మృత్యుంజయ KS 25
నిర్వహణ
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
1
2
11/05, 9:36 AM] మృత్యుంజయ KS: 🙏 నమస్కారం గురువుగారు
పేరు: గోశికొండ మృత్యుంజయ
కవిత సంఖ్య: 3
గ్రామం: రాంపూర్
మండలం: హుజురాబాద్
జిల్లా: కరీంనగర్
చరవాణి: 9291573564
కవితా శీర్షిక:
మతమా..?ఆధ్యాత్మికమా..?
అస్తిత్వం కోల్పోయిన వ్యక్తిత్వాలు
మతం తాలూకు మరకలు
పులుముకున్నాయి
మారణహోమం సృష్టిస్తున్నాయి
అణువంత మతం కోసం
అనంత ఆధ్యాత్మికతను
వదిలి...
హింసను చేపట్టాయి
చీకటి గుహల్లో గబ్బిలాల్లా
నిశాచరమతంలో సంచరించడం...తప్ప అవి
ఆధ్యాత్మిక వెలుగును చూడబోవు
ఏనాడు...
నీది... ఏ మతమైతేందోయ్
మంచిగుంటూ
మంచి చెయ్యి... ఇంతకుమించి న
మతముందా?
ఆత్మజ్ఞానాన్ని మించిన
ఆధ్యాత్మికతుందా?
ఒక్కసారి ఆలోచించు...
హామీ పత్రం
మతమా..?ఆధ్యాత్మికమా..? శీర్షికన గల వచన కవిత నా యొక్క సొంత రచన అని తెలుపుతున్నాను
[14/05, 9:01 AM] మృత్యుంజయ KS: పేరు: గోశికొండ మృత్యుంజయ
4
గ్రామం: రాంపూర్
చరవాణి: 9291573564
కవితా సంఖ్య: 04
కవితా శీర్షిక:
జ్ఞాన జ్ఞాపకం మాబడి
ప్రతియేటా
మృగశిర వాన సినుకుల్లో
తడిసి
పవిత్ర స్నానంతో... నేను
బడి అనే...గుడికెళ్లిన
జ్ఞాపకం
బడిగంట గుడిగంట శబ్దంగా
తనువు తన్మయత్వం
చెట్ల కింద చదువులు
ఆటపాటల సంబరాలు
పైస లేని నాకు
సదువు నేర్పిన సరస్వతి
పగటీలి బువ్వ పెట్టిన
పార్వతి... "మా సర్కారు బడి"
కార్పోరేట్ సదువు మోజుకు
శిథిలావస్థ శిలల్లో
మా ఊరి
సర్కారు బడి
అయినా... నా మదిలో
జ్ఞాన జ్ఞాపకాలు భద్రంగా
దాచుకోవడం తప్ప
చేసేదేమి
లేదనిపిస్తుంది
హామీ పత్రం
జ్ఞాన జ్ఞాపకం మాబడి శీర్షికన గల కవిత నా యొక్క సొంత రచన
ఇట్లు
గోశికొండ మృత్యుంజయ
చరవాణి:9291573564
5
[20/05, 5:18 PM] మృత్యుంజయ KS: శీర్షిక : తస్మాత్...జాగ్రత్త..!
సూక్ష్మంలో మోక్షం...తత్వం
సూక్ష్మ జీవితో నాశనం...శాస్త్రం
భూమి గాలి నీరు అంతటా తానే
ఆదమరిస్తే అందరికీ అనర్థమే...
నీ చేతుల్లోనే ఆరోగ్యం...తెచ్చుకోకు
చే జేతుల అనారోగ్యం...
ఇప్పుడూ...
నీ ఇల్లే స్వర్గసీమ
చేతులశుభ్రతే శ్రీరామరక్ష...
అడుగుబయట పడిందా..! అంతమే
నీ చావు నువ్వు కొని తెచ్చుకోవడమే.
ఇదివరకు సత్తే...
నలుగురచ్చేది పాపమనేది
అశ్రునివాళితో..ఆత్మశాంతి కోరుకునేది
కరోనా...రోగంతో సత్తే...
వీని సావు..మన సావు కచ్చే...
అంటూ...తిట్టుకుంటది సమాజం.
తస్మాత్ ..జాగ్రత్త..!
తరచూ చేతులుకడుగూ...
ఇంట్లోనే ఉండూ...
ఇట్లు
గోశికొండ మృత్యుంజయ
కవిత సంఖ్య: 05
రాంపూర్ ,హుజురాబాద్
జిల్లా:కరీంనగర్ తెలంగాణ
చరవాణి: 9291573564
[20/05, 5:23 PM] మృత్యుంజయ KS: మినీ కవిత:
6
వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య : 06
శీర్షిక : ఓ ప్రపంచమా.!వందనమిడూ..
హరిజనుల కే ఆరాధ్యుడా..? కాదు
భరతావని కే పూజనీయుడా..?కాదు..కాదు
జగతికే జ్ఞాన భిక్షువతడూ...
