సుంకర శ్రీలత KS 21
కవయిత్రి సుంకర శ్రీలత గారు
కవిరాజ్ పురస్కార గ్రహీత
*************"""****""
పేరు:సుంకర శ్రీలత
తండ్రి పేరు:తిమ్మయ్య
భర్త పేరు:విజయ కుమార్
వృత్తి:ఉపాధ్యాయిని,LPH
సొంత జిల్లా:అనంతపురం
******************************
వీరి కవిత్వం ఆస్వాదించ బోయే ముందు
ఒక్క మాట
మీతో పంచుకోవాల్సినవిషయాలు:
1.నేను రాసిన "గ్రామ స్వరాజ్యం" నాటిక గాంధీగారి 150వ జయంతి సందర్బంగా తెలుగు యూనివర్సిటీ లో మా స్కూల్ పిల్లల చేత(zphs,Hayathnagar) ప్రదర్శింపబడి తెలంగాణా రాష్రం తరఫున జాతీయ స్థాయికి సెలెక్ట్ఐ నాగ్పూర్ లో ప్రదర్షింపబడింది.అక్టోబర్2 రవీంద్రభారతి లో ప్రదర్శించి,ముగ్గురు డైరెక్టర్ లు
విజయకుమార్ సర్(school education),శేషుకుమారి మేడం(scrt),మామిడి హరికృష్ణ గార్లచేత ప్రశంసలు, సన్మానం అందుకున్నాము.
ఆ నాటిక "కమలాభారతి " స్వచ్ఛంద సంస్థ వాళ్ళు దేశభక్తి నాటికల సంకలనం లో అచ్చువేశారు.
2. "మహిళా సాధికారిత" అనే వ్యాసం women's day రోజు
నమస్తే దినపత్రిక లో అచ్చయింది.
3.నేను రాసిన "మేరీ"అనే కథ బాలలది నోత్సవపోటీ లో ఉపాధ్యాయదర్శిని పత్రికలో మొదటి బహుమతి(2000/రూ.)సాధించింది.
అదే కథ "భూమిక"స్త్రీవాద పత్రిక లో విమెన్సడే సందర్బంగా వాళ్ళు ప్రచురించారు.
🙏ధన్యవాదాలు🙏
సుంకర శ్రీలత.
******""***************
1
తేదీ : 07-05-2020
కవిత సంఖ్య : 01
కవి పేరు : సుంకర శ్రీలత
జిల్లా : రంగారెడ్డి
శీర్షిక : ఆమె ప్రకృతి పక్షం
సృష్టి ప్రసవమైయ్యాక
జరిగిన ప్రకృతి పంపకాల్లో
ఆలోచనా శక్తి ని అదనంగా పొందిన మనిషి !
ఆకాశమంత ఎదిగి అత్యాశ తో అభివృద్ధంటూ అడవులు నరికి
ఋతుపవనాలకి బద్ధకం చుట్టించాడు.
సర్వభక్షకుడి గా మారిజీవకారుణ్యాన్ని
తుంగలో తొక్కేసాడు.
అందుకే కరోనా మనిషికి
కనిపించని శత్రువై
ధరాతలానికి దిగివొచ్చి
కరాళనృత్యం చేస్తోంది.
ఈ పోరాటం లో తను
ప్రకృతి పక్షం వహించి
నాణేనికి మరో వైపు చూడమంటోంది.
ఎన్నడో కనుమరుగైన
'దాల్ దౌర్ 'హిమవన్నగపు అందాల్ని
వేలు పెట్టి చూపెడుతోంది.
ఇన్నాళ్లు కాలుష్య పొగలు చిమ్మిన పర్యావరణం ఇప్పుడు పక్షుల ఆనందకేళి తో హొయలు పోతోంది లెమ్మంటోంది.
జీవించే 'హక్కు 'మాకూ
ఉందంటూ వన్యప్రాణులు
ఖాళీ రోడ్లెక్కి అస్తిత్వ ప్రదర్శన చేస్తుండగా.....
నదులన్నీశుభ్రజలాలతో
హాయిగా తేటగీతి పాడుకుంటుంటే.....
సద్దుమణిగిన మానవ
నిర్మిత హర్మ్యాల సందడికి
ప్రకృతి శుద్ధి పడి స్వేచ్ఛా గీతాలాలపిస్తుండగా....
గ్లోబలైజేషన్ గుడ్డి వెలుగులో
ఆధునీకరణ మాయామోహపు
తెరలుతొలిగించికనువిప్పు చేసింది కరోనా.
అందుకే!! పరితప్తహృదయాలతో
ఇదే ఆఖరి విపత్తవ్వాలని
గట్టి 'సంకల్పం' చెప్పుకొని
కుటుంబాలే పాఠశాలలుగా
బతుకు పుస్తకం తెరిచి
పచ్చని చిత్రాలు గీసేద్దాం.
రేపటి అవసరాలకు తగ్గట్టుగా
భావిభారతాన్ని మలిచేందుకు
సనాతన విలువల నడకల్ని
పిల్లలకు నేర్పించేద్దాం .
పంచతంత్ర కథలలోని భూతదయను ఉగ్గుపాలతో
రంగరించి పోసేద్దాం.
గృహనిర్బంధం కాదిది
బతుకు దీపాలు వెలిగించుకుంటున్న తరుణమని సరికొత్త
భాష్యం చాటిచెపుదాం
2
[09/05, 1:28 PM] Sunkara Sreelatha KS 21: వీరాస్ కవి సమయం
******************
కవిపేరు:- సుంకర శ్రీలత
కవిత పేరు :- ఆలోచనలు
కవిత సంఖ్య:-2
తేదీ:9/5/2020
ఆలోచనలు
ఆవృత్తాలై
పరిధి, వైశాల్యం
పెంచుకుంటూ
పోతూనేవుంటాయ్.
చిన్న మర్రికాయ
పెద్ద వటవృక్షం ఐనట్టు
మెదడు మొదల్లోంచి
ఆవిర్భవించే
ఆలోచనల వ్యాప్తి
అనంత సృష్టి లో
రేఖీయ సమీకరణాలై
విస్తరిస్తూ నే ఉంటాయి.
ఆకాశానికైనా
ఆలోచనల కైనా
పరిధులు వెదకటం
కించిత్ సాహసమే !!
అసలు ఈ సృష్టే
భగవంతుడు నిత్యం
ఆలోచించి చేసే
గొప్ప 'సృజన '
ఎప్పుడు మొదలౌతాయో
ఎక్కడ అంతమౌతాయో
తిరిగి ఎప్పుడు
పునరావృత్తమౌతాయో !!
తేల్చేదెవరు?
అసలు ఆలోచనే
లేకపోతే అభివృద్ధి
సాధ్యమేనా?
ఆలోచించండి.
అందుకే ఆలోచనలకు
అనకట్టవేయాలనుకున్న
ప్రతి సారీ అవి,
కట్టలు తెంచుకున్న
ప్రవాహమై, నన్ను
'త్సునామీ 'లా
ముంచెత్తుతూనే
ఉంటాయి.
3
తేదీ :19/5/2020
కవిత :జడ భరతులు
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀
ముళ్లకంపపై చిక్కుకున్న
వస్త్రాన్ని విడదీసినంత
సున్నితంగా !!విషపూరిత
వ్యక్తుల నుంచి మనల్ని
మనం వేరుపరుచుకుంటూ
వెళ్లాల్సిందే, ఎందుకంటే
మంథరలు, శకునిలు,
ఇంద్రజిత్ లు మళ్ళీ
ప్రత్యక్ష మావుతూనే.....
వున్నారుయుగాలు మారినా.
సరస్వతీ నిలయాలు కూడా
స్వార్థపూరితప్రయోజనాల
కోసంఊసరవెల్లులుతిరుగాడేవూడలమర్రులవుతుంటే
ధర్మం! నేనుండలేనంటూ
భేతాళుడిలా చెట్టెక్కికూచుంది.
గుడిలాంటి బడులు
సంకెళ్లులేని బందీల్లా
మౌనం! దాల్చిన మునుల్లా
మూగపోయి నిల్చుంటున్నాయ్
చరిత్ర సాక్షిగా !!
అవును,
రోజులు మారాయి
రాజకీయ రంగు పులుముకుంటున్న
బడులూ !మారుతున్నాయి.
చుట్టూ వున్న జనాల్ని బట్టి
న్యాయానికున్న నిర్వచనం
మారిపోతుంటే......
ఇక్కడ !!
మారిపోవాల్సింది మనమే
ఎలాగంటే??
నాకెందుకులే అని
వూరకుండడం కాకుండా
ఎదురెళ్లి పోరాడాలి
అన్యాయాన్ని ఈడ్చి
అవతల పారేయాలి
అంతేకాని జవసత్వాలు లేని
జడ భరతుల్లా!!
చూస్తూ ఉండిపోకలా...
4
తేదీ :19/5/2020
కవిత :స్త్రీ శక్తి (3)
రచన :సుంకర శ్రీలత
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆడపిల్ల అనే అస్తిత్వం
తనకు ఆపాదించింది మొదలు, ఎన్నెన్నో పోరాటాలు
మరెన్నో సంఘర్షణలు
ఆమె జీవన పుస్తకం లో
నమోదు చేయబడని
గణాంకాలుగా మిగిలిపోయాయి.
ఆడతనమో,
అమ్మతనమోతప్ప,
ఏ ప్రత్యేకత !లేని వ్యక్తిగా
తృనీకరించబడిన ప్రతీసారీ
ఆమె మనసు
ఘనీభవిస్తూనే వుంది.
ఉత్క్రుష్టమైన ఆలోచనలు,
సున్నితమైన భావోద్వేగాల
నడుమ, ఆడకత్తెర లో
పోకచెక్కలా, ఆమె
ప్రగతి రథచక్రాల కింద
ముద్దముద్దగా నలుగుతూ కూడా, ఎప్పటికప్పుడు
తనను తాను సరికొత్తగా
ఆధునీకరించుకుంటూనే వుంది
ప్రపంచంలోని మేధావులంతా
కలసి, ఎన్ని ఆవిష్కరణలు
చేసినా, భగవంతుడు సృష్టించిన
ఈ విశిష్టశక్తి ముందు
వెల వెల పోవాల్సిందే.
కళావిహీనం కావాల్సిందే.
5
సమయం
తేదీ :20/5/2020
కవిత :కదులుతున్న కాలం (5)
రచన :సుంకర శ్రీలత
🌻🌻🌻🌻🌻🌻🌻
రెప్పపాటు సమయాల్ని
లెక్కకట్టి నీ గుప్పిట్లో బంధిస్తావ్.
బంధాల్ని గుర్తెరగమని
బాధల తిరగలిలో
చకచకా తిప్పేసి
తికమకపెట్టేస్తావ్.
ఆశల కెరటాల్ని
ఒడ్డుకు చేర్చినట్టు
నటిస్తూనే...
అగాధాల అంబుధిలోకి
నెట్టేస్తావ్...
నీవే జాలరివై
జనాల్ని చేపపిల్లల్ని చేసి
ముందరికాళ్లకు బంధాలేస్తావ్.
అంతలోనే
బోధిసత్వుడై !
బంధనాలనుండి
విడివడే
మెళకువసూత్రాల్ని
'బోనస్' లా నేర్పిస్తావ్.
ఇంతేనా ?
కాలమంటే,
ఒట్టి కవ్వింపు చర్యలేనా !!
అని, కునికిపాటు పడుతుంటే
ఈ జాదూగర్ లోకంలో
అసలెవరు, నకిలీలెవరో
పోల్చుకోమంటూ...
'పజిల్ '' విసురుతావ్.
అసలు,
లోపలి మనసులు
పైకి కనపడనిస్తే కదా!
ఈ మనుషులు....
అంటూ - ఆలోచిస్తూ
అయోమయంలో పడిపోతే
అంతరంగ - తరంగధ్వనులే
గీటురాయిగా చేసి
నిఖార్సుగా !!
నిగ్గుతేలిన నిజమిత్రులను
బాసటగా నిలుపుతావ్.
కాలమా !
నీవు క్షణాల్ని హరించే
కాలుడవే కాదు
కరుణను కురిపించే
కృపాళుడవు కూడా !
అని, నిను పొగిడేలోపే
పాతదంతా పోయి
కొత్తదొచ్చే ఢాం.. ఢాం.. ఢాం..
అంటూ కేరింతలు కొట్టి
జనాల్ని చూసి,
వెర్రివెంగళప్పల్లారా !!
మీకు నేనేమిచ్చానో?
మీ నుంచి ఏం తీసుకెళ్తున్నానో? తెలుసట్రా..
అంటూ పరిహాసంతో
పలాయనం సాగిస్తావ్.
కాలం అంటే మార్పే కదా !
అంటూ నీతో పాటే
మేమూ సాగిపోతాం.
తేదీ :21/5/2020
6
కవిత :దిశకు నివాళి (6)
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
జీవనపార్శ్వాల
పక్కటెముకల
కింద నలిగి,
జీవించే హక్కుకై
చేసే పోరాటంలో
ఒక్కసారిగా !
ఆలోచనలు స్తంభించి పోగా
పరమపద సోపానంలో
ఆమె అడుగులు ఆగిపోయాయి.
నమ్మకానికి -అపనమ్మకానికి
మధ్య అయోమయంతో
ఊగిసలాడే !కళ్ళు
ఆసరా కోసం వెదికితే
మోసాన్ని మునిపంటితో
అదిమి, సాయంపేరుతో
నమ్మించి గొంతుకోసిన
మృగాళ్ల అకృత్యాలకు బలై ఆరనిచిచ్చయి ఆమె
ఎగిసిపోయింది.....
హృదయ దౌర్బల్యాలు
మానసిక బలహీనతలు లేని
బలమైన వ్యక్తిత్వపు!! జాడలను
అన్వేషించుకుంటూ....
నకిలీ వేషాలతో
జీవిత రంగస్థలం లో
చిందులేస్తున్న నాగరికులు
ఆదిమవాసుల జెరాక్స్ కాపీలై
విచ్చలవిడిగా తిరుగడుతుంటే
ఏం చేయలేని
నిస్సహాయ నిశీధి నుంచి వెళ్ళిపోయింది.
కిరాయి మనస్తత్వాలతో
అమాయకత్వాన్ని అరువు తెచ్చుకొనే జాదూగాళ్ళ
హృదయాంతరపు
చీకటి పొరలను
చీల్చుకుంటూ ఆమె
వెళ్ళిపోయింది......
చీకటి కావల ఏకాస్త
స్వచ్చతయినా వెలుగై
ప్రకాశిస్తుందనే ఆశ తో!!
నిష్క్రమ నిర్వేదంతోముగిసినా
పునరాగమనం మాత్రం
ప్రచండ కాళియై
దుర్గ యై, నిర్భయయ్, ఝాన్సీయై, రుద్రమయ్
విజృంభించ వీరాంగనై
చట్టాలు చేతపట్టుకొని
వస్తుందదిగో !
కామాంధుల
మదమనిచే 'దిశ 'గా
ఖబడ్ధార్ !! క్రూరుడా..
మదాంధుడ...
ఖబడ్ధార్...
7
కవిత :నేనింతే
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀
ఏంది? భయ్, నీ లొల్లి
వూకూకే అడ్డు తగుల్తావ్.
నా ఇష్టం! నా రాజ్యం !
సప్పుడు కాకుండా వూకో.
కడుపు మండి
నువ్వు వీధిలోకచ్చి
తిరుగుబాటు చేస్తేఏంది?
నీ మాట ఇంటన
నాకు నచ్చితే
గంజాయి మొక్కనైన,
సరే !
నెత్తి లో పెట్టుకుంటా
నచ్చకపోతే తుంగలో
తొక్కేస్తా నేనంతే..
నా ఇష్టం భయ్
అడిగినీకి నువ్వెవరు?
నీ ఎనకాతల ఏమైనా
బలగాలున్నాయా?
ఎక్కువ తక్కువ
మాట్లాడితే
రెక్కలిరిసేస్తా..
పీక నొక్కేస్తా...
గుట్టు చప్పుడు కాకుండా
పక్కోడికి అనుమానం రాకుండా...
గుడ్లు ఒతెస్తా బిడ్డా.. 😡😡
8
కవిత :పెళ్లి నిఘంటువు
రచన :సుంకర శ్రీలత
🌸🌸🌸🌸🌸🌸🌸
శ్రీరస్తు శుభమస్తు అంటూ
శ్రీకారం చుట్టుకున్న వాళ్ళ
"పెళ్ళిపుస్తకం " డెబ్భై
వసంతాలు పూర్తి చేసుకొని
పెళ్లి 'నిఘంటువే 'ఐయ్యింది.
పెళ్లంటే మూడే ముళ్ళు
ఏడే అడుగులు
పప్పన్నాలు
సన్నాయి మేళాలు
చెప్పుకుంటే నిర్వచనం
చిన్నదే ఐనా....
భిన్న వ్యక్తిత్వాలతో
భిన్న అభిరుచులతో
దశాబ్దాలు కలిసి చేసే
జీవనయాత్రను నడిపించే
'సూత్రం ' మాత్రం
ఎటుపడితే అటు ఊగే
గాలిపటం కాదు.
వివాహవ్యవస్థ అనే పెద్ద
వటవృక్షానికి బలంగా
అల్లుకున్న మల్లెతీగ.
పురుషుడునచ్చితేప్రేమిస్తాడు స్త్రీనమ్మితేప్రాణమిస్తుంది.
నచ్చడానికి, నమ్మకానికి
మధ్య వైరుధ్యం,
ఇరువురి మధ్య నున్న
భావోద్వేగాల అంతరం.
అన్నిటిని అధిగమించి
దాంపత్యాన్ని పండించుకోవడమే
వివాహబంధం.
ముడతలు పడిన శరీరాలతో
అనుభవం నిండినమనసులతో
అరిగిన కీళ్లు, ఒంగిన నడుము
మసకబారిన కనుచూపులతో
కడదాకా కలిసి జీవించడమే
జీలకర్ర, బెల్లం పరమార్థమేమో !!
తడబడే అడుగుల్తో పాపాయిల్లా పారాడుతూ
ఒడిదుడుకుల్ని తట్టుకొని
ఆఖరుదాకా ఆసరాగా
నిలబడటమే 'సప్తపది '
భాష్యమేమో !!
అందుకే పండుముత్తయిదువలా
ఆమె వెళ్ళిపోతే,
ఆకాశం లో కనిపించే
నక్షత్రాలలో ఆమెను
వెదుక్కునే వాలంటైన్
ఐయ్యాడు అతడు.
ఒకరికొకరు ఋణానుబంధాలు
అనుకున్నారో ఏమో?
రుణాలు తీరి
నీవేనుకే నేనంటూ
ఒకరివెంట ఒకరు వెళ్లిపోయారు.
ప్రేమంటే అవసరమూ కాదు
ఆకర్షణా కాదు, అన్నిటికీ
అతీతమైన "పవిత్రబంధం "
అంటూ చెప్పకనే చెప్తూ
ఆదర్శ దంపతులైయ్యారు.
(అత్త, మామకు అంకితం )
O9
తేదీ :23/5/2020
కవిత :ధ్యానం (9)
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀
చుట్టూవున్న జనాలందరూ
ఒక్కసారిగా !
పరాయీకరణ చెందారా?
అన్న సందేహం....
ఎందుకొచ్చిందో తెలీదు.
ఇప్పుడిక ఏకాంతంలో
అంతర్ముఖి గా ఉండటమే
బావుందనిపిస్తుంది.
ఎందుకంటే?
నిశ్శబ్దంగా జరిగే
జ్ఞాపకాల తవ్వకంలో
నన్ను - నేను
వెలికి తీసుకొనే ప్రయత్నం
నా అస్తిత్వానికి
సరైన నిర్వచనం !
ఖచ్చితంగా చెబుతుందని
ఆశపడ్డాను.
కానీ,
ఆత్మావలోకనం
ఏమంత ఈజీ కాదు !
ఎందుకంటే?
కొన్ని జన్మల
వాసనాబలాలతో
ముడిపడిన ముద్రలని
కేవలం ! ఈ జన్మతోనే
సరిచూసి
పోల్చుకోవడం ఎలా సాధ్యం !
ఏదో ఒక
భౌతిక చట్రంలో
బంధించాలని చూస్తే
ఊపిరాడక,
ఉక్కిరి - బిక్కిరి
అవుతుంటే
నన్ను - నేను
వెతుక్కుంటున్నాను వెనక్కువెళ్ళి.
ప్రశ్నలన్నీ మౌనవాక్యాలై
ఆలోచనల అలజడిని
అణగార్చి,
మనసుతో హృదయాన్ని
అనుసంధానించే
నిశ్చల యోగమే
సమాధానమై నిలచింది...
10
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత :😷కరోనా అబ్
తుమ్ ఛలోనా 😷
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ఏ మానవ తప్పిదమో
ప్రకృతిని ప్రేరేపించి
కనిపించని శత్రువై
ప్రపంచాన్ని కకావికలం చేస్తూ
మరణమృదంగం వాయిస్తోంది.
కసితీరా! మానవ కళేబరాల్ని
మారణ హోమంలో పడేస్తూ...
రాక్షసమాయను తలపిస్తోంది
ప్రపంచదేశాల తప్పులు
లెక్కకు మించాయేమో?
కృష్ణుని చేతిలో హతమైన
శిశుపాలుల్లా! నేలకొరుగుతున్నారు జనాలు, శవాలై గుట్టలుగా..
దుష్టశిక్షణ - శిష్టరక్షణ కోసం
విధి ఆడుతున్న వింతనాటకం
కాకపోతే !! ఐకమత్యంతో
పోరాడే రోజులు పోయి
ఒక్కరే విడివిడిగా
ఒంటరి గదుల్లో అంతర్మధనంతో
తనతోపాటు నలుగుర్ని
కాపాడుకోవాల్సిన దుస్థితి.
ఈ ఆపద సమయంలో
పెద్దలమాటలే వరాలై
అక్కరకొస్తున్నాయి
కాళ్ళు - చేతులు కడుక్కోకుండా
దూకుడుగా ఇంట్లోకి దూరే
మనవల్ని " ఛీ.. భడవా!!" అంటూ
దుడ్డుకర్ర పుచ్చుకున్న బామ్మలా,
కరోనా వైరస్ ప్రత్యక్షమైంది !!
పబ్బులు - క్లబ్బులు అంటూ
విచ్చలవిడిగా తిరిగే మందుబాబులు ఇంట్లో
మూసుక్కూర్చునేలా
మాడు పగలగొట్టే మహమ్మారై !
విజృంబించింది.
అడ్డు - అదుపు లేకుండా
ప్రకృతిలో కనపడ్డ
జీవరాసినల్లా పొట్టన పెట్టుకునే
పాపాత్ముల 'కీలెరిగి వాతలు '
పెడ్తున్నట్టే ఉంది.
పైకి 'ఉపద్రవం'లా కనపడుతూనే
మానవాళికి ఎన్నో గుణపాఠాలు
నేర్పడానికి 'కరోనా' పేరు పెట్టుకువచ్చిన పంతులమ్మా.. !
ఇక చాలు నీ దండనలు
పచ్చాత్తాపంతో జనాలు
ప్రాయశ్చిత్తాలు చేసుకుంటున్నారు
' కరోనా అబ్ తుమ్ ఛలోనా '
ప్లీజ్.............
11.
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత :ఆశా కిరణాలు (11)
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀
నిన్న నేటికి గతం కావొచ్చు
నేడు చేస్తున్న యుద్ధం
రేపటి చేదు
జ్ఞాపకంగా! మిగలొచ్చు....
తప్పొప్పులెంచుకునే
సమయం మించిపోయింది.
నేటి చావు లెక్కలే కాదు,
రేపు !బతకడానికి కావాల్సిన
ఆహారపు లెక్కల సూచీలూ
'బూచీలై' భయపెడుతున్నాయి.
కష్టకాలం లోనే కదా !మనం
నిబ్బరం తో నిగ్గుతేలాల్సింది.
దూరమైనపుడే కదా దగ్గరకు
చేరే దారులు వెదుక్కొనేది.
చీకటి కమ్మినపుడే కదా
ఐక్యతా దీపాలు వెలిగించేది.
సంకెళ్లు పడ్డప్పుడే కదా
స్వేచ్చవిలువ తెలిసేది.
ఐనా !ఇది
పశ్చాత్తాప పడుతూనే..
ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సందర్భం.
ఏ సమాజానికైనా కుటుంబాలే
కదా!పునాదిరాళ్ళు.
అందుకే రేపటిఅవసరాలకు
తగ్గట్టుగా పిల్లల్ని
మలచడానికి అనువుగా
దొరికిన వరంగా!
ఈ సమయాల్ని స్వీకరిద్దాం.
ఆపదలో ఆపద్భాందవులై
భరతమాత సేవలో ముందున్న
మన 'మినాల్ భోన్స్లే' కృషిని
రతన్ టాటా 'త్యాగనిరతిని '
వైద్యుల కర్తవ్య దీక్షని
పోలీసుల తెగువని
వైరస్ ను ఊడ్చి పారేస్తున్న
పారిశుద్ధ కార్మికుల సేవల్ని
కథలు - కథలుగా చెప్పి
పిల్లల్లో దేశభక్తిని రగిలిద్దాం.
అసలు సిసలైన
ఆచార -వ్యవహారాల
స్పృహను కలిగిద్దాం.
రాబోయే రోజుల్లో
ఇలాంటి విపత్తులు
పునరావృతం కాకుండా
నిన్నటి సామజిక
తప్పిదాల నుండి...
గుణపాఠాల్ని నేర్పుదాం.
ఎందుకంటే?
పిల్లలే కదా....
మన ఆశాకిరణాలు.
12.
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత(12):స్నేహం
రచన :సుంకర శ్రీలత
🌹🌹🌹🌹🌹🌹
ఏడాది క్రితం జరిగిన
వీడ్కోలు సభను
ఎంత బలవంతంగా
ముగించాల్సి వచ్చిందో!
మీకు గుర్తుందా?
పొంగుకొచ్చిన దుఃఖం
గద్గద స్వరాలతో
పూడుకుపోయిన గొంతుకలతో
భావాలు బయటకు రాక
ఇబ్బంది పడ్డారు కదా!
అందర్నీ వదిలి వెళ్ళ లేనంత
అనుబంధం ఎక్కడిది?
జీవితం మలి దశలోనూ
ఇంత భావోద్వేగమా!!
అని ఆలోచించాను.
యాంత్రిక జీవనం తాలూకు
నిర్లిప్తతో!
న్యూక్లీయర్ ఫామిలీస్ లోని
ఏకాకితనమో!
పిల్లలు పెరిగి పెద్దవాళ్లయి
రెక్కలు కట్టుకుని విదేశాలకు
ఎగిరి పోతే,
తల్లిగూడు ఖాళీఅయిన
నిశ్శబ్దమో!
గుండెగూటిలో సందుచేసుకొని
మెలిపెట్టినప్పుడు,
స్నేహాలే కుటుంబాలయి
ఆత్మీయతను పంచుకుంటూ
ఓకేగూటి పక్షులై
ప్రతి సమస్యకు ,పలు సమాధానాలు వెదికి పెట్టి
ఒత్తిడిని తరిమికొట్టి
పనిచేసే ఉత్సాహాన్ని
అందిపుచ్చుకున్నాం.
మరి?ఇంత 'గూడు'చెదిరి
భూమి గుండ్రం అన్నట్టు
ప్రత్యక్ష పలకరింపులు పోయి
సద్దిపెట్టలోని మెసేజ్ లకే
స్నేహాలు........... పరిమితమైపోతాయనే ఆలోచనే,అంత మందిని
కుదిపేసి పొగిలి పొగిలి
ఏడ్చేలా చేసిందా?
అందుకే!!
వలస పక్షుల్లా మీరు
ఎగిరిపోయినా.....
తిరునాళ్ళలో తప్పిపోయినi
'పిల్లాడి'లా మిమ్మల్ని
వెదుక్కుంటూనే ఉన్నాను.
ఇదే కదా స్నేహమంటే....
13
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత :లయ (13)
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀
సృష్టి లో ప్రతి దానికీ
ఓ, లయ ఉందనేదే
నిజమైతే !నా అక్షరాలకు
కూడా లయ ఉండాలి కదా !
హృదయం స్పందించిన
ప్రతిసారి మేల్కొనే నా
ఆలోచనలకు ఊపిరి, ఈ
అక్షరాలే మరి !
పక్షుల రెక్కల టపటపలు
గాలి చప్పుడు తో
పోటీపడి, ఆకుల
మాటున దాగిన
అనంత నిశ్శబ్దాన్ని ఛేదించినట్టు, గుండెలో
అలికిడి మొదలై
అలా అక్షరాల్లోకి దూసుకెళ్లి
ఎలా అంతమౌతుందో?
నాకే తెలీదు.
14
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (14):ఆకాశం లో సగం
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఎవరి చేత్తోనో రాయబడ్డ పుస్తకమైంది !
నా జీవితం, అని
ఇప్పుడిపుడే, ఎరుకలోకి వస్తోంది.
ఇన్నాళ్లు... నాకే తెలీలేదు,
నేనొక బందీనని.
నా ఆలోచనలు, ఉద్వేగాలు
అన్నీ బట్వాడా చేయబడ్డ
బానిస భావాలని,
ఇప్పుడిపుడే.. గ్రహింపులోకి వస్తోంది.
ఇరవై ఏళ్ళు, వెనక్కుపోతే!
ఆ 'నేను' కి , ఇప్పటి 'నేను' కి
మధ్య ఎంత! తేడా?
వర్షానికి రాలిన
పున్నాగ పూల సౌరభం,
వసంతంలో, కోయిల కూతల అనుకరణ!
నల్లని మేఘం - సాయంసంధ్యా
అన్నీ కవితావస్తువులై
పుస్తకం నిండా పరుచుకునేవి.
'స్వేచ్ఛ' గురించి ఎన్నెన్నిచర్చలు?
ఆ భావాలన్నీ ఏమయ్యాయి?
బంధాలు - బాధ్యతలు
వైరల్ ఫీవేరయ్యి పీల్చేసాయా?
'ఉద్యోగం' స్త్రీ ని మరింత
బలోపేతం చేస్తుందనుకున్నా, కానీ,
ఆ 'ఊబి'లో కూరుకుపోయి
ఒత్తిడిలో, ఒత్తిగిలిపోతాననుకోలేదు.
'ఆర్థిక స్వేచ్ఛ' అసలా పదం లొనే ఏదో అబధ్ధముంది.
ఎందుకంటే, అది కేవలం
జీవన్మరణానికి మధ్యనున్న
సన్నని 'ఆసరా' మాత్రమేనని
అపుడపుడనిపిస్తూ వుంటుంది.
స్వేచ్ఛ - ఆర్థిక స్వావలంబన
అనే పదాలు పట్టుకుని
జీవితంలో ఏదో పొడిచేయలనే
పంతంతో ప్రయాణం
మొదలుపెట్టిన 'నేను'
పురుషాధిక్య సమాజ 'ముసుగు'లో
భద్రంగా దాచబడిన
'బానిస'లాగా, తిరోగమించిన
క్రమమే నాకు విచిత్రంగావుంది.
అనాదినుంచి మా జాతికిది
అలవాటే మరి!
ముళ్లబాట మీద
కాసినిపూలు పరిచి, సర్దబోతే
మటుకు! కిందనున్న ముళ్ళు
గుచ్చుకోవడం మానేస్తాయా?
సామాజిక భద్రత లోని డొల్లతనం,
'ఆకాశం లో సగం' సృష్టిలోని
ఓ ఇంద్రజాలం!
ఈ భ్రమలు, భ్రాంతులతో
నన్ను , నేను తర్కించుకుంటే
మిగిలే శేషమే
నా వునికని తేలింది.
అందుకే , నన్ను - నేను కొత్తగా!
నిర్వచించుకునే అవసరమొచ్చింది.
15
[03/06, 1:35 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (15):ప్రేమ
రచన :సుంకర శ్రీలత
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఎప్పటికెప్పుడు నిన్ను
చూడాలనే ఉంటుంది నాకు
ఎందుకో !తెలీదు....
ఎదురుగ లేని నిన్ను
వున్నట్టే ఊహించుకొని
ఏవేవో !ఊసులాడుకుంటాను
నాలో నేనే...
వినీవినిపించనట్టు
'పిచ్చిదానా 'అంటూ
నా చెవిలో ఏదో
రహస్యం !!
ఊది ఊరకుండి పోతుంది
నీ జ్ఞాపకం.
సరిగా అపుడే
"ప్రేమ "గురించి ఏదో,
రాయాలని పోతానా?
ఊహు, రాదు...
గొంతులో అడ్డం పడి
గిజగిజ లాడుతూ
తిరిగి గుండెలోనే
గూడు కట్టుకుంటుంది.
అంతవరకు ఉత్సాహంగా
వున్న కాగితం,
ఏమీ రాయలేని
నా ఆసక్తతను! గాలితో
జతకూడి రెపరెపలాడుతూ
తన నిరసనను అలా
వ్యక్తపరుస్తుంది....
16
[03/06, 1:35 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత(16) :పంతులమ్మ
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ఆమె ఉరుకుల పరుగుల జీవితం, విశ్రాంతి ఉపాధ్యాయురాలిగా
విరామం తీసుకుంటోంది.
మడిమలు, మోకాళ్ళ నొప్పులతో అలసిన దేహం
ఇక నడవనని మొండికేసింది.
ఇంట్లో పిల్లల్ని, బడిలో పిల్లల్ని
కనుసైగలతో కట్టడి చేయగల
సత్త వున్న ఆమె, ఇపుడు
నాలుగు గోడల'గది 'కే
పరిమితమైపోయింది.
కాట్రాక్టుఆపరేషన్ లు
దృష్టి దోషాలు బాధిస్తున్న
జీవనపార్శ్వాలను
ఎప్పటికప్పుడు కొత్తకోణం
లోంచి చూస్తున్న
'ద్రష్ట' ఆమె!
