మల్యాల డి .వెంకట్ రెడ్డి 17







నిర్వహణ
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet of
కవి పేరు ః
వెంకట్ రెడ్డి గారు
1.
సమూహము: వీరా కవిసమయం
 తేదీ: 06--05--2020
కవిత  సంఖ్య :  01
కవి పేరు:  మల్యాల డీ వెంకట్రెడ్డి
 ఊరు: మహబూబాబాద్
శీర్షిక:       " మేము మట్టి మనుషులు"
----------------------------------------------
----------------------------------------------

మేము మట్టి మనుషులం మేము ఒట్టి మనుషుల0
మేము మట్టి మనుషులం మేము ఒట్టి మనుషుల0
 మట్టిలో పుట్టి మట్టిలో పెరిగె మట్టి మనుషులు
ఒట్టి మనుషులం ...గట్టి మనుషులు

తొలకరి వాన చినుకులకు పులకరించి పోయి
 వాన చినుకులకు తడిసిన మట్టి వాసన తో
 మహి మర్చిపోయే మట్టి మనుషులం ఒట్టి మనుషుల0 ...
     గట్టి మనుషుల

ఇంటి దానిని వెంటబెట్టుకొని చంటి దాన్ని చంకన నెసుకొని పంట పొలాలకు పయనమై బొక్కలు అరిగే దాక దుక్కులు లెనో దున్ని పచ్చని పొలాల్లో పనులు చేసి చేసి పసిడి రాశులు పండించే మట్టి మనుషులు0  మేము  ఒట్టి మనుషులం
        గట్టి మనుషులం

నీళ్లు వేసి సాగు చేసి సమానంగా భూమి చేసి
సన్న రకాలను సవ్యంగా పండించి
షావుకారి కి సగం రేటుకి అమ్మేసిన
బక్కచిక్కిన, బడుగు  బలహీన రైతుల0
మట్టి మనుషులం మేము ఒట్టి మనుషులం
      గట్టి మనుషులు

అందరికీ అన్నం పెట్టే అన్నదాత లం
ఆలీ నుండి అవ్వ దాకా పస్తులుండే త్యాగధనుల0
దేశానికి వెన్నుముక లం  దరిద్ర దేవతకు  పెద్ద  కొడుకుల0
చిట్టులో  ఉన్న గట్టి నూకలు తీసి గంజిలో వండి తినే
        గడ్డి మనుషులం

అప్పులు చేసి తిప్పలు పడి అన్నదాతల0
 అందరికీ అన్నం పెట్టే అమాయకుల0
 మర్యాదగా బ్రతికి మంచి మనుషుల0
 మట్టి మనుషులం మేము ఒట్టి మనుషులం.....కానీ
గట్టి మనుషులం    గట్టి మనుషుల

2.

సమూహము :వీరా కవిసమయం
తేదీ:07--05--2020
 కవిత సంఖ్య :02
 కవి పేరు :మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు :మహబూబాద్
శీర్షిక:      "అక్షర సేద్యం"
-----------------------------------
----------------------------------

నేను వెదజల్లిన విత్తనాలు మొలకెత్తిన వి
నా కలములొ జాలువారిన అక్షరాల గ
 మొలచిన మొలకల కు నీరు పెట్టినాను
 తెల్లని కాగితం పైన  నల్లని అక్షరాల లాగా
ఎరువు వేసి పెంచిన పైరు పైన
ఆలోచనలతో వ్రాసినకవితలాగా
ఏపుగా పెరిగే టి పంటను చూసి మురిసేను
నేను రాసిన రచనని చదివి మురిసినట్లు
పంట పైన పీడలను నివారించి నట్లు
అప్పుడప్పుడూ నా కవితలని చదివి తిట్టినట్లు
వయస్సు మీద ఉన్న పంట మిస మిస లాడి నట్లు
నేను గొప్ప కవి రచయిత నైనాని మిడిసి పడినట్లు
పంట ఏపుగా ఉంటే రైతు ఆనంద పడినట్లు
నా రచనని ఎవరైనా పొగిడి నప్పుడు
పంటలు కలుపు తీసి తే శుభ్రంగా ఉన్నట్లు
నేను భద్రతతో కవిత రాసి నప్పుడు
పండిన పంట పసిడి రాశుల పోసినట్లు
నా కవితా రచనలు ప్రజలు చదివినప్పుడు
నా అక్షర సేద్యం ఆనందంగా చేయాలి
అసాధ్యము కానీ సేద్యాన్ని చేసి అన్నం పెట్టే రైతన్న ల అందరినీ అక్షర జ్ఞానము అందించడం నా  " అక్షర సేద్యం"

3
తేదీ :08-05-2020
కవిత సంఖ్య 03
కవి పేరు: మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు: మహబూబాబాద్
 శీర్షిక:     "ఈ ప్రకృతియే నీ బ్రతుకు"
------------------------------------------------

గట్టు పైన చెట్టు
 ఛీ ట రూ కొమ్మలపైన
చిగురుటాకుల నడ మ
ముక్కుతో కర్చు కా వచ్చిన
ఆకు పుల్లలతో అందంగా
అల్లిన నీ గూడు అపురూపంగా
 చూసుకొని కాపురం
చేస్తున్న పిచ్చుకల జంట
ఎవరు నేర్పిన అల్లిక
ఏ బడిలో నేర్చిన విద్య
ఏ గురువు నేర్పినది జ్ఞానం
ఎన్ని గాలివాన లకు చెదరని ఆ గూడు
అంత గట్టి తనము ఎలా వచ్చింది
ఇంత వాస్తు ఏప్పుడు తెలిసింది
అపురూపమైన రంగులద్దిన గూడు
వాస్తు పోసింది ఎవరు
ఇటుక సిమెంట్ ఇచ్చింది ఎవరు
ప్లాను గీసిన ఇంజనీర్ ఎవరు
నీవు నేర్చుకున్న ప్రకృతి పాఠాలే కదా
తోటివారితో కలిసి బ్రతకడమే కదా
నీ వారు అంత కట్టిన గుళ్లు ఒక ఊరు
ఆ ఊరు పేరు రు పొట్టి పిచ్చుక గూడు
నీవు కట్టిన గూడు పెనుతుఫాను కైనా
ఎదురు రోడ్డును ఎండకు ఎండి నా
చెక్కు చెదరదు
ఆ గూడు చెట్టుని కిరాతకుడు నరికితే
నీ మనసంతా వికలమై నది
నీ జంట ఎన్ని రోజులు మనసు వికలం అయినది
అయినా మొక్కవోని ధైర్యంతో
మరో చోటికి మారిన నీ బ్రతుకు మాత్రం
 ఈ ప్రకృతిలో నే కదా
అడవి తల్లి గర్భమందు
నువ్వు ఆనందంగా బ్రతుకుతావు
స్వార్ధం లేని నీ జీవితం
శత్రువులు మిత్రులుగా చేసి జీవిస్తారు   
 "ఈ ప్రకృ తే నీ బ్రతుకు "
  "ఈ ప్రకృతిని బ్రతుకు"
4
[09/05, 9:17 AM] D Venkat Reddy KS...: సమూహము :వీర కవి సమయము
తేదీ09-05-2020
 కవిత సంఖ్య :04
పేరు: మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు:  మహబూబాబాద్
శీర్షిక :  "కంటి నీరు నీ పేరు"
‐-------‐------------------------------

కనిపించకుండా కంటిలో ఉంటావు
కళ్ళనుండి కారు తావు  ఉప్పగా
బాధలు కలిగినప్పుడు బయటికి వస్తావు
బంధువులను దగ్గర చేస్తావు
ఎంత గొప్ప వాడినైనా ఏడిస్తే బదులు ఇస్తావు
హృదయాన్ని కదిలిస్తా కనిపిస్తావు
నీవు సముద్రపు నీరు కావు
నీవు గంగాజలం అసలే కావు
బావులు నదులు నాలో లేవు
 జల్లు పడినట్లు జల జల కారుతాయి
చెక్కిలి పైన ఉరకలు వేస్తాయి
 ఆప్యాయతను కలుగజేస్తారు
 అనురాగాలను పుట్టిస్తారు
కొట్టిన తిట్టిన బయటికి రాగానే వస్తావు
భయానికి తోడవు తావు
 తప్పులు జరిగినప్పుడు ఒప్పుకున్నా కనిపిస్తావు పశ్చాత్తాపానికి పరిహారంగా పలకరిస్తారు
 ఎక్కడ నుండి వస్తావు
ఎందుకు నీవు గ్రహిస్తావు
కష్టము కలిగినప్పుడు కలుస్తావు
కౌగిలిలో కళ్ళనిండా నిండు తావు
 కష్టాలు కలిగినప్పుడు నీవే కనిపిస్తావు
ఆకలి బాధలు కలిగిన
నా కళ్ళల్లో అడ్డుపడతా వు
నీ పేరే కంటినీరు నీవు తెలియని వారెవ్వరు
           " నీ పేరే కంటి నీరు "
           " నీ పేరే కంటి నీరు
5
[10/05, 7:13 AM] D Venkat Reddy KS...: సమూహం :వీర కవి సమయం
తేదీ -10-05-2020
కవిత సంఖ్య:05
 కవి పేరు: మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు: మహబూబాబాద్
శీర్షిక " అమ్మా నన్ను కన్నందుకు వందనాలు అమ్మ"

 ‐--------------------------------------------------------------------

బ్రహ్మ చేసిన బొమ్మ
 అమ్మ కడుపులో నమ్మ
నా లక గా వేసిన నాన్న  నాన్న
ఛీ గురించి ఫలించి శిశువు నైతి నీ
 ఉమ్మినీరు లో తన్ను కొంటి తొమ్మిది నెలలకు
పాపం అయితే అమ్మ ఒడిలో చేరిపోతూ
 దినదినాభివృద్ధి చెందుతూ
తప్పటడుగుల నడక తో
దుమ్ము ధూళి పడిన బుగ్గలపై
 ముద్దులతో నా కేసిన అమ్మ మా నాన్న0
 చనుబాలను కోడి పి సాది నమ్మ
 భుజాలపై మోసిన అమ్మ
 పొత్తి లిలో మెత్తగా హత్తుకుని
 గుండెలపై ఆడించిన అమ్మ
మొదటి గురువు నీవేనమ్మా
ఉగ్గుపాలతో రంగరించి
చనుబాలను కుదిపిన అమ్మ
నీ మురిపాల ముద్దుల కొరకు
హద్దులు దాటి పరిగెడుతు తే
మధ్యలోనే ఆపేసి హద్దు కొన్ని
ముద్దులు వీడిన అమ్మ
త్యాగమనే ది కాదమ్మా
నీ రుణం ఎలా తీర్చుకోవాలి అమ్మ
జన్మజన్మలకు నీ గర్భమందు జన్మించాల అమ్మ
 అమ్మా నను కన్నందుకు వందనాలమ్మ
  మా యమ్మ నన్ను కన్నందుకు వందనాలమ్మ
    "ఈ కవిత ఎందరో అమ్మలకు  కు అంకితం"


note-- మా అమ్మ  క్యాన్సర్తో చనిపోయింది నా కంటి నీళ్లతో ఆమె పాదాలను తడుపుతూ ఆమె ఆత్మ శాంతి కొరకు ఈరోజు ఈ కవిత  అంకితం చేస్తున్నా

6
[11/05, 9:30 AM] D Venkat Reddy KS...: సమూహము :వీర కవి సమయము
తేదీ :11-05-2020
కవిత సంఖ్య 06
కవి పేరు :మల్యాల డి వెంకట్ రెడ్డి
 ఊరు :మహబూబాబాద్
 శీర్షిక "   "గుమ్మపాలు"

------------------------------------------------------------

గుమ్మపాలు పితాక బోయ వాడు వచ్చే
లేగ దూడ మెడకు కట్టి బిగించి వేసే
పాల కోసం నా పసి హృదయం ఆవేశంతో
 ఆ టు ఇటు గింజుకున్నా దయలేని పుత్రుడు బోయవాడు అమ్మ పొదుగు తడిపే చనుమొనలను నిమిరి
ఆకలితో ఉన్న నాకు మెడ తాడు ఒకటి బిగించి
అన్ని పితికిన పొదుగు ని అప్పటికి అయిపోగా
బాండ నింపిన సంతోషంతో తిరిగి వెళ్ళిపోతూ
నా మెడ తాడు తప్పించి వెళ్లగా
ఆనందముతో నేను అమ్మ పొదుగు
ఆకలి తీర్చుకునే సమయం వచ్చిందని
 సంతోషించిన అందులో ఏమి లేదు
ఆకలి తీరే ఉపాయము లేక పైపైకి
నా మూతితో పొదుగు నీ  తడిమి తడిమి
 దిగేసి లాగినా అందులో నా గుమ్మపాలు లేకపాయె
నా తోక ని అమ్మ నాలుకతో నా కేసి నిమిరింది
 అందులోని ఆనంద పడి నట్లు
నా కడుపు నిండినట్లు అయింది
స్వార్ధ జీవుడు అయిన మనిషి
మా ముఖాన పసుపు పెడితే పూజిస్తారు
మా మెడపై కాడి పెట్టి దున్నేస్తున్నారు
మా కొమ్ములకు తాడు పెట్టి కట్టి వేస్తారు
మీ ఆధీనంలో తీసుకుంటారు మేము
ఒట్టి పోతే కటిక వాడికి అమ్మేస్తారు
ముక్కలు ముక్కలు చేసి తినేస్తారు
ఈ ప్రకృతి అంతా  నష్టాలను చేస్తూ కష్టాల పొందు తూ
సకల జీవరాశులు సైతం అడవి తల్లి గర్భమందు
ఆదమరచి బ్రతుకుతున్న విప్రకృతికి పాడు చేయక
ఎంతో కొంత సహాయం పడుతుంది
ఈ మనిషి ఎందుకు ఇంత ఆరాటంతో పోరాటాల మధ్య
 కొట్టుమిట్టాడుతున్న నాడు ఆశలకు హద్దులేక
 స్వార్థం అనే గూటిలో ఇరుకు బతుకులో బ్రతుకుతున్నారు
 స్వేచ్ఛా జీవితం అనుకున్నా నిరుపయోగమైన
జీవితంగడుపుతున్నాడు
ఓ మనిషి తిరిగి చూడు నీ స్వార్ధాన్ని విడనాడి
ప్రకృతిని
 కాపాడు
7
[12/05, 9:39 AM] D Venkat Reddy KS...: సమూహము :వీర కవిసమయం
తేదీ  :12-05-2020
 కవిత సంఖ్య  : 07
 కవి పేరు: మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు :మహబూబాబాద్
శీర్షిక :    " నీళ్ళ కడవ పగిలిపోయే"

