కంచి రవికుమార్ poet
నిర్వహణ ః వీరా గుడిపల్లి
కవిరాజ్ పురస్కారం
****************"
కవి పేరు ః కంచి రవికుమార్ గారు
*****"*******"""""
1
వీరాస్ కవి సమయం
కవి పేరు ః కంచి రవికుమార్
జిల్లా ః రంగా రెడ్డి
కవిత సంఖ్యని 1
శీర్షిక ః జనం
12.07.20.
*'జనం'*
నా కవిత్వం-196,
9494345594.
➖👩🏻👦👨🦰👳🏻♂️➖
పురివిప్పిన జనపుష్పమై
వికసించిన
ప్రభంజనమై
ఉబికొచ్చిన
జనమే బలం
బలమే జనం
భారం కాదిది
భాగ్యం
అత్యద్భుత
మానవవనరుల
కేంద్రం
నవయవ్వన
భవిష్యత్ స్థంభాల
నిలయం
సమరశంఖ
సైనిక పటాలాల
శాస్త్ర విజ్ఞాన
పరిశోధనల
సృజన సాఫ్ట్వేరుల
కర్మాగారం
కార్మిక కర్షక
చక్రవర్తుల
ప్రపంచ నాయకత్వాల
దిగ్గజ వ్యాపారాల
కళలు క్రీడాకారుల
ఉత్పాదక కేంద్రం
చరిత్రలు చెక్కుతున్న
శిల్పకారుల
స్థావరమీ జనం.
_-రవికుమార్ కంచి_
🌺🙏.
➖➖✳️➖➖.
[14/07, 6:26 AM] Kanchi Ravi Kumar Poet: 14.7.20.
'వీరాస్ కవిసమయం'
సంఖ్య:02.
శీర్షిక:
*'రాజగృహం'.*
నా కవిత్వం-198,
రవికుమార్ కంచి.
----🏛️----
ఆ నేల
మేధావి అడుగులై
అట్టడుగుల అరణ్యరోదనల
తుడిచే
పోరాట ప్రణాళికలకు
ప్రాణం పోసింది
అవి ఉత్త గోడలు
ఉత్తుత్తి దర్వాజలు కావు
సమాజ సముద్రమును
ఎదురీదిన
కులహింసలకు
ఎదురెళ్ళిన
బాబాసాహెబ్ కు
ఆధారమైనవి
ఆ రాజగృహం
పీడిత ప్రజల
సంకెళ్ళను తెంచే
కాలరాసిన హక్కులు
సాధించే
మేధోమథనం
జరిపింది
అంబేడ్కర్ చారిత్రక
ఉద్యమాలకు
పురుడు పోసింది
ఆయన జ్ఞాపకాల భవనంపై
విధ్వంసమంటే
కులమత అసహనానికి
సాక్ష్యాలు చూపినట్టే
మనువాద రాక్షసత్వం
ఉనికి చాటుకున్నట్టే
అంధకారయుగాలకు దారులు
వేసినట్టే.
_-రవికుమార్ కంచి_
🙏🌸
➖➖➖➖
----------------
హామీ పత్రం
ఇది నా స్వీయరచన.
రవికుమార్ కంచి.
-------------------
[15/07, 6:09 AM] Kanchi Ravi Kumar Poet: 15.7.2020.
వీరాస్ కవిసమయం
సంఖ్య:03.
*'మిగిలిన కాలం'.*
నా కవిత్వం -
1️⃣9️⃣9️⃣,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9594345594.
----⏰----
ఎటు పోయిందో....
తరగని గనిలా
కనిపించింది
ఏమయిందో....
ఆకాశమంత అనంతం అనిపించింది
కాలం కళ్ళముందే కరిగిపోయింది
నాటి లేత మొలకలు మహావృక్షాలు
కానే లేదు
పిల్ల కాలువలు మహా కాలువలై
జన దాహం తీర్చనే లేదు
కాలిబాటలు అభివృద్ధి రహదారులై
ఉరుకుతనే లేవు
ఐతేంది....
కాకుంటేంది.......!?
కాలం పేజీలు
మలుపుతనే ఉంది
బడి పిల్లలు
ఐనిస్టీనులు కలాములు కానే లేదు
బక్క రైతు బండెడు దుఃఖాలు
తీరనే లేదు
విద్యా వైద్య శాస్త్ర సాంకేతిక రంగాలు
పాకురై పట్టిన
సమస్యలకు పరిష్కారాలు
చూపనేలేదు
ఐతేంది...!
చూస్తుండగానే కాలం
హిమ కొండలు
జల ప్రవాహాలై కరిగిపోతున్నయ్
పోతే పోనియ్...
పోయింది అరిచినా రాదు
ఈడ్చుకొద్దామన్నా దొరకదు
మిగిలిన కాలం చాలు ఇంకా మూలుగుతున్న
సమస్యలపై మేధోబాణం
సంధించడానికి
ఇంకా నలుగుతున్న మనసులలో వికాస
మార్గం వేయడానికి
మిగిలిన కాలం చాలు..
దాని పేజీలలో
విజయ సువర్ణాక్షరాలు
లిఖించడానికి.
_-రవికుమార్ కంచి_
🙏🌺
➖⏳👍➖.
[16/07, 5:56 AM] Kanchi Ravi Kumar Poet: 16.07.2020.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:04.
*'ఏం రాసినా'....!?.*
నా కవిత్వం -
2️⃣0️⃣0️⃣,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
.............................
...................✍️
ఏం రాసినా.....
అధికార మదం దిగి నేలపై నడుస్తలేదు,
పట్ట పగలు నక్షత్రాలు చూపడం ఆగలేదు,
అహంకార బావి ఊట బందైతలేదు...!?
ఏం రాసినా.....
అక్షర అంతరంగం బహిర్గతమైతలేదు,
పంజరమున్నా లేకున్నా
చిలుకలు ఎగరడానికి
సంశయిస్తున్నయ్,
అరక వదిలి పురుగుమందుల
నురగల గక్కుడే పంటైతుంది
ఏం రాసినా......
విషకణాలు విషం చిమ్ముతూనే ఉన్నయ్,
బడి గంటలు
మూగ నోములు
మూలకు వ్రతాలు చేస్తున్నయ్,
మానవత ముసుగు తీస్తే
అద్దంలో పులి గానే కనిపిస్తున్నడు,
ఏం రాసినా.....
ఆధిపత్య అంతరాల ముందు
చేతులు ముడుచుకు
పోతున్నయ్,
అక్రమాలు అకృత్యాలు కాదు
ఆస్తులు అవసరాలే సలాం కొడుతున్నయ్,
కలాల కాల్చివేత పిడికిళ్ళ బంధనాలు
ఆగడం లేదు,
అయినా రాస్తా.....!?
ఆలోచింప చేస్తా
చైతన్య జ్యోతులు వెలిగిస్తా
ఒక్కరికో
ప్రతి ఒక్కరికో.....✊
_-రవికుమార్ కంచి_
🙏🌺
➖➖🌞➖➖
[16/07, 11:01 AM] Kanchi Ravi Kumar Poet: 16.7.2020.
వీరాస్ కవిసమయం
సంఖ్య:05.
*'జై కొట్టాల్సిందే'..✊*
నా కవిత్వం -
2️⃣0️⃣1️⃣,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
♾️🌿🌞♾️
మనిషికో.. దేనికో..
పుడమిని చీల్చుకు
అంకురం
మురవాల్సిందే
విశ్వానికో.. దేనికో.. అనంతం అంచుల
రగులుతూ
రవి ఉదయించాల్సిందే
వెలుగుకో.. దేనికో.. అంధకార ఆకసాన్ని
తారలు పొడుచుకు రావాల్సిందే
జీవానికో.. దేనికో..
అనంత అవరోధాల నెదిరిస్తూ
మొక్కలు ఎదగాల్సిందే
బతుకుకో.. దేనికో..
పుట్టెడు దుఃఖ సాగరాలు
కన్నీళ్లు చెమట తెడ్లతో ఈదాల్సిందే
ఆనందానికో.. దేనికో..
భయం జోకొట్టి
విజయశిఖరంపై
జై కొట్టాల్సిందే...
✊👍
_-రవికుమార్ కంచి_
🙏🌺.
🌿🌸🌿🌸🌿
[17/07, 6:20 AM] Kanchi Ravi Kumar Poet: 17.7.2020.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:06.
*'కొన్ని అంతే'....!!?*
నా కవిత్వం -202,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
➖➖☹️➖➖
అద్భుతం చూసినా
ఆ కనులు ఇంకోవైపు
తలను తిప్పేస్తున్నయ్..!
అనంతం చేసినా
ఆ మనసులు తొండలు తిరిగే బోళ్ళై
నిస్తేజంగున్నయ్...!
నిరంతరం వెలిగినా
ఆ సమూహాలు
రవికాంతులపై రంధ్రాన్వేషణ
చేస్తున్నయ్..!
అనునిత్యం చైతన్యం రగిలించినా
ఇరుకు ఆలోచనల బెరుకు రూపాలు
లోపాలే చూస్తున్నయ్...!
నిత్యం సత్యాలే చెప్పినా
ఇనుప పాదాలు
సుతిమెత్తగ
తొక్కేందుకే
వంకరబుద్ధి
ప్రదర్శిస్తున్నయ్...!
సాంతం సమాజహితమే
రాసినా చెప్పినా
భావాల బగారా
బాగున్నా
ముక్కిరిచి
ముక్కబియ్యమే
ముక్కు మూసుకుని
బుక్కుతున్నయ్....!!??
కొన్ని అంతే...!
చెద పురుగుల్లా...
యద మురుగుల్లా...
కొత్తదనం ఆస్వాదించని
పురుగుల్లా
మంచితనం
ఆహ్వానించని
పేడపురుగుల్లా...
జ్ఞానోదయం ఎప్పుడో....!?
సమాజం మారేదెప్పుడో....!?
_-రవికుమార్ కంచి_
🙏🌺.
🌿⁉️🌻
[17/07, 10:26 AM] Kanchi Ravi Kumar Poet: 17.7.20.
వీరాస్ కవిసమయం,
సంఖ్య -007.
*'అమానవీయం'....!.*
నా కవిత్వం -203,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
🔅🔅🔅🔅🔅
ఆత్మీయత భుజం కాలేదు
అనురాగం చేతులై సాగనంపలేదు
అనుబంధం అసలు ముట్టనే లేదు
అంతిమయాత్రల భారమే లేదు
ఆ నలుగురి అవసరమే లేదు
డప్పుల బాంబుల మోతలే లేవు
అనాధ అధమ యాత్రలై
నిశ్శబ్ధమైనయ్
వ్యర్థాల ఖననమోలె
శవాలు
కూలుతున్నయ్
అమానవీయ పూడ్చివేతలైతున్నయ్
మనిషి
యంత్రమైపోయాడా..!
యంత్రమే
మనిషైపోయిందా..!
మనిషి పాపమా..! కరోనా శాపమా...!!
_-రవికుమార్ కంచి_
🙏🌸
🔅🔅🔅🔅🔅
[18/07, 6:04 AM] Kanchi Ravi Kumar Poet: 18.7.20.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:08.
*'స్పందన'*
నా కవిత్వం-204,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
♾️🌾🌺♾️
నేలను గాలి
దున్నుతుంది
దుమ్ము లేపుతుంది
అరక దున్నే నీరు లేక
***
నక్షత్రాలు పట్టపగలే నిద్రదీస్తున్నయ్
సూర్యుని ముందు
కుప్పి గంతులు వేయలేక
***
పరిశ్రమలు అలిగి కూసున్నయ్
ఆడించి అలరించే కార్మికులు లేక
***
చీమలు ఆశ్చర్య పోతున్నయ్
దవాఖాన్ల ముందు బారులు తీరిన మనుషుల జూసి
***
బ్యాట్ బాల్లు
పుచ్చి పోయినయ్
చెదలు పట్టినయ్
సెల్లు సొల్లెక్కువయ్యి.
***
_-రవికుమార్ కంచి
9
19.7.2020.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:10.
*'మనం ఆలోచించాల్సింది ఏమిటంటే'...!?*
నా కవిత్వం - 206,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
❕⁉️❔
ఆలోచించాల్సింది ఏమిటంటే ....
మన వెలుగులు ఎన్ని చీకట్లను
వెలిగించాయని...
మన జ్ఞానం ఎన్ని జ్ఞానోదయాలకు
తూర్పయిందని...
మన సామాజిక స్పృహ
ఎన్ని మూఢ మూలాలను
కదిలించిందని...
ఆలోచించాల్సింది
ఏమిటంటే...!?
మన మనసు ఎన్ని
కన్నీటి హృదయాలను
ఆపన్నహస్తమై ఆదుకుందని...
మన ఆలోచనలు
ఎన్ని అచేతన
నాడీకణాల
పునరుత్తేజం కలిగించిందని...
మనం ఆలోచించాల్సింది
ఏమిటంటే..!?
మనం... మనమేంటి...
అని...
మనకు అసాధ్యమైనదేదీ
లేదని...
మనసుంటే....👍🌿
_-రవికుమార్ కంచి
10
21.7.20.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:10
*స్నానం.*
నా కవిత్వం-208,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
°°°°°°💦🌧️°°°°°°
నీ మనసును కడిగి ఎన్ని రోజులు
అయ్యిందో
నీ ముఖ చిత్రం
భయం
గొలుపుతుంది....!
నీ మనసు స్నానాలాడి ఎన్ని
వారాలయిందో
నీ కదలికలు
విచిత్రంగున్నయ్...!
నీ మనసు వర్షంలో
తడిసి
ఎన్ని నెలలయిందో
నీ ప్రతిస్పందనలు
హింసాత్మకంగున్నయ్
....!
నీ మనసు
జలపాతాలను తాకి ఎన్ని
సంవత్సరాలయిందో
నీ హృదయ
స్పందనలు
అతివేగం చూపిస్తున్నయ్....!
నిత్య నిరంతర స్నానాలతో మనో
పంకిలం వదిలించుకో....
సమాజం అందంగా
కన్పిస్తుంది
మానవత్వం
పరిమళిస్తుంది
ఆ స్నానం నీ మంచి
ఆలోచనలే....!
నీ స్థానం
అత్యున్నత ఆలోచనల
ఫలితమే...!!
_-రవికుమార్ కంచి_
🙏💐
^°^°^^°🙂^°^°^°^
11
[21/07, 10:25 AM] Kanchi Ravi Kumar Poet: ➖➖➖➖➖➖
20.7.20.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:11
*'ఆమె'.*
నా కవిత్వం-207,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
🌿🤱🏻👱🏻♀️🧕👧🏻🌸
ఆమె భవిష్యత్ ప్రపంచ సృష్టికర్త
ఆమె బాధలు చెమటలు
ఉన్నత లక్ష్యసాధనకు
నిచ్చెనలు
ఆమె చేతులు ఆస్వాదన అనురాగాల
వారధులు
ఆమె అడుగులు
నవ యువ చైతన్య ఆదర్శ స్ఫూర్తులు
ఆమె సహనాలు విజయం తప్పక
సాధించే పవనాలు
ఆమె పాలనలు
మూర్తీభవించిన
సంపూర్ణ సస్యశ్యామలలు
ఆమె ఒక అమ్మ
ఆమె ఒక సోదరి
ఆమె ఒక భార్య
ఆమె ప్రతి ఇంటిని
వెలిగించే వెలుగొందే
ప్రత్యక్ష దైవం
ఆమెకు ఆమే సాటి
ఆమెకు జేజేలు..🙏
_-రవికుమార్ కంచి_
🙏💐
12
➖➖➖➖➖➖
[21/07, 10:38 AM] Kanchi Ravi Kumar Poet: -------🌞-------
21.7.20.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:12
*'జ్వలనం'.🔥*
నా కవిత్వం-209,
రవికుమార్ కంచి.
...............✍️
ఆ చైతన్య రచనలకు నాలుగు
గోడలే కాగితం...!
ఆ స్వేచ్ఛా
కాముకులకు
ఇనుప సంకెళ్లే
బహుమానం...!
ఆ సామాజిక కాంతులకు ఇనుప
ఊచలే నిలయం...!
ఆ వెలుగు
జ్యోతులకు
అజ్ఞాన చీకట్లే
ఆశ్రయం...!
అధికార అంధకార బంధనాలలో శరీరం
శల్యమైనా
ఆగని మేధో
జ్వలనం...!
ఆ మా'నవ' హక్కుల పరిరక్షకులపై
ఆపరా అమానుషత్వం...!
చూపరా
మానవత్వం...!!
_-రవికుమార్ కంచి_
🙏💐
----✊🌾----
---------------
13
22.7.20.
వీరాస్ కవిసమయం, సంఖ్య:13.
_*ఎక్కడని వెతకను...!?*_
నా కవిత్వం-211,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
❕💦🌾❔
ఎక్కడని వెతకను...!?
విభజన లేని
దొంతర లేని
అణచివేత లేని
సమాజాన్ని....!?
సస్యశ్యామల నేల
స్వచ్ఛ జలాలు
స్వ(స్వే)చ్ఛ గాలులున్న
ప్రదేశాన్ని....!?
ఎక్కడని వెతకను...!?
నిష్కల్మష నిస్వార్థ చైతన్య
మానవత్వపు నిండైన రూపాన్ని...!?
అక్రమాలు అన్యాయాలు
కుటిల
రాజకీయాలు లేని రాజ్యాన్ని....!?
ఎక్కడని వెతకను...!?
గొప్ప కార్యాలు మనం చేస్తే కదా...!
కనిపించేవి....!!
నిర్మాణాత్మక ఆలోచనలు
ఆచరణాత్మక
పనులు మనం
చేస్తే కదా...!
ఎక్కడ వెతికినా
కన్పించడానికి....!?
ఎక్కడని వెతకను...!!??
_-రవికుమార్ కంచి_
🙏🌺
------🌤️------
14
22.7.2020.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:14.
⏰ _*"కాలం"...!!*_ 👍🤴👸🌹
🔅 _*రవికుమార్ కంచి, ఉపాధ్యాయులు*_.
▪️◾⏳🕰️◾▪️
"కాలం నిష్పక్షపాత కలం,
అనంత పుటలలో, మంచివాడి,చెడ్డవాడి చరిత్ర లిఖిస్తుంది,
తనలో కలిపేస్తుంది";
"గొప్ప ఆవిష్కరణల, ఆలోచనల,
కుటిల ఆచారాల, మూఢనమ్మకాల, ముచ్చట్లు రాస్తుంది,
కనపడని పుస్తకంలో దాచేస్తుంది!";
"సుమనోహర చిత్రాలను,
సుందర భవనాలను, వనాలను,
స్వర్గసీమలను గీస్తుంది!,
రాక్షస రాజ్యాలను, సహించలేని స్పర్శలను,
హింసానాదాలను మోగిస్తుంది,
చదవలేని లక్షల కోట్ల పేజీలలో నిక్షిప్తం చేస్తుంది!";
"కాలం అమూల్య క్షణం,
వెనక్కి పోతే బాగుండు!?,
ఒక్క క్షణం ఆగిపోతే బాగుండు....."!!??,
"రాబోయే ప్రళయాలను ఆపేసేవాడిని!, జరగబోయే అనర్థాలను అరికట్టే వాడిని!,
కరోనా కణోత్పత్తి,రోగాలను, మూసేసే వాడిని!,
జఠిల జాఢ్యాలను తుంచేసేవాడిని!, ప్రపంచ యుద్ధాలు ఆపేసేవాడిని!,
రష్యా ప్రాభవం
పెంచేసేవాడిని!, భారత శాస్త్ర,సాంకేతిక అభివృద్ధి,
స్వేచ్ఛా బీజాలు నాటేసే వాడిని!,
మహాత్ముల మరణాలు
ఆపేసేవాడిని!,
కులాల కుళ్ళులు, మతాల ఘర్షణలు,
లేని ప్రపంచాన్ని నిర్మించే వాడిని"!,
"వ్యాధుల పీడలు, కాలుష్య కోరలు లేని, విశ్వాన్ని తయారు చేసే వాడిని!,
జీవ వైవిధ్యం పరిరక్షించే వాడిని!,
శాంతి,సమానత్వం, ప్రజాస్వామిక దేశాలను చూసేవాడిని!,
వైజ్ఞానిక,శాస్త్ర సాంకేతిక రంగాల్లో, భారత అగ్రత్వాన్ని, చూపించే వాడిని !,
విద్యా,వైద్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత నిచ్చేవాడిని"!!
"నా కలలను,కలాం కలలను సాకారం చేసుకునే, శక్తియుక్తులు పొందే వాడిని"!,
"కాలం తన కలాన్ని ఇస్తే,
ఈ విశ్వాన్ని స్వర్గంగా మార్చివేసేవాడిని!!".
🔅
_-రవికుమార్ కంచి_.🙏💐
♾️⏰♾️⏰♾️.
15
22.7.2020.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:15.
💥 _*"వోటరుడా! తెలుసుకో.!.. మేలుకో...."*!!_
☀️ _*రవికుమార్ కంచి, ఉపాధ్యాయులు.*_
🔅✨🔅✨🔅✨
"వోటరుడా!.. తెలుసుకో!... మేలుకో".....!
"నీ వోటును అమ్మతివా...!
నిన్ను నువ్వు అమ్మినట్లు...!!
అంగడిలో గొర్రెవా?! బర్రెవా?!
అమ్ముడు పోవడానికి"...;
"డబ్బులంత పిచ్చైతే,
నీ కన్నుల న'మ్ముతవా?
నీ గుండెలన'మ్ముతవా?
అవి లేకుంటే బతుకుతవా?,"
"పైసలకు,మందుకు ఆశపడి,
ఎన్నికల జాతరకు మోజుపడి,
నీ ఉనికిని కోల్పోకు,
నీ హక్కును
మసి చేయకు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకు, రాజ్యాంగాన్ని అవహేళన చేయకు,"
"నీ వాడను,
నీ వూరును,
నీ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించకు, ప్రశ్నించే హక్కు కోల్పోకు,
అక్రమాలకు ఊతం ఇవ్వకు, అన్యాయాలకు వంత పాడకు,
కొత్త చింతలు కోరుకోకు,
మంచి మనిషిని ఎన్నుకో,
సేవలు చేయించుకో,
అభివృద్ధి సాధించుకో, నీ విలువ పెంచుకో, మనిషిగా నువ్వు మసులుకో,"
"సామాజిక బాధ్యత అలవర్చుకో,
దేశ సేవ చేసుకో, పురోగతికి తోడ్పడు,
నీ బిడ్డల భవిష్యత్, గొప్ప బాటలు వేసుకో, నిన్ను బాగు చేసుకో, మీ పరిసరాలు బాగు చేయించుకో,
వోటు విలువ తెలుసుకో!,
మంచి బతుకు నేర్చుకో."
▪️▪️☀️▪️▪️
_-రవికుమార్ కంచి_.🙏💐
16
22.7.20.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:16.
_*'ఎంత ధైర్యం'...!*_
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
❕❕🦠❔❔
గాలికి పోయే
అతిచిన్న కణానికి
ఎంత ధైర్యం...!?
చెట్ల నివాసం నుండి
వంద అంతస్తులకు
ఎదిగిన.....
ఆకులు
చుట్టుకోవడం నుండి
లక్షల సూటుకెదిగిన.....
మనిషినే భయపెడుతున్నది....!
ఆ సూక్ష్మజీవికి
ఎంత ధైర్యం....!!
పచ్చి మాంసభక్షణ నుండి పంచభక్ష
పరమాన్నాలు తింటున్న...
నిప్పు కణికల నుండి అణుబాంబుల
స్థాయికెదిగిన
మనిషినే
వణికిస్తున్నది .....!
ఆ విష కంటకికి
ఎంత ధైర్యం....!?
దేశ సంచారం నుండి
అంతరిక్షయానాల
కేగిన.....
కర్ర ఆయుధం నుండి జీవాయుధ
దాడులకొచ్చిన...
తెలివి మీరి
స్వార్థం మితిమీరి
మానవ సంబంధాలు
విలువలు మరచి
ఎంతకైనా తెగించే మనిషని
ఆ కొవ్వు కోరల పురుగుకి తెల్వదా...!
దానికెంత ధైర్యం...!?
మనిషి ఊపిరాడకుండా
చేస్తుందా...
కోట్ల ఏండ్ల నుండి ఏలిన కోటలను
రాజ్యాలను నిర్మానుష్యం
చేస్తుందా...!
దానికెంత ధైర్యం...!!
_-రవికుమార్ కంచి_
🙏💐.
!?!?🦠!
17
23.7.20.
వీరాస్ కవిసమయం, సంఖ్య:17.
😟 _*ఏంటోళ్ళు...!!??*_
_రవికుమార్ కంచి_. 🌤️
♾️♾️🌱♾️♾️
ఏం ప్రశ్న ఇది? ఎందుకీ ప్రశ్న? ఎంతకాల మీ ప్రశ్న....?
"రూపం చూడు,
ఆకారం పరిశీలించు,
గుణం గమనించు,
చేతలు బేరీజు వేసుకో, నచ్చితే,మాట్లాడు, స్నేహించు, అభినందించు, నచ్చకుంటే మానుకో";!!
"మీ కులమయితే, మంచి వాడు! లేనట్లయితే చెడ్డవాడా"!??
"ఒకే జాతైతే, సంతోషం!?
అన్యజాతైతే భయం, అసహ్యమా!??"
ఏమిటీ దుర్భరం?
"కోట్ల విలువైన ఇల్లు, లక్షల విలువైన వస్తువులు,
వెలకట్టలేని సమయం, అద్భుత మేధాసంపత్తి, ఉత్తమ ప్రయోగాలు, పరిశోధనలు, అధికారాలు బిరుదులు,
అంతరిక్ష యాత్రలు, చరిత్రలు లిఖించిన మానవా!!? హిమాలయాల ఎత్తుకు ఎదిగి,
ఖ్యాతి గాంచిన మానవా"!!?
"కొన్ని వ్యవహారాల్లో....
నీ బుద్ధి"......
"మీ గుమ్మం దగ్గర చెప్పులను
దాటి ఎదగడం లేదు"!!??
"ఆ స్థాయికి మించి, కదలడం లేదు,
"ఇదేమి దరిద్రం??
ఇదేమి దౌర్భాగ్యం"??
"నీ ప్రవర్తన....
పవిత్ర గ్రంథాలపై ఇంకు పోసినట్లు లేదా...!??
ప్రార్థనా స్థలంలో, అపచారం చేసినట్లు లేదా....!??,
క్రికెట్ ఆటలో వాలీబాల్ పెట్టినట్లు..... లేదా!??,
భోజన విస్తరిలో ఇటుక పెట్టినట్టు లేదా.....!??,
చక్కటి సాంబారులో, తుమ్మ కాయ వేసినట్లు లేదా".....!??,
"అసమంజస ప్రవర్తనని మానుకో,
పట్టు పీతాంబరాలు కాదు....!
మానవత్వం ధరించు!!,
మూఢాచారాలు కాదు....!
మూర్తిమత్వం సాధించు!!,
కులాల కంపు,
మతాల ముంపు...కాదు!
ప్రేమ పరిమళాలు,
స్నేహ సౌందర్యాలు వెదజల్లు!!
తుక్కులు,తక్కువ, ఎక్కువలు....కాదు!
సమతలు,మమతలు సంపాదించు,
పెంపొందించు!!
ప్రపంచం అసహ్యించే, కళంకాలు పోగొట్టు!
ఏంటోళ్ళని.....కాదు!!
ఏం కావాలి...
నా ప్రియ భారతీయుడా....!!??
అని ఆహ్వానించు....
"మహనీయుల, మహోన్నత భారతఖండం నిర్మించు"...!
_-రవికుమార్ కంచి_.
18
23.7.20.
వీరాస్ కవిసమయం, సంఖ్య:18.
🤲 🙌 👋🏼 🙏
*"ఆ చేతులు....!?"*
_*నా కవిత్వం-97, రవికుమార్ కంచి*_.
➖♾️➖♾️➖♾️➖
_"ఆ చేతులు"...._
_పురుడు పోసాయి, సుతిమెత్తగా అమ్మ ఒడిలో చేర్చాయి,_
అమ్మ వాసనలు, అమ్మ గొంతుకలు, వినిపించాయి;_
_"ఆ చేతులు"....._
_నిస్సహాయ, బేల చూపుల,_
_బోసినవ్వుల,_
_ఆకలి కడుపుల_ _పాలను ఇచ్చాయి, స్పర్శతో ఆనందం కలిగించాయి;_
_"ఆ చేతులు"......_
_ఇంట్లో,నలుగురిలో, అందరిలో నడిపించాయి, నన్ను పరిచయం చేశాయి,_
_నాకు లోకం చూపించాయి సంతోషం పంచాయి;_
_"ఆ చేతులు"....._
_నన్ను పలకరించాయి, పలక అందించాయి నా చేతుల అ,ఆ లు రాయించాయి,_
_నా భవిష్యత్ రేఖలు గీయించాయి,_ _సకల విద్యలు, శాస్త్రజ్ఞానం బోధించాయి;_
_"ఆ చేతులు......"_
_రమ్మని పిలిచాయి, చేతులు కలిపాయి, భుజాన చేతులు వేశాయి,_
_ఆటలాడించాయి, పాటలు పాడించాయి, ఇంట్లో తెచ్చిన అప్పలిచ్చాయి,_
_చాక్లెట్లిచ్చాయి,_
_పోవొద్దని లాగాయి, ఓదార్చాయి,_ _నవ్వించాయి, విడువనని గోలచేశాయి_
_"ఆ చేతులు"....... ఒక వైద్యునివి,ఆయావి...!!_
_"ఆ చేతులు......" అమ్మవి,నాన్నవి....!!_
_"ఆ చేతులు....." గురువువి, స్నేహితుడివి....!!_
_"ఆ చేతులే......_"
_శ్రీరామరక్ష ,!!,_
_యేసురక్ష,!!_
_గౌతమ్ రక్ష,!!_
_అల్లా రక్ష !!_
_విజ్ఞాన రక్ష!!!_
_"ఆ చేతులే....."_
_రేపటి,భారత పౌరుల చేతలు_,
_గొప్ప రాతలు_,
_అధినేతలు_,
_శాస్త్రవేత్తలు_,
_తత్వవేత్తలు_.
_-రవికుమార్ కంచి, ఉపాధ్యాయులు_🙏💐.
➖♾️➖♾️➖♾️➖.
19
23.7.2020.
వీరాస్ కవిసమయం,
కవిత సంఖ్య:19.
💖 _*నా కవిత్వం. రవికుమార్ కంచి*_.
☀️ _*"పుడమి పువ్వులు"*_💐.
"అరకలు కట్టి, బడితను పట్టి,
ఎడ్లను కసిరి,పగ్గం గుంజి,
బాధల నొక్కి, చెమటలు కక్కి,
నల్లరేగడుల పాదం దింపి,
పొలముల చక్కని వరుసలు నింపి,"
"బెల్లం చేరిన చీమల్లాగా,
వేపకాయను ముసిరిన ఈగల్లాగా,
పువ్వుల వాలిన తుమ్మెదలాగా,
నీటిని పరిచిన తామరలాగా,
పుడమిని పులకించిన పువ్వుల్లాగా,
ఖనిజం తొవ్విన గడ్డపారలాగా,
మట్టిని తోలిన పారల్లాగా,
రాయిని పెకిలిన సీకుల్లాగా".....
"భూమే మాకు దిక్కూ, మొక్కూ,
ప్రకృతే మాకు అండా, దండా",
"నేలల చెమట చుక్కలు కార్చి,ముత్యాలు తీస్తాం,
భూయదపై రక్త బిందువులు చల్లి, వజ్రాలు కోస్తాం,"
"ధరణి పారాణులం,
పుడమి ప్రాణులం",
"విశాల నేలయే మాకు బడి,
నల్లని పొలమే మాకు పలక,
పైరుల ఫలములే వాక్యాలు,
ధాన్యం కుప్పలే పుస్తకాలు,
కాపు గాసుడే పరీక్షలు,
కడుపులు నింపుడే ఫలితాలు,
నేల బడి పిల్లలం,
సాగు సదువే రైతులం".
-రవికుమార్ కంచి.
"ఇది నా స్వీయరచన".
🌿🌸🌿🌸🌿🌸
20
[24/07, 1:35 PM] Kanchi Ravi Kumar Poet: 24.7.2020.
వీరాస్ కవిసమయం.
శీర్షిక:
⬛ _*గెట్లు*_ ⬛
_*, రవికుమార్ కంచి, ఉపాధ్యాయులు*
._
హైదరాబాద్,
కవిత సంఖ్య:20
➿➿➿➿➿➿
"ఇరవయేండ్ల క్రితం,
ఏ వ్యవసాయ పొలాలకు,
కంచెలు,గోడలు,
గెట్లు లేవు,ఏ గేట్లు లేవు,
కొండల కొట్టిన రాళ్ల కడీలు,
చెట్ల కోసిన దూలాలు, తాటి కమ్మల, గుడిసెలు,కొట్టాలు తప్ప,!
ఫామ్ హౌజులు లేవు,
జల్సాలు,గలీజులు లేవు"!!,
"భూముల కృత్రిమ భూమ్ తో,!
ఆశలు పెరిగినయ్, దురాశలు రేగినయ్, హద్దు రాళ్లు కరిగినయ్, సరిహద్దులు
మారినయ్, సంబంధాలు తెగినయ్, సంప్రదింపులు తగ్గినయ్, సంప్రదాయాలు పోయినయ్",!!
"పోరంబోకు భూముల ఆక్రమణ,
సాగు లేని సోదరుల భూమి దురాక్రమణ,
కాలువ,మడుగు,
యేరైనా పూడ్చేసుడే,
కొండయినా, గుట్టయినా,
కాదేదీ కబ్జకనర్హం",!!
"పొలాల అంచులు కాదు,
శెల్కల సరిహద్దులు కాదు,
తోటల అంతముల కాదు,
"నడవొద్దని,కాళ్లకు శూలాలు పెట్టిండ్రు",!
"చెయ్యి పెట్టొద్దని, వైరుల కరంటు పెట్టిండ్రు",!
"గుండెల్లో గెట్లు పాతిండ్రు,
మనసుల ముళ్ళకంచె వేసిండ్రు,!"
"మనుషులే రాళ్ల తెట్టెలయిండ్రు,!!"
"తండ్రి,సోదరుడనే బంధమే లేదు,!
అడ్డొస్తే అనర్థమే,! కాదంటే ఖండనమే! వినకుంటే హింసాత్మకమే!!"
"భూమి కి...భూమ్...కాదు,
మనిషికి....భూతమ్...పట్టింది...!!
మానవత్వాన్ని..........ఖతమ్ బెట్టింది"....!!!??.
_-రవికుమార్ కంచి_.🙏🌷
21
➰➰➰➰➰➰
[24/07, 1:41 PM] Kanchi Ravi Kumar Poet: 24.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
👨🎓
శీర్షిక: _*"శాస్త్రజ్ఞుడా"....!!*_
కవిత సంఖ్య:21.
➖🔆➖🔆➖
శాస్త్రజ్ఞుడా...!
నీ పరిశోధన మరింత పదును పెట్టు,
నీ ఆలోచనల ఇంకా సాన పట్టు,
క్షణక్షణం,అనుదినం నీకు సవాలే?!,
నీ ఊహలకు సృజనకు, సిద్ధాంతాలకు పునాదులే!,
కొత్త రోగాలు జడలు విప్పుతున్నాయి!,
కొత్త విష కణాలు, విషం కక్కి విజృంభిస్తున్నాయి?!, కొత్త సమస్యలు తాండవిస్తున్నాయి!,
తప్పు నీదా? మనుషులదా?
నీ మేధల, ఉద్భవించిన మెరుపులు,
నీ సృష్టిలో వికసించిన విశ్వాలు,
నీ ఊపిరిలో పరిఢవిల్లిన జీవాలు, జనాలు,
నీ అన్వేషణల మొలకెత్తిన వనాలు,
నిన్ను ప్రశ్నిస్తున్నాయి! నువ్వేం చేస్తున్నావని!!?
నిన్ను ప్రాధేయ పడుతున్నాయి, మార్గం చూపమని!,
నిన్నే తలుస్తున్నాయి, సంక్షోభం తొలగిస్తారని!,
నిన్నే వెతుకుతున్నాయి,
నీ ఆవిష్కరణలు వస్తాయని!!,
నిన్నే ఆరాధిస్తున్నాయి, నువ్వే దిక్కు,దైవమని!!,
నిన్నే చూస్తున్నాయి, పరిష్కారం చూపమని?!,
క్యాన్సర్, SLE, తలసేమియా, ఎయిడ్స్,కోవిడ్19....
ఆయుధం ఎప్పుడు! అంతమెప్పుడని!!,
అణు ప్రయోగాలు, క్రిమిసంహారక మందులు,
నింగీ,నేలా,గాలి,నీరు కలుషితాలు,జన్యు లోపాలు.... మనిషి పాపాలకు ముగింపు ఎప్పుడు??
పరిరక్షణ,ప్రక్షాళన ఎప్పుడు??!.
_-రవికుమార్ కంచి_.🙏
22
➖🔆➖🔆➖.
[24/07, 1:50 PM] Kanchi Ravi Kumar Poet: 21.5.2020.
వీరాస్ కవిసమయం,
పేరు: రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
🛣️ _*రోడ్డు పాలు*_
కవిత సంఖ్య:22.
🍅🍆🥔⁉️
అప్పులను అధిగమించి, వాతావరణ ముప్పులను ఎదుర్కొని,
నకిలీవా, అసలువా తెల్వని,
ఖరీదైన విత్తనాల కొనుగోలు,
ట్రాక్టర్లతో దున్నకం, కూలీలతో పనులు, దినదినం పరిశీలన కాపలా,
ఓ గండం.....!!
ఒకవైపు అడవిపందులు, మరోవైపు చీడపీడలు,
ఒక దిక్కు,తుఫానులు,
మరో దిక్కు వరదలు, అటు నుండి దొంగలు ఇటు నుండి పక్షులు ఎలుకలు;!
ఇవన్నీ ఒక ఎత్తయితే మార్కెట్లో అమ్మకం మరో ఎత్తు,!
