ఉల్లెంగ సాహిత్యం 41


ఉల్లెంగ ముత్యం poet

నిర్వహణ ః
వీరా గుడిపల్లి
సమన్వయం ః
శివునూరి లలితాకృష్ణ
*****"""""
కవి పేరు ః
ఉల్లెంగ ముత్యం గారు
నిర్మల్/బాసరవ
కలం పేరు ః
శ్రీ భారతి
***"""""""""""""

[29/07, 12:39 PM] Mutyam Sir Basara KS 41: వీరాస్ కవి సమయం.
దివి. 25-7-2020.
కవి పేరు - ఉల్లెంగ ముత్యం
ఊరు. రాంపూర్
జిల్లా. నిర్మల్
కవిత సంఖ్య. 02

 శీర్షిక.  : *మధుర స్నేహం*



మానవ జీవితంలో మరపురాని ఘట్టం స్నేహం
ఎలా కలుస్తారో ఎందుకు కలుస్తారో తెలియదు
అది పూర్వ జన్మ సంబంధమో లేక ఈ జన్మలో
భగవంతుడు ఏర్పర్చిన అనుబంధమో ఏమో
ఒకరి పట్ల మరొకరికి ఉన్న నమ్మకమే బలం
మిత్రునిలో మంచీ చెడులనూ స్వీకరించే గుణం
మంచిని పెంచి చెడుని త్రుంచేదైతే బలం
నమ్మకమనే నావపై నడిచే ఈ మధుర స్నేహం
మనస్పర్థలూ అనుమానంతో కావద్దు దూరం
కావాలి జీవితానికి మరపురాని మధుర ఘట్టం


ఈ కవిత నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను

ధన్యవాదములు 🙏🙏
[29/07, 12:39 PM] Mutyam Sir Basara KS 41: వీరాస్ కవి సమయం.
దివి. 25-7-2020.
కవి పేరు - ఉల్లెంగ ముత్యం
ఊరు. రాంపూర్
జిల్లా. నిర్మల్
కవిత సంఖ్య. 03

 శీర్షిక.  : *పంచ భూత తత్వం*



మలయ మారుతాల గాలి
మది మనసును దోచింది
సప్త వర్ణ ఇంద్ర ధనసు
స్వరములనే పలికింది
గంగాజల తరంగాలు
గమనము నే మార్చుకొని
అగ్ని శిఖల పర్వతమే
అణిగి మణిగి ఉన్నప్పుడు
భూగోళం లోని ప్రజల
బ్రతుకు భవ్య మయ్యింది



ఈ కవిత నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను

ధన్యవాదములు 🙏🙏
[29/07, 12:39 PM] Mutyam Sir Basara KS 41: 1
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
అద్యాపకులు
ఐఐఐటి - బాసర
కవిత సంఖ్య - 01



శీర్షిక : *నమ్మకం విలువ*

నమ్మకం అనే నావ మీద
విశ్వాసం అనే తెడ్డుతో
చేస్తున్న ప్రయాణం మనది
మోసం , ద్రోహం అనే కెరటాలు
ఎదురుగా వచ్చినప్పటికీ కూడా
చేరవలసిన తీరాన్నే చూస్తు
చేసే నిరంతర ప్రయాణమే
గమ్యాన్ని చేరుస్తుంది...

[29/07, 12:39 PM] Mutyam Sir Basara KS 41: వీరాస్ కవి సమయం.
దివి. 25-7-2020.
కవి పేరు - ఉల్లెంగ ముత్యం
ఊరు. రాంపూర్
జిల్లా. నిర్మల్
కవిత సంఖ్య. 04

 శీర్షిక.  : *కాలము*




కాలము విలువయె తెలియక
కాలక్షేపము చేసెడి యువత కు వినతీ
వేసిన బాణము మరియు గడిచిన కాలము
మరలా రావన్న మాట మరువక వినుమా!!



ఈ కవిత నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను

ధన్యవాదములు 🙏🙏
[29/07, 12:39 PM] Mutyam Sir Basara KS 41: వీరాస్ కవి సమయం.
దివి. 25-7-2020.
కవి పేరు - ఉల్లెంగ ముత్యం
ఊరు. రాంపూర్
జిల్లా. నిర్మల్
కవిత సంఖ్య. 05

 శీర్షిక.  : *ఆలోచన మార్పు*




అమవాస్య చీకటి ని చూసి
చంద్రుడు లేడనీ మళ్ళీ రాడనీ
అనుకోవడం నీ పొరపాటు
ప్రకృతిలో వస్తున్న మార్పుతో
చీకటి అయిందని అనుకోవడం
కాలానుగుణంగా వచ్చే గ్రహపాటు
కానీ ...
నూతన ఉత్సాహంతో చవితి చంద్రుడు
మళ్ళీ ఉదయిస్తాడనడం చేసుకో అలవాటు



ఈ కవిత నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను

ధన్యవాదములు 🙏🙏
[29/07, 12:39 PM] Mutyam Sir Basara KS 41: వీరాస్ కవి సమయం.
దివి. 25-7-2020.
కవి పేరు - ఉల్లెంగ ముత్యం
ఊరు. రాంపూర్
జిల్లా. నిర్మల్
కవిత సంఖ్య. 06

 శీర్షిక.  : *కాల చక్రం*




జనన మరణాల కాల చక్రం
ఏ తీరాలకు ఈ గమనం
దివి నుండి భువికా ?
భువి నుండి దివికా ?
నేడు అస్తమిస్తున్న సూర్యుడు
రేపు ఉదయిస్తాడని నమ్మే జనం
నేడు మరణించిన మనిషి
మళ్ళీ జన్మిస్తాడని నమ్మరెందుకో !?



ఈ కవిత నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను

ధన్యవాదములు 🙏🙏
[29/07, 12:39 PM] Mutyam Sir Basara KS 41: వీరాస్ కవి సమయం.
దివి. 25-7-2020.
కవి పేరు - ఉల్లెంగ ముత్యం
ఊరు. రాంపూర్
జిల్లా. నిర్మల్
కవిత సంఖ్య. 07

 శీర్షిక.  : *పరమేశ్వర తత్వము*




పరమేశా నీ తత్వము పరుల హితములోనే
సర్వభూత సమభావన సృష్ఠిలో రహస్యమే
నందన వనమైనా అది స్మశానమ్ము లోనైనా
నీలోనీ ఆత్మయే పరమాత్మను తెలుపునురా!



ఈ కవిత నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను

ధన్యవాదములు 🙏🙏
[29/07, 12:39 PM] Mutyam Sir Basara KS 41: వీరాస్ కవి సమయం.
దివి. 29-7-2020.
కవి పేరు - ఉల్లెంగ ముత్యం
ఊరు. రాంపూర్
జిల్లా. నిర్మల్
కవిత సంఖ్య. 10

 శీర్షిక.  : *జీవిత లక్ష్యం*




నేటి సమాజంలో మానవ జీవిత లక్ష్యం...

మానవుడు మాధవుడు కావాలి
నరుడు నారాయణుడు కావాలి
జీవుడు దేవుడు కావాలి...



ఈ కవిత నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను

ధన్యవాదములు 🙏🙏
[29/07, 12:39 PM] Mutyam Sir Basara KS 41: వీరాస్ కవి సమయం.
దివి. 27-7-2020.
కవి పేరు - ఉల్లెంగ ముత్యం
ఊరు. రాంపూర్
జిల్లా. నిర్మల్
కవిత సంఖ్య. 08

 శీర్షిక.  : *నా గమనం*




కాలచక్రంలో విహరించే నా గమనం
శిశిరం నుండి వసంతం లోకి
తమస్సు నుండి ఉషస్సు లోకి
పాల్గుణం నుండి చైత్ర కిరణం వైపు
దుర్గుణం నుండి సుగుణత్వం వైపు
మృత్యువు నుండి అమృతత్వం వైపు
ఇదే నా గమనం ...



ఈ కవిత నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను

ధన్యవాదములు 🙏🙏
[29/07, 12:39 PM] Mutyam Sir Basara KS 41: వీరాస్ కవి సమయం.
దివి. 29-7-2020.
కవి పేరు - ఉల్లెంగ ముత్యం
ఊరు. రాంపూర్
జిల్లా. నిర్మల్
కవిత సంఖ్య. 09

 శీర్షిక.  : *మన స్థితి*




చెట్టు లో భాగంగా ఉన్నంత వరకూ
అది *కొమ్మ* ...
వడ్రంగి చేతిలో ఒక రూపానికి వస్తే
అది *బొమ్మ* ...
దాన్నే ...
గుడిలో పెట్టి దండం పెడితే
అది *అమ్మ*...



ఈ కవిత నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను

ధన్యవాదములు 🙏🙏
10

11
వీరాస్ కవి సమయం .
30.07.2020 
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ జిల్లా 
సంఖ్య - 11


ॐॐॐॐॐ

*శీర్షిక - ఆదర్శ రాముడు*

భువిపై నడచిన పురుషోత్తముడు
ధర్మమూర్తియై వెలగిన రాముడు
పితృవాక్యమే శిరోదార్యముగ
వనముల కేగిన వదాన్యమూర్తి

గురువుల యెడ అనన్య భక్తి
సోదరుల పై అమిత ప్రేమతో
కౌగిలియిచ్చి గుహుని చేర్చుకొని
శబరి భక్తి కి మెచ్చి చెంతకు చేరి

ఆ అహల్య శాప మంత మొందించి
పతిత పావనుడిగ పేరు పొందిన 
శివధనువు విరిచి సీతను పెండ్లాడి
జగతి కి శుభ కళ్యాణము చేకూర్చి

ఒకేబాణ మొకేమాట ఏక పత్నితో
దుష్టశిక్షణ శిష్టరక్షణ వీరవ్రతమై
దశకంఠు గూల్చి ధర్మము నిలిపిన
ఓ రామా ఇంకెవరయ్యా మాకాదర్శం.

ॐॐॐॐॐ

ఇది నా సొంత కవిత

12

వీరాస్ కవి సమయం .
30.07.2020 
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ జిల్లా 
సంఖ్య - 12


ॐॐॐॐॐ

*శీర్షిక - స్నేహం* 

అనుకోకుండా కలిసిన 

నీ మరపురాని స్నేహం 

భగవంతుడు కలిపిన 

గత జన్మ బంధానిదేమో !!




ॐॐॐॐॐ

ఇది నా సొంత కవిత
13



17
[04/08, 9:25 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 17 


ॐॐॐॐॐ

*దీపపు సందేశం* 


 చీకటి నుండి వెలుగు లోకి 
అసత్యం నుండి సత్యం లోకి 
మృత్యువు నుండి అమృతత్వం వైపు
వికారం నుండి సకారం వైపు 
ప్రయాణమే "దీపం" సందేశం
వెలిగించుదాం దీపాలను 
ప్రయాణిద్దాం వెలుగు లోకి


ॐॐॐॐॐ

స్వీయ రచన ...
18
[04/08, 9:28 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం* 
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 18 


ॐॐॐॐॐ


*ముత్యం* 

ఆకాశం నుండి అనేక చినుకులు పడ్డాయి
బురదలో పడ్డ చినుకు బురదైపోయింది
కుంట లో పడ్డ చినుకు కుంటలా మారింది
వాగులో పడ్డ చినుకు వాగై సాగింది
చెరువులో పడి చెరువులో కలిసింది
నదిలో పడిన చినుకు నదిలాగ కదిలింది
గంగలో పడిన చినుకు పవిత్రమై పోయింది
కానీ...
స్వాతి నక్షత్రంలో సముద్రపు ఆలుచిప్పలో 
పడిన చినుకు  "ముత్యం"లా మెరిసింది
సరైన సమయానికి మనం ఎక్కడ పడాలో
అక్కడ పడితేనే జీవితం వెలుగుతుంది. 


