గాజుల భారతి శ్రీనివాస్ KS 20

అమ్మా... నీకు వందనం!
1
పట్టుపరుపు లెందుకు
హంసతూలిక తలపాలెందుకు..
నీకై నేను ఉన్నాననే
నిశ్చింతను చేకూర్చే..
అమ్మా ఒడి ఉంటే చాలు...
ఊరంతా..వెలుగులు నింపే
పున్నమి చంద్రుడేందుకు
చల్లని వెన్నెల కిరణాలెందుకు
నాకై ఎంతో సహనంతో...
ఎదురు చూసే..ప్రేమతో పిలిచే
అమ్మ పిలుపు ఉంటే చాలు...
వజ్రావైడూర్యాలెందుకు...
ధనధాన్యాలేదుకు
విలువైనది..వెలకట్టలేనిది..
కోల్పోతే..తిరిగి
పొందలేనిది
అమ్మ..తోడుంటే చాలు..!!!

మా అమ్మ తో పాటు..
అందరి మాతృమూర్తులకి..
నా ఈ కవిత అంకితం..
అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు..
2
౼౼౼౼౼౼౼౼౼౼౼౼
కవి పరిచయం
*************
గాజుల. భారతి శ్రీనివాస్.
ఉపాధ్యాయురాలు
ఖమ్మం.జిల్లా
చరవాణి:-9849788108.
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
కవిత సంఖ్య:- 1
తేదీ:-7/5/2020
చర వాణి.9849788108
జిల్లా:-ఖమ్మం
శీర్షిక:-అమ్మ
కవి సంఖ్య:-20

నవమాసాలు మోసి తన ప్రేగుని తెంచి
తన ప్రతి రూపానికి ప్రాణం పోసిన దేవత అమ్మా
ఆ చిన్నారి పాపాయి
బోసి నవ్వుని చూసి
తనే ఈ ప్రపంచంలో కెల్ల అదృష్టవంతురాలనే భావించి
తన సర్వం దారపోయాడానికి సిద్ధంగా ఉన్న త్యాగమూర్తి అమ్మా
తను కన్న కలలు
జన్మించిన
పాపాయి తీర్చుదన్నా ఆశలతో...ఆకాంక్ష లతో..
పెంచి పెద్ద చేసిన
సహనమూర్తి అమ్మా
[19/05, 10:45 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవి సమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
కవిత సంఖ్య:-2
తేదీ:-8/5/2020
చర వాణి:-9849788108
జిల్లా:-ఖమ్మం
శీర్షిక:-నలుపులో ఎన్ని పిలుపులో
కవిసంఖ్య:-20


కాకి నలుపు
కోకిల నలుపు
అయితేనేం
తన గళం ద్వారా లోకాన్ని మేలుకొలుపు
తన గాత్రం ద్వారా తీ పిని రుచి చూపు
రాముడు నలుపు
కృష్ణుడు నలుపు
అయితేనేం
పితృవాక్కు పరిపాలన తెలుపు
జగన్నటాక చరిత్రను తెలుపు
చీకటి నలుపు
కాటుక నలుపు
విశ్రాంతి వకిటని తెలుపు
అరవిరిసిన నేత్రాలకు అందమని తెలుపు
మేఘం నలుపు
నా గలి నలుపు
జలసిరులు కురిపించు
పచ్చని పంటలు పండించు
T. V. నలుపు
Cell. నలుపు
అయితేనేం
నలుమూలల ప్రపంచ తీరుతెన్నులు తెలుపు
నరమనవుడ్ని ప్రపంచం నా చేతిలో ఉండు అని తెలుపు
కన్ను నలుపు
కాలు నలుపు
అయితేనేం
సకలజీవుల వెలుగురేఖని తెలుపు
సప్తమండలాలకు దారి నాదేనని తెలుపు

అసలు నలుపంటే రంగే కాదు
అన్ని రంగుల మిశ్రమం తెలుపు అయితే
అసలు రంగు ఏమీ లేకపోవడమే నలుపు
తెలిపే గొప్ప అనేవారికి
నీ తెలుపు నా పాదం కింద ఉంది
నా నలుపు నీ నెత్తి మీద ఉంది
అనడం చెంపపెట్ట గును
నలుపు తెలుపుల
గోల కంటే
నలుపు తెలుపుల సంగమమే జీవితమని
అదే గెలుపని
ఆలోచన విధానంలో మార్పు రావాలి
మార్పు మనతోనే మొదలు కావాలి!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[19/05, 10:45 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవి సమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్.
కవిత సంఖ్య:-3
తేదీ:9/5/2020
చర వాణి:9849788108
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
శీర్షిక:-పుస్తకం.
కవి సంఖ్య:-20


క్షరం కానిది పుస్తకం
అక్షరాల సమూహమే మంచి పుస్తకం
కోటి అనుభూతుల కొలువు
లక్ష అనుబంధాల నెలవు..పుస్తకం!
మధుర స్మృతుల వేదిక
తీయ్యని కలల దీపిక
ఉమ్నీనీకారిని.. కార్యోన్ముఖదర్శిని..
చరిత్ర సాక్షి
నవచరిత్రకు పునాది
వేల వేల భావాల వీచిక..
వందల..వేల సంఘర్షణలా జ్ఞాపిక
మానవ నిక్షిప్త నీగూఢ వారధి
జ్ఞాన..విఙ్ఞానాల మైలు రాయి
నవ్యానుభూతుల గీటురాయ్
పుస్తకం ఒక మంచి నేస్తం.
అది ఒక పసిపాపల నవ్విస్తుంది.
అపుడే విరిసిన పువ్వులా... పలకరిస్తూఉంది!!!


ఈ కవిత నా సొంత మని హామీ ఇస్తున్నాను.
[19/05, 10:46 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్.
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
కవిత సంఖ్య:-4
శీర్షిక:-అమ్మా.. నీకు వందనం!!!
కవి సంఖ్య:-20



పట్టుపరుపు లెందుకు
హంసతూలిక తల్పాలెందుకు
నీకై..నెనున్నాననే
నిశ్చింతను చేకూర్చే
అమ్మ ఒడి ఉంటే చాలు..
ఊరంతా వెలుగులు నింపే పున్నమి చంద్రుడు ఎందుకు
చల్లని వెన్నెల కిరణాలేందుకు
నాకై ఎంతో సహనంతో ఎదురుచూసే
ప్రేమతో పిలిచే అమ్మ పిలుపు ఉంటే చాలు.
వజ్రావైడూర్యాలు ఎందుకు
ధన ధాన్యాలేందుకు
విలువైనది..వేల కట్టలేనిది
కోల్పోతే తిరిగి పొందలేనిది
అమ్మ తోడుంటే చాలు.!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.

మా అమ్మతో పాటు
మాతృమూర్తులకు ఈ నా కవిత అంకితం
[19/05, 10:46 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-హాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
కవిత సంఖ్య:- 5
కవిత శీర్షిక:-నువ్వు వచ్చాక.
కవి సంఖ్య:-20



ఎన్నో వచ్చాయి సూర్యోదయాలు
మరెన్నో వచ్చాయి చంద్రోదయా లు
ఎన్నో చూసాను ఉషోదయాలు
అపుడు అంతా మామూలుగానే ఉన్నాయి
ఇప్పుడంతా మహా సంబరంగా ఉన్నాయి
నిన్ను చూసాక
నువ్వు వచ్చాక
శోభయామానంగా ఉన్నాయి
ప్రకాశవంతంగా ఉన్నాయి
నా కంట్లో...
నా ఇంట్లో..
     వెలుగులు నింపాయ్!!!



ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[19/05, 10:47 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
కవిత సంఖ్య:-6
కవిత శీర్షిక:- నవ్వు
కవి సంఖ్య:-20



ముసి ముసి నవ్వు మురిపాల నవ్వు
గలగల నవ్వు గాంధర్వ నవ్వు
హాయ్ లా నవ్వు
హాయి ని గోలుపు
ఇంకొన్ని నవ్వులు
ఆనందతీరాలకు తియ్యటి పిలుపులు
మనఃవేదనను తీర్చే మేలిమలుపులు
స్వర్గటంచులను చేర్చే వెండి వెన్నెల కొలువులు
వర్ణ సువర్ణ శశివర్ణ సమీరాలు!!
కొన్ని నవ్వులు తీ య్యని వేడుకలు
ఇంకొన్ని నవ్వులు నెమలి నాట్యాలు
మరికొన్ని తీయ్యతీయ్యని మకరందాలు
వేల కట్టలేని పన్నీటి జలకాలు
అనుకోని వరాలు..
ఊహించని సంతోషాలు
తళుకు...బెళుకుల నవ్వు తరగని నవ్వు
పక పక నవ్వు పరువాల నవ్వు
కిలకిలా నవ్వు కులుకులా నవ్వు

ఎం నవ్వురా బాబు..
ఎదను గుచ్చే గులాబీ పువ్వు..!!!!

మనఃస్పూర్తిగా నవ్వే
 వారందరికీ
 అంకితం""
[19/05, 10:47 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
కవిత సంఖ్య:-7
కవిత శీర్షిక:-గగన సిగలో రవిని చూపనా
కవి సంఖ్య:-20


ఎండకు వెయ్యి దండ్డలుబెట్టా
మాడనంతా మంట పెడుతుంది
బంగరాజ్ లాంటి నన్ను
బావిలో మునకలు వెయిస్తుంది
బయటకు వెళ్లక తప్పదాయ్
వెళ్తే ఎండతో తిప్పాలయే
వీరులు..శూరులు అనే తేడా లేదు
చిన్నా.. పెద్దా అనే భేదం లేదు
అట్టుడికి పోయేలా అతలాకుతలం చేస్తుంది
శీతల గాలులకై పరిగెత్తేలా చేసి
అందరి చేత బంతటా ఆడిస్తుంది!
ఉడుకు సల్లగుండా
కునుకు లేకుండా చేస్తుండే
చెట్టంతా వాణ్ణి చెడుగుడు ఆడిస్తుండే!
చల్లని సుక్కకై తరుముతుండే
నీటి కొలనులో నిండా మునిగెట్టు చేస్తుండే!!!



ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[19/05, 10:48 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
కవిత సంఖ్య:-8
రచనతేదీ:-14/5/2020
కవిత శీర్షిక:అన్వేషించే కళ్ళు
కవి క్రమ సంఖ్య:-20


అవి నయనాల కాదు..కాదు
ఎదను చదివే
X-కిరణాలు
నా ఎదను తడిపే హిమ పవనాలు
సింగిడి వర్ణాలు
పున్నమి వెలుగులు
అరుణారున కిరణాలు
నా సఖి నయనాలు
తొనకని బెనకని వైనాలు
ఆత్మీయ ఆలింగనాలూ
కరుణా తుషారాలు
మరులు గొలిపే మాయలు
కలువకన్నులు..
ఎన్నేన్నో భావాలు
అన్నీ ఉన్నా నయనాలు
కఠిన కాఠిన్యాలు
మల్లెల నవ్వులు
విరాజాజి పువ్వులు
వెండి వెన్నెల కొలువులు
నిండు పున్నమి పిలుపులు
అవి కన్నులా..కాదు కాదు...
నన్ను కాల్చే..
కార్చిచ్చులు..!!!


ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.
[19/05, 10:48 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-9
రచనతేదీ:-15/5/2020.
కవిత శీర్షిక:-మేరా.. భారత్ మహాన్.
కవి క్రమ సంఖ్య:-20


నూట ముప్పై కోట్ల ప్రజల వెలుగుల నా బంగారు భారతదేశమా!
సామాన్య ప్రజా హృదయ రంజక పతాకమా..
నీకు వందనం!
జననీ భారతీ ఆశీస్సులతో..
కొత్తగా ఆలోచిస్తూ..
ఆచారణంగా మలుస్తూ..
శాంతి కపోతాలను ఎగురవేస్తూ..
హృదయ స్పందన ఉప్పొంగేలా చేస్తూ..
ప్రణమిల్లి మ్రొక్కెదం
అమ్మా భారతి నీకు వందనం
మహోన్నత హిమాలయ శిఖరాల నుండి
కన్యాకుమారి వరకు వీచే ఈ గాలులలో
ప్రాణ త్యాగాల అమరవీరుల స్మరణ వేల
నా తనువు గర్వంగా ఉప్పొంగి భారతీయూనిగా
ఈ పసిడి నేలకు పాదాభివందనం
మాతృభూమి కోసం
ప్రాణాలను పణంగా పెట్టి
తణువులను ఉరికొయ్యలకు అంకితమిచ్చే
అమరవీరులారా అందుకో నా వందనాలు
భారతీయూరాలిగా జన్మించినందుకు గర్వపడుతూ..
నా ప్రాణమున్నంత వరకు
నేను..నినదించే నినదాం..
మేరా భారత్ మహాన్!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
10
****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-10
రచనతేదీ:-16/5/2020
కవి క్రమ సంఖ్య:-20
కవిత శీర్షిక:-యూద్దనికి సిద్ధమా.. రోగం తరిమేద్దామా.


కరోనా నెలకొల్పిన భయానక స్థితి
గడప బయటపెట్టని జనాల ప్రస్తుత స్థితి
ఎలా పుట్టిందో తెలియక
ఎలా వ్యాపించిందో ఏరుకకా
చాపకింద నీరులా ప్రపంచమంతా పంజా విసురుతోంది
మానవ మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తుంది
విజ్ఞానల శాస్త్ర లకే సవాల్ విసురుతోంది
చడీ చప్పుడు లేకుండా సమాధులు కడుతుంది
మానవ తప్పిదామ లేక
ప్రకృతి వైపరీత్యమా
కంటికి కనపడని కల్లోలిత కరోన
కంటి నిండా నిద్ర లేకుండా చేస్తుంది
యూగాంతం ఇదేనా అనేలా ప్రాణాబితిని గొల్పుతుంది
అణుబాంబుల
అణ్వాయూదాలు లేవు
కొట్లాటలు లేవు
రక్తపతాలు లేవు
అయిన
విషవావుతో ప్రాణాలను గాల్లో కలిపేస్తుంది
గుమికూడకుంటా
దూరం దూరం ఉంటూ
కారోననూ కనుమారుగయ్యేలా చెయ్యాలి
బడులు..గుడులు మూతలయే
ప్రజల్లో చైతన్యం మొదళాయే
మహమ్మారి కారోననూ మట్టుబెట్టే గడియ వచ్చే
అందరం ఇంట్లోనే ఉందాం..
కరోన పతనానికి నాంది పలుకుదాం!!


ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

11
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
రచనతేదీ:-17/5/2020
కవి క్రమసంఖ్య:-20
కవిత శీర్షిక:-ధరణి నవ్వింది


కరోనా పుణ్యమా స్వీయనిర్బంధం వలన కలిగిన మేలు చూసి ధరణి నవ్వింది

పచ్చని పంటపొలాలు
నిండిన దాన్యగారాలు
హాయి గొలిపే ప్రకృతి శోభలు
అరవిరిసిన మందార అందాలు
కనువిందు చేసే అపురూప సౌందర్యాలు చూసి
ధరణి హాయి గా నవ్వింది

గల గల పారె నదులను చూసి
జల జల పారే జలపాతాలు చూసి
స్వచ్ఛమైన సముద్రాలు చూసి
కుహు కుహు పాడే కోయిలా గానా లు చూసి
కిచ కిచమనే పిచ్చుకల సందడి చూసి
ధరణి నిండుగా నవ్వింది

నెమలి నాట్యాలు చూసి
లేళ్ల గంతులు చూసి
తుళ్ళిపడే జింకల పరుగులు చూసి
కుందేళ్ల సంతోష ఉరుకులు చూసి
స్వచ్ఛమైన...
పచ్చనైనా
అడవి మాదే నని అంబరాన్ని తాకే సంబరాలు జరుపుకునే జంతువులను చూసి..
ధరణి పక పక నవ్వింది!!
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాన

12
వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
రచనతేదీ:-18/5/2020
కవి క్రమసంఖ్య:-20
కవిత సంఖ్య: 12
కవిత శీర్షిక:-సందడి నిద్రపోతుంది

కరోన పుణ్యమా అని సందళ్ళు నిద్రపోతున్నాయి
పెళ్లి..పేరంటా లు లేవు
బజాబజంత్రీలు అసలే లేవు
డోలు..సన్నాయి..మూగ బోయి మూలనున్నాయి
పురోహితులా మంత్రాలు లేవు
అమ్మలక్కలా హడావుడిలు లేవు
సందడి నిద్రపోతుంది!

రోడ్లన్నీ ప్రశాంతంగా
నిద్రిస్తూన్నాయి
రణగొల ధ్వనులు లేవు
ఉద్యోగస్తుల ఉరుకులు లేవు
బడిపిల్లల పరుగులు లేవు
బస్సు హారన్ల మో తలు లేవు
సందడి నిద్రపోతుంది

వేసవి యాత్రలు లేవు
సినిమా షూటింగ్స్ లేవు
క్లబ్బులు.. పబ్బులు బందులాయి
బడులు.గుడులు మూతలయే
కరోన చేతిలో ప్రపంచం బందీ ఆయే
లాక్డౌన్ మొదళాయే
సందడి కరువయ్యి
సందడి...సందడే లేక నిద్రపోతుంది!!!
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

13
వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-13
రచనతేదీ:-19/5/2020
కవి క్రమ సంఖ్య:-20
కవిత శీర్షిక:-మేమున్నాం..మీకు అండగా!