ప్రభుత్వం మద్ధతు ధరొకటి,
మార్కెట్ శక్తుల ధరొకటి,
నాణ్యత లేదని తరుగు
దోపిడీ,
వరుసలుంటే,వర్షాల దొంగల దోపిడీ,
కాంటను,
ఓ కంట కనిపెట్టక పోతే నిలువు దోపిడీ,
తతంగం పూర్తయ్యేసరికి, మద్దతు ధర ఢమాల్, నిల్వ సామర్థ్యం నిల్;
ఇక వృధా ప్రయాస భరించలేక,
ఓపిక నశించి,
అమ్మినా,
ఖర్చులు పోగా ఏమి మిగలని ధైన్యంలో,
ఆవేశంలో,
రోడ్డే నిరసన పొలంగా,
నల్లని తారుమడిలో పంట తొక్కి,
రోడ్డున పడ్డాడు
రైతు,!
పంట రోడ్డుపాలు, కష్టార్జితం,
కష్టాలపాలు,
రైతు కన్నీటి పాలు,
అంతా... రోడ్డుపాలు!
రైతు బతుకు అప్పుతో ఆరంభం...!
అప్పుతోనే...అంతం,!!
లాభమెక్కడ??
జీవనమెట్ల???
దళారులే లాభాలపాలు!,
అటు రైతు,
ఇటు కొనుగోలు దారులు,
నష్టాలపాలు,!!
శ్రమ రోడ్డుపాలు,!
సేద్యం రోడ్డుపాలు!!,
_-రవికుమార్ కంచి_.🙏
23
[25/07, 6:05 AM] Kanchi Ravi Kumar Poet: 25.07.2020.
వీరాస్ కవిసమయం,
కవిత సంఖ్య:23,
శీర్షిక:
*'సైకిల్'.*
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
హైదరాబాద్.
______🚲______
కాళ్లందని కాన్నుండి సీటెక్కేదాక నను
మోసింది
అద్భుతాలు చేసింది
మూతులు
మోచేతులు మోకాళ్లు
పగిలినా
లేచి నేర్వాల్సిందే
నేర్చి గెలవాల్సిందేనని
ప్రేరేపించింది
మట్టి బాటలు
పిల్లబాటలు
కంకర రోడ్లు
తారు రోడ్లు చూపి కష్టాన్నెదిరించి
లక్ష్యం చేరమన్నది
దోస్తుల ఇండ్లు బడి దుకాణాలు బోరింగు
బావులు
చిన్న తాత
పెదనాయన ఇండ్లు
మరో తీరుగా
చూపెట్టింది
ఇద్దర్ని ఎక్కించుకుని తొక్కుడు
ఊకనే బెల్లు గొట్టుడు
పోటీలు పడుడు
జారిపడుళ్ళు జరిగినా
క్రీడాస్ఫూర్తి నేర్పింది
తనిప్పుడు కదలకున్నా ....
కొత్త పంథాలో
జీవిత
ప్రయాణం నేర్పింది..
నా అట్లస్ సైకిల్...
_*-రవికుమార్ కంచి*_
🌿🙏.
👍🌸🚲🌺✌️
24
[25/07, 10:47 AM] Kanchi Ravi Kumar Poet: 24.7.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
కవిత సంఖ్య:24.
శీర్షిక:
*ముందుకే...*
🏃🏽♂️🏃♀️............
ముళ్ళుంటయ్
రాళ్ళుంటయ్
అడుగడుగున ఆటంకాలుంటయ్...!
మొరిగే కుక్కలు మురిగే మనసులు
కరిగే కాలాలు
తరిగే అవకాశాలు
విరిగే ఆకాశాలు
ఎన్నో అడ్డుకుంటయ్
మరెన్నో ఆపేస్తుంటయ్...!
నడుస్తావో
ఉరుకుతావో
దొర్లుతావో
దూకుతావో
శరీర అలసట అధిగమిస్తూ
మనసు గాయాలు మాన్పుకుంటూ
జీవన సమరం సాగిస్తూ
ప్రేమలు గెలుపులు సాధిస్తూ
సోదరా...!
సోదరీ.....!!
లక్ష్యసాధనలొ
పడినా... లేచి.... ముందుకే నడువు...
లేచి నడవడంలోనే
ఉంది గెలుపు
మున్ముందుకే
వడివడిగా
నడువ్ నడువ్.....
విజయం నీదే
నడువ్ నడువ్.....
👍👊✌️✊
_-రవికుమార్ కంచి_
25
🎯🏃🏽♂️..............
[25/07, 10:51 AM] Kanchi Ravi Kumar Poet: 25.7.2020
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
🔴 _*"మానవ సంహారకాలు".....!!???*_.
కవిత సంఖ్య:25.
▪️🌱♾️🦋♾️▪️
"ఏ పంటైనా, ఏ తోటైనా,
రసాయన క్రిమిసంహారకాలు,
జీవ,మానవ సంహారకాలు,
పరోక్ష సంహారకాలు"....
"చల్లనిదే,వెదజల్లనిదే, పూత లేదు,కాత రాదు",
"ఘోరమైన పరిస్థితి ఏర్పడింది, భయంకరమైన దుస్థితి దాపురించింది, కూరగాయలు,పండ్లు వరి,జొన్న,గోధుమ, ఎంత కడిగినా,
ఎలా తోమినా, వదలని రసాయనాలు, జీవజాల మనుగడ ప్రశ్నార్థకం"???
"భయంకర రోగాలు, ఉత్పరివర్తనాలు, నివారించలేని దరిద్రాలు,
నాడీ,శ్వాస,జీర్ణ ప్రసరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావాలు, పసిప్రాయంలోనే విపరీతాలు,
ఘోరమైన ఉపద్రవాలు,"
"మన బిడ్డల భవిష్యత్తు,
దేశం,విశ్వం
చక్కబడాలంటే,
స్వచ్ఛ నేల,గాలి,నీరు ఆహారం,ఉండాలంటే,
జీవ వైవిధ్యం కాపాడాలంటే"....
"మన సేద్య విధానాలు మారాలి,
విష రసాయన మందుల వాడుక ఆపాలి,
సహజ ఎరువుల వాడకం పెరగాలి,
సహజ పంటలు పండించాలి,
రైతుల ప్రోత్సాహం పెంచాలి,
ప్రకృతి సహజత్వం పరిరక్షించాలి,"
"స్వచ్ఛ,ఆరోగ్య , ఆనంద,భారత్ నిర్మించాలి."
_-రవికుమార్ కంచి_🙏🌹.
26
25.7.2020.
వీరాస్ కవిసమయం
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
🙇♂️ _*"ఒంటరైపోకు"..!!??*_
కవిత సంఖ్య:26.
👁️🗨️👁️🗨️👁️🗨️
"ఒంటరైపోకు.........మిత్రమా"....!!
"నిజాలు మాట్లాడితే నచ్చే లోకం కాదిది,
నిజాయితీగా ఉంటే సహించే రోజులు కావివి,
బంధువులు స్నేహితులైన మంచితనమే చూడు మంచి ప్రవర్తనే ప్రోత్సహించు, వారంతట వారే తెలుసుకునేలా చేయి, సంస్కరణల ప్రయత్నం వద్దు!,
విశ్వం మార్చేస్తాననే ప్రగల్భాలు వద్దు!,
ప్రతి ఒక్కరిలో మంచినే చూడు!,
చెడు లేనివాడు లేడు!,
ఒంటరైపోకు... మిత్రమా,
నీ మాటలు నచ్చవు!, నీ ప్రవర్తనతో వారికి లాభం ఉండదు!,
నీతో పాటు,
లోకం మారాలనే ఆలోచన మానకు!!,
ప్రయత్నం ఆపకు"!,
"కానీ తొందర వద్దు"!?,
"మార్పు నిదానంగా జరుగును,
ఆలోచన వేగంగా కదులును,
ఆచరణ ఆలస్యంగా జరుగును!,
నీతో సహా...!,
సంపూర్ణ మానవుడు ఎవడైనా ఉన్నాడా...!??,
ఏ లోపం లేనివాడు,
ఏ పాపం చేయని వాడున్నాడా...!!??
పొరపాటు చేయని వాడున్నాడా...........మిత్రమా"!!??
"నువ్వు చెప్పింది వినాలి!,
నువ్వు చేసింది ప్రశంసించాలి!! గొప్పవాడని అనాలి! అనుకోవడం అసమంజసం"!!,
"మంచి,చెడు సమూహాల,
ప్రవాహ సమాజమిది!!
తేలిపోతూనే ఉండాలి"!!,
"అవకాశం దొరికితే ఎదురీదాలి"!!,
లేదా
"ఆ ప్రవాహంలో పోతూనే ఉండాలి!!
మన కోసం ఏదీ ఆగదు"!,
" నీ మంచి పనులు ఆపకు,
నవత,మానవతా ఆపకు",
"అన్ని గుణాల మిశ్రమమే సమాజం..."!!
అది
ఏదో ఒకరోజు,
నీ మాటలు వినక తప్పదు!,
నిను గుర్తించక తప్పదు!!,
ఏదైనా... సమాజం లోనే ఉండు... మిత్రమా...!!
ఒంటరై పోకు....!!!.
_-రవికుమార్ కంచి_.🙏.
27
[26/07, 6:18 AM] Kanchi Ravi Kumar Poet: 25.7.20.
వీరాస్ కవిసమయం
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*'తెరవెనుక'....!?*
కవిత సంఖ్య:27.
---📽️🎬🎭---
రాత్రులు వెలుగు నింపిన భుజం
చీకట్లో జారిన తన జీవితం
వెతుకుతున్నయ్..!
వెన్నెల వెలుగుల ముఖారవిందాల
రంగులు అద్దిన చేతులు నలుపై
పోయినయ్..!
ప్రతి దృశ్యం
కళా శోభితం
వర్ణమయం నేత్రానందం కలిగించే
కుంచెలు
కుంచించుకుని
పెన్ స్టాండ్లకే పరిమితమైనయ్...!
ఆకర్షణీయ కుంతల సామ్రాజ్య నిర్మాణ
కళాకారుల జీవ నైపుణ్యాలు
పిట్టగూళ్ళై
కూలిపోతున్నయ్ ..!
అదిరేటి స్టెప్పులతో ప్రేక్షకలోకం ఈలలు
చప్పట్లలో
చిందేసిన పాదాలు
కరోనా ముళ్ళపై రక్తమోడుతున్నయ్..!
కన్నీళ్లు దాచి అభినయాలు
ఆహ్లాదాలు పంచే సహనటుల సహనం
అసహనమై చితికిన జీవన చిత్రాలు చతికిల
బడ్తున్నయ్...!
తెరవెనుక
సినిమా సిత్రాలు
చితికి
పోతున్నయ్..!
_*-రవికుమార్ కంచి*_
28
[26/07, 6:25 AM] Kanchi Ravi Kumar Poet: 26.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
🕺 _*"నాయకుడు"..🏹👍*_
కవిత సంఖ్య:28.
▪️▪️💐▪️▪️
"నాయకుడు.... ఎక్కడ"....!?
"ఆసనానికి అతుక్కోకుండా!, సింహాసన దర్పం చూపకుండా!,
జనాల గుండెల నిండిన,
జనాల నిచ్చెనల నుండి,
పీఠమెక్కే , ప్రజానాయకుడు ఎక్కడ".....!!??
"పదిమందిలో ఒకడిలా,
అందరి బాధలు మోసే దేవుడిలా!,
కష్టసుఖాలు పంచుకునే సఖుడిలా, ధైర్యం విశ్వాసం నింపే బోధకుడిలా,
ఆపదలో ఆదుకునే మిత్రుడిలా,
శోకంలో శ్వాసలు ఊదే ఊపిరిలా! మెరుపువేగంతో ఆలోచనలు చేసి, ధీటైన నిర్ణయాలతో ముందుకు సాగే"....,
"వంద మందికి విజయాలు పంచే, వెయ్యిమందికి దారి చూపే,
నిజమైన నిస్వార్ధ సేవ చేసే......!
నాయకుడు!
అధినాయకుడు!!
ఈ కాలంలో ఎక్కడ...."!??
"పొలాలు,ఆస్తులు అంతస్తులు లేకున్నా!, ఇంట్లో బాధలు ఎన్నున్నా!,
ఒంట్లో రోగాలు ఏం చేసినా!, కుటుంబసభ్యులు ఇబ్బంది పడినా!, ఆర్థిక భారాలు,
కఠిన కార్యాలు పెరిగినా!,
సంపాదించే,కట్టలు,
కోటలు కట్టే,
అవకాశ మున్నా!, నిజాయితీయే ప్రాణంగా,
ప్రజా సేవే లక్ష్యంగా, త్యాగాలే ముఖ్యంగా, ముందుకు నడుస్తూ లౌక్యంగా,
పోరాడే నాయకుడు.....ఎక్కడ"!!??
"ఈ జమానాలో, జనంలో ప్రాణమై నిలబడే"...!?
"అసలు సిసలైన నాయకుడు..... ఎక్కడ"....!?.
_-రవికుమార్ కంచి_.
29
26.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*ప్రశ్నించొద్దా..!?*_
కవిత సంఖ్య:29.
❗❗❓❓
ఎట్లున్నా ఏమనొద్దు!, ఏమైనా అడగొద్దు!,
ఏ బాధైనా మాట్లాడవద్దు....!?;
ప్రశ్నించే గళం వద్దు, ప్రశ్నించే కలం వద్దు, ప్రశ్నించే వేలు వద్దు, ప్రశ్నించే సాహిత్యం వద్దు,
అసలు ప్రశ్నించే, మనిషే ఉండొద్దు!!??,
పాలకులపై ప్రశ్నే ఉండొద్దు!!??
వద్దు.. వద్దు.. వద్దు.. ఏదీ...అడ్డు వద్దు!!??
ఏమిటీ నియంత నియంత్రణలు!?,
ఏమిటీ పాలన,
ఆలన,లాలన మరిచిన పరిపాలన,
ఆదిమ కాలం నుండైనా,
అరణ్య యుగం నుండైనా,
అనాగరిక యుగం నుండైనా,
ప్రశ్న లేకుండా నిప్పు లేదు,చక్రం లేదు,
ప్రశ్న లేకుండా అస్త్రం లేదు,
వస్త్రం లేదు,
ప్రశ్న లేకుండా పరిశోధన,అభివృద్ధి లేదు,
జీవ మానవ మనుగడ లేదు,
ప్రశ్న లేకుండా పర్యావరణం లేదు!!;
మీ అధికారం,మీ పీఠం లేదు,
మీ భోగం రాజవైభోగం లేదు,
ప్రశ్న లేకుండా ఏదీ లేదు....!!
ఏది సాధించబడ లేదు!!
ప్రశ్న వేల మెదళ్లను కదిలిస్తుంది,
లక్షల సమాధానాలు, పరిష్కారాలు రాబడుతోంది,
ప్రశ్న, స్తబ్దతను తొలగిస్తుంది, ఆలోచనలు రేకెత్తిస్తుంది,
ప్రశ్న మార్పును చూపిస్తుంది భవిష్యత్ కు,బాటలు వేస్తోంది, ప్రశ్న అన్యాయాల నిరోధిస్తుంది, అక్రమాల హరిస్తుంది,
ప్రశ్నకు, ప్రశ్న, వేదన.... జవాబు కాదు!!
ఈ ప్రశ్నకు సమాధానమే విధానం,
ప్రశ్నకు పరిష్కారమే సమాధానం,
ఇది ప్రజాస్వామిక విధానం,
అభివృద్ధికి నినాదం.
_రవికుమార్ కంచి_.🙏.
🌸🌿🌸🌿🌸
30
[26/07, 6:53 PM] Kanchi Ravi Kumar Poet: 26.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"కలం"✍️*_
కవిత సంఖ్య:30.
🌹🌹✍️🌹🌹
"కలాలు.....
మట్టి కొట్టుకుపోతున్న
జీవన చిత్రాలు
గీయాలి, అల్లాడిపోతున్న బతుకుల కవిత్వాలు రాయాలి, ఆరాటపడుతున్న లేత గుండెల ఆకలి కేకల వ్యాసాలు చూపాలి,
మంటగలిసి పోతున్న మానవత్వపు ధైన్యాన్ని గ్రంథంగా మలచాలి",
"కలాలు.....
అమాయక బాలల చీకటి కోణాలకు వెలుగు రాతలు రాయాలి,
చెవులకు చేరని ఆర్తనాదాలకు, పరిష్కార నినాదాలు రచించాలి,
కృశించిపోతున్న, నశించిపోతున్న, ప్రకృతి సంపదల నిలబెట్టే,
మొక్కలు ప్రతి ఒక్కరు నాటే స్పృహ కలిగించాలి",
"కుల కుతంత్రాల, మతమౌఢ్యాల
ముప్పులను గెట్లను తెంచి,
సోదరభావాన్ని పెంచే, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే,
శాస్త్రాలు లిఖించాలి",
"మన కలాలు.....
ప్రజల సమస్యలపై పోరాడే నిరంతర గళాలై పరుగెత్తాలి"!,
"పేదల బతుకుల్లో వెలుగు నింపే,
అఖండ దివిటీలు కావాలి",
"మన కలాలు..., ప్రపంచాన భారతీయుడు, గర్వంగా తలెత్తుకు తిరిగే,
విద్యా,వైద్య,విజ్ఞాన సాంకేతిక,సాహిత్య, కళా,ఆర్థిక రంగాల్లో, ఉత్తమోత్తమ స్థానాలు,శిఖరాలు,
చేరేలా ప్రేరేపించాలి"....!
"మన కలాలు....
కాలక్షేపాలు,
పొగడ్తలు,
సౌందర్య వర్ణనలకే,
పరిమితం కారాదు"....
"మన కలాలు...
చైతన్యం నింపాలి,
కొత్త భారతాన్ని లిఖించాలి,!
చరిత్రలు తిరగరాయాలి,
నవ విశ్వాన్ని సృష్టించాలి"!!
....✍️✊.
_రవికుమార్ కంచి_🙏💐.
31
🌈👑💐👑🌈.
[26/07, 6:56 PM] Kanchi Ravi Kumar Poet: 25.5.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"ప్రకృతి బీభత్సం😟"*_
కవిత సంఖ్య: 31.
♾️♾️♾️♾️♾️♾️
ఓ మానవా...
!
నీ విజ్ఞాన తృష్ణతో అనంత ఆకాశాన్ని, రాకెట్లతో, కాంతివేగంతో చీల్చావు!,
నీ సాంకేతిక పరిజ్ఞానంతో లోతైన సముద్రాల అగాధాల చీకటి అడుగులను సబ్మెరైన్లతో తాకావు!!,
భూగోళ ఉత్తర,దక్షిణ ధృవాన, విమానాలతో అడుగులు పెట్టావు,
నీ జండాలు పాతావు!!,
కానీ.....
ప్రకృతి ముందు నీ కుప్పిగంతులు చెల్లవు,
నీ వినాశక చర్యలు కుదరవు,
నీ విపరీత చేష్టలు నడవవు,
అకాల వర్షాలు, భయంకర తుఫాన్లు, భూకంపాలు, వరదలు,
సునామీలు,లావాలు, ఎండలు,
ప్రకృతి బీభత్సాలు, సహజ సవాళ్లు...
నువ్వు ఎదురించ లేవు?
ఓ మానవా...!
ప్రకృతి ప్రకోపాల ముందు,
నువ్వెంత??
నీ తెలివెంత??
ఇకనైనా మేలుకో!,
నీ కొమ్మను నువ్వే, నరికే పనులు ఆపుకో, మానుకో....!!!
ప్రకృతి బీభత్సాలకు,
నీ చెత్త పనులు తోడైతే!!,
ఒక్క జీవి కూడా మిగలని....
నిర్జీవ భూగోళమైతది..!,
నీలి గోళం,
నిశ్శబ్ద నిర్జీవ,గోళమైతది!!,
ప్రకృతి విరుద్ధ కార్యాలు చేయకు, సహజ వనరుల వినాశక చర్యలు చేపట్టకు....!!
"ప్రకృతిని నువ్వు పెంచు...
నిన్నది ఆరోగ్యంగా పెంచుతుంది".
_-రవికుమార్ కంచి_.🙏
♾️♾️♾️♾️♾️♾️
32
26.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*🌈✨"కలాం... సలాం!!🙏"*_
కవిత సంఖ్య:32.
✨✨⚡⚡🌟🌟
"కలలు కనండి...కలలను సాకారం చేసుకోండి"...... _*"కలాం"*_
"ఎక్కడో పుట్టావు..
ఎలాగో పెరిగావు....
కష్టాలు పడ్డావు...
సుఖాలు, బాధలు మరిచావు"....
"పక్షులు,ఆకాశం...
నీ నిరంతర పరిశీలనలు...
ఆకాశాన్ని తాకాలనే,
రామేశ్వరం తీర అలలే నీకు... ఆదర్శాలు"...
"ఉన్నత విద్య,
శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలే నీ అర్హతలు"....
"పరుగులు పెట్టించావు,
అణు పరీక్షలు,
అంతరిక్ష ప్రయోగాలు;
చిన్నతనంలో పక్షులతో పోటీ పడిన,
నీ ఊహలు, ఆలోచనలు,"
"భారత మువ్వన్నెల జెండాను,
మోసే రాకెట్లు,
ఉపగ్రహాలయినాయి"..
"భారత కీర్తిని పెంచే, కలాం స్ఫూర్తిని రగిలించే,
ఖగోళ,విజ్ఞాన యాత్రలయినాయి"....
"రాకెట్ వీరుడే,
విజ్ఞాన వీరుడే,
రాష్ట్రపతి పదవిలో ఉన్నా,
భావి భారత పౌరుల తరగతి బోధన,
ప్రేరణ తరగతులు,
ఏనాడూ ఆపని,
నిష్ఠా గరిష్టుడు,,",
"నిప్పులు చిమ్ముతూ, రాకెట్ ఎగిరేలా
ప్రోగ్రాం చేసాడు,
భారత యువతను, మేల్కొలిపే,
ఉత్సాహ,
ప్రేరణ మంత్రం చదివాడు,
కడవరకు యువ మెదళ్ళలో మిస్సైల్స్ ప్రయోగించాడు",
"పుట్టుకతో తెచ్చిందేమీ లేదు!,
పోయేటప్పుడు! తీసుకెళ్ళినదేమీ లేదు"!,
కానీ....
"అవకాశం,
ఆకాశం చూపాడు,
ఎగరమని,
కలలను సాకారం చేయమన్నాడు,
నిరాడంబర జీవితం, నిజాయితీ నేర్పాడు,
ప్రపంచానికి ఆదర్శంగా
నిలిచాడు,
యువతలో నిరంతర పరిశోధనా స్ఫూర్తి రగిల్చాడు....
భారత రత్నం,
మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా"....
*_"కలాం!....... సలాం"_!*.
_-రవికుమార్ కంచి_.🙏
🌈✨✨🔥🌟☀️
33
28.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*'మిగులు పొట్లాలు'.*
కవిత సంఖ్య:33.
:::::🐶::🐱:::::
మానవత నీడలో పెరుగుతున్న
మచ్చిక దారిలో వికసిస్తున్న
ఆప్యాయతకు ఆశకు విశ్వాసం
చూపుతున్న పక్షులు
వీధి కుక్కలు
పిల్లులు
మారిన పరిస్థితుల్లో ఆకలి అరుపులు
వినిపిస్తున్నయ్
బేల చూపులు
చూస్తున్నయ్...!
ఆ గడప ఈ గడప
వాలి మురక చూసి
మొత్తుకుని
ఆ అరుగు
ఈ అరుగు
తిరిగి తిరిగి చూసి
ఓ అమ్మ చేతో
ఓ అయ్య చేతో
మెతుకు ముద్ద పడ్తదని తోక
ఊపుకుంటూ మూలుగుతున్నయ్..!
నాయనమ్మలు అమ్మమ్మలు
జీయ్యొ...దా...
అని పిలిచి ఆడ ఈడ
మిగులు ముద్దలు
పెట్టే కాలం
పోయింది...!
అన్నం ముద్దలు ముద్దుగ
మిగులు పొట్లాలై
చెత్త బండిల
పడుతున్నయ్...!
పట్నం మూగజీవుల రోదనలు
చెంతనే చింతలై
వేదిస్తున్నయ్....!
_-రవికుమార్ కంచి_
🙏🌺
::::🕊️:::🐿️::::
34
28.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*'కాగితం'.*
కవిత సంఖ్య:34.
⬜🔲✍️🔲⬜
తెల్లవారింది
కలం జాడలేదు
రాతల ఊసేలేదు..!
ఏ కలవరాల
నిద్రదీస్తుందో
ఏ ఊహల్లో
విహరిస్తుందో....!
ఎన్నో గ్రంథాల బంధం
ఎన్నో హృదయాల కదిలించిన సంబంధం
ఎన్నెన్నో బాధలు బంధనాలు తెంచిన
దోస్తానా మాది..!
కథ రాస్తావో
కవిత రాస్తావో
పాట రాస్తావో
నా యెదపై రాసేసెయ్
రాస్తేనే జనంలో
నువుంటవ్
నేనుంటా..!
నేను గాలికి లేవక కుదురుగ కూసున్న
నాలుగు మూలలు చక్కగా పరుచుకున్న
నా తెల్లని హృదయం తెరిచి
ఎదురుచూస్తున్న...!
మిత్రమా...
కవికలమా..!ఆలస్యమైనదేమి...?
దిగులైతున్నవేమి...?
గుండెలు కదిలేలా
భావాలు నాపై
నింపుతున్నవ్
నీ కన్నీటి
సిరాచుక్కల్లో
నన్నూ
తడుపుతున్నవ్
జర సముదాయించుకో
జర సోచాయించుకో
నీ భావోద్వేగాల రాలే
కన్నీటి కవితల ధారలో
నేనూ నానిపోతే
నేనూ కొట్టుకుపోతే...
కవిత కానొస్తలేదు
వేదన
ఉబికొచ్చిన ఆవేదన
తప్ప
గ్రంథ నిర్మాణ పేజీ
కాదు....!
ఉత్త కాగితమైతి నేను....!
ఇదేమి రచన
మిత్రమా.....!!
_-రవికుమార్ కంచి_
🌷🌿
⬜✍️⬜✍️⬜
35
28.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
🌏 _*"అన్నీ నావే"...!?.*_
కవిత సంఖ్య:35.
🐰🦚🐋🌾🕊️🎑
"అన్నీ నావే!?.....
అంతా నాదే"!!??....
"అవును నేనన్నది, మీరు విన్నది నిజమే!,
"నేను స్వార్థపరుడినే, నేను అత్యాశ పరుడినే,
అన్నీ నా సొంతం అనుకునే మూర్ఖుడిని,
అన్నీ నేను అనుకున్నట్లే అవుతాయనుకొనే దురాశా పరుడినే"!!?.
"ఈ విశ్వం,సమాజం కులాలు,మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రార్థనా స్థలాలు, పండుగలు".....
"అన్నీ నావే"....!!??
"కవులు,శాస్త్రవేత్తలు వైద్యులు, ఉపాధ్యాయులు, కళాకారులు, నాయకులు, కవిత్వాలు, ప్రయోగాలు, మహాగ్రంథాలు,
కళలు,
నిర్మాణాలు".....
"అన్నీ నావే".....!!??
"మేధావులు, తత్వవేత్తలు, సిద్ధాంతాలు, ఆలోచనలు, విధానాలు, సృజనాత్మకతలు, ఆవిష్కరణలు, సమాజహితాలు"........
"అన్నీ నేనే"........!!??
"సుందర జలపాతాలు, పూలవనాలు, కొండలు లోయలు, సరస్సులు జీవవైవిద్యాలు, ప్రకృతి సంపదలన్నీ"....
"అన్ని నావే".....!!??
"సమస్తం...నాదే"!!??
_-రవికుమార్ కంచి🙏._
🌹🌹👑🌹🌹.
36
28.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*👑"గురువులు"*_
కవిత సంఖ్య:36.
🔅🔅🔅🔅
"నేర్చుకునే మనసుంటే,
కనిపించే ప్రతి ఒక్కటీ గురువే!,
కదలాడే జీవులన్నీ ఆదర్శాలే"!!
"ముందు చూపే తప్ప, భయం లేని,
నిద్రపోని,క్రమశిక్షణ తప్పని,
విశ్రాంతెరుగని,
సమైక్య సమరాలు, శత్రువుల శరీరాలపై, మూకుమ్మడి దాడులు, దండులు....
చీమలు,తేనెటీగలు, ఆదర్శాలే...!!
"స్పందించే మనసుంటే"....!
"ఏ ఆధారం లేని, గాలిలో వేలాడే, కనబడని దారాలు, ఆధారాలు చేసుకుని
తిరిగే,
చిక్కిన పురుగుల, వేటాడి మింగే, నైపుణ్య పురుగులు, సాలెపురుగులు, ........గురువులే"..!!
"పరిశీలించే గుణముంటే"......!
"ఏ సాంకేతికతకు అందని, అర్థం కాని, నారల గూడులు, పిల్లల సంరక్షణ అల్లికలు,
పక్షులకే సాధ్యం,
ఆ సునిశిత నైపుణ్యం, మనకు...... ఆదర్శమే"!
_-రవికుమార్ కంచి_🙏.
37
[28/07, 4:48 PM] Kanchi Ravi Kumar Poet: 28.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*🦚"సాహితీ సమూహాలు"🔆✍️.*_
కవిత సంఖ్య:37.
✨✨☀️✨✨
"తేనెల తెలుగు సాహితీ సమూహాలు, నిజమైన అక్షర యజ్ఞాలు,
శాశ్వతమైన పద ప్రయోగశాలలు, దివ్యమైన భావ ప్రతిమలు,
నిత్య చైతన్య దీపికలు,
సమాజ రుగ్మతల నివారణా ఔషధ నిలయాలు కావాలి";
"పారదర్శక అభిమానాలు, పొగడ్తలు,
నిష్పాక్షిక అభిప్రాయాలు, స్వచ్ఛమైన,విశ్లేషణ సమీక్షలు,
దోష నివారణ,
భజన నిర్మూలన తపస్సులు పెరగాలి",
"బంధుప్రీతి,సోదర, పరిచయ,అవసర, స్వార్థ స్త్రోత్రాలు, విడనాడాలి,
సాహిత్య రాజకీయాల పొగ పారకుండాలి"...!!,
"కొందరికి మాత్రమే, ప్రభావశీలురకే పట్టం కట్టే పీఠాల,ముఠాలు, కావద్దు....!!,
ప్రతిభా మూర్తుల సింహాసనాలు కావాలి,
కొత్త కలాల, చైతన్య గళాల,విశాల అక్షర సేద్య పొలాల,
చక్కని సాలుల, హలాలు కావాలి, సాహిత్య ఫలాలు పంచే క్షేత్రాలవ్వాలి"....!!
"గతకాల సమాజ వ్యర్ధాలను,అనర్థాలను కాలరాసే,నూతనత్వం నింపాలి,
నూతన కవుల సృజనాత్మక భావాల ప్రోత్సాహం పెరగాలి",
"సాహితీ సమూహాల అక్షర విప్లవం జరగాలి, నిజమైన సాహిత్య శోధన,సాధన కలగాలి, భవిష్యత్ సాహిత్య గ్రంథ నిర్మాణ,
కళా నిర్మాతలు, పోషకులవ్వాలి"....!
"సాహితీ సమూహాలు, నవ్య భారత, సామాజిక ప్రక్షాళనా,
కళా,రచనా,
వెలుగుల కేంద్రాలు కావాలి"....!!.
_-రవికుమార్ కంచి🙏💐_.
38
🌻🌻✍️🌹🌹.
[28/07, 4:52 PM] Kanchi Ravi Kumar Poet: 28.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"దేవుడు"🙏.*_
కవిత సంఖ్య:38.
🔅🔅☀️🔅🔅
"దేవుడున్నాడా"....?!
"ఆలయంలోనా,
చర్చిలోనా, మసీదులోనా, గురుద్వారాలోనా, ఆరామంలోనా".....??!!
"సాటి మనిషిలోనా, విగ్రహాలలోనా,
సాయమందించే చేతులలోనా"......??!!,
"ఏ గుడిలో వున్నా,
ఏ రూపంలో వున్నా,
ఏ చెట్టులో నున్నా, సూర్యునిలోనున్నా"....!!
"ఎక్కడున్నా....,
ఎలా ఉన్నా"....!!
"దేవుడు మనిషిని చేసినా,
మనిషి దేవుడిని చేసినా".....!!
"సహజ లక్షణం, మానవత్వం నిలిపి ఉంచు,
సాటి మనిషిలో దైవత్వం చూడు, బాధలు చూడు, అతని ఆకలి తీర్చు, అక్కున చేర్చు,
ఆ కళ్ళను చూడు,ఆ కృతజ్ఞతలో దేవుడున్నాడు....!!
ఆ సంతృప్తిలో దైవమున్నది!!,
"ఇదే దైవ దర్శనం"....!!
"ఆ కళ్ళు నిన్నే చూస్తున్నాయి... దైవదర్శన మనుకున్నాయి, పరస్పర దైవాల యినాయి"...!!!
"దేవుడు నువ్వేనా అని ఆశ్చర్యపోయినాయి!!??,
నమ్మ లేక పోతున్నాయి!!"
"దేవుడి విశ్వరూపం మనిషేనా"......!!??.
_-రవికుమార్ కంచి_🙏💐.
39
28.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"చీకటిలోయలు"😭....*
కవిత సంఖ్య:39.
♾️♾️♾️♾️
"తడిలేని వేడి కొలుములు,
ఊపిరాడని చిమ్మచీకట్లు,
ఆహ్వానాలే తప్ప వీడ్కోలు పలకని ఊబులు,
పసి గుండెల్ని పిండేసే జాలిలేని బండల తొర్రలు"....
"ప్రమాదమెరుగని,
మింగ నోరు తెరిచిన మహమ్మారిని గమనించని,
ఆటలే ప్రాణంగా, ధ్యానంగా, పరుగులు తీసే,
పసి పాదాల బంధించే...
నల్ల రాక్షసులు,
చీకటి లోయలు";
"తల్లిదండ్రుల రోదన, బంధువుల వేదన, వినవు,
నిస్సహాయ చేతుల, కాళ్ల ఆరాటాలు చూడవు,
అందీ,అందని ఊపిరుల, ఆఖరి పోరాటాలు చూడవు,
తల్లడిల్లే గుండెల,
ఆయాసాలు చూడవు",
"ఉపయోగం లేని,
బోరు బావులు..... చీకటి లోయలు".....!!
"లేత ప్రాయాలను, చీకట్లో కమ్మేస్తున్న పిచాచులు"......!!
"పాలకులారా, రైతన్నలారా"...!!??
"మీ నిర్లక్ష్యం,
పసి హృదయాలను బంధిస్తున్న, బోనులయినాయి"....!!,
"భావి భారత,
ఆశా కిరణాలను, మూసేస్తున్న, పాతాళాలవుతున్నాయి"....!!
"ఇకనైనా.....
చుక్క రాల్చని, బోరుబావుల...
ఆ చీకటి లోయల,
పూడ్చేయండి".....
"కన్నవారి, కన్నీటి చుక్కలు కారనీయకండి,
విషాద గీతాలకు చరమగీతం పాడండి"....!!!
_-రవికుమార్ కంచి🙏_.
48
30.7.2020.
కవిరాజ్ పురస్కారం
****************"
కవి పేరు ః కంచి రవికుమార్ గారు
*****"*******"""""
1
వీరాస్ కవి సమయం
కవి పేరు ః కంచి రవికుమార్
జిల్లా ః రంగా రెడ్డి
కవిత సంఖ్యని 1
శీర్షిక ః జనం
12.07.20.
*'జనం'*
నా కవిత్వం-196,
9494345594.
➖👩🏻👦👨🦰👳🏻♂️➖
పురివిప్పిన జనపుష్పమై
వికసించిన
ప్రభంజనమై
ఉబికొచ్చిన
జనమే బలం
బలమే జనం
భారం కాదిది
భాగ్యం
అత్యద్భుత
మానవవనరుల
కేంద్రం
నవయవ్వన
భవిష్యత్ స్థంభాల
నిలయం
సమరశంఖ
సైనిక పటాలాల
శాస్త్ర విజ్ఞాన
పరిశోధనల
సృజన సాఫ్ట్వేరుల
కర్మాగారం
కార్మిక కర్షక
చక్రవర్తుల
ప్రపంచ నాయకత్వాల
దిగ్గజ వ్యాపారాల
కళలు క్రీడాకారుల
ఉత్పాదక కేంద్రం
చరిత్రలు చెక్కుతున్న
శిల్పకారుల
స్థావరమీ జనం.
_-రవికుమార్ కంచి_
🌺🙏.
➖➖✳️➖➖.
[14/07, 6:26 AM] Kanchi Ravi Kumar Poet: 14.7.20.
'వీరాస్ కవిసమయం'
సంఖ్య:02.
శీర్షిక:
*'రాజగృహం'.*
నా కవిత్వం-198,
రవికుమార్ కంచి.
----🏛️----
ఆ నేల
మేధావి అడుగులై
అట్టడుగుల అరణ్యరోదనల
తుడిచే
పోరాట ప్రణాళికలకు
ప్రాణం పోసింది
అవి ఉత్త గోడలు
ఉత్తుత్తి దర్వాజలు కావు
సమాజ సముద్రమును
ఎదురీదిన
కులహింసలకు
ఎదురెళ్ళిన
బాబాసాహెబ్ కు
ఆధారమైనవి
ఆ రాజగృహం
పీడిత ప్రజల
సంకెళ్ళను తెంచే
కాలరాసిన హక్కులు
సాధించే
మేధోమథనం
జరిపింది
అంబేడ్కర్ చారిత్రక
ఉద్యమాలకు
పురుడు పోసింది
ఆయన జ్ఞాపకాల భవనంపై
విధ్వంసమంటే
కులమత అసహనానికి
సాక్ష్యాలు చూపినట్టే
మనువాద రాక్షసత్వం
ఉనికి చాటుకున్నట్టే
అంధకారయుగాలకు దారులు
వేసినట్టే.
_-రవికుమార్ కంచి_
🙏🌸
➖➖➖➖
----------------
హామీ పత్రం
ఇది నా స్వీయరచన.
రవికుమార్ కంచి.
-------------------
[15/07, 6:09 AM] Kanchi Ravi Kumar Poet: 15.7.2020.
వీరాస్ కవిసమయం
సంఖ్య:03.
*'మిగిలిన కాలం'.*
నా కవిత్వం -
1️⃣9️⃣9️⃣,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9594345594.