భారత రాజ్యాంగ నిర్మాతా...రాజర్షి
భరతమాత నుదుటి గీత విధాతా...దేవర్షి
ప్రపంచప్రఖ్యాత ప్రదాతా..మహర్షి అతడే..అంబేద్కర్
రచన
గోశికొండ మృత్యుంజయ
రాంపూర్,
హుజురాబాద్, కరీంనగర్
చరవాణి :9291573564
7
[21/05, 6:57 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 07
అంశం: లలిత కళలు
శీర్షిక: భారతీయతే...ఒక కళ
అరవైనాలుగు కళలను... అలుముకొని
ఆలింగనం చేసుకొని...అల్లుకున్న
భారతీయతనే... లతల వలె పెనవేసుకున్న
"లలిత కళలు"...
మానవ జీవితాన్ని "కళ"గా మార్చాయి
తనువు యంత్రంగా మారి,
జీవనం యాంత్రికమై...
"ఆత్మ వివేచన" లేక...
అంతరిక్ష చూపులే...మిగిలిన
తరుణంలో...
"భారతీయ జీవితమే" ఒక కళ
అంటూ నిరూపిస్తాయి..."లలిత కళలు"
పశుపక్ష్యాదుల అరుపులే అని,చులకన
చేయకు..."సంగీతాన్ని"
మానసిక శక్తిని నిలిపి
"సామవేదసారం" తెలిపే సప్తస్వరాలు... అవి
రాళ్లురప్పలని నిర్లక్ష్యం చెయ్యకు
"శిల్పాన్ని"...
శిల శిల్పమై... ఆరాధన విగ్రహమై...
నీలో..."నిగ్రహం" పెంచి
ఆధ్యాత్మికతకు...తోవ చూపును... అది
"చిత్రలేఖనం"...ది
పిచ్చిచిత్రాల రంగులు కాదు
సృష్టి సృజనతను, ప్రకృతి రమ్యతను
తెలిపే... సప్తవర్ణ చిత్రాలు...అవి
పనికిమాలిన రాత కాదు...
"కవిత్వా"నిది... నీ ఆలోచన,
మనోభావాల...
ఆత్మసాక్షాత్కార అక్షర రూప
దివ్య తేజస్సు...అది
- గోశికొండ మృత్యుంజయ
రాంపూర్, హుజురాబాద్
జిల్లా: కరీంనగర్, తెలంగాణ
చరవాణి: 9291573564
8
వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 08
కవితా శీర్షిక:
బహురూపుల నాటకాలు
కాలిపోయే దేహం
గడ్డకట్టే నెత్తురు
కుళ్లిపోయే మాంసం
విరిగిపోయే ఎముకలు
ముడతలుపడే చర్మం
ఏనాటికైనా
మట్టిలో కలిసిపోవు
అయినా...
అంతరాత్మ యందు
అపరాధములు నిలిపి
ఎదుటి వానికి
మంచి లాగా
ఉరుకులాట... పరుగులాట
శ్రమకు మించి
పాకులాట...
నా మది నిమ్మలము కై,
మధుర జ్ఞాపకం కై
మోసం,దగా,కుట్రలెన్నో
కనిపించకుండా
బహురూపుల నాటకాలెన్నో
నా జీవితానా....
🖊 గోశికొండ మృత్యుంజయ
రాంపూర్,హుజురాబాద్
జిల్లా: కరీంనగర్
చరవాణి: 9291573564
9.
కవిత సంఖ్య: 09
కవిత శీర్షిక : "శీతల"...నయనాలకై
గ్రీష్మకాల...
సుప్తావస్థను మిగిల్చింది
ఇంటిలోనే...
ఉండమంటూ ఆదేశం
జారీచేసింది
ఈ వేసవి కాలం... నాకు
భగ భగ మండే
సూర్య తాపానికి... సాక్ష్యం
వాడి,మాడిపోయిన
లేత చిగురు పత్రం
ఎండమావుల నీటి
జాడలు తప్ప...రోడ్లు
వాహన చక్రాల
ఘర్షణ...సంఘర్షణ లేక
నిర్మానుష్యంగా
విశ్రాంతి కోరుకుంటున్నాయి
ఉక్కిరి బిక్కిరి ఉక్కపోతల్లో...
ఉష్ణమే జనించే
ఉచ్వాస నిశ్వాస... గాలుల్లో
తనువు...
వర్షం స్పర్శకై ఆరాటం
నేలతల్లి...నెర్రెలు
వర్ష బిందువుల్నీ
మింగాలన్న ఉబలాటం కై
ఎదురుచూపులు
ఒక్కసారి
ప్రకృతి..."శీతల"నయనాలతో
చూస్తే బాగుండు
రచన:
గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు:తారా-శ్రీహరి
రాంపూర్, మం:హుజురాబాద్
జిల్లా:కరీంనగర్, తెలంగాణ
చరవాణి:9291573564
10
వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 10
కవిత శీర్షిక:
మనిషినెలా మారుస్తుందో..?
మూలాలు మరచి బతుకుతున్న
సమాజానికి...
ఇదొక "గొడ్డలిపెట్టు"
ఆరోగ్య ఆహార అలవాట్లను
మరచిన...జగతికి
ఇదొక "చెంపపెట్టు"
మితిమీరి విర్రవీగిన
విజ్ఞానానికి...
ఇదొక "సవాలు"
తనను తాను మరచి
"ప్రాణం" విలువ తెలియని
మనిషికి...