---‐-------------------------------------------------

ఉదయం పొద్దు పొడిచే
ఉజ్వల కిరణాలు
ఊరు మీద పడినది
ఛీరిగిన బొంత తీసి పక్క నేసి
కదలలేని నా కడవ కేసి చూశా
కాళ్లు చేతులు కళ్ళు అడుగుదామని
కడవ కాంత వరకు పగిలిపోయే
నీరు మొత్తం ఈ నికి పాయె
ఆకలేసినా దాహం వేసినా
నా కడ వలే కదా నా జీవము
నీటి కోసం ఆమడ దూరం పోవాలా
 ఎవరో పెట్టేది సద్ది బువ్వ పెట్టేది
చప్పరించే నా బ్రతుకు కు
కళ్ళ నీళ్ళతో కడవ నింపు దామన్న
ఎముకల గూడు లో ఏమీ లేదా
అన్నపూర్ణమ్మ అన్నం పెట్టమంటే
అన్నపూర్ణ అప్పుల కోసం చేతులు
చాచి అడుగుతుంది పొరుగు దేశాలన్నీ
నా యాచక వృత్తి కి ఏళ్ల లాయి
సొత్తు  బోయిన నా బొచ్చ ను
 చిరిగిపోయిన జోలెలో వేసుకొని
గుడిమెట్ల కాడికి రానే వస్తి నీ
బారు పంచ గుబురు మీసాల సార్
చెంగులు  చెప్పుల క్రింద నలిగిన
కాలికి లేచిన దుమ్ము
నా ముక్కులో జో చే
నా తుమ్ములకు వెనుదిరిగిన సారు
ఆప శకున పక్షి అనేశాడు
దేవుణ్ణి ఏ కోరికలు కోరటానికి ఏమో
కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి
కోట్లు కావాలని కోరుకుంటారు
 చేయి చాచి బిచ్చగాడు అడుగుతే
లేదు పొమ్మంటారు
 డబ్బులు వాడికి ఆ దేవుడు కూడా
భయపడతాడు
మాకు ఈ గతి ఏంటి అని అడిగితే
నీ తలరాత అంటాడు ఆ దేవుడు
ఈ బక్క ప్రాణం ఏమి చేయలేక
చావు నైనా ఎప్పుడు ఇస్తావ్
అని అడుగుతుంటారు
       "నీళ్ల కడవ పగిలిపోయే "
       "నా నీళ్ల  కడవ పగిలి పోయి"

Not:  11-05-2020 రోజున
కవిత సంఖ్య 06. బదులుగా 07పడినది   గుర్తించగలరు అని మనవి
8
[13/05, 7:41 AM] D Venkat Reddy KS...: సమూహము: వీర కవి సమయము:
 తేదీ:13-05-2020
 కవిత సంఖ్య : 08
కవి పేరు :మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు :మహబూబాబాద్
శీర్షిక :   "పశువుల సావడి "
 ______________________

నీకు కంపు అనుకునే పేడ
మాకు ఇంపుగా ఉంటుంది
నీవు చీదరించుకునే పేడ
మా పంట పొలాలలో ఎరువు అవుతుంది
నా ఎడ్ల సావడి లో వేసుకున్న
మంచం నల్లబడిన పట్టెలతో
తెగితే ముడివేసిన నవ్వారు
ఎడ్ల  రొచ్చు పైన వేసుకున్న నా మంచం
రాత్రి దోమలతో దోబూచులాట
 పగలు ఈగల తో వీరంగ మాట
ఎడ్ల తోకలతో విసిరే గాలి
ఆదమరచి నిద్రపోయే నా సావడి
కాలిన ఆకు చుట్ట చెవిలో
కుక్కి మంచం కింద కుంపటి నిప్పు
కోడి కూత ఏ లకు కట్టుకున్నది లేపి
రాముడు ఎద్దు రంకె వేసి
 కాడి మేడి  సర్దు కొనమని
 పెరిగిన గడ్డం నెరిసిన జుట్టు
 గళ్ళ లుంగీ చిరిగిన అంగి
మురికి పట్టిన తలగుడ్డ
ముల్లు కర్ర చేతబట్టి
సొర బుర్ర  నీళ్ళతో
ఏరువాక సాగుదాం అంటే
నెర్రెలు వాసిన నేల
నీటి దాహము ఎప్పుడూ  తీస్తావు అనే
 ఊర చెఱువు ఒట్టి పాయె
కర్రు నాగలి అరిగిపోయే
నీటి గుంటలు నిండేది ఎప్పుడు
ఊర చెరువు నీటితో ఊగిసలాడే దెప్పుడు
రాతలు రాసే ఆ దేవుడు
 రైతులు రాతలు మార్చేది ఎప్పుడు
అందుకే చల్లని నా సావడిలో
కంపు అయినా ఇంపుగా
నిద్ర లోకి జారుకుంది నా మనసు
9

సమూహము :వీరా కవిసమయం
తేదీ:  1 4 -05- 20 20 కవిత సంఖ్య :0 9
కవి పేరు :మల్యాల డి వెంకట్ రెడ్డి
 ఊరు మహబూబాబాద్
శీర్షిక     "నాలుగో సింహం"

_____________________
చేతులు శుభ్రంగా కడుక్కుని
ముక్కు కి గుడ్డ కట్టమని
పరిశుభ్రంగా ఉండండి చెప్పేవారు
డాక్టర్.       మొదటి సింహం
చట్టానికి అనుగుణంగా రేయిపగలు
 నాలుగు బజార్లో నిల్చుని కట్టడిచేసే
రెండవ సింహం పోలీస్
నీవు చీదరించుకుని ఛీ కొట్టేసి
 అశుభ్రంగా పడవేసిన చెత్తనంతా
మబ్బుల్లో ని వచ్చి దుమ్ము లేవకుండా
ఎత్తి పడవేసే పారిశుద్ధ కార్మికులు మూడవ సింహం
నీకు ప్రతి నిత్యం కనిపించే నాలుగో సింహం
ఎవరో తెలుసా నీవు ఉదయం లేచిన దగ్గర నుండి
 కాఫీలు టీలు వాటిలో కలిపి పాలు
మబ్బుల్లోన డబ్బాలో పోసి ఇల్లిల్లు తిరిగి
పాలు పోసే వాడు పాల అబ్బాయి
 తను పండించిన కూరగాయలు బస్తా లో
 పోసుకొని మూట కట్టుకొని ఆటోలు వేసుకొని
చీకట్లోనే పల్లెల నుండి పట్టణాలకు చేరవేసే
నాలుగు కుడళ్ల మధ్య అమ్మేవాడు
కూరగాయల వాడు తను పండించిన
పంట ఏ సహాయం లేకుండా వ్యవసాయం చేసి
 కోసి నపంట కుప్పలుగా పోసి తడిసిన ఎండిన సగం రేటుకి అమ్మేసే  అందరికీ అన్నం పెట్టే వాడు అన్నదాత భారతదేశంలో విభిన్న సంస్కృతులు ఉన్న
తేడా లేక అన్నం పెట్టే నాలుగో సింహమే రైతన్న నీ పాదాలకు శిరసు వంచి సమస్త జీవులు  నమస్కరిస్తున్న వి

10
సమూహము: వీర కవిసమయం
 తేదీ:15-05-2020
 కవిత సంఖ్య: 10
 కవి పేరు: మల్యాల డి వెంకట్ రెడ్డి
శీర్షిక:   "బహుదూరపు బాటసారి"

_________________________________


బహుదూరపు బాటసారి
నా ఊరే నాకు కావాలి
నా వల్లే నాకు ముఖ్యం
నా ఊరి పచ్చదనం పలకరింపులు
 నాకు గుర్తొస్తున్నది  నా మనసులో
మెదిలాడు ఉన్నవి
ఆకలి వేసిన దాహం వేసినా
నా ఈ రహదారి లో
నేను బాటసారిని
 బ్రతుకుతెరువు కోసం అని
 గుప్పెడు మెతుకులు సంపాదన కొరకు
పిచ్చుక ఊళ్లో సంసారం చేసి
 ఆకలి తీర్చుకునే రోజులైనా
ఈ మాయదారి కొరనా కొరకు
 నా ఊరే గుర్తొస్తుంది హృదయంలో
నా వాళ్లే మెదిల ఆడుతున్నారు
నా ఒంట్లో ఉన్న సత్వ నీ చేరదీసి
 కన్నబిడ్డకు కాల్ చెప్పులు లేకుండా
 కట్టుకున్న దానిని వెంటబెట్టుకొని
కడుపులో బాధ వేసినా మనసు
ఆవేదనతో ఉన్న రగిలిన
ఎన్ని  ఆమడల దూరమైన అయినా
మడమ తిప్పడం లేదు నడుస్తున్న
 కష్టం వచ్చినప్పుడు కాలినడకతో
 బయలుదేరిన మాకు
ముళ్ళు అయినా పూలు అయినా ఒకటే కదా
నా ఊళ్లో నా తల్లి ఒంటరి ది
నేను ఇచ్చట బాటసారిని
మూటలు మోసే నాకు
 బాట పట్టి నడిపిస్తుంటే
బాధ తెలియకపోయినా
అమ్మ చెంగు పట్టుకొని నడిచే
ఈ చిట్టి తల్లికి భవిష్యత్తులో
ఏమని చెపుతుందో
ఎప్పుడు నా గొళ్ళెం లేని ఇంటి
 తలుపులు తట్టాలని ఉన్నదో
నా ఒంట్లో తడిలే కున్న తప్పటడుగుల
 నడక తో.   "బహుదూరపు బాటసారి "గడుస్తున్నా

11
[16/05, 9:56 AM] D Venkat Reddy KS...: సమూహము :వీర కవిసమయం
తేదీ:16-05-2020
 కవిత సంఖ్య. :11
 కవి పేరు: మల్యాల డి వెంకట్రెడ్డి
 ఊరు : మహబూబాబాద్
శిరీష క. :  " విలేకర్ అన్నా నీకు వందనం"
-------------‐----------------------------------
  విలేకర్ అన్నా నీకు వందనం అన్న
 నీ విషయం వివరిస్తా విను
 ఉదయం సాయంత్రం అనేది లేదు
నీవు వార్తలకొరకే పరుగెడతాయి
 కెమెరాలో బంధిస్తారు
 కలము ద్వారా వార్తలను కక్కి ఇస్తావు
 ఎక్కడో మారుమూల జరిగిన విషయాన్ని
 నిక్కచ్చిగా నిరూపిస్తారు రాస్తావు
 ప్రపంచమంతా ఒక్క దగ్గరికి తెస్తావ్
ప్రతి విషయాన్ని ప్రజలకు అందజేస్తారు
క్షణక్షణం నిరీక్షణం తో కష్టపడుతూ
అక్షరం అక్షరం ప్రజల పక్షం చేస్తావు
 ఏ విషయమైనా క్షణములో తెలిసేలా చేస్తావు
 పక్ష పత్రిక ,మాసపత్రిక, రోజు వారి పత్రిక
 పత్రిక ఏదైనా వార్తను చదివిస్తారు
 అన్యాయాలను బయటికి తీస్తారు
న్యాయం కొరకు తపిస్తారు
 చానళ్లన్నీ నేర్పిస్తారు వార్తలను వినిపిస్తారు
చాలీచాలని జీతాలు అయినా
ఆశయం  కొరకు పని చేస్తావు
 పరిశోధనలపై పాడిపంటల పైన
ఆరోగ్యం కోసమైనా ఆడవారి వంటలు పైన
యువతీ యువకులు బ్రతుకు పైన
పిల్లల చదువుల పై
 అనగారిన ప్రజల బ్రతుకు పైన
నీవు రాసే వార్తల కొరకు
ఉదయం కాగానే
పేపర్ బాయ్ కోసం ఎదురు చూసే
వారు ఎందరో
కాఫీలు టీల కన్నా పేపర్ మిన్న
            "విలేకర్ అన్నా నీకు వందనం"
             "విలేకర్ అన్నా నీకు వందనం"
12
[17/05, 7:57 AM] D Venkat Reddy KS...: సమూహము: వీర కవి సమయము
 తేదీ :17-05-2020
కవిత సంఖ్య :12
కవి పేరు మల్యాల డి వెంకట్ రెడ్డి
 ఊరు మహబూబాబాద్
శీర్షిక:   " తొలకరి వాన చినుకులు"

‐--------------xxxxxxxxxx-----------
తొలకరి వాన చినుకులకు
 పుడమితల్లి పులకరించెను
 చినుకు చినుకు రాలి రాలి
చిత్తడి చిత్తడిగా పుడమి తల్లి తడిసి పోయాను
చిరు గాలులకు చిన్ని ఆకులు రాలి పాయను
 మట్టిపెళ్లలు కరిగిపోయాను గడ్డి పువ్వులు గంతులేసే
 చిన్ని చిన్ని కాలువలు లో ఊట గుంటలు నిండిపోయిన వాగులు వంకలు ఎన్నో మలుపులు తిరిగిన
ఏ రూల సెలయేరు లాగా ఎదిగి ఒదిగి పాయను
మట్టి నంతా తీసుకొని మలినం అనేది మర్చిపోయాను నదులుగా నాట్యంచేస్తూ నానా నదులను కలిపేస్తూ
కొండల నడుమ ప్రవహిస్తూ సీమల నీటిని చుట్టేస్తూ
 గొల్లు గొల్లున గోదావరి పేరుతో నడుస్తూ వెళ్ళి
కిలకిలా నవ్వుతూ కృష్ణమ్మ గా మారిన
పుడమి తల్లికి పుచ్చ టేషన్ పిచ్చిమొక్కలు నో
కప్పల కేరింతలు  వానపాముల ja rule ఆటలు
నత్త గువ్వల నాట్యాలు ఎండ్రకాయలు ఏర్పుల ఎన్నో
చిన్న చాపల ఏరివేత కొంగ బావ కోరు కూడా యే
తడిసి మొలిచిన  పిట్టల చెట్ల పైన
పొరలి పోయెను ఇసుక రవ్వలు
వాన చినుకుల జడివాన లతో
ఇది సాగరము పేరుతో జీవన్
ఆధారమైనది జీవులకు
 అది ఇది అనకొండ సముద్రుడు ఒడిలో కి వెళ్ళను
              " తొలకరి వాన చినుకులు"
               " తొలకరి వాన చినుకులు"

13
సమూహము: వీరస్ కవిసమయం
తేదీ: 18-05-2020
 కవిత సంఖ్య: 13
  కవి పేరు :మల్యాల డి వెంకటరెడ్డి
 ఊరు మహబూబాబాద్
శీర్షిక :  "విలువలేని చోట నిలబడలేరు"
_____________xxxxxxxx______

విలువలేని చోట నిలబడలేరు
నీవు చేసే పని విలువ నీవు కు తెలియకున్నా
నీవు నడుస్తున్న  బాట లే నీకు విలువ
నీ పనిలో ఒక అర్థం ఉన్నప్పుడు
నీ నడక లో ఒక త్యాగం ఉన్నపుడు
 నీవు చేస్తున్నది ఇతరులకు ఉపయోగం అయినప్పుడు
నీవు  నిలబడే చోటే విలువైనది
నీవు చేస్తున్న తప్పు  అప్పుడు గొప్పదైన
 నీ మనసు నిన్ను హెచ్చరిస్తూ ఉంటది
ఆ తప్పులన్నీ నిన్ను నీ వెనకాల దాహిస్తాయి
ఆస్తులు ఉన్నంత మాత్రాన విలువలు రావు
నీవు ఎప్పుడూ నీ మనసు అర్పితం చేయగలిగినప్పుడు
 నీ విలువైన  నీ మనసు నిర్మలంగా ఉంచినప్పుడు ఆప్యాయతలు అనురాగాలు నీలో కనిపిస్తున్నప్పుడు
నీవు వాటిని నిస్సందేహంగా విస్తరించినప్పుడు
 నీవు చేస్తున్న పనులు విలువలు గా ఉంటాయి
నీవు ఎంత చదవరి అయినా
 గుణం గణము లు కలగనప్పుడు అమృతము తాగినట్లు
లేదా సముద్రపు నీళ్లు తాగినట్లు
నీకు కలిగే విలువలను నీవు రమ్మంటే రావు
ఎదుటివాడు వాటిని పొమ్మన్న పోవు
నీవు స్థిరంగా లేవని తెలిసినా
 నీ ఫలితాలను మిగిలిపోవు ఈ ధరణి పై
  " విలువలు లేని చోట నిలబడలేరు "
   "విలువలు లేని చోట నిలబడలేరు"