----⏰----
ఎటు పోయిందో....
తరగని గనిలా
కనిపించింది
ఏమయిందో....
ఆకాశమంత అనంతం అనిపించింది
కాలం కళ్ళముందే కరిగిపోయింది
నాటి లేత మొలకలు మహావృక్షాలు
కానే లేదు
పిల్ల కాలువలు మహా కాలువలై
జన దాహం తీర్చనే లేదు
కాలిబాటలు అభివృద్ధి రహదారులై
ఉరుకుతనే లేవు
ఐతేంది....
కాకుంటేంది.......!?
కాలం పేజీలు
మలుపుతనే ఉంది
బడి పిల్లలు
ఐనిస్టీనులు కలాములు కానే లేదు
బక్క రైతు బండెడు దుఃఖాలు
తీరనే లేదు
విద్యా వైద్య శాస్త్ర సాంకేతిక రంగాలు
పాకురై పట్టిన
సమస్యలకు పరిష్కారాలు
చూపనేలేదు
ఐతేంది...!
చూస్తుండగానే కాలం
హిమ కొండలు
జల ప్రవాహాలై కరిగిపోతున్నయ్
పోతే పోనియ్...
పోయింది అరిచినా రాదు
ఈడ్చుకొద్దామన్నా దొరకదు
మిగిలిన కాలం చాలు ఇంకా మూలుగుతున్న
సమస్యలపై మేధోబాణం
సంధించడానికి
ఇంకా నలుగుతున్న మనసులలో వికాస
మార్గం వేయడానికి
మిగిలిన కాలం చాలు..
దాని పేజీలలో
విజయ సువర్ణాక్షరాలు
లిఖించడానికి.
_-రవికుమార్ కంచి_
🙏🌺
➖⏳👍➖.
[16/07, 5:56 AM] Kanchi Ravi Kumar Poet: 16.07.2020.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:04.
*'ఏం రాసినా'....!?.*
నా కవిత్వం -
2️⃣0️⃣0️⃣,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
.............................
...................✍️
ఏం రాసినా.....
అధికార మదం దిగి నేలపై నడుస్తలేదు,
పట్ట పగలు నక్షత్రాలు చూపడం ఆగలేదు,
అహంకార బావి ఊట బందైతలేదు...!?
ఏం రాసినా.....
అక్షర అంతరంగం బహిర్గతమైతలేదు,
పంజరమున్నా లేకున్నా
చిలుకలు ఎగరడానికి
సంశయిస్తున్నయ్,
అరక వదిలి పురుగుమందుల
నురగల గక్కుడే పంటైతుంది
ఏం రాసినా......
విషకణాలు విషం చిమ్ముతూనే ఉన్నయ్,
బడి గంటలు
మూగ నోములు
మూలకు వ్రతాలు చేస్తున్నయ్,
మానవత ముసుగు తీస్తే
అద్దంలో పులి గానే కనిపిస్తున్నడు,
ఏం రాసినా.....
ఆధిపత్య అంతరాల ముందు
చేతులు ముడుచుకు
పోతున్నయ్,
అక్రమాలు అకృత్యాలు కాదు
ఆస్తులు అవసరాలే సలాం కొడుతున్నయ్,
కలాల కాల్చివేత పిడికిళ్ళ బంధనాలు
ఆగడం లేదు,
అయినా రాస్తా.....!?
ఆలోచింప చేస్తా
చైతన్య జ్యోతులు వెలిగిస్తా
ఒక్కరికో
ప్రతి ఒక్కరికో.....✊
_-రవికుమార్ కంచి_
🙏🌺
➖➖🌞➖➖
[16/07, 11:01 AM] Kanchi Ravi Kumar Poet: 16.7.2020.
వీరాస్ కవిసమయం
సంఖ్య:05.
*'జై కొట్టాల్సిందే'..✊*
నా కవిత్వం -
2️⃣0️⃣1️⃣,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
♾️🌿🌞♾️
మనిషికో.. దేనికో..
పుడమిని చీల్చుకు
అంకురం
మురవాల్సిందే
విశ్వానికో.. దేనికో.. అనంతం అంచుల
రగులుతూ
రవి ఉదయించాల్సిందే
వెలుగుకో.. దేనికో.. అంధకార ఆకసాన్ని
తారలు పొడుచుకు రావాల్సిందే
జీవానికో.. దేనికో..
అనంత అవరోధాల నెదిరిస్తూ
మొక్కలు ఎదగాల్సిందే
బతుకుకో.. దేనికో..
పుట్టెడు దుఃఖ సాగరాలు
కన్నీళ్లు చెమట తెడ్లతో ఈదాల్సిందే
ఆనందానికో.. దేనికో..
భయం జోకొట్టి
విజయశిఖరంపై
జై కొట్టాల్సిందే...
✊👍
_-రవికుమార్ కంచి_
🙏🌺.
🌿🌸🌿🌸🌿
[17/07, 6:20 AM] Kanchi Ravi Kumar Poet: 17.7.2020.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:06.
*'కొన్ని అంతే'....!!?*
నా కవిత్వం -202,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
➖➖☹️➖➖
అద్భుతం చూసినా
ఆ కనులు ఇంకోవైపు
తలను తిప్పేస్తున్నయ్..!
అనంతం చేసినా
ఆ మనసులు తొండలు తిరిగే బోళ్ళై
నిస్తేజంగున్నయ్...!
నిరంతరం వెలిగినా
ఆ సమూహాలు
రవికాంతులపై రంధ్రాన్వేషణ
చేస్తున్నయ్..!
అనునిత్యం చైతన్యం రగిలించినా
ఇరుకు ఆలోచనల బెరుకు రూపాలు
లోపాలే చూస్తున్నయ్...!
నిత్యం సత్యాలే చెప్పినా
ఇనుప పాదాలు
సుతిమెత్తగ
తొక్కేందుకే
వంకరబుద్ధి
ప్రదర్శిస్తున్నయ్...!
సాంతం సమాజహితమే
రాసినా చెప్పినా
భావాల బగారా
బాగున్నా
ముక్కిరిచి
ముక్కబియ్యమే
ముక్కు మూసుకుని
బుక్కుతున్నయ్....!!??
కొన్ని అంతే...!
చెద పురుగుల్లా...
యద మురుగుల్లా...
కొత్తదనం ఆస్వాదించని
పురుగుల్లా
మంచితనం
ఆహ్వానించని
పేడపురుగుల్లా...
జ్ఞానోదయం ఎప్పుడో....!?
సమాజం మారేదెప్పుడో....!?
_-రవికుమార్ కంచి_
🙏🌺.
🌿⁉️🌻
[17/07, 10:26 AM] Kanchi Ravi Kumar Poet: 17.7.20.
వీరాస్ కవిసమయం,
సంఖ్య -007.
*'అమానవీయం'....!.*
నా కవిత్వం -203,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
🔅🔅🔅🔅🔅
ఆత్మీయత భుజం కాలేదు
అనురాగం చేతులై సాగనంపలేదు
అనుబంధం అసలు ముట్టనే లేదు
అంతిమయాత్రల భారమే లేదు
ఆ నలుగురి అవసరమే లేదు
డప్పుల బాంబుల మోతలే లేవు
అనాధ అధమ యాత్రలై
నిశ్శబ్ధమైనయ్
వ్యర్థాల ఖననమోలె
శవాలు
కూలుతున్నయ్
అమానవీయ పూడ్చివేతలైతున్నయ్
మనిషి
యంత్రమైపోయాడా..!
యంత్రమే
మనిషైపోయిందా..!
మనిషి పాపమా..! కరోనా శాపమా...!!
_-రవికుమార్ కంచి_
🙏🌸
🔅🔅🔅🔅🔅
[18/07, 6:04 AM] Kanchi Ravi Kumar Poet: 18.7.20.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:08.
*'స్పందన'*
నా కవిత్వం-204,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
♾️🌾🌺♾️
నేలను గాలి
దున్నుతుంది
దుమ్ము లేపుతుంది
అరక దున్నే నీరు లేక
***
నక్షత్రాలు పట్టపగలే నిద్రదీస్తున్నయ్
సూర్యుని ముందు
కుప్పి గంతులు వేయలేక
***
పరిశ్రమలు అలిగి కూసున్నయ్
ఆడించి అలరించే కార్మికులు లేక
***
చీమలు ఆశ్చర్య పోతున్నయ్
దవాఖాన్ల ముందు బారులు తీరిన మనుషుల జూసి
***
బ్యాట్ బాల్లు
పుచ్చి పోయినయ్
చెదలు పట్టినయ్
సెల్లు సొల్లెక్కువయ్యి.
***
_-రవికుమార్ కంచి
9
19.7.2020.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:10.
*'మనం ఆలోచించాల్సింది ఏమిటంటే'...!?*
నా కవిత్వం - 206,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
❕⁉️❔
ఆలోచించాల్సింది ఏమిటంటే ....
మన వెలుగులు ఎన్ని చీకట్లను
వెలిగించాయని...
మన జ్ఞానం ఎన్ని జ్ఞానోదయాలకు
తూర్పయిందని...
మన సామాజిక స్పృహ
ఎన్ని మూఢ మూలాలను
కదిలించిందని...
ఆలోచించాల్సింది
ఏమిటంటే...!?
మన మనసు ఎన్ని
కన్నీటి హృదయాలను
ఆపన్నహస్తమై ఆదుకుందని...
మన ఆలోచనలు
ఎన్ని అచేతన
నాడీకణాల
పునరుత్తేజం కలిగించిందని...
మనం ఆలోచించాల్సింది
ఏమిటంటే..!?
మనం... మనమేంటి...
అని...
మనకు అసాధ్యమైనదేదీ
లేదని...
మనసుంటే....👍🌿
_-రవికుమార్ కంచి
10
21.7.20.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:10
*స్నానం.*
నా కవిత్వం-208,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
°°°°°°💦🌧️°°°°°°
నీ మనసును కడిగి ఎన్ని రోజులు
అయ్యిందో
నీ ముఖ చిత్రం
భయం
గొలుపుతుంది....!
నీ మనసు స్నానాలాడి ఎన్ని
వారాలయిందో
నీ కదలికలు
విచిత్రంగున్నయ్...!
నీ మనసు వర్షంలో
తడిసి
ఎన్ని నెలలయిందో
నీ ప్రతిస్పందనలు
హింసాత్మకంగున్నయ్
....!
నీ మనసు
జలపాతాలను తాకి ఎన్ని
సంవత్సరాలయిందో
నీ హృదయ
స్పందనలు
అతివేగం చూపిస్తున్నయ్....!
నిత్య నిరంతర స్నానాలతో మనో
పంకిలం వదిలించుకో....
సమాజం అందంగా
కన్పిస్తుంది
మానవత్వం
పరిమళిస్తుంది
ఆ స్నానం నీ మంచి
ఆలోచనలే....!
నీ స్థానం
అత్యున్నత ఆలోచనల
ఫలితమే...!!
_-రవికుమార్ కంచి_
🙏💐
^°^°^^°🙂^°^°^°^
11
[21/07, 10:25 AM] Kanchi Ravi Kumar Poet: ➖➖➖➖➖➖
20.7.20.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:11
*'ఆమె'.*
నా కవిత్వం-207,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
🌿🤱🏻👱🏻♀️🧕👧🏻🌸
ఆమె భవిష్యత్ ప్రపంచ సృష్టికర్త
ఆమె బాధలు చెమటలు
ఉన్నత లక్ష్యసాధనకు
నిచ్చెనలు
ఆమె చేతులు ఆస్వాదన అనురాగాల
వారధులు
ఆమె అడుగులు
నవ యువ చైతన్య ఆదర్శ స్ఫూర్తులు
ఆమె సహనాలు విజయం తప్పక
సాధించే పవనాలు
ఆమె పాలనలు
మూర్తీభవించిన
సంపూర్ణ సస్యశ్యామలలు
ఆమె ఒక అమ్మ
ఆమె ఒక సోదరి
ఆమె ఒక భార్య
ఆమె ప్రతి ఇంటిని
వెలిగించే వెలుగొందే
ప్రత్యక్ష దైవం
ఆమెకు ఆమే సాటి
ఆమెకు జేజేలు..🙏
_-రవికుమార్ కంచి_
🙏💐
12
➖➖➖➖➖➖
[21/07, 10:38 AM] Kanchi Ravi Kumar Poet: -------🌞-------
21.7.20.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:12
*'జ్వలనం'.🔥*
నా కవిత్వం-209,
రవికుమార్ కంచి.
...............✍️
ఆ చైతన్య రచనలకు నాలుగు
గోడలే కాగితం...!
ఆ స్వేచ్ఛా
కాముకులకు
ఇనుప సంకెళ్లే
బహుమానం...!
ఆ సామాజిక కాంతులకు ఇనుప
ఊచలే నిలయం...!
ఆ వెలుగు
జ్యోతులకు
అజ్ఞాన చీకట్లే
ఆశ్రయం...!
అధికార అంధకార బంధనాలలో శరీరం
శల్యమైనా
ఆగని మేధో
జ్వలనం...!
ఆ మా'నవ' హక్కుల పరిరక్షకులపై
ఆపరా అమానుషత్వం...!
చూపరా
మానవత్వం...!!
_-రవికుమార్ కంచి_
🙏💐
----✊🌾----
---------------
13
22.7.20.
వీరాస్ కవిసమయం, సంఖ్య:13.
_*ఎక్కడని వెతకను...!?*_
నా కవిత్వం-211,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
❕💦🌾❔
ఎక్కడని వెతకను...!?
విభజన లేని
దొంతర లేని
అణచివేత లేని
సమాజాన్ని....!?
సస్యశ్యామల నేల
స్వచ్ఛ జలాలు
స్వ(స్వే)చ్ఛ గాలులున్న
ప్రదేశాన్ని....!?
ఎక్కడని వెతకను...!?
నిష్కల్మష నిస్వార్థ చైతన్య
మానవత్వపు నిండైన రూపాన్ని...!?
అక్రమాలు అన్యాయాలు
కుటిల
రాజకీయాలు లేని రాజ్యాన్ని....!?
ఎక్కడని వెతకను...!?
గొప్ప కార్యాలు మనం చేస్తే కదా...!
కనిపించేవి....!!
నిర్మాణాత్మక ఆలోచనలు
ఆచరణాత్మక
పనులు మనం
చేస్తే కదా...!
ఎక్కడ వెతికినా
కన్పించడానికి....!?
ఎక్కడని వెతకను...!!??
_-రవికుమార్ కంచి_
🙏🌺
------🌤️------
14
22.7.2020.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:14.
⏰ _*"కాలం"...!!*_ 👍🤴👸🌹
🔅 _*రవికుమార్ కంచి, ఉపాధ్యాయులు*_.
▪️◾⏳🕰️◾▪️
"కాలం నిష్పక్షపాత కలం,
అనంత పుటలలో, మంచివాడి,చెడ్డవాడి చరిత్ర లిఖిస్తుంది,
తనలో కలిపేస్తుంది";
"గొప్ప ఆవిష్కరణల, ఆలోచనల,
కుటిల ఆచారాల, మూఢనమ్మకాల, ముచ్చట్లు రాస్తుంది,
కనపడని పుస్తకంలో దాచేస్తుంది!";
"సుమనోహర చిత్రాలను,
సుందర భవనాలను, వనాలను,
స్వర్గసీమలను గీస్తుంది!,
రాక్షస రాజ్యాలను, సహించలేని స్పర్శలను,
హింసానాదాలను మోగిస్తుంది,
చదవలేని లక్షల కోట్ల పేజీలలో నిక్షిప్తం చేస్తుంది!";
"కాలం అమూల్య క్షణం,
వెనక్కి పోతే బాగుండు!?,
ఒక్క క్షణం ఆగిపోతే బాగుండు....."!!??,
"రాబోయే ప్రళయాలను ఆపేసేవాడిని!, జరగబోయే అనర్థాలను అరికట్టే వాడిని!,
కరోనా కణోత్పత్తి,రోగాలను, మూసేసే వాడిని!,
జఠిల జాఢ్యాలను తుంచేసేవాడిని!, ప్రపంచ యుద్ధాలు ఆపేసేవాడిని!,
రష్యా ప్రాభవం
పెంచేసేవాడిని!, భారత శాస్త్ర,సాంకేతిక అభివృద్ధి,
స్వేచ్ఛా బీజాలు నాటేసే వాడిని!,
మహాత్ముల మరణాలు
ఆపేసేవాడిని!,
కులాల కుళ్ళులు, మతాల ఘర్షణలు,
లేని ప్రపంచాన్ని నిర్మించే వాడిని"!,
"వ్యాధుల పీడలు, కాలుష్య కోరలు లేని, విశ్వాన్ని తయారు చేసే వాడిని!,
జీవ వైవిధ్యం పరిరక్షించే వాడిని!,
శాంతి,సమానత్వం, ప్రజాస్వామిక దేశాలను చూసేవాడిని!,
వైజ్ఞానిక,శాస్త్ర సాంకేతిక రంగాల్లో, భారత అగ్రత్వాన్ని, చూపించే వాడిని !,
విద్యా,వైద్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత నిచ్చేవాడిని"!!
"నా కలలను,కలాం కలలను సాకారం చేసుకునే, శక్తియుక్తులు పొందే వాడిని"!,
"కాలం తన కలాన్ని ఇస్తే,
ఈ విశ్వాన్ని స్వర్గంగా మార్చివేసేవాడిని!!".
🔅
_-రవికుమార్ కంచి_.🙏💐
♾️⏰♾️⏰♾️.
15
22.7.2020.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:15.
💥 _*"వోటరుడా! తెలుసుకో.!.. మేలుకో...."*!!_
☀️ _*రవికుమార్ కంచి, ఉపాధ్యాయులు.*_
🔅✨🔅✨🔅✨
"వోటరుడా!.. తెలుసుకో!... మేలుకో".....!
"నీ వోటును అమ్మతివా...!
నిన్ను నువ్వు అమ్మినట్లు...!!
అంగడిలో గొర్రెవా?! బర్రెవా?!
అమ్ముడు పోవడానికి"...;
"డబ్బులంత పిచ్చైతే,
నీ కన్నుల న'మ్ముతవా?
నీ గుండెలన'మ్ముతవా?
అవి లేకుంటే బతుకుతవా?,"
"పైసలకు,మందుకు ఆశపడి,
ఎన్నికల జాతరకు మోజుపడి,
నీ ఉనికిని కోల్పోకు,
నీ హక్కును
మసి చేయకు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకు, రాజ్యాంగాన్ని అవహేళన చేయకు,"
"నీ వాడను,
నీ వూరును,
నీ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించకు, ప్రశ్నించే హక్కు కోల్పోకు,
అక్రమాలకు ఊతం ఇవ్వకు, అన్యాయాలకు వంత పాడకు,
కొత్త చింతలు కోరుకోకు,
మంచి మనిషిని ఎన్నుకో,
సేవలు చేయించుకో,
అభివృద్ధి సాధించుకో, నీ విలువ పెంచుకో, మనిషిగా నువ్వు మసులుకో,"
"సామాజిక బాధ్యత అలవర్చుకో,
దేశ సేవ చేసుకో, పురోగతికి తోడ్పడు,
నీ బిడ్డల భవిష్యత్, గొప్ప బాటలు వేసుకో, నిన్ను బాగు చేసుకో, మీ పరిసరాలు బాగు చేయించుకో,
వోటు విలువ తెలుసుకో!,
మంచి బతుకు నేర్చుకో."
▪️▪️☀️▪️▪️
_-రవికుమార్ కంచి_.🙏💐
16
22.7.20.
వీరాస్ కవిసమయం,
సంఖ్య:16.
_*'ఎంత ధైర్యం'...!*_
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
❕❕🦠❔❔
గాలికి పోయే
అతిచిన్న కణానికి
ఎంత ధైర్యం...!?
చెట్ల నివాసం నుండి
వంద అంతస్తులకు
ఎదిగిన.....
ఆకులు
చుట్టుకోవడం నుండి
లక్షల సూటుకెదిగిన.....
మనిషినే భయపెడుతున్నది....!
ఆ సూక్ష్మజీవికి
ఎంత ధైర్యం....!!
పచ్చి మాంసభక్షణ నుండి పంచభక్ష
పరమాన్నాలు తింటున్న...
నిప్పు కణికల నుండి అణుబాంబుల
స్థాయికెదిగిన
మనిషినే
వణికిస్తున్నది .....!
ఆ విష కంటకికి
ఎంత ధైర్యం....!?
దేశ సంచారం నుండి
అంతరిక్షయానాల
కేగిన.....
కర్ర ఆయుధం నుండి జీవాయుధ
దాడులకొచ్చిన...
తెలివి మీరి
స్వార్థం మితిమీరి
మానవ సంబంధాలు
విలువలు మరచి
ఎంతకైనా తెగించే మనిషని
ఆ కొవ్వు కోరల పురుగుకి తెల్వదా...!
దానికెంత ధైర్యం...!?
మనిషి ఊపిరాడకుండా
చేస్తుందా...
కోట్ల ఏండ్ల నుండి ఏలిన కోటలను
రాజ్యాలను నిర్మానుష్యం
చేస్తుందా...!
దానికెంత ధైర్యం...!!
_-రవికుమార్ కంచి_
🙏💐.
!?!?🦠!
17
23.7.20.
వీరాస్ కవిసమయం, సంఖ్య:17.
😟 _*ఏంటోళ్ళు...!!??*_
_రవికుమార్ కంచి_. 🌤️
♾️♾️🌱♾️♾️
ఏం ప్రశ్న ఇది? ఎందుకీ ప్రశ్న? ఎంతకాల మీ ప్రశ్న....?
"రూపం చూడు,
ఆకారం పరిశీలించు,
గుణం గమనించు,
చేతలు బేరీజు వేసుకో, నచ్చితే,మాట్లాడు, స్నేహించు, అభినందించు, నచ్చకుంటే మానుకో";!!
"మీ కులమయితే, మంచి వాడు! లేనట్లయితే చెడ్డవాడా"!??
"ఒకే జాతైతే, సంతోషం!?
అన్యజాతైతే భయం, అసహ్యమా!??"
ఏమిటీ దుర్భరం?
"కోట్ల విలువైన ఇల్లు, లక్షల విలువైన వస్తువులు,
వెలకట్టలేని సమయం, అద్భుత మేధాసంపత్తి, ఉత్తమ ప్రయోగాలు, పరిశోధనలు, అధికారాలు బిరుదులు,
అంతరిక్ష యాత్రలు, చరిత్రలు లిఖించిన మానవా!!? హిమాలయాల ఎత్తుకు ఎదిగి,
ఖ్యాతి గాంచిన మానవా"!!?
"కొన్ని వ్యవహారాల్లో....
నీ బుద్ధి"......
"మీ గుమ్మం దగ్గర చెప్పులను
దాటి ఎదగడం లేదు"!!??
"ఆ స్థాయికి మించి, కదలడం లేదు,
"ఇదేమి దరిద్రం??
ఇదేమి దౌర్భాగ్యం"??
"నీ ప్రవర్తన....
పవిత్ర గ్రంథాలపై ఇంకు పోసినట్లు లేదా...!??
ప్రార్థనా స్థలంలో, అపచారం చేసినట్లు లేదా....!??,
క్రికెట్ ఆటలో వాలీబాల్ పెట్టినట్లు..... లేదా!??,
భోజన విస్తరిలో ఇటుక పెట్టినట్టు లేదా.....!??,
చక్కటి సాంబారులో, తుమ్మ కాయ వేసినట్లు లేదా".....!??,
"అసమంజస ప్రవర్తనని మానుకో,
పట్టు పీతాంబరాలు కాదు....!
మానవత్వం ధరించు!!,
మూఢాచారాలు కాదు....!
మూర్తిమత్వం సాధించు!!,
కులాల కంపు,
మతాల ముంపు...కాదు!
ప్రేమ పరిమళాలు,
స్నేహ సౌందర్యాలు వెదజల్లు!!
తుక్కులు,తక్కువ, ఎక్కువలు....కాదు!
సమతలు,మమతలు సంపాదించు,
పెంపొందించు!!
ప్రపంచం అసహ్యించే, కళంకాలు పోగొట్టు!
ఏంటోళ్ళని.....కాదు!!
ఏం కావాలి...
నా ప్రియ భారతీయుడా....!!??
అని ఆహ్వానించు....
"మహనీయుల, మహోన్నత భారతఖండం నిర్మించు"...!
_-రవికుమార్ కంచి_.
18
23.7.20.
వీరాస్ కవిసమయం, సంఖ్య:18.
🤲 🙌 👋🏼 🙏
*"ఆ చేతులు....!?"*
_*నా కవిత్వం-97, రవికుమార్ కంచి*_.
➖♾️➖♾️➖♾️➖
_"ఆ చేతులు"...._
_పురుడు పోసాయి, సుతిమెత్తగా అమ్మ ఒడిలో చేర్చాయి,_
అమ్మ వాసనలు, అమ్మ గొంతుకలు, వినిపించాయి;_
_"ఆ చేతులు"....._
_నిస్సహాయ, బేల చూపుల,_
_బోసినవ్వుల,_
_ఆకలి కడుపుల_ _పాలను ఇచ్చాయి, స్పర్శతో ఆనందం కలిగించాయి;_
_"ఆ చేతులు"......_
_ఇంట్లో,నలుగురిలో, అందరిలో నడిపించాయి, నన్ను పరిచయం చేశాయి,_
_నాకు లోకం చూపించాయి సంతోషం పంచాయి;_
_"ఆ చేతులు"....._
_నన్ను పలకరించాయి, పలక అందించాయి నా చేతుల అ,ఆ లు రాయించాయి,_
_నా భవిష్యత్ రేఖలు గీయించాయి,_ _సకల విద్యలు, శాస్త్రజ్ఞానం బోధించాయి;_
_"ఆ చేతులు......"_
_రమ్మని పిలిచాయి, చేతులు కలిపాయి, భుజాన చేతులు వేశాయి,_
_ఆటలాడించాయి, పాటలు పాడించాయి, ఇంట్లో తెచ్చిన అప్పలిచ్చాయి,_
_చాక్లెట్లిచ్చాయి,_
_పోవొద్దని లాగాయి, ఓదార్చాయి,_ _నవ్వించాయి, విడువనని గోలచేశాయి_
_"ఆ చేతులు"....... ఒక వైద్యునివి,ఆయావి...!!_
_"ఆ చేతులు......" అమ్మవి,నాన్నవి....!!_
_"ఆ చేతులు....." గురువువి, స్నేహితుడివి....!!_
_"ఆ చేతులే......_"
_శ్రీరామరక్ష ,!!,_
_యేసురక్ష,!!_
_గౌతమ్ రక్ష,!!_
_అల్లా రక్ష !!_
_విజ్ఞాన రక్ష!!!_
_"ఆ చేతులే....."_
_రేపటి,భారత పౌరుల చేతలు_,
_గొప్ప రాతలు_,
_అధినేతలు_,
_శాస్త్రవేత్తలు_,
_తత్వవేత్తలు_.
_-రవికుమార్ కంచి, ఉపాధ్యాయులు_🙏💐.
➖♾️➖♾️➖♾️➖.
19
23.7.2020.
వీరాస్ కవిసమయం,
కవిత సంఖ్య:19.
💖 _*నా కవిత్వం. రవికుమార్ కంచి*_.
☀️ _*"పుడమి పువ్వులు"*_💐.
"అరకలు కట్టి, బడితను పట్టి,
ఎడ్లను కసిరి,పగ్గం గుంజి,
బాధల నొక్కి, చెమటలు కక్కి,
నల్లరేగడుల పాదం దింపి,
పొలముల చక్కని వరుసలు నింపి,"
"బెల్లం చేరిన చీమల్లాగా,
వేపకాయను ముసిరిన ఈగల్లాగా,
పువ్వుల వాలిన తుమ్మెదలాగా,
నీటిని పరిచిన తామరలాగా,
పుడమిని పులకించిన పువ్వుల్లాగా,
ఖనిజం తొవ్విన గడ్డపారలాగా,
మట్టిని తోలిన పారల్లాగా,
రాయిని పెకిలిన సీకుల్లాగా".....
"భూమే మాకు దిక్కూ, మొక్కూ,
ప్రకృతే మాకు అండా, దండా",
"నేలల చెమట చుక్కలు కార్చి,ముత్యాలు తీస్తాం,
భూయదపై రక్త బిందువులు చల్లి, వజ్రాలు కోస్తాం,"
"ధరణి పారాణులం,
పుడమి ప్రాణులం",
"విశాల నేలయే మాకు బడి,
నల్లని పొలమే మాకు పలక,
పైరుల ఫలములే వాక్యాలు,
ధాన్యం కుప్పలే పుస్తకాలు,
కాపు గాసుడే పరీక్షలు,
కడుపులు నింపుడే ఫలితాలు,
నేల బడి పిల్లలం,
సాగు సదువే రైతులం".
-రవికుమార్ కంచి.
"ఇది నా స్వీయరచన".
🌿🌸🌿🌸🌿🌸
20
[24/07, 1:35 PM] Kanchi Ravi Kumar Poet: 24.7.2020.
వీరాస్ కవిసమయం.
శీర్షిక:
⬛ _*గెట్లు*_ ⬛
_*, రవికుమార్ కంచి, ఉపాధ్యాయులు*
._
హైదరాబాద్,
కవిత సంఖ్య:20
➿➿➿➿➿➿
"ఇరవయేండ్ల క్రితం,
ఏ వ్యవసాయ పొలాలకు,
కంచెలు,గోడలు,
గెట్లు లేవు,ఏ గేట్లు లేవు,
కొండల కొట్టిన రాళ్ల కడీలు,
చెట్ల కోసిన దూలాలు, తాటి కమ్మల, గుడిసెలు,కొట్టాలు తప్ప,!
ఫామ్ హౌజులు లేవు,
జల్సాలు,గలీజులు లేవు"!!,
"భూముల కృత్రిమ భూమ్ తో,!
ఆశలు పెరిగినయ్, దురాశలు రేగినయ్, హద్దు రాళ్లు కరిగినయ్, సరిహద్దులు
మారినయ్, సంబంధాలు తెగినయ్, సంప్రదింపులు తగ్గినయ్, సంప్రదాయాలు పోయినయ్",!!
"పోరంబోకు భూముల ఆక్రమణ,
సాగు లేని సోదరుల భూమి దురాక్రమణ,
కాలువ,మడుగు,
యేరైనా పూడ్చేసుడే,
కొండయినా, గుట్టయినా,
కాదేదీ కబ్జకనర్హం",!!
"పొలాల అంచులు కాదు,
శెల్కల సరిహద్దులు కాదు,
తోటల అంతముల కాదు,
"నడవొద్దని,కాళ్లకు శూలాలు పెట్టిండ్రు",!
"చెయ్యి పెట్టొద్దని, వైరుల కరంటు పెట్టిండ్రు",!
"గుండెల్లో గెట్లు పాతిండ్రు,
మనసుల ముళ్ళకంచె వేసిండ్రు,!"
"మనుషులే రాళ్ల తెట్టెలయిండ్రు,!!"
"తండ్రి,సోదరుడనే బంధమే లేదు,!
అడ్డొస్తే అనర్థమే,! కాదంటే ఖండనమే! వినకుంటే హింసాత్మకమే!!"
"భూమి కి...భూమ్...కాదు,
మనిషికి....భూతమ్...పట్టింది...!!
మానవత్వాన్ని..........ఖతమ్ బెట్టింది"....!!!??.
_-రవికుమార్ కంచి_.🙏🌷
21
➰➰➰➰➰➰
[24/07, 1:41 PM] Kanchi Ravi Kumar Poet: 24.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
👨🎓
శీర్షిక: _*"శాస్త్రజ్ఞుడా"....!!*_
కవిత సంఖ్య:21.
➖🔆➖🔆➖
శాస్త్రజ్ఞుడా...!
నీ పరిశోధన మరింత పదును పెట్టు,
నీ ఆలోచనల ఇంకా సాన పట్టు,
క్షణక్షణం,అనుదినం నీకు సవాలే?!,
నీ ఊహలకు సృజనకు, సిద్ధాంతాలకు పునాదులే!,
కొత్త రోగాలు జడలు విప్పుతున్నాయి!,
కొత్త విష కణాలు, విషం కక్కి విజృంభిస్తున్నాయి?!, కొత్త సమస్యలు తాండవిస్తున్నాయి!,
తప్పు నీదా? మనుషులదా?
నీ మేధల, ఉద్భవించిన మెరుపులు,
నీ సృష్టిలో వికసించిన విశ్వాలు,
నీ ఊపిరిలో పరిఢవిల్లిన జీవాలు, జనాలు,
నీ అన్వేషణల మొలకెత్తిన వనాలు,
నిన్ను ప్రశ్నిస్తున్నాయి! నువ్వేం చేస్తున్నావని!!?
నిన్ను ప్రాధేయ పడుతున్నాయి, మార్గం చూపమని!,
నిన్నే తలుస్తున్నాయి, సంక్షోభం తొలగిస్తారని!,
నిన్నే వెతుకుతున్నాయి,
నీ ఆవిష్కరణలు వస్తాయని!!,
నిన్నే ఆరాధిస్తున్నాయి, నువ్వే దిక్కు,దైవమని!!,
నిన్నే చూస్తున్నాయి, పరిష్కారం చూపమని?!,
క్యాన్సర్, SLE, తలసేమియా, ఎయిడ్స్,కోవిడ్19....
ఆయుధం ఎప్పుడు! అంతమెప్పుడని!!,
అణు ప్రయోగాలు, క్రిమిసంహారక మందులు,
నింగీ,నేలా,గాలి,నీరు కలుషితాలు,జన్యు లోపాలు.... మనిషి పాపాలకు ముగింపు ఎప్పుడు??
పరిరక్షణ,ప్రక్షాళన ఎప్పుడు??!.
_-రవికుమార్ కంచి_.🙏
22
➖🔆➖🔆➖.
[24/07, 1:50 PM] Kanchi Ravi Kumar Poet: 21.5.2020.
వీరాస్ కవిసమయం,
పేరు: రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
🛣️ _*రోడ్డు పాలు*_
కవిత సంఖ్య:22.
🍅🍆🥔⁉️
అప్పులను అధిగమించి, వాతావరణ ముప్పులను ఎదుర్కొని,
నకిలీవా, అసలువా తెల్వని,
ఖరీదైన విత్తనాల కొనుగోలు,
ట్రాక్టర్లతో దున్నకం, కూలీలతో పనులు, దినదినం పరిశీలన కాపలా,
ఓ గండం.....!!
ఒకవైపు అడవిపందులు, మరోవైపు చీడపీడలు,
ఒక దిక్కు,తుఫానులు,
మరో దిక్కు వరదలు, అటు నుండి దొంగలు ఇటు నుండి పక్షులు ఎలుకలు;!
ఇవన్నీ ఒక ఎత్తయితే మార్కెట్లో అమ్మకం మరో ఎత్తు,!
ప్రభుత్వం మద్ధతు ధరొకటి,
మార్కెట్ శక్తుల ధరొకటి,
నాణ్యత లేదని తరుగు
దోపిడీ,
వరుసలుంటే,వర్షాల దొంగల దోపిడీ,
కాంటను,
ఓ కంట కనిపెట్టక పోతే నిలువు దోపిడీ,
తతంగం పూర్తయ్యేసరికి, మద్దతు ధర ఢమాల్, నిల్వ సామర్థ్యం నిల్;
ఇక వృధా ప్రయాస భరించలేక,
ఓపిక నశించి,
అమ్మినా,
ఖర్చులు పోగా ఏమి మిగలని ధైన్యంలో,
ఆవేశంలో,
రోడ్డే నిరసన పొలంగా,
నల్లని తారుమడిలో పంట తొక్కి,
రోడ్డున పడ్డాడు
రైతు,!
పంట రోడ్డుపాలు, కష్టార్జితం,
కష్టాలపాలు,
రైతు కన్నీటి పాలు,
అంతా... రోడ్డుపాలు!
రైతు బతుకు అప్పుతో ఆరంభం...!
అప్పుతోనే...అంతం,!!
లాభమెక్కడ??
జీవనమెట్ల???
దళారులే లాభాలపాలు!,
అటు రైతు,
ఇటు కొనుగోలు దారులు,
నష్టాలపాలు,!!
శ్రమ రోడ్డుపాలు,!
సేద్యం రోడ్డుపాలు!!,
_-రవికుమార్ కంచి_.🙏
23
[25/07, 6:05 AM] Kanchi Ravi Kumar Poet: 25.07.2020.
వీరాస్ కవిసమయం,
కవిత సంఖ్య:23,
శీర్షిక:
*'సైకిల్'.*
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
హైదరాబాద్.
______🚲______
కాళ్లందని కాన్నుండి సీటెక్కేదాక నను
మోసింది
అద్భుతాలు చేసింది
మూతులు
మోచేతులు మోకాళ్లు
పగిలినా
లేచి నేర్వాల్సిందే
నేర్చి గెలవాల్సిందేనని
ప్రేరేపించింది
మట్టి బాటలు
పిల్లబాటలు
కంకర రోడ్లు
తారు రోడ్లు చూపి కష్టాన్నెదిరించి
లక్ష్యం చేరమన్నది
దోస్తుల ఇండ్లు బడి దుకాణాలు బోరింగు
బావులు
చిన్న తాత
పెదనాయన ఇండ్లు
మరో తీరుగా
చూపెట్టింది
ఇద్దర్ని ఎక్కించుకుని తొక్కుడు
ఊకనే బెల్లు గొట్టుడు
పోటీలు పడుడు
జారిపడుళ్ళు జరిగినా
క్రీడాస్ఫూర్తి నేర్పింది
తనిప్పుడు కదలకున్నా ....
కొత్త పంథాలో
జీవిత
ప్రయాణం నేర్పింది..
నా అట్లస్ సైకిల్...
_*-రవికుమార్ కంచి*_
🌿🙏.
👍🌸🚲🌺✌️
24
[25/07, 10:47 AM] Kanchi Ravi Kumar Poet: 24.7.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
కవిత సంఖ్య:24.
శీర్షిక:
*ముందుకే...*
🏃🏽♂️🏃♀️............
ముళ్ళుంటయ్
రాళ్ళుంటయ్
అడుగడుగున ఆటంకాలుంటయ్...!
