగల గంధపు చెక్కలనమ్మి
వీరప్పను గడియిo చెను కోట్ల సొమ్ము
వ నా ల తిరిగి అందరిని గడగడలాడించె
కడకు పోలీసులచేత చిక్కి కాలుపుల గతియించె
దొంగ రవాణా నిరోధిo చప్రభుత్వం శాసనాలు చేయించే
చిక్కినట్లే చిక్కి జారి పోవు నేరగాళ్ళు
ఏమి చేయు చట్టాలు నేరగాళ్ల చుట్టాలు
    వనసంపద అందరిదీ కాపాడుట మన విధి
    దోచుకొనే వారిని ఆపుట తప్పని సరి.
[30/06, 5:17 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమ సంఖ్య :38
కవిత సంఖ్య :37
అంశం :గులాబీ
తేది :30-06-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :జీవితం క్షణం -జ్ఞాపకం అమరం
********************************
ఓ గులాబీ బాలా....... ఓ అందాల రాణీ.....
సుందరసుకుమార వన్నెల చిన్నెల మహ రాణీ
వివిధ వర్ణాల శోభిల్లు పూబోణి
సౌందర్యసౌకుమార్యాల విరిరాణి
ప్రేమ ఆప్యాయతల తలపించు పొదరిల్లు
దేవతారాధనలో ముందుండి భాసిల్లు
పడతుల మది దోచు ముగ్ద మోహిని
యువతుల అధరాల చేరిన మృదు మోహనవర్ణం
బుగ్గల పూయించు సిగ్గుల సింధూరం
చాచాజీ హృది నేలు పాపాయి
ముద్దు పాపల పోల్చు ఉపమానం
మహోన్నతుల ఖ్యాతి పెంచు పరిమళ పూదండ
సర్వుల మనసుల హాయి నిచ్చు అత్తరు
వధూవరుల ప్రేమకు పలుకు స్వాగతం
అంతటా నీ ఉనికిని చాటు  ఘనత గల
నిన్ను చేరాలంటే........... బాబోయ్ దాటాలి నీ ముళ్ళ రక్ష
నిన్ను చేరి మురిసేలోగా ముగిసేను నీ జీవితం
అయినా నీ జ్ఞాపకం శాశ్వతం
మధురాతి మధురం.
[01/07, 7:58 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :38
అంశం :గానం
తేది :01-07-2020
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :అమృత వర్షిణి.... గానం
********************************
మనసులోని భావాలను రాగాలుగా చేసి
శృతి లయలను జోడించి చవులూర వినిపించు
అమృత వర్షిణి.......... గానం.....
నిదుర పోయేవేళ తల్లి పాడే జోల
గోరుముద్దలవేళగోముగా పాడేను
మారాము వేళలో మురిపాల జోల
వెన్నెల లొలికించు జాబిల్లి జోల
గానము పలికించు వేవేల  భావనలు
పక్షులా కిలకిలలు ప్రకృతిలో  గానం
జలజలా పారేటి సెలయేటి సరిగమలు
ఘల్లు ఘల్లు న మ్రోగు అందెల రవళులు
ఝుమ్మని సాగేటి ఝoకార  నాదాలు
పులకింప జేసేటి  మధుర గానాలు
భక్తిని, ముక్తిని, దేశ భక్తిని పెంచు
పేర్మిని, ఓర్మి ని, శుభమును కూర్చు
శ్రామికుల శ్రమను  మరపించి ఉల్లాసమును కూర్చు
విప్లవాలను రేపు, భాధలను బాపుతూ  ఓదార్పు నిచ్చు
హాస్యాన్ని పండించు, ప్రేమను పెంచుతూ .
ఆప్యాయతలను పంచు...
రాళ్లనే కరిగించు...వర్షాలు కురిపించు
పన్నగము పరవశమ్మున పడగెత్తి ఆడు...
ఆ దేవదేవులే కోరేరు గాన కైంకర్యాలు
గాన మాధుర్యాన పరవశించును జగతి
రాగలాలిత్యాన రోగాలు కుదురు
త్యాగయ్య, అన్నమయ్య యేలిరి సంగీత సామ్రాజ్యమ్ము
భక్తి కీర్తనలతో ప్రసిద్ధి నొందిరి
నంద నందనుని గాన లాహిరిలో తరియించె ఆబాల గోపాలము
శిశువు వైనా, పశుపక్ష్యాదులైనా ....
సాధువైన......, క్రూరులైనా....
జగతిలోని ప్రతి ప్రాణీ.... గానానికి...
పరవశించకుండునా...? మనసునిండకుండునా...?
సంగీత జలధిలో ఓలలాడకుండునా ..?
[02/07, 9:23 AM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :39
అంశం :గరళం
తేది :01-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక : అతియే గరళం
****************************************
సాగర గార్భాన కామధేను, కల్పతరువు లక్ష్మి శశిల వోలె
మనిషి మనమునుండు సద్బుద్ధియే అమృతము
సాగర గర్భాన గరళము ఉదయించినట్లు
మానవ మస్తిష్కమున వృద్ధి చెందు విపరీతాలోచనలే గరళం

సాగర మధనమున గరళం గ్రోలి యా హరుడు లోక హితము కూర్చే
మానవ మేధో మధనమున మొలకెత్తేడు దుర్భుద్ధి దుశ్చర్యలు లోక నష్టమొనగూర్చే
జగతిన ఏదైనా మితిమీరిన ఔను గరళము

అత్యాశ, అవినీతి, అన్యాయం, బంధుప్రీతి అధికారకాంక్ష గరళమైన క్షీణించును దేశ ప్రగతి
అతిగారాబము, అతి ప్రేమ, అతినమ్మిక, అతి స్వేచ్ఛ గరళమై దారి తీయు విధ్వంసపు దిశ వైపు

ప్రకృతిన చెట్టు చేమ వాగులు వంకలు గాలి ఆకాశము పశు పక్ష్యాదులు సకల జీవరాశులు సమతులముగసాగినపుడు
ప్రకృతి అమృత తుల్యము
సకల జనులు మురిసెదరు ప్రకృతొసగు వరముల
మరి యా ప్రకృతి వికృతి యైన కాలుష్యపు గరళాన
జనుల కెల్ల దుఃఖాలే, ఒనగూరును అశాంతి అనారోగ్యాలే

సాగు పెంచు ఎరువులు మందులు నేల తల్లి ఒడిని చేరి
పాడి పంట సిరుల కూడి గరళంగా రూపు దాల్చి
చెరచు నరుల ఆరోగ్యం హరియించును ప్రాణాలే
ఏడు ఎనిమిది యేండ్లకే పసిమొగ్గలు వికసించిన కలుగుమిగుల కష్టం
సంతతి నొందు బాగ్యానికి దూరులౌద్రు ఆలుమగలు
సకల కాలుష్యాల పీడితులై సకల జనులు భాధల పాలవుతున్నరు

సరదాల అమృతము అలవాటుల గరళమైతే జరుగుతుంది విధ్వంశము (తాగుడు, జూదము వంటివి )
తార్కాణములివే నాటి నిర్భయ నేటి దిశ సంఘటనలు

అతి సర్వద సృష్టించును గరళం
అందుకే అన్నారు అతి వినయం ధూర్త లక్షణం
అతి సర్వత్ర వర్జయేత్

గరళం ఒక్క సారి గా...... ప్రాణం తీస్తుంది
అతి చాపక్రింద నీరులా గరళమై నెమ్మదిగా నాశనం చేస్తుంది

********తస్మాత్........ జాగ్రత్త..........
[02/07, 9:24 AM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :40
అంశం :గుండె చప్పుడు
తేది :02-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :ఊహయా.... !
*************************************-
ఉషోదయానికి స్వాగతం పలికే వేళ
మంగళ మామిడి తొరణాలతో కల కల లాడే గుమ్మాలు
పసుపు కుంకాలతో  అందగించే గడపలు
ముంగట ముత్యాల ముగ్గులు
పిండి వంటల ఘమ ఘమలు
ఇల్లంతా పరచుకున్న పరిమళాలు
సువాసినిల గాజుల గలగలలు
బంధువుల  కలకల  సవ్వడులు
పసుపు పాదాల అందెల రవళులు
ఎదలో రేగే తీయని తేనియ మమతలు
మదిలో తెలియని మధుర భావనలు
గుండెలపై తాళిబంధం పడ్డ తరుణం
హృదయంలో రేగిన కలవరం
గుండె చప్పుడు వేగంగా నాకే వినిపించిన వైనం
కన్నకలలు నెరవేరే మధుర సమయం
మెట్టినింట అడుగిడే మధుర మనోజ్ఞ క్షణాలు
పుట్టినింటి మెట్టినింటి గౌరవం రక్షణ బాధ్యతలు
మానస కడలిలో సంఘర్షణల మధనాలు
అమృతమే ఉదయించునో
హాలాహలమే ప్రభవించునో
భయంతో ఊహలకందక
మది కలవర పడగా
గుండె చప్పుడు పెరగగా
తనువెల్లా స్వేద మలముకున్న తరి
దిగ్గని లేచి కన్నులు తెరిచినా...
ఇది కలయా !...... ఊహయా !.....
హమ్మయ్యా !...... ఊపిరి.... పీల్చుకున్నా....
నా గుండెల చప్పుడు నెమ్మదిగా మార్చింది లయ
నెమ్మది o చేలా....... మామూలుగా
కలైనా కలవర పెట్టినా.....
ఎప్పటికైనా..... కల నిజమేఔ నుగా....
[02/07, 3:23 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :41
అంశం :కాలచక్రం
తేది :02-07-2020
పేరు :ch. విజయలక్ష్మి
టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :అలుపెరుగని పయనం
**************************
వత్సరాలే మూలంగా
మాసాలే కొమ్మలుగా
వారాలు దినాలే ఆకులుగా
విరాజిల్లు కల్పవృక్షమా... !
ఆగని అలుపెరుగని
అనంత కాలగమనమా.... !
నిరంతర చక్ర భ్రమణమా.. !
చరిత్రల కాధారమా.... !
అనుభవాల కాసారమా... !
జ్ఞాపకాల కాలవాలమా... !
విజ్ఞాన భండాగారమా.... !
ఎన్ని చిత్ర విచిత్రాలు
ఎన్నెన్నో విలయాలు
మరెన్నో అద్భుతాలు
బాధలు, అభద్రతా భావాలు
యివన్నీ నీలోనే విలీనం
ఏదైనా, ఏం జరిగినా....
గత గాయాలు మాన్పుతూ..
భవితపై ఆశలతో....
వర్తమానం వైపుగా...
నీ అలుపెరుగని పయనం ఆగదుగా..?
అందరి పయనం ముందుకు సాగునుగా..., !
నీ తోనే..... భావి పసిడి కాంతుల దిశగా....
42


[04/07, 2:24 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :42
అంశం :చిగురాకు
తేది 03-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :ప్రకృతి
************---***********--
చైత్ర మాసం వసంతాగమనానికి
స్వాగతం పలుకుతూ తరువుల
తనువు లెల్ల రక్త వర్ణం తోడ
రంజిలు పల్లవాల పల్లవించు

విరిసిన విరుల పరిమళాల
తేలు చల్లని పవన పయనం
పుడమి తల్లి పెండ్లి కూతురై
కులుకు లొలుకు తళుకు సోయగాల

లేత చివురులు మేసిన
కోయిలమ్మల కుహు కుహు
హొయలొలుకు రాగాల పల్లకిలో
చిరు చిరు సడుల సందడి చేయ
దొరలును చిరు దరహా హాసాలే

ప్రకృతి కాంతకు తోడై వసంతుడే రాగా
మామిడి చిగురుల ముక్కు పుడకల
వేప పూతల సోయగమ్ముల
పూల వాసనల గాలి తెమ్మెరల
కళ కళ లాడు తు సిగ్గు దొంతరల
కన్నుల వేడుక చేసేను జనులకెల్లర

మానవ స్వార్ధప్రయోజనాల ఫలము
తరువులన్నియు కనుమరుగు కాగా
ఋతువు లన్నియు తారు మారు కాగా
ప్రకృతియే వికృతి యై రమణీయ దృశ్యాలు
మృగ్యమై పోగా అకాల పరిణామాలు
దారిలో పరిసరాలన్నీ హితమునే కోల్పోగా
పూర్వ వైభవం ఒయాసిస్సులై ఊరించగా
ప్రకృతి ఉనికి యే ప్రశ్న గా మారగా
మనం నడుము బిగించి కృషి చేసి
పునర్జీవనం తేవాలి.