బ్లాక్ బోర్డు మీద
చక చకా లెక్కలు రాసిన
చేతులు, ఇపుడు
రామకోటి పుస్తకాలను
టక టకా నింపేస్తున్నాయ్.
శిష్యుల శిక్షణ కు
పనికొచ్చిన కథలు ఇపుడు
వ్యక్తిత్వ వికాస సూత్రాలుగా
మనవళ్లకు మానమరాళ్ళకు
బోధిస్తుంటే, ఎవరనగలరు?
ఆమె రిటైరైయ్యిందని.
పిల్లలకు ఇల్లే మొదటి పాఠశాల
ఆమ్మే మెదటి పంతులమ్మ.
17
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (17):శుద్ధి
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
జీవితం సంక్షోభంలో
పడ్డ ప్రతీసారి....
నాలోనిసంవేదన
సంఘర్షణగా మారి,
సంధిగ్ధావస్థలో
కొట్టుమిట్టాడుతునప్పుడు
ఊబిలో కూరుకుపోతున్న
ఓ 'మూగజీవినై' పోతాను.
ప్రవచనాలో, పుస్తకాలో
లేక, చైతన్య గీతాలో
ఏవైతేనేం?
బలమైన తాడులా పెనవేసుకుని
నన్ను బయటికి నెట్టినపుడు
సుఖంలోని ఆనందంకంటే
బాధలోని ఆలోచనల 'తళుకు'
నన్ను అబ్బురపరుస్తుంది.
ఇప్పటిదాకా పేరుకుపోయిన
ఘటనాఘటనల గోడలని
చీల్చుతూ చేసే
స్వీయపరిశీలన
మనోవికల్పాలన్నిటిని
కన్నీటిధారలతో
స్వఛ్ఛంగా తుడిచి
ఆరబెట్టినపుడు జరిగిన
చిత్తశుద్ధితో,
జీవన తత్వాన్ని శోధించే
అన్వేషణతో !!
ప్రవాహమై సాగిపోతాను
18
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (17):అనుభూతి
రచన :సుంకర శ్రీలత
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మూసిన కనురెప్పల మధ్యనుంచి జారిపోతున్న
కన్నీరు కాలువై
నీ ఆలోచనలను
నా జ్ఞాపకాల మంజూషలో
భద్రపరుచుకొనే యత్నం
ఓ యగ్నమై !!
కోరికల సుడిగుండం లోకి
ఇంకి పోతుంటే, నీ
చల్లని ఒడిలో
సేదతీరుతున్నాను.
అపార్థాలు -అపోహలు
అన్నీ మన మధ్య
దగ్ధమౌతుంటే
తడిచిన నీ
కళ్ళల్లో నా రూపం
చూసుకుంటున్న క్షణం లో
నా రెప్పల కదలికల
మాటునుంచి
జలజల రాలే కన్నీరు
నీ ప్రేమ !!
గుప్పిట్లో ఇంకిపోతుంటే
పంచుకుంటున్న
అనుభూతి
మన ఇద్దరిదీను కదా !
19
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (18):కలబోత
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
గుణాత్మక ప్రాతిపదికగా
గుర్తుపెట్టుకున్న
స్నేహాలన్నిటినీ ఒకచోట
ఏర్చి కూర్చితే
వసుధైక కుటుంబానికి
నమూనాగా!! ప్రత్యక్షమైయ్యాయేమో
కబుర్లన్నీ కలబోసుకుంటుంటే
కాలం పరిగెత్తినట్టయింది.
కల్తీ పదార్థాలు తింటూ
రక్తసంబందాల్ని కూడా
కలుషితం చేస్తున్న నేపథ్యం లో
బాల్యమిత్రులంత స్వచ్ఛమైన
బంధాలన్నీ ఒక్కసారిగా
తారసపడితే,
గుక్కపట్టి ఏడుస్తున్న
పిల్లవాణ్ణి,
తల్లి చంక నెత్తుకుని
లాలించించినంత గొప్ప
ఊరడింపు కలగక మానదు.
ఏమిటి లోకం? అన్న ప్రశ్నకు
తాలింపు పెట్టన వాసన
గుభాలిస్తోంది.
అందుకే,
మంచి అనుబంధాల్ని
గెట్ టూ గెథెర్ అని
అపుడపుడు ఆహ్వానించుకుందాము.
ఇంకా మనం మనుషుల
మధ్యే బతుకుతున్నాం
అని భుజం తట్టి
ప్రోత్సహించుకుందాం.
20
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (20):అమ్మకు ప్రేమతో
రచన :సుంకర శ్రీలత
💐💐💐💐💐💐💐💐
అమ్మా !నీ పుట్టినరోజు కదా, ఏదయినా రాద్దామనుకుంటే
ఏం తోచడం! లేదు, ఎందుకని?
చెదిరిన వర్ణమాలలో
అచ్చులేవో హల్లులేవో
గుర్తుపట్టలేనంత
గజిబిజీ గా జీవితం !
వొత్తులేవో, గుణింతాలేవో
తెలియని,బాల్యం !తాలూకు
కన్ఫ్యూషన్ మళ్ళీ మొదలైనట్టుంది.
అమ్మ గురించి ఎవరెన్ని
ఉపమానాలు చెప్పినా
నాకు మాత్రం నువ్వు
'ధైర్యం విసిరిన రాకెట్టే '
అమ్మా !
చిన్నప్పటినుంచి నువ్వు
నా బుర్రకు ఎక్కించిన
"సత్యం మాట్లాడు,
ధర్మంగా నడుచుకో " అన్న
ఈ రెండు మాటలు
సామాన్య వాక్యాలుగా
కనిపిస్తున్నా, ఇపుడిపుడే
వాటి లోని సంక్లిష్టత తెలుస్తోంది.
నన్ను ఈ సమాజం లోకి
పంపేటప్పుడు కాస్తంత
'లౌక్యం 'నేర్పుంటే
ఎంత బావుండేది !
ఇపుడు అరువు తెచ్చుకున్నా
మాటలకు అంటుకోవట్లేదు.
ఏదేమైనా నీ నుంచి
అనువంశికంగా వచ్చిన
ఆధ్యాత్మిక సంపద మాత్రం
నాకు కొండంత అండగా
నిలబడి వెన్ను తట్టి
ప్రోత్సహిస్తుంటుంది.
ఇంతకంటే పిల్లలకు
ఇవ్వాల్సిన నిధులేముంటాయ్.
21
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (21):ఉనికి
రచన :సుంకర శ్రీలత
దేవా !త్రిగుణాతీతుడైన
నిన్ను నేనెలా స్తుతించను?
జీవేశ్వరా !!
జీవిగా ఆవిర్భవించింది
మొదలు నా జీవితాన్ని
నడిపిస్తూ.. శాసిస్తూ..
నీడలా వెంటాడుతూ వుండే
నిన్ను నేనెలా చూసేది?
నాలోని నిన్ను కనుగొనేదెలా?
సత్య బోధ, ఆత్మ సాక్షాత్కారం
ఈ పదాలేవీ !
నాకు తెలీదు.
నాకు కావాల్సింది
కేవలం !
నీవు నాతో వున్న 'ఉనికి '
అంతే !ప్రభు...
22
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (22):స్నేహం
రచన :సుంకర శ్రీలత
🌻🌻🌻🌻🌻🌻
భావాల్ని పంచుకోవడం అంటే
'ఆత్మను'ఆవిష్కరించుకోవడమే
ఉత్తమ సంస్కారాలు
వున్న చోటే అది సాధ్యం.
లేకపోతే ఒట్టి
గాలి కబుర్లై
తేలిపోతాయ్...
ఒకరి అంతరంగాన్ని
మరొకరు ఒడిసి
పట్టుకోవడం అంటే
కాలాలకు అవతల
కంటికికనిపించనంత మేరా
ఆలోచించ గలగడమే.
హృదయం ఎంతో
విశాలమైతే తప్ప
ప్రయత్నం నిరర్థకం.
అందుకే !
చావు, పుటుకలే కాదు
స్నేహాలు కూడా..
స్వర్గం లోనే నిర్ణయం
అవుతాయేమో?
ఆపదలు చుట్టుముట్టినపుడు
స్నేహితులే.....
ఏంజెల్స్! అయి
అవతరిస్తారు.
ఒంటరి ఎడారుల్లో
ఓదార్పు సెలయేరులై
ప్రవహిస్తారు.......
23
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (23):మరియమ్మ
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
భూమ్మీద పడగానే అందరిలాగే
అమ్మను వెతుక్కుంది
చిన్నారి మరియ
ఆమె ఈ లోకం లోకి
ఎప్పటికీ రాదని తెలిసితానే నాన్నకు అమ్మయింది.
పదేళ్ల తర్వాత
ఈ మధ్యే నాన్న
'కొత్తమ్మను'తెచ్చాడు.
ఐనా ! తానే కూరలొండాలి
ఎందుకంటే? ఆమెకు
కూరలు రావు మరి.
అలా !మన మరియమ్మ
ఇంటికి పెద్ద దిక్కై
నాన్నకు అమ్మయి
అమ్మకు అత్తయి
అన్నం వండి
వడి వడి గా
అడుగులు వేస్తూ
గంట కొట్టేలోపు
బడికి చేరాలని
పరుగులు తీసేసరికి
చిరిగినా సంచీ లోంచి
పుస్తకాలు బోర్లాపడి
వెక్కిరించాయి....
ఆలస్యమైతే బెత్తం దెబ్బలు
గుర్తొచ్చాయేమో మరి?
టక టక పుస్తకాలని
సంచిలో ఎత్తి కుదేసి
చంటి పిల్లల్లే చంక నెత్తుకొని
చక చకా అడుగులేస్తూ
బడివైపుకే పరుగుతీస్తోంది
మరియమ్మ....
చదువులమ్మ కావాలని....
24
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (24):మనసే కదాని...
రచన :సుంకర శ్రీలత
🌹🌹🌹🌹🌹🌹🌹
మనసే కదాని
మాయ చేయబోతే
మూసుకొని ఉండటానికి
అదేమన్నా !
కవాటాలతో పనిచేసే
హృదయమా?
సంకల్ప వికల్పాలతో
ఎగిసి పడే
సాగర కెరటమైతేను.
భావావేశం కమ్మినపుడు
మనసొక భావగీతమై
కృష్ణశాస్త్రి ఎదుట
నిలబెడుతుంది.
ప్రేమ పొంగినపుడు
బాలు గొంతుకతో
ప్రణయ గీతమై
ఆలపిస్తుంది.
దానికి లొంగదీసుకోవడమే
తెలుసు, లొంగివుండటం
అస్సలు గిట్టదు. లోకువ చేస్తే అలిగి కూచుంటుంది.
మెచ్చుకోలుగానవ్వితే చాలు
అసాధ్యాలను సుసాధ్యాలుగా
చేయడానికి 'ఉప్పెనై '
వురుకుతుంది.
పాపం !మనసు
దానిది' పసిదాని 'తత్వం
బాధైనా, సంతోషమైన
అందులో ఇమిడిపోవడమే
దానికి తెలుసు.
గ్రహణం పట్టిన ముసుగులో
తన్ను తాను
కుంగదీసుకుంటుంది.
కలత చెందితే
కన్నీరై చిందుతుంది.
కాస్త ఆలంబన దొరికితే
ఎవరెస్టైన !ఎగబాకేస్తుంది.
పసిఫిక్ !నైనా ఈదేస్తుంది.
25
సమూహం :వీరాస్
కవిసమయం
కవిత(25):జ్ఞాపకాలు
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
కొన్ని జ్ఞాపకాలు
తెరమరుగవగానే
మాయమైపోతాయి.
కొన్ని జ్ఞాపకాలు
అతిథి లా వచ్చే
పిల్ల వాయువులై
పలకరించి
పోతుంటాయి.
కొన్ని జ్ఞాపకాలు
ఆలోచనల వేడికి
ఆవిరైపోతుంటాయి.
కాని.. కాని...
కొన్ని జ్ఞాపకాలు మాత్రం
నీడల ముడులై !
ఎప్పుడూ..
అంటిపెట్టుకొని
అనుభవాల
సందడి చేస్తాయ్.
మరి కొన్ని
జ్ఞాపకాలు
వర్షం ఆగాక
కదిపిన
చెట్టుకొమ్మల్నుంచి
రాలే! చినుకుల్లాంటి
అనుభూతులుగా
మారిపోతాయి....
ప్రకృతి లో
మారే ఋతువులతో
జ్ఞాపకాలు గానీ
పోటీ పడుతున్నాయా?
26
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (26):లేడీస్ స్టాఫ్ రూమ్
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
గోడలు బీటలు బారిన
ఐక్యత ఎక్కడా చీలలేదు
ఎలుకలు పారాడినా..
రూఫులు లీకై
జలాభిషేకాలు జరిగినా..
పురాతన ప్రదర్శనశాలను
తలపించినా...
ఏదయినా గానీ..
మా స్టాఫ్ రూమ్ !
మాకు 'మాత్రమే 'ప్రత్యేకం.
ఎందుకంటే?
అదో !విజ్ఞాన ఖని
చర్చా గోష్ఠుల
ప్రతిధ్వని !
విందు, వినోదాల
హాస్యవల్లరి !
వివేక, విచక్షణాల
జ్ఞానఝరి !
సలహాలు, సూచనల
ఓ !మినీ
గూగుల్ తల్లి..
అనురాగాల
కల్పవల్లి...
(2018 లో జరిగిన ట్రాన్స్ఫర్స్ లో ఒక్కసారిగా 13మంది లేడీటీచర్స్ బదిలీ ఐన సందర్బంగా వాళ్లకు అంకితమిచ్చిన కవిత )
27
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (27):ప్రదక్షిణ
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
చిత్తం నీ మీదకు మళ్లించి
పరుగు పరుగున
నీ 'గుడి 'చేరి
నీ నామ సంకీర్తన తో
'గిరిప్రదక్షిణ 'చేస్తూవుంటే
ఎంతకీ? తెమలదేం,
అరుణాచలేశ్వరా !
అనంతుడైన నిన్ను
చుట్టాలనుకోవడం
నా వెర్రి భ్రమేనా?
ఐనా, ఏ ప్రయత్నమైనా
అనంత కరుణా సాగరాలైన
నీ నయనాలలో
రెప్పపాటుకాలమైనా
మునకలు వేయాలనే
పిచ్చి ఆశ !
అంతే.. ప్రభు..
28
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత :(28): "ఆర్తి "
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
దేవా !
మబ్బుల
ముసుగేసిన ఆకాశం
సన్నగా...
మూలుగుతున్నట్టున్న
ముసురు!
నాలోని,
'ఆర్తిని 'మూగగా
తడిమింది కాబోలు!
ఎన్నో జన్మల
మన ఎడబాటువల్ల
కుంగిన ఆత్మగోషకు
కంటినిండా కారుతున్న
కన్నీటి ధారలతడి
హోరున కురుస్తున్న
వానజడి తో
సారూప్యం చెందగా
వీస్తున్న
వాయుసమీరాలు
నీ సామీప్యాన్ని
తలపిస్తూ... కాస్తంత
ఓదార్పు నిస్తున్నాయ్
ప్రభు.....
29
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (29): బతకడమే గెలుపు
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ఎవరన్నా !
ఎపుడైనా కలగన్నారా?
గెలుపు పదానికి
కొత్తర్థం పుట్టుకొచ్చేంతగా
ప్రపంచ మాయాబజార్ లో
ఓ !అదృశ్య హంతకి
హల్చల్ చేస్తుందని.
ఇన్నాళ్లూ భూమికి
తామే హక్కుదార్లమని
గింజుకున్నోళ్ల మూతికి
మాస్కులు కట్టి
'నన్నేం చేయలేవురా'
అంటూ ఛాలెంజ్ విసిరి
చెంగు చెంగు మని
నలు దిక్కుల్ని
ఆక్రమిస్తుందని.
మార్పుని స్వాగతించే జీవులే
పరిణామక్రమంలో
బతికి బట్టకడతారంటారు.
తప్పదిక మనం
ప్రతి క్షణం అప్రమత్తమై
మన జీవన శైలిని
మార్చుకుంటూ
శత్రువుతో పోరాడే
సత్తువ !పెంచుకోవాల్సిందే.
ఎందుకంటే? ఈ
మారణ హోమం లో
మనకి మనం మిగిలుండటమే
మహాద్భుత విజయం !
అవును,
అనంత సృష్టిలో
బతకడానికి మించిన
గెలుపేముంది.
30
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (30):వందనాలువీరుడా!
రచన :సుంకర శ్రీలత
🙏🙏🙏🙏🙏🙏🙏
యావత్ భారత మంతా
కనిపించని రక్కసి నుంచి
స్వీయ రక్షణ కోసం
మాస్క్ లు, శానిటైసర్ల తో
సహ వాసం చేస్తుంటే,
అక్కడ దేశ సరిహద్దుల్లో
ఎముకలు కొరికే చలిలో
135కోట్ల భారతీయుల
రక్షణ కోసం శత్రువు తో
తలపడి నేలకొరిగిన
వీర జవాన్ల త్యాగానికి
వేల వేల వందనాలు !
తెలుగు తేజమై
తల్లులందరి ముద్దుబిడ్డవై
డ్రాగన్ పిరికిచర్యల
వెన్నుపోటుకు బలైన
వీరుడా !
కల్నల్ సంతోష్ నీకు
వేల వేల వందనాలు .
నీ తల్లి వీరమాత
నీ పత్ని వీరపత్ని
దేశమాత మెత్తటి
పాదాల చెంతకు
వీరపుష్పమై సగర్వన్గా
చేరిన సంతోష్
నీ స్ఫూర్తి గాథ
దేశచరిత్రలో సదా..
అమర్ రహే !అమర్ రహే !
31
[18/06, 9:55 AM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (31):సైనికుడు
రచన :సుంకర శ్రీలత
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
స్వార్థపరుల కమురు వాసన
పీలుస్తూ బతికే జనాలకు
ఒక్కసారిగా వీరజవాన్ల
నిస్వార్థపు పూలపరిమళం
దేశభక్తి మత్తు ఎక్కిచింది.
డాలర్లమోజును మెదళ్లకెక్కిస్తూ
పిల్లల్ని పెంచుతున్న తల్లులకు
ఒక్కగానొక్కకొడుకుని
దేశంకోసంఅర్పణచేసిన
వీరమాత మంజుల త్యాగం అర్థమైతే బావుణ్ణు....
రాజకీయ వారసత్వం కోసం
పాకులాడడం కాదు దేశభక్తి
పుణికి పుచ్చుకున్న పద్మ పాణి
లక్ష్మణ్, సంతోష్ లాంటి వీరుల
త్యాగాన్నిఅందిపుచ్చుకోవాలనే
ఆలోచన వస్తే బావుణ్ణు
ఏ నాయకునికైనా.....
విధిగా తమ కొడుకులను
సైన్యంలో చేర్చాలని ఆర్డినెన్స్
తెస్తే బావుణ్ణు దమ్మున్న
ఏ నాయకుడైన......
కుళ్ళు, మోసపు ఎత్తుగడలతో
ఏపుగా పెరిగిన కొడుకులకంటే
నీ రక్షణకు నేనున్నానమ్మా
అని బలిదానాలకు సిద్ధపడిన
వీరజవాన్లను చూసి మురిసిన
తల్లి భారతి! తన మువ్వెన్నల
పతాక రెపరెపలకింద
ముద్దుబిడ్డలుగా.... పొదువుకుంటుంది.
జోహార్ !వీర సైనికా...
నీకు జోహార్.....
32
[18/06, 9:55 AM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (32) :" భరతమాత
పిలుస్తోంది "
రచన : శ్రీలత సుంకర
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
జెండాపండుగ వొచ్చింది
ఉత్సవాలు షరా మాములే
నాలుగు పాటలు
రెండు డాన్స్లు
మూడు స్పీచులు
చేతిలో చాక్ల్ట్స్
ఇదే నేడు
స్వాతంత్ర దినోత్సవమైనా
గణతంత్ర దినోత్సవమైనా
పిల్లలలకున్న అభిప్రాయం.
జెండా ఎగరేసి
జైహింద్ అని
మూడు సార్లు అనడం
మహా ఐతే
స్వాతంత్రోద్యమకారుల గురించి, ఓ
పది నిమిషాలు స్పీచ్
బస్ ఐపోయింది మన భాద్యత
భరతమాత బిడ్డలుగా.
మరి? ఇంతేనా !!
ఎవరో కష్టపడి సాధించిన
అమృత ఫలాలను
ఆబగా ఆస్వాదించడం.
దేశం ఇంకా ఏమిస్తుందని
ఆశగా ఎదురుచూడడం.
ఇంతకు మించి మనమేమీ చేయలేమా?
మన చుట్టూరా వున్న
జీవితాలని, పరిసరాల్ని
పరిశీలించి అందులోని
అభద్రతను, అన్యాయాన్ని
ప్రశ్నించడం పొరపాటని
స్పృహ లో వున్నాం.
ఎవరెట్టా పోతే నాకేం
అని నిండా ముసుగు తన్ని
నిద్రపోతున్నాం.
అందుకే భరతమాత పిలుస్తోంది రా రమ్మని...
సరైన వీరులకోసం
హంగు, ఆర్భాటాలకు
అతీతంగా అంతహ్హ్శుద్ది తో
తనను ఆరాధించే
నిజమైన దేశభక్తులకోసం
భరతమాత కలవరిస్తోంది.
భావదాస్యం లేని
బలమైన వ్యక్తుల కోసం
అన్వేషిస్తోంది.
సాటి సోదరుల్ని అణగదొక్కి
అందలమెక్కాలనే
చెదపురుగులని పారదోలే
పెస్టిసైడ్స్ గా ఎదగమని
ఎలుగెత్తి పిలుస్తోంది.
స్పష్టమైన ఆలోచనలతో
ముందుకు సాగే
మేధావులకోసం
మరి మరి పిలుస్తోంది.
నిస్వార్థంగా పనిచేసే
కర్మవీరులకోసం
కన్నులు కాయలు కాసేలా
ఎదురుచూస్తోంది.
ఇప్పుడు మనం
దేశం కోసం ప్రాణాలు
అర్పించక్కరలేదు
ఆత్మసాక్షి గా పనిచేస్తే చాలు.
33
[19/06, 6:10 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (33): పసి మొగ్గలు
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఒరేయ్ !చిన్ని నాన్నలు
జీవిత పరమార్థం ఏం?
అర్థమైందని ఇలా...
అర్ధాంతరంగా వెళ్లిపోతున్నారు.
నిన్న మొన్నటి మీ
బుడిబుడి నడకలకు
ముద్దు ముద్దు మాటలకూ
అమ్మ నాన్నలెంత
మురిసారో కదా !
వాళ్ళ ఆశల్నలా
కుప్పకూల్చేసి
ఎదగడం లోని మెళకువల్ని
నేర్చుకోకుండానే నింగికెగసి
పోవాలనే మీ ప్రయత్నం
ఏమైనా బావుందా?
నిన్ను ఈ ప్రపంచానికి
పరిచయం చేయటానికి
అమ్మ ఎన్నినొప్పులు తిన్నదో
నిన్ను పెంచడానికి నాన్న
ఎన్ని తిప్పలు పడ్డాడో కదా !
మీ కవేవీ గుర్తుకు రాలేదా?
తెలిసీ తెలియని అజ్ఞానంతో
తెగించి ప్రాణాలను తీసికునే
హక్కును మీకెవరిచ్చారు?
జీవితంలోని కల్లోలాల
అగాధాల అంచులసలే
తాకనేలేదే? రంగుల
ప్రపంచంలోని వర్ణాలసలే
చూడనేలేదే? విజయాల్ని
సాధించే అందమైన
అనుభూతుల్ని అందుకొనలేదే?
అప్పుడేఏంమునిగిపోయిందని
ఇలా మొగ్గల్లారాలిపోతున్నారు
అనంత విశ్వంలో భూగోళమే
చిన్నదిరా చిన్నా......
అందులో మనమెంత?
మన కష్టమెంత?
దేహం జ్ఞాన జ్యోతులు
వెలిగించుకోవడానికి
దేవుడిచ్చిన వరం.
దాని విలువ తెలుసుకోకుండా
అలా కాలదన్ని పోవడం
ఎంత తప్పో తెలుసా?
వద్దు నాన్నా... వద్దు
కోరి కోరి చావు జోలికి
వెళ్ళోద్దురా చిన్నా....
(విద్యార్థుల ఆత్మహత్యలు చూసి హృదయం ద్రవించి... )
34
[19/06, 6:11 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (34): కవి
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
లోకం లో కనిపించే బాధంతా
తనదే అనుకుని నలుగుతూ
వేదనా భరితమైన ఆలోచనల
నుంచి చిక్కని !కవిత్వాన్ని
ఒలకపోస్తాడు కవి.
అనుభూతులను తన
హృదయం తో మండించి
అభివ్యక్తి 'డికాక్షన్ '
మన ముందుంచుతాడు
కవి !ఆస్వాదించమని.
చదివిందల్లా పుస్తకం కాదు
రాసిందల్లా కవిత్వం కాదు
పొమ్మంటాడు అతడు.
అన్యాయానికి తన కలాన్ని
అడ్డేస్తూ మనిషికి మరో మనిషి
ఇచ్చే నైతిక మద్దతే...
కవిత్వమంటాడు కవి.
కళ్ళ ముందు ప్రపంచం
అందంగా వుండాలని
ఆశ పడే అమాయకుడు కవి.
కవిత్వీకరించడమంటే
పురిటిగదిలో చంటి బిడ్డను
అక్కున చేర్చుకోవడం లాంటిదే
అంటాడు అమ్మతనంతో కవి.
భాస్కరుడిలా మండుతూ
నిశి శశి ల మధ్య
చల్లబడుతూ....
లౌకికానందాన్ని కోరుకొనే
అలౌకికుడు మన కవి.
35
[20/06, 5:59 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (35):యుద్ధం గెలుద్దాం
*రచన* *:* సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
వూహాన్ నగరం లో
ఊపిరిలూదుకొని,
ఝామ్ ఝామ్ అంటూ
ప్రపంచజైత్రయాత్రకు తయారై
వచ్చింది కరోనా పేరు తగిలించుకొని.
కనపడని శత్రువై
కళేబరాల గుట్టలు పేరుస్తూ
కరాళ నృత్యం చేస్తోంది
ఓ !సూక్ష్మజీవి.
బలవంతమైన సర్పం
చలిచీమల చేతచిక్కినట్టు
అగ్రరాజ్యాలు సైతం చతికిల
పడ్డాయ్ దాని దాష్టీకానికి !!
ముంచుకొస్తున్న ముంపుకు
లాక్డౌన్ అంటూ గొళ్ళెం పెట్టాడు
మన మోదీ దేశరక్షణ కోరి.
ఇప్పుడిక రణతంత్రం
దేశసరిహద్దుల్లో కాదు
ఒంటరి గదుల్లో అని తేలిపోయింది.
కనిపించని శత్రువు మాయావి
ఇంద్రజిత్తుతో పోరాడిగెల్చిన
అనుభవాన్ని తలచుకొని
ధైర్యాన్ని కూడగట్టుకుందాం.
మనమిప్పుడుబిక్కుబిక్కు మంటూ కాలంగడపట్లేదని,
జీవించేహక్కుని కాలరాస్తున్న
కాలయముడు కరోనాను
మూగనోముపట్టి మాస్క్ లతో
నిలవరిస్తున్నామని భుజం తట్టి
ప్రోత్సహించుకుందాం.
రాక్షసమాయకు విష్ణుమాయను అడ్డేసినట్టు.... విషం చిమ్మి
కాటేస్తున్న కరోనా
కాలసర్పాన్ని సబ్బుబురగతో
నురగలు కక్కిద్దాం.....
ఒకరి చావుకు మరొకరు
వాహకమైయ్యే వ్యూహాన్ని
నమస్కారంతో తిరస్కరిద్దాం.
'దూరం -దూరం జరగండి
ఆగినాక ఎక్కండి 'అనే బాలగేయాలే కనికట్టు
మంత్రాలై కరోనాను
తరిమి తరిమి కొట్టేలా పాడుకుందాం.
దైవంమానుష రూపేణాఅంటూ
వైద్యులు, పోలీసులు, పారిశుద్ద
కార్మికుల అండదండలతో
మనం యుద్ధం గెలుపు తీరాలు
తప్పకుండా చేరుకుంటాం.
అంతవరకు ఆత్మవిశ్వాసం
కోల్పోకుండా ఇల్లొదిలి
బయటకు రావొద్దు మిత్రమా !!
యుద్ధం గెలుద్దాం.....
36
[20/06, 5:59 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (36) : చెట్టు
రచన: సుంకర శ్రీలత
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
కాకమ్మ పిల్లల
కాపలా గూళ్ళు
పిట్టల కేళి
ఉద్యానవనాలు
కోయిల కూతల
రాగాల వేదికలు
పిల్లల కోతి
కొమ్మచ్చిలాటలు
దాగుడుమూతలు
ఊయల బల్లల
కేరింతలు
మామిడాకుల
పచ్చని లోగిళ్ళు
వేపపూతల
లేలేత చివుళ్ళ
ఉగాది ఉషస్సులు
అరిటాకుల
పంక్తి భోజనాలు
పిల్లలైనా,తల్లులైనా
పిట్టలైనా, పక్షులైనా
చెట్టమ్మ చుట్టూనే
ఎండైనా వానైనా
అలుపొచ్చిన బాటసారికి
నీడనిచ్చే గొడుగు
చెట్టు నాన్నే
37
[21/06, 6:25 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (37): జీవన సహచరి
రచన :సుంకర శ్రీలత
📖📖📖📖📖📖📖
పుస్తకం అనగానే ఎందుకో
చప్పున మస్తకం స్ఫురిస్తుంది.
అలాగే నాన్న చిన్నప్పుడనే
హస్త భూషణం గుర్తొస్తుంది.
కొత్తట్టలు, లేబుల్లతో
అలమరలో ఊరిస్తున్న
కొత్త పుస్తకాలను తడిమి
ముద్దాడి సగం తెరచి
వాసనలు పీల్చిన
బాల్యం గుర్తొస్తుంది.
పుస్తకాలు ఇచ్చిపుచ్చుకుంటూ
స్నేహాలని పంచుకొన్న
దాఖలాలు గుర్తుకొస్తాయి.
పరీక్షలపుడు రాత్రిళ్లు
చుట్టూ పరచు కున్న
పుస్తకాల మధ్య
నిద్ర పోయిన లేజీ
రోజులు గుర్తుకొస్తాయి.
ఓకే నవలను నలుగురు
మిత్రులు ఒకేసారి కలిసి
చదివిన గుంజాటన
రోజులు గుర్తుకొస్తాయి.
పుస్తకం లోని విషయ
లోతుల మీద జరిగిన
వాడి వేడి చర్చలు
గుర్తుకొస్తున్నాయి.
బాల్యంనుంచీ ఇప్పటిదాకా
పుస్తకం నన్నంటి పెట్టుకుందో
నేను పుస్తకాన్ని
అంటిపెట్టుకున్ననో తెలీదు
మేము ఒకరికొకరం
సహచరులం అంతే..
38
[21/06, 6:25 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (38):ఉత్సవాల రారాజు
రచన :సుంకర శ్రీలత
🎊🎊🎊🎊🎊🎊🎊
అనగనగ ఓ ఊరు
ఆ ఊరికో రాజు
అక్కడ రోజూ
పండగ వాతావరణమే
ఎక్కడ చూసిన కోలాహలమే
ఎప్పుడూ ఎదో
ఒక సందడే
ఎక్కడెక్కడో ప్రజానీకం
తండోప తండాలుగా వచ్చి
ఇక్కడి వింత వింత
సమావేశాలకు
హాజర్ అవుతుంటారు.
రాజు కూడ
కీలుగుర్రమెక్కి ఆహ్వానాలు పంచుతూనే ఉంటాడు .
కార్యక్రమాల చిత్రమాలికలు
చూసుకొని ముసిముసి
నవ్వులతో మురిసి పోతుంటాడు.
అంతా బానే వుంది
కానీ, పాపం ప్రజలే
ఊర్లో తమకు స్వేచ్చగా
తిరిగే చోటులేక
నిస్చేస్టులై విక్రమాదిత్యుని
సాలభంజికల్లా..
రాతి ప్రతిమలై పోయారు.
39
[23/06, 7:06 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (39):ఆన్లైన్ పాఠాలు
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
కళ్ళ ముందు పెట్టలో
ఇస్కూల్....
బుడ్డోడికి గదే కలాసు
కాలేజీ బుల్లోళ్ళకు గందులోనే
ఏమి ఇసిత్రపు
కాలమొచ్చినాదో గంద
ఎనకటికి గురూలంటే
ఎంత భక్తీ...
సీకటి దారుల్లో
మిణుగురు కాంతి లెక్క
కదా గురూలు
అని మొక్కెటోళ్లు.
గంతేందుకు మనిసి
పుట్టుక పుట్టిన మన
దేవుళ్ళకూ గురూలున్నారు.
రామయ్య కేమో వసిట్టులోరు
కిట్టయ్య కేమో సాందీపులోరు
గప్పటి గురుకులాలు పోయే
నిన్నటి బడులు మూతపడె
గిప్పుడు
ఇస్కూళ్ల లోనే పాఠాలు
పెట్టలోని పంతులకే
పెట్టాలె దండాలు...
40
[23/06, 7:06 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (40):నిశ్శబ్దం
మూగిన
వేళ
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఎన్నాళ్లగానో సాగుతోంది
ఈ అంతర్యుద్ధం, కానీ
పైకి మాత్రం
అంతా నిశ్శబ్దం !
పోరాటం నాతో నేనా?
మనసు పొరల్లో
దాగిన శూన్యం
ఎప్పుడు ఏర్పడిందో
కూడా తెలీదు.
దాన్ని పూడ్చుకోవడానికి
ఎన్ని స్నేహాలు
ఎన్ని ప్రయాణాలు
అన్నీ తాత్కాలిక
ఉపశమానాలై
థూచ్ మనిపించాయి.
