తాండ్ర మెరుపులు
![]() |
| తాండ్ర చిరంజీవి |
మెరుపులు ఇదో నూతన ప్రక్రియ
దీని సృష్టి కర్త తాండ్ర చిరంజీవి గారు
" మెరుపులు "
———————
కడవ నీటిలో
పడవ నడవదు
కంటి నీటిలో
కల్మషం ఉండదు !! 1
అమ్మ అలిగితే
అన్నం ఉండదు
నాన్న అలిగితే
పైకం ఉండదు !! 2
ఎగిరే పక్షికి
వేగ ముండదు
ఈదే మనిషికి
లోతు ఉండదు !! 3
సరిగా తింటే
జబ్బులు ఉండవు
మంచిగా వింటే
అపార్థాలు ఉండవు !! 4
కడగండ్ల వాన
కంటికి కాదు
వడగండ్ల వాన
ఒంటికి కాదు !! 5
నోరు జారకు
ఊరు తిట్టినా
నింద మోపకు
నిజం తెలిసినా !! 6
పుస్తకం లేకుంటే
మస్తికం మారదు
ఆటస్థలం లేకుంటే
ఆరోగ్యం ఉండదు !! 7
అవ్వ వండనిది
బువ్వ రాదు
అయ్య చేయనిది
పని లేదు !! 8
వలయానికి చిక్కితే
నిలయంలో వుండము
పనులన్ని పక్కనేస్తే
మనకేమో గండము !! 9
భాగస్వామి తోడస్తే
స్వామికి బలము
మేఘం వర్షిస్తే
భూమికి జలము !! 10
బువ్వ తినకుంటే
బుద్ధి రాదు
పఠనం చేయకుంటే
తెలివి రాదు !! 11
కోతి పరుగెడుతది
భీతి నొదలి
మనసు పరుగెడుతది
మతి నొదలి !! 12
అలలైన ఆవిరైతైయ్
గాలి లేనపుడు
కలలైన మాయమైతయ్
నిదుర పోనపుడు !! 13
బలము కావాలంటే
గళముతో పనిలేదు
పని చేయాలంటే
కండతో పనిలేదు !! 14
మండే సూర్యుడు
అస్త మించడు
భోదించు ఆర్యుడు
శృతి మించడు !! 15
నడక వయ్యారమైన
నాట్యముంటుంది
అడుగు బలమైన
స్థిరముంటుంది !! 16
కొడుకు గాకుండపోడు
కోట్లివ్వకున్న
బిడ్డ గాకుండపోదు
ప్లాట్లివ్వకున్న !! 17
చిత్తమున్న చోట
భక్తి ఉంటుంది
భయమున్న చోట
బాధ్యత ఉంటుంది !! 18
ఆలిలేని ఇంట్లో
జాలి ఉంటుందా
మనసులేని ఒంట్లో
మంచి బతుకుతుందా !! 19
కడలి ఎగురుతుంటే
కనువిందు అవునా
సుస్వరాలు వినడమంటే
సునామి అవునా !! 20
ఎంత ఏడ్చినా
లేవనిది శవం
మంత్రాలెన్ని చదివినా
అదికాదు మనవశం !! 21
గంట మోగితే
బడి తెరచుకున్నట్లు
పేగులు ఒర్రితే
ఆకలౌతున్నట్లు !! 22
ఒంటరి జీవితం
తుంటరికి తెలుసు
నేర్పిస్తది గతం
అనుభవంతో తెలుసు !! 23
మడిలోన నీరు
వడివడిగ ఉరకదు
జనం లేని ఊరు
కళకళా లాడదు !! 24
తోడులేని వారి
జాడ కష్టం
పేరు లేనివారి
ఊరు కష్టం !! 25
జీవి నవ్వాలంటే
జీవ ముండాలి
బావి తోవ్వాలంటే
బాధ్యతుండాలి !! 26
లేక అడుక్కుంటే
బిచ్చగాడంటరు
పనిలేక తిరుగుతుంటే
బచ్చగాడంటరు !! 27
బారులో వుండేది
చారు కాదు
నీడలో వుండేది
జాడ కాదు !! 28
బరువును అదిగమించు
గురువు జ్ఞానం
మనిషిని కిందికివంచు
అతని అజ్ఞానం !! 29
బావిలోని ఊట
బరువెంతో తెలువదు
మనసులోని తంట
మర్మమెంతో తెలువదు !! 30
కోమలాంగి కోరికలు
అందని నక్షత్రాలు
అడవిలోని మూళికలు
ఆరోగ్య ప్రధాతలు !! 31
అహం విడచిన
స్నేహం దక్కు
మందు మరచిన
మర్యాద దక్కు !! 32
అనిత కష్టం
వనిత కెరుక
స్వామి నష్టం
భూస్వామి కెరుక !! 33
అరక దున్నబోతే
గరక అడ్డమచ్చినట్లు
సాయం చేయబోతే
సమస్య వచ్చినట్లు !! 34
మగువ భర్తవైన
ఎగువ నుండవు
ప్రేమ కరువైన
మనసులో వుండవు !! 35
విచిత్ర వేషం
చిత్రమౌతుంది
సర్థికి నశం
ఔషదమౌతుంది !! 36
గోదావరి పరవళ్ళు
పంటలకు ఆధారం
జీవితపు ఆనవాళ్ళు
భవిషత్తుకాదారం !! 37
గుమ్మి నవ్వాలంటే
పంట పండాలి
మమ్మి నవ్వాలంటే
పైకం ఉండాలి !! 38
కలలో వచ్చేవి
అలలు కావు
వలలో చిక్కేవి
వలపులు కావు !! 39
ఇంకు లేనిది
పెన్ను రాయునా
ఇంజనులేనిది
రైలు నడచునా !! 40
ఆలికి తాళి
జాలికొరకు కాదు
భర్తను గేలి
చేయుటకు కాదు !! 41
సున్నం తెల్లనైన
అన్నం కాదు
పాతదైనంత మాత్రాన
పాచి పోదు !! 42
సతిచేయు పనులన్ని
మతిలేనివి కాదు
సంసారంలో కష్టాలన్ని
సంతసం కావు !! 43
సామి నిలబడినాడని
తెలివిలేక కాదు
అటుంటె పడుతున్నడని
నోరులేక కాదు 44/
అడుగులకు ఎవరి
మడుగు లొత్తద్దు
పైసలకు ఎవరి
ప్రాణం తీయ్యద్దు !! 45
విద్య వికటిస్తే
వ్యాపార మౌను
మందు వికటిస్తే
మరణమౌను!! 46
లావుగల వాడికైన
చావు తప్పదు
సంపదున్నోడి కైన
రోగం తప్పదు !! 47
మనిషికి కలత
కాలు జారితే
నగషికి వెలత
తుప్పు పడితే !! 48
కవితలు పుట్టాలంటే
కవి వేదన పడాలి
పిల్లలు పుట్టాలంటే
తల్లి ప్రసవవేదన పడాలి !! 49
రవి హృదయం
కవికెరుకే
జనుల హృదయం
రాజుకెరికే !! 50
సార్ 🙏. ఈ యాబై మెరుపులను మెరుపుల బ్లాగులో పెట్టగలరు.

Comments
Post a Comment