దైవాధీనం KS 4

[06/05, 1:13 PM] Daivadheenam Ks4: సమూహం:వీరాస్ కవి సమయం
తేది.06.5.2020
కవితసంఖ్య.1
కవి పేరు.డి.దైవాధీనం
జిల్లా.మేడ్చల్
శీర్షిక.కరోనా నేర్పిన పాఠం

దారిలో ముళ్లుంటాయి
అడుగడుగునా అప్రమత్తం
నల్లని వన్నీ నీళ్ళని
తెల్లని వన్నీ పాలని భావిం చే సమయంకాదు
క్షమాగుణం స్వావలంబన
ధరిత్రి ని కాపాడే
శ్రమైక జీవనం
స్వీయ నియంత్రణ
స్వస్త జీవనం
స్వయంసమృద్ధి
ఆపదలను గుర్తెరిగి యుక్తితోఎదుర్కొనే
శక్తి
బాహ్యప్రపంచాన కీడెంచి మేలెంచవలె
నను సూక్తి
దూరపు కొండలు
నునుపు కాదు
ఆపత్కాలమందు
గడప లోపలె సుఖముండు
కుటుంబ సభ్యులతో
దినమంతా గడుపుటకన్నామించి ఆనందమెచట లేదు
మనిషి కి మనిషికిమధ్యన
భౌతికదూరం
మహమ్మారితో మరి కొన్నాళ్ళుసహజీవనమాయె
పాఠాలు నేర్పిన కరోనా కు  గుణపాఠమే చెబుదాం
ప్రభుత్వానికి అండగా
వుంటూ కరోనాను
కడతేర్చుదాం
అన్నార్థులను ఆదుకొందాం
నిరాశ్రయులకు నీడనిద్దాం
వైద్యులు, వైద్య సహాయకులు, పారిశుద్ధ్య కార్మికులు,శాంతిబధ్రతలుకాపాడెరక్షకభటులు,కవిగాయకకళాకారులు , జర్నలిస్టు లు
మానవ రూపాల్లో వున్న దేవతలు వీరు
ఏమిచ్చినా వీరి రుణం తీర్చుకోలేనిది
వారికేమన అభినందన మందారాలు
జయజయధ్వానాలు

ఈ కవిత నా స్వీయ రచనని హామి ఇస్తున్నాను
ధన్యవాదాలు.
[07/05, 2:47 PM] Daivadheenam Ks4: సమూహం:వీరాస్ కవి సమయం
తేది.07.5.2020
కవిత సంఖ్య.2
కవి.డి.దైవాధీనం
జిల్లా.యాదాద్రి
కవి సంఖ్య.4
శీర్షిక.మూలిగేనక్క పై
తాటికాయ
అది 7.5.2020రోజు
ప్రాతఃకాలం 2.45.
నిమిషాలసమయం
ఒక వైపు కరోనా కాఠిన్యం నుండి బయట పడటానికి
జరుపు తున్నపోరాటం
లొ
లాక్ డౌన్ సడలింపు లతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నజనాలు
దినమంతా కరోనా
నిర్మూలన చర్యల్లో వుండి
రాత్రి వేళల్లో సేదతీరుతున్న సమయంలో
అంతలో విశాఖపట్నం లో ని
ఆర్.ఆర్.వెంకటాపురం వాసులపై
మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు
ఎల్.జి.పాలిమర్స్
ఫాక్టరీ నుండి
స్టెరిన్ మోనోమర్
విషవాయువు లీకేజి
బారినపడిన సమీమ ప్రాంతవాసులు
ఊపిరాడక, కళ్ళు కనడక అప్పటి కప్పుడే  ఆరుగురు
దుర్మరణం
రెండు వేలకు పైగా  కె.జి.ఎచ్,అపోలో
మొదలైన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నబాధితులు జీవకారుణ్యాన్నితలపించిన విషవాయుప్రభావం
 ప్రాణ వాయువు లోపంతోప్రాణాలువిడిచిన మూగజీవాలు
 తల్లడిల్లి న పశుపక్షులు,ఫలవృక్షాదులు
విషవాయువు లీకేజీకి
యాజమాన్యానిదేబాధ్యత గాదా
ఇంతమంది ప్రాణాలను ప్రమాదం లోకి నెట్టిన ఫాక్టరీ
నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ రోజు దుర్ఘటనకు సాక్ష్యం
బాధ్యులంతా బాధితులకు మూల్యం చెల్లించాలి
ఆవిషవాయువు  బారినపడిన వ్యక్తు లకు రెండు మూడు
నెలలవరకు
శ్వాసకోశ వ్యాధులు,
నరాలపై నా తీవ్ర ప్రభావం
వీటితోపాటుమానసిక
ఇబ్బందులు సైతం
ఆవహించును
సతతం
కాన్సర్ కుకూడా దారి
తీసే ప్రమాదం
ప్రకృతిని ప్రమాదంలో కి  నెట్టిన ఎల్.జి.పాలిమర్స్ ఫాక్టరీ యాజమాన్యం
తమ బాధ్యతారాహిత్యానికి గుణపాఠం నేర్చుకోవాలి
బాధితులను ఆదుకోవాలి
ప్రకృతి ని కాపాడండి
అదిమనను కాపాడుతుంది

(విశాఖపట్నం లోని
ఆర్.ఆర్.వెంకటాపురం ఎల్.జి.పాలిమర్స్ ఫాక్టరీలో విషవాయువు లీకేజి కి  అసువులు బాసినవారికి వారి ఆత్మశాంతి కై భగవంతుని వేడుతూ, ఆసుపత్రి పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆ కాంక్షిస్తూస్పందించి
రాసిన నా స్వీయకవిత)

డి.దైవాధీనం
8008409665
[08/05, 6:46 PM] Daivadheenam Ks4: వీరాస్  కవిసమూహం
కవిత సంఖ్య.3
శీర్షిక.పకృతిసంపద
కవి.డి.దైవాధీనం
తేది.8-5-2020

-------------------
ప్రకృతి సంపద
------------------
 ప్రకృతి సంపద మానవాళికి దేవుడిచ్చిన వరం
పంచభూతాలు అనబడే భూమి,ఆకాశం,గాలి,నీరు, అగ్ని
అందరికీ సమంగానే
పంచాడు
ఐనా ఎన్నో వ్యత్యాసాలు
కాలుష్యానికిమానవుడే కారణమైనాడు
రైతు స్వయంశక్తితో
పంటలు పండించే వాడు
అవసరమైతే నే సేంద్రియ ఎరువులు
తనకు తానే నీటి వనరులు కల్పించుకునేవాడు
అవసరమైతే తనకున్న కొద్దిపాటి
వ్యవసాయ కూలీల
సహకారంతో స్వయంగా బావులుత్రవ్వేవాడు
నారుమళ్లు తయారుమరియు
నాట్లు మొదలుకొని
పంట దిగుబడి వరకు
ప్రాణశక్తియే ఆధారం
అప్పుడన్నీ పకృతి
సిద్ధమే
రానురాను మేధాశక్తి
తో పని చేయనారంభించాడు
అభివృద్ధి చెందిన దేశాలు
ఒకడుగు ముందుకేసి
మనవారికి యాంత్రిక శక్తిని పరిచయం చేశాయి
అప్పు డే మొదలాయె
ఆధునికత
నాగలిఎడ్లబండ్లు పోయిమోటారు ట్రాక్టరులొచ్చె
మోటకొట్టేపని
మోటుగాదలచె
మరయంత్రాలేమంచివనిదలచె
చేతివృత్తుల వారికి
చేతినిండా పనిలేక
పనులకోసం పట్నవాసమాయె
గ్రోమోర్  లేనిదే
గొప్పలేదని రైతు
దండిగా భూమి లో
ఎరువులు దట్టించె
బావుల్లో నీరు ఉప్పు
గా మారి
మంచినీరు ఖరీదుకు
కొనగనాయె
సారంలేని భోజనాలు
రోగాలకు నెలవాయె
తృణధాన్యాలు కొనుట గగనమాయె
సహజపంటలు మాని
వ్యాయాపారులు
యాంత్రిక తకుబానిసాయె
అడవులన్నీఅంతరించి
ఆకాశహర్మ్యాలకు
నెలవాయె
కాలుష్య కోరల్లో జనులు కలవరపడుటాయె
కొత్త కొత్త వైరస్ లు
జనులపై దాడి చేయుటాయె
స్వీయ రక్షణిపుడు
మనకు తక్షణకర్తవ్యమాయె
వైరస్ లను పారద్రోల
పచ్చదనం, పరిశుభ్రతపాటించుటే మేలాయె

