తుమ్మ జనార్ధన్ KS 27

[07/05, 7:10 PM] Tumma Janardhan KS 27: ***** సమూహం :  వీరాస్ కవి సమయం *****
తేదీ        : 07-05-2020
కవిత సంఖ్య : 01
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

శీర్షిక : కలల లోకం – కష్టమే స్వర్గం

కలల అలలపై జీవితం సుఖం
ఊహాలోకం నీటిబుడగ సర్వం
అందని అదొక అనుభవ స్వర్గం
కనుల ముందు కదలాడిన మేఘం
కురవకుండానే తరలిన వైనం
ఊహల మేడలు కూలుట ఖాయం
నిజం నిప్పులో చేరిన సమయం
అంతా మాయం మిగులును శూన్యం.

కాలం కలిసివస్తే కలలు నిజం
లేకుంటే మిగులు నిస్తేజం
కష్టమే దానికి విరుగుడు నేస్తం
కష్టం నమ్ముకో కల నెరవేర్చుకో
కలలు కల్లలు కాకుండా చూసుకో
ఏనాటికైనా నీ కష్టమే నిజ స్వర్గం.
[11/05, 12:11 PM] Tumma Janardhan KS 27: ***** సమూహం :  వీరాస్ కవి సమయం *****
తేదీ        : 11-05-2020
కవిత సంఖ్య : 03
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

శీర్షిక: మీ వరస చూస్తే.....
       (వరస అంటే పద్ధతి/ప్రవర్తన అనే అర్ధంలో)

తాగుబోతుల వరస చూస్తే
మద్యం కూడా అత్య్వసర సరుకనిపిస్తుంది.

వలసకూలీల వరస చూస్తే...
కరోనా మీ స్థైర్యాన్ని పరీక్షించడానికే వచ్చిందనిపిస్తుంది.

పేకాడే వారి వరస చూస్తే...
గెలిచినా ఒడినా రాణి(కరోనా)కి మీరు చిక్కుతారనిపిస్తుంది.

విచ్చల విడిగా తిరిగేవారి వరస చూస్తే...
కరోనా మిమ్మల్ని మాత్రం వదిలేస్తుందని అనుకుంటున్నారనిపిస్తుంది.

ప్రభుత్వం వరస చూస్తే...
మద్యం లేకుంటే ప్రభుత్వం నడవదనిపిస్తుంది
సంక్షేమమంతా మధ్యం అమ్మకాల్లోనే దాగుందన్నమాట
ముందు ముందు మద్యం తాగకపోవడం వల్లనే రాష్ట్రం వెనకబడింది అంటారేమో!
[12/05, 7:32 PM] Tumma Janardhan KS 27: ***** సమూహం :  వీరాస్ కవి సమయం *****
తేదీ        : 12-05-2020
కవిత సంఖ్య : 04
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

శీర్షిక: తెలుసుకోవాల్సిన సమయమొచ్చింది

భారతీయత, శుభ్రత రెండే మనకు రక్షలని
అన్ని సంబంధాలు కరోనతో అనుబంధాలేనని
కర్షకుడైనా, కోటీశ్వరుడైనా దూరం పెట్టాల్సిందేనని
మూతి ముక్కు మూసుకుంటేనే కరోనానుండి మోక్షమని
శత్రువు(కరోనా)ను పారద్రోలలేనప్పుడు శత్రువుతో కలిసుండాలని
దిక్కెవరూ లేనప్పుడు దేవుడే దిక్కని.

స్టడీ టూర్ కోసం విదేశాలకు కాదు
గుజరాత్ వెళ్లాల్సిన సమయమొచ్చింది
(ఇక్కడ ప్రభుత్వాలు మద్యం డబ్బులతోనే నడుస్తున్నాయి
మరి ఎప్పటినుండో మద్యానిషేధం ఉన్నా గుజరాత్ అభివృద్ధి పథంలో
ఎలా నడుస్తుందో స్టడీ చేయడానికి)
[13/05, 2:19 PM] Tumma Janardhan KS 27: ***** సమూహం :  వీరాస్ కవి సమయం *****
తేదీ        : 13-05-2020
కవిత సంఖ్య : 05
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

శీర్షిక: ఎందుకైనా మంచిది...

నిన్నటిదాకా కలిసి కరోనాను పారద్రోలుదామన్నారు
ఈ రోజు కరోనాతో కలిసి జీవించాలంటున్నారు
రేపు చేతులెత్తేసి కరోనాతో కలిసి చావమంటారేమో !

కరోనాతో పొరాడి (యుద్ధం) గెలవలేనప్పుడు
కరోనాతో కలిసి (సంధి) సహజీవనం
సంధి విఫలమైతే ? ...... జవాబు కరువు!

నిన్నటిదాకా మొక్కాం, ఇంతలోనే ఎంత మార్పు
ఇంకా ఏదీ మామూలు కాలేదు, కానీ
పోలీసు మళ్ళీ “మామూలు” అయిపోయాడు.