ఇదొక "ఆత్మపరిశీలన స్థితి"
అవధులు లేని
అజ్ఞాన...ఆధునికునికి
ఈ పరిస్థితి కలిగించునా? కనువిప్పు
చూద్దాం
ఈ విషమ పరిస్థితి
మనిషినెలా మారుస్తుందో?
రచన
గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు:తార-శ్రీహరి
రాంపూర్
మండలం:హుజురాబాద్
జిల్లా:కరీంనగర్
తెలంగాణ-505498
చరవాణి:9291573564
11
* వీరాస్ కవిసమయం *
కవి పేరు: గోశికొండ మృత్యుంజయ
కవిత సంఖ్య: 11
చిరునామా: ఇ.నం:5-14
రాంపూర్,మం: హుజురాబాద్
జిల్లా:కరీంనగర్-505498
చరవాణి: 9291573564
కవిత శీర్షిక :. ఆత్మ
మదిలోని స్మృతులు
హృదయం ఉన్నంతవరకే
మస్తిష్కపుఆలోచనలు
మెదడు ఉన్నంతవరకే
నెత్తురు ఉడుకు స్వభావం
ప్రవాహం ఉన్నంతవరకే
శరీర చలనం
ఊపిరి ఉన్నంత వరకే
పంచేంద్రియాల పనులు
ప్రాణం ఉన్నంత వరకే
దేహం ఉన్నా లేకున్నా
భూత భవిష్యత్ వర్తమాన మైన
సర్వకాల సర్వావస్థలయందు
నిరాకార నిర్గుణ రూపంగా
సదా నిలిచే సచ్చిదానంద
పరబ్రహ్మ రూపం
ఆత్మ ఒక్కటే...
ఆత్మ శీర్షికన గల వచన కవిత నా యొక్క సొంత రచన అని తెలియజేస్తున్నాను
💐కృతజ్ఞతలతో...🙏
12
*వీరాస్ కవిసమయం*
కవి పేరు: గోశికొండ మృత్యుంజయ
కవిత సంఖ్య: 12
చరవాణి: 9291573564
*తలుపు తట్టిన మృత్యువు*
అలుపెరగని బాటసారినై
నిరంతర ప్రవాహ
ప్రయాణినై...
దహింపబడితీ
కోర్కెల దాహంతో
కాలి బూడిదైతీ
ఆశ తీరని మోహంతో
కాలికి బట్ట కట్టకుండా
కడుపునిండా తినకుండా
ఉరుకుల...పరుగుల...
జీవనంలో
ఉక్కిరి...బిక్కిరి...
జీవితంతో
ఊసేలేని...విశ్రాంతి
ఊహించని...శాశ్వత విశ్రాంతి
మృత్యువు...
తలుపు తట్టి
ఒంటరిగా నన్నెత్తుకెళ్లింది
పైన పేర్కొన్న వచన కవిత నా యొక్క సొంతరచన అని తెలియజేస్తున్నాను
13
[23/06, 5:47 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 13
శీర్షిక: కర్మభూమికై...కర్తవ్యం
కవి పేరు: గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు: తార-శ్రీహరి
గ్రామం: రాంపూర్,హుజురాబాద్
చరవాణి: 9291573564
కంచె కాడ కాపలా కాసే
సైన్యమైనా...కంచె లోపల
బతికే సామాన్యుడైనా...
అన్నీ...ఈ మట్టి పువ్వులే
దేశద్రోహ...తీవ్ర,ఉగ్రవాద
కంటకాలు...భరతమాత
పాదాల్ని బాధించి కంటతడిని
కోరుకునేవే... "ఏనాటికైనా"
నా తల్లి పాదాలకంటకుండా
ఆ కంటకాల మొనలను
పుప్పొడిలా... నా ఎదకు హత్తుకొని
భరతమాత పాదాలకు ఒత్తునై
నా తల్లి కష్టాల...కన్నీళ్ళని
పంచుకుంటూ...దేశం పై
ప్రేమను పెంచుకుంటూ
కర్మభూమిని కాపాడుకునే
కర్తవ్య బాధ్యత నాదే
దేహంలోని దేశభక్తి దేవాలయంలోని
దేశ ప్రతిమను దర్శించే...దేహం నాదే
14
[23/06, 5:52 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 14
కవిత శీర్షిక : రాత మారలే...
అంతా మంచిగైంది...తెలంగాణ
అచ్చింది...ఇగ బతుకు సంబరమనుకున్నా
ఇప్పుడే...మొదలైందని
ఇప్పుడిప్పుడే ఎరుకైతంది
ఇన్నేండ్ల కొట్లాట...ఆంధ్రతో"హద్దులుపాతే"
గెట్టుపంచాయితే...బతుకు మార్చేది
కాదని "ఎరుకైతంది"
"యాది మరిచిర్రు"...నావోడన్నది
ఏగోడు ఇనక...పరాయి లెక్క
లెక్కగడతుర్రు...సంపదకే సలాం కొట్టి
గులామయ్యి "అస్తిత్వాన్ని" సంపిర్రు
సన్యాసి మాటలు...సన్నాసి పనులు
కూడులేని కడుపులు...గూడులేని బతుకులు
దీనికేనా "త్యాగాలు బలిదానాలు"
రాష్ట్రమచ్చిన...రాత మారలే...ఈడ
ఆశల చిగురుల్ని తెంపుకొని బతకాలే
పైన పేర్కొన్న వచన కవిత నా యొక్క సొంత రచన అని తెలియజేస్తూ హామీ ఇస్తున్నాను
రచన:
గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు:తార-శ్రీహరి
రాంపూర్
చరవాణి: 9291573564
15
[24/06, 5:41 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 15
అంశం : ప్రతిజ్ఞ ప్రాముఖ్యత
కవిత శీర్షిక:
దేశమెట్లా మరిచిందో...?