వృక్షో రక్షతి రక్షితః
43
[04/07, 2:30 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవితసంఖ్య :43
అంశం :జంట పక్షుల రాసకేళి
తేది :04-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :ముచ్చటైన సుందర దృశ్యం
**************************************
అలసితిరో.......... సొలసితిరో....... ఓ అందాల చకోల్లారా
పొద్దుపొద్దునలేచి దిశదిశగా గగనాన చేసిరేమో అలుపు లేని గమనం
ఎగిరెగిరి ఎటుపోతిరో గ్రాసము వెతుక
గతుకుట కెంత కష్టించిరో కదా !
పొద్దంతా జతగా ఎన్ని వెతల కోర్చిరో కదా !
చంద్రోదయ మాయెగా
సయ్యాటకు వేళాయెగా
చేరితిరి జతగా
మధుర కాపురమే చేయగా
కువ కువ లాడు ముద్దుల జంట
కలిసి పోవ పడు ఆరాటమంట
కౌముది కాంతుల వెదజల్లెనంట
కనులు మూయుట మరచె చంద్రుడంట
కిల కిల రావాలసవ్వడుల
కువ కువ లాడు ముద్దుల
కలువరేడు సిగ్గిల
కలసి పోదురే ఒద్దికల
వివిధ వర్ణరాగాల విలసిల్లు హరి విల్లు చేబూని
వలకాని శరముల హృది తాకి
వింత మమతానురాగాలమనసులు రంజిల్లఁ
విరిసె క్రౌంచ పక్షుల గాడ ప్రణయాంబుధి
వివిధ భావాలకు స్ఫూర్తి నిచ్చు
చిత్ర వర్ణాల చిత్రము రచియించిన
చిత్రకారుడెంతటి  నేర్పరో కదా... !
ఓ....... మహానుభావా.................
మీకివే.... మా హృదయ పూర్వక శుభాభినందనలు
మీ... కళకు.... మా మదులే పాదాక్రాంతము.
44
[04/07, 3:05 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :44
అంశం :గాజులు
తేది :04-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి,
వివరాలు :టీచర్, బీర్కూర్.
శీర్షిక :నీవు లేక మన లేము
*******************************
అమ్మ గాజులసవ్వడి బిడ్డకు కూర్చునవ్వుల విరిజల్లు
జవరాలి గాజులసవ్వడి ప్రియునికిఆగమన చిరునామా
భార్య గాజులసవ్వడి భర్తకు సాంత్వన వసంతo
ఆడు బిడ్డలమువ్వల సందడి గాజులగల గల నాదo
జతగా కురి పించు యింట లక్ష్మి దేవి కరుణా కటాక్షం
సువాసినీల సౌభాగ్య చిహ్నం వనితల జన్మబంధం
బిడ్డలకు ఆదిలో వేయు నల్ల గాజులు చేయు దిష్టి దూరం
గాజుల నిత్యధారణం మంగళదాయకం ఆరోగ్యం చేకూర్చు సంప్రదాయం సౌభాగ్యదాయకం
సంప్రదాయకంగా గాజుగా జనియించినా...
వివిధ వర్ణాల భాసిల్లు
వివిధ మెటల్ లలో శోభిల్లు
వివిధ ఆకృతుల విలసిల్లు
రవ్వల రాగాల రంజిల్లు
బంగారంతో సింగారించు
నవరత్నాలు నీలో పొదిగి ముచ్చటిల్లు
ఎన్నో ఎన్నెన్నో హంగుల వర్ధిల్లు
ఎన్ని హంగుల ఎన్ని మార్పులు తెచ్చు కున్నా...
నిత్య నూతనమగా ఒయారాలు పోయినా....
మట్టి గాజులకు సాటి మేటి కావుగా... !
సంప్రదాయసంసృతిగా వెలుగొందిన నీవు
అలంకారప్రాయ మయ్యావు నేడు
గుచ్చుకుంటున్నాయని అడ్డమనే భావముతో
బోడి చేతుల భామ లౌతున్నారుగా... !
కల్చర్ పేరున మంచికి దూరమౌతున్నారుగా
అయినా -----------ఓ..... గాజులమ్మ తల్లీ.........
పెళ్ళయినా, పేరంటమయినా, పండుగైనా, ఏవేడుకైనా...
పిన్నలూ, పెద్దలూ చేయి నిండా గాజులతో
అందాలు వొలక బోస్తూ ఒయ్యారాల వెలిగి పోతున్నారు
ఈ.... నాటికీ.....
అదే............ మరి... నీ.... ఘనత..... !
ఎన్నటికీ... ముదితలు వదులుకోలేని జన్మ బంధం నీవేగా !
నిన్ను బాసి జీవించ లేకనే ఏ వనితయైనా.. కోరుకుంటుoది..
భర్త ఒడిలో... తనువు చాలించాలనీ ...
తాను... పుణ్యవతిగానే.. పోవాలనీ .....
తన జ న్మ  తరించాలని.
45
[05/07, 3:50 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :45
అంశం :గాలిపటం
తేది :05-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్
శీర్షిక :అనుకోలేదు
********************************
ప్రాణ దాతల ప్రేమామృత వర్షంలో
ఆటపాటల అనుబంధాల మల్లె పందిరిలో
గిల్లికజ్జాల స్నేహసౌరభాల విరితోటలో
విరిసిన విరజాజి కుసుమం నేను
జీవనయానం పూలబాటగా సాగాలని
భవిత పసిడికాంతుల ప్రకాశించాలని
జీవననేస్తం అభయహస్తం జీవితాంతం
తోడు నీడై కలకాలం కలిసుండాలని
అత్తా మామల్ని అమ్మా నాన్నలుగా తలచి
వారి సేవామృతలహరిలో తరించాలని
అందరికి తలలో నాల్కలా మసలాలని
కుటుంబానికి అనురాగసుధలందించాలని
జీవితమాధుర్యాన్ని ఆస్వాదించాలని
జీవనాన్ని ఫలవంతం గావించాలని
ఎన్నో ఎన్నెన్నో మధురోహల తీయ తేనియ
మకరంద మాధురీ మత్తులో మది సోలగా
సుందర నందన వనంగా మెట్టినిల్లు భాసిల్లాలని
కోటి ఆశల పల్లకినెక్కి నవ వధువుగా
ఆశల హరివిల్లుల మది రాగరంజితం కాగా
గృహప్రవేశం చేసిన మధుర మనోజ్ఞ తరుణం
తలపోయలేదు ఆశలు అడియాశలౌతాయని
కాళ్ల పారాణి ఆరక ముందే వరకట్న భూతం
కన్న కలలను కాలరాస్తుందని
ఆశల సౌథం పేకమేడల్లా కూలిపోతాయని
వెన్నెముక లేని మగని చేదోడు లేదని
రెక్కలు తెగిన పక్షిలా దారం తెగిన గాలిపటంలా
మది కన్నీటి కల్లోల సాగరం కాగా
దుఃఖ సంద్రాన దారితెన్ను గానక మునక వేయగా
పుట్టిల్లు చేరలేక మెట్టిల్లు వీడలేక
భవిష్యత్ అంధకార బంధురం కాగా
ఎవరిని కారణభూతుల్ని చేయలేక
దిక్కు తోచని అయోమయస్థితిలో
ఆవేశంలో ఒక బలహీన క్షణాన
కానరాని లోకానికి పయనమౌతానని
కన్న వారి గర్భ శోకానికి కారణమౌతానని.
[05/07, 3:59 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :46
అంశం :జయం
తేది :05-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :ఘన విజయం
******************************************
జయీభవ విజయీభవ యనెడి
జయ జయ ధ్వానాల కలుగు వింత శక్తి
జయముతో తాను విజేత యగు
విజేత బడయు అనంత యశము

దేవతలు సైతము కాంక్షింతురు విజయం కైవసం కావాలని
విజయలక్ష్మిని కోరని వారుందురా!

విజయము రావడమన్న అంత సులువు కాదు
దీక్ష, పట్టుదల, నిరంతర పరిశ్రమ, ఆశయం వంటి
అస్త్రాలే విజయానికి చేర్చే విజయసోపానాలు

విజయం ఆనందాలకు హేతువు
అపజయం విజయాలకు  చేర్చే సేతువు

జయాపజయాలు దైవాధీనాలంటారు కొందరు
విజయాలనే ఆకాశ హరివిల్లు చేరడమే జీవితం అంటారు ఇంకొందరు

జయం మనకే కాక ఇతరులకు ఆనందాన్ని ఇవ్వాలి అదే నిజమైన విజయం
అందర్నీ బాధించే విజయం అనిపించుకోదు నిజమైన విజయం

ఇతరులకు చేతనైన సాయం చేస్తే చూసే చల్లని చూపే జయం
మనకున్నది ఇతరుల కివ్వలేని గుణం ఉండడం అపజయం

సొంత క్షేమం మాత్రమే కాక ఇతరుల క్షేమం కోరుకోవడం లోనే ఉంది నిజమైన జయం
ప్రస్తుత పరిస్థితులలో ధైర్యంగా పరుల సేవకు అంకితమై
నిలబడ్డ వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికులు రక్షక భటులు భారత దేశ జనుల హృదయ కమలాల ఉన్నత స్థానాన్ని పొంది సాధించారు ఘన విజయం.
47

వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :47
అంశం :చల్లగాలి
తేది :07-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :చల్ల గాలీ..... నీ.. చిరునామా... ఎక్కడ?
******************************************
పల్లెటూర్లు అందాలకు పుట్టిళ్లు
సంప్రదాయాలకు పట్టుకొమ్మలు
పచ్చని చీర కట్టుకున్న నేల కన్య
చెరువుల అందాలు తామరల సోయగాలు
పంట చేల పై నుండి వీచే చల్లగాలులు
పిల్ల కాలువల పై నుండి వీచే పిల్లగాలులు
ఉషోదయాన కావిడి మోతల మగవాళ్ళు
చంకన బిందెల హొయలొలుకు ఆడాళ్ళు
సాయంసమయాన రచ్చ బండ్ల పై
తరువు లిచ్చు చల్లగాలి లో హాయి గొలుపు
సంతోషాల సమావేశాల సంబురాలు
ఏవి?...... ఎక్కడ?.............
కానరాక కనుమరుగై పోయాయిగా......... !
ఉద్యోగాలకోసం....
వ్యాపారాల కోసం....
చదువుల కోసం....
బ్రతుకు తెరువు కోసం
పట్నం బాట పట్టిన పల్లె జనం
ఇరుకు గదుల్లో......
బ్రతుకు పోరాటంలో....
ర్యా o కు ల పరుగులో.....
సంపాదన వేటలో.........
అలసి సొలసి గూడు చేరిన
జనాలు అలసట పోగొట్టు కునేది
టీ. వీ. లు, సెల్ ఫోన్ల తో నేగా
కాలుష్యపు కోరల్లో
కట్టుబానిసైన
కాంక్రీటు నగరాల్లో
చల్లగాలీ...? నీ.. ఉనికెక్కడ...?
నీకు ప్రత్యామ్యాయాలు
ఏ. సీ. లు, కూలర్లు, ఫ్యాన్ లేగా !!
అడపా దడపా పార్కులేగా... !!!
హాలీ డే స్పాట్లు... !!!!!
హరితహారం పుణ్యమాని
స్వచ్ఛ భారత్ బాటగా
మొక్కల పెంపకంతో
జనాలకు దొరికే స్థలం
కొంత సేదతీరే తరుణం
చల్లగాలి.. ప్రకృతి ప్రసాదించిన వరం
దాన్ని అందకుండా శాపం గా మార్చింది
స్వయంకృతాపరాధం
ఏం చేయగలమో... ఆలోచించాలి
మన తప్పును మనమే దిద్దు కుందాం
పర్యావరణాన్ని రక్షిద్దాం
కాలుష్యాన్ని నివారిద్దాం
పూర్వ వైభవాన్ని పొందుదాం
చల్లగాలిలో సేద తీరుదాం.
48

వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :48
అంశం :గుడి గంటలు
తేది :07-07-2020
పేరు :విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :జ్ఞానదాయిని
******************************
మా పల్లె నంట గోపాలుని గుడి యంట
గుడిలో ఉందో గుడి గంటా
గణ గణ గంటల నాదాలే
మేలు కొలుపులే పల్లెన్తా
సుప్రభాతసేవలో కుంకుమార్చనలలో
పవళింపు సేవలో హారతిచ్చు వేళలో
సేవ చేసే భాగ్యము నాదేగా దేవా
నాదేగా దేవా.....
గంటా నాదము విని నంత నే
దూరమౌను గా చింతలూ
మదిలో కలుగును మోదాలు
డెందము ఊగును ఊయలలు
గుడి గంటల మ్రోగు మ్రోతలు
జనియించును  పవిత్ర నాదాలు
హరియించును మనో వికారాలు
తొలగించును అజ్ఞాన తిమిరాలు
వెలిగించు ను విజ్ఞాన జ్యోతులు
మదిలో నిండును కాంతులు
కలుగును మధుర భక్తి భావనలు
ముక్తికి చూపును మార్గాలు
ధన్యత నొందును జీవితము.
49

[08/07, 10:31 AM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :49
అంశం :చెరువు
తేది :08-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :ఆనాడు -ఈనాడు
******************************
గాలి నీరు ఆహారం జీవుల కాధారo
చెరువు లేని పల్లె కాన రాదు
చెరువు నీరు ఊరి కాధారం
పంటలకు యిచ్చేను ఊతం
అందరికి తీర్చేను దాహం
కొబ్బరి నీరం త స్వచ్ఛం
చెరువు లో పిల్లల ఈతలు
సరదాల స్నానాలు
కార్తీక దీపాల కాంతులు
సమీపాన చెట్టు నీడన
రచ్చ బండ సమావేశాలు
కావిడి బిందెల మోతలు
పండుగల పబ్బాల సందళ్ళు
ధాన్య రాశుల  ధన రాశులు
వాలు జడల వయ్యారాలు
నడుము వంపున బిందెల మోతతో
హొయలొలుకు నడకల వయ్యారులు
కుర్రకారు గుండెల చేసే గాయాలు
కిల కిల నవ్వుల సరస
సల్లాపాల చెలుల కూడి
ఇల్లు చేరే పడతుల సంబరాలు
చెరువు లక్ష్మి కటాక్షం చేత
అద్భుతంగా ఆనందాల
అలరారిన పల్లె అందాలు
ఇది పూర్వ వైభవం