అనుభూతుల కుదింపులు
అనుబంధాల కత్తిరింపులు
ఏమీ తోచని అలసత్వం
మనసు మీద
ఏ ప్రభావమూ చూపని
భౌతిక వాతావరణం
ఎక్కడి నుంచి
ఎక్కడికి ఎదిగానో తెలీదు
ఏ అనుభవాలు
నన్నీ స్థితిలో
వుంచుతున్నాయో తెలీదు.
అశాంతి అలజడైతే లేదు
అలాగని ఆరాటమూ
ఆతృత కూడా లేదు.
ఎందుకని?
శూన్యాన్ని పూడ్చుకునే
క్రమంలో కూలిన
సౌధాల చప్పుడికి
ఉలిక్కి పడ్డానా?
అసలు నాకేమైంది?
ఎందుకీ స్తబ్దత !
41
[24/06, 2:37 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్
కవి సమయం
కవిత (41):నెట్టిల్లు
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
1.నాన్న
ఇంటర్నెట్టు
అమ్మ
వైఫై
2.అక్క
ట్యాబు
చెల్లి
సెల్లు
3.అన్న
కంప్యూటర్
తమ్ముడు
లాప్ టాప్
4.అమెజాన్
ఫ్లిఫ్ కార్ట్
దుకాణం
మామయ్యలు.
5. గూగుల్
గూట్లో
నానీలు
దాదీలు
42
[24/06, 2:37 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్
కవి సమయం
కవిత (42):ఆధునిక స్త్రీ
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ముక్కు సూటితనం
ఆత్మ విశ్వాసం
ఆమె సహజాతాలు
బుద్ది కుశలత తో
సమర్ధవంతంగా
భాద్యతలను
నెరవేర్చడం లో
నేర్పరి
ఒకోసారి
భూమాతకున్నంత
సహనం,
మరోసారి
రుద్రమకున్న తెగువ
ఝాన్సి కున్న ధైర్యంతో
జీవన సమరం లో
అలుపెరుగని
పోరాటం
చేస్తూ...
సాధికారిత దిశగా
దూసుకెళ్తోంది.
43
[25/06, 4:09 PM] Sunkara Sreelatha KS 21: సమూహం : వీరాస్ కవి సమయం
కవిత (43): జీవితాదర్శం
రచన : సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఏమైందని అంత బెంగ!
ఏం కోల్పోయావని
అంత నిరాశ!
జీవిత రథచక్రాల కింద
ఘడియలు
నిమిషాలు
గంటలు
నలిగి పగిలి
పోవాల్సిందే కదా!
పరిగెత్తే కాలం ఓ వైపు
తిరిగిరాని కాలం ఓ వైపు
రైలు పట్టాల్లా సమాంతరంగా
సాగే పయనాన్ని
సాక్షీభూతంగా చూడటమే
జీవితానుభవం కదూ!
తొట్లో పాపాయి గట్టిగా
ముడుచుకున్న గుప్పిటను
ఒకసారి విప్పదీసి చూడు
ఖాళీ అరచేతితో
చిదంబర రహస్యం చెప్పేసి
గుట్టుగా కిసుక్కున
నవ్వేయదూ!
44
[25/06, 4:09 PM] Sunkara Sreelatha KS 21: సమూహం : వీరాస్ కవి సమయం
కవిత(44): ఆ చూపులే
రచన : సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
రాసే శక్తి ఉండాలే గానీ
ఆ కళ్లలోని
భావప్రకంపనాలు, కాస్త
భావగీతాలై
బండెడు పుస్తకాల్ని
నింపేస్తాయి కాబోలు!
నిరాశ నిస్పృహలతో
బీటలు బారిన గుండెకు
ఆ కళ్ళ "తడే"గా పంట కాలువై
పచ్చదనాన్ని పరిచేది.
అలిగినా, కసిరినా
కళ్ళల్లో కనిపించే ఆరాధనకేగా
కరిగి సెలయేళ్లయ్యేది
ఆత్మీయ స్పర్శను మించిన
చూపుల పంజరంలో
బందీగా చిక్కుకున్నాక
బయట పడటం సాధ్యమా?
వేయి వాక్యాల భావం
నీ ఒక్క చూపుకు
సాటిరాదు కదా
అందుకే,
నీవు చూపుల
మాంత్రికుడు వయ్యాబాబు!
45
[26/06, 10:52 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(45):అతడు-ఆమె
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
అతడు
సర్వవ్యాపకుడు
ఆమె
ఆతనిలో సగం
అతడు
లయకరుడు
ఆమె
లాస్యప్రియ
అతడు
వృషభ వాహనుడు
ఆమె
సింహవాహిని
అతడు
స్మశానవాసి
ఆమె
సర్వ మంగళ
అతడు
భవుడు
ఆమె
భవాని
అతడు
రుద్రుడు
ఆమె
రుద్రాణి
అతడు
విశ్వేశ్వరుడు
ఆమె
విశ్వ జననీ
46
[26/06, 10:52 AM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి సమయం
కవిత(46): సాహో!సావిత్రి బాయ్ ఫూలే
రచన: సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
సావిత్రమ్మా !!
అవమానాలు కూడా
అందర్నీ వరించవని, దానికీ
కొన్ని అర్హతలు వుండాలని
నీ జీవితం పాఠమై మాకు
నేర్పింది కదా .
సాఫీగా సాగడమంటే
అన్యాయానికి అణచివేతలకు
చెద్దరు కప్పేసి బాగుందని
భ్రమ పడటం కాదని, ప్రశ్నిస్తే?
ఓర్పు లేని మనుషులు
మురికి నీళ్ళుపోసి
అవమానించారే.....
విజ్ఞానం తో వెలుగుతూ
చుట్టూ వున్న చీకట్లను
తరిమి కొట్టాలని నువ్వు చూస్తే
ఛాందసవాదులు' ఉఫ్ 'మని
ఊదెయ్యాలని చూసారే.....
ఆలోచన లేకుండా బతకడమంటే
అవివేకంగా అజ్ఞానం తో
జీవించడమేనని, మార్పు కోసం
బాలికా విద్యకోసం
అడుగులు కదుపుతున్న నిన్ను
ఆపాలని, చీరపై
బురద నీళ్లు చల్లారే.....
ఎంత సహనం !!తల్లీ నీకు
ఎంత ఆత్మస్థైర్యం !!అమ్మా నీకు
ఈ సుగుణాలేనా?? నీకు
అవమానాల హారతులు పట్టిందీ....
ఐనా !అవమానాలు ఊరికే రావు
మానవ హక్కులూ వూరికే రావు
అంటూ -మాకు సందేశమిచ్చావు
చెడుపై విజయం సాధించాలంటే
ప్రశ్నించాల్సిందే !!
పోరాడాల్సిందే !!
అవమానాల్ని లెక్కచేయక
ముందుకెళ్లాల్సిందే.....
అంటూ స్ఫూర్తిని నింపిన
అమ్మ సావిత్రి బాయి ఫూలే కు
జయహో !జయాహో !!
47
[26/06, 10:52 AM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి సమయం
కవిత(47) : ప్రేమ
రచన: సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఎప్పటికప్పుడు నిన్ను
చూడాలనేవుంటుంది నాకు
ఎందుకో? తెలీదు.
ఎదురుగ లేని నిన్ను
వున్నట్టే ఊహించుకొని
ఏవేవో ఊసులాడుకుంటాను
నాలో నేనే........
వినీ వినిపించినట్టు
'పిచ్చిదానా 'అంటూ
నా చెవిలో
ఏదో 'రహస్యం 'వూది
వూరకుండిపోతుంది
నీ జ్ఞాపకం !!
సరిగా అప్పుడే
ప్రేమ గురించి
ఏదో రాయాలని పోతానా?
వూ..హు.. రాదు.
గొంతులో అడ్డం పడి
గిజగిజలాడుతూ....
తిరిగి గుండెలోనే
గూడు !కట్టుకుంటుంది.
అంతవరకు వుత్సాహంగా
వున్న కాగితం,
ఏమీ !!రాయలేని
నా ఆసక్తతకు,
గాలితో జతకూడి రెపరెపలాడుతూ
వ్యంగంగా నవ్వుతూ
వెక్కిరిస్తోంది.....
48
కవిత(48) : పదవీ విరమణ
రచన: సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
వాక్యానికి విరామచిహ్నాలు
ఎంత అవసరమో !!
వార్ధక్యంలోకి తొంగిచూసే
వయసులో పదవీవిరమణ
కూడా అంతే !!అవసరం.
కాకపొతే,
వయసుమీద పడిపోతోందంటే
ఒప్పుకోని మనసు మొరాయిస్తుంది
పైపెచ్చు మూలుగుతుంది.
కొలువులోకి వొచ్చిన తొలిరోజు
అందరూ 'ఒంటరి 'బాటసారులే
అదే !రిటైర్మెంట్ రోజుకి
ఎన్ని స్నేహాలు, ఎన్ని పలకరింపులు
ఎంత సత్కారం !
ఎన్ని' పూదండల 'సౌరభాలు
ఎంతమంది' ఆత్మీయ 'ఆలింగనాలూ
కాకపోతే....
కొన్ని కళ్ళు చెమ్మగిల్లుతాయి
రోజూ 'దస్తఖత్ 'చేసే
రిజిస్టర్ లోని పేజీలు
రేపటినుంచి నువ్వు
రావుకదూ... అంటూ...
బెంగటిల్లిపోయి -తుఫాను గాలికి
ఊగిసలాడే దర్వాజాల్లాగా
అటు ఇటు ఊగిపోతాయ్.
జీవన సమరం లో
ప్రధాన ఘట్టం ముగింపు రోజున
వడి వడి గా అడుగులేస్తూ
ఒక్కసారి వెనక్కు చూస్తే
శ్మశాన వైరాగ్యం లాంటిదేదో
మనసును కమ్మేసి
టపా-టపా!!
రెండు కన్నీటిబొట్లు
భుజం మీద వేలాడుతున్న
శాలువ లోకి ఇంకిపోతాయ్.
కానీ, అంతలోనే..
సమయాభావం వల్ల
మిగిలిపోయిన పనులు
మద్యలో ఆపేసిన కళలు
గుర్తొచ్చి జీవితపు
మరో కోణాన్ని ఆవిష్కరించుకోవడానికి
తాత్వికుడై ముందుకు కదలిపోతాడు.
49
[26/06, 10:53 AM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి సమయం
కవిత(49): మార్గదర్శి
రచన: సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నిస్తబ్దత !!
దేనిమీద లగ్నం కాలేని మనసు
దేనికో అన్వేషిస్తోందని మాత్రం తెలుసు
నా ఈడు వాళ్ళతో కలిసి నడవలేను
చిన్నవాళ్ళతో కలసి పరుగెత్తలేను
ఎందుకంటే??
వయసుకు - మనసుకు మధ్య
తేడా అటువంటిది మరి.
వీటిమధ్య 'సంతులన '
నియమాలు ఎవరూ!! నేర్పందే
ఎక్కడని? నేర్చుకోను,
జీవన సమరం లో తప్ప.
'అంతర్ముఖ 'పయనానికి
గమ్యం కనిపించదు,
బహిర్ముఖ పయనానికి
అడుగులసలే పడవు.
ఇంకో ప్రపంచాన్ని నిర్మించుకోలేను
వున్న ప్రపంచం లో జీవించలేను.
పరుగా? పలాయనవాదమా?
రెంటి మధ్య నలుగుతున్న మనసు
మూగదై బతికిపోతోంది.
అయినా, నా పిచ్చిగాని
బ్రహ్మ పదార్థాన్ని వెదికి
పట్టుకోవడానికి తోడెవరుంటారు?
గురువు తప్ప !అంతవరకు...
ఆత్మసాధనకు వెదుకులాటో
వెంపర్లాటో ఏదో !
తెలియని నాకు, సంతృప్తిని
ఇచ్చేవి ఈ చేరతాలే.
50
[26/06, 10:53 AM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి సమయం
కవిత(50) : స్మృతి చిత్రాలు
రచన : సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఏ అర్ధరాత్రో కలలోంచి
మెలకువలోకి జరిగిన మజిలీలో
గతించిన సంఘటనలన్నీ
స్మృతి చిత్రాలై !! నా
మనోఫలకం మీద
"చిత్రోత్సవం "జరుపుతున్నాయి.
ఒక్కో చిత్రం !
ఒక్కో జీవనసూత్రంతో
ఇమిడిపోయిన వైనం
'గిజిగాడి గూడు 'లాగా
ఎంత పకడ్బందీగా!! వుందో.
అల్లి బిల్లి జోకులతో
ఆనందంగా గడిపిన రోజులు
అంతలోనే, మబ్బుపట్టిన ఆకాశం లోంచి
చినుకల్లే జారి -దూరమైన నేస్తాలు
నల్లటికాన్వాస్ పై
పసుపు 'వర్ణ చిత్రాలై '
కదిలిపోతున్నాయ్.....
గెలుపోటములు పున్నమిసంద్రం లోని
ఆటుపోటులై !!అలలా
సాగిపోతున్నాయి.....
నోటితో నవ్వి
నొసలుతో వెక్కిరించే
వ్యంగ్య 'చిత్రాలు '
ఓ వైపు వెళ్తుంటే.....
కన్నీరు భూమ్మీదకు జారకుండా
దోసిటితో ఒడిసి పట్టిన
ఆపన్నహస్తాల 'ముఖచిత్రాలు '
మరో వైపు....
అన్నీ కలగాపులగంగా కల్సిపోయీ
ఓ పెద్ద 'మల్టీకలర్ ఫ్రేమ్ 'లో
ఒదిగి !తొంగి చూస్తున్నాయి.....
51
[30/06, 9:27 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(52):చదువు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
చదువంటే
వెన్నెల కలువ
చదువంటే
బతికే మెలకువ
చదువంటే
ఎగసే కెరటం
చదువంటే
తిమిరంతోసమరం
చదువంటే
చిక్కటి జ్ఞానం
చదువంటే
చక్కని జీవితం
చదువంటే
సంస్కారం
చదువంటే
సమభావం
చదువంటే
సర్దుబాటు
చదువంటే
దిద్దుబాటు
చదువంటే
పంచాక్షరి
చదువంటే
సకలశుభంకరి.
[30/06, 9:27 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(51):భాష గోస
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
సంస్కృతమ్మ
దేవనాగరయ్యల
గారాలపట్టి
ఉత్తరాదిన పుట్టి
దక్షిణాదిన మెట్టి
అందరి కోడళ్ల మల్లె
అత్తగారింట్లోఆదరణ
దొరుకుతుందేమోనని
ఎప్పటినుంచో
ఎదురుచూస్తోంది.
అత్త మామలకేమో(hms)
అడబిడ్డలే (లెక్కలు,సైన్సు)
అపురూపమాయే
ఉత్సవమైన(సైన్స్ ఫేర్)
వేడుకలైన(గణిత మేళా)
అన్నీ వారికోసమే.
ఇవాంకా!లెవల్లో అన్నీ
జరిగుతుంటే.....
నువ్వెంత?(20మార్కులు)
అన్నట్టుంటారు వాళ్ళు.
పాపం!ఈ ఇంట్లో
ముందునుంచి ఉన్న
తోడికోడలు(తెలుగు)కదా!
అని అభిమానంగా ఉంటే..
నన్ను పక్కన పెట్టి
ఆమెకూడా వేడుకగా
ఒడిబియ్యాలు(తె.మ.స)
విందుచేసుకుంది.
ఇక మరిదో(ఇంగ్లీష్)
సినిమాలు, డిస్కర్స్ లు
అదో గోల!
ఆఖరుగా చిన
మామయ్య(సోషల్)
ఆస్తి పంపకాలలో(ప్రమోషన్స్)
తన వాటా సరిగా
కుదరలేదనే నైరాశ్యం తో
అన్నిట్లో నిర్లిప్తతగాఉంటాడు.
పోనీ, అన్నయ్యలకు(నాయకులకు)
గోడు ఎల్లబోసుకుందామంటే
ఎప్పుడో!రాఖీ పండుగనాడు
రాఖీ(సభ్యత్వం)
కట్టించుకుందుకు వచ్చి
చెల్లని చీటి(రసీదు)
చేతికిచ్చి చల్లగా
జరుకుంటారు.
ఐనా!ఎవరిని అని
ఏం లాభం?
పుస్తెకట్టి(నియామకం)
అతీ గతీ పట్టించుకోకుండా
తిరుగుతున్నాడే....
"పెనిమిటి"(ప్రభుత్వం)
అంటే గింటే
ఆ మహానుభావుణ్ణి అనాలి
అన్నీ మౌనంగా భరిస్తూ
వెనక్కు మళ్ళా లేక
ముందుకు దారిలేక
ఎన్నటికి మార్పు వస్తదో
అంటూ హిందమ్మ
నిట్టూరుస్తూనే ఉంది.
[30/06, 9:27 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్
కవి సమయం
కవిత(53):గాయం
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
మనసుకు గాయమైంది
అవును!నిజంగా
మనసుకు గాయమైంది.
చిల్లుపడిన కుండ లోంచి
కారే ధారగా!!
కంట్లోంచి వస్తున్న
కన్నీరే దానికి సాక్ష్యం!
మాట చిన్నదే కావొచ్చు
అలవోకగా అలా
దొర్లిండొచ్చు కానీ...
మాటపడ్డ మనిషికది
పుండుమీది కారంలా
తగిలుండొచ్చు.
అలాంటి మాటల
తాలూకు రకరకాల
అనుభవాలతో మనసొక
రాచపుండయి
రాసికారుతుంటే...
అదే చోటుకు
నీవు వదిలిన మాటలు
తూటాలై గాయాన్ని
తడిమితే మనసు
బావురుమని ఏడుస్తుంది.
[01/07, 10:14 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(54):వెలి
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
కళా 'ఉత్సవాలు '
ఆటా 'బాలోత్సవాలు '
నిజం !!చాలా బావున్నాయి.
నా ఈడు పిల్లలందరూ...
కళామూర్తులై
వివిధ వేషధారణలతో
వివిధ వాయిద్యాలను చేతపట్టుకొని
పోటీల్లో పాల్గొనే ఉత్సాహం తో
ప్రాంగణమంతా తిరుగాడుతుంటే
కళాజాతరలా కళకళ లాడుతోంది.
ఆటలకు పాటలకు చెక్ పెట్టి
అర్థం కాని కాన్సెప్ట్ లు
పై పై చదువులతో
ర్యాంకుల పరుగు పందెం లో
పడుతూ లేస్తూ
ఆయాసపడుతున్న 'నాకు '
ఏదో అద్భుత!! ప్రపంచం
చూపిస్తోంది ఈ కళా ఉత్సవం.
సారంగి, మృదంగం
వీణా, వయోలిన్
వేణు నాదాలన్నీ
డప్పు వాద్య చప్పుడు తో
పోటీ పడుతుంటే
ఎంత గమ్మత్తుగా వుందో!
జానపద, శాస్త్రీయ సంగీత
నాట్యాల మధ్య పోటీ
ఉత్సాహాన్ని ఉరకలెత్తిస్తోంది.
అమ్మా, నాకు తెలీక !!అడుగుతాను
నేను కడుపులో వున్నపుడే
చక్కటి పాటలు విని,
చిక్కని కవిత్వం చదివావు కదా !
నన్నో 'కళాకారిణిని ' చేద్దాం
అనుకున్నావ్ కదా !
మరెందుకు నన్ను
టెక్నో స్కూలు లో వేసావ్?
అందుకే, కళాజాతరలో
ముందువరుసలో నను
నిలబెట్టి చూసుకోవాలన్న
నీ కోరికను !
తీర్చలేకపోయానమ్మా...
ఎందుకంటే?
'నేను 'వీటన్నిటికీ
అతీతంగా ర్యాంకుల
జంగిల్ లో జీవించే
టెక్నో విద్యార్థిని,
కళా స్వరూపాలనుంచి
'వెలి'వేయబడ్డ
ఓ !బానిసని.
[01/07, 10:14 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత (55): "బాల్యం "
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
బతుకు భారమనిపించో
పిల్లల ఆటలు చూస్తూనో
కాస్తంత తీరిక దొరకగానే
స్వప్న మంజూష లో
భద్రంగా దాచుకున్న
నా చిన్ననాటి జ్ఞాపకాలు
ఆహ్లాదపవనాలై ముసురల్లే
వొచ్చి ముంచేస్తాయి.
బడి ఎగ్గొట్టడానికి
'కుళాయి గుంతల్లో '
దాక్కున్నప్పుడు
అమ్మమ్మ వచ్చి
చెవి మెలిపెడితే వచ్చిన ఉక్రోషం !!
క్లాసులో ఎక్కాలు
పైనుంచి -కిందకు,
కింద నుంచి పైకి
గబా గబా చెప్పి పక్కవాణ్ణి
ముక్కుచెంపలు కొట్టే ఛాన్స్
దక్కించుకున్నాక గాని, చల్లారేదికాదు .
సాయంకాలం కరెంటుపోతే
ఎంత? సంబరం .
వీధివీధంతా పిల్లల కేరింతలతో
అదో ఉత్సవమే !!
ఇక రామనవమి వేడుకలు
పీర్ల వూరేగింపులు,
అయ్యప్ప భజనలు
అబ్బో !అన్నింటా బృందాలే.
'శంకరాభరణం ' పాటలు
టేప్ రికార్డు లో
వింటూ బాలసంగీతజ్ఞులై
మైమరచి పోయేవాళ్ళం.....
వేసవిలో చందమామను చూస్తూ నక్షత్రాలెంచుతూ ఆరుబయట
హాయిగా!!
నిదురించిన రోజులు
కలలాగా కరిగిపోతూ......
మబ్బుల్లా మాయమౌతుంటే.....
దేవలోకం నుంచి 'జారి '
యాంత్రికలోకం లోకి వూడిపడ్డట్టు
ఉలిక్కిపడుతూనే!!
ఉంటాను.....
[02/07, 9:11 AM] Sunkara Sreelatha KS 21: సమూహం: వీరాస్ కవి
సమయం
కవిత (56): "ఏకాత్మ "
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
నా కళ్ళు కలల
కాణాచిగా మారిపోయాయి,
నువ్వు నా కళ్ళలోకి
సూటిగా! చూసినప్పుడే.
తీరిక దొరికినప్పుడల్లా
నీ మాటల మూటల్ని
విప్పుకుంటూనే
ఉంటాను ఆశగా !
గుప్పెడు భావాల్ని, నా
గుండెకు బట్వాడా చేసి
మసక చీకట్లో
నే కన్న కలనుంచి
మంచుతునకలా కరిగిపోతావ్.
ఆరాధించడం !నేర్చుకుంటున్నాను
అందమైన నా వూహల్లోంచి
నిన్ను చూస్తూ.....
విడి విడిగా తిరుగాడుతున్నవి
మన దేహాలు కాదు
రెండుగా చీల్చబడి
వేరువేరు రూపాలు దాల్చిన
మన ఒకే 'ఆత్మ '
ఒకరి అంతరంగం ఇంకొకరి
కళ్ళలో అద్దంలా !
ప్రస్ఫుటిస్తూనే ఉంటుంది.
చింతలగూడుని చీల్చుకుని
చివరి మజిలీగా నీ నీడకు
నా నీడ కూడా తోడై చేరిపోతుంది
చేతలూపుతూ........
[02/07, 9:11 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్
కవిసమయం
కవిత(57):ఇల్లాలి వైభోగం
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
అమ్మకు జొరమొచ్చింది
వంటిల్లు కళ తప్పింది
వాకిలి వెలవెల పోయింది
నాన్న పానం గిల గిలమంది
పిల్లలు పొద్దు గూకులు వచ్చి
పరీక్ష చేసి పోతున్నరు.
అమ్మ 'సూరీడు 'లెక్క
అమ్మ నట్టింట్లో తిరుగాడితేనే
అందరి దినచర్యలు
సక్కంగుంటాయ్.
ఇల్లాలి వైభోగం
ఇంతింత కాదయా!
అన్న సత్యం వెనుక
కనిపించని వ్యూహం
పురుషుడే అన్న నిజం
అమ్మకూ తెలుసు.
ప్రేమకు బందీ ఐన
అమ్మకు ఇవేవీ పట్టవు.
అందుకే అమ్మలేని
వంటిల్లిపుడు దేవత
లేని దేవాలయమయింది.
58
[03/07, 11:55 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(58):మూర్ఖుడి వీరంగం
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
పుట్టడం తోటే
స్త్రీ మీద పెత్తనం చేయొచ్చు
అనే మిత్ తో
పుడతారేమో!
ఇలాంటోళ్లు.
చుట్టూ కరోన రక్కసివుంది
మాస్క్ పెట్టుకోమని
సామాజిక బాధ్యత
గుర్తుచేస్తే ,నాకంటే
రాక్షసుడుంటాడాఅన్నట్టు
పిడి గుద్దులు గుద్దేస్తాడా?
సాటి ఉద్యోగిని, ఆపై
దివ్యంగురాలు ఐనా
కరోన కాలంలో కూడా
కష్టపడి పనిచేస్తుంటే
ప్రశంసించే సంస్కారం
అయ్యకు ఎలాగూ లేదు
చెయ్యి చేసుకొనే
అధికారం ఎవరిచ్చారు?
స్త్రీ అంటే ఎవడబ్బ
సొత్తనుకున్నాడు.
ఆడదాని ఆత్మగౌరవాన్ని
జుట్టుపట్టి ఈడ్చే
ఆ వెధవ !!
వికృతస్వభావం వెనుక
ఎంత కరుడుకట్టిన
భావజాలం పనిచేస్తోందో!
వాని అహంకారం
ఆవిరై పోను.
(నెల్లూరు లో ఉషా రాణి మీద
జరిగిన దాడికి నిరసనగా)
59
[03/07, 11:55 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్
కవిసమయం
కవిత(59):హరివిల్లు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
మేఘాల
చిత్రమాలికలతో
ఆకాశం చేసుకున్న
ఒప్పందం !ఫలించి
పుష్పించింది కాబోలు
ధారలు ధారలుగా
చుక్కలపూలు
రాలుతున్నాయి...
దేవుడిరథం
ఊరేగుతున్నట్టు
శబ్దప్రకంపనలు
వేయి మోముబతీల
వెలుగుఎగజిమ్మినట్టు
మెరుపుల తలతలలు
ఎండా-వానా
వానా-ఎండల
మోహపు పారవశ్యానికి
ప్రకృతి పరవశించి
గీసిన చిత్రం
ఏడు రంగుల
హరివిల్లు
60
సమూహం:వీరాస్
కవి సమయం
కవిత(60): "మట్టి దిబ్బలు"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
సహజసిద్ధంగా
అడవిలో పెరిగిన
మానుని చూస్తే
అర్థమవట్లేదూ!
స్వేచ్ఛగా ఎదగడం
లోని బలమేంటో.
కత్తిరించి కుదించి
కృత్రిమంగా పెంచిన
బోన్సాయ్ మొక్కలను
చూస్తే తెలీదూ!
ఎదగలేనితనమేంటో.
కోకిలమ్మ
స్వేచ్చా గానం
ముందు చిలకమ్మ
కృతక పలుకులు
ఏపాటివి?కనుక
నల్లనికోకిలమ్మ
ఆవాసాలుపచ్చని
మామిడితోపులు.
పచ్చనిచిలకమ్మ
వసతేమో చీకటి
పంజరాల్లో.
అందుకే స్వేచలేని
బతుకులుఎదగలేని
మట్టిదిబ్బలు.
61
సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(61):"విజేత"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ప్రతిభకు
వేయి వాకిళ్ళు
ఒకటి
మూసుకుపోతున్నా
రెండోది
తెరుచుకుంటూనే
ఉంటుంది.
చెదపురుగులు
తొలిచేయాలనిచూసినా
వానపాములు
బురదపులమాలని చూసినా
కొండంత కష్టాన్ని
పిడికిట మూసి
ప్రయాణం సాగిస్తేనే
విజయ తీరాలు చేరేది.
వెలుగుకిరణాల
ఉష:కాంతినిచూసేది.
రంధ్రాన్వేషకుల
నోళ్లుమూయించేది.
సాధించాలని
జ్వలించేవారిని
అసూయ నీళ్లతో
ఆర్పాలనిచూస్తే,
దాన్నే ఇంధనంగా
మార్చుకొని
విజేతగా నిలవడమే
ఏ యుద్దానికైనా
అంతిమ స్ఫూర్తి.
62
[05/07, 1:43 PM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(62): ఆనందం
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ఏడుస్తూ వచ్చి
ఆనందం కోసం
వెంపర్లాడటమే
మనిషి సహజ గుణం.
ఉత్సవాలు, వేడుకలు
హంగు,ఆర్భాటాలతో
ఖర్చుపెట్టి కొంటున్నది
పైపూతల మోతే!
రజ్జుసర్పబ్రాంతే!
మార్పునకు లొంగే
అల్పమైనవాటిలోని
ఆనందప్రచ్ఛయాలతో
తృప్తిపడక
అశాంతి తో
విచలితుడై
జన్మలవలయంలో
చిక్కుకుపోతాడు.
పరిపూర్ణ మైన
పరబ్రహ్మతత్వాన్ని
చేరుకోవటమే
ఆనందస్వరూపమనే
స్పృహ గురువు
ఎరుకపరిచేవరకు
కర్మలతిరుగలిలో
నలుగుతూనే ఉంటాడు.
అభ్యాసకునికి
గురుచారణాలే
ఆనందసరోవరాలు.
(భౌతిక,ఆధ్యాత్మిక గురువులందరికి సభక్తితో ప్రణమిల్లుతూ ..)
[05/07, 1:43 PM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(63):సమయం
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ప్రపంచమంతా
పోటీలుపడి
పరిగెత్తుతోంది
గెంతుతోంది
ఎవరూ కూచోలేరు
నించోలేరు
ఒకటే ఆరాటం!
అందరిలోనూ అభద్రత
వెనకబడిపోతామేమో
ఓడిపోతామేమో
ఎలా? ఆందోళన
ఈచట్రం నుంచీ
ఏఒక్కరు పక్కకు
తప్పుకోలేని
ఆశల సంకెళ్లు
మాటలగారడీలు
కార్పొరేట్ లక్ష్యాలు
పాపం!మనుషులు
ఎంతలా పరిగెత్తి
అలసిపోయారోగానీ
కరోన "మోహిని"లా
వచ్చి ఎవరి
సమయాల్ని వారి
దోసిట్లోపోసింది
64
[07/07, 3:51 PM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(64):యోధురాలు
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
వారసత్వపు ఆస్తి
ఎప్పటికీ మారనిఇంటిపేరు
కుటుంబ పెత్తనమనే
తాళాలగుత్తి
అరచేతులోపెట్టుకొని
అబ్బాయిలు పుట్టేస్తారు.
లోకం చూపాల వద్దా?
అనే మీమాంసలు
తర్జనభర్జనలమధ్య
పుట్టుకే ప్రశ్నగా
మారిన చోట ఆక్షణం
నుంచే అస్థిత్వపోరాటం
మొదలైపోతుంది
ఆడపిల్లలకు.
కన్నతల్లితో ఐనా సరే
పెంపకంలో నాకిద్దరు
సమానమే అని
ఒప్పించటానికి
యుద్ధం అనివార్యమే!
అడుగడుగునా
వివక్షల సుడిగుండంలో
మునకలేస్తూ....
ఆఖరిశ్వాస వరకు
పోరాటాల ఆరాటమే!
స్త్రీ చేసే అస్తిత్వ
ఉద్యమంముందు
ప్రపంచఉద్యమాలన్నీ
దిగ దుడుపే....
ఆమె అలుపెరుగని
యోధురాలు!!
[07/07, 3:51 PM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(65):ప్రశ్న
🍀🍀🍀🍀🍀🍀🍀
ప్రశ్న మొదలైందా
జ్ఞానం పొరలు
విచ్చుకుంటుంది.
న్యూటన్ ప్రశ్న
గురుత్వాకర్షణయ్ తేలింది.
ఆర్యభట్ట
ప్రశ్నసున్నగా
విశ్వాన్ని చుట్టింది.
ధ్రువుని ప్రశ్న
అతన్ని
చుక్కల్లోనిలబెట్టింది.
ఇన్స్టయిన్ ప్రశ్న
సాపేక్ష సిద్ధాంతమై
సాక్షాత్కరించింది.
అందుకే ప్రశ్నించు
ప్రపంచాన్నిమార్చు.
ప్రశ్న లేనిచోట
ప్రగతే !ప్రశ్నవుతుంది.
65
[07/07, 3:51 PM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(64):యోధురాలు
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
వారసత్వపు ఆస్తి
ఎప్పటికీ మారనిఇంటిపేరు
కుటుంబ పెత్తనమనే
తాళాలగుత్తి
అరచేతులోపెట్టుకొని
అబ్బాయిలు పుట్టేస్తారు.
లోకం చూపాల వద్దా?
అనే మీమాంసలు
తర్జనభర్జనలమధ్య
పుట్టుకే ప్రశ్నగా
మారిన చోట ఆక్షణం
నుంచే అస్థిత్వపోరాటం
మొదలైపోతుంది
ఆడపిల్లలకు.
కన్నతల్లితో ఐనా సరే
పెంపకంలో నాకిద్దరు
సమానమే అని
ఒప్పించటానికి
యుద్ధం అనివార్యమే!
అడుగడుగునా
వివక్షల సుడిగుండంలో
మునకలేస్తూ....
ఆఖరిశ్వాస వరకు
పోరాటాల ఆరాటమే!
స్త్రీ చేసే అస్తిత్వ
ఉద్యమంముందు
ప్రపంచఉద్యమాలన్నీ
దిగ దుడుపే....
ఆమె అలుపెరుగని
యోధురాలు!!
[07/07, 3:51 PM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(65):ప్రశ్న
🍀🍀🍀🍀🍀🍀🍀
ప్రశ్న మొదలైందా
జ్ఞానం పొరలు
విచ్చుకుంటుంది.
