మద్దిరాల సత్యనారాయణ రెడ్డి KS 19




నిర్వహణ
వీరా గుడిపల్లి


కవి పేరు:: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా:: నల్లగొండ.
మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
తెలుగు ఉపన్యాసకులు.
ఆర్.జి.యు.కె.టి..బాసర.
పరిశోధక విద్యార్థి .
కాకతీయ విశ్వవిద్యాలయం.
మంగాపురం.గ్రామం.
వేములపల్లి.మం.
నల్లగొండ.జిల్లా.
తెలంగాణ.
చరవాణి:9502771776.
snreddymaddirala@gmail.com

*************--
కవిత సంఖ్య::1.
శీర్షిక::విద్యా జ్యోతులు.
-----------------------------------.
             
నిత్యం జ్ఞానమనె సాగరంలో.
మునిగి తేలుతూ ముందుకు నడుస్తూ.
కాల గమనంలో  జ్ఞాన దీపాలను .
వెలిగిస్తున్న అఖండ జ్యోతులు.
నిరంతరం తాము దహించబడుతున్నా .
పలువురికి వెలుగునిచ్చే కాగడాలు.
పోటీ ప్రపంచంలో కాలానికి కళ్ళెం వేస్తూ. విజయతీరాలకు దారిచూపే విద్యా దీపాలు.
గాడాంధకారంలో కూరుకుపోయిన.
 విద్య మిత్రులకు అజ్ఞానవంతులకు.
 వారు కాంతిరేఖలు.
ఉరిమినా మెరిసినా అగ్గి కురిపించినా .
 చల్లని ప్రేమను పంచే మేఘాలు.
మంచి చెడులను విద్యా విలువలను .
విడమర్చి చెప్పే నిత్య విద్యార్థులు.
గురుతర బాధ్యతలలో బందీ అయి .
విలువల వర్షంలో తడిసి ముద్దై.
 పరవశించే పవనాలు.
నిరంతరం విజ్ఞాన గని లో పనిచేస్తూ .
మెరికల్లాంటి మెరుగైన వజ్రాలను .
సమాజానికి అందిస్తున్న కార్మికులు.
జీవితమనే కలువకొలను లో మునిగి తేలుతూ. ముసురుతున్న చలి అనేక కష్టాలను. దులుపుకుంటూ ముందుకు నడుస్తున్న .
ఆదర్శ జీవులు వారు..
అందుకే సమాజం వారికి హారతులు పడుతుంది.
(నా అభివృద్ధికి కారణమైన గురువులందరికీ శనార్థుల తో)

(ఇది నా సొంత రచన.ఈ కవిత దేనికి అనువాదం కాదని దృవీకరిస్తున్నాను........).

2
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
ఊరు: మంగాపురం, నల్లగొండ.
కవిత సంఖ్య:02.
శీర్షిక::వి(మి)ష వాయువు.
-----------------------------------
ఎప్పుడూ చల్లగా కనిపించే విశాఖలో.
 వారంతా వెన్నెలను తాగి అలసిపోయినా.
 చకోర పక్షుల్లా నిద్రిస్తున్నారు.
నిద్రలోకి భయంకరమైన కలలు వచ్చినట్లుగా.
అల లాంటి స్టైరీన్  వాయువొచ్చి .
ఊపిరి సలపకుండా ఉక్కిరిబిక్కిరి చేసింది.
వాయువే విష వాయువై విలయ తాండవం  చేస్తుంటే.
 చలికి వణుకుతున్న కూనల్లా అల్లాడిపోయారు.
నిత్యం జీవినిచ్చే వాయువే .
కళ్ళెర్ర చేసినట్టుగా ఆదమ రాత్రి .
మృత్యు తాండవమాడింది.
వాయుగుండం లా దూసుకొస్తున్న వాయువులు.
 వాటి నుండి తప్పించుకొలేక.
 రోడ్లపై చతికిలపడిన.
 చెట్ల కొమ్మల్లా జనాలు.
కంచే చేను మేసిందన్న చందంగా .
పీల్చేగాలే విషమై విసురుతుంటే.
 ఎగరలేని  కివి పక్షుల్లా .
చెల్లా చెదురైన వారిని చూస్తుంటే.
 హృదయం ద్రవిస్తుంది.
ఈ దుర్ఘటనలో అస్వస్థకు గురైన.
వారంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ....

హామీ పత్రం::ఇది నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు అని ధృవీకరిస్తున్నాను.....
3
[10/05, 7:27 PM] Maddirala Satyanarayan Reddy 19: సమూహం:వీరా‌స్ కవి సమయము.
తేదీ:10-05-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:03.
శీర్షిక: కరోనాను ఖతం చేద్దాం.
---------------------------------------.


కాలు కదిపినా కాటు వేసేను.
కరోనా కబంధాలలో చిక్కి శల్యమయ్యేవు.
 కరోనా కబళించేది మనుషులను కాదు .
మానవులు ఆత్మవిశ్వాసాన్ని .
ధైర్యంగా ఐక్యతతో దాన్ని ఎదుర్కొందాం.
కరోనా కదులుతుంది కదనరంగంలో .
దాని కట్టడికై కరవాలం చేపడతాం .
నలుదిశలా దాని వ్యాప్తిని అరికడదాం.
మనుషుల దేహమే దాని ఆవాసం .
మనం తలుచుకుంటే తరిమి కొట్టేయ్యగలం.
ఆదమరచినమా! ఆగం చేసెస్తది.
కరోనా కట్టడికి కాలు దువ్విన వైద్యులు .
కనిపించే కలియుగ దైవాలు.
విచ్చలవిడి విహారం విజృంభించును కరోనా .
అది మన దేశానికి విపత్తు.
అది జరగక ముందే మేల్కొందాం.
సామాజిక దూరం పాటిద్దాం .
కరోనా సమస్యకు చరమగీతం పాడుదాం.
కరోనా అంతం అదే మన పంతం.
అందరం ఇంటికే పరిమితమవుదాం.
 అని ప్రతిజ్ఞ చేద్దాం.........

(ఇది నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు అని ధృవీకరిస్తున్నాను...............)
4
[12/05, 10:41 AM] Maddirala Satyanarayan Reddy 19: సమూహము:వీరాస్ కవి సమయము.
తేదీ:12-05-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:04.
శీర్షిక:కష్టాల కడగండ్లు.
--------------------------------.       
           
సమాజమనే కన్నుల నుండి.
కొన్ని కష్టాలు రాలి నా ఒడిలో పడ్డాయి.
వాటిని ఎంత  దులుపుకుందామన్న.
వాటి మరకలు పోవడం లేదు.
ఈ మరకలు పోవడానికి.
కృషి అనే డిటర్జెంట్ ను వాడాలంటున్నారు.
కృషి చేస్తున్న కానీ.
నా జీవితానికి అంటిన మకిలి వదలడం లేదు.
భగీరథ ప్రయత్నం చెయ్యటం లేదని.
సమాజం నన్ను నిందిస్తుంది .
జీవితమనే సముద్రంలో ఎంత ఈదినా.
అలలు ముందుకు పోనీయడం లేదు.
అలలను తప్పుకుంటూ ముందుకు సాగుతున్నా.
అలసట వస్తుందె తప్ప అలలు వదలడం లేదు. సుగంధపు పరిమళాలు వెదజల్లే.
గంధపు తోటలోకి విష వాయువులు వచ్చినట్లుగా.
నా జీవితంలోకి కష్టాలు వచ్చి కకావికలం చేస్తున్నాయి.
మహత్తరమైన మబ్బుల స్థాయికి ఎదిగిన.
నా జీవితాన్ని లాగి అదొః పాతాళానికి పడేస్తున్నాయి.
సమాజమనే వర్షంలో కడగండ్లనే కష్టాలు కురుస్తున్నాయి.
ఇక కడగండ్ల నుంచి తప్పించుకోలేనని  తెలిసి.
కమనీయమైన కడగండ్లకు అలవాటుపడి.
బతికీడుస్తున్న బాటసారిని.......

  (ఇది నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు అని ధృవీకరిస్తున్నాను...)

4
[12/05, 1:40 PM] Maddirala Satyanarayan Reddy 19: సమూహము:వీరాస్ కవి సమయము.
తేదీ:12-05-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:04.
శీర్షిక:కష్టాల కడగండ్లు.
--------------------------------.       
           
సమాజమనే కన్నుల నుండి.
కొన్ని కష్టాలు రాలి నా ఒడిలో పడ్డాయి.
వాటిని ఎంత  దులుపుకుందామన్న.
వాటి మరకలు పోవడం లేదు.
ఈ మరకలు పోవడానికి.
కృషి అనే డిటర్జెంట్ ను వాడాలంటున్నారు.
కృషి చేస్తున్న కానీ.
నా జీవితానికి అంటిన మకిలి వదలడం లేదు.
భగీరథ ప్రయత్నం చెయ్యటం లేదని.
సమాజం నన్ను నిందిస్తుంది .
జీవితమనే సముద్రంలో ఎంత ఈదినా.
అలలు ముందుకు పోనీయడం లేదు.
అలలను నెట్టుకుంటూ ముందుకు సాగుతున్నా.
అలసట వస్తుందె తప్ప అలలు ఆగటం లేదు.
సుగంధపు పరిమళాలు వెదజల్లే.
గంధపు తోటలోకి విష వాయువులు వచ్చినట్లుగా.
నా జీవితంలోకి కష్టాలు వచ్చి కకావికలం చేస్తున్నాయి.
మహత్తరమైన మబ్బుల స్థాయికి ఎదిగిన.
నా జీవితాన్ని లాగి అదొః పాతాళానికి పడేస్తున్నాయి.
సమాజమనే వర్షంలో కడగండ్లనే కష్టాలు కురుస్తున్నాయి.
ఇక కడగండ్ల నుంచి తప్పించుకోలేనని  తెలిసి.
కమనీయమైన కడగండ్లకు అలవాటుపడి.
బతికీడుస్తున్న బాటసారిని.......

  (ఇది నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు అని ధృవీకరిస్తున్నాను...)
5
[14/05, 10:10 AM] Maddirala Satyanarayan Reddy 19: సమూహము: వీరాస్ కవి సమయము.
తేదీ:14-05-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:5.
శీర్షిక:నిస్వార్థ జీవి.
----------------------------.
తాను పండించిన పంటనంత .
ప్రపంచానికి పంచిపెట్టే.
కర్షకునిలాగా నిజాయితీగా కనిపించే.
 నిస్వార్థ జీవి అది.
సుకుమారమైన పువ్వుల్లో ఉన్న .
మకరందాన్ని సేకరించి తుట్టెల బ్యాంకుల్లో .
పొదుపు చేసే నిస్వార్థ ఖాతాదారుడు.
తన సంతానాభివృద్ధి కోసం .
ఎంత కష్టాన్నయినా భరిస్తూ.
అమృతాన్ని పండించే దైవదూత.
ఆహారాన్వేషణ కై .
 వేల మైళ్ళ ప్రయాణంలో  .
అలసటే తెలియని అనామిక.
కలసి వుంటే కలదు సుఖం .
అనే సూత్రానికి నిలువుటద్దంగా.
 దర్శనమిస్తున్న దయామయి.
దాని కష్టానైతే దోచుకుంటున్నారు.
 కానీ !
అజరామరమైన దాని కళను దోచుకోవడం.
 ఎవరి తరము కాదు......

(ఇది నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు అని ధృవీకరిస్తున్నాను........)

6
[15/05, 3:21 PM] Maddirala Satyanarayan Reddy 19: సమూహము:వీరాస్ కవి సమయము.
తేదీ:15-05-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:06.
శీర్షిక:తేనీరు.
----------------------------.


కోడికూతల పిలుపులు.
 పక్షుల కిలకిల రాగాలు.
మనసుదోచే తేనీరు .
వెరసి తొలి వేకువ జాము.
నరాలలో నాట్యం చేస్తూ .
రక్తాన్ని రంజుగా రంకెలెయిస్తూ.
 మెదడుకు ఉత్సాహానందిస్తూ .
దేహ బడలికను తీర్చే అమృతం.
భారమై బరువెక్కిన జీవితాన్ని .
ఒక్క చుక్కతో మేల్కొకొలిపే వేకువలా.
 మధురమైన అనుభూతిని అందిస్తుంది.
అలసిపోయిన దేహాన్ని అక్కున చేర్చుకొని .
తన కౌగిలిలో బందీ చేసి .
వెచ్చని ఉత్సాహానందించే నిచ్చెలి.
నిత్యం మదిలో మెదులుతూ.
 ఊహల ఊసులతో ఊరిస్తూ .
అలసట తీర్చే ఆత్మబంధువు.
బంధుమిత్రుల ఆగమన వేళ.
 ఆహ్లాదాన్నందించే ఉత్సాహ పానీయం.
పేద ధనిక తేడా లేకుండా .
అందరికీ సమానమైన ప్రేమను పంచే కన్నతల్లి.

(ఈ కవిత నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు అని ధృవీకరిస్తున్నాను)....
[16/05, 3:52 PM] Maddirala Satyanarayan Reddy 19: సమూహము:వీరాస్ కవి సమయము.
తేదీ:16-05-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:07.
శీర్షిక: పసి మొలకలు.
 ---------------------------------.

వారు తెల్లని పలువరుసతో.
నవ్వుల పువ్వులు పూయిస్తూ.
అందరి ముఖాల్లో వెలుగు  నింపే ప్రకృతి శక్తులు.
వాక్కులతో వాదన చేస్తూ.
పదాలతో పందెం కాస్తూ.
పాదాలతో చిందులు వేస్తూ.
మనసులను కట్టిపడేసే కళాకారులు.
బాధలు అనే చీకటి తో నిండిపోయిన.
మానవ హృదయాలకు ఊరట కలిగిస్తూ.
వెలుగు వైపు నడిపించే బాల సూర్యుళ్లు.
సమాజమనే పెరుగులోంచి.
స్వచ్ఛమైన అమాయకత్వాన్ని తీసి .
అందరికీ పంచిపెట్టే పసి మొలకలు.
పరిచయాలే అక్కర్లేకుండా అందరినీ.
చిరునవ్వుతో పలకరించే బ్రహ్మకమలాలు వారు.
కులమతాల  భేదాలతో.
సంబంధం లేకుండా అందరి ఇళ్లలో .
వెన్నలాంటి ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్న చిన్ని కృష్ణుళ్లు.
ఏడుపనె ఆయుధాన్ని చేతబట్టి .
అందరి హృదయాలను కలవరపరుస్తూ.
తాము అనుకున్నది సాధించుకునే పట్టువదలని విక్రమార్కులు.
మానవులందరికీ ఆనందాల వారదులను కడుతూ.
 అనుబంధాల పంటలను పండించి.
మమతానురాగాల దిగుబడులను రాబడుతున్న బాల రైతులు.
ఏ కుళ్లు కుతంత్రాలు లేని సమాజం వారిది.
ఆ సమాజంలోకి మనుషులంతా ప్రయాణించాలని కోరుకుంటున్న పసివాణ్ణి నేను......
             .

08
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:08.
శీర్షిక::కవి చేతిలో కలాన్ని.
--------------------------------------

నేను కలాన్ని.
కవికుల గళాన్ని.
నాకు అక్షరానికి విడదీయరాని బంధముంది.
 అక్షరం నాకు కన్నతల్లి .
పొలంలో విత్తనాలను చల్లినట్టుగా .
అక్షరాలను చల్లడమే తెలుసు నాకు .
నేను రాసే ప్రతి అక్షరానికి.
 పిడుగుకున్నంత శక్తి ఉంది.
కవి మదిలో మెదిలే భావాలకు .
అక్షర రూపం ఇస్తూ .
తలలో నాలికలా ఉంటూ.
అక్షర సంపుటాలను వెలువరిస్తాను.
సమాజంలో పేరుకు పోయిన అవినీతి పై.
 కవి ఎక్కుపెట్టిన వజ్రాయుధాన్ని.
నా చూపు డేగ చూపు .
ఉక్కు నరాలు కలిగిన.
వజ్ర సంకల్పం నాది .
నేను రాసే రాతలు .
తరతరాలకు లో చూపునిస్తుంది.
పాలకుల పని తీరును .
ప్రజల తరుపున ఆక్రోషం గా ప్రశ్నిస్తా.
సంఘంలో పేరుకుపోయిన.
 కలుపు మొక్కలను .
ఏరి పారేయడమే నా లక్ష్యం.
నేను కలాన్ని.
 కవికుల గళాన్ని............

(ఈ కవిత నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు....)
9
వీరాస్ కవి సమయము.
తేదీ:19-05-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:09.
శీర్షిక:నిదుర.
----------------------------.
అలసి సొలసిన దేహాలకు.
 ఊరట కలిగిస్తూ తనదైన శైలిలో.
 చికిత్స చేసి ప్రపంచానికి.
 తన ఉనికిని చాటే మత్తు అది.
గమ్మత్తయిన నిద్రమత్తు చేసే జిత్తు ముందు .
నీ జీవితమే చిత్తు.
చురుకైన చూపుకు.
 పదునైన మెదడుకు .
దేహం చేసే అన్ని పనులకు.
నిండైన నిదుర అవసరం .
అనవసరమైన నిదుర.
అవరోధాలను తెచ్చును.
పొద్దంతా పనిచేసి .
రాత్రి అవ్వగానే పసిపిల్లలమై.
దాని ఒడిలోకి చేయవలసిందే.
వినువీధుల్లో సంచరిస్తున్న నిశాచర జీవిగా.
 దేహాలపై వాలి పూనకం తెప్పిస్తుంది.
కోడి పిల్లల్ని రెక్కల కింద దాచినట్టుగా .
మనలని తన బాహువులలో బంధిని చేస్తుంది.
నిద్ర లేని ప్రాణి .
అదుపు తప్పిన  ఆంబోతు తో సమానం.
అందుకే నిదుర అత్యవసరం......
(ఈ కవితా నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు)


10

[మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:10.
శీర్షిక:లాక్ డౌన్ మంచిదే..
-----------------------------------.

లాక్ డౌన్ మనకు మంచే చేసింది.
 అదుపు తప్పి సంచరిస్తున్న ఆంబోతులకు.
ముకుతాడేసి ముచ్చటగా కట్టేసింది.
రోడ్డు మీద తిరగాల్సిన .
వాహనాలకు రెస్ట్ ఇవ్వడంతో.
 ప్రకృతికి జవ జీవాలొచ్చినయ్.
కాలుష్యమంతా కాశీకి పోయినట్టు అదృశ్యమవడం తో.
 పరిసరాలన్నీ కళకళలాడుతున్నాయి.
పిల్లగాలులు పరవశించి .
 పరిమళాలను స్ప్రే చేస్తున్నాయి.
రోగాల పేరుతో నిలువు దోపిడీ లేదు .
టెస్టులు మందులు అనే హడావుడి లేదు .
అసలు అనారోగ్యమే ఆవిరైపోయింది.
బతికుంటే చాలు అనే భావన ఊపందుకుంది.
బయటకు వెళ్లిన వాడు ఎప్పుడొస్తాడొ?
అన్న ఎదురుచూపు లేదు .
ఇంట్లో పనులకు ఆందోళన లేదు.
వలస కార్మిక పక్షులు .
ఖండాలు దాటే ప్రయత్నంలో .
కాస్త ఇబ్బంది పడ్డా.
గూడు చేరతామనే ఉత్సాహముంది.
లాక్ డౌన్ వేళ అనుబంధాలు .
కొత్త చిగురులు తొడిగి చిందేస్తున్నాయి.
అనవసరమైన ఖర్చులను అదుపు చేసి .
పొదుపులను ప్రోత్సహించే.
లాక్ డౌన్ మనకు అవసరమే కదా!!!!

