ప్రశాంత కవిత్వం
********************
కవయిత్రి పేరు ః ప్రశాంత చిలుక
తండ్రి పేరు: సుదర్శనం చిలుక
జిల్లా : కామారెడ్డి
*************
1
వీరాస్ కవి సమయం
తేదీ:15.07.2020
కవి సంఖ్య:31
కవిత సంఖ్య:01
కవి: ప్రశాంత. చిలుక
శీర్షిక: అమ్మ
నా
కళ్ళలో వెలుగు అమ్మ,
తనువులో ప్రాణం అమ్మ,
రూపానికి చిరునామా అమ్మ,
ఆలోచనకి ఆచరణ అమ్మ,
బాధలో లాలన అమ్మ,
సంతోషంలో చిరునవ్వు అమ్మ,
భవిష్యత్తుకి బలం అమ్మ,
నా జీవితానికి అర్థం- పరమార్థం అమ్మ.
2
వీరాస్ కవి సమయం
తేది:15.07.2020
కవి సంఖ్య:31
కవిత సంఖ్య:2
కవి: ప్రశాంత. చిలుక
శీర్షిక: నేను- నా నేస్తం
నీ కళ్ళలో నేనాశించే వెలుగుంది,
నీ ఆలోచనల్లో నా గమ్యం దాగుంది,
నీ మనసులో నా ఆశయం కదలాడుతుంది,
ఉంటావా మరీ! నాతో కలకాలం తోడుగా,
చాటుదామా! తల్లిదండ్రుల ఉనికిని ఈ లోకానికి,
నిరూపిద్దామా! మనలోనూ చైతన్యం దాగుందని ఈ జనాలకి,
సాధిద్దామా!స్వార్థమే లేని సమైక్యతా సమాజాన్ని,
మర్చివేద్ధామా! రంగుల హరవిల్లులా ఈ లోకాన్ని,
పూఇద్దామా! చిరునవ్వుల పూవుల్ని ఈ సమాజంలో,
తీసుకెళ్దామా! ఈ లోకాన్ని ఆనంద లోకపు అంచులదాకా.....
3
[24/07, 8:45 PM] Prashanta Chilika KS 31: వీరాస్ కవి సమయం
తేదీ:16.07.2020
కవి సంఖ్య:31
కవిత సంఖ్య:03
శీర్షిక: స్నేహం
ఎడారిలో వసంతంలా
పెదవులపై చెరగని చిరునవ్వులా
చీకటిలో పున్నమి వెన్నెలలా
బంధువు కాని బంధువులా ఉండేదే స్నేహం...
4
[24/07, 8:45 PM] Prashanta Chilika KS 31: వీరాస్ కవి సమయం
తేదీ:16.07.2020
కవి సంఖ్య:31
కవిత సంఖ్య:04
కవి పేరు: ప్రశాంత.చిలుక
శీర్షిక: పిల్లలు-బోసినవ్వులు
బాలలు,
బోసినవ్వుల బాలలు
కల్లాకపటం లేని బాలలు
చిందిస్తారు చిరునవ్వులు- అందిస్తారు ఆనందం, ఆహ్లాదం
వేస్తారు తప్పటడుగులు- నడవాలన్న తపనతో
అంటారు అత్త, అత్తా అని-మాట్లాడలన్న ఆరాటంతో
ఎదుగుతుంటారు దశలలో- పున్నమి చంద్రునివలె
సాధిస్తారు ప్రతీదీ- సాధించాలన్న కసితో.... బాలలు వీళ్ళు బోసినవ్వుల బాలలు.
5
వీరాస్ కవి సమయం
తేదీ:24.07.2020
కవి సంఖ్య:31
కవి పేరు: ప్రశాంత చిలుక
కవిత సంఖ్య: 5
శీర్షిక: ప్రేమ
భౌతికంగా బహు తిక్కగా పరిచయమై, రసాయనశాస్త్రంలోని పరమనువులా మొదలై,
గణితశాస్త్రంలోని అనంతంలా నిలిచిపోయేదే ప్రేమ,
మనసులోని పవిత్రమైన ప్రేమ.....