ॐॐॐॐॐ 

స్వీయ రచన
19


[05/08, 8:30 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 19


ॐॐॐॐॐ

*పుల్వామా సైనికులు*

 పుల్వామా గడ్డ పైన నెత్తుటి మరకల గురుతు
ఏడాదీ గడుస్తున్న మరువలేని ఆ క్షణము
చెల్లాచెదురైనా ఆ వీరుల దేహాలు చూడు
ఆక్రోశించెడి ఆ కుటుంబాల బాధ చూడు
ద్రవించే నీ హృదయాంతరంగమును చూడు
ఇకనైనా నిలబడి జనగణ గీతము పాడు
ఏమిచ్చిన వారి ఋణం తీర్చలేము చూడు
వందే'మాతరము'తో కొట్టూ సెల్యూటు నేడు


ॐॐॐॐॐ

స్వీయ కవిత
[05/08, 8:35 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 20


ॐॐॐॐॐ

*ఊహా ప్రేయసి*

 గమ్యం తెలియని నా ప్రయాణంలో
గమనం నీవై నావు
మార్గం తెలియని నా ప్రయాణానికి
మార్గదర్శి వైనావు
ఎడారి లో ఒయాసిస్సు లా
సముద్రయానంలో నావలా
ఆకాశ మార్గంలో పుష్పకం వలే
నన్ను దరి చేర్చడానికి వచ్చిన
దేవతవి నువ్వే కదా !!


ॐॐॐॐॐ

స్వీయ కవిత
21

[06/08, 3:44 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 21


ॐॐॐॐॐ

*అంబెద్కర్*


 అంటరానితనం అనే విషరక్కసి కోరలలో
చిక్కుకున్న సమాజాన్ని రక్షించగ ముందుండి
రాజ్యాంగం రచియించి దేశానికి దిశను చూపి
బాబాసాహెబుగా ఘన కీర్తి పొంది నావయ్యా
ఓ భారతరత్నమా ! అంబెద్కరు దైవమా!!
అందుకొనుము దండాలు నీరాజనాలు...


ॐॐॐॐॐ

స్వీయ కవిత
[06/08, 3:47 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య -22


ॐॐॐॐॐ


*కరోనా*


కరోనా ను చేయాలి ఖననం
ఎవ్వరికీ రావద్దు మరణం
ఇంటిలోనె ఉంటె సంతోషం
బయటికెళ్తె మిగులు సంతాపం


ॐॐॐॐॐ


స్వీయ కవిత
23

*వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 23


ॐॐॐॐॐ

*కరోనా నివారణ*

 దేశ దేశాల నుండి వచ్చిన
ముష్కరులను మట్టికరిచిన జాతి మనది
చైనా నుంచి వచ్చిన వైరస్ ను
తుద ముట్టించడం మనకొక లెక్కనా
ఆనాడు మైదానంలో యుద్ధాలు చేశాం
ఈనాడు ఇంట్లో ఉండి చూడాలి అంతే
భౌతిక దూరంతో ఉండాలీ మనము
మాస్క్ కట్టుకొని తిరగాలి తప్పకుంటె
శానిటైసరూ వాడి శుభ్రంగా జీవిస్తే
కరోనా కానరాదు కనుసన్నల లోనా


ॐॐॐॐॐ

స్వీయ రచన
24

*వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 24



ॐॐॐॐॐ


*విదేశీ వ్యామోహం*


కొత్తా పండగలొచ్చే కోతి చేష్టలెక్కువాయె
మన సంస్కృతి వద్దంటూ పరదేశీ ముద్దంటూ
రోస్ డే ప్రపోసు డే  కిస్సింగు హగ్గింగంటూ
పరదేశపు వ్యామోహం పరుగెత్తీ వస్తున్నది
పవిత్ర ప్రేమకు రూపం రాధాకృష్ణులు కాగా
కామంతో కాటువేయ వాలంటైన్ ముందుకొచ్చె
విదేశీ వ్యామోహం విరగబడీ వస్తున్నది
స్వదేశీ వద్దంటూ విదేశీ ముద్దంటూ
ఇంగిలీషు కల్చరొచ్చి ఇంటిలోన కూసున్నది
25
*వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 25


ॐॐॐॐॐ


*సైనికులకు ఓదార్పు*


 గాల్వానా లోయలోన గాయపడ్డ సైనికులను
కలవాలను సంకల్పం కరోనాను జయించెను
వయసూ వాతావరణం ఏదీ అడ్డము  కాదు
నా వాళ్ళు అనే గొప్ప ఆత్మీయత ఉన్నప్పుడు
కలిసీ మాట్లాడే మనసు ఉండటమే ముఖ్యమూ
అందుకనే కదలి వెళ్ళి సైనికులను కలుసుకొని
యుద్ధానికి సిద్ధమనే సంకేతము చూపించి
కోట్ల మంది అండగా ఉన్నామను ధీమానిచ్చె
కోట్ల భారతీయ హృదయ సీమలనూ కొల్లగొట్టె


ॐॐॐॐॐ

స్వీయ కవిత
26
27
28

*వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 28


ॐॐॐॐॐ

*కరోనా మందు*


తాటికల్లు తాగమని తరచి చూసి చెప్పారు
వేడి నీటి ఆవిరీ వేగంగా తగ్గించును
ఉప్పు నీళ్ళు పోసుకొని పుకిలిస్తే చాలు
వేడి వేడి ఆహారం సమయానికి తినుము
పొద్దున్న సాయంత్రం కషాయాన్ని సేవించు
పాలల్లో పసుపు వేసి రాత్రి పూట త్రాగు
నీలోనీ శక్తి యే నిన్నూ రక్షించును రా
వేరొక మందూ కోసం వెంపర్లాటలు ఎందుకు
రోగాన్ని నిరోధించె శక్తిని పెంచుకొ చాలు
కరోనానె కాదు దాని అబ్బయైన పారిపోవు



ॐॐॐॐॐ


స్వీయ కవిత

29

[10/08, 4:23 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 29



ॐॐॐॐॐ


*సంస్కృతి*


మన సంస్కృతి మహత్యాన్ని
గుర్తించే తరుణమొచ్చె
ఇదే గొప్ప శాస్త్రమని తెలుసుకొనే సమయమొచ్చె
కల్లాపి చల్లి అలికి ముగ్గు పెడుతుంటే
వెకిలిగ నవ్విన జనం వేనోల్లుగ పొగుడుతుండ్రు
గుమ్మానికి పసుపు రాసి దేవుడనీ మొక్కినపుడు
అజ్ఞానం మీది అని ఎన్నో మాటలు అనిరి
మళ్ళీ మన పద్దతులే పాటించాలంటున్నరు
పాము కు పాలు పోసి చెట్టుకు నీళ్ళూ పోసి
ప్రకృతి తో మనం సహజంగా జీవిస్తే
సైన్స్ ఇలా చెప్పదంటు సంకలు గుద్దుకొనిరి
ఆఖరకు మళ్ళివచ్చి మన మాటనె సత్యమనిరి
భారతీయ సంస్కృతిలో ఇమిడి ఉంది సైన్స్
వాటిని పాటిస్తేనె ఉంటుందీ సెన్సు ...



ॐॐॐॐॐ

స్వీయ కవిత
[10/08, 5:18 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 30


ॐॐॐॐॐ


*పుట్టిన రోజు*

పుట్టిన రోజు అంటే గొప్పని పండుగ మనకు
చేయొద్దు దాన్ని మనం విదేశీ డే లాగా
అభం శుభం తెలియని ఆ చిన్ని శిశువు కు ముందు
దీపము ను వెలిగించి ఆర్పు ఆర్పు మంటారు
నేడు దీపాలార్పు రేపు కొంపలు ఆర్పు
కేకు అనే పదార్థాన్ని చక్కగాను చేయించి
పిల్లవాడి పేరును చక్కగా రాయించీ
కత్తి పట్టుకొని పేరు కట్టు కట్టు చేస్తుంచే
దేనికి సంకేతమో ఇది ఎక్కడి సంస్కృతియో
దీపాలార్పే పద్దతి భారతీయ విధానమా
విదేశీ విధానాలు పరతంత్రపు సంకేతాలు
ఇకనైనా నిద్రలేచి మన సంస్కృతి గుర్తించి
భారతీయ పద్దతిలో పండుగగా జరుపుకొనుము
తల్లిదండ్రుల గురువుల ఆశీస్సులు పొందుతూ
భగవంతుని దర్శించి చక్కని సేవలు చేసి
ఆకలితో అలమటించు ఆర్తజనుల బాధ తీర్చి
తోచిన రీతిగ వారికి అండగా నిలిచినపుడు
నిజమైన పండుగయే జన్మదినం నీది ...


ॐॐॐॐॐ


స్వీయ కవిత

31


[11/08, 11:03 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 31


ॐॐॐॐॐ


*జన్మ అష్టకం*


 కారాగృహమున పుట్టి
కష్టాలెన్నో భరించి
తల్లీదండ్రి ని బాసీ
రేపల్లెలో గోవులు గాసి  ॥ 1 ॥

కంసుని పరమార్చి నాడు
చానూరుని మదమణచే
పూతననూ కూలదోల్చి
శటకాసుర చెండాడి     ॥ 2 ॥

గోపికలతొ ఆటలాడి
గోవులనూ రక్షించీ
పాలు పెరుగు అన్ని త్రాగి
జ్ఞానమనే వెన్న పంచి  ॥ 3 ॥

కుబ్జా శాపము త్రుంచి
రాధ కు ప్రేమను పంచి
గోవర్ధన గిరిని ఎత్తి
గో వంశము కాపాడి    ॥ 4 ॥

పిల్లన గ్రోవిని ఊదుతు
జీవన మర్మం తెలిపీ
సోదర ప్రేమను పంచీ
బలరామ సుభద్ర లతో  ॥ 5 ॥

ధర్మము పక్షాన నిలిచి
దానవులను ద్రుంచంగా
పాండవులతొ మైత్రిచేసి
ద్రౌపది నీ రక్షించే        ॥ 6 ॥

కౌరవులతో సంధికొరకు
శతవిధాల యత్నించీ
తప్పని పరిస్థితి లొ
యుద్ధాయ కృత నిశ్చయ॥ 7 ॥

దుష్ట శిక్షణార్ధమై
శిష్ట రక్షణార్థమై
ధర్మాన్ని రక్షింపగ
భగవద్గీత న చెప్పె   ॥ 8 ॥