కరోన మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తుంది
దేశవ్యాప్త దిగ్బంధంతో
జీవనశైలి అస్తవ్యస్తమైపోయింది
కరోనాకు టీకా లేదు
ఖచ్చితమైన చికిత్సా లేదు
మేమున్నాం మీకు అండగా అంటూ...
వైద్యుల సేవలు వెలకట్టలేనివి
కరోనాతో వైద్య బృందం సైనికులుగా సేవలందిస్తూ
సర్వశక్తులు ఒడ్డి మహా యూద్దమే చేస్తున్నారు
వారి పాదాలు తాకి శిరసాభివందనం చెయ్యాలి!!
వారు చేస్తున్నా సేవా..త్యాగం అలాంటివి
కరోన రక్కసికి ధనిక..పేద భావం లేదు
నేతలైనా...సమాన్యులైన ఆ వైరస్ కి ఒక్కటే
కోరలు చాచి విజృభించడానికి
ప్రాణం ఉన్న మనిషైతే చాలు
కరోనా ముప్పుతో
మానవాళికి కనువిప్పు కలిగింది
ప్రజానీకం ఉదాసినతతో లేకుండా..ఉక్కు సంకల్పంతో
అందరం ఇంట్లోనే ఉందాం!
కరోనా పతనానికి నాంది పలుకుదాం!!!


ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
14
వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-14
రచనతేదీ:-20/5/2020
కవి క్రమ సంఖ్య:-20
కవిత శీర్షిక:-ప్రకృతి....స్త్రీ.


స్త్రీఏ ప్రకృతి..ప్రకృతే స్త్రీ.
రెండింటిని విడదీయలేము
విడదీసి మనలేము
చూసి ఆనందించలేం
ప్రకృతి...స్త్రీ. రెండు శాంతి స్వరూపులు
ఆకలేస్తే అమ్మైయ్ ఆసరా ఇస్తుంది
చేతకాని వేళా చేతి కర్రయి చేయూథానిస్తుంది
అభయ హస్తం అందిస్తూ..
అండ దండగ ఉంటూ
ఉన్నతిలో అహర్నిశలు నిన్ను కంచెలా కాపలా కాసే రక్షణ సైనిక తానే
స్త్రీ.. అంటే సౌభాగ్యం
స్త్రీ.. అంటే సౌశీల్యం
దశ అవతారాల చైతన్య శాంతి
శత అవధానుల సరిసమాన క్రాంతి
తనకంటూ ఏమి లేకుండా
తన కోసం ఏమి కొరకుండా
తన వాళ్ళ శ్రేయస్సు కోసం
తలచి..వలచి..నిలిచిన..సేవకురాలు..స్త్రీ.. ప్రకృతి.
వెన్నెల హాయి ఆస్వాదన తెలుసు
మల్లెల పూల పరిమళాలు తెలుసు
కరుణా.. లావణ్య..దయార్ద్ర హృదయ కోమలాంగులు..
ప్రకృతి..స్త్రీ.
రెండూ ఒకటే!
మాట తేడా వస్తే..
మహిషాసురమర్ధనులు... కాళికంబా స్వరూపులు కాగలరు!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.



15
వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్.
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవియ్హ సంఖ్య:-15
రచనతేదీ:-21/5/2020
కవి క్రమ సంఖ్య:-20
కవిత శీర్షిక:-విన్నపం


కామ్ గా ఉండకు
ఖాళీ నే నవుతా.
మునిగా ఉండకు
నీ మాట రాహిత్యంలో
నే అల్లాడిపోతా..
పట్టించుకోకుండా ఉండకు...
పిచ్చెక్కిపోతా...
పలకరిస్తూ ఉండు..
పరవశించిపోతా.
ప్రేమిస్తూ ఉండు..
నీ ప్రాణానికి ప్రాణంగా ఉంటా...!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను



16
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్.
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
రచనతేదీ:-22/5/2020
కవిత సంఖ్య:-16
కవిత శీర్షిక:-వజ్రాయు దం
కవి క్రమాసంఖ్య:-20


నీ ఓటు
         దేశ ప్రగతి మెట్టు
ఆశపడి పెట్టకు తాకట్టు
బురిడీ మాటలు కనిపెట్టు
దొంగనాయకుల పని పట్టు
గాలిమాటల మనిషిని
నీ ఓటు తో చితక్కొట్టు
నిజమైన నాయకుని పసిగట్టు
నికార్సైన నాయకుని జై కొట్టు
నీ వజ్రాయుధ ఓటుతో పట్టం కట్టు!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[23/05, 11:58 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
17
****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-17
రచనతేదీ:-23/5/2020
కవి క్రమాసంఖ్య:-20
కవిత శీర్షిక:-స్వేచ్ఛ

స్వేచ్ఛ మనిషికి
అన్న పానీయలంతా అవసరమైన హక్కు
స్వేచ్ఛ లేని జీవితం శూన్యం
జన్మ వ్యర్థం
స్వేచ్ఛ నిండిన మనసులు
అందమైన లోకాన్ని ఆవిష్కరించు
స్వేచ్ఛ లేని జీవితం
గూటిలో గువ్వలా
పంజరంలో చిలకలా
కారాగారంలో ఖైదీలా
జైల్లో బందీ లా ఉండును
అపరిమిత స్వేచ్ఛ అనార్దదాయకం
హద్దు ఉంటేనే అందం
బిడ్డకైనా..గొడ్డుకైన
పరిమిత స్వేచ్ఛ క్రమశిక్షణతో కూడిన ప్రశాంతతను ఇచ్చు
కలలు గన్నా తీరాలకు చేర్చు
హరించే స్వేచ్ఛ అవసరమా
ప్రమమున్న నిర్జీవీ
పిల్లలకి స్వేచ్ఛ నిచ్చి చూడు
రంగు రంగులా గాలిపటాలగును
వర్ణ..సువర్ణ సీతాకోక చిలుకలగును
అంతర్గత శక్తులు సాక్షాత్కరించు
కొత్త బంగారు లోకం ఆవిష్కరించు!!!


ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
18

వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-18
రచనతేదీ:-24/5/2020
కవి క్రమ సంఖ్య:-20
కవిత శీర్షిక:-ప్రేమలేఖ


నా ఎద సడితో
ప్రేమలేఖలు రాసి
చిరుగాలితో రాయబారం పంపా
నీ ఎద చేరలేదా...చెలీ!!
నా ఎద వీడొద్దనే ...
కన్నీటి విన్నపాల కబురందలేదా ప్రియా!
త్రికాల సుందరివై వస్తావని
చితికిన గుండెను
తడిమి ప్రాణం పోస్తావని..
రెప్పవేయడమే మరిచి
ప్రాణం ఉన్న శిల్పంలా...
నీకై వేచి ఉన్నానని తెలుసా ప్రియా!!!


ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
19.
వీరాస్ కవి సమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చరవాణి:-9849788108
రచనతేదీ:-25/5/2020
కవిత సంఖ్య:-19
కవిత శీర్షిక:-ప్రేమ
కవి సంఖ్య:-20

కనులు మూసిన తెరిచిన నీ ఊసులే
నీకై ఆరాటపడే నా మనసుకి స్వాంతన ఎక్కడ??
సంతోషం ఎక్కడ??
కనిపించకుండానే అనుక్షణం నన్ను కవ్విస్తావు
కలవరపడేలా చేస్తావు
నిన్ను వలచిన నా మనసు
నన్ను నిలువనీకున్నది
నీ చెంత చేరి తరించాలంటున్నది
పగలంతా వెలుగులా
ఇక్కడో..అక్కడో..
కనిపిస్తావని
సూదంతురాయిలా నా చూపులు నీకై
నిఘూకాస్తాయి
రేయి అయితే చాలు గుండెల్లో గుబులు
నువ్వు నాకు కానరావనే దిగులు
తొలిపొద్దు కోసం..
కళరాత్రిని కాగడాతో తరిమికొట్టి..
ఉషోదయం వేళా
నిన్ను చూడాలనే ఆశ
నన్ను ఉక్కిరి...బిక్కిరి చేస్తూ..కునుకులేని రెయిలెన్నో...
నీ ఊహల జడివానలో
నన్ను ముంచెత్తో ఘడియాలెన్నో
కాలంతో పాటు మారిపోయే మనసు నీది!!
నీ మనసు మారదా..
నా మనసు చేరదా...
నీ ఎదురుగా నేనే...
నా ఎద నిండా నువ్వే

మాట రాని మౌనం నీది.
మారిపోని...
ప్రేమ నాది...!!!


ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను


20

వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చరవాణి:-9849788108
రచనతేదీ:-26/5/2020
కవిత సంఖ్య:-20
కవిత శీర్షిక:- కంటే కూతుర్నే కనాలి!
కవి క్రమ సంఖ్య:-20


అమ్మ అనురాగపు ఊపిరిలు
నాన్న ఆప్యాయతలా ఆరోప్రాణాలు
లేలేత అమాయకపు మోములు
మన కంటి..మన ఇంటి ఆడపిల్లలు
అమ్మాయి అంటే కుడికలు.. తీసివేతలు కాదు
కంట్లో నలుసు..అందరికి అలుసు కూడా కాదు
కూతురంటే..
వేల పున్నమి చంద్రుల వెలుగులు
కోటి కలువలా నవ్వుల పువ్వులు.
నన్ను అనుకరిస్తూ..అనున్నాయిస్తూ..
సూచనలు చేస్తూ మంత్రిగా..
సున్నిత హెచ్చరికలు చేస్తూ ప్రియ స్నేహితురాలిగా
ఆర్ధిక లెక్కలు చేసే అష్టలక్మిలా
గణ గణ గంటకొట్టేలా చదివే సరస్వతిలా..
అమ్మా.. బాగుంటే ఇల్లంతా..బాగుంటుందనే గొప్ప మాట పలికే..మా...అమ్మలా.తోడుంటా నంటూ.. నీ నీడ నేనే అంటూ
అక్కడా.. ఇక్కడా కాదు..నీ అంతా నేనే అంటూ..
ఆకలేసిన వేళా కంచంలో బువ్వవుతూ
చేతకాని వేళా ఆసరా ఇచ్చే ఉతకర్రావుతు
నవ్వుతూ.. తుల్లుతూ
మువ్వలతో నట్టింటా నడయాడే..
అమ్మకే అమ్మాయినా
నా ప్రతిరూపం..నా ప్రపంచం
కూతురంటే మన ఇంట్లో ఉండే తులసి మొక్క
పవిత్రంగా చూసుకునే చక్కని ఛుక్కా.
అందర్నీ దీవించే కల్పవల్లి
కూతురున్న ప్రతీ ఇల్లు దేవాలయమే
నిత్య. నూతన సంతోష హరివిల్లులా ఆలయం!
నా అంతా ఎదిగిన నా కూతుర్ని చూస్తే..
మళ్ళీ..మళ్ళీ..నేను చెప్పే ఒకే ఒక మాట.
కంటే ..కూతుర్నే కనాలి!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను


వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చరవాణి:-9849788108
కవిత సంఖ్య:-25
కవి క్రమ సంఖ్య:-20
శీర్షిక:-ఉగాది

     ఉగాది
************

అద్భుతమైన ఉగాది రొజునా
అందమైన భవిష్యత్ లోకి
ఆనందంగా అడుగిడుదాం
కొత్త చివుళ్ళ కూనిరాగాలు
నవపల్లవుల మేళవింపులు
పంచాంగాల పలకరింపులు
అవధానుల హాస్యకేళీలు
ఆనంద ఆలింగణాలు
కోటికలలను కంటూ
కొత్త ఊహలను చిగురింపచేస్తూ
కొంగొత్త ఆశలవైపు పరుగులు తీస్తూ
స్వాన్తన లేని జీవితాలలో..సంతోష సాగరంలో నిండే ఉగాది రావాలని
ఉషోదయపు ఉషస్సులు తేవాలని
కోరుకుంటూ..

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

21
వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చర వాని:-9849788108
రచనతేదీ:-27/5/2020
కవిత సంఖ్య:-21
కవి క్రమసంఖ్య:-20
శీర్షిక:-నువ్వే..నువ్వే

       నువ్వే..నువ్వే

నువ్వు ఉంటే చాలు
నిన్ను చూస్తే చాలు
అదే నాకు మేలు..మేలు
ఎలా చెప్పను
ఏమని చెప్పను
ఎంతని చెప్పను
నువ్వు కావాలి
నీ స్నేహం కావాలి
నీ ప్రేమ కావాలి
ఏ అనుమానం లేదు
ఏ సందేహం లేదు
ఈ మాటే నీకు చెప్పాలంటే గుండే జారినట్టుగా
నిన్ను దగ్గరగా చూడాలంటే తనువు తులుతున్నట్టుగా..
నిన్ను తాకాలంటే
ప్రాణమంతా లయ తప్పుతున్నట్టుగా ఉంది
ప్రేమంటే...ఇదేనా!!!


ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
22
[01/06, 1:07 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్.
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చరవాణి:-9849788108
రచనతేదీ:-1/6/2020
కవిత సంఖ్య:-22
కవిత శీర్షిక:-పరమౌషదం నీరు
కవి సంఖ్య:-20

  పరమౌషదం నీరు
******************
సర్వకాల సర్వావ్యవస్థలకు ఆధారం నీరు
చారాచరజీవుల గమనలయకారి నీరు
జలమే జీవనాధారం
జలమే జగతికి ప్రధానం
ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన అపురూపమైన వరం నీరు
ప్రప్రధంగా జీవం నీటి నుండే ఆరంభమైనది
నీటిని విశ్వవ్యాప్త ద్రావణి అని కొనియాడుతూ
నీరు వాతావరణ పీడనాల నుండి రక్షిస్తూ
శారీరంలో రవాణా వాహకంగా ఉంటూ
వ్యార్ధాలను బయటకు విసర్జిస్తూ
మానవుడికి పరమౌషదం నీరు
గృహ..పరిశ్రమల..వ్యవసాయానికి. నీరే ఆధారం
విద్యుత్ ఉత్పత్తిలో చాలా ప్రధానం
సతతం హరితం కావాలంటే నీరే ముఖ్యం
మొక్కల్ని నాటుదాం
పుడమితల్లికి పచ్చలహారంతో తోరణం కడదాం
నేలపై పచ్చని పరదాలను పరచి
హరిత తీవాచిలపై ఆనందించాలన్నా నీరే ఆధారం
నీటిని వృధాచేయక
పొదుపుగా వాడుతూ
భవిష్యత్ తరాలకు బహుమతిగా ఇద్దాం
ప్రాణకోటి మనుగడకు ప్రాణధారాన్ని అందిద్దాం!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.
23
[01/06, 1:29 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
రచనతేదీ:-1/6/2020
కవిత సంఖ్య:-23
కవిత శీర్షిక:-ధూమపానం ఆరోగ్యానికి హానికరం
కవి సంఖ్య:-20

ధూమపానం ఆరోగ్యానికి హానికరం
******************

ఆరోగ్యానికి పొగాకు హానికరం
నూనూగుమీసాలా నూత్నయవ్వనంలో సరదాగా ఫోజు..ఫ్యాషన్ గా ధూమపానం మొదలై
నిన్ను తుదముట్టించేదాక వదలకా..
వెంటాడి..వేటాడి..నువ్వు నమిలిన పోగాకే నిన్ను నలిపి నమిలేస్తుందని గ్రహించు
నుసిచేసి..నలిపేసి నమిలేస్తు నీ బ్రతుకును మసిచేసుకోకు
మత్తులో పరిభ్రమిస్తూ ఆతృత..ఆందోళనలతో ఉన్మాదిలా ఉగ్రరూపుడవై..
శివాలెత్తి చిందేస్తూ..ఆలి బిడ్డల్ని కానక..
తోచిందే చేస్తూ
ఒక్క నిమిషం కిక్కు.. మైకం కోసం
నిండు నూరేళ్ళ పచ్చని బతుకును పొగాకు బానిసై తృణప్రాయంగా తుంచేస్తూ..నీకు నువ్వే చితి పేర్చుకోకు
నువ్వు పీల్చి..వొదిలే వాయువు నీకే కాక నీ కుటుంబ ప్రాణాలను గాల్లో కలిపేస్తుంది
చాడీ.. చప్పుడు లేకుండా సమాధులు కడుతుంది
ఎంత దయనీయం
ఎంత దారుణం
ఖైనీ..గుట్కా..తంబాకు..పొగాకు..
   పేర్లు ఏమైనా తీరు ఒక్కటేగా.
రూపాలు వేరైనా గుణమొక్కటేగా
ధూమపానానికి బానిస కాకు
పచ్చని బ్రతుకును కాల్చుకోకు
విజ్ఞతతో..వివేకంతో మెలిగి
యోగ..ధ్యానం చేస్తూ..విజేయూడివై జీవించు..
మీ వాళ్ళ జీవితాలలో విజ్ఞాన జ్యోతులు వెలిగించు!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
24.
[01/06, 3:34 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్.
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చరవాణి:-9849788108
రచనతేదీ:-1/6/2020
కవిత సంఖ్య:-24
కవిత శీర్షిక:-స్నేహం చేస్తావా
కవి క్రమసంఖ్య:-20