న్యూటన్ ప్రశ్న
గురుత్వాకర్షణయ్ తేలింది.
ఆర్యభట్ట
ప్రశ్నసున్నగా
విశ్వాన్ని చుట్టింది.
ధ్రువుని ప్రశ్న
అతన్ని
చుక్కల్లోనిలబెట్టింది.
ఇన్స్టయిన్ ప్రశ్న
సాపేక్ష సిద్ధాంతమై
సాక్షాత్కరించింది.
అందుకే ప్రశ్నించు
ప్రపంచాన్నిమార్చు.
ప్రశ్న లేనిచోట
ప్రగతే !ప్రశ్నవుతుంది.
66
[08/07, 10:35 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్
కవి సమయం
కవిత(66):వారణాసి
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
కాశీ!
మోక్షపురి
కాశీ!
ఆనందవనం.
ఉత్తరవాహిని
గంగమ్మ లో
మూడు మునకలు
సర్వపాపక్షయం.
విశ్వేశ్వర దర్శనం
కోటిజన్మల
పుణ్యఫలం.
విశాలాక్షి వీక్షణం
సౌభాగ్య ప్రదం.
కాశీ కొత్వాల్
కాలభైరవదర్శనం
దక్కించును
యాత్రాఫలం.
అన్నపూర్ణ ప్రసాదం
వదిలించును
జన్మల దారిద్ర్యము.
మనికర్ణికఘాట్
మధ్యాహ్న స్నానం
తెరిచివుంచును
మోక్షద్వారం.
సాయం సంధ్యవేళ
గంగాహారతి
నయనానందకరం.
కాశీ!
భూలోక కైలాసం.
67
[08/07, 10:35 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్
. కవి సమయం
కవిత(67):సాహిత్యం
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
సాహిత్య లక్ష్యాల
దారి మల్లుతోందా?
లక్షణమైన సాహితీ
విలువల వలువలు
కట్టుకొని చక్కనైన
భావ సంపదతో
కవిత్వాన్ని గుప్పించిన
ఆ పాతరోజులు
పొలాల గట్టున
పడి దొర్లుతున్నాయా?
కొత్త మైలురాయిని
స్ఫష్టించుకొని
అక్షరాలఅపప్రదలతో
పరుగులు తీస్తున్న
నవనాగరికులకు
ఏం తెలుసు?
సాహిత్య తులాభారం
తూగే తులసీదళం!
కవి హృదయమేనని.
68
[09/07, 9:47 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(68):ఉగాది ఆగమనం
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
కాలం !!ఓ ప్రవాహం
కాలం !!ఓ చక్రం
కాలం !!కర్మలవలయం
కాలం !!శక్తివంతం
కాలం!! ఓ మాయాజాలం
మానావమానాలు సుఖ దుఃఖాలు
భోగాలు- త్యాగాలు గెలుపోటములు
ఏమైతేనేం? అన్నీ
ఆ ప్రవాహం లో
పడి కొట్టుకు పోవాల్సిందే.....
కాలం గతమే కాదు
వర్తమాన-భవిష్యత్తు కూడా !!
చలించే ప్రతిరోజు, గంటలు
నిముషాలను సైతం ఆస్వాదించమని
తన చక్రభ్రమణం తో
ముందుకుతోస్తూనే ఉంటుంది....
శిశిరంలో రాలే ఆకులు
వసంతం లో పూసే వేపపువ్వు
లేలేత మావిచిగుళ్ళు
ఆమని కోయిల కుహుకుహులు
మండే ఎండకు పూసే
చల్లని మల్లెల సౌరభాల
ప్రకృతి పరవశానికి
కర్మసాక్షి 'ఉగాది '
కాలగమనం -సృష్టి చక్రం
మధ్య నున్న
చక్కని సూత్రం 'ఉగాది '
ఉష :కాంతులతో
నవనవోన్మేష రాగాలాపనతో
షడ్రుచుల సమ్మేళనాలను మేళవిస్తూ
గతం ఓ జ్ఞాపకం !
వర్తమానం నిత్య నూతనం
భవిష్యత్తు ఆశావహం అంటూ..
పంచాంగ శ్రవణం చేయించడానికి
అదిగదిగో వచ్చేస్తోంది
మన తెలుగువారి 'ఉగాది'
శార్వరీ నామ తొలి పండగ ఉగాది
స్వాగతం !సుస్వాగతం !!శుభస్వాగతం!!
69
[09/07, 9:47 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(69):మార్పు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
అందమైనతోటలోకి
కంచె లెక్క చేయక
దొడ్డిదారిన దూరిన
ఆబోతుల డెక్కల
చప్పుడికి
నేలరాలిన పూరెక్కల
సౌరభం!
మట్టిపరిమళాలతో
ఇమిడిపోయి
తలదాచుకుంటే
పాపం!ఎవ్వరిది?
మార్పు అనివార్యమే
కావొచ్చు, కానీ!
పాతదంతా తుడిచిపెట్టాలనే
విద్వంసకర ఆలోచనలు
పునాదులు కూల్చి
గోడలు కట్టే
పేకామేడలే అవుతాయి.
ఏ మార్పు ఐనా
చరిత్రకు కొనసాగింపుగా
వుండాలేగాని
నేలమట్టంచేసేలా
ఉండటం
సంస్కృతి
విద్వంసమే!
70
[10/07, 11:09 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(70):వీడ్కోలు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
అనుకుంటాం గానీ
అన్నీ మనవేనని
అంతా మనవాళ్లేనని
ఏదో ఒక
సందర్భంలో
వ్యక్తులకో
పరిసరాలకో
వీడ్కోలు
చెప్పాల్సిన
సందర్భం
వచ్చినపుడు కానీ
తెలీదు.
ఏవీ!
మనల్ని
అంటిపెట్టుకొని
ఉండవని.
71
[10/07, 11:09 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(71): "ఆశ"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నువ్వు లేని చోట
ఏదీ నిలువదు.
ఓ!ఆశయం
సిద్దించదు.
ఓ!ఆలోచనా
పొడసూపదు.
ప్రపంచమే
నిర్వీర్యమైపోదూ.
ఉషోదయాన
వేకువముంగిట్లో
కొన్ని ఆశల చుక్కల
తేనీరు సేవిస్తేకదా
రోజంతా....
ఉల్లాసంగా ఉండేది.
రాత్రికి రంగురంగుల
స్వప్నాలతో....
నిదురించేది.
చావు బతుకులమధ్య
కిట్టుమిట్టాడే రోగికి
ప్రేరణ నీవే.
ప్రేమ విహంగాలై
విహరించే ప్రేమికులకు
ఆలంబన నీవే.
చైతన్య దీప్తివై
మనిషిని ముందుకు
నడిపే ఇంధనమూ నీవే.
72.
[11/07, 10:31 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(72):"అద్దం"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
బింబ ప్రతిబింబాల మధ్య
భేధం లేకుండా
నిన్ను నీకు
నిక్కచ్చిగా చూపే
నిజాయితీ అద్దం!
బలాల్నీ బలహీనతల్నీ
ప్రస్ఫుటంగా
పారదర్శకంగా
ప్రదర్శించే నిష్కర్ష
నేస్తం అద్దం!
ముసి ముసి నవ్వులతో
నీ అందానికి నీవే
మురిసినా...
నెరిసిన జుట్టును
సవరించుకుంటూ
దాచేయాలని చూసినా
అన్నిటికీ నిన్నే
సర్వసాక్షిని చేసి
నిలబెట్టే
శుద్ధ స్పటిక
అద్దం!!
73
[11/07, 10:32 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(73):విశ్వగురువు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
అనంతసృష్టిలో అతిసూక్ష్మ క్రిమి
అజ్ఞాతశత్రువై జీవన్మరణపోరాటానికి
విశ్వవేదికను సిద్ధం చేసింది.
రాజు -రైతు, ఉన్నోడు -లేనోడు
తేడాలు తుడిచేసి
ఒలంపిక్ పట్టికలో చోటుదక్కని
దేశాలక్కూడా కరోనా పట్టికలో
చోటిచ్చి హద్దుల్ని చెరిపేసి
భూగోళాన్ని బంతిలాచేసి ఆడేస్తోంది.
'గ్లోబలైజేషన్ 'చమ్కీదండను
పూసలు పూసలుగా తెంచి
విశ్వవిపణి లోకి 'కోవిడైజేషన్ 'పేరుతో
విసిరి పారేసింది .
కాలికేయ సైన్యంలా విరుచుకు
పడుతున్న మహమ్మారికి
అగ్రరాజ్యాలు సైతం పాదాక్రాంతలై
కప్పంగా శవాల రాసులు, కుప్పలుగా పోస్తుంటే
అప్రమత్తమైన భారత్ బతకడమే గెలుపంటూ
బతుకుసూత్రాల చిట్టా తెరిచింది.
సామజికదూరాన్ని రక్షరేకుగా కట్టి
గృహాలనే యుద్ధ శిబిరాల్ని చేసి
కరోనారక్కసి గొలుసుకట్టును తెగ్గొస్తోంది.
మాస్క్ లు, శానిటైజెర్లే మరణాయుధాలుగా ప్రత్యర్థి ఎత్తులు చిత్తు చేస్తోంది.
ఒకవైపు వైద్యుల సేవకు
చప్పట్ల దుప్పట్ల ప్రశంసలందిస్తూనే మరోవైపు
దీపయజ్ఞంతో సమస్యను సమిష్టిగా సవాలు చేసి శత్రువుకు ముచ్చెమటలు పట్టిస్తూ
నేను సైతం అంటూ
సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికి
కృతజ్ఞతా మాలలు అల్లి పెడుతోంది.
ఎన్నో దాడులు, విపత్తులు, ఉపద్రవాలు సంయమనంతో పోరాడి గెలిచిన చరిత్ర మాది
కావాలంటే 'ఊరకట్టడి'గురించి,
ఏ జానపదున్నైనా కదిపిచూడు
క్వారంటైన్ మాకు కొత్తకాదని సనాతన
సంప్రదాయాలవిలువల్ని సాక్షిగా!చూపెడతాడు అంటూ అందరి దృష్టి ఆకర్షించింది.
సొంతలాభం కొంతమానుకొని
పొరుగువారికి సాయంఅందిస్తూభారతీయుల
ఔన్నత్యాన్ని చాటి చెప్పింది.
విగత జీవుల లెక్కలపట్టీలో
తక్కువ ప్రాణనష్టమే గెలుపు పాయింట్లుగా
శరీరం ఖలు ధర్మసాధనం అంటూ
అంతర్జాతీయ యవనిక మీద మరోసారి
విశ్వగురువై అవతరించి యావత్ ప్రపంచానికి దిశా నిర్దేశం చేయడానికి
ముందుకు దూసుకెళ్తోంది......
74.
సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(74):"ఆకాశం"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నిజం!నాకు
ఆకాశం ఎలా వున్నా
బావుంటుంది.
తారాహారాలమధ్య
చందమామ లాకెట్టు
తొడుక్కొన్న పున్నమి
ఆకాశం నిజంగా
ఎన్ని వెన్నెల రాసుల్ని
కొలిచి పోస్తుందో!
సింగారం తీసేసి
బోసిమెడతోఅలిగి
బోర్లాపడుకున్న
ఆడపిల్ల శోకంలా
అమావాస్య ఆకాశం
చిక్కటి చీకటితో
భాషకందని భావావేశంతో
ఎన్ని స్మృతులు
తట్టి లేపుతుందో!
ఇంటికొచ్చిన
అతిథుల పలకరిస్తూ
సందడిచేసే ఇంటిపెద్దలా
మేఘాల గుంపులోంచి
తొంగిచూసే నీలాకాశం
సంబరాల అంబరమే!
సమున్నతమైన
వ్యక్తిత్వానికి
సరైన పోలిక!
ఆకాశమే!
అందుకే ఎలావున్నా
నాకు బావుంటుంది.
75.
సమూహం:వీరాస్
కవి సమయం
కవిత(75):రోజులలా
దొర్లిపోతున్నాయ్
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఆరాటాల్లేవ్
సమయంతో
పోరాటాల్లేవ్
రోజులలా
దొర్లి పోతున్నాయ్
బాక్స్ లు సర్ధటాల్లేవ్
స్కూల్ బస్సుల
మోతల్లేవ్.
సాయంకాలానికి
గూడుచేరుకున్న
చిట్టిగువ్వల
ముచ్చట్లు లేవు.
ఆదివారాని కున్న
క్రేజ్ సప్పబడే
పెళ్లి పందిట్లో
ఊరేగింపుల్లేని నగలు
లాకర్ లో
మూలగబట్టే.
మానవ జీవితాల్ని
అతలాకుతలం చేస్తున్న
శత్రువైరస్ కు చిక్కకుండా
యుద్ధ శిబిరాల్లో
తలదాచుకున్నట్టు
పరేషాన్ పొద్దులతో
రోజులలా...
దొర్లిపోతున్నాయ్.
76
[14/07, 10:24 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(76):వర్షం కురిసిన రాత్రి
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
మంచు పవనం
మనసును తడిమినట్టు
చుట్టూరా
పరుచుకున్న చల్లదనం.
చెట్టునుండి
జలజలా రాలి
తడిసి ముద్దై
పరిమళాలు వెదజల్లుతున్న
పున్నాగపూలరాసులు.
బరువు దింపేసుకున్న
మేఘాలు మాయమై
నిశ్చలమైనఆకాశం.
చిరుకప్పలు తల్లికప్పల
బెకబెక సందడి.
చల్లబడ్డ నేలనుంచి
పనిమాలా వస్తున్న
చలిచీమలు.
ప్రకృతిస్నానానికి
పరవసిస్తున్న
కీటకాల సందడి.
పరికించాలేగానీ
అన్నీ.....
అపురూప దృశ్యాలే.
వర్షం కురిసిన రాత్రి
ఈ ధరిత్రి
ఎంతగా!
మురిసిపోతుందో.
[14/07, 10:24 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(77):కళార్చన
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
అక్షరాలతో
ముగ్గుపెట్టి
పదాలతో
పాటపాడి
వాక్యాలను
తోరణాలుగా కట్టి
కళామతల్లికి
కవితా కుసుమాలతో
అర్చన చేస్తూ
కథా నైవేద్యాలు
సమర్పిస్తుంటే
ఉలికిపాటుకి
కునుకుచెదరగా
సుషుప్తి లోంచి
జాగృతిలోకి
జారి పడ్డాను.
78
[15/07, 11:03 AM] Sunkara Sreelatha KS 21: సమూహం: వీరాస్ కవి
సమయం
కవిత(78):గుర్తుకొస్తున్నాయి
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
పూలగుత్తి లోని
పరిమళమంతా
గుప్పు మన్నట్టు
మదిలోని జ్ఞాపకాలు
ఇవాలెందుకో
గుర్తుకొస్తున్నాయి....
పలకా బలపం చేతికిచ్చి
చక్కగా చదువుకొమ్మని
అమ్మ నన్ను బడికి
పంపినతొలినాళ్లు
తొలకరి ఝల్లులు
కురిసినంత కమ్మగా
గుర్తు కొస్తున్నాయి....
పొలాలగట్టున నాన్న
నన్ను భుజాలమీద
మోసుకుంటూ నడుస్తున్నప్పుడు
పల్లకిలో రాకుమారుడిలా
పొంగిపోయిన రోజులు
గుర్తుకొస్తున్నాయి......
బాల్యస్నేహితులతో
కలిసి చేసిన అల్లరి
ఆడిన దొంగాటలు
లేలేత తాటి ముంజెలంత
తియ్య తీయగా
గుర్తు కొస్తున్నాయి.....
79
[15/07, 11:03 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(79):చావు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ఊహల రెక్కలు
తొడుక్కొని
ఊరు వూరంతా
చూసొచ్చాను.
బేతాలకథలోని
రాక్షసరాకకు
భయపడి
దర్వాజాలు
బందుపెట్టుకొని
బిక్కు బిక్కుమని
కాలం గడిపే
ప్రజలు ఇప్పుడు
నిజంగానే
ప్రత్యక్షమైయ్యారు.
కరోనా రక్కసి
కోరల్లో నలిగిన
మనిషికి చావు కూడా
చచ్చే చావయ్యింది.
ఒంటరితనానికి
పరాకాష్ఠను!
మరణంలో సైతం
రుచిచూపిస్తోంది
మాయల మరాఠీ!!
82
[17/07, 12:31 PM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(82):అజ్ఞాత వాసి
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
పాలెట్ లోని
రంగులు అద్దుకుంటూ
కుంచెతో
తదేకంగా రక రకాల
బొమ్మలు గీసే
బోలేడు మంది
చిత్రకారులను
చూసేఉంటాము.
ఆకాశం కాన్వాస్ పై
కిరణాల కాంతితో
మబ్బుల వర్ణాలే
కుంచె కద్దుకుని
మేఘాల చిత్రాలను
రోజుకో రీతిగాచిత్రించి
కనువిందుచేస్తున్న
ఆ చిత్రకారుడు
ఎందుకో?
మనకెపుడూ
కనపడని
అజ్ఞాతవాసి!
[17/07, 12:32 PM] Sunkara Sreelatha KS 21: సమూహము:వీరాస్ కవి
సమయం
కవిత(83): మన నదులు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
మన నదులు
పుట్టింటినుంచి
మెట్టి నింటికి చేరే
అందమైన
ఆడపిల్లలు.
మన నదీ
సంగమాలన్నీ
ముచ్చట్లాడుకొనే
అక్కచెల్లెళ్ళు.
మన నదీ
జలాలే
పట్టెడు అన్నం పెట్టే
కన్నతల్లులు.
మన నదుల
తీరాలు
నాగరికత!
ఉత్పాదకాలు
ప్రవహిస్తూ...
ప్రవహిస్తూ...
భాషను
యాసను
సంస్కృతిని
తీరాలకు చేరవేసే
జీవనవాహిణులు
మన నదులు.
84
[18/07, 9:57 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(84):నేనేం రాసేది?
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నేనేం రాసేది...
కొత్తగా నాకేం తెలుసని!
ఏం నేర్చుకున్నానని రాసేది?
ప్రపంచమంతా
వైరస్ దాడికి
విలవిలలాడుతూ
ప్రాణాలు అరచేతిలో
పెట్టుకొని మూతికి
మాస్కులు తగిలించి
మౌనపోరాటాలు
చెస్తుంటే..
పనిలేక పడున్న
ఖాళీ చేతుల్ని
రుద్దుకుంటూ...
మృత్యుఘోష వింటూ
నేనేం రాసేది?
ఎంతసేపూ
ఆ పాతజ్ఞాపకాలనే
తవ్వి తవ్వి
ఆఖరికి !
ఖంగుమంటుంటే
నేనేం రాసేది?
లాక్డౌన్ ఐన
మనసులో ఏ
భావాలున్నాయని
రాసేది..
నేనేం రాసేది?
85
[18/07, 9:57 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(85):పూలజడ
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
రంగురంగుల పూలు
రక రకాల పూలు
పూలవనాలు మదిని
మీటే వాయులీనాలు.
మల్లెలు,జాజులు
విరాజాజులు,సంపెంగలు
కాగడాలు,కనకాంబరాలు
పారిజాతాలు,గులాబీలు
ఒక్కో పువ్వూ ఒక్కోరకం
దేనికదే విభిన్న పరిమళం.
నల్లా నల్లనిజడ
నాగుపాములాంటి జడ
జడకుప్పెలతో
వయ్యారంగా
ఊగే జడ!
రసహృదయాల
మది కొల్లగొట్టే జడ.
జడకు
పూలంటే ఇష్టం!
కాదు
అలంకారం!
గిల్లి,గుచ్చి
బారెడు దండను
తలలో తురిమే జడది
పూలపై గుత్తాధిపత్యం!
జడలో అలిగి కూచున్న
పూలుపెట్టిన శాపాలకు
జుట్టు రాలీ.. రాలీ..
మాయమైన జడలు
పోనీలై తేలాయి
పూలజడలు
జ్ఞాపకలై మిగిలాయి.
(Whatsapp group lo vochina oka sandesam chadhivi raayaalani pinchindi.)
86
[19/07, 11:57 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(86):"దీవార్"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
అవును!
గోడలు కూల్చాల్సిందే
మనసులో కట్టుకున్నవైన
దేశానికి హద్దులగానైన సరే!
గోడలెపుడూ
సంకుచితమే..
స్వార్థమే..
మనవత్వపు
విభాజితమే!
రణరంగసిక్తమే!
స్నేహహస్తాలు చాచే
వంతెనలాంటి
గోడలు కావాలిపుడు.
అనాథలకు
అన్నార్తులకు
కూడు-గుడ్డు
అందుబాటులో ఉంచే
మనవత్వపు
సామాజిక దీవార్లే
చౌరస్తాల్లో లేవాలిపుడు.
[19/07, 11:57 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(87):వివాహం
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
పెళ్ళి!
మూడుముళ్ళ బంధం
విడాకులు!
అపసవ్య దిశలో ఏడడుగులు.
భార్య!
ఊరుమారిన వలస జీవి.
భర్త!
మారే అవసరమేరాని
విలాస జీవి.
కుటుంబం!
కలిసుంటే ఆనందనిలయం.
విడిపోతే
విషాద వలయం.
88
[21/07, 9:13 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమూహం
కవిత(88);నువ్వు మారాల్సిందే
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
చూసావా!
నువ్వు మారాల్సిందే.
నీదంతా
ఒట్టి చాదస్తం!
గిరి గీసుకున్న
వలయంలోంచి
ఎంతకీ బయటకు రావేం?
ఉలిపికట్టెలా ఎంతసేపని
ఒంటరిగా నిలబడతావ్.
అందరూ నవ్వినప్పుడు
నువ్వూ నవ్వేసేయ్.
అందరూ ఏడుస్తున్నప్పుడు
కారణం తెలీకున్నా ఏడు.
నక్క వినయాలు ఒలకపోయి.
భజనగీతాలు పాడేసేయ్.
నువ్విప్పుడు మారాల్సిందే!
ఏ ప్రత్యేకతా లేని
యాంత్రిక ముళ్ళు కావాల్సిందే.
లేకపోతే!
మనిషి లెక్కలోంచి
వ్యవకలన మైపోతావ్
నీ ఇష్టం మరి.
[21/07, 9:13 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(89): "డ్రాపౌట్"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀
చెదలుపట్టిన చెక్కను
చీల్చి చెండాడుతూ
చక్రం పట్టిన అభిమన్యుడిలా
రంపమ్ పట్టిన అతడు
పెంచుకున్న గడ్డంతో
మా ఇంట్లో ఒంగోని
పనిచేస్తుంటే...
టీచర్ బుద్ధి ఏడపోయేను.
నువ్వు గోపివి కదూ!
అన్నా పరిశీలన చేస్తూ..
ఊ ..అనాలో
ఊహు.. అనాలో తెలీని
సంధిగ్ధంలో తెలివిగా
బడి ఇడిసి సాన్నాళ్లైంది
అంటూ నసిగాడు
ఒంచినతల ఎత్తకుండానే.
ఆరేళ్ల క్రిందటి
ఏడో తరగతి డ్రాపౌట్!
కబురంపితే..
ఊరిడిసి పోయాడనే
సమాధానం తో సహా
గుర్తు కొచ్చింది.
ఆశ్చర్యం!
నేటి వలస కార్మికుల్లో
డ్రాపౌట్లు ఎందరో?
కదాని...
90
[22/07, 9:56 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(90):"శ్రీమతి"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ఆమెకు
రెక్కలున్నాయ్
ఎగరనివ్వు.
భాషవుంది
ఆమెను
మాట్లాడనివ్వు.
ఆలోచనలు
ఉన్నాయ్
వికసించనివ్వు.
ఆమెకు
ప్రాణముంది
ప్రాధాన్యతనివ్వు.
స్పందనుంది
భావాలు
పంచుకోనివ్వు.
శక్తి ఉంది
నీతో సమానంగా
నడవనివ్వు.
అంతే!
ప్రపంచంలో
ఆమెను మించిన
బహుమతి నీకు
వెదికినా దొరకదు.
[22/07, 9:56 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(91):ఉపాధ్యాయుడు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ఉపాధ్యాయుడు
నిత్యం చిన్నారుల
మధ్య ఉలిపట్టుకు
తిరుగాడే జక్కన.
పిల్లల మనోఫలకాలమీద
భావిచిత్రాలు
గీసే డావిన్సీ.
ఆరోగ్య సూత్రాలు
నేర్పే సుశ్రుతుడు.
ఐనా కూడా!
బాల్యచాపల్యం పోని
చిన్ని శిశువు!
ఒక్కోసారి ప్రేమతో
శిష్యుడిచ్చే చిన్ని
బహుమతికే
పొంగిపోతాడు.
తన మీద
అవగాహన లేమితో
రాసే గాలివార్తలకు
కుంగిపోతాడు.
అతనిలోని
సంవేదన,
సృజనాత్మకత
పెల్లుబికిందా..
ఎక్కుపెట్టిన తూనీరమై
విస్ఫోటనం చెందిన
విజ్ఞానమై ప్రగతి
రథచక్రాల మధ్య
ఇరుసై ఇమిడిపోతాడు.
92
[23/07, 9:50 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(92) : "డైరీ"
రచన: సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀
నా డైరీ!
ఉగాది పచ్చడి
షడ్రుచుల మేళవింపు.
కొన్ని పేజీలు
మధురోహలు.
కొన్ని పేజీలు
కన్నీటి చారికలు.
మరికొన్ని
పూలవనాలు.
ఇంకొన్ని
హాస్యవల్లరులు.
కొన్ని జాలిపాటల
జావళీలు.
పెద్దగా
రహస్యాలేం లేవ్.
అంతా!
బహిర్గతమే
ప్రస్ఫుటితమే.
గతం పునాదుల
మీద నిలబెట్టి
వర్తమాన
భవంతుల్లో
సేదతీర్చి
భవిష్యత్
డాబా మీద
ఆరాంగా
కునికిపాటలు
పాడుకునే
ప్రణాళికా రచనలే.
93
[23/07, 9:50 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత (93) :కరోన నానీలు
రచన: సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
1. కరోనా
సినిమా బ్లాక్బస్టర్
ప్రొడ్యూసర్
చైనవాలా.
2. కరోనా
సోకులు
మ్యాచింగ్
మాస్కులు.
3.కరోనా
లాజిక్కు
నీవు నాకెంత దూరమో
నేను నీకంతే దూరం.
4.కరోనాతో
షాదీ ఐయిందా
దునియాతో
విడాకులే.
94
[24/07, 9:40 AM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (94):దిగులు పడకు
నేస్తమా!
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
మనిషి
దేన్ని కోల్పోయినా
అది ఒక
జ్ఞాపకమై
మిగులుతుంది.
మరి!
ఙ్ఞాపకాలనే
కోల్పోతే?
సృష్టి!
మన ఊహకందని
సంకల్పాలని
సృజించే క్రమంలో
జరిపిన
ఒకానొక క్రియే
జ్ఞాపకాల విధ్వంసం.
ఆ ధ్వంసరచన కూడా
ఏదో ఒక రోజు
సరి కొత్తరూపం లో
మొలకెత్తక మానదులే
దిగులు పడకు నేస్తమా!
[24/07, 9:40 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(95) : "తగువు"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ప్రతిదీ లెక్కాచారంగా
బతికే మనిషికి
లెక్కలు రాకపోతే
అన్నీ చిక్కులే!
భౌతిక ప్రపంచం లో
పరమాణు నిర్మాణం
అర్థమైతే చాలు
విశ్వాన్ని చుట్టేయొచ్చు.
రాజనీతి నేర్పే
పాఠాలే కదా!
ప్రభుత్వ పాలనాధికార
శాసనాలు.
భాషలేనిచోట
ఏ శాస్త్రమైనా
అభివ్యక్తి లేక
అణగారిపోదు!
జీవించి వుంటే కదా
ప్రతిదీ సాధ్యమైయేది.
జీవి ఆవిర్భావం గురించి
మనుగడ గురించి
మరి తెలుసుకోరా?
గర్భస్త శిశువుగావున్నపుడే
కాళ్ళు,చేతులు కదుపుతూ
మొదలెట్టిన ఆటలు
బయటికి వొచ్చాక ఆపేస్తే
నాడీ వ్యవస్థే
అస్తవ్యస్తమై పోదూ!
అందుకే!
దేనికదే ప్రాముఖ్యం
కలసి సాగితేనే
ఏదయినా
సఫలీకృతం.
96
[25/07, 9:10 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత (96) : రిహార్సల్
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఆ కళ్ళు
వెదుక్కుంటున్నాయ్.
నిర్మలమై,స్వచ్ఛమై
కాంతిపుంజాల్లా వెలిగే
కళ్ళు !
వెదుక్కుంటున్నాయ్.
బోర్లాపడి బోసినోరుతో
మెడను మోరగా ఎత్తి
తలను తలోదిక్కు తిప్పుతుంటే
ఊగే ఉంగరాలముంగురులు
దూరంగా చూస్తుంటే
అన్నమయ్య చింతకాయజడల
చిన్నికృష్ణుని వర్ణనే
కళ్ళముందు సదృశమైంది.
అన్వేషణ కాస్తముదిరి
దిగులు పొంగగా
బుంగ మూతితో
మారిన ముఖకవళికలతో
ఉక్రోశంతో ఉంగాఏడుపును
లంఘించుకుంటే
రెండుజతల కళ్ళు
కన్నీటిచెలమలైయ్యాయి.
మెటర్నిటీలీవు ఐపోతుండగా
రేపటి రోజుల కోసం చేస్తున్న
రిహార్సల్ నాపి తల్లిమనసు
పరుగున వెళ్ళి
గుండెలకు హత్తుకుంది.
అమ్మకనిపించగానే అంత
యేడుపూ మానిన
చిన్నారి!
విజయగర్వంతో
విప్పారినవదనంతో
బాలాత్రిపురసుందరై
నవ్వులు వెదజల్లుతోంది.
97
[25/07, 9:10 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(97) : రోడ్డెమ్బడి
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
రోడ్డు ఎందుకో
రక్త మోడుతోంది.
చితికిన బొబ్బలు
నెర్రలు చీలిన
పాదాల పగుళ్లలోంచి
స్రవిస్తున్న శ్రామిక
రుధిరజలంతో
రోడ్డు ఎందుకో
రక్త మోడుతోంది.
నెత్తిన మూట
కడుపులో అరట
బతికేందుకు
ఏమాత్రం భరోసానివ్వని
ఖాళీ పర్సు.
కష్టమేదైనా గాని
బిడ్డా నీకు నెనున్ననే
కన్న తల్లి !
కడుపుతీపి మాట
ఇంటిబాట పట్టిస్తుంటే
రోడ్డు నిండా
బతుకు నదిని
ఈదుతున్న గజయీతగాళ్లయి
రహదారుల దాహానికి
గుప్పెడు రక్తాన్ని పన్ను కడుతూ
తల్లివేర్లు వెదుక్కుంటున్న
పిల్లవేర్లయి సాగిపోతున్నారు.
98
[26/07, 8:19 AM] Sunkara Sreelatha KS 21: సమూహం: వీరాస్ కవి
సమయం
కవిత (98) : పునర్నిర్మాణం
రచన : సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నన్ను నేను పునర్నిర్మించుకునే
పనిలో నిమగ్నమైనాను.
నా ఆంక్షల్ని ఆశయాల్ని
గుప్పెడు సంకల్పాలతో
రగిలించుకుంటున్నాను.
సర్దుకుపోవటాలు
రాజీపడటాల్ని
అటకెక్కించేసాను.
నన్ను కనపడనీయకుండా
దాచేసినవేవీ ఇపుడు
నా ముందు లేకుండా
తొలగించేసుకుంటున్నాను.
పాత ప్రపంచమే
మెరుగులద్దిన కొత్త
బంగారు లోకంలా
మెరిసిపోతోంది.
శిథిలాలు కూలుతున్న
చప్పుడిపుడు నాకు
సుశ్రావ్యంగా వినిపిస్తోంది.
విత్తునుండి చీల్చుకు
రావడంలోని ప్రయాస
నాకు అనుభవమౌతోంది.
పునర్నిర్మాణం లోని
ఉత్తేజం కాంతిపుంజమై
నాకు వెలుగుదారి
చూపెడుతోంది.
[26/07, 8:19 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత (99) :మలుపు
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
అపజయాలెప్పుడూ
రాబోయే !
అఖండ విజయాలకు
గెలుపుల మలుపులే.
ఒక్కక్షణం!
నిన్ను నీవుతెలుసుకొనే
అవగాహనా శిబిరాలే.
ప్రయత్నాలతో మరింత
రాటుతేలాల్సిన భాధ్యతను
గుర్తుచేసే చురకత్తులే!!
ఏం ఫర్వాలేదు
నీ వెనుక మేమున్నాం
అని అభయమిచ్చే
ఆత్మీయులను!
అండగానిలిపే
అపజయాలెప్పుడూ
గెలుపుల మలుపులే.
100
[26/07, 8:20 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత (100) : నా కవితలు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నా కవితలు
మనోసేద్యంలో
ఒలికిన
చెమట చుక్కలు.
నా కవితలు
ఆలోచనల
పాదులనుంచి
పొడుచుకొచ్చిన
అడవి మొక్కలు.
నా కవితలు
ఊహలపల్లకిపై
నను ఊరేగించిన
పిల్లతెమ్మరలు.
నా కవితలు
మనసుపొరలను
తేరిపార చూసిన
మనో విశ్లేషకులు.
నాకవితలు
భావనా ఉద్యానవనంలో
పూసిన శతకుసుమాలు.
నా గురుదేవుల
పాదాలనర్చించే
పరిమళ ద్రవ్యాలు.