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు).
11
కవిత సంఖ్య:11.
శీర్షిక:వలస పక్షులు.
------------------------------.

వారి కష్టం చూడలేకపోతున్నా.
పిల్లా జల్లా మూట ముళ్ళే సదురుకొని.
 రోడ్డు పొంట పోతుంటే .
వలస పక్షులు దేశాలు దాటుతున్నట్టుగా.
కనపడుతున్న దృశ్యాలు.
చూసి చలించని గుండె లేదు.
నిప్పులు కురుస్తున్న ఎండలో .
కాళ్లకు చెప్పులు లేకుండా .
ఒళ్లంతా చెమటతో తడిసి
నడుస్తుంటే.
 ప్రాణం తరుక్కపోతుంది.
ఇక్కడ పాలించే ప్రభుత్వాలకి .
వలస కార్మికులంటే ఎవరో తెలియదు.
వారిని ఓట్లేసే యంత్రాలుగా చూస్తూ.
 ప్రజాస్వామ్యాన్ని ఏమార్చారు.
ఎవరికీ రాని కష్టం వారికొచ్చింది.
 వేల మైళ్ళ ప్రయాణంలో .
అలసిపోయిన వలసన్నలకి.
చేతనైనంత సహాయం చేద్దాం.
చెదిరిపోని వారి గుండె నిబ్బరానికి.
 చేతికర్ర లా ఊతమిద్దాం.
 మానవత్వ గోడలా నిలబడదాం....

12
కవిపేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:12
శీర్షిక:తాళి.
-------------------------------

అది పరమ పవిత్రమైన.
 వేద మంత్రాలలో మునిగి తేలుతూ .
దివ్యత్వాన్ని పొంది .
ఆశీర్వచనాలమధ్య.
 మంగళకరంగా దర్శనమిస్తుంది.
స్త్రీలను సుమంగళిగా నిలబెడుతూ .
పురుషుని ఒక ఇంటి వాన్ని చేస్తూ .
ఇద్దరి జీవితాలకు దిక్సూచి ఉంటుంది.
సౌభాగ్యానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచి.
 రెండు హృదయాలకు.
 ముడిపెట్టి ముందుకు నడిపి.
 సంసారమనే సాగరంలో బందీని చేసి.
బహుదూరపు ప్రయాణానికి బాటలు వేస్తుంది.
మన సంస్కృతి సంప్రదాయాలను .
ముందు తరాలకు అందిస్తున్న.
 జీవితపు బొడ్డుతాడు అది.
తాళి ని గౌరవిస్తే తల్లై సాకుతుంది.
తాళె కదా! అని చిన్న చూపు చూస్తే .
నీ జీవితాన్ని ఎగతాళి చేస్తుంది....

(ఈ కవిత నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు).
[23/05, 9:33 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:23-05-2020.

13
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:13.
శీర్షిక:కరోనా భూతం.
------------------------.
ఒక్క రాష్ట్రమనీ కాదు.
ఒక దేశమనీ కాదు.
యావత్ ప్రపంచాన్నీ .
తన చేతి వేళ్ళపై ఆడిస్తున్నది.
కరోనా వైరస్ భూతం.
 కంటికి కనపడదు.
కానీ, అంటుకున్నదో.
ఆగమాగం చేసేస్తది.
ఎక్కడిదో ఈ వింత వ్యాధి.
తుమ్మితే పాకుతుంది.
తాకితే సోకుతుంది.
మందు లేని ఈ మహమ్మారి.
అతి వేగంగా విస్తరిస్తోంది.
ప్రజల ప్రాణాలను బలిగొంటున్నది.
చైనా నుండి మొదలు.
అన్ని దేశాలలోకి దిగుమతి అయినది.
మనిషికి మనిషికి దూరం పెంచుతున్నది.
సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నది.
ఈ రోగాన్ని నివారించాలని.
పోలీసులు, వైద్య బృందాలు.
అలుపు లేక సొలసి పోక.
వారి ప్రాణాలను పణంగా పెట్టి. మరీ!
నిత్యం శ్రమిస్తూ దేశాన్ని కాపాడుతున్నారు.
ఇక మనం ఆలోచించి. ముందడుగు
వేయాల్సిన సమయం వచ్చింది.
బాధ్యత గల పౌరులుగా వ్యవహరిద్దాం.
సామాజిక దూరం పాటిద్దాం.
రోగితో కాదు వ్యాధితో పోరాడుదాం.
ఆ మహమ్మారికి ఎదురుగా.
కలిసి నిలిచి పోరాడుదాం.
ఇంట్లోనే ఉంటూ దేశాన్ని రక్షిద్దాం.
కరోనాని పారద్రోలుదాం......

(ఈ కవిత నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు.)
14
వీరాస్ కవి సమయము.
తేదీ:24-05-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:14.
శీర్షిక:అన్నా జర ఆలోచించు.
----------------------------------
అన్న జర దూరం వుండు.
 లేకుంటే గీ కరోనా బట్ట కాల్చి మీదేస్తది.
నందన వనంలోకి తుమ్మెద వచ్చి .
మకరందాన్ని పీల్చినట్టుగా .
నీ జీవిని పీల్చేస్తది.
ప్రపంచ దేశాలలో గీ మహమ్మారి.
 మరణ శాసనాన్ని లిఖిస్తుంది.
మారణాయుధాలు లేకుండానే .
మరణమృదంగం మోగిస్తుంది .
కంటికి కనిపించకుండా .
మృత్యు పాశం విసురుతుంది.
జడివానకు అల్లకల్లోలం అవుతున్న.
సముద్రంలా ఉంది లోకం.
అడవి దహిస్తున్న అగ్ని లా.
కరోనా నిన్ను దహించక ముందే.
మేల్కొంటే!
మనిషిగా నీకు మనుగడుంటుంది.
సమాజమనే నాటకంలో.
 నీ పాత్రను రసవత్తరంగా .
పోషించవలసిన సమయం ఆసన్నమైంది.
నీ కుటుంబానికి నీడనిచ్చే చెట్టులా.
 నిలబడవలసిన తరుణం ఇదే.
ఇన్ని రోజులు హాయిగానే బ్రతికావు .
ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న ఖైదీ లాగా.
రహస్యంగా బతికే రోజులొచ్చినయి.
కలో గంజో తాగి ఇంట్లోనే ఉండు.
అంతటా నిండి పోయిన పరమాత్మలాగా .
గా వైరస్ సంచరిస్తుంది.
దాని నడ్డి విరగోట్టాలంటే .
అందరం సామాజిక దూరం పాటించాలి..

(ఈ కవిత నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు.అని ధృవీకరిస్తున్నాను)...
15.

వీరాస్ కవి సమయము.
తేదీ:25-05-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:15.
శీర్షిక:మూగ రోదనలు.
-------------------------------.

అవన్నీ స్వేచ్ఛగా గాలిలో .
ఎగిరే గాలిపటాలు.
ఎంత ఎత్తుకైనా దూసుకుపోతూ .
ఆనంద తీరాలలో విహరించేవి.
అన్ని కాలాల్లో హాయిగా.
 రివ్వున ఎగిరే విహంగాలకి.
 ఎండాకాలం గడ్డుకాలం గా మారింది.
నీటి చెమ్మ కోసం మూగగా రోదిస్తున్న.
 వాటి బాధ వర్ణనాతీతం.
పొట్ట తిప్పల కై.
నిరంతరాయంగా అన్వేషిస్తూ .
అరుపులతో కాలం వెళ్లదీస్తున్నాయి.
ఎండిపోయిన గొంతులతో తిరుగుతూ.
ఆప్తులకై అర్రులు చాచుతూ.
 ఇళ్లలోకి వస్తున్నాయి.
మంచి మనసున్న పక్షి ప్రేమికులు అందించే. ఆపన్నహస్తం కోసం చకోర పక్షుల్లా తపస్సు చేస్తూ. తపనతో తహతహలాడుతున్నాయి.
మనం అందించే గింజలు .
వాటి జీవనానికి ఆధారం .
నీటి తొట్లే వాటికి ఆసరా.

(ఈ కవితా నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు)00
16.
వీరాస్ కవి సమయము..
తేదీ:26-05-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా:నల్లగొండ.
కవిత సంఖ్య:16.
శీర్షిక:పరిశోధకుడు.
--------------------------.

అతను ఒక నావికుడు.
పరిశోధన పరికరాలు చేతబట్టి .
పరిపరి విధాలుగా సాగరంలో.
 శోధనకు పూనుకున్న విశ్లేషకుడు.
ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ .
అనేక విషయాలు నేర్చుకుంటూ.
 క్షేత్ర పర్యటనలు చేస్తూ .
ముందుకు సాగే  అపర మేధావి.
అనునిత్యం పరీక్షగా పరిశీలించి.
 ఫలితం రాబట్టే పని రాక్షసుడు.
నిరంతరం శాస్త్రాలతో కుస్తీ పడుతూ .
పుస్తకాల పుటలలో పురుగై.
 భావాన్ని సంగ్రహిస్తూ.
 తరతరాలకు పనికొచ్చే .
అనేక విషయాలను విడమరచి చెప్పే.
విద్యా శోధకుడతను.
ఎంత సమయం వృధా అయినా.
 తాను ఎంచుకున్న సిద్ధాంతానికి కట్టుబడి .
విలువైన సూత్రాలు విశ్లేషించి.
పదునైన పదాలు సృష్టించి .
పరిశోధన పురిటి నొప్పులనుభవించి.
 నూతన కావ్యానికి జన్మనిచ్చే .
నికార్సైన సూక్ష్మ పరిశీలకుడు.

(ఈ కవితా నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు.).

17
వీరాస్ కవి సమయము..
తేదీ:27-05-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:17.
శీర్షిక:ఒంటరి పొదరిల్లు.
-----------------------------------.

ఆమెకు ఆనందాలను పంచి .
అవరోధాలను తుంచి.
 అవసరాలు తీర్చడమే తెలుసు.
అనుబంధాల తీగలను .
కంటికి రెప్పలా కాపాడుతూ.
 మమకారాలను పెంచి పోషిస్తున్నా కూడా .
ఆమె ఎప్పుడూ ఒంటరి పొదరిల్లే.
ఆమెకు స్వార్థం ఉంది .
తన సంతానాభివృద్ధికై.
సమాజం సంధించిన.
 అవమాన బాణాల నుండి తప్పించుకుంటూ.
 జీవితమనే వ్యాఘ్రం పై సవారి చేస్తూ .
సవాళ్లను అధిగమిస్తున్న అజాతశత్రువు.
లోకులు కాకులై  కారు కూతలు కూస్తుంటే .
తనదైన శైలిలో స్పందిస్తూ .
సమాధానమిచ్చే సహన శీలి.
జీవితంలో ఎదురైన.
 ఎత్తుపల్లాలను అధిరోహిస్తూ .
అవరోధాలనే పద్మవ్యూహాలని ఛేదిస్తూ.
పలువురికి  పట్టెడన్నం పెడుతూ .
ముందుకు నడుస్తున్న పేదరాశి పెద్దమ్మ.
అయినా !
ఆమె ఎప్పుడూ ఒంటరి పొదరిల్లే.

(ఈ కవిత నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు.).

18.
వీరాస్ కవి సమయము..
తేదీ:28-05-2020.
కవి పేరు:మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య: 18.
శీర్షిక:కవి.
-------------------------.

కవి ఆయనొక రవి.
చీకట్లో మగ్గుతున్న .
సమాజానికీ వెలుగునిచ్చే వాడు.
ఒక సంఘటనను చూసి. మనసులోనే మధించి. పదాలతో పందిరివేస్తూ. పదిమందికి నీడనిచ్చే వాడు.
మదిలో మెదిలిన భావాలకు.
 ఒక రూపమిస్తూ.
 కవితా వనాన్ని పెంచే తోటమాలి.
నూతన పద కల్పనలను. ముక్కలుగా కోస్తూ.
 ఊహలతో ఫ్రై చేస్తూ. కమనీయమైన కవితలను.
సంపుటాలుగా వడ్డిస్తూ.
పాఠకుల ఆకలి తీర్చే వంట వాడు.
వస్తువును చిత్రవిచిత్రంగా వర్ణిస్తూ.
 శిల్పంతో సింగరిస్తూ .
భావాల బాహువుల్లో బంధిస్తాడు.
అతనికి సరిహద్దులంటూ ఏమీ లేవు.
ఏ అంశం మీదనైనా స్పందించే. స్వేచ్ఛ ఉన్న కళాకారుడు.
నిత్య చైతన్యవంతుడై.
 కనువిప్పు కలిగించే వాడు కవి.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు).
19.
వీరాస్ కవి సమయము.
తేదీ:29-05-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:19.
శీర్షిక:కర్కోటకుడు.
--------------------------.

వాడో కర్కోటకుడు.
జాలి దయ లేని నికృష్టుడు.
కనీస విలువలు లేని కఠినాత్ముడు.
తల్లి విలువ తెలియని మూర్ఖుడు.
నవమాసాలు మోసి కని.
 ఎన్నో కష్టనష్టాలకోర్చుకొని. కడుపు గట్టుకుని పెంచి పెద్ద చేసిన.
 కన్నతల్లిని అగ్నికి ఆహుతి చేశాడు.
దైవం తల్లి రూపేణా.
 అనే విషయం మరిచి .
విషం చిమ్మిన నరరూప రాక్షసుడు.
సమాజంలో మానవతా విలువల్ని.
 మరచి ఉన్మాదిలా తిరిగే.
 ఇలాంటి చీడ పురుగులను .
ఏం చేసినా పాపం లేదు.
కనికరం లేని కఠినాత్ముని.
 కని పెంచినందుకు.
 ఆమె ఆత్మ ఎంత రోదిస్తుందో?
ఇలాంటి కొడుకును.
 ఏ సమాజం కోరుకోదు.
మంచి చెడు విచక్షణ తెలియని.
 మృగానికి మనుషుల మధ్య బ్రతికే హక్కు లేదు.

(   27-05-2020 నాడు నల్లగొండ జిల్లా నర్సింగ్ భట్లలో లింగస్వామి కన్నతల్లిని కాల్చిచంపిన విషాద సందర్భం).

(ఈ కవిత నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు).
20.
వీరాస్ కవి సమయము.
తేదీ:30-05-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:20.
శీర్షిక:సైకిల్ మోటార్.
--------------------------------.

ఒకప్పుడు దాని కొనాలంటే .
జనాలు జంకేవారు.
ప్రస్తుత అది అత్యవసర వస్తువై.
అడుగులకు మడుగులొత్తుతూ .
ఇంట్లో మనిషి గా మారి .
సకల కార్యాలలో సహకరిస్తూ.
 గుర్రంతో పోటీపడే సవారీ మోటర్ అది.
ఎంత దూర ప్రయాణమైన .
భారం లేకుండా బాధ్యతగా చేరవేసే విహంగం.
కష్టజీవికి కాయకష్టం గా .
కార్మికునికి చెమట చుక్క గా .
వెన్నంటే ఉంటూ .
ఖచ్చితమైన పనితనాన్ని కలిగి.
సమయాన్ని ఆదా చేస్తుంది.
ఆపద సమయాలలో .
అత్యవసరంగా ఆదుకునే .
అంబులెన్స్ లా దూసుకుపోతుంది.
మనిషి కంటికి కన్ను గా మారి వెలుగునిస్తూ .
కాలికి నడక  గా మారి.
ఊత కర్ర లా చేయూతనిస్తూ.
 సహకారమందిస్తున్న జట్కాబండి.

(ఈ కవితా నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు).

21.
వీరాస్ కవి సమయము.
తేదీ: 31-05-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:21.
శీర్షిక:కల్లోల కాశ్మీరం.
---------------------------.       

  కాశ్మీరం కాశ్మీరం కల్లోల కాశ్మీరం.
 కడలి అంచును తాకె బాడబాగ్ని వోలె.
బుస్సు బుస్సు మనుచు అహాకారాలు.
 నిత్యం గాయాల గేయాలు.
 కల్లోల కలహాలు.
 కనిపిస్తే లాఠీల ఘీంకారాలు.
వెరసి కాశ్మీర కన్నీటి జీవనం. కష్టాల కడలిలో.
 సమస్యల సుడిగుండంలో.
 చావుకెదురీదుతూ బ్రతకాలి.
 తప్ప.
 ప్రశ్నించడానికి వీలులేని.
 వింత జీవితాలవి.
 ఇంతటి కల్లోల గడ్డ పై.
 శాంతి వనం విరియాలని.
 మనమంతా.
 మనస్ఫూర్తిగా కోరుకుందాం.
        జై హింద్.....................

  (కాశ్మీర్ లో తరుచూ 144 సెక్షన్ విదింపు సందర్భంగా......).

(ఈ కవిత నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు..)

22.
వీరాస్ కవి సమయము.
తేదీ:01-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:22.
శీర్షిక:సడలింపుల సవ్వడి.
-------------------------------------

సమాజంపై కప్పి వుంచిన .
ముసుగు కొద్దికొద్దిగా తొలగిపోవడంతో.
 జనం పరవళ్లు తొక్కుతున్న నదిలా .
పరవశించిపోతున్న వైనం.
ఇన్నాళ్లూ చీకట్లో మగ్గిన లోకానికి .
ప్రకృతి వేకువతో స్వాగతం పలుకుతున్నట్టు. చిరుగాలులు విసురుతుంది.
ప్రపంచాన్ని కమ్మేసిన.
 కారుమబ్బులు వదలడంతో .
సూర్యకిరణాలకి రెక్కలు వచ్చి.
 సమాజానికి వెలుగును పంచుతూ.
 నూతన ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.
ఇంతవరకూ స్తంభించిపోయిన కార్యకలాపాలు. పువ్వుల్లా వికసించి పరిమళాలు వెదజల్లుతూ. పరిణితి చెంది వేగం పుంజుకున్నాయి.
దుకాణాలు హోటళ్ళు నోర్లు తెరిచి పలకరిస్తున్నాయి.
లాక్ డౌన్ సడలింపులతో .
ప్రగతి రథ చక్రాలు పరుగులు తీస్తూ.
ప్రజారవాణా సరఫరా చేస్తూ .
రోడ్లపై సందడి చేస్తూ .
ప్రయాణికులకు ఊరట కలిగిస్తున్నాయి.
సడలింపుల సవ్వడి మొదలవ్వగానే .
బోనులో బందీ గా ఉన్నా.
పక్షులకు స్వేచ్ఛ లభించినట్టు .
జనాలంతా గల్లీలలో గల గల మంటున్నారు .
ఇరుకు గదుల్లో ఇబ్బందిపడ్డా ప్రజానీకానికి.
స్వాగతం పలుకుతూ .
మరిన్ని సడలింపు ఇవ్వాలని కోరుకుందాం.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
23

వీరాస్ కవి సమయము.
తేదీ:02-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:23.
శీర్షిక:నా తెలంగాణ.
-----------------------.

ఒకప్పుడు పరాయి పాలనలో అవమాన పడుతూ.
తన అస్తిత్వం కోసం పోరాడిన నా తెలంగాణ.
ఇప్పుడు ఎవరికీ అందనంత.
వేగంగా దూసుకుపోతున్న రాష్ట్రం.
ఉమ్మడి రాష్ట్రంలో ఒట్టిపోయిన పల్లెలన్నీ.
తెలంగాణ రాకతో  జీవం పోసుకుని.
చేను చెరువులతో కళకళలాడుతుంది.
నీరు లేక నోరు తెరిచిన.
బీడు భూములకు ప్రాణమొచ్చి .
పచ్చని పాడిపంటలతో పలకరిస్తుంది.
ఉద్యమానికి ఊపిరిలూదిన.
అమరవీరుల ఆశయాలను .
అందుకోవాలనే తపన తో తహతహలాడుతోంది.
ఉద్యమ పోరు బాటలో నడిచిన.
తన బిడ్డలకు ఉపాధి లేక విలపిస్తుంది.
కోటానుకోట్ల గళాలతో గర్జిస్తూ.
ఉద్యమ కవాతు చేసిన  నా ప్రాంతం.
స్వర్ణయుగమై విలసిల్లుతుంది.