 స్నేహం చేస్తావా
****************
చుక్కల్ని దాటివాస్తవా
నా ప్రక్కన చేరుకుంటావా
వెన్నెల్ని వీడి వస్తావా
నా ఎదలో నిండి ఉంటావా
సప్త సముద్రాలు ఈది వస్తాను
నాతో స్నేహం చేస్తావా
వెన్నెల వెలుగులో
పున్నమి హాయిలో
పురివిప్పిన మాయూరంలా విహరిద్దామా
అరవిరిసినా మందారంలా వికసిద్దామా!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
25
26
[01/06, 4:09 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చరవాణి:-9849788108
రచనతేదీ:-1/6/2020
కవిత సంఖ్య:-26
కవి క్రమ సంఖ్య:-20
శీర్షిక:-నేను సైతం

  నేను సైతం
*************
కాలం కాటేసిన
నా కలం సాగనని మొరాయిస్తున్నా
బృణహత్యలు అంతం చేసే ఫిరంగీనౌతా!
పసిపిల్లలు పనులకు కాదు బడులకు అని ఎలుగెత్తి చాటుతా
బాల్య వివాహాల భరతం పడతా
నేటి బాలలే రేపటి పౌరులని నిరూపిస్తా
కాలం పోకడలను గుర్తించే మెర్క్యూరినౌతా
యువతి..యువకుల ఉజ్వల భవిత మార్గదర్శినౌతా
సమాజ అసమానతలను ఖందించే ఖడ్గమౌతా
నవ సమ సమాజ స్థాపనకు నడుం కడతా
మత మాడ్యాలను పంచభూతాలలో కలిపే కాలయమునౌతా
నన్ను కన్నవారి కలల స్వర్ణమౌతా
శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆవాహన చేస్తా
అంతరార్ధాన్ని జనులందరికి అవగాహన చేస్తా!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
27

వీరా స్ కవిసమయం
******************
కవిపే రు:గాజుల భారతి శ్రీనివాస్
ఊరు: ఖమ్మం
చరవాని: 9849788108
కవిత సంఖ్య:-27
కవిత శీర్షిక:- లాల్ దర్వాజా బోనాలు

లాల్ దర్వాజా బోనాలు
****************
వర్షాలు బాగా కురవాలని
పంటలు బాగా పండాలని
ప్రజలంతా చల్లగా ఉండా లని
అమ్మవారిని భక్తి..శ్రద్ధలతో
కొలిచే పండుగ.. బోనాల పండుగ
బోనం అంటే భోజనం
దేవికి సమర్పించే నైవేద్యం
బోనాల జాతర లో శివ సత్తులు మట్టికుండపై నిల్చో ని భవిష్యవాణి చెప్పే తీరు మనోహరం
అమ్మా వారిని పసుపు.కుంకుమతో నిండుగా
అల్లం.బెల్లం... ఆకూ కూరల తో మెండుగా సమర్పించే తీరు అమోఘం
ఈ పండుగ మహిళల.కట్టు బొట్టు
భారతీయ సాంప్రదాయ లకు ప్రతీక
ఈ వేడుకలో ఉట్టి పడే వ్యవహార శైలి అద్వితీయం
బోనాల పండుగ జాతరలో బంధువులతో ..వాడ వాసులతో కలిసి...మెలిసి జరుపుకునే గొప్ప పండుగ
కోరిన కోర్కెలు తీర్చే
కొంగు బంగారమై నిల్చిన అమ్మోరు తల్లికి
అడుగడుగునా నిలువెత్తు దండాలు

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
28


వీరా స్ కవిసమయం
******************
పేరు:- గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:- ఖమ్మం
చర వాణీ:-9849788108
తేదీ:-3/6/2020
కవిత సంఖ్య;-28
శీర్షిక:- తొలకరి పులకరింతలు


తొలకరి పులకరింతలు
*****************
భగభగ మండే ఎండలు
నోళ్ళు విచ్చుకున్న నేలతల్లి నీ చూస్తుంటే
దాహార్తి కోసం అన్వేషించే కళ్ళు
పరి పరి విధంగా..ఆరాటపడే జనాలు
ఒళ్ళంత కళ్ళతో..రారాదా అంటూ..వెయ్యి దేవుళ్ళకి మోక్కుతూ
కోటి ఆశల పల్లకిలో ఊరేగుతూ..
ఆశగా ఆకాశం వైపు గ మించే నయనాలు
పల పల మంటూ ఉరుములు..మెరుపులతో..
నింగి అంతా మేఘావృతమై
దైవాగ్నకు నిరీక్షించిన దట్టమైన కారుమబ్బులు
రైతన్నా ఎద సవ్వడిల ఆశగా..ఆత్రంగా..వీక్షిస్తూ..
చిటపట చినుకుల లా ప్రారంభమైన తొలకరి జల్లు..
నింగి..నేల..వెలుగులేనుతూ..
జనావలి అంతా పలకరిస్తూ..
పురివిప్పిన నెమలి లా నాట్యం ఆడే..
జల్లుల్లో మైమరుస్తు..రవళి రాగంలో పారవశ్యంలో..
పచ్చని ప్రకృతి ఆనందంలో మునిగి తేలుతూ తొలకరి పులకరింతలు తడిసి ముద్దైంది!!

ఈ కవిత నా సొంతం
అని హామీ ఇస్తున్నాను
29

వీరాస్ కవిసమయమ్
******************
కవి పేరు:- గాజుల.భారతి శ్రీనివాస్.
ఊరు&జిల్లా: ఖమ్మం
చర వాణీ:-9849788108
కవిత సంఖ్య:_29
శీర్షిక:- మాతృదేవోభవ

మౌనమే తన భాష
గానమే తన ప్రసా
తియ్యని భావమే అమ్మా
చల్లని దీవెన అమ్మా
వేకువై పలకరిస్తుంది
ఈ లోకాన్ని చూపిస్తుంది
గానామై జోలపాడుతుంది
స్నాన మై లాలిపడుతుంది
పండు వెన్నెల అమ్మా
నిండు ఊపిరి అమ్మా
తియ్యని వేడుక అమ్మా
వేడుకకి వేడుక అమ్మా
మరపురానిది.
మరచిపోనిది
మధురమైనది
అమృతమైనది
అమ్మా!
నీ పిలుపే ఆలంబన
అమ్మా నీ పేరే ఆలపనగా
ఆది గురువు అయ్యావు
అంచలంచెలుగా నన్ను
ఎదిగేలా చేశావు

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
30

వీరా స్ కవి సమయం
*****************
కవి పేరు:- గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:- ఖమ్మం
చర వాణీ:-9849788108
కవిత సంఖ్య:-30
కవిత శీర్షిక:- ఏరువాక పున్నమి
తేదీ:-5/6/2020

   ఏరువాక పున్నమి
******************
తొలకరి జల్లుల ఆగమణంతో
రైతుల ఆనంద ఉస్త్స్తవాల నడుమ
వ్యవసాయ ఆనంద ప్రారంభ వేడుక
ఏరువాక పున్నమి నుండి మొదలు..
కమనీయ..రమణీయ
శోభాయమానంగా
ముస్తాబైన కాడెద్దుల కొలాహాలాలు
రైతన్నల ఆనంద హే లలు
ఆడబిడ్డల కళ్ళల్లో కోటి కాంతులు
వేకుమజామునే చిరుగాలి కళ్ళాపి చల్లి నట్లు..
పైరా గాలి చుక్కల ముగ్గు పెట్టినట్లు
ఊరు.. వాడంతా అంబారానంటే సంబరాలు
ప్రతీ గడప...గడపలో పండుగ తోరణాలు
నయనానందకరంగా.
నవ క్రాంతి పరవశాలు
ఊరు.. వాడాంత జాతరలో ఎద్దులను తోలుకుపోయి దుక్కి.. దున్నుతారూ
కాలం కలిసి రావాలని
మా బతుకులు పండాలని..
వేవేల దేవుళ్ళకి మొక్కి
అలుపెరగని శ్రామికుల రైతులు
బతుకుపోరు చేస్తూ
జాతికి ఆహారాన్ని అందించే దేవుళ్ళు..రైతులు
ఆ దేవుడి ఇంట్లో..కంట్లో ఆనందం నిండాలని
రైతే రాజసంగా నిలవాలి
రైతే రాజసంగా బతకాలి!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

31.
వీరా స్ కవి సమయం
******************
పేరు:- గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:- ఖమ్మం
చర వాణీ:-9849788108
కవితా సంఖ్య:-31

తస్కరులా రాజ్యం
****************
నేడు మోసాల వలయంలో చిక్కుకున్నది
వైద్యం..విద్య..ఉద్యోగం
లోపభూయిష్టంగా ఉన్నాయి
చదువుకునే స్వచ్ఛమైన నాడు
చదువుకొనే మాయల ప్రపంచం నేడు
భాద్యత రాహిత్యం మే రాజ్యమేలు
మోసపూరిత దోరణి విజయం సా దించు
అంతా దొంగల భయమే
కీడు పొంచి వుండూ
రాయితీలతో ఆకర్షించి తాయిలాలతొ తలంతా కోరుగు
ఎందు చూడు అందూ కలదు
సందేహం వలదు వలదు అన్నట్టు
తస్కరులు లేని రాజ్యామేది
తస్క రం చేయని వస్తువు ఎది
ధర్మనిరతుల కోసం
సత్యవాద్ లా కోసం
కాగడా పెట్టీ వెతికినా కానరారేమో
చెప్పేదంతా సత్యం కాదు
చూసేది అంతా నిజం కాదు
అని తెలివిగా తెలుసుకొని నడుచుకోవాలి
ప్రజల తీరు తెన్నులు తెలుసుకొని మసలుకోవాలి

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

32.

వీరా స్ కవిసమయం
*****************
పేరు:- గాజుల.  భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:- ఖమ్మం
చర వాణీ:-9849788108
కవిత సంఖ్య:-32
శీర్షిక:- ఒంటరి మహిళలు

ఒంటరి మహిళలు
***************
ఈ నవనాగరిక సమాజంలో ఒంటరి/వితంతు మహిళల జీవితాలు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి
మానవతా దృక్పథం కొరవడి
ఎదురుపడితే ఆశుభామని భావించే తీరుకు సిగ్గుపడాలి
వీరికి సముచిత గౌరవం లేక
భావాలను పంచుకునే..పట్టించుకునే నాథుడు లేక అల్లాడుతున్నారు
సంసారం ఈదాలేక అప్పులు చెల్లించలేక ఆత్మహత్య వైపు మొగ్గుచూపుతున్నారు
అవమానాలకు అంతర్ముఖులగా మారి ఒత్తిడికి లోను ఔతున్నరు
వితంతు/వొంటరి మహిళలపై ఆర్థిక..లైంగికదాడికి దిగుతున్నారు
వీరి జీవన విధానంపై ఆంక్షలు పెరిగి సంకెళ్ళతో బందీ ఔతున్నారు
మన సంస్కృతిలోని చీకటి కోణాల నుండి విముక్తి పొందాలంటే
ఒంటరి మహిళలు ఏకతాటిపై నడవాల్సినఅవసరం ఉంది
విముక్తి యుద్దం చేయాల్సిందే!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
33

వీరా స్ కవి సమయం
******************
పేరు:- గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:- ఖమ్మం
చర్ వాణీ:- 9849788108
కవిత సంఖ్య:-33
శీర్షిక:- గతమేంతో ఘనమో
కవి సంఖ్య:-20

గతమెంతో గణమౌ
****************
ఔన్ గతమెపుడూ గణమెనోయి
ఆత్మీయంగా నాలుగు  మాటలు నవ్వుతూ మాట్లాడిన గతమేపూడు మాధురమే
పిల్లల ఆటలు పాటలు
ఉరుకులు..పరుగులు..తుళ్ళింతలు..కేరింతలు గతమేపు డు అమృతమే
ప్రతీ పండుగ..పండుగలా బంధుమిత్రుల అందరి మద్యన ఆనందంగా జరుపుకున్న ఆ రోజులే ఘనం కదా
సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి న రోజులు నిండైన ప్రేమలు
స్వచ్ఛమైన గాలులు
పచ్చనైనా పల్లెలు
చెట్లెంట్ల..గట్లేంట
చెలేంట..చెలకెంట
రంగు రంగుల సీతాకోకచిలుక లా
ముదుమరా గడిపిన ఆరోజులే ఘనమేగ
   నేడు ఏముంది
కరోనా కలకళం
అగమ్యగోచరం
అరణ్యరోధనం
కాలు బయట పెట్టోదని
భౌతిక దూరం అంటూ
షరతుల కంచెలో చిక్కుకున్నాము
కరోనా కాటుతో తల్లడిల్లిపోతున్నారు
ఆపాత మధురాలు ఎపుడు మధురాలు
మరువలేని తీయ్యని జ్ఞాపకాలే

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
34
వీరా స్ కవి సమయం
******************
కవి పేరు:- గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:- ఖమ్మం
చర వాణీ:-9849788108
కవిత సంఖ్య:-34
శీర్షిక:-ప్రామిస్
కవి సంఖ్య:-20

   ప్రామిస్
***********
నువ్వంటే ఇష్టం
ఎంతంటే
కనపడితే చాలు కన్నార్పకుండా చూసేంత
నన్ను నేను..నీకు దాసోహం అయ్యేంతాయిష్ఠం

నీ మాటంటే ఇష్టం
ఎంతంటే
నీ పలుకే బంగారం అయ్యేంతా
నన్ను నేను మరిచి
తన్మయత్వం చెందెంతగా ఇష్టం

నీ నవ్వంటే ఇష్టం
ఎంతంటే
ఒక్కసారి ముత్యమంత ముద్దుచ్చి
మరుక్షణమే...నేను మరణించినా చాలు అన్నంతగా ఇష్టం!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

35


వీరాస్ కవిసమయం
******************
కవిపేరు;-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా;-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-35
కవి సంఖ్య:-20
శీర్షిక:-తీరాన్ని వెతికే నావ

తీరాన్ని వెతికే నావ
****************
కల్లోలిత కరోనా
ఏ దారి లేక
ఏ తీరు కానరాక
సుడిగుండంలో చిక్కిన నావోలే
మానవ మనుగడ
తల్లకిందులై
ఏ తీరం కానరాక
ఉక్కిరి బిక్కిరౌతు
ఉసూరుమంతున్నారు
ఏమి చేయాలో తెలియక
ఎవరికి వారే ఓదార్చుకుంటున్నారు
మనిషి మానవత్వ పరిమళాలు వేదజల్లుతూ
ధర్మ సంస్థాపణకై
పాటుపడుతూ
స్వార్ధ చింతన వీడుతూ
తోటి వారికి సాయం చేస్తూ ఉన్నపుడూ..
తీరాన్ని వెతికే నావ
ఆచూకీ అందునేమో..
ప్రతీ కంట కన్నీరు తుడుస్తూ..
ఆనంద డోలికలో
హాయ్ ఉయ్యాలలుపుతూ..
మంచి మనిషిగా
అవతరించిన వేళా
ఆనంద తీరాన్ని వెతికే నావ సాక్షాత్తు కరించు..