కవిరాజ్ పురస్కార గ్రహీత
*************"""****""
పేరు:సుంకర శ్రీలత
తండ్రి పేరు:తిమ్మయ్య
భర్త పేరు:విజయ కుమార్
వృత్తి:ఉపాధ్యాయిని,LPH
సొంత జిల్లా:అనంతపురం
******************************
వీరి కవిత్వం ఆస్వాదించ బోయే ముందు
ఒక్క మాట
మీతో పంచుకోవాల్సినవిషయాలు:
1.నేను రాసిన "గ్రామ స్వరాజ్యం" నాటిక గాంధీగారి 150వ జయంతి సందర్బంగా తెలుగు యూనివర్సిటీ లో మా స్కూల్ పిల్లల చేత(zphs,Hayathnagar) ప్రదర్శింపబడి తెలంగాణా రాష్రం తరఫున జాతీయ స్థాయికి సెలెక్ట్ఐ నాగ్పూర్ లో ప్రదర్షింపబడింది.అక్టోబర్2 రవీంద్రభారతి లో ప్రదర్శించి,ముగ్గురు డైరెక్టర్ లు
విజయకుమార్ సర్(school education),శేషుకుమారి మేడం(scrt),మామిడి హరికృష్ణ గార్లచేత ప్రశంసలు, సన్మానం అందుకున్నాము.
ఆ నాటిక "కమలాభారతి " స్వచ్ఛంద సంస్థ వాళ్ళు దేశభక్తి నాటికల సంకలనం లో అచ్చువేశారు.
2. "మహిళా సాధికారిత" అనే వ్యాసం women's day రోజు
నమస్తే దినపత్రిక లో అచ్చయింది.
3.నేను రాసిన "మేరీ"అనే కథ బాలలది నోత్సవపోటీ లో ఉపాధ్యాయదర్శిని పత్రికలో మొదటి బహుమతి(2000/రూ.)సాధించింది.
అదే కథ "భూమిక"స్త్రీవాద పత్రిక లో విమెన్సడే సందర్బంగా వాళ్ళు ప్రచురించారు.
🙏ధన్యవాదాలు🙏
సుంకర శ్రీలత.
******""***************
1
తేదీ : 07-05-2020
కవిత సంఖ్య : 01
కవి పేరు : సుంకర శ్రీలత
జిల్లా : రంగారెడ్డి
శీర్షిక : ఆమె ప్రకృతి పక్షం
సృష్టి ప్రసవమైయ్యాక
జరిగిన ప్రకృతి పంపకాల్లో
ఆలోచనా శక్తి ని అదనంగా పొందిన మనిషి !
ఆకాశమంత ఎదిగి అత్యాశ తో అభివృద్ధంటూ అడవులు నరికి
ఋతుపవనాలకి బద్ధకం చుట్టించాడు.
సర్వభక్షకుడి గా మారిజీవకారుణ్యాన్ని
తుంగలో తొక్కేసాడు.
అందుకే కరోనా మనిషికి
కనిపించని శత్రువై
ధరాతలానికి దిగివొచ్చి
కరాళనృత్యం చేస్తోంది.
ఈ పోరాటం లో తను
ప్రకృతి పక్షం వహించి
నాణేనికి మరో వైపు చూడమంటోంది.
ఎన్నడో కనుమరుగైన
'దాల్ దౌర్ 'హిమవన్నగపు అందాల్ని
వేలు పెట్టి చూపెడుతోంది.
ఇన్నాళ్లు కాలుష్య పొగలు చిమ్మిన పర్యావరణం ఇప్పుడు పక్షుల ఆనందకేళి తో హొయలు పోతోంది లెమ్మంటోంది.
జీవించే 'హక్కు 'మాకూ
ఉందంటూ వన్యప్రాణులు
ఖాళీ రోడ్లెక్కి అస్తిత్వ ప్రదర్శన చేస్తుండగా.....
నదులన్నీశుభ్రజలాలతో
హాయిగా తేటగీతి పాడుకుంటుంటే.....
సద్దుమణిగిన మానవ
నిర్మిత హర్మ్యాల సందడికి
ప్రకృతి శుద్ధి పడి స్వేచ్ఛా గీతాలాలపిస్తుండగా....
గ్లోబలైజేషన్ గుడ్డి వెలుగులో
ఆధునీకరణ మాయామోహపు
తెరలుతొలిగించికనువిప్పు చేసింది కరోనా.
అందుకే!! పరితప్తహృదయాలతో
ఇదే ఆఖరి విపత్తవ్వాలని
గట్టి 'సంకల్పం' చెప్పుకొని
కుటుంబాలే పాఠశాలలుగా
బతుకు పుస్తకం తెరిచి
పచ్చని చిత్రాలు గీసేద్దాం.
రేపటి అవసరాలకు తగ్గట్టుగా
భావిభారతాన్ని మలిచేందుకు
సనాతన విలువల నడకల్ని
పిల్లలకు నేర్పించేద్దాం .
పంచతంత్ర కథలలోని భూతదయను ఉగ్గుపాలతో
రంగరించి పోసేద్దాం.
గృహనిర్బంధం కాదిది
బతుకు దీపాలు వెలిగించుకుంటున్న తరుణమని సరికొత్త
భాష్యం చాటిచెపుదాం
2
[09/05, 1:28 PM] Sunkara Sreelatha KS 21: వీరాస్ కవి సమయం
******************
కవిపేరు:- సుంకర శ్రీలత
కవిత పేరు :- ఆలోచనలు
కవిత సంఖ్య:-2
తేదీ:9/5/2020
ఆలోచనలు
ఆవృత్తాలై
పరిధి, వైశాల్యం
పెంచుకుంటూ
పోతూనేవుంటాయ్.
చిన్న మర్రికాయ
పెద్ద వటవృక్షం ఐనట్టు
మెదడు మొదల్లోంచి
ఆవిర్భవించే
ఆలోచనల వ్యాప్తి
అనంత సృష్టి లో
రేఖీయ సమీకరణాలై
విస్తరిస్తూ నే ఉంటాయి.
ఆకాశానికైనా
ఆలోచనల కైనా
పరిధులు వెదకటం
కించిత్ సాహసమే !!
అసలు ఈ సృష్టే
భగవంతుడు నిత్యం
ఆలోచించి చేసే
గొప్ప 'సృజన '
ఎప్పుడు మొదలౌతాయో
ఎక్కడ అంతమౌతాయో
తిరిగి ఎప్పుడు
పునరావృత్తమౌతాయో !!
తేల్చేదెవరు?
అసలు ఆలోచనే
లేకపోతే అభివృద్ధి
సాధ్యమేనా?
ఆలోచించండి.
అందుకే ఆలోచనలకు
అనకట్టవేయాలనుకున్న
ప్రతి సారీ అవి,
కట్టలు తెంచుకున్న
ప్రవాహమై, నన్ను
'త్సునామీ 'లా
ముంచెత్తుతూనే
ఉంటాయి.
3
తేదీ :19/5/2020
కవిత :జడ భరతులు
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀
ముళ్లకంపపై చిక్కుకున్న
వస్త్రాన్ని విడదీసినంత
సున్నితంగా !!విషపూరిత
వ్యక్తుల నుంచి మనల్ని
మనం వేరుపరుచుకుంటూ
వెళ్లాల్సిందే, ఎందుకంటే
మంథరలు, శకునిలు,
ఇంద్రజిత్ లు మళ్ళీ
ప్రత్యక్ష మావుతూనే.....
వున్నారుయుగాలు మారినా.
సరస్వతీ నిలయాలు కూడా
స్వార్థపూరితప్రయోజనాల
కోసంఊసరవెల్లులుతిరుగాడేవూడలమర్రులవుతుంటే
ధర్మం! నేనుండలేనంటూ
భేతాళుడిలా చెట్టెక్కికూచుంది.
గుడిలాంటి బడులు
సంకెళ్లులేని బందీల్లా
మౌనం! దాల్చిన మునుల్లా
మూగపోయి నిల్చుంటున్నాయ్
చరిత్ర సాక్షిగా !!
అవును,
రోజులు మారాయి
రాజకీయ రంగు పులుముకుంటున్న
బడులూ !మారుతున్నాయి.
చుట్టూ వున్న జనాల్ని బట్టి
న్యాయానికున్న నిర్వచనం
మారిపోతుంటే......
ఇక్కడ !!
మారిపోవాల్సింది మనమే
ఎలాగంటే??
నాకెందుకులే అని
వూరకుండడం కాకుండా
ఎదురెళ్లి పోరాడాలి
అన్యాయాన్ని ఈడ్చి
అవతల పారేయాలి
అంతేకాని జవసత్వాలు లేని
జడ భరతుల్లా!!
చూస్తూ ఉండిపోకలా...
4
తేదీ :19/5/2020
కవిత :స్త్రీ శక్తి (3)
రచన :సుంకర శ్రీలత
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆడపిల్ల అనే అస్తిత్వం
తనకు ఆపాదించింది మొదలు, ఎన్నెన్నో పోరాటాలు
మరెన్నో సంఘర్షణలు
ఆమె జీవన పుస్తకం లో
నమోదు చేయబడని
గణాంకాలుగా మిగిలిపోయాయి.
ఆడతనమో,
అమ్మతనమోతప్ప,
ఏ ప్రత్యేకత !లేని వ్యక్తిగా
తృనీకరించబడిన ప్రతీసారీ
ఆమె మనసు
ఘనీభవిస్తూనే వుంది.
ఉత్క్రుష్టమైన ఆలోచనలు,
సున్నితమైన భావోద్వేగాల
నడుమ, ఆడకత్తెర లో
పోకచెక్కలా, ఆమె
ప్రగతి రథచక్రాల కింద
ముద్దముద్దగా నలుగుతూ కూడా, ఎప్పటికప్పుడు
తనను తాను సరికొత్తగా
ఆధునీకరించుకుంటూనే వుంది
ప్రపంచంలోని మేధావులంతా
కలసి, ఎన్ని ఆవిష్కరణలు
చేసినా, భగవంతుడు సృష్టించిన
ఈ విశిష్టశక్తి ముందు
వెల వెల పోవాల్సిందే.
కళావిహీనం కావాల్సిందే.
5
సమయం
తేదీ :20/5/2020
కవిత :కదులుతున్న కాలం (5)
రచన :సుంకర శ్రీలత
🌻🌻🌻🌻🌻🌻🌻
రెప్పపాటు సమయాల్ని
లెక్కకట్టి నీ గుప్పిట్లో బంధిస్తావ్.
బంధాల్ని గుర్తెరగమని
బాధల తిరగలిలో
చకచకా తిప్పేసి
తికమకపెట్టేస్తావ్.
ఆశల కెరటాల్ని
ఒడ్డుకు చేర్చినట్టు
నటిస్తూనే...
అగాధాల అంబుధిలోకి
నెట్టేస్తావ్...
నీవే జాలరివై
జనాల్ని చేపపిల్లల్ని చేసి
ముందరికాళ్లకు బంధాలేస్తావ్.
అంతలోనే
బోధిసత్వుడై !
బంధనాలనుండి
విడివడే
మెళకువసూత్రాల్ని
'బోనస్' లా నేర్పిస్తావ్.
ఇంతేనా ?
కాలమంటే,
ఒట్టి కవ్వింపు చర్యలేనా !!
అని, కునికిపాటు పడుతుంటే
ఈ జాదూగర్ లోకంలో
అసలెవరు, నకిలీలెవరో
పోల్చుకోమంటూ...
'పజిల్ '' విసురుతావ్.
అసలు,
లోపలి మనసులు
పైకి కనపడనిస్తే కదా!
ఈ మనుషులు....
అంటూ - ఆలోచిస్తూ
అయోమయంలో పడిపోతే
అంతరంగ - తరంగధ్వనులే
గీటురాయిగా చేసి
నిఖార్సుగా !!
నిగ్గుతేలిన నిజమిత్రులను
బాసటగా నిలుపుతావ్.
కాలమా !
నీవు క్షణాల్ని హరించే
కాలుడవే కాదు
కరుణను కురిపించే
కృపాళుడవు కూడా !
అని, నిను పొగిడేలోపే
పాతదంతా పోయి
కొత్తదొచ్చే ఢాం.. ఢాం.. ఢాం..
అంటూ కేరింతలు కొట్టి
జనాల్ని చూసి,
వెర్రివెంగళప్పల్లారా !!
మీకు నేనేమిచ్చానో?
మీ నుంచి ఏం తీసుకెళ్తున్నానో? తెలుసట్రా..
అంటూ పరిహాసంతో
పలాయనం సాగిస్తావ్.
కాలం అంటే మార్పే కదా !
అంటూ నీతో పాటే
మేమూ సాగిపోతాం.
తేదీ :21/5/2020
6
కవిత :దిశకు నివాళి (6)
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
జీవనపార్శ్వాల
పక్కటెముకల
కింద నలిగి,
జీవించే హక్కుకై
చేసే పోరాటంలో
ఒక్కసారిగా !
ఆలోచనలు స్తంభించి పోగా
పరమపద సోపానంలో
ఆమె అడుగులు ఆగిపోయాయి.
నమ్మకానికి -అపనమ్మకానికి
మధ్య అయోమయంతో
ఊగిసలాడే !కళ్ళు
ఆసరా కోసం వెదికితే
మోసాన్ని మునిపంటితో
అదిమి, సాయంపేరుతో
నమ్మించి గొంతుకోసిన
మృగాళ్ల అకృత్యాలకు బలై ఆరనిచిచ్చయి ఆమె
ఎగిసిపోయింది.....
హృదయ దౌర్బల్యాలు
మానసిక బలహీనతలు లేని
బలమైన వ్యక్తిత్వపు!! జాడలను
అన్వేషించుకుంటూ....
నకిలీ వేషాలతో
జీవిత రంగస్థలం లో
చిందులేస్తున్న నాగరికులు
ఆదిమవాసుల జెరాక్స్ కాపీలై
విచ్చలవిడిగా తిరుగడుతుంటే
ఏం చేయలేని
నిస్సహాయ నిశీధి నుంచి వెళ్ళిపోయింది.
కిరాయి మనస్తత్వాలతో
అమాయకత్వాన్ని అరువు తెచ్చుకొనే జాదూగాళ్ళ
హృదయాంతరపు
చీకటి పొరలను
చీల్చుకుంటూ ఆమె
వెళ్ళిపోయింది......
చీకటి కావల ఏకాస్త
స్వచ్చతయినా వెలుగై
ప్రకాశిస్తుందనే ఆశ తో!!
నిష్క్రమ నిర్వేదంతోముగిసినా
పునరాగమనం మాత్రం
ప్రచండ కాళియై
దుర్గ యై, నిర్భయయ్, ఝాన్సీయై, రుద్రమయ్
విజృంభించ వీరాంగనై
చట్టాలు చేతపట్టుకొని
వస్తుందదిగో !
కామాంధుల
మదమనిచే 'దిశ 'గా
ఖబడ్ధార్ !! క్రూరుడా..
మదాంధుడ...
ఖబడ్ధార్...
7
కవిత :నేనింతే
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀
ఏంది? భయ్, నీ లొల్లి
వూకూకే అడ్డు తగుల్తావ్.
నా ఇష్టం! నా రాజ్యం !
సప్పుడు కాకుండా వూకో.
కడుపు మండి
నువ్వు వీధిలోకచ్చి
తిరుగుబాటు చేస్తేఏంది?
నీ మాట ఇంటన
నాకు నచ్చితే
గంజాయి మొక్కనైన,
సరే !
నెత్తి లో పెట్టుకుంటా
నచ్చకపోతే తుంగలో
తొక్కేస్తా నేనంతే..
నా ఇష్టం భయ్
అడిగినీకి నువ్వెవరు?
నీ ఎనకాతల ఏమైనా
బలగాలున్నాయా?
ఎక్కువ తక్కువ
మాట్లాడితే
రెక్కలిరిసేస్తా..
పీక నొక్కేస్తా...
గుట్టు చప్పుడు కాకుండా
పక్కోడికి అనుమానం రాకుండా...
గుడ్లు ఒతెస్తా బిడ్డా.. 😡😡
8
కవిత :పెళ్లి నిఘంటువు
రచన :సుంకర శ్రీలత
🌸🌸🌸🌸🌸🌸🌸
శ్రీరస్తు శుభమస్తు అంటూ
శ్రీకారం చుట్టుకున్న వాళ్ళ
"పెళ్ళిపుస్తకం " డెబ్భై
వసంతాలు పూర్తి చేసుకొని
పెళ్లి 'నిఘంటువే 'ఐయ్యింది.
పెళ్లంటే మూడే ముళ్ళు
ఏడే అడుగులు
పప్పన్నాలు
సన్నాయి మేళాలు
చెప్పుకుంటే నిర్వచనం
చిన్నదే ఐనా....
భిన్న వ్యక్తిత్వాలతో
భిన్న అభిరుచులతో
దశాబ్దాలు కలిసి చేసే
జీవనయాత్రను నడిపించే
'సూత్రం ' మాత్రం
ఎటుపడితే అటు ఊగే
గాలిపటం కాదు.
వివాహవ్యవస్థ అనే పెద్ద
వటవృక్షానికి బలంగా
అల్లుకున్న మల్లెతీగ.
పురుషుడునచ్చితేప్రేమిస్తాడు స్త్రీనమ్మితేప్రాణమిస్తుంది.
నచ్చడానికి, నమ్మకానికి
మధ్య వైరుధ్యం,
ఇరువురి మధ్య నున్న
భావోద్వేగాల అంతరం.
అన్నిటిని అధిగమించి
దాంపత్యాన్ని పండించుకోవడమే
వివాహబంధం.
ముడతలు పడిన శరీరాలతో
అనుభవం నిండినమనసులతో
అరిగిన కీళ్లు, ఒంగిన నడుము
మసకబారిన కనుచూపులతో
కడదాకా కలిసి జీవించడమే
జీలకర్ర, బెల్లం పరమార్థమేమో !!
తడబడే అడుగుల్తో పాపాయిల్లా పారాడుతూ
ఒడిదుడుకుల్ని తట్టుకొని
ఆఖరుదాకా ఆసరాగా
నిలబడటమే 'సప్తపది '
భాష్యమేమో !!
అందుకే పండుముత్తయిదువలా
ఆమె వెళ్ళిపోతే,
ఆకాశం లో కనిపించే
నక్షత్రాలలో ఆమెను
వెదుక్కునే వాలంటైన్
ఐయ్యాడు అతడు.
ఒకరికొకరు ఋణానుబంధాలు
అనుకున్నారో ఏమో?
రుణాలు తీరి
నీవేనుకే నేనంటూ
ఒకరివెంట ఒకరు వెళ్లిపోయారు.
ప్రేమంటే అవసరమూ కాదు
ఆకర్షణా కాదు, అన్నిటికీ
అతీతమైన "పవిత్రబంధం "
అంటూ చెప్పకనే చెప్తూ
ఆదర్శ దంపతులైయ్యారు.
(అత్త, మామకు అంకితం )
O9
తేదీ :23/5/2020
కవిత :ధ్యానం (9)
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀
చుట్టూవున్న జనాలందరూ
ఒక్కసారిగా !
పరాయీకరణ చెందారా?
అన్న సందేహం....
ఎందుకొచ్చిందో తెలీదు.
ఇప్పుడిక ఏకాంతంలో
అంతర్ముఖి గా ఉండటమే
బావుందనిపిస్తుంది.
ఎందుకంటే?
నిశ్శబ్దంగా జరిగే
జ్ఞాపకాల తవ్వకంలో
నన్ను - నేను
వెలికి తీసుకొనే ప్రయత్నం
నా అస్తిత్వానికి
సరైన నిర్వచనం !
ఖచ్చితంగా చెబుతుందని
ఆశపడ్డాను.
కానీ,
ఆత్మావలోకనం
ఏమంత ఈజీ కాదు !
ఎందుకంటే?
కొన్ని జన్మల
వాసనాబలాలతో
ముడిపడిన ముద్రలని
కేవలం ! ఈ జన్మతోనే
సరిచూసి
పోల్చుకోవడం ఎలా సాధ్యం !
ఏదో ఒక
భౌతిక చట్రంలో
బంధించాలని చూస్తే
ఊపిరాడక,
ఉక్కిరి - బిక్కిరి
అవుతుంటే
నన్ను - నేను
వెతుక్కుంటున్నాను వెనక్కువెళ్ళి.
ప్రశ్నలన్నీ మౌనవాక్యాలై
ఆలోచనల అలజడిని
అణగార్చి,
మనసుతో హృదయాన్ని
అనుసంధానించే
నిశ్చల యోగమే
సమాధానమై నిలచింది...
10
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత :😷కరోనా అబ్
తుమ్ ఛలోనా 😷
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ఏ మానవ తప్పిదమో
ప్రకృతిని ప్రేరేపించి
కనిపించని శత్రువై
ప్రపంచాన్ని కకావికలం చేస్తూ
మరణమృదంగం వాయిస్తోంది.
కసితీరా! మానవ కళేబరాల్ని
మారణ హోమంలో పడేస్తూ...
రాక్షసమాయను తలపిస్తోంది
ప్రపంచదేశాల తప్పులు
లెక్కకు మించాయేమో?
కృష్ణుని చేతిలో హతమైన
శిశుపాలుల్లా! నేలకొరుగుతున్నారు జనాలు, శవాలై గుట్టలుగా..
దుష్టశిక్షణ - శిష్టరక్షణ కోసం
విధి ఆడుతున్న వింతనాటకం
కాకపోతే !! ఐకమత్యంతో
పోరాడే రోజులు పోయి
ఒక్కరే విడివిడిగా
ఒంటరి గదుల్లో అంతర్మధనంతో
తనతోపాటు నలుగుర్ని
కాపాడుకోవాల్సిన దుస్థితి.
ఈ ఆపద సమయంలో
పెద్దలమాటలే వరాలై
అక్కరకొస్తున్నాయి
కాళ్ళు - చేతులు కడుక్కోకుండా
దూకుడుగా ఇంట్లోకి దూరే
మనవల్ని " ఛీ.. భడవా!!" అంటూ
దుడ్డుకర్ర పుచ్చుకున్న బామ్మలా,
కరోనా వైరస్ ప్రత్యక్షమైంది !!
పబ్బులు - క్లబ్బులు అంటూ
విచ్చలవిడిగా తిరిగే మందుబాబులు ఇంట్లో
మూసుక్కూర్చునేలా
మాడు పగలగొట్టే మహమ్మారై !
విజృంబించింది.
అడ్డు - అదుపు లేకుండా
ప్రకృతిలో కనపడ్డ
జీవరాసినల్లా పొట్టన పెట్టుకునే
పాపాత్ముల 'కీలెరిగి వాతలు '
పెడ్తున్నట్టే ఉంది.
పైకి 'ఉపద్రవం'లా కనపడుతూనే
మానవాళికి ఎన్నో గుణపాఠాలు
నేర్పడానికి 'కరోనా' పేరు పెట్టుకువచ్చిన పంతులమ్మా.. !
ఇక చాలు నీ దండనలు
పచ్చాత్తాపంతో జనాలు
ప్రాయశ్చిత్తాలు చేసుకుంటున్నారు
' కరోనా అబ్ తుమ్ ఛలోనా '
ప్లీజ్.............
11.
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత :ఆశా కిరణాలు (11)
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀
నిన్న నేటికి గతం కావొచ్చు
నేడు చేస్తున్న యుద్ధం
రేపటి చేదు
జ్ఞాపకంగా! మిగలొచ్చు....
తప్పొప్పులెంచుకునే
సమయం మించిపోయింది.
నేటి చావు లెక్కలే కాదు,
రేపు !బతకడానికి కావాల్సిన
ఆహారపు లెక్కల సూచీలూ
'బూచీలై' భయపెడుతున్నాయి.
కష్టకాలం లోనే కదా !మనం
నిబ్బరం తో నిగ్గుతేలాల్సింది.
దూరమైనపుడే కదా దగ్గరకు
చేరే దారులు వెదుక్కొనేది.
చీకటి కమ్మినపుడే కదా
ఐక్యతా దీపాలు వెలిగించేది.
సంకెళ్లు పడ్డప్పుడే కదా
స్వేచ్చవిలువ తెలిసేది.
ఐనా !ఇది
పశ్చాత్తాప పడుతూనే..
ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సందర్భం.
ఏ సమాజానికైనా కుటుంబాలే
కదా!పునాదిరాళ్ళు.
అందుకే రేపటిఅవసరాలకు
తగ్గట్టుగా పిల్లల్ని
మలచడానికి అనువుగా
దొరికిన వరంగా!
ఈ సమయాల్ని స్వీకరిద్దాం.
ఆపదలో ఆపద్భాందవులై
భరతమాత సేవలో ముందున్న
మన 'మినాల్ భోన్స్లే' కృషిని
రతన్ టాటా 'త్యాగనిరతిని '
వైద్యుల కర్తవ్య దీక్షని
పోలీసుల తెగువని
వైరస్ ను ఊడ్చి పారేస్తున్న
పారిశుద్ధ కార్మికుల సేవల్ని
కథలు - కథలుగా చెప్పి
పిల్లల్లో దేశభక్తిని రగిలిద్దాం.
అసలు సిసలైన
ఆచార -వ్యవహారాల
స్పృహను కలిగిద్దాం.
రాబోయే రోజుల్లో
ఇలాంటి విపత్తులు
పునరావృతం కాకుండా
నిన్నటి సామజిక
తప్పిదాల నుండి...
గుణపాఠాల్ని నేర్పుదాం.
ఎందుకంటే?
పిల్లలే కదా....
మన ఆశాకిరణాలు.
12.
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత(12):స్నేహం
రచన :సుంకర శ్రీలత
🌹🌹🌹🌹🌹🌹
ఏడాది క్రితం జరిగిన
వీడ్కోలు సభను
ఎంత బలవంతంగా
ముగించాల్సి వచ్చిందో!
మీకు గుర్తుందా?
పొంగుకొచ్చిన దుఃఖం
గద్గద స్వరాలతో
పూడుకుపోయిన గొంతుకలతో
భావాలు బయటకు రాక
ఇబ్బంది పడ్డారు కదా!
అందర్నీ వదిలి వెళ్ళ లేనంత
అనుబంధం ఎక్కడిది?
జీవితం మలి దశలోనూ
ఇంత భావోద్వేగమా!!
అని ఆలోచించాను.
యాంత్రిక జీవనం తాలూకు
నిర్లిప్తతో!
న్యూక్లీయర్ ఫామిలీస్ లోని
ఏకాకితనమో!
పిల్లలు పెరిగి పెద్దవాళ్లయి
రెక్కలు కట్టుకుని విదేశాలకు
ఎగిరి పోతే,
తల్లిగూడు ఖాళీఅయిన
నిశ్శబ్దమో!
గుండెగూటిలో సందుచేసుకొని
మెలిపెట్టినప్పుడు,
స్నేహాలే కుటుంబాలయి
ఆత్మీయతను పంచుకుంటూ
ఓకేగూటి పక్షులై
ప్రతి సమస్యకు ,పలు సమాధానాలు వెదికి పెట్టి
ఒత్తిడిని తరిమికొట్టి
పనిచేసే ఉత్సాహాన్ని
అందిపుచ్చుకున్నాం.
మరి?ఇంత 'గూడు'చెదిరి
భూమి గుండ్రం అన్నట్టు
ప్రత్యక్ష పలకరింపులు పోయి
సద్దిపెట్టలోని మెసేజ్ లకే
స్నేహాలు........... పరిమితమైపోతాయనే ఆలోచనే,అంత మందిని
కుదిపేసి పొగిలి పొగిలి
ఏడ్చేలా చేసిందా?
అందుకే!!
వలస పక్షుల్లా మీరు
ఎగిరిపోయినా.....
తిరునాళ్ళలో తప్పిపోయినi
'పిల్లాడి'లా మిమ్మల్ని
వెదుక్కుంటూనే ఉన్నాను.
ఇదే కదా స్నేహమంటే....
13
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత :లయ (13)
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀
సృష్టి లో ప్రతి దానికీ
ఓ, లయ ఉందనేదే
నిజమైతే !నా అక్షరాలకు
కూడా లయ ఉండాలి కదా !
హృదయం స్పందించిన
ప్రతిసారి మేల్కొనే నా
ఆలోచనలకు ఊపిరి, ఈ
అక్షరాలే మరి !
పక్షుల రెక్కల టపటపలు
గాలి చప్పుడు తో
పోటీపడి, ఆకుల
మాటున దాగిన
అనంత నిశ్శబ్దాన్ని ఛేదించినట్టు, గుండెలో
అలికిడి మొదలై
అలా అక్షరాల్లోకి దూసుకెళ్లి
ఎలా అంతమౌతుందో?
నాకే తెలీదు.
14
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (14):ఆకాశం లో సగం
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఎవరి చేత్తోనో రాయబడ్డ పుస్తకమైంది !
నా జీవితం, అని
ఇప్పుడిపుడే, ఎరుకలోకి వస్తోంది.
ఇన్నాళ్లు... నాకే తెలీలేదు,
నేనొక బందీనని.
నా ఆలోచనలు, ఉద్వేగాలు
అన్నీ బట్వాడా చేయబడ్డ
బానిస భావాలని,
ఇప్పుడిపుడే.. గ్రహింపులోకి వస్తోంది.
ఇరవై ఏళ్ళు, వెనక్కుపోతే!
ఆ 'నేను' కి , ఇప్పటి 'నేను' కి
మధ్య ఎంత! తేడా?
వర్షానికి రాలిన
పున్నాగ పూల సౌరభం,
వసంతంలో, కోయిల కూతల అనుకరణ!
నల్లని మేఘం - సాయంసంధ్యా
అన్నీ కవితావస్తువులై
పుస్తకం నిండా పరుచుకునేవి.
'స్వేచ్ఛ' గురించి ఎన్నెన్నిచర్చలు?
ఆ భావాలన్నీ ఏమయ్యాయి?
బంధాలు - బాధ్యతలు
వైరల్ ఫీవేరయ్యి పీల్చేసాయా?
'ఉద్యోగం' స్త్రీ ని మరింత
బలోపేతం చేస్తుందనుకున్నా, కానీ,
ఆ 'ఊబి'లో కూరుకుపోయి
ఒత్తిడిలో, ఒత్తిగిలిపోతాననుకోలేదు.
'ఆర్థిక స్వేచ్ఛ' అసలా పదం లొనే ఏదో అబధ్ధముంది.
ఎందుకంటే, అది కేవలం
జీవన్మరణానికి మధ్యనున్న
సన్నని 'ఆసరా' మాత్రమేనని
అపుడపుడనిపిస్తూ వుంటుంది.
స్వేచ్ఛ - ఆర్థిక స్వావలంబన
అనే పదాలు పట్టుకుని
జీవితంలో ఏదో పొడిచేయలనే
పంతంతో ప్రయాణం
మొదలుపెట్టిన 'నేను'
పురుషాధిక్య సమాజ 'ముసుగు'లో
భద్రంగా దాచబడిన
'బానిస'లాగా, తిరోగమించిన
క్రమమే నాకు విచిత్రంగావుంది.
అనాదినుంచి మా జాతికిది
అలవాటే మరి!
ముళ్లబాట మీద
కాసినిపూలు పరిచి, సర్దబోతే
మటుకు! కిందనున్న ముళ్ళు
గుచ్చుకోవడం మానేస్తాయా?
సామాజిక భద్రత లోని డొల్లతనం,
'ఆకాశం లో సగం' సృష్టిలోని
ఓ ఇంద్రజాలం!
ఈ భ్రమలు, భ్రాంతులతో
నన్ను , నేను తర్కించుకుంటే
మిగిలే శేషమే
నా వునికని తేలింది.
అందుకే , నన్ను - నేను కొత్తగా!
నిర్వచించుకునే అవసరమొచ్చింది.
15
[03/06, 1:35 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (15):ప్రేమ
రచన :సుంకర శ్రీలత
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఎప్పటికెప్పుడు నిన్ను
చూడాలనే ఉంటుంది నాకు
ఎందుకో !తెలీదు....
ఎదురుగ లేని నిన్ను
వున్నట్టే ఊహించుకొని
ఏవేవో !ఊసులాడుకుంటాను
నాలో నేనే...
వినీవినిపించనట్టు
'పిచ్చిదానా 'అంటూ
నా చెవిలో ఏదో
రహస్యం !!
ఊది ఊరకుండి పోతుంది
నీ జ్ఞాపకం.
సరిగా అపుడే
"ప్రేమ "గురించి ఏదో,
రాయాలని పోతానా?
ఊహు, రాదు...
గొంతులో అడ్డం పడి
గిజగిజ లాడుతూ
తిరిగి గుండెలోనే
గూడు కట్టుకుంటుంది.
అంతవరకు ఉత్సాహంగా
వున్న కాగితం,
ఏమీ రాయలేని
నా ఆసక్తతను! గాలితో
జతకూడి రెపరెపలాడుతూ
తన నిరసనను అలా
వ్యక్తపరుస్తుంది....
16
[03/06, 1:35 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత(16) :పంతులమ్మ
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ఆమె ఉరుకుల పరుగుల జీవితం, విశ్రాంతి ఉపాధ్యాయురాలిగా
విరామం తీసుకుంటోంది.
మడిమలు, మోకాళ్ళ నొప్పులతో అలసిన దేహం
ఇక నడవనని మొండికేసింది.
ఇంట్లో పిల్లల్ని, బడిలో పిల్లల్ని
కనుసైగలతో కట్టడి చేయగల
సత్త వున్న ఆమె, ఇపుడు
నాలుగు గోడల'గది 'కే
పరిమితమైపోయింది.
కాట్రాక్టుఆపరేషన్ లు
దృష్టి దోషాలు బాధిస్తున్న
జీవనపార్శ్వాలను
ఎప్పటికప్పుడు కొత్తకోణం
లోంచి చూస్తున్న
'ద్రష్ట' ఆమె!
బ్లాక్ బోర్డు మీద
చక చకా లెక్కలు రాసిన
చేతులు, ఇపుడు
రామకోటి పుస్తకాలను
టక టకా నింపేస్తున్నాయ్.
