కడారి పెద్దయ్య KS
1
తేది : 14/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 01
కవి పేరు : కడారి పెద్దయ్య
జిల్లా : నల్గొండ
శీర్షిక : *తెలంగాణ సంస్కృతి ఔన్నత్యం*
తెలుగు వారి తొలి పండుగ ఉగాది
తెలంగాణ స్త్రీల పండుగ బతుకమ్మ
తెలుగు భాషకు పట్టుగొమ్మ తెలంగాణ ప్రాతం
పౌరాణికంగా,చారిత్రకంగా నెలవైన ప్రాతం
పోరాటాల పురిటీగడ్డ నల్గొండ
తొలి మళిదశ ఉద్యమం లో మొదట ప్రాణాలర్పించిన జిల్లా నల్గొండ
ఆధ్యాత్మిక సార్వభౌమత్వానికి చిహ్నం
నల్గొండ జిల్లాలోని ఫణిగిరి
తెలంగాణ లోని బౌద్ధ స్థూపాలన్నీ
సాంచి స్థూపానికి నమూనాలే
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చార్మినార్ కుతుబ్ షాహీల కాలంనాటి అద్భుత కట్టడం
కుతుబ్ షాహీల సార్వభౌమత్వానికే కేంద్రం గోల్కొండ కోట
తెలంగాణ రాజవంశ మొదటి పరిపాలకురాలు రుద్రమదేవి
హైద్రాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా
భారతదేశానికి వన్నె తెచ్చిన పుణ్యభూమి తెలంగాణ రాష్ట్రం
సంస్కృతి, సంప్రదాయాలకూ, ఆచార వ్యవహారాలకూ నెలవైన భూమి
కాకతీయ అద్భుతమైన శిల్పాకళ నైపుణ్యాలకు
మచ్చుతునకలు రామప్ప , వేయిస్తంభాల గుడి
అక్షర అభ్యాసానికి అనువైన ఆలయం
జ్ఞాన సరస్వతీ బాసర
త్రిలింగళల్లో ఒకటి కాళేశ్వరం
మానవ నిర్మాత చెరువు హుసేన్ సాగర్
దేశంలో అతిపెద్ద రాతి నిర్మితం నాగార్జున సాగర్
తెలంగాణ లోనే ఎతైన జలపాతం కుంటాల జలపాతం
ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలింసిటీ రామోజీ ఫిలింసిటీ
భారతదేశ సాంస్కృతిక కళ వారసత్వానికి హస్తకళా గ్రామంగా పేరుగాంచినది శిల్పారామం
ఆసియాలోనే అతిపెద్ద జాతర సమ్మక్క - సారక్క
తెలంగాణ లోనే రెండో అతిపెద్ద జాతర గొల్లగట్టు
తెలంగాణ ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన కళారూపం ఒగ్గుకథ
తెలంగాణ లో అత్యంత జన ప్రియమైన వినోదాత్మకమైన జానపద కళారూపం కోలాటం
చిద్రికళ తెలంగాణ ఉనికిని చాటే అద్భుత కళ
తెలంగాణ లో విల్లాసిల్లుతున్న కళ నకాశి
2
తేది : 15/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 02
కవి పేరు : కడారి పెద్దయ్య
జిల్లా : నల్గొండ
శీర్షిక *తెలంగాణ వీరనారి*
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు
రైతాంగం రణం బిడ్డా...
తెలుగు గడ్డ ఎంతోమంది వీరులకు వీరవనితలకు పుట్టినిల్లు
అట్లాటి వీరవనితల్లో చాకలి ఐలమ్మ ఒకరు
ఆడది అబల వంటింటి కుందేలన్ని సమాజం చిన్న చూపు చూసే
ఆ రోజుల్లో తుపాకీ చేతపట్టి భూస్వాముల నడ్డి విడిచి ఆడదంటే అబలా కాదు ఆదిశక్తి అని నిరూపించిన నిప్పు కణిక
భూమి కోసం,భుక్తి కోసం పోరాడిన ధీశాలి..