ఈనాడు చెరువు ఉనికికే చేటు కాలం
అక్రమ ఆక్రమణ దారుల పాలిట వరం
వాటి స్థానే విలిసెను వెంచర్ల కాలం
చెరువులున్న పల్లెలు బహు స్వల్పం
ఉన్నా నేడవి కాలుష్యాల కాసారాలు
మానవ స్వార్ధ ప్రయోజనాల ఫలితం
మాయమైన వన సంపద
ఋతువులు దారి తప్పిన క్రమం
ప్రకృతి వైపరీత్యాలు వర్షా భావ పరిస్థితులు
నీరింకి ఎండమావు లైన చెరువులు
నేటి జనం క్యాన్ ట్యాంక్ల నీటికి
గొట్టపు బావుల నీటికి అలవాటు
పడి చెరువు అన్న మాటే మరువగా
వాటి మనుగడ ప్రశ్నగా మారెగా
ప్రభుత్వం యిప్పటికి కళ్ళు తెరిచి
నీటి ప్రాధాన్యత నెరిగి
చెరువుల పునరుద్ధరణకు
పలికేను స్వాగతం
మిషన్ కాకతీయతో కొంచెం పెరిగిన ప్రాభవం
దీనికి తోడు మానవ ప్రయత్నం పెరిగితే
హరితహారం కారణంగా
మొక్కల పెంపకంతో
ప్రకృతి కరుణిస్తే
కాలుష్యపు కోరలు పీకేస్తే
చెరువులు నిండవా
పంటలే పండవా
భూగర్బ జలం పెరగదా
విద్యుత్ వ్యయం తగ్గదా
ఆదాయం పెరగదా
రైతు సంతోషిం చడా
పూర్వ వైభవం రాదా
జై కిసాన్.. అన్న దాత సుఖీ భవ  లోకాస్సమస్తా సుఖినోభవంతూ
50
[09/07, 1:10 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :50
అంశం :ప్రేమ జంట
తేది :08-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :మరోలోకం
***********************************
అదో సుందరలోకం ప్రేమికులకు మాత్రమే ప్రవేశం
అంతటా పరచుకున్న గులాబీవర్ణం
అందగిస్తూ కలిగించు మానసికోల్లాసం
పరులెవరూ లేని లోకం ఎవరూ
ఎవర్నీ అడ్డగించని లోకం
మనసులు కలిపిన స్నేహం
ప్రేమగా రూపు దాల్చిన వైనం
ఎద దోచిన ప్రేయసి అందాల రూపం
రారమ్మని పలికే స్వాగతం
కుసుమకోమలి సుతిమెత్తని దేహం
గాఢ పరిశ్వంగాన కరిగే దీపం
తేనెలూరు చుంబనాల అమృత
చినుకుల తడిసిన హృదయం
కాంతులీను భామ కన్నుల లో
ప్రేమమైమరపు తోచిన వేళా
మరిమరి యని మారాము చేస్తూ
ఇంకా కోరే ప్రణయానులింగనం
ఘల్లుఘల్లు మను ప్రేమరాగాలు
ప్రతిధ్వనించే సుందర హర్మ్యం
సరాగాలవిలాసాల విలసిల్లే
మధుర మనోజ్ఞ మంజుల రంగుల హరివిల్లు
హృదయాలు ఏకమై మధురానుభూతుల
ఉయ్యాల లూగే అద్భుతసుందర వలపుల నిలయం
ఇద్దరమే మనమిద్దరమే ఒకరికొకరమై
ఎవరూ విడదీయలేంత గా మమేకమై
మనసులే మైమరచి సలుపుదమ రతికేళి
పెద్దల కులాలమతాల కుమ్ములాటలో
సమిధలమైన మనం రమణీయ ప్రేమస్వర్గాన
కలలు పండగా కాపురముందామా
దేవతలెల్లరు మన నిష్కామ ప్రేమన్ ఆశీర్వదించగ.
51
[09/07, 1:10 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :51
అంశం :పిల్లలు
తేది :09-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :భావి సారధులు
*****************************************
ఆడి పాడే పువ్వులం
ఆనందాల నవ్వులం
స్నేహాల మరు మల్లెలం
మురిపాల సిరి మువ్వలం
కలిసి మెలిసి బ్రతికేస్తాం
భేదాలను దరి చేరనీయం
ఎల్లలనే మేం చెరిపేస్తాం
విజ్ఞానం మా సొంతం
ప్రపంచాన్నే గెలిచేస్తాం
మొక్కలు చక్కగపెంచేస్తాం
నీటిని ఒడిసి పట్టేస్తాం
కాలుష్యాన్ని తరిమేస్తాం
భూతాపాన్ని తగ్గిస్తాం
పర్యావరణం రక్షిస్తాం
మా పెద్దల తప్పులు దిద్దేస్తాం
భావి పౌరులం మే మందరం
భవితకు పునాది వేసేస్తాం
బంగరు జగతి మా స్వప్నం
సాకారం కై మా పోరాటం
స్వచ్ఛ విశ్వమే మా లక్ష్యం
కొరోనా అంతం చూసేస్తాం
కల్లలు లేని ప్రపంచం
నిర్మించడమే మాద్యేయం
శాంతి సౌభాగ్యాలే సాధిస్తాం
భూ మాతనే రక్షిస్తాం
మాత ఒడిలో నిదురిస్తాం
హాయి ఆనందాలు పొందేస్తాo
వనరుల చుక్కగ కాచేస్తాం
పొదుపుగవాటిని వాడతాం
వృధా ఎన్నడూ చేయం
మా భావి తరాలకు అందిస్తాం
అదియే మా తక్షణ కర్తవ్యం
భూమి కి మేమే రక్షకులం
మేమే కంకణబద్దులమౌ సారధులం
ముందు తరాలకు మార్గదర్శకులం
52
[09/07, 2:58 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య 38
కవిత సంఖ్య :52
అంశం :తామర పూలు
తేది :09-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :దేవతా పుష్పాలు
********************************
తామర బురద నుండి పుట్టినా
తన సహజ గుణాల భాసిల్లెగా
బ్రహ్మ జననం తామర నుండే
లక్ష్మీ దేవి చేసికొనె ఆసనంగా
దేవతల ప్రియ పుష్పమ్ముగా
కరముల అలంకారమాయె
కవుల కవన సాధనముగా
పూబోనణు ల ఉపమానముగా
మలిన మంటని పుష్ప కన్నియగా
మనుజుడు కూడ మనవలెగా
ఎట్టి వికారాల నంటనీయక
మానవత్వపరిమళాలు వెదజల్ల
ప్రకాశించవలె పరుల మేలు జేయ
పరుల సేవన తరించగా
నేటి విపత్కర పరిస్థితుల నెదిరి
కరోనా పార ద్రోల కవచమై నిలిచిన
మన వైద్య సేవా బృందము
రక్షక భట సమూహము
మిత్ర మీడియా బృందము
ఆకలి తీర్చు అన్నదాత బృందము
అలుపెరుగక సేవ జేయు పారిశుధ్య పరిమళము
సమాజాన విరిసిన తామరలేగా
సామరస్య సమభావన వెలుగులీను పంకజాలే
తామరల నంటని నీటిబొట్టులా
వారికంటవు ఎట్టి తారతమ్యాలు
వారే నేడు నిక్కమగు తామరలు
మనం పూజించ దగు దేవతా పుష్పాలు

53

[11/07, 5:38 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :53
అంశం :మహిళా దినోత్సవం
పేరు :విజయలక్ష్మి,
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
తేది :11-07-2020శీర్షిక :మాటలు గలవా?
*****************************------
మహిళా దినోత్సవ మంటూ
మహిళా నీవే మహోన్నత మంటూ
వట్టి మాటలు కట్టి పెట్టు
జననం నుండి మరణం వరకూ
స్త్రీ లేనిదే క్షణం గడవని జీవన గమనాన
ఓ పురుషుడా వర్ణించడం నీ తరమా !
ఆమె సేవ కరుణ సహనాల ను
ఈ ఒక్క రోజు కాదు
ప్రతి దినం ప్రతి క్షణం
ఆమె ను ఆకాశా ని కెత్త నక్కర లేదు
మనిషి గా చూడు ఆప్యాయత చూపు
కొంచెం ప్రేమ కొంచెం ప్రేమ చూపించు
మణులు మాణిక్యాలు అక్కర్లేదు
చుక్కలు తేవక్క ర లేదు
తిన్నావా అని అడుగు చాలు
రవ్వంత నీ ప్రేమ అక్క ర చాలు
ఆమె ప్రపంచాన్ని గెలవడానికి
ఆమె ను ఆమె రక్షించు కోవడం కాదు
ఆమె కు రక్షణ గా నిలబడు
నమ్మకాన్ని కలిగించు
ప్రణమిస్తుంది ప్రణమిల్లు తుంది
మనిషి గా చూడు అంతే చాలు
54
[11/07, 5:39 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :54
అంశం :చినుకులు
తేది :11-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :ముదము నిచ్చు
*****************************
మేఘ రాజు నీలి రాణుల
ప్రేమ ఫలము రూపు దాల్చి
అనుంగు సంత తయినా
చినుకు చినుకు చేరి
వర్ష మై ఇలకు జారి
వాగులై ఏరులై పారుతూ
జల రాశు లను నింపి
మానవాళి మనుగడ కు
మూలమై కూర్చు గా ప్రాణంబు
భూగర్భ జల రూపాన
భూమాత దాహంబు తీర్చు

గ్రీష్మము వెనుకే వచ్చు చినుకు తాకి నంత
భూమాత తనువు పులకించు
మట్టి పరిమళాలందించు
జనుల ముదము గూర్చు
గ్రీష్మ తాపము తోడ విసిగిన
జనుల కొసఁగు ఓదార్పు

మోడైన తరువుల తపము ఫలియించగ
వరుణ దేవుడొసఁగు చినుకు అమృతము
గ్రోలి నంతా తరులు జీవము పొంద
చివురులు తొడుగుతూ పూలు వికసించు
చివురుల మేసిన కోయిలలు కమ్మని
స్వరముల జనుల వీనుల విందులే చేయు
పచ్చని తరువులు అందాల అలరారు
పూల సుగంధాల పుడమి పులకించంగా
ఝo కార నాదాల భ్రమరాలు తిరుగాడు
చైత్ర మాసపు శోభపుడమి వర్ధిల్లు

చినుకు కై రైతు ఆశగా చూచు
పంటలకు ప్రాణము జలములేగా
యేరు వాక కు యిచ్చు ఊతమేగా
పంటలే దండిగా పండగా
పండుగే జనుల కు మరి అన్నదాతలకు
ఉండవే మరి కరువు కాటకాలు
ఉందురే జనులంత ముదము తోడ

మానవ చర్యల క్షయ మాయే వనములే
క్ష య మాయే వానలే
వచ్చుగా అకాల వర్షాలే
భూగర్భ జలములే అడుగంటే
రైతు ల అగచాట్లు ఆకాశము నంటే
జనుల బాధలు కూడ భాగమయ్యే

మానవా...... మేలుకో
వనముల పెంచుమా భక్తి తోడ
ఒడిసి పట్టు చినుకు చినుకు
దాచుమా భద్రంగా
వాడుమా మితముగా
కాపాడుమా మన ముందు తరాల ను
నాడు కాదే జగము ముదము పొందు
55

వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య 55
అంశం :చేయూత
తేది :12-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి,
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీ ర్షి క :చేయూత ఇ వ్వాలి
*********************-----
ప్రాణు లన్ని పరస్పర ఆధారాలు
సహకారం లేక మన లేవు జగాన
జగతి కి మూలాధార మైన
తరువు లైన మనగలవా
గాలి లేక నీరు లేక
సారం గల నేల లేక
మరి మానవులంతా
మనగలరా చేయూత లేక
తీగ కు పందిరి
మగువ కు మగవాడు
మగవాడి కి మగువ
మానవునికి ధైర్యం
కాదా చేయూత
ప్రజల కు ప్రభుత్వం
ప్రభుత్వా నికి ప్రజలు
ప్రజలకు ఓటు హక్కు
కాదా చేయూత
చీకటి లో చిరు దివ్వె
ఆపదలో ఉపాయం
అన్నార్తుల కొక ముద్ద
ఆపన్నుల కొక అభయం
కావా చేయూత
పరస్పరా ల చేయూత
వెర్రి తలలు వేయగా
ధనాశ కీర్తి కాంక్ష
కల్తీ లకు తోడు రాగ
మానవుల మనుగడ
మంటల పాలవగ
మంచితనం మృగ్య మై
నిజాయితీ నీట కలసి
దుర్భుద్ధి దుంధుభి మ్రో గ
ఎక్కడుంది చేయూత
చేయూత చేతి సహకారం
సహాయం దా ని మరో రూపం
చేయదా అది మహోపకారం
ఇక్కడ అక్కడ అని కాక
అవసరం ఉన్న ప్రతి చోట
చేయూత ఆధార మైతే
సొంత లాభం కొంత మానితే
వెల్లి విరియు ఆనందం

56
వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :56
అంశం :స్నేహబంధం
తేది :12-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :మిత్రులఆశల హరివిల్లు
*******************************
అదో పల్లెటూరు
పచ్చని పంటలతో హరిత తివాచీ పరచి నట్లు అలరారు సుందర పల్లె
పంచుకున్నారు మిత్ర బృందం పసి ప్రాయము నుండి ఆటపాటల తో
ప్రేమ మీర కలిసి మెలిసి తిరిగి
పరిమళించిన స్నేహ సౌరభము
పట్టుదలతో ఇష్టంగా కలిసికట్టుగా
పండించుకున్నారు సుందర స్వప్నాలు
పాఠశాల విద్యను విజయవంతంగా పూర్తి గావించి
పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు
పలికారు ఇష్టంగా కళాశాల విద్యకు స్వాగతం
ఎదురు చూస్తున్నారు కళాశాలలో చేరడం కోసం
ఉత్సాహంగా ఉల్లాసంగా భావి వైపు ఆశగా
ఆశలతో అడుగులు వేస్తూ
సూర్యోదయంకు స్వాగతం పలుకుతూ
కళాశాల విద్య కై పరుగులెత్త సిద్ధమైనారు
ఏ ప్రతికూల శక్తులు వారి
ప్రతిభకు ప్రగతికి ప్రతిబంధకాలు
కాకూడదని కోరుకుందామా
ఆ దేవ దేవుని ఆశీర్వదించమందామా
ఆశీర్వదిద్దామా... వారి ఆకాంక్షలు
సాకారం కావాలని ఆత్మ శక్తి తో
ఎదురొడ్డి ముందుకు సాగాలని
కీర్తి శిఖరాలు చేరాలని
జీవితం విజయపధంలో ముందుకు సాగాలని
విజయం సాధించాలని
వారి స్నేహ బంధం కలకాలం నిలిచుండాలని
ఏ అరమరికలు లేక వర్ధిల్లాలని కాంక్షిద్దాం ఆకాంక్షిద్దాం.
57

[14/07, 1:42 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :57
అంశం :-వలస కార్మికుల వెతలు
తేది :-13-07-2020
పేరు :-సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :-టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :-విజయం నీ సొంతం
**********************************
సాగు తున్నది పయనం
అలుపెరుగక గమ్యం కోసం
సొంతఊరు చేరడం కోసం
వచ్చింది బ్రతుకు తెరువు కోసం
మహమ్మారి విలయ తాండవం
చేసింది జీవనం సమస్యల వలయం
మృగ్య మయింది సంపాదన మార్గం
ఆదుకుంది ఆర్తితో ఆపన్న హస్తం
కానీ ఎన్నాళ్ళు ఈ వనవాసం
ఏదేమైనా కావాలి సొంత వారి సమక్షం
పాద చారియై సాగిస్తోంది యజ్ఞం
అమ్మే అయింది బిడ్డల వాహనం
ఇంధనం లేని నడక యంత్రం
బేజారైనా తప్పదు పయనం
చిరునవ్వే తల్లీ నీ ఇంధనం
అడ్డంకు లెన్నైనా ఎదుర్కొనే ధైర్యం
నీధైర్యమే తల్లీ నీకు సాయం
తప్పక జయిస్తావు ఇది సత్యం
ఆత్మ స్తైర్యం తో సాగిపో...
విజయం అవుతుంది సొంతం
ఆశీర్వదిo చేరు దేవతలు తథ్యం
నీ సంకల్పమే నీ ఉక్కు కవచం
తల్లి సంకల్పానికి తప్పదు విజయం
నీవాళ్ళను చేరి పొందు ఆనందం
కష్టాల కడలి తీరం చేరి జీవించు కలకాలం
సంతోషాల గమ్యం కావాలి నీ జీవితం
ఇదే.. ఇదే... మా.. అభీష్టం...
[14/07, 1:42 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :58
అంశం :చెడు గుడు
తేది :13-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :నిత్యసంఘర్షణ
***********-********************
చెడుగుడు చెడుగుడు చెడుగుడు
మాటవిన్నంత గుర్తు కొచ్చు బాల్యం
పల్లె నుండి పట్నం దాకా పాకి
ప్రాచుర్యం పొందిన ఆట
మస్తు మజా నిచ్చు ఆట
ఐకమత్యానికి ప్రతీక
ఆపకుండా కూత పెట్టి గర్వ పడే ఆట
మంచి వ్యాయామానికి వేయు పెద్ద పీట
గెలుపుకు చేయు గట్టి ప్రయత్నం
గెలుపోటములయందు సమ దృష్టినైజం పెంపొందించు
ఇది...... ఒక..... కోణం.........

మరి....... వుందిగా...... మరో..... కోణం...
అనునిత్యం ప్రతి మనిషి
ఆడునుగా చెడుగుడు
మంచీ.. చెడూ..
నీతి... అవినీతి...
న్యాయం... అన్యాయం...
ప్రకృతి... వికృతి.....
ద్వేషం... ప్రేమ...
దయ... నిర్ధయ
త్యాగం... స్వార్ధం
ఆశ... నిరాశ...
శాంతి..... అశాంతి.....
వంటి అనేకానేక
పరస్పర విరుద్ధ
గుణాల మధ్య
మనసుకు.. మనిషి కి....
నిత్యం.. జరిగే..
సంఘర్షణ... చెడుగుడే... కాదా... !!!!!!