ఈ కవిత నా సొంత కవిత అని హామీ ఇస్తున్నాను
36

వీరాస్ కవి సమయం
*****************
కవిపేరు;-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-36
శీర్షిక:- లాల్ దర్వాజ బోనాలు

లాలదర్వాజ బోనాలు
******************
వర్షాలు బాగా కురావాలని
పంటలు బాగా పండాలని
ప్రజలంతా చల్లగుండాలని
అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచే పండుగ..బోనాల పండుగ
బోనం అంటే భోజనం
దేవికి సమర్పించే నైవేద్యం
బోనాల జాతరలో
శివసత్హులు మట్టి కుండపై నిల్చొని
భవిష్యవాణి చెప్పే తీరు మనోహరం
కోరిన కోర్కెలు తీర్చి
కొంగు బంగారమై
నిలిచిన...
అమ్మోరు తల్లికి
అడుగడుగునా నిలువేత్హు దండాలు

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
37
వీరాస్ కవిసమయం
****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా;-ఖమ్మం
చా వాణి:-989788108
శీర్షిక:-ప్లాస్టిక్ భూతం తరిమేద్దాం
ప్రజల ప్రాణాలను రక్షిద్దాం
కవిత సంఖ్య:-37

కృత్రిమంగా పాలిమర్స్ తో నిర్మితమయ్యే పదార్థమే ప్లాస్టిక్
చాపకింద నీరులా...విశ్వ వ్యాప్త భూతమై
భూతలమంతా కకావికాలం చేస్తూ...
జీవజాతుల ఉనికే
ప్రమాదకర అంచున
మరణమృదంగం మోగిస్తున్నా మహమ్మారి మాయదారి ప్లాస్టిక్
అంతా నేనే...అన్నింటా నేనే అన్నట్టు
మనతో మమేకమై
...తనే లోకమై
ప్రజల ప్రాణాలు హరించే పాయిజన్
అయింది
ప్రజల ప్రాణాలను ముప్పు వచ్చే సూచనలు ఉల్లంఘిసే
ప్లాస్టిక్ విక్రయ..వినియోగదారులపై
భారీ జరిమానాలు విధించి..
అవసరమైతే లైసెన్స్ రద్దు చేయాలి
ప్రజలను చైతన్య పరచాలి
కమిటీలను..టాస్క్ ఫోర్స్ లను నియమించడం ద్వారా
వ్యర్ధ ప్లాస్టిక్ ను సమూలంగా నిర్ముయులించాలి

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను


38


వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:- ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య;-38
శీర్షిక:-ప్రకృతి కన్య

ప్రకృతి కన్య
**********
సిత్ర..విచిత్రాల
ప్రకృతి కన్యవా!
సింగిడి వేల.. వేల రంగుల రంగోలివా
కదిలే కాలం స్థాణువై నివ్వెరపోతుంది
కొప్పులో ముడిచిన
సిరిమల్లెలు..మరు మల్లెలు..
మనసు పారేసుకుంటున్నాయి
తరుణి...తన్మయాత్మ నందంలో
నీ చూపు ఎందాకా...నీ నిరీక్షణ.. ఏ తీరం చేరేదాక!!
నెచ్చెలి స్నిగ్ధ సౌదర్య సోయగాలతో...
నేల తల్లి పోటా.. పోటీయా.
వేల రవికాంతుల శోభను
నే తాళలేను..తాకాలేనని..తప్పుకున్నదా
సింధూర వర్ణ..పైటకొంగుతో
నీ అమృతం గ్రోలే పెదవంచునా
నా పేరు..పలుకుదువా
నన్ను..నీ స్నేహలోకంలో..
విహరింప చేయనీయుదువా!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
39
వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-39
శీర్షిక:-వాసంత సమీరం

వాసంత సమీరం
**************
నునువెచ్చని గ్రీష్మంలో
అపుడే తూరుపు కొండల్లో
ఉదయించిన భానుడిలా
వే..వేల వర్ణాల అరుణారుణ కాంతిలా
అరవిరిసిన మందరంలా
ఇదేనా జీవన చిత్రమాలిక
అన్ని కాలాలకు అనుగుణంగా స్థిరంగా ఉంటూ
అన్ని క్లిష్ట పరిస్థితులను తట్టుకొని..నిలబడిన తరువులు..మనల్ని పలకరిస్తూ..పులకరింప చేసే ప్రియనేస్తాలు
ఈ వాసంత సమీరాన
నచ్చిన నెచ్చలి ఊసులు
మదిని ముసురువేళా
ఉ..కొడుతూ
మౌన మునిలా ఒదిగిపోతూ
పసిపాపల తారాడుతూ
నులివెచ్చని జ్ఞాపకాల దొంతరులు
మదిని హాత్హుకుంటుంటే
వదలకుండా..ఒడుపుగా పట్టుకొని
ఆస్వాదిస్తూ హాయిని పొందుట వరమేనోయ్
రోజలన్నీ
కాలాలన్ని ఒకే మాదిరిగా ఉండనట్లు
కనుమారుగౌతున్నా వసంతాన్ని
మన దోసిళ్ళతో నింపుకోగలగాలి
నవ ఉసస్సులతో పాటు
కోయిలా గానాలను అమృత ధారలుగా ఆస్వాదించాలి
నిత్యం ప్రకృతి మాతను కొలవాలి
అమ్మ ప్రేమంతా మార్థవంగా తడమాలి!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను


40

వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-40
శీర్షిక:-జవాన్ నీకు సలాం

జవాన్ నీకు సలాం
****************
అహోరాత్రులు రేయనక..పగలనక
కష్టాలు ఎన్ని ఎదురైన దేశ రక్షణలో
ప్రాణాలు సైతం పణంగా పెట్టి
దివారాత్రులు కాపలా కాస్తూ..తిండి తిప్పలు మరచి
కళ్ళల్లో వత్తులు వేసుకొని
సరిహద్దు వద్ద కాపలా ఉంటూ..
చొరబాటుదారుల్ని అడ్డుకుంటూ
మానవీయ బంధాలను త్యాగం చేస్తూ
వేల.. మైళ్ళ దూరంలో ఉంటూ
అస్తిత్వం అందాకారం అవుతుంటే
మస్తిష్కంలో అస్తిత్వం కోసం ఆరా తీస్తూ
ఎన్ని కష్ట నష్టాలు ఎదురైన
మొండి ధైర్యంతో
వెనుదిరగని వీరుడా
అలుపెరగని యోధుడా
అహర్నిశలు కృషి సలిపే మహోన్నతదీరుడా
సింగమై ముందుకు దూకి
కదనరంగంలో వీరపోరాటం చేస్తూ..
భరతమాత ముద్దుబిడ్డ
ప్రాణాలను సైతం
దేశం కోసం త్యాగం చేసి
వీరమరణం పొందిన వీరుడా..
నీకు సలాం
భరత జనుల వేల.. వేల.. ప్రాణామములు
జై వీర జవాన్!
జై అమర జవాన్!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
41

[19/06, 4:27 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాని:-9849788108
కవిత సంఖ్య:-41
 శీర్షిక:-కృష్ణ భక్తిలో మీరా!

కృష్ణ భక్తిలో మీరా!
***************
ఎల్లలు లేని ఎద ఎదను తడిపే ప్రేమ
నిత్య నూతనోత్సహమైన ప్రేమ
అమరం...అమృతం.. మీరా ప్రేమా
ముకుందా మురళీ గానమే
మీరా ఎదలో గుండే లయ
మీరా.. హృదయం
మాధవుని..నిలయం..ఆలయం!
మీరా చూపు నిండా గోపాలునిపై పై ప్రేమే
కంటి నిండా ప్రేమే
మాట నిండా ప్రేమే
మౌనంలోను ప్రేమే
మీరా.. తనువంతా ప్రేమే.
అనువణువంతా ప్రేమే
అంతం లేనిది
ఆనంతమైనది
నిత్యా నూతన పచ్చని శోభయామానం
మీరా.. శూన్యంలోను
శ్రీకృషుని ప్రేమాలాపన
ఏకాంతంలోనూ
హృదయచోరుడి నామాలపాన
జన్మ జన్మల బంధం
తరతరాల అనుబంధం
హద్దు..అదుపు లేని ప్రేమ
అమరికలు లేని
స్వచ్ఛమైన ప్రేమా
గోపిలోలుడు
రాధమనోహరుడు
మురళీ నాధుడు
నెమలి పింఛవీరుడు
మువ్వాగోపాలుడు...
మాధావుడ్ని తిలకించిన నేత్రాలు గతితప్పును
కోమలాంగుల గుండే.. లయ తప్పును

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
42

*****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా: ఖమ్మం
చర వాణి:9849788108
కవిత సంఖ్య:- 42
శీర్షిక:- ప్రతిజ్ఞ

         ప్రతిజ్ఞ
     **********
ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశ భక్తి భావం
నూరిపోయాలని
పలు భాషా కోవిధుడు పైడిమర్రి వారు ప్రతిజ్ఞకు
చైతన్న్యా పరిచేలా
హాత్హుకునే పదాలు కూర్చారు
ప్రతిజ్ఞ అవసరం
విలువను గుర్తించారు
దీన్ని అన్ని భాషల్లోకి
అనువాదం చేసి
దేశమంతా ...1965 జనవరి 26 నుండి చదువుతున్నారు
జాతీయ సమైక్యతకు..సమగ్రతకు ప్రతిజ్ఞ దోహదపడుతుంది
ప్రజల్లో సోదరభావం పెంచుతుంది
భారతీయూలంతా ఒక్కటే అని చాటి చెప్పే ప్రతిజ్ఞకు
మరింత ప్రాచుర్యం
కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

43

వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-43
శీర్షిక:-శానిటైజర్ లైఫ్

శానిటైజర్ లైఫ్
************
నేడు మనిషి దగ్గర ఎన్ని ఉన్నా..
నేనే మీ జీవనయానానికి
తోడూ.. నీడ అని
నేడు శాశించే..
పరమౌషాదం శానిటాయిజర్
నేటి కరోన కాలంలో మనకు రక్షణ కంచెలా ఉంటూ..
మనతో మమేకమై
మేలుగుతూ ఉన్నా
సరికొత్త నేస్తం..శానిటైజర్
అనునిత్యం శ్రీరామ రక్షలా
ఆపత్కాల సమయాలలో ఆడుకుంటూ
అంతా.. తానైన నేస్తం
అవసరం లేని పనులతో
అర్థం లేని సాకులతో
బలాదూర్ తిరిగే జనాల..రక్షించే
పరమౌషాదం
నేడు..మనకు
దిక్కుమొక్కై కంటికి రెప్పలా..కాపాడే
సైనిక..శానిటైజర్

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
44

వీరాస్ కవిసమయం
****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-44
శీర్షిక:-నా ప్రియ

      నా ప్రియ
  ************
నువ్వే నీ నంటూ
నీతోడే నీ నుంటూ
నీకై తపిస్తూ..
నీ మాట వింటే
నే పరవశిస్తూ
నీకై వెతుకుతూ
నువ్వే లోకమని తలుస్తూ
వందలో ఉన్న ఒక్కడినే
ఒక్కరుగా ఉన్నా.. మనమిద్దరమే
నిన్ను కోరి
చేరి ప్రేమిస్తా..
నీ ప్రేమ పొందుటకై
ప్రతి సెకండ్ ప్రయత్నం చేస్తా
నువ్వు కాదంటే
వంద సార్లైనా మరణిస్తా..
నిన్ను కోరి....చేరి నిన్నే ప్రేమిస్తా..
నన్నే...ప్రేమిస్తావా
నా..ప్రియ!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
45
[21/06, 4:52 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవి సమయం
****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-45
శీర్షిక:-ఓంకారనాదం- సంగీతం

ఓంకారనాదం-- సంగీతం
***************
సర్వరోగ నివారిణి
సకల కార్య ప్రదాయిని
రసరమ్య సమ్మోహిని
ఓంకారం నుండి ఉద్భవించిన ప్రణవా నాదం సంగీతం
ఆత్మానంద హాసిని
విశ్వవ్యాప్తమై వినోద సుహాసిని
సప్తస్వర సరాలు
ఏక స్వరమై
ప్రతీ ఎద.. ఎద ను
మది.. మది ని మీటే
మోహనారాగాలై
చెవులకింప్ఫై..
పండితుల..పామరులను
పన్నీటి జలకాలలో తెలియాడించుచూ..
పసిపాపల్లె నవ్విస్తుంది
అపుడే విరిసిన పువ్వులే.. పలకరిస్తుంది..సంగీతం
సామావేద జనితమై
జనరంజకంగా ఉంటూ..
కఠిన శిలలు సైతం
సంగీత సాగరంలో
కరిగి ఏరులై పారు
అలతి..అలతి పదాల శ్రావణి
కొంగొత్త ఆవిష్కరణల వాహిని
వాగ్గేయకారుల గానామృతం
శ్రావణనందకరంగా ఉంటూ
హృదయాలను హత్తుకునే పట్టుకొమ్మ.. పరవశింపచేసే..సంగీతమ్
తీయ్యని కలల దీపిక
సప్తవర్ణాల మాలిక
వే.. వేల భావాల వీచిక
వందల..వేల వినసొంపుల వేడుక
మాధురాతి..మధురమైన గీతం..సంగీతం!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[21/06, 5:12 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
కవిత సంఖ్య:-46
శీర్షిక:-నేలపై నడిచే దేవుడు నాన్న!
చర వాణి:-9849788108

నేలపై నడిచేదేవుడు నాన్న
******************
మన జీవిత నుడికారం
ఆధికావ్యం నాన్న
దారిచూపి నడిపే నేస్తం..నాన్న
ఎంత కష్టమైన..చిరునవ్వులు చిందిస్తూ....బిడ్డలకు
చేయూతనిచ్చే
గురుదక్షిణ కోరని గురువు... నాన్న!!
నిత్యం రక్షిస్తూ...
ప్రతినిత్యం దీవిస్తూ...
భద్రత..బరోసాకి...
ఖచ్చితమైన చిరునామై... ఎదలో నిలిచే....
గుడిలేని దేవుడు...నాన్న!!
ఎంత వెతికినా...దొరకని ఏకైక సింహాసనం!!
నాన్న..భుజాలపై సవారీ!
నింగికైనా కలదు హద్దు.
నాన్న ప్రేమకు లేదు...ఏ హద్దు!
త్యాగానికి ప్రతీక నాన్న..
సహనానికి తపస్వి నాన్న!
ఎంత పొగిడినా...
కొంత మిగిలి ఉండే..
మహోన్నత మూర్తిమత్వం నాన్న!!
సదా..స్మరించే..
దేవా...దేవుడు..నాన్న!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

47
[23/06, 2:13 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-47
శీర్షిక:-కాలం ఓ మాయాజాలం!

కాలం ఓ మాయాజాలం
***************
కనిపించని
వినిపించని..గురుదక్షిణ కోరని గురువు...కాలం
తియ్యని..చేదు జ్ఞాపకాలను..పుస్తకాలలో దాచిపెట్టిన
నెమలీకల్లా నిత్యం
మనఃపొరల్లో నిక్షిప్తం!!
కనులు ముసి తెరిచేలోగా..కాలం మాయద్వీపంలా మారుతూ..
ఇంద్రజాలం చేస్తూ..
సప్తవర్ణా లోకాలను చూపును
దగ్గరి తావులు వెతుకుతూ..
దూరపు తీరాలకు వారదులౌతు
బంధాలను ముడివేస్తూ
అనుబండాను పెనవేస్తూ..
కాలం ఒక అల్లఉద్దీన్
అద్భుతదీపమే.
ఎద.. ఎదలో నిఘాడమైన
భావాల గుట్టువిప్పే మెర్క్యూరినే... కాలం
మనిషి డినదినాభివృద్ధిలో సాయత చేసి
సాయం చేస్తూ
చేయూత నిచ్చే
నిరంతర ప్రవహించే
నదీనదాలు కాలం
ఆది..అంతంలేని
అపురూపమైన..అద్భుతమైన..
కాలం ఓ మాయాజాలం
!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
48
[23/06, 2:30 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
చర వాణి:-9849788108
ఊరు&జిల్లా:-ఖమ్మం
కవిత సంఖ్య:-48
శీర్షిక:-మధురస్మృతి

మధుర స్మృతి
*************
ఆ..రోజు నువ్వు చూసిన తొలిచూపు
చూడాటానికి సాదాసీదా చూపే...కానీ
ఎదలో మోగే..ప్రాణవనాదం
నీతోనే నా జీవనయానం
నీతోనే నా ప్రేమ ప్రయాణం
నేనే నువ్వు
నువ్వే నే..నైనట్టు
ఎన్నో మొరాయింపులు
మరెన్నో ఫిరాయింపులు
అన్ని ప్రేమలకంటే అతీతమైనది
అమరం..అమృతం..అజరామరం
నీ ఆలోచనలు నన్ను వెల్లువలా ముంచెత్తుతుంటే
ఆ ఊహల జడివానలో
నీ ప్రేమ ఉప్పెనలో..
తడిసి ముదవ్వక
నేనుండగలనా
నువ్వుంచగలవా...
నా కళ్లల్లో మెరుపు
నా మేనులో కుదుపు
నా ప్రేమలో అదుపులను
మురిపించి
మైమరపించి
పరవశింప చేసే
నీ స్వచ్ఛమైన..
ముత్యమంత..
ప్రేమకు..నేను ఫిదా..
అవుతూ..
చిరునవ్వుల లోకంలో
విహరిస్తూ..
    నీ...సఖి
***********
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
49
[24/06, 2:49 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-49
శీర్షిక:-తొలిపొద్దు పొడుపు

తొలిపొద్దు పొడుపు
*****************
ప్రత్యేక రాష్ట్రానికై
అలుపెరగని పోరాటం చేసి
స్వరాష్ట్ర సాధకులు
మడమ తిప్పని యోదుడు
వరంగల్ లో ఉదయించిన వెలుగు రేఖ..కొత్తపల్లి జయశంకర్ సర్
అందర్నీ పేరు.. పేరునా పలకరించే ఏక సంతాగ్రహి అనన్య మేధా సంప్పతి సరస్వతుడు ప్రొఫెసర్
జయశంకరుడు
Kcr కు గురు సామానులు
అంతకు మించిన ఆత్మ బంధువులు
తెలంగాణ సిద్ధాంతి కర్త
పలు భాషల ప్రావీణ్యులు
తన జీవితాన్ని
ఉద్యామనికే అంకితమిచిన త్యాగి
నిత్యం ఆలోచించి
ఆచరించే మహనీయూడు
తెలంగాణ రణ నినాదాన్ని వినిపించిన పోరాటశీలి
యాచక దశ నుండి
శాసక దశకు
తెలంగాణ రావాలి
అని స్వాన్పించిన..స్వాప్నికుడు
తెలంగాణ ఏర్పాటు కలను
కళ్లారా చూడకుండానే
కళ్ళు మూసినా త్యాగశీలి
వృత్తి పట్ల నిబద్ధత
ఉద్యమం పట్ల చిత్తశుద్ధి గల నేత
ప్రొఫెసర్ జయశంకర్
సార్.!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
50
[24/06, 3:24 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
అయూ&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-984978108
కవిత సంఖ్య:-50
శీర్షిక:-ప్రేమంటే..ఇదేరా!