దేశం ఎదలో ఏ ఘర్షణ
మొదలైందో..."జనగణమన" ను
అధినాయకున్ని చేసి..."వందేమాతరం" కు
వందనమిడిన...భరతభూమి
ప్రతిజ్ఞ భూని ప్రతిజ్ఞ పై...సవతి తల్లి
ప్రేమ జూపి...కాలం కాల్చిన జ్ఞాపకంగా
ఆసేతు హిమాచలాకి...కానరాని
అజ్ఞాతవాసిని చేసింది...పైడిమర్రి ని
"సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా"
అన్న....నరేంద్రుని ఆదరించి
"ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్
సిస్టర్స్" అన్న...సుబ్బారావు ని మరచింది
తల్లితండ్రి గురువుకు గౌరవం,ప్రతివారికి
మర్యాదిచ్చి...దేశానికి ప్రజలకు సేవచేయమని
అందరి శ్రేయస్సే తన ఆనందానికి మూలమనే
నీతిమాటల మూటల్ని దేశమెట్లా మరచిందో?
పైన రచించిన కవిత నా యొక్క సొంత రచన అని తెలియజేయుచున్నాను
రచయిత:
గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు: తార-శ్రీహరి
రాంపూర్
చరవాణి:9291573564
16
[24/06, 5:44 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 16
కవిత శీర్షిక: "భారతీయతే" స్త్రీ రూపం
భౌతిక పరమాత్మ తత్వాల
కనుబొమ్మల నడుమ
ధరణికి వెలుగునిచ్చే
కుంకుమ రూపం...
ఎదపై మాంగల్యాన్ని
భారంగా గాక
జీవిత త్యాగంగా చూసే
మాతృమూర్తి రూపం...
కన్నవాళ్లకు దూరంగా
కట్టుకున్న వానికి దగ్గరై
జీవితాంతం... కన్నబిడ్డల కై
తపనపడే శ్రమశక్తి రూపం...
బిడ్డలకు పాలిస్తూ... రాజ్యాన్ని
పాలించే రాచరికపు రూపం...
శ్రీ శక్తి రూపం భారతీయ స్త్రీ రూపం
సహనమే సహజత్వం
శాంతమే ఆభరణం
బోధనలో గురు రూపం
భర్త ప్రాణాలకై... యముడితో
చావు పోరాటం
మానవ సంపర్కం లేక
తల్లి గర్భం నుండి గాక
భూగర్భం నుండి...సీతయై
యజ్ఞము నుండి...ద్రౌపదియై
నక్షత్ర వెలుగులు జిమ్మే...అరుంధతియై
త్రిమూర్తుల్నిగన్న... అనసూయయై
ఓ...భారతీయ స్త్రీ
నీ ఖ్యాతి నిర్లక్ష్యం ఏనాడైతే జరుగునో
ఆనాడే మానవజాతి అంతం...
జగతికి అంధకారం
పైన రచించిన వచన కవిత నా యొక్క సొంత రచన అని తెలియజేయుచున్నాను
రచన:
గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు:తార-శ్రీహరి
గ్రామం:రాంపూర్
చరవాణి: 9291573564
17
[26/06, 7:29 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 17
శీర్షిక : దళిత జ్ఞానకమలం
హిందూ మహాసంద్ర తీరానా
ఉప్పొంగే కెరటాలతో...
పచ్చిమట్టిలో మలిగిపోయే
సాధారణ వ్యక్తిత్వం కాదది...
అస్తిత్వం..కోల్పోని వ్యక్తిత్వనిర్మాణం కై
రాళ్లపై చెక్కబడ్డ... నిబద్ధత,
అంకుఠిత దీక్ష గల్గిన... చెక్కుచెదరని
అసాధారణ వ్యక్తిత్వం ఆ ధీరశాలిది.
కుల వర్ణ వ్యవస్థను కడిగిన
పవిత్ర గంగామాత రూపం నతడూ...
స్వాతంత్ర భారత భాస్కరునికి
ప్రకాశ రాజ్యాంగ కిరణాలను చెక్కిన
మహా శిల్పినతడూ...
దళితుల స్థానం మా పాదాలే...అంటూ
విర్రవీగిన అగ్రవర్ణ చేతులే నేడు తన పాదాలు
తాకేలా చేసిన మహా సంకల్పశాలినతడూ....
నాడు..ఈసడింపు చీత్కారమన్న కులాలు
నేడు... నీ ప్రతిమను సత్కరించాలని
వరుసలో నిలబడ్డాయి...
నీ ఆశయసిద్ధాంతాలు...ఆదర్శమని
ప్రపంచం కొనియాడుతున్నా..ఎందుకో...
కులాన్ని కుంకుమగా దిద్దిన భరతభూమి
నేటికీ నీ త్యాగాన్ని విస్మరిస్తుందా..?