మొరిగే కుక్కలు మురిగే మనసులు
కరిగే కాలాలు
తరిగే అవకాశాలు
విరిగే ఆకాశాలు
ఎన్నో అడ్డుకుంటయ్
మరెన్నో ఆపేస్తుంటయ్...!
నడుస్తావో
ఉరుకుతావో
దొర్లుతావో
దూకుతావో
శరీర అలసట అధిగమిస్తూ
మనసు గాయాలు మాన్పుకుంటూ
జీవన సమరం సాగిస్తూ
ప్రేమలు గెలుపులు సాధిస్తూ
సోదరా...!
సోదరీ.....!!
లక్ష్యసాధనలొ
పడినా... లేచి.... ముందుకే నడువు...
లేచి నడవడంలోనే
ఉంది గెలుపు
మున్ముందుకే
వడివడిగా
నడువ్ నడువ్.....
విజయం నీదే
నడువ్ నడువ్.....
👍👊✌️✊
_-రవికుమార్ కంచి_
25
🎯🏃🏽♂️..............
[25/07, 10:51 AM] Kanchi Ravi Kumar Poet: 25.7.2020
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
🔴 _*"మానవ సంహారకాలు".....!!???*_.
కవిత సంఖ్య:25.
▪️🌱♾️🦋♾️▪️
"ఏ పంటైనా, ఏ తోటైనా,
రసాయన క్రిమిసంహారకాలు,
జీవ,మానవ సంహారకాలు,
పరోక్ష సంహారకాలు"....
"చల్లనిదే,వెదజల్లనిదే, పూత లేదు,కాత రాదు",
"ఘోరమైన పరిస్థితి ఏర్పడింది, భయంకరమైన దుస్థితి దాపురించింది, కూరగాయలు,పండ్లు వరి,జొన్న,గోధుమ, ఎంత కడిగినా,
ఎలా తోమినా, వదలని రసాయనాలు, జీవజాల మనుగడ ప్రశ్నార్థకం"???
"భయంకర రోగాలు, ఉత్పరివర్తనాలు, నివారించలేని దరిద్రాలు,
నాడీ,శ్వాస,జీర్ణ ప్రసరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావాలు, పసిప్రాయంలోనే విపరీతాలు,
ఘోరమైన ఉపద్రవాలు,"
"మన బిడ్డల భవిష్యత్తు,
దేశం,విశ్వం
చక్కబడాలంటే,
స్వచ్ఛ నేల,గాలి,నీరు ఆహారం,ఉండాలంటే,
జీవ వైవిధ్యం కాపాడాలంటే"....
"మన సేద్య విధానాలు మారాలి,
విష రసాయన మందుల వాడుక ఆపాలి,
సహజ ఎరువుల వాడకం పెరగాలి,
సహజ పంటలు పండించాలి,
రైతుల ప్రోత్సాహం పెంచాలి,
ప్రకృతి సహజత్వం పరిరక్షించాలి,"
"స్వచ్ఛ,ఆరోగ్య , ఆనంద,భారత్ నిర్మించాలి."
_-రవికుమార్ కంచి_🙏🌹.
26
25.7.2020.
వీరాస్ కవిసమయం
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
🙇♂️ _*"ఒంటరైపోకు"..!!??*_
కవిత సంఖ్య:26.
👁️🗨️👁️🗨️👁️🗨️
"ఒంటరైపోకు.........మిత్రమా"....!!
"నిజాలు మాట్లాడితే నచ్చే లోకం కాదిది,
నిజాయితీగా ఉంటే సహించే రోజులు కావివి,
బంధువులు స్నేహితులైన మంచితనమే చూడు మంచి ప్రవర్తనే ప్రోత్సహించు, వారంతట వారే తెలుసుకునేలా చేయి, సంస్కరణల ప్రయత్నం వద్దు!,
విశ్వం మార్చేస్తాననే ప్రగల్భాలు వద్దు!,
ప్రతి ఒక్కరిలో మంచినే చూడు!,
చెడు లేనివాడు లేడు!,
ఒంటరైపోకు... మిత్రమా,
నీ మాటలు నచ్చవు!, నీ ప్రవర్తనతో వారికి లాభం ఉండదు!,
నీతో పాటు,
లోకం మారాలనే ఆలోచన మానకు!!,
ప్రయత్నం ఆపకు"!,
"కానీ తొందర వద్దు"!?,
"మార్పు నిదానంగా జరుగును,
ఆలోచన వేగంగా కదులును,
ఆచరణ ఆలస్యంగా జరుగును!,
నీతో సహా...!,
సంపూర్ణ మానవుడు ఎవడైనా ఉన్నాడా...!??,
ఏ లోపం లేనివాడు,
ఏ పాపం చేయని వాడున్నాడా...!!??
పొరపాటు చేయని వాడున్నాడా...........మిత్రమా"!!??
"నువ్వు చెప్పింది వినాలి!,
నువ్వు చేసింది ప్రశంసించాలి!! గొప్పవాడని అనాలి! అనుకోవడం అసమంజసం"!!,
"మంచి,చెడు సమూహాల,
ప్రవాహ సమాజమిది!!
తేలిపోతూనే ఉండాలి"!!,
"అవకాశం దొరికితే ఎదురీదాలి"!!,
లేదా
"ఆ ప్రవాహంలో పోతూనే ఉండాలి!!
మన కోసం ఏదీ ఆగదు"!,
" నీ మంచి పనులు ఆపకు,
నవత,మానవతా ఆపకు",
"అన్ని గుణాల మిశ్రమమే సమాజం..."!!
అది
ఏదో ఒకరోజు,
నీ మాటలు వినక తప్పదు!,
నిను గుర్తించక తప్పదు!!,
ఏదైనా... సమాజం లోనే ఉండు... మిత్రమా...!!
ఒంటరై పోకు....!!!.
_-రవికుమార్ కంచి_.🙏.
27
[26/07, 6:18 AM] Kanchi Ravi Kumar Poet: 25.7.20.
వీరాస్ కవిసమయం
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*'తెరవెనుక'....!?*
కవిత సంఖ్య:27.
---📽️🎬🎭---
రాత్రులు వెలుగు నింపిన భుజం
చీకట్లో జారిన తన జీవితం
వెతుకుతున్నయ్..!
వెన్నెల వెలుగుల ముఖారవిందాల
రంగులు అద్దిన చేతులు నలుపై
పోయినయ్..!
ప్రతి దృశ్యం
కళా శోభితం
వర్ణమయం నేత్రానందం కలిగించే
కుంచెలు
కుంచించుకుని
పెన్ స్టాండ్లకే పరిమితమైనయ్...!
ఆకర్షణీయ కుంతల సామ్రాజ్య నిర్మాణ
కళాకారుల జీవ నైపుణ్యాలు
పిట్టగూళ్ళై
కూలిపోతున్నయ్ ..!
అదిరేటి స్టెప్పులతో ప్రేక్షకలోకం ఈలలు
చప్పట్లలో
చిందేసిన పాదాలు
కరోనా ముళ్ళపై రక్తమోడుతున్నయ్..!
కన్నీళ్లు దాచి అభినయాలు
ఆహ్లాదాలు పంచే సహనటుల సహనం
అసహనమై చితికిన జీవన చిత్రాలు చతికిల
బడ్తున్నయ్...!
తెరవెనుక
సినిమా సిత్రాలు
చితికి
పోతున్నయ్..!
_*-రవికుమార్ కంచి*_
28
[26/07, 6:25 AM] Kanchi Ravi Kumar Poet: 26.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
🕺 _*"నాయకుడు"..🏹👍*_
కవిత సంఖ్య:28.
▪️▪️💐▪️▪️
"నాయకుడు.... ఎక్కడ"....!?
"ఆసనానికి అతుక్కోకుండా!, సింహాసన దర్పం చూపకుండా!,
జనాల గుండెల నిండిన,
జనాల నిచ్చెనల నుండి,
పీఠమెక్కే , ప్రజానాయకుడు ఎక్కడ".....!!??
"పదిమందిలో ఒకడిలా,
అందరి బాధలు మోసే దేవుడిలా!,
కష్టసుఖాలు పంచుకునే సఖుడిలా, ధైర్యం విశ్వాసం నింపే బోధకుడిలా,
ఆపదలో ఆదుకునే మిత్రుడిలా,
శోకంలో శ్వాసలు ఊదే ఊపిరిలా! మెరుపువేగంతో ఆలోచనలు చేసి, ధీటైన నిర్ణయాలతో ముందుకు సాగే"....,
"వంద మందికి విజయాలు పంచే, వెయ్యిమందికి దారి చూపే,
నిజమైన నిస్వార్ధ సేవ చేసే......!
నాయకుడు!
అధినాయకుడు!!
ఈ కాలంలో ఎక్కడ...."!??
"పొలాలు,ఆస్తులు అంతస్తులు లేకున్నా!, ఇంట్లో బాధలు ఎన్నున్నా!,
ఒంట్లో రోగాలు ఏం చేసినా!, కుటుంబసభ్యులు ఇబ్బంది పడినా!, ఆర్థిక భారాలు,
కఠిన కార్యాలు పెరిగినా!,
సంపాదించే,కట్టలు,
కోటలు కట్టే,
అవకాశ మున్నా!, నిజాయితీయే ప్రాణంగా,
ప్రజా సేవే లక్ష్యంగా, త్యాగాలే ముఖ్యంగా, ముందుకు నడుస్తూ లౌక్యంగా,
పోరాడే నాయకుడు.....ఎక్కడ"!!??
"ఈ జమానాలో, జనంలో ప్రాణమై నిలబడే"...!?
"అసలు సిసలైన నాయకుడు..... ఎక్కడ"....!?.
_-రవికుమార్ కంచి_.
29
26.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*ప్రశ్నించొద్దా..!?*_
కవిత సంఖ్య:29.
❗❗❓❓
ఎట్లున్నా ఏమనొద్దు!, ఏమైనా అడగొద్దు!,
ఏ బాధైనా మాట్లాడవద్దు....!?;
ప్రశ్నించే గళం వద్దు, ప్రశ్నించే కలం వద్దు, ప్రశ్నించే వేలు వద్దు, ప్రశ్నించే సాహిత్యం వద్దు,
అసలు ప్రశ్నించే, మనిషే ఉండొద్దు!!??,
పాలకులపై ప్రశ్నే ఉండొద్దు!!??
వద్దు.. వద్దు.. వద్దు.. ఏదీ...అడ్డు వద్దు!!??
ఏమిటీ నియంత నియంత్రణలు!?,
ఏమిటీ పాలన,
ఆలన,లాలన మరిచిన పరిపాలన,
ఆదిమ కాలం నుండైనా,
అరణ్య యుగం నుండైనా,
అనాగరిక యుగం నుండైనా,
ప్రశ్న లేకుండా నిప్పు లేదు,చక్రం లేదు,
ప్రశ్న లేకుండా అస్త్రం లేదు,
వస్త్రం లేదు,
ప్రశ్న లేకుండా పరిశోధన,అభివృద్ధి లేదు,
జీవ మానవ మనుగడ లేదు,
ప్రశ్న లేకుండా పర్యావరణం లేదు!!;
మీ అధికారం,మీ పీఠం లేదు,
మీ భోగం రాజవైభోగం లేదు,
ప్రశ్న లేకుండా ఏదీ లేదు....!!
ఏది సాధించబడ లేదు!!
ప్రశ్న వేల మెదళ్లను కదిలిస్తుంది,
లక్షల సమాధానాలు, పరిష్కారాలు రాబడుతోంది,
ప్రశ్న, స్తబ్దతను తొలగిస్తుంది, ఆలోచనలు రేకెత్తిస్తుంది,
ప్రశ్న మార్పును చూపిస్తుంది భవిష్యత్ కు,బాటలు వేస్తోంది, ప్రశ్న అన్యాయాల నిరోధిస్తుంది, అక్రమాల హరిస్తుంది,
ప్రశ్నకు, ప్రశ్న, వేదన.... జవాబు కాదు!!
ఈ ప్రశ్నకు సమాధానమే విధానం,
ప్రశ్నకు పరిష్కారమే సమాధానం,
ఇది ప్రజాస్వామిక విధానం,
అభివృద్ధికి నినాదం.
_రవికుమార్ కంచి_.🙏.
🌸🌿🌸🌿🌸
30
[26/07, 6:53 PM] Kanchi Ravi Kumar Poet: 26.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"కలం"✍️*_
కవిత సంఖ్య:30.
🌹🌹✍️🌹🌹
"కలాలు.....
మట్టి కొట్టుకుపోతున్న
జీవన చిత్రాలు
గీయాలి, అల్లాడిపోతున్న బతుకుల కవిత్వాలు రాయాలి, ఆరాటపడుతున్న లేత గుండెల ఆకలి కేకల వ్యాసాలు చూపాలి,
మంటగలిసి పోతున్న మానవత్వపు ధైన్యాన్ని గ్రంథంగా మలచాలి",
"కలాలు.....
అమాయక బాలల చీకటి కోణాలకు వెలుగు రాతలు రాయాలి,
చెవులకు చేరని ఆర్తనాదాలకు, పరిష్కార నినాదాలు రచించాలి,
కృశించిపోతున్న, నశించిపోతున్న, ప్రకృతి సంపదల నిలబెట్టే,
మొక్కలు ప్రతి ఒక్కరు నాటే స్పృహ కలిగించాలి",
"కుల కుతంత్రాల, మతమౌఢ్యాల
ముప్పులను గెట్లను తెంచి,
సోదరభావాన్ని పెంచే, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే,
శాస్త్రాలు లిఖించాలి",
"మన కలాలు.....
ప్రజల సమస్యలపై పోరాడే నిరంతర గళాలై పరుగెత్తాలి"!,
"పేదల బతుకుల్లో వెలుగు నింపే,
అఖండ దివిటీలు కావాలి",
"మన కలాలు..., ప్రపంచాన భారతీయుడు, గర్వంగా తలెత్తుకు తిరిగే,
విద్యా,వైద్య,విజ్ఞాన సాంకేతిక,సాహిత్య, కళా,ఆర్థిక రంగాల్లో, ఉత్తమోత్తమ స్థానాలు,శిఖరాలు,
చేరేలా ప్రేరేపించాలి"....!
"మన కలాలు....
కాలక్షేపాలు,
పొగడ్తలు,
సౌందర్య వర్ణనలకే,
పరిమితం కారాదు"....
"మన కలాలు...
చైతన్యం నింపాలి,
కొత్త భారతాన్ని లిఖించాలి,!
చరిత్రలు తిరగరాయాలి,
నవ విశ్వాన్ని సృష్టించాలి"!!
....✍️✊.
_రవికుమార్ కంచి_🙏💐.
31
🌈👑💐👑🌈.
[26/07, 6:56 PM] Kanchi Ravi Kumar Poet: 25.5.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"ప్రకృతి బీభత్సం😟"*_
కవిత సంఖ్య: 31.
♾️♾️♾️♾️♾️♾️
ఓ మానవా...
!
నీ విజ్ఞాన తృష్ణతో అనంత ఆకాశాన్ని, రాకెట్లతో, కాంతివేగంతో చీల్చావు!,
నీ సాంకేతిక పరిజ్ఞానంతో లోతైన సముద్రాల అగాధాల చీకటి అడుగులను సబ్మెరైన్లతో తాకావు!!,
భూగోళ ఉత్తర,దక్షిణ ధృవాన, విమానాలతో అడుగులు పెట్టావు,
నీ జండాలు పాతావు!!,
కానీ.....
ప్రకృతి ముందు నీ కుప్పిగంతులు చెల్లవు,
నీ వినాశక చర్యలు కుదరవు,
నీ విపరీత చేష్టలు నడవవు,
అకాల వర్షాలు, భయంకర తుఫాన్లు, భూకంపాలు, వరదలు,
సునామీలు,లావాలు, ఎండలు,
ప్రకృతి బీభత్సాలు, సహజ సవాళ్లు...
నువ్వు ఎదురించ లేవు?
ఓ మానవా...!
ప్రకృతి ప్రకోపాల ముందు,
నువ్వెంత??
నీ తెలివెంత??
ఇకనైనా మేలుకో!,
నీ కొమ్మను నువ్వే, నరికే పనులు ఆపుకో, మానుకో....!!!
ప్రకృతి బీభత్సాలకు,
నీ చెత్త పనులు తోడైతే!!,
ఒక్క జీవి కూడా మిగలని....
నిర్జీవ భూగోళమైతది..!,
నీలి గోళం,
నిశ్శబ్ద నిర్జీవ,గోళమైతది!!,
ప్రకృతి విరుద్ధ కార్యాలు చేయకు, సహజ వనరుల వినాశక చర్యలు చేపట్టకు....!!
"ప్రకృతిని నువ్వు పెంచు...
నిన్నది ఆరోగ్యంగా పెంచుతుంది".
_-రవికుమార్ కంచి_.🙏
♾️♾️♾️♾️♾️♾️
32
26.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*🌈✨"కలాం... సలాం!!🙏"*_
కవిత సంఖ్య:32.
✨✨⚡⚡🌟🌟
"కలలు కనండి...కలలను సాకారం చేసుకోండి"...... _*"కలాం"*_
"ఎక్కడో పుట్టావు..
ఎలాగో పెరిగావు....
కష్టాలు పడ్డావు...
సుఖాలు, బాధలు మరిచావు"....
"పక్షులు,ఆకాశం...
నీ నిరంతర పరిశీలనలు...
ఆకాశాన్ని తాకాలనే,
రామేశ్వరం తీర అలలే నీకు... ఆదర్శాలు"...
"ఉన్నత విద్య,
శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలే నీ అర్హతలు"....
"పరుగులు పెట్టించావు,
అణు పరీక్షలు,
అంతరిక్ష ప్రయోగాలు;
చిన్నతనంలో పక్షులతో పోటీ పడిన,
నీ ఊహలు, ఆలోచనలు,"
"భారత మువ్వన్నెల జెండాను,
మోసే రాకెట్లు,
ఉపగ్రహాలయినాయి"..
"భారత కీర్తిని పెంచే, కలాం స్ఫూర్తిని రగిలించే,
ఖగోళ,విజ్ఞాన యాత్రలయినాయి"....
"రాకెట్ వీరుడే,
విజ్ఞాన వీరుడే,
రాష్ట్రపతి పదవిలో ఉన్నా,
భావి భారత పౌరుల తరగతి బోధన,
ప్రేరణ తరగతులు,
ఏనాడూ ఆపని,
నిష్ఠా గరిష్టుడు,,",
"నిప్పులు చిమ్ముతూ, రాకెట్ ఎగిరేలా
ప్రోగ్రాం చేసాడు,
భారత యువతను, మేల్కొలిపే,
ఉత్సాహ,
ప్రేరణ మంత్రం చదివాడు,
కడవరకు యువ మెదళ్ళలో మిస్సైల్స్ ప్రయోగించాడు",
"పుట్టుకతో తెచ్చిందేమీ లేదు!,
పోయేటప్పుడు! తీసుకెళ్ళినదేమీ లేదు"!,
కానీ....
"అవకాశం,
ఆకాశం చూపాడు,
ఎగరమని,
కలలను సాకారం చేయమన్నాడు,
నిరాడంబర జీవితం, నిజాయితీ నేర్పాడు,
ప్రపంచానికి ఆదర్శంగా
నిలిచాడు,
యువతలో నిరంతర పరిశోధనా స్ఫూర్తి రగిల్చాడు....
భారత రత్నం,
మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా"....
*_"కలాం!....... సలాం"_!*.
_-రవికుమార్ కంచి_.🙏
🌈✨✨🔥🌟☀️
33
28.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*'మిగులు పొట్లాలు'.*
కవిత సంఖ్య:33.
:::::🐶::🐱:::::
మానవత నీడలో పెరుగుతున్న
మచ్చిక దారిలో వికసిస్తున్న
ఆప్యాయతకు ఆశకు విశ్వాసం
చూపుతున్న పక్షులు
వీధి కుక్కలు
పిల్లులు
మారిన పరిస్థితుల్లో ఆకలి అరుపులు
వినిపిస్తున్నయ్
బేల చూపులు
చూస్తున్నయ్...!
ఆ గడప ఈ గడప
వాలి మురక చూసి
మొత్తుకుని
ఆ అరుగు
ఈ అరుగు
తిరిగి తిరిగి చూసి
ఓ అమ్మ చేతో
ఓ అయ్య చేతో
మెతుకు ముద్ద పడ్తదని తోక
ఊపుకుంటూ మూలుగుతున్నయ్..!
నాయనమ్మలు అమ్మమ్మలు
జీయ్యొ...దా...
అని పిలిచి ఆడ ఈడ
మిగులు ముద్దలు
పెట్టే కాలం
పోయింది...!
అన్నం ముద్దలు ముద్దుగ
మిగులు పొట్లాలై
చెత్త బండిల
పడుతున్నయ్...!
పట్నం మూగజీవుల రోదనలు
చెంతనే చింతలై
వేదిస్తున్నయ్....!
_-రవికుమార్ కంచి_
🙏🌺
::::🕊️:::🐿️::::
34
28.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*'కాగితం'.*
కవిత సంఖ్య:34.
⬜🔲✍️🔲⬜
తెల్లవారింది
కలం జాడలేదు
రాతల ఊసేలేదు..!
ఏ కలవరాల
నిద్రదీస్తుందో
ఏ ఊహల్లో
విహరిస్తుందో....!
ఎన్నో గ్రంథాల బంధం
ఎన్నో హృదయాల కదిలించిన సంబంధం
ఎన్నెన్నో బాధలు బంధనాలు తెంచిన
దోస్తానా మాది..!
కథ రాస్తావో
కవిత రాస్తావో
పాట రాస్తావో
నా యెదపై రాసేసెయ్
రాస్తేనే జనంలో
నువుంటవ్
నేనుంటా..!
నేను గాలికి లేవక కుదురుగ కూసున్న
నాలుగు మూలలు చక్కగా పరుచుకున్న
నా తెల్లని హృదయం తెరిచి
ఎదురుచూస్తున్న...!
మిత్రమా...
కవికలమా..!ఆలస్యమైనదేమి...?
దిగులైతున్నవేమి...?
గుండెలు కదిలేలా
భావాలు నాపై
నింపుతున్నవ్
నీ కన్నీటి
సిరాచుక్కల్లో
నన్నూ
తడుపుతున్నవ్
జర సముదాయించుకో
జర సోచాయించుకో
నీ భావోద్వేగాల రాలే
కన్నీటి కవితల ధారలో
నేనూ నానిపోతే
నేనూ కొట్టుకుపోతే...
కవిత కానొస్తలేదు
వేదన
ఉబికొచ్చిన ఆవేదన
తప్ప
గ్రంథ నిర్మాణ పేజీ
కాదు....!
ఉత్త కాగితమైతి నేను....!
ఇదేమి రచన
మిత్రమా.....!!
_-రవికుమార్ కంచి_
🌷🌿
⬜✍️⬜✍️⬜
35
28.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
🌏 _*"అన్నీ నావే"...!?.*_
కవిత సంఖ్య:35.
🐰🦚🐋🌾🕊️🎑
"అన్నీ నావే!?.....
అంతా నాదే"!!??....
"అవును నేనన్నది, మీరు విన్నది నిజమే!,
"నేను స్వార్థపరుడినే, నేను అత్యాశ పరుడినే,
అన్నీ నా సొంతం అనుకునే మూర్ఖుడిని,
అన్నీ నేను అనుకున్నట్లే అవుతాయనుకొనే దురాశా పరుడినే"!!?.
"ఈ విశ్వం,సమాజం కులాలు,మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రార్థనా స్థలాలు, పండుగలు".....
"అన్నీ నావే"....!!??
"కవులు,శాస్త్రవేత్తలు వైద్యులు, ఉపాధ్యాయులు, కళాకారులు, నాయకులు, కవిత్వాలు, ప్రయోగాలు, మహాగ్రంథాలు,
కళలు,
నిర్మాణాలు".....
"అన్నీ నావే".....!!??
"మేధావులు, తత్వవేత్తలు, సిద్ధాంతాలు, ఆలోచనలు, విధానాలు, సృజనాత్మకతలు, ఆవిష్కరణలు, సమాజహితాలు"........
"అన్నీ నేనే"........!!??
"సుందర జలపాతాలు, పూలవనాలు, కొండలు లోయలు, సరస్సులు జీవవైవిద్యాలు, ప్రకృతి సంపదలన్నీ"....
"అన్ని నావే".....!!??
"సమస్తం...నాదే"!!??
_-రవికుమార్ కంచి🙏._
🌹🌹👑🌹🌹.
36
28.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*👑"గురువులు"*_
కవిత సంఖ్య:36.
🔅🔅🔅🔅
"నేర్చుకునే మనసుంటే,
కనిపించే ప్రతి ఒక్కటీ గురువే!,
కదలాడే జీవులన్నీ ఆదర్శాలే"!!
"ముందు చూపే తప్ప, భయం లేని,
నిద్రపోని,క్రమశిక్షణ తప్పని,
విశ్రాంతెరుగని,
సమైక్య సమరాలు, శత్రువుల శరీరాలపై, మూకుమ్మడి దాడులు, దండులు....
చీమలు,తేనెటీగలు, ఆదర్శాలే...!!
"స్పందించే మనసుంటే"....!
"ఏ ఆధారం లేని, గాలిలో వేలాడే, కనబడని దారాలు, ఆధారాలు చేసుకుని
తిరిగే,
చిక్కిన పురుగుల, వేటాడి మింగే, నైపుణ్య పురుగులు, సాలెపురుగులు, ........గురువులే"..!!
"పరిశీలించే గుణముంటే"......!
"ఏ సాంకేతికతకు అందని, అర్థం కాని, నారల గూడులు, పిల్లల సంరక్షణ అల్లికలు,
పక్షులకే సాధ్యం,
ఆ సునిశిత నైపుణ్యం, మనకు...... ఆదర్శమే"!
_-రవికుమార్ కంచి_🙏.
- 🔆🔆🔆🔆🔆🔆
37
[28/07, 4:48 PM] Kanchi Ravi Kumar Poet: 28.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*🦚"సాహితీ సమూహాలు"🔆✍️.*_
కవిత సంఖ్య:37.
✨✨☀️✨✨
"తేనెల తెలుగు సాహితీ సమూహాలు, నిజమైన అక్షర యజ్ఞాలు,
శాశ్వతమైన పద ప్రయోగశాలలు, దివ్యమైన భావ ప్రతిమలు,
నిత్య చైతన్య దీపికలు,
సమాజ రుగ్మతల నివారణా ఔషధ నిలయాలు కావాలి";
"పారదర్శక అభిమానాలు, పొగడ్తలు,
నిష్పాక్షిక అభిప్రాయాలు, స్వచ్ఛమైన,విశ్లేషణ సమీక్షలు,
దోష నివారణ,
భజన నిర్మూలన తపస్సులు పెరగాలి",
"బంధుప్రీతి,సోదర, పరిచయ,అవసర, స్వార్థ స్త్రోత్రాలు, విడనాడాలి,
సాహిత్య రాజకీయాల పొగ పారకుండాలి"...!!,
"కొందరికి మాత్రమే, ప్రభావశీలురకే పట్టం కట్టే పీఠాల,ముఠాలు, కావద్దు....!!,
ప్రతిభా మూర్తుల సింహాసనాలు కావాలి,
కొత్త కలాల, చైతన్య గళాల,విశాల అక్షర సేద్య పొలాల,
చక్కని సాలుల, హలాలు కావాలి, సాహిత్య ఫలాలు పంచే క్షేత్రాలవ్వాలి"....!!
"గతకాల సమాజ వ్యర్ధాలను,అనర్థాలను కాలరాసే,నూతనత్వం నింపాలి,
నూతన కవుల సృజనాత్మక భావాల ప్రోత్సాహం పెరగాలి",
"సాహితీ సమూహాల అక్షర విప్లవం జరగాలి, నిజమైన సాహిత్య శోధన,సాధన కలగాలి, భవిష్యత్ సాహిత్య గ్రంథ నిర్మాణ,
కళా నిర్మాతలు, పోషకులవ్వాలి"....!
"సాహితీ సమూహాలు, నవ్య భారత, సామాజిక ప్రక్షాళనా,
కళా,రచనా,
వెలుగుల కేంద్రాలు కావాలి"....!!.
_-రవికుమార్ కంచి🙏💐_.
38
🌻🌻✍️🌹🌹.
[28/07, 4:52 PM] Kanchi Ravi Kumar Poet: 28.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"దేవుడు"🙏.*_
కవిత సంఖ్య:38.
🔅🔅☀️🔅🔅
"దేవుడున్నాడా"....?!
"ఆలయంలోనా,
చర్చిలోనా, మసీదులోనా, గురుద్వారాలోనా, ఆరామంలోనా".....??!!
"సాటి మనిషిలోనా, విగ్రహాలలోనా,
సాయమందించే చేతులలోనా"......??!!,
"ఏ గుడిలో వున్నా,
ఏ రూపంలో వున్నా,
ఏ చెట్టులో నున్నా, సూర్యునిలోనున్నా"....!!
"ఎక్కడున్నా....,
ఎలా ఉన్నా"....!!
"దేవుడు మనిషిని చేసినా,
మనిషి దేవుడిని చేసినా".....!!
"సహజ లక్షణం, మానవత్వం నిలిపి ఉంచు,
సాటి మనిషిలో దైవత్వం చూడు, బాధలు చూడు, అతని ఆకలి తీర్చు, అక్కున చేర్చు,
ఆ కళ్ళను చూడు,ఆ కృతజ్ఞతలో దేవుడున్నాడు....!!
ఆ సంతృప్తిలో దైవమున్నది!!,
"ఇదే దైవ దర్శనం"....!!
"ఆ కళ్ళు నిన్నే చూస్తున్నాయి... దైవదర్శన మనుకున్నాయి, పరస్పర దైవాల యినాయి"...!!!
"దేవుడు నువ్వేనా అని ఆశ్చర్యపోయినాయి!!??,
నమ్మ లేక పోతున్నాయి!!"
"దేవుడి విశ్వరూపం మనిషేనా"......!!??.
_-రవికుమార్ కంచి_🙏💐.
39
28.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"చీకటిలోయలు"😭....*
కవిత సంఖ్య:39.
♾️♾️♾️♾️
"తడిలేని వేడి కొలుములు,
ఊపిరాడని చిమ్మచీకట్లు,
ఆహ్వానాలే తప్ప వీడ్కోలు పలకని ఊబులు,
పసి గుండెల్ని పిండేసే జాలిలేని బండల తొర్రలు"....
"ప్రమాదమెరుగని,
మింగ నోరు తెరిచిన మహమ్మారిని గమనించని,
ఆటలే ప్రాణంగా, ధ్యానంగా, పరుగులు తీసే,
పసి పాదాల బంధించే...
నల్ల రాక్షసులు,
చీకటి లోయలు";
"తల్లిదండ్రుల రోదన, బంధువుల వేదన, వినవు,
నిస్సహాయ చేతుల, కాళ్ల ఆరాటాలు చూడవు,
అందీ,అందని ఊపిరుల, ఆఖరి పోరాటాలు చూడవు,
తల్లడిల్లే గుండెల,
ఆయాసాలు చూడవు",
"ఉపయోగం లేని,
బోరు బావులు..... చీకటి లోయలు".....!!
"లేత ప్రాయాలను, చీకట్లో కమ్మేస్తున్న పిచాచులు"......!!
"పాలకులారా, రైతన్నలారా"...!!??
"మీ నిర్లక్ష్యం,
పసి హృదయాలను బంధిస్తున్న, బోనులయినాయి"....!!,
"భావి భారత,
ఆశా కిరణాలను, మూసేస్తున్న, పాతాళాలవుతున్నాయి"....!!
"ఇకనైనా.....
చుక్క రాల్చని, బోరుబావుల...
ఆ చీకటి లోయల,
పూడ్చేయండి".....
"కన్నవారి, కన్నీటి చుక్కలు కారనీయకండి,
విషాద గీతాలకు చరమగీతం పాడండి"....!!!
_-రవికుమార్ కంచి🙏_.
40
29.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*'సోషల్ మీడియా'.⚜️*_
కవిత సంఖ్య:40.
~~°°~~📱~~°°~~
ప్రతికన్ను నిజాన్ని
చిత్రీకరిస్తున్నది
ప్రతి నేత్రం నిఘా
పెడుతున్నది
ప్రతి ఫోను అణువణువున
సీసీ కెమెరాయై
కాపలా కాస్తున్నది
ప్రతి దినం సామాజిక దృక్కోణమై
ప్రతిక్షణం సామాజిక నిబద్ధమై
సోషల్ మీడియా సమాజ అడుగులను
నిక్షిప్తం చేస్తోంది సామాజిక బాధ్యతను
విస్తరిస్తోంది
అనాధ బతుకులను ఆపదల
ఆర్తనాదాలను వినిపిస్తుంది
వింత ఉపయుక్త సమాచారాన్ని క్షణాల్లో
విశ్వవ్యాప్తం చేస్తుంది
అక్రమార్కుల
చీకటి కోణాలు బట్టబయలు చేస్తోంది
ఆవేదనలు
ఆవిష్కరణలు
ప్రదర్శించే ఆన్లైన్ పోరాట వేదికవుతోంది
వికసించిన హృదయాలను
పరిమళించిన మానవతను
విశ్వతెరపై
ప్రదర్శిస్తోంది
సరైన అస్త్రంగా
ఉపయోగిస్తే
మూగ గొంతుల
గొంతుకవుతుంది
నూతన
సంఘ సంస్కర్త
అవుతుంది.
_-రవికుమార్ కంచి_
🙏🌷
~~°°~~🎯~~°°~~
41
[29/07, 6:51 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 29.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"దైవ దూషణేల"...!!??❓❓.*_
కవిత సంఖ్య: 41.
✨✨✨✨✨✨
"దేవుడా"............!!??,
"కష్టాలు వస్తే,గుర్తొచ్చే.... మొదటి పేరు,
కోపం వస్తే,దూషించే..... మొదటి పేరు,
ఆనందం పొంగితే, స్మరించే.........మొదటి పేరు;
"కష్టమొచ్చినా,
నష్టమొచ్చినా, సంతోషమైనా, దుఃఖమైనా.....
నువ్వే కారణం....
ఓ మానవా"!?,
"నీ విధానాలు మారవా"....!!??,
"ప్రకృతి వినాశనాలు కోలుకోలేని దెబ్బలు వేసే నువ్వు......! పర్యవసానాలకు........దైవం బాధ్యుడా"!!!,
"దురాశతో,అత్యాశతో చెట్లు నరకడం, భూ గనుల తవ్వకాలు, విచ్చలవిడిగా చేసేది నువ్వు.......!!
ప్రకృతి వైపరీత్యాలకు ...........దేవుడా కారణం"!!,
"జంతువుల, మనుషుల,వెంటాడి వేటాడి,స్వార్థంతో సకల నాశనాలు, చేసేది నువ్వు .........!!
ప్రకృతి ప్రళయాలకు, దేవుడిదా భారం".....!!?,
"రకరకాల ఆచారాలతో, అంతరాలతో మనుషుల మధ్య దూరం పెంచింది నువ్వు.......!!
కులమత అసహనాలకు......... దేవుడా కారణం".......!!,
"మాదంటే,మాది గొప్పని మానవత్వం మరచి,
కొట్లాడేది..... నువ్వు!!
మత ఘర్షణలకు దేవుడా కారణం"......!!??,
"స్వార్థాలతో,సకల వ్యర్థాలను సృష్టించేది నువ్వు.....!! తదనుగుణంగా,వచ్చే అనర్ధాలకు దేవుడా...... కారణం"!!??
"ఆధిపత్య ధోరణితో కుల,మత భేదాలు సృష్టించింది.....నువ్వు!!,
రకరకాల ఆచారాలు తయారు చేసింది...... నువ్వు!!
ఈ ఘన కార్యాలకు.....
దేవుడా బాధ్యుడు".....!!??,
"నువు చేసే దరిద్రాలకు..., కనిపించని... దేవుడిపై నిందలా".......!!??
"మానవా!,
నీ బుద్ధి మానవా!!,
నీ విధానాలు మారవా"!!??.
_-రవికుమార్ కంచి_🙏💐.
🌟🌟🧠🌟🌟.
[29/07, 6:57 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 29.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"జలం"💧💦.*
కవిత సంఖ్య:42.
💦💦💧💦💦
"గంగా,యమునా, జీవనదులు,
కృష్ణా, గోదారుల ప్రవాహాలు,
దేశ,దేశాల,
పలు రాష్ట్రాల, జనాల,జీవాల పారించి, పాలించి,పోషించే జీవనాధారాలై"......,
"కదం తొక్కి,ఉప్పొంగి పులకరించి, మొలకెత్తించే, ఆధారాల జలం, సుజలం,
అమృత జలం,
జీవ జలం"......,
"అందరికీ,
ఇంకా దక్కని దైన్యం, అన్ని గొంతుల,దాహం తీర్చని వైనం!,
కొండ దారులు,
ఎండిన దారులు, కిలోమీటర్ల బారులు, అడుగంటిన బావులు, బిందెల గోలలు, అవస్తల లీలలు,
నీటి దొంగతనాలు, కొట్లాటలు,
డ్రమ్ముల,గోళాల తాళాలు,
దయనీయ విచిత్రాలు, బతుకు చిత్రాలు,
జల తాండవాలు"......,
ఎంతకాలం.....!!??
"జల పథకాలెటు బాయె!,
పైపులేమాయె!!, గొంతుల తడి
పారదాయె!!
ఫ్లోరైడ్ భూతం వదలదాయె!!
"బొక్కలు నిలబడవాయె!,
పండ్లు పాసు పండ్లాయె,
కాళ్ళ సందుల కుక్కలు, గొర్రెలు దూరే!!,
నరాలు నిర్జలాలై, గళాలు అగ్నిగోళాలై,
కన్నీరు కరువైన ఏడుపులై!!,
దాహం వెర్రి దారుల వెతుకుతుంటే"...!!??
"ఆనకట్టల పంచాయతీలు, అడ్డుకట్టల లడాయీలు,
లక్షల కోట్ల ఆర్భాటాలు తప్ప,
నదుల అనుసంధాన మేది"??,
సముద్రం పాలయ్యే స్వచ్ఛ,జీవజలాల ఒడిసి పట్టుడేది??, నిల్వజేసుడేది"???
"ప్రాణం నిలుపుడేది"?
