KC నర్సయ్య గారు KS26
కవిరాజ్ పురస్కార గ్రహీత
పేరు: కెసి నరసయ్య
ఊరు: బోదులబండ
మండలం: నేలకొండపల్లి
జిల్లా: ఖమ్మం
వృత్తి: జర్నలిస్ట్
చరవాణి: 7981814784
[06/05, 12:05 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 6-5-2020
కవిత సంఖ్య: 1
కవిపేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: లాక్ డౌన్ లాకప్ డెత్?
ఆర్థిక వనరుల సాకుతో
బార్లా తెరుచుకున్న
వైన్ షాపులు
రెక్కలు విదిల్చుకున్న
మద్యం మహమ్మారి
కంఠశోషగా మిగిలిన
నలభై రోజుల కఠోరశ్రమ
క్షీణ దశలో ఉన్న శత్రువుకు
అందిన ప్రాణ వాయువు
విమానయానం మహమ్మారితో
జత కలిసిన
మద్యం మహమ్మారి
లాక్ డౌన్ లాకప్ డెత్
సంఘటనపై
స్వపక్షంలో అంతర్యుద్ధం
మరో దఫా
కోరలు సాచిన శత్రుపక్షం
నిశ్శబ్ద యుద్ధంలో
మరింత బల పడిన శత్రు వైరస్
జూలు విదిల్చి బరితెగించిన కరోనా
ఆత్మరక్షణలో స్వపక్ష సైన్యం
అయోమయంలో స్వీయ గృహనిర్బంధం
పేరు: కెసి నరసయ్య
[06/05, 12:14 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 6-5-2020
కవిత సంఖ్య: 2
కవిపేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: కార్మికుడు!
కార్మికుడు
కష్టాలకు
చిరునామా
సుఖం మొఖం
ఎరుగని కష్టజీవి
కార్మికుడు
నష్ట జాతకుడు
లాభాల వైపు
కన్నెత్తి చూడని
నిస్వార్థపరుడు
కార్మికుడు
చెమట ఊటబావి
కష్టాలను
ఇష్టంగా కడతేర్చి
లాభాల పంటలను
సృష్టించే శ్రమైకజీవి
కార్మికుడు
పెట్టుబడిదారుల
జేబులో కరెన్సీ
నిత్యం క్షుద్బాధలతో
కాలచక్రంతో పోటీ పడేవాడు
పేరు: కెసి నరసయ్య
[07/05, 3:14 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 7-5-2020
కవితసంఖ్య: 3
కవిపేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: విజయ రహస్యం?
సువిశాల ప్రపంచంలో
సూక్ష్మాతి సూక్ష్మక్రిమి లక్ష్యం
మానవాళి నాశనం
భూమ్యాకాశంలో
కరోనాను ఖతం చేయడమే
ప్రపంచ ప్రజల ముందున్న కర్తవ్యం
ప్రాణాలను ఫణంగా పెట్టీ
తెగించి పోరాడుతున్న
దైవాంశ సంభూతులైన
శ్వేత దుస్తుల సైన్యం
వైరి వైరస్ బారిన పడకుండా
పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికులు
రక్షక కవచంగా పోలీసుల పహారా
లక్ష్యసాధనలో
విజయమో వీరస్వర్గమో
స్వీయ
గృహనిర్బంధం గుప్పెట్లో కఠోర దీక్ష
పేరు: కెసి నరసయ్య
[07/05, 3:20 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 7-5-2020
కవిత సంఖ్య: 4
కవిపేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక:ఉరి
మందు వేసుకుంటే
జబ్బు వదులును
విందు చేసుకుంటే
డబ్బు వదులును
కక్షతో కలవరం
మిత్రత్వం పవిత్రం
సాక్షితో పరిష్కారం
శతృత్వం విచిత్రం
అందలం ఎక్కిన
సంతృప్తి లేకపాయె
చిందులు తొక్కిన
చిరాకులు వెంటాడుతుండే
పంట పండిస్తే
కంటనీరాయే
చేసిన అప్పులు
మెడకు ఉరి తాడాయే
పేరు: కెసి నరసయ్య
[08/05, 11:40 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 8-5-2020
కవిత సంఖ్య: 5
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: నీకిక నూకలు చెల్లినయ్!
ప్రశాంతమైన
ప్రపంచ వాతావరణంలో
ఒక్కసారిగా
అల్లకల్లోలం సృష్టించావ్
నివురుగప్పిన నిప్పులా
అగ్నికి ఆజ్యం పోసినట్లు
రాజ్యాలకు రాజ్యాలనే
రావణ కాష్టాలుగా మార్చేశావ్
అగ్రరాజ్యాల ఆధిపత్యపోరులో
ఊహించని విధంగా ఊహాన్ నుండి
ఉగ్రవాదిలా ఊడి పడ్డావ్
విమానయానంతో విహరించి
అన్ని యానాలను కట్టిపడేసి
మానవాళిని కబలిస్తున్నావ్
కరోనా ఖబడ్దార్!
మేమంతా అప్రమత్తంగానే ఉన్నాం!
నీ వికృత చేష్టలను కట్టడి చేస్తున్నాం
భరత గడ్డపై నీకిక నూకలు చెల్లినయ్!
పేరు: కెసి నరసయ్య
[09/05, 10:14 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేదీ: 9-5-2020
కవిత సంఖ్య: 6
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: అవిశ్రాంత పోరు!
దేహాన్ని ఆవరించిన
శత్రువు జాడ కోసం
స్టెతస్కోప్
అలుపెరుగని సెర్చ్ చేస్తూనే ఉంది
కొనసాగుతున్న యుద్ధంలో
వైద్యులు నర్సులు
కొన ఊపిరికి ప్రాణం పోస్తున్నరు
దాడి చేసిన వైరి వైరస్ ను ఎదుర్కొనేందుకు
మానవ శరీర అంతర్యుద్ధంలో
మిత్ర వైరస్ లు బ్యాక్టీరియాలు అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నాయి
ఊహన్ జన్మ సంబంధాల
చైన్ లింక్ ను
తునా తునకలు చేసేందుకు
కక్ష కట్టిన రక్షకులు
ఇంటిల్లిపాదినీ వదిలి
రాత్రింబవళ్లు వేటాడుతూనే ఉన్నారు
మానవాళిని కబళిస్తున్న
క్రిమి ఆచూకీ కోసం జర్నలిస్టులు
పరిసరాలకు దరిచేరకుండా
పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికులు
కదనరంగంలో పోరాడుతూనే ఉన్నారు
రైతన్న అందరి ఆకలిని తీరుస్తూ ఎండనకా వాననక శ్రమిస్తున్నాడు
శత్రువు బారిన పడకుండా
కరోనా ఖతం చేసేందుకు
స్వీయ గృహనిర్బంధాన్ని పాటిస్తున్నాం
+++++++++++++++++
పేరు: కెసి నరసయ్య
[10/05, 7:18 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 10-5-2020
కవిత సంఖ్య: 7
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక : మహమ్మారి మహిమలు!
విమానాల రెక్కలు విరిచేసింది
రైలు బండ్ల చక్రాలకు కళ్లెం బిగించింది
వాహనాలను రోడ్లపై నుండి విసిరికొట్టింది
ఎవరి ఇంట్లో వారిని బందీ చేసి
కుక్కిన పేనులా పడి ఉండమన్నది
విషతుల్యమైన నదీ నదుల జలాన్ని మంత్రించింది
అటవి సమాజానికి అభయమిచ్చింది
నిత్యం విషవాయువులను క్రక్కుతున్న పరిశ్రమల పొగ గొట్టాలకు ముకుతాడు వేసింది
మనిషి బందీఖానాలో చిక్కిశల్యమైన ప్రకృతికి విముక్తి ప్రసాదించింది
ధనిక పేద కుల మతాల అడ్డుగోడలను కూల్చి వేసింది
శాస్త్ర విజ్ఞానములోని ఆశాస్త్రీయతను ఎండగట్టింది
నాగరికతలోని అనాగరికతను చాటి చెప్పింది
సామాజిక మహమ్మారి
మద్యాన్ని మటుమాయం చేసింది
వికృత చేష్టల మతాధిపతుల మూతులను బిగించి మూలన కట్టి పడేసింది
గ్రామాలు పట్టణాలు నగరాల పొలిమేరలకు లక్ష్మణ రేఖలను గీసింది
దోపిడి సమాజంపై గుణపాన్ని దింపింది
శకుని పాచికలోని
మనిషి వికృత చేష్టలను కట్టడిచేసింది
నేర ప్రవృత్తికి నిలువ నీడ లేకుండా చేసింది
ప్రపంచంలోని పాపాల పుట్టలను పాతాళానికి తొక్కేసింది
సమస్త పెట్టుబడిదారీ సమాజానికి చెంపపెట్టయింది
ప్రపంచ మార్కెట్ మాయాజాలం విరిచేసిన కిసాన్ వెన్నెముకను యధాస్థానంలో అమర్చింది
ప్రాణికోటిని ప్రాణప్రదంగా చూసుకుంటున్న వానికే పట్టం కట్టింది
ప్రపంచ మానవాళికి
కడుపు నింపుతున్న రైతే రాజని గుర్తుచేసింది
మానవాళిని కబళిస్తున్న
సూక్ష్మాతి సూక్ష్మానికి ఎన్ని మహిమలో
అయినా
అర్థంకాని మహమ్మారిని అంతం చేసేందుకు
నిశ్శబ్ద యుద్ధంలో హోరాహోరీగా పోరాడుతూనే ఉన్నాం
పేరు: కెసి నరసయ్య
[11/05, 7:33 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 11-5-2020
కవిత సంఖ్య:8
పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: తెల్లారిన బతుకులు
వేసవి కాలం
సాగరతీరం
అదమరచిన గాఢ నిద్ర
ఒక్కసారిగా
ఆకాశం విరిగి మీద పడ్డట్టు
ఊపిరి మెసలని కదలికలు
ఉచ్వాస నిశ్వాసలకు
చలనం లేని ప్రాణ వాయువు
నేత్రాలను ఆవరించిన అగాధం
బిడ్డ కోసం తల్లి భార్య కోసం భర్త
పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే పరుగులు
నిప్పులేని అగ్ని గోలాలైన కన్నులు
నిద్రమత్తులో వెంటాడుతున్న మృత్యువు
తప్పించుకునే ప్రయత్నంలో
బావిలో ఒకరు మేడపై నుండి మరొకరు
మంటెత్తుతున్న కండ్లను నలుపుకుంటూ
అగాదంలోకి కూరుకుపోతున్నట్లుగా
ఎటుపోతున్నామో తెలియని మాయాలోకం
తొలి కోడి కూయకముందే
బతుకులు తెల్లారిపోయినై
కప్పుకున్న దుప్పటే
జీవితం
అంతిమ యాత్రలో తెల్లని వస్త్రమయింది
విషవాయువుతో విశాఖ విషాదమైంది
పేరు: కెసి నరసయ్య
9
[12/05, 12:15 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 12-5-2020
కవిత సంఖ్య: 9
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక త్రిశంకు స్వర్గంలో కార్మికులు
ప్రకృతి ప్రతిబింబంలో
ఓ చక్కని ఆకృతి
రెక్కాడితే డొక్కాడని అస్తిపంజరం
బ్రతుకు పోరాటంలో
ఆలి మందలతో
అలుపెరుగని
జీవన ఆరాటమే కార్మికలోకం
శ్రమ దారాదత్తంతో
ఫ్యాక్టరీల పొగ గోట్టాలకు
వ్రేలాడుతున్న కార్మికుల ఊపిరితిత్తులు
కష్ట నష్టాల సుడిగుండంలో
వడి వడిగా సాగుతున్న శ్రామికులు
పెట్టుబడి ఒత్తిడిలో
లాభాల ముఖం చూడని
కట్టు బానిసలు
ఎనిమిది గంటల
పనిదినాల ఆరాటం
ఎన్నెన్నో తరాల పోరాటాల ఫలం
పెట్టుబడుల ఆకర్షణలో
కష్టజీవుల హక్కులను
కాలరాస్తున్న పాలకవర్గాలు
దోపిడీల రూపాల కనుగుణంగా
మార్చుకుంటున్న హక్కుల పోరాట రూపాలు
కరోనా బంధనాల త్రిశంకు స్వర్గంలో
అలసి సొలసి సొమ్మసిల్లిన వలస కార్మికులు
లాక్ డౌన్ తో కుప్పకూలిన కార్మిక ఉపాధి
జీవన్మరణ పోరాటంలో
ప్రపంచ కార్మికులారా! ఏకంకండి!!
పేరు: కెసి నరసయ్య
10
[13/05, 4:11 PM] KC Narsaiah KS 26: భూమాతంటే ఇష్టం!
అమ్మకు
భూమాత౦టే ఇష్టం!
అయ్యకు సరస్వతన్నా ఇష్టమే
అమ్మ
ఇంటి పనులు
వంట పనులతో పాటు
పొలం పనులు చేయించెేది
అయ్య
పొలం బాటతో పాటు
బడి బాట పట్టించాడు
పుస్తకాలు చేతపడితే
అమ్మ శాపనార్థాలు పెట్టేది
అమ్మకు సరస్వతి అంటే భయం?
బడికి పోకపోతే
పంతుళ్లు
అయ్యను మందలించే వాళ్లు
అయ్యకు చదవంటెే ఇష్టం!
అయ్యవార్లకు భయపడి
కలం చేత పట్టేవాడిని
అమ్మకు భయపడి
హలం కూడా పట్టేవాడిని
ఈ రెంటికి
పొసగక
బడి బాటనే ఎంచుకున్న
అమ్మ
బెంగపెట్టుకుంది
నిద్రాహారాలు మాని
నా కోసం ఎదురు చూసేది
అమ్మ
ఎప్పుడు కన్నుమూసిందొో
శాశ్వతంగా నిద్రపోయిం
------- కెసి నరసయ్య
9951260316
11
సమూహం వీరాస్ కవి సమయం
తేది 14/5/2020
కవిత సంఖ్య 11
పేరు కెసి నరసయ్య
జిల్లా ఖమ్మం
శీర్షిక వెంటాడుతున్న వెన్నుపోటు
స్కెతస్కోపే ఆయుధంగా
శత్రుసంహారంపై
రణం పూరించిన వైద్యులు
వైరస్ పద్మవ్యూహంలో
వీరోచితంగా పోరాడుతున్న
శ్వేత దుస్తుల యోధానుయోధులు
కరోనా రెడ్ జోన్లలో
కండకావరం
కదన రంగంలో కలవరం
క్వారంటైన్లకు తరలింపులో
అపోహల కుంటి సాకు
ప్రాణదాతలపై
మూక గుంపుల దాడి
రణ క్షేత్రంలో
స్వపక్షమే శత్రుపక్షమైన వేళ
మృత్యు రూపంలో
వెంటాడుతున్న వెన్నుపోటు
పద్మవ్యూహచ్చేదనలో
శత్రువు స్వపక్షమైనా విపక్ష మైనా
రణరంగ వ్యూహంలో
వ్యూహాత్మకంగానే కదం తొక్కాలి
పేరు కెసి నరసయ్య
[15/05, 4:07 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 15/5/2020
కవిత సంఖ్య: 12
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: శ్రీశ్రీకి లాల్ సలాం!!
కొంపెల్లకు
అంకితం
మహాప్రస్థానం!
ప్రజలకు
అంకితం
శ్రీశ్రీ ప్రస్థానం!!
ఎర్ర బావుటా
ఎగురవేసి
నేను సైతం అంటూ
జయభేరి మోగించాడు
అడవులు
కొండలు
ఎడారుల వెంట
పరుగులు పెట్టించాడు
కుక్కపిల్ల
అగ్గిపుల్ల
సబ్బుబిళ్ళలకు
పద్మవ్యూహాన్ని
ఛేదించడం బోధించాడు
పాపం! పుణ్యం! అంటూనే
విప్లవోద్యమ కెరటంలో
ఐదారేళ్ల చిన్నారులను
చిరుతలుగా మలిచాడు!
పొలాలనన్నీ
హలాల దున్ని అంటూనే
అన్ని వర్గాల పై
జరిగే
దోపిడీలను నినదించి
కార్యోన్ముఖులను చేశాడు
కవితా! ఓ కవితా!
పిలుపుతో
నవ కవితను సృష్టించి
మాలో పెనునిద్దురను వదిలించాడు
దేశ చరిత్రల
చీకటి కోణాలలో దాగిన
దోపిడీలపై
రణ శంఖం పూరించాడు
వస్తున్నాయ్! వస్తున్నాయ్!
జగన్నాధ రథచక్రాలోస్తున్నాయ్ పిలుపుతో దోపిడి నిర్మూలనపై
పరుగులు పెట్టించిన
శ్రీరంగం శ్రీనివాసరావుకు
లాల్ సలాం! లాల్ సలాం!!
పేరు: కెసి నరసయ్య
[15/05, 4:07 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 15/5/2020
కవిత సంఖ్య: 13
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక
: కరోనా శాంతించు!
నాణేనికి
బొమ్మా బొరుసు ఉన్నట్లుగానే
కరోనాకు
రెండు పార్శ్వాలు ఉన్నాయి
మొదటి పార్శ్వంలో
ప్రపంచ మానవాళిని కబళిస్తున్న నరహంతకి
రెండవ పార్శ్వంలో
సమసమాజ నిర్మాతగా మానవతా మూర్తి దర్శనం
కరోనా ఎంత కఠినాత్మురాలో
అంత కరుణామయురాలు
ధనిక పేద కుల మతాల తారతమ్యం లేకుండా
మానవాళిని కబళిస్తున్న వైరస్
దోపిడి సమాజంపై వేటు వేసింది
వాతావరణ కాలుష్యంలో కమిలిపోయిన పచ్చని చెట్లకు వెచ్చని కౌగిలి అందించి ప్రకృతిని పరవశింప చేసింది
అడవిలోని మానవ మృగాలను తరిమివేసి జంతు ప్రపంచానికి స్వేచ్ఛను ప్రసాదించింది
మనిషిలోని రాక్షస ప్రవృత్తిని పారద్రోలి మానవతను చాటింది
ఆధిపత్యం కోసం ప్రపంచ మనుగడనే దెబ్బతీస్తున్న అగ్రరాజ్యాల మెడలను వం చేసింది
ప్రపంచ మార్కెట్ పై కన్నెర్ర చేసిన కరోనా
ఎక్కడ ఉత్పత్తులు అక్కడే మార్కెట్ చేసుకొని జీవనం సాగించాలని హుకుం జారీ చేసింది
ప్రపంచ పాలకవర్గాలను శాసించింది
కమ్యూనిస్టు దేశంలో జన్మించిన కరోనా
ఊహకు అందని సోషలిజం మార్గాన్ని రాజమార్గంగా చూపావు
కరోనా ఇక శాంతించు నీవు చూపిన మార్గానే అనుసరిస్తాం నీకు విప్లవ జోహార్లు!