ॐॐॐॐॐ


స్వీయ కవిత
[11/08, 12:07 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 32


ॐॐॐॐॐ


*కృష్ణం వందే జగద్గురుమ్*



 ఏ కాన్వెంట్ కు వెళ్లని కృష్ణుడు విశ్వగురువుగా ఎలాఅయ్యెను?
లౌకిక చదువులు చదవని కృష్ణుడు లోకోద్ధారణ ఎలా చేసేను?
తల్లిదండ్రి ప్రేమతో గురువుల ఆశీస్సులతో
సదా వినయ విధేయత సంస్కారమ్ముల తోడ
దుష్టులనూ శిక్షింపగ శిష్టులనూ రక్షింపగ
తన జీవన లక్ష్యముగ నిశ్చయమ్ము  చేసుకుని
ధర్మమును రక్షింపగా అవతారం ఎత్తినాడు
భగవద్గీతను జాతికి బహుమతిగా ఇచ్చినాడు
భావి తరాల ను ఇలా జీవించమని చెప్పే
అందుకే కృష్ణుడు ఆయెను విశ్వానికి గురువు
కృష్ణం వందే జగద్గురుమ్  కృష్ణం వందే జగద్గురుమ్  ॥


ॐॐॐॐॐ

స్వీయ కవిత

33

[12/08, 8:38 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
 రాంపూర్
నిర్మల్
సంఖ్య - 33


ॐॐॐॐॐ


*ఉమ్మడి కుటుంబం*


భారతీయుల విజయరహస్యం
ఉమ్మడి కుటుంబ విశాల భావన
కష్టసుఖాలలో కలసీ మెలసీ
మేమున్నామని ధీమా నిచ్చి
నిరంతరం పెద్దల ఆశీస్సులు
చిన్న పిల్లల బంగారు భవితకు
 బాటలు వేయును సదా సర్వదా
కలసీ మెలసీ ఆడుతూ పాడుతూ
ప్రతినిత్యం ఒక పండగ లాగా
బాధ ఉంటే ఓదార్చే వారు
సంతోషాన్ని కలసి పంచుకొని
ఏదైనా ఒక చిన్న తప్పు చేద్దామన్నా
మా ఇంట్లో పెద్దలు తిడతారని
ఒక భావనతో ఆ పని మానేస్తాం
అన్నదమ్ములు అక్కలు చెల్లెలు
అత్తలు మామలు బాబాయ్ పిన్నిలు
వారి పిల్లల గలగల చప్పుడు
 నిత్య కళ్యాణం పచ్చ తోరణం
ఇది మన సంస్కృతి గొప్పతనం
 భారతీయుల విజయ రహస్యం


ॐॐॐॐॐ

స్వీయ కవిత
[12/08, 10:40 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 34



ॐॐॐॐॐ

*రాఫెల్ శక్తి*


యుద్ధరంగమున ఉన్న సైనికుల శక్తిని పెంచగా రాఫెల్ వచ్చెను
ఉరిమి చూసి ఆ శత్రు మూకలను తరిమి కొట్టగా శక్తిని ఇచ్చెను
చుట్టుపక్కల పొంచి ఉన్న ఆ గుంటనక్కల మదము ననచగా
చైనా పాకిస్తాన్ మరీ ఏ విచ్చిన్న శక్తి అయినను
కావాలని మేం పోరాటం చేయము కాలు దువ్వితే వదిలిపెట్టము
రాఫెల్ శక్తితో రణరంగమున ధన ధన మని ముందు కురుకుతూ
ఉగ్రవాదుల తీవ్రవాదుల ఉన్మాదులను మట్టు బెట్టగ
మా దగ్గర ఉన్న ఆయుధాలు దీపావళి పండుగ కొరకు కాదుగా
మాతృ భూమి రక్షణ మా జీవన లక్ష్యముగా
ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా తీసేస్తాం
దేశమాత చరణాలపై మా జీవన సుమములు అర్పిస్తాం



ॐॐॐॐॐ

స్వీయ రచన
35

[13/08, 11:42 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 35



ॐॐॐॐॐ


*మాతృ భాష*


అమ్మ భాషంటే హృదయ భాష
చెప్పకున్నా చూసి అర్థమయ్యే భాష
ఏ కష్టం కలగకుండ ఏర్పడే భాష
విద్యార్థి కి నేర్పె చదువు మాతృభాష లో ఉంటే
సునాయాస మవుతుంది బంగరు భవిష్యత్తు
అమ్మ ఒడిలో గోముగా నేర్చుకున్న భాష
లక్ష్య సాధనమ్ముకై వారధి ఆ భాష



ॐॐॐॐॐ


స్వీయ కవిత
[13/08, 5:02 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 36


ॐॐॐॐॐ


*కరోనా సమానత్వం*

రాజు పేద బేధము లేదు
రాష్ట్రపతి అను తేడా లేదు
రాజ కుమార్తెకు వచ్చిన కరోన
మన రాష్ట్రపతీ కి వచ్చింది
ఉన్నోడని లేనోడనీ ఏ బేధం
అసలే లేదీ మహమ్మారికి
స్వాతంత్రం న మన రాజ్యంలో
అందరికీ సమానము గ వస్తుంది కరోనా
కానీ కరోనా కు కాసింత కనికరం
బిచ్చగాళ్ళ నొదిలింది నిరుపేదల నొదిలింది
కారణమేమో దీనికి కాసింత యోచించు
ప్రకృతి సహ జీవనం ఇచ్చును ఆరోగ్యం

ॐॐॐॐॐ
స్వీయ కవిత

37

[15/08, 7:55 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 37


ॐॐॐॐॐ


*స్వాతంత్రపు సమర ఫలం*

 స్వతంత్రం సిద్ధించి దశాబ్దాలు గడిచిపోయె
సామాజిక పరిస్థితి ఏమైనా మార్పున్నద
ఏడాదికి ఒకమారు జరుపుకునే పండుగనా?
నిరంతరం స్మరియించే వీరుల ధీరుల జాతర
అప్పటికీ ఇప్పటికీ ఏమైనా మార్పున్నదా
ఏడు దశాబ్దాల స్వా తంత్రపు ఈ జీవనంలో
సామాన్య ప్రజల సౌహార్ద్రపు జీవనమ్ము
అప్పుడు ఇప్పుడు ఒకే పరిస్థితి ఉన్నదంటే
సిద్ధించిన స్వాతంత్రం ఇస్తుందా సమర ఫలం
వేలాది వీరులు అర్పించిరి తమ జీవితాలు
స్వ సుఖాలను వదిలి సమర్పించే సర్వస్వం
ఎందరు గుర్తున్నారు ఏ విషయం గుర్తు ఉంది
ఆనాటీ వీరులు మళ్ళోక్కసారి బ్రతికి వస్తే
ఈ దేశపు ప్రజల ఈ పోకడలూ చూసినపుడు
ఎందుకు తెస్తిమిరా ఈ స్వాతంత్రం అనుకోరా?
భారతీయుడా ఆలోచించూ నీ భవితవ్యం
ఇకనైనా నడుం కట్టు భారత్ కు జై కొట్టు



ॐॐॐॐॐ


స్వీయ కవిత
[15/08, 8:08 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 38



ॐॐॐॐॐ


*భారతీయత*


పొద్దున లేచిన్నుండీ నువు వస్తువులలో
నిత్యం నువ్వేసుకునే నీ వస్త్ర ధారణలో
నీ మాట నీ పాట నిరతం నీ ఆలోచన
నిత్యం నువు జరిపే ఏ పండగలోనైనా
ఉన్నదా భారతీయ జీవన తత్వం
స్వదేశీయ భావన స్వాతంత్రపు లక్ష్యం

ॐॐॐॐॐ
స్వీయ కవిత

39
*వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 39



ॐॐॐॐॐ


*ఒక్క రోజు దేశ భక్తి*



స్వాతంత్ర్య దినము అని
పొంగీ పొరలెను భక్తి
వాట్సపు లో స్టేటసులు
ఫేస్ బుక్కు లొ పోస్టింగులు
ఇన్ స్టాగ్రాములొ ఫోటో
ట్విట్టరులో డైలాగులు
పొంగిపొరలు దేశభక్తి
సోషల్ మీడియ సాక్షిగ
ఒక్కరోజు మొత్తమంత
ఒకే ఒక్క విషయమూ
ఆ రోజూ పూర్తియై తెల్లారి పోగానే
ఎవరి గోలలో వారు మునిగీ పోతార

ॐॐॐॐॐ


స్వీయ కవిత
40

*వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్

సంఖ్య - 40
ॐॐॐॐॐ
*నాయకుడు*

నాయకుడంటే నలుగురినీ నడిపించును
అనుయాయుల అభివృధ్ధికి పాటుపటేవాడు
అన్నా అని ప్రేమతో పిలిచిన వెంటనె తాను
నేనున్నా పద మంటూ తోడు నిలుచువాడు
తనను నమ్ముకున్న ఆ అనుయాయుల జీవనంలొ
సంతోషము కోసం తపించి నిలుచువాడు
తను తిన్నా తినకున్నా నలుగురి కోసమే శ్రద్ధ
బడుగూ బలహీనులంటె అమితమైన శ్రధ్ధ
ఇంతగొప్ప నాయకుడు మరియొకరూ ఉండరంటు
నోరారా ప్రజలంతా పొగడే ఆ వ్యక్తిత్వము
నాయకుడు అనే వాని లక్షణాలు ఇవియే
ॐॐॐॐॐ
41
[16/08, 11:17 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 41



ॐॐॐॐॐ


*అన్నీ నీవే*

నా హృదయ స్పందన నీవు
నా జీవన గమ్యం నీవు
నా మది లో మెదిలే
ప్రతి ఆలోచన నీవే

నా మానస ఆశ నీవు
నా ప్రాణపు శ్వాస నీవు
నా యెదలో మెదిలే
ప్రతి స్పందన నీవే

నా ఆరోప్రాణం నీవు
నా ఆనంద ధామం నీవు
నా ఆశల సౌధానికి
ప్రతి మెట్టు నీవే

నా క్రియలకు సాక్షి నీవు
నా సమర ఫలితం నీవు
నా అంతిమ లక్ష్యపు
తుది గమ్యం నీవే



ॐॐॐॐॐ


స్వీయ కవిత
[16/08, 1:10 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 42



ॐॐॐॐॐ

*అఖండ భారతం*


ఉపగణస్థానమాయె ఆఫ్ఘనిస్థాను
బ్రహ్మదేశ మాయె బర్మా
త్రివిష్ఠపం టిబెటాయెను
సింధుస్థానం పాకిస్థాను గ
వంగదేశ మాయె బంగ్లా
భూటాను నేపాలు కూడ
ఈ దేశము లో భూభాగాలే
ముక్కలైన మనదేశము
ఒక్కటయ్యేదెప్పుడూ?
భరతమాత గుండె మంట
చల్లారే దెప్పుడూ?
భాగాలన్నీ కలిసీ ఒకే
దేశ సంపద యై
అఖండ భారత స్వప్నం
నిజమయ్యేదెప్పుడూ?