దొరలు,దేశ్ ముఖ్ల దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన ధీరవనిత
బాంచన్ దొరా.....సంస్కృతి పై ఐలమ్మ సమర శంఖం
విసునూర్ దేశ్ ముఖ్ ఆగడాలను ప్రశ్నించిన గొంతుక
ఆంధ్ర మహాసభ స్పూర్తితో నిజాం దాష్టికాల పై పోరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన వీరనారి
చిన్నతనం నుండి అభ్యుదయ భావాలు కలిగి ఉండేది ఐలమ్మ
కులాలు,మతాలు ఇవన్నీ కొంతమంది గుంటనక్కలై తమ స్వార్ధo కోసం పుట్టించిన జిమ్మికులన్నీ బలంగా వాదించేది ఐలమ్మ
3
తేది : 16/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 03
కవి పేరు : కడారి పెద్దయ్య
జిల్లా : నల్గొండ
కవితా శీర్షిక *లాల్ దర్వాజా బోనాలు*
తెలంగాణ రాష్ట్రం లో ప్రసిద్ద బోనాలు
లాల్ దర్వాజా బోనాలు
జూలై/ఆగస్టులో వచ్చు ఆషాఢమాసంలో జరుపుకొనే పండుగ
ప్రతి సంవత్సరం తీస్తారు - లాల్ దర్వాజా బోనాలు
ప్రజలందరూ బాగుండాలని తీస్తారు - లాల్ దర్వాజా బోనాలు
కలరా, మసూచి వ్యాధులు రాకుండా తీసే బోనాలు - లాల్ దర్వాజా బోనాలు
పిల్లలందరూ ఆయువు ఆరోగ్యాలతో ఉండాలని వేడుకుంటూ ప్రతి ఒక్కరూ తీసే బోనాలు - లాల్ దర్వాజా బోనాలు
బోనాల పండుగ వచ్చిందంటే సింహవాహిని అమ్మవారి గుడి ఆహ్లాదకరంగా ఉండు
బోనాల పండుగ అమ్మవారికి నైవేద్యం సమర్పించు పండుగ
పండుగరోజు స్త్రీలు పట్టుచీరలు ,నగలు ధరిస్తారు
సింహవాహిని అమ్మవారికి తమ మొక్కులు చెల్లిస్తారు
లాల్ దర్వాజా బోనాల సమయంలో శివసత్తులు భవిష్యవాణి చెప్పడం ప్రత్యేకత
సింహవాహిని అమ్మవారి గుడి కొత్త కొత్త రంగులతో,మామిడి తోరణాలతో విద్యుత్ దీపాలతో రంగరంగా వైభవంగా విరాజిల్లుతుడటం మరో ప్రత్యేకత
డప్పు దరువులతో,శివసత్తులతో
పోతురాజుల విన్యాసాలతో తీసే బోనాలు
మన లాల్ దర్వాజా బోనాలు
4
తేది : 17/05/2020
కవి క్రమ సంఖ్య :35
కవిత సంఖ్య :04
కవి పేరు : కడారి పెద్దయ్య
జిల్లా : నల్గొండ
కవితా శీర్షిక *వందేళ్ళ ఉస్మానియా*
హైద్రాబాద్ రాజ్యంలో ఏర్పాటైన తొలి విశ్వవిద్యాలయం
ఉస్మానియా నూరేండ్ల పండుగ చేసుకున్న విశ్వవిద్యాలయం
దేశంలోనే అతిపురాతనమైన విశ్వవిద్యాలయం
ఎంత జ్ఞానం పంచిన తరగని విజ్ఞాన గని
వందేళ్ళ ఉస్మానియా భవిష్యత్ తరాలకు కొత్త కళను తీసుకొచ్చిన వందేళ్ళ సంబరం
తెలంగాణ ఉద్యమంలో ముందున్న విశ్వవిద్యాలయం
స్వరాష్టసాధన పోరుకు వేదికైనా విశ్వవిద్యాలయం
చదువులోనూ ,ఉద్యమ పొరులోనూ ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించిన విశ్వవిద్యాలయం
వందేళ్ళ నాడు వికసించిన విద్యాపరిమళం ఉస్మానియా విశ్వవిద్యాలయం
తరాలు మారుతున్న నిత్యనూతనంగా వెలుగుతున్న ఆర్ట్స్ కళాశాల భవనం
విజ్ఞాన సుగంధాలను ప్రపంచ వ్యాప్తంగా పంచుతున్న విశ్వవిద్యాలయం
ప్రతి ఉద్యమానికి నువ్వే మొదటి అడుగు
చదువుతోపాటు సమకాలీన సమస్యల పై స్పదిస్తుంది
ఎందరో విద్యావేత్తలను ,మేధావులను తీర్చిదిద్దిన విశ్వవిద్యాలయం
5
