తాండ్ర చిరంజీవి KS 23
నిర్వహణ ః వీరా గుడిపల్లి
***********************
1
******************
తేది : 21/05/2020
కవి సంఖ్య : 23
కవి పేరు : తాండ్ర చిరంజీవి
జిల్లా : వరంగల్ అర్భన్
చరవాణి : 9959180762
కవిత సంఖ్య : 01
శీర్షిక : గురువు
——————————
భక్తి నేర్పువాడు గురువు
శక్తి నిచ్చువాడు గురువు
అనుభవాల జ్ఞాపకం గురువు
ఆదరించే మనసు కలవాడు గురువు
లొసగులు తెలిపేవాడు గురువు
లోగుట్టును విప్పేవాడు గురువు
పరిస్థితుల మార్చేవాడు గురువు
ప్రకాశింప జేయువాడు గురువు
అనుభవాల పాఠం గురువు
అందరిని మెప్పించేవాడు గురువు
సాధన యోధుడు గురువు
సమస్య పూరకుడు గురువు
ఉన్నత బోధన గురువు
ఉత్తమ విద్యార్థి గురువు
పాఠం పండించువాడు గురువు
ప్రశ్నలు సందించువాడు గురువు
ఓదార్పు నిచ్చువాడు గురువు
ఓర్పును అనుగ్రహించువాడు గురువు
ఉద్యమానికి ఊపిరి గురువు
పాటకు రాగం గురువు
గురువు మాట " ఔదార్యం "
గురువాజ్ఞ " శిరోదార్యం " !!
[21/05, 11:
: వీరాస్ కవి సమయం
*****************
2
కవి సంఖ్య : 23
పేరు : తాండ్ర చిరంజీవి
జిల్లా : వరంగల్ అర్భన్
చరవాణి : 9959180762
కవిత సంఖ్య : 02
శీర్షిక : జంట నగరాలు
——————————
జంట నగరాలు
హైదరాబాద్ సికింద్రాబాద్
వానకు మీరు..
తడిసిన ముద్దలు
కలిమి లేములకు..
కావడి కుండలు
అభివృద్దికి..
నిదర్శనాలు
బతుకు దెరువుకు..
ఆధారాలు
ఉగ్రమూకలకు..
ఉక్కు పిడికిళ్ళు
టెక్నాలజీకి..
టెంపరోళ్ళు
కళలకు..
నిలయాలు
వలస వాదులకు..
బసలు మీరు
గుళ్ళు గోపురాలకు..
గుర్తు మీరు
పర్యాటకానికీ..
పట్టుమీరు
చరిత్రకు..
అద్దం మీరు !!
3
కవి సంఖ్య : 23
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్
శీర్షిక : తరువు
———————
తరువు..
నువ్వే మా గురువు
రాళ్ల దెబ్బలకు
రంజి పడలేదు
ఉరుములు మెరుపులకు
ఉలికి పడలేదు
కొమ్మలిరిగినా గాని
చింత పడలేదు
ప్రాణం పోయినా గాని
బాధపడలేదు
మొద్దువైనా నీవు
మోడు వారలేదు
చిరుజల్లుకు నీవు
చిగురు తొడిగావు..
ఎండలకు నీవు
ఏపుగా ఎదిగావు..
ఎండిందిరా.. మ్రాను అనుకుంటే..
బ్రతికి బట్టకట్టడం నేర్పించినావు.
4
కవి సంఖ్య : 23
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్
కవిత సంఖ్య : 04
# పట్టాల పై పాదయాత్ర #
—————————————
కరోనా...?
ఎంతటి దౌర్భాగ్య స్థితి తెచ్చావే ?
పొట్టకూటి కోసం
వలస కూలీలుగా వచ్చినవారు
బతక లేక
మూటముల్లే సదురుకోని
సంకలల్ల బిడ్డల్ని ఎత్తుకొని
సక్కగా రైలు పట్టాలెంబడి
పాదయాత్ర చేసుకుంటూ
వాళ్ళ రాష్ర్టాలకు బోతుండ్లు !
కలో గంజో తాగి
ఈడనే వుందా మనుకుంటే
కరోనా గజ్జున వణికిస్తుండే..