పేరు: నరసయ్య
[16/05, 12:28 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 16/5/2020
కవిత సంఖ్య: 14
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
కవితా శీర్షిక: కరోనా ముళ్ళ కిరీటం
వ్యూహ ప్రతివ్యూహాలతో
ఇప్పుడు అవనిలోని ప్రతి ఇల్లు రణస్థలమే
ఆయుధ రహిత యుద్ధంలో అంతా సాయుదులే
కలికాలం కదం తొక్కింది
ప్రకృతి రణరంగాన్ని పర్యవేక్షిస్తుంది
కనపడని శత్రువు ఊహకు అందకుండా
ఊహన్ నుండి సప్త సముద్రాలు దాటింది
ప్రపంచ సామ్రాజ్యంలోని రాజ్యాలన్నీ
ఆత్మరక్షణతో అట్టుడికి పోతున్నాయి
సమస్త మానవాళికి కరోనా క్రిమి ముళ్లకిరీటమయింది
నివురుగప్పిన నిశ్శబ్దంతో మనిషి ఆవిరై పోతున్నడు
గత్తర కలరాలను తిప్పికొట్టిన అనుభవాలతో
వైద్యరంగం సముద్రాన్ని చిలుకు తుంది
కుదేలైన అన్ని రంగాలతో కుస్తీ పడుతున్నాం
ఉరుకుల పరుగుల జీవితాన్ని కొక్కానికి వెళ్ళాడదీసి
శత్రువును శాశ్వతంగా సమాధి చేసేందుకు
స్వీయ గృహనిర్బంధం నుండే వ్యూహాత్మకంగా సమరశంఖం పూరించాం!
పేరు: కెసి నరసయ్య
[17/05, 12:29 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 17/5/2020
కవిత సంఖ్య: 15
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: శార్వరీకి స్వాగతం
కోయిల గానంలో
కరోనా రాగం వినిపిస్తుంది
కంటికి కునుకు లేకుండా
కనపడని వైరస్ వెంటాడుతోంది
చైనా గోడను దాటి
చైన్ లింకుతో గొలుసుకట్టుగా
మానవ మనుగడపై
దండయాత్ర మొదలు పెట్టింది
మామిడి పిందె కందిపోయి
వేపపువ్వు ఏవగింపయింది
షడ్రుచులు చెల్లాచెదురై
చేదు అనుభవాలు వెంటాడుతున్నయ్
ఉగాది పచ్చడి కోసం
కరోనా కోరలు సాచింది
కొమ్మ మీద కోయిలమ్మలు
కలవరపడి కలత చెందుతున్నయ్
పశువులకు చిక్కాలు కట్టినట్లు
అయ్యవార్లు
మూతులకు మాస్కులు తగిలించుకొని
పంచాంగం శ్రవణానికి సిద్ధపడ్డారు!
ఓ శార్వరీ!
వికారి నామ సంవత్సరంలో
శనిలా దాపురించి
కరోనా పన్నిన పద్మవ్యూహం నుండే
మేం స్వాగతం పలుకుతున్నాం!
ఓ యుగయుగాల ఉగాదీ!
మా గమ్యం అగమ్యగోచరం
మహమ్మారి కరోనాను కట్టడి చేసి
జాతిని జాగృతం చెయ్యి తల్లీ!
పేరు: నరసయ్య
[17/05, 12:30 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 17/5/2020
కవిత సంఖ్య: 16
కవి పేరు: కట్టెకోల చిన నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: కరోనాను ఖతం చేద్దాం!
యుద్ధభూమిలో
ఎవరూ ఒంటరి కాదు
ఎదుటివారిలోని బలహీనతల ఆసరాతోనే
శత్రువు ఊహాన్ వేదికగా
రణశంఖం పూరించింది
ఎన్ని యుద్దాలు చూడలేదు
ఎన్ని విపత్తులను ఎదుర్కొన్నాం
కలరా కాల గర్భంలో కలిసింది
గత్తర పత్తా లేకుండా పోయింది
మశూచి మసి బారింది
చరిత్రలో ఎన్నెన్నో
నామరూపాల్లేకుండా పోయాయి
ఇదొక లెక్కా
మాకేం కాదులే అనే నిర్లక్ష్యపు వాదనే
శత్రువు ఒరలోని పాశుపతాస్త్రమైంది
స్వీయ నిర్భంధాన్ని తిరస్కరించి
రోడ్డెక్కిన వారంతా శత్రు పక్షమే
రణ భూమిలో శత్రువుకు
ఇన్ఫార్మ ర్ గా మారిన వైరస్ అంటు
సైనిక బలగాలను రప్పించడం
మన స్వయంకృతాపరాధమే
యుద్ధ క్షేత్రంలో
ప్రాణాలకు తెగించిన వైద్యులు
పరుల ప్రాణమే
తమ ప్రాణంగా పారిశుద్ధ్య కార్మికులు
ఇల్లును మరచిన పోలీస్ పహారా
శత్రువు జాడలో జర్నలిస్టుల కదలికలు
అందరికీ అన్నం పెడుతున్న రైతులు
వీరంతా కరోనా కదన రంగంలో
వీర సైనికులే
ఇప్పుడు మన ముందున్న
తక్షణ కర్తవ్యం
శత్రుసంహారమే ఏకైక లక్ష్యం
గడపదాటని స్వీయ నిర్బంధాలు
సర్కార్ సహకారంతో
మనందరి పోరాటంలో
కరోనాను ఖతం చేద్దాం!!
17
కవిత సంఖ్య: 17
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఓ రఘునందనా!
ఓ రామా!
కరాళ రక్కసి
కరోనా కకావికలం చేస్తోంది
సీతమ్మ తల్లీ!
కనిపించని వైరస్
కాటు వేయ వెంటాడుతోంది
లక్ష్మణా!
సూది రంధ్రంలో
సూక్ష్మ క్రిమి మాటు వేసింది
ఆంజనేయా!
అదుపుతప్పిన కోవిడ్ 19
అహంకారంతో విర్రవీగుతోంది
మేమంతా
సర్కార్ సందేశాలను
చక్కంగ పాటిస్తున్నాం
వైద్యుల నిరంతర సేవలో
రుణపడి పోతున్నాం
పోలీసుల పహారాలో
శత్రువుకు
దొరకని రక్షకులమయ్యాం
అయినా క్రిమి ఉనికి
కునుకు లేకుండా చేస్తుంది
కంటి చూపుకు చిక్కటం లేదు
మా ఆకలి చావులను
ఆసరా చేసుకొని కాపు కాసింది
ఆత్మ రక్షణతో
స్వీయ గృహ నిర్భంధంలోనే
సీతారాముల కల్యాణాన్ని
ప్రత్యక్ష ప్రసారాలతో
సర్దుకుని తరించి పోయాం
ఓ రావణ సంహారా!
రాకాసి రాక్షస క్రీడలకు బలైపోతున్నం
రఘు నందనా!
మహమ్మారిని మట్టుపెట్టు తండ్రి!!
18
తేది : 18/5/2020
కవిత సంఖ్య: 18
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: తస్మాత్ జాగ్రత్త!
వర్తమానంపై
విసిరిన సవాల్ ను
సాదరంగానే స్వీకరించాం
భవిష్యత్తుపై ఆశలతో
శత్రువును కట్టడి చేస్తున్నాం
ప్రకృతి గమనిస్తోంది
నీ వికృత చేష్టలను
నీవు నారాయణాస్తత్రం సంధిస్తే
మేం అస్త్రసన్యాసం చేసి
గృహ నిర్బంధం నుండే
నీ దాడిని తిప్పి కొడుతున్నాం
కంటికి కనబడని శత్రువువి
నీది రాక్షస క్రీడ
మేం మొదట ప్రదర్శించిన
ఉదారవాదం వల్లనే
విమానయానం చేసి
వికృత చేష్టలతో విర్రవీగుతున్నవ్
అప్రమత్తమైన
మా సర్కార్ సందేశంతో
సమాజ దూరం పాటిస్తూ
లక్ష్మణ రేఖను దాటకుండా
స్వీయ నిర్భంధంతో
నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాం
మహమ్మారి కరోనా తస్మాత్ జాగ్రత్త!
పేరు కెసి నరసయ్య
19
కవిత సంఖ్య::19
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: విశ్వ మానవతామూర్తి!
ప్రపంచ దేశాలలో
నువ్వు ఒక చీమ లాంటి దానివి
నిన్న మొన్నటి వరకు
ఇరుగుపొరుగు వాళ్లకు
నువ్వొక తృణప్రాయం
ఆపదలో నిన్ను ఆదుకోకపోగా
నిన్నంతా ఎగతాళి చేసిన వారే
కోటి జనాభాలో
లక్షమంది దేవుళ్లతో
కొలువైన నీ రాజ్యం!
మాలో ఎంతో ఆత్మస్థైర్యం నింపింది
ప్రపంచ ప్రజల
ఆర్తనాదాలు హాహాకారాలనే
స్వాగతంగా భావించిన నీవు
మమ్ముల హృదయానికి హత్తుకొని
మానవత్వాన్ని చాటుకున్నావ్!
నిన్నోకప్పుడు అవమానించిన మేము
మా అహంకార శిరస్సులను
నీ పాదాల చెంత ఉంచి
ప్రణమిల్లు తున్నాం!
వైద్యుల రూపంలో
అవతారమూర్తిగా అవతరించి
కనపడని శత్రువుతో
కదన రంగాన పోరాడుతున్న
ఓ విశ్వ మానవతా మూర్తీ!
క్యూబా! ఓ క్యూబా!!
నీకు లాల్ సలాం! లాల్ సలాం!!
20
పేరు: నరసయ్య
[19/05, 7:12 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 20/5/2020
కవిత సంఖ్య: 20
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఆత్మ రక్షణే!
ప్రకృతి ఆకృతిలో
వైరస్ విలయ తాండవం
అగ్రరాజ్యాల
మెడలు వంచిన సూక్ష్మాతి సూక్ష్మం
పరేషాన్ లో ప్రపంచ దేశాలు
జమ్మి చెట్టును ఆశ్రయించిన
అణ్వస్త్ర ఆయుధ సంపదలు
అజ్ఞాతవాసంలో దాగుడుమూతలు
రాజ్యాలలో
రగులుతున్న కరోనా నిప్పు కణికలు
పాలనలో అంతా స్మశాన వైరాగ్యం
ముచ్చెమటలతో
మూడు కోట్ల మంది దేవతల సాక్షిగా
చిక్కాలు కట్టుకున్న మతాధిపతులు
గుడులు గోపురాలకు శఠ గోపాలు
మూతేసుకున్న మసీదులు చర్చిలు
వైతరణి నదిని
మరిపిస్తున్న నదీనదుల ప్రవాహాలు
కాలుష్యం కోరల్లో
బందీలైన పల్లె పట్టణాలు నగరాలు
మనిషి వికృత చేష్టల్లో ప్రకృతి విలవిల
పరాకాష్ట దశలో ఓజోన్ పొర
యుద్ధాలు లేవు
ఆధిపత్యం అంతకన్నా లేదు
ఆత్మ రక్షణే అంతిమ పరిష్కారం
ప్రపంచ కవితా దినోత్సవంలో
కరోనాను
వెంటాడుతున్న నా కవితాగానం!
21
పేరు: నరసయ్య
[20/05, 3:45 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 20/5/2020
కవిత సంఖ్య: 21
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: సమాధులే
ప్రతిపక్షం
లేకపోతే
ప్రశ్నకు
తావేలేదు
పాలక పక్షం
ఉన్నా
సమాధానాలు
సమాధులే
నిర్వీర్యమైన
ప్రజల
ఓటు
ఆయుధం
చట్ట సభలు
అధికారపక్షం
చేతిలో
కట్టు బానిసాయే
22
పేరు: కెసి నరసయ్య
[20/05, 3:48 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 20/5/2020
కవిత సంఖ్య: 22
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: లోపించిన పారదర్శకత
మనిషికి
రెండు కాళ్ళు
రెండు చేతులు
ఆడితేనే
అవనిపై
నిలబడగలుగుతాడు
ఏ వాహనానికైనా
కుడి ఎడమల
రెండు చక్రాలు
ఉండి తీరాల్సిందే
గాలిలో తెలిపోతున్న
విహంగానికైనా
భూమి మీద
దూసుకుపోతున్న
రైలు బండికైనా
పక్షికి
రెండు రెక్కలు
ఉంటేనే
ఆకాశంలో
ఎగరగలుగుతుంది
రెక్కను
తెగ్గొట్టిన
పక్షి
ఎగరగలుగుతుందా
బలమైన
ప్రతిపక్షం లేని
పాలకపక్షం
పాలనలో
లోపించిన పారదర్శకత
కవి పేరు: కెసి నరసయ్య
[22/05, 7:07 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 22/5/2020
23
కవిత సంఖ్య: 23
కవిపేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఓనర్లోచ్చారు
రాజకీయం
వ్యాపారంగా
మారింది
పార్టీలకు
ఓనర్లోచ్చారు
గులాబీ గూడు
ప్రైవేట్ లిమిటెడ్ గా
సందడి చేస్తుంది
నీరు
పల్లమెరుగును
కాళేశ్వరం
కాకతాలీయమేం కాదు
కోట్ల కరెన్సీ ప్రవాహమే
కాంట్రాక్టర్లు
వ్యాపారులు
కండువాల రంగులు
మారుస్తూ
పార్టీలను కబ్జా చేస్తున్నరు
24
పేరు : కెసి నరసయ్య
[22/05, 7:07 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 22/5/2020
కవిత సంఖ్య: 24
జిల్లా: ఖమ్మం
కవిపేరు: కెసి నరసయ్య
శీర్షిక: ఆదర్శానికి ప్రతిబింబం
ఐదు వేళ్ళతో
ఐదురూపాయిల భోజనం
తృప్తిగా ఆరగిస్తున్న
ఐదు దఫాల ఎమ్మెల్యే
సుందరయ్య రధమే
విలాసవంతమైన వాహనం
అడవి ప్రజల మధ్య
కలివిడి జీవనం
మేడి పట్టిన చేతులు
నాగేటి సాళ్ల వెంట సాగిన కాళ్ళు
ఆదివాసీల ఆర్తనాదాలు
జనం గుండె చప్పుళ్లను
చట్టసభల్లో టంకా చాటింపు
జనం మెచ్చిన
ప్రజా ప్రతినిధి
గుమ్మడి నరసయ్య
ఆదర్శానికి ప్రతిబింబం
నిజాయితీకి నిలువుటద్దం
పేరు: కెసి నరసయ్య
25
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 23/5/2020
కవిత సంఖ్య: 25
కవిపేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: దాష్టీకం
రాత్రంతా
చిట్టి చేతులతో
అమ్మను
తడిమి తడిమి
బోసినవ్వులతో
బోలెడు కబుర్లు
రవికను ఒక చేత్తో
పవిటను మరొక చేత్తో
తొలగించాలనే ప్రయత్నంలో
అమ్మ చనుబాలతో
ఆకలి తీర్చుకుంటూ
ఎన్నెన్నో ఆటలు
కన్నులు
మూతలు పడుతుండగా
మధ్యమధ్యలో ఉలిక్కిపాటు
అమ్మ ఉందో లేదోనని
చనుల పైన చిట్టి చేతులు
తారాడుతూ భరోసాగా
మగత నిద్రలో
అర్ధరాత్రి
మానవ మృగాలు వేట
డేగల సమాచారం
తల్లి పొత్తుల నుండి
చిట్టితల్లినీ ఎత్తుకెళ్లిన
ఓ మానవ మృగం
అమ్మ స్పర్శ
దూరమయ్యే సరికి
తల్లడిల్లిన బంగారు తల్లి
కెవ్వుమన్న కేక రాకుండా
అదిమిపట్టి
మర్మాంగంపై
మానవ మృగం దాడి
అమ్మా! అమ్మా!!
అంటున్న
అరణ్యరోదన లోనే
చిన్నారిని చిదిమేశాడు
చీమను నిలిపివేసినట్టు
మామిడి పిందెను
కొరికి నమిలి ఉాసినట్లు
మాటలే రాని
బోసి నవ్వుల
బంగారు తల్లిని
గొంతునులిమాడు
వెంపలి చెట్లకు
నిచ్చెనల వలయం
పాపం పుణ్యంలో
పాపిష్టి దాష్టీకం
పసికూనలపై పాశవికం
ఇప్పుడు
మనం ఎక్కడ ఉన్నాం?
మానవ సమాజంలోనా?
ఆటవిక లోకంలోనా?
ఎంత అనాగరికం?
ఏమిటీ వైపరీత్యం?
చుట్టూ వైతరణీ నదీ ప్రవాహమేనా?
పేరు: కెసి నరసయ్య
26
సమూహం: వీరా స్ కవి సమయం
తేది: 23/5/2020
కవిత సంఖ్య: 26
కవి పేరు: కె సి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఆత్మరక్షణలో అడవి
అరాచకం
అహంకారం
కండకావరం
అన్ని కలగలిపి
పొగరు గల అధికార దర్పం
స్వాహా చేసేందుకు
పోరంబోకు అయితేనేమీ
పోడు భూమి అయితేనేమి
అనుచరులు అంతా కీలు బొమ్మలే
అటవీ చట్టాలన్నీ
ఆటవిక రాజ్యంలో
తోలుబొమ్మలాటలయ్యాయి
హరితహారం
ఆదివాసిల
ఉనికికే ప్రశ్నార్థకమైంది
వన్ సెవంటీ
ఏనాడో
చార్ సౌబీస్
మాదర్ చోర్ లో మంటగలిసింది
మొక్కలు నాటే వంకతో
ఆదివాసీల పొడు దారులపై
అటవీ అధికారుల జులుం
ఫారెస్ట్ అధికారులపై
పోడు కబ్జాదారుల దాడులు
నెత్తిపై ఎక్కించుకున్నాక
తలలైనా పగుల కొడతారు
ఏకంగా శిరస్సులైనా తీసేస్తారు
ఆత్మరక్షణలో పడ్డ
అధికారులు
అప్రమత్తం కావాలి
తమను తాము రక్షించుకుంటారో?