ప్రేమంటే ఇదేరా
*************
కనులు తెరచిన
నీ కలలే
మౌనంగా ఉన్నా
నీ మాటలే
ఇదేనా ప్రేమంటే!

దూరంగా ఉన్నా
దగ్గరైనట్టే
ఎక్కడో ఉన్నా
పక్కనున్నట్టే
ఇదేనా..ప్రేమంటే!!

నీ పేరు వినగానే
నా మది నిండగా ఉండు
నీ ఊసు రాగానే
మనసు మెండుగా ఉండు
ఇదేనా..ప్రేమంటే!!!

పెదవులపై నవ్వు
కళ్ళల్లో మెరుపు
ఒంటిలో కుదుపు
ఇదేనా..ప్రేమంటే!!!

ప్రేమంటే..ఇదేరా!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
51
[25/06, 1:24 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-51
శీర్షిక:-నువ్వుంటే చాలు


నువ్వుంటే చాలు
***************
కడలి తీరాలు వొద్దు
ముత్యాల మేడలు వొద్దు
నువ్వుంటే చాలు

వెన్నెల రాత్రులు వొద్దు
పున్నమి రేయిలు వొద్దు
నీ నవ్వుంటె చాలు

హాయ్ గొలిపే మల్లెలు వొద్దు
హాయ్ నిచ్చే మంచు తెమ్మరలు వొద్దు
నీ తోడుంటే చాలు

వజ్రవైడూర్యలూ వొద్దు
వర్ణ శోభితాలు వొద్దు
నీ తోడుంటే చాలు

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
52
[25/06, 2:44 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
***************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాని:-9849788108
కవిత సంఖ్య:/52
శీర్షిక:-స్నేహితుడు

స్నేహితుడు
**********
లోకమంతా స్నేహమయం
నా మనసంతా నా ప్రియనేస్తమయం
నవ్వుల వేళా లతలా అల్లుకునేవాడు
కన్నీరు ఒలికే వేళా
తీగల తల్లడిల్లేవాడు
ఉష్ణతప్పవేలా వింజమరమౌతాడు
చలి గిలి వేళా ఉష్ణ గుండమౌతాడు
సాయం సంధ్య వేళా
చల్లని లిల్లాగలి వాడు
నా ఆలోచనలకు జీవమై
నా కలానికి ఊపిరై
లోకానికి చూపిన
నా ప్రాణహితుడా
నా స్నేహితుడా
వేల.. వేల పూలభిషేకం చేసి
కొంతైనా నీ ఋణంతీర్చుకొనా
కలల కోలాటంలో
అలల సుడిగుండాల్లో
ఎల్లవేళలా కొలువై ఉండే నిజమైన
సరిజోడు నా స్నేహితుడు
స్వచ్ఛంగా ఉండేవాడు
అచ్చంగా నాలా ఆలోచించేవాడు
నా ఎద నిండినవాడు
పద పద మంటూ ముందుకు నడిపే వాడు
వాడే వాడే నా హితుడు
నా ప్రాణ స్నేహితుడు!!


ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
53

[26/06, 2:49 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-53
శీర్షిక;- విరిసే పరువాలు

విరిసే పరువాలు
**************
విరిసిన పరువాల లోతులే వెతకాలి
అరవిరిసిన అందాల మందారాలు బృందావనాల సోయగాల కనువిందవుతుంటే
కనులకు వేరే విందెలా
విరిసే పరువాల పవనాలు మెల్లగా వీచి హృదయలయలతో మనసు దోచే
కాలలనుగుణంగా
ప్రకృతితో సరిసమానంగా
సృష్టి ధర్మాన్ని నిర్వర్తిస్తూ
ఏవేవో తెలీని మార్పులకు ముగ్దులై
కొంగొత్త ఆశలను
ఆలోచనలకు శ్రీకారమై
తుళ్ళింతల.. జలదరింతల తో సాగుతూ
నవలోకంలో అడుగిడుతూ
కొత్త బంగారు లోకమని తపిస్తూ సప్త వర్ణ సోయగాలని భ్రమిస్తూ..తూనీగోలే విహరించును
గండు తుమ్మదోలే
ఝమన్న నాదాలను ఆలపించును
విరిసే పరువాలతో
కొంగొత్త ప్రాయంలోకి
ఆనందంగా అడుగిడును!!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
54
[26/06, 2:59 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
****************
కవిపేరు :-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-54
శీర్షిక:-అమ్మా నాన్న

అమ్మా నాన్న
**********
జన్మకు నాంది పునాది అమ్మ
చేయి పట్టి నడిపే నేస్తము నాన్న
మన జీవిత నుడికారం..ఆధికావ్యం అమ్మ..నాన్న.
ఎదలో ఉండే దేవత అమ్మా
మదిలో ఉండే దేవుడు నాన్న
ఆ నింగికైనా కలదు హద్దు
అమ్మా నాన్న ప్రేమకు లేదు ఏ హద్దు
సదా ..స్మరించే
దేవ.. దేవుళ్ళు
గుడిలేని దైవాలు
అమ్మా.. నాన్నలూ!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
55


[26/06, 2:49 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-53
శీర్షిక;- విరిసే పరువాలు

విరిసే పరువాలు
**************
విరిసిన పరువాల లోతులే వెతకాలి
అరవిరిసిన అందాల మందారాలు బృందావనాల సోయగాల కనువిందవుతుంటే
కనులకు వేరే విందెలా
విరిసే పరువాల పవనాలు మెల్లగా వీచి హృదయలయలతో మనసు దోచే
కాలలనుగుణంగా
ప్రకృతితో సరిసమానంగా
సృష్టి ధర్మాన్ని నిర్వర్తిస్తూ
ఏవేవో తెలీని మార్పులకు ముగ్దులై
కొంగొత్త ఆశలను
ఆలోచనలకు శ్రీకారమై
తుళ్ళింతల.. జలదరింతల తో సాగుతూ
నవలోకంలో అడుగిడుతూ
కొత్త బంగారు లోకమని తపిస్తూ సప్త వర్ణ సోయగాలని భ్రమిస్తూ..తూనీగోలే విహరించును
గండు తుమ్మదోలే
ఝమన్న నాదాలను ఆలపించును
విరిసే పరువాలతో
కొంగొత్త ప్రాయంలోకి
ఆనందంగా అడుగిడును!!!!


54
****************
కవిపేరు :-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-54
శీర్షిక:-అమ్మా నాన్న

అమ్మా నాన్న
**********
జన్మకు నాంది పునాది అమ్మ
చేయి పట్టి నడిపే నేస్తము నాన్న
మన జీవిత నుడికారం..ఆధికావ్యం అమ్మ..నాన్న.
ఎదలో ఉండే దేవత అమ్మా
మదిలో ఉండే దేవుడు నాన్న
ఆ నింగికైనా కలదు హద్దు
అమ్మా నాన్న ప్రేమకు లేదు ఏ హద్దు
సదా ..స్మరించే
దేవ.. దేవుళ్ళు
గుడిలేని దైవాలు
అమ్మా.. నాన్నలూ!!


55
******************
కవిపేరు:-గాజుల భారహి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-55
శీర్షిక:-బమ్మెర పోతన

బమ్మెర పోతన
***************
బమ్మెర గ్రామంలో ఉదయించిన
తెలుగు ఘనుడు బమ్మెర పోతన
మహాకవి పోతన
మధురమైన పద్యాల ద్వారా తెలుగు భాష కీర్తి కిరీటాన్ని నలుదిశలు
వ్యాపింపచేసిన మహర్షి!!
గొప్ప ప్రజాకవి
పండిత..పామరులను జనరంజకంగా రంజింపజేసిన సిద్ధర్షి!!
పోతనామాత్యువుడు
సహజపండితుడు
మహాభాగవత భవ్య ఫలప్రధాత
మందార మకరంద
మాధురీ సముపేత శబ్ద విధాత
పద్యారత్నాలను కానుక చేసి
తెలుగు వారిని
తెలుగు భాషను ధన్యుల్ని చేశారు
అలతి అలతి పదాలతో
అనంత అర్ధం వచ్చే శైలి పోతన సొంతం
తేనెలొలికే కవిత్వానికి ప్రసిద్ధి
పోతన రచనలు
వీరభద్రవిజయం
భోగిని దండకం
చక్కని పదసంపదతో
అలరించిన సుప్రసిద్ధ తెలుగు కవి పోతన
బమ్మెర పోతనకు
శత,,,,సహస్ర వందనములు!!!

********
56
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-989788108
కవిత సంఖ్య:-56
శీర్షిక:-అపర చాణిక్యుడు

అపర చాణిక్యుడు
****************
పాములపర్తి వెంకట నరసింహారావు ( P. V. నరసింహరరావు)
ఒకే ఒక తెలుగువాడిగా
భారతదేశ ప్రధాని అయ్యారు
అపర చాణిక్యులు
పలుభాషప్రవీణ్యులు
వివాదాల జోలికిపోని
గొప్ప వ్యక్తి త్వం గల నేత
వరంగల్లు లో ఉదయించిన తెలుగు తేజం
హంగు..ఆర్భాటం లేని మహానుభావుడు
సరస్వతీ పుత్రులు
వృతిపట్ల నిబద్ధత గల నేత
ఆర్ధిక సంస్కరణల పితామహుడు
ఆగ్రహాన్ని ప్రదర్శించని..గొప్ప లౌక్యం గల ధీశాలి
సహజసిద్ద తెలివితేటలు..
అపార అనుభవశాలి
జర్నలిస్ట్ గా తొలి అడుగుతో
కాకతీయ పత్రిక స్థాపన చేసి
జయ కలం పేరుతో
అనేక వ్యాసాలు రాసారు
రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి
ఎదిగారు
నిజాం పాలనను ధిక్కరిస్తూ వందేమాతరం పాడిన గొప్ప..పోరాటశీలి
తీరికలేని రాజకీయాల్లో ఉన్నా
సాహిత్యంలో ముందు ఉండేవారు
సాహిత్య కృషికి గుర్తు గా..కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది
శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్లో మాట్లాడి అందర్నీ అబ్బురపరిచారు
తెలుగు తేజం
పీ. వి.నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞధురీణులు!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

[28/06, 5:56 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
శీర్షిక:-అద్భుతం
కవిత సంఖ్య;-57

      అద్భుతం
  *************
నిన్ను చూసిన క్షణం అద్భుతం
పదహరుప్రాయంలో
విరిసే పరువాల దొంతరులు అద్భుతం
నా తొడంటూ నువుంటే
నీ నీడ నేనైతే..మహా అద్భుతం
కన్నీరొలికే వేళా
తుడిచేవెలు నీదైతే..ఆ భావమే ఓ వరం
కనపడితే చాలు
కన్నార్పకుండా..చూసేంత..చూసే నీ అపురూప మహత్తర వాసికరణ చూపు అద్భుతం
తపనపడే నీ మనసంతా..
పరవసించే నా మది అంతా.. అద్భుతం!
నా పిలుపే
నీకు బంగారమయ్యేంత
నా పలుకె..నీకు
కోయిలా గనాలంతా..మధురంగా ప్రతీ భావన
ప్రస్ఫుటం అయ్యేలా..తెలిపే
నీ ఎద సవ్వడి..
అద్భుతం!!

ఈ కవిత నా సొంతం
అని హామీ ఇస్తున్నాను
[28/06, 6:04 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
***************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-58
శీర్షిక:-హాస్యం

        హాస్యం
    ************
నవరసాల్లో పంచమం హాస్యం
అందర్నీ నవించేవాడు యోగి
పక పక నవ్వేవాడు భోగి
నవ్వలేని వాడు రోగి
కొన్ని ఊహించని సంతోషాలు
ఇంకొన్ని అనుకోని వరాలు
నవ్వులతో ఉన్న ఇల్లు
పలకరించే పువ్వులు
నవ్వులు తీయ్యని వేడుకలు
తియ్య తియ్యని మకరందాలు
నవ్వుతో వచ్చు హాయి
నడిచివచ్చు ఆరోగ్యప్రదాయి.
ఎమ్ నవ్వురా బాబు
ఎదలో గుచ్చే గులాబీ పువ్వు

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[28/06, 6:58 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-984988108
కవిత సంఖ్య:-59
శీర్షిక:-మనసు జోడి

మనసు జోడి
************
మోము మల్లె
నవ్వు సిరిమల్లె
మాట సున్నితం
మనిషి మనిదీపం
మనసు నవనీతం
తనతో నా ప్రయాణం పునీతం
తనతో ఉన్న ప్రాంగణం ఆహ్లాదం
అదే కదా.. నాకు ఆనందం
నిశిత పరిశీలన
నిదానమే తన ప్రధానం
అందరిలో అందరిలా
కొందరితో ముందరిలా
పేరు.. పేరునా పలకరింపులు
పాత జ్ఞాపకాల మది మల్లింపులు
బాగుంది
చాలా బాగుంది
నా మది మెచ్చింది
నా మనసుకు నచ్చింది!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[30/06, 11:10 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
**************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య :-60
శీర్షిక:-బైకాట్ చైనా గూడ్స్

బైకాట్ చైనా గూడ్స్
*****************
నాకు దేశం వొద్దు
ఫోన్లే ముద్దు అంటూ
ఒక వర్గానికి చెందిన యువత ఉంది
లాప్టాప్ ముందు కూర్చొని వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు
ప్లాస్టిక్ మగ్గులు. దువ్వెన్లు దేవుడి బొమ్మలు చైనా బజారుతో మనల్ని నిలువుదోపిడి చేసే పరిస్థితి..అంతా గమనించాలి
పొరుగు దేశం మనల్ని వల్ల వస్తువులు కొనేల వ్యాపారాలు చేసుకుంటూ..మనల్ని మోసం చేసుకుంటూ చూస్తూ బాధపడాల అంటే ఔను అనే అనాలి
మనం మన దేశాన్ని ఎంత ప్రేమిస్తున్నామో అర్థం అవుతుంది
మన సైన్యం ను ఎంత దారుణంగా దెబ్బకొట్టారో
ఎంత ఘోరంగా హింసించి చంపారో
గుర్తు పెట్టుకొని నడుచుకోవాలి
కొనొద్దు కొనొద్దు చైనా వస్తువులు
వాడుదాం వాడుదాం ఇండియా వస్తువులు అంటూ..ప్రతి పౌరుడు ప్రతిజ్ఞ చేద్దాం
బీ ఇండియన్
బై ఇండియన్
మేకిన్ ఇన్ ఇండియన్ అనే నినాదంతో
మన జీవనాన్ని సాగిద్దాం
నూతన పయనానికి శ్రీకారం చూడదాం!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[30/06, 11:17 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవి సమయం
****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-61
శీర్షిక:-భయానకం

భయం అనేది పనికిరానిది
భయపడుతూ బతికే కన్నా
రాజల ధైర్యంగా దర్జాగా బతకాలి
అదే మేలు మేలు
భయానక దృశ్యాలు చూడకు
గుండే వేగాన్ని పెంచుకోమాకు
సంతోషమే సగం బలం అంటూ..
తపిస్తూ..తరిస్తూ జీవించు
భయాలను వీడి ప్రయాణించు
మార్గదర్శకుడివై జీవించు

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[30/06, 11:25 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
**************
పేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
చర వాని:-9849788108
కవిత సంఖ్య:-62
శీర్షిక:-అత్త మామలు తల్లిదండ్రుల సామానులు

అమ్మను మరిపించే మరో అమ్మా..అత్తమ్మ
నాన్నను తలపించే నాయిన..మామయ్య
కంటికి రెప్పలా
కాపుకాసేటి ఆదిదేవుళ్ళు
అపార అనుభవంతో
దారి చూపే నిజమైన నేస్తాలు
సీతాదేవి సౌమ్యం
మూర్తీభవించిన మా అత్తమ్మ
మహోన్నత శిఖరం
మా మామయ్య
నిండైన నిలువెత్తు రూపాలు
అరుదైన మా అత్త మామయ్య లు
మార్గదర్శక నిర్దేశకులు

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[01/07, 3:02 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
చర వాణి:9849788108
కవిత సంఖ్య:-63
శీర్షిక:-వలసలలతో దేశం నడుస్తుంది

నెత్తిన మూట
చంకన బిడ్డ
పసినోళ్ళకు పాలు లేక
తాగే నీళ్లు లేక
రేయనక..పగలనక
కాలంతో..
ఖాళీ కడుపులతో
పోటీ పడుతూ...
మన కళ్ళ ముందే దాటిపోయే
అన్నార్తులను ఆదుకునే
ఆపన్నాహస్తం ఏమాయే??
వసారాల్లో పిట్టలకోసం కంకులు కట్టిన మానవత్వ పరిమళాలు ఏమైపోయే??
సంపద మీద ఆశ
పట్టణాలకు దారి చూపే
బ్రతుకు మీద ఆశ
గ్రామాలకు దారి చూపే
ఆకలికేకల సుడిగుండంలో
ఆకలిలేని లోకాలకు సాగిపోతున్న వాళ్ళు...ఇల్లు..చేరాలి!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[01/07, 3:09 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-64
శీర్షిక:-ఫ్రెండ్షిప్

కలకానిది విలువైనది
ఇలలో దొరికే అమృతమైనది
ఆపదలో ఆదుకునేది
నెనున్నాననే ధైర్యం ఇచ్చేది
ఇద్దర్ని ఒక దరికి చేర్చేది
ఒకే మాటల చేసేది
ఒకే ప్రాణంలా ఉంచేది
ఒక్కరిలో ఒక్కరిగా
ఒకటిగా నిలిపేది
ఎవర్...ఫర్ ఎవర్.
నెవెర్ డైస్ ఫ్రెండ్షిప్

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[01/07, 3:21 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-65
శీర్షిక:-గుర్తున్నాన

  గుర్తున్నాన
*************
మాట్లాడలేదని మర్చిపోయావా??
నవ్వలేదని..నాకెందుకనుకున్నావా??
ప్రేమించడం..
ఇష్టపడడం..
     అంటే
కలిసినప్పుడు..
మాట్లాడినప్పుడు మాత్రమే..కాదు
కలవనపుడు..
మాట్లాడనప్పుడు కూడా..ఉండడమే
ప్రేమా.. ఇష్టం!!
ఎండ వచ్చి వెళ్ళింది
వాన వచ్చి వెళ్ళింది
వెన్నెల...వస్తానంటున్నది....
నువ్వు..మాత్రం..
రావా.. మరి??