[18/05, 7:08 PM] Kadari Peddaiah KS 35:
తేది 18/05/2020
కవి క్రమ సంఖ్య :35
కవిత సంఖ్య :05
కవి పేరు : *కడారి పెద్దయ్య*
జిల్లా : నల్గొండ
కవితా శీర్షిక *శ్రీరాముడు*
శ్రీరాముడు వివేకవంతుడు
భూత,వర్తమాన,భవిష్యత్ లలోని సర్వాన్ని ఏరిగినవాడు
శ్రీరాముడు బలము,యశస్సు,సంపద,జ్ఞానము,సౌందర్యము,వైరాగ్యము అనే ఆరు దివ్యవైభవములు కలిగినవాడు
శ్రీరాముడు వేదాలను క్షుణ్ణంగా ఎరిగినవాడు
శ్రీరాముడు అత్యంత విశుద్ధమైన సౌశీల్యం కలవాడు
శ్రీరాముడు అద్భుతమైన కంఠస్వరము,వక్తృత్వ శక్తి కలవాడు
శ్రీరాముడు సత్యమైన ధర్మాన్ని కలవాడు
శ్రీరాముడు ఆత్మసాక్షాత్కారములో సంపూర్ణుడు
శ్రీరాముడు వర్ణశ్రమ ధర్మాన్ని సముద్దరిస్తున్నవాడు
శ్రీరాముడు సకల శత్రువులను సంహరించేవాడు
శ్రీరాముడు సకలవిధ ఆయుధాలను ప్రయోగించడంలో దిట్టమైనవాడు
పట్టిన పట్టు విడవనివాడు
శ్రీరాముడు మిత్రులను,శత్రువులను కూడా సమదృష్టిలో చూచే నిష్పక్షపాతి
శ్రీరాముడు ధైర్యంలో హిమాలయం వంటివాడు
శక్తిలో విష్ణువు వంటివాడు
శ్రీరాముడు అందంలో చంద్రుని వంటివాడు
శ్రీరాముడు ఓర్పులో భూదేవిని పోలినవాడు
శ్రీరాముడు సంపదలలో కుబేరుని వంటివాడు
6
సమూహం : వీరాస్ కవి సమయం
తేది 19/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 06
కవి పేరు : *కడారి పెద్దయ్య*
జిల్లా :నల్గొండ
కవితా శీర్షిక *మన్యం వీరుడు*
భారత స్వాతంత్ర్యదమ చరిత్రలో అల్లూరి సీతారామరాజు మహోజ్వల శక్తి
బ్రిటిష్ పాలకులను ఎదిరించిన మన్యం ప్రాంత వీరుడు
విప్లవజ్యోతి అనగానే గుర్తుకు వచ్చే వ్యకి
మడమ తిప్పని పోరాట యోధుడు
తెలుగు జాతి పౌరుశాన్ని రగిలించిన యువకిశోరం
స్వతంత్ర వీరుడు
స్వరాజ్య బాలుడు
తెల్లవాళ్లకు వెన్నుపోటు ధోరణిలో కాకుండా ప్రత్యేకంగా ఎదురెళ్లి ధైర్యంగా పోరాడిన ధైర్యశీలి
సాయుధ పోరాటాల ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దానికోసమే తన ప్రాణాలను అర్పించిన యోధుడు
అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధులైన ఈ మన్యం వీరుని అసలు పేరు శ్రీరామరాజు
పాండ్రంగిలో జన్మించిరి
మన్యం వాసుల కష్టాలను కడతేర్చడానికి,తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచిరి
ఒక సీతారామరాజు మరణిస్తే లక్షలాది సీతారామరాజులు ఉద్బవిస్తారని గొంతెత్తి పోరాడారు
27 ఏళ్ల వయస్సులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యారు
7
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 07
కవి పేరు : *కడారి పెద్దయ్య*
జిల్లా : నల్గొండ
కవితా శీర్షిక *గిరిజనులు*
గిరిపుత్రులు ప్రకృతి ముద్దుబిడ్డలు
ఆధునిక జీవితానికి అలవాటు పడలేకపోయిన అమాయకులు
గిరిజనులు కనీస సౌకర్యాలు నోచుకోని అభాగ్యులు
రికార్డులకు చేరని గిరిజనుల మాతశిశు మరణాలు
ఏ గిరిజన తండాలను చూసిన దయనీయ దృశ్యాలే
గిరిజనులు గుక్కెడు నీళ్లకోసం కష్టాలు పడిరి
రోడ్లు లేక అవస్థలు పడిరి