ॐॐॐॐॐ

స్వీయ కవిత
43
[18/08, 1:54 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 43

*రైతు*


ఈ దేశంలో శతాబ్దాల తరబడి
ఎవరికీ అందని వ్యక్తి రైతు
ఎందరో గొప్ప కవుల కలాలకు
అందని కవిత్వం ఆ వ్యక్తిత్వం
ఎందరి భవితలు మారిన
మరెందరో గతులు మారిన
మారని స్థిరత్వ కనిష్ఠ జీవనం
లోకానికి అన్నం పెట్టి తను మాత్రం
గంజి త్రాగి జీవించే వాడు రైతు
రైతే వెన్నెముకన్న దేశాన
వెన్నెముకే మిగిలిన వాడు రైతు
రైతుకి వందనం అభివందనం

ॐॐॐॐॐ

స్వీయ కవిత
[18/08, 2:05 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 44

*ఎడ్ల పొలాల*


దేశానికి వెన్నెముక రైతైతే
ఆ రైతుకి ఆధారము ఎడ్లు
రైతు కుటుంబంలోనే కాదు
కష్ట సుఖాలలో భాగస్వాములు
పగలనకా రేయనకా రైతు శ్రేయముకై
పంటలు పండించును ఈ ఎడ్లు
ఏడాదికి ఒక్కనాడు ఎడ్ల పొలాల
పండగ ఆ ఎడ్లకు మనసు నిండా
శుభ్రంగా కడిగి తగు రంగులు అద్ది
ఆభరణాలెన్నో ఏర్చీ కూర్చీ
శుభ్రమైన వస్త్రాలు కుట్టించీ తొడిగీ
పిండి వంటలెన్నో ఇంపుగ చేసి
దండము పెట్టీ పూజలు చేస్తామీ రోజు

ॐॐॐॐॐ


45
*వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 45



ॐॐॐॐॐ


*రైతే రాజు*


అందరి మనుగడ ఆహారంతోనే
ఆహారం లేకపోతె ప్రాణం లేదు
కంప్యూటరు యుగమైనా లేదా
కటిక చీకటి లో జీవిస్తు ఉన్న
ఏ వృత్తి లోన ఉన్నా నీవు ఆ
రైతు పండిస్తేసే తినేది కదా
వస్త్రం కుట్టించుకు కట్టాలన్నా
రైతు పత్తి పండించాలి
పాలు పెరుగు వెన్న నెయ్యి
ఏది కావాలన్నా రైతు తీయాలి
బంగారం పండించే రైతన్నలు
భూమిని తల్లిగ కొలిచే రైతులు
 ప్రతీ జీవి మనుగడకు ఆధారం
అందుకే అంటారు రైతే రాజు ...



ॐॐॐॐॐ


స్వీయ కవిత

46

*వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 46



ॐॐॐॐॐ


*మానవత*


నేను వెతుకుతున్నాను నిన్ను
ఎక్కడున్నావో ఏమో అని
మేడ మిద్దెల దాగి ఉంటివొ
పేద గుడిసెల లోన ఉంటివొ
చెట్టునుంటివొ పుట్టనుంటివొ
రాళ్ళలో రప్పళ్ళ నుంటివొ
ఆరోగ్యవంతుల లోన నుంటివొ
రోగులా హృదయాల నుంటివొ
డబ్బుగల వాళ్ళ ఇళ్ళలో
దర్పమును చూపెట్టనుంటివొ
పేదవారి కాయకష్టము లోన
బాధ ఎంతని చూస్తుంటివో
అడుగు అడుగున సగటు మనిషిలొ
అణువంతయన్నా ఉన్నవేమొ యని
నిరంతరమూ వెతుకు చుంటిని
మానవత్వమా నీవెక్కడనుచూ
ॐॐॐॐॐ
స్వీయ కవిత

47

*వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 47

ॐॐॐॐॐ

*ప్రకృతి*


ప్రకృతి శుభ్రత లో పరమార్థం ఇమిడి ఉంది
ప్రాణులన్నింటికీ ప్రకృతియే జీవధార
భారము మోసే భూమిలొ చెత్తా చెదారాలు పోసి
కలుషితాలు వేసినా తనలో కలుపుకుంటున్నది
జీవాధారము అయినా నీటిని కలుషితం చేసి
వ్యర్థము చేసిన గానీ తనలో లీనము చేసెను
ప్రాణాధారము అయినా ఆ గాలి కలుషితం
నిరంతరం వాహనాల హోరు జోరుతో
అగ్ని భయము లేదు అక్కడ కూడా కలుషితం
నిరంతరం మనిషి చేష్ఠ కలుషితాలు పెంచవట్టె
ఆకాశమంత విశాల హృదయాలు కలుషితం
ఆకాశములో కలుషితమే కానవచ్చు
మరి ఎందుకు ప్రకృతీ ప్రకోపించదూ?
వైపరిత్యమై మనలా కొంపముంచదా
మొక్కనాటుదామనే ఆలోచన ఉందా మనలో కొందరికైనా
వర్షం రావట్లేదను బాధనే నిరంతరము
మొక్క పెట్టి చెట్లు పెంచి ప్రకృతి నీ కాపాడితె
పులకించదా ఆ ప్రకృతి వర్షించదా ధారయ
ॐॐॐॐॐ
స్వీయ కవిత

48
[20/08, 5:48 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 48



ॐॐॐॐॐ

*ప్రాణం విలువ*

జనన మరణ చక్రంలో బందీ ఈ మనిషీ
భవ బంధాల నడుమ నలుగును ఈ మనిషీ
నాది నాది నా వాళ్ళు అన్న జీవనము
ఒక్కసారి ప్రాణం పోయిందని అంటే
ఈ రోజు ఇంట్లో రేపు మంట్లో అన్న చందమే
జననం మరణం అనివార్యమే
పునర్జన్మమూ అనివార్యమే
దిగిపోవలసిన స్టేజీ వచ్చినప్పుడూ
దిగిపోక తప్పనప్పుడు అందరినీ వదలి పోవాల్సిందే
పరమాత్మను చేరుకునే గమనంలో ఆత్మ
యొక్క ఒక మజిలీ ఈ జీవనం



ॐॐॐॐॐ


స్వీయ కవిత
[20/08, 7:20 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 49



ॐॐॐॐॐ


*హృదయేశ్వరీ*


సుందర సుకుమార కోమలీ
ఎక్కడ నీ చిరునామా?
చిటారు కొమ్మన ఉన్న తేనె తుట్ట లోని మాధుర్యం లోనా
కిలకిల నవ్వుల పక్షుల రవములలోనా
చెట్టు కొమ్మల పైన ఉన్న సుకుమార పుష్పాల లోనా
స్వచ్ఛమైన జీవనదుల హోయల లోనా
విశాల ఆకాశపు సువిశాల తత్వము లోనా
ప్రభాత వేళలో కోయిలల కుహు కుహు రాగాలలోనా
పుష్పాల లో దాగి ఉన్న మధుర మకరందము లోనా
చిలక పలుకుల లోనా నెమలి నాట్యములోనా
ప్రతీ నెలలో వచ్చే చవితి చంద్రుని నెలవంక లోనా
ఎగసి పడే సముద్రపు ఘోషల విహరములోనా
ఎక్కడ నీ అందచందాల ఆ మోము కిరణం...
అక్షయ దరహాసానికి చిరునామా నీవే..


ॐॐॐॐॐ
[20/08, 9:26 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 50



ॐॐॐॐॐ

*వృద్దాశ్రమ జీవులు*


చిన్ననాటి నుండి పెంచీ పోషించినట్టి
తల్లీదండ్రులను ఆవసాన దశలోనా
ఆశ్రమాలలో వదిలీ వచ్చే ఓ బిడ్డలార
ఆలోచించండొక్కసారి శ్రేయమా ఈ పని
పుట్టిననాడు మిమ్ముల వాళ్ళు కూడ ఇలానే
ఎక్కడనో పడవేస్తే ఏలాగా ఉంటుంది
కని పెంచీ తిండి పెట్టి బట్టలు తీర్లుగ తెచ్చి
అడిగిన ప్రతీది ఇచ్చి అనుక్షణం రక్షించీ
ఒక స్థాయికి తెచ్చిరి చదువులెన్నొ చెప్పించిరి
ఉద్యోగం వచ్చీ ఒక ఇంటివాడి వయ్యావని
ఎంతొ సంబుర పడిరి తల్లిదండ్రులూ
ఆలాంటి పెద్దలూ ఆవసాన దశకు చేరీ
విశ్రాంతిగ జీవితాన్ని వెళ్ళా దీద్దామంటే
సేవ చేసే భాగ్యానికి నోచుకోని సంతానము
వృద్దాశ్రమముకు పంపే విచిత్ర యోచన చేసిరి
తల్లడిల్లి పోవా ఆ ముదుసలి హృదయాలు
భరించగలవా ఆ బరువెక్కిన గుండెలూ
ఆలోచన మార్చుకొనుము ఓ నవ యువకా
నీవూ ఒకనాడు ముసలివాడి వయ్యాక
నిన్నూ అక్కడ చేర్చితె తట్టూ కొంటవ నీవు
ప్రత్యక్షా దైవాలు మన తల్లీ దండ్రులు
కాచుకొని సేవించూ కడవరకూ వారినీ



ॐॐॐॐॐ



51

[21/08, 10:23 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 51



ॐॐॐॐॐ


*మెకాలే విద్యా విధానం*



భారతదేశం మొత్తం తిరినట్టి మెకాలే
విస్మయమూ చెందెను ఈ దేశపు సంస్కృతి కి
తన దేశ పార్లమెంటు లోకి వెళ్ళి మాట్లాడెను
చూడలేదు బిచ్చగాన్ని ఒక్క దొంగ నైనా
నీతీ నిజాయితీ భారతీయ సంస్కృతీ
బానిసలుగ వారినీ చేయడమూ అసాద్యం
నైతికంగ దెబ్బతీసి పరిపాలన చెయ్యాలి
రక్తంలో వర్ణంలో భారతీయులై ఉండి
భావాలన్నీ విదేశీ ఆలోచనల తోని
ఉన్నట్టీ వ్యక్తులుగా తయారు చేయ్యాలి
అనుచూ ప్రవేశపెట్టె నొక విద్యా విధానం
అదే విద్య విధానం ఇప్పటికీ ఉన్నదీ
బానిస బ్రతుకుల చరిత్ర మనం చదువుతున్నది
అందుకనే దీన్ని మార్చి సంస్కరణలు తేవాలి
నూతన విద్యా విధాన మమలూ చేయాలి
గౌరవమయ చరిత్రలు గుర్తూ చేయాలి..
ॐॐॐॐॐ
స్వీయ కవిత
[21/08, 11:15 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 52