ఈ కవిత నా సోనీహామని హామీ ఇస్తున్న
[02/07, 11:51 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-66
శీర్షిక:-ఉత్తరం

   ఉత్తరం
**********
ఉత్తరం
        తోకలేని పిట్ట కావొచ్చు ఐతనెం
తొంభై ఆమడలు పోయేది
కబురులెన్నో చేరవేసి
చేరువలో నిలిచి
గుండే బరువు దించే
ఆత్మబందువు అయ్యేది
పోస్ట్....
      అనే చిన్నమాట
గుడి గంటై వినిపించి
చెవిలో అమృతం ఒలికించి
మన అనే నమ్మకం కలిగించేది
నోటితో చెప్పలేని ఎన్నో ఉసులను
గుండే భాషతో విన్నవించి
అండగా ఉన్నాననే
కొండంత భరోసాను మోసుకొచ్చేది
ఆ రోజులే వేరు
ఇప్పుడంతా మారిందిలే తీరు
మనుషుల మధ్యనే ఉంటూ
మునిమార్కు దాల్చారు అందరూ!!!
[02/07, 1:08 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-67
శీర్షిక:-అసిఫా కోసం

అసిఫా కోసం
*************
ఇది నవయుగమా..
నవీన యుగమా..
కాదు..కాదు..
పాపం పెల్లుబికె
పాపపు యుగం
ఆడపిల్లన్ని అరచేతిలో ఆడించే
పిచ్చి యుగం
రాతి యుగం
కన్ను మిన్నూ కానకా
వావి వరస చూడక
పాపం పుణ్యం ఎరుగక
తోచిందే చేస్తున్నారు
స్త్రీ.. బాలల
జీవితాలతో ఆడుకుంటున్నారు
బరోసాన్నిచ్చే బాబాయిలు బ్రతుకు
చిదిమే బూచాలవుతున్నారు
అండగా ఉండే నాన్నలూ
అఘాయిత్యానికి పాలుపడుతున్నారు
తల్లీ నీకు రక్షనేది..
చెల్లి వీళ్లకు శిక్షలేవీ..
ఆదుకుని..రక్షించే
ఆపద్బాంధవుడు దేవుడు..
దేవుడి ఉన్న గుడే
నిన్ను నాశనం చేసే అడ్డయింది
నీ జీవితాన్ని ఛిద్రం చేసే కామ వేదికైంది.
వీరి కామాన్ని ఏ కాష్టంలో వేసి కాల్చాలి
ఏ భోగి మంటల్లో వేసి మసి చెయ్యాలి!

ఆడపిల్ల కాదు..
పులి కావాలి
గర్జించి..గాండ్రించాలి
చీల్చి చెండాడే శివంగి కావాలి!!
తిరగబడాలి
కలబడి..నిలబడాలి!!
నవనాగరిక సమాజంలో
ధ్రువ తారలా...
వెలుగొందాలి!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[02/07, 1:16 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-68
శీర్షిక:-కోరిక

    కోరిక
**********
చంద్రవంక తారల్ని
గున్నమావి తోటల్ని
కోయిలా పాటల్ని
మల్లెల రెయిల్ని
చూసినా కొద్దీ తనివి తీరదు
కన్నా కొద్దీ మది నిండదు
ప్రకృతి రమనీయతను
హరివిల్లులా అపురూపాలను
నాయనానందకరం
నవ వసంతంలా వెల్లివిరియాలని
వీరాజిల్లుతూ ఉండాలని
నీ ఇంట్లో..
నీ కంట్లో..
ఉండాలని కోరుకుంటు...

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[03/07, 4:08 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చరవాణి:-9849788108
కవిత సంఖ్య:-69
శీర్షిక:-కాలపు సింధూరం.

కాలపు సింధూరం
****************
ఈ ఆషాఢమాసం శుభకార్యాలకు సరికాదు
ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత కలదు
ఈ మాస పండుగలతో సందడిగా మారును
తెలంగాణలో బోనాల పండుగ
జగన్నాథుని రథయాత్ర
అందమైన అరుదైన
మెత్తని జీవి
వ్యవసాయ నేస్తం
ప్రకృతి దోస్థాన
సింధూర రేఖా... ఆరుద్రా.
రైతులకు..ఆరుద్రకు అవినాభావ సంబంధం కలదు
ఆరుద్ర ఆగమనం వ్యవసాయానికి శుభసూచకం
ఆషాడ మాసం కొత్త అల్లులకూ రెడ్ సిగ్నల్
కొత్త దంపతుల నెల రోజుల కష్టాలు
ఈ తరం వారికి
ఆషాడ డిస్కౌంట్ సేల్ తెలిసినంతగా
ఈ మాస విశిష్ట త అంతగా తెలియదు
ఆడపడుచులకు ఆనందాల మాసం
మహిళకు ఇష్టమైన గోరింటాకు
కొత్త పెళ్లికూతుళ్ళ
గోరింట..సందడులు
సంతోషాలు
మహిళల అరచేతిలో
గోరింటాకుతో ఎర్రగా
అందంగా మెరిసిపోతుంటాయి.
ఏరువాక సందడి
గోరింటాకు ముచ్చట్లతో..
సాగే కాలం..
ఈ కాలపు సింధూరం!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[03/07, 4:16 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
చర వాని:-9849788108
కవిత సంఖ్య:-70
శీర్షిక:-సాక్షి

     సాక్షి
**********
ఆకాశంలో చంద్రుడ్ని అడుగు
చుక్కల సాక్షిగా చెబుతాయి నువ్వే నా లోకమని
నేలమీద తుమ్మెదనడుగు
పువ్వులా సాక్షిగా చెబుతాయి
నువ్వే నా ప్రాణమని
ముంచుకొస్తున్న మేఘాన్ని అడుగు
హరివిల్లు సాక్షిగా చెబుతాయి
నీతోనే నా జీవితమని
నీ గుండెలోని సవ్వడినడుగు
నీ ఉపిరి సాక్షిగా చెబుతాయి
నువ్వు..నేను
ఒకటేనని!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[03/07, 4:41 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
******************
పేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
చరవాణి:-9849788108
కవిత సంఖ్య:-71
శీర్షిక:-నవరత్న సేవ

 నవరత్న సేవ
*************
మంచి ముత్యాలతో మేడ కట్టనా
పచ్చలతో పందిరేయ్యనా
పగడాలతో పౌడర్ వెయ్యనా
కెంపులతో అలంకరించనా
గోమేధికంతో గొర్లకు రంగేయన
వైడూర్యంతో వడ్డాణం చేయించనా
వజ్రాలతో ఉరేగించనా
ప్లాటినంతో కూడిన
సౌగంధిక పుష్పాలతో
పవళింపు సేవ చేయనా!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
72
[04/07, 3:41 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
పేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-72
శీర్షిక:-నిండైన తెలుగుదనం

నిండైన తెలుగుదనం
******************
ముప్పవరపు వెంకయ్య నాయుడు
భారరతదేశ 13వ ఉపరాష్ట్రపతి
ఆహార్యం..మాటతీరు
పంచకట్టులో తెలుగుతనం ఉట్టిపడు
రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని మహానేత
సౌమ్యులు..సరస్వతి పుత్రులు
మాతృభాషను అమితంగా ప్రేమించే
తెలుగుభాష ప్రేమపిపాసి
మాతృభాష కళ్ళ వంటింది
పరభాష కళ్ళద్దాల వంటింది
అని తెలుగుభాష అభిమాన మహా తపస్వి
క్రమశిక్షణ..నైతిక విలువను నిలువెత్తు నిదర్శనం
వాక్పటిమ గల నేత
తెలుగుజాతి రత్నం
తెలుగు ఖ్యాతి రత్నం!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

73
[04/07, 3:50 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఖమ్మం
చర వాని:-9849788108
కవిత సంఖ్య:-73
శీర్షిక:-కోరిక

   కోరిక
**********
నీ చెంతనే స్వాంతన
పొందుతుంది నా మనసు
నీ ప్రేరణతో పరిగెడుతుంది
నా వయసు
నీ మాటతో పురివిప్పుతుంది
నా మేను
నువ్వే నా ప్రాణం.
నువ్వే నా జీవం.
నువ్వే నేను
నేనే నువ్వు
ఇద్దరం ఒకటి కావాలని
కోరుకుంటూ..

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
74

వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-74

డాక్టర్స్ సేవలు వెలకట్టలేనివి
మేమున్నాం మీకు అండగా అంటూ
ఇంటిల్లిపాది ని వొదిలి
ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంలా ఉంటూ
వైద్య బృందం సైనికులుగా సేవలందిస్తూ
సర్వ శక్తులు ఒడ్డి
మహా యుద్ధం చేస్తున్నారు
జాతి మతమని తలవక
ధనిక పేద అనే భావం లేక
అంతా ఒకటే అని
అందరూ సమానులని
అందరి ప్రాణాలు
రక్షించే కళ్ళముందు
కదిలే నిజమైన దేవుళ్ళు!!
అహర్నిశలు కష్టపడుతూ
సేవే పరమార్ధం అని తలుస్తూ
తిండి తిప్పలు మరచి
తమ ఆరోగ్యాలు గాలికి వొదిలి
ప్రాణాలు పణంగా పెట్టి
ప్రతి నిమిషం
సరిహద్దు సైనికులుగా
మహా యుద్ధం చేసే
కదిలే యుద్ధవీరులు
అందర్నీ కంటికి రెప్పలా రక్షించే
ప్రాణాధాతలు
వారే..
వైట్ కోట్ వారియర్స్


ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను


75
వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
చారవని:-9849788108
కవిత సంఖ్య:-75
శీర్షిక:-తెలుగు-వెలుగు

తెలుగు-వెలుగు
***************
తేనేకన్నా మధురమైన
చేరుకురసం కన్నా తియ్యనైనా భాష తెలుగు భాష
నా భాష..మనభాష.. మన మాతృభాష
దేశభాషలందు తెలుగు లెస్సా
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్
కొనియాడిన ఎందరో
మహానుభావులు
అందరికీ వేల.. వేల వందనాలు
తెలుగు అక్షరాల తోరణాలు కట్టి
ప్రేమగా తడమాలి
అమ్మ ప్రేమగా చదవాలి
తెలుగుదనాన్ని ఆవాహన చేసుకుందాం
తెలుగు అంతరార్ధాన్ని అవగాహన చేద్దాం
తెలుగు అపురూప సౌందార్యాన్ని ఆస్వాదిద్దాం
తెలుగోడి గుండే లయ తెలుగవ్వాలి
ఆశ..శ్వాస..తెలుగు వెలుగవ్వాలి
ప్రపంచ నలుదిక్కులా ఆశలా.. శ్వాసలా
తెలుగు భాష దేదీప్యమానంగా వెలిగిపోవాలి
క్షరం కానీ అక్షరంలా వెలిగిపోవాలి!
తెలుగు భాష నీకు వందనం
తెలుగోడా నీకు పాదాభివందనం!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను


76

[05/07, 4:16 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-76
శీర్షిక:-జయహో మహిళ

జయహో మహిళ
***************
కరోనా నేపథ్యంలో మహిళల శ్రమ అపారం
సమాజగమణలో పురోగమనంలో మహిళల శ్రమ ఆమేయం
ఈ కరోన సమయంలో మహిళల శ్రమ పాదింతలై
క్షణం తీరికాలేక అలసిసొలసిపోతున్నారు
ఆకాశంలో సగమే కాదు
శ్రమలోను సగమే కాదు
సగానికన్నా ఎక్కువ పాత్రలు మహిళలదే
పారిశుద్య మహిళలు
చీకట్లు వీడకముందే
రహదారుల శుభ్రత వలన తళతాళలాడుతున్నాయి
వీరి శ్రమను గుర్తించడం..గౌరవించడం అవసరం
వైద్యశాలలో పేషంట్లు..వైద్య సిబ్బంద్దికి వంటా వార్పు
అధిక మోతాదులో మస్కల తయారీలో
మహిళలే రేయింబవళ్లు పనిచేస్తున్నారు
లోకమంతా నడవటానికి ఆమె శ్రమ శక్తినే.. ఇంధనం!
ఇంట్లో శ్రమ చెప్పనలవి కాదు..
ఆమె శ్రమకు ..గౌరవం..గుర్తింపు ఎక్కడ??
దేవతనో..ఇంటి మహారాణి అనో
పొగడ్తలతో ముంచెత్తడం కాదు కావాల్సింది
కష్టం ఎక్కడ ఉంటే
మహిళలు అక్కడ ఉంటారు.
మహిళల శ్రమపై
ఇంటివారిలోను
సమాజంలోనూ
పాలకుల దృక్పథంలో మార్పు రావాలి.!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
77
[05/07, 4:33 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
****************
కవిపెరు:-గాజుల భారతి శ్రీనివాస్
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-77
శీర్షిక:-హరితహారం

హరితహారం
**********
హరితహారం పేరులోనే ఉంది
ఎంతో ఆహ్లాదం
అందరం అవుదాం
భాగస్వాములం
అనుభవిద్దాం చెట్ల
పెంపకంలో ఆనందం
చెట్లను పరిరాక్షిద్దాం
ప్రకృతి వైపరీత్యాలన్
నిర్మొలీద్దాం
వృక్షో రక్షతి రక్షతః

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
78

[07/07, 10:35 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి;-9849788108
కవిత సంఖ్య;-78
శీర్షిక:-కరోన దీపం

కరోన దీపం
***********
దీపం పరబ్రహ్మ స్వరూపం
దీపారాధన సకల జనులకు,, జీవులకు
శుభప్రదం
లోక క్షేమం కొరకు
నిత్యా దీపారాధన తధ్యం
దీప కల్యాణ కాంతులు
విశ్వ వ్యాప్తమై
ఐశ్వర్యం సిద్దించగా
దేవత లందరి దీవెనలే అందిచును
దీపవిధిని సూర్యని సూచిగా విధిగా నిర్వహించాలి
అందరం ఒకే మాటపై ఉంటూ
నవజ్యోతులను వెలిగిద్దాం
భారతదేశం నుండి
కారోననూ ప్రారదోలుదాం!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.
[07/07, 10:52 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య;-79
శీర్షిక:-నిజమైన నేస్తం

నిజమైన నేస్తం
************
గుండెలోని లయలకు
మనసులోని హొయలకు
అక్షరాల హారం.. సమాహారం..డైరీ
ప్రతి చర్య..దిన చర్య
మది.. మనసు సాక్షాత్కారం
ఎద.. హృదిలో
నిత్యా సంతోష సాత్కారం
సఖి..ప్రియసఖి
నెచ్చలి..సహచరి.
సదా..తోడు..నీడై నిలిచే..
నిజమైన..నిక్కమైన నేస్తం.
ఆవేదన..ఆక్రందన
తుధముట్టించే తురుపు ముక్క
ఆజన్మాంతం..అండగా నిలిచే చక్కని చుక్క..డైరీ!!
తలపులో..తొలి వలపులో
మలుపులో..ప్రతి గెలుపులో
నిక్షిప్త వాహిని..
సంక్షిప్త దారిని..డైరీ!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[07/07, 10:58 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-80
శీర్షిక:-నా ప్రియ

      నా ప్రియ
 **************
ప్రేమకు పరిమాణం
ఇష్టానికి కొలమానం
ఉండవేమో
నా మనసుకు నీ ధ్యాస
నా గుండెకు నీ శ్వాస లేకుండా ఉండవేమో!
వెన్నెల మందారాలు పూస్తుంటే
నువ్వై వస్తావనుకోలేదు
నవ్వై పూస్తావనుకోలేదు
కలల కోలాటంలో
అలల సుడిగుండంలో
నే కొట్టుకుపోకుండా
నా ఆశల తీరమవుతావా...నా ప్రియ!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
81

[08/07, 1:45 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-81
శీర్షిక:-ప్రేమమ్

ప్రేమమ్
********
ప్రేమమ్..రాధాకృష్ణమయం
స్నేహం..కృష్ణా కుచేలా ద్వయం
రాధకి కృష్ణుడే లోకం..
కృష్ణకి రాధే ప్రాణం.
రాధమాధవ ప్రేమాయణం..మది మదిని పులకింప జేసే
నిత్యనుతానోత్సహం.
రాధమాధవ ప్రణయం.. యమునా సాగర సంగమం.
రాధా హృదయం
మాధావుణ్ణి నిలయం..ఆలయం..దేవాలయం!!
రాధా చూపునిండా..కంటినిండా,,మాటనిండా,,మౌనంలోను,రాధ అనువంతా ప్రేమే..తనువంతా ప్రేమే..మాధావుడిపై ప్రేమే.
అదే కదా.. రాధ మాధవ ప్రేమాయణం.
అంతంలేనిది
ఆనంతమైనది
నిత్యనూతన పచ్చని శోభయామానం
రాధ శూన్యంలోను శ్రీకృషుని ప్రేమాలాపన
ఏకాంతము లో హృదయచోరుడి నామలాపన.
మనవుడ్ని తిలకించిన నేత్రాలు గురితప్పున్
కోమలాంగుల గుండే లయ తప్పును.
రాధా.. మాధవ ప్రేమ..పరమపవిత్రం
కన్నా..విన్నా నవనీతం
కనీ.. వినీ..ఎరుగని కమనీయం
రాధ ఆత్మ..
కృషుడి రూపం
రాధ శరీరం..కృషుడి ప్రాణం.
ఇద్దరూ ఒక్కరుగా
ఒకే ఒక్కరుగా..ఒకే లోకంగా..
మెలిగినా.. నలిగినా
నవ్యాంశం..ప్రేమఅంశం.
అదే అదే మన రాధా.. మాధవ..
ప్రేమమ్..ప్రేమాయణమ్.