ఎందుకైనా మంచిది...
మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది
నియమాలు పాటిద్దాం, కరోనాతో యుద్ధం చేద్దాం
జాగ్రత్తలు పాటిద్దాం, కరోనాతో ‘దూరంగా’ కలిసుందాం.
[14/05, 7:01 PM] Tumma Janardhan KS 27: ***** సమూహం :  వీరాస్ కవి సమయం *****
తేదీ        : 14-05-2020
కవిత సంఖ్య : 06
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

శీర్షిక: ఏదైనా మనతోనే సాధ్యం

అప్పుడెప్పుడో విడతలవారీ మద్యనిషేధమని చెప్పారు
అది విడతలవారీ ధరల పెంపకమని ఇప్పుడు తెలిసింది
పాపం, వారి ఉద్దేశ్యం ధరలుపెంచి మద్యం మన్పిద్దామని
మనకే అర్ధం కావట్లేదు, కాదు కాదు అర్ధం చేసుకోవట్లేదు.

మహిళలు మద్యనిషేదం కోసం ఎదురుచూస్తారు
అప్పటికి వాగ్దానలిచ్చేస్తారు, వీరు గుద్దెస్తారు, షరా(బు) మామూలే
అర్ధం కాలేదా,
ఓటేసే దాకా అక్క మల్లవ్వ, ఓటేశాక బొక్క మల్లవ్వ.

మనం మానేస్తేనే ప్రభుత్వం మద్యం దుకాణాలు మూస్తుంది
లేదంటే మద్యం మానే రోజుకోసం వేచిచూస్తుంది
అంతే తప్ప మద్యం నిషేధించదు.

ఏదీ జరగదు ఈ ఎండమావిలో.....
ఏదైనా మనతోనే సాధ్యం,
కరోనా పోవాలన్నా మద్యానిషేదం రావాలన్నా

జాగ్రత్తలు పాటిద్దాం, కరోనాతో ‘దూరంగా’ కలిసుందాం
మద్యం మానేద్దాం, మద్య నిషేదానికి సహకరిద్దాం.
[15/05, 7:01 PM] Tumma Janardhan KS 27: ***** సమూహం :  వీరాస్ కవి సమయం *****
తేదీ        : 15-05-2020
కవిత సంఖ్య : 07
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

శీర్షిక: తిని పన్నోడే పరమాత్మాయే

బద్దకస్తులే నేడు బుద్ధజీవులాయె
బుద్ధిమంతులు బుద్ధి తప్పగాను
పరహితముగాకున్న స్వార్ధముతోనైన
ఇంటనున్న జరుగు జనహితంబు.

కనబడాలంటే కనిపించకు బయట
బయట ఉంటే వినిపించదు నీ మాట
గృహమే కదా మరుమల్లెల మూట
అనుబంధాలే నీ హృదయపు తోట.


కులాలు మతాలన్నీ మరిపించే కరోనా
ఇకముందు అంతా ఐసేహీ రహోనా
దిల్ సే దిల్ మిలాకర్ ఆగే బడోనా
మానవతా కే లియే హీ లడోనా.
[16/05, 5:46 PM] Tumma Janardhan KS 27: ***** సమూహం :  వీరాస్ కవి సమయం *****
తేదీ        : 16-05-2020
కవిత సంఖ్య : 08
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

శీర్షిక: పడవ ప్రయాణం

భారత సంస్కృతే రక్షన్నావు
వేదవిదిత జీవనమన్నావు
పోరాటం పలు మిద్ధమన్నావు
నిరస్త్ర పోరాటం చేయించావు.

సంబంధాలే అఖ్ఖర లేదని
ఆస్తి పాస్తులు ఆదుకోవని
మరణం సదా వేచివుండునని
మంచితనమే స్వర్గ దారులని.

అంతు చిక్కనిది జీవన మార్గం
ప్రకృతి వికృతి చేయుట నేరం
కలిసి నడుచుటే జీవన యానం
తెలిసెనులే ఇది పడవ ప్రయాణం.


9
తేదీ        : 17-05-2020
కవిత సంఖ్య : 09
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

శీర్షిక: ఇంటిలో ఉండి ఈశ్వర ప్రయత్నం

ఆరుబయట తిరుగుట నిషేధం
కరోనాను తరుముట ఉద్దేశం
ఇంట్లో ఉండి ఈశ్వర ప్రయత్నం
జనతా భాగస్వామ్యంతో అంతా సాధ్యం !

సహచర జీవుల పట్ల కరుణ కరువైనవేళ
ఎగసిపడెను మనిషిపై కరుణలేని కరోనా
వేదవిదిత జీవనమే సదా ఆచరణీయం
నేల విడిచి సాము ఎలా మనం చేయగలం!