14

 తేదీ :19-05-2020
కవిత సంఖ్య :  14
కవి పేరు :మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు :మహబూబాబాద్
శీర్షిక :      "" తప్పిన ప్రేమ ""

---------------------------@@@@@--'xxzzz----------

జీవితం గొప్ప ఆశయాలతో నిండి ఉన్నది
మనిషి మనసు నిండా ఆలోచనలతో
అపురూపమైన అందాన్ని అశ్వ దించాను
అందరిలాగే అనుకున్నాను ప్రేమ అని
మనసులోనే మమకారాన్ని పెంచుకున్నా
 నీ కొరకు తప్పించాను ప్రేమ పిపాసి నై
 నా రూపాన్ని మర్చిపోయాను
నీ రూపాన్ని చూస్తున్నాను
నా గుండెల్లో నీవే ఉన్నావని
 నీ గుండె సవ్వడి తో విన్నాను
నా కళ్ళకు చీకట్లు కమ్ముకుంటున్న
నీ రూపం వెల్తురు అయింది
కని పెంచిన తల్లిదండ్రులను
 మరిచిపోయా నీ కొరకై
కులం ,మతం ,కట్టుబాట్లు
అడ్డు వచ్చిన తెచ్చుకున్నాను
తోబుట్టువులు వాళ్లను కూడా పక్కకు నెట్టేసిన
బంధాలను తెంచుకుని
బంధువులను మర్చిపోయాను
గడప దాటి బయటకు వచ్చాను
 నాది అనేది తీసివేసి నీలోనే కలుపుకున్న
 అప్పటికే తెలిసింది నీవు వేరొకరి ఆస్తి అవుతున్నా వని
నిన్ను  కళ్ళారా చూశాను కళ్యాణ మంటపం లో
 నా గుండె బద్దలయినంత
100 సమ్మెట దెబ్బలు తగిలి నట్లు
 జీవితం బరువై పోయింది
బ్రతకటం తప్పని అనిపిస్తుంది
పెనుగాలులు వీస్తున్నాయి
కారు మబ్బులు కమ్ముకున్నాయి
అడుగులు వేస్తున్నాను అందని
 లోకాలకువెళ్లి పోవాలని
మళ్లీ నీవు గుర్తుకు వచ్చావు
ఓరచూపుల తో చూస్తున్నాను
మంచం పైన ఉన్న నా స్థితిని
మందులకు తగ్గని పరిస్థితి నీ
తప్పిన నా ప్రేమని
మళ్లీ జన్మలోనైనాఒప్పిస్తా అని

               "  నిద్ర లేచి చూసేసరికి నా చుట్టూ "
               "  సూర్య కిరణాలతో నిండిన వాకిలి"

15
 కవిత సంఖ్య.  15
కవి పేరు: మల్యాల డి వెంకట్ రెడ్డి
 ఊరు :మహబూబాబాద్
శీర్షిక :   " తెలుగు వెలుగు వెలుగు జిలుగులు"

------------------------------××××××××××------------

నవరసభరితం నా తెలుగు తరం
 కళా జీవనం నా తెలుగు మతం
తెలుగు వెలుగుల జిలుగులు
 తెలియజేయు నా తెలుగు కులం
దాశరథి గోడలపై రాసిన
బొగ్గు రాతలు నా తెలుగుగీతాలు
 నేర్చిన నా తెలుగు భాష ను
  మరి చేసేదెవరు మదిలో పెట్టనిదే ఎవరు
 అమ్మ గోరుముద్దలు తినని దెవరు
 అమ్మ ఒడిలో జోల పాట వినని దెవరు
 అష్టైశ్వర్యములు తో కూడిన
 నా తెలుగు భాష నుపలకని దెవరు ఎవరు
 అష్ట దిక్కులకు నలుమూలలకు
 వెదజల్లే నా తెలుగు అక్షరాల జల్లులు
 పల్లెల్లో పాడుకునే పాటలు జానపదాలు
 నదులలో నడిచే నా వల సాగేది నా తెలుగు పాట
 తెలుగు లోగిళ్లు బోసి నవ్వులు నింపేది తెలుగు ఆట ఆత్మీయత అనురాగాన్ని కలిపేది
 తెలుగు భాష మాట తెలుగు దోర్నాల కోట
అమ్మ ,నాన్న ,అన్నదమ్ముల అనురాగాలనే
నింపేది తెలుగు బాట
కవుల కళాశాలలో ja rule ఆర్ ఏది
 తెలుగు అక్షర ja rule ఆట
 మన తెలుగు మాట
నిండు నూరేళ్లు ఉండమని దీవించే ది
నా తెలుగు పూల తోట
నిఘంటువుల మాట
         "  తెలుగు జాతి వర్ధిల్లు "
           "ఓ తెలుగు భాషా వర్ధిల్లు"


16

సమూహము :వీరా సమయము
తేదీ: 21-05-2020
 కవిత సంఖ్య:16
 కవి పేరు: మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు: మహబూబాబాద్
శీర్షిక : "కాడెద్దుల కళ్లల్లో కన్నీళ్లు"
-
-------------------&&&&&-------------

మా మా మనసు ఎందు కో  నిశ్శబ్దంగా ఉంది
మా అంతరాత్మ ఊహల్లో విహరిస్తున్నా
మా లో ఉన్న ఆలోచనలకు పదును
పెట్టాలని పడి పడి లేచే పదేపదే ఆలోచనలు
రేకెత్తిస్తుంది గాలి చల్లబడుతుంది
మా లో  ఆశలు ఉప్పొంగుతున్న
ఎగిసిపడుతున్న సముద్రపు నీటి కెరటాలు
వీచే గాలులకు కురిసే చినుకులకు
 ఆకుల పై పడిన చినుకుల సవ్వడి కి
పత్ర రేకుల చిగురిస్తున్న చిన్ని చెట్లకు
 మృదువుగా మధురమైన రంగులో
 కనిపించే ఆ లేత చిగురుల ఒక్కొక్కటిగా
 తిని వేస్తూ ఉదరము నిండిందని
కొండ కోయిల ఊరి వెలుపల
చింత చెట్టు ని ఆసరా చేసుకుని
 పాట మొదలు పెట్టింది
నీవు కూసిన కూతకు అది నీకు పాట అనిపించినా
కాడెద్దుల కళ్ళల్లో కారుతున్నాయి కన్నీళ్లు
తొలకరి మొదలవుతుందని
యజమాని తొందర పడతాడని
 కష్టపడాల్సిన రోజులు వస్తున్నాయ
కాడెద్దుల లో
 గుబులు ని తెలియజేయ
కూసింది కోయిల కు కు అంటూ
నిస్సత్తువ లో ఉన్నా రైతు
 రోహిణికార్తె మొదలయ్యిందని
మనసు లో ఊహించుకున్నా
 భూమాత ను చీల్చుతూ
 దున్న   మని హెచ్చరిస్తుంది మా మనసు
ఊహల్లో మాకు ప్రకృతికి సిద్ధమని రంకె వేసి లేద్దామని సిద్ధమైన  డొక్కల నిండా మేత లేక బక్కచిక్కి నా
 మా కంటి నీళ్ళతోనే కడుపు నింపుతున్న
             " కాడెద్దుల కళ్లల్లో కన్నీళ్లు "
              "కాడెద్దుల కళ్లల్లో కన్నీళ్లు"

17
కవిత సంఖ్య : 17
కవి పేరు :మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు :మహబూబాబాద్
 సెల్ నెంబర్: 9676 8602 60
 శీర్షిక :       ""చెత్త కుప్ప కాడి పిల్లలం""
------------------------#$####----------

చెత్త కుప్ప కాడి పిల్లలం
అమ్మానాన్న తెలియని బాలలం
 ఆ కలిసిన దాహం వేసినా
 మేము ప్రేమతో కలిసి తింటాము
 కుక్కల,  పందులతో ఆడ దొరికే దంత
పంచుకుంటాం  భాగస్తులమై
వండితే ఒక్క కూర అయినా
పడ వేసే  దంతా నానా రుచుల కూరలు

చిరిగిన చొక్కా పెరిగిన వెంట్రుకలు
మడత బడిన గోచీ గుడ్డ
మేము మనుషులం
అనేదే మర్చిపోయిన ము
 మా స్నేహితులంతా పందులే
మా కాపలాదారులు అంతా కుక్క లే
 అవి తింటూ ఉంటాయి దొరకనప్పుడు
మమ్మల్ని నెట్టు తుంటాయి
 అనాధ బాలల మైన మేము చెత్తకుప్పలో
పుట్టిన మాకు పచ్చడి మెతుకులు అయిన
పరమానందమే .
పందులతో పంచుకునే తింటాము
కుప్ప తోటలో వేసే అన్నమంతా మా అమ్మానాన్న లే
 ఆదరించే వారు ఎవరు లేకున్నా అందరితో కలిసి వెళుతున్నాము సమాజములో మాకు ఏది లేకున్నా
గుర్తింపు రాకున్నా
మేము మనుషులం అనేది మర్చిపోయాము
ఈ సమాజమంతా మమ్మల్ని వెలివేసిన
మాకు సహస దోషణ లక్షణాలు లేవు
ఓ నేస్తమా ప్రేమ మూర్తులు మీరు
 కన్న మా అమ్మ చీదరించుకు నీ
 కళ్ళు తెరవక ముందే
ఈ లోకానికి నన్ను చూపలేక
మౌనంగా రోదిస్తూ వెళ్ళింది
అమ్మ అని పిలవలేని నిస్సహాయ నీ
చేసింది.

ఈ చెత్త కుప్ప తోటి లో పడవేసింది
దైవానికి సైతం దయలేని పుత్రులం
ధైర్యానికి  ధైర్యం అయిన దయ గలిగిన వాళ్ళం
భయానికి అభయమిచ్చే వాళ్ళం
 ఒంటరి వాళ్ళం కాదు ఓటు లేని వాళ్ళం

''మాకే చలి వణుకుతుంది ''
"మాకు ఎండ భయపడుతుంది"
"వర్షాకాలం మాకు చెట్టును చూపిస్తుంది"
"మాకు ఆకలేస్తే మున్సిపాలిటీ
ఎడ్లబండి పిలుస్తుంది."       రా ... రమ్మని
                                           -----'--------------
       
                "చెత్త కుప్ప కాడి పిల్లలం "
                "చెత్తకుప్ప కాడి పిల్లలం"
18
[23/05, 6:39 AM] D Venkat Reddy KS...: సమూహము: వీర కవిసమయం
 తేదీ:  23-05-2020
 కవిత సంఖ్య :18
కవి పేరు : మల్యాల డి వెంకట రెడ్డి
ఊరు :మహబూబాబాద్
శీర్షిక :     "గులాబీ ముళ్లు"
----------------@@@@@----------------

గుప్పుమని గుబాళించే ఎర్ర.        " గులాబీలు"
 ప్రేమికుల బంధం పెనవేసే ది.      " గులాబీలు "
పెద్దరికాన్ని కలిపే పేరున్నది.        గులాబీలు
స్నేహాన్ని  కురిపించి మరిపించే.        "గులాబీలు
ఆప్యాయత అనురాగానికి మూలం.  "గులాబీలు
హృదయానికి చేరువగా ద్రవించే ది.    "గులాబీలు
కనురెప్పల మధ్య  కనువిందు చేయు. " గులాబీలు
ప్రియురాలిని వశపరుచు ప్రియమైనవి. "గులాబీలు"
 ప్రియుడికి మనసు నిండా ఆశలు రేపే.  "గులాబీలు
పిచ్చి ప్రేమ కనువిప్పు చిహ్నం.             "గులాబీలు
 రాచరికపు బాటలో వెదజల్లే.               "గులాబీలు
రమణీయం సొగసు వడిలో నింపే.      "గులాబీలు
 పెళ్లిళ్లలో బంధువుల చేతికి అందించే.  గులాబీలు
పెండ్లి జంటలకు మెడలో వేలాడే.           గులాబీలు
పెద్దరికాన్ని నిలుపుకునే ది.                    గులాబీలు
 ఆనందపు ఆలోచనలు నింపేది.            గులాబీలు
మంచి మనసుని పదిల పరిచే.              గులాబీలు
పూల బుట్ట లో పుణికిపుచ్చుకొనే.        "గులాబీలు
 పూ... దోటలలో దోబూచులాడు             గులాబీలు
ఇంటి ఆవరణంల లో నిండుగా ఉండే.  .  గులాబీలు
మట్టి బుట్టలో మనసు విప్పి వికసించే.    గులాబీల
మనిషి మనసుని మంచితనంతో దోచే.   గులాబీలు
ప్రతి పూజలు దాగి ఒదిగి మెదిలే.         "గులాబీలు
నిండు ముత్తైదువ సిగలో ముడిచిన.    "గులాబీలు
మరి ఇన్ని మురిపాల మురిపించిన.       గులాబీలు
 ముళ్ళుక్రింద దాచినావో ఎందుకు అమ్మా--  గులాబీలు
           "
           "ఓ గులాబీలు గుబాళింపులు జాగ్రత్త "
          "  మనిషి నిన్ను నలిపేస్తున్నాడు జాగ్రత్త "
19
సమూహము :వీర కవిసమయం
తేదీ :24-05-2020
కవిత సంఖ్య :19
కవి పేరు :మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు :మహబూబాబాద్
సెల్ నెంబర్:  9676 86 02 60
శీర్షిక:      "అమ్మ ఆడిన బొమ్మలాట"
--------   --------$$$$$$--------------