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
82
[08/07, 2:18 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
***************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఖమ్మం
చర వాని:-9849788108
కవిత సంఖ్య:-82
శీర్షిక:-జనహృదయనేత..8/7/2020
వై. ఎస్.రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా.
*************
జనహృదయనేత
**************
ఆహార్యం..పంచకట్టులో..నికార్సైన నిండైన తెలుగుదనం.
రాజనీతజ్ఞుడు
సుపరిపాలన దక్షుడు
జయమ్మా..రాజారెడ్డిల తనయుడు
ముక్కుసూటితనం
నిర్మొహమాటతనం
వీటికి పెట్టింది పేరు
మండుటెండల్లో  పాదయాత్ర
గెలుపు వైపు మలుపు తిప్పిన యాత్ర!
జనరంజక జనాదరణ నేత
జలయజ్ఞ పూనాది దాత
మతటప్పని
మడమ తిప్పని
జనహృదయ విజేత!!
తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసిన రాజు
ప్రజల గుండెల్లో నిలిచిన రారాజు
ప్రజా సంక్షేమ పథకాల రూపకర్త
ఎదురులేని స్థితప్రజ్ఞ
రైతుల సమస్యలు చూసి చలించిన
దయార్ద్ర హృదయాలు
ఉచిత విద్యుత్తు పై తొలి సంతకం చేసిన
మహనీయులు
వైద్యులు.. ప్రజనేతగా
ద్విపాతాభినయం చేసిన..ధీశాలి!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.
83
[09/07, 10:22 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల భారతి శ్రీనివాస
ఊరు&జిల్లా:-ఖమ్మం
కవిత సంఖ్య:-83
శీర్షిక:-కోటి రతనాల వీణ( నా మదిలో తెలంగాణ)

కోటి రతనాల వీణ
***************
నాలుగున్నర కోట్ల కలలు సాకరమైన వేళ
అమరవీరుల ఫలించిన వేళ
విద్యార్థి ఆకాంక్షలు
ఉదయించిన వేళా
యువత పోరాటాల పటిమ విజయం సాధించిన వేళా
తెలంగాణ గడ్డపై
తెలంగాణ బిడ్డ
గొంతెత్తి నినదించిన వేళా
పోరాడితే పోయేదేముంది
దాస్య శృంఖలాలు తప్పా.. అన్న నానుడి
నిజం చేసిన వేళా
అందరి పోరాటం ఫలించిన వేళా
తెలంగాణ కలలు సాకరమైన వేళా
ప్రేత్యేక రాష్ట్రం విజయం సాధించిన వేళా
విజయ దుందుభి మోగించిన వేళా
సాధించాం మన తెలంగాణను...
కోటి రతనాల వీణను

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
84
[09/07, 10:22 AM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి;-9849788108
కవిత సంఖ్య:-84
శీర్షిక:-ధాత్రికి హరిత హేళ!

ధాత్రికి హరిత హేళ
*****************
భగ భగ మండే ఎండల నుండి
చిరు చిరు జల్లులతో
పుడమంతా పులకరించిపోయే
ఆనందంతో మెరిసిపోయే
రైతన్న కళ్ళల్లో వెలుగులు నిండే
నారుమళ్ళల్లో పెరిగిన నారు
పచ్చని చీర పరిచిన ఆకాశమయే
ఆనందంతో ధాత్రి ఉప్పొంగే
తరులు..గిరులు
కొండలు.. కొనలు
పచ్చికబయిల్లు.. సెలయేళ్ళు
చిత్రకారుని కుంచె నుంచి జాలువారిన
ప్రకృతి అంతా...
అద్భుతమైన హరిత చిత్రమాయే
సతతం..హరితం
తరం..తరం.
నిరంతరం
నిత్య హరిత శుభోదయం
నవ చైతన్య ఉషోదయం
పచ్చని మొక్క ప్రకృతి వరం.. మనకు అవసరం
మానవ మనుగడకు
ప్రాణదారం
మొక్కలేని పుడమి
ప్రశ్నార్థకం
జన జీవనం అతలాకుతలం
పరి పరి విధాలా పరికించిన అంతటా
పచ్చ పచ్చని పచ్చదనం
నిండుగా..మెండుగా..
ఉండగా..అపుడే కదా
ధాత్రికి నిజమైన
హరిత ఆనంద హేళ!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
85

[10/07, 12:11 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి;-9849788108
కవిత సంఖ్య:-85
శీర్షిక:-మన్యం వీరుడు

మన్యం వీరుడు
**************
నెత్తురు మండే యువతకు ఆరాధ్యుడు
మన్యం గుండే గుడిలో కొలువైన దేవుడు
తెల్లోడి గుండెల్లో నిద్రించి
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని
హడలగొట్టిన పొరతాయోధుడు
అల్లూరి సీతారామరాజు
మన్యం ప్రాంత బ్రిటిష్ పాలకుల శ్రమదోపిడి
వ్యతిరేక ఉద్యమ వీరుడు
ఆంగ్ల విద్యను
తిరస్కరించి
సనాతన విద్యను
అభ్యసించిన భారతీయులు
గెరిల్లా యుద్ధరీతిని ప్రదర్శించిన యోధుడు
రాజు పోరాటంలో
అడ్డ తీగల ప్రాంతం కీలకం
దేశం,,ధర్మం కోసం
వందేమాతరం అంటూ
నెలకొరిగిన మహావీరుడు
వీరుడు మరణించడు
విప్లవానికి పరాజయం లేదు
చిందిన రక్తం
చిరకాలం ప్రవహిస్తూనే ఉంటుంది
ఒక్క సీతారమరాజును చంపితే
వేలమంది సీతారమరాజులు
పుడతారని
నినదించిన స్వతంత్ర సమరయోధుడు!!


ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
86
[10/07, 12:21 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా;-ఖమ్మం
చర వాణి:-989788108
కవిత సంఖ్య:-86
శీర్షిక:-తొలిప్రేమ

తొలిప్రేమ
*********
చరవాణి సుందరి
ఎద కొరినావే
ఎద తడిమావే
సడి రేపావే
కలిసింది ఒకమారే
చూసింది ఒకపారే
జన్మలన్ని మనవేగా అన్నావు
నీ మాయలో పడేసావు
జాతకుడినా క్షణాలు
అద్వైతాలు
గడిపిన ఘడియలు
ఆ పాత మధురాలు
నిన్ను కోరే తృష్ణను రేపి
నిన్ను చేరే సెగను పులిమి
నన్ను నేను వీడి
నీలో నిలిచిన నాకు
నీ గుండెల్లో గాయమా..
నా వల్ల అనకుమా?
కాలం గిర్రెలో చిక్కి
మన కథే ముగిసేనా??
మూడు ముక్కలాటయ్యేనా??

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
87

[11/07, 3:58 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-87
శీర్షిక:-ముతైదువుల వేడుక-బతుకమ్మా పండుగ


ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు
నవరాత్రుల తీరైన
వెండి వెలుగుల వేడుక- బతుకమ్మ పండుగ.
తెలంగాణ సాంస్కృతిని ఆవిష్కరించే
అపురూపమైన పూలపండుగా
రంగు..రంగుల పూలతో
ఆటపాటలతో కీర్తిస్తూ
నయనానందకరంగా ఉండే..ముతైదువుల వేడుక-బతుకమ్మా పండుగ!
ప్రకృతితో మహిళలతో ముడిబడినది
అందంగా అలంకరించుకున్న స్త్రీ లు.
బతుకమ్మలతో కన్నుల పండుగగా
తీరొక్క పూల సౌందర్యం..
ఊరొక్క తీర్ల వేడుకల వైభోగం..
చూచుటకు రెండు కళ్ళు.. చాలవేమో మరి
మహిళల స్వేచ్చా.. సాధికారతతో ముడిబడినది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో.నమోదైన
అరుదైన.అద్భుతమైన..అమోఘమైన..
అద్వితీయమైన
తియ్యనైన వేడుక
మన బతుకమ్మా పండుగ!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
[11/07, 4:11 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
******************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-88
శీర్షిక:-పవిట

స్త్రీ లకు కొంగే బంగారం
చీరే సింగారం
పాపాయిలను లాలించే ఉయ్యాలలూపి
పవళింప్ప చేసే
పడకేగా..ఈ పవిట!
మండుటెండలో చల్లని వింజామర
పరువాల అడ్డుగా నిలిచే పరదా అగును
చిరుజల్లు వేళా
ఛత్రి ఐనవేళ
తలపై బరువులు మోసేవేళ చుట్టుగుడ్డ తానే..కదా
సాయం సంధ్యలో
పూలువేసే చేతి సంచి ఈ పవిటే కదా
కన్నెపిల్ల అందాలకు
రక్షణ కంచెగును
ఆరబోతకు అడ్డుకట్టగును
కళ్ళతో కాటేసే
కుర్రాళ్ళ కళ్ళకు
చైనా వాల్ ఈ పవిటే
ఒళ్ళంతా కప్పే తుండు వస్త్రం
కదానరంగాన దూకే
వీరవనితల
నడుములో ఇమిడిపోయే..బాకేగా.. ఈ పవిట
89
[12/07, 1:12 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-89
శీర్షిక:-పండంటి కాపురం

పండంటి కాపురం
**************
కాలం కరిగిపోయిన ఆనందం తరిగిపోనీదే దాంపత్యం
కలిమిలోను పొంగక
లేమిలోను కుంగక
తొనకని..బెనకని
నిండుపున్నమి వెన్నెల వెలుగు
ఆలు.మగల మమకారపు మాధుర్యంలో
సవాలక్ష సమస్యలకు
సునాయాసంగా చిరునవ్వుతో మోస్తూ
బాధ్యతల దీవిటీని కాంతివంతంగా వెలిగించే లోగిలి..మా వాకిలి
జీవనపయణంలో పొరపోచాలోచినప్పుడు ..సమస్యల పీఠముడిని విప్పుతూ..
ఒకరి కొకరు తోడుగా
..నీడగా ఉండేదే నిజమైన కాపురం
ఉన్నంతలో సర్దుకుపోయి సంతృప్తి చెందేది
లేనంతలో నిండు గోదావరిలా నిబ్బరంగా ఉండేదే నిజమైన దాంపత్యం!
ఒకరంటే ఒకరికి అంతులేని అభిమానం
అలకలు..కులుకులతో కూడిన నిత్యసంతోషా ఆత్మీయాభిమానం
నింగిలోని చుక్కలన్ని నెలకొచ్చినట్లు
పిల్లలు..పెద్దలతో నిండిన పొదరిల్లు.. మా బొమ్మరిల్లు
చేదిరిపోని స్మృతులు
మధురమైన జ్ఞాపకాలు
మా పెళ్ళీపుస్తక పుటలో పడికాలలు
పదిలం..పదిలం!!
రీజనింగ్ అడగకుండా
ఆలోచించకుండా వినే గొప్ప స్త్రీ నా సతి.
ఎన్నో సమస్యల సుడిగుండంలో ఉన్నా చెక్కుచెదరని మనిషి నా పతి.
ఒకరినొకరు తెలుసుకొని...ఒక్కటిగా మసులుకొని..
గుట్టుగా..గుంభనంగా
సాగించేదే..
పండంటి కాపురం!!

ఈ కవిత నా సొంత మని హామీ ఇస్తున్నాను
90
[12/07, 1:25 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చర వాణి:-9849788108
కవిత సంఖ్య:-90
శీర్షిక:-అర్ధాంగి ఔదార్యం.

అర్ధాంగి ఔదార్యం
***************
స్త్రీ లేనిదే జననం లేదు
స్త్రీ లేనిదే గమనం లేదు
ముడుముళ్ల బంధంతో ఏకమై
మనమే లోకమై
మనతో మమేకమై
ఇంటిని..ఇంటివారిని
కంటికి రెప్పలా కాపాడే ఇంటిమహారాణి ఇల్లాలు
అందరికీ తలలో నలుకలా ఉంటూ..
అందరి అవసరాలు తీర్చుతూ..
భూదేవి అంత సహన మూర్తి స్త్రీ
ఇంటికి సూచి
బిడ్డలకు డిక్సూచి .తానే
ఇంటి భారంతో తలమునకలై ఉన్నా
మోముపై చెరగని చిరునవ్వుకు శాశ్వత చిరునామై..హరివిల్లులా వేణి..స్త్రీ.
పతిలో భాగమై
ఇల్లే లోకమై
ఇల్లే స్వర్గం అని తలచి..వలచి
ప్రేమించే..ఔదార్యం గల మహామనిషి..స్త్రీ మూర్తి
ఇల్లు సాఫీగా సాగాలంటే..ఆమె శ్రమ శక్తే ఇంధనం
పుట్టింటి వారిని మదిలో తలుస్తూ..
మెట్టింటి వారికై
తపనపడే సేవలు చేసే సేవకురాలు
నిత్య చైతన్య శ్రామికురాలు
అన్నీ తానై..
అంతా తానై..
నట్టింట నడయాడిన అష్టలక్మి !

ఈ కవిత నా సొంతం అని హామీ ఇస్తున్నాను
91

[14/07, 10:41 AM] Gajula Bharati KS 20: తెలంగాణ రత్నం
***************
కవితా పయోనిధి దాశరథి
తెలంగాణ విముక్తికోసం ఉద్యమించిన సుకవి
నిజాం దుష్టపాలనను కళ్ళకు కట్టి చూపిన పోరాటశీలి
తెలంగాణ మహోద్యమన్ని...చారిత్రిక పోరాటాలను ఖండించిన కవిసింహం
నన్నయ్య లా విభిన్నశైలీ రచనకారులు
వేదంతానికి,,మార్కిజానికి పెద్ద తేడాలేదని తేల్చారు
శక్తివంతమైన భావాల్ని..అందమైన భాషతో పొదిగి
మనస్సుకు హత్తుకునేల చెప్పడం వీరి ప్రత్యేకత
ఆ చల్లని సముద్రగర్భం గొప్ప గేయ రచయిత
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించిన సహజ కవి.దాశరథి
మంచి ఉపాన్యసకుడు
భవప్రేరిత ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం నింపిన ప్రేరణ కవి
రాష్ట్ర..కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెలిచిన విజేత
గాలిబ్ గీతాల గజళ్లా అనువాదకులు
కన్నతల్లి..కన్న ఊరుపై అపార మమకారం..వారి సొంతం
కవిసింహం..అభ్యుదయ కవితా చక్రవర్తి బిరుదాకింతులు
సింహ ద్వారం గుండా సినిరంగానికి పయణమైన.. జనరంజకా సినీ గేయ రచయిత..సుకవి
శ్రీదాశరధి కృష్ణమాచార్య!!