గిరిజనుల జీవితాలు గుడ్డి దీపాల కిందనే తెల్లరుతున్నవి
గిరిజనులు విషసర్పాల కాటుకు బలవుతుండిరి
దుర్భర పరిస్థితుల్లో గిరిజనుల బ్రతుకులు
చిన్న వయస్సులో పెళ్ళిళ్లతో తల్లి -బిడ్డ ప్రాణాలకు ముప్పు
గిరిజన తెగలల్లో అంతరించిపోతున్న అరుదైన తెగ చెంచు
చెంచులకు అటవీ ఫల సేకరణే జీవనాధారం
చెంచులకు అడవిలో దొరికే దుంపలు,గడ్డలు,ఆకులే ఆహారం
చెంచులు రక్షిత మంచినీరు దొరక్క చెరువులు, చెలమల నీటి పై ఆధారపడి అంటువ్యాధుల బారినపడి చనిపోతుండిరి
చెంచు పెంటలు చలికాలం వస్తే ఇంకా గజగజ లాడల్సిoదే
చెంచులు పోషకాహారం లోపంతో ఏ చిన్న వ్యాధి ప్రబలిన ప్రాణాలు పొయ్యే స్థితి
గిరిజనులు ఆధునిక కాలంలో ఆమడ దూరంలో బ్రతుకుతుండిరి
గిరిజనులవి పక్కఇల్లు విద్యుత్ వెలుగులు నోచుకోని బ్రతుకులు
8
[21/05, 6:29 PM] Kadari Peddaiah KS 35: సమూహం : *వీరాస్ కవి సమయం*
తేది 21/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 08
కవి పేరు : *కడారి పెద్దయ్య*
జిల్లా : నల్గొండ
కవితా శీర్షిక : *విజ్ఞాన కేంద్రం*
అది ఒక ప్రశాంతమైన విజ్ఞాన ఉద్యానవనం
నిత్య శోభితంగా వికసించే హావభావాల కవనం
కవి కవయిత్రులు అంతా సీతాకోక లాగా విహరించే విజ్ఞానాల వనం
భవిష్యత్తుకు సువర్ణబాటలు వేసే అందాల భవనం
సత్సాoతగత్యపు హద్దులను తాకించే విహంగాల వనం
అదే అదే ఎందరో నాలాంటి వారి మదిని దోచే గ్రంథాలయ భవనం
నాలో మనలో మేథోమధ నాన్ని కవ్వించే రచనల వనం
అదే మన పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం...
9
[23/05, 6:52 PM] Kadari Peddaiah KS 35: సమూహం *వీరాస్ కవి సమయం*
తేది 22/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 09
కవి పేరు : *కడారి పెద్దయ్య*
జిల్లా : నల్గొండ
కవితా శీర్షిక *రైతు*
రణరంగంలో సైనికుడిలా రాళ్ల భూమిలో రత్నాలు పండించగల మా రారాజు మా రైతన్న
ఋతు పవనాలను నమ్ముకోని నాగలి పట్టి నడుమ బిగించి నడిచెను మా రైతన్న
పాడి పశువులే తన ఆస్తిగా భావించి ప్రేమను పంచే మా రైతన్న
పొద్దున్నే నాగలిపట్టి ఒడిఒడిగా నవ్వుతూ భూ మాతను పలకరించే మా పల్లె రారాజు మా రైతన్న
ఎండకు ఎండి వానకు తడిసి ఎంత కష్టము వచ్చిన కన్నీరవుతున్న కలవరపడని మా రైతన్న
వేసిన పంట చేతికి వచ్చేదాకా వేచి చూసే మా రైతన్న
నాగలి పట్టి దుక్కిదున్ని, విత్తనాలు నాటి కలుపులు తీసి
నీరుపెట్టి ఏరువేసి మొలకలు కాసే వరకు కపుకాసి వాటిని కాపాడే కాగాడి మా రైతన్న
వనరులు లేక చినుకు రాకా వాటి కొరకు వేచి వేచి చూసి విలవిలలాడే మా రైతన్న
మట్టిని నమ్మి ముద్ద కోసం
మల మలలాడుతున్న మా రైతన్న
చేతికి అందిన పంట ఆకాల వర్షరూపంలో చేజారిన చేసేది ఏమి లేక చెమ్మగిల్లుతున్న మా రైతన్న
10
[23/05, 6:52 PM] Kadari Peddaiah KS 35: సమూహం *వీరాస్ కవి సమయం*
తేది 23/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 10
కవి పేరు : *కడారి పెద్దయ్య*