మనిషి ఆరాటం గెలుపు కోసమే
అందుకై విరుద్ధగుణాల చేయు నిత్య పోరాటమే

పోరాటాన గెలిచి సానుకూల గుణాల వర్ధిల్లిన
సాధించును మనఃశాంతి
తాను బడయు మేలు

ప్రతికూల గుణాల పాలబడిన
ఆర్జించును ధనము కీర్తి
కోల్పోవును మనఃశాంతి
సమాజానికి చేటు తెచ్చు

అయినా ఎప్పటికైనా
కలుగును విజయం మంచికే
ఇదియే తథ్యం
జగమెరిగిన సత్యం
తస్మాత్..... జాగ్రత్త...... !!!!!!!!
59

[15/07, 12:27 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :59
అంశం :చిత్రం
తేది :14-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :అంతా చిత్రమే..... అందనిదే
********************************
ప్రకృతి రమణీయత రమణీయ చిత్రం
విశ్వ గమనం చిత్రాతి 'చిత్రం '
ఆధారరహితం గా గమించే గ్రహాలే కడు చిత్రం
భగవంతుని సృష్టి వి ''చిత్రం "
బ్రహ్మ లిఖితం చిత్ర విచిత్రం
బ్రహ్మాండమే వింత ఊహా చిత్రం

మానవుని పుట్టుక రహస్యం
మనుగడ కోసం పోరాటం
బంధాలు బాధిస్తున్నా
బందీలుగా ఉండడం
భాద్యతలు కృంగ దీస్తున్నా
భాద్యతలు నెరవేర్చలనుకోవడం... చిత్రమే

ఏమి శాశ్వతం కాదనీ...
మనతో యేమి రావనీ...
తెలిసినా....
నిత్యం, అనుక్షణం, అంతు లేని ఆశలతో.....
మనిషి కాసు కోసం.....
కీర్తి కోసం...... బంధాల కోసం
పడే ఆరాటం..... చిత్రమే

ఆశల హరివిల్లు అందు కోవాలని
ఊహల పల్లకి లో ఊరేగాలని
సకలం పాదాక్రాంతం కావాలని
సర్వ సుఖాలు భోగాలు అనుభవం కావాలని
తానే సర్వం కావాలని ఆశ ఆరాటం గలిగిన
మనిషి ఆలోచన..... చిత్రమే

ప్రకృతి ని శాసించాలని
పంచభూతాలను అదుపు చేయాలని
అంతరిక్షం లో కాపురముండాలని
సాంకేతిక అభివృద్ధి సాధించామని
తామే అధికుల మని విర్రవీగే
మానవుడు ప్రకృతి ప్రకోపాల కోపాలకు
అది సృష్టించే.. విలయాలకు
తామే........
బలి కావడం.... బహు చిత్రం

సృష్టిలో ఊహకందనిది
సృజించ లేనిది
స్పష్టత లేనిది
చేరుకోలేనిది
చేరాలని ఆరాట పడేది
పొందాలని కోరుకొనేది
ఎన్నో... ఎన్నెన్నో....
చిత్రాలు.. విచిత్రాలే...
ఈ చిత్ర.... విచిత్రాలను....
అన్వేషణ కు.... చాలునా... !
.మానవ మేధస్సు....?
[15/07, 2:10 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :60
అంశం :జడ
తేది :14-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :మనసు పడు అందం
**********************************
పుట్ట గానే వచ్చే మొదటి ప్రశ్న
తెలుపా నలుపా..... తెలుపే...
జుట్టో..... నల్లని నలుపు......
ఎంత.. చక్కని జుట్టో....
వత్తుగా.. నల్లగా....ఎంత అందం

ఇక మొదలు కేశ సంరక్షణ నిత్యం నూనె పెట్టి
దిన దిన తలంటు సున్ని పిండి తో నలుగుపెట్టి
చిట్కాల నాచరించి ఆయుర్వేద పుటం పట్టి
కేశ సంపద పెంచి మురిపించే జడలు వేసి
నా తల్లే.. అని బుగ్గ పుణికి మురియు అమ్మ

ఆ బిడ్డే.... యవ్వన వతి... అయిన.. వేళ
వేణి బంధం అందంగా అల్లి
జడ గంటల చివర లల్లి
సూర్య చంద్రులు చంప సరాలు
మాటీలు పాపిడి బిళ్ళల   నలంకరించి
విరులు ముడిచి నాగుబాము బోలు
కేశ బంధము పిరుదులపై నాట్యమాడ
పరికిణి ఓణీ ల వస్త్రాలంకారణతో
ముగ్ద మనోహర రూపంలో ముద్దుగుమ్మ
చూసి మురిసిపోవు మాతృ హృదయము
ఆరూపము చూడ మనసు పడు పురుష హృదయము
అందుకే.. జడ... జడం.. కాదు
జడత్వాన్ని పోగొట్టే మంత్రము
వాలు జడ వయ్యారాల
కలహంస నడకల
కలకంఠి కులుకుల
హొయలు లయల
కడకంటి చూపుల
నిలువెత్తు ఆడ తనానికి
పాదాక్రాంతం కాని
పురుషుడు పురుషుడే.... !

సుగంధ పరిమళ భరిత నీలాల
కురుల కేయూర పాశ లహరీ
విలసిత యై యేతెంచిన
శాo భ విని గాంచిన శంభుడు
విచలిత మనస్కుడై
పరవశుడై వివశుడై
ఆనంద తాండవ మాడే హరుడు
ఆదిదేవునే అలరించిన వేణి అందము

శ్రీకృషుని విధేయుడిగా చేసిన
సత్య భామా ప్రేమ కలాపము

అవతార పురుషులే దాటలేని వేణీ సౌందర్య బంధము
మానవ మాత్రు డేమి చేయు పాశాల పడక
కాంతల వివిధ కేశాలంకారాల మనసు పడక
కాంత కౌగిగిలింతల బంధీ కాక మనగలడే మొనగాడు
(గమనిక ::ఇదంతా ఒకప్పుడు, నేడంతా నవీన పోకడ
కొండొకచో పండుగ పబ్బాల పెండ్లి పేరంటాల ఒయాసిస్సులై కన్పించుచున్నవి )
61
[16/07, 1:23 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :61
అంశం :గణితం
తేది :15-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డ
శీర్షిక :సర్వాంతర్యామి
***************************
గణన కాధారం గణితము
గణన లేక మనలేం మనం
అంచనా కన్నా కొలతలే మిన్న
కొలత ఖచ్చితమైతే ఫలితాలు మిన్న
లేకున్న ఫలితం సున్న
కూడికలు తీసివేత గుణకారం బాగాహారం
కూడినదే గణితం
వాస్తు శాస్త్రమైనాఖగో ళ శాస్త్రమై నా
గణన లేక నిలుచునా గతిని మార్చకుండునా
విశ్వామ్మున గ్రహాలగమనమొక గమ్మతైన లెక్క
లెక్క తప్పిన గ్రహాల గమనం విధ్వంశము సృష్టించు
తిథి వార నక్షత్ర గణన జ్యోతిష్యానికాధారము
మానవ జీవనగమనమునకిదియే ఆధారము
మానవ జీవనం లెక్కలతో సహవాసం
ప్రేమ గుణకారం ద్వేషం తీసివేత
బంధం కూడిక పుణ్యం బాగాహారం
పాపం శేషంగా జీవితం సుఖమయం
కాలచక్రం భ్రమణం గణితాధారం
పూర్వం వర్తమానం భవిష్యత్
పురాణాలకాధారం
చరిత్రలు తెలుపు
యే శాస్త్రానికయినా గణన గణితమే మూలం
ఆది నుండి అనంతము దాకా విశ్వ వ్యాప్తినొందింది
దేవతలనుండి మానవుల వరకు
మానవ పుట్టుక నుండి మరణం వరకు
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు
ప్రతి చోట ప్రతి విషయం గణన మయం
గణనతో ఘనత కెక్కిరి రామానుజం వంటి గణిత వేత్తలు
విశ్వేష్వర య్య వంటి ఇంజనీరులు
గణితం మన జీవనాన మమేకం
అందుకే గణితం లేక మనం లేం.
62
[16/07, 1:34 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :62
అంశం :గాలి
తేది :15-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :సర్వం నీవే
*****************************
జీవరాశుల పాలిట ప్రాణ వాయువు నీవు
యజ్ఞ యాగాదుల నగ్నికి అభయ మిచ్చేవు
స్వర తంత్రుల కూపిరై స్వరముల పలికించేవు
సకల జీవుల సకలంబు ఒనకూర్చేవు
వివిధ అంశాల కూడిన మలయ మారుత మీవు

పైరు పంటల వీచేటి చల్లని గాలులు
మనసుకెంతో నిచ్చు వెచ్చని హాయి
మంద్రాన సాగేటి పిల్లగాలులు తాకి
తరువులే తలలూచు వేడుక మీరా

నీవు లేని చోటు ఈ విశ్వాన లేదులే
జాతి మత కుల బేధాలు నీకు లేవే
పూరి గుడిసె భవంతులు ఒకటే లేవే
సువాసన అయినా దుర్వా సన అయినా నీవు మోసుకెళ్తావే
 
చిరు గాలి పిల్లగాలి పైర గాలి పైట గాలి వంటి పేర్లెన్నో కలవే
వివిధ పేరులనీవు వాసి కెక్కేవు ఉల్లాసాన్ని కలిగించేవు
పైట గాలికి చిక్కని ప్రవరాఖ్యు  డెవడు
పైర గాలికి మనసు పడని మానవుడెవరు

వానతో కలిసి సృష్టించేవు విలయాన్నే
ధన ప్రాణాలు హరియించేవు
జనుల నిరాశ్రయుల చేసేవు
జీవితాలే కల్లోల మాయేను
కాలుష్యాల కూడి మనుషుల
వ్యాధుల పాల్చేసేవు

ఏది ఏమైనా నీవు మాకు ప్రాణం
అలుపెరుగనినీ పయనం
సాగేను నిరంతరం
మా కోసం.... కనుకనే
కాపాడు కోవాలి మే మందరం
నిన్ను పవిత్రం గా ఉండేలా
మేలు చేసేలా.. స్వచ్ఛo గా ఉండేలా
ఆరోగ్యం ఇచ్చేలా........

63

 వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :63
అంశం :వ్యవసాయమే ఆధారం
తేది :16-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :ఆదర్శ వనిత
*********************************
మానవుడు నిత్యఅన్వేషి
నిత్య నూతన కామేష్టి
నిరంతర ప్రగతి అభిలాషి
నూతన విజ్ఞాన పిపాసి

మానవ మేధోమధన జనితం
అత్యద్భుత వికసిత కుసుమం
అంతర్జాల విహంగం
విజ్ఞాన బాండాగారం
విశ్వ వ్యాపితం

ఐనా.....
ఎన్ని చదువులు చదివినా
ఎంత ఎత్తుకు ఎదిగినా
అందరికి ఆకలి ఒకటేగా
కావాల్సింది పిడికెడు మెతుకులేగా
కనుకనే కర్తవ్యాన్ని గుర్తించావుగా
ఉద్యోగంలో పైసానే కానీ పరమార్ధం లేదన్నావుగా
లక్షల నిచ్చే కొలువు విడిచావుగా
పల్లె చేరావుగా.....
పల్లెలే దేశానికి వెన్నెముకలంటూ
స్వచ్ఛ వ్యవసాయమే ద్యేయంగా
అంతర్జాల పాఠాలు వింటూ
మెళకువలు నేర్చుకుంటూ
నూతన విధానాలు అవలంబిస్తూ
ప్రగతి ప ధా న పయనిస్తూ
పంటలు పండిస్తూ
పదిమందికి అన్నం పెడుతూ
రాణిస్తున్న.. ఓ.. ఆదర్శ వనితా.....
నీకిదే.. మాపాదాభివందనం
కావాలి... కావాలి... నీవంటి.... ఆదర్శ మహిళలు
ప్రస్తుత సమాజానికి...
అందుకో... మా... అభినందననీరాజనం


64
65
66
[19/07, 4:51 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవితసంఖ్య :66
అంశం :మానవా మేలుకో
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :పోరాటమే జీవనం

ఓ మానవా.... మేలుకో.....
ప్రతిభ యంత నాదేనని భ్రమలనుండి బయటపడు
విశ్వమంత నాకొరకని విర్రవీగుటెందుకు?
ప్రకృతి మాత సేవయే పరమావధి యని తెలుసుకో...
ప్రకృతి సంరక్షణయే ధ్యేయంగా మలచుకో...
కనిపించని సూక్ష్మజీవి విజృంభణ చూసావా?
సామర్ధ్యము ఎటుపోయెను?
 విజయగర్వము ఏమాయెను?
క్షణం.. క్షణం... భయం... భయం...
స్వయంరక్షణాయె.. జీవనం...
ఏదైనా... ఎదుర్కొనుటే... నీ నైజము...
ప్రయత్నించు, ఓడించు, జయకేతనమెగురవేయ్
మనుగడకై పోరాడి మనిషిగా గెలువఁవోయ్.
[19/07, 4:57 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవితసంఖ్య :67
అంశం :భాద్యత
తేది 18-07-2020
పేరు :ch.విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
కవితా శీర్షిక :కళ్ళు తెరవాలి

అమానవీయ సంఘటనలు చెత్త కుప్పల్లో చంటి బిడ్డలు వెలుస్తున్న అనాధ వృద్ధ శరణాలయాలు

మొలకెత్తని విత్తనాలు పనిచేయని పురుగు మందులు సారమివ్వని ఎరువులు భారమౌతున్న వడ్డీ కొండలు

నాణ్యత లేని నిర్మాణాలు, నకిలీ పట్టాలమంజూరీలు
నకిలీమందులు

కుటుంబ శ్రేయస్సు కు తిలోకదాలు చెడు వ్యసనాలకు బానిసలు

వాగ్ధానాల తాయిలాలతో గెలుపొంది ప్రజల బాగోగులు పట్టని ప్రభుత్వాలు

సౌకర్యాల సౌధాలలో పెంచుతూ విలువల వలువలు మరచిన జనకులు

స్వార్ధ చింతన గల అధికారాలు పరుల హితమెంచక  హాలాహలం పుట్టిస్తున్న వైనాలు

కాసుల వేటలో ప్రకృతిని ధ్వంసం చేస్తూ కాలుష్య కారకులవుతున్న మానవ నైజం

అన్నింట్లో కల్తీలు ప్రజారోగ్యానికి గండి కొట్టే చిత్రాతిచిత్రమైన కార్యాలు

బాధ్యతా రాహిత్యానికి తార్కాణాలు కోకొల్లలు భాద్యతలు ప్రగతికి సోపానాలు

నిర్వర్తించే వారికి గుదిబండలు తప్పించుకొనేవారికి దూది పింజలు

భాద్యతలు కొందరికి వీడని నీడలు మరికొందరికి పట్టని బరువులు

కానీ..........