చిన్నప్పుడు మా అమ్మ
బొమ్మలతో  ఆడుకునే దంట
 ఆ బొమ్మ ఒక  అమ్మ య్యిందంట
 అమ్మానాన్న ల  బొమ్మలాట లో
ఆ అమ్మ బొమ్మ అమ్మాయి తే
 నేను అమ్మకు పుట్టాడంట
నాకు అమ్మ బొమ్మలు ఇచ్చింది ఆడు కొమ్మని
 ఆడుకుంటున్న బొమ్మలతో ఒక ఆడ బొమ్మ
ఆ ఆడబొమ్మ మా అమ్మ లాగా అనిపించింది
దానిని అమ్మ అని నత్తి నత్తి గా పలికితి నంట
 ఈ బొమ్మల అన్ని నీవే అన్న మా బాఅమ్మ
 నా  ఏడుపు మానిపించ టానికి
 బొమ్మలు వేసింది ముందు
ఏడుపు మాని బొమ్మలతో ఆడిన నాకు
ఆ ఆటలో బొమ్మలే కదా అనుకున్నా కానీ
అందులో అమ్మ బొమ్మ ఉందని చెప్పిన
మా బామ్మ అమ్మను చూపించింది
 మా అమ్మ చనుబాలు కుడి పెంచాలి  అనుకున్న
  డబ్బా పాల తో పెంచింది మా బామ్మ
 మా  అమ్మ నీచూపించమని అడిగా  మా బామ్మని
 పైకి చూపిస్తూ అంది
 మనమంతా బొమ్మల మే ఆ బ్రహ్మ కి
  ఆ అమ్మే నీ  జన్మ రహస్యాన్ని కి మూలం
 అమ్మ ఆట బొమ్మ కాదమ్మా
 ఉగ్గుపాలు రంగరించి తాపీ నఅమ్మ
ఉయ్యాలకు కట్టింది  ఒక బొమ్మని
 బ్రహ్మ   బొమ్మల ను సృష్టించిన
ఆ బ్రహ్మ ను సృష్టించింది అమ్మే కదా

    "అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ"
     "అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ"
20
సమూహము :వీరా కవిసమయం
తేదీ :25-05-2020
కవిత సంఖ్య:  20
 కవి పేరు: మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు: మహబూబాబాద్
సెల్ నెంబర్ :9676860260
 శీర్షిక.   "తాపీ మేస్త్రి వందనం"
---------------------$$$$$$$$$$-----------

ఇటుక మీద ఇటుక వేసి
ఇల్లు కట్టి నావా తాపీ మేస్త్రి
 నీవు కలిపిన సున్నం ఎంత
అందులో నిండిన ఇసుక ఎంత
కలబోసి కలిపిన నీరు ఎంత
తాపీ తో కొట్టిన ప్పుడు కారిన చెమట
 చుక్కలు విలువ ఎంత
ఇటుకలు విసిరేస్తా వు పైకి
సిమెంట్ తో సాహసం  చేస్తావు
ఇసుకతో పరాచికాలు ఆడుతావు
 అన్నీ కలిపిన తరువాత
 తాపీ తో నాట్యం చేస్తావు గోడకు కొడుతూ
నీకు ఇచ్చిన కూలి ఎంత
నీవు తిన్న కారం మెతుకుల విలువెంత
తినగా మిగిలిన పైకం ఎంత
 కట్టిన ఇంట్లో ఉన్నది ఎవరు
వారికి మిగిలిన ఆస్తి ఖరీదు ఎంత
 నీ కష్టాలన్నీ కలుపుకొని దిగమింగిన బలమెంత 
అందమైన గోడల కట్టుబడి లో నీ రక్తపు విలువెంత
నీవు దిద్దిన రంగుల మెరుపుల ఎంత
 నీ మొఖము ఎండకు కాలిపోయిన రంగు ఎంత
ప్రేమతో అద్దిన ఇంటిలో సొగసులు తీరులు ఎంత
 ఎవరో గీసిన గీత లకు
 నీ తాపీ తో కలిపిన రాత లెంత
నీవు పట్టుబట్టి కట్టిన గోడ విలువ ఎంత
నీవు కష్టాలలో కళ్ళు మూసుకుని
 పడుకున్న రాత్రులు ఎన్ని
 నీవు కట్టిన ఇంట్లో సుఖశాంతులతో ఉన్నది ఎవరు
 నిద్రించిన రోజులు ఎన్ని
నీవు వలస వచ్చిన దూరం ఎంత
చివరికి నీకు మిగిలేది ఎంత
అమ్మానాన్నల విడిచిన రోజులు ఎన్ని
ఆలీ తో కలిసి మాట్లాడిన రోజులు ఎన్ని
లాక్ డౌన్ లో నీ తిన్న పూటలు ఎన్ని
     
      " తాపీ మేస్త్రి నీకు వందనం అన్న "
        "తాపీ మేస్త్రి నీకు వందనం అన్న"

21
సమూహము: వీర కవి సమయము
 తేదీ :26-05-2020
కవిత సంఖ్య:   21
 కవి పేరు :మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు :మహబూబాబాద్
 9676860260

శీర్షిక:    " కష్టమంటే ఏమిటి ?"
-----'-------------$$$$$---------------
__________________________


కష్టజీవి కళ్ళల్లో కారిన నీటితో
తడిసిన కనురెప్పలు అడుగు.     
     "కష్టం అంటే ఏమిటో"

కార్మికుని కాళ్లల్లో కాచిన కాయం
 పగిలి వచ్చిన   నెత్తురు నడుగు 
      "కష్టం అంటే ఏమిటో "

కష్టాన్ని ఇష్టంగా మలుచుకుని కారం
 కలిపి తినే మెతుకుల గొంతు నడుగు.
      "  కష్టం అంటే ఏమిటో "

కాయకష్టం చేసిన కూడా అష్టలక్ష్మి చెంత లేక
ఈసడించుకునే వాడిని అడుగు.   
         "కష్టం అంటే ఏమిటో"

కనుమరుగైపోయిన కాల చక్రాల
కింద పడి నలిగే మాటల నడుగు   
         "కష్టం అంటే ఏమిటో :

కర్షకుని పొలములో ఉన్న మట్టి పేల్లను
 తడిపిన చిట్టి చినుకుల నడుగు.
         "కష్టం అంటే ఏమిటో "

కాళ్ల పారాణి ఆరకముందే కట్నం కోసం
కాల్చిన చిట్టి అగ్గిపుల్ల నడుగు.
       "  కష్టం అంటే ఏమిటో "

కా...మందులు చేతుల లో చిక్కుకొని
చీకట్లో నలిగిన నా మంచం పట్టినడుగు.
      "   కష్టం అంటే ఏమిటో "

కటిక దరిద్రుడు ఇంటి చీకటిలో మెరిసిన
మెరుగుడు పువ్వు వెలుతురు నడుగు 
       "  కష్టం అంటే ఏమిటో "

కారాగారంలో ఉరికంభంనకు వ్రేలాడే
 తాడు ముడి చివరి నార కొస నడుగు
          "కష్టం అంటే ఏమిటో "

కమ్మరి కొలిమి లో సాగదీసి కొట్టే ఇనుప ముక్కలపై
సమ్మెట దెబ్బలు తట్టుకునే దాతి నడుగు.
         " కష్టం అంటే ఏమిటో "

కరువు కోరల్లో చిక్కుకున్న కమ్మని తిండి
లేక ఎగిరే కాకి పిల్ల అడుగు. 
          "కష్టం అంటే ఏమిటో "

కరుడుగట్టిన నీరు లేక గాలికి రాలి
ఎగిరి పోయే పువ్వ పుప్పొడి నీ  అడుగు
         "  కష్టం అంటే ఏమిటో "

కంకర రాళ్లపైన కాళ్ళు పెట్టి రైలు
పట్టాలపైన మొలలు కొట్టే సుత్తి నడుగు.
        "   కష్టం అంటే ఏమిటో."       

కన్నతల్లిని కళ్ళ నిండా  చూడలేని
 గుడ్డివాడి కనుపాపల నడుగు
        " కష్టం అంటే ఏమిటో"

అప్పుచేసి కొనుక్కున్న ఆటో టైర్ పంచర్
అయిప్పుడు నడిచ

22

సమూహము వీర కవిసమయం
తేదీ 27 -05- 20 20
కవిత సంఖ్య 22
కవి పేరు మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు మహబూబాబాద్
సెల్ నెంబర్ 96 76 86 02 60
 శీర్షిక.   " అమ్మ జన్మనిస్తుంది"
-----------------$$$$$$$--------------


అమ్మ జన్మనిస్తుంది
నాన్న బ్రతుకును ఇస్తాడు
 గురువు చదువు ఇస్తాడు
 భార్య ప్రేమ నిస్తుంది

సమాజం నేర్పిస్తుంది
 ఏడుపు కన్నీరు నిస్తుంది
ఓదార్పు ధైర్యాన్నిస్తుంది
 అందము ఆకర్షణ  నిస్తుంది

ఉద్యోగం డబ్బునిస్తుంది
అన్నం ఆకలి తీరుస్తుంది
బంగారం అలంకారం  నిస్తుంది
అలంకారం  గర్వం నిస్తుంది
గర్వం మనిషి రెచ్చగొడుతుంది

గృహం నివాసాన్ని స్తుంది
లోకం మనుగడ నిస్తుంది
 మనుగడ మంచి పేరు నిస్తుంది
మంచి పేరు గుర్తింపు నిస్తుంది

నల్లని మబ్బులు వర్షాన్ని నిస్తుంది
కురిసిన వాన తడి నిస్తుంది
 తడిసిన భూమి మొలకల నిస్తుంది
 మొలిచిన మొలకలు చెట్టు నిస్తుంది
చెట్టు పండు నిస్తుంది

పండు తిన్న ఆయుష్ నిస్తుంది
 ఆయుష్ బలాన్నిస్తుంది
బలం మనిషికి ఆరోగ్యం నిస్తుంది
ఆరోగ్యం ఆలోచన చేస్తుంది

23
సమూహము :వీరాజ్ కవిసమయం
తేదీ :28-05-2020
కవిత సంఖ్య :23
కవి పేరు: మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు :మహబూబాబాద్
96 76 86 02 60
శీర్షిక  :    "కళ్ళతో చూడలేని వాడు"

-----------------$-------------------------

కళ్ళతో చూడ లేక కనురెప్పలను
 తెరవలేక గుడ్డివాడిని
కాళ్లతో నడవలేక గర్భగుడిలోకి
చేరలేక కుంటి వాడిని
వేదమంత్రాలు చెవులారా చెవులతో
 వినలేక చెవిటి వాడిని
రెండు చేతులతో పైకెత్తి దండం
 పెట్టలేని చేతులు లేని వాడిని
నా నడుము నా మాట వినలేక
నెట్టుకుంటూ తిట్టుకుంటూ గుడిమెట్ల నుండి
 చేరలేక దేవుని దగ్గర చేరాక
మనసులోనే ఉన్న మనసుని
మందిరము చేసుకొని రూపం లేని
దేవుణ్ణి రూపాన్ని ఊహించుకొని
రకరకాల పేర్లతో పిలిచే దేవుని
రంగురంగులతో ఊహించు కొని
 కష్టపడి కడుపార కన్న తల్లితో
మనసార మాట్లాడలేక కంటినిండా
అమ్మ రూపాన్ని చూడలేక
జోల పాట వినలేక
నాన్నకు కావలసినవి తీసుకురాలేక
 తీసుకువచ్చి ఇవ్వలేక
ఈ నీచ స్థితిని ఎందుకు ఇచ్చావని
 దేవుని అడగలేక ఈ మనుషుల
మధ్య  స్థానాన్ని పొంద లేక
 కుంటి, గుడ్డి  ,మూగ , చెవిటి ,అనే
బిరుదులు పొందుతూ
 చస్తూ బ్రతుకుతూ బ్రతుకుతూ
ప్రతి క్షణం చస్తూ అభాగ్యులం అనాధలం
 అందరితో అనుకునే అమాయకులం
బతుకు జీవుడా అని బతుకుతున్న బడుగు జీవిని
 కానీ ...కాళ్లు చేతులు కళ్ళు చెవులు
శక్తియుక్తులు ఉన్నా ఓ మనిషి
నీవు ఎందుకు అనాగరికంగా జీవిస్తున్నారు
నిండు ప్రాణాలను తీస్తున్నావు
ప్రేమను సమాధి చేస్తున్నావు
కులాన్ని ఇంకా వీపుపై మోస్తున్నారు
 అన్నీ ఉన్నా కూడా గొప్పగా చెప్పుకునే
నీకన్నా ఏమీ లేవు అనుకునే
నేనెంతో గొప్పవాడిని
 కళ్ళు లేని వాడినని అవహేళన చేయకు
నా మూడో కంటితో చూసి
ఎంతో కొంత బాగు చేస్తా ఈ ధోరణి.
24
సమూహము: వీర కవి సమయం
తేదీ :29-05-2020
కవిత సంఖ్య :24
కవి పేరు :మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు: మహబూబాబాద్
96 76 86 02 60
శీర్షిక:   " శిల్పి చెక్కడం స్థిర స్థాయి"
-------------------@@@@@-------------


కష్టమైన చేతులతో ఇష్టమైన
 పని నీ చేయమన్నది
పడి తొక్కే రాయ ఉలి వేసి చెక్కితే
ఊరు జనులకు మ్రొక్కు రాయి
చిరునవ్వులు చిందిస్తూ చెక్కిన
శిల్పి నేటికీ అవి మేలుకొలుపులు అయినవి
చరిత్రను సృష్టించిన శిల్పి
తరతరాలకు సంపూర్ణ సృష్టి అయినది
ఎన్ని తరాల కైనా మాసిపోని తరిగిపోని
ఆస్తి ధనం శిల్పి కష్ట మదనం
భారతీయుల చరిత్ర కన్నుల పండుగగా
 చూపించిన శిల్పికి కళా వందనం
చెక్కిన శిల్పులు అమరులైన
చక్కబడిన కళాఖండాలు నిలిచిపోవునుకదా
నా ...ఈ సంపద పోయిన తరం నేటితరం
రేపటి తరం రానున్న తరం
తరం తరం నిరంతరం వెలుగును కదా
అఖండ జ్యోతి లై ఈ కళాఖండాలు
భక్తిని రంజింపజేసి భావాలను వెలికితీసే
 ఈ....నైపుణ్యాలు భరత మాత ఒడిలో
పుట్టిన తెలుగు జాతి నిండుదనం గా
వెలుగొంది కట్టడాలు
నా చేతులు కష్టమైన
ఇష్టమైన పనులు చేయించి నవి
నల్ల బండ పైన నాట్యాచార్యుల ని
నగుమోము తోడ చెక్కిన
నాట్యమయూరి లను దింపినట్లు
 నవరసాలను వంపి దింపిన ఉలి
పదును లతో మెత్తగా హత్తుకున్న ట్లు
సుత్తి దెబ్బలతో సంగీతాన్ని
పరవళ్లు తొక్కించి న
 నా శిల్పి అంత ర్యాలు
కాకతీయుల కళాఖండాలు
రుద్రమదేవి వీరత్వం శాసనాలతో నింపిన
నా శిల్పి చేతులు కష్టమైన ఇష్టమైనవి గా
 మలచిన. 

          ,నా శిల్పి చేతులు తో చెక్కడం చిరస్థాయి.