ఇది నాస్వీయరచన
డి.దైవాధీనం
[10/05, 3:47 PM] Daivadheenam Ks4: వీరాస్ కవి సమయం
---_------------------
కవి సంఖ్య.4
కవితా సంఖ్య.4
కవి.దైవాధీనం
------------------
అనురాగ దేవత
----------------------
అమ్మ అనురాగ దేవత
అమృత మూర్తి
ఆత్మవిశ్వాసం
ఆర్ద్రతకుమారుపేరు
అన్నపూర్ణ
అభినందనకారిణి
ఆదిగురువు
కనిపించే దైవం
కరుణామయి
కల్పతరువు
త్యాగశీలి
ఇంటిని స్వర్గసీమ చేసే
గృహ లక్ష్మి
-------++------
[10/05, 4:44 PM] Daivadheenam Ks4: వీరాస్ కవి సమయం
-----
కవిసంఖ్య.4
కవితా సంఖ్య.5
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక.ప్రతిబింబాలు
పత్రికలే పజావేదికల
ప్రతిబింబాలు
సమాజహితం కోరే
సందేశాలు
వాటికి తమశక్తి,యుక్తి,అనురక్తి తో జీవం పోసేదే
పత్రకారులు
పత్రికా పరిపుష్టికి
మూలస్థంభాలు
అంకితభావం, సమయపాలన,చురుకుదనం,వేగంవారి
నైజం
అవినీతి అంతానికి
ఆయధమయ్యే అక్షర యోధులు
నిజం,నిర్భయం వారి
ఔన్నత్యం
ప్రజలకు ప్రభుత్వానికి
వారధులువీరే
పత్రికా రంగానికి
రథసారధులువీరే
ప్రభుత్వపథకాలకు
ప్రచార కర్తలువీరే
ప్రపంచంలోఏవిశేషమైనా, విపత్తు జరిగినా క్షణాలలో
ప్రజలముందుంచగల
నేర్పరులు
రైతు,కార్మికసమస్యలైనా
నిరుద్యోగులనివేదనలైనా
ఉద్యోగ,ఉపాధ్యాయ
పదోన్నతులైనా
అవార్డులైనా,రివార్డులైనా
యుద్ధం,శాంతిబధ్రతలైనా
ఆరోగ్యం,అత్యైకపరిస్థితులైనా
లాక్ డౌన్,కరోనా కట్టడి ఐనా
నిజం రాసేదె జర్నలిజం
నిర్భయత్వమే జర్నలిజం

డి.దైవాధీనం
యాదాద్రి భువనగిరి జిల్లా.
[13/05, 11:14 AM] Daivadheenam Ks4: వీరాస్  క వి సమయం
కవి సంఖ్య.4
కవితా సంఖ్య.6
కవితా శీర్షిక.ఆరనిదీపం
కవి.డిదైవాధీనం
---------
సేవయే పరమావధి
మానవ సేవయేమాధవసేవగా
దలచి
అనునిత్యం ఆరోగ్యం
పెంచుతూ సాగుతుందిలా ప్రయాణం
వైద్యాలయాలలో చేరిన వారందరూ ఏదోఒక వ్యాది పీడుతులే
 వారందరి మనసుల్లో
ఆత్మవిశ్వాసం నింపుతుంది
తల్లి లా,సోదరిలాసపర్యలు చేస్తుంది
కోలుకునేవరకు చెంతనుండిఎంతో ధైర్యం నింపుతుంది
ఔషధాలతో పాటు
ఆత్మస్థైర్యం అందిస్తుంది
వైద్యులకు సహాయకారిగావుంటూ రోగికోలుకునేవరకు
తోడుగా వుంటూ త్వరగా రోగవిముక్తి
కలిగేటట్లు సూచనలిస్తుంది
పగలు చెరగని చిరునవ్వు తో రాత్రులందు చల్లని
వెన్నెల కురిపిస్తూ
స్వాంతన చేకూరుస్తుంది ఆమె లేడి విత్ లాంప్
సేవా నిరతి కి ప్రతీక నర్సుమాత
ఫ్లోరెన్స్ నైటింగేల్
-------
ఇది నా స్వీయ రచన..డి.దైవాధీనం

(నర్సులు దినోత్సవం
12.5.2020 సందర్భంగా)
[13/05, 1:11 PM] Daivadheenam Ks4: వీరాస్ కవి సమయం
కవి సంఖ్య.4
కవితాసంఖ్య.7
కవి.డిదైవాధీనం
యాదాద్రి భువనగిరి జిల్లా
కవితా శీర్షిక.కడదాకాపోరాటం
 కరోనావిశాదం
ఇది ధరిత్రి శోకం
చైనా వైరస్ సృష్టించి న అఘాదం
ఇప్పటిలో తీరేనా మానవశోకం
కడదాకా చేయాలిపోరాటం
అంతుచూడాలి
కరోనా కయ్యాన్ని
దాని అంతంకోసం
మనమంతా పంతం
పూనాలి
అప్రమత్తమే ఆయుధం
జాగరూకత జనజీ విన సౌందర్యం
మనిషి కి మనిషికి భౌతికదూరం
మాస్కులు మన జీవరక్షక కవచాలు
అలాయ్బలాయ్
అసలే లేదు
అతిథులకుఆతిథ్యమే గగనం
సహా పంక్తి భోజనాలు లేవు
సామూహిక ప్రార్థనలు లేవు
ఇల్లేబడి,గుడి,పెళ్ళిపేరంటాల పెన్నిధి
వ్యాయామం,యోగాసనాల సన్నిధి
పరిశుభ్రత తేపరమావధిగా
స్వీయ రక్షణే శ్రీరామ రక్ష గా
జీవన పోరాటం సాగించుటే  మన కింకర్తవ్యం
సామాజిక దూరం పాటిస్తూనే
బంధాలుఅనుబంధాలు  బలోపేతం చేయాలి
దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తూ
చేయూత నందించాలి
-------
ఇది నా స్వీయ రచన
అని హమి.
డిదై వాధీనం
[13/05, 2:50 PM] Daivadheenam Ks4: వీరస్ కవి సమయం
కవి సంఖ్య.4
కవితా సంఖ్య.8
కవి.డి.దైవాధీనం
శీర్షిక.కరోనా పై కదనం
-----------------
కనిపించని శత్రువు
కాటు వేయజూసింది
కదలలేని వైరస్ అది
జీవం లేని కొవ్వుపొరను కప్పుకున్న కణంఅది
జీవరాసుల కదలికలతో కలిస్తే జీవం బోసుకుంటదది
ముక్కు,నోరు, కళ్ళు
ద్వారా ఊపిరితిత్తులకు సోకి
ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
దగ్గు,జలుబు,జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులున్నా
రోగ నిర్ధారణ పరీక్షలు
చేయించుకొనుట మేలు
ఇవేమిలక్షణాలు లేక పోయినా
ఒక్కో సారి రోగనిర్ధారణ లో పాజిటివ్ తేలవచ్చు
అందుకే  అప్రమత్తం
మేలు
అమెరికా లాంటి కొన్ని దేశాల్లోరిమిడెసెవర్
అనే అంటీవైరల్ ఔషధం వెంటిలేటర్ పై
వున్న రోగులకు ఇవ్వబూనిరి
దాని ఫలితంగా
వైరస్ తీవ్రత తగ్గనాయె
దాంతో పాటుగా
లోపినావిర్ కూడా
సమర్థవంతంగా పని చేయనాయె
పోటాపోటీగా కొన్నిదేశాలుకరోనా
విరుగుడు కు వ్యాక్సిన్ తయారీలో
పరుగులాయె
ఏదేమైనా కొన్ని రోజులు సామాజిక దూరం పాటిస్తూ
సహజీవనం తప్పేట్లులేదాయె
చైనా చక్రాన్నియ తలకిందులయ్యేవరకు స్వీయ రక్షణ పాటిస్తూ పోరాటం
చేయవలె
అందరిలోనూ ఆత్మవిశ్వాసం నింపవలె

ఇది నా స్వీయ రచన
అని హామి
డి.దైవాధీనం
--------
[14/05, 4:00 PM] Daivadheenam Ks4: వీరాస్ కవి సమయం
కవిసంఖ్య4
కవితాసంఖ్య9
కవితాశీర్షిక.మేక్ఇన్ఇండియా
కవి.డి.దైవాధీనం
---------------
ఇన్నాళ్లదాకావిదేశీ వస్తువులంటే మోజుండెమనకు
మనవద్ద తయారు వస్తువులు గింతేగదా
దూరంకొండలనునుపనుకుంటిమి
భ్రమసి కొంటే నాసిరకమనితేలె
పైపైన మెరుగులున్న
వాటి వైపు పరుగులు
తీశాం
మెరిసే దంతా బంగారం కాదని
ఇపుడర్థమైంది
మన దగ్గరే మన్నికగల నాణ్యమైన వస్తువులతయారీకి
పెట్టింది పేరని తెలుసుకున్నాం
మనదేశ నిపుణులే
అభివృద్ధి చెందిన దేశాల్లోఉన్నత స్థానాల్లో పని చేస్తున్నారని తెలుసుకున్నాం
మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే
మన పరిశ్రమలు నిలదొక్కు కోవాలి
మనదేశంలో శిక్షణ పొందిన నిపుణులు
మన దేశ అభివృద్ధి కే
పనిచేయాలి
ఎందరో విదేశీ పర్యాటకులు మనదేశ సంస్కృతికి
అబ్బుర పడ్డారు
మన శ్రామిక శక్తిని కొనియాడారు
సారవంతమైన మన  భూముల్లో రైతుల సేద్యవిధానం,పంటల
దిగుబడి చూసి ఆశ్చర్యపడ్డారు
మన శ్రమశక్తి నిమనదేశంలోనేవినియోగించు కొన్నట్లైతే
మన దేశం కూడా త్వరలో నే అభివృద్ధి చెందినదేశాలజాబితాలోచేరగలదు
కరోనా వైరస్ చైనాలోని వూహాన్లో
పుట్టి అంచెలంచెలుగా ప్రపంచ వ్యాప్తంగా
ప్రబలి ఆయా దేశాల్లో అంతులేని ప్రాణనష్టం
తోపాటు ఆర్థికంగాదెబ్బతీసింది
ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాలను సైతం కోలుకోకుండా చేసింది
ఇంతధనప్రాణ నష్టం
ప్రపంచ యుద్ధాలలో
కూడా కనివినీ ఎరగలేదు
దీనికంతాకారణం
చైనాఅంటూ
అగ్రరాజ్యలన్నీ ముక్తకంఠంతో నినదిస్తున్నాయ్
ఈసంకటస్థితిలో
మనప్రధాని కోవిడ్-19 ను జాతీయ విపత్తు గాప్రకటించి, జనతా కర్ఫ్యూ,లాక్ డౌన్ లు
ప్రకటించి, రాష్టాలను చైతన్య పరిచి, సర్వశక్తులు ఒడ్డి చైనా చైన్ ను ఒడుపుతో విడదీసి
పాజిటివ్ కేసులు పెరగకుండా చూశారు
ఆర్థిక భారమైనా కరోనా బారినపడకుండా జనులను కాపాడాలన్నారు
క్లోరోక్వున్ హైడ్రో క్లోరైడ్ టాబ్లెట్ లను
అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఆస్ట్రేలియా,బ్రిటన్, న్యూజిలాండ్, సౌదీ అరేబియా మొదలగు దేశాలకు ఎగుమతి చేసి తన ధాతృత్వం చాటుకున్నారు
విపత్కర పరిస్థితుల్లో
సహాయంఅందించిన
మనప్రధాని మోదిని
'సంజీవని' తెచ్చిన హనుమంతుడిగా అభివర్ణించారువారు
భారత దేశకీర్తి ప్రతిష్ట లు దశదిశలా వ్యాపించాయి
నాణ్యత లేని చైనా మరియు విదేశీ తయారివస్తువుల దిగుమతిఅడ్డుకోవాలి
మనదేశంలోనే పరిశ్రమలు వాటికి ధీటుగా నిలబడి చైతన్య వంతం గా పని చేయాలి
ఉద్దీపన పథకాలు
సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సమర్ధవంతంగా వినియోగించుకొని ఆర్ధిక పరిపుష్టితోఎదగాలి
మేక్ ఇన్ ఇండియా
నినాదం విజయవంతం చేయాలి
-------------
ఇది నా స్వీయ రచన
అనిహామి ఇస్తున్నాను
డి.దైవాధీనం
------
[15/05, 7:26 PM] Daivadheenam Ks4: వీరాస్ కవి సమయం
కవిసంఖ్య.4
కవితాసంఖ్య.10
కవి.డి.దైవాధీనం
-------