ప్రతి ఒక్కరూ.... భాద్యతాయుతులై........ కళ్ళు తెరవాలి
.. పరస్పర ఆధారిత సమాజాన బాధ్యతల చివురులు తొడగాలి

సుగంధ పూరిత ఆనందాల హరివిల్లులు పూలై వికసించాలి
స్వచ్ఛమైన నవ్య సమాజ స్థాపన జరగాలి.

సర్వే జనా సుఖినో భవంతు 🙏🙏🙏🙏🙏
[19/07, 5:01 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవితసంఖ్య :68
అంశం :జనని
తేది :19-07-2020
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :కొంత ఋణం తీర్చు
*************************************
జననీ జన్మ భూమిశ్చ స్వర్గా దపీ గరీయసి

నవ మాసాలు కడుపునమోసి
దివారాత్రాలు శ్రమల కాసి
బిడ్డను లాలించి పెంచి
తన అభ్యున్నతి కాంచి
మురియు కన్న తల్లి

బిడ్డ రూపసి అయినా కాకున్నా
సద్గుణసంపన్నుడైనా వైకల్యుడైనా
బేధ మెంచక హృదయానికి హత్తుకొని
పిల్ల కోడోలే అవాంతరాల గద్దల కాచు
అనంత రక్షణ కవచం అమ్మ

అమ్మ
మమతల కోవెల అనంత ప్రేమ జలధి
సేవ అనురాగాల నిలువెత్తు రూపం
వెలకు రాని త్యాగ రూపం

ఆమె త్యాగానికి అర్ధం నీవిచ్చే ఆదరణ చూపాలి
జీవన సమరంలో అలసి సొలసిన ఆమెకు ధైర్యాన్నిచ్చే వెలుగు నీవు కావాలి
అవసాన కాలాన ఆమెకు ఆలంబన కావాలి నీవు
అమ్మ భారం కారాదు ఆమె అమృత పానం చేసిన నీకు

తాను ఉండలేని చోట తనకు మారుగ భగవంతుడు సృష్టించిన మహోన్నత రూపం అమ్మ
అమ్మ ఋణం తీర్చకుంటే............
నీతో పాటుగా నీ తల్లికి జన్మనిచ్చిన
నీ జన్మాన్తము దాకా నీకు సకలమిచ్చి
పోషించి అనంతరం కూడ తనలో దాచి
మోక్షమిచ్చు జన్మభూమి భూమాత
ఋణమేల తీర్చెద వోయి........

జ...జన్మాన్తము వరకు యేమి ఆశించని నిష్కామి. నీ
న... నవ్వుల సుఖమయ జీవనం ఆశించే
ని... నిత్య త్యాగమయి అమ్మ

జనని, జన్మభూమి నీనుంచి ఆశించవు యేమి!!
అయినా వారి ఋణం తీర్చుట నీ కర్తవ్యం కాదా యేమి !!!
అప్పుడే... నీదు జన్మ... పొందును .... సార్ధకత...

69
[19/07, 5:36 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :69
అంశం :వైద్యం
తేది :19-07-2020
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
అంశం :వైద్యo
కవితా శీర్షిక :వైద్యులే దేవుళ్ళు

మానవశ్రేయస్సు ప్రగతిరథానికి విద్య వైద్యాలు రెండు చక్రాలు
ఆరోగ్యవంతులైన ప్రజలే దేశ ఉన్నతికి ముడి సరకులు
అలనాడు పత్యం, లంఖణంతో నయమయే రోగాలు
నేడు చిన్న రుగ్మతకే స్కానింగులూ, ఐ సి. యూ. లు
అధునాతన వైద్యవిధానాలు అందుబాటులో నేడు
ఉన్న మారాజులు ఎలాంటి చికిత్స నైనా పొందగల శ్రీమంతులు
రోగాలకు తెలియవుగా పేద ధనిక బేధాలు పేదలకు వైద్యం అందని ద్రాక్షే
నానాటికీ పెరుగుతున్న రోగాలు పల్లెలకూ విస్తరిస్తున్న కార్పోరేట్ వైద్యాలయాలు
రోగాలకే లేదుఅంతం, ఎక్కడుంది లోపం? వైద్య విధానంలో నా? వైదుల్లోనా? వ్యవస్థలోనా?
పేదలకేమో ప్రభుత్వ ఆసుపత్రులు, పెద్దలకేమో కార్పొరేట్లు, విదేశాలు, పేదల ప్రాణాలకు విలువెక్కడ?
మారాలి మన జీవనవిధానం కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారం రావాలి అందరికి అందుబాటులోకి
ఆర్జనే ద్యేయంగా యెంచక ప్రతి రంగం విలువలు పాటిస్తే పోష్టికాహారం ప్రతి ఒక్కరికి అందితే ఆరోగ్యం చేకూరదా !
ఆహారం తోనే ఆరోగ్యం ఆరోగ్యంతోనే ప్రగతి సాధ్యం
పేదైనా ధనికుడైన మధ్య తరగతోడైనా ఆర్జనలో సగంవెచ్చించేది  విద్యావైద్యాలకే
సొంతలాభం కొంతమానితే వైద్యమే అవసరంలేని సమాజ నిర్మాణం జరుగదా !
ఐనా నేటి పరిస్థితిలో ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు దేవుళ్ళ యినా వైద్యులందరికి పాదాభివందనం.
[19/07, 6:34 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :70
తేది :19-07-2020
అంశం :దాగుడు మూతలు
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :వింత ఆట
*********************************
నానిరీక్షణ ఫలితం
నోముల పుణ్యఫలం
అందాల ముఖారవిందం
అరవిరిసిన అరవిందం

గులాబీ పూలందం
గంధాల సుగంధం
తీయతేనియ చందం
మాతగమురిసిన క్షణం

ముద్దు మురిపాలు
మూటగట్టి న బుజ్జాయి
బుడి బుడి అడుగుల
గజ్జెల రావళ o దం

దిన దిన ప్రవర్ధమానం
దిగివచ్చిన శశి సమం
దిగులు బాపిన సుమం
వంశ వర్ధనవరప్రసాదం

సంతోషాల సంద్రం
ఎద ఉత్తేజితం
సదాశివుని అనుగ్రహం
ఆనందించిన మరుక్షణం

మాయమయింది ఆనందం
విధి ఆడిన వింత నాటకం
హరించింది నా దివ్య ఫలం
ముంచిన ది దుఃఖ సాగరం

ఇది దేవుని దొంగాట
సుఖ దుఃఖాల పొర్లా ట
రాగ ద్వేషాల సయ్యాట
తప్పని విధి వింత ఆట
కడుపు కోత మిగిల్చిన ఆట
ఎన్నటికీ తీరని వెత


71

[21/07, 3:25 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవితసంఖ్య :71
తేది :21-07-2020
అంశం :కరుణ
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :ఆత్మ బంధువు

కన్నపేగు పంచి జన్మ నిచ్చినావు
వెతలనెన్నో ఓర్చి పెద్ద జేసినావు
పస్తులున్న నీవు కడుపు నింపినావు
నిదుర లెన్నో కాచి సేవజేసినావు
కష్టమనక కాయకష్టము జేసి
విద్యాబుద్ధులెన్నొ నేర్పినావు
జంటపక్షి కూడా అలసి నిదురపోయే
అలుపు గాసి నీ కన్ను కాపుగాసినావు
మొక్క పెద్దదాయె వేళ్ళు ఊనుకొనుచు
పూలు పండ్ల తోడ పచ్చదనంతోడఁ
మిసిమికాంతులతోడ పరిఢవిల్లె
ఆశతోడ చిలుక గోరువంకను చేరె
ముచ్చటైన కాపురము మొదలు యాయే
నీరుపోసి పెంచిన తోటమాలి నేడు
మాలి తనము జేయ శక్తులుడి గిపాయె
తన చక్కని కాపురమ్మున పుడకాయే నీ బతుకు
ఓపలేనంటు నిన్ను వదలివేసె జనారణ్యమున
దిక్కులేని నీకు దిక్కాయె ఆశ్రమము
కరుణలేని బంధము వీధిపాల్జేసినా
కరుణ కొంత జగతి నిలిచినంటూ
ఆదుకొనిరి కాదే కరుణా మూర్తులు
కరుణకాదె.. యిలను దైవ స్వరూపము
ఆర్త జనుల కాచు ఆత్మ బంధువు.

Ch. విజయలక్ష్మి, బీర్కూర్
[21/07, 3:30 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవితసంఖ్య :72
తేది :21-07-2020
అంశం :చందనం
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :ఎంత గొప్పది
****************************
చందనం సుగంధ భరితం
చలువ నిచ్చు దాని గంధం
చెలులు చేయు పూజలందు
చేరి వుండు పసుపు కుంకాల

భగవదారాధనకది ఉపయుక్తము
అరగదీసిన గంధము శ్రేష్ఠము
సింహాద్రి అప్పన్నకు అతి ప్రియము
అగరు ధూ పము రూపాన పొందు
ఆలయాన అగ్ర స్థానము

దీని విలువ కోట్లు పలుకు
బొమ్మల కగును సరకు
చందన కట్టెల కాష్ఠము
గొప్ప వారి కీర్తి ఘనము

కవుల కవన బంధు
జంటల సరస సల్లాపమందు
పరిమళించు చందనం
హాయి గూర్చు సాధనం

మందులందు నీ స్థానముండు
ఆయుర్వేద వైద్య మందు
సబ్బుల తయారు యందు
అత్తరుల పరిమళించు
పడతుల సౌందర్య వనరులనుండు
ప్రాముఖ్యత పొంది వుండు

ఎంత అరిగి పోయినా చివరి వరకు
సుగంధమునే తాను పంచు
ఎన్నింటనో తానుండి మేలు చేయు చుండు
నరక వచ్చు గొడ్డలి కైన తావినే యిచ్చు
ప్రాణం లేని చెక్క చూపు కొండంత మంచినే
ప్రాణ మున్న మనిషేందుకు మంచినే మరచెనే
స్వార్థం పరమావధి గా పయనం సాగించునే
ఎంత హేయ మెంత బాధాకరం మదిని పిండునే.

73
వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య 38
కవిత సంఖ్య :73
తేది :22-07-2020
అంశం :-ప్రపంచ జనాభా దినోత్సవము
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :-స్వచ్ఛ సమాజం - మన లక్ష్యం

జనశక్తి ప్రగతికి మూలం జనమే బలం.. చేవఉన్నప్పుడే..... చేయూతయై, సోపానమై సాగును పయనం
ఆరోగ్యం, శక్తి, వివేకం విచక్షణ, విజ్ఞానం, విలువలున్న జనం ప్రపంచానికి బలం, ప్రతికూల శక్తులు ప్రపంచ వినాశనం
విజ్ఞాన పురోగతి పెంచిన ఆయుః ప్రమాణం జనాభా విస్ఫోటనానికి మూలం
వనరులు మితం అవసరాలు అపరిమితం మనుగడ కోసం పోరాటం ప్రోత్సహిస్తుంది అవినీతి, అన్యాయం, కల్తీలు స్వార్ధం, దోపిడీలను
కొందరి అత్యాశ, అధికారకాంక్ష, భోగలాలసకారణమౌతుంది ఇంకొందరిపాలిట ఆకలి చావులు  అణచి వేతలకు
స్వార్ధగుణమే అంకురమైతే సంక్షోభమే మొక్కై మానై వేళ్లూనుతుంది
ప్రతి ఒక్కరూ సోమరితనం, దుర్వ్యసనాలు విడనాడి కావాలి ప్రగతి పథంలో  భాగస్వామ్యులు
నాగరిక ముసుగులో పారిశ్రామికీకరణ ఉపాధితో పాటూ తెచ్చిపెట్టింది పర్యావరణ కాలుష్యం
నగరీకరణ ఫలితం వనాల నాశనం, కాంక్రీటు అడవుల నిర్మాణం, ప్రజల అనారోగ్యం
శక్తి హీనసమాజం ప్రగతి కి కాబోదు ఆలంబనం,దృష్టి సారించాలి ప్రతి దేశం పాడీ, పంట అభివృద్ధి దిశగా
లేదంటే... అసంతృప్త సమాజంలో పెచ్చుపెరుగును సంక్షోభానికి హేతువులు  సాంఘిక  విద్రోహాలు, అశాంతి, అభద్రతా భావాలు
నేటి ప్రపంచ జనాభా దినోత్సవ సందర్బంగాఉద్యమిద్దాం జనాభా నియంత్రణ అవగాహన కై,
నినదిద్దామందరం బేధాలెంచక పర్యావరణ పరిరక్షణకై, స్వచ్ఛ సంతతి నందిస్తూ అడుగులు వేద్దాం నవ్య సమాజ స్థాపనకై 🙏🙏

హామీ పత్రము :-ఈ రచన నా స్వంత రచన. పున్నమి -ఇ -కవితా సంకలనము కొరకు మాత్రమే వ్రాసితిని. ఇది ఎట్టి ఏ రచనకు అనువాదము కానీ, అనుసరణ కానీ కాదు అని హామీ ఇచ్చు చున్నాను.

 అంగీకరించగలరు.