(02-06-2020 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా.....)
24

వీరాస్ కవి సమయము.
తేదీ:03-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా:నల్లగొండ.
కవిత సంఖ్య:24.
శీర్షిక:విషపు కౌగిలిలో యువత.
---------------------------.

యువతా ఓ యువతా!
నవయుగపు నవత!!
విలాసాల ఒరవడిలో. విహరించే ఓ యువతా.
ఎటువైపు నీ పయనం.
ఎందుకోస మీవ్యసనం.
ధూమపాన శాలలో.
మద్యపాన మత్తులో.
మదించె నీ జీవితం.
కారాదోక గుణపాఠం.
యువతా ఓ యువతా!
నవయుగపు నవత!!
విషపు వలలో చిక్కి.
వివరించే నీ ప్రాయం.
దహించే అగ్నివనం.
కారాదోక కార్ఖాన.
మత్తు చేసే గమ్మత్తు.
ముందు నీ జీవితమే చిత్తు.
అందుకే!
మేలుకొ ఓ యువత!
కోరుకొ నీ భవిత!!

(ఈ కవిత నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు.)
25

.వీరాస్ కవి సమయము.
తేదీ:04-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:25.
శీర్షిక:అవమానవియ్య చర్య.
-------------------------------------.


కేరళ పాలక్కాడ్ లో అమానవీయ చర్య.
మానవత్వం మంటగలిసిన ప్రాంతం అది.
నిండు చూలాలైన మూగ జీవానికి.
అరణ్యరోదనను మిగిల్చిన ఘటన.
ఉన్మాదమే సిగ్గుపడేలా జరిగిన.
 పైశాచికత్వంపై సమాజం కన్నెర్ర చేసింది.
జాలి దయలేని నీచుల పై.
నిప్పుల వర్షం కురిపించింది.
కనికరం లేని కఠినాత్ములును .
కటకటాల పాలు చేయాల్సిందే.
సైలెంట్ వ్యాలీ అటవీ ప్రాంతంలో .
చక్కనైన చూడి ఏనుగు.
ఆకలికి తాళలేక అనాసపండు తినబోతే.
 ఆటంబాంబై ఆగంజేసే.
బాధను భరించలేక రోదనలుజేసే.
తన బాధను తీర్చే నాధునికై.
పరుగుదీసే వీధుల వెంబడి.
కాపాడేవారు లేక.
ముక్కుతూ మూలుగుతూ .
కృంగి కృశించిపోయి బాధకొర్చుకోలేక.
చల్లని నీటికై తహతహలాడి.
వేలియార్ నదిలో పడి నిమజ్జనమాయను.
పండు మాటున పొంచి ఉన్న.
 ప్రమాదాన్ని పసిగట్టలేకబలయిపోయేను  మూగజీవి.

( 27-05-2020 నాడు కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో సైలెంట్ వ్యాలీ అటవీ ప్రాంతంలో ఆడ ఏనుగు పై బాంబు దాడి విషాద ఘటన సందర్భంగా).
26

విరాస్ కవి సమయము.
తేదీ:05-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:26.
శీర్షిక: 'ఉద్యమ విద్యాలయం.'
---------------------------------------.       

వంద సంవత్సరాల క్రితం పుట్టింది పోరుబిడ్డ.
అనేక ఉద్యమ గాయాలను భరిస్తూనే.
ఎప్పటికప్పుడు నూతన చరిత్రను లిఖిస్తూ.
కొత్త తరాలకు విద్యార్థి ఉద్యమాలను.
అందిస్తున్న ఆదర్శ ఉద్యమ జీవి.
ఈ గడ్డపైన ఎంతో మంది అమరవీరుల .
ఆశయాలు రాజ్యమేలుతున్నాయి .
వాటిని సాధించాలని విద్య కుసుమాలు .
కుతకుతాని ఉడుకుతున్నాయి.
ఇక్కడ మరణించిన విద్యార్థులు వీర పుష్పాలుగా జన్మించి.
ఉద్యమ పరిమళాలను వెదజల్లుతూ.
నిరంతర ఉద్యమ చైతన్యాన్ని రగిలిస్తున్నాయి.
ఈ ప్రాంతంలో మొలిచిన గడ్డిపోచ సైతం.
విద్య వీర గ్రంథాలను పూసుకుని ఉద్యమిస్తుంది.
ఉస్మానియాలో వీచేగాలి పారే నీరు కూడా.
ఉద్యమ పాఠాలను బోధిస్తాయి.
తెలంగాణకె మకుటాయమానంగా.
హైదరాబాద్ నడిబొడ్డున ఉదయించిన ఉస్మానియా.
అలుపెరుగని విద్యా కిరణాలను ప్రసరిస్తూ. సమాజానికి ఒక  దిక్సూచిగా నిలబడింది.
అలలు ఎగిసిపడుతున్న ఉస్మానియా సాగరంలో. విద్యార్థి  ఎన్ని ఉద్యమ ప్రయాణాలు చేసినా.
చివరికి  సాగర తీరమనె పట్టాలు పుచ్చుకుని.
కొత్త ప్రయాణానికి సిద్ధమవుతారు.

 (ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా...)
27
వీరాస్ కవి సమయము.
తేదీ:06-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:27.
శీర్షిక:వార్త వేదిక.
-----------------------.

పొద్దు పొద్దునే వెచ్చని తేనీటితో పాటు .
 ప్రపంచ సమస్త సమాచారాన్ని.
మనముందుచుతున్న వార్తా వేదిక.
లోకంలో ఏ సంఘటన జరిగినా .
సమగ్ర సమాచారం.
అక్షరాల రూపంలో మన ముందు వాలుతుంది.
నిజాయితీకి నిలువెత్తు రూపంగా ఉండి .
వార్తా సేకరణలో పారదర్శకత పాటిస్తూ.
ఖచ్చితమైన సత్యాలను ప్రజల ముందుంచి.
వారిని చైతన్యపరుస్తుంది.
సమాజ నడవడికను ప్రతిబింబిస్తూ .
వ్యవస్థలో జరుగుతున్న దుర్మార్గాలను చిత్రించి. విలువైన ప్రశ్నలు సంధిస్తూ .
ప్రజలను అప్రమత్తం చేస్తుంది.
సామాన్య మానవునికి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ.
 ప్రజల గొంతు ప్రభుత్వానికి తెలిసేలా చేసి.
సమస్యలకు పరిష్కార మార్గంగా ఉంటుంది.
ప్రభుత్వం చేసే విచారణలో.
సాక్షాధారాలను ప్రత్యక్షంగా అందిస్తూ .
చట్టానికి సహకారమందిస్తుంది.
అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ .
అవినీతి కోరల్లో చిక్కుకున్న.
అధికారుల గుట్టు రట్టు చేస్తూ.
గల్లబట్టి నిలదీస్తుంది.
అటు విద్యార్ధులకి ఇటు వ్యాపారవేత్తలకి.
దిశానిర్దేశం చేస్తున్న ఏకైక సాధనం దినపత్రిక.


28
వీరాస్ కవి సమయము.
తేదీ:07-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:28.
శీర్షిక:సభా వేదిక.
---------------------------.

గద్దె మీద మైకులు మాట్లాడుతూ .
అనేక విషయాలను విశ్లేషిస్తూ .
ఆపరేషన్ చేసి కుట్లేస్తుంటాయి.
అదొక పవిత్రమైన స్థలం .
అక్కడ మేధావులు గొంతు చించుకుంటూ.
 తమ అంతరాల్లో దాగి ఉన్న.
 భావాలను తట్టి లేపుతూ .
తమదైన రీతిలో వివరిస్తూ .
అంశాన్ని పంచనామా చేస్తారు.
అదొక రంగస్థలం.
అక్కడ వాదోపవాదనల యుద్ధం జరుగుతుంటుంది.
అందులో ఎవరైనా పాల్గొనొచ్చు.
తమకు కలిగిన సంశయాలను.
అడిగి నివృత్తి చేసుకోవచ్చు.
వక్తలు తమ వెంట తెచ్చుకున్న.
అస్త్రాలను అక్కడ ప్రదర్శిస్తూ .
తమ నైపుణ్యాన్ని చాటుకుంటారు
మధ్య మధ్యలో సభాధ్యక్షుడు .
కోచ్ గా మారి సూచనలిస్తూ .
అవసరమైతే హెచ్చరిస్తూ .
సభా సమరాన్ని ముందుకు నడిపిస్తాడు.
సభ ముగింపు దశలో.
సన్మానాలే ఆశ్చర్యపోయేలా .
చప్పట్లు పొగడ్తలతో అలంకరిస్తూ .
నివేదికను వెల్లడిస్తారు....

(ఈ కవిత నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు).

29

వీరాస్ కవి సమయము.
తేదీ:08-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:29.
శీర్షిక:నిశ్శబ్దాలయం.
---------------------------.

అదొక నిశ్శబ్దాలయం.
అక్కడ పుస్తకాలే నిశ్శబ్దంగా మాట్లాడుతాయ్.
రెక్కలు కట్టుకుని ఎగురుతుంటాయ్.
పుస్తకాలలో ఉన్న విషయాలను మదించి. ఒక్కొక్కటిగా ఏరుకొని .
ట్రంకు పెట్టెలో దాచుకుంటారు.
అక్కడ ఉన్న వాళ్లంతా .
అడవిలో ఋషుల్లాగా మారి .
అక్షర తపస్సు చేస్తూ .
మెదడుకు పదును పెడుతూ .
జ్ఞానమనే వరాన్ని సంపాదించడం కోసం .
నిరీక్షిస్తూ వుంటారు.
మనసును కట్టి పడేసే ప్రాంతమది.
అడ్డదిడ్డంగా సంచరిస్తున్న.
ఆలోచనలను పట్టి బంధించి .
ప్రశాంత వాతావరణాన్ని కల్పించే .
నాలెడ్జ్ కేంద్రాలవి.
అందులోకి అడుగుపెట్టాలంటే.
పుస్తకాలే ఐడెంటిటీ కార్డులుగా ధరించి .
లక్ష్యాలపై సవారి చేస్తూ .
ఉన్నత స్థానాలకు చేరుకుని.
సమాజానికి సేవ చేసే .
ఉత్తములను తయారు చేసే .
కోచింగ్ సెంటర్లలవి.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు).
30

వీరాస్ కవి సమయము.
తేదీ:09-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:30.
శీర్షిక:మాస్క్ మంచిదే.
-------------------------------.

ఇవాళ  వ్యవస్థను మాస్క్ పాలిస్తుంది.
లోకంలో ఎక్కడ చూసినా  దాని మార్క్ కనిపిస్తుంది.
ప్రాణాయామంలో గాలిని బంధించినట్టుగా. మూతులను బంధించి .
లాక్ డౌన్ విధించింది.
మూతులకు గుడ్డ లేకపోతే.
సమాజం అనుమానపు చూపులతో .
గాయపరిచి అవహేళన చేస్తోంది.
రోడ్డు మీద కనిపించిన.
చెత్తంతా కడుపులో వెయ్యకుండా .
మోకాలడ్డు పెడుతుంది.
అనవసరమైన మాటలకు అడ్డుకట్ట వేస్తూ .
నిశ్శబ్ద లోకాన్ని సృష్టిస్తూ.
ఎడ్ల మూతులని శిక్కాలు బంధించినట్టుగా. మానవుల నోటిని బిగించింది.
మందిలో సంచరిస్తున్న మనుషులకి .
ఒక రక్షణ కవచంలా ఉండి.
మనోధైర్యాన్ని అందిస్తుంది.
స్వచ్ఛమైన గాలిని అందించే వృక్షంలా .
మానవ దేహాలకు సహాయపడుతుంది.
మాస్క్ లేని ప్రాణం .
గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతుంది.
దారిన పోయే దానయ్య కైనా .
మాస్క్ తప్పనిసరి.
అది ఉంటేనే సమాజం నిన్ను తిరిగనిస్తుంది.
 లేకుంటే చలానా విధిస్తుంది.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)......

31

వీరాస్ కవి సమయము.
తేదీ:10-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:31.
శీర్షిక:చినుకు
--------------------------.

అది మేఘాలపై సవారి చేస్తూ.
ఆకాశం నుండి దూసుకొచ్చే.
పవనంలా పరవసించి.
చల్లని కబురు అందిస్తుంది.
తొలకరి లో తొలి వేడుక చేస్తూ.
వేడికి మాడే జీవులకి.
ఊరట కలిగిస్తూ..
కొత్త కాలానికి తెర తీస్తుంది.
ఎండిన గొంతులతో బీటలు బారిన.
చెలకల దాహార్తిని తీర్చూతూ.
కొత్త మొలకలకి పురుడు పోసుతుంది.
దాని అలికిడికి మెల్కొన్న సమాజం.
ఏరువాక పనుల్లో తలమునకలై.
తనివితీరా తరించిపోతుంది.
మోడుబారిన హ్రుదయాలకు.
కొత్త చిగుళ్లు తొడిగేలా.
నూతనోత్సాహాన్ని అందిస్తూ.
ఆహ్లాదపరుస్తుంది.....
నువ్వుంటే లోకం గలగలాని గర్జిస్తుంది.
లేకుంటే కరువు కాటుకు విలవిలలాడుతుంది.....

(తొలకరి చినుకుల సందర్భంగా....)

(ఈ కవిత నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు.)

32

వీరాస్ కవి సమయము.
తేదీ:11-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:32.
శీర్షిక:ఏది ప్రామాణికం.
--------------------------------.

ప్రపంచంలో ఏది ప్రామాణికం.
సమాజంలో ఎక్కువ మంది .
తమ అవసరాల కోసం .
లేని ప్రేమను ఒలకబోస్తున్నారు.
అవసరం తీరిన తరువాత.
పట్టించుకోవటం మానేస్తున్నారు.
ఇక్కడ అవసరం ప్రామాణికమా?
అయితే నమ్మినవారి పరిస్థితేంటి?
కొద్ది మంది యువతీ యువకులు .
వలపు వలలో పడి.
కన్న ప్రేమను తిరస్కరిస్తున్నారు .
ఇందులో కన్న ప్రేమ కన్నా .
తమ సొంత  వలపు ప్రామాణికమా ?
మరీ  కన్న వారి పరిస్థితేంటి?
చాలామంది డబ్బు సంపాదించడం కోసం.
ఎదుటి వ్యక్తిని మోసం చేస్తున్నారు .
ఇక్కడ డబ్బు ప్రామాణికమా?
 మోసపోయిన వ్యక్తి పరిస్థితేంటి?
ఆస్తి అంతస్తులు కోసం .
అనుబంధాలను పణంగా పెడుతున్నారు.
అయితే ఆస్తి అంతస్తులు ప్రామాణికమా ?
మరి అనుబంధాల పరిస్థితేంటి?
సంఘంలో తమ పనుల దృష్ట్యా .
పొగడ్తను అస్త్రంగా ప్రయోగిస్తున్నారు.
ఇండ్ల పనులు ప్రామాణికమా?
ఇక్కడ వ్యక్తిత్వ పరిస్థితేంటి?
మనిషి!
ఏది ప్రామాణికమొ తెలుసుకోలేక.
అగాథంలో పడి అరణ్యరోదనలు చేస్తుండు.

(ఈ కవిత నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు.)
33

వీరాస్ కవి సమయము.
తేదీ:12-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:33.
శీర్షిక:జీవన పోరాటం.
-------------------------------.

అది జన్మించడానికి .
భూమిలో జీవన పోరాటం చేసి .
సమస్త శక్తిని కూడగట్టుకొని.
ఎన్నో ఆశలు ఆశయాలతో .
ప్రాణం పోసుకుని .
కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతుంది.
మన్నులో పుట్టీ పుట్టగానే.
 చినుకులతో సహవాసం చేసి .
ఎన్నో బాలారిష్టాలను దాటుకుంటూ .
ఆకాశానికి ఎదగాలని ఆత్రుత పడుతుంది.
ప్రతికూల పరిస్థితుల్లో .
ప్రకృతి శక్తులతో.
ఒంటరిపోరాటం చేస్తూ.
తన ఉనికిని ప్రపంచానికి చాటుతుంది.
మట్టిలో చీడలపై.
జీవన్మరణ పోరాటం చేస్తూ .
వాస్తవ పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ.
ఏ ఆధారం లేకుండానే .
తనకు తానే ఎదుగుతుంది.
ప్రకృతిలో తనదైన విధులు నిర్వర్తిస్తూనే.
అస్తిత్వ పోరాటం చేస్తూ .
సంపూర్ణమైన మొక్కగా నిలబడుతుంది....

(ఈ కవితా నా సొంత  రచన. ఇదే దేనికి అనువాదం కాదు)
34

వీరాస్ కవి సమయము.
తేదీ:13-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:34.
శీర్షిక:నేను - సహనం.
----------------------------------.

కాలమనే ప్రవాహం తన అలలతో .
నా జీవితం మీద పడి .
అనేక పరీక్షలకి గురి చేసినా.
చతికిల పడకుండా.
ధైర్యంగా ఎదిరించి .
సహనంతో ఎదురు నిలిచిన.
సమాజమనే చిలుకొయ్యకు.
నా ప్రాణం వేలాడుతుంది .
అది ఎప్పుడు వూడి పడుతుందోనని.
అనుక్షణం సహనంతో కాపుగాస్తున్న.
ప్రస్తుతమున్న వ్యాధులతో పాటు .
కరోనా కోరలు చాచి నరబలి కోరుతుంది .
దాని రక్తదాహానికి దొరకకుండా .
సహనంతో శాంతి పూజలు చేస్తున్న.
ప్రకృతి నన్ను సాధించడం కోసం .
అనేక అస్త్రాలను ప్రయోగిస్తుంది .
ఏ అస్త్రానికి దొరకకుండా తప్పించుకుంటూ.
సహనంతో అస్త్రసన్యాసం చేసిన వాణ్ణి.
సహనం అనే పరీక్షను .
నిరంతరం ఎదుర్కొంటున్న నిత్య విద్యార్థి నేను.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు).
35

వీరాస్ కవి సమయము.
తేదీ:14-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:35.
శీర్షిక:చెరిగిపోని సంతకం.
-----------------------------------.

మన జ్ఞాపకాలకి చిరునామాగా ఉంటూ .
నిలువెత్తు రూపానికి చిహ్నంగా ఉండి .
తరతరాలకు మన ఉనికిని అందించే .
ఛాయాచిత్రమది.
చరిత్రలో చెరిగిపోని సంతకం లా .
ఎప్పటికీ నిలిచి ఉండే శిలాశాసనంలా.
చిరకాలం నిలిచి ఉండే ఇతిహాసంలా.
వెలుగొందే వెలుగురేఖది.
మనసుకు నచ్చిన లొకేషన్ .
ఎప్పటికీ మన మదిలో .
నిలిచి ఉండే విధంగా .
సజీవచిత్రం రూపంలో.
 చిత్రితమైన జీవం పోసుకుంటుంది.
అది మనిషికి ప్రతీకగా నిలిచి.
 అన్ని అవసరాలకు సహాయపడుతూ.
ఆదరిస్తున్న ఆధార చిత్రమది.....