అభివృద్ధి మాయయని నాగరికత నరకమని
నమస్కారం శరణమని, శుభ్రత ఆరోగ్యమని
సదాచారం, సంస్కారం తెలియజెప్పె కరోనా
ఆచరించి చూపిన, ఆగునుగా కరోనా, వెళ్ళునుగా బిరానా
10


11
కవిత సంఖ్య : 11
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

*శీర్షిక: తీరు మారిన కరోనా పోరు*

ఏప్రిల్, 2020
పోలీసులు మనను ఇంటికి తరిమిరి
వైద్యులు కరోనాను బయటకు తరిమిరి
పారిశుధ్య కార్మికులు శుభ్రతకై కష్టించిరి
కరోనా లేని భారత్ కై అందరూ ప్రయత్నించిరి 🇮🇳

అయినా అది మొండిఘటం చావకుండా ఉన్నది
ఆర్ధిక పరిస్థితులను బట్టి మనమూ ప్రవర్తిద్దాం
ఎన్నాళ్ళీ ఎదురుచూపు కరోనాతో కలిసుందాం
మనమేం తక్కువకాదు తట్టుకొని నిలుద్దాం.

మే, 2020
ఆంక్షలు సడలించిరి పోలీసులు వదిలేసిరి
వైద్యులు, నర్సుల పోరు ఒడువకున్నది
పారిశుధ్య కార్మికుల బాధ్యత తరగకున్నది
అయినా మనం ఆత్మనిర్భరతతో పోరాడుదాం, కరోనాను గెలుద్దాం.

కరోనా మనకోసం అప్పుడు దొరుకుతామని ఎదురుచూస్తున్నది
మన చిన్న అశ్రద్ధ, అపరిశుభ్రతకై అనుక్షణం వేచిచూస్తున్నది
నియమాలను పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను కట్టడిచేద్దాం
అంటక ముట్టక కరోనాకు చిక్కకుండా, దొరకకుండా పనిచేద్దాం.

తేదీ        : 19-05-2020
12
కవిత సంఖ్య : 12
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

శీర్షిక: కరోనా - కబడ్డీ

కరోనా కబడ్డీ ఆడుతుంది చూడు
దాని వైపుకెళ్ళితే పట్టుకోజూస్తుంది
మనవైపుకి వస్తే తాకివెళ్ళజూస్తుంది
ఎలాగైనా మనని ఔటు జేయజూస్తుంది
అందుకే దానికి తాకకుండా చిక్కకుండా
తప్పించుకొని జీవితం పెంచుకొనుటే దారి
తాకినప్పుడు చేతులు కడుగుకో చక్కగా
లాక్ డౌన్ సమయంలో వెళ్లకు నువ్వెక్కడా
సమయమయ్యే దాకా దాటకు గీత (గడప)
అది వెళ్లిపోయేదాక ఆపకు నీ ఆట (జాగ్రత్తలు)

కరోనాతో సామాజిక జీవనం సాధారణమయ్యెను
సామాజిక జీవనమే తప్ప సహజీవనం కాదు
ఇది తెలుసుకొని ప్రవర్తిస్తే కరోనా మనకు రాదు
లేదంటే సహజీవనం స్వాహాజీవనం కద్దు.

తేదీ        : 19-05-2020
13
కవిత సంఖ్య : 13
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)-27
జిల్లా          : రంగారెడ్డి

శీర్షిక: కవి - రవి

ఓ కవీ,
ఏడ దాగినావు, బయటికి రా తెలుసుకో
నీవు ఊహల్లో చిత్రకారుడివి
కనులు మూస్తే విశ్వేశ్వరుడివి
కలము పడితే కవీశ్వరుడివి.

కవి రవిలాంటి వాడు
రవి ఉదయిస్తే ఆగడు
కవి ఆలోచనవస్తే ఆగడు
వస్తే రాసేయ్ “ఇస్ రాత్ కీ సుబాహ్ నాహీ”
రాస్తే తోసేయ్ “రాత్ గయీ తో బాత్ గయీ”.

రవి దాగితే లోకమంతా చీకటి
కవి దాగితే సాహితీ లోకానికి చీకటి
రవికి మేఘమైనా అడ్డు
కవికి ఏ అడ్డూ లేదు
దులిపేయ్ బూజు
ప్రసరించు ప్రతిరోజు.

14

***** సమూహం :  వీరాస్ కవి సమయం *****
తేదీ        : 23-05-2020
కవిత సంఖ్య : 14
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

శీర్షిక: కరోనా నేర్పిన పాఠాలు

పొదుపు ప్రాధాన్యత
కనీసం రెండు లేక మూడు నెలల పోషణకు ఎప్పుడూ ఉండాల్సిందే (ప్రజాలైనా/ప్రభుత్వామైనా)

అయినవారు మనతోటే ఉండాలి
అమెరికాలోనో, ఆస్ట్రేలియా, లండన్ లోనో కాదు

ఎప్పుడు ఏమైనా జరగొచ్చు - ఉన్నఫలంగా వెళ్లాల్సి రావచ్చు, ఉన్నచోటే ఆగిపోవాల్సి రావచ్చు
ఎల్లప్పుడూ దేనికైనా సిద్ధంగా ఉండాలి.