6
వీరాస్ కవి సమయం
తేదీ:24.07.2020
కవి సంఖ్య: 31
కవి పేరు: ప్రశాంత చిలుక
కవిత సంఖ్య: 06
శీర్షిక: నా దేశం
నీ రూపమే సుందరం,
నీలోని భిన్నత్వంలో ఏకత్వం మధురం,
నీలో మనుషుల మనసులు బహు సుందరం,
నీలోని ప్రతీ అంశం అత్యద్భుతం,
నీలో జన్మించిన నా జన్మ ధన్యం...
7
వీరాస్ కవి సమయం
తేదీ:24.07.2020
కవి సంఖ్య: 31
కవి పేరు: ప్రశాంత చిలుక
కవిత సంఖ్య:07
శీర్షిక:
స్నేహపు వెలుగులు
➖➖➖➖➖➖
హృదయమనే గదిలో
స్నేహమనే తైలంతో
కలకాలం వెలుగుతుందీ స్నేహ దీపం
ఏనాటికీ నిండుకొదీ హ్రదయ దీపం
తెలియాడుతుంది, ఆకాశ మార్గాన స్వేచ్చా విహంగంలా
పంచుతుంది స్నేహపు వెలుగులు ఈ లోకానికంతా......
08
వీరాస్ కవి సమయం
తేదీ:25.07.2020
కవి సంఖ్య:31
కవి పేరు: ప్రశాంత చిలుక
కవిత సంఖ్య:08
అంశం:
స్నేహితురాలి వివాహం
శీర్షిక:
రాజు- సుధామృతం
♾️♾️♾️♾️♾️♾️
నీ కంటి పాపలా- గుండె సవ్వడిలా
నీ ఇంటి దీపంలా- ముంగిట్లో ముగ్గులా
నీ హృదయ సామ్రాజ్యపు పట్టపు రాణిలా
కలకాలం నా సుధ నీ ఇంటి సుధా రాణిలా
నీలాకాశంలో స్వైరవిహారం చేసే ప్రేమపావురాల్లా
కలిమి- లేమి, కష్ట- సుఖాల వేటలో చిలకా-గోరింకల్లా
ఆత్మీయత- అనురాగాలు కలబోసిన ప్రేమమృతంలా
మీ వివాహ బంధం నూరేళ్ళ రాజు- సుధామృతంలా సాగిపోవాలి...
9
వీరాస్ కవి సమయం
తేదీ:25.07.2020
కవి సంఖ్య:31
కవి పేరు: ప్రశాంత చిలుక
కవిత సంఖ్య:09
శీర్షిక: నేటి మనిషి
➖➖➖➖➖➖
ప్రకృతికి అందం పక్షులు
ప్రాణవాయువు దాతలు వృక్షాలు
వరణుడనే వరాన్నిచ్చే దైవాలు అడవులు
వీటిని తరగింపజేస్తున్న నేటి మనిషికి
రేపటి మనుగడ సాధ్యమా!!
10
వీరాస్ కవి సమయం
తేదీ:26:07:2020
కవి సంఖ్య:31
కవి పేరు: ప్రశాంత చిలుక
కవిత సంఖ్య:10
శీర్షిక: నా కలల ప్రపంచం
➿➿➿➿➿➿
నాది ఓ కలల ప్రపంచం
నాకు నేను అల్లుకున్న ఊహల ప్రపంచం
ఈ ప్రపంచానికి నేనే మహారాణిని
ఆ ప్రపంచంలో ఎన్నో ఆశలు,ఆశయాలు
శ్రమిస్తాను నా ఆశయ సాధనకై
చేరుకుంటాను, ఒక రోజు నా కలల ప్రపంచాన్నీ
ఆ రోజే, నేను ప్రపంచాన్ని జయించినంత గొప్పదన్నావుతాను....