ॐॐॐॐॐ
*గౌరవ చరిత్రలు*
గౌరవమయ చరిత్రలు గాథలు గా ఉండాలి
స్వజాతీయ పౌరుషం వెల్లివిరియుచుండాలి
వీరత్వము తేజస్వము పునికి పుచ్చుకోవాలీ
మన దేశపు జాతీయత యద యదలో రగలాలి
సనాతన భారతీయ సంస్కృతి మురియాలి
మనదేశపు ఝండా గగనము నెగరాలి
ఈ దేశపు రాజుల వీరోచిత పోరాటము
మాతృ భూమి రక్షణకై ఒరిగినట్టి ప్రాణాలు
ఇలాంటి చరితలు చదివితె ఉప్పొంగును పరాక్రమం
అస్త్రాలు శస్త్రాలు సకలా శాస్త్రాలు
ఈ దేశపు వైభవాన్ని ఇనుమడింప జేయాలి
భారతమాతకు జై అని దశ దిశలా మ్రోగాలి
53




67
[27/08, 3:34 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 67



ॐॐॐॐॐ


*మాతృవత్ పర దారేషు*


స్త్రీ అంటే భోగ వస్తువని
అనుభవించడానికే పుట్టిందని
అంగడి బొమ్మగ చూసే వారికి
అబలగా అవమానించే వారికి
ఏ శిక్షను వేయాలి ఎలా మార్పు రావాలి
పర స్త్రీ లను తల్లిగ చూసే విశిష్ఠ దేశం మనది
ఈ దేశం లో స్త్రీలకు రక్షణ ఎక్కడ ఉన్నది
అమ్మగ అక్కగ చెల్లిగ చూసే బంధం మనదీ
అంగడి బొమ్మగ భావించే దుష్టాచారం ఎక్కడిది
ఇకనైనా పాడాలి చరమగీత మీ సంస్కృతికి
స్త్రీ జాతికి కల్పించాలి చక్కనైన రక్షణ



ॐॐॐॐॐ
68

స్వీయ రచన
[27/08, 3:54 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 68



ॐॐॐॐॐ


*నీవే నీవే*


నా కవితకు ప్రేరణ నీవే
నా ఆలోచన రూపం నీవే
నా ఆశల సౌదం నీవే
నా భావపు గీతం నీవే

నా మదిలో మెదిలే ప్రతి ఆలోచన నీదే
నా ప్రతి పని లో చేరే తుది గమ్యం నీవే
నా జీవన నావకు చెలియలి కట్ట వి నీవే
నా మనసులోని భావాలకు "సంగీత"ం  నీవే



ॐॐॐॐॐ

69
స్వీయ కవిత
[27/08, 4:10 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 69



ॐॐॐॐॐ



మనం అనుకున్నది జరిగితే ఆనందం
అది జరగనపుడు కలుగు ఎంతో బాధ
కాని అసలు విషయం ఏమిటో తెలియదు మనకు
జరగ వలసిన విషయం జరగక మానదు
దానికి మన ఆలోచన ఎక్కడో అనుకోకుండా కలుస్తుంది
దానికే ఆకాశాన్ని అందుకున్న ఆనందం మనది
కానీ జరుగుతున్న విధి కి సాక్షి గా మనముంటే
ఆనందం ఆవేశం బాధ కూడా తోచును ఏకమై

70


/08, 8:14 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 70


ॐॐॐॐॐ


*భారతీయ సంస్కృతి*

మనుషులు చచ్చి పోవడం విన్నాము మనము
కానీ సంస్కృతి చచ్చిపోవడం తెలుసా మీకు
విశ్వజేతను కావాలని యుద్ధాలు చేసిన
అలెగ్జాండరు గ్రీకు సంస్కృతి ఎక్కడుంది ఈనాడు
ఇజిప్షియను సంస్కృతేమొ ఇరాకు గా మారిపోయె
పార్శీ సంస్కృతి లేదు కొందరు మిగిలిరి మనదేశంలో
జూలియో సీజరు యొక్క రోమను సభ్యత లేదు
అమెరికాలొ ఉన్నట్టీ మాయా సంస్కృతి ఏదీ
అసీరియన్ సుమేరియన్ సంస్కృతులెక్కడపాయే
అజ్ టెక్ ఐగుప్తుల జాడ కాన రాదాయే
ఇంటాను సిజియాను చార్డియాన్ సంస్కృతులు
మచ్చుకు కొన్నీ చెప్పితి ఇంకా ఉన్నవి చాలా
నలభయారు సంస్కృతులు కలిసిపోయె భూమిలోన
మిగిలినవీ మూడే తమ అస్తిత్వము తో ఉన్నవి
భారత్ చైనా ఇజ్రాయిలు సంస్కృతులు
ప్రాచీనమైన  భారతమే ఇప్పటికీ మిగిలి ఉంది
చిర పురాతనం నిత్య నూతనం  మన భారత సంస్కృతీ
వందనం వందనం ఈ గొప్ప సంస్కృతి కి
అభినందన చందనం అజరామర సంస్కృతి కీ

71
[28/08, 12:23 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 71



ॐॐॐॐॐ


*కన్నీటి విలువ*



ఆనందంలో ఉన్నా వస్తాయి కన్నీళ్ళు
దుఃఖం లో ఉన్నా వస్తాయీ ఆ నీళ్ళు
ఆనందపు కన్నీళ్ళకు కారణమైతే మంచిది
ఎదుటివారి దుఃఖపు కన్నీళ్ళకు వద్దు వద్దు
మాట్లాడే మాట వల్ల నువు చేసే పనుల వల్ల
ఎదుటి వ్యక్తి లోన సంతోషం రాకున్న గాని
దుఃఖపు కన్నీళ్ళను అసలే రానివ్వకు నీవు
ఇదే మనిషి జీవితంలో ఆచరించి చూపాలి
72
[28/08, 7:09 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 72



ॐॐॐॐॐ


*నైతిక విలువలు*


నైతిక విలువల పతనమె నేటి ఈ దుస్థితి
బంధాలకు విలువలేదు అనుబంధాల ఊసులేదు
కనిపెంచిన వారూ కానరారు ఎదిగాక
తోబుట్టువులూ శతృవులై దూరమైరి
అంతటా ఇమిడిందీ స్వార్థపు వాతావరణం

పరస్పరం ద్వేషము ఈర్ష్యా అసూయలు
ఇతరుల ప్రగతిని చూసీ ఓర్వలేనితనము
అపనమ్మకమూ ఏ పని న చూసినా గానీ
ఎక్కడా కానరావు అనురాగపు బంధములు

ప్రతి మాట లొ అబద్ధం ప్రతీదీ లోభత్వము
నాకేమొస్తుంది అనే ఆలోచన అన్నింటా
ఇదే భావన ప్రతి మనిషి లోన ఉన్న స్థితి ని
తరిమి కొట్టి మనుషులలో పెరగాలి మనుష్యత్వము



ॐॐॐॐॐ


స్వీయ రచన

[28/08, 7:54 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 73



ॐॐॐॐॐ


*కరోనా సంస్కారం*


షేకు హ్యాండులు మరిచి నమస్కారము పెట్టి
ప్రతిక్షణమూ పరిశుభ్రత గురించియె తలపు
రక్షణ కొరకు మాస్కు కట్టుకొను జాగ్రత్తలు
పరిమిత సంఖ్యలొ పండగ ఫంక్షనులు చేస్తు
పెళ్ళిళ్ళు చావులూ తక్కువ సంఖ్యలొ జరిగే
హడావుడులు లేకుండా ఆరోగ్యపు ఆలోచన
ఇమ్యూనిటీ పెంచుకునే ఆహారపు అలవాట్లు
కషాయాలు పాలు పండ్లు వేడినీరు ఆవిరి
ఇదియే కద కరోనా ఇచ్చిన సంస్కారమూ

74
[29/08, 4:37 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 74
*నవరాత్రి సంబరాలు*

వినాయక నవరాత్రులంటె
ఎగిరిలేసె యువకులంత
చందాలు జమ చేయుట
గణపతు లను కూచోబెట్టి

స్కూలు కాలేజీలన్నీ ఎగ్గొట్టి
రోజు అక్కడె ఉంటుంటే
ఇంటోళ్ళ తిట్లు వడీ మళ్ళీ
అక్కడికే పోతూనే ఉంటారు

నిమజ్జనం రోజైతే ఎంతో గొప్పగ
డీజే లు కొత్త డ్రెసులు అలంకరణలు
ధూం ధాం పండగా రోజంతా డ్యాన్సులే
ఎవరిమాట వినరు ఎక్కడా ఆగరు

ఇప్పుడు ఆ సంబరమేదీ
సంతోషాలు ఏవీ
అంతా కరోనా భయం
బిక్కు బిక్కు మంటున్నరు

స్వీయ కవిత
75
[29/08, 4:56 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్
నిర్మల్
సంఖ్య - 75

*జవాను నా హీరో*


అభిమాన హీరోలు ఉంటారు అందరికీ
నాకూ ఒక హీరో ఉన్నాడు గొప్పవాడు
ఊన్న ఊరిని వదిలి కన్నతల్లి వదిలి
దేశంకోసం కాపల కాస్తుంటూ సరిహద్దు లొ

గడ్డకట్టె మంచులోన గన్ పట్టుక పోవాలి
కంటికి రెప్పగ భూమిని రక్షిస్తూ ఉండాలి
తల్లీదండ్రుల ద్యాస భార్యా బిడ్డల యాది
ఎంతా కలిగిన కానీ దేశమే నా సర్వమనుచు

తిండి మీద ద్యాసుండదు
నీటి మీద ద్యాసుండదు
నిద్ర ఆరోగ్యం ఆలోచన లేదు
తల్లి కోసమే తపన నిరంతరం
ॐॐॐॐॐ
75
[29/08, 4:56 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 75 



ॐॐॐॐॐ 


*జవాను నా హీరో*


అభిమాన హీరోలు ఉంటారు అందరికీ 
నాకూ ఒక హీరో ఉన్నాడు గొప్పవాడు 
ఊన్న ఊరిని వదిలి కన్నతల్లి వదిలి 
దేశంకోసం కాపల కాస్తుంటూ సరిహద్దు లొ 

గడ్డకట్టె మంచులోన గన్ పట్టుక పోవాలి 
కంటికి రెప్పగ భూమిని రక్షిస్తూ ఉండాలి 
తల్లీదండ్రుల ద్యాస భార్యా బిడ్డల యాది 
ఎంతా కలిగిన కానీ దేశమే నా సర్వమనుచు 

తిండి మీద ద్యాసుండదు 
నీటి మీద ద్యాసుండదు
నిద్ర ఆరోగ్యం ఆలోచన లేదు 
తల్లి కోసమే తపన నిరంతరం 



ॐॐॐॐॐ

స్వీయ రచన
[30/08, 2:38 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 76 



ॐॐॐॐॐ 


*సైనికా వందనం*

ఏ తల్లికి పుట్టిన బిడ్డలో ఏ ఊరికి చెందిన వారలో 
సరిహద్దులలో రక్షణ కొరకై అర్పణ చేసే వారలు 

ఈ దేశమె నా మాతృభూమి యని 
రక్షించుటయే జన్మ హక్కనీ 
రాత్రింబగళ్ళు పహార కాస్తూ 
సుఖాలనన్నీ త్యజించి వేసి 

శతృ సైనికుల గుండెలలో 
గుబులు పుట్టించు వీరుల్ 
యుద్ధ సమయాన ప్రాణాలే 
లెక్క చేయక ముందుకు దూకి 

జీవితమంతా భారతమాతా రక్షణలోనే సాగాలంటూ 
జీవించే ఓ సైనిక అభివందనము ..