డబ్బు ఎంతున్నా దేనికీ పనికి రాకపోవచ్చు
అందుకే డబ్బుతో పాటు మంచితనం, మానవత్వం, ప్రేమతత్వాన్నీ సంపాదించండి.

ఖాళీగా ఉండటం చాలా కష్టం, జీవితంలో విసుగు లేకుండా గడపాలంటే,
ఏదైనా అభిరుచి ఉండాలి – పుస్తక పఠనం, కవిత్వం, ఆట, పాట, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, యోగా, ధ్యానం, మొ||వి.

పోరాటామంటే తప్పని సరిగా గెలిచేది కాదు
ఓడిపోకుండా ఉండగలిగితే చాలు.

జీవితమంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు.
పరిస్థితులకు అనుగుణంగా మారడం అవసరం, దానినే విచక్షణ అంటారు.

ఓర్పుకు మించిన ఆయుధం
పట్టుదలకు మించిన విజయం లేదు.

*కరోనా చూపించిన ఛేదు నిజం (గీతా బోధ)
మనిషి ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా జీవిస్తాడు, ఒంటరిగా పోతాడు.*
15.
***** సమూహం :  వీరాస్ కవి సమయం *****
కవి సంఖ్య :  27
తేదీ        : 27-05-2020
కవిత సంఖ్య : 15
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

శీర్షిక :  పుష్పమై వికసించు – వసంతం రప్పించు

జీవితం రసమయం
నీరసమూ రసమైన
ఎందుకింత నిరసన
లేచి నిలిచి పరుగిడిన
ఉండమా మళ్ళీ వరసన
నిలబడమా జీవితం సరసన.

మోడైన మొండెమే వికసించగా
ఎండిన వృక్షమే చిగురించగా
కిరణమే మేఘం చీల్చుకు రాదా
కలకలం తర్వాత పక్షులే చేయు కిలకిలా రావాలు
అనంతమైన విశ్వానా అంతా తాత్కాలికమే
ఇక్కడ అంతం లేదు, అంతరాయమే, అంతా ఆరంభమే.

అందుకే మళ్ళీ ఆరంభించు
స్వరమై పలుకు
మేఘమై వర్షించు
పుష్పమై వికసించు
వసంతం రప్పించు
సువాసనలు వెదజల్లు.

కెరటాలకు అలుపు లేదు
ఆకాశానికి అంతులేదు
ఈ అనంత విశ్వంలో గమనమే సంచలనం
ఆగనిదే జీవితం, కదిలేదే కాలం
నీకు నీవే తోడు, నిలిచి కదిలిన చాలు
నీకు నీవే సాటి, ఆగక ప్రయాణించు, జీవితం కొనసాగించు.
16
***** సమూహం :  వీరాస్ కవి సమయం *****
కవి సంఖ్య :  27
తేదీ        : 30-05-2020
కవిత సంఖ్య : 16
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

శీర్షిక: కరోనా వేసిన మంచి దారి

కరోనా కాలాన ఎన్నో శుభ ఫలాలు
కష్టంతో పాటు మనను మనం నియంత్రించుకోగలమని చూపింది.
అసాధ్యమనుకున్నవన్నీ సుసాధ్యమని చూపించింది కరోనా, మన శక్తి మనకు తెలిపింది. ఇలా,

1. మద్యపానం లేక ఉండలేని వాడు కూడా ఉన్నాడుగా 45 రోజులు తాగకుండా
2. ధూమపానం మానలేని వాడు మానినాడు అన్నినాళ్ళు
3. తేనీరు లేక పూట గడవని వాళ్ళు ఉండలేదా తేనీరు లేకుండా.
4. బయట రుచులు మరిగిన ఆహార ప్రియులు బ్రతకలేదా బిర్యానీ, పిజ్జా, బర్గర్, చాట్, మిర్చి బజ్జి, ఐస్ క్రీమ్, చాక్లెట్లు, చిరుతిండ్లు తినకుంటే – జరిగిందిగా ఆరోగ్య రక్షణ.
5. ముఖమెంతో ముదమంటూ – అందాల సందడి చేసే బాహ్య ఆహార్య ప్రేమికులు.
6. ఖరీదైన దుస్తులు, విలాస వస్తువులు ఒక్కటీ కొనకున్నా ఆనందంగానే ఉన్నాం.
7. ఈర్ష్యా, ద్వేషాలకు దారితీయు ముచ్చట్లు – మురిగిపోయాయిగా
8. దోపిడీలు, దౌర్జన్యాలు, కక్షలు, కార్పన్యాలు చేయకుండా ఉన్నారుగా – అవసరమే లేదని తేలిందిగా
9. అనవసరపు ఆలోచనలు, అశాంతికారక కార్యక్రమాలు – అడుగంటిపోయాయిగా
10. అనవసర తిరుగుళ్లు, అవసరం లేని స్నేహాలు – లేకుండానే గడిచిందిగా
11. ఉప్పర మీటింగులు, ఎంగిలి శేరింగులు, తప్పటడుగులు - లేకున్నా ఏం నష్టం జరగలేదుగా
12. ప్రకృతికి మనం అవసరం లేదు, మనకే ప్రకృతి అవసరం – మనం లేకుంటే అది క్షేమమని తెలిసిందిగా.
13. మన వ్యవహారం సరిగా ఉంటే ఏ వ్యాధీ అంటదు, అనారోగ్యాల్ని మనమే అంటుకుంటున్నాం - నిజమేగా.
14. భగవంతుడిని పూజించినా పూజించకున్నా పరవాలేదు, సాయం మాత్రం మరవొద్దు – మనమే ఒకరికొకరం సాయంగా ఉంటే ఇంక దేవుడి సాయమెందుకు, మనం చేయలేనివి ఆయన చూసుకుంటాడు.
15. అభిరుచి ముఖ్యమని తెలిసింది – అది వున్నోడికి క్వారంటైన్ అయినా వాలెంటైన్ అయినా ఒక్కటే.