కరుణించే జాడలు లేక
ఆకలికి తట్టుకో లేక
ఉన్నఊరే ఉత్తమమని
నడకను నమ్ముకోబట్టే !
నడక సాగితే మంచిదే
కానీ..!
ఓ పక్క మూటలు
మరో పక్క
అల్లరిచేసే తూటలు
గంటెత్తు కుంటనే
గుంజిసత్తది చేయి
ఇప్పుడు...
ఎన్ని గంటలైతాందో మోయబట్టి !
కరోనా...ఉన్నకాడుండక
చైనా నుంచి ఉరికి వత్తివి
వచ్చిందానివి ఓ మూలనుండక
లోకాన్ని చుట్టేస్థివి
అంతటితో ఆగితివా..?
పాణాలు తీసుకుంట
పరిహాస మాడుతాంటివి !
ఇంకెన్ని రోజులు
నీ ఆటలు కరోనా..?
ఓ మందు , సూదో వచ్చేవరకే
" నవ్విన నాపచేను పండదన్నట్లు "
నిన్ను చంపే టైం దగ్గర్లనే వుంది !!
మా వలస కూలీల
పాదాలకు విశ్రాంతి టైం
అతి దగ్గరలోనే వుంది !!
తేది 20/05/2020
5
ప్రభుత్వమా ఆదుకో... !!
————————————
ఉదయం లేస్తే పేపర్ కావాలి..!
టీవి పెడితే ఎక్కడ ఏం జరుగుతుందో
తెలుసుకోవడానికి వార్తలు కావాలి.. !
అవి కావాలంటే.... !!
నిరంతరం పనిచేస్తున్న విలేకరులను
రిపోర్టర్లను, పాత్రికేయులను
మనం మరచి పోగూడదు .
భార్య బిడ్డలను వదలి..
"కరోనా " వార్తలను ఎప్పటికప్పుడు
ప్రభుత్వానికి , ప్రజలకు చేరవేస్తూ..
అనేక ఇబ్బందులను పడుతున్నరు.
ప్రభుత్వం ప్రజలకు " కరోనా " వస్తదని
గృహ నిర్భందం చేయమన్నరు.
వార్తలను సేకరించుటకు విలేకరులను
రిపోర్టర్లను ఇంట్లో ఉండద్దన్నరు.
మరీ ! విలేకరులకు , రిపోర్టర్లకు కరోనా రాదా .. ?
వస్తే వీరి కుటుంబాలు , పిల్లల పరిస్థితి ఏమిటి .. ?
ప్రభుత్వమా ఆలోచించు..
ఎప్పటి వార్తలను అప్పుడే
లైవ్ లో అందిస్తున్న విలేకరులు
రిపోర్టర్లు , పాత్రికేయులు
మనకు చాలా అవసరం .
మనకోసం నిరంతరం శ్రమిస్తున్న వారికి
ప్రభుత్వం మాస్కులను, సానిటైజర్స్ ను ,
సమయానికి ఆహారాన్ని అందించాలి
వారి కుటుంబాలకు భద్రతను కల్పించాలి.
మెడికల్ ఫెసిలిటి మరియు ఇన్సూరెన్సు
లాంటి అవకాశాలను అందించి
వారిని ఎల్లప్పుడు ఆదుకోవాలి !!
కవిత సంఖ్య : 05
కవిసంఖ్య :23
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్
సెల్ : 9959180762.
6
వీరాస్ కవి సమయం
కవి సంఖ్య : 23
కవిత సంఖ్య : 06
నిజమైన దేవుడు " డాక్టరే " !!
——————————————
మనుషులకు దేవుడిపై నమ్మకం వుండాలి
అంతేకాని గుడ్డినమ్మకం కాదు
పూజలు,ప్రార్థనలు , నమాజులు చెప్పాయా
"కరోనా " ఎపుడు చచ్చి పోతుందని
ఏదో చెప్పాలి కాబట్టి అందరు ఏవేవో మాటలు
వారి కడుపు తిప్పల కోసం చెబుతున్నారు
కంటికే కనిపిస్తలేదు " కరోనా " ఐన
ప్రపంచాన్ని కల్లోలం చేసి శవాలుగా మారుస్తుంది
ఇంకా కొందరు ఈదేవుడని ఆదేవుడని
బుకాయింపు మాటలు చెబుతున్నారు
దేవుళ్ళే గుడి తలుపులు మూసుకొని పడుకున్నారు
ఇక దయ్యాల ఊసేలేదు
మహామహా సంపన్న దేశాలే కరోనా కత్తికి
భలైపోతుంటే ఇంకా గుడ్డినమ్మకాలే....!
మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసిన
మన పద్దతులు ఆచారాలు...
కరోనాకు ఆడమగ తేడాలేదు
వున్నోళ్ళు లేనోళ్ళు అని తేడాలేదు
చిన్నాపెద్దా , ఈమతం ఆమతం, నలుపు తెలుపు
అనే తేడాలు అసలు లేవు
క్షణాలలో ఎటునుంచి ఎటైన వచ్చి చంపేస్తుంది
మనల్ని మనం రక్షించుకోవాలంటే
ఇల్లుదాటి బయటకు రాకుండా వుండడమే
అనునిత్యం శుభ్రతను పాటించడమే
ఇప్పుడు ప్రపంచానికి ఒక్కదేవుడే వున్నాడు
ఆయనే ప్రాణంపోసే " డాక్టరు "
ఆ వైద్యుని నిరంతర పోరాట ఫలితమే
మన ప్రాణాలకు రక్షణ.
అతడు కనిపెట్టే మందు
కరోనాకు విరుగుడు మందు
ఏకులమైన ఏమతమైన పూజించాల్సింది డాక్టరును
ప్రాణాపాయం అని తెలిసిన వారి ప్రాణాల్ని
పణంగా పెట్టి కరోనాతో పోరాడుతున్నారు
చివరికి సైన్సు గెలిచింది
ఇకనైన తారతమ్యాలు ,భేదాలు వదలి
అందరం మనుషులుగా బ్రతుకుదాం
సైన్సు మన నమ్మకం
ప్రపంచానికి సైన్సు ప్రాణరక్షణ ప్రాణభిక్షణ !!
" వైద్యుల పాదాలకు శతకోటి వందనాలు "
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్
సెల్ : 9959180762.
***********************
1
******************
తేది : 21/05/2020
కవి సంఖ్య : 23
కవి పేరు : తాండ్ర చిరంజీవి
జిల్లా : వరంగల్ అర్భన్
చరవాణి : 9959180762
కవిత సంఖ్య : 01
శీర్షిక : గురువు
——————————
భక్తి నేర్పువాడు గురువు
శక్తి నిచ్చువాడు గురువు
అనుభవాల జ్ఞాపకం గురువు
ఆదరించే మనసు కలవాడు గురువు
లొసగులు తెలిపేవాడు గురువు
లోగుట్టును విప్పేవాడు గురువు
పరిస్థితుల మార్చేవాడు గురువు
ప్రకాశింప జేయువాడు గురువు
అనుభవాల పాఠం గురువు
అందరిని మెప్పించేవాడు గురువు
సాధన యోధుడు గురువు
సమస్య పూరకుడు గురువు
ఉన్నత బోధన గురువు
ఉత్తమ విద్యార్థి గురువు
పాఠం పండించువాడు గురువు
ప్రశ్నలు సందించువాడు గురువు
ఓదార్పు నిచ్చువాడు గురువు
ఓర్పును అనుగ్రహించువాడు గురువు
ఉద్యమానికి ఊపిరి గురువు
పాటకు రాగం గురువు
గురువు మాట " ఔదార్యం "
గురువాజ్ఞ " శిరోదార్యం " !!
[21/05, 11:
: వీరాస్ కవి సమయం
*****************
2
కవి సంఖ్య : 23
పేరు : తాండ్ర చిరంజీవి
జిల్లా : వరంగల్ అర్భన్
చరవాణి : 9959180762
కవిత సంఖ్య : 02
శీర్షిక : జంట నగరాలు
——————————
జంట నగరాలు
హైదరాబాద్ సికింద్రాబాద్
వానకు మీరు..
తడిసిన ముద్దలు
కలిమి లేములకు..
కావడి కుండలు
అభివృద్దికి..
నిదర్శనాలు
బతుకు దెరువుకు..