అడవిని రక్షిస్తారో? తేల్చుకోవాలి
పేరు: కె సి నరసయ్య
27
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 26/5/2020
కవిత సంఖ్య: 27
కవిపేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: చలి చీమల దండు
ఓటేస్తున్న
కాటేయమాకు
నోటు లేకుండానే!
ఓటమిపై
నీకెందుకు రందీ
గెలిచిన వాళ్లంతా
నీ బందీలవుతుండగ
ఓటేస్తున్న
కాటేయమాకు
నోటు ఉన్న లేకున్నా
ఇప్పుడు
పొలిటిషన్ ఒకే ఒక్కడు
అంత పొల్యూషనిస్టులే
అసెంబ్లీ కప్పలు
పార్లమెంటు పాములు
ఓటుకు వచ్చినవి తిప్పలు
నోటు సుడిగుండంలో
ఓట్టేస్తున్న
కాటేయమాకు
ప్రశ్నకు తావుందో లేదో?
తెలుసుకొని
రాజకీయం
థన ప్రవాహాల పై
ఓటు ఇటుకలతో
వంతెనలు కడుతోంది
ఇక
అందరి దాహం
తీరుతుందట
ఓటు నోటు తో
ఓటేస్తున్నా
కాటేయమాకు
బీదా బిక్కీ
అందరినీ కలుపుకొని
గంగిరెద్దుల
గుంపుల్లో
దొర ఉండగా
మాకెందుకు రంది
యంత్ర తంత్రాల
మంత్రాల గారడీ
ఉండగా
మాకెందుకు
మరో మంత్రగాడు
ఓటేస్తున్న
పోరాటాలకు స్వస్తి పలికి
మరో పోరాటం రూపంలో
గురిగింజ కింద
నలుపు దొరలంతా
తెల్లదొరలను
మరి పిలుస్తున్నారు
ఎవ డు
దోచుకుంటేనేమి
ఎంగిలి మెతుకుల్లా
ఓ నోటు పడేస్తున్నారు
ఓటేస్తున్నా
కాటును
వేటు వేసేందుకే
చలి చీమల దండుతో
పేరు: కెసి నరసయ్య
28.
సమూహం: వీరాస్ కవిసమయం
తేది: 27/5/2020
కవిత సంఖ్య: 28
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: కఠినత్వం ఆపాదించకండి
ఓర్పుకు
పరీక్ష పెట్టకండి
అడ్మిన్ లకు
ఆగ్రహం తెప్పించకండి
లెక్కలేని తనానికి
స్వస్తి పలకండి
నిబంధనలను
నిఖార్సుగా పాటించండి
గ్రూప్ సభ్యులకు
హుందాతనం పెంచండి
మధ్యలో దూరానని
మండి పడకండి
రిమూవ్ రీల్ కు
ఆమడ దూరంలో ఉండండి
సాహితీ స్నేహితులారా!
సగర్వంగా రచనలు చేయండి
గ్రూప్ నిర్వహణకు
మరింత చేయూత నివ్వండి
కోయిల స్వరంకు
కఠినత్వం ఆపాదించకండి
తీయని పలుకులతో
ఆశీర్వచనాలు అందుకోండి
పేరు: కెసి నరసయ్య
29.
సమూహం: వీరాస్ కవిసమయం
తేదీ: 26/5/2020
కవిత సంఖ్య: 29
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఆగమ్యగోచరం
పల్లె రమ్మంటుంది
పట్నం పొమ్మంటుంది
ఆకలి
కేకలు పెడుతుంది
కంచాలు
పస్తులుండమంటున్నయి
చెమట ప్రవాహంలో
కాళ్ళు జారిపోతున్నాయి
పైన మాడు మాడిపోతుంది
కింద పాదాలు బద్దలవుతున్నయి
పసికూనల పేగుబంధం
రెక్కలకు వేళ్ళాడుతున్నయి
అవ్వ బువ్వ కోసం
గువ్వలా ముడుచుకుపోయింది
ఆగితే ఆకలి పీక పిసుకుతోంది
సాగితే కరోనా వెంటాడుతుంది
ఆగినా సాగినా
వలస బతుకుల గమ్యం అగమ్యగోచరం
పేరు: కెసి నరసయ్య
30.
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 28/5/2020
కవిత సంఖ్య: 30
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: బోర్డు బొందలో ఎవరిని పాతి పెట్టాలి?
బలిపీఠం
ఎక్కిన బలిదానాలు
తెలంగాణ తల్లి ఒడిలో సేద తీరాయి
పరీక్షల ప్రామాణికంలో
బిడ్డల ప్రాణాలు గడ్డిపోచలయ్యాయి
గ్లోబరీనా గూడుపుఠానిలో
గుండు సున్నాలు గుడ్లురు మాయి
గణితశాస్త్రంలో ఆరితేరిన పండితులంతా
అంకెల గారడీలపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు
రాసిన సమాధానాల కోసం
ప్రశ్నలను నిగ్గ తీసేందుకు
నూనూగు మీసాల చిన్నారులు
విగత జీవులై
ఇంటర్ బోర్డు గేటుకు వేలాడుతున్నారు
త్రిసభ్య కమిటీతో
చేతులు దులుపేసుకుంటున్న పాలకవర్గాన్ని
న్యాయస్థానం
సూటిగానే ప్రశ్నించింది
సమాధానాల జాడే లేదు
యువరాజా వారి సన్నిధిలో
గ్లోబరీనా గోలీలాటకు
శ్రీకారం చుట్టింది
ఇప్పుడు
ఇంటర్మీడియట్ బోర్డు బొందలో
ఎవరినీ పాతి పెట్టాలి?
గ్లోబరీనానా?
దాన్ని నెత్తిన పెట్టుకున్న పాలకవర్గాన్నా?
పేరు: కెసి నరసయ్య
31
తేది: 29/5/2020
కవిత సంఖ్య: 31
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: కరోన అరాచకం
కంటికి కనపడని వైరస్
కనికరం లేని కరోనా వేటు
ఈశాన్యం దిశగా దండయాత్ర
కటీఫ్ అయిన కరచాలనం
చెల్లాచెదురైన సమూహాలు
చతికిల పడ్డ స్టాక్ మార్కెట్
మూతపడ్డ సినిమా హాళ్లు
చదువులకు సెలవు దినాలు
వాయిదాపడిన ఎన్నికలు
నిలిచిపోయిన ప్రయాణాలు
చేపల మాదిరిగా చేతులను
రుద్ది రుద్ది కడుతున్నాం
నిన్ను కడ తేర్చేందుకు
నివురుగప్పిన విదేశీయానం
స్వదేశీయులకు ముచ్చెమటలు
గృహనిర్బంధంలో పర్యవేక్షణలు
అతలాకుతలమౌతున్న లోకం
ప్రశ్నార్థకమైన మానవ మనుగడ
కరోనా కలవరింతలో కకావికలం
మానవ తప్పిదం
అదను చూసి
దాడి చేసిన వింత వైరస్
కన్నెర్ర చేసిన విశ్వం!
కరోనా అరాచకానికి
కలిసికట్టుగా అంతం పలకాలి!
పేరు: కెసి నరసయ్య
32.
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 30/5/2020
కవిత సంఖ్య: 32
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: గాయం గాయమే!
వందేళ్లు కాదు
వేయ్యేళ్లయినా
గాయం గాయమే!
నల్ల చట్టాలు
పిల్లిలా ఇళ్ల చుట్టూ
తిరుగుతున్న అంతకాలం
ఎంత చిన్న గాయమైనా రాచపుండే!
జూలియన్ వాలాబాగ్
దురంతమే కాదు
తోభై శాతం వికలాంగుడైన
సాయిబాబాను జైల్లో పెట్టిన
దౌర్భాగ్య సంఘటన తక్కువేమీ కాదు
అదీ గాయమే
గాయం చిన్నదా పెద్దదా
సమస్య కాదు అసలెందుకు
గాయాలు చేస్తున్నారన్నదే
ఇప్పుడు
మా సున్నిత
మనసులను తోలుస్తున్న ప్రశ్న?
ప్రజల వర పుత్రుడైన
వరవరరావును
చీకటి బందీఖానా చేశానని
చిందులేయకు
వందేళ్ల నెత్తురు చుక్క
వెయ్యేళ్ల కైనా మాకు వేగుచుక్కే
మేము డయ్యర్ దగుల్బాజీని
రౌలర్ చట్టం రింగ్ ముఠాల
కీచక పర్వాన్ని మరవకుండానే
మా వీరులను స్మరించుకుంటూ ముందుకు పోతున్నాం!
పేరు: కె సి నరసయ్య
33.
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 31/5/2020
కవిత సంఖ్య: 33
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: చిరునవ్వుల మస్తాన్!
మా మంచి మస్తాన్!
మరువలేని మరపురాని మనిషి
మనసులోనే
విప్లవాల గూడుకట్టుకొని
చెదరని జీవితంతో
అడుగులు వేయించిన వాడు
తమ్ముళ్ళను తట్టి
అన్నల ఆకలి తీర్చిన వాడు
చిరునవ్వులతో
ఆచరించి ఆప్తుడైన
అరమరికలు లేని
మస్తాన్ మన అందరి వాడు
మా మంచి మనిషి
మస్తాన్ కు విప్లవ జోహార్లు!
పేరు: కె సి నరసయ్య
34
సమూహం: వీరాస్ కవిసమయం
తేది: 01/6/2020
కవిత సంఖ్య: 34
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: తుది యాత్ర
బక్కచిక్కిన
బరువుతో
పలకా బలపం
చేత పట్టి
బడికి వెళ్లాను
బరువైన అక్షరాలు
బతుకు జీవనంలో
బహుదూరంగా నిలిచి ఉన్నవి
బండబారిన
నేలతల్లి బాహువుల్లో
బందీ అయ్యాను
అందలం ఎక్కిన
అంద వికారాన్ని తుదికంటా
అంతమొందించుటకు
అంపశయ్యపై
అంతిమయాత్ర సాగించాను
పేరు: కెసి నరసయ్య
35
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 02/6/2020
కవిత సంఖ్య: 35
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: మత సామరస్యం
పాతబస్తీలో పాత నాయకుడు
కొత్త బస్తీలో కొత్త నాయకుడు
కార్చిన మొసలి కన్నీరు
మూసీ నదై ప్రవహించింది
భాగ్యనగరంలో వీచేగాలి
శవాల కంపుతో
ముక్కుపుటాలను పగలే స్తుంది
పాలవాడు పత్తా లేక
పసివాడు తెలేసిన గుడ్లు
గురిపెట్టి చూస్తున్నాయి
కర్ఫ్యూ గుండెలోతుల్లోకి
వీధులన్నీ విసిరేసిన బొంగరంలా
తిరిగి తిరిగి అలసి పడి ఉన్నాయి
అంతంలేని ఏకాంతంగా
తుఫాను బీభత్సంలో
కొట్టుకుపోయిన కొంప కోసం
వెతుకులాడుతున్నట్టుగా
గల్లి గల్లి కి పోలీస్ గస్తీ
తిరుగుతోంది ప్రతిక్షణం
రాతి విగ్రహాల రాక్షసంలో
కర్కశమైన కఠోరమైన కర్ఫ్యూ
కాకలు తీరిన గజదొంగ లను
(అ) రాజకీయ వాదులను
కాపాడుతూనే ఉంది అనుక్షణం
మతసామరస్యం పేరుతో
మనువు వారసుల సమావేశంలో
KCN పులుముకున్న ఆయుధం
అంతర్గత కలహాలను లేపింది
అంతులేని వివాదాలను సృష్టించింది
పేరు: కెసి నరసయ్య
36
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 03/6/2020
కవిత: 36 సంఖ్య
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: చివరి ఎత్తు
సజీవంగా ప్రయాణిస్తున్న నీకు
ఉవ్వెత్తున లేచిన అలలు
ఆహ్వానం పలుకుతూ
గర్భంలో ఇముడ్చుకుంది సంద్రం
మూడు ముక్కలాటలో
ముప్పేట ముంచిన
దగాకోరును దండించుటకు
దగాపడ్డ తమ్ముళ్లను ఆశ్రయించావు
ఎరకు ఆశ పడ్డ చేప
సొర చేప అంత పెద్దదై
సంద్రంలో విహరించే
నావను కూల్చ ప్రయత్నించింది
పగటి కల
పచ్చి నెత్తురు తాగుతూ
పగబట్టి స్వైర విహారం చేస్తుంది
చదరంగంలో
వేసిన చివరి ఎత్తు
ఏకలవ్యుని బొటనవేలుతో
రక్తాన్ని చవిచూసింది
నివురుగప్పిన నిప్పు
నినదించిన నినాదం
బిగించిన పిడికిలి
సమాజ మార్పుకై సవాల్ విసిరింది
పేరు: కెసి నరసయ్య
నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
37
సమూహం: వీరాస్ కవిసమయం
తేది: 04/6/2020
కవిత సంఖ్య: 37
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: డార్విన్ అమర్ హై!
మానవతే మహిమను
నిలబెట్టినప్పుడు
నాగరికతే అనాగరికంగా
మారినప్పుడు
యధార్థమైన
జీవ పరిణామాన్ని
సజీవ సమాధి చేసినప్పుడు
అందలం కోసం
ఐదుగురే కాదు
ఇంకెంత మందినైనా
అంతమొందించే
అనాగరిక ప్రపంచమా!
పదార్థాన్ని కాలదన్ని
పరమార్ధమే అంటుంది
ఓ నవ నాగరీకులరా!
చేతులతో చేయండి
చేసినవన్నీ
చేతబడులు కావని చెప్పండి
బస్తరు మారాయిగూడెం
అమాయక గిరిజనులను
పొట్టన పెట్టుకుని
ఆంధ్ర మారాయిగూడెం
అంధకారమై కంచే చేను మేసింది
ఇది నాగరీకుల
అనాగరికత అంటావా?
మానవతకే
మతి లేదంటావా?
యధార్థమైన పదార్థాన్ని
వ్యర్థమైన మూఢనమ్మకాలతో
మట్టుపెట్టాలని చూస్తావా?
మతిలేని ఛాందస భావాలతో
కూరుకుపోయిన చాందసుడా!
మహా శాస్త్రజ్ఞుడు అమర్ హై!
డార్విన్ మహాశయుడు అమర్ హై!!
పేరు: కెసి నరసయ్య
9951260316
38
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 5/6/2020
కవిత సంఖ్య: 38
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: కరోనా దండయాత్ర
కోయిల గానంలో
కరోనా రాగం వినిపిస్తుంది
కంటికి కునుకు లేకుండా
కనపడని వైరస్ వెంటాడుతోంది
చైనా గోడను దాటి
చైన్ లింకుతో
గొలుసుకట్టుగా
మానవ మనుగడపై
దండయాత్ర మొదలు పెట్టింది
మామిడి పిందె కందిపోయి
వేపపువ్వు ఏవగింపయింది
షడ్రుచులు చెల్లాచెదురై
చేదు అనుభవాలు వెంటాడుతున్నయి
ఉగాది పచ్చడి కోసం
కరోనా కోరలు సాచింది
కొమ్మ మీద కోయిలమ్మలు
కలవరపడి కలత చెందుతున్నాయి
దూడలకు
చిక్కాలు తగిలించినట్లు
అయ్యవార్లు
మూతులకు మాస్కులు తొడిగి
పంచాంగం శ్రవణానికి సిద్ధపడ్డారు
అనాదిగా
వస్తున్న ఉగాది
ఈ ఏడాది
కరోనా కబంధహస్తాల్లో
చిక్కుకొని ఆగమాగమయింది
పేరు: కెసి నరసయ్య
9951260316
39
సమూహం: వీరాస్ కవిసమయం
తేది: 6-6-2020
కవిత సంఖ్య: 39
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఉరికొయ్యలకు వేలాడదీయండి!!
హమ్మయ్య!
ఆ నాలుగు
మానవ మృగాలను
మట్టు బెట్టారు!
దిశను కాల్చిన చోటనే!
సజ్జనార్ సాబ్
సల్లంగ ఉండాలని!
శభాష్ పోలీస్ అంటూ
మొఖం చాటేసిన
ముఖ్యమంత్రినీ దీవించాం!
పుట్టెడు దుఃఖంలో కూడా
మిఠాయిలు పంచుకొని
రగులుతున్న ఆవేశాలను
ఆ నలుగురి చావుతో
ఆనందాలు పంచుకున్నాం!!
ఇప్పుడు హాజీపుర బావిలో
నలుగురు దిశల అస్తిపంజరాలు
ఆత్మశాంతి కోసం
నలుదిక్కుల పిక్కటిల్లేలా
ఆర్తనాదాలు చేస్తున్నయ్!
ఆసిఫాబాద్
వరంగల్ ఉన్నావ్ బాధితులు
ఎన్ కౌంటర్ స్పెషలిస్టు ల కోసం
ఎదురుచూస్తున్నరు
బావి ఆహ్వానిస్తుంది!
చిన్నారుల వికృత రాక్షసుడు
లక్ష్మి మానసల నర హంతకులు
ఆటవిక మానవ మృగాల కోసం
మనసారా స్వాగతం పలుకుతున్నరు!
మూలాల్లోకి వెళ్లండి
సమూల మార్పు కోసం!
వేటను కొనసాగించండి!
మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా!
స్వామి కార్యం నెరవేర్చండి సాబ్!
కౌంటర్ చేస్తారో? ఎన్ కౌటర్ లే చేస్తారో??