శిష్యుల శిక్షణ కు
పనికొచ్చిన కథలు ఇపుడు
వ్యక్తిత్వ వికాస సూత్రాలుగా
మనవళ్లకు మానమరాళ్ళకు
బోధిస్తుంటే, ఎవరనగలరు?
ఆమె రిటైరైయ్యిందని.
పిల్లలకు ఇల్లే మొదటి పాఠశాల
ఆమ్మే మెదటి పంతులమ్మ.
17
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (17):శుద్ధి
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
జీవితం సంక్షోభంలో
పడ్డ ప్రతీసారి....
నాలోనిసంవేదన
సంఘర్షణగా మారి,
సంధిగ్ధావస్థలో
కొట్టుమిట్టాడుతునప్పుడు
ఊబిలో కూరుకుపోతున్న
ఓ 'మూగజీవినై' పోతాను.
ప్రవచనాలో, పుస్తకాలో
లేక, చైతన్య గీతాలో
ఏవైతేనేం?
బలమైన తాడులా పెనవేసుకుని
నన్ను బయటికి నెట్టినపుడు
సుఖంలోని ఆనందంకంటే
బాధలోని ఆలోచనల 'తళుకు'
నన్ను అబ్బురపరుస్తుంది.
ఇప్పటిదాకా పేరుకుపోయిన
ఘటనాఘటనల గోడలని
చీల్చుతూ చేసే
స్వీయపరిశీలన
మనోవికల్పాలన్నిటిని
కన్నీటిధారలతో
స్వఛ్ఛంగా తుడిచి
ఆరబెట్టినపుడు జరిగిన
చిత్తశుద్ధితో,
జీవన తత్వాన్ని శోధించే
అన్వేషణతో !!
ప్రవాహమై సాగిపోతాను
18
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (17):అనుభూతి
రచన :సుంకర శ్రీలత
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మూసిన కనురెప్పల మధ్యనుంచి జారిపోతున్న
కన్నీరు కాలువై
నీ ఆలోచనలను
నా జ్ఞాపకాల మంజూషలో
భద్రపరుచుకొనే యత్నం
ఓ యగ్నమై !!
కోరికల సుడిగుండం లోకి
ఇంకి పోతుంటే, నీ
చల్లని ఒడిలో
సేదతీరుతున్నాను.
అపార్థాలు -అపోహలు
అన్నీ మన మధ్య
దగ్ధమౌతుంటే
తడిచిన నీ
కళ్ళల్లో నా రూపం
చూసుకుంటున్న క్షణం లో
నా రెప్పల కదలికల
మాటునుంచి
జలజల రాలే కన్నీరు
నీ ప్రేమ !!
గుప్పిట్లో ఇంకిపోతుంటే
పంచుకుంటున్న
అనుభూతి
మన ఇద్దరిదీను కదా !
19
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (18):కలబోత
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
గుణాత్మక ప్రాతిపదికగా
గుర్తుపెట్టుకున్న
స్నేహాలన్నిటినీ ఒకచోట
ఏర్చి కూర్చితే
వసుధైక కుటుంబానికి
నమూనాగా!! ప్రత్యక్షమైయ్యాయేమో
కబుర్లన్నీ కలబోసుకుంటుంటే
కాలం పరిగెత్తినట్టయింది.
కల్తీ పదార్థాలు తింటూ
రక్తసంబందాల్ని కూడా
కలుషితం చేస్తున్న నేపథ్యం లో
బాల్యమిత్రులంత స్వచ్ఛమైన
బంధాలన్నీ ఒక్కసారిగా
తారసపడితే,
గుక్కపట్టి ఏడుస్తున్న
పిల్లవాణ్ణి,
తల్లి చంక నెత్తుకుని
లాలించించినంత గొప్ప
ఊరడింపు కలగక మానదు.
ఏమిటి లోకం? అన్న ప్రశ్నకు
తాలింపు పెట్టన వాసన
గుభాలిస్తోంది.
అందుకే,
మంచి అనుబంధాల్ని
గెట్ టూ గెథెర్ అని
అపుడపుడు ఆహ్వానించుకుందాము.
ఇంకా మనం మనుషుల
మధ్యే బతుకుతున్నాం
అని భుజం తట్టి
ప్రోత్సహించుకుందాం.
20
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (20):అమ్మకు ప్రేమతో
రచన :సుంకర శ్రీలత
💐💐💐💐💐💐💐💐
అమ్మా !నీ పుట్టినరోజు కదా, ఏదయినా రాద్దామనుకుంటే
ఏం తోచడం! లేదు, ఎందుకని?
చెదిరిన వర్ణమాలలో
అచ్చులేవో హల్లులేవో
గుర్తుపట్టలేనంత
గజిబిజీ గా జీవితం !
వొత్తులేవో, గుణింతాలేవో
తెలియని,బాల్యం !తాలూకు
కన్ఫ్యూషన్ మళ్ళీ మొదలైనట్టుంది.
అమ్మ గురించి ఎవరెన్ని
ఉపమానాలు చెప్పినా
నాకు మాత్రం నువ్వు
'ధైర్యం విసిరిన రాకెట్టే '
అమ్మా !
చిన్నప్పటినుంచి నువ్వు
నా బుర్రకు ఎక్కించిన
"సత్యం మాట్లాడు,
ధర్మంగా నడుచుకో " అన్న
ఈ రెండు మాటలు
సామాన్య వాక్యాలుగా
కనిపిస్తున్నా, ఇపుడిపుడే
వాటి లోని సంక్లిష్టత తెలుస్తోంది.
నన్ను ఈ సమాజం లోకి
పంపేటప్పుడు కాస్తంత
'లౌక్యం 'నేర్పుంటే
ఎంత బావుండేది !
ఇపుడు అరువు తెచ్చుకున్నా
మాటలకు అంటుకోవట్లేదు.
ఏదేమైనా నీ నుంచి
అనువంశికంగా వచ్చిన
ఆధ్యాత్మిక సంపద మాత్రం
నాకు కొండంత అండగా
నిలబడి వెన్ను తట్టి
ప్రోత్సహిస్తుంటుంది.
ఇంతకంటే పిల్లలకు
ఇవ్వాల్సిన నిధులేముంటాయ్.
21
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (21):ఉనికి
రచన :సుంకర శ్రీలత
దేవా !త్రిగుణాతీతుడైన
నిన్ను నేనెలా స్తుతించను?
జీవేశ్వరా !!
జీవిగా ఆవిర్భవించింది
మొదలు నా జీవితాన్ని
నడిపిస్తూ.. శాసిస్తూ..
నీడలా వెంటాడుతూ వుండే
నిన్ను నేనెలా చూసేది?
నాలోని నిన్ను కనుగొనేదెలా?
సత్య బోధ, ఆత్మ సాక్షాత్కారం
ఈ పదాలేవీ !
నాకు తెలీదు.
నాకు కావాల్సింది
కేవలం !
నీవు నాతో వున్న 'ఉనికి '
అంతే !ప్రభు...
22
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (22):స్నేహం
రచన :సుంకర శ్రీలత
🌻🌻🌻🌻🌻🌻
భావాల్ని పంచుకోవడం అంటే
'ఆత్మను'ఆవిష్కరించుకోవడమే
ఉత్తమ సంస్కారాలు
వున్న చోటే అది సాధ్యం.
లేకపోతే ఒట్టి
గాలి కబుర్లై
తేలిపోతాయ్...
ఒకరి అంతరంగాన్ని
మరొకరు ఒడిసి
పట్టుకోవడం అంటే
కాలాలకు అవతల
కంటికికనిపించనంత మేరా
ఆలోచించ గలగడమే.
హృదయం ఎంతో
విశాలమైతే తప్ప
ప్రయత్నం నిరర్థకం.
అందుకే !
చావు, పుటుకలే కాదు
స్నేహాలు కూడా..
స్వర్గం లోనే నిర్ణయం
అవుతాయేమో?
ఆపదలు చుట్టుముట్టినపుడు
స్నేహితులే.....
ఏంజెల్స్! అయి
అవతరిస్తారు.
ఒంటరి ఎడారుల్లో
ఓదార్పు సెలయేరులై
ప్రవహిస్తారు.......
23
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (23):మరియమ్మ
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
భూమ్మీద పడగానే అందరిలాగే
అమ్మను వెతుక్కుంది
చిన్నారి మరియ
ఆమె ఈ లోకం లోకి
ఎప్పటికీ రాదని తెలిసితానే నాన్నకు అమ్మయింది.
పదేళ్ల తర్వాత
ఈ మధ్యే నాన్న
'కొత్తమ్మను'తెచ్చాడు.
ఐనా ! తానే కూరలొండాలి
ఎందుకంటే? ఆమెకు
కూరలు రావు మరి.
అలా !మన మరియమ్మ
ఇంటికి పెద్ద దిక్కై
నాన్నకు అమ్మయి
అమ్మకు అత్తయి
అన్నం వండి
వడి వడి గా
అడుగులు వేస్తూ
గంట కొట్టేలోపు
బడికి చేరాలని
పరుగులు తీసేసరికి
చిరిగినా సంచీ లోంచి
పుస్తకాలు బోర్లాపడి
వెక్కిరించాయి....
ఆలస్యమైతే బెత్తం దెబ్బలు
గుర్తొచ్చాయేమో మరి?
టక టక పుస్తకాలని
సంచిలో ఎత్తి కుదేసి
చంటి పిల్లల్లే చంక నెత్తుకొని
చక చకా అడుగులేస్తూ
బడివైపుకే పరుగుతీస్తోంది
మరియమ్మ....
చదువులమ్మ కావాలని....
24
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (24):మనసే కదాని...
రచన :సుంకర శ్రీలత
🌹🌹🌹🌹🌹🌹🌹
మనసే కదాని
మాయ చేయబోతే
మూసుకొని ఉండటానికి
అదేమన్నా !
కవాటాలతో పనిచేసే
హృదయమా?
సంకల్ప వికల్పాలతో
ఎగిసి పడే
సాగర కెరటమైతేను.
భావావేశం కమ్మినపుడు
మనసొక భావగీతమై
కృష్ణశాస్త్రి ఎదుట
నిలబెడుతుంది.
ప్రేమ పొంగినపుడు
బాలు గొంతుకతో
ప్రణయ గీతమై
ఆలపిస్తుంది.
దానికి లొంగదీసుకోవడమే
తెలుసు, లొంగివుండటం
అస్సలు గిట్టదు. లోకువ చేస్తే అలిగి కూచుంటుంది.
మెచ్చుకోలుగానవ్వితే చాలు
అసాధ్యాలను సుసాధ్యాలుగా
చేయడానికి 'ఉప్పెనై '
వురుకుతుంది.
పాపం !మనసు
దానిది' పసిదాని 'తత్వం
బాధైనా, సంతోషమైన
అందులో ఇమిడిపోవడమే
దానికి తెలుసు.
గ్రహణం పట్టిన ముసుగులో
తన్ను తాను
కుంగదీసుకుంటుంది.
కలత చెందితే
కన్నీరై చిందుతుంది.
కాస్త ఆలంబన దొరికితే
ఎవరెస్టైన !ఎగబాకేస్తుంది.
పసిఫిక్ !నైనా ఈదేస్తుంది.
25
సమూహం :వీరాస్
కవిసమయం
కవిత(25):జ్ఞాపకాలు
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
కొన్ని జ్ఞాపకాలు
తెరమరుగవగానే
మాయమైపోతాయి.
కొన్ని జ్ఞాపకాలు
అతిథి లా వచ్చే
పిల్ల వాయువులై
పలకరించి
పోతుంటాయి.
కొన్ని జ్ఞాపకాలు
ఆలోచనల వేడికి
ఆవిరైపోతుంటాయి.
కాని.. కాని...
కొన్ని జ్ఞాపకాలు మాత్రం
నీడల ముడులై !
ఎప్పుడూ..
అంటిపెట్టుకొని
అనుభవాల
సందడి చేస్తాయ్.
మరి కొన్ని
జ్ఞాపకాలు
వర్షం ఆగాక
కదిపిన
చెట్టుకొమ్మల్నుంచి
రాలే! చినుకుల్లాంటి
అనుభూతులుగా
మారిపోతాయి....
ప్రకృతి లో
మారే ఋతువులతో
జ్ఞాపకాలు గానీ
పోటీ పడుతున్నాయా?
26
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (26):లేడీస్ స్టాఫ్ రూమ్
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
గోడలు బీటలు బారిన
ఐక్యత ఎక్కడా చీలలేదు
ఎలుకలు పారాడినా..
రూఫులు లీకై
జలాభిషేకాలు జరిగినా..
పురాతన ప్రదర్శనశాలను
తలపించినా...
ఏదయినా గానీ..
మా స్టాఫ్ రూమ్ !
మాకు 'మాత్రమే 'ప్రత్యేకం.
ఎందుకంటే?
అదో !విజ్ఞాన ఖని
చర్చా గోష్ఠుల
ప్రతిధ్వని !
విందు, వినోదాల
హాస్యవల్లరి !
వివేక, విచక్షణాల
జ్ఞానఝరి !
సలహాలు, సూచనల
ఓ !మినీ
గూగుల్ తల్లి..
అనురాగాల
కల్పవల్లి...
(2018 లో జరిగిన ట్రాన్స్ఫర్స్ లో ఒక్కసారిగా 13మంది లేడీటీచర్స్ బదిలీ ఐన సందర్బంగా వాళ్లకు అంకితమిచ్చిన కవిత )
27
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (27):ప్రదక్షిణ
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
చిత్తం నీ మీదకు మళ్లించి
పరుగు పరుగున
నీ 'గుడి 'చేరి
నీ నామ సంకీర్తన తో
'గిరిప్రదక్షిణ 'చేస్తూవుంటే
ఎంతకీ? తెమలదేం,
అరుణాచలేశ్వరా !
అనంతుడైన నిన్ను
చుట్టాలనుకోవడం
నా వెర్రి భ్రమేనా?
ఐనా, ఏ ప్రయత్నమైనా
అనంత కరుణా సాగరాలైన
నీ నయనాలలో
రెప్పపాటుకాలమైనా
మునకలు వేయాలనే
పిచ్చి ఆశ !
అంతే.. ప్రభు..
28
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత :(28): "ఆర్తి "
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
దేవా !
మబ్బుల
ముసుగేసిన ఆకాశం
సన్నగా...
మూలుగుతున్నట్టున్న
ముసురు!
నాలోని,
'ఆర్తిని 'మూగగా
తడిమింది కాబోలు!
ఎన్నో జన్మల
మన ఎడబాటువల్ల
కుంగిన ఆత్మగోషకు
కంటినిండా కారుతున్న
కన్నీటి ధారలతడి
హోరున కురుస్తున్న
వానజడి తో
సారూప్యం చెందగా
వీస్తున్న
వాయుసమీరాలు
నీ సామీప్యాన్ని
తలపిస్తూ... కాస్తంత
ఓదార్పు నిస్తున్నాయ్
ప్రభు.....
29
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (29): బతకడమే గెలుపు
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ఎవరన్నా !
ఎపుడైనా కలగన్నారా?
గెలుపు పదానికి
కొత్తర్థం పుట్టుకొచ్చేంతగా
ప్రపంచ మాయాబజార్ లో
ఓ !అదృశ్య హంతకి
హల్చల్ చేస్తుందని.
ఇన్నాళ్లూ భూమికి
తామే హక్కుదార్లమని
గింజుకున్నోళ్ల మూతికి
మాస్కులు కట్టి
'నన్నేం చేయలేవురా'
అంటూ ఛాలెంజ్ విసిరి
చెంగు చెంగు మని
నలు దిక్కుల్ని
ఆక్రమిస్తుందని.
మార్పుని స్వాగతించే జీవులే
పరిణామక్రమంలో
బతికి బట్టకడతారంటారు.
తప్పదిక మనం
ప్రతి క్షణం అప్రమత్తమై
మన జీవన శైలిని
మార్చుకుంటూ
శత్రువుతో పోరాడే
సత్తువ !పెంచుకోవాల్సిందే.
ఎందుకంటే? ఈ
మారణ హోమం లో
మనకి మనం మిగిలుండటమే
మహాద్భుత విజయం !
అవును,
అనంత సృష్టిలో
బతకడానికి మించిన
గెలుపేముంది.
30
సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (30):వందనాలువీరుడా!
రచన :సుంకర శ్రీలత
🙏🙏🙏🙏🙏🙏🙏
యావత్ భారత మంతా
కనిపించని రక్కసి నుంచి
స్వీయ రక్షణ కోసం
మాస్క్ లు, శానిటైసర్ల తో
సహ వాసం చేస్తుంటే,
అక్కడ దేశ సరిహద్దుల్లో
ఎముకలు కొరికే చలిలో
135కోట్ల భారతీయుల
రక్షణ కోసం శత్రువు తో
తలపడి నేలకొరిగిన
వీర జవాన్ల త్యాగానికి
వేల వేల వందనాలు !
తెలుగు తేజమై
తల్లులందరి ముద్దుబిడ్డవై
డ్రాగన్ పిరికిచర్యల
వెన్నుపోటుకు బలైన
వీరుడా !
కల్నల్ సంతోష్ నీకు
వేల వేల వందనాలు .
నీ తల్లి వీరమాత
నీ పత్ని వీరపత్ని
దేశమాత మెత్తటి
పాదాల చెంతకు
వీరపుష్పమై సగర్వన్గా
చేరిన సంతోష్
నీ స్ఫూర్తి గాథ
దేశచరిత్రలో సదా..
అమర్ రహే !అమర్ రహే !
31
[18/06, 9:55 AM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (31):సైనికుడు
రచన :సుంకర శ్రీలత
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
స్వార్థపరుల కమురు వాసన
పీలుస్తూ బతికే జనాలకు
ఒక్కసారిగా వీరజవాన్ల
నిస్వార్థపు పూలపరిమళం
దేశభక్తి మత్తు ఎక్కిచింది.
డాలర్లమోజును మెదళ్లకెక్కిస్తూ
పిల్లల్ని పెంచుతున్న తల్లులకు
ఒక్కగానొక్కకొడుకుని
దేశంకోసంఅర్పణచేసిన
వీరమాత మంజుల త్యాగం అర్థమైతే బావుణ్ణు....
రాజకీయ వారసత్వం కోసం
పాకులాడడం కాదు దేశభక్తి
పుణికి పుచ్చుకున్న పద్మ పాణి
లక్ష్మణ్, సంతోష్ లాంటి వీరుల
త్యాగాన్నిఅందిపుచ్చుకోవాలనే
ఆలోచన వస్తే బావుణ్ణు
ఏ నాయకునికైనా.....
విధిగా తమ కొడుకులను
సైన్యంలో చేర్చాలని ఆర్డినెన్స్
తెస్తే బావుణ్ణు దమ్మున్న
ఏ నాయకుడైన......
కుళ్ళు, మోసపు ఎత్తుగడలతో
ఏపుగా పెరిగిన కొడుకులకంటే
నీ రక్షణకు నేనున్నానమ్మా
అని బలిదానాలకు సిద్ధపడిన
వీరజవాన్లను చూసి మురిసిన
తల్లి భారతి! తన మువ్వెన్నల
పతాక రెపరెపలకింద
ముద్దుబిడ్డలుగా.... పొదువుకుంటుంది.
జోహార్ !వీర సైనికా...
నీకు జోహార్.....
32
[18/06, 9:55 AM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (32) :" భరతమాత
పిలుస్తోంది "
రచన : శ్రీలత సుంకర
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
జెండాపండుగ వొచ్చింది
ఉత్సవాలు షరా మాములే
నాలుగు పాటలు
రెండు డాన్స్లు
మూడు స్పీచులు
చేతిలో చాక్ల్ట్స్
ఇదే నేడు
స్వాతంత్ర దినోత్సవమైనా
గణతంత్ర దినోత్సవమైనా
పిల్లలలకున్న అభిప్రాయం.
జెండా ఎగరేసి
జైహింద్ అని
మూడు సార్లు అనడం
మహా ఐతే
స్వాతంత్రోద్యమకారుల గురించి, ఓ
పది నిమిషాలు స్పీచ్
బస్ ఐపోయింది మన భాద్యత
భరతమాత బిడ్డలుగా.
మరి? ఇంతేనా !!
ఎవరో కష్టపడి సాధించిన
అమృత ఫలాలను
ఆబగా ఆస్వాదించడం.
దేశం ఇంకా ఏమిస్తుందని
ఆశగా ఎదురుచూడడం.
ఇంతకు మించి మనమేమీ చేయలేమా?
మన చుట్టూరా వున్న
జీవితాలని, పరిసరాల్ని
పరిశీలించి అందులోని
అభద్రతను, అన్యాయాన్ని
ప్రశ్నించడం పొరపాటని
స్పృహ లో వున్నాం.
ఎవరెట్టా పోతే నాకేం
అని నిండా ముసుగు తన్ని
నిద్రపోతున్నాం.
అందుకే భరతమాత పిలుస్తోంది రా రమ్మని...
సరైన వీరులకోసం
హంగు, ఆర్భాటాలకు
అతీతంగా అంతహ్హ్శుద్ది తో
తనను ఆరాధించే
నిజమైన దేశభక్తులకోసం
భరతమాత కలవరిస్తోంది.
భావదాస్యం లేని
బలమైన వ్యక్తుల కోసం
అన్వేషిస్తోంది.
సాటి సోదరుల్ని అణగదొక్కి
అందలమెక్కాలనే
చెదపురుగులని పారదోలే
పెస్టిసైడ్స్ గా ఎదగమని
ఎలుగెత్తి పిలుస్తోంది.
స్పష్టమైన ఆలోచనలతో
ముందుకు సాగే
మేధావులకోసం
మరి మరి పిలుస్తోంది.
నిస్వార్థంగా పనిచేసే
కర్మవీరులకోసం
కన్నులు కాయలు కాసేలా
ఎదురుచూస్తోంది.
ఇప్పుడు మనం
దేశం కోసం ప్రాణాలు
అర్పించక్కరలేదు
ఆత్మసాక్షి గా పనిచేస్తే చాలు.
33
[19/06, 6:10 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (33): పసి మొగ్గలు
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఒరేయ్ !చిన్ని నాన్నలు
జీవిత పరమార్థం ఏం?
అర్థమైందని ఇలా...
అర్ధాంతరంగా వెళ్లిపోతున్నారు.
నిన్న మొన్నటి మీ
బుడిబుడి నడకలకు
ముద్దు ముద్దు మాటలకూ
అమ్మ నాన్నలెంత
మురిసారో కదా !
వాళ్ళ ఆశల్నలా
కుప్పకూల్చేసి
ఎదగడం లోని మెళకువల్ని
నేర్చుకోకుండానే నింగికెగసి
పోవాలనే మీ ప్రయత్నం
ఏమైనా బావుందా?
నిన్ను ఈ ప్రపంచానికి
పరిచయం చేయటానికి
అమ్మ ఎన్నినొప్పులు తిన్నదో
నిన్ను పెంచడానికి నాన్న
ఎన్ని తిప్పలు పడ్డాడో కదా !
మీ కవేవీ గుర్తుకు రాలేదా?
తెలిసీ తెలియని అజ్ఞానంతో
తెగించి ప్రాణాలను తీసికునే
హక్కును మీకెవరిచ్చారు?
జీవితంలోని కల్లోలాల
అగాధాల అంచులసలే
తాకనేలేదే? రంగుల
ప్రపంచంలోని వర్ణాలసలే
చూడనేలేదే? విజయాల్ని
సాధించే అందమైన
అనుభూతుల్ని అందుకొనలేదే?
అప్పుడేఏంమునిగిపోయిందని
ఇలా మొగ్గల్లారాలిపోతున్నారు
అనంత విశ్వంలో భూగోళమే
చిన్నదిరా చిన్నా......
అందులో మనమెంత?
మన కష్టమెంత?
దేహం జ్ఞాన జ్యోతులు
వెలిగించుకోవడానికి
దేవుడిచ్చిన వరం.
దాని విలువ తెలుసుకోకుండా
అలా కాలదన్ని పోవడం
ఎంత తప్పో తెలుసా?
వద్దు నాన్నా... వద్దు
కోరి కోరి చావు జోలికి
వెళ్ళోద్దురా చిన్నా....
(విద్యార్థుల ఆత్మహత్యలు చూసి హృదయం ద్రవించి... )
34
[19/06, 6:11 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (34): కవి
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
లోకం లో కనిపించే బాధంతా
తనదే అనుకుని నలుగుతూ
వేదనా భరితమైన ఆలోచనల
నుంచి చిక్కని !కవిత్వాన్ని
ఒలకపోస్తాడు కవి.
అనుభూతులను తన
హృదయం తో మండించి
అభివ్యక్తి 'డికాక్షన్ '
మన ముందుంచుతాడు
కవి !ఆస్వాదించమని.
చదివిందల్లా పుస్తకం కాదు
రాసిందల్లా కవిత్వం కాదు
పొమ్మంటాడు అతడు.
అన్యాయానికి తన కలాన్ని
అడ్డేస్తూ మనిషికి మరో మనిషి
ఇచ్చే నైతిక మద్దతే...
కవిత్వమంటాడు కవి.
కళ్ళ ముందు ప్రపంచం
అందంగా వుండాలని
ఆశ పడే అమాయకుడు కవి.
కవిత్వీకరించడమంటే
పురిటిగదిలో చంటి బిడ్డను
అక్కున చేర్చుకోవడం లాంటిదే
అంటాడు అమ్మతనంతో కవి.
భాస్కరుడిలా మండుతూ
నిశి శశి ల మధ్య
చల్లబడుతూ....
లౌకికానందాన్ని కోరుకొనే
అలౌకికుడు మన కవి.
35
[20/06, 5:59 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (35):యుద్ధం గెలుద్దాం
*రచన* *:* సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
వూహాన్ నగరం లో
ఊపిరిలూదుకొని,
ఝామ్ ఝామ్ అంటూ
ప్రపంచజైత్రయాత్రకు తయారై
వచ్చింది కరోనా పేరు తగిలించుకొని.
కనపడని శత్రువై
కళేబరాల గుట్టలు పేరుస్తూ
కరాళ నృత్యం చేస్తోంది
ఓ !సూక్ష్మజీవి.
బలవంతమైన సర్పం
చలిచీమల చేతచిక్కినట్టు
అగ్రరాజ్యాలు సైతం చతికిల
పడ్డాయ్ దాని దాష్టీకానికి !!
ముంచుకొస్తున్న ముంపుకు
లాక్డౌన్ అంటూ గొళ్ళెం పెట్టాడు
మన మోదీ దేశరక్షణ కోరి.
ఇప్పుడిక రణతంత్రం
దేశసరిహద్దుల్లో కాదు
ఒంటరి గదుల్లో అని తేలిపోయింది.
కనిపించని శత్రువు మాయావి
ఇంద్రజిత్తుతో పోరాడిగెల్చిన
అనుభవాన్ని తలచుకొని
ధైర్యాన్ని కూడగట్టుకుందాం.
మనమిప్పుడుబిక్కుబిక్కు మంటూ కాలంగడపట్లేదని,
జీవించేహక్కుని కాలరాస్తున్న
కాలయముడు కరోనాను
మూగనోముపట్టి మాస్క్ లతో
నిలవరిస్తున్నామని భుజం తట్టి
ప్రోత్సహించుకుందాం.
రాక్షసమాయకు విష్ణుమాయను అడ్డేసినట్టు.... విషం చిమ్మి
కాటేస్తున్న కరోనా
కాలసర్పాన్ని సబ్బుబురగతో
నురగలు కక్కిద్దాం.....
ఒకరి చావుకు మరొకరు
వాహకమైయ్యే వ్యూహాన్ని
నమస్కారంతో తిరస్కరిద్దాం.
'దూరం -దూరం జరగండి
ఆగినాక ఎక్కండి 'అనే బాలగేయాలే కనికట్టు
మంత్రాలై కరోనాను
తరిమి తరిమి కొట్టేలా పాడుకుందాం.
దైవంమానుష రూపేణాఅంటూ
వైద్యులు, పోలీసులు, పారిశుద్ద
కార్మికుల అండదండలతో
మనం యుద్ధం గెలుపు తీరాలు
తప్పకుండా చేరుకుంటాం.
అంతవరకు ఆత్మవిశ్వాసం
కోల్పోకుండా ఇల్లొదిలి
బయటకు రావొద్దు మిత్రమా !!
యుద్ధం గెలుద్దాం.....
36
[20/06, 5:59 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (36) : చెట్టు
రచన: సుంకర శ్రీలత
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
కాకమ్మ పిల్లల
కాపలా గూళ్ళు
పిట్టల కేళి
ఉద్యానవనాలు
కోయిల కూతల
రాగాల వేదికలు
పిల్లల కోతి
కొమ్మచ్చిలాటలు
దాగుడుమూతలు
ఊయల బల్లల
కేరింతలు
మామిడాకుల
పచ్చని లోగిళ్ళు
వేపపూతల
లేలేత చివుళ్ళ
ఉగాది ఉషస్సులు
అరిటాకుల
పంక్తి భోజనాలు
పిల్లలైనా,తల్లులైనా
పిట్టలైనా, పక్షులైనా
చెట్టమ్మ చుట్టూనే
ఎండైనా వానైనా
అలుపొచ్చిన బాటసారికి
నీడనిచ్చే గొడుగు
చెట్టు నాన్నే
37
[21/06, 6:25 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (37): జీవన సహచరి
రచన :సుంకర శ్రీలత
📖📖📖📖📖📖📖
పుస్తకం అనగానే ఎందుకో
చప్పున మస్తకం స్ఫురిస్తుంది.
అలాగే నాన్న చిన్నప్పుడనే
హస్త భూషణం గుర్తొస్తుంది.
కొత్తట్టలు, లేబుల్లతో
అలమరలో ఊరిస్తున్న
కొత్త పుస్తకాలను తడిమి
ముద్దాడి సగం తెరచి
వాసనలు పీల్చిన
బాల్యం గుర్తొస్తుంది.
పుస్తకాలు ఇచ్చిపుచ్చుకుంటూ
స్నేహాలని పంచుకొన్న
దాఖలాలు గుర్తుకొస్తాయి.
పరీక్షలపుడు రాత్రిళ్లు
చుట్టూ పరచు కున్న
పుస్తకాల మధ్య
నిద్ర పోయిన లేజీ
రోజులు గుర్తుకొస్తాయి.
ఓకే నవలను నలుగురు
మిత్రులు ఒకేసారి కలిసి
చదివిన గుంజాటన
రోజులు గుర్తుకొస్తాయి.
పుస్తకం లోని విషయ
లోతుల మీద జరిగిన
వాడి వేడి చర్చలు
గుర్తుకొస్తున్నాయి.
బాల్యంనుంచీ ఇప్పటిదాకా
పుస్తకం నన్నంటి పెట్టుకుందో
నేను పుస్తకాన్ని
అంటిపెట్టుకున్ననో తెలీదు
మేము ఒకరికొకరం
సహచరులం అంతే..
38
[21/06, 6:25 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (38):ఉత్సవాల రారాజు
రచన :సుంకర శ్రీలత
🎊🎊🎊🎊🎊🎊🎊
అనగనగ ఓ ఊరు
ఆ ఊరికో రాజు
అక్కడ రోజూ
పండగ వాతావరణమే
ఎక్కడ చూసిన కోలాహలమే
ఎప్పుడూ ఎదో
ఒక సందడే
ఎక్కడెక్కడో ప్రజానీకం
తండోప తండాలుగా వచ్చి
ఇక్కడి వింత వింత
సమావేశాలకు
హాజర్ అవుతుంటారు.
రాజు కూడ
కీలుగుర్రమెక్కి ఆహ్వానాలు పంచుతూనే ఉంటాడు .
కార్యక్రమాల చిత్రమాలికలు
చూసుకొని ముసిముసి
నవ్వులతో మురిసి పోతుంటాడు.
అంతా బానే వుంది
కానీ, పాపం ప్రజలే
ఊర్లో తమకు స్వేచ్చగా
తిరిగే చోటులేక
నిస్చేస్టులై విక్రమాదిత్యుని
సాలభంజికల్లా..
రాతి ప్రతిమలై పోయారు.
39
[23/06, 7:06 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (39):ఆన్లైన్ పాఠాలు
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
కళ్ళ ముందు పెట్టలో
ఇస్కూల్....
బుడ్డోడికి గదే కలాసు
కాలేజీ బుల్లోళ్ళకు గందులోనే
ఏమి ఇసిత్రపు
కాలమొచ్చినాదో గంద
ఎనకటికి గురూలంటే
ఎంత భక్తీ...
సీకటి దారుల్లో
మిణుగురు కాంతి లెక్క
కదా గురూలు
అని మొక్కెటోళ్లు.
గంతేందుకు మనిసి
పుట్టుక పుట్టిన మన
దేవుళ్ళకూ గురూలున్నారు.
రామయ్య కేమో వసిట్టులోరు
కిట్టయ్య కేమో సాందీపులోరు
గప్పటి గురుకులాలు పోయే
నిన్నటి బడులు మూతపడె
గిప్పుడు
ఇస్కూళ్ల లోనే పాఠాలు
పెట్టలోని పంతులకే
పెట్టాలె దండాలు...
40
[23/06, 7:06 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (40):నిశ్శబ్దం
మూగిన
వేళ
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఎన్నాళ్లగానో సాగుతోంది
ఈ అంతర్యుద్ధం, కానీ
పైకి మాత్రం
అంతా నిశ్శబ్దం !
పోరాటం నాతో నేనా?
మనసు పొరల్లో
దాగిన శూన్యం
ఎప్పుడు ఏర్పడిందో
కూడా తెలీదు.
దాన్ని పూడ్చుకోవడానికి
ఎన్ని స్నేహాలు
ఎన్ని ప్రయాణాలు
అన్నీ తాత్కాలిక
ఉపశమానాలై
థూచ్ మనిపించాయి.