అనిపిస్తుంది....
పైన రచించిన వచన కవిత నా యొక్క సొంత రచన అని తెలియజేస్తూ హామీ ఇస్తున్నాను
గోశికొండ మృత్యుంజయ
రాంపూర్
చరవాణి: 9291573564
[26/06, 7:35 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య :18
అంశం: వందేళ్ల ఉస్మానియా యూనివర్సిటీ
కవితా శీర్షిక: హృదయంలో...హృదయం
నాడు...భారతావనికి
నలుగుపెట్టె నలంద...తలకుపోసే
తక్షశిల...నేడు ఉస్మానియా
ఉద్యమాల ఉగ్గుపాలు పట్టే
వందనమిడే
వందేమాతరోద్యమానికి... అప్పుడు
స్వరాష్ట్రం సాధించే
తెలంగాణోద్యమానికి ఊపిరై... ఇప్పుడు
భారతీయ భాషతో
పురుడోసుకున్న... తొట్టతొలి
విద్యాకుసుమం... విశ్వగెలుపు కై
విశ్వవిద్యాలయ మై...భావితరాలకు
బాటలు వేస్తూ... స్త్రీ హరిజన గిరిజన
విద్యకు పరితపించే... బాటసారిలా
తెలంగాణ గుండె
భాగ్యనగరం... భాగ్యనగర హృదయం
ఉస్మానియానే
వెలుగు పై వెలుగు అన్నట్టు
హృదయంలో హృదయం...మా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
లక్షల్లో పుస్తకాలే కాదు... సలక్షణ
జాతి రత్నాలనెన్నింటినో... జాతికిచ్చింది
మా అమ్మ ఉస్మానియా... నీవు
శతాబ్ది ఉత్సవాలే కాదు... సహస్రాబ్ది
ఉత్సవాలు...జరుపుకోవాలి తల్లి
పైన రచించిన వచన కవిత నా యొక్క సొంత రచన అని తెలియజేస్తూ హామీ ఇస్తున్నాను
గోశికొండ మృత్యుంజయ
ఇ.నం:5-14, రాంపూర్
మండలం: హుజురాబాద్
జిల్లా: కరీంనగర్
తెలంగాణ. 505498
చరవాణి: 9291573564
19
[02/07, 6:19 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 19
కవిత శీర్షిక: ఎగ"తాళి"...బతుకు
జతనువీడి జంటపక్షి ఒంటరాయే
"నీతిమారి" సమాజపు రీతిమారే
పూలేరుగని ఆ కురులు... లోకం
కుళ్ళుకు బలయ్యే
ఏడుపు మిగిల్చిన "ఏడడుగుల
బంధం"...మూన్నాళ్ల ముచ్చటైన
"మూడుముళ్ల బంధం"...ముల్లై
ఎదను గుచ్చుతుండే
"ఎగతాళి"చేసే తాళిలేని మెడని చూసి
"అరిష్టమనే"బొట్టు లేని మోము చూస్తే
"అంధకారమే" మిగిల్చే అరుంధతీ
నక్షత్రం... నా తల్లికి
హోమాగ్ని గురుతులు...మస్తిష్కం
మరవకముందే
"చితిమంటల జ్వాలలు"కళ్ళముందు
నాట్యమాడే...వితంతువును వింతగా
చూసే లోకమిది..."ఏతంతు జరిగినా"
చులకన చేసే సమాజమిది... అయినా
రెప్పల మాటున పిల్లల్ని దాచుకుంటూ...
సాదుకుంటుంది... తల్లి కోడిలా... అమ్మ
పైన తెలిపిన వచన కవిత నా యొక్క సొంత రచన అని తెలియజేస్తూ హామీ ఇస్తున్నాను
రచన:
గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు: తార-శ్రీహరి
రాంపూర్
చరవాణి: 9291573564
20
[02/07, 6:21 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 20
కవిత శీర్షిక:
సుతిమెత్తని మస్తిష్కాలు
కాంక్రీట్ వనంలో కాటగలసిన
వన్యజీవుల్లా
కార్పోరేట్ చదువుల్లో...
సింగిడి సింగారపు బాల్యం
అన్ని రంగుల్ని మలిపి
పూసుకుంది
"నల్లరంగు" చీకటిని
నిష్కల్మషపు..."స్వేచ్ఛ
గాలిపటాలు"..చదువుల ఒత్తిడికి
చెట్లకొమ్మల్లో...చిక్కుకొని
"ఉరేసుకున్నాయి"
పిచ్చుక గూళ్ళలాంటి.. ఇరుకు గదుల్లో
సుతిమెత్తని మస్తిష్కాలు
"మార్కుల" సెల్ టవర్లకి
మానసిక కార్మికులై...రాలిపోతున్నాయి
విశ్వగురువైన "జ్ఞానభూమి"లో
"అజ్ఞాన పాచికలతో"...జూదమాడుతూ
సంపదకే సలాం కొడుతున్న
విద్యాసంస్థలు...కర్మభూమిలో
విద్యార్థుల "కర్మకాండలు" చేస్తున్నాయి.