రచ్చబండ న్యాయస్థానాల ఉరికొయ్యలకు వేలాడదీయండి సాబ్!!
పేరు: కెసి నరసయ్య
9951260316
40
సమూహం: వీరాస్ కవిసమయం
తేది: 7/6/2020
కవిత సంఖ్య: 40
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: తప్పదు!
మంట మండుతున్న
వంటగాస్
కంట నీరు పెడుతున్న
వంటిల్లు ఇల్లాలు
ఓటు రాజకీయం
సుడిగుండంలో
పేదల బతుకులు
ఇదేమిటని
ప్రశ్నకు తావు లేని సమాజం
ఓటుకు నోటు
తప్పదు అనుభవించక
పాలకుల పాపాల కర్మలను
పేరు: కెసి నరసయ్య
7981814784
41
సమూహం: వీరాస్ కవిసమయం
తేది: 8/6/2020
కవిత సంఖ్య: 41
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: పగిడిద్దరాజు!
బరువెక్కిన
పాపభీతి
నిలువెత్తు బంగారం
సరితూగని తూకం!
పరుగు పరుగున
పయనమైన పల్లెలు!
అట్టహాసంగా
పట్టణ వాసులు!!
ఎటు చూసిన
మహా జన సంద్రం!
ముందు వెనకల
అటు ఇటు
ఎటు కదిలిన
మేడారం మయం!!
అడవువిలో
రణగొణ ధ్వనులు!
ఎండిన ఆకుల
గలగల చప్పుళ్ళు
తుపాకుల మోత!
మునకలు వేసి
జంపన్న వాగులో
వెతుకులాట
అంపశయ్యపై
జంపన్న కదలికలు!
శత్రు సైన్యంతో
నెత్తురోడిన
సారలమ్మకు
సాదరంగా
ఆహ్వానం పలికిన
చిలకల గుట్ట!
గుట్టలో దాగిన
యుద్ధ నైపుణ్యం!
సమ్మక్క సారలమ్మల
సారథ్యంలో
శిక్షణ పొందుతున్న చిలుకలు!!
చల్లని
దీవెనలిచ్చే
మారాజులు
మహారాజులు
మేడారం గద్దెలపై
కొలువైన
పగిడిద్దరాజు! గోవిందరాజులు!!
కదంత్రోక్కిన జనం
పదం పదం భావావేశం!
ముక్తి కోసం భక్తి భావంతో
సత్తువ చాటిన భక్తప్రభంజనం!
పేరు: కెసి నరసయ్య 9951260316
42
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 9/6/2020
కవిత సంఖ్య: 42
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: సింహ వాహినీదేవి
ఆషాఢమాసం
ఆనందోత్సహాలతో
లాల్ దర్వాజా బోనాలు!
మా ఇంటి ఆడపడుచు
స్వర్ణకిరీటిధార
మహంకాళి ఆలయంలో
కొలువైన
ఆది శక్తి స్వరూపిణీ!
ప్రజల కష్టాల కడలిని
కడతేరుస్తున్న కట్టమైసమ్మవై
పాపవినాశనంలో పోచమ్మవై
మమ్ముల భద్రంగా
కాపాడుతున్న భద్రకాళివై
ఎల్లవేళలా
మాకు అండగా ఉంటున్న ఎల్లమ్మగా
బోనాలందుకుంటున్న సింహవాహినిదేవి!
మల్లెలు సన్నజాజులు
తీరొక్క పూలతో పూదండలు
గవ్వలు నిమ్మకాయలు
వేపాకుల మాలలు ధరించగ!
పెరుగు బెల్లం పచ్చి పులుసు
బూరెలు గారెలు ఆకుకూరల సాకల
బోనాలతో పరమాన్నం నైవేద్యం!
వాడవాడలా
తోరణాల అలంకరణ
పచ్చన్నంతో పచ్చగా ఉండాలని
పోతురాజులు శివసత్తుల విన్యాసాలు!
పచ్చి కుండపై రంగం
మాతంగిని
ఆవరించిన అమ్మవారు!
జరిగింది జరగబోయేది
పలుకుతున్న భవిష్యవాణి!
పాడి పంటలతో
పిల్లా జల్లా
సల్లంగ ఉండాలని
బంగారు బాటలకు
చల్లని దీవెనలు అందించు తల్లీ!
పేరు: కెసి నరసయ్య 9951260316
43
సమూహం: వీరా స్ కవి సమయం
తేది: 10/6/2020
కవిత సంఖ్య: 43
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: కౌన్ బనేగా కరోడ్ పతి!
అమితాబచ్చన్
అద్భుతమయిన
ఉచిత సలహాలు!
ఆహ్వానం!
కౌన్ బనేగా కరోడ్ పతికి
కోటి రూపాయలు
గెలుచుకోమనీ!
ఈ సలహా బాగానే ఉంది
ఎన్నో తిప్పలు పడి
శ్రమ కోర్చి సాదించిన కోటి!
గెలుచుకున్న సొమ్ముతో
కళ్యాణ్ జ్యువెలరీ లో
నగలు కొన మంటాడు
ఇదీ బాగానే ఉంది
నలుగురిలో
ఎంత హుందాతనం!
ఏమి డాబు!!
కొన్న నగలును
ముత్తూట్ ఫైనాన్స్ లో
కుదువ పెట్టమంటాడు!
బహుత్ అచ్చా
డబ్బుకు డబ్బు
బంగారానికి భరోసా!
ఇప్పుడు
తడిసి మోపెడైంది
అసలు వడ్డీతో సహా
అప్పెలా తీర్చాలనే బెంగ?
ఒత్తిడికి గురై
తల వేడెక్కిపోయింది?
వేడెక్కిన తల
చల్లబడడానికి
నవరత్న ఆయిల్ ను
తలకు రాసుకోమంటాడు
దటీజ్ అమితాబ్ ఉచిత సలహా!
పేరు: కెసి నరసయ్య 9951260316
44
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 11/6/2020
కవిత సంఖ్య: 44
కవిపేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: అమ్మతనం!
గుర్రాలెక్కిన కోరికలు
గుట్టుచప్పుడు కాకుండా
గర్భాన్ని ఆశ్రయిస్తున్నాయి
నవమాసాలు,
మోసిన మాతృమూర్తులు
ద్రౌపదినే మరిపిస్తున్నరు
మెడలో
పుస్తెల తాళ్లకు బదులు
పెళ్లి కాని భర్తలు
వేలాడుతున్నరు
తల్లి పేగు బంధాలను
ముళ్ళ పొదల్లో
మురికి కూపాలకు
ముట్ట చెబుతున్నరు
కారుతున్న
చనుబాలు
కార్చిచ్చులా
దేహాన్ని రగిలిస్తున్నాయి
అనాధలు
అగాధాలలో
తమ గాథలను
తవ్వు కుంటున్నరు!
కమ్మనైన తల్లితనం
కరుడు కట్టిన కాఠిన్యంతో
అమ్మతనానికే ప్రశ్నార్థకమైంది?
పేరు: కెసి నరసయ్య
9951260316
45
సమూహం: వీరాస్ కవిసమయం
తేది: 12/6/2020
కవిత సంఖ్య: 45
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: వివాదం -- సంవాదం
ఏపీకి
మూడు ముళ్ల బంధం
మూడు రాజధానుల భాగ్యం
మురిపెంగా
తీరొక్క రంగులతో
రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం
ముచ్చటైన కలయిక
ఉరుకుల పరుగులతో
మూడు నదుల త్రివేణి సంగమం
రాజకీయ
ఆధిపత్యపోరులో
రగులుతున్న వివాదం
రాజధానుల సంవాదం
పేరు: కెసి నరసయ్య
9951260316
46.
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 13/6/2020
కవిత సంఖ్య: 46
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: కొండెక్కిన ఉల్లి
ఉల్లిగడ్డ
ఉరిమి ఉరిమి
గుడ్లురుముతుంది
మార్కెట్లో
ఘాటెక్కిన ఉల్లి
రారాజై పోయానని
విర్రవీగుతుంది
ఉల్లి చేసే మేలు
తల్లికి చేటయి
తరాజులోనుండి
సంచిలోకి జారనంటుంది
తాలింపు లో
ఎర్రగడ్డ లేక
ఏవగింపైంది
కొండెక్కిన ఉల్లి
తోడు రాక
నూనె చిటపటలాడుతూ
చిందులేస్తుంది
రుచి రాని కూర
మారాం చేస్తూ గొంతులోకి
దిగనని మొండికేస్తుంది
మందు బాబులు
ఉల్లి కోసం స్టఫ్ ను
కోడి కేలికినట్లు కెలుకుతున్నరు
పేరు: కెసి నరసయ్య
9951260316
47
సమూహం: వీరాస్ కవిస మయం
తేది: 14/6/2020
కవిత సంఖ్య: 47
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: మళ్లీ శిలువ
దారుణం!
రణం కాదు మారణ హోమం!
మరు భూమిని
మరిపించిన ఘోరం!!
రక్తం రుచి మరిగి
పులి విసిరిన పంజా
పునరుత్థానంపై
ముద్దుగా పిలుచుకునే ఉగ్రదాడి
యేసయ్యకు
వేసిన మరో సిలువ!
రక్తపు మడుగులో
మునిగితేలుతున్న చర్చ్ లు
లంక కకావికలం!
ఎగిరిపడుతున్న
మానవ ఆనవాళ్లు!
చెల్లాచెదురైన
ప్రార్థన కూటములు!!
రక్త ప్రవాహంలో
కాగితపు పడవఎల్లా
కొట్టుకు పోతున్న
దైవ గీతాలాపనలు!!
ఉగ్ర సుడిగుండంలో
సుడులు తిరిగిన
ఈస్టర్ వేడుకలు
కాపులను రక్షించుగాక!!
ప్రభువా!
ఎవరు పాపి?
నీవా? నిన్ను ఆరాధించే మేమా?
ఓ రక్షకుడా!
శరణు కోరి ఆశ్రయించాం
ఇప్పుడు మేము
ఎవరి రక్షణ లో ఉన్నాం?
పేరు: కెసి నరసయ్య
9951260316
48
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 14/6/2020
కవిత సంఖ్య: 48
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: పేలాలైన పూలవర్షం
దైవంతో
సమానంగా భావించాం
వైద్యుడే పరమాత్ముడని
పూలవర్షం కురిపించాం
ప్రాణాపాయంలో ఉన్నాం
ప్రాణాలను కాపాడతారని
కరతాళ ధ్వనులతో జేజేలు పలికాం
కరోనాతో వణికి పోతున్నాం
ఆపద నుండి ఆదుకుంటారని
కొవ్వొత్తుల వెలుతురులో
పరమాత్మలను చూసుకున్నాం
ప్రమాదపుటంచుల్లో
పనిచేస్తున్నారనుకున్నాం
డాక్టర్లపై నమ్మకం వమ్ము కాదని
మీతో పాటు
మేమూ కదం తొక్కాం
చెడు వినకు చెడు కనకు
ఆపదలో ఉన్నాం
ఆదుకోమని వేడుకొన్నాం
ప్రాణాపాయ ఆవేదనలను
తిరస్కరించిన అహంకారం
కరోనా కబళిస్తుందని
కాళ్ళ వేళ్ళ పడ్డాం
కనికరం లేని
నిలువుటద్దమైన నిర్లక్ష్యం
గాంధీగిరిలో
నమ్మకం వమ్మైంది
మహాత్ముని సాక్షిగా
కురిపించిన పూల వర్షం
మనోజ్ పై విసిరిన పేలాలయ్యాయి
పేరు: కెసి నరసయ్య
9951260316
49
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 16/6/2020
కవిత సంఖ్య: 49
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: అంతా భాగస్వాములే
ఎన్నికల
పండుగ ముగిసింది
కలలన్నీ
పటాపంచలయ్యాయి
ఓడి నోళ్లు
అంతర్మథనంతో
అంగబలం అర్థబలాలపై
ఆత్మపరిశీలన
వారసుల
పరాజయాలు
మింగుడుపడని ఫలితాలు
రాజకీయ పునాదులకే బీటలు
ఒకరినొకరు
పడగొట్టాలన్న
వ్యూహప్రతివ్యూహాలలో
ఎవరి గోతిలో వారే పడ్డారు
నేర సామ్రాజ్యంలో
అందరూ భాగస్వాములే
పేరు: కెసి నరసయ్య
9951260316
7981814784
50
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 17/6/2020
కవిత సంఖ్య: 50
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఏమిటి రైతు ఘోష?
ఎవరు ఎవరికి
భయపడుతున్నరు?
ఎందుకీ భయం? ఏమిటి అభద్రత?
ఎవరు ఎవరి నుండి
రక్షణ కోరుకుంటున్నరు?
ఎవరికీ రక్షణ? ఏమిటి అభద్రత?
దొంగలెవరు? దొరలెవరు?
నీతిమంతులెవరు? అవినీతిపరులెవరు?
కొనిందెవరు? అమ్మిందెవరు?
భూమి పుత్రులకు వారసులెవరు?
ధరణి వెబ్సైట్ లో
రెవెన్యూ రంకు బొంకులెందుకు?
తెల్ల తెల్లని
ఎఱ్ఱెర్రని బంగారం
నెత్తినేత్తుకున్న రైతన్నకు కత్తి మీద సాము!
గిట్టుబాటు ధర కావాలని
గొంతెత్తి నినదించి నేరానికి
బేడీలతో ఖైదీలుగా
జైలు గోడల మధ్య సాగుకు కుస్తీ!
గట్ల మీది పురుగుల మందు
పట్టు తప్పి అన్నదాతను కాటేస్తుంది?
పట్టాల చిట్టాల్లో
తప్పిపోయిన భూమాతకు
పెట్రో అగ్గి వెలుగులో వెతుక్కుంటున్న
పచ్చని పైరుల వీరుల ఘోష!
రెవిన్యూ బాస్ లకు ఉగ్రవాదమట?
బంగారు తెలంగాణలో
కంగారెత్తిస్తున్న నీతిమాలిన ఆగడాలు
పేరు: కెసి నరసయ్య
9951260316
7981814784
51
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 18/6/2020
కవిత సంఖ్య: 51
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: రండి! లేచి రండి!!
ఎవరు గెలిచారు?
ఎవరు ఓడారు?
సమ్మె పాచికలాటలో
ముగిసిన సమరం!
కాలు దువ్విన కార్మికవర్గం!
మీసం మెలేసిన పాలకవర్గం!
కక్ష సాధింపు చర్యలో
కడతేరిన కార్మికులెందరో?
ప్రగతి రథ చక్రాల బాటలో
నలిగిన ప్రయాణికులు
ఆర్టీసీకి శత్రువెవరు? మిత్రుడెవరు?
ఖంగుతిన్న న్యాయస్థానం!
దిమ్మతిరిగిన బంగారు తెలంగాణ!!
ఆత్మబలిదానాలతో అమరులైన
ఓ అమరులారా! రండి! లేచి రండి!!
యధావిధిగా కొమ్ములు తగిలించుకొని
పోగొట్టుకొని సాధించుకున్న కొలువులో
చేరి పోదాం! పాలకుని సన్నిధిలో!
పేరు: కెసి నరసయ్య
9951260316
7981814784
52
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 18/6/2020
కవిత సంఖ్య: 52
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: సరిహద్దు ఉక్కు కవచం!
సరిహద్దుకు
నీ దేహం
ఉక్కు కవచమయింది
మీ ఉడుకు రక్తంతో
తెల్లని మంచు కొండలు కరిగి
గాల్వన్ లోయ
ఎరుపెక్కిన సంద్రమైంది
సరిహద్దు సాహసం
భారత్ త్రివర్ణ పతాకమై
రెపరెప లాడుతోంది
శత్రుదేశం గుండెల్లో
దూసుకుపోయిన వీర కిషోరుల్లారా!
భరతమాత కీర్తి
గగనతలంలో విశ్వవ్యాప్తమైంది
విషం కక్కిన డ్రాగన్ పై
వెన్ను చూపని వీరత్వం ప్రదర్శించి
శత్రువు గుండెల్లో గుబులు పుట్టించారు
వీరులవై మా వెన్నుతట్టారు
శత్రు సంహారంలో చిందిన రక్తంతో
శ్యోక్ గాల్వాన్ నదుల సంగమం
నురగలు క్రక్కుతుంది
కల్నల్ సంతోష్ వీర కిశోరమా!
అమరులైన వీర జవానులారా!
మీ త్యాగం మా జీవం!
మీ సాహసం మా ఊపిరి!!
వీరులారా! మీకివే మా వందనాలు!!
పేరు: కెసి నరసయ్య
7981814784 9951260316
53
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 19/6/2020
కవిత సంఖ్య: 53
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: తహశీల్ మాయ
బంగారు తెలంగాణ
ముఖద్వారంలో
వేలాడుతున్న
శవాల తోరణాలు
కోరి తెచ్చుకున్న
రతనాల తెలంగాణలో కాలిన శవాల
కమురు వాసన వాసనలు
చట్టాల ఇరుసులో
నలిగిపోతున్న పట్టాదారుడు
పాస్ కాని
పట్టాదారు పాస్ పుస్తకాలు
రైతు కుటుంబంలో
ప్రవేశించిన బంధువు
వేలికేస్తే కాలికి చేస్తుండు
ఇహలో తహసిల్ మాయ
సర్వే పేరుతో
సర్వర్లను చేసిండ్రు
కోటి ఎకరాల
మాగాణాల్లో ని సాగునీరు
రైతుల కన్నీటి ధార అయింది
దేశ వెన్నెముకను
విరిచేసిన రెవెన్యూను
ఆత్మబలిదానాలతో
ఆలింగనం చేసుకుంటున్నారు
ప్రశ్నలకు రాసిన
సమాధానాల కోసంఇంటర్ గేట్ కు
వేలాడిన విద్యార్థులు
విగత జీవులై అస్థిపంజరాలయ్యారు
ఆగని
ఆర్టీసీ కార్మికుల బలిదానాలు
పిట్టల్లా రాలిపోతున్న
బంగారు తెలంగాణ బిడ్డలు
పేరు: కెసి నరసయ్య
7981814784
54
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 19/6/2020
కవిత సంఖ్య: 54
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: సముద్ర గర్భం!