జిల్లా : నల్గొండ
కవితా శీర్షిక *మన భాష - మన శ్వాస*
అచ్చమైన స్వచ్ఛమైన మాధుర్య మమకారా అనురాగ అప్యాయతలు కలిగిన భాష మన తెలుగు
*తెలుగు ఒక వెలుగు*
తెలుగు భాష తియ్యనైన అమృతం లాంటిది
ఒడవని - తరగని చెరగనిది
మనసును పలికించి
హృదయాన్ని పులకించేదే మన తెలుగు భాష
అన్ని భాషల్లోకెల్ల అందమైన భాష - తెలుగు భాష
తెలుగు భాష - మన వెలుగు భాష
తెలుగు నేర్చుకో - వెలుగు తెచ్చుకో
తెలుగు భాష లేకపోతే తెలుగు ప్రజలకు అర్థమే లేదు
మన శ్వాస తెలుగు - మన శపదం తెలుగు
మన రిష తెలుగు - మన ఆయుధం తెలుగు
తెలుగు తెలుగు తెలుగు - అంతమంచే కలుగు
11
సమూహం *వీరాస్ కవి సమయం*
తేది 24/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 11
కవి పేరు : *కడారి పెద్దయ్య*
జిల్లా : నల్గొండ
కవితా శీర్షిక *బహుభాషా శాస్త్రవేత్త దోణప్ప*
అధ్యయనమే తపస్సుగా అధ్యపనమే ఆత్మనందంగా నిరంతర పరిశోధనమే ధ్యేయంగా
పరిశోధన పర్యవేక్షణమే కలిగిన బహుముఖ ప్రజ్ఞశీలుడు
ప్రతిభ వ్యుత్పత్తి అభ్యసాలు మేళవించిన సాహిత్య విద్యావినోద దీక్షితులు
వివేచన సాలోచన - నిర్వచనాలు ముద్దకట్టిన ఆదర్శమూర్తి
చిన్నతనంలో అనేక నాటకాల్లో నటించి ఎన్నో బహుమతులు పొందిరి
అనంతపురం దత్తమండల కళాశాలలో ఇంటర్ చదివిరి
వాల్తేరులో బహుముఖంగా గేయపద్య ఏకాoకికా రచనలు చేసిరి
1959లో ఆంధ్ర విశ్వకళ పరిషత్ తెలుగుశాఖలో అధ్యాపకులుగా చేరిరి
ఆంధ్ర సంస్థానాధిపతులు తెలుగు సాహిత్యానికి చేసిన సేవల్ని గూర్చి వీరు కావించిన కృషి అనన్య సామాన్యం
జానపద కళల పై వీరికి అమితమైన ఆసక్తి
అన్యదేశ్యాల మీద పరిశోధన విషయంలో దోణప్ప గారిదే అగ్రతాబులం
వైకృత పదస్వరూప నిరూపణ అనే విషయం పై దోణప్పగారు పరమ ప్రామాణికంగా కృషి చేసిరి
12.
సమూహం *వీరాస్ కవి సమయం*
తేది 25/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య :12
కవి పేరు : *కడారి పెద్దయ్య*
జిల్లా : నల్గొండ
కవితా శీర్షిక *సురవరం*
తెలంగాణ సాంస్కృతిక సారథి
తెలుగు భాషా వికాసానికి కృషి చేసి జనచైతన్య రగిల్చిరి
సురవరం ప్రతాపరెడ్డి
పాలమూరు జిల్లా ఇటిక్యాల పాడులో రంగమ్మ నారాయణ రెడ్డి దంపతులకు జన్మించిరి
తన తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో చిన్నాన్న రామకృష్ణ రెడ్డి వద్ద బోరవెల్లిలో పెరిగిరి
ABM మిషనరీ పాఠశాల లో ప్రాథమిక విద్య
హైద్రాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్
మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ
తిరువాన్ కూరులో బి.ఎల్ పూర్తి చేసిరి
గోల్కొండ పత్రికతో రాజకీయ చైతన్యానికి కృషి చేసిరి
హైద్రాబాద్ శాసనసభకు వనపర్తి నుండి ఎన్నికైరి
ప్రథమాoధ్ర మహాసభకు అధ్యక్షత వహించిరి
గోల్కొండతో పాటు ప్రజావాణి పత్రికను స్థాపించిరి
పత్రిక సంపాదకుడుగా
పరిశోధకుడుగా
పండితుడుగా
రచయితగా
క్రియాశీల ఉద్యమకారుడుగా
ప్రజ్ఞాశీలిగా సురవరం ప్రతాపరెడ్డి
13.