(ఈ కవితా నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు)

36.
వీరాస్ కవి సమయము.
తేదీ:16-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:36.
శీర్షిక:తెలుగు మన వెలుగు.
--------------------------------------.

తెలుగు మన వెలుగుల జిలుగు.
నుడికారాల సుడులు
మాండలికాల మడులు.
పదాల పలుకులు.
వెరసి మన తెలుగు.
క్రియలతో కీర్తిస్తూ .
ప్రక్రియలతో పలకరిస్తూ.
వెలిగి పోతుంది మన తెలుగు .
కవితలతో కమనీయంగా .
కథలతో కనువిందుగా.
రచనలతో రమణీయంగా.
అలరారుతుంది మన తెలుగు.
శిలాశాసనాలతో శిల్పకళా సంపదతో.
తాళపత్ర గ్రంథాలతో
ఉప్పొంగుతుంది మన తెలుగు.
తెలుగు మన వెలుగుల జిలుగు.

37.
వీరాస్ కవి సమయము.
తేదీ:17-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:37.
శీర్షిక:*ఆయనొక రథసారథి.*
---------------------------------------.

బరువైన బాధ్యతలను తలపై మోస్తూ/.
 ఐహిక సుఖాలను వదులుకొని/.
 ఇతరుల కోసం నిజాయితీగా కష్టించే త్యాగధనుడు/.
సమాజంలో ఎదురైనా ఆటుపోట్లకు/.
ఎదురీది ముందుకు నడుస్తూ/.
తన తోటలో కాసిన కాయల కోసం/.
తపన పడుతూ కాపు కాసే ఉత్తముడు/.
ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ/.
కుటుంబానికి రక్షణ కల్పిస్తూ/.
పగలు రాత్రి అనే తేడా లేకుండా/.
అనుబంధాలనే పైరును పండిస్తూ/.
ప్రేమానురాగాలనే దిగుబడిని సాధిస్తున్న కర్షకుడు/.
కష్టేఫలి అనే సూత్రానికి నిలువుటద్దం/.
ధైర్యానికి నిండైన రూపం/.
భరోసా కల్పించడంలో బలమైన బ్రాండ్ ఆయన/.
అతను  తనకంటూ ఏది దాచుకోడు/.
పంచి ఇవ్వడం లోనే ఆనందం వెతుక్కుంటూ/.
అవరోధ తీరాలలో సేద తీరుతుంటాడు/.
జీవితమనే  రణరంగంలో ఎలా పోరాడాలో చూపిస్తూ/.
కుటుంబ రథానికి  ఒక దిక్సూచిలా ఉండి/.
ధైర్యంగా ముందుకు నడుపుతున్న రథసారధి/.

38
వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:38.
శీర్షిక:పోరాట వీరుడు.
--------------------------------.

ఎముకలు కొరికే చలిలో.
దేశభక్తిని శ్వాసగా పిలుస్తూ .
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.
నిస్వార్ధంగా కాపుకాసే సేవకుడతను.
అతనొక నడుస్తున్న యుద్ధ ట్యాంకర్.
దేశానికి చిటారు కొమ్మలో ఉంటూ .
కాకులు దూరని కారడవిలో నడుస్తూ .
దేశం మొత్తాన్ని తన భుజాలపై మోస్తున్న యువరాజు.
యావత్ దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ .
దాయాది దేశాల నుండి ఎదురైన సవాళ్లను తిప్పికొడుతూ .
ప్రపంచ దేశాలకు బలమైన శక్తిని ప్రదర్శిస్తూ.
మనదేశ ఉనికిని కాపాడుతున్న పోరాట వీరుడు.
ప్రకృతి విపత్తులను ఎప్పటికప్పుడు ఎదుర్కుంటూ.
సరిహద్దు దేశాలు సంధిస్తున్న. వ్యూహప్రతివ్యూహాలు నుండి తప్పించుకుంటూ.
నిరంతరం నిఘా నేత్రంలా పని చేస్తాడు.
అనుకోకుండా వెన్నుపోటుకు బలౌవుతూ.
దేశానికి ప్రాణాన్ని అర్పిస్తాడు.
అతని  మరణం వృధా కాదు .
మరో వంద మంది సైనికులను తయారు చేస్తుంది.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)

39
వీరాస్ కవి సమయము.
తేదీ:18-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:39.
శీర్షిక:మాయని మచ్చ.
--------------------------------.

ఆసిఫా పై జరిగిన దాడి.
నీచాతి నీచమైన హేయమైన.
ఒక అమానవీయ ఆటవిక చర్య.
ఈ చర్య జరిగింది ఒక పసిమొగ్గపై కాదు .
నా దేశ సంస్కృతి పై జరిగిన దాడి.
అది నా దేశ గుండెలపై మాయని మచ్చ.
ఈ మచ్చ ఇప్పటికీ మిగిలే ఉంటుంది.
మతోన్మాద దురహంకారపూరిత చర్య.
వెరసి అసిఫా చెల్లి పై అఘాయిత్యం.
గుర్రాల సాక్షిగా దేవుని సమక్షంలో.
జరిగిన ఈ పశు వాంఛను.
ఏ సమాజం అంగీకరిస్తుంది?.
ఆ తల్లి కడుపు కోత కి తండ్రి రోదన కు.
ఈ దేశం సమాధానం చెబుతుందా?
ఇకనైనా ఈ దేశం మేల్కొని .
ఇలాంటి చీడపురుగులను ఏరి పారేస్తుందా?
రండి !మేధావులారా!!
ఈ మతోన్మాదుల కు శిక్షపడే వరకూ .
మీ కలాలకు గళాలకు పని చెప్పండి.
అసిఫా చెల్లి ఆత్మకు శాంతి చేకూర్చండి.

(కాశ్మీర్ లో అసిఫా అనే పాప పై జరిగిన లైంగిక దాడి దుర్ఘటన సందర్భంగా రాసిన కవిత)

40
వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:40.
శీర్షిక:జాండ్ల బాయి.
----------------------------.

జాండ్ల బాయి పొలానికి నీటిని అందిస్తూ.
ఎల్లప్పుడూ నిండుగా సంతృప్తికరంగా కనిపిస్తూ.
పుట్లకు పుట్లు వడ్లు పండిస్తూ .
రైతు పక్షపాతిగా పేరుగాంచింది.
ఎండాకాలం వచ్చిందంటే చాలు .
నీటి సమస్యతో బాధపడుతున్నా .
మా ఊరిని ఆదుకుని అక్కున చేర్చుకునేది.
వేసవి తాపానికి తాళలేక .
విహంగాలు దాని ఒడ్డున సేదతీరేవి.
పిల్లలంతా వేసవిలో ఈతలు కొడుతుంటే .
కోనేరులో మునుగుతున్న భక్తులాగా కనిపించే వారు.
మిత్రులమంతా కలిసి ముంజలు తిని .
పోటీపడి మరీ ఈతలు కొట్టేవారం.
అన్ని విధాలుగా మాకు ఆశ్రయమిచ్చిన జాండ్లబాయి.
ఇవాళ దాని ఉనికె లేకుండా పోయింది.
ఆధునిక ప్రపంచంలో .
భూమికి విలువ పెరగడంతో .
చెరువు కబ్జా గురై నీల్లింకిపోవడంతో.
జాండ్లబాయి కూడా తన అస్తిత్వాన్ని .
కొద్దికొద్దిగా కోల్పోతూ .
బోర్ల రాకతో పూర్తిగా ఎండిపోయి .
నోరు తెరిచిన బీడు భూమిలా మారి.
బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంది.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)


41
వీరాస్ కవి సమయము.
తేదీ:19-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:41.
శీర్షిక:**అనుబంధాల వారది.*
---------------------------------------.


బాధ్యతల మధ్య బందీ అయి.
 బరువైన బంధాలను మోస్తూ.
 అదనంగా అనుబంధాల తోటను పెంచుతూ.
 అనునిత్యం కాపు కాసే తోటమాలి.
వంశమనె వట వృక్షానికి.
 కాసిన కాయల కోసం పూసిన పువ్వుల కోసం.
అనేక కష్టాలను భరిస్తూ.
కాయకష్టం చేసే కర్షకుడు.
తన మదిలో పూచిన కోరికలు.
ఒక్కొక్కటిగా రాలిపోతుంటే.
ఏరుకొని మదిలో దాచుకొని.
మదనపడే మనసున్న మహారాజు.
తరతరాలుగా వస్తున్న వంశాచారాలను మోస్తూ.
ముందు తరాలకు ఆ బాధ్యతలని అందిస్తూ. అందరికీ మార్గదర్శకంగా ఉంటున్న మహా మనిషి.
కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ.
 కుటుంబ సభ్యులకొక దారి చూపిస్తూ .
అందరి తలలో నాలుకలా ఉంటూ .
చిరునవ్వు అనే అమృతాన్ని అందరికీ పంచుతున్న.
 పేదరాశి పెదనాన్న ఆయన..


42
వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:42.
శీర్షిక:*జ్ఞాన దీపం.*
--------------------------.

అది  విద్యా వ్యవస్థను మేల్కొలిపే వేగుచుక్క.
లోకానికి వెలుగును పంచే సూర్యునిలా .
తన కీర్తి పతాకాన్ని .
భారత గగనసీమలో ఎగిరేలా.
ఘనకీర్తి సాధించింది.
యావత్ విద్యార్థి లోకానికి.
దేశభక్తిని ప్రబోధిస్తూ రాసిన ప్రతిజ్ఞ .
దేశంలో ప్రతి వ్యక్తి గుండెల్లో .
శిలాక్షరాలతో లిఖించబడి.
గొప్ప శాసనంగా విరాజిల్లుతోంది.
అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న .
విద్యార్థి లోకానికి విలువలనే.
వెలుగును పంచుతున్న జ్ఞానదీపమది.
ప్రతిజ్ఞ నుండి ఒలికిన పదాలు .
తరతరాలకు తరలిపోతున్న తంతుని చూసి.
దేశం పులకరించిపోతుంది.
వెలకట్టలేని పదునైనా.
పదాల తోరణమే ప్రతిజ్ఞ....

(జూన్ 10 పైడిమర్రి గారి జయంతి సందర్భంగా...)
43
[20/06, 9:52 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:20-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:43.
శీర్షిక:మాయదారి డ్రాగన్.
------------------------------------.

నిరంతరం కుళ్ళు కుతంత్రాలతో కత్తులు నూరుతూ.
సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతూ.
ప్రపంచాన్ని ఏలాలనే దురాశతో.
దుర్మార్గపు చర్యలకు పాల్పడుతూ .
విలువల్లేని శాంతి ప్రవచనాలను వల్లవేస్తూ.
ఇవాళ వెన్నుపోట్లకి చిరునామాగా మారింది.
పరాయి దేశాలలో వ్యాపారం చేసుకుంటూ .
ఆ దేశాల సరిహద్దులనే కబళించాలనే దురుద్దేశంతో.
కవ్వింపు చర్యలకు దిగుతూ.
ప్రాణాలకు మరణ శాసనం రాస్తూ.
దుష్టబుద్ధిని నిరూపించుకుంటుంది.
ఊహలకే అందకుండా వూహాన్ లో.
మాయదారి కరోనాను ఉత్పత్తి చేసి .
 ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసి.
పైశాచికానందాన్ని పొందుతుంది.
మాయదారి డ్రాగన్ కు పోగాలం దాపరిచి.
 ఈ దుష్ట విన్యాసాలకు తెరతీసింది.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
44
[20/06, 5:51 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:44.
శీర్షిక:ప్రజా ఓడ.
---------------------------.

మానవ జీవన ప్రస్థానంలో .
అది ఒక వజ్రాయుధంగా వెలిగిపోతూ .
మనమెక్కుపెట్టిన చోటికి దూసుకుపోతూ .
కాగల కార్యాన్ని తీర్చగలదు.
దానిపై సవారీ చేస్తున్న.
ప్రతి వ్యక్తిని కంటికి రెప్పలా కాపాడుతూ .
చిన్నా పెద్ద అనే తేడా లేకుండా.
అందరినీ ఒకే చోట కట్టిపడేసే ప్రజా ఓడది.
దూరం ఎంతైనా భారం లేకుండా .
దూర తీరాలతో సహవాసం చేస్తూ .
రెక్కలు కట్టుకుని ఎగిరిపోతూ.
అనుకోని అతిథిలా దర్శనమిస్తుంది.
గరుడ వజ్ర ఇంద్ర పేరేదైనా కావచ్చు .
సమాజమనే ఇసుకతెన్నెలపై పరుగులు తీస్తూ.
ప్రజా రవాణాను సరఫరా చేస్తూ.
దూరాన్ని తగ్గించి సమయాన్ని ఆదా చేస్తుంది.
మానవ జీవన ప్రయాణంలో .
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా .
చెక్కుచెదరకుండా ఆపద్బధువుగా మారి. గమ్యస్థానానికి చేరవేసే శకటమది.
ప్రయాణ ప్రాంగణమే తన కుటీరంగా.
ప్రయాణికులే తన పిల్లలుగా భావించి .
ఒడిలోకి తీసుకుని లాలించి పాలించి.
అవసరాలను అరుసుకునే పుష్పక విమానమది.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)
45
[21/06, 9:23 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:21-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:45.
శీర్షిక:టి -- అడ్డా.
-------------------------.

మిత్రులంతా కలిసి ముచ్చట్లలో మునిగితేలుతూ.
అడ్డ మీద కులోలలెక్క నిలబడి.
వెచ్చని అమృతాన్ని గుటకలేస్తుంటే .
ఒత్తిడి వదిలి నరాలలో రక్తం .
నూతనోత్సాహంతో ఉరకలేసేది.
మాటల్లో చెప్పలేని మధురానుభూతి .
మనస్సును ఉక్కిరిబిక్కిరి చేసి గిలిగింతలు పెట్టేది.
సాయంత్రం అయ్యిందంటే చాలు .
గూటికి చేరిన గువ్వలెక్క.
అందరం అడ్డ మీద చేరిపోయేవాళ్ళం.
వచ్చి పోయే వాళ్ళని పలకరిస్తూ .
నానా హంగామా చేసే వాళ్ళం .
కానీ!
ప్రస్తుతం కరోనా పుణ్యమాని.
అడ్డా బోసిపోయి కనిపిస్తుంది .
మునపటి సందడి కనిపిస్తలేదు .
అడ్డ మీద అమృతం అంతరించిపోగానే.
సహవాస గాళ్ళమంతా అజ్ఞాతవాసం చేస్తున్న.
కోడి పిల్లల్లా చెల్లాచెదురైనం.
అడ్డ మీద జ్ఞాపకాలు నెమరేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాం.
నిద్రలో అడ్డ గుర్తుకొస్తే .
ఒళ్లంతా వేడిక్కి ఉలిక్కిపడుతున్నా.
ముసుగులో తిరుగుతున్న కరోనాకు భయపడి.
అడ్డాలనీ మూలకు దాక్కున్నాయి.
వాటి మనసు మళ్ళీ ఎప్పుడు వికసిస్తుందో.
వేచి చూడాల్సిందే.........

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
46
[21/06, 12:29 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:46.
శీర్షిక:యుద్ధ వాతావరణం.
--------------------------------------.

రెండు దేశాల్లో యుద్ధ మేఘాలు.
 భీకరంగా కమ్ముకొని ఉరుముతున్నాయి.
యుద్ధ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో.
అర్థంకాక సరిహద్దు ప్రజలు తలలు పట్టుకుని. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
రెండు దేశాల మధ్య ఉన్న శాంతి ఒప్పందాలనే పవనాలు .
యుద్ధమేఘాలు తోసేస్తున్నాయి .
ఒకపక్క చర్చలు మరోపక్క ఉరుములు మెరుపులు.
వాతావరణం గంటగంటకు మారుతూ .
పరిస్థితులు చేదాటి పోతున్నాయి.
ఒక దేశానిది ఆధిపత్యహంకారమైతే.
మరో దేశానిది సార్వభౌమారాటం.
రెండు దేశాలు మాటల తూటాలను పేల్చుతూ. మనుషుల మనసులను చిద్రం చేస్తున్నాయి.
ఇరుదేశాలు కయ్యానికి కాలు దువ్వుతూ .
వందల కోట్లు ఖర్చు చేస్తూ .
ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నాయి.
ప్రజల మనసులలో నెలకొన్న భయాందోళనలను.
రెట్టింపు చేసేలా యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నాయి.
యుద్ధ మేఘాలు కురిసే వర్షం లో ఎంతమంది తడిసి ముద్దౌవాలనో?
ఈ మేఘాలు శాంతించాలంటే రక్తతర్పణం తప్పదేమో.
ప్రపంచ శాంతి దూతలారా! మేల్కొండి .
జరగబోయే వినాశనాని ఆపండి .
దౌత్యపరమైన ఆలోచనలతో ముందుకు రండి.....

(ఈ కవితా నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)
47
[23/06, 10:26 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:23-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:47.
శీర్షిక:శరీర ధర్మం.
------------------------.

అది ఒక నికార్సయిన పరిశ్రమ.
అందులో నిరంతరం క్రియలు జరుగుతూనే ఉంటాయి .
ఏది అదుపుతప్పిన సమన్వయం చేసుకుని. సమూహంగా బతుకుజట్కాబండిని.
ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయి.
దేహమనే నివాసంలోకి వస్తున్నా.
ఏ అతిథినైనా క్షుణ్నంగా తనిఖీ చేస్తూ.
ఆహ్వానం పలుకుతూ అనుమతులు మంజూరు చేస్తూ .
నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది.
శత్రుమూకలు చేసే దాడులతో .
అనుక్షణం అలుపెరుగని పోరాటం చేస్తూ.
పట్టుదలతో శక్తిని కూడగట్టుకొని .
రోజువారి పనులలో తలమునకలై ఉంటుంది.
బాహ్యంగా తగిలే దెబ్బలకు .
సొంతంగా చికిత్స చేసుకుంటూ .
ఎప్పటికప్పుడు తన పరివారాన్ని కాపాడుకుంటూ. వాటికి మనోధైర్యాన్ని అందిస్తుంది.
అప్పుడప్పుడు అలసిపోయి విశ్రాంతిని కోరుకుంటూ .
శరీర ధర్మాన్ని పాటిస్తుంది.

(ఈ కవిత నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)
48
[23/06, 5:38 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:48.
శీర్షిక:ప్రేమ వృక్షం.
--------------------------.

అది ఒక ప్రసిద్ధమైన ప్రేమ వృక్షం.
అక్కడ నిరంతరం ప్రేమ పక్షులు .
కబుర్లతో కాలక్షేపం చేస్తుంటాయి.
మనసులో ఉన్న భావాలు బయటికి వచ్చి .
అక్కడ యదేచ్ఛగా ఎగురుతుంటాయి .
ప్రేమికులు చేసే వాగ్దానాలకు మూగసాక్షిగా ఉంటూ.
పిల్లగాలులను విసురుతూ .
ప్రేమ వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రేమికులను దగ్గర చేస్తుంది.
ఆ చెట్టు నిత్యం వచ్చిపోయే.
ప్రేమ జంటలతో కలకలలాడుతుండేది.
ప్రేమ విహంగాలు ఎప్పుడు కలుసుకోవాలన్న.
ఆ చెట్టు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది.
ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు .
ప్రేమజంటల సందడితో చెట్టుకు ఊపిరాడేది కాదు.
బాహ్యంగా దానికి మరణమున్నా.
ఎంతోమంది ప్రేమికుల జ్ఞాపకాలలో   ప్రేమ వృక్షంగా.
ఎప్పటికీ సజీవంగా నిలిచే ఉంటుంది....

(కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రసిద్ధమైన ప్రేమ వృక్షం గురించి).......

(కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
49
[24/06, 1:11 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:24-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:49.
శీర్షిక:కర్షక నేస్తాలు .
---------------------------.

అవి ఈ కష్టానికి ప్రతిరూపాలుగా.
సహనానికి పర్యాయపదాలుగా కనిపించేవి.
రోజంతా బండెడు చాకిరీ చేసి .
ఒళ్లంతా కాయలు కాసినా .
కాళ్లు మెత్తబడి ఇబ్బంది పెడుతున్నా .
మౌనంగా భరిస్తూ శాంతంగా కనిపించేవి.
వాటి కోపం తీరంలో వాయుగుండంలా ఉండేది.
రంకేసి కాలు దువ్విదంటే.
వాటిని ఆపడం ఎవరి తరమయ్యేది కాదు.
రైతులకు చేదోడువాదోడుగా ఉంటూ .
వారి కష్టాలలో పాలు పంచుకొని.
కర్షక నేస్తాలుగా పేరుగాంచి.
పొలాల అమావాస్య రోజు పూజలందుకుంటూ.
ప్రత్యక్ష దైవాలుగా పరవశించిపోయేవి.
కష్టాన్ని తన జీవిత పరమార్ధంగా మార్చుకున్న. మూగ జీవుల ఉనికి .
నేడు ప్రశ్నార్థకంగా మారిపోయింది.
చరిత్రకలో సజీవ సాక్ష్యాలుగా నిలిచిపోయాయి.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)
50
[24/06, 3:26 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:50.
శీర్షిక: లై(ly).
------------------------.

నమ్మిన వ్యక్తిని నట్టేట ముంచుతూ.
విశ్వాసం సడుగులు విడగొడుతూ .
అనుకున్న కార్యం కోసం.
ఎంత దూరమైనా వెళ్లడానికి వెనకాడని .
విలువల్లేని వ్యక్తిత్వం దానిది.
అది కలియుగాన్ని వామపాదంలా ఆక్రమిస్తూ. స్వచ్ఛమైన సత్యాన్ని సమాధి చేస్తుంది.
మనిషి జీవితాన్ని అపహాస్యం చేస్తూ .
వ్యక్తుల మధ్య వివాదాలు సృష్టిస్తూ .
కోరలు చాచి వికటాట్టహాసం చేస్తోంది.
దానికి ఆకలి ఎక్కువ .
దయాదాక్షిణ్యాలు చూడకుండా.
ఎంతమందినైనా దహించడానికి వెనుకాడదు.
ఆలుమగల మధ్య గిల్లికజ్జాలు పెడుతూ.
అన్నదమ్ముల ఆప్యాయతలను తుంచేస్తూ.
సకుటుంబాలను లాగి రోడ్డుమీద పడేస్తున్న.
నిలకడలేని పలుకది.
ఆధునిక యుగంలో జీవించాలంటే .
లై అనే గ్రీన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి .
లేదంటే సమాజం నిన్ను చిన్నచూపు చూస్తుంది.

(ఈ కవిత  నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు).
51
[25/06, 9:15 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:25-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:51.
శీర్షిక:బతుకు  ఎట్లుండాలంటే!!.
------------------------------------.

ఆప్యాయతానుబంధాలు నిలిచి ఉండేలా.
ప్రేమను పంచి చేయందించాలి.
ఉన్నతమైన ఆలోచనలు కలిగి.
నాలుగు కాలాలపాటు నిలిచిపోయేలా సత్కార్యాలు చేయాలి.
అడిగిన వారికి చేతనైనంత సహాయం చేస్తూ.
ఉన్న దాంట్లో సంతృప్తికరంగా బతకాలి.
నీ కీర్తి ఆకాశాన్ని తాకుతున్న .
హిమాలయ పర్వతాల్లా ఉండాలి.
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మేరుపర్వతంలాగా.
చెలించకుండా ఎదురు నిలవాలి.
జీవితంలో కుడిఎడమలను బేరీజు వేసుకుంటూ. హంసలాగా బతకాలి.
నీకై జీవిత లక్ష్యముండాలి.
దాన్ని సాధించే సహనం పట్టుదల ఉండాలి.
జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగూ .
మనసులో నుండి వచ్చే ప్రతి మాట .
ఆదర్శంగా అర్థవంతంగా ఉండాలి .
అప్పుడే జీవితం పండుతుంది.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దీనికి అనువాదం కాదు)
52
వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:54.
శీర్షిక:కథకులు.
----------------------.


ఒకప్పుడు వారు ప్రజాదరణ కలిగి .
తన నటనతో ప్రజలను రంజింపజేసేవారు.
మొహానికి రంగులు పూసుకుని విచిత్ర వేషధారణలో.
చిత్రవిచిత్రమైన పదాల గారడీతో .
సన్నివేశానికి తగ్గట్టు హావభావాలు ప్రదర్శిస్తూ.
వీక్షకులను ఆనంద డోలికల్లో ఓలలాడించేవారు.
చీకటి పడిందంటే చాలు .
వింతైన శబ్దాలతో కథనాన్ని ప్రారంభించి .
ఆసాంతం పలుకులతో చిందేస్తూ.
మధ్యమధ్యలో అదిరిస్తూ బెదిరిస్తూ ఉత్సాహం అందించేవారు.
పూర్వకాలంలో ఉన్న విజ్ఞాన భాండాగారాలను.
చదివి ఆకళింపు చేసుకుని.
కాచి వడపోసిన స్వచ్ఛమైన కథనాలను.
కమనీయంగా మనకందించేవారు.
వారికి పాత్రలో ఒదిగిపోయి నటించడమే తెలుసు. వాస్తవజీవితంలో పొట్టకూటికోసం.
ఎలా నటించాలో తెలియని జీవితాలు వారివి.
ఆధునిక కాలంలో ఆదరణ లేక .
కథలన్నీ కంచికి చేరినట్లుగా.
కథకులు కనిపించకుండా పోయి.
కథనాలు కాలగర్భంలోకి జారుకున్నాయి.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)

53

వీరాస్ కవి సమయము.
తేదీ:26-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:53.
శీర్షిక:కల్తీగాళ్లు.
------------------------.

ఇవాళ యాడ చూసినా కల్తీగాళ్లు కాలర్ ఎగరేస్తూ.
కలికాలాన్ని కాస్త కల్తీకాలంగా మార్చి.
ప్రపంచాన్ని కలుషితం చేస్తున్నారు.
వారు వ్యవస్థలన్నింటిలో తమ చేతివాటం ప్రదర్శిస్తూ.
మానవ దేహాన్ని వ్యాధులకు నిలయంగా మారుస్తూ.
ఆరోగ్యాన్ని  అగాధంలోకి నెడుతున్నారు.
కల్తీకంత్రీలు చేసే అకృత్యాలకు అంతు లేకుండాపోతోంది.
సంపాదన యావలో పడి.
తమ జీవితానికి తామే తెరదించుకుంటూ.
కొద్దికొద్దిగా ఊబిలో కూరుకుపోతున్నారు.
స్వచ్ఛమైన సరుకులు కల్తీ చేసి.
వాటి సహజత్వానికి చరమగీతం పాడుతూ.
మానవ ఆయుః ప్రమాణాన్ని తగ్గిస్తున్న సామాజిక హంతకులు.
పసిపిల్లల నోటికాడి ఆరోగ్యాన్ని లాగేసుకుంటూ.
రుగ్మతల విషవలయంలోకి.
బలవంతంగా నెట్టేస్తున్న దుర్మార్గులు.
మచ్చుకైనా మానవత్వం లేని కేటుగాళ్లు.

(ఈ కవిత నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
54
[27/06, 10:00 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:52.
శీర్షిక:వివాహ వేడుక.
--------------------------------.

అక్కడ పండుగ వాతావరణం నెలకొని.
వచ్చిపోయే బంధుమిత్రులతో ఇల్లు కళకళలాడుతుంటుంది.
అది ఆనందలోగిళ్లను కలిగి .
మాటల్లో చెప్పలేని మధురానుభూతిని కలిగించే. ప్రశాంతమైన పొదరిల్లులా కనిపిస్తుంది.
పచ్చని పందిళ్ల సాక్షిగా .
రెండు మనసులని ముడివేయడానికి. మేళతాళాలతో బాసింగాలు కట్టి .
పవిత్రమైన వేద ప్రవచనాలతో .
పెద్దల ముందు పాణిగ్రహం చేయిస్తూ .
జీవితాంతం కలిసుండేలా బాసలు చేయిస్తారు.
పెద్దలు మెచ్చి నచ్చిన ముహూర్తానికి .
పవిత్రమైన పసుపుతాడు కట్టిస్తూ .
జీవితానికి ఇది బలమైన బంధమని వివరిస్తూ.
ఓ ఇంటివారిని చేస్తారు.
వేడుకకొచ్చిన సపరివార బంధుమిత్రులందరికీ.
పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తూ .
తాంబూలాలు అందించి ఆశీర్వచనాలు అందుకుంటారు.
వేడుక చివర్లో కొత్త దంపతులతో .
బంధుమిత్రులంతా కలిసి ఉత్సాహంగా ఊరేగుతూ .
ఒకరికొకరు అలయ్ బలయ్ తీసుకుని .
ఆనందంగా తిరుగు ప్రయాణమవుతారు.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
55
[27/06, 3:10 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:27-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:55.
శీర్షిక:దగాకీయాలు.
----------------------------.

ఒకప్పుడవి ప్రజాదరణ కలిగి .
రాజసంగా చేసే ప్రజాకీయాలు రాజకీయాలు.
అవి తమ విలువైన సమయాన్ని .
నిరంతరం ప్రజా సమస్యల చర్చలకు కేటాయిస్తూ. ప్రజలందరికీ చేరువలో ఉంటూ.
ఆదర్శ ప్రజాస్వామ్యాన్ని తయారు చేసేవి.
రానురాను రాజకీయాలలో స్వార్ధం పెరిగి.
విలువలు పతనమై వ్యక్తిత్వాన్ని కోల్పోయి. రాజకీయాలు కాస్త దగాకీయాలుగా మారిపోయాయి.
వ్యక్తుల కుమ్ములాటలకు కొమ్ము కాస్తూ.
ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ .
అధికారం కోసం అర్రులు చాచుతూ.
బూటకపు వాగ్దానాలకు చేస్తూ పతనావస్థకు చేరుకుంది.
వాటికి ధనమే ఇంధనం .
దాన్ని ఆయుధంగా వాడుకొని .
సంతలో పశువులు అనుకున్నట్లు అభ్యర్థులను కొని .
నిజాయితీని గాటికి కట్టేసాయి.
రోజురోజుకీ అవినీతి బురద లో కూరుకుపోతూ.
ప్రజా విశ్వాసం కోల్పోతూ.
ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోయింది.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)
56
[27/06, 7:24 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:56.
శీర్షిక:పచ్చని పండుగ.
-----------------------------.

భూగోళానికి చిలక పచ్చని పైట కప్పడానికి.
మెడలో  హరితహారం వెయ్యడానికి.
ప్రకృతికి కమనీయమైన శోభను అందించడానికి.
పచ్చని ఉద్యమమొకటి బయలుదేరింది.
ఆ ఉద్యమానికి కేంద్రబిందువు తెలంగాణ.
పచ్చని చెట్లతో పందిరి వేసి.
స్వచ్ఛమైన గాలులతో తోరణాలు కట్టి.
వర్షాలతో ముగ్గులు వేస్తూ.
పచ్చని పండగ వాతావరణంలో.
రాష్ట్రం తడిసి ముద్దవుతుంది.
ఊరూరా వందల చెట్లు ప్రాణం పోసుకుంటూ.
కాలుష్యంతో యుద్ధం చెయ్యడానికి .
వర్షాలతో వాగులు నింపడానికి .
ప్రపంచానికి మేఘసందేశం పంపిస్తుంది.
మేఘాల మెడలు వంచి.
వర్షాలను తమ కనుసైగలతో శాసిస్తాయి.
చెట్టు ఎన్నో బతుకులకు ఆశ్రయమిస్తూ .
బతుకు వనాలను సృష్టిస్తూ .
ప్రపంచానికి భరోసా కల్పిస్తుంది.
పచ్చని ప్రకృతి ఒడిలో .
ప్రతి వ్యక్తి ఊయలలూగలనే.
హరితహార లక్ష్యం......

(ఈ కవిత నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)

57
[28/06, 8:31 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:28-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:57.
శీర్షిక:వలపు.
--------------------.

వలపు వలపు అంటూ.
హరించే ఓ యువత .
వలపు వలలో చిక్కి .
విలవిలలాడే వింత చెేపవు కదా.
వలువలు లేని వలపుకు .
విలువ లేదు కదా.
విలువలున్న వలపు వివాహమే కదా.
వలచి విలపించుట కంటే .
వివాహం మేలు కదా .
వివాహానంతర వలపు .
విపులాంగీకారమే కదా.
వివాహానంతరం.
విరామమున్న వలపులో .
విరహమే విషయం కదా.
విరహ విషయం తీరాలంటే .
వలపు మలపులో విహరించాలి కదా.

('వ'తో చేసిన ప్రయోగం.నా సొంత రచన.)
58
[28/06, 10:34 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:58.
శీర్షిక:*చిన్నారి తల్లులు.*
--------------------------------.

సమాజం ఒక నిర్బంధకాండ.
అది మనుషుల మధ్య అంతరాలను సృష్టిస్తూ.
లింగభేద గోడలను కడుతుంది.
సామాజిక కట్టుబాట్ల పేరిట  గుండం గీసి.
అందులో స్త్రీలను ఆడిస్తూ .
సమాజం పైశాచికానందాన్ని పొందుతుంది.
వ్యవస్థలో దైవ స్వరూపాలుగా చూడాల్సిన.
చిన్నారి తల్లులు వివక్షకు గురవుతున్నారు.
మనుషులలో కొందరి చూపు మరికొందరి చేతలు.
రాక్షసంగా మారి వేధింపులకు గురి చేస్తున్నాయి.
కంచే చేను మేసిందన్న చందంగా .
సొంతవారే వెకిలి చేష్టలకు దిగితే.
ఆ తల్లులు ఎవరికి మొర పెట్టుకోవాలి.
సుకుమారమైన మాటలతో .
ఆనంద వనాలను పూయిస్తున్న చిట్టి తల్లులకు.
నేడు రక్షణ కరువై .
పంజరంలో పక్షుల్లా విలవిలలాడుతూ ఇంటికే పరిమితమవుతున్నారు.
స్వేచ్ఛగా ఎదగాల్సిన వారి మనసులు .
అనుక్షణం భయంతో కొట్టుమిట్టాడుతూ .
అభద్రత భావానికి లోనవుతున్నారు.
బంగారు తల్లుల భవిత బాగుండాలంటే.  మగసమాజానికి దూరంగా పెంచాల్సిందేనేమో!!

(ఈ కవిత నా సొంత రచన....
ఇది దేనికి అనువాదం కాదు...)
59

వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:59.
శీర్షిక:గర్భగుడి.
------------------------.

కోడికూతలతోనే మేల్కొంటూ .
కమనీయమైన తేనీటిని అందిస్తూ .
మానవ దేహాలపై పూనిన బద్దకాన్ని వదిలిస్తూ .
తన మార్కును చూపిస్తుంది.
నిత్యం విజిల్ శబ్దాలతో.
గుమగుమలాడే సువాసనలతో విలసిల్లుతూ.
అందరి ఆకలి తీర్చే అక్షయపాత్రది.
అక్కడ అన్నం పరబ్రహ్మ స్వరూపంగా .
రూపుదాల్చి ఉగ్రంగా మారి .
అంతట నిండిన ఆకలిని సంహరిస్తుంది.
ఆ గదిని పాలించేది అమ్మ అయినా .
దానికి కోశాధికారి నాన్న.
ఆమె చెప్పిన వంటలే అక్కడ సంచరిస్తూ.
అందర్నీ ఊరిస్తూ ఊరకలేస్థాయి.
ఎవరికి ఏది కావాలన్నా అమ్మ అనుమతితో .
ఆ గదికి దరఖాస్తు చేసుకోవాలి.
కాలే కడుపులకు కన్నతల్లి .
మాడే పేగులకు కల్పవల్లి .
అన్నపూర్ణ అవతారంగా .
దర్శనమిస్తున్న పవిత్రమైన గర్భగుడది.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)
60

[30/06, 9:23 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:30-06-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:60.
శీర్షిక:పార్థివదేహం.
----------------------------.

అది జీవులకు శాశ్వత నిద్ర.
ఆ నిద్రలో ప్రసన్నమైన వదనంతో .
సమాజానికి ఒక సందేశమిస్తూ .
సహచరులందరిని శోకసంద్రంలో ముంచి.
ఒంటరి ప్రయాణాన్ని సాగిస్తుంది.
జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసినా .
ఎంత దూరం ప్రయాణించినా .
చివరికి మృత్యుకౌగిలిలో బంధీఐ.
స్మశానానికి యాత్ర చేయవలసిందే.
దానికి స్మశానమే ఆవాసం .
బోలుప్యాలాలే మిత్రులుగా మారి .
మహాప్రయాణానికి దారి చూపిస్తాయి.
అందరూ చివరి చూపు చూస్తూ.
పూలమాలలతో అభిమానం చూపిస్తూ.
మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ.
దారి మధ్యలో దింపుడుగల్లాల చేస్తూ .
ఘనంగా వీడ్కోలు పలుకుతూ .
దహనసంస్కారాలు చేసి .
బరువైన గుండెలతో వెను తిరుగుతారు.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)
[30/06, 11:51 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:61.
శీర్షిక:అదృశ్య రంగం.
------------------------------.

అంతరంగం అదొక అదృశ్య రంగం .
అది ఎవరికీ కనిపించని అందమైన నందనవనం.
అందులో ఆశయాలు తుమ్మెదల వలే సంచరిస్తూ.
వాటిని సాధించాలనే కసరత్తు జరుగుతుంది.
అక్కడ అనేక యుద్ధాలు .
తెలివిగా కత్తులు లేకుండానే జరుగుతుంటాయి.
నెత్తురు చిందకుండానే విజయం సాధిస్తారు.
అనేక మంది సైనికులు రణరంగంలో పాగా వేసి. మస్తిష్కాన్ని తొలిచేస్తూ .
విలువైన సమయాన్ని తింటూ .
తమ ఆకలి తీర్చుకుంటుంది.
మనిషి దీర్ఘాలోచన ద్వారా .
తనలోకి ప్రయాణింపజేస్తూ .
సుప్తావస్థలో ఉన్న కప్పలాగా మార్చి.
కదలకుండా కనుమరుగయ్యేలా  చేస్తుంది.
వింతలు విశేషాలు వికృత చేష్టలకు .
అది కేంద్రస్థానంగా ఉండి .
మనుషుల మనసులను శాసిస్తుంది.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
[01/07, 6:20 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:01-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:62.
శీర్షిక:ఉట్టి.
----------------------.