"జల ప్రక్షాళన పేరుతో, వేల కోట్లు జలమయం, జల భకాసురుల జేబుల మయం....."!!,
ముప్పాతిక జలవనరుల భూగోళం".....!,
"పరిశుద్ధం చేయలేని, మానవ,సాంకేతిక పరిజ్ఞానం",
"దాహం తీర్చలేని విద్యా వైభోగం ప్రశ్నార్థకం"......!!???
_రవికుమార్ కం
43
[29/07, 4:18 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 29.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*🌻ఆదర్శాలు*_
కవిత సంఖ్య:43.
🌿💐🌿
ఎన్నో మాటలు వింటున్నాం,
గొప్ప వాగ్ధానాలు చూస్తున్నాం,
మరెన్నో ఆలోచనలు చేస్తున్నాం,
ఆదర్శాల ప్రస్తావనలు
గమనిస్తున్నాం....
వినడానికి, చూడడానికి,
మాటలు,
ఎంత అద్భుతంగా ఉన్నాయి,
కళ్ళముందు,
స్వప్నం సాకారమయినట్లు,
స్వర్గం అంచులు తాకినట్లు,
ఉన్నత శిఖరం ఎక్కినట్లు,
కొత్త వెలుగురేఖలు చిమ్మినట్లు,
కొత్త ప్రపంచంలో విహరిస్తున్నట్లు....
ఆ క్షణం అన్నీ అద్భుతాలే,
ఆ క్షణం అన్నీ అనుకూల తపనలే,
కానీ,వాస్తవం ఏమోటి?,
మాటల ఆచరణ ఎక్కడ,
కొత్త ప్రపంచం ఎక్కడ??,
ఆశావాదులు,
ఆదర్శ మూర్తులు, మేధో సంపన్నులు, విశాల విశ్వ మానవులు....
కలలుగన్న,మాట్లాడిన,
ఆశించిన ఆదర్శాలు, విధానాలు ఎక్కడ??,
సమ సమాజం స్థాపించబడిందా?
భేదాలు,విభేదాలు మరచి, మానవత్వం వికసించిందా?,
కుల,మత,లింగ వివక్షలు నశించాయా?
రైతు ఆత్మహత్యలు, ఆకలిచావులు,
అత్యాచారాలు,
ఆధిపత్యాలు,
ఆర్తనాదాలు, ఆగిపోయాయా??,
విశ్వ క్రీడా రంగంలో, విజ్ఞాన సాంకేతిక విప్లవంలో,
భారత జెండా రెపరెపలాడుతోందా?,
ఓ యువత ఏం జరుగుతోంది?,
పెద్దల ఆదర్శాలు,
మీ లక్ష్యాలు సాధించండి, ఆచరణలో పెట్టండి,
గత పీడలు,రోదనలు భవిష్యత్ తరాలకు రానీయకండి,
వెలుగు కిరణాలై, భాస్కరునితో పోటీపడండి,
ముందడుగులై, అభివృద్ధికి, సంస్కరణలకు, దారులు వేయండి,
అచంచల విశ్వాసంతో, జటిల సమస్యలను ఢీ కొట్టండి,
పరిష్కారాలు రాబట్టండి...
స్పందన లేని,
స్తబ్ధత నిండిన,
మనుషుల చేతల, చైతన్యం నింపండి,
నవ ప్రపంచ నిర్మాతలై, చేతులు కలపండి,
ఆదర్శ విశ్వం ఆవిష్కరించండి!!.
_రవికుమార్ కంచి_🙏💐
🔆🔆🌏🔆🔆.
[29/07, 4:22 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 29.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"సమాజం"🌏*_
కవిత సంఖ్య:44.
🔅🔅🔅🔅🔅
సమాజం.....
మనిషిని మహోన్నతుడిని, మహా నాయకుడిని, మహా జ్ఞానిని చేస్తుంది,
వారిని అంతమొందించే దుర్మార్గులను!, బ్రహ్మరథం పట్టే సజ్జనులను సృష్టిస్తుంది!!,
సమాజం భిన్న కోణాల,
భిన్న ధృవాల సమ్మేళనం,
అడుగులు వేయిస్తుంది, ఆటంకాలు కల్పిస్తుంది,
ఏ స్థాయిలో వున్నా,
ఏ శిఖరాలను అధిరోహించినా, నువ్వేంటని ప్రశ్నిస్తుంది??
నీ స్థానం,స్థాయి అశాశ్వతమని హెచ్చరిస్తుంది!?,
నువ్వు,నీ స్వార్థమే కాదు,
నీ పరిధి విస్తరించమంటుంది, నీ చుట్టూ వెలుగురేఖలు వెదజల్లమంటుంది,
ఆ వెలుగులో నిన్ను చూస్తుంది,
గొప్పగా చూస్తుంది, సంతోషపడుతుంది;
సమాజం గురువు, పాఠాలు,గుణపాఠాలు,మార్గాలు సన్మార్గాలు చూపెడుతుంది,
ఎన్నో పరీక్షలు పెడుతుంది, పరిష్కారాలు చూపెడుతోంది,
నీ బాధ్యతలు, భారాలు, లక్ష్యాలు గుర్తు చేస్తుంది;
సమాజం శిల్పి,
విలువలేని,చలనం లేని,
బండరాయిని,
కొలిచే మూర్తులుగా, అద్భుత శిల్పాలుగా చెక్కుతుంది,
కలకాలం గుండెల్లో నిలబెడుతుంది, దెబ్బలు భరించకపోతే,
భయపడితే, పశువులు తొక్కే రాయిగా మిగిలిపోతావు..!!;
సమాజం గ్రంధాలయం, విజ్ఞానాన్ని, జీవితగాథలను చదివిస్తుంది,
నిన్ను మలచుకునే జ్ఞానమిస్తుంది,
జఢ పదార్థం,ముఢి పదార్థమైన నిన్ను
సాన పెడుతుంది, మెరిపిస్తుంది, మురిపిస్తుంది;
సమాజమనే తెరచాపలను అనుకూల దిశకు మార్చుకుంటే,
నీ గమ్యం చేరుకుంటావు,
నీ లక్ష్యం సాధిస్తావు, విజయం సాధిస్తావు;
సమాజం అన్నీ ఇస్తుంది,
అన్నీ నేర్పుతుంది, గెలుపు పథంలో నడుస్తావో,
పతనవుతావో తేల్చుకో!!,
నువ్వు చూసే తీరును, అనుసరించే విధానాన్ని బట్టి,
నీ రాత,నీ చేతిలోనే ఉంది,
సమాజ పరిశోధనా, ప్రశంసా పత్రం,
పొందే అవకాశం ఉంది...
_రవికుమార్ కంచి_🙏🌻.
✨✨👑🌏✨✨
[29/07, 4:26 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 29.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*🔆మీడియా🌏*_
కవిత సంఖ్య:45.
🔅🔅✍️🔅🔅
నిజమైన,రాజకీయ రంగులు వేయని,
ప్రభావాలకు, ప్రలోభాలకు లొంగని, స్వతంత్ర, నిర్భయ, పారదర్శక,నిజాయితీ నిష్పక్షపాత, మీడియా.....
నయా వార్తా విశేషాల దునియా,
పీడిత ప్రజల సులభ, పరిష్కార, ప్రసార ఐడియా....
మీడియా........
ప్రజాసంక్షేమ, ప్రజాస్వామ్య,
ప్రజా సేవల,
హక్కుల పోరాట వేదిక అవుతుంది,
బడుగు,బలహీన జనాల
వేడుక చేస్తుంది,
బాధల,మూగ రోదనల గొంతుక అవుతుంది,
ప్రశ్నించే,సాధించే, విన్నవించే బాణమవుతుంది,
ప్రాపంచిక విషయాల నివేదిక అవుతుంది,
కళ్ళముందు వీరంగం చేస్తున్న, అన్యాయాలను, అక్రమాలను ఖండించే, దృశ్య ఖడ్గమవుతుంది,
నిస్సహాయ చేతుల, సుదర్శన చక్రమవుతుంది,
నిద్ర నటిస్తున్న,నిర్లక్ష్యం వహిస్తున్న పాలక,సేవక,అధికార, యంత్రాంగంపై ఢమరుకం మోగిస్తుంది, క్రమశిక్షణ,ఫలితం సాధిస్తుంది,
నిరంతర సమాచార, నిత్య చైతన్య దీపికలవుతుంది,
ప్రజా పక్ష, సంక్షేమ పెన్నిధవుతుంది,
ప్రజా
మీడియా,జనాల గళం,
ఆయుధమవుతుంది,
ఆశయ సాధనమవుతుంది,
భారత అభివృద్ధికి, గర్వ కారణమవుతుంది.
_రవికుమార్ కంచి_🙏💐.
🔅🔅🌏🔅🔅.
46
[30/07, 6:32 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 30.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
KS.Number:44,
హైదరాబాద్,
శీర్షిక:
🇮🇳
_*"భరతవీరులు".*_
కవిత సంఖ్య:46.
🔆🕊️|🇮🇳✊🔆
మన స్వేచ్ఛను
సార్వభౌమత్వాన్ని
కబంధ హస్తాల్లో
బంధించిన
ఆంగ్లేయుడి
తెల్ల దుర్మార్గుడి
గుండెల్లో నిదురించిన
తూటాలకు ఎదురొడ్డిన
చిరునవ్వుతో
'ఉరి'కురికిన
భరతఖండ వీరులారా...
భరత జాతి
ఉగ్ర సింహాల్లారా.....
భరతమాత
ముద్దుబిడ్డలారా....
మీకు వందనం
అభివందనం
మీ రక్తార్పణమె భారత
స్వాతంత్రోద్యమం
మీ ప్రాణ త్యాగమె
స్వాతంత్ర్య ఫలం
మీరూదిన శ్వాసలలో
మీరొదిలిన జీవంలో
వికసించెను
భరతభూమి
మీ త్యాగాల గుట్టలపై
మీ బలిదానాల గడ్డలపై
జన్మించెను భరతభూమి
జీవించెను భరతజాతి
ఆయుధమై
నిరాయుధమై
అతివాదుల
మితవాదుల
హింసా మార్గాల
అహింసా మార్గాల
స్వదేశీ ఆచరణల
ఉప్పు సత్యాగ్రహాల
సహాయ నిరాకరణల
జలియన్వాలా బాగుల
పార్లమెంట్ దాడుల
లక్షల నిరసనల
వేల అనామక భారత స్వాతంత్ర్య
వీరుల త్యాగఫలం
వీరనారీమణుల పోరాటాల
కవుల సాహితీ ఉత్ప్రేరణల
ఉదయించిన భరతదేశం
పఠించును
స్మరించును అనునిత్యం
మీ నామం
మీ బలిదానం
దైవాలుగ
పవిత్ర గ్రంథాలుగ
కలకాలం.
_జై హింద్_ ✊
_-రవికుమార్ కంచి_
🙏💐.
🌺💠🌸.
[30/07, 6:38 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 30.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి(44),
హైదరాబాద్,
శీర్షిక:
_*"వైకల్యం"...?!*_
కవిత సంఖ్య:47.
⚜️⚜️⚜️⚜️⚜️
వైకల్యం, దివ్యాంగులలో కనిపించేది కాదు!,
అవయవ లోపంతో, ఆపసోపాలు పడ్తున్న, ఆత్మవిశ్వాసంతో జీవనయానాలు చేస్తున్న, లక్ష్యాలు ఢీ కొట్టి, నిలబడలేకున్నా, నిలదొక్కుకునే,వారిది కాదు.....
వైకల్యం!!
సమాజ హితం, సామాజిక బాధ్యత,
సాధించే ఉషస్సు, ప్రశ్నించే, స్పందించే తత్వం లేని వారిదే... కనిపించని....
వైకల్యం!!
సాయమందించని, చలనం లేని,
మంచి కొరకు అడుగేయలేని, పిడికిలి బిగించని, పిక్కలు లేవని,
రెక్కలు విదిలించని, ఆచరణ చేయని వారిదే.......
వైకల్యం!!!
అంగవైకల్యంతో కలిగే నష్టం కన్నా ,
అన్నీ సక్రమంగా ఉండి కూడా,
చైతన్యం,
సామాజిక స్పృహ,
స్పందించే గుణం లోపించిన,మెదళ్ళ, శరీరాలలో, మానవత్వం మరిచిన మనసులలో ఉన్నదే....
ప్రమాదకర, అభివృద్ధి నిరోధక........ వైకల్యం!!!
ప్రపంచంలో
దివ్యాంగుల కన్నా, మనోవికలాంగులు, వైకల్యాలు, వైఫల్యాలే ఎక్కువ...!!
విచ్ఛిన్న కుటుంబ వ్యవస్థలు,
ఒంటరి జీవనాలు,
బాంధవ్యాలు తెంచిన విధానాలు,
సంఘ జీవితం మరిచిన పద్ధతులు... వైకల్య కారణాలు!?.
_రవికుమార్ కంచి_🙏💐.
⚜️⚜️⚜️⚜️⚜️
48
30.7.2020.
వీరాస్ కవిసమయం, రవికుమార్ కంచి(44),
హైదరాబాద్,
శీర్షిక:
_*"ఒక్క"*_........👣🗣️✊👍!?
కవిత సంఖ్య:48.
🔅🔅✊👑🔅🔅
_"ఒక్క అడుగు"_.......
లక్ష అడుగుల నడిపించాలి,
సుదూర తీరాల దాటించాలి,
సమస్యల కొండల కరిగించాలి,
పీఠాలు కదిలే కంపనలు,ప్రకంపనలు పుట్టించాలి,
కష్టాల తుదముట్టించే, దీక్ష కావాలి;
_"ఒక్క గొంతు"_.........
బండలా, గుదిబండలా తగిలిన,
మొండిలా, జగమొండిలా పట్టిన,
పప్పులా,ముద్దపప్పులా మిగిలిన,
జఠిల దరిద్రాలు పారద్రోలే కూత కావాలి,
అందరిని మేల్కొల్పే మోత మోగాలి;
_"ఒక్క పిడికిలి"_....
కొండలు పిండి చేసే బలమవ్వాలి,
మొండి బండల కలరిగించే గట్టి దెబ్బలవ్వాలి,
నిశ్శబ్ధ రోదనల, బాధల మూలుగుల ఎదిరించే,
ఆయాసాల కదిలించే మెరుపు శక్తవ్వాలి, పోరాడే ఉత్తేజమివ్వాలి;
_"ఒక్క ఆలోచన"_.....
కోట్ల మెదళ్ల,విద్యుత్ తరంగాల వేగాలు పెంచాలి,
కుంచించుకు పోయిన, వంచనకు గురైన, ప్రజల సంకెళ్ళను తెంచాలి,
సత్తువ లేని,
తేజం కోల్పోయిన,
మత్తుల మునిగిన,పాలకుల, ప్రజాప్రతినిధుల తుప్పుల దులిపి, ప్రజాసంక్షేమ పనులు చేయించాలి;
_"ఒక్క ఆచరణ"_......
నిర్లిప్త,నిస్తేజ చేతుల్లో, చలనం కలిగించాలి, వేల సమస్యల,బాధల్లో వెలుగులు నింపాలి,
స్తబ్ధత వదిలి,భయం అణిచి,ఫలితం పొంది,
విజయం సాధించాలి, సంతోషం వెల్లివిరియాలి.
_-రవికుమార్ కంచి_👍🙏💐.
49
30.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44)
హైదరాబాద్,
శీర్షిక:
_*"హీన చరిత్ర"...!?*_
కవిత సంఖ్య:49.
✨✨😭✨✨
వాడెప్పుడో చచ్చాడు...!?
ప్రేమతో సృష్టించిన, అపురూపంగా పెంచిన అమ్మను కడతేర్చిన వాడు,మనిషిగా బతికున్నా ఎప్పుడో చచ్చాడు...!
వాడి అంత్యక్రియలు అయిపోయాయి...!?
మతిలేని,మానవత్వం నశించిన ఉన్మాది చేతిలో బలైన వాడి తల్లి కన్నా ముందే వాడి మనసుకి అంత్యక్రియలు అయిపోయాయి,
జీవచ్ఛవంలా వాడున్నా పోయినా తేడా లేgదు..!
ఎంత కీర్తిగడించినా, ఎత్తైన శిఖరం ఎక్కినా, వాటిని చూసి గర్వించే, వాడిని ఆశీర్వదించే చేతుల,చేజేతులా నరికేసిన వాడి హీన చరిత్రను,
చరిత్ర కూడా అసహ్యించుకున్నది!.
_రవికుమార్ కంచి_.🙏💐
50
[09/08, 7:54 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 03.6.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
హైదరాబాద్,
శీర్షిక:
*"జాత్యహంకారం"!*
కవిత సంఖ్య:50.
🔅🔅🔅🔅🔅
అగ్రరాజ్యమా....? ఎలా?
ప్రపంచానికి ఏం చేశావు?
ఎక్కడ నీ ఆదర్శాలు?
ఏది నీ పరిణితి......?
నీ పిడి గుద్దులలో అణిగిపోయింది,
నీ బూటు కాళ్ళకింద నలిగి నశించిపోయింది,
విరిచేసిన పెడరెక్కలలో మూగబోయింది,
నలుపు తెలుపు రెండు ముక్కలయింది,
నలిపేసిన నలుపు దావానలమవుతుంది,
దేశాల రగిలిస్తుంది మానవత్వాన్ని కదిలిస్తుంది,
నిను చుట్టేస్తుంది,
నెల్సన్ మండేలా వారసులై,
మార్టిన్ లూథర్ కింగ్ మణిదీపాలై, అంబేడ్కర్ ఆశయాలై, గాంధీ కాముకులై,
నిను ముంచేస్తది,
జాత్యహంకార హింసా క్రీడల దంచేస్తది,
నీ పతనం ప్రారంభమైతది,
నల్ల మచ్చయితది.
_రవికుమార్ కంచి_
🙏💐.
🔅🔅🔅🔅🔅
[09/08, 7:54 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 31.7.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44)
హైదరాబాద్,
శీర్షిక:
*దిగుమతి.*
కవిత సంఖ్య:51.
-----🎯-----
ప్రపంచ నలుమూలల
ప్రసరించిన
మేధో కిరణం
ప్రతి అడుగును
ఆవిష్కరణగ మలచిన తేజోరూపం
ప్రతి అక్షరం
ప్రశ్నను గెలిచిన
బాణమై సంధించిన
విల్లులై
సరిహద్దుల బయటే వెలుగులు
చిమ్ముతోంది
ఖరీదైన దిగుమతులై
ప్రతిస్పందిస్తోంది
ఆయుధమైనా
ఏ ఉత్పాదనమైనా
మన నుండే ముడిసరుకై
తరలి పోయి
అపురూప
దిగుమతై
దిగుతోంది
కోట్ల ద్రవ్యం
పరాయి చేతుల
మారుతోంది
మేధో వలసలు
ఆగేదెన్నడో
మన ప్రతిభ
మనకు వెలుగై
వెలుగేదెప్పుడో...!?
_-రవికుమార్ కంచి_.
🙏🌷
-----🛩️-----
[09/08, 7:56 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 31.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
హైదరాబాద్,
శీర్షిక: _*"ఉనికి"*_.
కవిత సంఖ్య:52
🔆🔆🔆🔆🔆
అజ్ఞాత దేవాలయ విజ్ఞాన దైవం నేను,
కొన్ని రోజులుగా పూజలు లేవు,
భజనలు లేవు,
భక్తులు లేరని కలవరపడ్డాను,
శక్తులు,వరాలు లేవనుకున్నాను,
నన్ను మరిచారనుకున్నాను,
నన్ను నేను మరిచి పోయాను,
ఒంటరయ్యాను.....!
కానీరోజు పండుగ జరిగింది,
సంబూరమయ్యింది, ఆరేళ్ల బాలిక జన్మదిన వేడుకయింది,
రంగుల కాగితాలు, తోరణాలు,
పిల్లల పాటలు నవ్వులు చప్పట్ల నడుమ,
పతాకమెగిరింది జయజయ నాదాలయినవి,
తీపి పంపకాలయినవి, నా ఉనికి నాకు తెలిసింది,
సందడి చేసింది.
_రవికుమార్ కంచి_🙏💐.
✨✨✨✨✨✨
[09/08, 7:57 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 31.07.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"అన్లాక్"🔓🔑.*_
కవిత సంఖ్య: 53.
🔅🔅🔅🔅🔅
అన్లాక్...
అన్లక్కీ అయ్యింది
లేదన్నది,తక్కువన్నది
వెక్కిరింతే అయ్యింది,
దేశం సునాయాసంగా 10 నుండి రెండో స్థానానికి ఎగబాకింది,
ఎంత అదిమి పెట్టామో ఎన్ని నియమాలు పాటించామో,
అంత ఎగిసి చెలరేగింది,
అంతకంత విచ్చలవిడిగా మారింది,
విధ్వంసక మరణమృదంగం మోగిస్తోంది,
ఎవరో కట్టడి చేయడం ఎవరో నిబంధనలు పెట్టడం,
వద్దన్నదే చేయడం నవ్వొచ్చే సాకులు చెప్పడం,
కాదు,
ఇక చాలు....
పరీక్షలు లేవు ఫలితాలు లేవు మందులు లేవు,
కఠిన పరీక్ష లే నీకు,
సహజీవన కరోనా సవాలే నీకు,
ఏది లాక్
ఎక్కడ అన్లాక్
నువ్వే చూసుకో,
నీకు నువ్వే విధించుకో నీ విధి లిఖించు
విధులు నిర్వర్తించు వీధిన పడకుండా కరోనా బారిన పడకుండా,
పడ్డా అధిగమించే ఆరోగ్యం,
రోగ నిరోధక శక్తి సాధించుకో,
జీవిత
సంరక్షణా పథక
రచన రూపొందించుకో...
ప్రకృతి ప్రకోపాలు,
ఉన్న రోగాల రొంపి కాక
కొత్త రోగమొచ్చి చేరె,
మాయలు జిత్తులు చేస్తుండె,
తాళానికి సరైన కీ లాగా,
సూదిలో దారం లాగా,
ఏ ఎండకా గొడుగుగా
అనిగి అనుగుణంగా విధానం,
జీవన విధానం మార్చుకో,
అయినా రాదనే గ్యారంటీ,వారంటీ లేదు,
శుభ్రత, భౌతిక దూరం పాటిస్తూ,
మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించుకోవడమే నీ కర్తవ్యం
లాక్
అన్లాక్
కాక తప్పదు,
ఏదీ శాశ్వతం కాదు...
నిరంతర కరోనా సమరం తప్పదు.
_రవికుమార్ కంచి_
🙏💐.
🔅🔅🔅🔅🔅
[09/08, 7:58 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 31.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*క్షోభ...!😰*_
కవిత సంఖ్య:54.
➖➖ ➖➖
నిప్పులై రగిలిన త్యాగాలు
ఆవిరైపోయిన ఆత్మబలిదానాలు
వేడి గాలులై ఎగిసిన ప్రాణాలు
చిమ్మ చీకటి కమ్ముకున్న
తడి లేక ఎండిపోతున్న
దయా దాక్షిణ్యాలు కరువైన
దక్షిణ తెలంగాణ జూచి క్షోభిస్తున్నాయి....!
ఎత్తున ఎగిసిన జ్వాలల మాడిపోతున్నా మాంస ముద్దలు కాలి రాలిపోతున్నా...
గొంతులో వేడి సెగలు పొగలు కక్కుతున్నా
జై తెలంగాణ...!
జై జై తెలంగాణ....!! నాదం నినాదం దద్దరిల్లి నింగికేగిన
అమర జ్యోతులు
మారని తెలంగాణ బతుకు చిత్రాల జూచి
బలిదానాలు వృధా అయినవని విలపిస్తున్నాయి.....!!
_రవికుమార్ కంచి_
🙏💐.
➖➖ ➖➖
[09/08, 8:00 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 01.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*'ఆన్లైన్ బడి'..!?*
కవిత సంఖ్య:55.
-----🖥️-----
అది ఫీజు కోసమో
పోజు కోసమో
విద్యా సంవత్సరం ఏమైద్దో ఏమోగానీ..
ఆన్లైన్ అమ్మకాల వలె
ఆన్లైన్ బడి పరుగులు మొక్కుబడిగ
సాగుతున్నయ్
వాడు వింటున్నాడో
తింటున్నాడో
అటెన్షన్లున్నాడో
ఏ టెన్షన్లున్నాడో
ఆటాడుతున్నాడో
ఏం చూస్తున్నాడో
ఏం చేస్తున్నాడో
చూసేదుందా
సరి చేసేదుందా
కళ్ళు మూతలు పడేలా
కాళ్ళు కప్పలయ్యేలా
ఒళ్లు కుప్పలయ్యేలా
ఓ చిన్న తెరముందు
రెప్పవాల్చని
విన్యాసాలు
ప్రత్యామ్నాయం లేని
పరిణామాలు
పాలక బడి
బందులు
కార్పొరేటు బడి
చిందులు
కుదేలైన వ్యవస్థలో
చదువులు
అయోమయం
బతుకులు భయం
భయం.
_-రవికుమార్ కంచి_
🙏🌺
----🌚📲----
[09/08, 8:00 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 01.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*'నిరుద్యోగులు'.*
కవిత సంఖ్య:57,
⚡⚡⚡⚡⚡
ఆశల ఆయాసల నడుమ వేలాడే అనామతు జీవులు,
లోకం ఇకమతులు ఒంటబట్టక అవకాశం కోసం ఒంటికాలిపై ఎదురుచూసే నిశ్శబ్ధ ప్రాణులు,
ఆశయాలున్నా అవకాశాలు శూన్యమైన దయనీయ మేధలు,
కాలు కదిపినా వేలూపినా వెంటాడే భయంకర బాధలు,
చదువులు మురిగి చెప్పులు అరిగి నిట్టూర్పుల నిరుద్యోగులు,
ముప్పై దాటిన మీసాలు,గడ్డాల
ఒంటరులు,
జీవన తత్త్వం చూసిన రుషులు,
పాలకుల ఆదరణ లభిస్తే,బాధల బంధాలు తెంపే మొనగాండ్లయితరు, చక్కని చుక్కల పోషించే,
సమస్యలనెదిరించే మొగుండ్లయితరు,
భరత భూమికి దేదీప్య కాంతులు నింపే సూర్యుండ్లయితరు,
ఎండినాకోలె గాలికి దొర్లే భృతిలేని,బతుకు గతిలేని, ఉదాసీన జీవుల పాలిట దేవుండ్లయితరు.
_-రవికుమార్ కంచి_.
💐🙏.
🔆🔆🔆🔆🔆
[09/08, 8:00 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 01.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*హాసం...*_😃🤣
కవిత సంఖ్య:56.
✨✨🤩✨✨
ముద్దు గొలిపే పెదాల నాట్యం
ముత్యాల దంతాల మెరుపుల మురిపెం
వినాళ గ్రంథుల వికాసం
నగుమోము నగిషీల హాసం దరహాసం
అలసిన శరీర మందగమన మస్తిష్కాల చురుకుల చమక్కుల రసాయనం హాసం
నూతన ముఖాల వినూత్న పరిచయం
ప్రేయసీ ప్రియుల ప్రేమ వారధి
పెద్దలు బంధువుల పలకరింపుల సుగంధం హాసం
రహస్యాలెన్నో అసహ్యాలెన్నో అపహాస్యాలెన్నో ఛేదించే పదునైన ఉల్లాస ఖడ్గం
మానసికానంద సుందర వనం
సకల రుగ్మతల నివారణోపాయం......
హాసం.
_రవికుమార్ కంచి_
💐🙏
🔅🔅🤣🔅🔅
[09/08, 8:00 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 01.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*'అగాధాలు'*
కవిత సంఖ్య:58.
------🌗------
అగాధాల లోతులు దూరాలు పెరుగుతున్నయ్, జారిపడితే కనిపించని శూన్యలోకా లవుతున్నయ్,
మాటల ప్రవాహాలకు చేతల అమలుకు మధ్యన చీకటి అగాధాలు రాజ్యమేలుతున్నయ్,
నిర్మలంగా కనిపించే సమాజ ప్రవాహాల మధ్యన,
కులకుతంత్రాల మత మౌఢ్యాల అగాధాలు నల్లని రాత్రులయినయ్ భయంకర స్వప్నాలయినయ్,
దూసుకెల్తున్న నూతన శతాబ్ధ శబ్ధాల నడుమ, దేశాలు మారినా ఖండాలు దాటి చదువులు హోదాలు పెరిగినా,పాత పాకురులు
నల్ల తెల్ల వర్ణాల మధ్య లోతైన అగాధాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నయ్
మనుషులు తీసిన గోతులేనని,
మారని మనసుల అపరిపక్వ నీతులేనని అపహాస్యం చేస్తున్నయ్.
_రవికుమార్ కంచి_
🙏🌹
---🙈🙉🙊---
[09/08, 7:54 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 03.6.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
హైదరాబాద్,
శీర్షిక:
*"జాత్యహంకారం"!*
కవిత సంఖ్య:50.
🔅🔅🔅🔅🔅
అగ్రరాజ్యమా....? ఎలా?
ప్రపంచానికి ఏం చేశావు?
ఎక్కడ నీ ఆదర్శాలు?
ఏది నీ పరిణితి......?
నీ పిడి గుద్దులలో అణిగిపోయింది,
నీ బూటు కాళ్ళకింద నలిగి నశించిపోయింది,
విరిచేసిన పెడరెక్కలలో మూగబోయింది,
నలుపు తెలుపు రెండు ముక్కలయింది,
నలిపేసిన నలుపు దావానలమవుతుంది,
దేశాల రగిలిస్తుంది మానవత్వాన్ని కదిలిస్తుంది,
నిను చుట్టేస్తుంది,
నెల్సన్ మండేలా వారసులై,
మార్టిన్ లూథర్ కింగ్ మణిదీపాలై, అంబేడ్కర్ ఆశయాలై, గాంధీ కాముకులై,
నిను ముంచేస్తది,
జాత్యహంకార హింసా క్రీడల దంచేస్తది,
నీ పతనం ప్రారంభమైతది,
నల్ల మచ్చయితది.
_రవికుమార్ కంచి_
🙏💐.
🔅🔅🔅🔅🔅
[09/08, 7:54 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 31.7.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44)
హైదరాబాద్,
శీర్షిక:
*దిగుమతి.*
కవిత సంఖ్య:51.
-----🎯-----
ప్రపంచ నలుమూలల
ప్రసరించిన
మేధో కిరణం
ప్రతి అడుగును
ఆవిష్కరణగ మలచిన తేజోరూపం
ప్రతి అక్షరం
ప్రశ్నను గెలిచిన
బాణమై సంధించిన
విల్లులై
సరిహద్దుల బయటే వెలుగులు
చిమ్ముతోంది
ఖరీదైన దిగుమతులై
ప్రతిస్పందిస్తోంది
ఆయుధమైనా
ఏ ఉత్పాదనమైనా
మన నుండే ముడిసరుకై
తరలి పోయి
అపురూప
దిగుమతై
దిగుతోంది
కోట్ల ద్రవ్యం
పరాయి చేతుల
మారుతోంది
మేధో వలసలు
ఆగేదెన్నడో
మన ప్రతిభ
మనకు వెలుగై
వెలుగేదెప్పుడో...!?
_-రవికుమార్ కంచి_.
🙏🌷
-----🛩️-----
[09/08, 7:56 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 31.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
హైదరాబాద్,
శీర్షిక: _*"ఉనికి"*_.
కవిత సంఖ్య:52
🔆🔆🔆🔆🔆
అజ్ఞాత దేవాలయ విజ్ఞాన దైవం నేను,
కొన్ని రోజులుగా పూజలు లేవు,
భజనలు లేవు,
భక్తులు లేరని కలవరపడ్డాను,
శక్తులు,వరాలు లేవనుకున్నాను,
నన్ను మరిచారనుకున్నాను,
నన్ను నేను మరిచి పోయాను,
ఒంటరయ్యాను.....!
కానీరోజు పండుగ జరిగింది,
సంబూరమయ్యింది, ఆరేళ్ల బాలిక జన్మదిన వేడుకయింది,
రంగుల కాగితాలు, తోరణాలు,
పిల్లల పాటలు నవ్వులు చప్పట్ల నడుమ,
పతాకమెగిరింది జయజయ నాదాలయినవి,
తీపి పంపకాలయినవి, నా ఉనికి నాకు తెలిసింది,
సందడి చేసింది.
_రవికుమార్ కంచి_🙏💐.
✨✨✨✨✨✨
[09/08, 7:57 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 31.07.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"అన్లాక్"🔓🔑.*_
కవిత సంఖ్య: 53.
🔅🔅🔅🔅🔅
అన్లాక్...
అన్లక్కీ అయ్యింది
లేదన్నది,తక్కువన్నది
వెక్కిరింతే అయ్యింది,
దేశం సునాయాసంగా 10 నుండి రెండో స్థానానికి ఎగబాకింది,
ఎంత అదిమి పెట్టామో ఎన్ని నియమాలు పాటించామో,
అంత ఎగిసి చెలరేగింది,
అంతకంత విచ్చలవిడిగా మారింది,
విధ్వంసక మరణమృదంగం మోగిస్తోంది,
ఎవరో కట్టడి చేయడం ఎవరో నిబంధనలు పెట్టడం,
వద్దన్నదే చేయడం నవ్వొచ్చే సాకులు చెప్పడం,
కాదు,
ఇక చాలు....
పరీక్షలు లేవు ఫలితాలు లేవు మందులు లేవు,
కఠిన పరీక్ష లే నీకు,
సహజీవన కరోనా సవాలే నీకు,
ఏది లాక్
ఎక్కడ అన్లాక్
నువ్వే చూసుకో,
నీకు నువ్వే విధించుకో నీ విధి లిఖించు
విధులు నిర్వర్తించు వీధిన పడకుండా కరోనా బారిన పడకుండా,
పడ్డా అధిగమించే ఆరోగ్యం,
రోగ నిరోధక శక్తి సాధించుకో,
జీవిత
సంరక్షణా పథక
రచన రూపొందించుకో...
ప్రకృతి ప్రకోపాలు,
ఉన్న రోగాల రొంపి కాక
కొత్త రోగమొచ్చి చేరె,
మాయలు జిత్తులు చేస్తుండె,
తాళానికి సరైన కీ లాగా,
సూదిలో దారం లాగా,
ఏ ఎండకా గొడుగుగా
అనిగి అనుగుణంగా విధానం,
జీవన విధానం మార్చుకో,
అయినా రాదనే గ్యారంటీ,వారంటీ లేదు,
శుభ్రత, భౌతిక దూరం పాటిస్తూ,
మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించుకోవడమే నీ కర్తవ్యం
లాక్
అన్లాక్
కాక తప్పదు,
ఏదీ శాశ్వతం కాదు...
నిరంతర కరోనా సమరం తప్పదు.
_రవికుమార్ కంచి_
🙏💐.
🔅🔅🔅🔅🔅
[09/08, 7:58 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 31.7.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*క్షోభ...!😰*_
కవిత సంఖ్య:54.
➖➖ ➖➖
నిప్పులై రగిలిన త్యాగాలు
ఆవిరైపోయిన ఆత్మబలిదానాలు
వేడి గాలులై ఎగిసిన ప్రాణాలు
చిమ్మ చీకటి కమ్ముకున్న
తడి లేక ఎండిపోతున్న
దయా దాక్షిణ్యాలు కరువైన
దక్షిణ తెలంగాణ జూచి క్షోభిస్తున్నాయి....!
ఎత్తున ఎగిసిన జ్వాలల మాడిపోతున్నా మాంస ముద్దలు కాలి రాలిపోతున్నా...
గొంతులో వేడి సెగలు పొగలు కక్కుతున్నా
జై తెలంగాణ...!
జై జై తెలంగాణ....!! నాదం నినాదం దద్దరిల్లి నింగికేగిన
అమర జ్యోతులు
మారని తెలంగాణ బతుకు చిత్రాల జూచి
బలిదానాలు వృధా అయినవని విలపిస్తున్నాయి.....!!
_రవికుమార్ కంచి_
🙏💐.
➖➖ ➖➖
[09/08, 8:00 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 01.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*'ఆన్లైన్ బడి'..!?*
కవిత సంఖ్య:55.
-----🖥️-----
అది ఫీజు కోసమో
పోజు కోసమో
విద్యా సంవత్సరం ఏమైద్దో ఏమోగానీ..
ఆన్లైన్ అమ్మకాల వలె
ఆన్లైన్ బడి పరుగులు మొక్కుబడిగ
సాగుతున్నయ్
వాడు వింటున్నాడో
తింటున్నాడో
అటెన్షన్లున్నాడో
ఏ టెన్షన్లున్నాడో
ఆటాడుతున్నాడో
ఏం చూస్తున్నాడో
ఏం చేస్తున్నాడో
చూసేదుందా
సరి చేసేదుందా
కళ్ళు మూతలు పడేలా
కాళ్ళు కప్పలయ్యేలా
ఒళ్లు కుప్పలయ్యేలా
ఓ చిన్న తెరముందు
రెప్పవాల్చని
విన్యాసాలు
ప్రత్యామ్నాయం లేని
పరిణామాలు
పాలక బడి
బందులు
కార్పొరేటు బడి
చిందులు
కుదేలైన వ్యవస్థలో
చదువులు
అయోమయం
బతుకులు భయం
భయం.
_-రవికుమార్ కంచి_
🙏🌺
----🌚📲----
[09/08, 8:00 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 01.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*'నిరుద్యోగులు'.*
కవిత సంఖ్య:57,
⚡⚡⚡⚡⚡
ఆశల ఆయాసల నడుమ వేలాడే అనామతు జీవులు,
లోకం ఇకమతులు ఒంటబట్టక అవకాశం కోసం ఒంటికాలిపై ఎదురుచూసే నిశ్శబ్ధ ప్రాణులు,
ఆశయాలున్నా అవకాశాలు శూన్యమైన దయనీయ మేధలు,
కాలు కదిపినా వేలూపినా వెంటాడే భయంకర బాధలు,
చదువులు మురిగి చెప్పులు అరిగి నిట్టూర్పుల నిరుద్యోగులు,
ముప్పై దాటిన మీసాలు,గడ్డాల
ఒంటరులు,
జీవన తత్త్వం చూసిన రుషులు,
పాలకుల ఆదరణ లభిస్తే,బాధల బంధాలు తెంపే మొనగాండ్లయితరు, చక్కని చుక్కల పోషించే,
సమస్యలనెదిరించే మొగుండ్లయితరు,
భరత భూమికి దేదీప్య కాంతులు నింపే సూర్యుండ్లయితరు,
ఎండినాకోలె గాలికి దొర్లే భృతిలేని,బతుకు గతిలేని, ఉదాసీన జీవుల పాలిట దేవుండ్లయితరు.