కవితాశీర్షక.వందేభారతం
--------
వందేభారతం
అందాం అందరం
భారతం సుందరం
బంగారు భవితకిదే
స్వాగతం
భాగ్యాలహరితహారం
బహుసుందరనందనవనం
వందేభారతంఅందాంఅందరం
శాంతి సామరస్యం
అన్నది మన అభితం
నీతి నిజాయితీ
నిత్యం మనసాంగత్యం
వందేభారతం అందాం అందరం
చెరిగిపోని స్నేహం
చేయడమేమన ఆశయం
చెదరనిచిరునవ్వులే
తీర్చగలవుఆపద లే
శ్రమైక జీవనంనేర్పును
జీవిత పాఠం
జననీ జన్మభూమి
స్వర్గము కన్నమిన్న
పులకించునుమనసు
తల్లి వడిలోసేదతీర
తరించును జీవితం
మాతృ భూమిసేవచేయ
వందేభారతం అందాం అందరం
అన్నదమ్ముల అనురాగం
చెరగని తరగని అనుబంధం
మిత్రులకలయిక
మహదానందం
పాడిపంటలు,పచ్చని
పకృతి  రైతులు
పల్లెలకిచ్చిన సౌభాగ్యం
తెలంగాణలో కృష్ణ,గోదావరి
ఉత్తర భారతాన
గంగాయమునలసంగమం
హిమాలయాల ఔన్నత్యం
కానవచ్చును మనకు
భారతాన దశదిశలా మన వైభవం
మిశ్రమభాషల
మేలుకలయిక
జాతిప్రగతికి పెట్టని కోటలు
వందేభారతం అందాం అందరం
శక్తి సంపదం
యుక్తి సంపదం
శక్తి యుక్తి సంపదం
భవతి భారతం
వందే భారతం అందాం అందరం

ఇది నా స్వీయ రచన
దేనిలోనూ ప్రచురితం కాలేదు.
డి.దైవాధీనం
[16/05, 1:40 PM] Daivadheenam Ks4: వీరాస్  కవిసమయం
తేది.16.5.2020
కవిసంఖ్య.4
కవితాసంఖ్య.11
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక.గెలుపుగీతం
-------------

పడిలేచే జీవనపోరాటంలో
గెలుపునీదే
నీవుఅలసిపోలేదు
అదరిపోలేదు
నిరంతర
నీశ్రమఫలిస్తుంది
నీస్వప్నంసాకామవుతుంది
కాలాన్నినిందించకు
కలికాలంఐనా కడదాకా గుర్తుంటావు
నీవువంటరికాదు
నీవెంట దేశమేకాదు ప్రపంచ మంతా వుంది
 అనుకోని ఆపదలనెదుర్కునే
వీరసైనికుడివి
నీవేజీవకోటికిచైతన్యమూర్తివి
పరిశుభ్రతకుపాఠాలుబోధించే పండితుండవు
కనిపించనిశత్రువుతో
కదనం నీవే
జనజాగృతి దీపం నీవే
అలుపెరగనిపోరాటం
లోఊపిరులూదిన
ఉనికివినీవే
ఆత్మవిశ్వాసం అందరిలోనింపి ఆదుకున్నధన్వంతరినీవే
జనులజీవనగమనపువేకువ నీవే
అవినీతి అంతానికై అవిశ్రాంతపోరులో
గెలుపువునీవే
భావితరాలకుబాటనుజూపే
భవ్యకాంతుల
ఉషస్సువు నీవే
 చైనా చైన్ ను అరికట్టే చైతన్యం నీవే
-----
ఇది నా స్వీయ రచన.దేనికి అనువాదం గాని,కాపిగానికాదు
డి.దైవాధీనం
---------
[17/05, 3:23 PM] Daivadheenam Ks4: వీరాస్ కవి సమయం
తేది.17.5.2020
కవి సంఖ్య.4
కవితా సంఖ్య.12
కవి.డి.దైవాధీనం
యాదాద్రి భువనగిరి జిల్లా
కవితా శీర్షిక.సమాచారవైభవం
కవి  సమాచారం ఒక చైతన్యం
సమాచారం సాంకేతిక పరిజ్ఞానం
సమాచారం చురుకుదనం
సమాచారం అభివృద్ధి కి సంకేతం
మనిషికి మనిషికి మధ్య దూరాలను
తగ్గించి అనుబంధాలను పెంచుతుంది
సమాచారం ఒక సాంకేతిక విప్లవం
ప్రగతికి ప్రతిరూపం
జనజీవన గమనం లో సమాచార ఆవిష్కరణమొక జయకేతనం
వేగం దీని నైజం
విషయ పరిజ్ఞానం
దీని ఆశయం
ప్రగతికి మార్గం
సమాచార అనుసంధానం
వార్తలు, వినోదం, విజ్ఞానం, ఉపదేశం అన్నింటికీ ఆధారం
జల,తల,ఆకాశ,ఉపగ్రహాల అనుసంధానం
సహితం సమాచారపరిజ్ణాన
పరిపుష్టికి సంకేతం సామాజిక సాంకేతిక పురోగమనానికిదర్పణం
నవభారతనిర్మాణానికి నాంది

ఇది నా స్వీయ రచన అని హామిఇస్తున్నాను.
డి.దైవాధీనం

(అంతర్జాతీయ సమాచారకమ్మ్యూనికేషన్ దినోత్సవం సందర్భంగా)
13

వీరాస్  కవిసమయం
తేది.18-5-2020
కవి సంఖ్య.4
కవితా సంఖ్య.13
కవి.డి.దైవాధీనం
యాదాద్రి భువనగిరి జిల్లా
కవితా శీర్షిక.జీవాయుధం
--------------------
  పోరాటాలు ఎన్నో
పోరాట విధానాలెన్నో
ప్రఛన్న యుద్ధాలెన్నో
చొరబాట్లు ఎన్నో
ఆక్రమణలెన్ళో
దుష్ప్రచారాలెన్నో
మతఛాందసదురహంకారాలెన్నో
ప్రత్యక్ష యుద్ధాలెన్నో
పరోక్షయుద్ధాలెన్నో
మానవ బాంబుల దారుణకాండలెన్నో
సరిహద్దు ఉగ్రవాదాలెన్నో
అన్నింటికీ కారణం
ఆధిపత్యం,అక్రమ ఆక్రమణం చొరబాట్లు,మానవహననం
ప్రత్యక్ష యుద్ధాలు కొన్నైతే
పరోక్ష యుద్ధాలు కొన్ని
రాకెట్ దాడులు కొన్నైతే
క్షిపణి దాడులు కొన్ని
రసాయన యుద్ధాలు కొన్ని
ఏయుద్ధం ఐతేనేం
ఉద్దేశం ఒక్కటే
ఆధిపత్య పోరు
చివరికి వైరి వర్గాల
వినాశనమే వారి లక్ష్యం
జీవాయుధం వుపయోగించడం
కూడా అనైతిక పోరుగా భావించడం
పరిపాటి
కారకులెవరైనామూల్యం చెల్లించకతప్పదు
వైరస్ వ్యాప్తి కికారణాలనుకనుగొనడం ప్రారంభించాయికొన్నిఅభివృద్ధిచెందినదేశాలు తనదేశంలోనికరోనాకేసులను అరికడుతూనే
అగ్రరాజ్యాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి
ప్రపంచ ఆరోగ్య సంస్ధ
వైరస్  వ్యాప్తిపరిణామదశలనిజనిర్దారణ లో తలమునకలవుతుంది
ప్రపంచ లోని 200పైగా దేశాలను
ఆరోగ్య అత్యైక పరిస్థితి కినెట్టి
ఎందరో అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్నమహమ్మారి
ని భౌతిక దూరంపాటిస్తూ దాని
వ్యాప్తికి అడ్డుకట్టవేయాలి
దీనికంతటికీ కారణమైన చైనా మూల్యం చెల్లించాలి
--------
ఇది నా స్వీయ రచన అని హామి ఇస్తున్నాను
డి.దైవాధీనం