ఒకప్పుడది అందరిళ్లలోనూ సందడి చేస్తూ.
భూమికి ఆకాశానికి మధ్య ఉన్న.
చంద్రునిలా ప్రకాశవంతంగా కనిపించేది.
ఇంట్లో ఎవరికి ఆకలేసినా .
ఉట్టి మీద ఉన్న కూర ఊరించేది.
పాలు పెరుగు కూర పదార్థమేదైనా .
ఉట్టి మీద ఊరేగాల్సిందే.
చీమలకు ఈగలకు దొరకకుండా .
చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా.
వేలాడుతూ ఉండేది.
అలిసిపోయి ఆకలితో వచ్చిన వారెవరైనా .
దాన్ని ప్రసన్నం చేసుకోవాల్సిందే.
అంది అందని ఎత్తులో ఉంటూ .
అందరికీ ప్రసన్నమవుతూ.
మానవ జీవన గమనంలో .
ఊగుతున్న ఊయలలా దర్శనమిస్తూ దరిచేరేది.
ప్రస్తుతం ఊట్టి ఊహల్లో తిరుగుతూ .
కృష్ణాష్టమికి వంత పాడుతూ కనిపిస్తుంది...

(ఈ కవిత  నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
[01/07, 2:59 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:63.
శీర్షిక:నేస్తం.
--------------------------.

ఎల్లవేళలా ఆపదల నుండి కాపాడుతూ.
నిజాయితీకి నిలువెత్తు రూపం కలిగి.
సెల్ ఫోన్ కి సిగ్నల్లా బతుకిచ్చేవాడు .
మనలోపాలను నిజాయితీగా ఎత్తిచూపుతూ.
మనలని సన్మార్గంలో నడిపించే వాడు.
సద్గుణాలని ఎప్పటికప్పుడు మెచ్చుకుంటూ.
వెన్నుతట్టి ప్రోత్సహించే వాడు.
ఆపదకు అడ్డువచ్చి ఆదుకొని .
అందలమనే సౌధాన్ని ఎక్కించేవాడు.
చాటుమాటు విషయాలను మనసులో దాచుకుని. సమాజంలో మనకొక చోటు కల్పించేవాడు.
తన మనసులో ఉన్నతమైన పదవిని కట్టబెట్టి.
మనకు కనకాభిషేకం చేసేవాడు.
మన ఉన్నతికై తపన పడుతూ .
ఉదార స్వభావం కలిగున్నవాడు.
వాడే నిజమైన నిఖార్సైన నేస్తం.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దీనికి అనువాదం కాదు)
[01/07, 7:05 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి ‌
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:64.
శీర్షిక:పర్వదినం.
--------------------------.

ఉత్సవం మనసుల్ని ప్రసన్నం చేసే మహోత్సవం.
పరమ పవిత్రమైన పర్వదినం.
బ్రహ్మ ముహూర్తంలోనే జలకాలాడి.
ప్రసన్నమైన వదనంతో .
దైవ సన్నిధిలో పూజతో పునీతమై .
ప్రశాంతమైన చిత్తంతో తనివితీరా దైవారాధన చేసి.
తీర్థప్రసాదాలు స్వీకరించి.
పరిపరివిధాలుగా పరవశించిపోయే వారం.
సహచరులందరితో సరదా సంభాషణలు చేస్తూ.
పండుగ ప్రత్యేకతలను చర్చిస్తూ .
చెరువు కట్ట మీద చిందేసేవారం.
పిండివంటల వాసన మస్తిష్కాన్ని తాకి నోట్లో నీళ్లూరించేవి.
ప్రత్యేకమైన విందు వినోదాలతో.
గంటగంటకోరుచి చూస్తూ కడుపు సయ్యాటలాడేది.
అసలు పండుగ వచ్చిందంటే చాలు .
రోజు రోజంతా గడియ రిగా  లేకుండా గడుపేవారం.

(ఈ కవిత నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)
[02/07, 2:37 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:02-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి ‌
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:65.
శీర్షిక:విత్తుకదును.
----------------------------.

విత్తు నాటకాలంటే విశ్వ ప్రయత్నం చేయాల్సిందే.
మాటల్లో చెప్పలేని కష్టం.
మందితో కూడిన శ్రమసేద్యమది.
మేఘాలతో చర్చలు జరిపి .
పవనాలతో సంధి కుదుర్చుకుని.
మట్టితో ఘర్షణ పడకుండా .
విత్తనానికి లౌక్యం నేర్పాలి.
విత్తన బలాన్ని అంచనా వేస్తూ .
భూమిలో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి.
విత్తుకనుకూలమైన పదును చూసుకుని.
లోతుకు సరిపడా సాల్లు దున్ని .
సాల్లతో కర్షకులు సయ్యాటలాడుతూ.
కష్టానికే చెమటలు పట్టేలా .
శ్రమిస్తూ విత్తుకు ప్రాణం పోసేందుకు .
కర్షకులు వైద్యులవతారమెత్తి.
అదునులో విత్తు నాటుతారు.
అది మట్టితో అనుసంధానమై ప్రాణం పోసుకుంటుంది.

(ఈ కవిత నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
[02/07, 4:06 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి ‌
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:66.
శీర్షిక:కొత్త మనిషి.
---------------------------.

ఆధునిక మానవుడు నూతన పోకడలతో.
విర్రవీగుతూ వింతగా ప్రవర్తిస్తున్నాడు.
సమాజంతో సంబంధం లేకుండా .
ఒంటరిగా సోషల్ మీడియా అనే బొందల గడ్డలోసంచరిస్తూ. శవంలా బిగుసుకుపోతున్నాడు.
బంధాలకు బీటలు వారే విధంగా.
కనికరం లేకుండా కఠినంగా వ్యవహరిస్తూ .
తన ఉనికిని ప్రశ్నార్ధకం చేసుకుంటూ ఒంటరిగా మిగిలిపోతున్నాడు.
పాశ్చాత్య భావాలకలవాటుపడి .
విదేశీ వస్తు సంప్రదాయాన్ని పెంచి పోషిస్తున్నాడు.
ఉన్మాదాలోచనలు చేస్తూ.
ఆధునిక భావాలు గల మనిషినని బొంకుతూ .
తన దేశ సంస్కృతిని తెగనరుకుతూ.
తనలోనే శత్రువుని తయారు చేస్తున్నాడు.
నేడు చరవాణి మనిషికి ఆత్మగా మారి .
వికృతమైన తలపులలో ఊరేగిస్తూ.
మరమనిషిలా తయారు చేస్తుంది.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దీనికి అనువాదం కాదు)
[02/07, 7:03 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:67.
శీర్షిక:కాలగమనం.
---------------------------.

కాలం ఒక నదిలా ప్రవహిస్తూ .
ప్రపంచానికి కొత్తదనాన్ని అందిస్తూ .
అనేక అవకాశాలను కల్పిస్తుంది.
తొలకరితో రైతులకు దిశానిర్దేశం చేస్తూ .
సమాజాన్ని వేసవి నుండి విముక్తి చేస్తూ .
ఎండినా భూములకు జీవం పోస్తూ .
వర్షాలతో పచ్చదనాన్ని పెంచి పోషిస్తుంది.
మంచు బిందువులు ముత్యాల వలే మెరుస్తూ.
 ప్రకృతికి సొగసులద్దుతూ .
పర్యాటకులను ఆహ్లాద పరుస్తుంది.
కాలం అనేక  జీవులకు జన్మనిస్తుంది .
అవి అదుపు తప్పి కర్కశంగా ప్రవర్తిస్తే.
కాలనాగై కాటు వేస్తుంది.
మనిషి చేసే ఆధునిక పోకడలకు కాలం కన్నెర్ర చేస్తూ .
అధిక వర్షాలు ఎండలతో విజృంభిస్తూ.
విశ్వానికి  వినాశకర సందేశాన్ని పంపిస్తుంది.
ఇకనైనా మనిషి మేల్కొని.
కాలానికి శాంతి పూజ చేసి.
జరగబోయే విపత్తులను అడ్డుకోవాలని కోరుకుందాం.

(ఈ కవిత  నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
[03/07, 6:54 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:03-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:68.
శీర్షిక: మేఘానికోలేఖ.
-----------------------------------.

మేఘమా నువ్వు వర్షంతో పరిచయమై .
మమ్మల్ని ఎల్లవేళలా ఆదరిస్తున్నావు.
వర్షపు చినుకులతో లేఖలు రాస్తూ.
మా యోగక్షేమాలు విచారిస్తున్నావు.
అప్పుడప్పుడు జడివానతో జడలు విప్పుతూ.
మమ్మల్ని కవ్వింపుకు గురిచేస్తున్నావు.
నీ తొందరపాటు చర్యవల్ల పిడుగులు జారిపడుతూ .
జనాలు అవస్థలకు గురవుతున్నారు.
నీ దుందుడుకుతనం కొంచెం తగ్గించుకోవాలి.
పోతే!
నీవు ఎప్పుడూ మెత్తబడే కనిపిస్తావు.
కానీ విత్తుకదునుకు ఆదుకోవు.
ఈ నిర్లక్ష్యం వల్ల పంటలు అల్లాడిపోతున్నాయి.
అవసరం లేని చోట హడావుడి చేస్తావు.
నీకై పరితపించే వాళ్లను కృంగదీస్తూ.
అప్రతిష్ఠ మూటగట్టుకుంటున్నావు.
ఇప్పటికైనా ఏరియల్ సర్వే చేసి .
నీ షెడ్యూలు మార్చుకో.
కరువు ప్రాంతాలను కనికరించి .
కాపాడుతామని కోరుకుంటూ ముగిస్తున్నాను.
నీ సమాధానానికై ఎదురుచూసే భూలోక మిత్రున్ని.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దీనికి అనువాదం కాదు)
[03/07, 2:41 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:69.
శీర్షిక:లక్ష్యం.
--------------------------------.

శ్రమకే  విసుగొచ్చేలా కఠినమైన సాధన చేస్తూ.
సమయమనే ఇంధనాన్ని ఆదా చేసుకుంటూ.
పటిష్టమైన దృఢచిత్తం కలిగివుండాలి.
విజయతీరాల్లో విహరిస్తున్నట్లు .
ఆశావహ దృక్పథం కలిగుండాలి.
నిరంతరం సానుకూల తలపులతో .
 నిప్పులు చెరిగే రాకెట్లలా.
ఎక్కుపెట్టిన వైపు దూసుకుపోవాలి.
తనువు మనసు ఏకం చేస్తూ .
తపస్సు చేస్తున్న ఋషిలా మారి.   
అవకాశం కై ఆరాటపడిపోవాలి.
ఆకాశాన్ని భూమికి దించే ఓపిక.
పాతాళాన్ని తవ్వితీసే సహనం .
సప్త సముద్రాలను తాగేయ్యాలనే తపనుండాలి.
అప్పుడే అనుకున్న కార్యాన్ని .
అవలీలగా ఆలింగనం చేసుకొని.
సమాజంలో సమరసింహంలా గర్జించవచ్చు.

(ఈ కవితా నా సొంత రచన. దేనికి అనువాదం కాదు)
[03/07, 7:22 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:70.
శీర్షిక:దినచర్య పుస్తకం.
------------------------------------.

మనసులో ఉన్న భావాలను .
సంఘటనల రూపంలో పొందుపరుస్తూ.
జ్ఞాపకాలను దాచుకునే మస్తిష్కమది.
దానిని ఎప్పుడు తెరిచిన.
మనలని పదాల రూపంలో పలకరిస్తూ .
మన వ్యక్తిత్వాలను అద్దంలా ప్రతిబింబిస్తుంది.
మనం మరిచిపోయిన అనేక విషయాలను.
గుర్తుంచుకుని మనకందిస్తుంది .
మేధావుల దినచర్యలను రికార్డు చేస్తూ .
అత్యవసర సమయాలలో వారిని ఆదరిస్తూ.
సమాజానికి ఎనలేని సేవ చేస్తుంది.
అక్షరాల రూపంలో సాక్ష్యాలను .
అవసరమైతే తేదీలను అందిస్తూ .
అనవసరమైన గొడవలను తుడిచేస్తుంది.
రోజువారి విషయాలను నిక్షిప్తం చేసుకుంటున్నా.
దినచర్య పుస్తకం నేడు కొమ్మలెగిరిపోయినా.
చెట్టులా మోడుబారి పోయింది.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
[04/07, 1:19 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:04-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:71.
శీర్షిక:మాయా రణరంగం.
-------------------------------------.

అక్కడ నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది.
గెలుపోటములు దోబూచులాడుతాయి.
యుద్దరంగంలోకి అడుగుపెట్టగానే .
ప్రాణాలొడ్డి పోరాడాలి.
పోరులో సిపాయిలు ముందువరుసలో ఉండి. శిబిరంలో శత్రు చొరబాట్లకు.
ఎదురు నిలిచి పోరాడాలి.
గుర్రాలు ఒంటెలు ఏనుగులు .
భీకరంగా పోరాడుతూ దూసుకుపోతాయి.
పోరులో ఎన్నో  పద్మ వ్యూహాలుంటాయి .
యుక్తి ఉన్నవారు మాత్రమే వాటిని ఛేదిస్తూ.
ప్రత్యర్థికి దొరకకుండా పోరాటం చేస్తారు.
అందులో ఎవరు ఎన్ని పోరాటాలు చేసినా. అంతిమంగా రాజు కు రక్షణ కల్పించి.
విజయతీరాలకు చేర్చాల్సి ఉంటుంది.
రణరంగంలో అందరూ మరణించిన.
రాజు బతికుంటే విజయం సాధించినట్టే .
ఇదే యుద్ధరంగం ఇది.

(ఈ కవిత నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
[04/07, 2:58 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:72.
శీర్షిక:జీవి.
---------------------------.

అది ప్రకృతికి విలువైన అతిథిగా పరిచయమవుతూ .
పర్యావరణాన్ని సమతుల్యం చేస్తూ.
నిరంతరం జీవన పోరాటం చేస్తోంది.
ఆవాస వ్యవస్థలో చురుకైన పాత్ర పోషిస్తూ.
కర్తవ్య నిర్వహణలో రాజీపడకుండా.
తన మనుగడను కాపాడుకుంటుంది.
ఉత్పత్తి వ్యవస్థలో జీవులను సృష్టిస్తూ.
తన జాతి ఉనికిని నిలబెట్టుకుంటుంది.
జీవావరణ వ్యవస్థలో సహచర జీవులతోటి.
సమైక్యత ప్రదర్శిస్తూ సంఘీభావంగా ఉంటాయి.
చెట్లలోను పుట్టల్లోను సహజీవనం చేస్తూ. సంఘజీవిగా చలామణవుతుంది..
ఆహార వ్యవస్థలో తన పొట్టకూటి కోసం తపన పడుతూ .
వేరే జీవికి ఆహారమై తనువు చాలిస్తుంది.

(ఈ కవితా నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు)
[04/07, 3:53 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:73..
శీర్షిక:ఉద్యమం.
-----------------------------------.

వ్యవస్థలో జరిగే లోపాలను ఎత్తి చూపుతూ.
సమూహంగా కలిసి పిడికిలెతుతూ.
గొంతులతో నిప్పుల వర్షం కురిపిస్తూ .
సమాజాన్ని దిగ్బంధనం చేస్తూ
సమర శంఖం పూరిస్తారు.
పాలనా వ్యవస్థ పై నినాదాలు విసురుతూ.
న్యాయం కోసం పట్టుబడుతూ .
తమ గొంతు సమాజానికి చేరేలా .
ప్రసంగాలు చేస్తూ .
రోజుకొక విధంగా ఉద్యమిస్తూ .
స్పష్టమైన హామీ కోసం.
నిజాయితిగా జరిపే పోరాటమది.
దిక్కు మొక్కు లేని జనానికి .
అది ఒక ఆశాజ్యోతిగా దర్శనమిస్తుంది.
సమాజ ఆకాంక్షను తెలియజేయడానికి. అద్భుతమైన వేదికది.
ఆ వేదికపై జరుగుతున్న వేడుకలను.
మూడోకన్ను జాగ్రత్తగా గమనిస్తుంది.
ఉరకలేసే ఉత్సాహంతో .
ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారు.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు )
74
వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:74.
శీర్షిక:కమనీయమైన కవిత.
-------------------------------------.

అది మనసు పొరల్లో నిక్షిప్తమైన లావాలా.
పలువిధాలుగా మదనం చెంది .
భావావేశంతో బలంగా ఉబికి వస్తున్నా.
కమనీయమైన భావాలను బహిరంగ పరుస్తూ.
జనాలను చైతన్యపరుస్తుంది.
దానికి ఆవేశమెక్కువ .
సామాజిక సమస్యలపై గళమెత్తి.
పదునైన కవితా బాణాలను సంధిస్తూ.
ప్రశ్నలవర్షం కురిపిస్తూ నిలదీస్తుంది.
తన పాదాలలో అనేక ప్రతీకలను ప్రతిఫలిస్తూ. సామాన్య జనాల మనసుల్లోకి దూసుకుపోతుంది.
అభాగ్యుల పాలిట అరుణతారగా అవతరిస్తూ .
వారి గొంతుకై నినదిస్తుంది.
సమాజంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న.
సామాజిక సమస్యలను .
తనదైన రీతిలో చీల్చి చెండాడుతుంది.
దానికి ప్రజా సంక్షేమమే ప్రాణవాయువు.
నిత్య చైతన్యమే దాని వ్యక్తిత్వం .
అది బలమైన వస్తువు కలిగి .
యుగయుగాలకు అజరామరంగా నిలుస్తుంది.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
75

వీరాస్ కవి సమయము.
తేదీ:05-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:75.
శీర్షిక:ఆది దేవత.
---------------------------.

స్త్రీ జాతి ఔన్నత్యాన్ని పెంచుతూ .
లోకానికి విలువలు నేర్పుతూ .
పూజనీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి.
పాతివ్రత్య ధర్మానికి .
మేరు పర్వతంలా నిలిచిన మహాసాధ్వి ఆమె.
రఘువంశ కీర్తిని నలుదిశలా చాటేలా .
తనయులకు ఉద్బోధ చేసి.
రమ్యమైన రామాయణాన్ని నడిపించింది.
ఆదర్శసతికి ప్రతిరూపంగా నిలిచి .
యుగయుగాల్లో దర్శనమిస్తూ .
సజీవ సాక్ష్యంగా నిలిచింది.
భారతదేశ సనాతన ధర్మానికి .
మూల స్తంభంగా నిలిచి.
సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ .
హిందూ హిందూ ధర్మాలకు ఆది దేవతగా   నిలిచింది.
ఎన్ని కష్టాలు ఎదురైనా .
నమ్మిన ధర్మానికి కట్టుబడి .
మానవతా విలువలను కాపాడుతూ.
అవనికే అమ్మగా అవతరించింది.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
76
వీరాస్ కవి సమయము.
తేదీ:07-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:76.
శీర్షిక:తిండి గింజ.
-------------------------------.

ప్రస్తుతం అది ఆకలి సామ్రాజ్యాన్ని పాలిస్తూ. అందరికీ అందుబాటులో ఉంటూ .
సమ న్యాయపాలన చేస్తోంది.
దాని పొడ తగలగానే కరువు పరార్ అవుతుంది.
అన్నం గింజని నిర్లక్ష్యం చేసిన వారిని.
ఆకలి రూపంలో వెంటాడుతుంది.
కాయకష్టం చేసే కర్షకుని ఇంట .
కన్నతల్లిగా పూజింపబడుతుంది.
దానికి పరోపకార బుద్ధి ఎక్కువ .
నిరంతరం ఆకలికి సమిధగా మారుతుంది.
అది పసుపు తో సహవాసం చేసి.
పవిత్ర గింజగా మారి .
పెళ్లి వేడుకలో చురుకైన పాత్ర పోషిస్తుంది.
మానవుడు ఎంత అభివృద్ధి సాధించినా .
ఎంత ఎత్తు ఎదిగినా.
 చివరకు బురదలో పుట్టిన పంకజం లాంటి.
తిండిగింజకై మోకరిల్లాల్సిందే.