పైన రచించిన వచన కవిత నా యొక్క సొంత రచన అని తెలియజేస్తూ హామీ ఇస్తున్నాను
రచన:
గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు: తార-శ్రీహరి
రాంపూర్
చరవాణి: 9291573564
21
[02/07, 6:24 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 21
అంశం: గిరిజన సంస్కృతి,సాంప్రదాయం
జీవన విధానం,నాటి నేటి చరిత్ర
కవిత శీర్షిక : నిస్వార్థపు జాతి...
అడవితోనే జీవిస్తరు
అడవినే పూజిస్తరు
అడవంటే ప్రాణమిస్తరు
అడవిలోనే కలిసిపోతరు
"అడవి మనుషులని చులకన చేయకు
అనాగరికులని హేళన చేయకు"
పరిణామంలో
నరునికి వానరునికి
వారధిగా నిలిచిన
ఆదిమానవుని సంతతివారు
వాల్మీకి జ్ఞాన సంపన్నులు
జాంబవంతాది పరాక్రములు
ఏకలవ్యుని శిష్యులు
"కరుణ"లో శబరి వారసులు
వనవాస అజ్ఞాత వాసాల్లో సురులకే
సాయం చేసిన దయామయులు
ప్రకృతిని ప్రసన్నం చేసుకున్న
ఆధ్యాత్మిక తొలి గురువులు
వనమూలికల వైద్యం తెలిసిన
ఆయుర్వేద సారధులు
వన రక్షణే వారి నైతికం
ప్రకృతి సమతుల్యతే వారి కర్తవ్యం
ధరణి లో వెలసిన
నిస్వార్థపు జాతి...గిరిజన జాతి...
పైన రచించిన వచన కవిత నా యొక్క సొంత రచన అని తెలియజేస్తూ హామీ ఇస్తున్నాను
రచన:
గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు: తార-శ్రీహరి
రాంపూర్
చరవాణి: 9291573564
22
వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 22
అంశం:
జాతీయ ఐక్యత పితామహుడు
సర్దార్ వల్లభాయ్ పటేల్
కవిత శీర్షిక: ఉక్కు సంకల్పం
తెల్లవారు పోయి
తెల్లవారకముందే
రాత్రికోరల్లో చిక్కిన ఉదయం
మసిబారిన వెలుతురులో
స్వాతంత్ర్య సంబరాల్ని వదిలి
"స్వతంత్ర దేశ"ఆకాంక్షను వెళ్లగక్కిన
సంస్థానాలు...
నిజాముల నైజానికి
ఒకే ఒక్క నక్షత్ర కాంతి కిరణం
ప్రకాశ విస్పోటనంగా మారి
అందరి అంచనాల్ని...
దేశ ద్రోహుల అత్యాశల్ని
తారుమారు చేసింది
ఏనాడో...
అఖండ భారతం
ముక్కలు ముక్కలు అయ్యింది
ఈనాడు మళ్లీ...
భరతమాత అవయవాల పంపకం
మొదలైందంటూ
మొరపెట్టిన భరతమాతకి
భరోసానిచ్చిన...
మొండి మనిషి పంతం ముందు
"పాకిస్థాన్"పాచికలు
పనిచేయకుండా పోయాయి
ఆ ఉక్కుసంకల్పం
ముక్కుసూటి తత్వం
నిజాముల్ని నవాబుల్ని
ముక్కు పిండి
తలదించేలా చేసింది
భరతమాతని
తల ఎత్తుకునేలా నిలిపింది
నిజంగా...
ఆ "పటేలే" లేకుంటే
భిన్నత్వ వైవిధ్యాల భారతం
ఎన్ని ముక్కల్లయేదో
పైన రచించిన వచన కవిత నా యొక్క సొంత రచన అని తెలియజేస్తూ హామీ ఇస్తున్నాను
రచన
గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు:తార-శ్రీహరి
రాంపూర్
చరవాణి: 9291573564
23
వీరాస్ కవిసమయం
అంశం:
డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవితం వ్యక్తిత్వం మరియు పరిపాలన,ప్రజాసంక్షేమం
పేరు: గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు: తార-శ్రీహరి
కవిత సంఖ్య: 23
కవిత శీర్షిక: పంచకట్టు "కలువ"
కత్తుల నెత్తురు సీమలో...పంచకట్టు
కలువ వికసించి ఉదయించింది
రాళ్లురప్పల రాళ్ళసీమలో
రత్నమై మెరిసి...కరువుకాటకాల
రాయలసీమలో కరుణను పంచింది
రాయలకీర్తి గడించిన నేల...రాజన్న
రాజ్యంగా మారింది
గంజి బతుకుల్ని పీజీలు చదివించా..
కార్పొరేట్ కు పంపి...పెద్దాస్పత్రే దిక్కన్న
పాణాల్ని ఆరోగ్యశ్రీతో... ఆదుకుంది
ప్రజా సమస్యల నాడీ తెలిసిన
వైద్యుడి హోదా...హుందా...ఠీవీ
ధీరత్వం చూసి... దేశం దిష్టితాకిందో.?