 మానవుడు,సమాజం ప్రపంచదేశాలు సాంకేతికంగా యుద్ధరీతులో ప్రావీణ్యం సాధించాయి
ఏదేశమైనా అంతర్జాతీయ న్యాయస్థానాలకు లోబడే నడచుకుంటాయి

14
తేది.19.5.2020
కవి సంఖ్య.4
కవితా సంఖ్య.14
కవి.డి.దైవాధీనం
యాదాద్రి భువనగిరి జిల్లా
కవితా శీర్షిక.పకృతిసహజసంపద
-----------            ప్రకృతి సంపద
పరమాత్ముడిచ్చినవరం
మానవాళి కిరక్ష
సుఖసంతోషాలకు నిలయం
స‌కలజీవరాసుల నివాససంగమం
మునుల తపస్సుకుయోగ్యస్థానం
జీవకోటికి ప్రాణవాయువు ప్రసాదించే మూలాధారం
వాయుకాలుష్యాన్ని
నివారించి వాతావరణ తౌల్యాన్ని కాపాడే
విశేషగుణం
పకృతి వైద్యానికి ఆలంబనం
వృక్ష సంపదల మూలికలద్వారా ఎన్నో రుగ్మతలను
నయం చేసే ఔషధాలమేలుకలయిక
పర్యావరణ సమతుల్యత కాపాడే
సహజ గుణం
వాయుకాలుష్యాన్నికాపాడి,వ్యాధి నిరోధకంగాపనిచేసేవృక్ష సంపద
సీజనల్ వ్యాధులు ప్రభలకుండా మానవాళికి వ్యాధి నిరోధక శక్తి నందించే
సహజగుణం
నదీజలాల సంరక్షణ
మానవుని తక్షణకర్త వ్యం
జలమే జగతికి ఆధారం అనే నానుడి
నిజం చేయాలి
పాడిపంటల సౌభాగ్యానికి ఆలంబనమే పకృతిసౌభాగ్యం
కరోనా మహమ్మారి నిర్మూలనకు మూలమంత్రం
ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలన
పారిశ్రామిక వ్యర్థజలాల నివారణ
నదులు శుద్ధి, చెరువులు,ఉద్యానవనాల సుందరీకరణ
కార్యా చరణతో
ఆరోగ్యం అందరికీ పంచుదాం.
అంటు వ్యాధులనివారణకుతోడ్పడదాం
భూతలాన్ని సస్యశ్యామలం చేద్దాం
------

ఇది నా స్వీయ రచన
దేనికి అనువాదం కాదు అని హామి ఇస్తున్నాను.

15
తేది.20.5.2020
కవి సంఖ్య.4
కవితా సంఖ్య.15
కవి.డి.దైవాధీనం
యాదాద్రి భువనగిరి జిల్లా
కవితా శీర్షిక.తేటతేటతెలుగు తెలుగెత్తి జైకొట్టు తెలుగోడా
గతమంతా ఘనకీర్తి
గలవోడా
మాతృ భాష ను మరువకు మొనగాడా
పరభాష వ్యామోహం
వదలుకోరా
మన జాతిని ముందు నడిపి మనుగడసాధించుదాం
మనభాష   తీయదనం అందరికీ
పంచుదాం
దేశభాషలందు తెలుగు లెస్స యని చాటుదాం
మన భాష యే
సరళమని ,గొలుసు
కట్టు తన ఉనికియని
అందమైన అక్షరాల
కలయికని దేశమంతటాతెలుగు
తేజమునుచాటుదాం
పరభాషా వ్యామోహం లోపడి
తరించుట ఏల
తెలుగు భాష ప్రాధాన్యత తగ్గించుట ఏల ప్రాచీన భారతీయ భాషగాపేరొందిన తెలుగు
మన సంస్కృతి సాంప్రదాయాల వెలుగు
మన భాష తెలుగు
రెండు కళ్ళకది వెలుగు
పరభాష కళ్ళజోడు
పరికించి చూడు
మాతృభాష మహత్వము దశదిశలాచాటుదాం
దేశభాషలందు తెలుగు లెస్స యని చాటుదాం

ఇది నా స్వీయ రచన
అని హామి
డి.దైవాధీనం

16
తేది22.5.2020
కవి సంఖ్య.4
కవితా సంఖ్య.16
కవి.డి.దైవాధీనం
యాదాద్రి భువనగిరి జిల్లా
కవితా శీర్షిక.కరోనాపైకదనం       కరోనా పైకదనం
అంతటా కరోనా కరాళ నృత్యం
అందరినీ తమ ఇళ్ళకేపరమితంజేసిన మాయారోగం
పరిశుభ్రత అనివార్యం చేసిన
కరోనా నిర్మూలన యంత్రాంగం
స్వీయ రక్షణే ఇపుడు
జనులకు శ్రీరామ రక్ష
మందిలో మసలాలంటే
మాస్కులే మనమిత్రులు
జలుబు, పొడిదగ్గు,
జ్వరం ,ఆయాసం దీని లక్షణం
సరియైన
మందులేని రోగంగా
మారుమ్రోగుతున్న ది జాగ్రత్తలతోఈమహమ్మారినెదుర్కోవాలి
చైనాలోని వూహాన్లో పుట్టి ఇటలీ, ఫ్రాన్స్,జర్మనీ,సౌది,కొరియా, ఆస్ట్రేలియా,అమెరికాను దాటి210 దేశాలకుపైగా పాకింది
ఆరోగ్య పరిరక్షణ అందరి  బాధ్యత ఐనది
అభివృద్ధి చెందిన దేశాలు సైతం అతలాకుతలం ఐనవి
కఠిన నియమ నిబంధనలతో జనజీవనమిపుడున్నది
ముందు చూపుతో మన ప్రధాని జనతాకర్ఫ్ఫ్యూ,లాక్
డౌన్ లతో
చైనా చైన్ నుఅరికట్టగా
కోట్లధనరాసులకన్న
జనుల ప్రాణాలేమిన్నయనిరి
హైడ్రాక్సీన్ క్లోరోక్యునిపుడు
సంజీవని బూటాయె అమెరికా,ఆస్ట్రేలియా
తోసహా ఎన్నోదేశాలకో ఎగుమతాయె
వ్యాధి తీవ్రత తగ్గించి
అందరిలో అమితమైన పేరు దెచ్చె
జయ జయ ధ్వానాలతో మనదేశ దాతృత్వం పొగడిరంత
జాగ్రత్త గా మనముందాము
కరోనాను కంటికి కనిపించనంత కనుమరుగు చేద్దాం

ఇది  నా స్వీయ రచన దేనికి అనువాదం కాదు.
డి.దైవాధీనం
17
తేది.23.5.2020
కవి సంఖ్య.4
కవితాసంఖ్య.17   
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక.కరోనా అంతమే మనపంతం
-----------------------
    కరోనా అంతమేజనులందరిపంతం
కరోనా కాటుకు ఇంకెవ్వరూ బలికారాదు
సమస్యవున్న చోట
పరిష్కారం పక్కనే వుంటది
ముందు జాగ్రత్త చర్యలతో‌మనం ముప్పు నుండి కాపాడుకొనవచ్చు
మందు లేనిరోగమని
దూరంగా వుండాలి
మందులువచ్చేవరకు
పోరాటం సాగించాలి
వ్యాధి నివారణ చర్యలు
వడివడిగాచేయాలి
మనుషులలో దేవుళ్ళైనవైద్యులసేవలు కొనియాడాలి
వైద్య సహాయకులు, పారిశుద్ధ్య కార్మికులు,అడుగడుగునా అన్నదానప్రభువులు
కరోనా తోపోరాడుతున్న వీరులు ,ధీరులు
ప్రాణధాతలు వీరు
ప్రపంచ మంతా మారణహోమం
సృష్టస్తున్న  కరోనాఅంతమే మన పంతం కావాలి
కరోనామిగిల్చిన విషాదంలో నివారణోపాయం వెదకాలి
ఒకతరుణోపాయం
ఒక పరిష్కారం కావాలి