(ఈ కవిత నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)
77
[08/07, 7:27 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:77.
శీర్షిక:*ముసురు.*
----------------------------.

చినుకులన్నీ కలిసి భూమిని.
అమాంతం చుట్టేసి చిత్తడి చేశాయి.
చినుకుల ధాటికి తట్టుకోలేక.
నేల సంధి చేసుకుంది.
పుడమి తల్లి ఒడిలో .
చినుకులు చిన్నారులుగా మారి .
కేరింతలు కొడుతూ సేద తీరుతున్నాయి.
చినుకుకు చినుకు ముడి వేసుకుంటూ .
ముసురుగా ముసురుకుంటుంది.
ముసిముసి నవ్వుల లేత పాపాయిలా.
ముసురు ముద్దొస్తుంది.
మనసు తెరలపై కొత్త భావాలను .
ముద్రిస్తూ ముచ్చటగొలుపుతుంది.
ఆబాలగోపాలాన్ని అలరిస్తూ.
వాకిట్లలో నాట్యం చేస్తుంది.
ధరణికి నూనూగు మీసాల పోగులా.
యవ్వన అలంకారప్రాయమై.
మనసును ఊగిసలాడిస్తుంది..
ముసురు గాలికి మూగజీవాలు .
లేత చిగురు కొమ్మలా వణుకుతున్నాయి.
ముచ్చటైన ముసురుకు తనువంతా తడిసి .
వెచ్చని కిరణాలకై తపన చెంది.
వృక్షాలు నిరాశగా చూస్తున్నాయి.
బడుగు జీవుల బతుకు తెరువు పై .
పిడుగుల వర్షంలా  పీడిస్తున్నావు.
కర్షక కమనీయమైన క్షేత్రాలలో .
కనువిందు చేసే కనకపు జల్లులతో.
సన్మానం చేస్తావు.
సడీ సప్పుడు లేకుండా.
సరసమైన జల్లులతో .
ప్రకృతితో  పరిగాసమాడుతుంది.
విరిసిన మనసులలో .
వింతైన తలపులు సృష్టిస్తూ.
వికారాలు కలిగిస్తుంది.
కురిసి కురిసి కృంగిపోయి .
ప్రపంచానికి లొంగిపోయి .
తిరుగు ప్రయాణమవుతుంది.

78


వీరాస్ కవి సమయము.
తేదీ:08-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:78.
శీర్షిక:మస్తిష్కము.
-----------------------------.

అది అద్భుతమైన పరిశోధనశాల.
అక్కడ ఆలోచనలకు పదును పెడుతూ.
అనేక పరిశోధనలు జరుగుతుంటాయి.
అందులో లభించిన పరిష్కారాలకు.
ఆవిష్కరణలు కూడా జరుగుతుంటాయి.
అవయవాలనే అభాగ్యులకు పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ .
తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలకి.
పరిష్కార మార్గాలను సూచిస్తూ.
న్యాయంతో కూడిన పాలన చేస్తుంది.
ఎప్పటికప్పుడు ఆజ్ఞలు జారీ చేస్తూ.
వ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థాలనే.
సమస్యలను తుడిచేస్తూ.
సంఘంలో ఎవరూ  మితిమీరి ప్రవర్తించకుండా.
అనునిత్యం కాపు కాస్తుంది.
మొత్తం దేహాన్ని తన గుప్పిట్లో ఉంచుకొని .
ఎక్కడ ఏది జరిగినా వెంటనే స్పందిస్తూ .
రక్షణాత్మక చర్యలు చేపడుతూ.
సుప్రీమ్ లా వ్యవహరిస్తోంది.
తనువులో ఏది యుద్ధం చేయాలన్నా .
దాని అనుమతి తప్పనిసరి...

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)

79

వీరాస్ కవి సమయము.
తేదీ :09-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:79.
శీర్షిక:ఆప్యాయతల పిలుపు.
---------------------------------------.

అమ్మ పిలుపు ఆప్యాయతలు పంచుతూ.
అనురాగపు తేనెలూరుతూ.
మనసుకూరట కలిగిస్తుంది.
చల్లని పవనాలు మధ్య.
నల్లని మేఘాలల్లుకొని .
మమతల వర్షం కురిపించినట్లుగా .
మాటలతో అమ్మ మంత్రం వేస్తుంది.
అనురాగం కలిగిన ఆమె పిలుపులో .
ఆకలి తీర్చే అభిమానం ఉంది .
కష్టాలు కడతేర్చే కనికరముంది .
మార్గం చూపించే మర్యాదుంది .
ఆశలు నిలిపే అవగాహన ఉంది.
మానవ జీవితం నిండుగా పండి .
నిజాయితీగా నడవాలంటే .
ఆప్యాయతలు కలిగిన అమ్మ పిలుపు అవసరమే.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)


80
వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:80.
శీర్షిక:కైపు.
------------------------------.

తొలివలపు మైకంలో పడి.
యువత కాలాన్ని వృధా చేస్తూ .
భవిష్యత్తును అంధకారం చేసుకుంటూ.
ప్రేమ కైపులో విహరిస్తున్నారు.
విందు వినోదాల పేరిట.
మధ్య ధూమపానాన్ని సేవిస్తూ.
యువత కైపు ప్రపంచంలో షికార్లు కొడుతూ.
కవ్వింపుగా కాలరే గురేస్తున్నారు.
నల్ల మందు మత్తులో ఊగిపోతూ.
మంచి చెడు విచక్షణ మరచి .
ఉన్మాదిలా ఉగ్రంగా మారి.
ఊచలు లెక్కిస్తూ నేరస్తులవుతున్నారు.
సమాజంలో ఉన్నత విలువలు కలిగిన.
కుటుంబ వ్యవస్థను ఛిద్రం చేస్తూ.
ధనసంపాదననే  మత్తుతో.
సహజీవనం చేస్తూ.
 అనారోగ్యంతో అంగలార్చుతున్నారు.
కైపు మానవజీవితానికి మహమ్మారిలా తయారై. కష్టాలనే మంటల్లోకి తోసేస్తుంది.

(ఈ కవిత నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)

81

[10/07, 7:00 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:10-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:81.
శీర్షిక:కామ్రేడ్స్.
-------------------------.

ఒకప్పుడు వారిని చూస్తే.
నిజాయితీగా ధైర్యంగా నడిచినట్లుండేది.
పేదల గొంతుకై  నినదిస్తూ.
అభాగ్యులను ఆదరిస్తూ చేరదీసేవారు.
ఎర్రని మందారాలు రెపరెపలాడుతూ.
వాటి నీడలో నాయకులుగా ఎదిగేవారు.
ఆదర్శ సిద్ధాంతాలను సంచీలో వేసుకొన్ని .
వందల కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ .
ధర్నాలతో దండుని వెంటబెట్టుకుని .
సమస్యల పరిష్కారానికై పట్టుబట్టేవారు.
కామ్రేడ్ అంటే చాలు .
నరాలలో రక్తం బదులు పౌరుషం పరిగెత్తేది.
నిజాయితీ కణాలు రెక్కలు కట్టుకొని  ఎగిరేవి.
ఆపద్బంధువు అభయమిస్తున్నట్లుండేది.
ప్రస్తుతం వారి నినాదాలకు ఆదరణ తగ్గి.
సిద్ధాంతాలు మూలకు పడిపోయాయి.
ఎరుపుదళ ఉద్యమాలు ఎవరికీ .
అక్కరలేక రంగెలిసిపోయాయి.
గోడ మీద నినాదాలే దర్శనమిస్తున్నాయి .
తప్ప  నాయకులు కనిపించడం లేదు.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)
82
[10/07, 9:56 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:82.
శీర్షిక:సోయగాలు.
----------------------------------.

అవి ఎక్కడున్నా ఆహ్లాదమే.
మనసులను వికసించేలా చేసి .
మనుషులను రంజింపజేస్తాయి.
అది పైరగాలికి ఊగుతున్న వరికర్రలోను.
నింగిలో విహరిస్తున్న విహంగ రెక్కలలోనూ.
ఎత్తయిన కొండల నడుమ హరితంలోనూ.
పైనుండి దుముకుతున్న నీటిలోనూ.
దర్శనమిస్తూ పరవశింపజేస్తాయి.
పసిపిల్లల నవ్వులలో.
అమ్మ ఆప్యాయత పిలుపులో.
నాన్న పంచుతున్న ప్రేమలో .
సోయగాలు నక్కి తొంగి చూస్తుంటాయి.
మనిషి బాహ్యప్రపంచానికి సంబంధం లేకుండా.
అంతర్ ప్రపంచాన్ని ప్రతిఫలిస్తూ .
మనసుతో సహవాసం చేస్తుంది.
కార్మిక కర్షక శ్రమ సౌందర్యం లోనూ .
కష్టించే వారి చెమట చుక్కలోనూ .
సోయగాలు తొణికిసలాడుతుంటాయి.
ప్రపంచానికి ఒక పర్యాటక ముద్రను అందిస్తూ. చూపరులను కట్టిపడేస్తాయి.

(ఈ కవిత నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)
83.
[11/07, 1:08 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:11-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:83.
శీర్షిక:మంటల్లో మానవత్వం.
---------------------------------------.

మానవత్వం మంటల్లో పడి మసిలిపోతుంది.
సాటి వారిపై హింస రచన చేస్తూ .
విమర్శ విశ్లేషణలతో ఆనందం పొందుతుంది.
ఆపదలో చిక్కుకొని విలవిలలాడుతున్న. అనామకులను అవహేళన చేస్తూ.
మానవ హృదయాంతరాళం లో .
మానవత్వం మొద్దునిద్ర నటిస్తోంది.
ఆధునిక సమాజంలో ఐహిక సుఖాల కోసం .
తన పర బేధం లేకుండా అక్రమాలకు ఎగబడుతూ.
అయిన వారిని ఆగం చేస్తూ.
మృత్యు క్రీడకు తెగబడుతుంది..
క్షణకాల సుఖం కోసం .
సొంత వారిని అంతం చేస్తూ .
అగాధంలో పడిపోతుంది.
అనవసరమైన ఖర్చులతో అప్పులపాలవుతూ.
అవి తీర్చలేక తిప్పలు పడుతూ .
ఉన్న ఆస్తులకై అర్రులు చాచుతూ.
కన్నవారిని రోడ్డుపాలు చేస్తూ .
కర్కశత్వం ప్రదర్శిస్తుంది.
మానవత్వం మానవ ముసుగులో తిరుగుతూ. మంటల్లో కాలి పోతుంది.
తప్ప! బయటికి రావడం లేదు.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
[11/07, 1:25 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:84.
శీర్షిక:మరో అమ్మ.
---------------------------------.

తెలుగు భాషలో పాత పదబంధాన్ని.
మురిపాలతో రంగరించి మురిపెంగా అందించేది.
వంటింటికి వైద్యం చేస్తూ .
ఆరోగ్య చిట్కాలు అందించేది.
అనగనగా కథలను నడిపిస్తూ .
చల్లని చందమామలో విహరింపచేస్తూ.
ఊహించని మలుపులతో ఉత్కంఠ రేపుతూ.
అందర్నీ కంచికి తీసుకుపోయేది.
చెదిరిపోయిన జుట్టుకు మరమ్మత్తులు చేస్తూ. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తూ.
విజయ తిలకం దిద్ది తయారు చేసేది.
ఎంత అల్లరి చేసినా .
ఓపికగా ఉయ్యాలలో  ఊపుతూ జోల పాడేది.
అడగకుండా ఆకలిని పసిగట్టి కడుపుకు మంత్రం వేసేది.
ఏడుపు గుక్క పట్టినప్పుడు దిష్టితీసి అంత్రాలు కట్టి.
ఒంటికి సామ్రన్ పొగేసి సపర్యలు చేసేది ..
ఆమె చేసే వంట ముందు.
నలభీమపాకం కూడా పనికి రాదు.
ఆమె పంచుతున్న ముద్దలలో .
అమ్మని మించిన మరో అమ్మ గా దర్శనమిచ్చేది.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)
85.
వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:85.
శీర్షిక:లచ్చక్క.
--------------------------------.

ఆమె ఊరికే అన్నపూర్ణమ్మ. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన.
చల్లని మనసున్న దేవత.
ఊరంతా ఆమెని లచ్చమ్మ అన్నా.
కొందరు మాత్రం లచ్చక్కా అని ఆప్యాయంగా పిలిచేవారు.
ఊళ్లోకి ఎవరొచ్చినా ఆమెను దర్శనం చేసుకుని .
ఆమె చేతి ప్రసాదం పుచ్చుకోవాల్సందే.
ఇంద్రధనస్సులో ఏడు రంగుల్లా.  సంతానమున్న ఊర్నంతా సొంతవారిలా చూసేది.
ఆకలితో అలసి ఎవరొచ్చినా. కడుపు చల్లబరచి పంపేది.
ఒకప్పుడు లచ్చక్క భర్త రామన్న .
సాయుధ పోరాట దళంలో కాలు దువ్వినప్పుడు.
 వంటలు వండి గిన్నెలు సద్దేది.
రహస్యంగా ఉద్యమకారులకు పొయ్యి ముట్టించేది.
రామన్న కాలం చేసిన తర్వాత. లచ్చక్క ఊరిని దత్తత తీసుకుంది.
రంగయ్యా అని ఆప్యాయంగా. మా నాయినని పిలిచినప్పుడు. మాటల్లో చెప్పలేని మధురానుభూతి .
 మా నాయన కళ్లలో కనిపించింది.
ఊరి నడిబొడ్డున  బొడ్రాయిలా నిలబడి .
ఊరిని కాపాడిన లచ్చక్క.
ఇప్పుడు ఎవరికీ అందనంత దూరంగా వెళ్ళిపోయింది.
అప్పుడప్పుడు కలలో దర్శనమిస్తూ.
మళ్లీ వేదాన్వితగా మా ఇంట్లో జన్మించిందని.
మా నాయన అన్నప్పుడు.
మా అందరి మనసులు అనురాగంతో నిండి. ఆప్యాయతలతో చిందులు వేశాయి.

(ఈ కవిత నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)

86.
వీరాస్ కవి సమయము.
తేదీ:12-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:86.
శీర్షిక:దారి తప్పిన ప్రవాహం.
--------------------------------------.

సమాజం నిరంతరం ఒక నదిలా ప్రవహిస్తుంది.
అందులో అనేక నీటి అనువులు జీవనం చేస్తూ.
నదికి అనుకూలంగా మసులుకుంటున్నాయి.
అప్పుడప్పుడు చిన్న చిన్న అలజడులు జరిగినా.
మళ్ళీ కుదురుకొని కాల ప్రవాహంలో ప్రయాణిస్తాయి.
నది నిర్దేశించిన నైతిక విలువలు పాటిస్తూ.
నదికనుకూలంగా నాట్యమాడుతాయి.
నదికి ప్రవాహమే ప్రామాణికం.
అలాంటి ప్రవాహం దారి తప్పి.
కుంటలతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ.
ముందుకు కదలనని మొరాయిస్తుంది..
నీటి నియమాలను తుంగలో తొక్కి.
వింత పోకడలకు తెర తీసింది.
ప్రేమతో ఒకటైన అనుబంధం.
స్వార్ధ ప్రయోజనాలలో పడి.
అక్రమ సంబంధాలతో బీటలు బారుతూ .
చివరికి నీరు నిక్కచ్చిగా నిలువలేక.
పిరికి పందై పారిపోయింది.....

87.
వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:87.
శీర్షిక:పసలేని కన్ను.
------------------------------.


అది ఒంటి కన్ను తో చూస్తూ .
పసలేని సిద్ధాంతాలను ప్రసారం చేస్తూ .
ఇరవై నాలుగు గంటలు వాగుతూనే ఉంటుంది.
విలువలు లేని అశ్లీలాన్ని నెత్తుకొని .
బ్రేకింగ్ న్యూస్ లంటూ .
మానవుల గదులలో జొరబడి .
కుక్కలా వాసన చూస్తూ .
ప్రపంచాన్ని ఉద్ధరించే బలమైన ఆధారం సంపాదించినట్టు.
డాబు దర్పం ప్రదర్శిస్తూ .
జనాల తలలను బొప్పి కట్టిస్తుంది.
రాజకీయ నాయకులకు ధనవంతులకు .
ఎర్రతివాచీల స్వాగతం పలుకుతూ.
కర్షకుల వ్యతలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా.
వారి జీవితాల్లో అమావాస్య చీకటిని నింపుతూ.
నిస్సిగ్గుగా వార్తలలో పారదర్శకత అంటూ.
మాటలతో మంత్రం వేస్తుంది.
కట్నం తీసుకునేవాడు గాడిద అన్నప్పుడు .
డబ్బులు తీసుకొని వార్తలు రాసే వాడు .
గాడిద కంటే హీనమనలనా.
కుంభకోణాలు ఒంటికన్నుకి కనిపించవు.
పేదవాడి ఆర్తనాదాలు దానికి వినిపించవు.
అసమానతల సమాజాన్ని చూడలేదు.
కానీ !ఖద్దరు బట్టలకు సాగిలపడిపోతుంది.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)

88

[14/07, 3:59 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:14-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:88.
శీర్షిక:జీవన యాత్ర.
------------------------------.

అనాధలు అభాగ్యులు ఆధారం లేనివారు.
నిరంతరం ఆహార వేటలో అలసిపోయిన జీవులు వారు.
మోరీలు ఆవాసాలుగా ఆదరిస్తూ .
అక్కున చేర్చుకుని ఊరటనిస్తాయి.
చిరిగిన చొక్కాలే వారికి నేస్తాలు .
చెత్తకుండీలే వారి ఆహార కేంద్రాలు .
ఆహార దాతలే వారికి ప్రత్యక్ష దైవాలు.
మెతుకు విలువ బాగా తెలిసిన వారు.
పూట పూటకి మెతుకులను పోగేసుకుంటూ.
మెతుకుల యాత్రకై బయలుదేరుతారు.
కడుపు మాడినప్పుడల్లా కన్నీరు తాగి బతుకుతూ.
కరువుసీమలో కళేబరంలా కనిపిస్తూ .
కంటి మీద కునుకు లేకుండా కదులుతున్నారు.
మానవత్వం మరిచిన మనుషుల చిత్కారాలకు గురవుతూ.
చీకు చింతలను భుజాన వేసుకొని.
మురికి కాల్వలెంట ఆకలి యాత్ర చేస్తున్నారు.
ఎండిన డొక్కలతో ఎగరలేని పక్షుల్లా మారి.
ఎంగిలి మెతుకులకై ఆరాటపడుతూ.
ఎగిసిపడుతున్న ఆకలి జ్వాలలను .
ఆర్పడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు.
నిత్యం ఆకలితో యుద్ధం చేస్తూ సూర్యునితో  పోటీపడి.
పసందైన పచ్చడి మెతుకులకై అన్వేషిస్తూ.
ఆహారయాత్రకై బయలుదేరారు......

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
[14/07, 4:10 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:89.
శీర్షిక:వ్యామోహం.
--------------------------------.

అదొక విచిత్రమైన సాలెగూడు ప్రపంచం.
అందులో ఒక సారి చిక్కితే .
గిలగిలాని కొట్టుకోవలసిందే తప్ప.
బయటపడే దారులు కనిపించవు.
కళ్ళు మిరిమిట్లు గొలిపే లైట్ల మధ్య.
తళతళమని మెరుస్తున్న వస్తువులు.
మనసుకు వలవేసి లాగుతాయి.
మదిలో మత్తుని నింపి మనిషిని కకావికలం చేస్తుంది.
మనకు అవసరం లేకున్నా .
వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకునే వరకూ .
మనలని వెంబడిస్తూనే ఉంటాయి.
విదేశీ వేషాలతో ఇక్కడ ప్రదర్శనలిస్తూ .
మనలను కొల్లగొడుతూ మాయ చేస్తాయి.
ఒకప్పటి రాజ్య దాహం .
మళ్ళీ మార్కెట్ రూపంలో .
మనల్ని ఆకర్షించి ఆక్రమిస్తుంది.
మన పై వామపాదము మోపుతూ .
మన జీవితాలకు జీవం లేకుండా చేస్తుంది.
మనలని గ్రహణం పట్టిన సూర్యునిలా మార్చి .
మన ఇంట్లో తిష్ట వేస్తాయి.