పైవన్నీ అవసరాలు కావు కానీ చేస్తూనే ఉన్నాము ఇన్ని రోజులు, కరోనా లాక్ డౌన్ వల్ల అవన్నింటికీ దూరంగా ఉండగలిగాం, ఉండగలమని నిరూపణ జరిగింది.  అమూల్య సమయం, ఆరోగ్యం నష్టపోయే కార్యక్రమాలకు దూరంగా ఉన్నాం. ఇన్నాళ్ళూ అవకాశం లేక దూరం ఉన్నాం, ఇప్పుడు అవకాశం ఉండీ స్వీయ నియంత్రణతో ఉందాం. *ఇక ముందూ చెడు అలవాట్లతో సామాజిక దూరం పాటిస్తే – ఆరోగ్యం, ఆనందం మనవెంటే జీవితాంతం.*

గమనించారా ఈ సమయంలో మనం రోటీ, కప్డా ఔర్ మకాన్ ఇవి మాత్రమే ఆలోచించాం, ఐతే ఇంకో ముఖ్య విషయం ఇవన్నీ ఉండాలంటే పని ఉండాలి – అది అత్యంత అవసరం, పని చేస్తేనే డబ్బు వస్తుంది కాబట్టి.  ఇవన్నీ సవ్యంగా జరగాలంటే ఇంట్లో వాళ్ళ అనుబంధం, ప్రోత్సాహం అవసరం.  అందుకే ప్రాధాన్యతలెరిగి ప్రవర్తిద్ధాం, కుటుంబంతో ముందుకు సాగుదాం.  కరోనా చూపిన మంచి దారిని రహదారిగా మార్చుకుందాం. ఆరోగ్యంతో ఆనందంగా ఉందాం.
17
***** సమూహం :  వీరాస్ కవి సమయం *****
కవి సంఖ్య :  27
తేదీ        : 09-06-2020
కవిత సంఖ్య : 17
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

*శీర్షిక:  ఉత్తమ మిత్రుల దినోత్సవం (08 జూన్)*

ఎప్పటికీ మారనిదీ
ఎన్నటికీ వీడనిదీ
నీడలాగా ఉండేది
నీతోనే ఉండేది
ఉత్తమ స్నేహం కదా.

కష్టంలో ఉండేది
నష్టంలో నడిచేది
అన్నింటా తోడంటూ
పిలవకుండా వచ్చేదే
ఉత్తమ స్నేహం కదా.

నీకోసం నేనంటూ
నాలోకం నీవంటూ
ప్రతి క్షణం నీవెంటే
ప్రతి అడుగూ నీతోటే వేసేదే
ఉత్తమ స్నేహం కదా.

మాటల్లో కొట్లాట
మనసులో ఆప్యాయత
అభిప్రాయభేదాలున్నా
ఎప్పుడూ నీతో ఉండేదే
ఉత్తమ స్నేహం కదా.

నీవారెందరున్నా
నావారెందరున్నా
చుట్టూ ఎందరున్నా
నీవు లేక అంతా సున్నా
అదే ఉత్తమ స్నేహం కదా.

ఉత్తమ మిత్రులందరికీ శుభాభినందనలతో.....
18

***** సమూహం :  వీరాస్ కవి సమయం *****
కవి సంఖ్య :  27
తేదీ        : 13-06-2020
కవిత సంఖ్య : 18
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

*శీర్షిక:  పద్యం*

హృద్యంగా పద్యం వ్రాయాలనుకున్నా
పదములు కలిపితే పాదమౌతుందనుకున్నా
ఛందము అందము నాకు తెలియలేదు
ఛందస్సు వర్చస్సు గమనించలేదు.

