ఆధ్యాత్మికత 2021 జనవరి

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ

వెన్నెల శిల్పం సృష్టి కర్త

******

కవితాగానం

నేటి అంశం 

ఆధ్యాత్మికత

ఎనిమిది నుండి తొమ్మిదిన్నరవరకు

అంశానికి కవితలతో స్పందించగలరు.


ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.

***†**************

భరద్వాజ గారు

శ్రీ లక్ష్మి గారు

ధనాశి ఉషారాణి గారు

సుధారాణి కృష్ణం రాజు గారు

కొలచన విజయ భారతి గారు

సునంద వురిమళ్ళ గారు

మర్రి జయశ్రీ గారు

డా.ఆంజనేయులు గారు

ప్రమోద మునిమడుగు గారు

విజయ లక్ష్మి గారు

సంధ్యా శర్మ గారు

విజయ లక్ష్మి గారు

పరాంకుశం రఘు నారాయణ గారు

***********

1

*️⃣*️⃣*️⃣*️⃣*️⃣


👉అంశం ఆధ్యాత్మికత 🌻

🌹శీర్షిక-ముక్తిప్రదాయం 🌹

మత కట్టుబాట్లను  ముందుకు సాగుతాడో -

ముక్తి మార్గం వైపుకు నడుస్తాడో -

చింతల జీవితం నుండి -

చింతలు లేని జీవితం వైపుకు పయనిస్తాడో  -

బాధ్యతలు బంధాలకు దూరంగా -

ఏకాగ్రతపై దృష్టిపెట్టి -

నిర్మల నిశ్చల మనస్సుతో -

కోరికలకు దూరంగా 

మనోనేత్రాన దేవుడ్నిస్పృశిస్తూ -

తత్వసారాన్ని ఔపోసన పట్టి --

స్వార్ధచింతన విడనాడి -

ఇంద్రియాల పటుత్వాన్ని వదిలి -

శరీరంపై కాక ఆత్మతత్వంపై -

దృష్టి పెట్టి జీవన సంస్కారాన్నిపెంచుకుంటాడో  -

సామరస్య ధోరణిని అలవరుచుకుంటాడో శాంతాన్ని వంటబట్టించుకున్నప్పుడే సాధించగలడు ఆధ్యాత్మికత-

ముక్తి ప్రాప్తికి అవుతుంది చేయూత -

ఇదినాస్వీయరచన 

భరద్వాజా రావినూతల✒️

 9866203795

2

[02/01, 8:47 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితాగానం

తేదీ: 02-01- 2021

అంశం: ఆధ్యాత్మికం 

పేరు: శ్రీలక్ష్మి చివుకుల


మానవ జన్మ ఎత్తి

సకల జీవరాసులలో

ఉత్తమంగా నిలిచి

కడవరకు చేసే పయనమే ఆధ్యాత్మికం

పంచేంద్రియాలు కర్మేంద్రియాలు

పంచభూతాలకు ప్రతినిధులై

నీలో ఉండి నిన్ను నడిపించే

అంతర్నిహితమైన జ్ఞానమే ఆధ్యాత్మికం

భౌతికంగా చేసే పూజలు చూసే ఆలయాలు

అగోచరమై నీలో నీవే రమించే వేళ

ఉన్నత స్థాయిలో ఆనందించే వేళ

అవగతమయ్యేదే ఆధ్యాత్మికం

ఒక మతానికో జాతికో 

దేవునికో కట్టుబడి ఉండక

సర్వ జీవులపై ప్రేమను సమానంగా పంచితే

అదే అసలైన అధ్యాత్మికం

కామ రహితమైన జ్ఞానంతో 

పరిపూర్ణమైన జీవనంతో 

అంతర్ముఖులమై చేసే 

ప్రయాణమే ఆధ్యాత్మికం

ఆత్మ పరమాత్మతో యోగిస్తే ఆధ్యాత్మికం

నిన్ను నీవు తెలుసుకుంటే ఆధ్యాత్మికం

ఎఱుక కలిగి ఉండుటయే ఆధ్యాత్మికం

అనంతంలోకి చేసే ప్రయాణమే ఆధ్యాత్మికం

3

[02/01, 8:51 PM] Dhanasi Usha Rani Poetess: అంశం. ఆధ్యాత్మికత

.......