అనుభూతుల కుదింపులు
అనుబంధాల కత్తిరింపులు
ఏమీ తోచని అలసత్వం
మనసు మీద
ఏ ప్రభావమూ చూపని
భౌతిక వాతావరణం
ఎక్కడి నుంచి
ఎక్కడికి ఎదిగానో తెలీదు
ఏ అనుభవాలు
నన్నీ స్థితిలో
వుంచుతున్నాయో తెలీదు.
అశాంతి అలజడైతే లేదు
అలాగని ఆరాటమూ
ఆతృత కూడా లేదు.
ఎందుకని?
శూన్యాన్ని పూడ్చుకునే
క్రమంలో కూలిన
సౌధాల చప్పుడికి
ఉలిక్కి పడ్డానా?
అసలు నాకేమైంది?
ఎందుకీ స్తబ్దత !
41
[24/06, 2:37 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్
కవి సమయం
కవిత (41):నెట్టిల్లు
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
1.నాన్న
ఇంటర్నెట్టు
అమ్మ
వైఫై
2.అక్క
ట్యాబు
చెల్లి
సెల్లు
3.అన్న
కంప్యూటర్
తమ్ముడు
లాప్ టాప్
4.అమెజాన్
ఫ్లిఫ్ కార్ట్
దుకాణం
మామయ్యలు.
5. గూగుల్
గూట్లో
నానీలు
దాదీలు
42
[24/06, 2:37 PM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్
కవి సమయం
కవిత (42):ఆధునిక స్త్రీ
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ముక్కు సూటితనం
ఆత్మ విశ్వాసం
ఆమె సహజాతాలు
బుద్ది కుశలత తో
సమర్ధవంతంగా
భాద్యతలను
నెరవేర్చడం లో
నేర్పరి
ఒకోసారి
భూమాతకున్నంత
సహనం,
మరోసారి
రుద్రమకున్న తెగువ
ఝాన్సి కున్న ధైర్యంతో
జీవన సమరం లో
అలుపెరుగని
పోరాటం
చేస్తూ...
సాధికారిత దిశగా
దూసుకెళ్తోంది.
43
[25/06, 4:09 PM] Sunkara Sreelatha KS 21: సమూహం : వీరాస్ కవి సమయం
కవిత (43): జీవితాదర్శం
రచన : సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఏమైందని అంత బెంగ!
ఏం కోల్పోయావని
అంత నిరాశ!
జీవిత రథచక్రాల కింద
ఘడియలు
నిమిషాలు
గంటలు
నలిగి పగిలి
పోవాల్సిందే కదా!
పరిగెత్తే కాలం ఓ వైపు
తిరిగిరాని కాలం ఓ వైపు
రైలు పట్టాల్లా సమాంతరంగా
సాగే పయనాన్ని
సాక్షీభూతంగా చూడటమే
జీవితానుభవం కదూ!
తొట్లో పాపాయి గట్టిగా
ముడుచుకున్న గుప్పిటను
ఒకసారి విప్పదీసి చూడు
ఖాళీ అరచేతితో
చిదంబర రహస్యం చెప్పేసి
గుట్టుగా కిసుక్కున
నవ్వేయదూ!
44
[25/06, 4:09 PM] Sunkara Sreelatha KS 21: సమూహం : వీరాస్ కవి సమయం
కవిత(44): ఆ చూపులే
రచన : సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
రాసే శక్తి ఉండాలే గానీ
ఆ కళ్లలోని
భావప్రకంపనాలు, కాస్త
భావగీతాలై
బండెడు పుస్తకాల్ని
నింపేస్తాయి కాబోలు!
నిరాశ నిస్పృహలతో
బీటలు బారిన గుండెకు
ఆ కళ్ళ "తడే"గా పంట కాలువై
పచ్చదనాన్ని పరిచేది.
అలిగినా, కసిరినా
కళ్ళల్లో కనిపించే ఆరాధనకేగా
కరిగి సెలయేళ్లయ్యేది
ఆత్మీయ స్పర్శను మించిన
చూపుల పంజరంలో
బందీగా చిక్కుకున్నాక
బయట పడటం సాధ్యమా?
వేయి వాక్యాల భావం
నీ ఒక్క చూపుకు
సాటిరాదు కదా
అందుకే,
నీవు చూపుల
మాంత్రికుడు వయ్యాబాబు!
45
[26/06, 10:52 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(45):అతడు-ఆమె
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
అతడు
సర్వవ్యాపకుడు
ఆమె
ఆతనిలో సగం
అతడు
లయకరుడు
ఆమె
లాస్యప్రియ
అతడు
వృషభ వాహనుడు
ఆమె
సింహవాహిని
అతడు
స్మశానవాసి
ఆమె
సర్వ మంగళ
అతడు
భవుడు
ఆమె
భవాని
అతడు
రుద్రుడు
ఆమె
రుద్రాణి
అతడు
విశ్వేశ్వరుడు
ఆమె
విశ్వ జననీ
46
[26/06, 10:52 AM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి సమయం
కవిత(46): సాహో!సావిత్రి బాయ్ ఫూలే
రచన: సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
సావిత్రమ్మా !!
అవమానాలు కూడా
అందర్నీ వరించవని, దానికీ
కొన్ని అర్హతలు వుండాలని
నీ జీవితం పాఠమై మాకు
నేర్పింది కదా .
సాఫీగా సాగడమంటే
అన్యాయానికి అణచివేతలకు
చెద్దరు కప్పేసి బాగుందని
భ్రమ పడటం కాదని, ప్రశ్నిస్తే?
ఓర్పు లేని మనుషులు
మురికి నీళ్ళుపోసి
అవమానించారే.....
విజ్ఞానం తో వెలుగుతూ
చుట్టూ వున్న చీకట్లను
తరిమి కొట్టాలని నువ్వు చూస్తే
ఛాందసవాదులు' ఉఫ్ 'మని
ఊదెయ్యాలని చూసారే.....
ఆలోచన లేకుండా బతకడమంటే
అవివేకంగా అజ్ఞానం తో
జీవించడమేనని, మార్పు కోసం
బాలికా విద్యకోసం
అడుగులు కదుపుతున్న నిన్ను
ఆపాలని, చీరపై
బురద నీళ్లు చల్లారే.....
ఎంత సహనం !!తల్లీ నీకు
ఎంత ఆత్మస్థైర్యం !!అమ్మా నీకు
ఈ సుగుణాలేనా?? నీకు
అవమానాల హారతులు పట్టిందీ....
ఐనా !అవమానాలు ఊరికే రావు
మానవ హక్కులూ వూరికే రావు
అంటూ -మాకు సందేశమిచ్చావు
చెడుపై విజయం సాధించాలంటే
ప్రశ్నించాల్సిందే !!
పోరాడాల్సిందే !!
అవమానాల్ని లెక్కచేయక
ముందుకెళ్లాల్సిందే.....
అంటూ స్ఫూర్తిని నింపిన
అమ్మ సావిత్రి బాయి ఫూలే కు
జయహో !జయాహో !!
47
[26/06, 10:52 AM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి సమయం
కవిత(47) : ప్రేమ
రచన: సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఎప్పటికప్పుడు నిన్ను
చూడాలనేవుంటుంది నాకు
ఎందుకో? తెలీదు.
ఎదురుగ లేని నిన్ను
వున్నట్టే ఊహించుకొని
ఏవేవో ఊసులాడుకుంటాను
నాలో నేనే........
వినీ వినిపించినట్టు
'పిచ్చిదానా 'అంటూ
నా చెవిలో
ఏదో 'రహస్యం 'వూది
వూరకుండిపోతుంది
నీ జ్ఞాపకం !!
సరిగా అప్పుడే
ప్రేమ గురించి
ఏదో రాయాలని పోతానా?
వూ..హు.. రాదు.
గొంతులో అడ్డం పడి
గిజగిజలాడుతూ....
తిరిగి గుండెలోనే
గూడు !కట్టుకుంటుంది.
అంతవరకు వుత్సాహంగా
వున్న కాగితం,
ఏమీ !!రాయలేని
నా ఆసక్తతకు,
గాలితో జతకూడి రెపరెపలాడుతూ
వ్యంగంగా నవ్వుతూ
వెక్కిరిస్తోంది.....
48
కవిత(48) : పదవీ విరమణ
రచన: సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
వాక్యానికి విరామచిహ్నాలు
ఎంత అవసరమో !!
వార్ధక్యంలోకి తొంగిచూసే
వయసులో పదవీవిరమణ
కూడా అంతే !!అవసరం.
కాకపొతే,
వయసుమీద పడిపోతోందంటే
ఒప్పుకోని మనసు మొరాయిస్తుంది
పైపెచ్చు మూలుగుతుంది.
కొలువులోకి వొచ్చిన తొలిరోజు
అందరూ 'ఒంటరి 'బాటసారులే
అదే !రిటైర్మెంట్ రోజుకి
ఎన్ని స్నేహాలు, ఎన్ని పలకరింపులు
ఎంత సత్కారం !
ఎన్ని' పూదండల 'సౌరభాలు
ఎంతమంది' ఆత్మీయ 'ఆలింగనాలూ
కాకపోతే....
కొన్ని కళ్ళు చెమ్మగిల్లుతాయి
రోజూ 'దస్తఖత్ 'చేసే
రిజిస్టర్ లోని పేజీలు
రేపటినుంచి నువ్వు
రావుకదూ... అంటూ...
బెంగటిల్లిపోయి -తుఫాను గాలికి
ఊగిసలాడే దర్వాజాల్లాగా
అటు ఇటు ఊగిపోతాయ్.
జీవన సమరం లో
ప్రధాన ఘట్టం ముగింపు రోజున
వడి వడి గా అడుగులేస్తూ
ఒక్కసారి వెనక్కు చూస్తే
శ్మశాన వైరాగ్యం లాంటిదేదో
మనసును కమ్మేసి
టపా-టపా!!
రెండు కన్నీటిబొట్లు
భుజం మీద వేలాడుతున్న
శాలువ లోకి ఇంకిపోతాయ్.
కానీ, అంతలోనే..
సమయాభావం వల్ల
మిగిలిపోయిన పనులు
మద్యలో ఆపేసిన కళలు
గుర్తొచ్చి జీవితపు
మరో కోణాన్ని ఆవిష్కరించుకోవడానికి
తాత్వికుడై ముందుకు కదలిపోతాడు.
49
[26/06, 10:53 AM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి సమయం
కవిత(49): మార్గదర్శి
రచన: సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నిస్తబ్దత !!
దేనిమీద లగ్నం కాలేని మనసు
దేనికో అన్వేషిస్తోందని మాత్రం తెలుసు
నా ఈడు వాళ్ళతో కలిసి నడవలేను
చిన్నవాళ్ళతో కలసి పరుగెత్తలేను
ఎందుకంటే??
వయసుకు - మనసుకు మధ్య
తేడా అటువంటిది మరి.
వీటిమధ్య 'సంతులన '
నియమాలు ఎవరూ!! నేర్పందే
ఎక్కడని? నేర్చుకోను,
జీవన సమరం లో తప్ప.
'అంతర్ముఖ 'పయనానికి
గమ్యం కనిపించదు,
బహిర్ముఖ పయనానికి
అడుగులసలే పడవు.
ఇంకో ప్రపంచాన్ని నిర్మించుకోలేను
వున్న ప్రపంచం లో జీవించలేను.
పరుగా? పలాయనవాదమా?
రెంటి మధ్య నలుగుతున్న మనసు
మూగదై బతికిపోతోంది.
అయినా, నా పిచ్చిగాని
బ్రహ్మ పదార్థాన్ని వెదికి
పట్టుకోవడానికి తోడెవరుంటారు?
గురువు తప్ప !అంతవరకు...
ఆత్మసాధనకు వెదుకులాటో
వెంపర్లాటో ఏదో !
తెలియని నాకు, సంతృప్తిని
ఇచ్చేవి ఈ చేరతాలే.
50
[26/06, 10:53 AM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి సమయం
కవిత(50) : స్మృతి చిత్రాలు
రచన : సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఏ అర్ధరాత్రో కలలోంచి
మెలకువలోకి జరిగిన మజిలీలో
గతించిన సంఘటనలన్నీ
స్మృతి చిత్రాలై !! నా
మనోఫలకం మీద
"చిత్రోత్సవం "జరుపుతున్నాయి.
ఒక్కో చిత్రం !
ఒక్కో జీవనసూత్రంతో
ఇమిడిపోయిన వైనం
'గిజిగాడి గూడు 'లాగా
ఎంత పకడ్బందీగా!! వుందో.
అల్లి బిల్లి జోకులతో
ఆనందంగా గడిపిన రోజులు
అంతలోనే, మబ్బుపట్టిన ఆకాశం లోంచి
చినుకల్లే జారి -దూరమైన నేస్తాలు
నల్లటికాన్వాస్ పై
పసుపు 'వర్ణ చిత్రాలై '
కదిలిపోతున్నాయ్.....
గెలుపోటములు పున్నమిసంద్రం లోని
ఆటుపోటులై !!అలలా
సాగిపోతున్నాయి.....
నోటితో నవ్వి
నొసలుతో వెక్కిరించే
వ్యంగ్య 'చిత్రాలు '
ఓ వైపు వెళ్తుంటే.....
కన్నీరు భూమ్మీదకు జారకుండా
దోసిటితో ఒడిసి పట్టిన
ఆపన్నహస్తాల 'ముఖచిత్రాలు '
మరో వైపు....
అన్నీ కలగాపులగంగా కల్సిపోయీ
ఓ పెద్ద 'మల్టీకలర్ ఫ్రేమ్ 'లో
ఒదిగి !తొంగి చూస్తున్నాయి.....
51
[30/06, 9:27 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(52):చదువు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
చదువంటే
వెన్నెల కలువ
చదువంటే
బతికే మెలకువ
చదువంటే
ఎగసే కెరటం
చదువంటే
తిమిరంతోసమరం
చదువంటే
చిక్కటి జ్ఞానం
చదువంటే
చక్కని జీవితం
చదువంటే
సంస్కారం
చదువంటే
సమభావం
చదువంటే
సర్దుబాటు
చదువంటే
దిద్దుబాటు
చదువంటే
పంచాక్షరి
చదువంటే
సకలశుభంకరి.
[30/06, 9:27 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(51):భాష గోస
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
సంస్కృతమ్మ
దేవనాగరయ్యల
గారాలపట్టి
ఉత్తరాదిన పుట్టి
దక్షిణాదిన మెట్టి
అందరి కోడళ్ల మల్లె
అత్తగారింట్లోఆదరణ
దొరుకుతుందేమోనని
ఎప్పటినుంచో
ఎదురుచూస్తోంది.
అత్త మామలకేమో(hms)
అడబిడ్డలే (లెక్కలు,సైన్సు)
అపురూపమాయే
ఉత్సవమైన(సైన్స్ ఫేర్)
వేడుకలైన(గణిత మేళా)
అన్నీ వారికోసమే.
ఇవాంకా!లెవల్లో అన్నీ
జరిగుతుంటే.....
నువ్వెంత?(20మార్కులు)
అన్నట్టుంటారు వాళ్ళు.
పాపం!ఈ ఇంట్లో
ముందునుంచి ఉన్న
తోడికోడలు(తెలుగు)కదా!
అని అభిమానంగా ఉంటే..
నన్ను పక్కన పెట్టి
ఆమెకూడా వేడుకగా
ఒడిబియ్యాలు(తె.మ.స)
విందుచేసుకుంది.
ఇక మరిదో(ఇంగ్లీష్)
సినిమాలు, డిస్కర్స్ లు
అదో గోల!
ఆఖరుగా చిన
మామయ్య(సోషల్)
ఆస్తి పంపకాలలో(ప్రమోషన్స్)
తన వాటా సరిగా
కుదరలేదనే నైరాశ్యం తో
అన్నిట్లో నిర్లిప్తతగాఉంటాడు.
పోనీ, అన్నయ్యలకు(నాయకులకు)
గోడు ఎల్లబోసుకుందామంటే
ఎప్పుడో!రాఖీ పండుగనాడు
రాఖీ(సభ్యత్వం)
కట్టించుకుందుకు వచ్చి
చెల్లని చీటి(రసీదు)
చేతికిచ్చి చల్లగా
జరుకుంటారు.
ఐనా!ఎవరిని అని
ఏం లాభం?
పుస్తెకట్టి(నియామకం)
అతీ గతీ పట్టించుకోకుండా
తిరుగుతున్నాడే....
"పెనిమిటి"(ప్రభుత్వం)
అంటే గింటే
ఆ మహానుభావుణ్ణి అనాలి
అన్నీ మౌనంగా భరిస్తూ
వెనక్కు మళ్ళా లేక
ముందుకు దారిలేక
ఎన్నటికి మార్పు వస్తదో
అంటూ హిందమ్మ
నిట్టూరుస్తూనే ఉంది.
[30/06, 9:27 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్
కవి సమయం
కవిత(53):గాయం
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
మనసుకు గాయమైంది
అవును!నిజంగా
మనసుకు గాయమైంది.
చిల్లుపడిన కుండ లోంచి
కారే ధారగా!!
కంట్లోంచి వస్తున్న
కన్నీరే దానికి సాక్ష్యం!
మాట చిన్నదే కావొచ్చు
అలవోకగా అలా
దొర్లిండొచ్చు కానీ...
మాటపడ్డ మనిషికది
పుండుమీది కారంలా
తగిలుండొచ్చు.
అలాంటి మాటల
తాలూకు రకరకాల
అనుభవాలతో మనసొక
రాచపుండయి
రాసికారుతుంటే...
అదే చోటుకు
నీవు వదిలిన మాటలు
తూటాలై గాయాన్ని
తడిమితే మనసు
బావురుమని ఏడుస్తుంది.
[01/07, 10:14 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(54):వెలి
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
కళా 'ఉత్సవాలు '
ఆటా 'బాలోత్సవాలు '
నిజం !!చాలా బావున్నాయి.
నా ఈడు పిల్లలందరూ...
కళామూర్తులై
వివిధ వేషధారణలతో
వివిధ వాయిద్యాలను చేతపట్టుకొని
పోటీల్లో పాల్గొనే ఉత్సాహం తో
ప్రాంగణమంతా తిరుగాడుతుంటే
కళాజాతరలా కళకళ లాడుతోంది.
ఆటలకు పాటలకు చెక్ పెట్టి
అర్థం కాని కాన్సెప్ట్ లు
పై పై చదువులతో
ర్యాంకుల పరుగు పందెం లో
పడుతూ లేస్తూ
ఆయాసపడుతున్న 'నాకు '
ఏదో అద్భుత!! ప్రపంచం
చూపిస్తోంది ఈ కళా ఉత్సవం.
సారంగి, మృదంగం
వీణా, వయోలిన్
వేణు నాదాలన్నీ
డప్పు వాద్య చప్పుడు తో
పోటీ పడుతుంటే
ఎంత గమ్మత్తుగా వుందో!
జానపద, శాస్త్రీయ సంగీత
నాట్యాల మధ్య పోటీ
ఉత్సాహాన్ని ఉరకలెత్తిస్తోంది.
అమ్మా, నాకు తెలీక !!అడుగుతాను
నేను కడుపులో వున్నపుడే
చక్కటి పాటలు విని,
చిక్కని కవిత్వం చదివావు కదా !
నన్నో 'కళాకారిణిని ' చేద్దాం
అనుకున్నావ్ కదా !
మరెందుకు నన్ను
టెక్నో స్కూలు లో వేసావ్?
అందుకే, కళాజాతరలో
ముందువరుసలో నను
నిలబెట్టి చూసుకోవాలన్న
నీ కోరికను !
తీర్చలేకపోయానమ్మా...
ఎందుకంటే?
'నేను 'వీటన్నిటికీ
అతీతంగా ర్యాంకుల
జంగిల్ లో జీవించే
టెక్నో విద్యార్థిని,
కళా స్వరూపాలనుంచి
'వెలి'వేయబడ్డ
ఓ !బానిసని.
[01/07, 10:14 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత (55): "బాల్యం "
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
బతుకు భారమనిపించో
పిల్లల ఆటలు చూస్తూనో
కాస్తంత తీరిక దొరకగానే
స్వప్న మంజూష లో
భద్రంగా దాచుకున్న
నా చిన్ననాటి జ్ఞాపకాలు
ఆహ్లాదపవనాలై ముసురల్లే
వొచ్చి ముంచేస్తాయి.
బడి ఎగ్గొట్టడానికి
'కుళాయి గుంతల్లో '
దాక్కున్నప్పుడు
అమ్మమ్మ వచ్చి
చెవి మెలిపెడితే వచ్చిన ఉక్రోషం !!
క్లాసులో ఎక్కాలు
పైనుంచి -కిందకు,
కింద నుంచి పైకి
గబా గబా చెప్పి పక్కవాణ్ణి
ముక్కుచెంపలు కొట్టే ఛాన్స్
దక్కించుకున్నాక గాని, చల్లారేదికాదు .
సాయంకాలం కరెంటుపోతే
ఎంత? సంబరం .
వీధివీధంతా పిల్లల కేరింతలతో
అదో ఉత్సవమే !!
ఇక రామనవమి వేడుకలు
పీర్ల వూరేగింపులు,
అయ్యప్ప భజనలు
అబ్బో !అన్నింటా బృందాలే.
'శంకరాభరణం ' పాటలు
టేప్ రికార్డు లో
వింటూ బాలసంగీతజ్ఞులై
మైమరచి పోయేవాళ్ళం.....
వేసవిలో చందమామను చూస్తూ నక్షత్రాలెంచుతూ ఆరుబయట
హాయిగా!!
నిదురించిన రోజులు
కలలాగా కరిగిపోతూ......
మబ్బుల్లా మాయమౌతుంటే.....
దేవలోకం నుంచి 'జారి '
యాంత్రికలోకం లోకి వూడిపడ్డట్టు
ఉలిక్కిపడుతూనే!!
ఉంటాను.....
[02/07, 9:11 AM] Sunkara Sreelatha KS 21: సమూహం: వీరాస్ కవి
సమయం
కవిత (56): "ఏకాత్మ "
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
నా కళ్ళు కలల
కాణాచిగా మారిపోయాయి,
నువ్వు నా కళ్ళలోకి
సూటిగా! చూసినప్పుడే.
తీరిక దొరికినప్పుడల్లా
నీ మాటల మూటల్ని
విప్పుకుంటూనే
ఉంటాను ఆశగా !
గుప్పెడు భావాల్ని, నా
గుండెకు బట్వాడా చేసి
మసక చీకట్లో
నే కన్న కలనుంచి
మంచుతునకలా కరిగిపోతావ్.
ఆరాధించడం !నేర్చుకుంటున్నాను
అందమైన నా వూహల్లోంచి
నిన్ను చూస్తూ.....
విడి విడిగా తిరుగాడుతున్నవి
మన దేహాలు కాదు
రెండుగా చీల్చబడి
వేరువేరు రూపాలు దాల్చిన
మన ఒకే 'ఆత్మ '
ఒకరి అంతరంగం ఇంకొకరి
కళ్ళలో అద్దంలా !
ప్రస్ఫుటిస్తూనే ఉంటుంది.
చింతలగూడుని చీల్చుకుని
చివరి మజిలీగా నీ నీడకు
నా నీడ కూడా తోడై చేరిపోతుంది
చేతలూపుతూ........
[02/07, 9:11 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్
కవిసమయం
కవిత(57):ఇల్లాలి వైభోగం
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
అమ్మకు జొరమొచ్చింది
వంటిల్లు కళ తప్పింది
వాకిలి వెలవెల పోయింది
నాన్న పానం గిల గిలమంది
పిల్లలు పొద్దు గూకులు వచ్చి
పరీక్ష చేసి పోతున్నరు.
అమ్మ 'సూరీడు 'లెక్క
అమ్మ నట్టింట్లో తిరుగాడితేనే
అందరి దినచర్యలు
సక్కంగుంటాయ్.
ఇల్లాలి వైభోగం
ఇంతింత కాదయా!
అన్న సత్యం వెనుక
కనిపించని వ్యూహం
పురుషుడే అన్న నిజం
అమ్మకూ తెలుసు.
ప్రేమకు బందీ ఐన
అమ్మకు ఇవేవీ పట్టవు.
అందుకే అమ్మలేని
వంటిల్లిపుడు దేవత
లేని దేవాలయమయింది.
58
[03/07, 11:55 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(58):మూర్ఖుడి వీరంగం
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
పుట్టడం తోటే
స్త్రీ మీద పెత్తనం చేయొచ్చు
అనే మిత్ తో
పుడతారేమో!
ఇలాంటోళ్లు.
చుట్టూ కరోన రక్కసివుంది
మాస్క్ పెట్టుకోమని
సామాజిక బాధ్యత
గుర్తుచేస్తే ,నాకంటే
రాక్షసుడుంటాడాఅన్నట్టు
పిడి గుద్దులు గుద్దేస్తాడా?
సాటి ఉద్యోగిని, ఆపై
దివ్యంగురాలు ఐనా
కరోన కాలంలో కూడా
కష్టపడి పనిచేస్తుంటే
ప్రశంసించే సంస్కారం
అయ్యకు ఎలాగూ లేదు
చెయ్యి చేసుకొనే
అధికారం ఎవరిచ్చారు?
స్త్రీ అంటే ఎవడబ్బ
సొత్తనుకున్నాడు.
ఆడదాని ఆత్మగౌరవాన్ని
జుట్టుపట్టి ఈడ్చే
ఆ వెధవ !!
వికృతస్వభావం వెనుక
ఎంత కరుడుకట్టిన
భావజాలం పనిచేస్తోందో!
వాని అహంకారం
ఆవిరై పోను.
(నెల్లూరు లో ఉషా రాణి మీద
జరిగిన దాడికి నిరసనగా)
59
[03/07, 11:55 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్
కవిసమయం
కవిత(59):హరివిల్లు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
మేఘాల
చిత్రమాలికలతో
ఆకాశం చేసుకున్న
ఒప్పందం !ఫలించి
పుష్పించింది కాబోలు
ధారలు ధారలుగా
చుక్కలపూలు
రాలుతున్నాయి...
దేవుడిరథం
ఊరేగుతున్నట్టు
శబ్దప్రకంపనలు
వేయి మోముబతీల
వెలుగుఎగజిమ్మినట్టు
మెరుపుల తలతలలు
ఎండా-వానా
వానా-ఎండల
మోహపు పారవశ్యానికి
ప్రకృతి పరవశించి
గీసిన చిత్రం
ఏడు రంగుల
హరివిల్లు
60
సమూహం:వీరాస్
కవి సమయం
కవిత(60): "మట్టి దిబ్బలు"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
సహజసిద్ధంగా
అడవిలో పెరిగిన
మానుని చూస్తే
అర్థమవట్లేదూ!
స్వేచ్ఛగా ఎదగడం
లోని బలమేంటో.
కత్తిరించి కుదించి
కృత్రిమంగా పెంచిన
బోన్సాయ్ మొక్కలను
చూస్తే తెలీదూ!
ఎదగలేనితనమేంటో.
కోకిలమ్మ
స్వేచ్చా గానం
ముందు చిలకమ్మ
కృతక పలుకులు
ఏపాటివి?కనుక
నల్లనికోకిలమ్మ
ఆవాసాలుపచ్చని
మామిడితోపులు.
పచ్చనిచిలకమ్మ
వసతేమో చీకటి
పంజరాల్లో.
అందుకే స్వేచలేని
బతుకులుఎదగలేని
మట్టిదిబ్బలు.
61
సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(61):"విజేత"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ప్రతిభకు
వేయి వాకిళ్ళు
ఒకటి
మూసుకుపోతున్నా
రెండోది
తెరుచుకుంటూనే
ఉంటుంది.
చెదపురుగులు
తొలిచేయాలనిచూసినా
వానపాములు
బురదపులమాలని చూసినా
కొండంత కష్టాన్ని
పిడికిట మూసి
ప్రయాణం సాగిస్తేనే
విజయ తీరాలు చేరేది.
వెలుగుకిరణాల
ఉష:కాంతినిచూసేది.
రంధ్రాన్వేషకుల
నోళ్లుమూయించేది.
సాధించాలని
జ్వలించేవారిని
అసూయ నీళ్లతో
ఆర్పాలనిచూస్తే,
దాన్నే ఇంధనంగా
మార్చుకొని
విజేతగా నిలవడమే
ఏ యుద్దానికైనా
అంతిమ స్ఫూర్తి.
62
[05/07, 1:43 PM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(62): ఆనందం
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ఏడుస్తూ వచ్చి
ఆనందం కోసం
వెంపర్లాడటమే
మనిషి సహజ గుణం.
ఉత్సవాలు, వేడుకలు
హంగు,ఆర్భాటాలతో
ఖర్చుపెట్టి కొంటున్నది
పైపూతల మోతే!
రజ్జుసర్పబ్రాంతే!
మార్పునకు లొంగే
అల్పమైనవాటిలోని
ఆనందప్రచ్ఛయాలతో
తృప్తిపడక
అశాంతి తో
విచలితుడై
జన్మలవలయంలో
చిక్కుకుపోతాడు.
పరిపూర్ణ మైన
పరబ్రహ్మతత్వాన్ని
చేరుకోవటమే
ఆనందస్వరూపమనే
స్పృహ గురువు
ఎరుకపరిచేవరకు
కర్మలతిరుగలిలో
నలుగుతూనే ఉంటాడు.
అభ్యాసకునికి
గురుచారణాలే
ఆనందసరోవరాలు.
(భౌతిక,ఆధ్యాత్మిక గురువులందరికి సభక్తితో ప్రణమిల్లుతూ ..)
[05/07, 1:43 PM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(63):సమయం
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ప్రపంచమంతా
పోటీలుపడి
పరిగెత్తుతోంది
గెంతుతోంది
ఎవరూ కూచోలేరు
నించోలేరు
ఒకటే ఆరాటం!
అందరిలోనూ అభద్రత
వెనకబడిపోతామేమో
ఓడిపోతామేమో
ఎలా? ఆందోళన
ఈచట్రం నుంచీ
ఏఒక్కరు పక్కకు
తప్పుకోలేని
ఆశల సంకెళ్లు
మాటలగారడీలు
కార్పొరేట్ లక్ష్యాలు
పాపం!మనుషులు
ఎంతలా పరిగెత్తి
అలసిపోయారోగానీ
కరోన "మోహిని"లా
వచ్చి ఎవరి
సమయాల్ని వారి
దోసిట్లోపోసింది
64
[07/07, 3:51 PM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(64):యోధురాలు
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
వారసత్వపు ఆస్తి
ఎప్పటికీ మారనిఇంటిపేరు
కుటుంబ పెత్తనమనే
తాళాలగుత్తి
అరచేతులోపెట్టుకొని
అబ్బాయిలు పుట్టేస్తారు.
లోకం చూపాల వద్దా?
అనే మీమాంసలు
తర్జనభర్జనలమధ్య
పుట్టుకే ప్రశ్నగా
మారిన చోట ఆక్షణం
నుంచే అస్థిత్వపోరాటం
మొదలైపోతుంది
ఆడపిల్లలకు.
కన్నతల్లితో ఐనా సరే
పెంపకంలో నాకిద్దరు
సమానమే అని
ఒప్పించటానికి
యుద్ధం అనివార్యమే!
అడుగడుగునా
వివక్షల సుడిగుండంలో
మునకలేస్తూ....
ఆఖరిశ్వాస వరకు
పోరాటాల ఆరాటమే!
స్త్రీ చేసే అస్తిత్వ
ఉద్యమంముందు
ప్రపంచఉద్యమాలన్నీ
దిగ దుడుపే....
ఆమె అలుపెరుగని
యోధురాలు!!
[07/07, 3:51 PM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(65):ప్రశ్న
🍀🍀🍀🍀🍀🍀🍀
ప్రశ్న మొదలైందా
జ్ఞానం పొరలు
విచ్చుకుంటుంది.
న్యూటన్ ప్రశ్న
గురుత్వాకర్షణయ్ తేలింది.
ఆర్యభట్ట
ప్రశ్నసున్నగా
విశ్వాన్ని చుట్టింది.
ధ్రువుని ప్రశ్న
అతన్ని
చుక్కల్లోనిలబెట్టింది.
ఇన్స్టయిన్ ప్రశ్న
సాపేక్ష సిద్ధాంతమై
సాక్షాత్కరించింది.
అందుకే ప్రశ్నించు
ప్రపంచాన్నిమార్చు.
ప్రశ్న లేనిచోట
ప్రగతే !ప్రశ్నవుతుంది.
65
[07/07, 3:51 PM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(64):యోధురాలు
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
వారసత్వపు ఆస్తి
ఎప్పటికీ మారనిఇంటిపేరు
కుటుంబ పెత్తనమనే
తాళాలగుత్తి
అరచేతులోపెట్టుకొని
అబ్బాయిలు పుట్టేస్తారు.
లోకం చూపాల వద్దా?
అనే మీమాంసలు
తర్జనభర్జనలమధ్య
పుట్టుకే ప్రశ్నగా
మారిన చోట ఆక్షణం
నుంచే అస్థిత్వపోరాటం
మొదలైపోతుంది
ఆడపిల్లలకు.
కన్నతల్లితో ఐనా సరే
పెంపకంలో నాకిద్దరు
సమానమే అని
ఒప్పించటానికి
యుద్ధం అనివార్యమే!
అడుగడుగునా
వివక్షల సుడిగుండంలో
మునకలేస్తూ....
ఆఖరిశ్వాస వరకు
పోరాటాల ఆరాటమే!
స్త్రీ చేసే అస్తిత్వ
ఉద్యమంముందు
ప్రపంచఉద్యమాలన్నీ
దిగ దుడుపే....
ఆమె అలుపెరుగని
యోధురాలు!!
[07/07, 3:51 PM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(65):ప్రశ్న
🍀🍀🍀🍀🍀🍀🍀
ప్రశ్న మొదలైందా
జ్ఞానం పొరలు
విచ్చుకుంటుంది.
న్యూటన్ ప్రశ్న
గురుత్వాకర్షణయ్ తేలింది.
ఆర్యభట్ట
ప్రశ్నసున్నగా
విశ్వాన్ని చుట్టింది.