25
సమూహము :వీర కవిసమయం
తేదీ :30-05-2020
 కవిత సంఖ్య :  25
కవి పేరు :మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు :మహబూబాబాద్
     96 76 86 02 60
 శీర్షిక. :      "ఓ యువత ఎటు నీ ప్రయాణం"
----------------------$$$$$$---------------------


ఓ యువత ఎటు నీ ప్రయాణం
 బాధ్యతగల పౌరుల కొరకు
 బార్లు బార్ల గా తెరిచారు
బాధ్యతలను మరి పిలుస్తున్నారు
మత్తు ఎక్కిస్తున్నారు
బంధువుల మధ్య బంధం
విడదీస్తున్నారు
నూగు మీసాల వాడు నూరు
 రూపాయలిచ్చి మూతలు తీస్తున్నాడు
మత్తులో ఊగుతున్నాడు
 మానవత్వాన్ని మరుస్తున్నారు
పసి పిల్లలను సైతం పాడు చేస్తున్నారు
 ఆలోచనలను ప్రక్కదారి  పట్టిస్తున్నారు
అన్యాయాన్ని ఆహ్వానిస్తున్నాడు
న్యాయాన్ని నాశనం చేస్తున్నాడు
చేస్తున్నదంతా న్యాయమే అనుకుంటున్నాడు
పల్లెలను ఖాళీ చేస్తున్నారు
పట్టణాలను గబ్బు పట్టిస్తున్నారు
వాయి వరసలు  మరుస్తున్నారు
ముసలి వారిని సైతం వంచిస్తున్నారు
అనాది నుండి వస్తున్న మర్యాదలను
మంట కలుపుతున్నారు
కాలమా ఎటువైపు నీ ప్రయాణం
యువతను మేలుకొలుపు
కష్టాలను కలిగించకు
కా...మందులను పురిగొల్పు కు
మద్యం మత్తులో మరణిస్తున్న
యువకులు ఎందరో
మగువలు ఎందరో విడువ లై
వీధుల్లో పడుతున్నారు
ఆసరా లేక నిరాశ్రయులై జీవిస్తున్నారు
ఆధారము లేక పిల్లల్ని సాగలేక
ఆత్మహత్యలకు చేరువ  అవుతున్నారు
కుటుంబాల మనుగడ కుంటుపడుతుంది
అభివృద్ధి పథకం అన్నారు
మద్యం వ్యాపారం చేస్తున్నారు

           " ఓ యువత ఎటువైపు"
    " ఓ యువత ఎటువైపు నీ ప్రయాణం"


26

[31/05, 9:20 AM] D Venkat Reddy KS...: సమూహము: వీర సమయం
 తేదీ--31--05--2020
 కవిత సంఖ్య: 26
 కవి పేరు: మల్యాల D. వెంకట్ రెడ్డి
 ఊరు : మహబూబాబాద్
9676860260

 శీర్షిక         "పని వాడిని బిచ్చ గాడి నైతిని"
___________________________________
____________________________________


బిక్షాటన లో కూడా నా తల్లి
నాకు తోడయ్యింది
అమ్మ కాళ్లల్లో జవసత్వాలు లేకున్నా
నా కాళ్ళ తో నడిపిస్తున్న
 నీకు నెత్తుటి ముద్ద నై పుట్టాను
 నీ కడుపులో పేగులు మడత పడిన
 నా కడుపు నింపినా  అమ్మా --
 నా ప్రేగులను జోలె చేసి
ఎత్తు కుంటాం అమ్మ
  నీ శరీరము ముడతలు పడి నా
  నా శరీరము వలిచి వస్త్రాన్ని
 చేసి కప్పు  తాన అమ్మ
  నాకు శక్తి ని ఇచ్చావు
 వలస వచ్చిన బ్రతుకులకు
భరోసా లేకుండా
 గుప్పెడు మెతుకుల కొరకు
 నా చేతులు చాచి అడిగి పెడత నమ్మ
నీవు నా చిన్నప్పుడు ఇలాగే
వీపుపై  మోసితి  వంట
 నేను కడవరకు నిన్ను మోస్తా  అమ్మ
 ధర్మ మూర్తులైన ధర్మాత్మ లారా
 దరిద్రుల వైపు చూడక పోతారా
 ఆకలిగా ఉన్న మనకు
అన్నపూర్ణమ్మ పెట్టక పోతుందా
 పనిచేసే మా చేతులు కరోనా కట్టి వేసింది
 పని వాడిని బిచ్చగాడిని చేసింది
 అమ్మ నీ ఆకలి తీర్చే మార్గం లేక
 నా వీపు పైన మోస్తూ అడుగుతున్నాను
 అమ్మ  ఈ ఊరు నాకు కొత్త    ఈ పని నాకు కొత్త
 ఎక్కడ  నుండి వచ్చాము
ఎన్ని తిప్ప లైనా తప్పవు
దారి తప్పిన మనకు
దరిద్ర దేవతే దిక్కు అమ్మ
 మన ఊరికి వెళితే గంజి అయినా
 తాగి గడిపేద్దాం మ్మ మ్మ
 పని వాడిని బిచ్చగాడిని చేసింది
 ఈ మాయదారి కరోనా

"పని వాడిని బిచ్చగాడిని చేసింది"
27
[01/06, 6:27 PM] D Venkat Reddy KS...: సమూహము:   వీర కవిసమయం
తేదీ  01--06--2020
 కవిత సంఖ్య: 27 
  కవి పేరు:  మల్యాల  డి venkat Reddy
ఊరు  :మహబూబాబాద్
శీర్షిక :       "నీవు రాసిన లేఖ ముట్టింది"

____________#######_______

నీవు రాసిన లేక పుట్టింది
నీవు నా వంశానికి వారసుడ ఇచ్చావని
 నీవు నా రూపాన్ని ప్రతి భావించామని
 నీవు పడిన పురిటినొప్పులు చూడలేదని
నీవు నన్ను భర్తగా గౌరవించకున్న కూడా
 నీకు ప్రణమిల్లి మొక్కు  చున్న
నీవు నా శరీరంలో సగభాగం అయిన వేళలో
 నీవు నా చెవిలో చెప్పిన గుసగుసలు వినిపిస్తున్నాయి
 నీవు అమ్మవైన0దుకు ఆనందిస్తున్న
 నేను నాన్నని అయినా ని గర్విస్తున్నా
నీవు నాన్నగా మార్చినందుకు
 నీవు నన్ను గుండెల్లో దాచావని
నేను నా కనురెప్పల్లో నిన్ను దా చేస్తున్న
నీ గుండెల సవ్వడి నా గుండెల్లో తడుతున్న నా
 నాకు  గుండ్ల చప్పుడే వినిపిస్తుంది
నీవు మాతగా ఆనందపడిన
నా ఈ భరత మాత ఒడిలో ఉన్న
నీవు నేర్పిన బాధ్యతలు గుర్తుకొస్తున్న
 నీకు నచ్చిన మనసుతో మాట్లాడిన
నా మనసుతో చదివేస్తున్నా
 నీవు నేను రావాలని కోరుకున్న
నా బాధ్యతలు నన్ను ఆపే ఇస్తున్నవి
 నీవు తల్లిగా ఆలోచిస్తున్నా
నేను భరతమాత కొడుకు గా నిలుస్తు నా
నీవు గద్దెలకు ముక్కే పనిలో ఉన్నా
 నేను యుద్ధరంగ ముందు కాలుదువ్వుతున్న
నేను అమరుడు నైనా
 నా వంశాన్ని అభివృద్ధి చేస్తావు అనుకుంటున్నా
 నేను వీర  జవాను గా
 నీ ముఖాన్ని తడిమి తడిమి చూసేచేస్తున్నా
నీవు రాసిన లేఖ ముట్టింది
 నా హృదయము తోనే చది వేస్తున్న
 నీవు రాసే లేక ముట్టింది


( ఎందరో వీర జవాన్లు భరత మాత ఒడిలో అమరవీరులైన వారికి కుటు0బలాకు  అంకితం ఇస్తున్నాను)                                            "జైజవాన్  జై కిసాన్"
28
[02/06, 7:18 AM] D Venkat Reddy KS...: సమూహము :వీర కవిసమయం
తేదీ02--06--2020
కవిత సంఖ్య: 28
కవి పేరు: మల్యాల D వెంకట రెడ్డి
 ఊరు: మహబూబాబాద్
 శీర్షిక   " భావి తరాలకు బంగారు బాట"

----------------------------------------------------------
----------------------------------------------------------

భావి తరానికి బంగారు బాట
అది కావాలి పూల తోట
పోరాటాల ఫలము తెలంగాణ నిర్మాణ వరం
 సబ్బండ వర్ణాల 'కులాల 'మత'
 జాతుల పోరాటం నా తెలంగాణ
సర్వ జనులకు అందాలి దాని పోరాట ఫలం
మంజీరా .కాళేశ్వరం. ధర్మపురి దద్దరిల్లి
 గోదావరిని కటేసి పట్టేసి పచ్చదనాన్ని
పనిచేసి .పసందైన భూమి నింపేసి
రాజకీయ రంగు ని ఆ నీటిలో కడిగేసి
 రాచరికాన్ని తీసేసి
 గోదావరి పొంగుని అని చేసి
నెట్టెంపాడు లో దానినిగుట్టుగా  కట్టేసి
 కృష్ణమ్మను సైతం ఆపేసి పొలాల్లోకి నెట్టేసి
పాడి పంటలను సైతం పెంచేసి
ఆకలి లేని తెలంగాణను చేసేసి
నీళ్లు, నిధులు,  నియామకాల
మాటలను నిలిపేసి
అమరవీరుల త్యాగాలను నేమరేసి
వారికి మొక్కే సి తెలంగాణ తల్లికి
దండేసి దండం పెట్టేసి
అనగారిన  జనాన్ని హక్కు నచేర్చిసి
వారి జీవితంలో అఖండ జ్యోతిని వెలిగించే సి
ముసలి వారికి సైతం జీవితం పైన
భరోసా ఇచ్చేసి
ఆడపిల్లలకు ఒంటరిగా నడిచే భరోసా ఇచ్చేసి
 ఆనందాన్ని పనిచేసి
 అందరికీ చదువుల తల్లిని దగ్గర చేసి
ఆ తల్లి ఒడిలో నిద్రపోయేలా చూసేసి
 రైతుల బ్రతుకు బంగారు బాట లో నడిపించే సి
ఆత్మహత్యలను నిర్మూలించే సి
కవులు కళాకారులు సాహితీ వేత్తలు
క లాలను  ధూలి  పిచేసి
పునర్ నిర్మాణాలను చేద్దాం
బంగారు భవిష్యత్తును సృష్టిద్దాం
 భావితరానికి బంగారు బాటలో నడిపిద్దాం
 అందరి బాధ్యతగా నడుద్దాం
భావి తరాన్ని బంగారు బాట లో నడిపిద్దాం
      "అది బంగారు బాట''
29

సమూహము వీర కవిసమయం
తేదీ: 03--06--2020
కవిత సంఖ్య: 29
కవి పేరు: మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు:  మహబూబాబాద్
 శీర్షిక:    " ప్రేమ పిచ్చిది"
_____________@@______
_______________________

నీ పై ఆశ పడింది మనసు
అది ప్రేమగా మారింది
మారిన ప్రేమ బంధం అయింది
ఆ బంధం నా సొంతం అయ్యింది
నా సొంతమైన నీ ప్రేమతో
 జీవితం సాగిస్తుంది
సాగిస్తున్న జీవితం భవిష్యత్ నిస్తుంది
నేను నీ మెడ పై వేసిన దార ....బంధం
అది అలంకరణ కొరకే అనుకున్నా ...కానీ
ఇప్పుడు తెలిసింది తీరని బంధమని
 మన ఇద్దరి మధ్య ఒప్పందం మనీ
విడదీయరాని బంధం అని
ప్రేమకు చిహ్నం మనీ
నడచిన నా నడక ఇతరులకు మార్గము కావాలని
 ఆ మార్గము మంచికి దగ్గరవ్వాలని
నేను కోరుకున్న మంచి  మనిషిగా నిలపాలని
ఆ మనిషి మరో మనిషి వరకు కలిసి నడవాలని
నడచిన జీవితము నావల సాగాలని
సాగే నావల నిండుదనం తో సాగాలని
సాగే నావ గాలికి తెరచాప తోడైనట్లు
తోడైన నీవు కలిసి రావాలని
నీవు వస్తున్న దారిలో లతలు
 అల్లుకుంటాయి అని
అల్లుకున్న లత లకు పరిమళ మైన
పూ .. ద్వారబంధము కావాలని
పరిమళ మైన వాసన లు విరజిమ్ము
 పూ... దండలు నిండుగా
 విరజిమ్మిన వాసన పూల దండలు
మన జీవితానికి ఆనందం ఇవ్వాలని
 అందమైన జీవితాని ఆనందించాలని
ఆ ఆనందములో నీ ప్రేమను
జుర్రు కోవాలని
పూ ...ప్పొడిని నా కేసిన తుమ్మెదవో లే చేసిన
parimala జీవితాన్ని సాగించాలి
అందుకే నీపై ప్రేమ పిచ్చి దిగింది
             "ప్రేమ పిచ్చిది"
              "ప్రేమ పిచ్చిది"
30
31.
సమూహము :విర కవి సమయము
తేదీ --5 --6 --20 20
కవిత సంఖ్య  : 31
కవి పేరు :మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు: మహబూబాబాద్
శీర్షిక :     "ఈ రేయ్ ఇలాగే నిలబడితే"
–-------------------------------------------------
---------------------------–----------------------

చల్ల గాలి వీస్తూ ఉంది
 పిల్ల తెమ్మెరలు తగులుతున్నాయి
ఆకాశం మేఘావృతమై ఉన్నది
అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తూ ఉన్నది
కురిపించే వాన కు హద్దులు లేవని పరిగెడుతున్న
ఉరుములు సైతం బెదిరిస్తుంది
ఆనందం పొంగుతుంది
 ఏమో అనిపిస్తుంది
గువ్వల జంట చెట్టు కొమ్మ ని
పట్టుకొని వేలాడుతున్న
మనసు ప్రశాంతంగా ఉన్నాది
గాలి  అప్పుడప్పుడూ నా మనసుని తాకి
నిదాన పరుస్తుంది
ఆకలి వేసినప్పుడు భూతల్లికి అంతో ఇంతో
 తడి తగలగానే అనిపిస్తుంది
మో డు బారిన చెట్లు చిగురించాలని
ఉవ్విళ్ళూరుతున్న
ఈ రేయి గడవాలంటే హాయిగా అనిపిస్తుంది
ప్రకృతి తల్లికి అన్నీ తెలుసు
ఏ కాలం లో జరగ వలసినది
 ఆ కాలంలో జరిపిస్తుంది
అదుపు తప్పిన మనిషి కోరికలు
దానిని అధిరోహించలేకపోతున్నాడు
 మనసు ఎందుకో ప్రశాంతతో
 అది శాంతి గా ఉంటే చాలు అనుకుంటున్నది
నా హృదయము పొంగిపొర్లుతున్న
ఎవరో పిలిచినట్టు అనిపించింది
నేను నిలుచున్న
నా భుజం తట్టి నడిపిస్తుంది
అది పిల్ల గాలి తెమ్మెర కు తగిన
చెట్టు కొమ్మ చిగురాకు
 చిట్టి చినుకులతో తడిసిన
మట్టి పెల్ల సువాసనలు రేపుతున్నది
ఈ వాసన ఎంత హాయిగా ఉన్నదో
ఈ రేయి ఇలాగే నిలబడితే
ఎంత బాగుంటుందో అనిపిస్తుంది
కానీ ప్రకృతి సిద్ధమైన టువంటి ది
జరగవలసిన వి   జరగాలి కదా
     "ఈ రేయి ఇలాగే నిలబడితే "
     "ఈ రేయ్ ఇలాగే నిలబడితే"
32.
సమూహము :వీరా కవిసమయం
తేదీ:6--6--2020
కవిత సంఖ్య :32 కవి పేరు
కవి పేరు మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు :మహబూబాబాద్
శీర్షిక:      " తొలిసారి నిన్ను చూసినప్పుడు"
---------------------------------------------------------
----------------------------------------------------------