ఈ కవిత నా సొంతం అని హామీ ఇస్తున్నాను

గాజుల.భారతి శ్రీనివాస్
ఖమ్మం
9849788108
92
[14/07, 10:44 AM] Gajula Bharati KS 20: గానగంధర్వుడు
***************
పద్మశ్రీ,డాక్టర్ ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం తెలుగు నేపధ్య గాయకులు
బహుభాషా మధుర గాయకుడు
పాడుతా తియ్యగా మార్గదర్శకులు
మాటల మాంత్రికుడు
విశ్రమించని అమృత గానా ప్రవహకుడు
సంగీత దర్శకుడు.. నటుడు
నటుల హావభావాలు అనుగుణంగా పాడి పాటకు ప్రాణం పోస్తాడు
ఎల్లలు లేని సినీగీతాలపన మాంత్రికుడు
పాటలలో తెలుగుదనం ఒలికించే సత్తా తన సొంతం
భవిష్యత్ తరాల దిశా నిర్దేశకుడు
సద్గుణ వల్లభువుడు
చిరునవ్వుల ధరహాసుడు
సునీత మనస్కుడు
సూచరిత సంపన్నుడు
జనరంజక గాణామృతంలో పండిత..పామరులను
ఓలలాడించిన
గానగంధర్వుడు..
మన బాలు..
ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం.

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

గాజుల.భారతి శ్రీనివాస్
ఖమ్మం
9849788108.
93

[15/07, 10:58 AM] Gajula Bharati KS 20: శీర్షిక:-సర్ ఆర్థర్ కాటన్ మహాశయ.

ప్రాజెక్టు నిర్మాణ కృషీవలుడు
భుసూరుడు నవ భగీరథుడు
కర్షకుల నేస్తం కాటన్
బీడుభూములను సస్యశ్యామలం చేసిన జలప్రధాత
పుడమి పులకింప చేసిన ధాన్యపు సిరుల దాత
ఎనలేని కీర్తినొందినాడూ
కారువులేకుండా చేసిన ఘనుడు
ఇంజనీరు పట్టభద్రుడు
ఉభయగోదావరి జిల్లా వాసుల గుండెల్లో దేవుడైనాడు
గోదావరి ప్రజల గుండే చప్పుడు కాటన్ మహాశయుడు
ప్రజలకు సాగు..తాగు నీరు జలప్రధాత.
బ్యారేజి నిర్మాణానికి ఆద్యుడు.
సుశాస్తియా అపర భగీరథ
అందరి గుండెల్లో
నేటికి చిరంజీవై నిలిచే!!

ఈ కవిత నా సొంతం అని హామీ ఇస్తున్నాను

గాజుల.భారతి శ్రీనివాస్
ఉపాధ్యాయులు
ఖమ్మం.9849788108.
94
[15/07, 10:59 AM] Gajula Bharati KS 20: అంశం:-నెల్సన్ మండేలా
శీర్షిక:-నల్లజాతి సూరీడు.

నల్లజాతి సూరీడు
***************
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు
నల్లజాతి సూరీడు
నెల్సన్ మండేలా
గాంధేయమార్గ అనుసర..ఆచరనీయులు
దక్షిణాఫ్రికా గాంధీగా పిలువబడే..ఒక విశిష్ట చరిత్రకారుడు నెల్సన్ మండేలా!
ఒక తిరుగులేని వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు
ఒక ప్రఖ్యాత న్యాయకోవిదుడు
మానవత్వకే స్ఫూర్తి ప్రదాత.
క్షమను మించిన గుణం లేదని చాటినాడు
ప్రతీకారం మనుషుల మధ్య గోడలు కడితే
క్షమ...ఒక్కటి చేస్తుంది.
నిర్బంధంలోంచి దేశాదక్ష్యత పదవి చేపట్టిన యోధుడు
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
భారతరత్న పురస్కార మహనీయులు
ప్రపంచ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన
గాంధేయవాదుడు
ప్రజలను కట్టిపడేయగల వక్త
వర్ణాసమానతకు మండేలా ఒక సంకేతం!!
27 ఏళ్ళ కారాగార జీవితం గడిపిన ధీశాలి.
కెనడా పౌరసత్వాన్ని జీవించి ఉండగా అందుకున్నా ఏకైక వ్యక్తి..మండేలా
అత్యంత ప్రసిద్ధ ప్రపంచ నాయకుడు
మండేలా...జనం ..
గుండే మండే..లా..
జాతి వివక్ష చరిత్రను
తిరగరాసిన మరో బ్రహ్మ...
నెల్సన్ మండేలా!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

గాజుల.భారతి శ్రీనివాస్.
ఉపాధ్యాయురాలు
ఖమ్మం
9849788108.
95

[16/07, 6:51 AM] Gajula Bharati KS 20: అంశం:-పాఠశాల భద్రత- ఆరోగ్య దినోత్సవం
శీర్షిక:-మొక్కుబడి భద్రత.

బడిపిల్లలకు బరోసాన్నిద్దాం
పాఠశాలల్లో విద్యార్థుల భద్రత కరువై..
బడుల్లో భయం భయం అనేలా ఉన్నాయి
శిథిలమైన గదుల్లో చుదువులు
కానరాని తాగునీరు
కనీస వసతులు కరువు తాండవిస్తుంది
కొత్త పథకాలు వచ్చిన ఫలితాలు లేకపోయే
అధికారుల పర్యవేక్షణ లేమి
పథకాల అమలులో అలసత్వం
పాఠశాలలు పలు సమస్యల నిలయాలు
ఇబ్బందుల ఆలయాలు
ప్రహరీ లేక భద్రత కరువు
విషజంతువుల నుండి రక్షణ కరువు
పాఠశాలకు అభద్రత రాకపోకలు
కలువ గట్ల వెంట
పొలం గట్ల వెంట
ఆరోగ్య పరీక్షలు అంతంతే
అపరిశుభ్ర పరిసరాల్లో.. విద్యార్థులు అస్వస్థత చేకూరు
బాల ఆరోగ్య పథకం అమలు చేసి సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేద్దాం
నేటి బాలలే
రేపటి పౌరులని గుర్తించి
వారి బావిభారత జీవితానికి
భద్రతకు బరోసానిస్తూ
విద్యార్థుల బంగారు బాటకు శ్రీకారం చూడదాం!!!

ఈ కవిత నా సొంతం అని హామీ ఇస్తున్నాను
దేనికి అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను
****************
గాజుల.భారతి శ్రీనివాస్
ఉపాధ్యాయురాలు
ఖమ్మం
చరవాణి:-9849788108.
96
మెయిల్:-ggajulabharathi@gmail.com.
[16/07, 6:54 AM] Gajula Bharati KS 20: అంశం:-గరిమెళ్ళ సత్యనారాయణ
శీర్షిక:-బొబ్బిలి.

మాకొద్దీ తెల్లదొరతనం పాట ద్వారా బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు రేపిన బొబ్బిలి..గరిమెళ్ళ
ఈ శతాబ్దం సాహిత్యంలో మేటి తార!
శ్రీకాకుళం జిల్లాలో ఉదయించిన సూర్యుడు
తెలుగు తేజోమూర్తులు
ప్రఖ్యాత పాత్రికేయుడు
ప్రజాపాటల త్యాగయ్య గరిమెళ్ళ
వీరి గేయాలు ప్రజలను ఉర్రుతాలుగించాయి
తన కవితా పటిమతో జన చైతన్యం కలిగించిన..జ్వాల.గరిమెల్లా.
స్వాతంత్ర్య ఉద్యమం లోకి కెరటమై దూకిన యోధుడు!
దేశభక్తి కవితల ఉద్యమనేత
దండాలు..దండాలు
గేయ ఉత్తేజితా
నిజాయితీ,,నిర్భీతి గల..విశిష్ట నేత
కంచు కంఠం తో
పాటల ద్వారా జనజాగృత మహోజ్వలా నేత
గొప్ప దేశభక్తులు
అనేక శిక్షలు అనుభవించారు
మాకొద్దీ తెల్లదొరతనం పాటతో...
భరతమాత దాస్య శృంఖలాలు...
ఛేదించిన..
నిరూపమానా దేశభక్తుడు..
మన బొబ్బిలి..గరిమెళ్ళ.


ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.దేనికి అనువాదం అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను
*************
గాజుల.భారతి శ్రీనివాస్.
ఉపాధ్యాయురాలు
చరవాణి:-9849788108.
మెయిల్,:ggajulabharathi@gmail.com.
97

[17/07, 7:12 AM] Gajula Bharati KS 20: అంశం:-ప్రపంచ న్యాయవాదుల దినోత్సవం
శీర్షిక:-సత్యమేవ జయతే
****************
నేరాలకు న్యాయం జరిగేలా
దోషులకు శిక్షలు పడేలా
న్యాయదినోత్సవం నేడు.
దోషి,,నిర్దోషుల వారధి
న్యాయ,,,అన్యాయాల ప్రతిది
స్వేచ్చా,, సమానతల పునాది
న్యాయస్థానం యొక్క వారసులు..న్యాయవాదులు!

చట్టం ముందు అందరూ సమానులే
సత్వర న్యాయ పరిష్కారాలే
వ్యక్తిగత స్వేచ్చా,, ప్రాథమిక హక్కుల పరిచాయలే
విస్తృత పరిచే
పవిత్రవృత్తి.. ప్రత్యక్ష దైవాలు..
న్యాయవాదులు!!

చట్టం డబ్బునోడి చుట్టం కాదని
బాధితుల పక్షపాతిఐ
న్యాయం కోసం పోరాటం చేసే వారై
ప్రపంచ మానవాళి శ్రేయస్సుకూ తపనపడే వారై
సత్వర కేసుల పరిష్కార ఘనులు
ప్రశాంత ప్రపంచ సృష్టి యోధులు
ఉత్తమ న్యాయవాదులు!!

డెబ్భై ఏళ్ళ గణతంత్ర దినోత్సవంలో
సమన్యాయం ఎండమావిగానే ఉంది
అనడం ఏ మాత్రం
అతిశయం కాదు.

ప్రస్తుత విపత్కర పరిస్థితులలో
రాజ్యాంగ స్ఫూర్తి ని మనం చేసుకునేందుకు
ప్రపంచ న్యాయవాదుల దినోత్సవం అవసరం.

ఉత్తమ న్యాయవాదులకు
వందనం..అభివందనం!

సత్యమేవ జయతే!!!
****************
గాజుల భారతి శ్రీనివాస్
ఉపాధ్యాయురాలు
ఖమ్మం.
చర వాని:-9849788108
98
మెయిల్ ggajulabharathi@gmail.com.
[17/07, 7:18 AM] Gajula Bharati KS 20: జయహో తెలుగుభాష
*************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చరవాణి:-9849788108

జయహో తెలుగుభాష
***********
తేనేకన్నా మధురమైన
చేరుకురసం కన్నా తియ్యనైన భాష...తెలుగు భాష!
దేశభాషలందు తెలుగు లెస్సా
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్
కొనియాడిన ఎందరో మహానుభావులు
అందరికీ వేల.. వేల.. వందనాలు
తెలుగు అక్షరాల తోరణాలు కట్టి
ప్రేమగా తడమాలి!
అమ్మ ప్రేమగా చదవాలి
తెలుగు అమ్మదనాన్ని ఆవాహన చేసుకుందాం
తెలుగు అంతరార్ధాన్ని అవగాహన చేద్దాం
తెలుగు అపురూప సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం
తెలుగోడి గుండెలయ తెలుగవ్వాలి
ఆశ..శ్వాస
తెలుగు వెలుగు అవ్వాలి
ప్రపంచ నలుదిక్కులా ఆశలా..శ్వాసలా
తెలుగు భాషే..దేదీప్యమానంగా వెలిగిపోవాలి
క్షరం కానీ అక్షరంలా వెలిగిపోవాలి
తెలుగు భాష నీకు వందనం!!
తెలుగోడా..నీకు పాదాభివందనం!!!

ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.

గాజుల.భారతి శ్రీనివాస్.
ఉపాధ్యాయూరాలు
9849788108
99

[18/07, 12:00 PM] Gajula Bharati KS 20: అంశం:-సినారే జీవితం-సాహిత్యం
శీర్షిక:-సాహితీ శిఖరం
******************
బహుముఖ ప్రజ్ఞ
కవి,,పాటల రచయిత,, అనువాదకులు,,పరిపాలనా దక్షులుగా అన్నింటా సింహభాగం..సినారే భళారే!
వన్నె చిన్నెల కలం
కవితాధార ప్రవాహం
వచన కవిత్వానికి
నాజూకు నడక నేర్పిన నేర్పరి
అష్టాదశ సారంగదుడు
అనన్య సాహిత్య కృషీవలుడు
సినారే పదాలు పరిమలించే కుసుమాలు
తెలుగులో గజళ్ళు ఒదిగేలా చేసిన ఘనుడు
సురుచిర సుందర తీరాలకు
రసరమ్య రమణీయ తావులకు దారిచూపే మహాఘనుడు..సినారే
నవ్వని పువ్వును నవ్వించిన వాడు
పద్మశ్రీ,,పద్మభూషణ్ బిరుదాకింతుడు
తెలుగుదనం ఉట్టిపడే
సరస్వతీ పుత్రుడు
రసరమ్య రాగాల రాఘవుడు
మాధురాతి మధుర గేయాల ఘనుడు
సినారే..భావవిస్తుతి ఆకాశమంత..వైశాల్యం సముద్రమంతా లోతైన..అనితర సాధ్యుడు
నవీన కవిత్వ కవిచంద్రుడు
సింహద్వారం గుండా
వెండితెర పరిచయమై పాటలు పరుగులు పెట్టించే గానాగంధర్వుడు
తెలంగాణ కీర్తి
మనిమాణిక్యాల దీప్తి
హృదయాంతరాల స్ఫూర్తి
సినారే..తెలుగు వైభోగాల క్రాంతి
తెలుగు గజళ్ళ సొగస్సు
చమత్కారాల విరస్సు
విరహాల తపస్సుల సుప్రసిద్ధుడు
సినారే..ప్రతీ పాట ఒక కర్పూర కళికా
రచనలో అగ్నివిరజిమ్మడం..
అమృతం కురిపించడంలో ఘనాపటి
అనంత జీవితసత్యం
విశ్వరంభారతత్వం
సినారే..మనసపుత్రిక
నన్నుదోచుకుందువటే.. పాటతో హృదయాలను దోచిన హృదయచోరుడు.
ఏమా సినారే..ఏమేమి రాసినరే.అని సాహితిలోకంలో మాటలను...పాటలను పరుగులు పెటించిన చీరస్మరనీయుడు
జానపదం అయిన
జ్ఞానపదం అయిన అలవోకగా రాసే రసరాజ ఘనుడు
మాటల మాంత్రికుడు
అనితర సాధ్యుడు
సాహిత్య కృషీవలుడు
ప్రముఖ కవి
సినారే గా ప్రసిద్ధుడు
చిరస్మరనీయుడు!!
****************
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.దేనికి అనువాదం అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను
****************
గాజుల.భారతి శ్రీనివాస్
ఉపాధ్యాయురాలు
ఖమ్మం
చరవాణి:-9849788108
మెయిల్:-ggajulabharathi@gmail.com
[18/07, 12:01 PM] Gajula Bharati KS 20: వీరాస్ కవిసమయం
*****************
కవిపేరు:-గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు&జిల్లా:-ఖమ్మం
చరవాణి:-9849788108
కవిత సంఖ్య:-100
శీర్షిక:-సుజాత
( ప్రియ నేస్తం )
తేదీ:-18/7/2020
నా స్నేహితురాలు పుట్టిన రోజు సందర్బంగా నా వందో కవిత

    సుజాత
***********
సూచనలు చేస్తూ
సున్నిత హెచ్చరికలు ఇస్తూ
తోడుంటానంటూ..
నీ నీడ నేనేనంటూ..
పాతికేళ్ల స్నేహం
ఏమని చెప్పను??
ఎలా చెప్పను??

అశాశ్వతమైన మాటలతో
క్షరం కానీ అక్షరాలతో
సౌమ్య శీలి
శ్వేతా వాణి
నవ్వుల రాణి
పువ్వుల బోణి
నా నెచ్చెలి ముకారవిందం
నా ప్రాణసఖి అమృతానందం

స్వచ్ఛతకు ప్రతీక
ముత్యం కు నిహరికా
ఎనలేని రాసులకు మరీచికా
నా చెలి పరిచయం
నా ప్రియసఖి హృదయతరంగం!

అదే పిలుపు
అదే స్నేహం
అదే ప్రేమ
ఇన్నాళ్ళైనా
ఎన్నేళ్లయిన
మారని నీ ఎద
మురిసెను నా పైఎద!!

ముదుమార హత్తుకునే
నిర్మలత్వ మనసులు
మనసారా ప్రేమించే
పండు వెన్నెల వైనాలు

కనపడితే చాలు
కోటి ఆనందాలు
ఎదురుపడితే చాలు
అంబరానంటే సంబరాలు!!

నాలో ఉన్నా నువ్వు
నీలో ఉన్నా నేను
జన్మ జన్మల బంధం
అన్ని జన్మలకు
కోరుకునే అనుబంధం!!

ఎల్లలు లేని
ఏ హద్దులేని
వెలకట్టలేని
శాశ్వత స్నేహానికి
చిరునామా
నా నేస్తం సాంగత్యం!!
నా పూర్వజన్మ సుకృతం!!!
***************
గాజుల.భారతి శ్రీనివాస్.
ఉపాధ్యాయురాలు.
ఖమ్మం.

🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

తిరు వేంకటాచార్యులు KS 6

బాటసారి KS 12

అనామికా శతకం విట్టుబాబు గారు