ఇదినాస్వీయరచన
దేనికి అనువాదం కాదు అని హామి.
డి.దైవాధీనం

18

వీరాస కవిసమయం
తేది 23.5.2020

కవితా.    18
కవి డి.దైవాధీనం
కవితా శీర్షిక లాక్ డౌన్ లాక్ డౌన్
లాక్ డౌన్ అంటే
మనం బంధీ కాదు
కరోనా ను బంధీ చే  యడానికే
దాన్ని ఏకాకిని చేయడానికే
దానిని నిర్మూలించడానకే
అందరిలో అదే పరుగులు
అదే అలజడి అదే చైతన్యం
అదే స్వేచ్ఛ కై ఎదిరి చూపులు
అదేఉరుకులపరుగులపోరాటం
కాని కరోనా కు 
మనంబంధీ కా
దు
ఇంట్లో మనం బంధీలం
కుటుంబ సభ్యులతో
భౌతిక దూరం పాటిస్తూ బంధీలం
కానీ లక్ష్మణ్ రేఖ పాలకులం
రక్షణ వలయదిక్ఫాలకులం
కలంపట్టినా,హలంపట్టినా చరిత్రను తిరగరాస్తాం
భారతీయ సంస్కృతి ని ప్రపంచానికి తెలియజేస్తాం
సర్వేసంథునిరామయా అనే నినాదం
చాటుతాం
కరోనా ను కడతేర్చ
ప్రపంచ దేశాలకు
సంజీవని అందిస్తాం
ఆరోగ్యం అందరికి పంచుతాం
నవ భారత నిర్మాణం
అందరికీ సౌభాగ్యం
అదే మన అభతం
ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం కాదు అని హామి ఇస్తున్నాను
డి.దైవాధీనం
19
వీరాస్ కవి  సమయం తేది.24.5.2020
కవిసంఖ్య.4
కవితాసంఖ్య19
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక.బహుదూరపుబాటసారి
----------------------------వలస పక్షులు
బ్రతుకు తెరువు కోసం
నగరవాసంచేరిన శ్రమ జీవులు
మాయదారి కరోనా
మనుషులబ్రతుకుదెరువు దూరం చేసింది
లాక్ డౌన్ తో పనులు
లాక్ ఐనవి
దీర్ఘకాల లాక్ డౌన్ లతో
ఇంటి బాట పట్టిరి వలసజీవులు
రహదారి నడక
జీవన పోరాటంలో
ఎత్తు పల్లాలన్నీసమే
ఎండలు వానలు అనే
వెగటేలేదు ఇల్లు చేరాలన్న ఆలోచనతప్ప
తనకుటుంబం తన వెంట నడిస్తే
అంతా కన్నా కావలిసిందేముంది
వారి సుఖసంతోషాలుతప్ప
ఆకలి చూపులు ఆవిరి
సుదూర ప్రయాణమే
ఊపిరి
అలసిన చోటనే సేదతీరి
ఆపై విరామం లేని
అడుగులసవ్వడి
వెంట తెచ్చుకున్న
ఆహా రం,మంచినీరు
తోడుగా సేవించక
తప్పదు ఇంకా పయనం బహుదూరం
నడిచే దారిలో అన్నదాతల శిబిరాలు
రానివ్వరు లోటు అన్నార్థులకు
తెలిసీతెలియని
భయంకొందరిలో
రహదారి నడకనే
నమ్ముకొనిరి
రవాణా సౌకర్యాలు
కలిగించేంతవరకు
ఆగలేదు కొందరు
మునుముందు
ఏంముంచుకొస్తుందోనన్న తొందరపాటు
అందరినీ అయోమయంలో పడేసింది
కొందరు వలసకార్మికులు
అవగాహన లేమితో
రైళ్లు ఆవైపు రావనే
భ్రమతోపట్టాలపైనే నిదురించి నిద్రలోనే
విగత జీవులైరి
ఇంకెన్నో వెతలతో
రోడ్డు నే నమ్ముకున్నారు
ప్రభుత్వాలెన్ని సౌకర్యాలు కల్పించినాఇల్లు త్వరగా చేరాలనే తపనొకటి కెలుకుతోంది
శ్రమను నమ్ముకున్న
వారెన్నటికీఓడిపోరు
ఎంత దూరప్రయాణమైనా
అలసట  లేని పయనమవుతుంది
లక్ష్య మొకటి  వుండాలిమదిలో
అదే దరిజేర్చేగమ్యమగును

ఇది నా స్వీయ రచన
 అని హామి
డి.దైవాధీనం
-----------
20
వీరాస్ కవి సమయం
తేది.25.5.2020
కవి సంఖ్య.4
కవితా సంఖ్య.20
కవి.డి.దైవాధీనం
యాదాద్రి భువనగిరి జిల్లా
కవితా శీర్షిక. జీవవైవిధ్యం
-----------

దేవుడు మానవాళికి
అనంతకోటి జీవరాసులకు పంచభూతాలతో సహా పకృతి సంపదను వరంగా ఇచ్చాడు
పకృతి ఒడిలో సేదతీరేట్లు
సృష్టి స్థితి లయ లకనుగుణంగా
జీవనవిధానం ఆపాదించాడు
అడవుల్లో నే నివాసం
ఎక్కడ నివాసం చేస్తే
అతడితేఆ భూమి
 దుంపలు, కాయలు,ఫలాలువారి
ఆహారం
క్రమక్రమంగా భూమి
చదువు చేసి పంటలు
పండించే వాడు
జనాభా పెరిగిన కొద్దీ
నియమాలూ పెరిగాయి
ఆధునికత అవలంభించిన కొలది
అడవులు క్రమంగా తగ్గుతూ ఆవాసాలు పెరిగాయి
యంత్రాలు రావడంతో శ్రమశక్తి
తగ్గి
మనిషి తెలివితేటలు
పెరిగాయి
ఆలోచనలవిధానం
ఆస్తులసంపాదన,స్వార్థం చోటు చేసుకుంది
ఉరుకుల పరుగుల యాంత్రిక ‌జీవనం
ప్లాస్టిక్ వస్తువుల ఉద్పాదనతో పాటు
వినియోగం పెరిగి
పర్యావరణ కాలుష్యముతో
విషవాయువులు
పెరిగాయి
పారిశ్రామిక వ్యర్థజలాల తో
పర్యావరణం కలుషితం ఏర్పడి
సహజ సంపదలు
నశించాయి
భూమి ఓజోన్ పొరకు
రంధ్రాలు ఏర్పడి పలుచ బారింది
జీవవైవిధ్య సమతుల్యం దెబ్బతింది
తద్వారామానవునిలో రోగ నిరోధక సామర్థ్యం తగ్గి రోగాలు బారిన
పడుతుండు
నీరు లేని నదులు
జీవనదులు గామనగలవా
వృక్షములులేని నేల
పచ్చదనం తో శోభించునా
సహజ వాయువులు
వీచకుండా ఆకాశమేఘాలు వర్షించునా
జీవకోటి రక్షణకై
జీవవైవిధ్యం కాపాడాలి
లోకాసమస్తాసుఖినోభవంతు అనే నినాదం నిజం చేయాలి

ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం కాదు అని హామి ఇస్తున్నాను
డి.దైవాధీనం
21
22
వీరాస్  కవి సమయం
తేది28-5-2020
కవి సంఖ్య.4
కవితా సంఖ్య.22
కవి.డి.దైవాధీనం
యాదాద్రి భువనగిరి జిల్లా
కవితా శీర్షిక
పేదల పెన్నిధి
--------
నందమూరిఅతడు
నటరత్న గాతాను
సినిమా విలీనాకాశాన వెలిగినాడు
తెలుగు భాష కీర్తి
దశదిశలచాటించి
దేశ భాషలందు తెలుగు లెస్సనే
నానుడి నిజం జేసినాడు
బడుగు జీవులపాలిట భగవంతునిదూతయై
అన్నపూర్ణ ఆహారశాలు తెరచినాడు
ప్రజల కొరకే తన పరిపాలనకు
రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినాడు
ప్రజల వద్దకు పాలన
పంతముతో తెచ్చి
ఊరు ప్రజలవెతలు
తీర్చి నాడు
ఉచిత విద్యుత్తు తో
రైతుల  విపత్తు కడతేర్చి రైతు బంధు గా పేరు గడించినాడు
సామాజిక న్యాయం
అందరికీ అందించి
సవ్యసాచి గా తానెదిగినాడు
పితృ ఆస్తిలోమహిళలకూ
సమాన హక్కులు
కల్పించి మహిళలను
మణి పూసలుగా కొనియాడి నాడు
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు జేసినాడు
ఏదేశ మేగినా ఎం దుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని అనే
నినాదం నిజం జేసినాడు
పేదల పెన్నిధి గా పరిపాలనందించే
భువిలోన చంద్రుడై
వెలిగినాడు
------
ఈరోజు  28-5-2020        స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు (మాజీముఖ్యమంత్రి మరియు నేషనల్ ఫ్రంటు చైర్మన్) జయంతి సందర్భంగా
23
వీరాస్  కవి సమయం
కవితాసంఖ్య23
డి.దైవాధీనం
మాయదారి కరోనా
కరోనా వైరస్ మిగిల్చిన విశాదమెంతో
అణగారిన బతుకుల్లో
అల్లకల్లోలం ఎంతో
దినసరి కూలీల దినదిన గండం ఎంతో
అప్పు చేసి పప్పు కూడుతినే అభాగ్యులెందరో
పనులు ఆగి‌పోయి
పస్తులున్న విగత జీవులెందరో
అలసిన ప్రాణాల కు
సేదతీర్చాలన్నా కరోనా వైరస్ అనుమానాలెన్నో
ప్రభు త్వాలు అందించే పథకాలను
అంది పుచ్చుకోని
అభాగ్యులెందరో
అవగాహన లేక అలమటించే పీడితులెందరో
ప్రభుత్వం కల్పించే
సౌకర్యాలు వినియోగించక‌కాలి
బాట పట్టిన అమాయక జీవులెందరో
చైనాలోని కరోనా
ప్రపంంతా పాకిన
వైనమేమో
అజాగ్రత్త తెచ్చిన తంటాకు అమాయకులబలి
మాయదారి కరోనామటుమాయంచేయాలి
మానవాళికి మంచి
ముందు అందించాలి

ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం కాదు అని హామి
డి.దైవాధీనం

24
వీరాస్ కవి సమయం
కవి సంఖ్య.4
కవితా సంఖ్య.24
కవి.డి.దైవాధీనం
యాదాద్రి భువనగిరి జిల్లా
తేది.29.5.2020
కవితా శీర్షిక.కరోనా
------------------------ కల్లోలం
--------
ప్రపంచాన ఏదేశం చూసినా
ఏమున్నది గర్వకారణం
అంతా కరోనా
అదుపు చేయకుంటే
అంగం చేసే కరోనా
ఆచి తూచి అడుగులేయి
అది చైనా కరోనా
బే చైన్ చేసే కరోనా
ఇల్లు దాటకు
ఇంట్లోనే వుండు
స్వీయ నియంత్రణ తో
ముందు జాగ్రత్త చర్యలు మేలు
మందిలో మసలితే
మాస్కలుధరించినచాలు
దగ్గు,దమ్ము, తుమ్ములకు దూరంగా వుండు
ముందు లేని రోగమది , వాక్సిన్ వచ్చే  వరకు
ఆరోగ్యం కాపాడాలి
కనిపించని శత్రువు తో
పరిశుభ్రత నే ఆయుధంతో
పోరాటం చేయాలి
పరిసరాలు పరిశుభ్రంగా
వుంచి ,అంటు వ్యాధులు ప్రభలకుండా చూడాలి
విదేశీ వస్తువుల కు
దూరంగా వుండి
స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలి
అపోహలు నమ్మకుండా ప్రభుత్వ
సూచనలు పాటించాలి
సర్వే జనా సుఖినోభవంతు
లోకోక్తి నిజం చేయాలి

ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం కాదు.
డి.దైవాధీనం
25

వీరాస్ కవిసమయం
కవిసంఖ్య.4
కవిత25
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక.పోరుతెలంగాణ
తెలంగాణ ఘనచరిత
కొనియాడి నా రోజు
నివురు కప్పిన నిప్పు లా యున్న
ఆంధ్రప్రాంత ఆధిపత్య ధోరణి
అంతా మొందించిన రోజు
నీళ్ళు,నిధులు నియామకాల భవితవ్యం తేల్చిన రోజు
ఆటపాటా తెలంగాణ యాసతో నినదించిన రోజు
బీడుబడ్డ బంజరునేలలు
నోల్లు తెరిచి నీటికై
నినదించిన రోజు
నిరుద్యోగం తీవ్రమైవీధికెక్కినరోజు
ఇప్పుడు గాక పోతే
మల్లెప్పుడూ తెలంగాణ రాదని
ఉక్కు సంకల్పంతో
 ఐదుకోట్ల ప్రజలు
ఏకమై పోరుబాట పట్టినరోజు
పసులకాడి పోరగాడినుండి
మంచమెక్కిన
ముసలితాత వరకు జైతెలంగాణ
జెండా ఎత్తిన రోజు
మాభూమి, మాసంస్క్రుతి,మాఉనికి ఆత్మాభిమానం
చాటుకున్నరోజు
తెగించిపొరాడుదాం
తెలంగాణ సాధించుదాం అంటూ
తెలంగాణ ధూంధాం లు నిర్వహించిన రోజు
ఉస్మానియా యూనివర్సిటీ
విద్యార్థులు ఉప్పెనలా ప్రత్యేక
తెలంగాణ కై ఉద్యమించిన రోజు
పన్నెండు వందల మంది విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు ఆత్మ బలిదానం చేసిన
అమరులైన రోజు
రాజీనామాలపర్వం
రసపట్టుగా మారిన రోజు
మహిళా శక్తి బతుకమ్మ,బోనాలతో తెలంగాణ కై తెగువ జూపిన రోజు
నాశ్వాస ,నాధ్యాస
తెలంగాణ గోస కు
పరిష్కార భాష
అంటూ కల్వకుంట్ల
చంద్రశేఖర్ రావు గారు ఆమరణ నిరహార దీక్ష చేపట్టి నా రోజు
తెలంగాణ ఒక వైపు
దానికి విరోధులంతా ఒకవైపు
రాజకీయ నాయకుల ఏకీకరణ జరిగినప్పుడు
రాకుండా ఎట్లుంటది తెలంగాణ
ఓటు అనే బ్రహ్మాస్త్రమే ప్రజల వద్దుంటే
------------
ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం కాదు అని హామి.
డి.దైవాధీనం
26


వీరాస్ కవి సమయం
కవి సంఖ్య.4
కవితా సంఖ్య.26
కవి.డి.దైవాధీనం
యాదాద్రి భువనగిరి జిల్లా
తేది.26.6.2020
కవితా శీర్షిక.పోరుబిడ్డ
యాదాద్రి భువనగిరి జిల్లా లో
బొల్లేపల్లి గ్రామాన
జన్మించి న పోరుబిడ్డ అతడు
రావి నారాయణరెడ్డి అను నామంతో
దేశమంతా తెలిసిన యోధుడతడు
దొరలకుటుంబాప
జన్మించి నా
పేదల మధ్యలో  జీవించిన దయామయుడు
భూమిలేని నిరుపేదలకు భూదానం చేసిన
ధన్యజీవి అతడు
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా
పోరాటం చేసిన ఎర్ర సైన్యమతడు
రజాకార్ల పాలిట
సింహ స్వప్నమైన
యోధుడతడు
ఆర్యసమాజ్ స్థాపనకుకృషిచేసిన నేత అతడు ప్రజాసేవలో అభివృద్ధి పనులెన్నో జేసి
 అందరిమన్నలకు
పాత్రుడైన పద్మభూషణుడతడు
1952సంవత్సరంలో జరిగిన సారస్వత ఎన్నికల్లో నల్లగొండ
పార్లమెంటు యం.పి.గా కమ్యూనిస్టు పార్టీతరపున అత్యధిక మెజారిటీతో గెలిచిన ప్రజా నేత అతడు
తెలంగాణ మట్టిలో
సకలజనుల
స్వాతంత్ర్యం కైపోరాడిన ఎర్రసైన్యమాతడు
అందుకే  అందుకోండి మా జోహార్లు

ఇది నా స్వీయ రచన
డి.దైవాధీనం
27

వీరాస్ క వి సమయం
తేది05.6.2020
కవిసంఖ్య.4
కవితా సంఖ్య.27
కవితా శీర్షిక.
కవి.డి.దైవాధీనం
--------
పకృతి పచ్చదనం
జీవకోటికి పరవశం
చెట్టు,చేమ,పుట్ట,గుట్ట,వాగు,వంక,
సెలయేరు
కోయిల పాటలు,
నెమలిఆటలు
పచ్చని పంటలు
పూచే పూవులు
వీచే గాలులు
ఆకాశాన వెలసిన
ఇంద్రధనుస్సు
ఉదయించే సూర్యుని ఉషస్సు
వెలిగే చందమామ
తళతళ తారలు
ఉరిమే ఉరుములు
మెరిసేమెరుములు
పరిడవిల్లే పకృతి శోభకు ఆనవాళ్ళు
జీవ వైవిధ్య సమతుల్యమే
పర్యావరణ పరిరక్షణ కు సంకేతం
వాతావరణ కాలుష్యం నియంత్రిం చాలి
పకృతి పచ్చదనం
కాపాడాలి
పారిశ్రామిక వ్యర్థాల ను నిర్మూలించాలి
ప్రజల ఆరోగ్యం కాపాడాలి
అడవులను రక్షించాలి,విని సంపద పెంచాలి
వృక్ష మే  పచ్చని ప్రగతికి చిహ్నం
ప్లాస్టిక్ సంచులు నిశేదించాలి
భూమి ఓజోన్  పొర  రక్షించాలి
వాతావరణ సమతుల్యత కాపాడాలి
పర్యావరణ పరిరక్షణ కు బాగా స్వాములవ్వాలి
లోకా సమస్తా సుఖినోభవంతు
-----

ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం కాదు అని హామి
డి.దైవాధీనం
29
వీరాస్ కవి సమయం
-----------
తేది9-6-2020
------
కవి సంఖ్య.4
కవితా సంఖ్య.29
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక. కాచుకో కరోనా
కాచుకో కరోనా
నీ ఆటలు కట్టి పెట్టు
విశ్వమంతా అంటుకొని
విలయతాండవం
చేశావు
ఎటు వెళ్ళినా అటు దాడి చేస్తున్నావు
మారణహోమం సృష్టించి మహమ్మారి గా మారావు
మానవత్వం మరచిమనుష్యులకు నరకం చూపిస్తున్నావు
ముందు లేదని భావం మందిలో ప్రబలింపజేసావు
బ్రతికుంటే బలుసాకుతినైనా
బ్రతకొచ్చునన్న
నినాదానికి కారణమయ్యావు
నీ దాడి వల్ల మేమెంతో నేర్చుకున్నాం
పరిశుభ్రత పరమావధిగా
స్వీయ రక్షణ నే చేపట్టాము
మాస్కులుధరియించి ముందు జాగ్రత్తలే తీసుకుంటున్నాం
వ్యాధి నిరౌధకత కలిగించే ఆహారమే
సేవిస్తున్నాం
జలుబు, దగ్గు, దమ్ముతోకూడినజ్వరం వస్తే అప్రమత్తమవుతున్నాం
వైద్య సలహాలతో
రోగ నివారణ చర్యలే తీసుకుంటున్నాం
వ్యాక్సిన్ వచ్చేవరకు యోగావ్యాయామాలే చేస్తున్నాం
ఎంత దూరమైనా నిన్ను పారద్రోల పూనుకున్నం
చైనా నుంచి వచ్చిన నిన్ను చైనాకే పంపిస్తాం
 ----
ఇది నా స్వీయ రచన అని హామి
ఇస్తున్నా
డి.దైవాధీనం