ప్రతిపక్షాల కళ్ళుమండాయో.? నల్లమలలో
వాడిపోయి అస్తమించింది...ఆ "కలువ"
24
25
[21/07, 4:20 PM] మృత్యుంజయ KS: విరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 25
శీర్షిక: "ఆరోగ్యమే" మా బడి
సంస్కారానికి పుట్టిల్లు
క్రమశిక్షణకు మెట్టినిల్లు
నైతిక విలువల వాకిళ్లు
చదువు నేర్పే పొదరిల్లు
వ్యాయామ శిక్షణతో
ఆరోగ్య చిట్కాలతో
చదువు సంధ్యల
ఆటపాటల హరివిల్లులతో
జీవిత పాఠాలు నేర్పి
జీవన గమ్యాలు తెల్పి
అమ్మనాన్న లా...అన్నింటి
విలువ నేర్పే "గురువులు"
చీకటిని తరిమే
వెలుగులు పంచుతూ
ఎన్నింటినో నేర్పింది మా బడి
రచన
గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు: తార-శ్రీహరి
చరవాణి: 9291573564
ఈమెయిల్: mruthyunjayagoshikonda83500@gmail.com
[21/07, 4:21 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 26
అంశం : గరిమెళ్ళ సత్యనారాయణ
శీర్షిక: మా కొద్దీ...తెల్లదొరతనము
"కుక్కలతో పోరాడి
కూడు తింటామంటూ"
తెల్ల కుక్కలు...దేశపు కూడు
తింటున్నాయంటూ చెప్పకనే
చెప్తూ...జనాన్ని జాగృతం చేస్తూ
స్వతంత్ర కాంక్ష కు
గరిమెళ్ళ...ఆకాంక్ష తోడైంది
"దేశభక్తి గేయాల తో
దేశం గాయాలు"మానాలని
పరితపించి...భరతమాత కై
జైలు జీవనం గడిపిన
"తపస్వి"...అతడు
దేశపు చైతన్యం కై
కవితా గానం
దేశ రక్షణకై...కంకణం
కట్టుకున్న...సంకల్పం
సత్యనారాయణ సొంతం
హామీ పత్రం:
"మాకొద్దీ...తెల్లదొరతనం" శీర్షికన గల వచన కవిత నా యొక్క సొంత రచన అని తెలియజేస్తూ హామీ ఇస్తున్నాను
రచన: గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు: తార-శ్రీహరి
చరవాణి:9291573564
ఈమెయిల్ mruthyunjayagoshikonda83500@gmail.com
27
[06/08, 7:14 AM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 27
అంశం: నెల్సన్ మండేలా
శీర్షిక : నల్ల కలువ
జాత్యహంకార బురదలోంచి
వికసించాలని
పరితపించే
నల్ల కలువ...శాంతి రేకుల్ని
విచ్చుకుంటూ
స్వేచ్ఛ కిరణాలకై
పరితపించ సాగింది
కష్టం నష్టం తట్టుకుంటూ
బరువు బాధ్యతను చూసుకుంటూ
నల్లజాతి త్యాగాన్ని
జగతికి చాటిచెప్పాలని
అవమానాల
మూటల్ని మోసుకుంటూ
జాతి ఉద్ధరణ కై...
శాంతి అహింసల్ని
పగలు రాత్రిగా చేసుకొని
గుర్తింపు రోజుకై
ఎదురుచూడ సాగింది
గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు: తార-శ్రీహరి
నివాసం: రాంపూర్
చరవాణి: 9291573564
ఈమెయిల్: mruthyunjayagoshikonda83500@gmail.com
[06/08, 7:14 AM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 28
అంశం: ప్రపంచ జనాభా దినోత్సవం
శీర్షిక: "పుట్లకొద్దీ" జనం
కోతి నుండి పరిణామం
కొండకోనల్లో
చెట్లు చేమల్లో ఆవాసం
ఆఫ్రికాలో పుట్టి
ఆసియాలో ఎదిగి
దీవులు ద్వీపకల్పాలు అనే
తేడా లేక... జగతి నంతా
ముసురుకుని
ఆదిమానవుడు ఆధునికుడై
పుట్లకొద్దీ పెరిగి
కోట్ల జనాభా గా ఎదిగి
నిత్యవసర వస్తువు లేక
అత్యవసర సదుపాయం లేక
బాధపడే...జనాభా ఎంతో...
ఎంతెంతో ఈ పుడమి యందు
రచన: గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు: తార-శ్రీహరి
చరవాణి: 9291573564
మెయిల్: mruthyunjayagoshikonda83500@gmail.com
హామీ పత్రం:
ప్రపంచ జనాభా దినోత్సవంను పురస్కరించుకొని "పున్నమి సాహితీ"ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా "పుట్లకొద్దీ జనం"శీర్షికన గల వచన కవిత నా యొక్క సొంత రచన అని హామీ ఇస్తున్నాను
29
[08/08, 3:40 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 29
అంశం : కాటన్-ఉభయ గోదావరి జిల్లాల
భగీరథుడు
శీర్షిక : ఆనకట్టల "కాటన్ దొర"
నదుల...నడకల్ని
ముద్దాడి ఆపిన ఆనకట్టల
నిర్మాణ భగీరథుడు
ఉప్పొంగే...
ఉగ్రరూప సముద్రుడి
అలలను అలిసేలా చేసి
విశాఖ నగరాన్ని రక్షించిన
సాహసికుడు
తెల్లవాడైనా...