74

వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :74
తేది :22-07-2020
అంశం :జలపాతం
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :వర్ణించతరమా.. ఆ సోయగం
*********************************************
దివి నుండి భువికి దిగిన తొలి జలపాతం
శివ ఝాటా ఝూట జనితం
భగీరధ తపః ఫల పారిజాతo పుణ్య గంగ
ప్రపంచంలోని జలపాతాలన్నీ పతిత పావని
భగీరధీ అనుంగు పుత్రికా రత్నములే ఇల
కన్నుల పండుగ చేయుచూ ఒసగె జల నిధులు

జలపాతం ----------
ప్రకృతిన అదృశ్య చిత్ర కారుని కుంచె నుండి
జాలువారిన సుందర రమ్య రమణీయ కావ్యం

ప్రకృతి ఒడిన వికసిత మై జాలు వారు మల్లెల ప్రవాహం
దివి నిండి భువి దిగిన వెన్నెల వారుణీ ఝరీ తరంగం

మబ్బుల ప్రసవ వేదనా జల్లుల స్నేహ మాలికా మాలిక
వనాల విహరిత సుగంధ గంధాల చెలిమి రంజిత

ఉరకలు వేయు ఉత్తుంగ తరంగ లహరి లీలా వినోదం
కనువిందు చేయు గిరి సోయగాల జలతారు పయ్యెద

శిలా పియోనాపై జల ధారలతీగెల మ్రోగు
అద్భుత రాగాలాపన లు
జల పాత జల జల గల గల ధ్వనీ తరంగాలు  సంగీతానికి పరవశించి నాట్యమాడు జలకన్య కరన్యాస విలసిత కంకణ మృదు మధుర నాదాలు

ప్రకృతీ మాత ఒడిని ఆనంద తాండవమాడు జలపాత కన్యల ముగ్ద మనోహర రూప లావణ్యము చూడ చాలునే వేయి కన్నులు
జల సుందరీ గాన నాట్య చాతురీ మహిమ పొగడ చాలునే వేవేల నోళ్ళు

అందుకే ---------
ప్రపంచ ప్రసిద్ద నయాగరా జలపాతఅత్యద్భుత సోయగాల వీక్షించని కన్నులు కన్నులే
ఝల ఝలల ఝo కార గాన మాధుర్యాన్ని గ్రోలని వీనులు వీనులే... !(కావుగా )

మరి వెళదామా.........
నయాగరా ఒయ్యారాలు కాంచి మురియగా
జలపాతాల కాణాచి సింహళ యాత్ర చేద్దామా
కన్నులపండుగ చేయగా...  చూచి.....
మన జన్మ సార్ధకత చేసు కుందామా.... !
75

[23/07, 6:58 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :75
తేది :23-07-2020
అంశం :వీధి బాలలు
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :భావి రథ సారథులు
*********************************
బంగరు చరితల భారతావని
శ్లాఘనీయ పూజనీయపుణ్య అవని
వ్యవసాయాధారిత అన్నపూర్ణ
జగతికి జ్ఞానమిచ్చిన జ్ఞాన భూమి
సంప్రదాయసచ్చరితల ధన్య జనని
ప్రపంచ తలమానికమైన స్వర్ణ భూమి
పరపాలన పీడితయై బానిసత్వ శృంఖలాల
విలువల వలువ వన్నె కోల్పోయిన ధర్మ ధరితి
స్వతంత్ర్యాన్ని చవి చూసి ఏటికేండ్లు గడచిపాయే
వేదవిద్యలన్నియు సమాజాన దూరమాయె
ఆంగ్ల విద్య మోహాన విలువ విద్య కరవాయే
మనో వికార మోహితులై పాపాత్ములు పెరిగిపాయె
కాముకుల దాహానికి మొలిచిన మొక్కలాయే
అనాథలైన వీధి బాలల బతుకులు యెడారాయె
చెత్త కుప్పలల్ల కుక్క లోలె మనుడాయె
చిన్న చితక పనులు చేసి చిన్న బొజ్జ నింపుడాయె
కరోనా మహమ్మారి దారికేమో అడ్డమాయె
లాకు డౌను కాలంలో కలిసిన అనుబంధాలు
దొరికిన ఆహారమె పంచుకొనే మమతలు
కడుపు కింత దొరికినంత వెలిగెను నగుమోములు
పంచు కొనుటె పరమార్ధమని యెరిగిన బాలలు
స్వార్థమెరుగని నిష్కల్మష హృదయులు
ఆదుకోవాలి దయార్ద్ర హృదయాలు
ఆదరించాలి ప్రభుత్వ అనాధాశ్రమాలు
అందించాలి అందరు అండదండలు
అభాగ్యులే కావాలి పరిమళాల విద్యా కుసుమాలు
భారత మాత ప్రియ ముద్దు బిడ్డలు
భావి భారత రథ సారథులు
[23/07, 7:31 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :76
తేది 23-07-2020
అంశం :ప్రతిజ్ఞ
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :భావి మార్గదర్శి
*********************************
ప్రపంచమంతా దృష్టి సారించేది మన భారత దేశం వైపే
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే మన సంస్కృతి వైపే
భారతీయత ప్రపంచాన తలమానికం.
కారణం...... !ప్రపంచానికి నాగరికత నేర్పిన విజ్ఞానం మనది
మన జాతీయ పతాకం
మన జాతీయ గీతం
మనజాతీయ గేయం
ఎంతో ప్రఖ్యాతి చెందినవి
వీటి సరసన సాటిగా ధీటుగా
నిలిచిన సమైక్య తా సందేశం
మన పైడి మర్రి వారి ప్రతిజ్ఞా పలుకుల మకరందం
భారత్ చైనా యుద్ధ సమయాన
చైనా వారిని తరిమి కొట్టగా
సోదర భావము పెంచగా
సుహృద్భావము కలుగునటుల
క్రమశిక్షణ, సన్మార్గములే లక్ష్యముగా
బహుభాషా కోవిదులూ
గొప్ప సాహితీ వేత్తా
దేశ భక్తి తత్పరులూ
పైడి మర్రి వారి కలము నుండి జాలువారిన
సార్వజనీనమగు తెలుగు తేనియ పలుకులు
తెన్నేటి, పీ వీ జీ రాజు వంటి మహనీయుల యత్నంతో
1964లో జాతీయ ప్రతిజ్ఞ గా స్థానమందీ
1965గణతంత్ర్య దినోత్సవ నాటి నుండీ
భారతీయ భాషలలో అనువాదము కావింపబడీ
అఖిల భారత విద్యార్థులందరి నోటా ఈనాటికీ
స్వల్ప మార్పులతో జాలువారుతున్న
జాతీయ వాద పరిమళ కుసుమాలు
దివ్య సందేశమిచ్చు మధుర దేశభక్తి గుళికలు
సనాతన భారతీయ హిందూ ధర్మ ప్రబోధితాలు
వారసత్వ సంపద పొందుటకు కిచ్చు వ్యక్తిత్వ వికాసాలు
భావి పౌరులకు చేయును దిశా నిర్దేశనాలు
సేవానిరతియే లక్ష్యంగా.....
అందరి యెడల గౌరవ భావం పెంపొందేలా....
పరుల శ్రేయస్సే తమశ్రేయస్సుగా........
భారతీయుల గుండెల్లో తలపుల విత్తులు నాటే బీజాక్షరాలు
ప్రతినలోని ప్రతి పలుకూ వేదమై...
అందరి హృదయాలనేలు మంత్రాక్షరాలు...
అనుసరించదగు మార్గాలు....
ప్రపంచాన మన దేశాన్ని అగ్ర స్థానాన నిలిపే...
మహోత్క్రుష్ట భావ జాల తరంగాలు..
ఆ మహా వ్యక్తి యునికి చాట గా
మహాయజ్ఞమే జరిగె నాయె
పైడి వారి నామము 2016వరకు తెలియదాయె
వారి ఖ్యాతి చాటుట మన కర్తవ్యం కాదా... !
భారత రత్న బిరుదు కు అర్హుడని ఉద్యమిద్దాం.....
ఘనత ను వ్యాపింప జేసి వారి ఋణం తీర్చుదాం....
అనుసరణే జీవన ధ్యేయంగా చేసుకుందాం...
అదే.... అదే... ఆ మహనీయునికి......
మనమిచ్చే..... నిజమైన... నివాళి.... కాదా..... !
77

78

79
వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య 38
కవితసంఖ్య :79
తేది :25-07-2020
అంశం :ప్రేమ
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :మరువగలనా !

ప్రియా....
నేనంటే ఇష్టమన్నావు...
నాతోనే నీలోకమన్నావు...
నామాటే నాదమన్నావు....
నాచూపే వెన్నెల వర్షమన్నావు...
నాకోసమే నీ తపమన్నావు....
నాపూజకై వేచానన్నావు...
నేనులేక నీవు లేవన్నావు...
కులం, మతం అడ్డు రావన్నావు..
భాషా బేధం లేదన్నావు.....
ఒకరికొకొరం తోడన్నావు...
ఐనా నన్ను వీడిపోయావు...
నీ నీడగా నే మిగిలిపోయాను..
నాలో నిన్నే చూసుకుంటూ...
నీ ప్రేమను నాలో బ్రతికించుకుంటూ...

హామీ పత్రము :-
ఇది నా స్వంత రచన, దేనికి అనువాదము కాదు
80


81

[28/07, 11:23 AM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :81
తేది :28-07-2020
అంశం :-తపస్సు
పేరు :-సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :-టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :-తపస్సు.. నాడు... నేడు
***********************************
కార్య సాధన యందొనర్చు బహు దొడ్డ యత్నం
అలనాడు...........
గంగనుభువికి దించిన భగీరథ యత్నం
మహర్షుల పరమ పదసోపాన మంత్రం
సురల వరములందు సులక్షణ యజ్ఞం
రాక్షసుల కాంక్ష లీడేర్చు రాజమార్గం
మోక్ష ప్రాప్తి నొసగు మేలైన రూపం
భవ బంధాలు బాపుభవ్య మగు తీరం
మార్కెo డేయుని కాయువు పెంచిన అమర యాగం
మూఢుని జ్ఞానిని చేసిన జ్ఞాన దీపం
ఎన్నో.. ఎన్నెన్నో.. తార్కాణాలు.. గతంలో..
తపస్సు సాధించిన అద్భుతాలు.........
మరి.. నేటి.. ప్రపంచంలో.. చేసే.. తపస్సు....
ప్రేయసి ప్రేమకోసం.. బిడ్డకు యల్. కె. జి. సీటు కోసం
ఉపాధి కోసం.. ఉపాధి నిలుచుట కోసం..
కార్పొరేట్ చదువు కోసం.. రేంకుల కోసం..
సర్వ దర్శనం కోసం.. సర్వ సౌకర్యాల కోసం
కొందరు పిడికెడు బువ్వ కోసం....
ఇంకొందరు తిన్నది అరగడంకోసం.....
కొందరు బతకడం కోసం...
ఇంకొందరు డాబుగా బతకడం కోసం...
ఓటుకు నోటు కోసం....
నోటుకిచ్చిన సీటు కోసం....
నీతికి నిలుచుట కోసం... నీతిని తొక్కుట కోసం
ఎన్నో.. ఎన్నెన్నో... చెప్తూ పొతే తరగవుగా...
నాడైనా.. నేడైనా....
మంచోడు.. చెడ్డోడు..
వారి వారి.. దారుల్లో...
వారి వారి కోర్కెల కోసం....
చేసే స్తారు యెంత టి ప్రయత్నమైనా...
అదేగా తపస్సు.... మంచికి దారితీస్తే.. శుభమే...
కాకుంటే... అనర్ధానికి.... హేతువే.... కాదా....
ఉందిగా... నిదర్శనం.....
నేటి కరోనా... పుట్టుక.. వ్యాప్తి... కలిగిన ప్రాణనష్టం.. చైనా కు పుట్టిన పేరాశ... ఫలితం..
నేడు సమస్త లోకం చేసే కొరోనాతో యుద్ధం... చేయాలి
సమిష్టి స్వీయ నియంత్రణ తపస్సు.....
కరోనా నశించాలి... మన తపో ఫలంగా...
కనుగొనాలి శాస్త్ర వేత్తలు కరోనా వాక్సిన్
విలసిల్లాలి.. మానవాళి... ఆరోగ్య వంతంగా.. పూర్వంలా......
82
[28/07, 11:39 AM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య 38
కవిత సంఖ్య 82
తేది :28-07-2020
అంశం :తీరని కోరిక
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :కాదు అసాధ్యం
*************************
సమసమాజం రావాలంటే బేధాలు తారతమ్యాలు పోవాలిగా.... !
పేదరికం నిర్మూలించ బడాలంటే.. దానగుణం వెల్లివిరియాలిగా... !
వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాలు ఉండ కూడ దంటే
ప్రేమ, ఆప్యాయతానురాగాలు వర్దిల్లాలిగా.... !
నిజాయితీగా ఉండాలంటే.. వ్యక్తిత్వ విలువలు వృద్ధి చెందాలిగా.... !
సుపరిపాలన వర్ధిల్లాలంటే... ప్రజా వికాసం అవసరమేగా..! ఆశలు చిగురించాలంటే.ఆనందం హరివిల్లు కావాలంటే.. స్వార్ధం విడనాడాలిగా... !
అభివృద్ధి చెందాలంటే.. సోమరితనం వీడి కష్టించే నైజం పెంపొందాలిగా... !
రుణాత్మాక గుణాలు వీడి.. ధనాత్మక గుణాలు పెంపొందితే
కాదా విశ్వం సంతోషదాయకం
వసుధైక కుటుంబం రాదా.... !ఇదే. ఇదే.. తీరని కోరిక....
ప్రయత్నిస్తే... కాదుకదా ... !అసాధ్యం...
అసాధ్యమైనా.... కాదా..... !సాకారం... !
మనమంతా నడుం బిగించి సాగితే తీరని కోరికకూడా.. తీరునుగా...


83
[28/07, 3:11 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :83
తేది :28-07-2020
అంశం జాజిపూలు
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :అన్నింటా.. నీవే... !
********************************
జాజి పూవు రేరాణి
శ్వేత వర్ణ పూబోణి
పరిమళాల విరి బోణి
మల్లెల జత రాణి

గ్రీష్మ తాపాన్ని బాపు చల్లదనం
పండును ఆలు మగలదాంపత్యం
ప్రేమ జీవులపెంచు విరహం
పెంపొందించును అతివల అందం

వెన్నెల రాత్రులచందమామనే
తారకవై యిలకు రప్పింతువే
నీ తావి మాయ మోహితుడై
ఆ శశియే తారల విడిచి రాడే !

శ్వేత వర్ణ చీర కట్టి
జాజి పూలు జడను బెట్టి
అందానికి పుటం పట్టి
పడకటింట కాలు బెట్ట
మగని హృదిని పట్టి పట్టి
వలపు శరము మదిని గుచ్చి
తీయని బాధ రేపి రగిల్చి
వలపు వీణ పలికించి
ఆనందాల తీరం చేర్చు

రసికతకు మాత్రమే చిహ్నానివి కావే
ఆధ్యాత్మిక లోనూ ప్రధాన పాత్ర నీదే
పూజలో నీవున్న ఇంకేమి లోటు లేదే
పూజా వ్రతాల నీవు లేకున్నలోటు కాదే
పెళ్లి పేరంటాల నీ ఉనికి చాటు నీ సుగంధమే
పన్నీరు అగరబత్తీ సెంటుల నీకే ప్రథమ స్థానమే
అలంకరణ సామాగ్రిలో నేవుండి అతివల అందం పెంచేవే
ఆయుర్వేదం లోను నీ స్థానం పదిలమే
ఎన్నో చిన్న రుగ్మతల చిట్కాల రూపానివే
ఓ జాజమ్మా.. నీ రూపం.. నీ సుగంధం
నీ అత్యద్భుత గుణాలే నిన్ను అగ్ర స్థానాన నిలిపేనే
నీకు నీవే సాటి లేవే......... !!
84
[28/07, 4:18 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య 38
కవితసంఖ్య 84
తేది :28-07-2020
అంశం :మాతృ భాష
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
కవితా శీర్షిక :ఉగ్గుపాల భాష
*******************************--

మాతృ భాష యన్న తల్లిపాల భాష
ఉగ్గు పాల తోనే మాట నేర్వగా వచ్చును

మాతృ ప్రేమ మరచి పోత పాలకొరకు
పరుగులెత్తి నీవు భంగ పడకు

అమ్మ భాష నీకు ఆకారమునునిచ్చు
చక్కగాను విషయమిశద మగును

తీయతేనియలూరు తల్లిభాష కాదె !
మమతతో మది నింపు మధుర పాయసమ్ము

తొలుత నేర్చినంత మాతృభాష మహిమ
పరభాష నేర్చుట సులభతరము

నీది యన్న భాష కూరిమి బెంచును
పరభాషదెప్పుడు సవతి ప్రేమే... !