సమూహం *వీరాస్ కవి సంమయం*
తేది 26/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 13
కవి పేరు : *కడారి పెద్దయ్య*
జిల్లా పేరు : నల్గొండ
కవితా శీర్షిక *కరోనా*
కరోనా నీ వల్ల నేడు యావత్ ప్రపంచం అత్యంత ప్రమాదకరస్థితిలో ఉంది
కరోనా నీ వల్ల నిజావేతనాలు పడిపోయి ఉద్యోగులు, కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు
కరోనా నీ వల్ల గ్రామాలల్లో ప్రజలు పనులు లేక పరశనౌతున్నారు
కరోనా నీ ప్రభావం వల్ల ప్రజల మరణాలు రోజురోజూ పెరుగుతున్నాయి
కరోనా నీ విష ప్రభావం వల్ల ప్రజలు కన్నీరుమున్నీరు అవుతున్నారు
కరోనా నీ వల్ల ఏ దుకాణం ఎప్పుడూ మూతపడుతుందో తెలుస్తాలేదమ్మా
కరోనా నీవల్ల కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో తెలియని అనిశ్చితి
కరోనా ఎక్కడ చూసిన
ఎవ్వరిని అడిగిన నీ పేరే...
గల్లీ నుండి ఢిల్లీ దాకా
పల్లె నుండి ప్రపంచం దాకా
నీ పేరు తెలియని వారు ఎవ్వరూ వుoటారమ్మ కరోనా
నీవంటే ఏమిటో మాకందరికి అర్థమైంది కరోనా
మాపై దయవుoచి మా నుండి ఇంకా వెళ్లిపో కరోనా...
14.
సమూహం *వీరాస్ కవి సహాయం*
తేది 27/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 14
కవి పేరు : *కడారి పెద్దయ్య*
జిల్లా : నల్గొండ
కవితా శీర్షిక *దొడ్డి కోమరయ్య*
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు
నల్గొండ జిల్లా వీరుడు
నిజాం రజాకార్లకు ఎదిరించిన ధీరుడు
విసునూరి తుపాకి తూటాలకు నెలరాలిన అరుణతార
తెలంగాణ విప్లవంలో చెరగని ముద్ర
కోమరయ్య మరణ వార్త తెలంగాణ ప్రాంత ఆంధ్రమహాసభలో కార్యకర్తలందరికీ విషాదమైన వార్త
ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రాజాకార్లు ,దేశ్ ముఖ్ లు, జమీoదారులు,దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించిరి
విసునూరి నైజాం అల్లరి మూకలకు వ్యతిరేకంగా,
ప్రజలంతా ఏకమై కర్రలు,బడిశెలు,గుతుపలు అందుకుని విసునూరి, నిజాం, రజాకార్లను తరిమికొట్టిరి
15.