11
వీరాస్ కవి సమయం
తేదీ:26:07:2020
కవి సంఖ్య:31
కవి పేరు: ప్రశాంత చిలుక
కవిత సంఖ్య: 11
శీర్షిక: తపన
➖➖➖➖➖➖
శరీరమనే చెరలో
హృదయమనే ముసుగులో
ఓ మనసా ఎప్పుడు తీస్తావు అహంకారమనే తెరలు
ఎప్పుడు చేరుతావు నీ ఆశల సౌధానికి, ఆశయ సౌధానికి
ఎప్పుడు అందిస్తావు నీ వాళ్ళకి ఆనందాన్ని, తృప్తిని...
12
వీరాస్ కవి సమయం
తేదీ:27.07.2020
కవి సంఖ్య:31
కవి పేరు: ప్రశాంత చిలుక
కవిత సంఖ్య:12
శీర్షిక:
బంధాలు- బాంధవ్యాలు
తల్లిదండ్రులకి SUN అయినా, లోకానికి SON కావాలి
తల్లిదండ్రులకి Daughter అయినా, వారి మనసులకి Doctor అవ్వాలి
భార్యకి భర్త Husband గానే కాదు, వాళ్ళ బంధం Chemical bond అవ్వాలి
భర్తకి భార్య Wife గానే కాదు, అతడి lifeకి Safe అవ్వాలి.
13
[28/07, 7:24 PM] Prashanta Chiluka KS 31: వీరాస్ కవి సమయం
తేదీ:28.07.2020
కవి సంఖ్య:31
కవి పేరు:ప్రశాంత చిలుక
కవిత సంఖ్య: 13
శీర్షిక:గమ్యం- గమనం
〰️〰️〰️〰️〰️〰️
జనారణ్యం అనే ఈ సముద్రాన్ని ఈదడానికి
ఓ కాలమా! నాకు ధైర్యం అనే నావనివ్వు,
ఓ విధి! నాకు స్థయిర్యం అనే తెరచాపనివ్వు,
ఓ మనసా! నాకు నాయకత్వం అనే నావికున్నివ్వు,
ఓ తనువా! నే ప్రయాణించడానికి అనుకులతనివ్వు.
14
[28/07, 7:35 PM] Prashanta Chiluka KS 31: వీరాస్ కవి సమయం
తేదీ: 28.07.2020
కవి సంఖ్య:31
కవి పేరు: ప్రశాంత చిలుక
కవిత సంఖ్య:14
శీర్షిక: నీలో నువ్వు
〰️〰️〰️〰️〰️〰️
నీవు సంతోషంగా ఉన్నావంటే అది పరిస్థితుల ప్రభావం,
నీవు నవ్వుతూ ఉన్నావంటే అది నీ ప్రభావం,
నీవు బాధ పడుతున్నావంటే అది నీ మనసు ప్రభావం,
నీవు ఎడుస్తున్నావంటే అది అర్థం కాని నీ ఆలోచన ప్రభావం.
15
18
వీరాస్ కవి సమయం
తేదీ:12:08:2020
కవి సంఖ్య: 31
కవి పేరు: ప్రశాంత చిలుక
కవిత సంఖ్య:18
శీర్షిక:
మా ఆయన బంగారం
➕➕➕➕➕➕
నువ్వు గుర్తొస్తే నా మొహంలో తెలియని సంతోషం
నీకై ఆలోచిస్తే నా మనసులో నాకే అర్థం కాని సంతృప్తి
నువ్వు పక్కనుంటే నన్ను నేను మర్చిపోయేంత ప్రేమ
ఇవన్నీ నీలో నాకెప్పుడూ ఇష్టాలే
నీతో నేను అల్లుకున్న బంధాలే
నాలోని నువ్వు, నీలోని నవ్వు
ఏదయినా భరించే శక్తినిచ్చే బలాలు నాకు
ఇవే నా ఆస్తి, అస్తిత్వం, జీవితం.....

Comments
Post a Comment