ఆధారాలు
ఉగ్రమూకలకు..
ఉక్కు పిడికిళ్ళు
టెక్నాలజీకి..
టెంపరోళ్ళు
కళలకు..
నిలయాలు
వలస వాదులకు..
బసలు మీరు
గుళ్ళు గోపురాలకు..
గుర్తు మీరు
పర్యాటకానికీ..
పట్టుమీరు
చరిత్రకు..
అద్దం మీరు !!
3
కవి సంఖ్య : 23
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్
శీర్షిక : తరువు
———————
తరువు..
నువ్వే మా గురువు
రాళ్ల దెబ్బలకు
రంజి పడలేదు
ఉరుములు మెరుపులకు
ఉలికి పడలేదు
కొమ్మలిరిగినా గాని
చింత పడలేదు
ప్రాణం పోయినా గాని
బాధపడలేదు
మొద్దువైనా నీవు
మోడు వారలేదు
చిరుజల్లుకు నీవు
చిగురు తొడిగావు..
ఎండలకు నీవు
ఏపుగా ఎదిగావు..
ఎండిందిరా.. మ్రాను అనుకుంటే..
బ్రతికి బట్టకట్టడం నేర్పించినావు.
4
కవి సంఖ్య : 23
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్
కవిత సంఖ్య : 04
# పట్టాల పై పాదయాత్ర #
—————————————
కరోనా...?
ఎంతటి దౌర్భాగ్య స్థితి తెచ్చావే ?
పొట్టకూటి కోసం
వలస కూలీలుగా వచ్చినవారు
బతక లేక
మూటముల్లే సదురుకోని
సంకలల్ల బిడ్డల్ని ఎత్తుకొని
సక్కగా రైలు పట్టాలెంబడి
పాదయాత్ర చేసుకుంటూ
వాళ్ళ రాష్ర్టాలకు బోతుండ్లు !
కలో గంజో తాగి
ఈడనే వుందా మనుకుంటే
కరోనా గజ్జున వణికిస్తుండే..
కరుణించే జాడలు లేక
ఆకలికి తట్టుకో లేక
ఉన్నఊరే ఉత్తమమని
నడకను నమ్ముకోబట్టే !
నడక సాగితే మంచిదే
కానీ..!
ఓ పక్క మూటలు
మరో పక్క
అల్లరిచేసే తూటలు
గంటెత్తు కుంటనే
గుంజిసత్తది చేయి
ఇప్పుడు...
ఎన్ని గంటలైతాందో మోయబట్టి !
కరోనా...ఉన్నకాడుండక
చైనా నుంచి ఉరికి వత్తివి
వచ్చిందానివి ఓ మూలనుండక
లోకాన్ని చుట్టేస్థివి
అంతటితో ఆగితివా..?
పాణాలు తీసుకుంట
పరిహాస మాడుతాంటివి !
ఇంకెన్ని రోజులు
నీ ఆటలు కరోనా..?
ఓ మందు , సూదో వచ్చేవరకే
" నవ్విన నాపచేను పండదన్నట్లు "
నిన్ను చంపే టైం దగ్గర్లనే వుంది !!
మా వలస కూలీల
పాదాలకు విశ్రాంతి టైం
అతి దగ్గరలోనే వుంది !!
తేది 20/05/2020
5
ప్రభుత్వమా ఆదుకో... !!
————————————
ఉదయం లేస్తే పేపర్ కావాలి..!
టీవి పెడితే ఎక్కడ ఏం జరుగుతుందో
తెలుసుకోవడానికి వార్తలు కావాలి.. !
అవి కావాలంటే.... !!
నిరంతరం పనిచేస్తున్న విలేకరులను
రిపోర్టర్లను, పాత్రికేయులను
మనం మరచి పోగూడదు .
భార్య బిడ్డలను వదలి..
"కరోనా " వార్తలను ఎప్పటికప్పుడు
ప్రభుత్వానికి , ప్రజలకు చేరవేస్తూ..
అనేక ఇబ్బందులను పడుతున్నరు.
ప్రభుత్వం ప్రజలకు " కరోనా " వస్తదని
గృహ నిర్భందం చేయమన్నరు.