(ఈ కవిత నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
90

వీరాస్ కవి సమయము.
తేదీ: 15-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:90.
శీర్షిక:నిండుదనం.
---------------------------------.

అది పల్లీయుల కట్టుబాట్లలో .
మకుటం లేని మహారాజుగా వెలిగిపోతూ .
నిండైన రూపాన్ని కలిగి.
తెలుగుతనం ఉట్టిపడేలా ఊగుతూ.
హుందాతనాన్ని అందిస్తుంది.
పౌరోహిత్యము యజ్ఞ యాగాలకు.
పూజా పునస్కారాలకు.
దైవత్వం ఉట్టిపడే పవిత్రమైన వస్త్రమది .
వివాహ వేడుకల్లో పెళ్లిపీటల పై .
ముచ్చటగా ముస్తాబై కూర్చుంటుంది.
రచ్చబండ పై రంగులు మారుస్తూ.
వింత తీర్పులు వెలువరిస్తుంది.
పొలాలగట్లపై నిండుదనంతో రెపరెపలాడుతూ.
మట్టికి పరిమళాన్ని అద్దుతూ.
దేశానికి అన్నం పెట్టే పనిలో తలమునకలై ఉంటుంది.
ఒకప్పటి అలంకరణలో అందలమెక్కి.
ప్రస్తుతం అదో పాతాళానికి పడిపోతూ .
అవనిపై అంగళారుస్తూ కనిపిస్తుంది.

(ఈ కవితా నా సొంత రచన.ఇది దేనికి అనువాదం కాదు)
91

వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:91.
శీర్షిక:చెరలొ వాణి.
----------------------------------.

అది మనిషి చెవులను కబ్జా చేసి.
కాకమ్మ కథలు చెబుతూ విసిగిస్తుంది.
వింతైన శబ్దాలు విడ్డూరంగా వినిపిస్తూ .
మనసుని మలినం చేస్తుంది.
అప్పుడప్పుడూ అవసరాలను తీరుస్తూ.
హస్తభూషణం గా దర్శనమిస్తుంది.
తనలోని అందాలను ప్రదర్శిస్తూ .
మానవులను ఆకర్షిస్తూ మాయ చేస్తోంది.
విద్యార్థుల విలువైన సమయాన్ని తింటూ .
వారి భవిష్యత్తుకు గుదిబండై కూర్చుంటుంది.
పచ్చని పందిళ్లలో ఆరని అగ్ని సెగలు రేపుతోంది.
ముచ్చటైన మూడుముళ్ల బంధాన్ని .
మూన్నాళ్ల ముచ్చటగా మార్చి హేళన చేస్తుంది.
జనాల జేబులకు చిల్లులు పెడుతూ .
తన కరెన్సీ దాహం తీర్చుకుంటుంది.
లేనిపోని ఆశలు ఎరగా వేసి .
మనసులను విష కౌగిలిలో బంధిస్తుంది.
రోడ్లమీద విచ్చలవిడిగా విహరిస్తూ. అమాయకులను రోడ్లకి బలి చేస్తోంది.
మనిషి చేసే ప్రతి పనిలోనూ  తల దూరుస్తూ.
తగువుల అగాధంలోకి నెట్టేస్తుంది.
మంచి మానవత్వం మరిచేలా చేసి .
మనిషిని మృగంలా మారుస్తుంది.
సమాజ విలువలను దిగజార్చుతూ.
అనవసరపు మాటలను ఉత్పత్తి చేస్తూ .
చరవాణి కాస్త చెరలోవాణిగా మారిపోయింది.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు
92

[16/07, 11:16 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:16-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:92.
శీర్షిక:తన్మయత్వం.
----------------------------------.

అక్కడ వీచే వింత గాలులకు.
మనసు మైమరిచిపోయి సేద తీరుతుంది.
కొత్త లోకంలో మనసు రెక్కలు కట్టుకొని.
విహంగ వీక్షణం చేస్తూ .
అక్కడి పరిసరాలను పరిచయం చేసుకుంటూ .
ఆత్మ సంతృప్తితో చిందులేస్తుంది.
అక్కడ జలపాతాలు వర్షించే .
చిరుజల్లులకు మనసు పట్టలేనంత.
సంతోషంతో సుడులు తిరుగుతుంది.
అక్కడ చెప్పుకునే ఊసులు పాతవే అయినా .
మనసుకు కొత్తదనాన్ని అందిస్తాయి.
మనిషిలో కొత్తరక్తం ప్రవహించినట్టు .
లోతుల్లోంచి ఆనంద ఉబికివస్తూ.
తనువుకు ఊపిరాడకుండా చేస్తుంది.
యాత్రలో వాతావరణం పూర్తిగా .
మనుషులను వశం చేసుకుని .
కొంగొత్త భావాలకు అంకురార్పణ చేస్తూ. అలజడులను సృష్టిస్తుంది.
తనివితీరే వరకు గాలి తంబురా ఊదుతూ .
విశ్వ సంగీతంలో మనసులను ఓలలాడిస్తూ.
తన్మయత్వం చెందిస్తుంది.

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
93
[16/07, 11:30 AM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:93.
శీర్షిక:భూమి పుండు.
-----------------------------------.

అది భూమికి రాచపుండులా మారి .
నిరంతరం దురదతో ఇబ్బంది పెడుతూ.
ముసురులో మురిసిపోతుంది.
నగరవాసులు దాని బాధ పడలేక.
కాంక్రీటుతో టాటా చెప్పేశారు.
పల్లీయులు బురదను బువ్వతో సమానంగా చూస్తూ .
కళ్ళకద్దుకుని దానిలో బంగారం పండిస్తూ .
దాని విలువను ప్రపంచానికి చాటారు.
నేల తల్లి తానమాడినప్పుడు .
బురద తల్లిగా దర్శనమిస్తుంది.
అందులోంచి వేల మొక్కలు ప్రాణం పోసుకొని.
మేఘాలను మధనం చేసి వర్షపు దారలను కురిపిస్తూ .
పుడమి తల్లి దాహం తీరుస్తాయి.
భూమి తనువు తడిసి పొంగితేనే.
నాలుగు మెతుకులు కుండలోకొస్తాయి.
కలువపూలకు కన్నతల్లిగా.
ఆదరిస్తూ అవనిపై అవతరింపజేస్తుంది.
ఎన్నో జీవులకు ఆశ్రయిస్తూ అగ్రపీఠంగా వెలిగిపోతుంది.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)

94

)[17/07, 1:08 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:17-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:94.
శీర్షిక:మాటల యుద్ధం.
-----------------------------------.

అక్కడ మాటలు అగ్నిగుండాల్లా మండుతుంటాయ్.
అక్కడున్నవారంతా అవి చల్లారకుండా అగ్నికి ఆజ్యం పోస్తూ ఉంటారు.
మాటలు వలువలు లేకుండా పచ్చిగా చెలరేగుతూ .
కయ్యానికి కాలు దువ్వుతూ.
కదన రంగాన్ని తలపిస్తూ ఉంటుంది.
అందులో చేరిన పెద్దలంతా రణరంగానికి నేతృత్వం వహిస్తూ .
ఇరుపక్షాలని శాంతింపజేస్తూ శాంతిదూతలుగా కనిపిస్తారు.
పెద్దలల్లో కొందరు మాటల మంటలకు.
కట్టెలెగేస్తూ మంటలను ఆరకుండా చూస్తూ.
రంగులు మారుస్తూ పైశాచికానందాన్ని పొందుతారు.
దాని మీద కొన్ని సమస్యలు శాంతంగా నిద్రిస్తున్నా .
మరికొన్ని కయ్యంతో రగులుతున్న.
అన్నిటినీ డబ్బుతో తూకం వేస్తారు.
మానవత్వం మచ్చుకైనా కానరాక.
పగల సెగల బుస కొడుతూ.
అదును కోసం ఎదురు చూస్తూ కుట్రల విషాన్ని కక్కుతాయి.
అదంటేనే జనాలు బెంబేలెత్తి పోతున్నారు.

( ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
95
[17/07, 1:29 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:95.
శీర్షిక:ఉద్యమ హోరు.
-----------------------------------.

అది మేము ఉస్మానియాలో పిడికిలి ఎత్తిన సంవత్సరం.
ఉద్యమ పోరు గాలి ఉధృతంగా వీస్తున్న సంవత్సరం.
మేము ఉప్పెనలా కదులుతూ ఉరిమినం.
రాజ్యం చేసే కుట్రలను చేదిస్తూ ఉద్యమ గడ్డపై ఉరకలేసినం.
మాపై కురిసిన పిడుగులను భరిస్తూనే .
ఉద్యమ సూర్యుళ్ళుగా ఉదయించి .
అలుపెరగని పోరాటంలో కొదమసింహాల్లా.
పంజాలు విసురుతూ ప్రాణాలను పణంగా పెట్టినం.
రేపటి ప్రపంచం కోసం బంగారు కలలు కంటూ.
సమాజాన్ని మేల్కొల్పుతూ .
ఉద్యమ నినాదాలై విప్లవించినం.
నాయకుల రెండు నాలుకల ధోరణులను ఎండగడుతూ .
వారి ముఖంపై నినాదాలు విసురుతూ .
వారి బతుకులను ముట్టడించడం.
కేసులన్నీ మాపై ముప్పేట దాడి చేసి .
మమ్మల్ని బెదిరించి నిర్బంధించినా.
మాలో ఉద్యమ కోరిక చావలేదు.
మా సహచర ఉద్యమకారులు .
నినాదాలు వదిలి నిరాశలో కూరుకుపోయి.
తనువును చావుకి తాకట్టు పెట్టినప్పుడు.
మాలో ధైర్యం కించత్ అయినా తగ్గలేదు.
పోరుగాలిలో తెలంగాణ జెండాను ఎగుర వేస్తూ. ఆత్మగౌరవం కై ఆరాటపడుతూ.
అవనికే ఉద్యమ నీతిని నేర్పిస్తూ .
తెలంగాణను గెలిచి నిలిచినం.

(ఈ కవిత నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)
96


వీరాస్ కవి సమయము
తేదీ:18-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:96.
శీర్షిక:కవితా యోధుడు.
-------------------------------------.


ఆయన కలంతో అక్షరాలను చెక్కుతూ.
కమనీయమైన భావాలను వెలువరిస్తూ .
సూటిగా ప్రజల గుండెల్లోకి దూసుకుపోయే.
కవితా బాణాలను సంధిస్తూ.
అణిచివేతకు గురైన సమాజానికి .
వెలుగు రేఖలు ప్రసాదిస్తున్న కవితా సూర్యుడు.
ఆయన వెలువరించిన కవితా ఝరి .
సెగలు కక్కుతున్న లావాలా ప్రవహించి .
గుండె గుండెకు మంటను రగిలిస్తూ.
పొగల సెగల మధ్య నిప్పురవ్వలు చైతన్యమై.
ఆరని ఉద్యమ చిచ్చు రేపుతూ.
ఆగ్రహజ్వాలలై ఎగిసిపడుతూ.
నిజామ్ గుండెల్లో నినాదాలై.
నిప్పుల వర్షం కురిపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేసింది.
కోటి రతనాలకు ప్రాణం పోస్తూ .
ఆయన విసిరిన అక్షరాలే .
తెలంగాణ అంతటా చైతన్యవారధిగా మారి. ఉద్యమ ప్రేరణగా నిలిచాయి.
ముసలి నక్కకు ముక్కుతాడేస్తూ.
తెలంగాణ రైతుని గగనసీమలో ఆవిష్కరిస్తూ.
పీడిత ప్రజల గొంతుకై నినదించారు.
అగ్నిధార రుద్రవీణను కవితా పుష్పక విమానంలో.
ఊరేగిస్తూ తిమిరంతో సమరం చేస్తూ .
సమాజంలో మార్పు కోసమే తీర్పునిస్తూ.
ధ్వజమెత్తిన ప్రజాను నేత్రపర్వంగా చిత్రిస్తూ.
ఆంధ్ర కవితా సారథిగా వెలుగొందారు.
తెలంగాణకు పట్టిన పిశాచం దుమ్ము దులుపుతూ.
దొరల దురాగతాలను ఖండిస్తూ .
సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న.
తెలంగాణ సమాజాన్ని ఓ దరికి చేరుస్తూ .
కవన ఖడ్గాన్ని  జలపించారు.
అమరవీరుల ఆశయాలకు ప్రాణం పోస్తూ.
ఉద్యమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ .
కోకిల గొంతులకు గానమందించారు.
అభ్యుదయ భావాల ఆచరణలో.
అలుపెరుగని పోరాటం చేస్తూ .
ఊహల్లో విహరిస్తున్నా కవితా భావాలను భూమ్మీదికి దించి.
వాస్తవ కవితా వనం సృష్టిస్తూ .
అభ్యుదయ కవితా చక్రవర్తిగా ప్రసిద్ధిగాంచారు.
97
వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:97.
శీర్షిక:నిర్మాణం.
----------------------------------.

ఉద్యమ ప్రయాణంలో  అనేక ఒడిదుడుకులెదుర్కొంటూ .
ఉప్పెనలా ముందుకురికినం.
ప్రాణాలను పణంగా పెట్టి పోరాడినం.
మా దేహాలకు తగిలిన దెబ్బలు .
మాయని మచ్చలా మిగిలే ఉన్నాయి.
తెలంగాణ నిర్మాణంలో.
బంగారు ఇటుకల్లా వుంటామనుకున్నాం.
పారదర్శక సమాజాన్ని నిర్మిస్తామనుకున్నాం.
తెలంగాణ దేశానికే ఆదర్శ రాష్ట్రంగా ఉంటుందనుకున్నం.
అయితే!!
మా కలలన్నీ కల్లగానే మిగిలిపోయాయి.
మా నిధులన్నీ కొల్లగొట్టబడ్డాయి.
ఉద్యోగాలు అంగట్లో సరుకులయ్యాయి.
తెలంగాణ తల్లి పాలకుల చేతుల్లో .
బందీ అయి నిరాశలో కూరుకుపోయింది.
యువకులంతా  గతితప్పి తిరుగుతున్నారు.
ఉద్యమ వేగుచుక్కలు కనుమరుగయ్యారు.
చీకట్లో సంచరించే రాజకీయ గబ్బిలాలు.
తెర మీదికొచ్చి జనాలను తోలు బొమ్మల్లా ఆడిస్తున్నారు.
సమాజం అసమానతలతో మూలుగుతుంది.
ముందు తెలంగాణను నిర్మించండి.
తరువాత పునర్నిర్మాణం గురించి మాట్లాడండి.

(ఈ కవితా నా సొంత రచన .ఇది దేనికి అనువాదం కాదు)


98
వీరాస్ కవి సమయము.
తేదీ:19-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:98
శీర్షిక:మహా నటులు.
------------------------------.


వారు ప్రపంచ స్థాయిలో నటిస్తూ...
నటనకే నడకలు నేర్పిన హంసలు.
జగన్నాటక సూత్రధారికే జిత్తులు నేర్పగల నేర్పరులు.
కపట ప్రేమ కల్లబొల్లి మాటలు.
వారికి వెన్నతో పెట్టిన విద్య.
మనుషులను మాటలతో మాయ చేయగలిగే మాంత్రికులు.
నోటితో పలుకుల పాకం పడుతూ.
పొగడ్తల మిఠాయిలు తినిపిస్తూ.
నొసటితో వెక్కిరిస్తారు.
మనసులో మాలిన్యం నింపుకొని.
మంచి మానవత్వం మరిచి.
కుట్రల పల్లకిలో ఊరేగిస్తూ.
పైశాచికానందాన్ని పొందుతారు.
మానవ హృదయాలను మురిపిస్తూ.
ఆనంద సాగరంలో ఓలలాడేలా.
 మాటలను ప్రయోగిస్తూ.
తాము అనుకున్న కార్యాలను సాధించుకుంటూ.
గుంట నక్కలా మారుతారు.
99
[21/07, 1:06 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
తేదీ:21-07-2020.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:99.
శీర్షిక:ముచ్చటైన ఉత్సవం.
-------------------------------------.

సమాజంలో శాంతి నెలకొనాలని .
పాడిపంటలు వృద్ధి చెందాలని.
వ్యాధులు ప్రకోపించకుండా చూడాలని.
వేడుకుంటూ దేవతలకి బోనం సమర్పిస్తూ.
భక్తిభావంలో తడిసి ముద్దవుతారు.
పోతురాజుల కోలాహలం .
కొంగుబంగారం చేసే తల్లుల దీవెన.
ఆడబిడ్డల అందెల సవ్వడి .
భజనలు చేసే భక్తుల గీతాలు .
వెరసి బోనాల ఉత్సవం.
తల్లుల నిండైన రూపాన్ని .
మదిలో నింపుకొని ఆరాధిస్తూ.
కోరిన కోరికలు పండాలని.
ముక్కులప్పజెపుతూ తనివితీరా దర్శిస్తారు.
ఊరంతా బోనాలు ఎత్తుకుని .
మంగళకరమైన మేళతాళాలతో కదులుతూ. పవిత్రమైన తల్లుల చెంత ప్రసాదాలు పంచుతూ .
మానవ ఐక్యతకు దారులు వేస్తారు.....

(ఈ కవిత నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)
100
[21/07, 1:59 PM] Maddirala Satyanarayan Reddy 19: వీరాస్ కవి సమయము.
కవి పేరు: మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
జిల్లా: నల్లగొండ.
కవిత సంఖ్య:100.
శీర్షిక:ఆదర్శమూర్తి.
---------------------------------.

మంచితనం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది.
మహోన్నతమైన భావాలను కలిగి.
ఉన్నతమైన ఆలోచనలు చేస్తూ .
మాకు ఆదర్శపురుషుడు గా ఉంటూ .
వెన్నుతట్టి ప్రోత్సహించేవాడు.
మేము చేసే అన్ని కార్యాలలో .
తనదైన ముద్ర వేస్తూ .
మా కుటుంబానికి పిల్లర్ లా ఉండేవాడు.
నేడు ఆ పిల్లర్ కూలిపోయింది.
మమ్మల్నందర్నీ ఒంటరిని చేస్తూ.
విషాద తీరాల్లో వదిలేసి .
ఈ జన్మకు సెలవు ప్రకటిస్తూ .
ఒంటరి పక్షై ఎగిరిపోయాడు.
ఆయన జ్ఞాపకాలతో కదులుతున్న కాలం.
మమ్మల్ని కఠినంగా శిక్షిస్తుంది.
ఆయనకై పరితపిస్తూ .
మా మనసులు దహించబడుతున్నాయి.
కలలోనైనా ఆయన రూపం కల్పించాలని కోరుకుంటూ...

(మా బాబాయ్ అనంత రెడ్డి గారికి నివాళి తో)

(ఈ కవితా నా సొంత రచన. ఇది దేనికి అనువాదం కాదు)

Comments

Popular posts from this blog

తిరు వేంకటాచార్యులు KS 6

బాటసారి KS 12

అనామికా శతకం విట్టుబాబు గారు