_-రవికుమార్ కంచి_.
💐🙏.
🔆🔆🔆🔆🔆
[09/08, 8:00 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 01.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*హాసం...*_😃🤣
కవిత సంఖ్య:56.
✨✨🤩✨✨
ముద్దు గొలిపే పెదాల నాట్యం
ముత్యాల దంతాల మెరుపుల మురిపెం
వినాళ గ్రంథుల వికాసం
నగుమోము నగిషీల హాసం దరహాసం
అలసిన శరీర మందగమన మస్తిష్కాల చురుకుల చమక్కుల రసాయనం హాసం
నూతన ముఖాల వినూత్న పరిచయం
ప్రేయసీ ప్రియుల ప్రేమ వారధి
పెద్దలు బంధువుల పలకరింపుల సుగంధం హాసం
రహస్యాలెన్నో అసహ్యాలెన్నో అపహాస్యాలెన్నో ఛేదించే పదునైన ఉల్లాస ఖడ్గం
మానసికానంద సుందర వనం
సకల రుగ్మతల నివారణోపాయం......
హాసం.
_రవికుమార్ కంచి_
💐🙏
🔅🔅🤣🔅🔅
[09/08, 8:00 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 01.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*'అగాధాలు'*
కవిత సంఖ్య:58.
------🌗------
అగాధాల లోతులు దూరాలు పెరుగుతున్నయ్, జారిపడితే కనిపించని శూన్యలోకా లవుతున్నయ్,
మాటల ప్రవాహాలకు చేతల అమలుకు మధ్యన చీకటి అగాధాలు రాజ్యమేలుతున్నయ్,
నిర్మలంగా కనిపించే సమాజ ప్రవాహాల మధ్యన,
కులకుతంత్రాల మత మౌఢ్యాల అగాధాలు నల్లని రాత్రులయినయ్ భయంకర స్వప్నాలయినయ్,
దూసుకెల్తున్న నూతన శతాబ్ధ శబ్ధాల నడుమ, దేశాలు మారినా ఖండాలు దాటి చదువులు హోదాలు పెరిగినా,పాత పాకురులు
నల్ల తెల్ల వర్ణాల మధ్య లోతైన అగాధాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నయ్
మనుషులు తీసిన గోతులేనని,
మారని మనసుల అపరిపక్వ నీతులేనని అపహాస్యం చేస్తున్నయ్.
_రవికుమార్ కంచి_
🙏🌹
---🙈🙉🙊---
59
[01/08, 6:43 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 01.08.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*"మూలాలు"...?*
కవిత సంఖ్య:59.
- -🌷👩🦰🌹- -
పాతాళం నుండి ఆయువు తోడే వేర్లు చూడక
ఆకాశం అంచులు అందుకోవాలనే చిగురుటాకుల ఆశలు చూడక
మధ్యన మొద్దుకు అతుక్కున్న మిడతోలె మిడిమిడి జ్ఞానంతో
చెంగుచెంగున ఎగురుతున్న మానవా.....!
మూలాలు మరచి మూలలు వెతుకుతున్నావ్ మూలకు పడుతున్నావ్...!
ఏ రంగో ఎంత పొడవో ఏ ప్రాంతమో తెలియదు
అందరికీ జన్మనిచ్చిన మహాతల్లి ఒక్కతే....!!
ఏ గీతలు గీసుకున్నా ఏ హద్దులు పెట్టుకున్నా
మూలం ఆమే....!!
మూలం ఒక్కటే అయితే
విభేదాలకు అర్థం ఉందా...?
ఒకే తల్లి పిల్లలకు వర్గాలు వర్ణాలు
ఉచ్చ నీచాలు
ఉత్తమ అధమ వర్గీకరణలు ఎలా పుట్టాయి....??
మూలాలు మరచి
జన్మస్థానాలు మరిచి
విచక్షణ లేని వివక్షలు ఏమిటి..?
బంధాలు
సంబంధాలు వదిలి
రక్తపాతాలు ఏమిటి..?
_రవికుమార్ కంచి_
🙏🌹
###🦗🦗###
[01/08, 6:45 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 1.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*'ప్రకృతిలో ఒక రోజు'*_.
కవిత సంఖ్య:60.
🦚🦜🌾🌴🌳
బండలు చెట్లు నిండి సాగు సోకు లేని నా భూమి వృధాగా పడి ఉన్న వ్యధా చిత్రమైనా,
గొప్ప చిత్రం చూపింది విచిత్రం చేసింది
వేపపుల్ల దంతధావనం తో సందర్శనం మొదలయింది,
బండి దిగగానే చెవుల్లో తేనెపోసి తీపిదనం నింపినట్లు
చుట్టూరా జొన్న చేనుల చేరిన పక్షుల కిలకిల రావాలు,
పక్కన యేసుక్రీస్తు ముళ్ళ కిరీటం మోస్తున్నట్లు మూసీ నీటిలో గుర్రపు డెక్కల ప్రవాహాలు,
నెమళ్ళ అరుపులు, సుదూరాన వ్యవసాయ పనుల ట్రాక్టర్ నుండి 'కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ....' ఇళయరాజా పాటలు,
ప్రకృతిలో ఒదిగిన సొగసులతో నన్ను నేను మైమరచి పోయాను
నేను కాదు కోట్ల మంది ఆరాధించినా ప్రకృతి సొగసుల సౌందర్యాల వర్ణించినా తక్కువే..!
పచ్చనాకుల,
ప్రశాంత గాలుల మధ్య
ఆకుల అన్నం
ఏ విందు భోజనంలో దొరకని మకరందం
భూమి ఊగుతుందా చెట్లు ఊపుతున్నాయా తేల్చే లోపు చెట్ల నీడలో, సోయగాల గాలుల్లో నిద్ర ఎప్పుడు పట్టిందో..!
స్వర్గం ఎలా చేరానో ఎలా తిరిగి వచ్చానో...!
అంతా ప్రకృతి మాయ,
సాయంత్రానికి చల్లని మబ్బులు తొలకరి జల్లుల తో గుట్ట గుండ్ల నుండి జల జల జారుతున్న అమృత ధారల సవ్వడులు
నిశ్శబ్దాన్ని చీల్చిన స్వరఝరులు..
ఇంపుగున్నయ్....
ప్రకృతి ఆకృతులు మహా
సొంపుగున్నయ్.
_రవికుమార్ కంచి_
61
[04/08, 7:17 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 04.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*'విజయ శిఖరం' 🚩*_
కవిత సంఖ్య:61.
°°°°°°°👍🌸°°°°°°°
ముళ్ల బాటల
నడవనిదే
పూల బాటలు
వేయరుగా
గతుకుల దారులు దాటనిదే
బతుకుల గమ్యం చేరవుగా
దురద బురదలు తొక్కనిదే
పల్లకీల మోత మోయరుగా
పర్రెలు తొర్రలు దాటనిదే
విజయ శిఖరం చేరవుగా
మడుగుల
అడుగులు వేయనిదే
పచ్చని పైరుల
చూడవుగా
కాలువల కాళ్లు తడవనిదే
విలువల మైళ్లు పొందవుగా
అలలపై పరుగులు
తీయనిదే
కలల పై ప్రపంచం
తాకవుగా
ఉరుములు మెరుపులు చూడనిదే
వర్షపు దారలు
రాలవుగా
అవమానాలు
తిప్పికొట్టనిదే
భవిష్యత్ అడుగులు
సాగవుగా
రాళ్ళు రంగులు భరించనిదే
పూల వర్షాలు కురవవుగా
అపజయాలు ఎదురవ్వనిదే
విజయ తీరాలు అందవుగా
_*-రవికుమార్ కంచి*_
👍🌻🙏
~~~~✊🌷~~~~
~~~~~~~~~~~~~~~
62
[04/08, 7:25 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 4.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*పునాదులు*_
కవిత సంఖ్య:62.
🔅🔅🏰🔅🔅
ఒక్క నెలకే కుదేలు
ముప్పై రోజులకే వ్యవస్థ బెంబేలు....!
ఉన్నత శిఖరం
ఆర్థిక సౌరభాల సౌధం
కాలువెంట కుప్పలుతెప్పలుగా పెరిగిన చొప్ప దండేనా...?!
ఆర్థికవేత్తల
చాణక్య నీతుల
రంకెల వృషభ పౌరుషాల
పునాదులు గ్రానైట్ రాళ్ళపై వేసినావా...?!
ఉత్త వర్షాలకు కరిగిపోయే మట్టి పెడ్డలతో కట్టినవా...!?
ఆర్థిక పునాదుల,
పరిశ్రమల కార్మిక
వలస పాదాల
ఆకలి ఆర్తనాదాలు ఆపే ప్రణాళికలు కరువా...!
మూలిగి ముక్కి సముద్రాల బియ్యంనాన బెట్టుడేంది...?
బుక్కెడు అన్నం పెట్టి ఉపాధి చూపలేని దయనీయస్థితిలో వ్యవస్థలు డొల్ల మేడలేనా...!?
నీటి బుడగల పునాదులపై గాలి మేడలు అతలాకుతలం కాక
ప్రళయాలకెదురు నిలబడతాయా..?!
దేశం మేధావుల నిలయం
సృజనశీలుర ఆలయం ,
వారి ఆలోచనలు సేవలు దృఢ భారతం నిర్మించాలి,
భయంకర విపత్తుల జయించే గట్టి పునాదులు పడాలి.
_రవికుమార్ కంచి_
🙏🌷
##//###//##
63
[04/08, 7:25 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 4.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"ఫ్రంట్ లైనర్స్"*_
కవిత సంఖ్య:63.
🌷🌷✊🙏🌷🌷
ముందు వరుస వీరులారా
ముప్పు అంచున తలవంచని వెనుతిరగని
ధీరులారా....
మీకు సెల్యూట్
యాభై రోజులు మీరు మీరు కాదు
ఏం తిన్నారో..!
ఎలా ఉన్నారో...! ఎక్కడున్నారో...!!
కానరాని పురుగుల పాలిట కాలయములై కాపలా కాశారు
నిశ్శబ్ధ యుద్ధాలు మౌన గాయాలు భరించి ఎదుర్కొన్నారు
ఎన్నో ప్రాణాలు
రక్షించారు,
ఇప్పుడు బేడాలు తీసేసి తాళాలేసి మత్తుల గమ్మత్తులు చేసిన
ఏలికలు
మీకు రెండో దశ యుద్ధమేఘాలు కమ్మించాయి,
రక్షణ కవచాలు పరీక్షల పథకాలు లేని,
అణుయుద్ధాల మించిన
విష కణ యుద్ధాలు చేపిస్తున్నయ్,
ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత ప్రదర్శిస్తున్నాయి
జనాల దూకుడు ప్రభుత్వ ఆదేశాల నడుమ
మీ యుద్ధ ప్రతిఘటనలు తీవ్రతరమయ్యాయి,
సాన పట్టని,
వాడి లేని మొండి కత్తుల
వేడి యుద్ధాలు మొదలయినయ్,
మీకు సహనం త్యాగాలే అణ్వస్త్రాలవ్వాలి
విజయం మీదే కావాలి చరిత్రై నిలవాలి
సెల్యూట్ ఫ్రంట్ లైనర్స్...
_రవికుమార్ కంచి_
🌷🙏
⚡✊👨⚕️💂♂️✊⚡
64
04.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"తొలకరి"⛈️*_
కవిత సంఖ్య:64.
🌦️🌦️🌱🌱🌦️🌦️
తొలకరి గుండెలనిండా కురిసింది సంతోషాల అలుగు పారింది
చెరువుల పొలాల ప్రాణధారల నింపింది,
మట్టిలో దాగిన విత్తన ముత్యాలు
వర్షబిందువుల పట్టి
ఉబ్బి తబ్బిబ్బ వుతున్నాయి
నేల పొరలు చీల్చి నవ్వడానికి ఉవ్విళ్ళూరు తున్నాయి
భూమ్యాకర్షణల నెదిరించే పచ్చని
నేల పతాకాలవుతాయి
గాలికి సిగ్గుల
మొగ్గలూగుతాయి
ఆశల నోళ్ళ కరిగే కమ్మని ఫలాలౌతాయి
జీవకణోత్పాదక శక్తులవుతాయి
విశ్వకర్మాగారాల నడిపే ఉత్పాదక శ్రమలు
పరిశ్రమలవుతాయి
తిరిగి విసర్జితాలై
నేల సారములైతాయి తొలకరి చుక్కల కరిగి విత్తన మొలకలవుతాయి మరల తొంగిచూస్తాయి
మరల మరల పలకరించే జీవ నేస్తాలవుతాయి.
_-రవికుమార్ కంచి_.
💐🙏.
🌦️🌦️🌱🌱🌦️🌦️
✨✨✨✨✨
65
[04/08, 7:43 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 04.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*ఆసియా ఖండమా...!*
కవిత సంఖ్య:65.
------🌏-------
ఆసియా ఖండమా...
ఆకలి ఖండమా....
అందని మెతుకుల భాండాగారమా....!!?
పేదల ఆశల చిగురులు చిగురించని, ఆశయాల కొమ్మలు విస్తరించని
సౌందర్య సుగంధాల నవ్వులు పువ్వులు పూయని
గోసల మొండి కాండమా...!
జనసంద్రం ఉప్పొంగే అనంతసాగర శక్తులున్నాయి
అమృత ధారలు పొందే క్షీరసాగర మేధోమధనా
లున్నాయి
సకల ప్రకృతి
సంపదల వనాలున్నాయి
అనంత కోటి లక్ష్యాల అంతరిక్షాలనందుకునే అసంఖ్యాక మానవ వనరులున్నాయి
కానీ.....
కరోనా కాటుల కన్నా ఘోరమైన
విషపు దాడుల కన్నా దారుణమైన
పస్తుల పతనాలు
పేదరిక ప్రాకారాలు
నిరుద్యోగ నిట్టూర్పులు
కోట్ల సంఖ్యలో పెచ్చరిల్లిపోతున్నాయి
ఆత్మబలిదానాలు త్యాగాలతో
ఆకలి తీర్చుకుంటున్నాయి...!
ఎంత పరిజ్ఞానం ఉన్నా
భయంకర రోగాలు వ్యాపించినా
బక్కచిక్కిన పేదవాళ్ల డొక్కల పై నాట్యమాడుతున్న ఆకలి ఆర్తనాదమే అగ్రస్థానమైతున్నది....!!
వంద కోట్ల ఆకలి
నోళ్ళ రోదనలే ప్రముఖ స్థానమైతున్నది....!!
కోటలు గొప్పలు యుద్ధోన్మాదాలు కాదు
యేండ్ల నుండి వింటున్న
కూడు గూడు గుడ్డ కావాలి
మానవత చూపాలి.
_రవికుమార్ కంచి_
🙏💐
🔅🔅🌏🔅🔅.
66
[04/08, 7:46 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 04.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"బడి త(ల)లుపులు"...!*_
కవిత సంఖ్య:66.
###🏛️###
ఎన్నడు రాని ఆపదలొచ్చె
మూడు నెలల సెలవులొచ్చె...
అక్షరాలు దారితప్పి పుస్తకాలు బూజు పట్టి నిరంతర ఆటపాటలు బోరు కొట్టి
నేర్చుకున్న దాచుకున్న విద్యలు ఎండకు ఆరిపోయి
గాలికి కొట్టుకుపోయినయ్...!
ఆన్లైన్ ఆఫ్లైన్ బోధన లేక
ఏ లైను లేక
దిక్కు తోచక బడి బుడతలు ఉడుతలై తిరుగుతున్నరు
బడి పిల్లలు బడి వైపే ఆశగా చూస్తున్నరు...!
ఇకనైనా తలుపులు తెరుచుకుంటే దూరమైన దోస్తులు కలుస్తరు
ఆటలు ఆడడం పాటలు పాడటం చక్కని బొమ్మల కథలు చదువుతమని ఎదురుచూస్తున్నరు తలపులలో తడిసి పోతున్నరు
రైతులు మబ్బుల
వానల కొరకు చూస్తూ
మట్టి వాసనల పసిగడుతూ
వర్షాలు ఆహ్వానిస్తున్నట్లు
బడి పిల్లలు విద్యా దేవాలయ విజ్ఞాన వేదికల ద్వారాలు తెర్చుకోవాలని దిగులు పెట్టుకున్నరు
కళ్ళార్పక చూస్తున్నరు
స్కావెంజర్ను వంటామెను అడుగుతున్నరు
సార్లొస్తరా సదువు చెప్తరా...!
రాతలు రాపిస్తరా...!!
మంచి బుద్ధులు నేర్పిస్తరా....! అని ఆతృతగా ఆరా తీస్తున్నరు
ఆరాట పడుతున్నరు....!
_రవి కుమార్ కంచి_
🙏💐.
☘️☘️🏛️☘️☘️.
67
[04/08, 7:50 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 04.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"అపాయానికి ఉపాయం"...🌀✳️*_.
కవిత సంఖ్య:67
🔅🔅🔅🔅🔅🔅
ఊరికే కూసోని ఉదాసీనంగా అడ్డమొరిగి
భయం గుప్పిట్లో నలగడం
భవిష్యత్ జీవితం పై బాధపడడం
కరోనా కష్ట నష్టాలకు జంకి కుమిలి కుంగడం
సునాయాసంగా, ఖర్చు లేకుండా టెన్షన్ పడడం
ఎవరైనా చేస్తరు,
ఎవరికైనా వస్తది, జరుగుతది....!!?
ఈ ఉచిత భయాలు అల్కటి ఆపసోపాలు ఉపాయంతో కరోనా అపాయాన్ని
కఠిన ప్రమాదాన్ని ఎదిరించుదాం నివారించుదాం
జయించుదాం....!
సెల్ఫ్ లాక్ డౌన్ శుభ్రత మాస్క్ ధరించడం కళ్ళద్దాలు గ్లౌజులు వాడకంతో పాటు
ఖచ్చితంగా నిర్మొహమాటంగా కుటుంబ సభ్యులైన బంధువులైన
బజారైనా దుకాణమైనా కార్యాలయమైనా భౌతిక దూరం పాటించు
వీటన్నింటి కన్నా
నీ నిర్లక్ష్యం వదులు చైతన్యంగా కదులు
అనుమానం అవకాశమున్నా లేకున్నా
మంచి ఆలోచనలు పెంపొందించు
మంచి ఆహారం స్వీకరించు
వేడి నీటి ఆవిరిల తరించు
వేడినీటినే సేవించు
గొంతు సవరించు
గరళకంఠునోలె
కంఠంలో విష కణాల సంహరించు
చీటికి మాటికి బయట చిందులు వద్దు తప్పదంటే జాగ్రత్తలు పాటించు
ఓపికతో ఉపాయంతో అపాయాన్ని దూరం పెట్టు
జీవన సమరాన్ని ఛాలెంజ్గా చేపట్టు ఆనంద శిఖరం చేరేటట్టు
కొత్తలోకం చేరేట్టు...!
_రవికుమార్ కంచి_
68
05.08.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*'అవకాశం రాక పోదు'....!?*_👍🌤️.
కవిత సంఖ్య:68.
🌻🌻🇮🇳🌺🌺
మనకంటూ....
సంక్లిష్ట సమస్యలు
సరళతరం చేసే ఒక
ఆలోచన ఉంటే...
ఏదో ఒక రోజు
అవకాశం రాకపోదు అందలం
ఎక్కకపోము..
మనకంటూ....
ప్రపంచ గతిని
నిర్దేశించే ఒక గొప్ప
పరిష్కారం ఉంటే....
అవకాశం రాకపోదు చరిత్ర సృష్టించక
పోము...
మనకంటూ....
మానవ ఉన్నతీకరణ జరిగే ఒక పరిశోధన
ఉంటే....
అవకాశం రాకపోదు
వరుస నోబెల్
పురస్కారాలు
పొందకపోము...
మనకంటూ....
క్రీడాభివృద్ధి
క్రీడాస్ఫూర్తి చూపే
ఒక గుణముంటే....
ఏదో ఒక రోజు
అవకాశం రాకపోదు
ఒలంపిక్ పథకాల
జాబితాలో మొదటి
స్థానం
పొందకపోము...
మనకంటూ....
జెండా ఎజెండా
ఉంటే...
విశ్వ వీధిలో భారత
నాయకత్వం నడిచే
ఒక అవకాశం
రాకపోదు
గర్వంగా తలెత్తుకోక పోము....
మనకంటూ...
పోరాట పటిమ
ఉంటే....
ఒక అవకాశం
రాకపోదు..
విజయ గర్వంతో
మన జెండా
ఎగరకపోదు...🚩👍✌️✊👊
_*- రవికుమార్ కంచి*_
🙏🌷
~~^^~~🌸~~^^~~~
69
[05/08, 6:16 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 05.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*"బడి పిట్టలు"* 🐧🐤.
కవిత సంఖ్య:69
******😃******
పిల్లల్లారా పిట్టల్లారా....!
చెట్లు చేనులు
పుట్టలు తెట్టెలు హద్దులు చెరిపి
సుద్దులు వినక
వద్దులు భరించక
తుమ్మి ష్కలై
తిరుగుతున్న
పిల్లల్లారా పిట్టల్లారా....!
గూళ్ళ్ళకు చేరి సంచులు తెరిచి బడిలో చదివిన
సార్లు చెప్పిన
రాతలు పూతలు పుస్తకాల దుమ్ము దులపండి మూతబడినవి తెరవండి
కరోనా కాలం ముగిసే లోపల
చదువని చదువులు
రాయని రాతలు
ఏమైనుంటే
మరిచిన ప్రశ్నలు వదిలిన
అభ్యాసాలు
శ్రద్ధగా మీరు చేయండి
కరోనా సెలవులు దండిగా ఉండె బుద్ధిగా మీరు రాయండి
బడి తెరిచే లోపల సంసిద్ధత సాధించండి.
_-రవికుమార్ కంచి_
💐🙏.
70
****🐣🐥🦆****.
[05/08, 6:16 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 05.8.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*'సరిహద్దురేఖ'*._
కవిత సంఖ్య:70.
🌸🕊️🌞🕊️🌸
ప్రశాంత వాతావరణంలో నిద్రించి
ఎత్తైన శిఖరాలు లోతైన లోయల తాకుతూ మైమరపించే చల్లగాలులు పరిమళాలు పీల్చి,
జలపాతాలు హిమపాతాలు
మంచు కొండల వెండి మెరుపులు చూసి
ఎనిమిది దశాబ్ధాలు గడిచింది
హద్దుగా ఉండడమే నేను చేసిన పాపం
సరిహద్దుగా నిలవడమే నన్ను వరించిన శాపం...!
సోదరత్వం మరిచి శత్రుత్వమె జెండాగా ఆక్రమణలు రహస్య దాడులు ఆధిపత్యాలే ఎజెండాగా
సాగిస్తున్న ముష్కర, సైనిక హింసాక్రీడలు
రక్త పాతాలకు
శిలనై శిథిలమై నిలిచిన మూగ సాక్ష్యం నేను....!
పేరుకే నేను సరిహద్దురేఖను
నియమాలు ఒప్పందాలు
ఈ రాళ్ల,మంచు గడ్డలు,
లోయలకే పరిమితం...!
నా ముందు ఎన్నో ఉల్లంఘనలు కవ్వింపులు దాడుల వర్షాలు కోకొల్లలు...!
మాటొకటి చేతొకటి
లక్షల బలగాలు
కోట్ల బడ్జెట్లు ఏటేటా రెట్టింపులు
వందల సంఖ్యలో బలిదానాలు ఆస్తి నష్టాలు విపరీతాలు...!
దేశాభివృద్ధి,
ప్రజల జీవనోపాధి సదుపాయాలు కల్పించక ఇరుగుపొరుగు దేశాలు
ప్రగతిబాటలు మరిచినయ్
పోరులై పొర్లుతున్నయ్...!
నాపై శాంతి కపోతాలు స్వేచ్ఛగా ఎగరాలి
సోదర భావనలు జాతి పతాకాలై కదలాలి...
యుద్ధోన్మాదాలు నశించి
బౌద్ధ ప్రభోదాలు మారుమోగాలి.....
_-రవికుమార్ కంచి_
💐🙏.
🌿🕊️🌞🕊️🌿.
71
[05/08, 6:55 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 05.8.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
(44)
హైదరాబాద్,
శీర్షిక:
*☀️ 'యోగా'.*
కవిత సంఖ్య:71.
🔅🔅🧎♀️🧎♂️🔅🔅
అసమతుల జీవన విధానాల
అశాంతుల మానసిక సమరాల
తేజోకాంతుల వికాస మార్గం
సహజ పొద్దుపొడుపుల ఆరోగ్య సాధనం యోగ
సకల దేశాలకందించిన ప్రకృతి చికిత్సల భారతీయ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల అద్భుత భంగిమ,
ప్రశాంత చిత్తాల పరిణితి పరిమళాల సున్నిత సునిశిత లక్ష్య ఛేధనం
శారీరక మానసిక ఒత్తిడుల నివారణా మంత్రం యోగా
నిత్యం యోగ సాధనమే
మేలైన నిజమైన జీవన సత్యం.
_-రవికుమార్ కంచి_
🙏🌹
🌀🧎♀️🧎♂️🌀.
[05/08, 7:01 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 05.8.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
🌞 _*"నాన్న".*_
కవిత సంఖ్య:72.
➖➖🚀🎯➖➖
నన్ను ఎత్తుకోవడం నేర్చుకున్న చేతులు
ఎక్కడా దించలేదు
దారి చూపి నడిపించిన చేతులు
ఎప్పుడూ వదలలేదు ఎన్నడు గురి తప్పలేదు
నాన్న సైకిల్ పై
చిన్న ముందు సీటు నాది
ముద్దుగా ముందుండాలి పరిశీలించి ముందడుగు వేయాలన్నది.....!
తొక్కేది నాన్నే అయినా ముందుగా దూసుకెళ్తున్నది నేనే...!
నాన్న ఇంజన్ తో రివ్వున పోతున్న రాకెట్ నేను
ఏ లక్ష్యమైనా 'ఢీ' కొట్టగలను
ఏ అంతరిక్ష గ్రహమైన చేరగలను.....!
నాన్న 'కీ' ఇచ్చి వదిలిన బొమ్మను నేను
ఆ వేగం తగ్గే లోపు
నా సొంత రెక్కల విప్పుతాను
నాన్నకు
మరోరెక్కనవుతాను....
_-రవికుమార్ కంచి_
🙏🌹
🌼🌼🚲 🌼🌼.
[05/08, 7:06 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 05.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
(44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*"బిరుదులు".*_
కవిత సంఖ్య:73.
🌀🌀🤴🌀🌀
మీ అద్భుత ప్రతిభా పాటవాల కథలు కవితలు పాటలు చిత్రాలు
అచేతన అజ్ఞాన మెదళ్ల
మెరుపు వేగం సృష్టించాలి
మరపురాని ఉత్తేజాన్ని నింపే
అద్భుత కళాఖండాలు కావాలి
మహా ప్రపంచ నిర్మాణం చేయాలి
మెరుగైన సమాజం సృష్టించాలి
ఆ సమాజం నువ్వు గెలవాలి
నిన్నది గెలిచి గొప్పగా చూడాలి
నీ మేధను సహజ సృజనను కీర్తించాలి
అంతేగాని.....
అరువు తెచ్చిన అడుక్కొచ్చిన
కొనుక్కొచ్చిన బిరుదులు సత్కారాలు సన్మానాలెందుకు...!?
మీ ప్రతిభపై మీకు అనుమానాలెందుకు
అసంబద్ధ గొప్పలకై పాకులాటలెందుకు....!?
కాలం సమాజం విలువైన మాణిక్యాలకు
మసి పూయదు
మానవతా
సామాజిక
కళా చైతన్య మూర్తులను
అణగదొక్కదు
అందరి గుండెల్లో గొప్ప స్థానమిస్తుంది
చరిత్ర గ్రంథాల్లో
మీ కళాసేవకు ఉత్తమ విలువనిస్తుంది
ఒక శ్రీ శ్రీ
ఒక సినారే
ఒక రవీంద్రుని సరసన చేరుస్తుంది
జేజేలు పలుకుతుంది.
_రవికుమార్ కం
74
[06/08, 6:17 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 06.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'పాక్ తోక వంకర'....!?*
కవిత సంఖ్య:74.
➖➖🦮🐉➖➖
కలుపు మొక్కను
పోషిస్తున్న చప్పిడి
ముఖానికి బుద్ధి రాదు
దానండతో ఏపుగ
పెరుగుతోంది
దానూతంతో
పేట్రేగిపోతోంది
ఆవల ఈవల
ప్రశాంత ప్రకృతిపై
పడిన చీడ మొక్క
ఎన్నాళ్లకు
విరగడవుతుందో
పర్వత ఒంపుసొంపులు
కనబడవు
మంచు కొండల వెండి మెరుపులు
కనబడవు
ప్రశాంత సరస్సు ఒడ్డులు దర్శించవు
చల్లని మంచు ఇసుకలు క్రీడించవు
నిత్యం కవ్వింపులే అనునిత్యం బాంబుల
మోతలే
ఒకవైపు చొరబాట్లు
మరోవైపు
మాదకద్రవ్యాలు
మతం ముసుగులో
తీవ్రవాదాలు
చెంప దెబ్బలు
వాయించినా
వీపు విమానం
మోత మోగించినా
మారని నైజం
పాక్ తోక వంకర..!
ఇంకేం
మారుతుంది..!?
ఎప్పటికైనా
బూడిదవుతుంది!.
_-రవికుమార్ కంచి_
🌸🌻🏵️
➖➖🐲🦮➖➖
[06/08, 6:25 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 06.8.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
🌀 _*'కదలిక'.*_
కవిత సంఖ్య:75.
🏃🏽♂️🚶♀️" ..".."..".."
ఒక్కో అడుగు వేస్తుంటేనే
ఒక్కో మెట్టు ఎక్కుతుంటేనే....
దూరం ఎంతో తెలుస్తది
ఎత్తు ఎంతో ఎరుకయితది
నువ్వు యాడున్నది
నీ స్థితి ఏమిటి
గతి ఏమిటి
లక్ష్యం ఏమిటో కనబడుతది.....
గెలుపైనా ఓటమైనా
నీ కదలిక తప్పనిసరే
నీ పరుగు అత్యవసరమే....!
చైతన్య పరిశోధన
ఆసక్తుల ఆవేదన
సృజనాత్మక ఆలోచన అనునిత్యం అవసరమే ప్రతినిత్యం ఇది సత్యమే.
_రవికుమార్ కంచి_
💐🙏
🏃🏽♂️➖➖➖➖
[06/08, 6:25 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 06.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*'బడి'...*._
కవిత సంఖ్య:76.
➖➖🔆➖➖
బడుంటే
బడంటే ......ఇది!
అంటుంటే మురిసేదాన్ని
పచ్చని చెట్ల మధ్య పక్షుల కిలకిల పలుకులతో
పిల్లల చదువులు ఆటలతో
పులకరించే దాన్ని
ఇప్పుడు బడంటే
ఇదా....!
అంటుంటే బాధేస్తుంది!
పచ్చని చెట్ల ఎండుటాకులు రాలి గాలికి కదిలే సవ్వడే మిగిలింది
పలకరింపులు పులకరింపులు మూతబడి
నాకు ఒంటరితనమే
మూగాధ్యయన
మయ్యింది.
నా ఒడిలోకి పుస్తకాలు పిల్లలు చేరాలి
కూతబడి
చదువుల మోతబడి
కావాలి
_-రవికుమార్ కంచి_.
🙏💐
➖➖🌿➖➖.
77
06.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*'సమసమాజం'.*_
కవిత సంఖ్య:77.
➖➖🌵➖➖
మనువాదం
మత వాదం
కులవాదం.....
సమాజ మహావృక్షపు తల్లి వేరై పాకింది
తరతరాల తల్లడిల్ల జేస్తుంది
నవ మానవులెవరైనా
విశ్వ చైతన్య
వీరులెవరైనా
సంస్కర్తలెవరైనా
ఆకులన్ని రాల్చినా కొమ్మలన్ని నరికినా కాండం ఖండ ఖండాలు చేసినా
చెడు వాదం పిడివాదం వితండవాదం మూలాలై కూసుంది
విష మూటలై దాగుంది
విష బీజం వ్యాప్తి చేస్తూ
మూఢత్వపు చిగుర్లేస్తుంది
పక్షపాత అమానవీయ
కవితలు పాటలు పాఠాలు
గ్రంథాలు పురాణాలై మర్మంగా విష సంస్కృతి పెంచింది
అంతరాల దొంతరల
ఆధిపత్య నిచ్చెనలు జనుల విచ్ఛిన్నం చేసింది
అన్యాయపు రీతులతో అణగదొక్కి పెట్టింది
సేవకులై బానిసలై
అణిగి అణిగి బతకమంటు
పీడితులై తాడితులై
నలిగి నలిగి
నడవమంటు
కపట నీతులు చెప్పింది
కటిక దరిద్రం చేసింది
పిడితుడా బాధితుడా...
ఆ వేరుల ఆ కొర్రుల
రంపాలై కోసిపడెయ్
కాగడాలై కాల్చిపడెయ్
నవ మానవ
విలువలతో
నిత్య చైతన్య వెలుగులతో
కుటిల ఆచారాల కూకటి వేర్లను పెకిలించి పీకి పడెయ్
సమానత్వ బీజాలను వడివడిగా నాటేసెయ్
నూతనత్వ ఫలాలను కుప్పలుగా పోగేసెయ్ సమ సమాజ నిర్మాణం గట్టిగ నువ్వు చేసేసెయ్
_రవికుమార్ కంచి_.
💐🙏
🔆🔆✊🔆🔆.
78
6.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*🌴'హరితహారం'.*
కవిత సంఖ్య:78.
🌱🙂🌳🙂☘️
తెలంగాణ వీరులారా
తెలంగాణ పౌరులారా
కొట్లాడి సాధించిన తెలంగాణ
నీళ్ల చుక్క పారని ఎడారి మరణవీణ
ఒక్కొక్కరు ఒక మొక్క చక్కగా నాటాలి
చిక్కని అడవోలే చక్కని పచ్చని తెలంగాణ చేయాలి
తెలంగాణ తల్లికి ఆకుపచ్చ కొంగు వేయాలి
కొండలైన గుట్టలైన గట్టులైన
మొక్కలన్నీ నాటాలి
పచ్చదనం పెంచాలి
చెట్లంటే భూమికి పెట్టిన పచ్చ గొడుగు
చెట్లుంటే గాలి కాలుష్యాన్ని కడుగు
చెట్లు పెంచితే వర్ష ధారలు నిండవా నీటి మడుగు
పరిసరాలు జీవులు చెట్లతోనే ఆరోగ్యం అందం ఆనందం పొందు
చెట్లలోనే జీవనం సౌభాగ్యం సుసంపన్నం చెందు
చెట్లు లేని జీవం
భూగోళం భవిష్యత్ ప్రశ్నార్థకం
మొక్కలు చెట్లు
నీ ప్రగతికవే మెట్లు సోదరా....!
హరితహారం విజయవంతం చేయడమే సరైన పరిష్కారం
నీ పరిహారం
వినరా....!
_-రవికుమార్ కంచి_
🙏💐
🌱🐦🌴🐰🌴.
79
[06/08, 7:53 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 06.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*"ప్రయాణం....".*
కవిత సంఖ్య:79.
🏛️......,,,️🚌,,,........,,,
బడి వైపు వేసే అడుగులు
వృత్తి నిబద్ధతతో
చేసే ఉరుకులు పరుగులు
ఎన్నో ముఖాల దర్శనం చేస్తున్నయ్
మరెన్నో భావాల పలకరిస్తున్నయ్
ఆత్రుత ఆరాటాలు నిరసనలు నీరసాలు
బస్సులో వేలాడుతున్నయ్
పొగత్రాగరాదు,
స్త్రీలను గౌరవిద్దాం
ప్రజాప్రతినిధులకు, దివ్యాంగులకు, వృద్ధులకు,
వాక్యాలు వద్దన్నా అటూ ఇటూ కదిలినా తప్పక కనిపిస్తున్నయ్
భిన్న వేష భాషల
విభిన్న బాసల వ్యవహారాల చిత్రప్రదర్శన
లైతున్నయ్
కొందరి నవ్వులు అందరి ముచ్చట్లు
కొందరి నిద్రలు
మరెందరో మూకుమ్మడులై
పరుగుతీస్తున్నయ్
ప్రయాణ లక్ష్యం చేరగానే
నవ్వుల పువ్వుల స్వాగతాలు
ప్రశాంత పచ్చని ప్రకృతి ఒడిలో పక్షుల సవ్వడిలో
బడి ఆహ్వానాలు
సమ్మోహన పరిచినయ్
ప్రయాణజీవనం
పాఠ్యబోధనానందం
నిత్య జీవితానుభవ మధురస్మృతుల పేజీలై పరిణితులు సాధిస్తున్నయ్.
_-రవికుమార్ కంచి_
💐
🌷🌷🌷🌷🌷🌷
80
[06/08, 7:55 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 07.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*"ఆటవికం"....!.*
కవిత సంఖ్య:80.
-----⚜️-----
-------------
శాంతి వచనాలు పలుకుతున్నాం
ప్రపంచ శాంతి బహుమానాలు పొందుతున్నాం.....
సామరస్యాలు వదిలి చర్చలు మాని కయ్యానికి కాలు దువ్వుతున్నాం.....
****
లక్ష్మి కాలు పెడితే మంచిదన్నాం
మహిళ ఇంటింటా వెలసిన దైవమన్నాం
దేశదేశాల కానరాని దైవం
నలిపేయడమే తప్ప
కాపాడలేని దైన్యం
ఆడపిల్లంటేనే బరువనే కలికాల వైనం
****
ఎన్నో మానవ వనరులు
మరెన్నో విలువల హక్కుల నిలబెట్టే సంస్థలు
కులమత హింసలు జాతి విధ్వంసాలు విద్వేషాలు అణచివేతలు
కోకొల్లలు
****
నాగరిక సమాజమా
అనాగరికం వదలని ఆటవిక సమూహమా
ఎటు నీ పయనం
ఏది నీ పరిణామం
ఎక్కడ నీ పరిణితి....??