తెల్లదొరల మెప్పించి
నదుల్ని మల్లించి
బీడు భూముల్ని తడిపించి
కరువు సీమను...అన్నపూర్ణగా
జేసిన కార్యదక్షుడు
సర్ ఆర్ధర్ కాటన్ దొర
హామీ పత్రం:
ఆనకట్టల కాటన్ దొర శీర్షిక గల వచన కవిత నా యొక్క సొంత రచన అని తెలియజేస్తూ హామీ ఇస్తున్నాను
రచన: గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు: తార-శ్రీహరి
చరవాణి:9291573564
ఈమెయిల్: mruthyunjayagoshikonda83500@gmail.com
[08/08, 3:43 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 30
రచన: గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు: తార-శ్రీహరి
గ్రామం: రాంపూర్
చరవాణి:9291573564
కవిత శీర్షిక: కాలం కాల్చిన జ్ఞాపకం
మూగబోయిన కాలి గజ్జెల శబ్దం
నిశ్శబ్దం వీడి రోధిస్తున్న
హృదయం
"స్తబ్దంగుండి" జానపద బంధపు
ముడిని విప్పుకొని వెళ్తానంటున్న
జానపదం
ఎద బాధలకెన్నింటికో
ఎదురు నిల్చిన కళారూపం
చితి "పాటలకట్టెల" కై వెతుకులాట
రోధిస్తున్న హృదయాల్ని వదిలి
పోనంటున్న దుఃఖం
ఒక్కసారి తిరిగి ప్రాణం వస్తే
బాగుండనుకుని
ఎదురు చూస్తున్నా నయనానికి
కాలం కాల్చిన జ్ఞాపకంగా
నిల్చిపోయావా
జానపదుల్లో...జనపదాల్లో
నిన్ను చూసుకోవడం
తప్ప...చేసేదేమీ లేదనిపిస్తుంది
అయినా నువ్వు వేసిన
"వంగపండు" పాట...
బాటలోనే నడవాలనిపిస్తుంది
ఇట్టి రచన నా యొక్క సొంత రచన అని హామీ ఇస్తున్నాను
31
[10/08, 5:29 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 31
అంశం : పింగళి వెంకయ్య
కవిత శీర్షిక : జాతీయ పతాక శక్తి
ఆ మహనీయుని మస్తిష్క ఆలోచన
భారతీయుల్ని జాగృతం చేయ...
స్వతంత్ర కాంక్షను
పతాకస్థాయికి...చేర్చా
"జాతీయ పతాక" శక్తిగా ఎదిగి
రొమ్ము విరిచి "సెల్యూట్" చేసే
పౌరుషాన్ని కల్పించింది
"సైనిక పార్థివదేహల్ని" కప్పి
వేదన ను దూరంచేయ...దేశభక్తిని
నింపి...రుణం తీర్చుకుంది
ఆ దేశభక్తుని త్యాగఫలం...కాషాయ
శ్వేత హరిత వర్ణాల ధర్మచక్రమై నిలిచింది
దేశం గర్వించదగ్గ
పతాకమై విరాజిల్లింది
%%%%%%%%%%%%%%%%%%%%%%
హామీ పత్రం:
"జాతీయపతాక శక్తి" కవితా శీర్షికన గల వచన కవిత నా యొక్క సొంత రచన అని హామీ ఇస్తున్నాను.
రచన: గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు: తార-శ్రీహరి
గ్రామం: రాంపూర్
మండలం: హుజురాబాద్
జిల్లా: కరీంనగర్
తెలంగాణ-505498
చరవాణి:9291573564
ఈమెయిల్: mruthyunjayagoshikonda83500@gmail.com
[10/08, 5:29 PM] మృత్యుంజయ KS: వీరాస్ కవిసమయం
కవిత సంఖ్య: 32
అంశం : చెట్టుతో స్నేహం
కవిత శీర్షిక : నిస్వార్థ స్నేహం..
జీవ మనుగడకి
జీవన యానానికి
యంత్రం మంత్రం తంత్రంగా...అంతా
జగమంతా...తానై నిలిచి
ప్రాణవాయువు నిలిపి
ఎదిగేకొద్దీ ఒదిగుంది
ఒంటరిని చేయక...సమస్త
జీవులకు తోడుంది
జీవ మనుగడకు
బాధ్యతాయుత భరోసానిస్తూ
పంచభూతాలకు తోడుగా
చరాచర సృష్టిలోని జీవులతో
"నిస్వార్థ స్నేహం"చేసేదే చెట్టు
అందుకే...చేద్దాం నినాదం
వృక్షో రక్షతి రక్షితః
%%%%%%%%%%%%%%%%%%%%%%
హామీ పత్రం:
నిస్వార్థ స్నేహం కవితా శీర్షికన గల వచన కవిత నా యొక్క సొంత రచన అని తెలియజేస్తూ హామీ ఇస్తున్నాను
ఇట్లు
రచన: గోశికొండ మృత్యుంజయ
తల్లిదండ్రులు: తార-శ్రీహరి
గ్రామం: రాంపూర్
మండలం: హుజురాబాద్
జిల్లా: కరీంనగర్
తెలంగాణ-505498
చరవాణి:9291573564
ఈమెయిల్: mruthyunjayagoshikonda83500@gmail.com

Comments
Post a Comment