పోటీ ప్రపంచములోన

ప్రతిభను నిద్రావస్థలో ఉంచి

విలాసాల దారిలో సాగుతూ

మనస్సును అధీనములో 

ఉంచక అస్థిరత్వం దారిలో సాగుతూ

ప్రగతి దారిని వీడి

విజయాలను దరిచేరక

నిట్టూర్పులు దారిలో సాగుతూ

గమ్యము చేరని స్థితిని వీడి

భక్తి మార్గములో నడిచి

ఇంద్రియాలను నిగ్రహించి

యోగా ద్వాసలోన

నిత్యము శ్వాస ఉంచి

ఓంకార రూపాన్ని 

నిత్యము జపిస్తూ

సాగిపో విజయకేతంను

నిత్యము ఎగురవేస్తూ

బతుకు సమరములో

నిత్యము సాగిపోదాము

సత్యము శోధించు దారిలో

ఆత్మ పరమాత్మ శోధనలో

నిత్యము సాగిపోదాము


ధనాశి ఉషారాణి

చిత్తూరు జిల్లా

 భాకరాపేట

4

[02/01, 9:10 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*అంశం*ఆధ్యాత్మికత*

02-01-2021(శనివారం)

పోటీ ప్రపంచంలో ఉదయం లేచిన దగ్గరి నుంచి ఉరుకులు పరుగుల జీవితం కొద్దిగా మానసిక ప్రశాంతత కావాలి అంటే ఏకాగ్రత కావాలి

ఏకాగ్రత రావాలంటే యోగా ధ్యానం వ్యాయమం చేయడమే

కాకుండా ఆధ్యాత్మికత కావాలి

మనసును భగవంతుని యందు నిశ్చలంగా ఉంచగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

ఆధ్యాత్మికత భావాలవైపు ఈమధ్య అందరు మొగ్గు చూపుతున్నారు 

ఆధ్యాత్మికతలో భాగంగా తాము భగవత్ నామ స్మరణ

చేయడం అందరితో చేయించడానికి ప్రయత్నం

చేయడం కనిపిస్తుంది

భయంతో పాటు భక్తి ముక్తి మార్గము పొందాలంటే శుచి, శుభ్రత,మంచి కార్యాలు చేయడం

ఉపవాసాలు,దీక్షలు మొదలైనవి చేయడం వల్ల

ఆరోగ్యానికి ఆరోగ్యం ముక్తి మార్గానికి ఆధ్యాత్మిక ఎంతో మేలు చేస్తుంది

తమను తాము ఆరోగ్యం గా ఉంచుకుంటూ మానసిక వత్తిడికి లోను కాకుండా ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది

స్వామి కార్యం స్వకార్యం

ఈ ఆధ్యాత్మిక త మానవాళికి 

ముక్తి మార్గము🙏

5

[02/01, 9:11 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం

పేరు: కొలచన విజయ భారతి

ఊరు: హైదరాబాద్

అంశం : ఆధ్యాత్మికత

తేదీ:2-1-2020

******************

లోకాన ధర్మానికి కొంతైనా

విలువ నిలుస్తోంది అంటే

హిందూ పురాణాలు సాంప్రదాయాలలో

ఆధ్యాత్మిక కార్యక్రమాలు

భగవదారాధనలు

వెల్లివిరుస్తూండటమే

కారణం

కనిపించని భగవత్ స్వరూపం

విశ్వమంతా వ్యాపించి ఉంది

దైవం మానుష రూపేణ అన్నారు

శంఖ చక్ర గదా రూపాలు

ధరించే భగమత్ సాక్షాత్కారం

ఉండదు

ఆపదలలో ఉన్నమనిషికి  మానవత్వం తో సాయం చేయడమే దైవ సంకల్పం

ఆధ్యాత్మిక భావాలు 

అలవరచుకుంటే

చెడులో కూడా మంచిని 

చూడవచ్చు

దుర్మార్గులను కూడా క్షమించి

మంచి మార్గానికి మార్చవచ్చు

      🌺🌺🌺🌺🌺

6

[02/01, 9:24 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ:02-01-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: ఆధ్యాత్మికత

*****************

మనో క్షేత్రంలో

మనకు మనమే సేద్యం చేసుకుంటూ

ఆనందాల పంటను పండించు కోవడమే

అసలైన ఆధ్యాత్మికత!


అనిర్వచనీయమైన అనుభూతిని

ఆత్మ నిండా నింపుకొని

మనో వాక్కాయలను ప్రభావితం చేసే

వాస్తవిక ప్రపంచాన్ని 

స్వియ నియంత్రణ కోణంలో

చూస్తూ ఉండటమే...