తొలత నీవు ఏదో అనుకున్నా
నేలచూపులు కాళ్ల గీతలు
నాకు కోపాన్ని తెప్పించిన
 నీ తల పైకి లేపే సరికి తెలిసింది
 నీవు అందానికి అందం అని
 నీ కనురెప్ప  లు సిగ్గుతో టపటప కొట్టినప్పుడు
అప్పుడు తెలిసింది నా అందాన్ని
 నీవు బంధిస్తున్న వని
నా గుండె ఎందుకోజల్లుమంది
 నా చూపు నీ పైనే పడగానే
 హృదయం విశాలమనీ తెలియక
ఇరుకు సందులో నుండి నడుస్తున్నట్లు
ఒక్కసారి పలకరించాలని అనుకున్నా
పెద్దరికం అడ్డు పడతారేమో అనిపించింది
నీ పెదవుల చిరునవ్వు
నా మనసు నీ బందీ చేసింది
అప్పుడనిపించింది
నేను పూల తోటకు నీరు పెడుతున్నానని
నాలో అగ్ని రాజుకుంది
ధైర్యము దగ్గరయింది
అందించిన స్వీట్ 
అంత రుచించక పోయినా
నీ పెదవి పై రాలిన నీటి చుక్క
 తీపి మత్తు లెక్కించింది
అది ప్రేమో ఏమో తెలియదు కానీ
నేను మనసారా నీ ఒడిలో
సేద తీరాలని పిలిచింది
కానీ కట్టుకున్న దానివి కాదు కదా
 నా కళ్ళు నీ పై నుండి మరల నన్న వి
 అది నీకు ఉన్న అందమో లేక
నేను కావాలనుకునే బంధమొ తెలియదు
నీ నగుమోము పై దిద్దిన కుంకుమ
ఉదయము ఉదయించే
సూర్య కిరణాలు పోలినట్లు
నీ జడ కురులు
నా మెడ చుట్టూ చుట్టుకుని
నీ అందమైన బంధంతో
 బందీ నవ్వాలి అనిపిస్తుంది

"తొలిసారి నిన్ను చూసినప్పుడు"

33.
34.

సమూహము : వీరకవిసమయం
తేదీ.   09---06--2020
కవిత సంఖ్య :34
కవి పేరు: మల్యాల డీ వెంకట్రెడ్డి
ఊరు: మహబూబాబాద్

శీర్షిక:   " నన్నెందుకు నరికి చంపేస్తున్నారు"
---------------------------------------------
----------------------------------------------

చెట్టుని నేను పట్టుపట్టి పెంచండి
చెట్టును నేను పట్టుపట్టి పెంచండి
నీకు ఎండ కాస్తే నా క్రిందకు వస్తావు
నీకు వర్షం నీరు తగిలితే నా పక్కకు చేరుతావు
నీకు ఆకలేస్తే నా పైకి చూస్తావు పండు కొరకు
నీకు చెమట వేస్తే నా కొమ్మలకెసి చూస్తావు గాలి కొరకు

"మరి నన్ను ఎందుకు నరికి చంపేస్తున్నావు?"

సకల కోటి జీవరాసులకు జీవితం ఇస్తున్నాము అడవిగా
నీకు పంటను ఇస్తున్నాము పచ్చదనం ఇస్తున్నాము
నీకు రోగాలకు ఔషధాన్ని ఇచ్చే ఆ కులు ఇస్తున్నాము
మేఘాల ని దగ్గర చేసి వర్షాన్ని కురిపిస్తున్నా ము
సూర్య భగవానుడు కోపంగా నీ వైపు చూస్తే
నా కొమ్మలను అడ్డుపెట్టి నీకు నీడని ఇస్తున్నాము

"మరి నన్ను ఎందుకు నరికి చంపేస్తున్నావు?"

నీకు ముసలితనంలో తోడై తాను కట్టెగా
నీవు పడుకునే మంచం పట్టినైతాను
 నీవు ఉండే ఇంటికి గుమ్మం ననైతాను
నీవు చివరికి చచ్చిపోతే పాడే కట్టనైతాను
నిన్ను కాల్చే చితిమంటల నై కడ తెర్చు తాను

"మరి నన్ను ఎందుకు నరికి చంపేస్తున్నావు?"

పురుషుడు జలం వీడి పెంచరావయ్యా
హరితహారం పేరు తో పెంచరవయా
భావితరాలకు భవిష్యత్ నిచ్చే భరతమాత రుణం తీర్చుకో
వన రక్షణ సంరక్షణ దానిని పరిరక్షణ చేస్తే
నేను నీకు ఇస్తాను ఆరోగ్య రక్షణ
ఆరోగ్యమే మహాభాగ్యం

 "మరి నన్ను నరికి చంపేయకు"
 "నరికి చంపేయకు"
 35

[10/06, 9:44 AM] D Venkat Reddy KS...: సమూహము :వీరా కవిసమయం
తేదీ: 10--06---2020
 కవిత సంఖ్య:   36
కవి పేరు :మల్యాల D వెంకట్ రెడ్డి
ఊరు :మహబూబాబాద్

 శీర్షిక:      " కలం తీసి రాస్తే కవి నవుతాను"
________________________________
________________________________

కలము తీసి రాస్తే  కవి నవ్వుతాను
హలం పట్టి దున్నితే రైతు అవుతాను
సుత్తి పట్టి దాతి పైయిన కొడితే కమ్మరి ని
సారె తిప్పి కు0డ చేస్తే కుమ్మరి ని
మగ్గం వేసి చీరలునే స్తే శాలిని
బట్టలు రేవు బండ పై కొడితే చాకలిని
రాజునైన తలవంచి కత్తిరిస్తే మంగలిని
కోత కోసి కుప్పలు వేస్తే కూలీని
కంకర కొట్టి రోడ్డు వేస్తే వడ్డెరని
 వల విసిరి చేపలు పడితే ముదిరాజ్ ని
మంథని తొలి కెళ్ళి మేపితే గొల్లని
చెట్టు ఎక్కి కళ్ళు గీస్తే గౌడ ని
కర్మాగారంలో పనిచేసే కార్మికుని
జంజం వేసి పంచ కడితే బ్రాహ్మణులు
లుంగీ కట్టి లాల్చీవె సి టో పి పెడితే నవాబులు
గౌను వేసి సిలువవెసి చర్చి కి వెళితే ఫాదర్ ని
కులం కులమని కుళ్లుకుంటారు
మతం మతం అని మారాం చేస్తారు
ఇంకా కులాల నీటిలో   ఈదుతున్న నారు
 మనమంతా మనుషులం అనేది మర్చిపోకు
మర్యాదగా బ్రతకటం మన మతం
భారతీయ బిడ్డలం  భారత దేశ పౌరుల0

            "మువ్వన్నెల జెండా రెపరెపలాడు"
            "మువ్వన్నెల  జెండా రెపరెపలాడు"
35
[10/06, 9:48 AM] D Venkat Reddy KS...: సమూహము : వీరకవిసమయం
తేదీ.   08---06--2020
కవిత సంఖ్య : 34
కవి పేరు: మల్యాల డీ వెంకట్రెడ్డి
ఊరు: మహబూబాబాద్

శీర్షిక:   " నన్నెందుకు నరికి చంపేస్తున్నారు"
---------------------------------------------
----------------------------------------------

చెట్టుని నేను పట్టుపట్టి పెంచండి
చెట్టును నేను పట్టుపట్టి పెంచండి
నీకు ఎండ కాస్తే నా క్రిందకు వస్తావు
నీకు వర్షం నీరు తగిలితే నా పక్కకు చేరుతావు
నీకు ఆకలేస్తే నా పైకి చూస్తావు పండు కొరకు
నీకు చెమట వేస్తే నా కొమ్మలకెసి చూస్తావు గాలి కొరకు

"మరి నన్ను ఎందుకు నరికి చంపేస్తున్నావు?"

సకల కోటి జీవరాసులకు జీవితం ఇస్తున్నాము అడవిగా
నీకు పంటను ఇస్తున్నాము పచ్చదనం ఇస్తున్నాము
నీకు రోగాలకు ఔషధాన్ని ఇచ్చే ఆ కులు ఇస్తున్నాము
మేఘాల ని దగ్గర చేసి వర్షాన్ని కురిపిస్తున్నా ము
సూర్య భగవానుడు కోపంగా నీ వైపు చూస్తే
నా కొమ్మలను అడ్డుపెట్టి నీకు నీడని ఇస్తున్నాము

"మరి నన్ను ఎందుకు నరికి చంపేస్తున్నావు?"

నీకు ముసలితనంలో తోడై తాను కట్టెగా
నీవు పడుకునే మంచం పట్టినైతాను
 నీవు ఉండే ఇంటికి గుమ్మం ననైతాను
నీవు చివరికి చచ్చిపోతే పాడే కట్టనైతాను
నిన్ను కాల్చే చితిమంటల నై కడ తెర్చు తాను

"మరి నన్ను ఎందుకు నరికి చంపేస్తున్నావు?"

పురుషుడు జలం వీడి పెంచరావయ్యా
హరితహారం పేరు తో పెంచరవయా
భావితరాలకు భవిష్యత్ నిచ్చే భరతమాత రుణం తీర్చుకో
వన రక్షణ సంరక్షణ దానిని పరిరక్షణ చేస్తే
నేను నీకు ఇస్తాను ఆరోగ్య రక్షణ
ఆరోగ్యమే మహాభాగ్యం

 "మరి నన్ను నరికి చంపేయకు"
 "నరికి చంపేయకు"
36
[10/06, 9:49 AM] D Venkat Reddy KS...: సమూహము వీర కవిసమయం
తేదీ:09-06--2020
కవిత సంఖ్య:  35
కవి పేరు: మల్యాల డి వెంకట్ రెడ్డి
శీర్షిక: " అభిమానం నాది కాదు"
---------------------------------------------
---------------------------------------------

నేను ఈరోజు చెప్పినవి నీకు
రుచించకపోవచ్చు
రేపటి రోజు అది గుర్తుకు వస్తే
 నీవు ప్రశ్నించు కుంటావు
నీవు తెలుసుకునే టప్పటికి ఏమీ మిగలదు
ఎండ మాములు లో నీళ్లు గుర్తించ  వచ్చునంట
కుందేటి కొమ్ము మొలిపించ వచ్చునంట
నీలో ఉన్న అంతరాలను చూపించలేము
 ఈరోజు నాకు జరిగిన అవమానం
 మీకు సంతోషం ని ఇచ్చిన
రేపటి రోజు నీదేనని మర్చిపోకు
 అప్పుడు దుఃఖం తో నిండిన నీ మనస్సు
మనసుకు జరిగిన అవమానం
 గుండె పొరల్లోకి చొచ్చుకుని పోయి
వెనుకటి రోజులు గుర్తుకు వస్తాయి
ఈ రోజు నీకు మంచి రోజులు అయినా
 రేపు మంచి జరగకపోవచ్చు
 గాలిబుడగ అధికారం
  నీ సొంతం అనుకోకు
 ఈ అధికార పీఠం  మరొకరిది అవ్వచ్చు
నీవు ఊహల్లో బ్రతుకుతున్నారు
నీవు బాధ్యతలను మర్చి పోయి
నీవు   అందలమెక్కినాని గర్వపడకు
నీవు అనుభవిస్తున్నది నీవు సృష్టించింది కాదు
 ఈ సృష్టిని సృష్టించిన  సృష్టి ధర్మాన్ని
తెలిసిగాని అవమానించకు
 నాది అనుకుని  నీది కాదు
 నీది అనుకొని పాడు చేస్తే
 నిన్నే కాటు వేస్తుంది
 నాకు జరిగిన అవమానం
మీకు సంతోషాన్ని కలిగించినా

         "ఆ అవమానం నాది కాదు"
        "ఆ అవమానం నాది కాదు"
37
[11/06, 3:33 PM] D Venkat Reddy KS...: సమూహము  :వీర  కవిసమయం
తేదీ:11--june--2020
కవిత సంఖ్య:
కవి పేరు: మల్యాల D వెంకట్ రెడ్డి
 ఊరు మహబూబాబాద్
శీర్షిక:   "భూమి పుత్రుడు"
------------------------------------------
------------------------------------------

ధనము సంపాదించే వాడైనా
దరిద్రాన్ని మోసే వాడైనా
ఆకలితో అలమటించిన అప్పుడు
కావాలి ఉదర మనకు ఇంత ఊరట
 దానిని సాగు చేసే వాడు
 పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా
 మట్టి లోనే ఉంటాడు మట్టి పైన బ్రతుకుతాడు
 మట్టిని మాయ చేసి బువ్వ తీస్తాడు
 పశుపక్ష్యాదులను బంధువులు అంటాడు
 మట్టి గంధము పరిమళపు సుగంధం
మట్టితోనే మమేకమై ఈ ప్రపంచాన్ని మర్చిపోతాడు
 కాడెద్దులు తమ బిడ్డల అంటాడు
కాపురం చేసే ఆలీతో సమానంగా చూస్తాడు
 మనుషుల కన్నా గొప్ప పేరు పెడతాడు
రామలక్ష్మణులని
కారం మెతుకులు కడుపులో వేస్తే చాలు
 కాయకష్టం చేయటానికి బలం వస్తుంది
సెంటు వాసన అంటదు అతని
 మట్టి వాసన కే మై మర్చిపోతాడు
 భూతల్లిని బుద్ధ గరించి
సాలు సాలుకు తల్లడిల్లిన
 పచ్చదనంతో పరవశింప చేస్తాడు
  కార్లు మెడలు కలలో కనిపించిన
 కటిక నేలపై నా కాడెద్దుల తో కలిసి పోతాడు
 ఆయన కట్టే వస్త్రానికి ఇస్త్రీ ఉండదు
 తల గుడ్డకు  తపెడుమట్టి ఉంటది
పై మీద గుడ్డ పాతదైన
బొక్కల పోగు ఒంటిని కప్పుతారు     

                        "అతనే భూమి పుత్రుడు"
38
[11/06, 6:21 PM] D Venkat Reddy KS...: సమూహము  :వీర  కవిసమయం
తేదీ:11--june--2020
కవిత సంఖ్య:37
కవి పేరు: మల్యాల D వెంకట్ రెడ్డి
 ఊరు మహబూబాబాద్
శీర్షిక:   "భూమి పుత్రుడు"
------------------------------------------
------------------------------------------