రెండు కత్తులు
ఇమడలేవు
ఒకే ఒరలో
ఉత్తర దక్షిణ ధృవాలు!
ఒకటి కాలేవు
రెండు ఆలోచనలు
తూర్పు పడమరలు!
ఏకతాటిపై
నిలువ లేవు
రెండు ఆశయాలు
భూమ్యాకాశాలు!
వెలుగు నిస్తారు
వంతులవారీగా
ఎదురుపడరు
సూర్యచంద్రులు!
ఆవరించలేవు
ఒకేసారి
రెండు సమయాలు
పగలు రాత్రి!
ఎవరి దారి వారిదే
ప్రవహిస్తున్న నదీ నదాలు
లీనమవుతాయి ఒకే చోట
సముద్ర గర్భం!
పేరు: కెసి నరసయ్య
7981814784
55
[20/06, 5:01 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 20/6/2020
కవిత సంఖ్య: 55
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: సాష్టాంగ సంస్కరణ
వానరాలు
వనం వీడి
జనంతో
జరగడానికి దిగాయి!
పొలంలోని
పంట కల్లాలు
దింపుడు కల్లాల
ఆశలై రోడ్డెక్కాయి!
పల్లెల
చదువులమ్మలు
సంచులు సర్దుకొని
పట్టణాలకు వలస బాట పట్టాయి!
పిలిచినా
ఉలుకూ పలుకూ లేని వాన
పిలవని పేరంటంగా
రైతు కన్నీటి ప్రవాహమై కురుస్తుంది?
దేశ వెన్నెముకలు
మార్కెట్ యార్డుల్లో
పంట గింజల మూల్యాన్ని
పరిగేరుకుంటున్నారు?
రాజధాని నగరంలో
స్వేచ్ఛ కపోతాలుపై
నిర్బంధం ప్రకటించారు?
ఠపఠపమని
కిటికీలపై వాలి
ఆత్మీయులుగా
పలుకరించే పావురాలకు
మేత నిషేధమయింది?
ఆర్టీసీ కార్మికులు
ఆత్మబలిదానాలతో
ప్రగతి రథ చక్రాలను శరణువేడారు!
పాలకులు
పాపాలను కడిగేసుకునేందుకు
స్వాముల పాదాలపై
సాష్టాంగం పడుతున్నారు!
పేరు: కెసి నరసయ్య
56
7981814784
[20/06, 5:02 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 20/6/2020
కవిత సంఖ్య: 56
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: దిశ నిర్భయ అవార్డులు
ఆడపిల్ల
నేడు ఓ అబల
కంచే చేను మేస్తున్న
ఈ దేశంలో ఆడపిల్ల
సబల కానీ అబల
ఇందిరమ్మ ఏలిన
ఈ భరత ఖండంబులో
బలి అవుతున్న
భరతమాత లెందరో?
రాణి రుద్రమదేవి
రణభూమిలో
దిక్కులేని
దిశ నిర్భయ అవార్డుల పంట
రగులుతున్న
అత్యాచార చితిమంటల్లో
ఆవిరై పోతున్న
అందమైన కలల జీవితాలు!
పేరు: కెసి నరసయ్య
7981814784
57
[21/06, 3:17 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 21/6/2020
కవిత సంఖ్య: 57
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: తెగిపడ్డ బొటన వ్రేలు!
ఆత్మబలిదానాలతో
అందలమెక్కిన దొర?
నియంత పాలనలో
ఖాకీల కర్కశత్వం??
సేఫ్ జోన్ ఖమ్మంలో
ప్రాణాలు ఫణంగా పెట్టి!
నీ ప్రాణాలు కాపాడుకున్నాం!!
ఉద్యమ యోధుడి
రక్తాన్ని కళ్ళ చూసినవ్?
తెగిపడ్డ
బొటన వ్రేలు!
చిందిన రక్తం!
ఎరుపెక్కిన సమ్మె!!
ఆగిన ప్రగతి రధ చక్రాలు!!
ప్రగతికి ప్రశ్నార్థకం
నిరంకుశత్వం?
కాలిలో సమ్మె ముల్లు!
కదం త్రొక్కిన సకలజనులు!
పంటితో తీస్తావో?
కంటిలో పొడుచుకుంటావో??
పేరు: కెసి నరసయ్య
7981814784
58
[21/06, 3:17 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 21/6/2020
కవిత సంఖ్య: 58
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: రెవెన్యూ కంటతడి!
మానవత్వమా!
ఏమిటీ వైపరీత్యం?
అగ్గిని మాపై
ఉసిగొలుపుటేల?
రైతు కంటతడికి
రెవిన్యూ తోడై
కన్నీరుమున్నీరైంది!
ఇప్పుడది
దేశ వెన్నెమొకనే మరిపిస్తూ
గుండెలవిసేలా రోధిస్తుంది
ధరణిపై మిన్నంటిన
విజయారెడ్డి
హాహాకారాలు! ఆర్తనాదాలు!!
ఎగిసిపడ్డ మంటల్లో
రెవిన్యూ కంటి పాప
తన చుట్టూ తాను తిరుగుతూ
అగ్నికీలల్లో ఆహుతైంది!
ఆదుకునేందుకు
ఆరాటపడ్డ గురునాధం
మృత్యువుతో పోరాడి
ఆకాశంలో నక్షత్రమైండు!!
కోరలు సాచిన
భూమాఫియా
పడగవిప్పి బుసలుకొడుతుంది
మానవత్వమా!
ఎవరిదీ వైఫల్యం?
మాఫియా సుడిగుండంలో
రైతులదా? రెవెన్యూ రాచరికానిదా?
పేరు: కెసి నరసయ్య
7981814784
59
[23/06, 2:59 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 23/6/2020
కవిత సంఖ్య: 59
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: కరోనాకు సమాధి
కరోనా
సాధించాం!
నీ అంతం
మా పంతంగా
పగబట్టి
పరిశోధనలతో
నీపై
పట్టుబిగించాం!
ఇక నీ ఆటలు సాగవ్
మానవాళిని కబళిస్తున్న
నీకు
చెక్ పెట్టాం!
ఫార్మా సంస్థలు
విరుగుడు మందులతో
నీ కుత్తుకపై
వేటు వేస్తున్నాయి
అన్ని ప్రయోగాలు
పూర్తి చేసుకొని
అనుమతులతో
రంగ ప్రవేశం జరుగుతుంది
తస్మాత్!
కరోనా
నీకిక సమాదే
పేరు: కెసి నరసయ్య
79818147860
60
[23/06, 3 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 23/6/2020
కవిత సంఖ్య: 60
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: నేను రాలేనమ్మా!
అమ్మా!
నేను రానమ్మా
నువ్వైనా చెప్పమ్మా! నాన్నకు
నాకు
పర్యాటకమూ వద్దు
లాంచీ ప్రయాణమూ వద్దు
పాపం పుణ్యమే
ఎరుగని
నాకెందుకమ్మా
పాపికొండల పాపం?
మా టీచర్
మరీ మరీ చెప్పింది!
హాసిని నువ్వు తప్పనిసరిగా
జూపార్కు కు రావాలని
అమ్మా!
నా చేతులకు కాళ్ళకు
పండిన గోరంట చూసి
నా బిడ్డకు
నా దిష్టే తగులుతుందన్నావు
గోదారమ్మ
కుళ్ళుకుందమ్మా
నీ చిట్టి తల్లిని చూసి
వశిష్ట బోటు
ఒరిగినప్పుడు
నాన్న ఉన్నాడన్న
భరోసాతో నాన్నను
కరుచుకుపోయానమ్మా!
అమ్మా! అమ్మా!!
అంటుండగానే
నదీమతల్లి
మమ్ములను కలిపేసుకుందమ్మా
వరద ఉధృతిలో
నీ కాలు పట్టుకునేలోపు
దొరికినట్టే దొరికి
చేజారి పోయావమ్మా!
ఇప్పుడు
నా నుండే గోదారమ్మ
ప్రవహిస్తుంది
నాన్న నేను
కలిసే ఉన్నావమ్మా!
అమ్మా!
ఇక నేను రాలేనమ్మా
నన్ను చూడాలనిపిస్తే
నా తరగతి పిల్లలతో కలసి
జూపార్క్ కు వెళ్ళమ్మా!
పేరు: కెసి నరసయ్య
7981814784
61
[24/06, 6:25 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 24/6/2020
కవిత సంఖ్య: 61
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఎన్నికల ముసుగు
నాకెందుకు
ముసుగు వేశావు
నేను ఎవరిని
ప్రభావితం చేస్తున్నానని?
నాకెందుకు
పాడు గుడ్డలు చుట్టావు
నేనెవరిని
పాడు చేశానని?
నాకెందుకు
ఎన్నికల మకిలి
అంటించావు
నేనెవరి
జయాపజయాలలో
తల దూర్చానని?
నాకెందుకు
నోటు శిలువ వేశావు
నేనెవరి
ఓటును కాటేశానని?
నాకెందుకు
అంటరానితనం
అంట కట్టావు
నేనెవరి
ఎన్నికలు పంటను
మంట కలిపానని?
నాకెందుకు
రూపం లేకుండా చేశావు
నేనెవరిని కురూపిని చేశానని?
నాకెందుకు
ఆగ్రహం కలిగించావు
నేనెవరి నిగ్రహాన్ని
ఆటంకపరిచానని?
నగారా మ్రోగింది
జమ్మి చెట్టుపై దాచిన
హామీల మూటల
ముడులు తెగిపడ్డాయి
ఇదో మాయ
మయసభను
మరిపించే మహా మాయ!
పాంచాలి పంచ భద్రుకా!!
ఇదో జాతర
ఎన్నిక(ల)ల మాయో
సంగ్రామం! మహాసంగ్రామం!!
అంతా
అశ్వద్ధామ హత: కుంజరః లే!!
పేరు: కెసి నరసయ్య
7981814784
62
[24/06, 6:27 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 24/6/2020
కవిత సంఖ్య: 62
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: వాగ్దానాలు
ఎవరు గెలిచిన
ఆ గూటికే
ఇక
ఎన్నికలేందుకు?
పోటీలెందుదుకు
గేదె ఎక్కడ
ఈనిందని కాదు
మన దొడ్లో కట్టేశేమా? లేదా?
నాలుకలన్నీ
తాటి మట్టలైనప్పుడు
ఏ నోటికి తాళం వేయాలి?
ఇక్కడ
దానాలు చెయ్యడానికి
బోలెడు
వాగ్దానాలున్నాయి
పెద్ద నోట్లు రద్దు చేసి
అవ్వను కూడా
క్యూలో నిల బెట్టి
అవతారపురుషుడయ్యాడు
రైతుకు
ఎన్నెన్ని వరాలో
ఎవరికీ చెయ్యి చాపనివాడు
బ్యాంకుల్లో
బిచ్చమెత్తుకుంటున్నాడు
ఎంత ఆసరా
ఎవ్వరూ
ఏ పని
చేయాల్సిన అవసరం లేదు
మా బాధ్యతలన్నీ
వారివే
ఒక్కగానొక్క
ఓటును
అమ్ముకుంటే చాలు
పేరు: కెసి నరసయ్య
7981814784
63
[25/06, 2:42 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 25/6/2020
కవిత సంఖ్య: 63
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఆదర్శానికి ప్రతిబింబం
ఐదు వేళ్ళతో
ఐదురూపాయిల భోజనం
తృప్తిగా ఆరగిస్తున్న
ఐదు దఫాల ఎమ్మెల్యే
సుందరయ్య రధమే
విలాసవంతమైన వాహనం
అడవి ప్రజల మధ్య
కలివిడి జీవనం
మేడి పట్టిన చేతులు
నాగేటి సాళ్ల వెంట సాగిన కాళ్ళు
ఆదివాసీల ఆర్తనాదాలు
జనం గుండె చప్పుళ్లను
చట్టసభల్లో టంకా చాటింపు
జనం మెచ్చిన
ప్రజా ప్రతినిధి
ఆదర్శానికి ప్రతిబింబం
నిజాయితీకి నిలువుటద్దం
గుమ్మడి నరసయ్య జీవితం
పేరు: కెసి నరసయ్య
7981814784
64
[25/06, 2:46 PM] KC Narsaiah KS 26: సమూహం: వేరాస్ కవి సమయం
తేదీ: 25/6/2020
కవిత సంఖ్య: 64
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: అదృష్టం
ఓటు
విసిరికొట్టింది
అహంకారాన్ని
దురహంకారాన్ని
కుక్కలు కూడా
కానన్నంత దూరానికి
పాలేరు
ఆగ్రహానికి గురయ్యాడు
ఉన్న పదవి ఊడి
మురుగు కాల్వలో
కొట్టుకుపోయిండు
రొచ్చు రొచ్చు
రాజకీయంలో
రచ్చరచ్చ అయ్యిండు
రంకు బొంకు మాటలతో
నోరు పారేసుకుండు
ఓడి నోడికి
లేని పశ్చాత్తాపం
ఓటరు కెందుకొ
ఫిరాయింపులో
తీసిపొలేదు ఊసరవెల్లికి
రంగు ఏదైతేనేమి
అధికార పీఠం
దక్కించుకునేందుకు
చిన్నతనం
పెద్దతనం ఏతనమైతేనేమి
మంచితనం ఉంటే
అదే మాకు కొండంత అండ
అభివృద్ధి ప్రదాతగా
అహంతో
హుకుం జారీ చేసావు
ప్రజాప్రతినిధి తీర్పులో
మా తీర్పు మేమిచ్చాం
దీనికెందుకంత
ఉలికిపాటు గగుర్పాటు
ప్రజాస్వామ్యమంటే
ఇంత పరిహాసమా
కుక్క గతి
పట్టి నోడు
ఓటుకు
శాపనార్థాలు
పెడుతుండు
వానికి లేదు
చట్టసభల్లో ప్రవేశం
పేరు: కెసీ నరసయ్య
7981814784
65
[26/06, 11:08 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 26/6/2020
కవిత సంఖ్య: 65
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: పశుత్వం
మైనర్ల
ప్రేమ తీర్పుపై
పశుత్వం దాడి చేసింది
బిడ్డల
ప్రేమ వ్యవహారాన్ని
రచ్చబండ కిడ్చి
రాక్షసత్వాన్ని ప్రదర్శించింది
పెద్దరికం
పేదల పరువును
ఆలిని అమ్మను జతచేసి
బూతు పురాణంతో
కసితీరా కాటేసింది
రచ్చబండ పెద్దరికం
హద్దులు దాటి
అమాయక పేదరికంతో
ఆటలాడుతున్నది
మనవరాలి
వయసున్న బిడ్డను
తాకరాని చోట
కర్కశంగా కాళ్లతో కుమ్మిందుడు
వయసు మరిచి
రెక్క పెట్టి
గుక్కతిప్పుకోకుండా
గొడ్డును బాదినట్టు బాదిండు
ప్రేమించిన నేరానికి
పంచాయతీ పేరుతో
పగబట్టిన పాములా
పైశాచిక తత్వంతో
చిన్నారిపై చిందులేసిండు
ఈ తీర్పు
అంటరాని దైంది
రచ్చబండ రగులుతోంది
అసలు తీర్పు ఇప్పుడు చెప్పండి
నేర పరిష్కారంలో
నేరం చేసిందెవరు?
బాధిత బాలికా? పెద్దరికమా?
పేరు: కెసి నరసయ్య
7981814784
66
[26/06, 11:09 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 26/6/2020
కవిత సంఖ్య: 66
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఎరుపెక్కిన అడవి
వేసవికి
అలసిసొలసిన అడవి
చిరుజల్లులతో చిగురించిన చెట్లు
పచ్చని వాతావరణంలో
సేదతీరిన గిరిజనం
నందికొండ
పంది గుట్టల్లో
కొక్కొరోకో మేలుకొలుపులు
పక్షుల కిలకిలారావాలు
ఎక్కడో వినకూడని శబ్దాలు
కర్కశ ఆనవాళ్ల బూట్ల చప్పుడు
శత్రుదేశంపై విరుచుకుపడ్డట్టుగా
నిరాయుధుడిపై ఎదురులేని కాల్పులు
లింగన్న కోసం
చెట్టు పుట్ట
రాయి రప్పల ఆరా
జాడ చూపిన ఉదయించిన సూర్యుడు
తుపాకీ గుళ్ల వర్షంలో
నేలకొరిగిన వీరుడు
రోళ్ళ గడ్డ రోదనతో
అక్కున చేర్చుకున్న అడవి బిడ్డలు
చిందిన రక్తంతో
ఎరుపెక్కిన పచ్చని చెట్లు
అడవి సింధూరాన్ని పులుముకున్నయ్!
కవి పేరు: కెసీ నరసయ్య
7981814784
66
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 27/6/2020
కవిత సంఖ్య: 67
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: అపహాస్యం
పాలకవర్గాల
మదిని తొలుస్తున్న
మనువాద పురుగు
కరోనా మహమ్మారి
కదనరంగంలో
కలకలం రేపిన
నల్ల చట్టాల అలజడి
తల్లి గర్భం నుండి
అంబేద్కరుడు
ఉదయించిన రోజునే
జన బాంధవుడు జర్నలిస్టు
మానవ హక్కుల
ముద్దుబిడ్డడు నవలక్ ను
నిర్బంధించిన నల్ల చట్టం
అపహాస్యమైన
రాజ్యాంగ నిర్మాత జన్మదినం
పాలకవర్గాల ఉక్కు పాదం కింద
నలిగిపోతున్న పౌర హక్కులు
పేరు: కెసి నరసయ్య
7981814784
67
[27/06, 10:08 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 27/6/2020
కవిత సంఖ్య: 67
పేరు: కేసీ నరసయ్య
జిల్లా ఖమ్మం
శీర్షిక: ఎరుపెక్కిన అడవి
వేసవికి
అలసిసొలసిన అడవి
చిరుజల్లులతో చిగురించిన చెట్లు
పచ్చని వాతావరణంలో
సేదతీరిన గిరిజనం
నందికొండ
పంది గుట్టల్లో
కొక్కొరోకో మేలుకొలుపులు
పక్షుల కిలకిలారావాలు
ఎక్కడో వినకూడని శబ్దాలు
కర్కశ ఆనవాళ్ల బూట్ల చప్పుడు
శత్రుదేశంపై విరుచుకుపడ్డట్టుగా
నిరాయుధుడిపై ఎదురులేని కాల్పులు
లింగన్న కోసం
చెట్టు పుట్ట
రాయి రప్పల ఆరా
జాడ చూపిన ఉదయించిన సూర్యుడు
తుపాకీ గుళ్ల వర్షంలో
నేలకొరిగిన వీరుడు
రోళ్ళ గడ్డ రోదనతో
అక్కున చేర్చుకున్న అడవి బిడ్డలు
చిందిన రక్తంతో
ఎరుపెక్కిన పచ్చని చెట్లు
అడవి సింధూరాన్ని పులుముకున్నయ్!