స్వీయ రక్షణొక్కటే
మూలమంత్రమన్న
30
వీరాస్ కవి సమయం
తేది 13.6.2020
కవిసఝఖ్య.4
కవితా సంఖ్య.29
కవి డి.దైవాధీనం
కవితా శీర్షిక.కరోనా
గోబ్యాక్
కరోనా వైరస్
ఒక అంటు వ్యాధి
అని అందరికీ తెలుసు
మందులేని మహమ్మారనీ తెలుసు
ఒకవైపు వ్యాప్తి నిరోధక చర్యలు
మరొక వైపు పెరిగే
కేసులసంఖ్య
సామాజిక వ్యాప్తి
పెరిగిందా
లేక సామాజిక దూరం పాటించకపోవడమా
స్వీయ రక్షణ కొరవడితే
జరిగేపరిణామమే
ఇది
సమూహాలలో తిరగక పోవడమేమేలు
అత్యవసర మైతే
బయట తిరగక పోవడమే క్షేమం
ముఖాలకు మాస్కులు
చేతులను సానిటైసర్ లేక
సుబ్బు నీటితో శుభ్రం చేసుకొనుట
ఇవే మనముందున్న కరోనా ను ఎదిరించే ఆయుధాలు
రోగ నిరోధకతను
పెంచే ఆహారపదార్థాలు
తీసుకొని ఆరోగ్యంగా వుంటే
ఏకరోనా వంటి వ్యాధులైనా మన దాపులచేరవు
బయట జాగ్రత్త సుమా
ఎవరివద్ద కరోనావుందోఎవరికెరుక
ఆచి తూచి అడుగులేయి
కనిపించని
శత్రువది
కాటు వేయ చూస్తది
చికిత్స కన్నా
నివారణ ముఖ్యమంటూ
ఆయుధాలతో ముందు కదలు
ఆరోగ్యమే మహాభాగ్యమంటూ
----------
ఇది నా స్వీయ రచన. దేనికి అనువాదం కాదు అని హామి ఇస్తున్నాను.
31
వీరాస్ కవియం
తేది.14.6.2020
కవి సంఖ్య.4
కవితాసంఖ్య.30
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక.రక్తదానం
-మహాదానం
మానవుని జీవక్రియకు
ఇంధనం
శరీరములోని ఎముకుల గుజ్జునండి రక్తం సెల్స్ ఉత్పత్తి జరుగు
దమనులు,సిరలు
ముఖ్య భూమిక తో
హృదయకవాటాలలో పంపింగ్ జరిగి
కిడ్నీ లయందుశుద్ధి
పక్రియపూర్తవగా
చివరకు ఆక్సిజన్ శుద్ధి గాదలచి ఊపిరితిత్తుల జేరి
ఉపశమనము పొందు
ఉచ్వాస.,నిశ్వాసలతో గుండె లబ్ డబ్  అంటూ జీవక్రియ సాఫీగా జరుగు చుండు
ఇదే ప్రక్రియ నిరంతరం ఒక క్రమంలో జరుగంగ
ఆరోగ్యముగా తానుండు
 ఆరోగ్యవంతుడి
శరీరములో జూడ
మూడు లీటర్ల నుండి ఐదులీటర్లుండవచ్చు
 జీవ ప్రక్రియనిరాటంకంగా కొనసాగింపుకు
రెండున్నర లీటరు
రక్తమున్న చాలు
రక్తప్రసరణ సరిగా
సరిగా జరుగునట్లు
జూడ వలె నెల్లరు
రక్త చాపముద్వార
మన ఆరోగ్యపరిస్థితి
అంచనా వేయవచ్చు
రక్త గ్రూపు లను
నాల్గు గ్రూపు లుగా
ఎంచి   ఏ,బి,ఏబి,ఓ. లని
నామమిడిరి
ఏ,డి,ఓ. లకు  పాజిటివ్, నెగెటివ్
అంటూ సబ్ గ్రూపు లుండె
ఓ గ్రూపుకు విశ్వ దాత
ఏ,బి  గ్రూపు లకు
విశ్వగ్రహీత లుగా
గుర్తించిరందరు
 రక్తదానం చేసిన
బలహీనపడరు
రెండు మూడు రోజుల్లోనే రక్తవృద్ధి
జరుగు నెప్పటి తీరు
సమతులాహారం తో పాటు పాలు,పండ్లును
మేలు చేయునెపుడు
రక్త దానంచేసి
ఎదుటి వారి ప్రాణము నిల్పుటకన్న మిన్న లేదు
 ఎన్ని సార్లు రక్త దానం చేసిన గాని
నష్టమేమాత్రముండబోదు
రక్తదానం మహాదానమని తలచి మనుషులలో దేవుడిగా మసలుకొండి

----
ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం కాదు.
(ప్రపంచ రక్తదానం దినోత్సవం సందర్భంగా )
32

వీరాస్ కవిసమయం
తేది.18.6.2020
కవిసంఖ్య.4
కవితా సంఖ్య.31
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక.పక్కలో బల్లెం
పొరుగుదేశాలతో సౌమ్యంగావుండాలన్నసందేశమిస్తాం
కాని ఆపొరుగుదేశాలే కుట్రతో ఫక్కీలో బల్లాలైనపుడు
వారికెలా బుద్ధి చెప్పాలో భారత్
కు తెలుసు
చైనావంకరబుద్ధి
కి నిదర్శనం గల్వాన్ లోయలో ఘాతుకం
ముప్పదేడుమంది
సైనికులను పొట్టనబెట్టుకున్న పాపం
హద్దులు దాటితే అంతు చూస్తాం
ఎందాకైనా తెగబడతాం
అంగుళం భూమైనా వదలుకోం
దేశ సార్వభౌమత్వాన్ని
కాపాడతాం
సడలనివ్వం
సైనిక పరాక్రమం
మానవవిలువలుకాపాడతాం
మంచితనానికి పాటుపడతాం
స్నేహానికి దారులు వేస్తాం
ద్రోహాలను ఖండిస్తాం
మంచితనం మానినాదం
ప్రపంచ దేశాలకు
వెలు గు లవుతాం
-----
ఇది నా స్వీయ రచన. దేనికి అనువాదం కాదు అని హామి.
డి.దైవాధీనం

33

వీరాస్ కవియం
తేది.18.6.2020
కవి సంఖ్య.4
కవితాసంఖ్య.32
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక.
కదనం రంగంలో
కదంతొక్కిన
వీర కిషోరం
నడిరాతిరిలో పహారా కాస్తున్న
గస్తీదలంపై చైనా ముష్కరుల పంజా
చర్చలంటూ నే దొంగ దాడి దుర్మార్గం వైపు
నీ అడుగులు
ఆదిలోనే అంతం
చేస్తాం
వీరునిమరణం
వృదాకాదు
దేశం మొత్తం సైనికులమవుతాం
మాతృభూమి సేవలో అసువులు బాసిన
కల్నల్ సంతోష్
బాబు ఋణంతీసుకుంటాం
భరతమాత ఖ్యాతినిలబెడతాం
చైనా దొంగదెబ్బ కు
బలైన అమరసైనికుల
ఆశయాలు నెరవేరుస్తాం
త్యాగాలు బాటలో
అందరమొక్కటై కదలుతాం
సూర్యాపేట సూర్యుడిలానీ కీర్తి
అజరామరం
జాతిమరవదు నీత్యాగం
ఈ దేశం తరతరాలు నీసేవలు కొనియాడును
జాతికి నీవే కలకాలం జ్యోతివై వెలిగుతావు
నీకిదే అశేష భారత జనులశ్రద్ధాంజలి

--------
అమరులైన సైనికులకిదే
ఇది నా శ్రద్ధాంజలి.