ధనము సంపాదించే వాడైనా
దరిద్రాన్ని మోసే వాడైనా
ఆకలితో అలమటించిన అప్పుడు
కావాలి ఉదర మనకు ఇంత ఊరట
 దానిని సాగు చేసే వాడు
 పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా
 మట్టి లోనే ఉంటాడు మట్టి పైన బ్రతుకుతాడు
 మట్టిని మాయ చేసి బువ్వ తీస్తాడు
 పశుపక్ష్యాదులను బంధువులు అంటాడు
 మట్టి గంధము పరిమళపు సుగంధం
మట్టితోనే మమేకమై ఈ ప్రపంచాన్ని మర్చిపోతాడు
 కాడెద్దులు తమ బిడ్డల అంటాడు
కాపురం చేసే ఆలీతో సమానంగా చూస్తాడు
 మనుషుల కన్నా గొప్ప పేరు పెడతాడు
రామలక్ష్మణులని
కారం మెతుకులు కడుపులో వేస్తే చాలు
 కాయకష్టం చేయటానికి బలం వస్తుంది
సెంటు వాసన అంటదు అతని
 మట్టి వాసన కే మై మర్చిపోతాడు
 భూతల్లిని బుద్ధ గరించి
సాలు సాలుకు తల్లడిల్లిన
 పచ్చదనంతో పరవశింప చేస్తాడు
  కార్లు మెడలు కలలో కనిపించిన
 కటిక నేలపై నా కాడెద్దుల తో కలిసి పోతాడు
 ఆయన కట్టే వస్త్రానికి ఇస్త్రీ ఉండదు
 తల గుడ్డకు  తపెడుమట్టి ఉంటది
పై మీద గుడ్డ పాతదైన
బొక్కల పోగు ఒంటిని కప్పుతారు     

                        "అతనే భూమి పుత్రుడు"
39
[12/06, 9:39 AM] D Venkat Reddy KS...: సమూహము: వీర కవిసమయం
 తేదీ:12--june-2020
 కవిత సంఖ్య: 38
 కవి పేరు :మల్యాల డీ వెంకట్రెడ్డి
 ఊరు: మహబూబాబాద్
శీర్షిక:       "అడవి తల్లి బిడ్డలు"
--------------------------------------
---------------------------------------

కోకిల నీవు పాడే పాట ఎవరు నేర్పారు
ఈ అడవి తల్లి కదా
నీ రూపు కాకి రూపు నీ జన్మకు మూలం ఆ కాకి కదా
కాకి గోల అని దాని పేరు, కోకిల పాట అనేది నీ పేరు
 కాకితో కబురు పెట్టేవారు  పాట పాడేది కోకిలమ్మ

మయూర మా నీవు చేయు నాట్యం ఎవరు నేర్పారు
  ఈ అడవి తల్లి కదా
నీవు పురివిప్పి  ఆడినప్పుడు
ప్రకృతి పరవశించి దంట
అడవితల్లి ఆనందానికి అవధులు లేవు అంట
నీ నాట్యానికి మనిషి కూడా
నాట్యమయూరి అని బిరుదు పొందుతున్నాడు
నటరాజుకే నాట్యం నేర్పిన నాట్యమయూరి
నీ కాలిగోటి సవ్వడికి సరిగమలు పలికినవి
పలికిన సరిగమలు సప్తసముద్రాలు తడ బడినవి

చిలుకా నీ పలుకులు బహు ముచ్చటగా ఉన్నవి
నీవు ముచ్చటగా జ్యోతిష్యాన్ని చెపుతా వంట
 చెప్పే జ్యోతిష్యం మనిషి బ్రతికే నంట
దీన్ని నేర్పింది
       ఈ అడవి తల్లి కదా!

 గోరువంక మంచి సంసారానికి నిన్ను చూపిస్తారు
 చిలకా గోరువంకలు అని
 మనిషి సంసారానికి నిన్నే చూపుతారు
 ఈ సంసారము జంటకు నేర్పింది
       ఈ అడవితల్లి కదా

పావురమా నీవు శాంతికి చిహ్నం అంట
 సందేశాలను అందించే దాన వంట
 నీకు నేర్పిన గురువు
          ఈ అడిగి తల్లి కదా
హంస నడకలు నేర్పింది ఎవరంటా
 హంస నడక అని అందరూ అంటుంటారు
 మరి నీ గురువు ఎవరు
           ఈ అడవి తల్లి కదా
40
[13/06, 1:32 PM] D Venkat Reddy KS...: సమూహము :వీరకవిసమయం
తేదీ --13--06--2020
సంఖ్య : 39
కవి పేరు:   మల్యాల డి వెంకట్ రెడ్డి
 ఊరు :మహబూబాబాద్
 శీర్షిక:           "మనిషి దారి తప్పుతున్నాడు "
-------------------------------------------------
-------------------------------------------------

 మనిషి దారి తప్పుతున్నాడు
మనిషి దారి తప్పుతున్న డు         
మనసు కలుషితం అవుతున్నది
 మనము అనే పదానికి అర్థం లేదు
మంచి పనుల కన్నా చెడు పనులు ఎక్కువైనవి
 మరో మనిషి మనోగతం తెలియదు
 మనం  మనమనేది  మర్చిపోతున్నాము
 మన పిల్లల భవిష్యత్తు ని కాపాడలేక పోవుచున్నాము
 మన ప్రకృతినిపాడు చేస్తున్నాము
 మనం స్వార్ధా బుద్ధితో ఉన్నాము
 మన భూగ్రహం కలుషితం చేస్తున్నా ము
 మన ధర్మాన్ని మర్చిపోతున్నాం
 మన కోరికలకు హద్దులు లేవు
 మనం  అందరి కొరకు బ్రతక లేక పోతున్నా ము
 మనం స్వార్థంతో పాడైపోతుంనాము
 మనం ఇతరులకు చెడు తలపెడుతున్న ము
 మనం ఆస్తులకోసం ఆరూలు చాస్తున్నాము
 మనం నిన్నటి గురించి మరిచిపోతున్నాం
మనం రేపటి ని ఆలోచించలేక పోతున్నా ము
     "మనిషి దారి తప్పుతున్నారు"
      "మనిషి దాడి తప్పుతున్నారు"
41
[14/06, 1:38 PM] D Venkat Reddy KS...: సమూహము :వీర కవి సమయం
తేదీ:14--june--2020
కవిత సంఖ్య: 40
కవి పేరు: మల్యాల డి వెంకట్ రెడ్డి
ఊరు:  మహబూబాబాద్
శీర్షిక:        " నేను అనాధ నా?"
__________________________
__________________________

అందరూ నన్ను అనాధ అంటున్నారు
అదేదో నాకు తెలియదు
 నా ఇల్లు వాకిలి తెలిసిందల్లా
రైల్వే స్టేషన్లు, బస్టాండ్   కానీ
అవేమో తాళాల మీద తాలుపడి
మమ్ములను తరిమేస్తున్నారు
అంతో ఇంతో అడుక్కొని తిందామన్నా
కరోనా పేరుతో గల్లీ గల్లీలో లొల్లి ఎక్కువయింది
కట్టె కంపలతో రోడ్డు కట్టిడిచేస్తున్నారు
అమ్మానాన్న ఎలాగో లేరు
ఆకలేస్తే పట్టెడన్నం పెట్టే వాళ్ళు లేరు
చెత్తకుప్ప తొట్టి కాడ అన్న  దొరుకుతుంది అంటే
హోటల్ అన్ని మూతబడినవి
 మా గుంపంతా ఎక్కడ పోయిందో తెలియదు
 నేను ఒంటరిగానే ఉండిపోయాను
బజార్ నీళ్లులైనా తాగుదామంటే
నల్లాల ని మరమ్మతులు లాయే
అక్కడో ఇక్కడో వెతికి పట్టినాచుక్క నిీరురాకపాయే
కరోణ వచ్చింది కాళ్ళు చేతులు కడుగు దామన్న
 కడుపునిండా తాగుదామని మంచినీరె లేక పాయే
ఆకలి తీరక పోయే నీళ్లు రాక పాయే
మేము అనాధలం అంట అది మాకు తెలియదు
మా బ్రతుకులు బజార్  పాలేనా?
                   
                        "నేను అనాధ నా ?
                       " నేను అనాధ నా"?
42
[16/06, 7:01 AM] D Venkat Reddy KS...: సమూహము వీరా కవిసమయం
తేదీ: 16--06--2020     (మంగళవారం)
కవిత సంఖ్య:  42
కవి పేరు మల్యాల డీ వెంకట్రెడ్డి
ఊరు :మహబూబాబాద్
శీర్షిక:         "చివరి గెలుపు నీదే"
-------------------------------------------
-------------------------------------------

చిగురు తొడిగే స్వప్నాల నుండి
సాధించే లక్ష్యాల వరకు
లక్ష్యం ఏదైనా
నీ ఆలోచనకు పదును పెట్టు
రాయిని సాన పడుతేనేకదా
వజ్రం తయారయ్యేది
కష్టాన్నయినా ఇష్టంగా మలుచుకో
నష్టం వచ్చినా నడక సాగించు
 సాగించే దాని లో సాధించాలి  ని అభివృద్ధిని
నీ అభివృద్ధికి ఆటంకం కలిగిన వేణు తిరగకు
నీవు కలలుగన్న వాటిలో కలగానే మిగిల నివ్వకు
దారి తప్పిన వాడు దారిలోకి రాక తప్పదు
 అవరోధాల్ని అధిరోహించి నప్పుడు
అవకాశం సద్వినియోగం అయ్యేది
సాధన చేసి తే  సాధించలేనిది ఏదీ లేదు
 మనస్సు నీ బాధ కన్నా  బాధ్యతలకు పురిగొల్పు
కష్టం  తో కృంగిపోయి కూర్చో కు ఎదురు ఈదు
చిగురించే కోరికలకు పదును పెట్టు
 గతం నుండి  రాబట్టిన అనుభవము
 భవిష్యత్తులో సాధించుకో
నీవు కృంగిన ప్పుడు వెలుగు లో ఉన్న
 నీ హృదయం చీకటి లో ఉన్నట్లు0టుంది
 అన్నింటినిచేది0చినప్పుడు చివరి గెలుపు నీదే
                  "చివరి గెలుపు నీదే "
                   "చివరి గెలుపు నీదే"
43
[17/06, 1:23 PM] D Venkat Reddy KS...: సమూహము: వీర కవి సమయం
తేదీ : 17--06--2020
కవిత సంఖ్య :   43      (బుధ వారం)
కవి పేరు :మల్యాల డి వెంకట్ రెడ్డి
 ఊరు :మహబూబాబాద్
శీర్షిక   :       "ఓ తెలుగు బిడ్డ"
–-------------------------------++----
------------------------------------------
ఓ తెలుగు తెలంగాణ బిడ్డ
నీవు తిరగబడ్డ వేళ
భరత మాత ఒడిలో
కన్న తల్లిదండ్రుల ఆశయాలకొరకు
సైన్యంలో చేరి చేదించిన
తల్లి రక్షణ కొరకై
తరిమి తరిమి శత్రు మూకలను
 గజగజలాడించిన వేళ
రెపరెపలాడిన మువ్వన్నెల జెండా నీడలోన
ఆ జెండా గాలి సవ్వడిలో
గుండ్లకు గుండెను ఎదురొడ్డి
 వీరోచితంగా పోరాడిన
మంచుకొండల్లో మట్టిని పుట్టించి
ఎదుటి వారికి ఆ మట్టిని కరిపించిన
నా జాతి రక్షణ ముఖ్యమని
  వీర కర్నూల్  గా పేరొందిన
అణువు అణువు నాదేనని
130 కోట్ల భారతీయుల రక్షణకు
ఈ జెండా కర్ర వెన్నుతట్టి లేపి నటి
వీర మరణం పొందిన వీరుడా
పోరాటాల గడ్డ సూర్యాపేట బిడ్డ
నీవు చూపిన తెగువ వెలుగులో
మిగిలిన వారికి ఆదర్శం అయినావు
మరిచిపోదు మరిచిపోదు
ఈ జాతి మన భారత జాతి
తిరగబడ్డ తెలుగు బిడ్డ
తెలంగాణ పోరు గడ్డ లో పుట్టిన బిడ్డ
నీకిదే మా వందనాలు
            "ఓతెలంగాణ బిడ్డ"
           " ఓ తెలుగు బిడ్డ"
44
[18/06, 5:01 PM] D Venkat Reddy KS...: సమూహము: వీర సమయము
తేదీ :--18--06--2020
కవిత సంఖ్య:. 44
 కవి పేరు మల్యాల డీ వెంకట్రెడ్డి
 ఊరు మహబూబాబాద్
శీర్షిక        "ఏదీ శాశ్వతం కాదు"
------------–-----–---------------------
-------------------------------------------
ఏదీ శాశ్వతం కాదు
ఎవరూ శాశ్వతం కాదు
ముచ్చటగా బ్రతకటానికి
 మచ్చ లేకుండా ఉండాలి
 చావు అనేది  ఎలాగూ రాక తప్పదు
 ఎదురొచ్చిన మృత్యువు
 నీకు ఎవరు ఎదురు చెప్పలేరు
తన పని తాను చేసుకు పోతుంది
ఆ చావులో కూడా అర్థం ఉండాలి
త్యాగధనులకు కష్టాలే ఎక్కువ
ఎక్కువైనా కష్టాలను ఎదిరించిన వాడు త్యాగధనుడు
 త్యాగధనుడు అనేవాడు ఇతరుల కోసం
త్యాగం చేసిన వాడే త్యాగధనుడు
అలాగని స్వార్థంతో బ్రతికినవాడు గాడు
నేను నేనే అహాని వదలటం అంత సులువు కాదు
స్వార్థంని కొంతైనా వదులుకోవాలి
సంపాదన ఎదురుగా ఉన్నదని
సంతోషంగా ఉన్నా కూడ
 కష్టంలో ఉన్న వాడి సంపాదన ఆలోచించు
 గెలుపుని దగ్గరలో ఉన్న ఒక్కసారి ఓటమి తప్పదు
ఆ ఓటమిలో మళ్లీ గెలుపుని వెదకాలి
గెలుపు ఓటములు సమానమే అయినా
  వాటిని మలుచుకునే గెలుచుకుంటే
త్యాగం మీ సొంతమవుతుంది
 కష్టం సుఖం ఏది వచ్చినా దాన్ని అలా పోనీ
 ఏది కూడా ఆగదు ఎప్పుడు నీ దగ్గర
 చేసిన త్యాగం మాత్రం నిలింది ఎప్పటికైనా
 త్యాగమూర్తులు మరణించిన బ్రతికే ఉంటారు
         

          "ఏదీ శాశ్వతం కాదు "
          "ఎవరు శాశ్వతం కాదు"
45
[19/06, 5:14 PM] D Venkat Reddy KS...: సమూహము :వీరా కవిసమయం
తేదీ :19--06--2020
కవిత సంఖ్య:45 (శుక్రవారం)
 కవి పేరు:  మల్యాల వెంకట్ రెడ్డి
 ఊరు: మహబూబాబాద్
శీర్షిక         " నది మా... తల్లి"
-----------------------------------------
-----------------------------------------