వార్తలను సేకరించుటకు విలేకరులను
రిపోర్టర్లను ఇంట్లో ఉండద్దన్నరు.
మరీ ! విలేకరులకు , రిపోర్టర్లకు కరోనా రాదా .. ?
వస్తే వీరి కుటుంబాలు , పిల్లల పరిస్థితి ఏమిటి .. ?
ప్రభుత్వమా ఆలోచించు..
ఎప్పటి వార్తలను అప్పుడే
లైవ్ లో అందిస్తున్న విలేకరులు
రిపోర్టర్లు , పాత్రికేయులు
మనకు చాలా అవసరం .
మనకోసం నిరంతరం శ్రమిస్తున్న వారికి
ప్రభుత్వం మాస్కులను, సానిటైజర్స్ ను ,
సమయానికి ఆహారాన్ని అందించాలి
వారి కుటుంబాలకు భద్రతను కల్పించాలి.
మెడికల్ ఫెసిలిటి మరియు ఇన్సూరెన్సు
లాంటి అవకాశాలను అందించి
వారిని ఎల్లప్పుడు ఆదుకోవాలి !!
కవిత సంఖ్య : 05
కవిసంఖ్య :23
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్
సెల్ : 9959180762.
6
వీరాస్ కవి సమయం
కవి సంఖ్య : 23
కవిత సంఖ్య : 06
నిజమైన దేవుడు " డాక్టరే " !!
——————————————
మనుషులకు దేవుడిపై నమ్మకం వుండాలి
అంతేకాని గుడ్డినమ్మకం కాదు
పూజలు,ప్రార్థనలు , నమాజులు చెప్పాయా
"కరోనా " ఎపుడు చచ్చి పోతుందని
ఏదో చెప్పాలి కాబట్టి అందరు ఏవేవో మాటలు
వారి కడుపు తిప్పల కోసం చెబుతున్నారు
కంటికే కనిపిస్తలేదు " కరోనా " ఐన
ప్రపంచాన్ని కల్లోలం చేసి శవాలుగా మారుస్తుంది
ఇంకా కొందరు ఈదేవుడని ఆదేవుడని
బుకాయింపు మాటలు చెబుతున్నారు
దేవుళ్ళే గుడి తలుపులు మూసుకొని పడుకున్నారు
ఇక దయ్యాల ఊసేలేదు
మహామహా సంపన్న దేశాలే కరోనా కత్తికి
భలైపోతుంటే ఇంకా గుడ్డినమ్మకాలే....!
మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసిన
మన పద్దతులు ఆచారాలు...
కరోనాకు ఆడమగ తేడాలేదు
వున్నోళ్ళు లేనోళ్ళు అని తేడాలేదు
చిన్నాపెద్దా , ఈమతం ఆమతం, నలుపు తెలుపు
అనే తేడాలు అసలు లేవు
క్షణాలలో ఎటునుంచి ఎటైన వచ్చి చంపేస్తుంది
మనల్ని మనం రక్షించుకోవాలంటే
ఇల్లుదాటి బయటకు రాకుండా వుండడమే
అనునిత్యం శుభ్రతను పాటించడమే
ఇప్పుడు ప్రపంచానికి ఒక్కదేవుడే వున్నాడు
ఆయనే ప్రాణంపోసే " డాక్టరు "
ఆ వైద్యుని నిరంతర పోరాట ఫలితమే
మన ప్రాణాలకు రక్షణ.
అతడు కనిపెట్టే మందు
కరోనాకు విరుగుడు మందు
ఏకులమైన ఏమతమైన పూజించాల్సింది డాక్టరును
ప్రాణాపాయం అని తెలిసిన వారి ప్రాణాల్ని
పణంగా పెట్టి కరోనాతో పోరాడుతున్నారు
చివరికి సైన్సు గెలిచింది
ఇకనైన తారతమ్యాలు ,భేదాలు వదలి
అందరం మనుషులుగా బ్రతుకుదాం
సైన్సు మన నమ్మకం
ప్రపంచానికి సైన్సు ప్రాణరక్షణ ప్రాణభిక్షణ !!
" వైద్యుల పాదాలకు శతకోటి వందనాలు "
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్
సెల్ : 9959180762.
Comments
Post a Comment