డ్రాగన్  విషపు కోరలు పీకేస్తాం
భారతభూభాగంపై
కన్నేస్తే సరియైన బుద్ధి చెప్తాం



34

[26/06, 12:54 PM] Daivadheenam Ks4: వీరాస్ కవిసమయం
తేది.26.6.2020
కవి సంఖ్య.4
కవితా సంఖ్య 33
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక.వసుదైక కుటుంబం
స్వదేశీ సంస్కృతి
ఉన్నత కీర్తి ప్రదాయకం
శక్తిభారతం
యుక్తిభారతం మేలైన సంస్కృతీ
సంప్రదాయాలకుపెట్టిందిపేరు
శ్రమైక జీవన విధానం
స్యయం శక్తి సంపన్నం
సహజీవన సౌందర్యం
సహాయసహకార
దృక్పథం
సుశక్తిసంపన్నం
వృత్తి నైపుణ్యకౌశలం
విశ్వాసానికి మారుపేరు
నమ్మిన బంటు
మన్నికైన ఉత్పత్తులతయారికి చిరునామా
సంప్రదాయ బద్ధ జీవనం
స్వయం సమృద్ధి కి
నిదర్శనం
అణువణువూ
నింపుకున్న
స్నేహసౌభాతృత్వం
దానగుణం సంపన్నం
దృడసంకల్పదీక్షా దక్షతం
లక్ష్య సిద్ధి కారకం
ప్రకృతి ఆరాధకం
సహనశీలగుణసంపన్నం
అవినీతి కివిరోధం
ఆశావహ దృక్పధం
దేశభక్తి భావనం
జాతీయ సమైక్యతా నినాదం
సర్వమత సామరస్యజీవనం
అన్నింటినీ మించి
సంస్కృతి సంప్రదాయాల
సమ్మేళనం
హిమాలయ శిఖరమంత ఉన్నతం
భారతదేశ ఔన్నత్యం
-----
ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం కాదు అని హామి.
35
[26/06, 2:10 PM] Daivadheenam Ks4: వీరాస్ కవి సమయం
తేది.26.6.2020
 కవి సంఖ్య4
కవితా సంఖ్య.34
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక.కల్పతరువు
వృక్షం బు నాటిన
వృధాకాదెన్నటికి
గాలినిచ్చిమంచి నీడనిచ్చు
ప్రాణవాయువు కాదా పరమ ఔషదంబు
పచ్చని చెట్లను
నాటు ప్రతిచోట
పచ్చలహారము
తోడ ప్రగతి చేయ
ఒక్కరొక్కరునొక్క
మొక్కను నాటీన
హరితహారమగును జగతి ఆవనిలోన
పకృతి పలురీతి ఫరిడవిల్లవలెనన్న
వృక్షంబులే గాదా వనసంపదగును
వర్షా లు తగు రీతి
వర్షించవలెనన్న
వృక్షంబులే మూలకారణంబగును
పర్యావరణ పరిరక్షణ పాటించవలెను న్న
వృక్షం బులేకదా సాటియగును
వృక్షంబులు పెంచి
తమ ఉనికిని చాటండి
మానవాళి మనుగడకు మంచి చేయు
-----
ఇది నా స్వీయ రచన. దేనికి అనువాదం కాదు అని హామి.
36
[27/06, 9:55 AM] Daivadheenam Ks4: 
వీరాస్ కవి సమయం
తేది.26.6.2020
కవి సంఖ్య4
కవితా సంఖ్య 35
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక.ఆచీకటి రోజులు
ఆచీకటి రోజులు
మరపురాని మాయనిగాయాలు
మానవ హక్కుల కు భంగం కలిగించే
కుటిల యత్నాలు
తమ ఉనికిని చాటుకొనుటకు
ఇందిరచేసిన తెరచాటు ప్రయత్నం
ప్రజా స్వామ్యాన్ని
వెక్కిరించే కాంగ్రెస్ కుట్ర
ఫలితంగా ప్రజా నేతల నిర్బంధం
ఖేల్ కిస్సా కుర్సీకా థా
లోకా నాయక్ జయప్రకాష్ నారాయణ్ తో
సహా మహానేతలు
స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి,
సర్వ  శ్రీ  లాల్కిషన్ఆడవాణి,
హెచ్.ఎన్.బహుగుణ,రాజ్ నారాయణ్, చంద్రశేఖర్,మురార్జీ దేశాయ్ లాంటి
నేతలెందరో అరెస్టులు
జనాందో ళనలమధ్య  జన
జీవనం అతలాకుతలం
అత్యవసర పరిస్థితి ఇందిరా సర్కారు కు
మొదటికే ముప్పు
ప్రజా తీర్పు తో
కుర్సీకి దూరమైనతీరు
మరువరు ప్రజలు ఆచీకటిరోజులు
మరలా రావద్దు
అణిచి వేసే రోజులు
మరువలేని మానవ హననాలు
అవి ఎమర్జెన్సీ  పేరిట ప్రజల గుండెల్లో మానని
గాయాలు
-----
ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం కాదు అని హామి.
(25.6.1975లోశ్రీమతి ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా)
37
[27/06, 9:56 AM] Daivadheenam Ks4: వీరాస్ కవి సమయం
తేది.26.6.2020
కవిసంఖ్య.4
కవితా సంఖ్య.36
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక. చైనాకపట నాటకం
చైనా నైజం మారలేదు
చర్చలకు అంగీకారమంటూనే
తన బలగాలనుపెంచి
సరిహద్దువెంటమోహరించడం
భారతభూభాగంలోని గల్వాన్ భూభాగం తమదంటూ
ప్రేలాపనం
కరోనాతోప్రపంచ
దేశాల్లో మారణ హోమం సృష్టించి
అది కప్పి పుచ్చుకోవడానికీ
సరిహద్దు ఉగ్రవాదం
నీతిమాలిన మాటలతో ప్రపంచ దేశాలను గందరగోళంలో పడేయడం
స్నేహహస్తమందిస్తూనే
పక్కలోబల్లెమవడం
సరిహద్దు లు రక్షించుకునే సత్తా
మాకుంది
అంగుళం భూభాగమైనా
అన్యాక్రాంతం కానివ్వం
ఇది1962 నాటి
భారత్ కాదు
2020 సర్వే సత్తాక
గణతంత్ర  రాజ్యాంగం మాది
సమస్యలను ధీటుగా‌ ఎదుర్కొనే
దేశంమాది
రణభూమిలో
శత్రుదుర్భేధ్యమైన
సైనిక పటాలంమాది
సరిహద్దు లో నిరంతరం పహారా
కాసే సైన్యం మాది
శత్రుదాడిని నేర్పుతో తిప్పి కొట్టగల  శక్తియుక్తుల యంత్రాంగం మాది
నక్క జిత్తులు పన్నాగం
సమయస్ఫూర్తి తో
చిత్తు చేస్తాం
భారత్ పై  చేసే కుయుక్తులను తిప్పి కొడతాం
లోకా సమస్యా సుఖినోభవంతు అనే నినాదం మాది

-------
ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం కాదు అని హామి.
డి డి డి

38
[15/07, 11:38 AM] Daivadheenam Ks4: వీరాస్ కవి సమయం
తేది.15. 7.2020
కవి సంఖ్య4
కవితా సంఖ్య 37
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక.దాశరథీకవితా కమనీయం
దాశరథి కవితాఝరి
తెలంగాణ గని
నిజాం వ్యతిరేక
ఉద్యమ కెరటం
 విలువైన కవిత్వరచనా పరంపరలసారథి
తెలంగాణ భావజాలానికి
ఊతమిచ్చిన ఉత్తమ కవీంద్రుడు
చదువరులను ఉర్రూతలూగించే
కవితా శైలి
సమాజంలో ఒక
ప్రత్యేక స్థానాన్ని
సంపాదించిన ఉద్యమకవితా
పయోనిధి
అందుకోండి  మా
జోహార్లు
ఆకాశాన సూర్య చంద్రుడి లా వెలుగొందు   మీ కవిత్వం తెలుగు
ప్రజల హృదయాల్లో కలకాలం

ఇది నా స్వీయ రచన.దేనికీ అనువాదం కాదు అని హామి.
39
[15/07, 1:06 PM] Daivadheenam 
Ks4: వీరాస్ కవి సమయం
తేది.15.7.2020
కవి సంఖ్య4
కవితా సంఖ్య 38
కవి.డి.దైవాధీనం
కవితా శీర్షిక.
గోదావరి వారధి
కాటన్ దొర సారధి

ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం
చేసి గోదావరి నదీ
పరివాహక ప్రాంతాలకు
సాగునీరు,త్రాగు నీరు అందించ
దూరదృష్టి గలిగి
తెలుగు ప్రజల వ్యతలుతీర్చె
సార్ ఆర్థర్ కాటన్
కాటన్ దొర పేరుతో
ప్రజల గుండె ల్లో నిలిచె తాను
అద్భుత నిర్మాణ శైలి
ఆకట్టుకున్న ఇంజనీరింగ్ డిజైన్ వానలొచ్చినా ,వరదలొచ్చినా చెక్కు చెదరని నిర్మాణం
చుట్టూ పటిష్టమైన
గోడలతో ప్రవహించె గోదారి
కోనసీమపొలాలను  సశ్యశ్యామలం చేయ
కరువుతీరా ప్రజలు
హరిత కర్షకులై వెలుగొంద
తూర్పు గోదావరి
పశ్చిమ గోదావరి ప్రజల  ఇండ్లలో
పాడి పంటలే నిండగా
లోటు లేని జీవితాల చిరస్మరణీయుడవైతివా
 కాటన్ దొర పేరుతో అశేషాంధ్రుల జీవితాల్లో వెలుగులు నింపితివా
నీకివే మా జోహార్లు

ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం కాదు అని హామి.
40
వీరాస్ కవి సమయం
తేది.26.7.2020
కవిసంఖ్య.4
కవి.డి.దైవాధీనం
కవితా సంఖ్య 39
కవితా శీర్షిక.
విజయమే ఊపిరి
----------------  కార్గిల్ విజయదినం
కార్గిల్ లో దొంగ చాటు చొరబాటు
పాకిస్థాన్ కుట్రను
ధీటుగా ఎదుర్కొన్న మనసైనికులు
ఎత్తైన మంచుకొండల్లో
లాండ్ మైన్లు నాటి
పెద్ద ఎత్తున కాసువాలిటీకి గురి
చేయబూనిన పాక్ సేనలు
చాక్ చక్యంగా ఎదుర్కొన్న భారత
సైన్యం
శత్రు మూకలను
కొండలపై నే మట్టు
బెట్టిన మన సైన్యం
చివరకు శత్రుసేనల చెండాడి ఎత్తైన టైగర్ హిల్స్ ను వశ పరచుకొనడంతో
భారత సైన్యం విజయపతాకం
ఎగరవేసింది
ఈరోజు 21 వ కార్గిల్ విజయదివస్ ను
దేశమంతా జరుపుకుంటున్నారు
  ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం కాదు అని హామి ఇస్తున్నాను.


Comments

Popular posts from this blog

తిరు వేంకటాచార్యులు KS 6

బాటసారి KS 12

అనామికా శతకం విట్టుబాబు గారు