ఆకాశం మేఘావృతమై ఉన్నది
నల్ల మబ్బులు నాట్యం చేస్తున్నవి
 అంద మంథచిందినచ్చినట్లు
 గువ్వల జంట గారాలు పోతున్నది
 గూటి లోకి వెళ్ళాలన్నట్లు
 చిలుకల జంట తారాడుతుంది
కొంగ పిల్ల చెట్లపై వేలాడుతోంది
 వర్షం మబ్బు ఆగనంటుంది
ఉరిమిన ఉరుము కు ఝల్లుమన్నది
 మంచె  పైకి ఎక్కి చూస్తున్నా
మధ్యలో చిరుగాలి వీస్తున్నా
 ఆకలి మంట కడుపు బాధలు
 తీర్చే మార్గం లేక
 కురిసిన వాన  మురికిన అంతా
కూడగట్టుకుని గర్భమందు నిలుపుకొని
 ప్రకృతిని నంతా పర జ మ్ముకొని
 పచ్చని చెట్ల మధ్య లో నెట్టుకొని
 కొండలనడ మ్మా సవ్వడి చేస్తూ
పిల్లగాలుల తో కలిసి తోటి వారిని
 కలుపుకొని బంధాలనుపెనవేసుకుని
పుడమి తల్లిని తడుపుతూ
రెమ్మలను పలకరిస్తూ
సకల జీవులకు
ప్రాణం ఇస్తూ ప్రకృతిని బ్రతికేస్తూ
           బయలుదేరినావ
         "నది మా...తల్లి "
         బయలుదేరినావ
         "నది మా... తల్లి"
46
[20/06, 10:56 AM] D Venkat Reddy KS...: సమూహము :వీర కవిసమయం
తేదీ:
 కవిత సంఖ్య:
 కవి పేరు: మల్యాల డీ వెంకట్రెడ్డి
 ఊరు: మహబూబాబాద్
 శీర్షిక : 
---------------------------------------------------
---------------------------------------------------
అందానికి అందం అనేది ఆభరణం
పెదాల పై రాసిన రంగు కన్నా
 నీవు మనసులో నుండి పలికే పలుకులు
        నీ ఆభరణాలు

 భౌతికమైన దిద్దుబాట్ల కన్నా
 బాధ్యత గల కట్టుబాట్లే మిన్న
వన్నెల కొమ్మ తెచ్చి నమ్మ
నిండు సొగసు పూల గుత్తులు
పట్టుచీర ఆభరణం అయినా
నీవు నేర్చిన న కట్టుబాట్లే
       నీ ఆభరణాలు
జామురాతిరి జాజి మల్లెలు గుప్పుమన్న వేళ
నీవు వేసిన ఆభరణం అందాన్ని ఇచ్చినా
నీ ఆంతర్యము లో నీ మనసు నవ్వితేనే
     నీ ఆభరణం

నిండు పండువెన్నెల్లో నీవు వేసిన అడుగు
 నీవు కట్టిన ఆభరణాలను తట్టిలేపి నట్లు
వెయ్యి మెరుపు తీగలు ఒకచోట పెట్టినా
మెరిసె వెలుగుల కన్నా
నీ మదిలో మెరిసే ఆనందమే
నీ ఆభరణం

పూ.. రెమ్మల పై పూసిన రంగు కన్నా
నీ కనురెప్పలపై గీసిన కాటుక కన్నా
నీవు చూసిన ఓర చూపే
        నీ ఆభరణం

నీ నొసలు పైకి వేలాడే  మాడ బిళ్ళ కన్నా
నీ ముఖము పై దిద్దిన కుంకుమ
            నీ ఆభరణం
బంగారం  నింపిన చెవులకన్నా
నీవు చెవిలో చెప్పిన గుసగుసలే
             నీ ఆభరణం

 పురివిప్పిన నీ కురుల ముడి కన్నా
నీ కురుల మధ్య నా ముఖము దాయటమే
           నీ ఆభరణం
పాలు పోసిన వెండి గ్లాసు కన్నా
నీవు నా పెదవులకు అందించిన చిరునవ్వే
         నీ ఆభరణం
47
[23/06, 8:06 PM] D Venkat Reddy KS...: సమూహము :వీర కవిసమయం
Date--22--06--2020
కవిత సంఖ్య :48
కవి పేరు :malyal D. venkat reddy
ఊరు మహబూబాబాద్
 శిరీష.క:     " తెలుగంటే అలుసా" 
-------------------------------------
-------------------------------------
  తెలుగంటే అలుసా
 తెలుగు ఒక అమ్మ
 తెలుగు ఒక పరబ్రహ్మ
 తెలుగు ఒక వెలుగు
 తెలుగు ఒక ఆభరణం
 తెలుగు ఒక కట్టు ఒక బొట్టు
 తెలుగు బొట్టు ఒక సాంప్రదాయం
 తెలుగు తనం ఒక మంచి దనం
 తెలుగు భాష ఒక శాంతి మూస
 తెలుగు బిడ్డ ముద్దుబిడ్డ
తెలుగు రాత అ కరాళ మాల
 తెలుగువారు ప్రేమికులు
 తెలుగునేల ఒక సిరుల గాదె
తెలుగు  పలుకులు మదుర పలుకులూ
 తెలుగు పండుగలు ఆనందం మండులు
 తెలుగు ఆటలు ఆరోగ్యానికి మూట
 తెలుగు భూమి ఒక త్యాగాల గనీ
 తెలుగు మటి బాంగారు మూట
 తెలుగు జాతి మడమతిప్పరు
 తెలుగు అంటే అలుసా
తెలుగు అంటే అలుసా
48
[23/06, 8:06 PM] D Venkat Reddy KS...: వీర కవి సమయము
 తేదీ:21--06--2020
 కవిత సంఖ్య ::47
కవి పేరు: మల్యాల డీ వెంకట్రెడ్డి 
 ఊరు: మహబూబాబాద్
శిరీషక    " నీతిని అమ్ముకొని అవినీతిని ఆరాధించి"
________________________________
________________________________

 
 నీతిని అమ్ముకొని అవినీతిని ఆరాధించి
చిన్న పెద్ద నోట్లన్నీ కూడబెట్టి
పేదల సొమ్ముని పెరుగన్నము లా జురే సి
 వేల కోట్లు వెనక వేసుకొని
 చివరికి అవి ఎవరు తింటాడో కూడా
 తెలియక తికమక పడుతూ
మనసుని చంపుకొని
బినామీ పేర్లతో బీడు భూములను
 సైతం కాజేసి బిచ్చగాడిలా వేషాలు వేసుకొని ఎన్నిరోజులు బతుకుతావు
  తెలియకపోగా తెలిచిన వారికి
 సహాయ పడలేక ఆరోగ్యం
సహకరించక పోగా
ఎందుకు రా దేవుడా బతుకు
 అని నీకు నీవే ప్రశ్నించుకొని
 కట్టుకున్నది కూడా
నీవు తెచ్చే కట్టల కొరకే ప్రేమ ఉన్నట్లు
నీవు ఇంటిపట్టున కూడా ఉండకుండా
మనకేమి తక్కువ అని ఆర్డర్ల మీద ఆర్డర్లు వేసి అడ్డమైన గడ్డి తెప్పించి తిని వొం టి నిండా
రోగాలు నింపుకొని ఇల్లు చేరగానే
 మళ్లీ రేపటి కటల కోసమే ఆలోచ గాని
నీతి గురించి ఆలోచన లేకపాయె
49
[23/06, 8:06 PM] D Venkat Reddy KS...: వీర కవి సమయము
తేదీ--23--06--2020
 కవిత సంఖ్య:49
 కవి పేరు: మల్యాల డి వెంకట్ రెడ్డి
 ఊరు :మహబూబాబాద్
 శీర్షిక    "మనసు వికసిస్తుంది"
_________________________
_________________________
 మనసు వికసిస్తుంది
విరబూసిన పూదోట లలో
 నేను  తురిమిన ఆభరణము
 వికసించి నా సిగలో పూలమాల
  ఆనందంతో ఆందము నిలుస్తున్నది
 మనసు భయముతో బందీ చేసిన
 పొంగిపొర్లుతున్న ఆనందానికి
 కోపం తో మంటలు రగిలించిన
 గాలికి పురివిప్పిన నెమలి వోలె
 కమనీయ చూపులతో
ఆదర్శమైన జీవితానికి
 అనుభవించటానికి కదిలిస్తున్న
 మనసుని పరవశించు గా
 మధురమైన ఆ పూదోటలో
 ఉన్నప్పుడు నాకన్నులకు ఇంపైన
 నీ అందానిఆస్వాదించాలని
 నీ చల్లదనము నాపై విసిరినప్పుడు
నీకు నీటిని అందించే నీ  తోటమాలినై
 నీపై వాలిన సీతాకోకచిలక పై
నా ఎర్రబడిన కళ్లు తో తిరగబడి నప్పుడు
 నాకు శాంతిని ప్రసాదించావు
 నేను నీకు దగ్గర ని
 నీ కను బొమ్మలతో కనికరించిన
 అప్పుడు
నా మనసు వికసిస్తుంది
 ఈ... పూదోటలో  వికసిస్తుంది
50
[25/06, 8:18 PM] D Venkat Reddy KS...: సమూహము వీరకవిసమయం
  తేదీ--25--06--2020
 కవిత సంఖ్య: 51
 కవి పేరు:  మల్యాల డి వెంకట్   
ఊరు: మహబూబాబాద్
 శీర్షిక :.      "మళ్లీ ఏంటి నీ లొల్లి "
------------------------------------------
-----------------------------------------
 మళ్లీ ఏంటి నీ లొల్లి
నీవు తిరుగుతావు గల్లి గల్లి
 నిన్ను కాదనలేరు ఏ చెల్లి తల్లి
మళ్లీ నీవు తెచ్చావు లొల్లి
 కాపురము చేయువారినికలయిక చేస్తావు
ఆడపిల్ల  జడలో  అందాలను కురిపిస్తావు
 నీ సొగసు  పరిమళాలను వెదజల్లు తావు
 నీవు చుట్టిన పందిరికిఅందంగా కనిపిస్తావు
 నీ మత్తు లెక్కిస్తావు
ఆ మత్తులో గమ్మత్తు జరిపిస్తా వు
 గమ్మత్తు లతో గంతులు వేయిస్తావు
 ఆకు చాటు మల్లెపువ్వు
నవ దంపతులను నాట్యము చేయిస్తావు
 అందరినీ మధుర సువాసనలతో
 కొత్త పాటలు పాడి ఇస్తావు
సాయంకాలానికి సరిగమలతో
 వీచే గాలికి విరజిమ్మిన వాసనలు
 గుమ్మాల పైకి చేరవేస్తావు
 నీకు పలు పేర్లు పెట్టి పిలుస్తారు
 జాజిమల్లి, ముద్ద మల్లె, తీగ మల్లె
మళ్లీ  ఏదైనా మరుపురాని మళ్లీ
నీవు మైమరిపించే మళ్లీ
 ఓ జాబిలి తో వెలిగే మళ్లీ
 తెల్లగా తెల్లని మల్లెలు
నీవు తిరిగాడు తావు గల్లి గల్లి
 మళ్లీ నీతో లొల్లి లొల్లి
అదే నే మళ్లీ తల్లి
51
[25/06, 8:21 PM] D Venkat Reddy KS...: వీరా కవిసమయం
 తేదీ --24-06--2020
  కవిత సంఖ్య :50
కవి పేరు: మల్యాల డీ వెంకట్రెడ్డి
 ఊరు: మహబూబాబాద్

శీర్షిక:       "ఎటు చూద్దామన్న  కల్తీ" 
---------------------------------
--------------------------- _ `
 ఎటు చూద్దామన్న కల్తీ
 ఏం చేద్దాం అన్నా కల్తీ
జనం కల్తీ, పలం కల్తీ
ప్రతిఫలం కల్తీ తిండి కల్తీ   
 కల్తీ చేసేదంతా కల్తీ
స్నేహం  కల్తీ   నిత్యం కల్తీ మయ్యింది
బంధం కల్తీ అనుబంధం కల్తీ
  శెకండ ఇదామన్న   కరోనాతోకల్తీ
  మందులు కల్తీ మనుషుల అనుబంధం కల్తీ
  బజార్ కెళ్తే నే కల్తీ సరుకులు కల్తీ
  త్రాగి నీరు కల్తీ   పిల్లల పాలు కల్తీ
తినే అన్నం కలిసి సున్నము నీటిని తో
 తీయని  తేనె తీపికల్తీ సంపద కల్తీ
 కల్తీని అరికట్టే వారే కల్తీ
ప్రతిరోజు ఏదో ఒకటి కోల్పోతూ
వెలితిగా ఉండే కల్తీ
 కుటుంబంలో రేపుతున్న కల్తీ
  అన్నదమ్ముల  మధ్య తగాదాలు కల్తీ
 పంట రైతు చేతి నుండి దాటితే కల్తీ
ధర్మం, న్యాయం,  నీతి కల్తీ అన్నీ కల్తీ
 దగా , మెసం కల్తీకి ఆభరణాలు
ఈ కల్తీ ని కల్తీని కా టికి పంపాలంటే
 నిజాయితీతో బ్రతికి ఉన్నప్పుడే
అప్పుడే నీ ఆరోగ్యము అదుపు తప్పదు
 నీ బ్రతుకు బాగుపడాలి అన్న
 కల్తీని నిర్మూలించి అన్న
52
[26/06, 7:11 AM] D Venkat Reddy KS...: వీరకవి సమయం
తేదీ --26--06--2020
కవిత సంఖ్య: 52    (Fri day)
 కవి పేరు :మల్యాల డీ వెంకట్రెడ్డి
 ఊరు: మహబూబాబాద్
శిరీషక:     " బ్రతుకు మారేది ఎప్పుడు"
-------------------------------------------------
------------------------------------------------
 నా చేతిలో గీతలు అ రిగినవి
 అయినా నా తల రాత మారలేదు
నేను కూలబడింది కుక్కి మంచం
 వెక్రి యిస్తుంది నన్ను
నా చేతి కర్ర మొన అరిగిపోయింది
నా నడుము కట్టిన గుడ్డ పేలికలు అయింది
 నా డొక్క గుంజినా గుప్పెడు గంజి లేదు
నా వయసెంత ఊడి గాని కే సరిపోయింది
 ఎడ్లకు వేసి శనగపిండి నా డొక్కాకు ఆసరయింది
 తాటి ముద్దుల సందు పడుకున్న ఆ రోజులు
 కాయకష్టం చేసి కన్నవారిని సాగితే
 రెక్కలు వచ్చిన పక్షుల ఏ గుటిలో వాలారో
 బక్కచిక్కిన నా బ్రతుకు ని సాకేది ఎవరు
 మరణం రమ్మన్నా ఆ దేవుడికి దయ లేదు
అంతో ఇంతో కూడా పెట్టింది పంచుకుంటారు కట్టుకున్నది కూడా కాదని వెళ్ళిపోయింది
భూతల్లి ని అడుగుతున్నా నీలో కలుపుకొ మని
 కాలం కలిసిపోయిన నీకు కాలం రా లేదంటుంది
 అగ్ని దేవుని బుగి చేయమన్నా
నిన్ను బుగి చేసేది దగ్గర్లో లేదంది
 బ్రతుకుల కే  బాధ కలిగిస్తున్న  బ్రతుకులు
 బ్రతుకు మారేది ఇప్పుడు బాధలు తీరేది ఎప్పుడు
ఈ         " బ్రతుకు మారేది ఇప్పుడు"


Comments

Popular posts from this blog

తిరు వేంకటాచార్యులు KS 6

బాటసారి KS 12

అనామికా శతకం విట్టుబాబు గారు