ॐॐॐॐॐ 

స్వీయ రచన
[30/08, 2:38 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 77



ॐॐॐॐॐ


*కార్గీల్ వీరులు*


కరడుగట్టి కారుగీలు కొండలలో అడుగుపెట్టి 
ఆక్రమణలు చేసేందుకు ఉగ్రమూక దాడిచేస్తే 
మూడూ రంగుల జెండా కవమానం జరగద్దని 
తుపాకి పట్టీ శతృల చెండాడగ ముందుకురికి 
ఎదురుగ వచ్చె తుపాకి గుండ్లు లెక్క చేయకుండ 
ప్రాణం పోయినగానీ దేశమాత రక్షణయే 
జీవన పరమార్థమంటు జంగులోన దుమికారు 
పరమవీరచక్ర లై నేలకొరిగి అమరులైరి
కార్గీలు వీరులార అందుకోండి వందనములు 
ఏమిచ్చిన మీ ఋణం తీర్చుకోలేము మేము



ॐॐॐॐॐ 


స్వీయ రచన
[30/08, 8:38 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 78 



ॐॐॐॐॐ 


*ప్రకృతి మాత* 


గలగల పారే సేలయేళ్ళు 
ప్రవహించే ఆ జీవ నదములు 
నీడ నిచ్చు ఆ చల్లని చెట్లు 
వర్షాన్నిచ్చే వృక్షరాజములు 
ఇంటి ముందు ఆ తులసీమాత 
పాడినిచ్చును  ఆ గోమాతలు 
రివ్వున వీచే చల్లని గాలులు 
మలయమారుతపు హోయలు 
సహనరూపి ఆ తల్లి భూమియే
సర్వము ఇచ్చును మానవాళికీ 
జ్ఞానమిచ్చును వేదమాతయై
కర్తవ్య బోధ యై గీతా మాత 
అంతా కలిసీ ప్రకృతి మాత 
ప్రకృతినీ పూజించే కంటే 
కాపాడటమే అత్యవసరము 



ॐॐॐॐॐ 


స్వీయ రచన
[02/09, 3:41 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 79



ॐॐॐॐॐ 


*గోవు మన తల్లి* 


పాడి పంటలు ఇచ్చి 
పసిడి పైరులు ఇచ్చి 
భోగ భాగ్యాలిచ్చును 
గోమాత మన కల్పవల్లి 

తనను నమ్మిన రైతును 
కష్టము తొ పోషించి 
తారా స్థాయికి చేర్చ 
జీవితాన కష్టపడును గోవు 

ఎండుగడ్డేసిన పచ్చిగడ్డేసిన 
మురిసిపోయి పాలనిచ్చు ఆవు
కట్టివేసి కుడితినీళ్ళు పోసినగాని
కోపమును చూపదూ రైతుపైనా 

ఎండవానల పనులు చేయును 
అలసిపోక కష్టపడును గోవు 
ఎన్ని జన్మల పుణ్య ఫలమో 
ఇంటి లో గోమాత యుండుట 

ఆరోగ్యము ఆనందమిచ్చును 
రైతు బతుకున శోభనిచ్చును 
తాను చనిపోయినా కూడా 
రైతుకే ఉపయోగమవును 



ॐॐॐॐॐ 


స్వీయ రచన
[02/09, 4:31 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 80



ॐॐॐॐॐ 


*గోవు మన తల్లి* 


పాడి పంటలు ఇచ్చి 
పసిడి పైరులు ఇచ్చి 
భోగ భాగ్యాలిచ్చును 
గోమాత మన కల్పవల్లి 

తనను నమ్మిన రైతును 
కష్టము తొ పోషించి 
తారా స్థాయికి చేర్చ 
జీవితాన కష్టపడును గోవు 

ఎండుగడ్డేసిన పచ్చిగడ్డేసిన 
మురిసిపోయి పాలనిచ్చు ఆవు
కట్టివేసి కుడితినీళ్ళు పోసినగాని
కోపమును చూపదూ రైతుపైనా 

ఎండవానల పనులు చేయును 
అలసిపోక కష్టపడును గోవు 
ఎన్ని జన్మల పుణ్య ఫలమో 
ఇంటి లో గోమాత యుండుట 

ఆరోగ్యము ఆనందమిచ్చును 
రైతు బతుకున శోభనిచ్చును 
తాను చనిపోయినా కూడా 
రైతుకే ఉపయోగమవును 



ॐॐॐॐॐ 


స్వీయ రచన
[02/09, 8:28 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 81



ॐॐॐॐॐ 


*జీవే జీవస్య జీవనం* 


ఎలుకలు పిల్లులకు ఆహారము 
పిల్లులు కుక్కలకు ఆహారము 
ముంగీసకు పాము ఆహారము
పాము కు కప్ప యె ఆహారము
కొంగ కు చేపలు ఆహారము 
పురుగులు బల్లుల కాహారము
సింహాలు పులులకు అడవి 
జంతువులన్నీ ఆహారము 
మేకలు గొర్రెలు కోళ్ళూ 
మనుషుల కు ఆహారము 
ఇలా ఏ జీవి జీవితం చూసినా 
ఒక జీవి మరొక జీవికి ఆహారమే 



ॐॐॐॐॐ 


స్వీయ రచన
[02/09, 8:52 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 82



ॐॐॐॐॐ 


*ఆన్ లైన్ చదువులు* 


నోటుబుక్కు లేదు 
రాసే పెన్ను లేదు 
బ్యాగుల బరువులు లేదు 
టిఫిను బాక్సులు లేవు 
యూనిఫారములు లేవు 
అంతా ఆ....న్  లైన్ 
ఫోను టీవీ లే బడులు 
అవే పాఠాల ఒడులు 
క్లాసురూమ్ లో బోర్డు ముందర 
గొంతు చించుకొని సార్లు చెప్పినా 
అర్థము కానీ ఆ పాఠములన్నీ 
అన్ లైను లో అర్థమగునట 
కానీ తప్పదు కరోన కాలము 
పాఠశాలకూ వెళ్ళక పిల్లలు 
వాడకట్టు లో ఒకటే ఆటలు
ఆగమై తిరుగుతున్నరు వీధిన 
ఆరము లోకి ఎట్లస్తరో అని 
తల్లిదండ్రులు పెద్ద ఆందోళన 



ॐॐॐॐॐ 


స్వీయ రచన
[03/09, 12:56 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 83



ॐॐॐॐॐ 


*చరైవేతి చరైవేతి* 

ఏడు గుర్రాల రథము 
ఎంతో వేగంగా వెళ్తుంది 
అనుకుంటే మన పొరపాటు 
దానికి చక్రం ఒకటే ఉంది 
ఇది ఏమి రథము అనుకుంటే 
అది సూర్యుని రథము 
ఒకే చక్రంతో ప్రయాణమైనా 
సారథి చాకచక్యంతో ఉన్నాడేమో 
అందుకే రథం నడుస్తుంది 
అనుకుంటే మళ్ళీ పొరపాటు 
ఆ సారథి కి కళ్ళు లేవట!
అయ్యోపాపం సానుభూతి తో 
పనిచేసే సమయం తక్కువేమో 
అనుకుంటే మరొక పొరపాటు 
ఆ రథానికి రోజూ పనియే 
నిరంతరం పనిచేస్తూ ఉంటూ 
లోకాలకు వెలుగులు ఇస్తూ 
చరైవేతి చరైవేతి మంత్రము తో 
ఆగకుండ అలసిపోక సాగడమే 
ఆదర్శ తంత్రమూ మానవాళికి




ॐॐॐॐॐ 


స్వీయ రచన
[03/09, 12:56 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 84



ॐॐॐॐॐ 


*సుందర కాశ్మీరం* 

అందాల కాశ్మీరము  సుందర వనమూ 
కనువిందు ను కలిగించే నందన వనమూ 
భారతదేశానికీ తలయై యుండెను 
కనువిందు చేయునూ పర్యాటకులకు 
నోరూరించే తియ్యని ఆపిల్ పళ్ళూ 
బల బుద్ధులు ఇచ్చే కడు ఖర్జూరాలు 
ఎత్తైన కొండలూ లోతైన లోయల హోయలు 
వృక్షాలూ వనాలు చక్కని కుంకుమ పూలు 
మణి కిరీటమై వెలుగును హిమగిరి శిఖరం 
జమ్మూ మరియు కాశ్మీరము వేరు 
కొండలపై ఉన్న లే లద్దాకు  వేరూ 
అందాలను ఒలికించే సుందరీ మణులు 
దేవభూమి గా వెలిగెను సుందర కాశ్మీరం



ॐॐॐॐॐ 


స్వీయ రచన
[03/09, 10:03 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 85



ॐॐॐॐॐ 


*ప్రణబ్ దా* 

గంభీరమైన రూపంతో 
గగనము తాకెడి వ్యక్తిత్వం 
దేశపు ప్రతి విషయము లో 
ఒక సమగ్రమైన అవగాహన 
నచ్చిన విషయాలను చక్కగా 
వృద్ది చేసే గొప్ప ఆలోచన 
నచ్చని విషయాన్ని సైతం 
సూటిగా చెప్పే సాహసము 
తలవంచని మనస్తత్వం 
తన మౌనమె సమాధానం
ఎంత ఎత్తు ఎదిగిన కానీ 
ఒదిగి ఉండే మహా మనీషి 
రాజకీయ చతురత తెలిసిన 
భీష్మ ద్రోణుల సమాన నైజం 
ఉన్నత పదవిలొ ఉన్నప్పటికీ 
సామాన్యమైన వ్యక్తిత్వం కలిగి 
అజాత శత్రువు గా జీవించిన 
అందుకొండి వదనం ప్రణబ్ దా


ॐॐॐॐॐ 


స్వీయ రచన
[04/09, 12:26 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 86



ॐॐॐॐॐ 


*అక్షయ ఆలోచనలు* 

 
నా హృదయ ఆలోచన 
నీ హృదయానికి తెలిసిందా
నా మనసులోని భావాలు 
నీ మనసును తట్టుతున్నాయా 
నా లోపలి గుండె తడి 
నీ గుండె లోతులోకి వెళ్ళిందా 
నా ఆలోచన లోని స్ఫురణ 
నీ ఆలోచన లో కలిగిందా 
నా హృదయ స్పందన లో 
నీ అక్షయ మైన ఆలోచన లే 



ॐॐॐॐॐ 



స్వీయ రచన
[04/09, 12:36 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 87



ॐॐॐॐॐ 


*పల్లె తల్లి* 

 
పల్లె ప్రజల జీవనమే పసందు 
కల్లా కపటము లేనీ ప్రజలు 
గుండె నిండుగా మాట్లాడే మాటలు 
అన్న అక్క మామ అత్త పిలుపులు 
కులమేదైనా మతమేదైనా 
అప్యాయతలూ అనురాగములూ 
అంతట విరియును పల్లె ప్రజల్లొ 
పండగ లొస్తే సందడి సందడి 
పిండి వంటల ఘుమఘుమలు 
మాంసాహారపు మసాల బిర్యాని 
అందరి ఇండ్లలొ చుట్టాల సందడి 
ఆనందం తో విహార హారము 