_-రవికుమార్ కంచి_
🙏
-----☘️🌹-----
---------------
81
[07/08, 6:07 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 06.8.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44)
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'ఆచార్యా... వందనం'*
కవిత సంఖ్య:81.
~~~~~✊~~~~~
ఆచార్యా....
నీళ్లు నిధులు నిరుద్యోగ సమస్యల
సాధనే లక్ష్యంగా
యాస భాష
సాంస్కృతిక
ఆత్మగౌరవం
నిలబెట్టుడే
పరమావధిగా
సూత్రాలై
నిలబడితివి
సిద్ధాంతాలై
నిలబెడితివి
ఊపిరులై
కలెబడితివి
ఆచార్యా
జయశంకరా....
నీకు వందనం....
మలిదశ తెలంగాణ పోరాటం
మడమ తిప్పని ఆరాటం చేసేస్తివి
ఇప్పుడు కాదా....
మరెప్పుడు కాదని
ఇప్పుడు రాదా... మరెప్పుడు రాదని
మూల స్తంభమై నిలబడితే
నిశ్శబ్ద తరంగమై ఉప్పొంగితే
వికసించిన
తెలంగాణ
సాధించిన
తెలంగాణ
నీ ఆశయ
సౌధముకై
మున్ముందుకు సాగాలి
నీ శ్వాసల గర్జించిన
జై తెలంగాణ నినాదం
అభివృద్ధై నిలవాలి.
జై తెలంగాణ
జైజై జయశంకర్.✊
_- రవికుమార్ కంచి_
🌻🌷
82
▪️▪️🌺▪️▪️
[07/08, 6:13 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 07.8.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*"పీవీ".*
కవిత సంఖ్య:82
--__--❇️__--__
పీవీ.....
శత కీర్తులు మీవి
శత ప్రణామాలు
శత నివాళులు మావి
ఆలస్యంగానైనా అర్పించనీ మేధావీ
బహుభాషా ప్రావిణ్య
ఠీవి
మరిచినాడు నీ గొప్పలు కవి
హర్షించదు స్మరించని భువి
నిరాడంబర నిర్మల మేధోజీవి
భారత ఆర్థిక వ్యవస్థ దృఢ
పునాదులు కట్టిన శ్రమజీవి
కఠిన జఠిల సమస్యల్లోనూ
భావి భారత ప్రగతి చూపిన
తెలుగు జాతి
దక్షిణ ద్రవిడ జాతి
ఆశాజీవి....
పీవీ
అందుకో మా ఘన
అశ్రునివాళి.
_రవికుమార్ కంచి_
💐🙏
--__--✳️__--__.
83
[07/08, 6:18 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 07.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*భిన్న కోణం.*_
కవిత సంఖ్య:83.
-----⁉️-----
నాకు రాయనిపించింది
నీకు ఆరాధ్య దైవమనిపించింది
నీకు కులగోత్రాలు గొప్పైతే
నాకు ఆ ఉచ్ఛ నీచాల గోతులే ముప్పై ముంచుతున్నయ్
నాకు కుల వృత్తుల బతుకు చిత్రాలు పోరాటాలైతే
నీకు అవి నిరంతర సౌభాగ్య సేవలు
నీకు విలాస బాబాలు దేవుళ్ళైతే
నాకు కపటత్వం నిండిన చిల్లర చోరులు కన్పిస్తున్నరు
నీకు కవితలు కథలు కాలక్షేపాలైతే
నాకు నా స్థితిని గతిని
సమాజాన్ని మార్చే అక్షర నిప్పుల బాణాలు
నీకు వానజల్లులు కాసేపాడుకునే షవర్ బాతైతే
నాకు టప టప రాలే చినుకులు ప్రాణాధారాలు
నీకు ప్రతి సంబంధం వ్యాపారం
ప్రతి మనిషి ఆట వస్తువైతే
నాకు ప్రతి ఒక్కరు మానవరూపం దాల్చిన దైవం
ఏది తప్పు....
ఏది ఒప్పు.....!?
_-రవికుమార్ కంచి_
🙏💐.
-----💐-----.
84
[07/08, 6:24 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 07.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*గాల్లో దీపం 🪔.*_
కవిత సంఖ్య:84.
➖➖🕯️➖➖
➖➖➖➖➖
గాల్లో దీపం కరోనా జీవితం
వత్తి గట్టిదయితే నిలబడ్తది
చమురు నిండా ఉంటే వెలుగొస్తది
గాలినే నమ్ముకోవడం గాలినే వేడుకోవడం
గాలి తగ్గాలనుకోవడం
గాలిని బంధించే చేతులు కావాలనుకోవడం
గాలి నాపే ప్రభుత్వాలు రావాలనుకోవడం
ఉత్త గాలి కోరికలే...!
గుడ్డి నమ్మకాలే....!
కరోనా ఈదురుగాలిలో
జ్వాలలా వెలగాలంటే
తట్టుకుని బతకాలంటే
నువ్వు గట్టి వత్తివి కావాలి
చమురనే మంచి ఆహారం నిరంతరం
కావాలి
బలమైన రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలి
ఏ చీదర గాలినైనా ఎదిరించి నిలబడాలి
అప్పుడే నువ్వు దీపం
గొప్ప వెలుగునిచ్చే అఖండ దీపం
నీ వెలుగు నీక్కూడా వెలుగవ్వాలి
నీకు నువ్వే వెలుగివ్వాలి
నిన్ను నువ్వే రక్షించుకోవాలి.
_-రవికుమార్ కంచి_
💐🙏
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
85
[07/08, 3:58 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 07.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*'Asymptomatic'...!.*_
కవిత సంఖ్య:85.
_ _ _ _ 🙃_ _ _ _
సమాజం తనలో మోసాలు దౌర్జన్యాలు
చుట్టి పెట్టుకుంది
కుట్రలు కుతంత్రాలు
దాచి పెట్టుకుంది
మూఢాచారాలు
విష మూలికలు నాటుకుంది
asymptomatic గా
ఆ లక్షణాలు కనబడకుండా
ఆ తెగుళ్ళు తెల్వకుండా
సమాజం తనలో తాను కుంగి కృశించిపోతున్నది
పైకి అంతా బాగుందని
పరీక్షలు సంస్కరణల ఊసే చేయకున్నది
పురుగులున్న మేడిపండులా
పైకి నిగనిగలాడుతున్నది
ఎక్కడా లేని గోప్పలతో కళకళలాడుతున్నది
symptomatic గా మారేదెప్పుడు
చికిత్స జరిగేదెప్పుడు
స్వస్త సమాజం గా transform
అయ్యేదెప్పుడు....?
_-రవికుమార్ కంచి_
💐🙏
86
🔅🔅🔘🔅🔅
[07/08, 4:05 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 07.8.2020
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
_*అదిగో PRC..... ఇదిగో 61....!?.*_
కవిత సంఖ్య:86
.............🐯..............
_ఎన్నికలొస్తే_..........
దస్త్రాలు కదుల్తయ్
అస్త్రాలు వదుల్తయ్
శస్త్రాలు పేల్తయ్
శాస్త్రాలు వల్లిస్తయ్......
▪️▪️▪️
_అవసరముంటే_.........
ఉద్యోగులు త్యాగధనులు
క్రమశిక్షణ వెలుగులు
ఉపాధ్యాయులు పోరాట వీరులు
దేశానికి వెన్నెముకలు........
▪️▪️▪️
_వ్యతిరేకత పెరిగితే_......
పిఆర్సి నివేదిక సిద్ధం
ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం
సర్వీస్ రూల్స్ కై ఢిల్లీకి
పదవీ విరమణ 61 ప్రకటనలు .........
▪️▪️▪️
_పనైపోతే_...........
మీకు అన్ని జీతాలా
ఆర్థిక పరిస్థితి బాగాలేదు
దేశంలోకెల్లా ఎక్కువ జీతాలు
కమిటీ వేస్తాం పరిశీలిస్తాం.......!?
▪️▪️▪️
కలెక్టరైనా కండక్టరైనా
రాజకీయాల ముందు
రాజ్యాధికారుల ముందు
ఉద్యోగి
చెల్లని వోటే
విలువలేని మూటే
మూగ
మాటే.....!?
_-రవికుమార్ కంచి_
🙏🌹
... ... ... 😟 ... ... ...
...............................
87
[08/08, 6:04 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 07.8.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'నింగి చేరినయ్'✨*
కవిత సంఖ్య:87.
✨✨✨
నింగి చేరినయ్...
జన గొంతుకలై
గర్జించిన
జన జాగృతులై
వెలుగొందిన
జన తంత్రులై
కంపించిన
జన నేతలు
కళాజాతలు
నింగి చేరినయ్
తళుక్కున మెరిసే
తారకలై ఆకసమున
వెలుగులీనుతున్నయ్
ఎంతో ఎదిగి
మరెంతో ఒదిగి
జన సమూహమే
స్వగృహమై
జన సమస్యలే తమ
బాధ్యతలై
జన ఘోషలే
తమ బాధలై
నిదురించని
జననేతలు
గళమాపని
కళాజాతలు
నింగి చేరినయ్...
కొందరికే కాదు
మేము
అందరికీ కాంతి నింపే
ఎర్ర జ్యోతులై ఆకసమున ప్రజ్వరిల్ల
లోకమంత
కాంతి జల్ల
వెలుగు చుక్కలై
నింగి చేరినయ్...✨✊
_- రవికుమార్ కంచి_
🌷🌻
°°🔥✨✨🔥°°
[08/08, 6:05 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'ఓటమి'*
కవిత సంఖ్య:88.
▪️▪️👎👍▪️▪️
ఓటమి....
విజయానికి మరో
దారి చూపుతుంది
మరో గెలుపు
తలుపు తీస్తుంది
ఓటమి...
విభిన్న
మార్గాన్వేషణ
చేస్తుంది
సృజనాత్మకత
పెంపొందిస్తుంది
ఓటమి...
కొత్త శైలిలో పాఠం
బోధిస్తుంది
విజయానికి నాంది
అవుతుంది
ఓటమి....
నిర్లక్ష్యపు నీడలో దాగిన ఆలోచనలకు
అగ్గి రగిలిస్తుంది
అజ్ఞానపు
అలసత్వంలో కూలిన
నిస్తేజానికి
చురకలంటిస్తుంది
ఓటమి...
ఏది సన్మార్గము
ఏది దుర్మార్గమో
నిగ్గు తేలుస్తుంది
కారణాలు సరిగ్గా
విశ్లేషిస్తే
భవిష్యత్
విజయమవుతుంది
నేటి ఓటమి
రేపటి
చారిత్రక
గెలుపైనిలుస్తుంది.
_- రవికుమార్ కంచి_
👍🌸☘️🌷
➖➖✌️🚩➖➖
[08/08, 6:10 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*"సారూ.... బడెప్పుడు తెరుస్తరు".....!?.*
కవిత సంఖ్య:89.
▪️▪️🏛️▪️▪️
ఆడిన ఆటలు విసుగు తెప్పించినయ్
ఆట వస్తువులు అరిగిపోయినయ్
అక్షరాలు కరిగి
పోయినయ్
చెట్ల నీడలు చిర్రెత్తుకొచ్చినయ్
టీవీల్లో కార్టూన్లు వెక్కిరించినయ్
చేన్లల్ల కోతులు ఎగబడి తరిమినయ్
బడి పిల్లలు బజారు పాలైండ్రు
చదువులు రాతలు మట్టిపాల్జేశిండ్రు
పుస్తకాలు కాపీలు చెదలు పట్టించిండ్రు
సంచులు బడిబట్టలు
మసిగుడ్డలు జేసిండ్రు
సారూ....!
బడెప్పుడు
తెరుస్తరు...
ఎండకాలం ఎప్పుడోబాయె
పొలంబడి
షురువాయె
సదువుల బడి సాగదాయె
పోరగాండ్లు....
శెప్తింటలేరు
ఓకాడుంటలేరు
యాష్టకొచ్చిపాడాయే
సారూ....!!
బడెప్పుడు
తెరుస్తరు......!?
పిలగాండ్లు
ఆగమైతుండ్రు.....
_-రవికుమార్ కంచి_
🙏💐.
🔆🔆🏛️🔆🔆.
[08/08, 6:15 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'పొర'*
కవిత సంఖ్య:90
~~~~~⚪~~~~~
'''''''''''''''''''''''''''''
ఆవరించిన పొరలు
అంతరంగాలు
దాచిన ముసుగులు
పాలపిట్టలా విహరించే మనసును
తెల్ల పావురంలా
మురిపించే లేత
మనసును
రాజకీయ వైషమ్యం
వయోభేదం
కుల మత వర్గ
విభేదం
పేద ధనిక అంతరాల పంకిలం
తరాల తెరలు
తీసినకొద్దీ తరగని
ఉల్లి పొరలై
సాటి మానవ
మనోసౌందర్యాన్ని
ఎదుటి వాని భావ సరస్సుని
చూడలేని
రుచి చూడలేని
సంకుచిత అజ్ఞాన
పరిమితులు
సరికాని హద్దులు
చెరిగిపోయేదెప్పుడో....
!?
_-రవికుమార్ కంచి_
🙏💐.
☘️
91
[08/08, 10:28 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*🏡పల్లె - పట్నం🏢*
కవిత సంఖ్య:91.
. .''''''''''''''''. .
➖🔘➖➖🔘➖
వలసబాధితుడా
కాళ్ళే చక్రాలైన
కార్మికుడా........!
నీ వలసలు
నీ పరుగులు
నీ బరువులు
ఆగే పరిస్థితి లేదు
ఆపే ప్రభుత్వాలు లేవు
నీ చక్రాలరిగినా
నీ కండలు కరిగినా
నీ బొక్కలు విరిగినా
ఆదుకునే హస్తాల్లేవు
అక్కున చేర్చుకునే
గుండెల్లేవు
ఆ పట్నం పొమ్మంటది
నీ పల్లె రమ్మంటది
నీ ఆకలి పోగొడ్తది
నీ జీవం నిలబెడ్తది
పట్నానికి పల్లెలకు వంతెనలై వేలాడ్తివి
ఇనుప చక్రాలై పొర్లాడ్తివి
కూటి కొరకు గూటి కొరకు
మేటి పాట్లెన్నో పడ్తుంటివి
ఏ ప్రళయం ముంచేసిన
ఏ సమరం ఎదురొచ్చిన
నీ రెక్కలె దిక్కైనవి
నీ పిక్కలె మొక్కైనవి
ఎపుడాగును
నీ నడకలు
ఏడాగును
నీ వలసలు
ఊపిరున్నవరకేగా....!?
_-రవికుమార్ కంచి_
🙏💐.
🐾🐾.....💔.
92
[08/08, 10:32 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'వ్యూహం...?'*
కవిత సంఖ్య:92
🏹🙈😢⚔️
హద్దులలో కవాతులు
సరిహద్దులలో విన్యాసాలు
యుద్ధ సన్నద్ధ వ్యూహాలు
సాయుధ బలగాల ప్రదర్శనలు
లయబద్ధ
ప్రకంపనలు
సైనిక జల
వాయు దళాల సన్నాహాలు
కత్తులు కసరత్తులు
బలం బలగం
అద్భుతం
ఈ కత్తులన్నీ
ఈ కసరత్తులన్నీ
ప్రకృతి సంపదల నాశనానికేగా
మానవ
జీవ వనరుల వినాశనానికేగా....!?
కాలం మారింది...
కానీ
అవే కుట్రలు కుతంత్రాలు
కుటిల నీతులు
అవే ఆక్రమణలు
దుస్సాహసాలు
మారని దేశాల
అనైతిక అమానవీయ యుద్ధ నీతులు
హింసా యుద్ధోన్మాద
వ్యూహాలు
భూ మనుగడ
ప్రశ్నార్ధకాలు....!?
_-రవికుమార్ కంచి
93
[08/08, 2:49 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.08.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*'Outsider'...!.*_
కవిత సంఖ్య:93.
🌿🧠🌺
సోదరులారా.... మహానుభావులారా....
మీ వృత్తి నిబద్ధతకు
అంకిత
దీక్షలకు
అకుంఠిత సేవలకు
జోహార్లు....
మీ నిష్పక్ష యధాలాప
ప్రవర్తనకు వ్యాఖ్యలకు
ధన్యవాదాలు.....
జాతి నిర్మాతలైనా మేధావి వర్గమైనా
అట్టడుగు ఉద్యోగ వర్గమైనా.....
లోపరహిత సంపూర్ణ
సమాజమున్నదా.....
జీవితం చదివిన
శాంత అశాంత
ఋషిపుంగవులారా
......
వ్యాఖ్యలకు
వ్యాఖ్యానాలకు ముందు
మనమీ సమాజంలో భాగమా కాదా....
ఉత్తమోత్తమ సేవలకు స్వయంతృప్తి
ఉందా లేదా.....
సంస్కరణలకు ఉద్ధరణకు కృషి
చేశామా లేదా......
ఆత్మ పరిశీలన పునరాలోచన చేద్దాం...
సంస్కరణల అంకురాలు
మొలకెత్తించుదాం....
అంతేగాని
మేమే ఉన్నత శిఖరం
మేమే మహా పండిత పురాణం
మేమ్మాత్రమే విజ్ఞాన
ఆజ్ఞాపనా అతిరధులమని
భ్రమించి
అందరిపై వేలెత్తడం
గురివింద నీతులు వల్లించడం
పరిణితి లేని
Outsider గా
సమాజ అతీతులుగా
భావించడం
భావ్యమా.....!!??.
_-రవికుమార్ కంచి_
🙏💐.
🌿🙈🙉🙊🌻.
94
[08/08, 2:53 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.08.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'సిరా లేని కలాలు'....!✍️*
కవిత సంఖ్య:94.
.........................✍️
ఎన్ని తడి ఆరిన గొంతుల
ఒక్క నీటి బిందువు రాల్చింది....
నీ కలం.....?
ఎన్ని అనాథ జీవుల గుండెల
అనంత ధైర్యం నింపింది....
నీ కలం....?
తిండి లేక బట్ట లేక పొద్దే చిరునామై
నడిచే అరి పాదాలకు
ఏ దిక్కు చూపింది
నీకలం....?
గొప్ప భావాల గ్రంథాలు నిర్మిస్తున్నా
కుళ్ళు కులమత విద్వేషాలు
రూపుమాపిందా... నీ కలం....?
వీధికొకడు పేటకొకడు
పూటకొకడు
వివస్త్రల జేసి
'ఆడు'తుంటే.....
ఏం చేసింది.....
నీ కలం....?
ఆస్పత్రల ఆఫీసుల
ఆమ్యామ్యాలకై
ముసలి జనుల సైతం
పీడించుక
చంపుతుంటే.....
ఎక్కడుంది.....
నీ కలం.....?
ఏది గొప్ప కలం....?
ఏది గొప్ప రచన...?
సమాజమెటైనా పోనీ...
సమయమెంతైనా కానీ..
నీ కలల ప్రపంచంలో...
వర్ణన అభివర్ణనలో
ఆరితేరి
సన్మానాలు
బిరుదులు పొందితే
చాలా....?
లక్ష్యం మరిచిన
లక్షణం కోల్పోయిన
సిరా లేని ఎండిన కలాలతో
కనబడని రాతలతో
స్పృశించని
గుండె కోతలతో
ఎవరికేం
లాభం...?
కలం...
సమాజానికి
దూరంగా ఉనికి
కోల్పోయింది...
అడవిని చైతన్య
పరచడానికి....!?
గొప్ప కలం ఆచూకి
లేకుండా పోయింది...!
_-రవికుమార్ కంచి_.
🙏💐
➖➖⁉️➖➖.
95
[08/08, 7:24 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'విషమ పరిస్థితి'....!*
కవిత సంఖ్య:95.
🔅🔅😢🔅🔅
కరోనా దయనీయ సంప్రదాయాల
మూలమైంది
కర్కశ సూత్రాల
ఆవిష్కర్తైంది
ఎవ్వరాపని
ఎన్నడాగని
మానవ సృష్టి కార్యాలను
మాతృహృదయం వికసించే
సంతానోత్పత్తిని
సైతం
నిలిపివేస్తున్నది
నిత్యోత్సాహంతో నిరంతరానందంతో
సాగే
విద్యా సంవత్సరాన్ని
శూన్యంగా మార్చనుందేమో...!
రక్తాన్ని పిండుతూ
స్వేదాన్ని రాల్చుతూ
పుడమి పులకించే
ధాన్యపు సిరులు
పండించే
హలధారుడు
కరోనా ధాటికి
పంట విరామం
పాటించే
పరిస్థితి
ఏర్పడనుందేమో.!
కరోనా విషకణాలు
నిండిన గాలి
ప్రాణవాయువు
నిండా పీల్చలేని
విషమస్థితి ఏర్పడనుందేమో....!
అవాంఛిత
విషమ పరిస్థితి
ఎంతకాలమో....!!
మానవ మేధ
పరిష్కరించే వరకే....!
_-రవికుమార్ కంచి_
96
[08/08, 7:27 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.08.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*'తుగ్లకీకరణ'...👺.*_
కవిత సంఖ్య:96.
🔅🔅♨️🔅🔅
అరేక్ మాల్ ఉపకరణాలు
తూతూమంత్ర ఉపాయాలు
ముసురుతున్న
ఈగలకు
వేపకాయేసినట్లు
జనాలకు పథకాల
ఎరలేసి
ఏడ పన్నా
ఏం చేసినా
మాకేందని
అభివృద్ధి ఆధునీకరణ పేరుతో
జరిగే తుగ్లకీకరణ
జనాల మెదళ్లను తొలుస్తూనే ఉంది
కరోనా
పరుగోవైపు
పాలకులురుకులో
వైపు
జనం ఎరలమత్తు
వదిలి
నిద్ర లేచిన సింహమై
గర్జించి పంజా విసిరే సమయం
ముందుంది....!!
_-రవికుమార్ కంచి_
97
[08/08, 7:55 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.08.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*పరాధీనత...*
కవిత సంఖ్య:97.
.....👨🦯.....
క్రోమోజోమ్ నిర్మాణం గూని
పోయింది
పచ్చిదో పుచ్చుదో
కర్ర లేకుంటే నిలబడ్తలేదు
అచంచల విశ్వాసం ఊహకందని మేధస్సు
నవనవలాడే నవీనత
ఆంగ్లేయుడి ముందు ఉదాసీనతా
మానై కూసుంది
అనువంశిక నిస్తేజం
ఆనాటి నుండి నేటి వరకు
విశ్వ వ్యాప్తి జరిగింది
ఎవడేం చేసినా
ఎవడేం కూసినా
మొద్దోలె మిన్న కున్నది
పరాధీనత మెదళ్ల పట్టిన జాఢ్యమైనది
మరో ఫూలే అంబేడ్కర్ జన్మిస్తే గానీ
మరో నేతాజీ వివేకానందుడు
వస్తే తప్ప
కదలనని వంగి
చేతులు కట్టుకుంది.
_-రవికుమార్ కంచి_
98
[09/08, 6:20 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 09.08.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
9494345594,
హైదరాబాద్,
శీర్షిక:
*'కూలుతున్న విగ్రహాలు'...!*
కవిత సంఖ్య:9️⃣8️⃣.
♾️🌻♾️
విశ్వ వీధిన వెలుగులై విరాజిల్లిన
మేధో వృక్షాలై నీడనిచ్చిన
వందల సూర్యోదయాలై
ఉత్తేజితమైన
మహాత్ముల రూపాలు
స్ఫూర్తి రగిలించిన
ప్రతిరూపాలు
రోడ్డుకు మరకలై
తట్టు రాల్లై తాకుతున్నయ్
అగ్రరాజ్య జాత్యహంకార
నిరసన ప్రవాహమున ముక్కలై
మునిగిపోతున్నయ్
మేమెందుకు తక్కువన్న
మా రంగుపై తెల్లబూటు
మరకలేందన్న
మా గుండెలపై
శ్వేత
గునపాలెందుకన్న
ఆగ్రహాల ఉప్పెనలో
మూగ శిలలై
సరిచేయని తప్పులపై
చరిత్రై నిలబడిన
జాతివివక్ష
మచ్చలలో
మురికిపట్టిన
చరిత్రై
కూలుతున్న
విగ్రహాలు
మానవత చిగురించనిదే
సమానత సాధించనిదే
నిలబడలేవు....!!
_-రవికుమార్ కంచి_
🙏💐.
♾️👤♾️.
99
[09/08, 6:20 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 09.08.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
9494345594,
హైదరాబాద్,
శీర్షిక:
*'సుక్కలు'.*
కవిత సంఖ్య:
9️⃣9️⃣.
✨🍻✨
సంపాదించే స్తోమత లేదు
కాసులు వచ్చే పరిస్థితి లేదు
కూసుంటె కూడు తినే అవకాశం లేదు
పరుగెత్తితే పైకమిచ్చే పనిలేదు
కుటుంబం పోషించలేక ఒకడు
అలసిన శరీర బాధల మరిచేందుకు ఒకడు
మత్తుకు బానిసై మరొకడు
కూడు ఉన్నా లేకున్నా
ప్రసాదం తిన్నా పస్తులున్నా
గుడిసె ఉన్నా లేకున్నా
దిక్కన్నా లేకున్నా
పక్కున్నా లేకున్నా
సుక్క దిగాల్సిందేనా
సుక్కలు
కనపడాల్సిందేనా
మద్యం మత్తులో భవిష్యత్తు చిత్తు
కావాల్సిందేనా
ధూమపానం హానికరం
మద్యపానం
హానికరమని
మొత్తుకున్నా మత్తు దిగని వైనం
దిగజారి సానిటైజర్
కూడా వదలని దైన్యం
ప్రాణం పోయే భయం కన్నా
మత్తులో గమ్మత్తులే
ప్రాణమా
_రవికుమార్ కంచి_
🌸🌻
100
~~~~~~😕~~~~~~
[09/08, 6:21 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 09.08.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
9494345594,
హైదరాబాద్,
శీర్షిక:
*'అడవే ఇది'..!?*
కవిత సంఖ్య:
1️⃣0️⃣0️⃣.
🦁🐅🌱🐺🐲
అడవే ఇది....
కౄర మృగాలే తప్ప
మానవతేది
మనిషి జాడేది
అడవే ఇది...
ఆవులు కన్పిస్తే
పంజా
విసురుతున్నయ్
పులులు ఈగలై
ముసురుతున్నయ్
అడవే ఇది...
లేడి పిల్లలు
చెంగున ఎగిరి
గంతేసినా
వెంటాడి గొంతుబట్టి
రక్తం తాగేస్తున్నయ్
అడవే ఇది...
అంగబలం
మందబలముంటే తప్ప
ఎదురుపోటు
తిరుగుబాటు చేస్తే
తప్ప
జీవించలేని దైన్యం
అడవే ఇది...
బలముండి దోచుకున్నవాడు
దొరవుతున్నాడు
బలహీనుడు
నిజాయితీగ
ఉంటూ
బక్కచిక్కి
బలవుతున్నాడు
అడవే ఇది...
ఏండ్ల కొలది
భారత దేశం నా
మాతృభూమి
భారతీయులందరు
నా సహోదరులని
ముక్తసరి పాటలే
తప్ప
ఆ సోదరభావమెక్కడ
ఆ అభిమానాలెక్కడ
మానవతెక్కడ.
_*- రవికుమార్ కంచి*_
🌻🌸
➖➖🙂➖➖
65
[04/08, 7:43 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 04.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*ఆసియా ఖండమా...!*
కవిత సంఖ్య:65.
------🌏-------
ఆసియా ఖండమా...
ఆకలి ఖండమా....
అందని మెతుకుల భాండాగారమా....!!?
పేదల ఆశల చిగురులు చిగురించని, ఆశయాల కొమ్మలు విస్తరించని
సౌందర్య సుగంధాల నవ్వులు పువ్వులు పూయని
గోసల మొండి కాండమా...!
జనసంద్రం ఉప్పొంగే అనంతసాగర శక్తులున్నాయి
అమృత ధారలు పొందే క్షీరసాగర మేధోమధనా
లున్నాయి
సకల ప్రకృతి
సంపదల వనాలున్నాయి
అనంత కోటి లక్ష్యాల అంతరిక్షాలనందుకునే అసంఖ్యాక మానవ వనరులున్నాయి
కానీ.....
కరోనా కాటుల కన్నా ఘోరమైన
విషపు దాడుల కన్నా దారుణమైన
పస్తుల పతనాలు
పేదరిక ప్రాకారాలు
నిరుద్యోగ నిట్టూర్పులు
కోట్ల సంఖ్యలో పెచ్చరిల్లిపోతున్నాయి
ఆత్మబలిదానాలు త్యాగాలతో
ఆకలి తీర్చుకుంటున్నాయి...!
ఎంత పరిజ్ఞానం ఉన్నా
భయంకర రోగాలు వ్యాపించినా
బక్కచిక్కిన పేదవాళ్ల డొక్కల పై నాట్యమాడుతున్న ఆకలి ఆర్తనాదమే అగ్రస్థానమైతున్నది....!!
వంద కోట్ల ఆకలి
నోళ్ళ రోదనలే ప్రముఖ స్థానమైతున్నది....!!
కోటలు గొప్పలు యుద్ధోన్మాదాలు కాదు
యేండ్ల నుండి వింటున్న
కూడు గూడు గుడ్డ కావాలి
మానవత చూపాలి.
_రవికుమార్ కంచి_
🙏💐
🔅🔅🌏🔅🔅.
66
[04/08, 7:46 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 04.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"బడి త(ల)లుపులు"...!*_
కవిత సంఖ్య:66.
###🏛️###
ఎన్నడు రాని ఆపదలొచ్చె
మూడు నెలల సెలవులొచ్చె...
అక్షరాలు దారితప్పి పుస్తకాలు బూజు పట్టి నిరంతర ఆటపాటలు బోరు కొట్టి
నేర్చుకున్న దాచుకున్న విద్యలు ఎండకు ఆరిపోయి
గాలికి కొట్టుకుపోయినయ్...!
ఆన్లైన్ ఆఫ్లైన్ బోధన లేక
ఏ లైను లేక
దిక్కు తోచక బడి బుడతలు ఉడుతలై తిరుగుతున్నరు
బడి పిల్లలు బడి వైపే ఆశగా చూస్తున్నరు...!
ఇకనైనా తలుపులు తెరుచుకుంటే దూరమైన దోస్తులు కలుస్తరు
ఆటలు ఆడడం పాటలు పాడటం చక్కని బొమ్మల కథలు చదువుతమని ఎదురుచూస్తున్నరు తలపులలో తడిసి పోతున్నరు
రైతులు మబ్బుల
వానల కొరకు చూస్తూ
మట్టి వాసనల పసిగడుతూ
వర్షాలు ఆహ్వానిస్తున్నట్లు
బడి పిల్లలు విద్యా దేవాలయ విజ్ఞాన వేదికల ద్వారాలు తెర్చుకోవాలని దిగులు పెట్టుకున్నరు
కళ్ళార్పక చూస్తున్నరు
స్కావెంజర్ను వంటామెను అడుగుతున్నరు
సార్లొస్తరా సదువు చెప్తరా...!
రాతలు రాపిస్తరా...!!
మంచి బుద్ధులు నేర్పిస్తరా....! అని ఆతృతగా ఆరా తీస్తున్నరు
ఆరాట పడుతున్నరు....!
_రవి కుమార్ కంచి_
🙏💐.
☘️☘️🏛️☘️☘️.
67
[04/08, 7:50 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 04.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*"అపాయానికి ఉపాయం"...🌀✳️*_.
కవిత సంఖ్య:67
🔅🔅🔅🔅🔅🔅
ఊరికే కూసోని ఉదాసీనంగా అడ్డమొరిగి
భయం గుప్పిట్లో నలగడం
భవిష్యత్ జీవితం పై బాధపడడం
కరోనా కష్ట నష్టాలకు జంకి కుమిలి కుంగడం
సునాయాసంగా, ఖర్చు లేకుండా టెన్షన్ పడడం
ఎవరైనా చేస్తరు,
ఎవరికైనా వస్తది, జరుగుతది....!!?
ఈ ఉచిత భయాలు అల్కటి ఆపసోపాలు ఉపాయంతో కరోనా అపాయాన్ని
కఠిన ప్రమాదాన్ని ఎదిరించుదాం నివారించుదాం
జయించుదాం....!
సెల్ఫ్ లాక్ డౌన్ శుభ్రత మాస్క్ ధరించడం కళ్ళద్దాలు గ్లౌజులు వాడకంతో పాటు
ఖచ్చితంగా నిర్మొహమాటంగా కుటుంబ సభ్యులైన బంధువులైన
బజారైనా దుకాణమైనా కార్యాలయమైనా భౌతిక దూరం పాటించు
వీటన్నింటి కన్నా
నీ నిర్లక్ష్యం వదులు చైతన్యంగా కదులు
అనుమానం అవకాశమున్నా లేకున్నా
మంచి ఆలోచనలు పెంపొందించు
మంచి ఆహారం స్వీకరించు
వేడి నీటి ఆవిరిల తరించు
వేడినీటినే సేవించు
గొంతు సవరించు
గరళకంఠునోలె
కంఠంలో విష కణాల సంహరించు
చీటికి మాటికి బయట చిందులు వద్దు తప్పదంటే జాగ్రత్తలు పాటించు
ఓపికతో ఉపాయంతో అపాయాన్ని దూరం పెట్టు
జీవన సమరాన్ని ఛాలెంజ్గా చేపట్టు ఆనంద శిఖరం చేరేటట్టు
కొత్తలోకం చేరేట్టు...!
_రవికుమార్ కంచి_
68
05.08.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
_*'అవకాశం రాక పోదు'....!?*_👍🌤️.
కవిత సంఖ్య:68.
🌻🌻🇮🇳🌺🌺
మనకంటూ....
సంక్లిష్ట సమస్యలు
సరళతరం చేసే ఒక
ఆలోచన ఉంటే...
ఏదో ఒక రోజు
అవకాశం రాకపోదు అందలం
ఎక్కకపోము..
మనకంటూ....
ప్రపంచ గతిని
నిర్దేశించే ఒక గొప్ప
పరిష్కారం ఉంటే....
అవకాశం రాకపోదు చరిత్ర సృష్టించక
పోము...
మనకంటూ....
మానవ ఉన్నతీకరణ జరిగే ఒక పరిశోధన
ఉంటే....
అవకాశం రాకపోదు
వరుస నోబెల్
పురస్కారాలు
పొందకపోము...
మనకంటూ....
క్రీడాభివృద్ధి
క్రీడాస్ఫూర్తి చూపే
ఒక గుణముంటే....
ఏదో ఒక రోజు
అవకాశం రాకపోదు
ఒలంపిక్ పథకాల
జాబితాలో మొదటి
స్థానం
పొందకపోము...
మనకంటూ....
జెండా ఎజెండా
ఉంటే...
విశ్వ వీధిలో భారత
నాయకత్వం నడిచే
ఒక అవకాశం
రాకపోదు
గర్వంగా తలెత్తుకోక పోము....
మనకంటూ...
పోరాట పటిమ
ఉంటే....
ఒక అవకాశం
రాకపోదు..
విజయ గర్వంతో
మన జెండా
ఎగరకపోదు...🚩👍✌️✊👊
_*- రవికుమార్ కంచి*_
🙏🌷
~~^^~~🌸~~^^~~~
69
[05/08, 6:16 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 05.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
*"బడి పిట్టలు"* 🐧🐤.
కవిత సంఖ్య:69
******😃******
పిల్లల్లారా పిట్టల్లారా....!
చెట్లు చేనులు
పుట్టలు తెట్టెలు హద్దులు చెరిపి
సుద్దులు వినక
వద్దులు భరించక
తుమ్మి ష్కలై
తిరుగుతున్న
పిల్లల్లారా పిట్టల్లారా....!
గూళ్ళ్ళకు చేరి సంచులు తెరిచి బడిలో చదివిన
సార్లు చెప్పిన
రాతలు పూతలు పుస్తకాల దుమ్ము దులపండి మూతబడినవి తెరవండి
కరోనా కాలం ముగిసే లోపల
చదువని చదువులు
రాయని రాతలు
ఏమైనుంటే
మరిచిన ప్రశ్నలు వదిలిన
అభ్యాసాలు
శ్రద్ధగా మీరు చేయండి
కరోనా సెలవులు దండిగా ఉండె బుద్ధిగా మీరు రాయండి
బడి తెరిచే లోపల సంసిద్ధత సాధించండి.
_-రవికుమార్ కంచి_
💐🙏.
70
****🐣🐥🦆****.
[05/08, 6:16 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 05.8.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*'సరిహద్దురేఖ'*._
కవిత సంఖ్య:70.
🌸🕊️🌞🕊️🌸
ప్రశాంత వాతావరణంలో నిద్రించి
ఎత్తైన శిఖరాలు లోతైన లోయల తాకుతూ మైమరపించే చల్లగాలులు పరిమళాలు పీల్చి,
జలపాతాలు హిమపాతాలు
మంచు కొండల వెండి మెరుపులు చూసి
ఎనిమిది దశాబ్ధాలు గడిచింది
హద్దుగా ఉండడమే నేను చేసిన పాపం
సరిహద్దుగా నిలవడమే నన్ను వరించిన శాపం...!
సోదరత్వం మరిచి శత్రుత్వమె జెండాగా ఆక్రమణలు రహస్య దాడులు ఆధిపత్యాలే ఎజెండాగా
సాగిస్తున్న ముష్కర, సైనిక హింసాక్రీడలు
రక్త పాతాలకు
శిలనై శిథిలమై నిలిచిన మూగ సాక్ష్యం నేను....!
పేరుకే నేను సరిహద్దురేఖను
నియమాలు ఒప్పందాలు
ఈ రాళ్ల,మంచు గడ్డలు,
లోయలకే పరిమితం...!
నా ముందు ఎన్నో ఉల్లంఘనలు కవ్వింపులు దాడుల వర్షాలు కోకొల్లలు...!
మాటొకటి చేతొకటి
లక్షల బలగాలు
కోట్ల బడ్జెట్లు ఏటేటా రెట్టింపులు
వందల సంఖ్యలో బలిదానాలు ఆస్తి నష్టాలు విపరీతాలు...!
దేశాభివృద్ధి,
ప్రజల జీవనోపాధి సదుపాయాలు కల్పించక ఇరుగుపొరుగు దేశాలు
ప్రగతిబాటలు మరిచినయ్
పోరులై పొర్లుతున్నయ్...!