మాటలాడుమెపుడు మాతృభాషలోన
పరభాష నుండునా.... !పెన్నిధెపుడు

ఇతర భాషలయందు యిష్టముండగవచ్చు
మాతృభాష యందు మమత బెంచు

మాతృభాషయన్న ప్రకృతంతస్వచ్చము
జీవమిచ్చును  గాదె జనులకంతా..... !

అవసరార్ధము వలయు పరభాష చాలదా... !
మధువులొలుకు మాతృభాష మిన్నయేను
85

[29/07, 12:53 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :85
తేది :29-07-2020
అంశం :స్నేహం
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :కలిసేదెన్నడో?

చిన్న పొరపాటు... సృష్టించింది అగాధం
రేపింది... అపార్ధాల మేఘం.... !
నిద్రపోని రాత్రులెన్నో నీకోసం పరితపిస్తూ...
చకోరాన్నై ఎన్ని ఎదురు చూపులో....
నీ చల్లని పలుకు కోసం ఎన్ని పలవరింతలో..
నీ సాంత్వనలో సేదతీరాలని ఎన్ని ఆశలో....
నీ శ్వాస నాకాలంబన కావాలనీ...
నీ నడక నాతో జతవ్వాలనీ.....
జీవనపర్యంతం కలిసి సాగాలనీ...
నాలోని ప్రతి ఆలోచన నీ కోసమే ననీ...
నాప్రతి అడుగు నీ సాంగత్యం కోసమనీ...
నీవు దూరమైన క్షణం నుండీ....
నామనసు నీకై తపన పడుతోందనీ...
నీవు లేని జీవితం శూన్యమనీ....
ఎలా... !తెలుపను... నేస్తం....?
నిన్ను చేరాలనే... నా ఆశ... తీరేదెన్నడో...?
అపార్ధాల మేఘాలు తొలగేదెన్నడో....?
ఆప్యాయతల కాంతులు ప్రసరించేదెన్నడో...?
నీ స్నేహ హస్తం.. అందుకొనేదెన్నడో...?

ఇది నా రచన నా స్వంతం. ఎట్టి అనుకరణ, అనువాదము కాదు.
[29/07, 1:47 PM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య 38
కవిత సంఖ్య :86
తేది :29-07-2020
అంశం :తూనీగ
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :రక్షణ తక్షణ కర్తవ్యం
**********************************
పంట పొలాలపై
పండ్ల తోటలలో
పూలు వివిధాలైన
పులకితలై వాలి
పరువులెత్తు పరువాలు
పరోపకార జీవులు

వర్షాగమనసూచనలు
రైతుల కన్నుల వెలుగులు
చిరుతల కాహ్లాద కారకాలు
ఆటల మురిపించు మువ్వలు

నీరాక తొలకరుల స్వాగతాలు
నాందిపలుకు ఏరువాక పనులు
ఫల సాయం పరుగు మొదలు
విరియు పుష్ప నక్షత్రాలు
పొందేవు పుప్పొడుల పొందు
ఫలవరాల నిచ్చు నీదు సంకల్పము (పరాగ సంపర్కము )

పండించును సిరుల పంటలు
భుక్తి కిచ్చు ఘన వరాలు
సంపద కూర్చు సోపానాలు

అత్యాశతో మానవుడు
అవలంబించెను వికృత వికారాలు
మరచెను ప్రకృతి పద్ధతులు
మన నేటి సస్య రక్షణ విధానాలు
మన ప్రకృతి మాత విరోధకాలు
చాస్తున్నవి కాలుష్యపు విషకోరలు
మాయమౌతున్న వి మన
రైతు స్నేహ సౌరభాలు
అవునవే సాగుకు ప్రతి బంధకాలు
ప్రకృతి పయన కంటకాలు
రప్పించును రైతు కంట రక్త కన్నీరు
పరోక్ష పీడన జ్వాలల ప్రజల పాలిట శాపాలు

ఆగాలంటే సాగించాలి
సేంద్రియ వ్యవసాయం
కాచుకోవాలి మనప్రకృతి మిత్రుల
రక్షించి పొందు రక్షణ
భుక్తికి... కరువు రాకుండా...
తస్మాత్.. జాగ్రత్త...
ప్రకృతి రక్షణలో..
మిత్ర జీవుల రక్షణ లో....
కాలుష్య నివారణలో....
దాగిఉంది...... నీ స్వీయ రక్షణ.

రక్ష్యో రక్షతి రక్షితః
87
వీరాస్ కవి సమయం 
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :87
తేది :30-07-2020
అంశం :కాలం 
పేరు :ch. విజయలక్ష్మి 
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి 
శీర్షిక :కాలమా... కనికరించు 
***********************************
కాలమా..... !ఆగిపో.... !
కనికరించి.... తిరోగమించు.... 
నా బంగరు బాల్యంలోకి.... 
కల్లా కపటం ఎరుగని ప్రాయంలోకి... 
అమ్మా, నాన్నల ప్రేమవాహినిలో మునకాలేయనీ.... 
తోబుట్టువుల అనురాగలహరిలో తేలియాడనీ... 
గిల్లి కజ్జాల సుమధుర గతంలో మయూరినై నాట్యమాడనీ.... 
స్నేహితుల సరదాల సందడి పల్లకిలో ఊరేగనీ.... 
యే చీకూ చింతా లేని హాయితో మనసారా నవ్వనీ.... 
స్వేచ్ఛా విహంగాన్నై మేఘమాలికలతో పోటీ పడనీ.... 
ఆనంద సాగర తీరంలో మధుర క్షణాల ఇసుకరేణువులతో... 
సంతోషాల గూడుకట్టి హరివిల్లు రంగులేయనీ... 
తీయతేనియల మకరంద మాధుర్య మహిమ తెలియనీ...
సాధ్యమే.... !నీకు.... !. కాకున్న....? 
కాలమా..!. కాఠిన్యాన్ని కరిగించు....కో కో... . !
ఈ ఒక్క వరాన్నయినా .... !ప్రసాదించు.... !
నా సురక్షిత మాతృ గర్భ కోటలో... ఒదిగి దాగేందుకైనా.... 
కరుణతో... అనుగ్రహించు..... !
88

[04/08, 9:33 AM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం 
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :88
తేది :04-08-2020
అంశం :తాళిబొట్టు 
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి 
శీర్షిక :ప్రేమే నిలుపును బంధం కలకాలం 
**********************************
ఇరు తనువుల కొక మనసై 
ఇరు మనసుల కొక తనువై 
కుటుంబాల వారథి యై 
జతగ జేయు పవిత్ర బంధం 
మనసుల ముడి వేయు మంత్రం 

దాంపత్యానికి పూలదారి 
వంశాభివృద్ధికి రహదారి 
ప్రేమాభిమానాలకు పునాది 
త్యాగాల కొసగు పరమావధి 

పడతుల సౌభాగ్య చిహ్నం 
ఇంతుల కొసగు గౌరవం 
అతివలకు ఆరోగ్య దాయకం 
మహిలో మహిమాన్వితం 

కష్టాలలో తోడుండే కలిమి 
సుఖాలలో పెంచును బలిమి 
ఎన్నడు వీడని చెలిమి 
వీడినా వాడని పసిమి 

మగువకు మంగళ ప్రదం 
మగనికిచ్చు ఆయుః ప్రమాణం 
అనాదిగా అతివకు రక్షణ కవచం 
అమానుషాల నడ్డగించు ఆయుధం 

సావిత్రి మృత్యువుతో పోరాటం 
సుమతి ఆపింది సూర్యోదయం 
సతి పతి కోసం దేనికైనా సిద్ధం 
తన మాంగల్య రక్షణ కోసం 

ఆలు మగలమాంగల్య బంధం 
ఆజన్మాo తం చెరగని స్నేహం 

ఒకరికొకరు తోడై నీడై నిలిచిన
మనసున మనసై మెలిగిన 
విడదీయ గలవా యే ప్రతి బంధకాలు 
మగని విడచి మగువ మనగలదా.... 
మాంగల్య మహిమ తెలియనిదా.... 
గుండె లోతుల్లో కి దూరి తీయని పాశమై 
మగని దైవంగా గుండె గుడిలో ప్రతిష్టించి 
కొలుస్తుంది సతి పతి ప్రేమకు బానిసయై 
పరస్పర అనురాగము నిలుపుతుంది సుమా... !
వారి బంధం నిలుచును కలకాలం నిత్యమై 
ఏడేడు జన్మల అనుబంధమై....... 
89
[04/08, 9:44 AM] Vijayalakshmi Ch KS 38: వీరాస్ కవి సమయం 
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :89
తేది :04-08-2020
అంశం :తనయ
పేరు :ch. విజయలక్ష్మి 
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి 
శీర్షిక :ఆధారం 
*************************
అనురాగ తరువుల వికసిత పుష్పం 
అందించు ఆనందాల కల్ప వృక్షం 

నట్టింట నడయాడు శ్రీ మహాలక్ష్మి 
ప్రేమానురాగాలు వర్షించు పాలవెల్లి 

అమ్మానాన్నలకు చేదోడు వాదోడు 
అనుజుల తో చేసేను సై అంటు సవాలు 

సంప్రదాయసిరులవెలయు సుగుణ రాశి 
మమతానురాగాలమరుల రాణి 

ఆడపిల్లగ పుట్టినా ఆడపులి వలె పెంచ వలె 
అన్నింట రాణించు నేర్పు నేర్పవలె 

కూతురంటే కాదు కన్నవారికి బరువు 
కాపాడు ఆమె మన యింటి పరువు 

పుట్టింట యువరాణి యై వెలిగిన పూబోణి 
అత్తింట మహారాణియైయు సేవలందించు 

అత్తింటి పుట్టింటి బంధాల వారథి 
బరువు భాద్యత మోయు కుటుంబ సారథి 

ఆడపిల్లన్న గుండెలపై కుంపటి నాటి మాట 
ఆడపిల్లన్న ఆదిశక్తి అన్నది నేటి మాట 

అన్ని రంగాల మగధీరుల సాటి 
సహన శీలతలో లేరెవరు మేటి
90

వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :90
తేది :04-08-2020
అంశం :తిలకం
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :-ప్రకాశతిలకాలు
********************************
గగనానికి  సూరీడు పగటి బొట్టు
తిమిరాన్ని తరిమేటి శశి రేయి బొట్టు

కీర్తనలమేటి అన్నమయ్య కీర్తనలు
సంగీత ప్రపంచాన్ని ఏలిన కళాకారులు

నటజగతి ప్రఖ్యాత నటీనట గణమ్ము
హాస్యానీకే హాస్య మొసగు హాస్య బ్రాహ్మలు

యముని నిరోధించు వైద్య శిఖా మణులు
అలరించు చిత్రాల చిత్రించు చిత్రకారులు

నటరాజ పాదాల విరిసిన నాట్య విరులు
కవితల మేల్కొలుపు కవి లోక వరులు

దేశాన్ని రక్షించు వీర జవానులు
దేశ భుక్తి దాతలగు రైతు మిత్రులు

ప్రజల సేవల తరియించు సేవాపరాయణులు
అనాధల అక్కున చేర్చు ఆపన్న హస్తాలు

కొంగొత్త ఆవిష్కరణల పాటుపడు శాస్త్ర వేత్తలు
భాధ్యత మోసేటి బాధ్యతా బద్దులు

వివిధ రంగాల ఖ్యాతి గాంచు విజ్ఞాన కాంతులు
దేశాన్ని అగ్ర స్థానా న నిలిపేటి కృషీ వలురు

నేటి కరోనా తో యుద్ధం చేసేటి ప్రతి ఒక్క వ్యక్తి
ఎప్పటికి ప్రకాశించు సింధూర తిలకాలే.

లోకాన ప్రసిద్ధ మైన ప్రతీది దర్శించ దగిన
స్మరణీయ పూజనీయ తిలకమే.
91

92

వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :92
తేది :06-08-2020
అంశం :ప్రకృతి
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :నిండైన సౌందర్యం
********************************
ప్రకృతి అందాలు పరవశింప జేసేను
అందాల వనాలు అలరించు మనసులు
పుష్పాల సువాసనలు హాయి గొలిపేను
నీలాకాశంలో సాగేటి ఆ వెండి మేఘాలు
వివిధ వర్ణాల వివిధ రూపులు దాల్చీ
కన్నులకు పండుగలు చేసేను చూడు
వేకువ అందాలు వర్ణించ తరమా... !
సెలయేటి గల గలల మధుర సంగీతాలు
తామరలు నిండిన పల్లెల చెరువులు
ప్రభాత గీతాలు పాడేటి చిన్నారి చిలకలు
కిచ కిచ ధ్వనులతో తిరిగాడు పిచుకలు
కమ్మని స్వరముల గండు కోయిలలు
వీచేటి గాలుల ఇంపైన నాదాలు
కురిసేటి వానలు విరిసేటి హరివిల్లు
సంద్రపు అలలు పొడిచేటి సూరీడు
పండు వెన్నెల కాయు నిండు పున్నమి రేడు
పచ్చని పంటలు ప్రకృతి సోయగాలు
వైవిధ్య మైనట్టి జీవజాలపు సొగసు
ఒక్కటా.. !రెండా... !అనేకానేక దృశ్యాలు... !
మనసునాహ్లాద పరచేటి  సుందర దృశ్యాలు
అలౌకిక ఆనందాన్నిచ్చు లౌకిక ఆనందాలు
ప్రకృతిని మించిన సౌందర్యం కలదా ఈ ఇలలో... !
నిండైన ఆనందం అనుభవo లోనేగా తెలిసేది... !
93

వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవితసంఖ్య :93
తేది :07-08-2020
అంశం :జారుడు బల్ల
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :పోరాటం
***********************************
ఆశల ఆకాశపు అంచులకై తహ తహ
అహర్నిశలు ఆరాటం జీవన పోరాటం
అలుపెరుగనిప్రయాసల సమర సమాహారం
అంధకారం చీల్చే వెలుగు రేఖ కోసం
ఆశగా ఎదురు చూసే మానస సరోవరం
ఆశయాల శిఖరాలు చేరు వయ్యే వేళ
అడియాశ పాశాల పాముల కుహరం లోకి ప్రయాణం
అయినా ఆగదు ఆశయాల జీవన పోరాటం
అడుగడుగునా అవరోధాలు ఎదురైనా
అవాంతరాల వేడి సెగలు కాల్చుతున్నా
ఆపక ప్రయత్నించి ఎత్తుకు ఎదగాలన్నా
అవరోధ సర్పాల కాటుకు ఎదురీదుతూనే వున్నా
అంతులేని ప్రలోభాల జారుతున్నా
అణచలేని ఆవేశ సంద్రాల అలల తేలుతున్నా
అంతులేని అక్రమాల దిగ జార్చే
అనంత కోటి దుర్మార్గపు దారులపడకుండా
కర్తవ్యపు అంచు పట్టుకు జారకుండా ఎగబ్రాకాలని
పాతాళ లోతుల్లోకి పడకుండా వుండాలని
ఆశలతో ఆరాట పడుతూనే వున్నా
అందుకుని చేరాలని స్వచ్ఛ సమాజ నిర్మాణం వైపు
అడుగులు వేస్తూనే వున్నా..
అత్యుత్సాహం తో అలుపెరుగకుండా...
ఆశయ సిద్ధి సాధనలో.. అజేయుడిగా ఎదగాలని...
అనితర సాధ్యమైనా.... సుసాధ్యం చేయాలని
అకుంఠిత దీక్షతో... ముందుకు సాగుతూనే వుంటా...
94

వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :94
తేది 09-08-2020
అంశం :ప్రకృతిని రక్షించు
పేరు :సి. హెచ్. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :భవిత... నీ.. చేతిలో....
*************-**********************----******
ఏమా చిత్రమూ... కడు విచిత్రము....
పరవశింపజేసే పచ్చని పైరులు
మురిపించే వెండి మబ్బుల వినీలాకాశం
స్వేచ్ఛగా విహరించే ధవళ కపోతాలు (శాంతి చిహ్నాలు )

భూమండలాన్ని భుజ స్కంధాలపై భరిస్తున్నానని భ్రమ పడే బడుగు మానవుడు
భూమి తన చేతి చెండ నుకుంటున్నాడా.. !మానవ మాత్రుడు. !
పుడమి తల్లి పచ్చగుంటేనే తాను పచ్చగుంటానని మరచిన పశు ప్రాయుడు

పచ్చదనాన్ని పాతర వేసి తానే మోడైన మూఢుడు
అమృత ధారల్ని పాతాళానికి పాతరేసిన పాతకుడు
ఆశల పుట్ట గొడుగుల్ని అడ్డుకోలేని అధమాధముడు
అధికుడనని విర్రవీగే తను పరాధీనుడనని ఎరుగని అమాయకుడు

రేడియేషన్ పెంచుతూ కాలుష్యాల కాసారంలో కొట్టుకు పోతున్న రోగ పీడితుడు
తన ఉనికికే ముప్పు తెచ్చుకొంటున్న నాగరిక మేధావి

మానవా.... మేలుకో... కాలాతీత మౌతోంది......
విపరరీత బుద్ధులతో మోడుబారిన జీవనాన్నివివేచన నీట  చిగురింపజేసుకో.....
నీచేతుల్లో... నీచేతల్లో.... నీ... బంగరు భవిష్యత్తు....
కాలుష్యకోరలు పేకేయ్...
భూగర్భ జలం పెంచు....
భూమి ని హరిత మయం చేయ్....
సకాలవర్షాలకు మార్గం సుగమం చేయ్....
భూ మాత తన బిడ్డను చూసి గర్వించేలా నడచుకో...
పుడమి తల్లి కన్నీరు తుడిచేయ్...
ఆమె చల్లని ఒడిలో హాయిగా నిదురపో...
నిశ్చింతగా నిర్భయంగా జీవించు....
ఆనందావని ఆనందం లో నీవు ఓలలాడు..
అప్పుడు కదా... స్వర్ణ భవిత.......
ఆలోచించు... పధకం వేయ్.. పాటించు...
సాధించు.... విజయం....
నాడే.. నీవు.. నిజమైన... ధరణి... పుత్రుడివి.....

95

వీరాస్ కవిసమయం
క్రమసంఖ్య :38
కవితసంఖ్య :95
తేది :10-08-2020
అంశం :మిన్న యైనది
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :దేశరక్షణ
*********************************
ఓ ప్రియా.... !ఎక్కడున్నావోయి...?
నాపిలుపు వినలేని దూరాన ఉన్నావో... !
నావిరహ వేదనే తెలియకున్నావో... !
క్షణ క్షణము నీ తలపు నా మదిని
వీడలేకున్నది...
నీ మాట నాదమై...నీరూపు రమ్యమై...
నాచెంతనున్నది...
నీవు లేవన్న చింత మనసు..
మోయలేకున్నది...
నీ అనురాగమే.. నాపాలి సుధయై
బ్రతికించుచున్నది....
దేశరక్షణయే.. జీవనలక్ష్యంగా...
సాగిపోయే...నీవు..
ఎన్నటికి... నామదిపీఠమున...
నెలవైన దైవము.....
సరిహద్దు న పెట్టని కోటయై.. వైరులను దునుమాడి...
మాతృభూమి  సేవలో.. తరియించు వీరుడా... !
నీకన్న సరి ఎవరు? ఈ జగతి నందున.. !
నీ సేవలో.. నన్ను తరియించనీ...
నీవంటి.. వీరుణ్ణి.. మనదేశానికివ్వనీ.... !
మన పేరు నిఖిలమై... జగతిలో నిలువనీ..... !
దేశసేవకన్న... మిన్న ఏమున్నది...?

96

వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవితసంఖ్య :96
తేది :11-08-2020
అంశం :విశ్వశాంతి
పేరు :ch. విజయలక్ష్మి,
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :మానవ నైజం మారాలి
**************************************
మనిషి  స్వార్ధం,  అధికార కాంక్ష, భోగలాలసలతో
మృగమై చరిస్తుంటే...

స్వలాభాపేక్షతో ఎంతటి మారణకాండకైనా
తెగబడుతుంటే.......

మానవత్వం మరిచి రాబందుల్లా పరులను
పీక్కుతింటుంటే........

నీతి, నిజాయితీ దయాదాక్షిణ్యాలు ఇసుమంతైనా లేక
ఇగిరిపోతుంటే....

పేదల ఆకలికేకలు ఆకాశాన్నంటుతుంటే
మానవత్వపు ఛాయలు నల్లపూసలైపోతే

వ్యవస్థలన్నీ కట్లు తెగిన ఆబోతుల్లా వీరంగాలాడుతుంటే

ఎల్లలు దాటుతూ కవ్వింపుల కదంతొక్కి
మారణహోమాలతో దేశాలు నిత్య కాష్ఠ మై రగులుతుంటే

కుటిల రాజాకీయ కోటల్లో నేతలు కులాసాలు పోతూ
ప్రజా క్షేమం పెట్టకుంటే...

ఓ విశ్వశాంతి పుంజమా.. !ఓ తేజోమయ రూపమా.. !
నీ ఉనికి... నేనెక్కడ....? వెదకనూ..!

సకల ప్రజలలో సౌబ్రాతృత్వం వెల్లివిరిసిననాడు

సర్వేజనా సుఖినోభవంతని ప్రతిఒక్కరూ...
నినదించిననాడు...

సర్వదేశాలు పరస్పర సహకారమే ఊపిరై
మనగల్గిననాడు...

కలహాలకు స్వస్తి చెప్పి సామరస్యం
వృద్ధినొందిననాడు......

విశ్వశాంతి హరివిల్లై విశ్వాన వెలుగు నింపునుగా... !

హామీ :ఈ వచన కవిత నా స్వీయ రచన. ఎట్టి అనుకరణ, అనువాదము కాదు.
97
వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :97
తేది :12-08-2020
అంశం :పాడి పంట
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :నిన్ను నీవు మార్చుకో... !
***********************************
పల్లెసీమలు భాగ్య సీమలు జనుల
జీవనాధారాలు
పాడిపంటలున్న పల్లెలు పచ్చని లోగిళ్ళు
ప్రగతి సోపానాలు

సిరుల మాలక్ష్ములు ఆకలి తీర్చు అన్నపూర్ణలు
పాడి పంటలే కాదా... !వివిధ పరిశ్రమల కాధారం

పాడి పంటలుoటేనే విలసిల్లు జగతి కలకాలం

పెరిగిన విజ్ఞానంతోడ వికృత చేష్టల
మానవుడే... !
ప్రకృతికి శత్రువు తానై కాలుష్యము
సృజియించె.... !

కాలాలు మారిపాయె వర్షాలు పడవాయె జల  వనరులింకిపాయే పంటలేమొ పండవాయె

కష్టించే రైతన్నకు జరుగుబాటు లేకపాయె
పచ్చగడ్డి కరువైపాయె  పశుపాలన పరమ
కష్టమాయె

నాగరికత పేరుతో పొలాలేమొ తరిగిపాయె  కట్టడాలు పెరిగిపాయె
జనాభాకు సరిపడే గ్రాసమేమొ దొరకాదాయే
దుర్మార్గము పెరిగిపాయె

నవీన పద్దతులల్ల వ్యవసాయం సాగుడాయె కల్తీలకు నెలవాయె

హార్మోనుల వాడకంతో పాలపెంపు సాధ్యమాయె
మానవ గతి తప్పెనాయె

కలుషితఆహారం సేవనాన మనుజులు
ఆరోగ్యము కోల్పోయె
అనారోగ్యసమాజము ప్రగతికి ప్రతిబంధ కాలై,
నిస్తేజము కాదా... !

మేలుకో... !మానవా... !
నిన్ను నీవు మార్చుకో... !జల
సిరులను పెంచుకో... !
సేంద్రియ వ్యవసాయమే శ్రేష్ఠమని
తెలుసుకో.. !
పాడిపంట పెరిగితేనె.... !
నీ మనుగడ అని  తెలుసుకో.!
విజ్ఞానము చేటు కాక చూసుకో... !
భూమి పైన నీ ఉనికిని... నువ్వే
కాపాడుకో.... !

హామీ :ఇది నా స్వీయ రచన.  ఎట్టి అనువాదము, అనుకరణ కాదు... ch. విజయలక్ష్మి గారు
98

వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవితా సంఖ్య :98
తేది :13-08-2020
అంశం :సంతోషం
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :నిజమైన సంతోషం
*********************************
అనాగరిక మానవుడు ఆనాడు
ఆకలి తీరుటకై పడ్డాడు పాట్లు

నాగరిక మానవుడు నేడు
ధనాశతో చేస్తున్నాడు ఫీట్లు

నాగరికత ఏం నేర్పింది...?
సుఖంగా జీవించడమా...
సంతోషంగా ఉండటమా...
రెంటికి తేడా తెలుసుకోవటమా....

సంతోషం ఎక్కడుంది....?
డబ్బులోనా........ !
మిలియనీరైనా పొందలేకపోవచ్చు
అధికారంలోనా......... !
ఏకఛత్రాధిపతులైనా సంతోషంగా లేరే ఎల్లవేళలా
చదువులోనా........ !
విజ్ఞాన ఖనులైనా తనువు చాలించారే అశాంతితో
అందంలోనా.......... !
సౌందర్య వంతులెందరో దేహ త్యాగం చేసారే మానసికక్షోభలతో

సంతోషాలకు ఏది మూలం....?
ఆత్మానందమేగా.. సంతోషం
సంతృప్తి నిచ్చేదే... సంతోషం

పసిమొగ్గలకు ఆటల్లో..
యువకులకు కలల సాకారంలో....
దంపతులకు సంతానక్షేమంలో....
ప్రకృతి ఆరాధనలో.....
ప్రకృతిలోని ప్రతి దృశ్యంలో....
దైవార్చనలో... తీర్ధయాత్రల్లో....
సృజనలో...
పరోపకారంలో..
అసంతృప్తి ని జయించటంలో...
ఆత్మీయత పంచుకోవడంలో....
భయాలను చెరిపేయడంలో...
నిస్వార్ధ సేవలో.....
ఎదుటి వారిలో ఆనందం చూడడంలో...
ఉచిత మైన సంపాదనలో....
ప్రేమ పంచడంలో.....
పగ త్రుంచడంలో....
కష్టాల నధిగమించుటలో....
ఆరోగ్యం కాపాడుకోవడంలో....
విద్యుక్త ధర్మ రక్షణలో.....
మానసిక శాంతి సాధనలో....
మనోభావాల నియంత్రణ లో
ప్రశాంత జీవన యానంలో....
ఉన్నంతలో సంతృప్తి చెందుతూ....
అందరి శ్రేయస్సు కోరుతూ....
జీవన యజ్ఞం చేసిననాడు......
అంతర్యామి తో అనుసంధానమే....
శాశ్వతమని ఎరిగిననాడు....
జీవ కారుణ్యాన్ని చూపిననాడు.....
సుఖదుఃఖాల సమభావన కలిగిననాడు.....
మానసికోన్నతికి దారులు తెరచిన నాడు....
జీవితమే కాదా.. అమృత మయం...
అదే... అదే... నిజమైన సంతోషం
99

వీరాస్ కవి సమయం
క్రమసంఖ్య :38
కవిత సంఖ్య :99
తేది :18-08-2020
అంశం :కాగితం
పేరు :ch. విజయలక్ష్మి
వివరాలు :టీచర్, బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :కాగితం- నేడు- రేపో?
*********************************
కాగితమా.... !ఓ.. కాగితమా... !
వెదురు నుండి పుట్టావే.. !
ఎన్ని పాట్లు పడ్డావే ... !
మానవ అపూర్వ సృష్టివే... !
ఎన్ని అద్భుతాలు సృష్టించావే

తెలుపు వర్ణంతో స్వచ్ఛతకు గుర్తువే
ఎన్నో ఎన్నెన్నో భావాలు తెలుపుతావే
భాషా బేధం లేదు లేవే
ప్రేమలేఖ నీవే... టెలిగ్రామ్ నీవే...

ఆస్తులనందిస్తావే
రాజ్యాలు ఏలుతావే
శాస్త్రములనే పొందు పరచావే
చరిత్రల నెఱిగించు పుస్తకమే
పురాణాలు తెలుపుదువే
ఇతిహాసాలు రచింతువే
తాళపత్రాలనే వెనుకకు నెడితివే

పిల్లల చేతి గాలి పటానివే
అందాల రంగుల పుష్పాలవే

సులువుగా పుట్టకపోయినా
సులువుగా పుడమిన  కలుస్తావే
పర్యావరణ హితానివే

ఇంత పొగిడితే... అంత.. !బుంగమూతి పెట్టవే..

ఓహో.....

లేఖల స్థానే e మెసేజులయ్యే
పుస్తకాలు e పుస్తకాలయ్యే
నీ.. అవసరం లేదనా... !
అరచేతిలో వైకుంఠం ఉందనా... !

ఇరువురి సృష్టికర్త ఒకరేగా...!
కొత్త నీరు వస్తే పాత నీరు పోవాల్సిందేగా.. !

ఇదేగా... !నీ ఖేద కారణం...
ఐనా..... నీ గొప్ప... నీదేగా....
పోస్ట్ కోసం కన్నులు కాయలు కాసేలా.....
ఎదురు చూసిన రోజులు....
మధుర జ్ఞాపకాలు కాదా.... !
కాగితమా.... !ఓ... కాగితమా... !
నీవు ఎప్పటికి మాతో... ముడిపడ్డ...
విడదీయరాని..  అనంతఅనుబంధానివే... కదా..!
నిన్ను సృష్టించిన మానవుడైనా... !
నీవు లేక మనగలడా..?

(ఇది నా స్వంత రచన. ఎట్టి అనువాదము, అనుకరణ కాదు )

Comments

Popular posts from this blog

తిరు వేంకటాచార్యులు KS 6

బాటసారి KS 12

అనామికా శతకం విట్టుబాబు గారు