ॐॐॐॐॐ 



స్వీయ రచన
[04/09, 1:25 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 88



ॐॐॐॐॐ 



*టీవీ సీరియల్స్* 


అన్నా దమ్ముల గొడవలు ఒక సీరియల్ చూపిస్తే 
అత్తా కోడళ్ళ గూర్చి గుచ్చి గుచ్చి వివరిస్తే 
తోడి కోడళ్ళంతా గొడవలెట్ల చేయాలో 
హత్య ఎలా చేయాలో వివరించీ చెప్తుంటే 
అత్యాచారాన్ని బాగ మళ్ళి మళ్ళి చూపిస్తూ 
పరస్పరం మనస్పర్థలు గొడవలు కొట్లాటలు 
ఈ టీవీ మీ టీవి ఏ టీవీ చూసినన్న 
అదే ద్యాస తో ప్రచార పర్వాలూ సాగిస్తే 
ఇంట్లోని ఆడవాళ్ళ సీరియల్ల గోల ఇది 
చక్రవాకము కాణిపాకము మనసూ మమత 
కార్తీక దీపము అత్తారింటికి దారేది 
ఏ పేరు పెట్టినా అదే గొడవ ఎటు చూసిన 
ఆఫీసులొ అలసి పోయి ఇంటికొచ్చు భర్తకు 
అన్నము పెట్టే ధ్యాస ఏ భార్య కు ఉంది నేడు 
ఆకలితో అలమటించి అన్నం అని అడిగె భర్త 
గీ సీరియలు అయిపోనీ తర్వాత పెడ్తానని 
రాత్రి పది అయ్యేదాక టీవి ముందు కూర్చున్నది 
ఏమీ మాయలు చేసే మన కలరూ టీవీలు 
ఇంట్లో కయ్యం బెట్టే మాయదారి టీవీలు 



ॐॐॐॐॐ 



స్వీయ రచన
[04/09, 8:42 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 89



ॐॐॐॐॐ 



*సంగీత ధ్వనులు*


ఘల్లు ఘల్లు మని అందెల చప్పుడు 
వెలికి పెట్టిన వెండి ఉంగరములు 
వడ్యాణముల వయ్యారములూ 
చేతికి వేసిన బంగారు గాజులు 
వంకీలు హోయలు పెంపొందించగ 
మెడలో వేసిన వారాల నగలూ 
చెవుల కమ్మలూ చెల్లున మెరువగ 
ముక్కెర ముక్కున అందము పెంచగ 
పాపిడి బిళ్ళ మెరిసెను నుదురుపై 
జడ పై పెట్టిన వంకదండ తో 
వయ్యారముగా నడిచే నిను గని 
నాలో మ్రోగెను 'సంగీత' ధ్వనులు 



ॐॐॐॐॐ 



స్వీయ రచన
[04/09, 9:32 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 90



ॐॐॐॐॐ 



**


ఉపాద్యాయ స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగి 
బడికెల్లే స్థాయి నుండి రాష్ట్రపతి భవనానికి 
ఎదిగినట్టి సర్వేపల్లి జన్మదినమె పండుగగా 
ఉపాద్యాయ దినోత్సవం జరుపుకునే శుభతరుణం 
ఏ వృత్తి లోకి వెళ్ళాలన్న ఉపాద్యాయుడవసరం 
ఓనమాలు నేర్పించీ ఒక స్థాయికి నడిపించే 
ఉన్న స్థితి లో నుండి ఉన్నత స్థితి లోకి చేర్చి 
శిష్యుని విజయం లోనే తన విజయం చూసుకొంటు 
తన స్వంత పిల్లల సాధన ఇది అనుకొంటూ 
జీవితమంతా తపస్సు చేసే ఉపాద్యాయులారా 
శుభాకాంక్షలందు కోండి ఈ శుభ సమయాన 



ॐॐॐॐॐ 



స్వీయ రచన
[06/09, 1:18 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 91



ॐॐॐॐॐ 



*నిర్వికల్ప 'సమాధి'*


నేను రోజు ప్రయత్నం చేస్తున్నాను 
సమాధి లోకి వెళ్ళాలని 
కానీ అసలే కుదరడం లేదు ఎందుకనో
మరి నేను వెళ్ళలేనేమో 
రోజూ సమయం కేటాయిస్తున్నాను 
అయినా వెళ్ళలేక పోతున్నాను 
ఏవేవో ఆలోచనలు ఏవేవో ఆశయాలు 
సమాధి కి చేరకుండా ఆపుతున్నాయి 
ఆలోచన లను నియంత్రించి ఆశయాల ధ్యాసలేక 
అంతిమ గమ్య సమాధి ని నేను చేరుకోగలనా? 
ఎంత ప్రయత్నించినా ధ్యానం కుదరడం లేదు 
నా ప్రారబ్ద కర్మలు నన్ను వెంటాడుతున్నాయేమో 
నా మనసు చంచలమైతున్నది 
గాలి లేని చోట పెట్టిన దీపం లాగా 
నిశ్చలమైన మనసు నేనెప్పుడు పొందుతానో 
ఆ నిర్వికల్ప సమాధి ని నే నెప్పుడు చేరుతానో




ॐॐॐॐॐ 



స్వీయ రచన
[06/09, 4:19 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 92



ॐॐॐॐॐ 



*మాట విలువ*


కత్తి కంటే పదునైనది నాలుక 
కత్తి వస్తువులను కోస్తుంది 
ప్రాణులకు గాయాలను చేస్తుంది 
ప్రాణులను చంపుతుంది కూడా 
శరీరంలో నాలుక మెత్తనైనది 
నాలుక మనసుకు గాయం చేస్తుంది 
మనసులను చంపేస్తుంది కూడా 
అందుకనే అంటారు నరంలేని నాలుక అని 
నాలుక కేవలం మాట్లాడుతుంది 
నాలుక మాటలు ఆడుతుంది 
ఆ మాటల తోనే అంతా జరుగుతుంది 
మాట నోటి నుండి బయటకు 
రానంత వరకు దానికి అధిపతివి 
నోటి నుండి బయటకు వచ్చాక 
ఆ మాట కి నువ్వు బానిసవి 



ॐॐॐॐॐ 


స్వీయ రచన
[06/09, 8:55 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 93



ॐॐॐॐॐ 



*ఆదర్శ జీవితాలు*


తన జన్మ స్థానాన్ని వంశాన్నీ వదిలితేనే మురళీ మధుర గానం పలుకుతుంది 
శిల్పి ఉలి దెబ్బలు తట్టుకొని నిలబడితేనే శిల శిల్పమై పూజలందుకొంటుంది 
జీవితమంతా కష్టాలకు ఇబ్బందులకు తట్టుకొని రాముడు దేవుడయ్యాడు 
జీవితమంతా కష్టాల కడలిలో గడిపాడు కాబట్టే అయ్యాడు కృష్ణం వందే జగద్గురుమ్
అనేక అడ్డంకులు దాటాకనే పాండవులు ఆదర్శ పురుషులుగా కీర్తించబడ్డారు 
ఇలా ఏ మహాపురుషుని జీవనం చూసినా కష్టాలు కన్నీళ్ళు తప్పనిసరి 
అందుకే 
నీకు కష్టం ఇబ్బంది వచ్చాయని కృంగిపోకు నేస్తమా 
అవి రేపటి తరాలకు నిన్ను ఆదర్శంగా చూపడానికే వచ్చాయేమో ...




ॐॐॐॐॐ 


స్వీయ రచన
[06/09, 9:24 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం ( శ్రీ భారతి ) 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 94



ॐॐॐॐॐ 



*సరస్వతీ నామాలు*


పుస్తకము వీణ ను ధరియించీ 
సరస్వతీ యే దర్శనమివ్వగ 
హంస వాహనం అధిరోహించి 
విద్యా దానము నాకు ఇవ్వుము

*భారతి* నామమె ప్రథమము 

రెండవదీ ఆ *సరస్వతీ* గా

*శారదా దేవి* యై మూడున 

నాల్గవ నామం *హంసవాహిణీ*

ఐదవ నామం *జగదీఖ్యాతా* 

ఆరవదీ ఆ *వాణీశ్వరి* యై 

ఏడవ నామము *కౌమారీ* గా 

ఎనిమిది న *బ్రహ్మచారిణీ* గా

తొమ్మిదవదియే *బుద్ధి ధాత్రి* గా 

పదవ నామమే *వరదాయినీ* గా 

*క్షుద్రగంట* పదకొండవ నామము

పన్నెండవదీ *భువనేశ్వరి* యే 

బ్రహ్మీ ద్వాదశ నామాలు ఇవి 
మూడు సంధ్యలలొ తప్పక పఠిస్తె 
పరమేశ్వరి యె ప్రసన్నమగును 
సర్వ సిద్ధులు ఒసగును నీకు 
బ్రహ్మరూపిణీ సరస్వతీ యే 
వసించును నీ జిహ్వాగ్రమున



ॐॐॐॐॐ 


స్వీయ రచన
( సరస్వతీ ద్వా దశ నామాలు సంస్కృత స్తోత్రానికి తెలుగు అనువాదం ) 
*శ్రీ జ్ఞాన సరస్వతీ చరణారవిందార్పణమస్తు*
[08/09, 9:56 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం (శ్రీ భారతి)
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 96



ॐॐॐॐॐ


*విడిపోని బంధం*


ఎప్పుడూ ఏదో కొట్లాట 
చిన్న మాట కే అలక 
ఇలా ఎందుకన్నారని 
ఎగా దిగా వాయింపు 

ఇంతలోనే బాగున్నారా 
అని ప్రేమతో పలకరింపు 
కోపంతో మాట్లాడకపోతే 
బతిమాలి బుజ్జగింపులు 

ఇంకా మాట్లాడక పోతే 
ఎంతో అనునయింపులూ 
ఎలాగైనా మాట్లాడించుకొని 
గెలుపు నాదే అను ధీమా 

నేను ఆన్ లైన్ లో ఉంటే 
ఎవతోనో చాటింగని ధ్యాస 
ఉండబట్టలేక అడిగేసి 
ఏమీ లేదంటే అనుమానం 

నిరంతరం నీ ధ్యాస లో నేను 
అణుక్షణం నా ధ్యాస లో నీవు 
భగవంతుడు కలిపిన బంధము 
విడిపోకుండా కాపాడుకుందాం



ॐॐॐॐॐ 


స్వీయ రచన
[08/09, 10:18 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం (శ్రీ భారతి)
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 95



ॐॐॐॐॐ


*మూడో ప్రపంచ యుద్ధం*


ప్రపంచమంతా యుద్ధం  జరుగుతున్నది
మూడో ప్రపంచ యుద్ధమా అన్నట్టున్నది
కత్తులు కటార్లు అస్త్రశస్త్రాలూ లేనేలేవు
కనిపించని శత్రువుతో కలవడు తున్న యుద్ధం