ధ్రువుని ప్రశ్న
అతన్ని
చుక్కల్లోనిలబెట్టింది.
ఇన్స్టయిన్ ప్రశ్న
సాపేక్ష సిద్ధాంతమై
సాక్షాత్కరించింది.
అందుకే ప్రశ్నించు
ప్రపంచాన్నిమార్చు.
ప్రశ్న లేనిచోట
ప్రగతే !ప్రశ్నవుతుంది.
66
[08/07, 10:35 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్
కవి సమయం
కవిత(66):వారణాసి
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
కాశీ!
మోక్షపురి
కాశీ!
ఆనందవనం.
ఉత్తరవాహిని
గంగమ్మ లో
మూడు మునకలు
సర్వపాపక్షయం.
విశ్వేశ్వర దర్శనం
కోటిజన్మల
పుణ్యఫలం.
విశాలాక్షి వీక్షణం
సౌభాగ్య ప్రదం.
కాశీ కొత్వాల్
కాలభైరవదర్శనం
దక్కించును
యాత్రాఫలం.
అన్నపూర్ణ ప్రసాదం
వదిలించును
జన్మల దారిద్ర్యము.
మనికర్ణికఘాట్
మధ్యాహ్న స్నానం
తెరిచివుంచును
మోక్షద్వారం.
సాయం సంధ్యవేళ
గంగాహారతి
నయనానందకరం.
కాశీ!
భూలోక కైలాసం.
67
[08/07, 10:35 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్
. కవి సమయం
కవిత(67):సాహిత్యం
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
సాహిత్య లక్ష్యాల
దారి మల్లుతోందా?
లక్షణమైన సాహితీ
విలువల వలువలు
కట్టుకొని చక్కనైన
భావ సంపదతో
కవిత్వాన్ని గుప్పించిన
ఆ పాతరోజులు
పొలాల గట్టున
పడి దొర్లుతున్నాయా?
కొత్త మైలురాయిని
స్ఫష్టించుకొని
అక్షరాలఅపప్రదలతో
పరుగులు తీస్తున్న
నవనాగరికులకు
ఏం తెలుసు?
సాహిత్య తులాభారం
తూగే తులసీదళం!
కవి హృదయమేనని.
68
[09/07, 9:47 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(68):ఉగాది ఆగమనం
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
కాలం !!ఓ ప్రవాహం
కాలం !!ఓ చక్రం
కాలం !!కర్మలవలయం
కాలం !!శక్తివంతం
కాలం!! ఓ మాయాజాలం
మానావమానాలు సుఖ దుఃఖాలు
భోగాలు- త్యాగాలు గెలుపోటములు
ఏమైతేనేం? అన్నీ
ఆ ప్రవాహం లో
పడి కొట్టుకు పోవాల్సిందే.....
కాలం గతమే కాదు
వర్తమాన-భవిష్యత్తు కూడా !!
చలించే ప్రతిరోజు, గంటలు
నిముషాలను సైతం ఆస్వాదించమని
తన చక్రభ్రమణం తో
ముందుకుతోస్తూనే ఉంటుంది....
శిశిరంలో రాలే ఆకులు
వసంతం లో పూసే వేపపువ్వు
లేలేత మావిచిగుళ్ళు
ఆమని కోయిల కుహుకుహులు
మండే ఎండకు పూసే
చల్లని మల్లెల సౌరభాల
ప్రకృతి పరవశానికి
కర్మసాక్షి 'ఉగాది '
కాలగమనం -సృష్టి చక్రం
మధ్య నున్న
చక్కని సూత్రం 'ఉగాది '
ఉష :కాంతులతో
నవనవోన్మేష రాగాలాపనతో
షడ్రుచుల సమ్మేళనాలను మేళవిస్తూ
గతం ఓ జ్ఞాపకం !
వర్తమానం నిత్య నూతనం
భవిష్యత్తు ఆశావహం అంటూ..
పంచాంగ శ్రవణం చేయించడానికి
అదిగదిగో వచ్చేస్తోంది
మన తెలుగువారి 'ఉగాది'
శార్వరీ నామ తొలి పండగ ఉగాది
స్వాగతం !సుస్వాగతం !!శుభస్వాగతం!!
69
[09/07, 9:47 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(69):మార్పు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
అందమైనతోటలోకి
కంచె లెక్క చేయక
దొడ్డిదారిన దూరిన
ఆబోతుల డెక్కల
చప్పుడికి
నేలరాలిన పూరెక్కల
సౌరభం!
మట్టిపరిమళాలతో
ఇమిడిపోయి
తలదాచుకుంటే
పాపం!ఎవ్వరిది?
మార్పు అనివార్యమే
కావొచ్చు, కానీ!
పాతదంతా తుడిచిపెట్టాలనే
విద్వంసకర ఆలోచనలు
పునాదులు కూల్చి
గోడలు కట్టే
పేకామేడలే అవుతాయి.
ఏ మార్పు ఐనా
చరిత్రకు కొనసాగింపుగా
వుండాలేగాని
నేలమట్టంచేసేలా
ఉండటం
సంస్కృతి
విద్వంసమే!
70
[10/07, 11:09 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(70):వీడ్కోలు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
అనుకుంటాం గానీ
అన్నీ మనవేనని
అంతా మనవాళ్లేనని
ఏదో ఒక
సందర్భంలో
వ్యక్తులకో
పరిసరాలకో
వీడ్కోలు
చెప్పాల్సిన
సందర్భం
వచ్చినపుడు కానీ
తెలీదు.
ఏవీ!
మనల్ని
అంటిపెట్టుకొని
ఉండవని.
71
[10/07, 11:09 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(71): "ఆశ"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నువ్వు లేని చోట
ఏదీ నిలువదు.
ఓ!ఆశయం
సిద్దించదు.
ఓ!ఆలోచనా
పొడసూపదు.
ప్రపంచమే
నిర్వీర్యమైపోదూ.
ఉషోదయాన
వేకువముంగిట్లో
కొన్ని ఆశల చుక్కల
తేనీరు సేవిస్తేకదా
రోజంతా....
ఉల్లాసంగా ఉండేది.
రాత్రికి రంగురంగుల
స్వప్నాలతో....
నిదురించేది.
చావు బతుకులమధ్య
కిట్టుమిట్టాడే రోగికి
ప్రేరణ నీవే.
ప్రేమ విహంగాలై
విహరించే ప్రేమికులకు
ఆలంబన నీవే.
చైతన్య దీప్తివై
మనిషిని ముందుకు
నడిపే ఇంధనమూ నీవే.
72.
[11/07, 10:31 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(72):"అద్దం"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
బింబ ప్రతిబింబాల మధ్య
భేధం లేకుండా
నిన్ను నీకు
నిక్కచ్చిగా చూపే
నిజాయితీ అద్దం!
బలాల్నీ బలహీనతల్నీ
ప్రస్ఫుటంగా
పారదర్శకంగా
ప్రదర్శించే నిష్కర్ష
నేస్తం అద్దం!
ముసి ముసి నవ్వులతో
నీ అందానికి నీవే
మురిసినా...
నెరిసిన జుట్టును
సవరించుకుంటూ
దాచేయాలని చూసినా
అన్నిటికీ నిన్నే
సర్వసాక్షిని చేసి
నిలబెట్టే
శుద్ధ స్పటిక
అద్దం!!
73
[11/07, 10:32 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(73):విశ్వగురువు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
అనంతసృష్టిలో అతిసూక్ష్మ క్రిమి
అజ్ఞాతశత్రువై జీవన్మరణపోరాటానికి
విశ్వవేదికను సిద్ధం చేసింది.
రాజు -రైతు, ఉన్నోడు -లేనోడు
తేడాలు తుడిచేసి
ఒలంపిక్ పట్టికలో చోటుదక్కని
దేశాలక్కూడా కరోనా పట్టికలో
చోటిచ్చి హద్దుల్ని చెరిపేసి
భూగోళాన్ని బంతిలాచేసి ఆడేస్తోంది.
'గ్లోబలైజేషన్ 'చమ్కీదండను
పూసలు పూసలుగా తెంచి
విశ్వవిపణి లోకి 'కోవిడైజేషన్ 'పేరుతో
విసిరి పారేసింది .
కాలికేయ సైన్యంలా విరుచుకు
పడుతున్న మహమ్మారికి
అగ్రరాజ్యాలు సైతం పాదాక్రాంతలై
కప్పంగా శవాల రాసులు, కుప్పలుగా పోస్తుంటే
అప్రమత్తమైన భారత్ బతకడమే గెలుపంటూ
బతుకుసూత్రాల చిట్టా తెరిచింది.
సామజికదూరాన్ని రక్షరేకుగా కట్టి
గృహాలనే యుద్ధ శిబిరాల్ని చేసి
కరోనారక్కసి గొలుసుకట్టును తెగ్గొస్తోంది.
మాస్క్ లు, శానిటైజెర్లే మరణాయుధాలుగా ప్రత్యర్థి ఎత్తులు చిత్తు చేస్తోంది.
ఒకవైపు వైద్యుల సేవకు
చప్పట్ల దుప్పట్ల ప్రశంసలందిస్తూనే మరోవైపు
దీపయజ్ఞంతో సమస్యను సమిష్టిగా సవాలు చేసి శత్రువుకు ముచ్చెమటలు పట్టిస్తూ
నేను సైతం అంటూ
సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికి
కృతజ్ఞతా మాలలు అల్లి పెడుతోంది.
ఎన్నో దాడులు, విపత్తులు, ఉపద్రవాలు సంయమనంతో పోరాడి గెలిచిన చరిత్ర మాది
కావాలంటే 'ఊరకట్టడి'గురించి,
ఏ జానపదున్నైనా కదిపిచూడు
క్వారంటైన్ మాకు కొత్తకాదని సనాతన
సంప్రదాయాలవిలువల్ని సాక్షిగా!చూపెడతాడు అంటూ అందరి దృష్టి ఆకర్షించింది.
సొంతలాభం కొంతమానుకొని
పొరుగువారికి సాయంఅందిస్తూభారతీయుల
ఔన్నత్యాన్ని చాటి చెప్పింది.
విగత జీవుల లెక్కలపట్టీలో
తక్కువ ప్రాణనష్టమే గెలుపు పాయింట్లుగా
శరీరం ఖలు ధర్మసాధనం అంటూ
అంతర్జాతీయ యవనిక మీద మరోసారి
విశ్వగురువై అవతరించి యావత్ ప్రపంచానికి దిశా నిర్దేశం చేయడానికి
ముందుకు దూసుకెళ్తోంది......
74.
సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(74):"ఆకాశం"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నిజం!నాకు
ఆకాశం ఎలా వున్నా
బావుంటుంది.
తారాహారాలమధ్య
చందమామ లాకెట్టు
తొడుక్కొన్న పున్నమి
ఆకాశం నిజంగా
ఎన్ని వెన్నెల రాసుల్ని
కొలిచి పోస్తుందో!
సింగారం తీసేసి
బోసిమెడతోఅలిగి
బోర్లాపడుకున్న
ఆడపిల్ల శోకంలా
అమావాస్య ఆకాశం
చిక్కటి చీకటితో
భాషకందని భావావేశంతో
ఎన్ని స్మృతులు
తట్టి లేపుతుందో!
ఇంటికొచ్చిన
అతిథుల పలకరిస్తూ
సందడిచేసే ఇంటిపెద్దలా
మేఘాల గుంపులోంచి
తొంగిచూసే నీలాకాశం
సంబరాల అంబరమే!
సమున్నతమైన
వ్యక్తిత్వానికి
సరైన పోలిక!
ఆకాశమే!
అందుకే ఎలావున్నా
నాకు బావుంటుంది.
75.
సమూహం:వీరాస్
కవి సమయం
కవిత(75):రోజులలా
దొర్లిపోతున్నాయ్
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఆరాటాల్లేవ్
సమయంతో
పోరాటాల్లేవ్
రోజులలా
దొర్లి పోతున్నాయ్
బాక్స్ లు సర్ధటాల్లేవ్
స్కూల్ బస్సుల
మోతల్లేవ్.
సాయంకాలానికి
గూడుచేరుకున్న
చిట్టిగువ్వల
ముచ్చట్లు లేవు.
ఆదివారాని కున్న
క్రేజ్ సప్పబడే
పెళ్లి పందిట్లో
ఊరేగింపుల్లేని నగలు
లాకర్ లో
మూలగబట్టే.
మానవ జీవితాల్ని
అతలాకుతలం చేస్తున్న
శత్రువైరస్ కు చిక్కకుండా
యుద్ధ శిబిరాల్లో
తలదాచుకున్నట్టు
పరేషాన్ పొద్దులతో
రోజులలా...
దొర్లిపోతున్నాయ్.
76
[14/07, 10:24 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(76):వర్షం కురిసిన రాత్రి
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
మంచు పవనం
మనసును తడిమినట్టు
చుట్టూరా
పరుచుకున్న చల్లదనం.
చెట్టునుండి
జలజలా రాలి
తడిసి ముద్దై
పరిమళాలు వెదజల్లుతున్న
పున్నాగపూలరాసులు.
బరువు దింపేసుకున్న
మేఘాలు మాయమై
నిశ్చలమైనఆకాశం.
చిరుకప్పలు తల్లికప్పల
బెకబెక సందడి.
చల్లబడ్డ నేలనుంచి
పనిమాలా వస్తున్న
చలిచీమలు.
ప్రకృతిస్నానానికి
పరవసిస్తున్న
కీటకాల సందడి.
పరికించాలేగానీ
అన్నీ.....
అపురూప దృశ్యాలే.
వర్షం కురిసిన రాత్రి
ఈ ధరిత్రి
ఎంతగా!
మురిసిపోతుందో.
[14/07, 10:24 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(77):కళార్చన
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
అక్షరాలతో
ముగ్గుపెట్టి
పదాలతో
పాటపాడి
వాక్యాలను
తోరణాలుగా కట్టి
కళామతల్లికి
కవితా కుసుమాలతో
అర్చన చేస్తూ
కథా నైవేద్యాలు
సమర్పిస్తుంటే
ఉలికిపాటుకి
కునుకుచెదరగా
సుషుప్తి లోంచి
జాగృతిలోకి
జారి పడ్డాను.
78
[15/07, 11:03 AM] Sunkara Sreelatha KS 21: సమూహం: వీరాస్ కవి
సమయం
కవిత(78):గుర్తుకొస్తున్నాయి
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
పూలగుత్తి లోని
పరిమళమంతా
గుప్పు మన్నట్టు
మదిలోని జ్ఞాపకాలు
ఇవాలెందుకో
గుర్తుకొస్తున్నాయి....
పలకా బలపం చేతికిచ్చి
చక్కగా చదువుకొమ్మని
అమ్మ నన్ను బడికి
పంపినతొలినాళ్లు
తొలకరి ఝల్లులు
కురిసినంత కమ్మగా
గుర్తు కొస్తున్నాయి....
పొలాలగట్టున నాన్న
నన్ను భుజాలమీద
మోసుకుంటూ నడుస్తున్నప్పుడు
పల్లకిలో రాకుమారుడిలా
పొంగిపోయిన రోజులు
గుర్తుకొస్తున్నాయి......
బాల్యస్నేహితులతో
కలిసి చేసిన అల్లరి
ఆడిన దొంగాటలు
లేలేత తాటి ముంజెలంత
తియ్య తీయగా
గుర్తు కొస్తున్నాయి.....
79
[15/07, 11:03 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(79):చావు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ఊహల రెక్కలు
తొడుక్కొని
ఊరు వూరంతా
చూసొచ్చాను.
బేతాలకథలోని
రాక్షసరాకకు
భయపడి
దర్వాజాలు
బందుపెట్టుకొని
బిక్కు బిక్కుమని
కాలం గడిపే
ప్రజలు ఇప్పుడు
నిజంగానే
ప్రత్యక్షమైయ్యారు.
కరోనా రక్కసి
కోరల్లో నలిగిన
మనిషికి చావు కూడా
చచ్చే చావయ్యింది.
ఒంటరితనానికి
పరాకాష్ఠను!
మరణంలో సైతం
రుచిచూపిస్తోంది
మాయల మరాఠీ!!
82
[17/07, 12:31 PM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(82):అజ్ఞాత వాసి
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
పాలెట్ లోని
రంగులు అద్దుకుంటూ
కుంచెతో
తదేకంగా రక రకాల
బొమ్మలు గీసే
బోలేడు మంది
చిత్రకారులను
చూసేఉంటాము.
ఆకాశం కాన్వాస్ పై
కిరణాల కాంతితో
మబ్బుల వర్ణాలే
కుంచె కద్దుకుని
మేఘాల చిత్రాలను
రోజుకో రీతిగాచిత్రించి
కనువిందుచేస్తున్న
ఆ చిత్రకారుడు
ఎందుకో?
మనకెపుడూ
కనపడని
అజ్ఞాతవాసి!
[17/07, 12:32 PM] Sunkara Sreelatha KS 21: సమూహము:వీరాస్ కవి
సమయం
కవిత(83): మన నదులు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
మన నదులు
పుట్టింటినుంచి
మెట్టి నింటికి చేరే
అందమైన
ఆడపిల్లలు.
మన నదీ
సంగమాలన్నీ
ముచ్చట్లాడుకొనే
అక్కచెల్లెళ్ళు.
మన నదీ
జలాలే
పట్టెడు అన్నం పెట్టే
కన్నతల్లులు.
మన నదుల
తీరాలు
నాగరికత!
ఉత్పాదకాలు
ప్రవహిస్తూ...
ప్రవహిస్తూ...
భాషను
యాసను
సంస్కృతిని
తీరాలకు చేరవేసే
జీవనవాహిణులు
మన నదులు.
84
[18/07, 9:57 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(84):నేనేం రాసేది?
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నేనేం రాసేది...
కొత్తగా నాకేం తెలుసని!
ఏం నేర్చుకున్నానని రాసేది?
ప్రపంచమంతా
వైరస్ దాడికి
విలవిలలాడుతూ
ప్రాణాలు అరచేతిలో
పెట్టుకొని మూతికి
మాస్కులు తగిలించి
మౌనపోరాటాలు
చెస్తుంటే..
పనిలేక పడున్న
ఖాళీ చేతుల్ని
రుద్దుకుంటూ...
మృత్యుఘోష వింటూ
నేనేం రాసేది?
ఎంతసేపూ
ఆ పాతజ్ఞాపకాలనే
తవ్వి తవ్వి
ఆఖరికి !
ఖంగుమంటుంటే
నేనేం రాసేది?
లాక్డౌన్ ఐన
మనసులో ఏ
భావాలున్నాయని
రాసేది..
నేనేం రాసేది?
85
[18/07, 9:57 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(85):పూలజడ
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
రంగురంగుల పూలు
రక రకాల పూలు
పూలవనాలు మదిని
మీటే వాయులీనాలు.
మల్లెలు,జాజులు
విరాజాజులు,సంపెంగలు
కాగడాలు,కనకాంబరాలు
పారిజాతాలు,గులాబీలు
ఒక్కో పువ్వూ ఒక్కోరకం
దేనికదే విభిన్న పరిమళం.
నల్లా నల్లనిజడ
నాగుపాములాంటి జడ
జడకుప్పెలతో
వయ్యారంగా
ఊగే జడ!
రసహృదయాల
మది కొల్లగొట్టే జడ.
జడకు
పూలంటే ఇష్టం!
కాదు
అలంకారం!
గిల్లి,గుచ్చి
బారెడు దండను
తలలో తురిమే జడది
పూలపై గుత్తాధిపత్యం!
జడలో అలిగి కూచున్న
పూలుపెట్టిన శాపాలకు
జుట్టు రాలీ.. రాలీ..
మాయమైన జడలు
పోనీలై తేలాయి
పూలజడలు
జ్ఞాపకలై మిగిలాయి.
(Whatsapp group lo vochina oka sandesam chadhivi raayaalani pinchindi.)
86
[19/07, 11:57 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(86):"దీవార్"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
అవును!
గోడలు కూల్చాల్సిందే
మనసులో కట్టుకున్నవైన
దేశానికి హద్దులగానైన సరే!
గోడలెపుడూ
సంకుచితమే..
స్వార్థమే..
మనవత్వపు
విభాజితమే!
రణరంగసిక్తమే!
స్నేహహస్తాలు చాచే
వంతెనలాంటి
గోడలు కావాలిపుడు.
అనాథలకు
అన్నార్తులకు
కూడు-గుడ్డు
అందుబాటులో ఉంచే
మనవత్వపు
సామాజిక దీవార్లే
చౌరస్తాల్లో లేవాలిపుడు.
[19/07, 11:57 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(87):వివాహం
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
పెళ్ళి!
మూడుముళ్ళ బంధం
విడాకులు!
అపసవ్య దిశలో ఏడడుగులు.
భార్య!
ఊరుమారిన వలస జీవి.
భర్త!
మారే అవసరమేరాని
విలాస జీవి.
కుటుంబం!
కలిసుంటే ఆనందనిలయం.
విడిపోతే
విషాద వలయం.
88
[21/07, 9:13 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమూహం
కవిత(88);నువ్వు మారాల్సిందే
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
చూసావా!
నువ్వు మారాల్సిందే.
నీదంతా
ఒట్టి చాదస్తం!
గిరి గీసుకున్న
వలయంలోంచి
ఎంతకీ బయటకు రావేం?
ఉలిపికట్టెలా ఎంతసేపని
ఒంటరిగా నిలబడతావ్.
అందరూ నవ్వినప్పుడు
నువ్వూ నవ్వేసేయ్.
అందరూ ఏడుస్తున్నప్పుడు
కారణం తెలీకున్నా ఏడు.
నక్క వినయాలు ఒలకపోయి.
భజనగీతాలు పాడేసేయ్.
నువ్విప్పుడు మారాల్సిందే!
ఏ ప్రత్యేకతా లేని
యాంత్రిక ముళ్ళు కావాల్సిందే.
లేకపోతే!
మనిషి లెక్కలోంచి
వ్యవకలన మైపోతావ్
నీ ఇష్టం మరి.
[21/07, 9:13 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(89): "డ్రాపౌట్"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀
చెదలుపట్టిన చెక్కను
చీల్చి చెండాడుతూ
చక్రం పట్టిన అభిమన్యుడిలా
రంపమ్ పట్టిన అతడు
పెంచుకున్న గడ్డంతో
మా ఇంట్లో ఒంగోని
పనిచేస్తుంటే...
టీచర్ బుద్ధి ఏడపోయేను.
నువ్వు గోపివి కదూ!
అన్నా పరిశీలన చేస్తూ..
ఊ ..అనాలో
ఊహు.. అనాలో తెలీని
సంధిగ్ధంలో తెలివిగా
బడి ఇడిసి సాన్నాళ్లైంది
అంటూ నసిగాడు
ఒంచినతల ఎత్తకుండానే.
ఆరేళ్ల క్రిందటి
ఏడో తరగతి డ్రాపౌట్!
కబురంపితే..
ఊరిడిసి పోయాడనే
సమాధానం తో సహా
గుర్తు కొచ్చింది.
ఆశ్చర్యం!
నేటి వలస కార్మికుల్లో
డ్రాపౌట్లు ఎందరో?
కదాని...
90
[22/07, 9:56 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(90):"శ్రీమతి"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ఆమెకు
రెక్కలున్నాయ్
ఎగరనివ్వు.
భాషవుంది
ఆమెను
మాట్లాడనివ్వు.
ఆలోచనలు
ఉన్నాయ్
వికసించనివ్వు.
ఆమెకు
ప్రాణముంది
ప్రాధాన్యతనివ్వు.
స్పందనుంది
భావాలు
పంచుకోనివ్వు.
శక్తి ఉంది
నీతో సమానంగా
నడవనివ్వు.
అంతే!
ప్రపంచంలో
ఆమెను మించిన
బహుమతి నీకు
వెదికినా దొరకదు.
[22/07, 9:56 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(91):ఉపాధ్యాయుడు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ఉపాధ్యాయుడు
నిత్యం చిన్నారుల
మధ్య ఉలిపట్టుకు
తిరుగాడే జక్కన.
పిల్లల మనోఫలకాలమీద
భావిచిత్రాలు
గీసే డావిన్సీ.
ఆరోగ్య సూత్రాలు
నేర్పే సుశ్రుతుడు.
ఐనా కూడా!
బాల్యచాపల్యం పోని
చిన్ని శిశువు!
ఒక్కోసారి ప్రేమతో
శిష్యుడిచ్చే చిన్ని
బహుమతికే
పొంగిపోతాడు.
తన మీద
అవగాహన లేమితో
రాసే గాలివార్తలకు
కుంగిపోతాడు.
అతనిలోని
సంవేదన,
సృజనాత్మకత
పెల్లుబికిందా..
ఎక్కుపెట్టిన తూనీరమై
విస్ఫోటనం చెందిన
విజ్ఞానమై ప్రగతి
రథచక్రాల మధ్య
ఇరుసై ఇమిడిపోతాడు.
92
[23/07, 9:50 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(92) : "డైరీ"
రచన: సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀
నా డైరీ!
ఉగాది పచ్చడి
షడ్రుచుల మేళవింపు.
కొన్ని పేజీలు
మధురోహలు.
కొన్ని పేజీలు
కన్నీటి చారికలు.
మరికొన్ని
పూలవనాలు.
ఇంకొన్ని
హాస్యవల్లరులు.
కొన్ని జాలిపాటల
జావళీలు.
పెద్దగా
రహస్యాలేం లేవ్.
అంతా!
బహిర్గతమే
ప్రస్ఫుటితమే.
గతం పునాదుల
మీద నిలబెట్టి
వర్తమాన
భవంతుల్లో
సేదతీర్చి
భవిష్యత్
డాబా మీద
ఆరాంగా
కునికిపాటలు
పాడుకునే
ప్రణాళికా రచనలే.
93
[23/07, 9:50 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత (93) :కరోన నానీలు
రచన: సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
1. కరోనా
సినిమా బ్లాక్బస్టర్
ప్రొడ్యూసర్
చైనవాలా.
2. కరోనా
సోకులు
మ్యాచింగ్
మాస్కులు.
3.కరోనా
లాజిక్కు
నీవు నాకెంత దూరమో
నేను నీకంతే దూరం.
4.కరోనాతో
షాదీ ఐయిందా
దునియాతో
విడాకులే.
94
[24/07, 9:40 AM] Sunkara Sreelatha KS 21: సమూహం :వీరాస్ కవి
సమయం
కవిత (94):దిగులు పడకు
నేస్తమా!
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
మనిషి
దేన్ని కోల్పోయినా
అది ఒక
జ్ఞాపకమై
మిగులుతుంది.
మరి!
ఙ్ఞాపకాలనే
కోల్పోతే?
సృష్టి!
మన ఊహకందని
సంకల్పాలని
సృజించే క్రమంలో
జరిపిన
ఒకానొక క్రియే
జ్ఞాపకాల విధ్వంసం.
ఆ ధ్వంసరచన కూడా
ఏదో ఒక రోజు
సరి కొత్తరూపం లో
మొలకెత్తక మానదులే
దిగులు పడకు నేస్తమా!
[24/07, 9:40 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(95) : "తగువు"
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
ప్రతిదీ లెక్కాచారంగా
బతికే మనిషికి
లెక్కలు రాకపోతే
అన్నీ చిక్కులే!
భౌతిక ప్రపంచం లో
పరమాణు నిర్మాణం
అర్థమైతే చాలు
విశ్వాన్ని చుట్టేయొచ్చు.
రాజనీతి నేర్పే
పాఠాలే కదా!
ప్రభుత్వ పాలనాధికార
శాసనాలు.
భాషలేనిచోట
ఏ శాస్త్రమైనా
అభివ్యక్తి లేక
అణగారిపోదు!
జీవించి వుంటే కదా
ప్రతిదీ సాధ్యమైయేది.
జీవి ఆవిర్భావం గురించి
మనుగడ గురించి
మరి తెలుసుకోరా?
గర్భస్త శిశువుగావున్నపుడే
కాళ్ళు,చేతులు కదుపుతూ
మొదలెట్టిన ఆటలు
బయటికి వొచ్చాక ఆపేస్తే
నాడీ వ్యవస్థే
అస్తవ్యస్తమై పోదూ!
అందుకే!
దేనికదే ప్రాముఖ్యం
కలసి సాగితేనే
ఏదయినా
సఫలీకృతం.
96
[25/07, 9:10 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత (96) : రిహార్సల్
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఆ కళ్ళు
వెదుక్కుంటున్నాయ్.
నిర్మలమై,స్వచ్ఛమై
కాంతిపుంజాల్లా వెలిగే
కళ్ళు !
వెదుక్కుంటున్నాయ్.
బోర్లాపడి బోసినోరుతో
మెడను మోరగా ఎత్తి
తలను తలోదిక్కు తిప్పుతుంటే
ఊగే ఉంగరాలముంగురులు
దూరంగా చూస్తుంటే
అన్నమయ్య చింతకాయజడల
చిన్నికృష్ణుని వర్ణనే
కళ్ళముందు సదృశమైంది.
అన్వేషణ కాస్తముదిరి
దిగులు పొంగగా
బుంగ మూతితో
మారిన ముఖకవళికలతో
ఉక్రోశంతో ఉంగాఏడుపును
లంఘించుకుంటే
రెండుజతల కళ్ళు
కన్నీటిచెలమలైయ్యాయి.
మెటర్నిటీలీవు ఐపోతుండగా
రేపటి రోజుల కోసం చేస్తున్న
రిహార్సల్ నాపి తల్లిమనసు
పరుగున వెళ్ళి
గుండెలకు హత్తుకుంది.
అమ్మకనిపించగానే అంత
యేడుపూ మానిన
చిన్నారి!
విజయగర్వంతో
విప్పారినవదనంతో
బాలాత్రిపురసుందరై
నవ్వులు వెదజల్లుతోంది.
97
[25/07, 9:10 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత(97) : రోడ్డెమ్బడి
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
రోడ్డు ఎందుకో
రక్త మోడుతోంది.
చితికిన బొబ్బలు
నెర్రలు చీలిన
పాదాల పగుళ్లలోంచి
స్రవిస్తున్న శ్రామిక
రుధిరజలంతో
రోడ్డు ఎందుకో
రక్త మోడుతోంది.
నెత్తిన మూట
కడుపులో అరట
బతికేందుకు
ఏమాత్రం భరోసానివ్వని
ఖాళీ పర్సు.
కష్టమేదైనా గాని
బిడ్డా నీకు నెనున్ననే
కన్న తల్లి !
కడుపుతీపి మాట
ఇంటిబాట పట్టిస్తుంటే
రోడ్డు నిండా
బతుకు నదిని
ఈదుతున్న గజయీతగాళ్లయి
రహదారుల దాహానికి
గుప్పెడు రక్తాన్ని పన్ను కడుతూ
తల్లివేర్లు వెదుక్కుంటున్న
పిల్లవేర్లయి సాగిపోతున్నారు.
98
[26/07, 8:19 AM] Sunkara Sreelatha KS 21: సమూహం: వీరాస్ కవి
సమయం
కవిత (98) : పునర్నిర్మాణం
రచన : సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నన్ను నేను పునర్నిర్మించుకునే
పనిలో నిమగ్నమైనాను.
నా ఆంక్షల్ని ఆశయాల్ని
గుప్పెడు సంకల్పాలతో
రగిలించుకుంటున్నాను.
సర్దుకుపోవటాలు
రాజీపడటాల్ని
అటకెక్కించేసాను.
నన్ను కనపడనీయకుండా
దాచేసినవేవీ ఇపుడు
నా ముందు లేకుండా
తొలగించేసుకుంటున్నాను.
పాత ప్రపంచమే
మెరుగులద్దిన కొత్త
బంగారు లోకంలా
మెరిసిపోతోంది.
శిథిలాలు కూలుతున్న
చప్పుడిపుడు నాకు
సుశ్రావ్యంగా వినిపిస్తోంది.
విత్తునుండి చీల్చుకు
రావడంలోని ప్రయాస
నాకు అనుభవమౌతోంది.
పునర్నిర్మాణం లోని
ఉత్తేజం కాంతిపుంజమై
నాకు వెలుగుదారి
చూపెడుతోంది.
[26/07, 8:19 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత (99) :మలుపు
రచన :సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
అపజయాలెప్పుడూ
రాబోయే !
అఖండ విజయాలకు
గెలుపుల మలుపులే.
ఒక్కక్షణం!
నిన్ను నీవుతెలుసుకొనే
అవగాహనా శిబిరాలే.
ప్రయత్నాలతో మరింత
రాటుతేలాల్సిన భాధ్యతను
గుర్తుచేసే చురకత్తులే!!
ఏం ఫర్వాలేదు
నీ వెనుక మేమున్నాం
అని అభయమిచ్చే
ఆత్మీయులను!
అండగానిలిపే
అపజయాలెప్పుడూ
గెలుపుల మలుపులే.
100
[26/07, 8:20 AM] Sunkara Sreelatha KS 21: సమూహం:వీరాస్ కవి
సమయం
కవిత (100) : నా కవితలు
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నా కవితలు
మనోసేద్యంలో
ఒలికిన
చెమట చుక్కలు.
నా కవితలు
ఆలోచనల
పాదులనుంచి
పొడుచుకొచ్చిన
అడవి మొక్కలు.
నా కవితలు
ఊహలపల్లకిపై
నను ఊరేగించిన
పిల్లతెమ్మరలు.
నా కవితలు
మనసుపొరలను
తేరిపార చూసిన
మనో విశ్లేషకులు.
నాకవితలు
భావనా ఉద్యానవనంలో
పూసిన శతకుసుమాలు.
నా గురుదేవుల
పాదాలనర్చించే
పరిమళ ద్రవ్యాలు.
Prapanchanni kallatho kaakunda manasutho chustunaru. Daaniki jeevitham pai chala spasthatha kaavali. Mee kavithalalo adi uttipaduthundi...◉‿◉good job. Go ahead. Sky is your limit (•‿•)
ReplyDelete