పేరు: కెసీ నరసయ్య
7981814784
[27/06, 10:09 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 27/6/2020
కవిత సంఖ్య: 68
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా ఖమ్మం
శీర్షిక: ఓటు పరిహారం
మీసాలు తీసివేసి
వేషా లెన్నో వేస్తున్నా
విశ్వామిత్రుని మీద
విశ్వాసం ఉంచి ఓటివ్వండి
కాకలు తీరిన కమ్యూనిస్టులే
కాళ్లబేరానికి వచ్చారు
కాటు వేసిన
కారంచెడును మర్చిపోండి
సీటు కోసం
పాటులెన్నో పడుతున్నా
పత్తి రైతుల
పాపపరిహారంతో ముడి పెట్టకండి
అందలం కోసం
అన్నలే నాకు దిక్కన్నా
అడవినే
దహించిన సంగతి మరచి పొండి
పదవి కోసం పట్టుదలగా
కాషాయపు రంగు పులుముకుని
ఓటు కోసం పరిగెడుతూ
రెక్కలు విదుల్చుచుకున్న పక్షిలా!
పేరు: కెసీ నరసయ్య
7981814784
69
[28/06, 2:30 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 28/6/2020
కవిత సంఖ్య: 69
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: జర్నలిస్టుల సంక్షేమం!
అమ్మా! తెలంగాణ తల్లీ!
ఎందుకమ్మా మాపై వివక్ష!
రూపాయి కార్డు కోసం జీవోలపై జీవోలు
జర్నలిస్ట్ గా గుర్తించ బడాలంటే ఏడాదికేడాది నిరీక్షణలు?
ఉమ్మడి రాష్ట్రంలో
ఉలుకూ పలుకూలేని నిబంధనలు
ప్రత్యేక తెలంగాణలో
మా పీకలపై కుత్తుకలయ్యాయి తల్లీ!
కలాలు కెమెరాలను
అస్త్రాలుగా ప్రయోగించి
ఉద్యమ రణభూమిలో ఊపిరైతిమి తల్లీ!
పోలీస్ వలయాలను ఛేదించి
ఉద్యమకారులను
మా రెక్కల్లో కాపాడుకుం టిమమ్మా!
తెలంగాణ పోరులో
తెగించి పోరాడిన జర్నలిస్టులు
బంగారు బాతు గుడ్డు లాయే
బంగారు తెలంగాణలో
ఏల బండరాళ్ల పాలు చేస్తివి తల్లీ!
రూపాయికే ఎకరాలకు ఎకరాలు
దారాదత్తం చేసినప్పుడు
లేని నిబంధనలు మాకేల పల్లి తల్లీ
నిలువ నీడ కోసం
తలదాచుకునేందుకు
ఎన్నెన్ని ఆశలు
ఎన్నెన్నో కోరికలు
అన్ని వమ్మయ్యాయి తల్లీ!
నీ సింహాసనం సాక్షిగా
నోరు తెరిస్తే హామీలవర్షం
నోరు మూస్తే అమలుకాని
సందకాడ సద్ది మూటల ప్యాకేజీలు
బంగారు తెలంగాణలో
బ్రతక లేని జర్నలిస్టులయ్యారు తల్లీ!
పేరు: కెసి నరసయ్య
7981814784
[28/06, 2:31 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 28/6/2020
కవిత సంఖ్య: 70
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: రాలిన నక్షత్రం!
మనోజ్!
మనందరి ఆశాజ్యోతి
జనుల సమస్యలను
జగన్ పతాకంలో
ఆవిష్కరించిన వాడు
జర్నలిజం వృత్తిలో
ఆవృతమై
ప్రజా సమస్యల
వృత్తాకారంలో
విసిరి వేయబడ్డ వాడు
పాలకులకు పాలితులకు
అతనొక వారధి!
కష్టాలకు కన్నీళ్లకు
ఆనకట్టల సారథి!
ఒడిదుడుకుల లోకంలో
ఎత్తుపల్లాలను
చదును చేయాలనే
తాపత్రయ జీవి
విపత్కర సమయాలలో
ప్రజల బాధలు గాధల వెంట
పరుగెత్తిన వాడు
కరోనా విసిరిన పంజాలో
మృత్యువుతో
పోరాడిన యోధుడు
మహమ్మారి వైరస్
పన్నిన పద్మవ్యూహంలో
పడి లేచి లేచి పడిన కెరటం
జర్నలిజం ఆకాశంలో రాలిన ఓ నక్షత్రం!
పేరు: కెసి నరసయ్య
7981814784
71
[28/06, 2:30 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 28/6/2020
కవిత సంఖ్య: 69
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: జర్నలిస్టుల సంక్షేమం!
అమ్మా! తెలంగాణ తల్లీ!
ఎందుకమ్మా మాపై వివక్ష!
రూపాయి కార్డు కోసం జీవోలపై జీవోలు
జర్నలిస్ట్ గా గుర్తించ బడాలంటే ఏడాదికేడాది నిరీక్షణలు?
ఉమ్మడి రాష్ట్రంలో
ఉలుకూ పలుకూలేని నిబంధనలు
ప్రత్యేక తెలంగాణలో
మా పీకలపై కుత్తుకలయ్యాయి తల్లీ!
కలాలు కెమెరాలను
అస్త్రాలుగా ప్రయోగించి
ఉద్యమ రణభూమిలో ఊపిరైతిమి తల్లీ!
పోలీస్ వలయాలను ఛేదించి
ఉద్యమకారులను
మా రెక్కల్లో కాపాడుకుం టిమమ్మా!
తెలంగాణ పోరులో
తెగించి పోరాడిన జర్నలిస్టులు
బంగారు బాతు గుడ్డు లాయే
బంగారు తెలంగాణలో
ఏల బండరాళ్ల పాలు చేస్తివి తల్లీ!
రూపాయికే ఎకరాలకు ఎకరాలు
దారాదత్తం చేసినప్పుడు
లేని నిబంధనలు మాకేల పల్లి తల్లీ
నిలువ నీడ కోసం
తలదాచుకునేందుకు
ఎన్నెన్ని ఆశలు
ఎన్నెన్నో కోరికలు
అన్ని వమ్మయ్యాయి తల్లీ!
నీ సింహాసనం సాక్షిగా
నోరు తెరిస్తే హామీలవర్షం
నోరు మూస్తే అమలుకాని
సందకాడ సద్ది మూటల ప్యాకేజీలు
బంగారు తెలంగాణలో
బ్రతక లేని జర్నలిస్టులయ్యారు తల్లీ!
పేరు: కెసి నరసయ్య
7981814784
[28/06, 2:31 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 28/6/2020
కవిత సంఖ్య: 70
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: రాలిన నక్షత్రం!
మనోజ్!
మనందరి ఆశాజ్యోతి
జనుల సమస్యలను
జగన్ పతాకంలో
ఆవిష్కరించిన వాడు
జర్నలిజం వృత్తిలో
ఆవృతమై
ప్రజా సమస్యల
వృత్తాకారంలో
విసిరి వేయబడ్డ వాడు
పాలకులకు పాలితులకు
అతనొక వారధి!
కష్టాలకు కన్నీళ్లకు
ఆనకట్టల సారథి!
ఒడిదుడుకుల లోకంలో
ఎత్తుపల్లాలను
చదును చేయాలనే
తాపత్రయ జీవి
విపత్కర సమయాలలో
ప్రజల బాధలు గాధల వెంట
పరుగెత్తిన వాడు
కరోనా విసిరిన పంజాలో
మృత్యువుతో
పోరాడిన యోధుడు
మహమ్మారి వైరస్
పన్నిన పద్మవ్యూహంలో
పడి లేచి లేచి పడిన కెరటం
జర్నలిజం ఆకాశంలో రాలిన ఓ నక్షత్రం!
పేరు: కెసి నరసయ్య
7981814784
[30/06, 7:56 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 29/6/2020
కవిత సంఖ్య: 71
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: అపర చాణుక్యుడు!
వంగర వరపుత్రుడు
ఓరుగల్లు వీరుడు
తెలంగాణ ముద్దుబిడ్డడు
రాజసం ఉట్టిపడే ఠీవీ
నిజాం నిరంకుశ పాలనలో
పురుడు పోసుకున్న
ఉస్మానియా
విశ్వవిద్యాలయం విద్యార్థి
దిక్కార స్వరంతో
నైజాం నిరంకుశ పాలనపై
నినదించిన ధీరుడు
స్వాతంత్రోద్యమ
కదనరంగంలో
కలం పట్టి కదం త్రొక్కి
పదం పాడిన ఘనుడు
రాజకీయ అస్థిరత్వంలో
పగ్గాలు చేపట్టి
స్థిర పాలన అందించిన
గొప్ప పాలకుడు
మహా మేధావి
బహుభాషా కోవిదుడు
సరస్వతీ పుత్రుడు
నిగర్వి అపర చాణక్యుడు
ప్రపంచ దేశాలలో
తెలుగు తేజాన్ని
తెలంగాణ కీర్తిని
రెపరెపలాడించిన వాడు
ఆర్థిక సంస్కరణలో
అందెవేసిన చెయ్యి
మహా పాలకుడిగా
పాములపర్తి వెంకట నరసింహారావు
ముద్దుగా పిలుచుకుంటున్న
పీవీ నరసింహారావుకివే మా నివాళులు
పేరు: కెసి నరసయ్య
7981814784
[30/06, 8:05 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 29/6/2020
కవిత సంఖ్య: 72
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక : నేతాజీ!!
బాపూ!
మా సుభాస్ జాడ చెప్పవా?
మరణమే లేని
మా చంద్రుణ్ణి ఎక్కడ దాచారో?
యుద్ధభూమిలో
కర్ణుడుని తలపిస్తున్న వీరుడు!
ఓ అహింసావాదీ!
మా బోస్ ను ఏ బోన్ లో
బందించారో? చెప్పగలవా?
నీ వర్థంతి సాక్షిగా
సుభాష్ చంద్రబోస్ వర్థంతి
ఎన్నడో? వివరించ గలవా?
ఓ జాతిపితా!
జాతికి అంకితమైన
మా నేతాజీ జాడెక్కడ?
ఓ మహాత్మా!
సుభాష్ మిస్టరీ
మర్మం వీడవయ్యా!
అహింసలో దాగిన పరమార్థమేమిటో?
పేరు: కెసి నరసయ్య
7981814784
[30/06, 6:20 PM] KC Narsaiah KS 26: సమూహం: వీ రాస్ కవి సమయం
తేదీ: 30/6/2020
కవిత సంఖ్య: 73
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: గురు తులాభారం
గురు
తులాభారంలో
నోట్ల కట్టలే
బరువెక్కుతున్నాయి
ఏకలవ్యుని
బొటన వ్రేలు నుండి
నిత్యం రక్తం ప్రవహిస్తూనే ఉంది
వేకువజామున
సూర్య నమస్కారాల
శిష్యరికం
ఏసీ గదుల్లో వణుకుతూ
రవినే పోల్చుకోలేక పోతుంది
గురు సేవా దృక్పథం
ప్యాకేజీలై
ధనప్రవాహంలో
ర్యాంకుల పంటలయ్యాయి
విశ్వవిద్యాలయాలు
విశ్వాన్నే తారుమారు చేసి
చంద్రమండలంలో
సేద్యంకు పయనమయ్యాయి
మనువాదం
అనువాద తర్కంతో
రాజ్యాంగం తలనే
తెగ్గొడుతుంది
గురు శిష్యులు
కులమతాల
కుమ్ములాటల్లో
పాలకవర్గాలకు
ఓటర్ల పంటలైనారు
ఇప్పుడు బోధనే కాదు
ఆయుధం కూడా పట్టాలి
అణ్వాయుధాల యుద్ధంలో
పేరు: కెసి నరసయ్య
7981814784
[30/06, 6:23 PM] KC Narsaiah KS 26: సమూహం: వీ రాస్ కవి సమయం
తేదీ: 30/6/2020
కవిత: సంఖ్య: 74
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ప్రగతి సమ్మె సైరన్!
తెలంగాణ యాసతో
ఆయాసపడి
నక్క జిత్తులతో
సెంటిమెంట్ ను
సెంట్రీగా బంధించి
పీఠాన్ని దక్కించుకున్న
ఓ దొర!?
సమ్మె సైరన్
మహామహుల
పునాదులనే పెకళించింది!
నీ దొర పెత్తనమెంత?
కార్మిక శాఖను
ఊడబెరికినాక
కాకి గుంపుల
తల దాచుకున్నోడివి?
జయశంకర్ సార్!
యాదిలో
తెలంగాణ తల్లి ఒడికి
చేరినోడివి
సకలజనుల
ఉద్యమానికి
ఊపిరి పోసినోల్లం!
నువూడబెరికితే
ఊడిపోయే వాళ్ళం కాదు!!
ప్రగతిభవన్ లో
తిష్టవేసి
ప్రగతిరధ చక్రాలనే
మాయం చేద్దామనుకున్నోడివి?
మాయల మరాఠి మాటలను
తెలిసినోళ్ళమే!
ఆడినోడి మాట తప్పితే
ఆడిని గాడిలో పెట్టేందుకే
మా చివరి అస్త్రాన్ని ప్రయోగించాం!
బండెనక బండికట్టి దొరలను
తరిమికొట్టిన వారసత్వం!
నయా దొర పెత్తనాన్ని
బొందపెట్టేందుకే
ప్రగతిరధ చక్రాల సమ్మె సైరన్!!
పోరు బాటలో
ఆర్ టి సి నక్షత్రాలనే
కబళిస్తున్నావ్?
దేవిరెడ్డి శ్రీనివాసరెడి
ఆశయ స్పూర్తిగా!
సకలజనులతో
మరో ఉద్యమానికి నాంది పలికాం!
నిరంకుశత్వాన్ని
నిగ్గుతేలుస్తాం!
నితంత్రుత్వాన్ని
నిట్ట నిలువునా పాతరేస్తాం!!
పేరు: కెసి నరసయ్య
7981814784
[01/07, 6:58 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేదిః 1/7/2020
కవిత సంఖ్య: 75
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: గౌరీ లంకేష్
సీత కోసం
లంకాన్వేషన చేసిన
ఓ హనుమా!
మా లంకేష్ కోసం
ఏ లంకను అన్వేషించాలి?
జానకి కోసం
రావణ రాజ్యంపై
రణం చేసిన ఓ రామా!
మా గౌరీ లంకేష్ కోసం
మేము ఏ రాజ్యంపై
రణం పూరించాలి?
పేరు: కెసి నరసయ్య
7981814784
[01/07, 7:12 AM] KC Narsaiah KS 26: సమూహం స్ కవి సమయం
తేది: 1/7/2020
కవిత సంఖ్య: 76
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: కాపాడుకుందాం!
ముసుగు ధరించిన మతం
ఖాళీ స్థలాలపై కబ్జాల కన్ను
గుడి పేరుతో బడికి టోకరా
మతం పేరుతో మానవతకే టోకరా
ప్రభుత్వ విద్యాసంస్థలకు
కావలసినంత స్థలం
కాపాడుకోలేక పోతున్న యాజమాన్యాలు
ప్రభుత్వ స్థలాలంటే
అధికారులకు చిన్న చూపే
నెలవారీ జీతానికి డోకా లేదు
అడ్డదారిలో
జేబుల్లో రాలుతున్న కాసులు
చూసి చూడని చోద్యం
దోపిడీదారుల పాలనలో
అందినకాడికి ఆక్రమణ
అడిగే నాథుడే లేకపాయె
పోరంబోకు గవర్నమెంట్
దేవుని మాన్యాలు
గుడులు బడులు
బలహీనుల భూములు
ఏ స్థలం అయితే నేమి
ఖాళీ జాగా కనపడితే చాలు
కబ్జాకేదీకనర్హం
బంగారు తెలంగాణలో
ప్రశ్నకు తావు లేకుండా పోయింది
చైతన్య వీరులు చతికిల పడ్డారు
యువ కిశోరాల ఉడుకు రక్తం
ఉలుకు పలుకు లేకుండా పోయింది
విద్యార్థుల్లారా వీరత్వం పొందండి
అల్లూరి భగత్ సింగ్ ల
త్యాగాలను మననం చేసుకోండి
అవినీతి అక్రమాలపై నినదించండి
దోపిడీని రూపుమాపండి
రండి ఐక్యంగా నిలుద్దాం!!
పేరు: కెసి నరసయ్య
7981814784
[02/07, 7:45 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 2/7/2020
కవిత సంఖ్య: 77
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: కశ్మీర్ అందాలు
గోదారమ్మకు
ఎన్ని గొంతెమ్మ కోర్కెలో
సముద్రాన్నే శాసించాలని
సూర్యచంద్రులు
ప్రతిదినం పోరాడుతూనే ఉంటారు
విజయం సమభాగాలు
పిచ్చుక
కట్టుకున్న గూడు
ఎవరికి నచ్చదు
గాలి వానలకు తప్ప
మనిషిని
మనిషి చంపుకోవడానికి
ఏ మతమైతేనేమి
కశ్మీర్ అందాలు రక్తసిక్తం
పేరు: కెసి నరసయ్య
7981814784
[02/07, 7:46 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 2/72020
కవిత సంఖ్య: 78
కవిపేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: వర్షించలేక?