స్వయం నిర్ణయాలను అంతరాత్మ కోర్టులో విచారణ చేసుకుంటూ

అనవసరాల దుమ్ము ధూళి

దులుపుకుని...


ఆశలను పరిధి దాటనీయకుండా

సంతృప్తి జీవనాన్ని కొనసాగించడమే...


అమేయమైన శక్తి గల ఆధ్యాత్మిక జ్ఞానం

హృదయాల్లో అమృతవాహినియై  

జాలి దయ కరుణ ఓర్పు సహనంతో పరిపూర్ణమైన వ్యక్తిగా ప్రకాశింప జేస్తుంది!

7

[02/01, 9:27 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..ఆధ్యాత్మికం

శీర్షిక..ముక్తికి మార్గం



జీవులలోకెళ్ల అత్యంత ఉన్నతం

మానవ జన్మమం

అది ఎన్నో జన్మల పుణ్యఫలం

నిత్యం ఎదురయ్యే సమస్యలతో సతమవుతూ

స్వార్థం ప్రయోజనాల కోసం తపిస్తూ

అధికమైన కోరికల సాధన కోసం

మనసును మలిన పరుస్తున్న నేటి మనుషుల జీవితాలు

అయోమయ స్థితిలో

భగవంతుడి ఆరాధన

మనసుని శాంత పరుస్తుంది

మతాలకు అతీతంగా

భక్తిని ఏర్పరుచుకోవడానికి ఉన్నతమైన స్థితిని సాధించడం ఆధ్యాత్మికత

మహోన్నతం

అనంతమైన స్వేచ్ఛవైపు చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత

ఆద్యాత్మికత ఆత్మ సంబందమైంది

అది ముక్తికి మార్గం

ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధిస్తేనే 

అవుతుంది జీవితం సార్థకం.

8

[02/01, 9:28 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఆధ్యాత్మిక జ్ఞానం ముక్తి ప్రదాయకం

ఇహపర లోకాలలో సాధన ఏకైక మార్గం ఆధ్యాత్మిక శక్తి మాత్రమే


ఆధ్యాత్మిక తత్వాన్ని అవలంభించిన వారు తప్పనిసరిగా జ్ఞానం వేత్తలు



విశ్వంలో ఎందరో తపోధనులు ఎందరో గురువులు ఆధ్యాత్మికవేత్తలు ఈ సమాజానికి సందేశాత్మక ము

ఈ భరతావని అంత ఆధ్యాత్మిక భూమి భూమి అందుకే మానవ జీవన వికాసం అంటే ఆధ్యాత్మిక పరంపర



ఎందరో యోగులు ఎందరో మహా జ్ఞాన ధనులు అందరూ ముక్తి ప్రదాయకం సందేశాన్ని ఈ హిందూ ధర్మ పరంపరగా


సన్ దేశించిన దివ్య యోగులు


వారికి సదా కైమోడ్పులు

దివ్య నేత్రముతో ఎన్నో దర్శించిన ఆధ్యాత్మిక కారులు

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

9

[02/01, 9:30 PM] +91 90002 51604: నన్ను నేను ...నాలో నేను...

.శోధించు కుంటూ ముందు సాగే ప్రక్రియే ఆధ్యాత్మికత

తనలో తాను జరుపుకునే సాధనే ఆధ్యాత్మికత

మానవత్వము నుండి దైవత్వము వైపుకు సాగే ప్రయాణమే ఆధ్యాత్మిక

మనిషి నుండి మహనీయుడి ఆవిర్భావమే ఆధ్యాత్మికత

భారతీయ సనాతన ధర్మమే ఆధ్యాత్మికత

 జగన్నాథుడు...బోధించిన భగవద్గీతే ఆధ్యాత్మికత.   ...                        ..ప్రమోద మునిమడుగు