గణము గుణము గుర్తించలేదు
గణవిభజనే బుర్రకు తట్టలేదు
యతి యన్నదే వంట బట్టలేదు
యతి ప్రాసలస్సలే కలవలేదు

కాలేక పద్యకవి వ్రాసితిని గద్యము
తెలుగువాడి ప్రత్యేకత పద్యమే కదా
ఎప్పటికైనా వ్రాస్తాను హృద్యంగా పద్యం
పద్యలతో నేను చేస్తాను నేస్తం.

పద్య పరిమళంతో అలరిస్తాను నిత్యం
అంతదాకా సమయం నాకు ఇవ్వండి
నేర్చుకొని వస్తాను వేచివుండండి
దయచేసి నాకొరకు వేచివుండండి.
19


***** సమూహం :  వీరాస్ కవి సమయం *****
కవి సంఖ్య :  27
తేదీ        : 18-06-2020
కవిత సంఖ్య : 19
కవి పేరు     :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా          : రంగారెడ్డి

💐🙏*శీర్షిక:  జోహార్ కల్నల్ సంతోష్ బాబు*🙏💐

వీర సైనికుడా జోహార్, అమర వీరుడా జోహార్
చిన్నతనము నుండే దేశభక్తిగలిగి
తండ్రి కోరిక దీర్చ సైనికుడుగా మారి
అనతికాలంలోనే పదోన్నతులు పొంది
ఎదిగినావు సైనిక కల్నల్ స్థాయికి
సరిహద్దులలో చేసినావు ఎన్నో పోరాటాలు
దేశ సరిహద్దులను భద్రముగా కాచినావు
చైనా వేసిన వెన్నుపోటుకు బలైనావు
భరతమాత కొరకు అమరుడైనావు
నీ త్యాగం అమూల్యం, నీవు ఆదర్శం
నీ కీర్తి అజరామరం, మాకు గర్వకారణం
వీరుడా వందనం, వీర సైనికుడా వందనం🙏🙏🙏.

బిక్కుమళ్ల సంతోష్ బాబు
అమరుడైన వార్త గుండెకోత
దుఖః సంద్రమాయే సూర్యపేట
మళ్ళీరావా మాత సేవ జేయ.

ఏకైక పుత్రుని దేశసేవకు బంపిన
ఆ తల్లిదండ్రులెంతటి ధన్యులు
వారి దేశభక్తి ఆదరణీయము
ఎందరికో వారు ఆదర్శనీయము.

ఆ అమర వీరునికివే నా నివాళులు
వారి కుటుంబానికి ధైర్యమిమ్మని నా దైవ ప్రార్థన.
20


21

[21/06, 4:12 PM] Tumma Janardhan KS 27: ****** సమూహం :  వీరాస్ కవి సమయం ******
కవి సంఖ్య    :  2️⃣7️⃣
తేదీ         : 21-06-2020
కవిత సంఖ్య : 21
కవి పేరు      :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా           : రంగారెడ్డి

*శీర్షిక :  నాన్న – ఓ నిద్రాణ అగ్నిపర్వతం*

అమ్మ ప్రేమ లాలిత్యం, నాన్న చూపు రాహిత్యం
కుటుంబమే ఆయన విశ్వం, మా శ్రేయస్సే నిత్యం
గుంభన గంభీరంతో జరిపించును కృతకృత్యం
గమనిస్తే తెలుస్తుంది నాన్న ప్రేమ రహస్యం
కుటుంబానికి మూలస్తంభం గమనించని గాంఢీవం
ఎంత సమస్యనైనా నెరవేర్చును నేర్పుతో
కనిపించక చూపించక నెట్టేయును ఓర్పుతో
నాన్న ఓ కొవ్వొత్తి, చీకటిలో తానుండి ప్రసరించును ప్రకాశం
నాన్న ఓ రసతంత్రుల వీణ మధుర రాగాల భావన
నాన్న జీవితమే వేణువు అయినా కరుణారస మేరువు.

నాన్నంటే కాదు భయము గురితప్పని అభయము
దారి చూపు మార్గదర్శి దాగిచూచు విజయదర్శి
పిల్లల పెద్దోల్లజేసే ఘనుడు నలిగి మిగిలిపోవు పేదవాడు
భేషజాలు లేని మనీషి పేరుకే యింటి పెద్దమనిషి
పైన ఊగు తాటిచెట్టు మొదలు కదలని రసపట్టు
మనసెంత గుల్లయినా కనిపించు మధుర తేనెతుట్టె
అతడు పెద్ద సహాన శీలి, అంతుతెలియని త్యాగశీలి
అతడే భగవద్గీత, కుటుంబ విధాత, పిల్లల భవిష్యత్ ప్రదాత
ప్రేమించడంలో నాన్న దైవ సమానం, నాన్నే నా సర్వస్వం
అవును, *నాన్న హృదయ శిఖరం, ఓ నిద్రాణ అగ్నిపర్వతం.*
22
[21/06, 5:02 PM] Tumma Janardhan KS 27: ****** సమూహం :  వీరాస్ కవి సమయం ******
కవి సంఖ్య    :  2️⃣7️⃣
తేదీ          : 21-06-2020
కవిత సంఖ్య : 22
కవి పేరు      :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా           : రంగారెడ్డి