మేఘానికి
పురిటినొప్పులు రాక
వర్షించలేక పోతోంది
దాహంతో
బీటలు వారిన నేలతల్లి
నాటినవిత్తనాలను ఆరగిస్తుంది
వాగూ వంకలు
నదీ నదాలు
జలప్రవాహానికి బదులు
ప్లాస్టిక్ వ్యర్ధాలను
పదిలపరచుకుంటున్నాయి
మనుషులు
రూపాలు మార్చుకొని
మృగాలతో పోటీపడుతూ
కరెన్సీ నోట్లతో
ఆకలి దప్పికలు తీర్చుకుంటున్నారు
రాకెట్ పై రైతు
చంద్రయాన్ కు
పయనమయ్యేందుకు
పరుగులు పెడుతుండు
కరువును జయించేందుకు!
పేరు: కెసి నరసయ్య
7981814784
[03/07, 7:04 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేదీ: 3/7/2020
కవిత సంఖ్య: 79
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: పెట్టుకో నామాలు
ఎవరు
ఎవరికి పెడతారో నామాలు
పెట్టించుకున్నక
తెలుస్తుంది
అసలు చిరునామాలు
మధ్యలో
ప్రజలనెందుకు లాగుతావు
ఆడలేక బోడిమల్లన్న అన్నట్లు
ఆడింది ఆటగా
పాడింది పాటగా
సెంటిమెంటుతో చెల్లింది నీ ఆట
ప్రాజెక్టుల పేరుతో
పెరుగుతున్న పాపాలు
ఒక్కొక్కటిగా
జమ అవుతున్న
అవినీతి అవినీతి చిట్టాలు
అప్పు మీద అప్పు
లెక్కలేనన్ని తప్పులు
ఎక్కుతున్నాయి ఖాతాల్లోకి
తొక్కుతారు
నిన్నెవడొో పాతాళానికి
మాటల గారడి
మాయల మరాఠి
జై పాతాళ భైరవి
పేరు: కెసి నరసయ్య
7981814784
నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
[03/07, 7:05 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేదీ: 3/7/2020
కవిత సంఖ్య: 80
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: కశ్మీర్ ఆటబంతి
మెప్పు
పొందేందుకు
కశ్మీర్ అందాలను
అద్దంలో ఆరపోసిండు
అగ్రదేశం
పిడికిట్లో ని
పాకిస్తాన్ ను
అద్దం ప్రతిబింబంలో
కనువిందు చేసి మోకరిల్లిండు
ట్రంప్ మోడీల
ఆలింగనం
ధృతరాష్ట్రుని కౌగిలి
అమెరికా
ఆటస్థలంలో
కశ్మీర్ సమస్య
ఆటబంతి అయింది
పేరు: కెసి నరసయ్య
7981814784
ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
[03/07, 7:49 PM] KC Narsaiah KS 26: సమూహం వీరాస్ కవి సమయం
తేది 3/7/2020
కవిత సంఖ్య 81
కవి పేరు కెసి నరసయ్య
జిల్లా ఖమ్మం
శీర్షిక కనిపించే దేవుడు!
తెల్లని కోటు
శివుని మెడలో ధరించిన
పాము లాంటి స్టెతస్కోపు
ఏమైంది అంటూ
చిరునవ్వుతో పలకరింపు
చల్లని చేతి స్పర్శ
లబ్ డబ్ శబ్దం విని
అభయమిస్తున్నవాడు
రోగి ప్రాణ రక్షకుడు
ఏం పర్వాలేదు
మందులు రాసిస్తాను
ఏమి తినకూడదు ఏమి తినవఛో
ఉపదేశంతో కూడిన అభయం!
పోయిన ప్రాణం
తిరిగి వచ్చినట్లయింది
ముక్తి కోసం దైవాన్ని ప్రార్ధిస్తాం
రోగ విముక్తి కోసం
వైద్యుడిని వేడుకుంటాం
కరోనా కష్టకాలంలో
ముందుండి నడిచి
మృత్యువుతో పోరాడుతున్న
శ్వేత దుస్తుల సైనికుడు!
కనిపించని దేవుడు పైవాడు
భువిలో కనిపించే
ప్రత్యక్ష దేవుడే ఈ వైద్యుడు!
పేరు కెసి నరసయ్య
7981814784
82
[03/07, 7:49 PM] KC Narsaiah KS 26: సమూహం వీరాస్ కవి సమయం
తేది 3/7/2020
కవిత సంఖ్య 82
కవి పేరు కెసి నరసయ్య
జిల్లా ఖమ్మం
శీర్షిక అపర చాణుక్యుడు!
వంగర వరపుత్రుడు
ఓరుగల్లు వీరుడు
తెలంగాణ ముద్దుబిడ్డడు
రాజసం ఉట్టిపడే ఠీవీ
నిజాం నిరంకుశ పాలనలో
పురుడు పోసుకున్న
ఉస్మానియా
విశ్వవిద్యాలయం విద్యార్థి
దిక్కార స్వరంతో
నైజాం నిరంకుశ పాలనపై
నినదించిన ధీరుడు
స్వాతంత్రోద్యమ
కదనరంగంలో
కలం పట్టి కదం త్రొక్కి
పదం పాడిన ఘనుడు
రాజకీయ అస్థిరత్వంలో
పగ్గాలు చేపట్టి
స్థిర పాలన అందించిన
గొప్ప పాలకుడు
మహా మేధావి
బహుభాషా కోవిదుడు
సరస్వతీ పుత్రుడు
నిగర్వి అపర చాణక్యుడు
ప్రపంచ దేశాలలో
తెలుగు తేజాన్ని
తెలంగాణ కీర్తిని
రెపరెపలాడించిన వాడు
ఆర్థిక సంస్కరణలో
అందెవేసిన చెయ్యి
మహా పాలకుడిగా
పాములపర్తి వెంకట నరసింహారావు
ముద్దుగా పిలుచుకుంటున్న
పీవీ నరసింహారావుకివే మా నివాళులు
పేరు కెసి నరసయ్య
7981814784
[04/07, 7:54 AM] KC Narsaiah KS 26: స
82
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 3/7/2020
కవిత సంఖ్య: 82
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ప్రతి రూపాలు
కలలు అలలు
కవల పిల్లలు
సముద్రంలోని
అలల మాదిరిగా
వస్తూ పోతున్న కలలు
ఉవ్వెత్తున లేచి
ఎగిసిపడుతున్న అలలు
సద్దుమణిగిన నిద్దురలో
కవ్విస్తున్న కలలు
గాఢనిద్రలో
నింగికెగిసి పడుతున్న
కలల లోయలు
మేఘాల పరుగులో
దాగుడుమూతల నక్షత్రాలు
చంద్రుని రాకతో
చీకటిని చీల్చుకొన్న అవని
కలల అగాధంలో నిద్రాభంగం
వాస్తవ రూపం దాల్చని
ఆలోచనల ప్రతిరూపాలే కలలు
పేరు: కెసి నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
83
వీరాస్ కవి సమయం
తేది 4/7/2020
కవిత సంఖ్య 83
కలం పేరు కెసి నరసయ్య
జిల్లా ఖమ్మం
శీర్షిక సరస్వతి చిరునామా
పుస్తకం ఒక చైతన్యం
పుస్తకం ఒక మార్గదర్శి
చీకటిలో వెలుగు దివ్వె
పుస్తకం ఒక విప్లవం
పోరాటానికి ఆయుధం
ఉద్యమాలకు ఊపిరి
దోపిడి గుండెల్లో గుణపం
ప్రపంచ చరిత్రలకు నిలయం
ప్రపంచ మానవాళికి గూడు
పుస్తకం భవితకు ఆసరా
ప్రశ్నించే తత్వానికి చేయూత
నల్ల బజారులో
వెలుగుతున్న కిరణం
నిరక్షరాస్యతకు ఆశాదీపం
అక్షరాస్యతకు ఓ ఆయుధం
పుస్తకం ఓ విజ్ఞాన గని
పుస్తక పఠనం
అంధకారాన్ని పారద్రోలుతుంది
అజ్ఞానాన్ని వెంటాడుతుంది
పుస్తకం సరస్వతీ చిరునామా
పేరు కెసి నరసయ్య
7981814784
84
[04/07, 7:55 AM] KC Narsaiah KS 26: సమూహం వీరాస్ కవి సమయం
తేది: 04/7/2020
కవిత సంఖ్య: 84
కవి పేరు కెసి నరసయ్య
జిల్లా ఖమ్మం
శీర్షిక: చేదు జ్ఞాపకాలు
నడవ జారీ
కుటుంబం
కుప్పకూలిపోయింది
మనిషి ప్రతిబింబం
కనుమరుగైపోయింది
బాంధవ్యం ఆర్తనాదమై
గుడ్డి కళ్ళతో శూన్యాన్ని
అద్దంలో వెతకనారంభించింది
మిగిలిన కాళ్ల గుర్తులు
అస్తమించిన సూర్యుని కోసం
కటిక చీకటిలో
మిణుగురు పురుగుల వెంట
వెలుగు కోసం తాపత్రయం
ఎవరు ఎవరి కోసం?
నాకు నీవైనప్పుడు
నీవు నాకు కానప్పుడు
ఎవరు ఉంటేనేమి?ఎవరు పోతేనేమ్?
పోవలసిన వాళ్ళే పోకుండా
ఉండవలసిన వాళ్లు పోయినప్పుడు
ఇంకా రెక్కలు విదిలిస్తూ లేని పక్షులు
ఆకాశంలో శూన్యాన్ని
గుచ్చి గుచ్చి చూస్తున్నాయి
పరిణామం ఎటు పోతే నేమ్
పరిస్థితులు పరిపక్వం కానప్పుడు
మిగిలిన వాళ్లకు
మిగిల్చిన చేదు జ్ఞాపకాలు
వెళ్లిపోయిన వారికి
తీయని జ్ఞాపకాలు అందమా?
పేరు కెసీ నరసయ్య
7981814784
85
[05/07, 9:52 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 05/7/2020
కవిత సంఖ్య: 85
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: శాంత కోసం
అక్షర జ్ఞానం కోసం అరవిందలో
అ ఆ లకు శ్రీకారం చుట్టాము
అధ్యయనమే అభ్యాసంగా
అభ్యాసమే అధ్యయనంగా
ఆహ్లాదకరమైన ప్రకృతిని ఆరాధిస్తూ
ఆకాశంలో చుక్కల్లా
ఒకరికి ఒకరం తోడై నిలిచానము
సూర్యోదయం సూర్యాస్తమయం
నిత్యం లెక్కిస్తూ వారాలు నెలలు
సంవత్సరాలు గడిచాయి
సంఖ్య లేని అసంఖ్యాకంలో నుంచి
తెగిపడిన చుక్క ఆచూకీ కోసం కాదు
తరగతి గది సంఖ్యలో ఏర్పడ్డ మైనస్
ఆఘాతం పూడ్చ లేమన్న విచారం
ఈ విచారానికి తలవంచి
మౌనం పాటించే ఆచారం తప్ప
ఇంకేం మిగిలింది?
శాంత లేని అశాంతిలో
శాంత మౌనం తప్ప
కాకుంటే కారుతున్న
కన్నీటిని తూడ్చగలం
ఇంకిపోయిన కన్నీటి కోసం
మేఘాల వెంట పరుగెత్తు గలమా?
శాంత లేపిన అశాంతిని
ప్రశాంత పరచగలమా?
ఆదివారం అన్నయ్యలను పిలిపించి
అంతలోనే తొందర పడతావనుకున్నామా?
తొందరపాటు చర్యో? తొట్రుపాటు చర్యో?
తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖం
తోబుట్టువులకు
శాంత లేని అశాంతి తప్ప
ఇంకేం మిగిల్చావు
ఆత్మీయుల మైన మేము
తల వంచి మరొక్కసారి
శాంత కోసం మౌనం పాటిస్తున్నాం!!
పేరు కేసి నరసయ్య
798181478
నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
[05/07, 9:55 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 05/7/2020
కవిత సంఖ్య: 86
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఎదురు చూస్తా!
ఓ ప్రియా!
నీ రాక కోసం
తీతువులతో స్నేహం చేస్తా!
రోహిణి కార్తెలో
బండరాళ్లపై బోరున విలపిస్తా!
దప్పిక తీర్చుకొనుటకు
ఎండమావులలో ఎడారుల వెంట
ఏకరువుతో ఏకాకిగా పరుగు పెడతా!
నీవు వస్తానంటే
నే సంద్రంలో
అలలతో పోటీపడుతూ
ఆహ్వానం పలుకుతా!
అనంత కోటిలో
ఎన్ని అవాంతరాలనైనా అధిగమిస్తా!
నీ రాక కోసం
వినీలాకాశంలో విహంగాలతో
వింత పక్షినై విహరిస్తా
నీవు వస్తానంటే
విరబూసిన విరజాజితో
వియ్యంకాన్నేర్పరచుకుంటా!
కవి పేరు: కెసి నరసయ్య
7981814784
నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
87
[07/07, 8:32 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 7/7/202
కవిత సంఖ్య: 87
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఫోర్త్ ఎస్టేట్ వంట!
నారద లోకసంచారంలో
జనం నడుమ మసలుకొని
సభలు సమావేశాల
సమాచారంతో
బాధితుల
కష్టసుఖాల మూటగట్టుకొని
ఉదయిస్తున్న సూర్యునితో పయణం
పదవుల పందేరంలో
కిరీటాలు దక్కించుకున్న నేతలు
భంగపడ్డ నాయకులు
వాన రాకడ ప్రాణం పోకడలో
రైతుల కష్టాల కడగండ్లు
కుటుంబ కలహాలలో
భార్య భర్తల రావణ కాష్టం
రాజ్యంలో
రాబంధువుల రాక్షస క్రీడలు
హత్యలు మానభంగాలు
దోపిడీలు దౌర్జన్యాలు
కుంభకోణాలు భూమాఫియాలు
ఒకటేమిటి
సమాజంలో
సేకరించిన సమాచారంతో
అస్తమించిన రవిని వదిలి
వాడివేడి వార్తల వంట-వార్పుకు సిద్ధం
రాత్రంతా ఫోర్త్ ఎస్టేట్ లో
ఘుమ ఘుమ వాసనలతో షడ్రుచులతో...
వండిన వంటకాలను
దినపత్రికల విస్తర్లలో వడ్డించి
సూర్యోదయానికి ముందే
ప్రజల వాకిట్లకు చేరవేత
తలుపులు తట్టిన
పేపర్ బాయ్ అలికిడితో
ఆవురావురంటూ
పత్రికల నెమరువేత
తమ రుచుల వార్తలను ఆరగించి
తీయని జ్ఞాపకాల దినపత్రికలను
ఫైల్ చేసుకుని
జీర్ణం కాని అరుచుల వార్తలను
దేవురించుకుంటూ
యధావిధిగా
ఎవరి దినచర్యల్లో వారు హాజరు...
పేరు: కెసి నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
[07/07, 8:33 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 7/7/2020
కవిత సంఖ్య: 88
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఎదురు చూస్తా!
ప్రియా!
నీ రాక కోసం
తీతువులతో స్నేహం చేస్తా!
రోహిణి కార్తెలో
బండరాళ్లపై బోరున విలపిస్తా!
దప్పిక తీర్చుకొనుటకు
ఎండమావులలో ఎడారుల వెంట
ఏకరువుతో ఏకాకిగా పరుగు పెడతా!
నీవు వస్తానంటే
నే సంద్రంలో
అలలతో పోటీపడుతూ
ఆహ్వానం పలుకుతా!
అనంత కోటిలో
ఎన్ని అవాంతరాలనైనా అధిగమిస్తా!
నీ రాక కోసం
వినీలాకాశంలో విహంగాలతో
వింత పక్షినై విహరిస్తా
నీవు వస్తానంటే
విరబూసిన విరజాజితో
వియ్యంకాన్నేర్పరచుకుంటా!
పేరు: కెసి నరసయ్య
7981814784
నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
89
[07/07, 8:40 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 7/7/2020
కవిత సంఖ్య: 89
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: చిరునవ్వు
అక్షరాల వెంట
పరుగెడుతు
పదాల వెంట
పదనిసవై
వాక్యాల వెంట
వయ్యారి
నడకలతో
నాకు తోడై
గ్రంథాలలో
కదలాడుతూ
చిరునవ్వులతో
నన్ను కుదుపుతున్నావు
కూనిరాగం తీస్తున్న నాకు
కోయిల రాగం వినిపించావు
పేరు: కెసి నరసయ్య
7981814784
నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
[07/07, 9:11 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 7/7/2020
కవిత సంఖ్య: 90
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: మాతృమూర్తి
మాతృ గర్భం
నా భూగోళం
అమ్మ ఒడి
నా మొదటి బడి
అమ్మ పైట
నా ఆటల కోట
అమ్మ చనుబాలు
నా అమృత ధారలు
స్వచ్ఛమైనది
అమ్మ ప్రేమ
మర్మమెరిగిన
మాతృ హృదయం
బిడ్డలపై మమకారం
లోకమే పిల్లలు
ఇల్లే స్వర్గం
తల్లి రక్త బంధం
జన్మ జన్మల బంధం
ఈనాటి బంధం
ఏనాటికీ తీర్చుకోలేనిది
మాతృమూర్తి రుణం
పేరు: కెసీ నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
85
[05/07, 9:52 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 05/7/2020
కవిత సంఖ్య: 85
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: శాంత కోసం
అక్షర జ్ఞానం కోసం అరవిందలో
అ ఆ లకు శ్రీకారం చుట్టాము
అధ్యయనమే అభ్యాసంగా
అభ్యాసమే అధ్యయనంగా
ఆహ్లాదకరమైన ప్రకృతిని ఆరాధిస్తూ
ఆకాశంలో చుక్కల్లా
ఒకరికి ఒకరం తోడై నిలిచానము
సూర్యోదయం సూర్యాస్తమయం
నిత్యం లెక్కిస్తూ వారాలు నెలలు
సంవత్సరాలు గడిచాయి
సంఖ్య లేని అసంఖ్యాకంలో నుంచి
తెగిపడిన చుక్క ఆచూకీ కోసం కాదు
తరగతి గది సంఖ్యలో ఏర్పడ్డ మైనస్
ఆఘాతం పూడ్చ లేమన్న విచారం
ఈ విచారానికి తలవంచి
మౌనం పాటించే ఆచారం తప్ప
ఇంకేం మిగిలింది?