సమూహం *వీరాస్ కవి సమయం*
తేది 28/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 15
కవి పేరు : *కడారి పెద్దయ్య*
జిల్లా : నల్గొండ
కవితా శీర్షిక *నల్లమల*
పుణ్యనది కృష్ణమ్మ ప్రాణంపోసిన అరణ్యం
గిరిజన ప్రజలకు జీవనాధారం
జీవ వైవిధ్యానికి నిలయం మన నల్లమల మహా అరణ్యం
ఏది ఏమైనా ఎన్నో రకాల
జీవ జాతులకు ఆశ్రయాన్ని కల్పిస్తూ నాటి మనుగడకు సహకరిస్తున్న కల్పతరువు
నల్లమల ప్రాంతంలో
చెంచుపెంటలు ఎక్కువగా ఉండు
ఇక్కడి ప్రజలు అరణ్యంలో లభించే తేనే,ఇప్పపూలు,తునికి ,వెదురు,సుగంధ ద్రవ్యాలు,వన మూలికలతో జీవనం కొనసాగిస్తుండిరి
గిరిజన ప్రజలు అరణ్యంను
పవిత్ర పూజలతో
అరణ్య విలువను తమ సాంప్రదాయం
సంస్కృతిలో కాపాడుతుండిరి
ఈ ప్రాoతంలోని గిరిజన వాసులు వినియోగించే గిరిజన వైద్యం
ఆధునిక వైద్యాన్ని సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది
నల్లమల అనే పేరు ప్రస్థావన గురించి ఇక్కడి ప్రజలు
*నల్ల* అంటే *నల్లని* అని
*మల* అంటే *కొండలు* అని
చెబుతుండిరి
16.
సమూహం *వీరాస్ కవి సమయం*
తేది 29/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 16
కవి పేరు : *కడారి పెద్దయ్య*
జిల్లా : నల్గొండ
మినీ కవితా శీర్షిక *ఉగాది ఆహ్వానం*
కొత్త కొంగొత్త అందాలతో
నూతన నవనూతన సంవత్సరంలో అడుగు పెడుతూ
కుహూ కుహూ కోకిల రాగలతో
చిట్టి చిట్టి చిగురాకులలో
వేప పువ్వుల పులకరింపు
మామిడి పిందెల పిలుపు
మామిడి ఆకుల ఆహ్వానం
17
సమూహం *వీరాస్ కవి సమయం*
తేది 30/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 17
కవి పేరు : కడారి పెద్దయ్య
జిల్లా : నల్గొండ
కవితా శీర్షిక *ఉక్కుమనిషి*
స్వాతంత్ర సమరయోధుడు
స్వరాజ్య ఏకీకరణ చేసినవాడు
సర్దార్ వల్లబాయ్ పటేల్
భారతదేశ ఉక్కుమనిషిగా పేరుగాంచినవాడు
సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు పాటుపడినవాడు
1931 లో జరిగిన భారతదేశ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు
భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు
దేశ విభజన అనంతరం జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు
నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేదించాడు
ఉన్నత న్యాయ శాస్త్రం చదువులకై ఇంగ్లాడు వెళ్లి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు
స్వదేశానికి తిరిగి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు
1991 లో భారత ప్రభుత్వo సర్దార్ వల్లబాయ్ పటేల్ సేవలను గుర్తించి భారతరత్న బిరుదును మరణానంతరం ప్రకటించింది
18
[01/06, 4:52 PM] Kadari Peddaiah KS 35: సమూహం *వీరాస్ కవి సమయం*
తేది 31/05/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య : 18
కవి పేరు : *కడారి పెద్దయ్య*
జిల్లా : నల్గొండ
మినీ కవితా శీర్షిక *కరోనా*
చైనాలో పుట్టిన కరోనా
ప్రజలతో చెలగాటం ఆడుతున్న కరోనా
కంటికి కనిపించని కరోనా
ప్రపంచాని వణికిస్తుతున్న కరోనా
మాయదారి కరోనా
మందులేని కరోనా
మహమ్మారి కరోనా
మనుషులను చంపే కరోనా
ఇంకా మా నుండి వెళ్లిపో కరోనా
వెళ్లిపో కరోనా వెళ్ళిపో
19
[01/06, 4:52 PM] Kadari Peddaiah KS 35: సమూహం *వీరాస్ కవి సమయం*
తేది 01/06/2020
కవి క్రమ సంఖ్య : 35
కవిత సంఖ్య :19
కవి పేరు *కడారి పెద్దయ్య*
జిల్లా : నల్గొండ
మినీ కవితా శీర్షిక *నక్షత్ర గమనం*
చైత్ర శుద్దపాడ్యమి ఉగాదితో ప్రారంభమవుతుంది
ఉగస్య ఆది అనేదే ఉగాది
ఇది తెలుగువారి తొలి పండుగ
ఉగాది షడ్రుచుల సమ్మేళనం
ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక
హిందువులకు అత్యంత శ్రేష్ఠమైనది ఉగాది
ఉగాది రైతులను గౌరవించే పండుగ
Comments
Post a Comment