*శీర్షిక :  ఆచరణ*

అందరూ చెప్పేవారే, చేసేవారేరి?
తెలియని విషయమేమిటంటే,
చెయ్యనప్పుడు చెప్పే హక్కెక్కడిది
చెప్పినప్పుడు చేయకుండా వుండే అవకాశమేక్కడిది.

మనసా, వాచా, కర్మణా ఆచరణ ముఖ్యం
చేసిందే చెప్పుట సత్యం
చెప్పిందే చేయుట ధర్మం
సత్యం ధర్మం లేని మాటకు లేదర్థం.

విదుషీమణులు చెప్పరు ఆచరించి చూపుతారు
చెప్పుటకన్న చేసి చొపించుటే మిన్న
రాముడు దేవుడైనా చేసి చూపెను కర్మ
ఆచరణకు అతడే గొప్ప ఉదాహరణ.
23
[23/06, 5:59 PM] Tumma Janardhan KS 27: ******సమూహం :  వీరాస్ కవి సమయం******
కవి సంఖ్య    :  2️⃣7️⃣
తేదీ         : 23-06-2020
కవిత సంఖ్య  : 23
కవి పేరు      :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా           : రంగారెడ్డి

*శీర్షిక : హామీ పత్రం*

కొత్త కొత్త ఆలోచనలకు సూత్రం నీవు
ఒకే అంశాన్ని వివిధ రూపముల
ఆవిష్కరింపజేయు మంత్రం నీవు
నూతనోత్తేజం నింపే నేస్తం నీవు.

పాత పద్ధతిని పక్కకు నెట్టి
కొత్త భావాల కోకను గట్టి
నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి
కొత్త రకానికి ప్రాణం పోసే ప్రాణవాయువు నువ్వు.

ఒకే అంశానికి మరో కోణం చూపి
భావ, పదాలతో నవపథం తొక్కి
పాత భావనలు మరిపించేసి
కొత్త రుచులతో ఆకలి తీర్చే కవన ధార నీవు.

ప్రకృతి సిద్ధ శోభను తెచ్చి
మేధస్సుకు మేతను యిచ్చి
నవ భావాలకు మార్గం వేసి
కవి సామ్రాజ్యపు తలుపులు తెరిచి.

అవకాశాల ఆకాశం ఎత్తి
కొత్తపుంతలకు ఊపిరి పోసి
సాహితీలోకపు బాటలు వేసి
నన్ను కవిగా కసిగా వ్రాసేలా చేసి.

ప్రోత్సహించినది హామీ పత్రం
నీవే కదా నా విజయ సూత్రం.
24
[23/06, 6:00 PM] Tumma Janardhan KS 27: ******సమూహం :  వీరాస్ కవి సమయం******
కవి సంఖ్య    :  2️⃣7️⃣
తేదీ         : 23-06-2020
కవిత సంఖ్య  : 24
కవి పేరు      :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా           : రంగారెడ్డి

*శీర్షిక : నా అఖండ భారత్ ఎక్కడ*

పటంలో చూస్తే కనిపిస్తుంది
సరిహద్దేమో కాదంటుంది
పరాయిచేతిలో బ్రతికేస్తుంది
సరికాదంటూ మొరపెడుతుంది.

అటువైపున పీ.ఓ.కే. ఏంది
ఇటువైపున ఎల్.ఏ.సీ. ఏంటి
అక్సాయ్ చిన్ అసలేంటి
అఖండ భారత్ కాదంటుంది.

పర్వతమైనా, హిమ శిఖరమైనా
భారతమాత అంగమే కదా
దూరి వస్తే కోపమే రాదా
దగాపడినా ఉక్రోషమే లేదా.

ఇదంతా ఎవ్వరూ చేసిన పాపం
భారత మాతకు ఎందుకు శాపం
దేశభక్తుల నెత్తుటి ప్రవాహం
మంటగలిసెనా ఆత్మ గౌరవం
చూపించాల్సిందే ప్రతాపం.

అఖండ భారత్ అవ్వాల్సిందే
ఎవరైనా ఇచ్చి తీరాల్సిందే
లేకుంటే గుంజుకు రావాల్సిందే
పొరాడి విజయం సాధించాల్సిందే
పటంలోని భారత్ నే చూడాల్సిందే.

పదండి ముందుకు పదండి తోసుకు
పొరాడి గెలుద్దాం అఖండ భారతం.