శాంత లేని అశాంతిలో
శాంత మౌనం తప్ప
కాకుంటే కారుతున్న
కన్నీటిని తూడ్చగలం
ఇంకిపోయిన కన్నీటి కోసం
మేఘాల వెంట పరుగెత్తు గలమా?
శాంత లేపిన అశాంతిని
ప్రశాంత పరచగలమా?
ఆదివారం అన్నయ్యలను పిలిపించి
అంతలోనే తొందర పడతావనుకున్నామా?
తొందరపాటు చర్యో? తొట్రుపాటు చర్యో?
తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖం
తోబుట్టువులకు
శాంత లేని అశాంతి తప్ప
ఇంకేం మిగిల్చావు
ఆత్మీయుల మైన మేము
తల వంచి మరొక్కసారి
శాంత కోసం మౌనం పాటిస్తున్నాం!!
పేరు కేసి నరసయ్య
798181478
నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
86
[05/07, 9:55 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 05/7/2020
కవిత సంఖ్య: 86
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఎదురు చూస్తా!
ఓ ప్రియా!
నీ రాక కోసం
తీతువులతో స్నేహం చేస్తా!
రోహిణి కార్తెలో
బండరాళ్లపై బోరున విలపిస్తా!
దప్పిక తీర్చుకొనుటకు
ఎండమావులలో ఎడారుల వెంట
ఏకరువుతో ఏకాకిగా పరుగు పెడతా!
నీవు వస్తానంటే
నే సంద్రంలో
అలలతో పోటీపడుతూ
ఆహ్వానం పలుకుతా!
అనంత కోటిలో
ఎన్ని అవాంతరాలనైనా అధిగమిస్తా!
నీ రాక కోసం
వినీలాకాశంలో విహంగాలతో
వింత పక్షినై విహరిస్తా
నీవు వస్తానంటే
విరబూసిన విరజాజితో
వియ్యంకాన్నేర్పరచుకుంటా!
కవి పేరు: కెసి నరసయ్య
7981814784
నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
87
[07/07, 8:32 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 7/7/202
కవిత సంఖ్య: 87
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఫోర్త్ ఎస్టేట్ వంట!
నారద లోకసంచారంలో
జనం నడుమ మసలుకొని
సభలు సమావేశాల
సమాచారంతో
బాధితుల
కష్టసుఖాల మూటగట్టుకొని
ఉదయిస్తున్న సూర్యునితో పయణం
పదవుల పందేరంలో
కిరీటాలు దక్కించుకున్న నేతలు
భంగపడ్డ నాయకులు
వాన రాకడ ప్రాణం పోకడలో
రైతుల కష్టాల కడగండ్లు
కుటుంబ కలహాలలో
భార్య భర్తల రావణ కాష్టం
రాజ్యంలో
రాబంధువుల రాక్షస క్రీడలు
హత్యలు మానభంగాలు
దోపిడీలు దౌర్జన్యాలు
కుంభకోణాలు భూమాఫియాలు
ఒకటేమిటి
సమాజంలో
సేకరించిన సమాచారంతో
అస్తమించిన రవిని వదిలి
వాడివేడి వార్తల వంట-వార్పుకు సిద్ధం
రాత్రంతా ఫోర్త్ ఎస్టేట్ లో
ఘుమ ఘుమ వాసనలతో షడ్రుచులతో...
వండిన వంటకాలను
దినపత్రికల విస్తర్లలో వడ్డించి
సూర్యోదయానికి ముందే
ప్రజల వాకిట్లకు చేరవేత
తలుపులు తట్టిన
పేపర్ బాయ్ అలికిడితో
ఆవురావురంటూ
పత్రికల నెమరువేత
తమ రుచుల వార్తలను ఆరగించి
తీయని జ్ఞాపకాల దినపత్రికలను
ఫైల్ చేసుకుని
జీర్ణం కాని అరుచుల వార్తలను
దేవురించుకుంటూ
యధావిధిగా
ఎవరి దినచర్యల్లో వారు హాజరు...
పేరు: కెసి నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
88
[07/07, 8:33 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 7/7/2020
కవిత సంఖ్య: 88
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఎదురు చూస్తా!
ప్రియా!
నీ రాక కోసం
తీతువులతో స్నేహం చేస్తా!
రోహిణి కార్తెలో
బండరాళ్లపై బోరున విలపిస్తా!
దప్పిక తీర్చుకొనుటకు
ఎండమావులలో ఎడారుల వెంట
ఏకరువుతో ఏకాకిగా పరుగు పెడతా!
నీవు వస్తానంటే
నే సంద్రంలో
అలలతో పోటీపడుతూ
ఆహ్వానం పలుకుతా!
అనంత కోటిలో
ఎన్ని అవాంతరాలనైనా అధిగమిస్తా!
నీ రాక కోసం
వినీలాకాశంలో విహంగాలతో
వింత పక్షినై విహరిస్తా
నీవు వస్తానంటే
విరబూసిన విరజాజితో
వియ్యంకాన్నేర్పరచుకుంటా!
పేరు: కెసి నరసయ్య
7981814784
నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
89
[07/07, 8:40 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 7/7/2020
కవిత సంఖ్య: 89
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: చిరునవ్వు
అక్షరాల వెంట
పరుగెడుతు
పదాల వెంట
పదనిసవై
వాక్యాల వెంట
వయ్యారి
నడకలతో
నాకు తోడై
గ్రంథాలలో
కదలాడుతూ
చిరునవ్వులతో
నన్ను కుదుపుతున్నావు
కూనిరాగం తీస్తున్న నాకు
కోయిల రాగం వినిపించావు
పేరు: కెసి నరసయ్య
7981814784
నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
90
[07/07, 9:11 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 7/7/2020
కవిత సంఖ్య: 90
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: మాతృమూర్తి
మాతృ గర్భం
నా భూగోళం
అమ్మ ఒడి
నా మొదటి బడి
అమ్మ పైట
నా ఆటల కోట
అమ్మ చనుబాలు
నా అమృత ధారలు
స్వచ్ఛమైనది
అమ్మ ప్రేమ
మర్మమెరిగిన
మాతృ హృదయం
బిడ్డలపై మమకారం
లోకమే పిల్లలు
ఇల్లే స్వర్గం
తల్లి రక్త బంధం
జన్మ జన్మల బంధం
ఈనాటి బంధం
ఏనాటికీ తీర్చుకోలేనిది
మాతృమూర్తి రుణం
పేరు: కెసీ నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
91
[08/07, 11:57 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 8/7/2020
కవిత సంఖ్య: 91
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: తీయని జ్ఞాపకం!
వలపల దాపల
ఎడ్లను అదిలించగ
కదిలెను రైతు రథం!
ఆరున్నొక్కటి!
ఎనిమిది కుండలతో
పుట్లకు పుట్లు
ధాన్యపు రాశులను లెక్కించి
బోరేలను నింపుకున్న
ఆ ఎడ్లబండి పల్లెకు నిండుకుండ!
పరిగేరుకున్న పోరళ్ళు
పశువులతో బండెనకల
పల్లెకు పరుగులే పరుగులు
పట్నం రైలులో
వేంచేసిన దొరల బిడ్డలను
పల్లెకు చేరవేసిన గిత్తల బండ్లు!
పెళ్లిళ్లలో
బండెనక బండి కట్టి
పేరంటాలను సాగనంపిన సంస్కృతి!
తిరునాళ్ళలో ప్రభ బండ్ల వైభోగం!
మోటారు వాహనాల
వలయంలో
చిక్కి శల్యమై నా ఎడ్ల బండ్లు
మర యంత్రాల దాడిలో
కనుమరుగైన కులవృత్తులు
కానరాని నాటి ఆనవాళ్ళు
మహాభారతంలో
కుప్పకూలిన కర్ణుడి రథం!
కలికాలంలో
కానరాని నా రైతు రథం
గత తరంకు ఓ తీయని జ్ఞాపకం!
రేపటి తరానికి అది చెరగని ఓ కళ!!
పేరు: కెసి నరసయ్య
7981814784
ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
92
[08/07, 11:58 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 8/7/2020
కవిత సంఖ్య: 92
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: విలీనం
ప్రశ్నకే
తావు లేనప్పుడు
సమాధానం
ఎక్కడి నుండి వస్తుంది?
స్వపక్షాన్నే
కాదనుకున్నప్పుడు
ఎవరు ఏ పక్షంలో
విలీనమైతే నేమి?
అధికారపక్షమే
ఏకపక్షంగా
వ్యవహరిస్తుంటే
చట్టసభల్లో ప్రశ్నించేదేవరు?
ప్రజలు ఎన్నుకున్న
ప్రజా ప్రతినిధులే
అంగట్లో సరుకయినప్పుడు
రాజకీయ వ్యాపారానికి అడ్డేముంది?
పేరు: కెసి నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
93
[09/07, 1:40 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 9/7/2020
కవిత సంఖ్య: 93
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: మేమున్నాం!
మార్క్ తగ్గిందని
మందలించడండి!
తోటోళ్లకు
ఎలా పెరిగాయని
ఎగతాళి చేయకండి!
ప్రామాణికం
మార్కులు కాదు
జీవితం అని గుర్తెరగండి!
తల్లిదండ్రుల్లారా!
తగదు మీకు ఎత్తిపొడుపులు
గురువుల్లారా!
గురుతర బాధ్యతలను
విస్మరించ కండి!
పది పిల్లల్లారా!
తొందరపడి
నిర్ణయం తీసుకోకండి
గుండె నిబ్బరం చేసుకోండి
అయిన వారికి అండగా నిలవండి!
ఇంటర్ పిల్లల
ఉసురు సర్కార్ కే సొంతం!?
చిన్నారుల
చిరునవ్వులు
పెద్దలకే మందహాసం!
టెన్త్ చిన్నారులకు
టెన్షన్ పెట్టకండి
క్షణం ఆలోచించండి
క్షణికావేశాన్ని దూరం పెట్టండి
మేమున్నామనే భరోసా కల్పించండి!
పేరు: కెసి నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
94
[09/07, 1:41 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 9/7/2020
కవిత సంఖ్య: 94
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: స్థానికతకు బహుకరణ!
స్థానికతకు
ఓటరు
బహుకరణ
జిల్లా కో చైర్మన్
మండలానికో అధ్యక్షుడు!
నిధుల జాడ
ఎరక పడతారు
కేటాయింపులు చేస్తారు!
ఇక పల్లెలన్నీ
నిధుల ప్రవాహంతో
పరుగులు పెడతాయి!
నిరంతర అభివృద్ధికి
బాటలు వేస్తాయి!
పేరు: కెసి నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
95
[12/07, 1:58 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 12/7/2020
కవిత సంఖ్య: 95
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ఎవరికి రక్షకులు?
రాజకీయ
వారసుల
మాదిరిగానే
గ్యాంగ్ స్టర్ నయీమ్
వారసులొచ్చారు
వారు
అవినీతి
సామ్రాజ్యానికి
రాజులయితే
వీరు
ఆటవిక
సామ్రాజ్యానికి
రాబందులు?
ఇప్పుడు
పోలీసులు
ఎవరికి
రక్షకులు?
పేరు: కెసి నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
96
[12/07, 1:58 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 12/7/2020
కవిత సంఖ్య: 96
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ప్రియాంక అభిరుచి!
జంకు బొంకు
లేని ప్రచారం
పాములంటే
భయం లేదు
ప్రజలంటేనే ప్రశ్నార్థకం?
ఎన్నికల వేటలో
పాముల బుట్టలో
సర్పం చేతపట్టి
బుస కొట్టిన గాంధీగిరి!
ఓటు కోసం
సీటు కోసం
జనం ముందు
ఇంకెన్ని కొంగ జపాలో?
పాలకుల పాట్లు
వారసుల అగచాట్లు
వారి అభిరుచులే
అవసర ప్రతిబింబాలు!!
పేరు: కెసి నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
97
[14/07, 2:20 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 14/7/2020
కవిత సంఖ్య: 97
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: ప్రతిపక్షాల కుట్ర
ఎన్నికల
ఏర్పాట్లకు
సర్వం సిద్ధం!
ప్రతి ఒక్కరూ
ఓటు వేసేందుకు
సకల సౌకర్యాలు!
భద్రతా
వలయంలో
పోలింగ్ బూత్ లు!
ఓటు వేస్తున్న
జనంపై
ఒక్కసారిగా
పిచ్చికుక్క స్వైర విహారం?
ప్రాణాలు
అరచేత పట్టుకొని
పరుగు లంకించుకుంన్న
ఓటర్లు!?
అధికారుల
నిర్లక్ష్య వైఖరిపై
మండిపడ్డ ప్రజలు?
ఇది ముమ్మాటికీ
ప్రతిపక్షాల కుట్రేనని
పాలకపక్షం ఆరోపణ!
సిట్టింగ్ జడ్జి చేత
విచారణ జరిపించాలని
రాజకీయ పక్షాల డిమాండ్!!
పేరు: కెసి నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
98
[14/07, 2:20 PM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 14//2020
కవిత సంఖ్య: 98
కవి పేరు: కెసీ నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: యముడేల దాపరించాడు?
ఢిల్లీలో
ఒక చౌకీదారుడు
హైదరాబాదులో
ఒక కాపలాదారుడు
వీరిద్దరు ఉండగా
యముడేల దాపురించాడు?
గింజ గింజకు గిట్టుబాటు ధర
పంట పంటకు బీమా సౌకర్యాలు
మరి నాకెవ్వరు గ్యారెంటీ?
ధాన్యం బస్తాలపై ఆదమరచి
శాశ్వతంగా సేదతీరిన రైతన్న?
కొనుగోలు కేంద్రంలో ఎవరిస్తారు భద్రత?
మిఠాయిలు తెస్తానన్న అయ్య!
ఇంకా రాలేదని బిడ్డ మారాం!?
మగడి జాడలేదని ఆలి ఆందోళన?
వీరిని ఎవరు ఓదారుస్తారు?
ఇప్పుడు చెప్పండి
రైతు ఇల్లాలు తాళి తెంపిందెవరు?
చౌకీదారుడా? కాపలాదారుడా?
పేరు: కెసి నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
99
[15/07, 10:33 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 15/7/2020
కవిత సంఖ్య: 99
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: వేరే ఆశ్రమాలెందుకు?
ముసలితనం
చిన్నపిల్లల తనం
వయసు పైబడిందని
మనసు కలత చెందకు
అయినవారు చూడలేదని
దిగులు చెందకు
జీవిత అనుభవంలో
ఎన్నెన్ని చేదు అనుభవాలో
కష్టసుఖాల కడగండ్లలో
ఎదురీదిన వాడివి
సాధించినవి సాధించాల్సినవి
ఇంకా ఏదో సాధించాలని
ఏమి పోగొట్టుకున్నావు
వెతకటానికి అందని కంటి చూపు
ఇంకా ఏదో తపన
ఆడని కాళ్లు చేతులతో
ఇంకా ఏమేమో చేయాలనే
మనిషి తపన
వృద్ధాప్యం దశలో కూడా
మనసు ఆలోచనలు
ఉరకలు వేస్తూనే ఉన్నాయి
ముసలితనం
నీ జీవిత సరిహద్దుపై తిష్ట వేసింది
క్షీణించిన జీవకణాలు
ముడత బడ్డ శరీరం
పొడుచుకు వస్తున్న ఎముకల గూడు
మంచానికే పరిమితమైన నీకు
చేదోడు వాదోడైంది ఊతకర్ర!
వృద్ధాప్యం శాపమే మరి?
అంతా నా వాళ్లే
ఆఖరి దశలో పండుబారిన తనం
అంటరానితనమవుతుంది
అందుకే మరి
నేటి దంపతులే రేపటి వృద్ధులు
వేరే ఆశ్రమాలెందుకు?
ప్రతి ఇల్లు ఒక వృద్ధాశ్రమం కావాలి!
పేరు: కెసి నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
[15/07, 10:34 AM] KC Narsaiah KS 26: సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 15/7/2020
కవిత సంఖ్య: 100
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: నవ్యాక్షర ఆయుధాలు!
ప్రకృతిలో
అక్షరం దివ్యాక్షరం!
నల్లని పలకపై
నా అక్షరాలు
ఆకాశంలో
వెలుగు లీనుతున్న నక్షత్రాలు!
అవనిలో
క్షరం కాని అక్షరం!
తెల్లని కాగితంపై
నా అక్షరాలు
నడవడికకు మార్గదర్శకాలు!
జీవితంలో
అక్షరం ప్రత్యక్ష దైవం!
గ్రంథాలలోని
నా అక్షరాలు
ధర్మాధర్మాల స్వరూపాలు!
మనుగడలో
అక్షరం అనంత రూపం!
నల్లని బోర్డుపై
నా అక్షరాలు
మేఘాల నుండి వర్షిస్తున్న చినుకులు!
జీవన్మరణంలో
అక్షరం ఆయువుపట్టు!
మదిలో దాచిన
నా అక్షరాలు
మనుగడ కోసం జరిగే పోరాటంలో
ధరించిన నవ్యాక్షర ఆయుధాలు!!
కవి పేరు: కెసి నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
101
సమూహం: వీరాస్ కవి సమయం
తేది: 15/7/2020
కవిత సంఖ్య: 101
కవి పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం
శీర్షిక: దండిభట్ల
దండి కలవాడు
దండిభట్ల
వేద విజ్ఞానాన్ని
అవపోసన పట్టి
విశ్వవ్యాప్తం చేసిన
మహా జ్ఞాని
వేదమర్మంలో నిక్షిప్తమైన
విజ్ఞాన భాండాగారాన్ని
విడ మరచి పంచిన వాడు
యుద్ధ తంత్రాలను
శత్రు దేశాల
జయాపజయాల
రహస్యాలను రంగరించి
ప్రాపంచికం చేసినవాడు
వేద విజ్ఞాన అన్వేషణలో
సామ దాన వేద దండోపాయంలో
వేద విజ్ఞాని దండిభట్లను
గద్దలా తన్నుకు పోయిన జర్మనీ
పేరు: కెసి నరసయ్య
7981814784
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను

Comments
Post a Comment