10

[02/01, 9:31 PM] Vijayalakshmi Ch KS 38: కవితా గానం 

చెన్నా విజయలక్ష్మి 

02-01-2021

అంశం :ఆధ్యాత్మికత 

శీర్షిక :ముక్తికి మార్గం 

*************************

సంసార బంధంలో చిక్కిన 

మానవునికి ఊరట నిచ్చు మార్గం 

మంచి చెడుల విచక్షణ నేర్పే గురువు 

తామరాకుపై నీటిబొట్టులా నిలువ గల్గిన 

నేర్పును నేర్పే మంత్రం 


ఎంతటి భోగులైనా, మహారాజు లైనా 

జీవన చరమాకంలో అనుసరించు ధర్మం 

భౌతిక వాంఛలకు దూరంచేసి 

పారలౌకిక ఆనందానికి చేర్చు సోపానం 


ఆధ్యాత్మిక చింతన పాప కర్మలను నిరోధించి 

పుణ్య కార్యాలకు ప్రేరేపించే ఔషధం 

పెంచును పరోపకార గుణం 

ఒనగూర్చును ప్రశాంత చిత్తం 

చూపించును మంచి మార్గం 

భక్తిని పెంచి ముక్తిని చూపు కరదీపిక 


మానవ జీవన సాఫల్యం పొందే మార్గం సుగమం చేయును 

నిస్వార్ధ జీవనం చేర్చును దేవదేవుని పాద కమలం 

ఆత్మ పరిపక్వత చెందితే పరమాత్మ లో ఐక్యం 

లేదిక మరు జన్మం. 


హామీ :ఇది నా స్వీయరచన.

11

[02/01, 9:31 PM] Sandya Sharma Poetess: కవితాగానం


వై.కె.సంధ్యశర్మ


ఆధ్యాత్మికం


మనిషికి మనసును దగ్గర చేసే


ఏకైక సాధనం....


భగవంతుని ఆరాధనలో


దుర్గుణాలకు సుదూరంగా


సంకల్ప సిద్ధి కోసం


...


చైతన్య సంపదం కోసం


మానసిక ప్రశాంతతకు


పరి కల్పనగా


నిరంతరం 


వెన్నంటే నీడగా


మెలిగే భావనా శక్తిని 


మనలో విలీనం చేసుకునే


అద్భుతమైన  సామరస్యపు


సౌగధం... 


వేకువకు వెన్నెల తొడిగినట్లు


అజ్ఞానమనే చీకటిని ద్రోలే


ఆధ్యాత్మికం ...


భారత దేశ

సాంప్రదాయ సౌభ్రాతృత్వ సంగమం...!

12

*ఆధ్యాత్మికత*

**************

వ్యథల దాటికి ఓడినపుడు మేధ

ఎదలో వీడితే అహపు చెద

జీవనమథనంలో చిలికే సుధ

అత్యున్నత *ఆధ్యాత్మికత*


మనుషులను జంతువుల కన్నా

ఉన్నతులని నిరూపించే యోచన

జననమరణగుట్టును చూపే సులోచన

జయాపజయాల సమంగా తూచే సాలోచన


సుఖ దుఃఖాలను ఒకే రకంగా

స్వీకరింపజేసే మహత్వసుధ

అద్వైతాoబుదిలో తేల్చే తాదాత్మ్యత

జీవితాన్ని సఫలమొనర్చే *ఆధ్యాత్మికత*


కష్టాల్లోనో! జీవితచరమాంకాన్నో!

చేసేది కాదు *ఉత్తమ మథనం*

చిన్ననాటి నుండి కొంత కలిగితే

సుఖాంతమే జీవనకథనం


వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

13

*కవితాగానం*

+++++++++++++++++++++

 *శీర్షిక :ఆధ్యాత్మికం- జ్ఞానదీపం*

++++++++++++++++++(++

 మనిషి ఆత్మజ్ఞానానికి ప్రతీక! 

      మనిషి ప్రశాంతతకు కరదీపిక !!


మనిషి నైతికతకు దర్పణం!

  మనిషి మనుగడకు మార్గం !!


మనిషి అంతర్ముఖ దివ్యతేజం !

  మనిషి విశిష్టతకు సంకేతం !!


మనిషి సంస్కారానికి నిదర్శనం!

   మనిషి నైజానికి అద్దం!!


 మనిషి ఉదారతకు చిహ్నం!

   మనిషి తత్వానికి నిలువుటద్దం!!


 మనిషి విశాల జ్ఞానదీపం!

   మనిషి పూర్ణత్వ భావం!!


అదే అదే ఆధ్యాత్మిక జ్ఞానం!

    సనాతన భావ సందేశం!!


మనిషి జీవితం తేజోమయo!

   ఆధ్యాత్మికతే ఆనందమయం!!


- పరాంకుశం రఘు నారాయణ 

      మహబూబాబాద్


Comments

Popular posts from this blog

తిరు వేంకటాచార్యులు KS 6

బాటసారి KS 12

అనామికా శతకం విట్టుబాబు గారు