పోలీసులు డాక్టర్లు ఆరోగ్య సిబ్బంది వారు
పారిశుద్ధ్య కార్మికులంతా ప్రత్యక్ష సైనికులు
ప్రజలను ఇళ్లలో క్షేమంగా ఉండమని చెప్పి
ఇల్లు విడిచిపోరాడుతున్న దైవాలు వారు

ఇండ్లలోని ప్రజలు ఉన్నదేదో తింటూ
కాలక్షేపం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు
రైలు బోగీలోని ప్రయాణికుల లాగా
గమ్యం తెలియని ప్రయాణం విజయంవైపు

భయం గొలిపిస్తున్న బయోవార్ ఇది
పక్క ఊర్లో వస్తున్న పాజిటివ్ కేసులు విని
ఇంట్లో భయంతో ఉలిక్కి పడుతున్న ప్రజలు
ఇంట్లో ఉంటే క్షేమంబయటకు వెళితే మరణం

ఎప్పుడు ఏమౌతుందో అర్థం కాని పరిస్థితులు
ఏం చేయమంటారో తెలియని సందర్భాలు
కనిపించని దేవుణ్ణి కనిపించని వైరస్ నీ తలుస్తూ
బిక్కుబిక్కుమంటున్న ప్రజలు కుచ్ కరోనా అంటున్నారు


ॐॐॐॐॐ 


స్వీయ రచన
[08/09, 1:11 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం (శ్రీ భారతి)
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 97 



ॐॐॐॐॐ


*అక్షరము* 



నాశనము కానిది అక్షరము 
నాశనం లేనిది అక్షరము 
జీవితానికి వెలుగు నింపేది 
జీవితాన్ని నడిపించేది 
ఏ వృత్తి లో రాణించాలన్నా 
కొంత అక్షరాస్యత ఉండాలి 
ఉద్యోగం కోసం చదవడం కాదు 
జ్ఞాన సముపార్జన కోసం చదవాలి 
లక్ష్య సాధన కోసం ప్రయాణం 
అక్షరాస్యత తోనే సుగమము 
అక్షరాలు నేర్చుకోవడమంటే 
ఇల్లు దిద్దు కోవడం అని అర్థం 




ॐॐॐॐॐ 


స్వీయ రచన
[08/09, 4:37 PM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం (శ్రీ భారతి)
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 98



ॐॐॐॐॐ


*తెలంగాణ భాష* 


తెలంగాణ యాస లోన శాస్త్రీయత దాగి ఉంది 
మనసు విప్పి మాట్లాడే మధురమైన ధ్యాస ఉంది 
రాండ్రి పోండ్రి అని పిలిచే గౌరవమౌ మాట ఉంది 
రావే పోవే అని పిలిచే  అనునయపు సొబగు ఉంది 
ఎమే అని పిలిచి నీ వాడిని అని తెలిపే ప్రేమ ఉన్నది 
ఏమోయ్ రావోయ్ అని అని పిలిచే పిలుపుతో ఆప్యాయత 
మనసునిండా మాట్లాడితే కడుపు నిండినట్లయితది 
కయ్యం బెట్టుకునే తిట్ల లో కూడా మన యాస ప్రత్యేకత 
పరస్పరం అనురాగం ప్రేమ ఆప్యాయతల మన యాస 
కల్లా కపటం ఏమి ఎరుగనీ పనిమంతులు మన భాష లోనే 
సామెతలు మరి జాతీయాలు 
ఎంతో చక్కని నుడికారాలు 
ఇంత చక్కనీ మన ఈ యాసను 
విలన్ల భాష గ చిత్రించడమూ ఎంత విచిత్రం కాదా విడ్డూరం 



ॐॐॐॐॐ 
( తెలంగాణ భాష దినోత్సవం సందర్భంగా )

స్వీయ రచన
[09/09, 5:17 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 99 



ॐॐॐॐॐ


*కాళోజీ గొడవ*


తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కు 
మన భాషన్నా యాసన్నా గౌరవమ్ము ఉండాలే 
అని చెప్పుచు కాళోజీ ఎందరినో మేలుకొలిపె 
దేశ భక్తి రాజ్యభక్తి అందరికీ ఉండాలని
ఈ గొడవ యె నా గొడవ ని ప్రజలను మేల్కొల్పుతూ
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళు కదిలిస్తుందని 
తెలంగాణ పల్లె ప్రజల గుండె కోతలెన్నొ చూసి 
ప్రజలను మేల్కొల్పేందుకు కలం పట్టి కవితలల్లి 
బడుగుల బలహీనుల మార్గదర్శి అయినాడు 
అన్య భాషలు నేర్చి ఆంద్రంబు రాదంచు సకిలించు ఆంద్రుడా చావవెందుకు రా అన్నాడు 
ఎన్నికల్లొ పోటి చేసె అభ్యర్థి ఏ పార్టి వాడో కాదు ఏ పాటి వాడో చూడాలన్నాడు మన కాళోజి 
ఈ కాళోజీ గొడవ యే మన గొడవ గ మలచు కొంటు 
చూపిన మార్గంలో మన గమనం కొనసాగిస్తే 
భాషాభిమానం మన యద యద లో రగులుతుంటె
పేదల బ్రతుకులలో నూత్న  చిరునవ్వులు చిందించును 
మన తల్లీ 'శ్రీ భారతి' బంగరు కాంతి పంచు ప్రపంచాన 



ॐॐॐॐॐ


స్వీయ రచన
[09/09, 5:17 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం  ( శ్రీ భారతి )
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 100



ॐॐॐॐॐ


*ఋషి ని నేను*


ఉషస్సు కోసం తపస్సు చేస్తున్న ఋషి ని నేను 
మానవత్వాన్ని వెతుకుతున్న మనిషి ని నేను 
మత విద్వేషాలను రూపమాపడానికై 
అద్వైతాన్నందించిన ఆది శంకరున్ని నేను 
కుల మనే పిచ్చి రక్కసిని కూలదోయడానికి 
కక్క డికి జ్ఞాన బోధ చేసిన వీరబ్రహ్మం నేను 
ఆడదాన్ని అంగడి బొమ్మ గా చూస్తున్న యువత కు 
అమ్మతనాన్ని గుర్తుచేసే అపర వివేకున్ని నేను 
నాదీ నాదీ యని పాకులాడుతున్న ప్రజావళి కి 
అంతా మిథ్య యని తెలిపే తత్వాన్ని నేను 
నిరాశలో మ్రగ్గుతున్న  యువతకు స్ఫూర్తి గా 
ఎగసి పడి మళ్ళీ లేస్తున్న కెరటాన్ని నేను 
జీవన్మరణ చట్రం నుండి పరమాత్మ లో కలిసేందుకు 
పాకులాడుతున్న సర్వభూత ఆత్మ ను నేను 
అవును ఆత్మ ను ఆ పరమాత్మ నూ నేనే ...
ఉషస్సు కోసం తపస్సు చేస్తున్న ఋషి ని నేను 



ॐॐॐॐॐ


స్వీయ రచన
99
[09/09, 5:17 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం 
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 99 



ॐॐॐॐॐ


*కాళోజీ గొడవ*


తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కు 
మన భాషన్నా యాసన్నా గౌరవమ్ము ఉండాలే 
అని చెప్పుచు కాళోజీ ఎందరినో మేలుకొలిపె 
దేశ భక్తి రాజ్యభక్తి అందరికీ ఉండాలని
ఈ గొడవ యె నా గొడవ ని ప్రజలను మేల్కొల్పుతూ
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళు కదిలిస్తుందని 
తెలంగాణ పల్లె ప్రజల గుండె కోతలెన్నొ చూసి 
ప్రజలను మేల్కొల్పేందుకు కలం పట్టి కవితలల్లి 
బడుగుల బలహీనుల మార్గదర్శి అయినాడు 
అన్య భాషలు నేర్చి ఆంద్రంబు రాదంచు సకిలించు ఆంద్రుడా చావవెందుకు రా అన్నాడు 
ఎన్నికల్లొ పోటి చేసె అభ్యర్థి ఏ పార్టి వాడో కాదు ఏ పాటి వాడో చూడాలన్నాడు మన కాళోజి 
ఈ కాళోజీ గొడవ యే మన గొడవ గ మలచు కొంటు 
చూపిన మార్గంలో మన గమనం కొనసాగిస్తే 
భాషాభిమానం మన యద యద లో రగులుతుంటె
పేదల బ్రతుకులలో నూత్న  చిరునవ్వులు చిందించును 
మన తల్లీ 'శ్రీ భారతి' బంగరు కాంతి పంచు ప్రపంచాన 



ॐॐॐॐॐ


స్వీయ రచన
[09/09, 5:18 AM] Mutyam Sir Basara KS 41: *వీరాస్ కవి సమయం*
ఉల్లెంగ ముత్యం  ( శ్రీ భారతి )
రాంపూర్ 
నిర్మల్ 
సంఖ్య - 100



ॐॐॐॐॐ


*ఋషి ని నేను*


ఉషస్సు కోసం తపస్సు చేస్తున్న ఋషి ని నేను 
మానవత్వాన్ని వెతుకుతున్న మనిషి ని నేను 
మత విద్వేషాలను రూపమాపడానికై 
అద్వైతాన్నందించిన ఆది శంకరున్ని నేను 
కుల మనే పిచ్చి రక్కసిని కూలదోయడానికి 
కక్క డికి జ్ఞాన బోధ చేసిన వీరబ్రహ్మం నేను 
ఆడదాన్ని అంగడి బొమ్మ గా చూస్తున్న యువత కు 
అమ్మతనాన్ని గుర్తుచేసే అపర వివేకున్ని నేను 
నాదీ నాదీ యని పాకులాడుతున్న ప్రజావళి కి 
అంతా మిథ్య యని తెలిపే తత్వాన్ని నేను 
నిరాశలో మ్రగ్గుతున్న  యువతకు స్ఫూర్తి గా 
ఎగసి పడి మళ్ళీ లేస్తున్న కెరటాన్ని నేను 
జీవన్మరణ చట్రం నుండి పరమాత్మ లో కలిసేందుకు 
పాకులాడుతున్న సర్వభూత ఆత్మ ను నేను 
అవును ఆత్మ ను ఆ పరమాత్మ నూ నేనే ...
ఉషస్సు కోసం తపస్సు చేస్తున్న ఋషి ని నేను 



ॐॐॐॐॐ


స్వీయ రచన
[09/09, 5:30 AM] Mutyam Sir Basara KS 41: నమస్కారం 
తెలంగాణ భాష దినోత్సవం నాడే 100 కవితలు పూర్తి చేయాలనే నా సంకల్పానికి సహకరించిన మాన్యులు శ్రీ వీరా గుడిపల్లి గారికి , గౌరవనీయులు శ్రీమతి లలితాకృష్ణ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు ...
సమూహ సభ్యులందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు ...
            మీ 
         ముత్యం.
[09/09, 6:12 AM] Mutyam Sir Basara KS 41: నేటి తో ఈ సమూహం లో *నా గొడవ*  పూర్తి ...

స్వీయ రచన





Comments

Popular posts from this blog

తిరు వేంకటాచార్యులు KS 6

బాటసారి KS 12

అనామికా శతకం విట్టుబాబు గారు