25
[24/06, 7:46 PM] Tumma Janardhan KS 27: ******సమూహం :  వీరాస్ కవి సమయం******
కవి సంఖ్య    :  2️⃣7️⃣
తేదీ         : 24-06-2020
కవిత సంఖ్య  : 25
కవి పేరు      :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా           : రంగారెడ్డి

*శీర్షిక : ముఖమే ముఖద్వారం*

ముట్టకు ముఖాన్ని
ఎందుకంటే ముఖమే దానికి ముఖద్వారం.

తాకకు అధరాన్ని
పొడవకు కన్నును
కెలకకు ముక్కును
ఎందుకంటే ముఖమే దానికి ముఖద్వారం.

సబ్బుతో కడిగేయ్యాలి
చేతులు శుభ్రం చెయ్యాలి
ఆ తర్వాతే ముఖమును తాకాలి
ఎందుకంటే ముఖమే దానికి ముఖద్వారం.

ముఖమును గోకుట మానన్నా
పౌడరు వేయుట మానన్నా
క్రీములు పూయుట మానన్నా
ఎందుకంటే ముఖమే దానికి ముఖద్వారం.

పక్కులు తీయుట మానేసేయ్
ఊసులా ఊసే మరీచేసేయ్
చెవిలో గులిమిని వదిలేసేయ్
ఎందుకంటే ముఖమే దానికి ముఖద్వారం.

ఏమిటీ గోల అంటారా
కరోనా కష్టం కనలేదా
వైద్యుల మాటలు వినలేదా
ఎందుకంటే కరోనాకు ముఖమే ముఖద్వారం.
26
[25/06, 8:08 PM] Tumma Janardhan KS 27: ******సమూహం :  వీరాస్ కవి సమయం******
కవి సంఖ్య    :  2️⃣7️⃣
తేదీ         : 25-06-2020
కవిత సంఖ్య  : 26
కవి పేరు      :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా           : రంగారెడ్డి

*శీర్షిక : శాపం*

కరోనా వచ్చాక తెలిసింది
తాకితే పాపం అదో శాపం
ప్రాణాలకు మహా సంకటం
పరిశుభ్రతే పరిహరించే శక్తిపీఠం.

ఇలాంటి శాపాలే అవసరం
అప్పుడే వింటుందీ లోకం
సహజ వనరుల వినియోగం
తగ్గించే శాపం ఇప్పుడు అత్యవసరం.

నీటి వృధా తగ్గించుట కొరకు
నేటి తరానికి తెలుపుట కొరకు
ప్రకృతి వినాశనం ఆపుట కొరకు
ప్రకృతి పరిరక్షించుట కొరకు.

నదులను కాపాడుట కొరకు
కాలుష్యాన్ని కడతేర్చుట కొరకు
అబలల సబాలగా మార్చుట కొరకు
బాలల మానం కాపాడుట కొరకు.

దుశ్చర్యలను ఆపుట కొరకు
దుర్మార్గుల కడతేర్చుట కొరకు
అవసరమే పరిహరించగా పాపం
ముడితే మసియై పోయే శాపం.
27
******సమూహం :  వీరాస్ కవి సమయం******
కవి సంఖ్య    :  2️⃣7️⃣
తేదీ         : 28-06-2020
కవిత సంఖ్య  : 27
కవి పేరు      :  తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
జిల్లా           : రంగారెడ్డి

*శీర్షిక : వలస జీవితాలు గాలిదీపాలు*

వలస జీవుల కష్టం అందరికీ అవసరం
వారికి కష్టం వస్తే అందరూ దూరం
పట్టించుకోవాల్సిన ప్రభుత్వం అలసత్వం
వేచి వేచి వలసజీవి తెరుగు వలస ప్రయాణం.

నడవలేక సొమ్మసిల్లిన ప్రాణం
నడక దారిలోనే చచ్చుబడిన దేహం
నడుస్తూ చేరినారు కొందరు స్వర్గం
నడక దారులే అంపశయ్యలైనాయి.

నడవలేని పాదాలు రక్తపాతమయ్యే
నడుము వాల్చలేక నరకమయ్యే
నడిచి నడిచి నరాలు నలిగిపోయే
నడిచిన పాదాలు పలుగురాళ్ళాయే.

చిన్న పెద్దలంతా చిగురుటాకులాయే
చింతజెందినారు చిగురుటాకులు
చిద్విలాసుడి పరీక్షకు చివరంటా
చిన్నబోక చేసిరి నడక దండయాత్ర.

అది ఓ ప్రయాణం; ఓ ప్రత్యక్ష నరకం
అడుగడుగున అగచాట్లు, పాట్లు
అక్కడక్కడా ఆగినా, అలసట కష్టం
అయిపోయే వలస జీవితం గాలిదీపం.

Comments

Popular posts from this blog

తిరు వేంకటాచార్యులు KS 6

బాటసారి KS 12

అనామికా శతకం విట్టుబాబు గారు