నాపై శాంతి కపోతాలు స్వేచ్ఛగా ఎగరాలి
సోదర భావనలు జాతి పతాకాలై కదలాలి...
యుద్ధోన్మాదాలు నశించి
బౌద్ధ ప్రభోదాలు మారుమోగాలి.....
_-రవికుమార్ కంచి_
💐🙏.
🌿🕊️🌞🕊️🌿.
71
[05/08, 6:55 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 05.8.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
(44)
హైదరాబాద్,
శీర్షిక:
*☀️ 'యోగా'.*
కవిత సంఖ్య:71.
🔅🔅🧎♀️🧎♂️🔅🔅
అసమతుల జీవన విధానాల
అశాంతుల మానసిక సమరాల
తేజోకాంతుల వికాస మార్గం
సహజ పొద్దుపొడుపుల ఆరోగ్య సాధనం యోగ
సకల దేశాలకందించిన ప్రకృతి చికిత్సల భారతీయ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల అద్భుత భంగిమ,
ప్రశాంత చిత్తాల పరిణితి పరిమళాల సున్నిత సునిశిత లక్ష్య ఛేధనం
శారీరక మానసిక ఒత్తిడుల నివారణా మంత్రం యోగా
నిత్యం యోగ సాధనమే
మేలైన నిజమైన జీవన సత్యం.
_-రవికుమార్ కంచి_
🙏🌹
🌀🧎♀️🧎♂️🌀.
[05/08, 7:01 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 05.8.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
హైదరాబాద్,
శీర్షిక:
🌞 _*"నాన్న".*_
కవిత సంఖ్య:72.
➖➖🚀🎯➖➖
నన్ను ఎత్తుకోవడం నేర్చుకున్న చేతులు
ఎక్కడా దించలేదు
దారి చూపి నడిపించిన చేతులు
ఎప్పుడూ వదలలేదు ఎన్నడు గురి తప్పలేదు
నాన్న సైకిల్ పై
చిన్న ముందు సీటు నాది
ముద్దుగా ముందుండాలి పరిశీలించి ముందడుగు వేయాలన్నది.....!
తొక్కేది నాన్నే అయినా ముందుగా దూసుకెళ్తున్నది నేనే...!
నాన్న ఇంజన్ తో రివ్వున పోతున్న రాకెట్ నేను
ఏ లక్ష్యమైనా 'ఢీ' కొట్టగలను
ఏ అంతరిక్ష గ్రహమైన చేరగలను.....!
నాన్న 'కీ' ఇచ్చి వదిలిన బొమ్మను నేను
ఆ వేగం తగ్గే లోపు
నా సొంత రెక్కల విప్పుతాను
నాన్నకు
మరోరెక్కనవుతాను....
_-రవికుమార్ కంచి_
🙏🌹
🌼🌼🚲 🌼🌼.
[05/08, 7:06 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 05.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
(44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*"బిరుదులు".*_
కవిత సంఖ్య:73.
🌀🌀🤴🌀🌀
మీ అద్భుత ప్రతిభా పాటవాల కథలు కవితలు పాటలు చిత్రాలు
అచేతన అజ్ఞాన మెదళ్ల
మెరుపు వేగం సృష్టించాలి
మరపురాని ఉత్తేజాన్ని నింపే
అద్భుత కళాఖండాలు కావాలి
మహా ప్రపంచ నిర్మాణం చేయాలి
మెరుగైన సమాజం సృష్టించాలి
ఆ సమాజం నువ్వు గెలవాలి
నిన్నది గెలిచి గొప్పగా చూడాలి
నీ మేధను సహజ సృజనను కీర్తించాలి
అంతేగాని.....
అరువు తెచ్చిన అడుక్కొచ్చిన
కొనుక్కొచ్చిన బిరుదులు సత్కారాలు సన్మానాలెందుకు...!?
మీ ప్రతిభపై మీకు అనుమానాలెందుకు
అసంబద్ధ గొప్పలకై పాకులాటలెందుకు....!?
కాలం సమాజం విలువైన మాణిక్యాలకు
మసి పూయదు
మానవతా
సామాజిక
కళా చైతన్య మూర్తులను
అణగదొక్కదు
అందరి గుండెల్లో గొప్ప స్థానమిస్తుంది
చరిత్ర గ్రంథాల్లో
మీ కళాసేవకు ఉత్తమ విలువనిస్తుంది
ఒక శ్రీ శ్రీ
ఒక సినారే
ఒక రవీంద్రుని సరసన చేరుస్తుంది
జేజేలు పలుకుతుంది.
_రవికుమార్ కం
74
[06/08, 6:17 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 06.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'పాక్ తోక వంకర'....!?*
కవిత సంఖ్య:74.
➖➖🦮🐉➖➖
కలుపు మొక్కను
పోషిస్తున్న చప్పిడి
ముఖానికి బుద్ధి రాదు
దానండతో ఏపుగ
పెరుగుతోంది
దానూతంతో
పేట్రేగిపోతోంది
ఆవల ఈవల
ప్రశాంత ప్రకృతిపై
పడిన చీడ మొక్క
ఎన్నాళ్లకు
విరగడవుతుందో
పర్వత ఒంపుసొంపులు
కనబడవు
మంచు కొండల వెండి మెరుపులు
కనబడవు
ప్రశాంత సరస్సు ఒడ్డులు దర్శించవు
చల్లని మంచు ఇసుకలు క్రీడించవు
నిత్యం కవ్వింపులే అనునిత్యం బాంబుల
మోతలే
ఒకవైపు చొరబాట్లు
మరోవైపు
మాదకద్రవ్యాలు
మతం ముసుగులో
తీవ్రవాదాలు
చెంప దెబ్బలు
వాయించినా
వీపు విమానం
మోత మోగించినా
మారని నైజం
పాక్ తోక వంకర..!
ఇంకేం
మారుతుంది..!?
ఎప్పటికైనా
బూడిదవుతుంది!.
_-రవికుమార్ కంచి_
🌸🌻🏵️
➖➖🐲🦮➖➖
[06/08, 6:25 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 06.8.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
🌀 _*'కదలిక'.*_
కవిత సంఖ్య:75.
🏃🏽♂️🚶♀️" ..".."..".."
ఒక్కో అడుగు వేస్తుంటేనే
ఒక్కో మెట్టు ఎక్కుతుంటేనే....
దూరం ఎంతో తెలుస్తది
ఎత్తు ఎంతో ఎరుకయితది
నువ్వు యాడున్నది
నీ స్థితి ఏమిటి
గతి ఏమిటి
లక్ష్యం ఏమిటో కనబడుతది.....
గెలుపైనా ఓటమైనా
నీ కదలిక తప్పనిసరే
నీ పరుగు అత్యవసరమే....!
చైతన్య పరిశోధన
ఆసక్తుల ఆవేదన
సృజనాత్మక ఆలోచన అనునిత్యం అవసరమే ప్రతినిత్యం ఇది సత్యమే.
_రవికుమార్ కంచి_
💐🙏
🏃🏽♂️➖➖➖➖
[06/08, 6:25 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 06.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*'బడి'...*._
కవిత సంఖ్య:76.
➖➖🔆➖➖
బడుంటే
బడంటే ......ఇది!
అంటుంటే మురిసేదాన్ని
పచ్చని చెట్ల మధ్య పక్షుల కిలకిల పలుకులతో
పిల్లల చదువులు ఆటలతో
పులకరించే దాన్ని
ఇప్పుడు బడంటే
ఇదా....!
అంటుంటే బాధేస్తుంది!
పచ్చని చెట్ల ఎండుటాకులు రాలి గాలికి కదిలే సవ్వడే మిగిలింది
పలకరింపులు పులకరింపులు మూతబడి
నాకు ఒంటరితనమే
మూగాధ్యయన
మయ్యింది.
నా ఒడిలోకి పుస్తకాలు పిల్లలు చేరాలి
కూతబడి
చదువుల మోతబడి
కావాలి
_-రవికుమార్ కంచి_.
🙏💐
➖➖🌿➖➖.
77
06.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*'సమసమాజం'.*_
కవిత సంఖ్య:77.
➖➖🌵➖➖
మనువాదం
మత వాదం
కులవాదం.....
సమాజ మహావృక్షపు తల్లి వేరై పాకింది
తరతరాల తల్లడిల్ల జేస్తుంది
నవ మానవులెవరైనా
విశ్వ చైతన్య
వీరులెవరైనా
సంస్కర్తలెవరైనా
ఆకులన్ని రాల్చినా కొమ్మలన్ని నరికినా కాండం ఖండ ఖండాలు చేసినా
చెడు వాదం పిడివాదం వితండవాదం మూలాలై కూసుంది
విష మూటలై దాగుంది
విష బీజం వ్యాప్తి చేస్తూ
మూఢత్వపు చిగుర్లేస్తుంది
పక్షపాత అమానవీయ
కవితలు పాటలు పాఠాలు
గ్రంథాలు పురాణాలై మర్మంగా విష సంస్కృతి పెంచింది
అంతరాల దొంతరల
ఆధిపత్య నిచ్చెనలు జనుల విచ్ఛిన్నం చేసింది
అన్యాయపు రీతులతో అణగదొక్కి పెట్టింది
సేవకులై బానిసలై
అణిగి అణిగి బతకమంటు
పీడితులై తాడితులై
నలిగి నలిగి
నడవమంటు
కపట నీతులు చెప్పింది
కటిక దరిద్రం చేసింది
పిడితుడా బాధితుడా...
ఆ వేరుల ఆ కొర్రుల
రంపాలై కోసిపడెయ్
కాగడాలై కాల్చిపడెయ్
నవ మానవ
విలువలతో
నిత్య చైతన్య వెలుగులతో
కుటిల ఆచారాల కూకటి వేర్లను పెకిలించి పీకి పడెయ్
సమానత్వ బీజాలను వడివడిగా నాటేసెయ్
నూతనత్వ ఫలాలను కుప్పలుగా పోగేసెయ్ సమ సమాజ నిర్మాణం గట్టిగ నువ్వు చేసేసెయ్
_రవికుమార్ కంచి_.
💐🙏
🔆🔆✊🔆🔆.
78
6.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*🌴'హరితహారం'.*
కవిత సంఖ్య:78.
🌱🙂🌳🙂☘️
తెలంగాణ వీరులారా
తెలంగాణ పౌరులారా
కొట్లాడి సాధించిన తెలంగాణ
నీళ్ల చుక్క పారని ఎడారి మరణవీణ
ఒక్కొక్కరు ఒక మొక్క చక్కగా నాటాలి
చిక్కని అడవోలే చక్కని పచ్చని తెలంగాణ చేయాలి
తెలంగాణ తల్లికి ఆకుపచ్చ కొంగు వేయాలి
కొండలైన గుట్టలైన గట్టులైన
మొక్కలన్నీ నాటాలి
పచ్చదనం పెంచాలి
చెట్లంటే భూమికి పెట్టిన పచ్చ గొడుగు
చెట్లుంటే గాలి కాలుష్యాన్ని కడుగు
చెట్లు పెంచితే వర్ష ధారలు నిండవా నీటి మడుగు
పరిసరాలు జీవులు చెట్లతోనే ఆరోగ్యం అందం ఆనందం పొందు
చెట్లలోనే జీవనం సౌభాగ్యం సుసంపన్నం చెందు
చెట్లు లేని జీవం
భూగోళం భవిష్యత్ ప్రశ్నార్థకం
మొక్కలు చెట్లు
నీ ప్రగతికవే మెట్లు సోదరా....!
హరితహారం విజయవంతం చేయడమే సరైన పరిష్కారం
నీ పరిహారం
వినరా....!
_-రవికుమార్ కంచి_
🙏💐
🌱🐦🌴🐰🌴.
79
[06/08, 7:53 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 06.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*"ప్రయాణం....".*
కవిత సంఖ్య:79.
🏛️......,,,️🚌,,,........,,,
బడి వైపు వేసే అడుగులు
వృత్తి నిబద్ధతతో
చేసే ఉరుకులు పరుగులు
ఎన్నో ముఖాల దర్శనం చేస్తున్నయ్
మరెన్నో భావాల పలకరిస్తున్నయ్
ఆత్రుత ఆరాటాలు నిరసనలు నీరసాలు
బస్సులో వేలాడుతున్నయ్
పొగత్రాగరాదు,
స్త్రీలను గౌరవిద్దాం
ప్రజాప్రతినిధులకు, దివ్యాంగులకు, వృద్ధులకు,
వాక్యాలు వద్దన్నా అటూ ఇటూ కదిలినా తప్పక కనిపిస్తున్నయ్
భిన్న వేష భాషల
విభిన్న బాసల వ్యవహారాల చిత్రప్రదర్శన
లైతున్నయ్
కొందరి నవ్వులు అందరి ముచ్చట్లు
కొందరి నిద్రలు
మరెందరో మూకుమ్మడులై
పరుగుతీస్తున్నయ్
ప్రయాణ లక్ష్యం చేరగానే
నవ్వుల పువ్వుల స్వాగతాలు
ప్రశాంత పచ్చని ప్రకృతి ఒడిలో పక్షుల సవ్వడిలో
బడి ఆహ్వానాలు
సమ్మోహన పరిచినయ్
ప్రయాణజీవనం
పాఠ్యబోధనానందం
నిత్య జీవితానుభవ మధురస్మృతుల పేజీలై పరిణితులు సాధిస్తున్నయ్.
_-రవికుమార్ కంచి_
💐
🌷🌷🌷🌷🌷🌷
80
[06/08, 7:55 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 07.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*"ఆటవికం"....!.*
కవిత సంఖ్య:80.
-----⚜️-----
-------------
శాంతి వచనాలు పలుకుతున్నాం
ప్రపంచ శాంతి బహుమానాలు పొందుతున్నాం.....
సామరస్యాలు వదిలి చర్చలు మాని కయ్యానికి కాలు దువ్వుతున్నాం.....
****
లక్ష్మి కాలు పెడితే మంచిదన్నాం
మహిళ ఇంటింటా వెలసిన దైవమన్నాం
దేశదేశాల కానరాని దైవం
నలిపేయడమే తప్ప
కాపాడలేని దైన్యం
ఆడపిల్లంటేనే బరువనే కలికాల వైనం
****
ఎన్నో మానవ వనరులు
మరెన్నో విలువల హక్కుల నిలబెట్టే సంస్థలు
కులమత హింసలు జాతి విధ్వంసాలు విద్వేషాలు అణచివేతలు
కోకొల్లలు
****
నాగరిక సమాజమా
అనాగరికం వదలని ఆటవిక సమూహమా
ఎటు నీ పయనం
ఏది నీ పరిణామం
ఎక్కడ నీ పరిణితి....??
_-రవికుమార్ కంచి_
🙏
-----☘️🌹-----
---------------
81
[07/08, 6:07 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 06.8.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44)
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'ఆచార్యా... వందనం'*
కవిత సంఖ్య:81.
~~~~~✊~~~~~
ఆచార్యా....
నీళ్లు నిధులు నిరుద్యోగ సమస్యల
సాధనే లక్ష్యంగా
యాస భాష
సాంస్కృతిక
ఆత్మగౌరవం
నిలబెట్టుడే
పరమావధిగా
సూత్రాలై
నిలబడితివి
సిద్ధాంతాలై
నిలబెడితివి
ఊపిరులై
కలెబడితివి
ఆచార్యా
జయశంకరా....
నీకు వందనం....
మలిదశ తెలంగాణ పోరాటం
మడమ తిప్పని ఆరాటం చేసేస్తివి
ఇప్పుడు కాదా....
మరెప్పుడు కాదని
ఇప్పుడు రాదా... మరెప్పుడు రాదని
మూల స్తంభమై నిలబడితే
నిశ్శబ్ద తరంగమై ఉప్పొంగితే
వికసించిన
తెలంగాణ
సాధించిన
తెలంగాణ
నీ ఆశయ
సౌధముకై
మున్ముందుకు సాగాలి
నీ శ్వాసల గర్జించిన
జై తెలంగాణ నినాదం
అభివృద్ధై నిలవాలి.
జై తెలంగాణ
జైజై జయశంకర్.✊
_- రవికుమార్ కంచి_
🌻🌷
82
▪️▪️🌺▪️▪️
[07/08, 6:13 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 07.8.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*"పీవీ".*
కవిత సంఖ్య:82
--__--❇️__--__
పీవీ.....
శత కీర్తులు మీవి
శత ప్రణామాలు
శత నివాళులు మావి
ఆలస్యంగానైనా అర్పించనీ మేధావీ
బహుభాషా ప్రావిణ్య
ఠీవి
మరిచినాడు నీ గొప్పలు కవి
హర్షించదు స్మరించని భువి
నిరాడంబర నిర్మల మేధోజీవి
భారత ఆర్థిక వ్యవస్థ దృఢ
పునాదులు కట్టిన శ్రమజీవి
కఠిన జఠిల సమస్యల్లోనూ
భావి భారత ప్రగతి చూపిన
తెలుగు జాతి
దక్షిణ ద్రవిడ జాతి
ఆశాజీవి....
పీవీ
అందుకో మా ఘన
అశ్రునివాళి.
_రవికుమార్ కంచి_
💐🙏
--__--✳️__--__.
83
[07/08, 6:18 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 07.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*భిన్న కోణం.*_
కవిత సంఖ్య:83.
-----⁉️-----
నాకు రాయనిపించింది
నీకు ఆరాధ్య దైవమనిపించింది
నీకు కులగోత్రాలు గొప్పైతే
నాకు ఆ ఉచ్ఛ నీచాల గోతులే ముప్పై ముంచుతున్నయ్
నాకు కుల వృత్తుల బతుకు చిత్రాలు పోరాటాలైతే
నీకు అవి నిరంతర సౌభాగ్య సేవలు
నీకు విలాస బాబాలు దేవుళ్ళైతే
నాకు కపటత్వం నిండిన చిల్లర చోరులు కన్పిస్తున్నరు
నీకు కవితలు కథలు కాలక్షేపాలైతే
నాకు నా స్థితిని గతిని
సమాజాన్ని మార్చే అక్షర నిప్పుల బాణాలు
నీకు వానజల్లులు కాసేపాడుకునే షవర్ బాతైతే
నాకు టప టప రాలే చినుకులు ప్రాణాధారాలు
నీకు ప్రతి సంబంధం వ్యాపారం
ప్రతి మనిషి ఆట వస్తువైతే
నాకు ప్రతి ఒక్కరు మానవరూపం దాల్చిన దైవం
ఏది తప్పు....
ఏది ఒప్పు.....!?
_-రవికుమార్ కంచి_
🙏💐.
-----💐-----.
84
[07/08, 6:24 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 07.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*గాల్లో దీపం 🪔.*_
కవిత సంఖ్య:84.
➖➖🕯️➖➖
➖➖➖➖➖
గాల్లో దీపం కరోనా జీవితం
వత్తి గట్టిదయితే నిలబడ్తది
చమురు నిండా ఉంటే వెలుగొస్తది
గాలినే నమ్ముకోవడం గాలినే వేడుకోవడం
గాలి తగ్గాలనుకోవడం
గాలిని బంధించే చేతులు కావాలనుకోవడం
గాలి నాపే ప్రభుత్వాలు రావాలనుకోవడం
ఉత్త గాలి కోరికలే...!
గుడ్డి నమ్మకాలే....!
కరోనా ఈదురుగాలిలో
జ్వాలలా వెలగాలంటే
తట్టుకుని బతకాలంటే
నువ్వు గట్టి వత్తివి కావాలి
చమురనే మంచి ఆహారం నిరంతరం
కావాలి
బలమైన రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలి
ఏ చీదర గాలినైనా ఎదిరించి నిలబడాలి
అప్పుడే నువ్వు దీపం
గొప్ప వెలుగునిచ్చే అఖండ దీపం
నీ వెలుగు నీక్కూడా వెలుగవ్వాలి
నీకు నువ్వే వెలుగివ్వాలి
నిన్ను నువ్వే రక్షించుకోవాలి.
_-రవికుమార్ కంచి_
💐🙏
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
85
[07/08, 3:58 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 07.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*'Asymptomatic'...!.*_
కవిత సంఖ్య:85.
_ _ _ _ 🙃_ _ _ _
సమాజం తనలో మోసాలు దౌర్జన్యాలు
చుట్టి పెట్టుకుంది
కుట్రలు కుతంత్రాలు
దాచి పెట్టుకుంది
మూఢాచారాలు
విష మూలికలు నాటుకుంది
asymptomatic గా
ఆ లక్షణాలు కనబడకుండా
ఆ తెగుళ్ళు తెల్వకుండా
సమాజం తనలో తాను కుంగి కృశించిపోతున్నది
పైకి అంతా బాగుందని
పరీక్షలు సంస్కరణల ఊసే చేయకున్నది
పురుగులున్న మేడిపండులా
పైకి నిగనిగలాడుతున్నది
ఎక్కడా లేని గోప్పలతో కళకళలాడుతున్నది
symptomatic గా మారేదెప్పుడు
చికిత్స జరిగేదెప్పుడు
స్వస్త సమాజం గా transform
అయ్యేదెప్పుడు....?
_-రవికుమార్ కంచి_
💐🙏
86
🔅🔅🔘🔅🔅
[07/08, 4:05 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 07.8.2020
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
_*అదిగో PRC..... ఇదిగో 61....!?.*_
కవిత సంఖ్య:86
.............🐯..............
_ఎన్నికలొస్తే_..........
దస్త్రాలు కదుల్తయ్
అస్త్రాలు వదుల్తయ్
శస్త్రాలు పేల్తయ్
శాస్త్రాలు వల్లిస్తయ్......
▪️▪️▪️
_అవసరముంటే_.........
ఉద్యోగులు త్యాగధనులు
క్రమశిక్షణ వెలుగులు
ఉపాధ్యాయులు పోరాట వీరులు
దేశానికి వెన్నెముకలు........
▪️▪️▪️
_వ్యతిరేకత పెరిగితే_......
పిఆర్సి నివేదిక సిద్ధం
ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం
సర్వీస్ రూల్స్ కై ఢిల్లీకి
పదవీ విరమణ 61 ప్రకటనలు .........
▪️▪️▪️
_పనైపోతే_...........
మీకు అన్ని జీతాలా
ఆర్థిక పరిస్థితి బాగాలేదు
దేశంలోకెల్లా ఎక్కువ జీతాలు
కమిటీ వేస్తాం పరిశీలిస్తాం.......!?
▪️▪️▪️
కలెక్టరైనా కండక్టరైనా
రాజకీయాల ముందు
రాజ్యాధికారుల ముందు
ఉద్యోగి
చెల్లని వోటే
విలువలేని మూటే
మూగ
మాటే.....!?
_-రవికుమార్ కంచి_
🙏🌹
... ... ... 😟 ... ... ...
...............................
87
[08/08, 6:04 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 07.8.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'నింగి చేరినయ్'✨*
కవిత సంఖ్య:87.
✨✨✨
నింగి చేరినయ్...
జన గొంతుకలై
గర్జించిన
జన జాగృతులై
వెలుగొందిన
జన తంత్రులై
కంపించిన
జన నేతలు
కళాజాతలు
నింగి చేరినయ్
తళుక్కున మెరిసే
తారకలై ఆకసమున
వెలుగులీనుతున్నయ్
ఎంతో ఎదిగి
మరెంతో ఒదిగి
జన సమూహమే
స్వగృహమై
జన సమస్యలే తమ
బాధ్యతలై
జన ఘోషలే
తమ బాధలై
నిదురించని
జననేతలు
గళమాపని
కళాజాతలు
నింగి చేరినయ్...
కొందరికే కాదు
మేము
అందరికీ కాంతి నింపే
ఎర్ర జ్యోతులై ఆకసమున ప్రజ్వరిల్ల
లోకమంత
కాంతి జల్ల
వెలుగు చుక్కలై
నింగి చేరినయ్...✨✊
_- రవికుమార్ కంచి_
🌷🌻
°°🔥✨✨🔥°°
[08/08, 6:05 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'ఓటమి'*
కవిత సంఖ్య:88.
▪️▪️👎👍▪️▪️
ఓటమి....
విజయానికి మరో
దారి చూపుతుంది
మరో గెలుపు
తలుపు తీస్తుంది
ఓటమి...
విభిన్న
మార్గాన్వేషణ
చేస్తుంది
సృజనాత్మకత
పెంపొందిస్తుంది
ఓటమి...
కొత్త శైలిలో పాఠం
బోధిస్తుంది
విజయానికి నాంది
అవుతుంది
ఓటమి....
నిర్లక్ష్యపు నీడలో దాగిన ఆలోచనలకు
అగ్గి రగిలిస్తుంది
అజ్ఞానపు
అలసత్వంలో కూలిన
నిస్తేజానికి
చురకలంటిస్తుంది
ఓటమి...
ఏది సన్మార్గము
ఏది దుర్మార్గమో
నిగ్గు తేలుస్తుంది
కారణాలు సరిగ్గా
విశ్లేషిస్తే
భవిష్యత్
విజయమవుతుంది
నేటి ఓటమి
రేపటి
చారిత్రక
గెలుపైనిలుస్తుంది.
_- రవికుమార్ కంచి_
👍🌸☘️🌷
➖➖✌️🚩➖➖
[08/08, 6:10 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*"సారూ.... బడెప్పుడు తెరుస్తరు".....!?.*
కవిత సంఖ్య:89.
▪️▪️🏛️▪️▪️
ఆడిన ఆటలు విసుగు తెప్పించినయ్
ఆట వస్తువులు అరిగిపోయినయ్
అక్షరాలు కరిగి
పోయినయ్
చెట్ల నీడలు చిర్రెత్తుకొచ్చినయ్
టీవీల్లో కార్టూన్లు వెక్కిరించినయ్
చేన్లల్ల కోతులు ఎగబడి తరిమినయ్
బడి పిల్లలు బజారు పాలైండ్రు
చదువులు రాతలు మట్టిపాల్జేశిండ్రు
పుస్తకాలు కాపీలు చెదలు పట్టించిండ్రు
సంచులు బడిబట్టలు
మసిగుడ్డలు జేసిండ్రు
సారూ....!
బడెప్పుడు
తెరుస్తరు...
ఎండకాలం ఎప్పుడోబాయె
పొలంబడి
షురువాయె
సదువుల బడి సాగదాయె
పోరగాండ్లు....
శెప్తింటలేరు
ఓకాడుంటలేరు
యాష్టకొచ్చిపాడాయే
సారూ....!!
బడెప్పుడు
తెరుస్తరు......!?
పిలగాండ్లు
ఆగమైతుండ్రు.....
_-రవికుమార్ కంచి_
🙏💐.
🔆🔆🏛️🔆🔆.
[08/08, 6:15 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'పొర'*
కవిత సంఖ్య:90
~~~~~⚪~~~~~
'''''''''''''''''''''''''''''
ఆవరించిన పొరలు
అంతరంగాలు
దాచిన ముసుగులు
పాలపిట్టలా విహరించే మనసును
తెల్ల పావురంలా
మురిపించే లేత
మనసును
రాజకీయ వైషమ్యం
వయోభేదం
కుల మత వర్గ
విభేదం
పేద ధనిక అంతరాల పంకిలం
తరాల తెరలు
తీసినకొద్దీ తరగని
ఉల్లి పొరలై
సాటి మానవ
మనోసౌందర్యాన్ని
ఎదుటి వాని భావ సరస్సుని
చూడలేని
రుచి చూడలేని
సంకుచిత అజ్ఞాన
పరిమితులు
సరికాని హద్దులు
చెరిగిపోయేదెప్పుడో....
!?
_-రవికుమార్ కంచి_
🙏💐.
☘️
91
[08/08, 10:28 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*🏡పల్లె - పట్నం🏢*
కవిత సంఖ్య:91.
. .''''''''''''''''. .
➖🔘➖➖🔘➖
వలసబాధితుడా
కాళ్ళే చక్రాలైన
కార్మికుడా........!
నీ వలసలు
నీ పరుగులు
నీ బరువులు
ఆగే పరిస్థితి లేదు
ఆపే ప్రభుత్వాలు లేవు
నీ చక్రాలరిగినా
నీ కండలు కరిగినా
నీ బొక్కలు విరిగినా
ఆదుకునే హస్తాల్లేవు
అక్కున చేర్చుకునే
గుండెల్లేవు
ఆ పట్నం పొమ్మంటది
నీ పల్లె రమ్మంటది
నీ ఆకలి పోగొడ్తది
నీ జీవం నిలబెడ్తది
పట్నానికి పల్లెలకు వంతెనలై వేలాడ్తివి
ఇనుప చక్రాలై పొర్లాడ్తివి
కూటి కొరకు గూటి కొరకు
మేటి పాట్లెన్నో పడ్తుంటివి
ఏ ప్రళయం ముంచేసిన
ఏ సమరం ఎదురొచ్చిన
నీ రెక్కలె దిక్కైనవి
నీ పిక్కలె మొక్కైనవి
ఎపుడాగును
నీ నడకలు
ఏడాగును
నీ వలసలు
ఊపిరున్నవరకేగా....!?
_-రవికుమార్ కంచి_
🙏💐.
🐾🐾.....💔.
92
[08/08, 10:32 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'వ్యూహం...?'*
కవిత సంఖ్య:92
🏹🙈😢⚔️
హద్దులలో కవాతులు
సరిహద్దులలో విన్యాసాలు
యుద్ధ సన్నద్ధ వ్యూహాలు
సాయుధ బలగాల ప్రదర్శనలు
లయబద్ధ
ప్రకంపనలు
సైనిక జల
వాయు దళాల సన్నాహాలు
కత్తులు కసరత్తులు
బలం బలగం
అద్భుతం
ఈ కత్తులన్నీ
ఈ కసరత్తులన్నీ
ప్రకృతి సంపదల నాశనానికేగా
మానవ
జీవ వనరుల వినాశనానికేగా....!?
కాలం మారింది...
కానీ
అవే కుట్రలు కుతంత్రాలు
కుటిల నీతులు
అవే ఆక్రమణలు
దుస్సాహసాలు
మారని దేశాల
అనైతిక అమానవీయ యుద్ధ నీతులు
హింసా యుద్ధోన్మాద
వ్యూహాలు
భూ మనుగడ
ప్రశ్నార్ధకాలు....!?
_-రవికుమార్ కంచి
93
[08/08, 2:49 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.08.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*'Outsider'...!.*_
కవిత సంఖ్య:93.
🌿🧠🌺
సోదరులారా.... మహానుభావులారా....
మీ వృత్తి నిబద్ధతకు
అంకిత
దీక్షలకు
అకుంఠిత సేవలకు
జోహార్లు....
మీ నిష్పక్ష యధాలాప
ప్రవర్తనకు వ్యాఖ్యలకు
ధన్యవాదాలు.....
జాతి నిర్మాతలైనా మేధావి వర్గమైనా
అట్టడుగు ఉద్యోగ వర్గమైనా.....
లోపరహిత సంపూర్ణ
సమాజమున్నదా.....
జీవితం చదివిన
శాంత అశాంత
ఋషిపుంగవులారా
......
వ్యాఖ్యలకు
వ్యాఖ్యానాలకు ముందు
మనమీ సమాజంలో భాగమా కాదా....
ఉత్తమోత్తమ సేవలకు స్వయంతృప్తి
ఉందా లేదా.....
సంస్కరణలకు ఉద్ధరణకు కృషి
చేశామా లేదా......
ఆత్మ పరిశీలన పునరాలోచన చేద్దాం...
సంస్కరణల అంకురాలు
మొలకెత్తించుదాం....
అంతేగాని
మేమే ఉన్నత శిఖరం
మేమే మహా పండిత పురాణం
మేమ్మాత్రమే విజ్ఞాన
ఆజ్ఞాపనా అతిరధులమని
భ్రమించి
అందరిపై వేలెత్తడం
గురివింద నీతులు వల్లించడం
పరిణితి లేని
Outsider గా
సమాజ అతీతులుగా
భావించడం
భావ్యమా.....!!??.
_-రవికుమార్ కంచి_
🙏💐.
🌿🙈🙉🙊🌻.
94
[08/08, 2:53 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.08.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'సిరా లేని కలాలు'....!✍️*
కవిత సంఖ్య:94.
.........................✍️
ఎన్ని తడి ఆరిన గొంతుల
ఒక్క నీటి బిందువు రాల్చింది....
నీ కలం.....?
ఎన్ని అనాథ జీవుల గుండెల
అనంత ధైర్యం నింపింది....
నీ కలం....?
తిండి లేక బట్ట లేక పొద్దే చిరునామై
నడిచే అరి పాదాలకు
ఏ దిక్కు చూపింది
నీకలం....?
గొప్ప భావాల గ్రంథాలు నిర్మిస్తున్నా
కుళ్ళు కులమత విద్వేషాలు
రూపుమాపిందా... నీ కలం....?
వీధికొకడు పేటకొకడు
పూటకొకడు
వివస్త్రల జేసి
'ఆడు'తుంటే.....
ఏం చేసింది.....
నీ కలం....?
ఆస్పత్రల ఆఫీసుల
ఆమ్యామ్యాలకై
ముసలి జనుల సైతం
పీడించుక
చంపుతుంటే.....
ఎక్కడుంది.....
నీ కలం.....?
ఏది గొప్ప కలం....?
ఏది గొప్ప రచన...?
సమాజమెటైనా పోనీ...
సమయమెంతైనా కానీ..
నీ కలల ప్రపంచంలో...
వర్ణన అభివర్ణనలో
ఆరితేరి
సన్మానాలు
బిరుదులు పొందితే
చాలా....?
లక్ష్యం మరిచిన
లక్షణం కోల్పోయిన
సిరా లేని ఎండిన కలాలతో
కనబడని రాతలతో
స్పృశించని
గుండె కోతలతో
ఎవరికేం
లాభం...?
కలం...
సమాజానికి
దూరంగా ఉనికి
కోల్పోయింది...
అడవిని చైతన్య
పరచడానికి....!?
గొప్ప కలం ఆచూకి
లేకుండా పోయింది...!
_-రవికుమార్ కంచి_.
🙏💐
➖➖⁉️➖➖.
95
[08/08, 7:24 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.8.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*'విషమ పరిస్థితి'....!*
కవిత సంఖ్య:95.
🔅🔅😢🔅🔅
కరోనా దయనీయ సంప్రదాయాల
మూలమైంది
కర్కశ సూత్రాల
ఆవిష్కర్తైంది
ఎవ్వరాపని
ఎన్నడాగని
మానవ సృష్టి కార్యాలను
మాతృహృదయం వికసించే
సంతానోత్పత్తిని
సైతం
నిలిపివేస్తున్నది
నిత్యోత్సాహంతో నిరంతరానందంతో
సాగే
విద్యా సంవత్సరాన్ని
శూన్యంగా మార్చనుందేమో...!
రక్తాన్ని పిండుతూ
స్వేదాన్ని రాల్చుతూ
పుడమి పులకించే
ధాన్యపు సిరులు
పండించే
హలధారుడు
కరోనా ధాటికి
పంట విరామం
పాటించే
పరిస్థితి
ఏర్పడనుందేమో.!
కరోనా విషకణాలు
నిండిన గాలి
ప్రాణవాయువు
నిండా పీల్చలేని
విషమస్థితి ఏర్పడనుందేమో....!
అవాంఛిత
విషమ పరిస్థితి
ఎంతకాలమో....!!
మానవ మేధ
పరిష్కరించే వరకే....!
_-రవికుమార్ కంచి_
96
[08/08, 7:27 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.08.2020.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
_*'తుగ్లకీకరణ'...👺.*_
కవిత సంఖ్య:96.
🔅🔅♨️🔅🔅
అరేక్ మాల్ ఉపకరణాలు
తూతూమంత్ర ఉపాయాలు
ముసురుతున్న
ఈగలకు
వేపకాయేసినట్లు
జనాలకు పథకాల
ఎరలేసి
ఏడ పన్నా
ఏం చేసినా
మాకేందని
అభివృద్ధి ఆధునీకరణ పేరుతో
జరిగే తుగ్లకీకరణ
జనాల మెదళ్లను తొలుస్తూనే ఉంది
కరోనా
పరుగోవైపు
పాలకులురుకులో
వైపు
జనం ఎరలమత్తు
వదిలి
నిద్ర లేచిన సింహమై
గర్జించి పంజా విసిరే సమయం
ముందుంది....!!
_-రవికుమార్ కంచి_
97
[08/08, 7:55 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 08.08.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
హైదరాబాద్,
శీర్షిక:
*పరాధీనత...*
కవిత సంఖ్య:97.
.....👨🦯.....
క్రోమోజోమ్ నిర్మాణం గూని
పోయింది
పచ్చిదో పుచ్చుదో
కర్ర లేకుంటే నిలబడ్తలేదు
అచంచల విశ్వాసం ఊహకందని మేధస్సు
నవనవలాడే నవీనత
ఆంగ్లేయుడి ముందు ఉదాసీనతా
మానై కూసుంది
అనువంశిక నిస్తేజం
ఆనాటి నుండి నేటి వరకు
విశ్వ వ్యాప్తి జరిగింది
ఎవడేం చేసినా
ఎవడేం కూసినా
మొద్దోలె మిన్న కున్నది
పరాధీనత మెదళ్ల పట్టిన జాఢ్యమైనది
మరో ఫూలే అంబేడ్కర్ జన్మిస్తే గానీ
మరో నేతాజీ వివేకానందుడు
వస్తే తప్ప
కదలనని వంగి
చేతులు కట్టుకుంది.
_-రవికుమార్ కంచి_
98
[09/08, 6:20 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 09.08.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
9494345594,
హైదరాబాద్,
శీర్షిక:
*'కూలుతున్న విగ్రహాలు'...!*
కవిత సంఖ్య:9️⃣8️⃣.
♾️🌻♾️
విశ్వ వీధిన వెలుగులై విరాజిల్లిన
మేధో వృక్షాలై నీడనిచ్చిన
వందల సూర్యోదయాలై
ఉత్తేజితమైన
మహాత్ముల రూపాలు
స్ఫూర్తి రగిలించిన
ప్రతిరూపాలు
రోడ్డుకు మరకలై
తట్టు రాల్లై తాకుతున్నయ్
అగ్రరాజ్య జాత్యహంకార
నిరసన ప్రవాహమున ముక్కలై
మునిగిపోతున్నయ్
మేమెందుకు తక్కువన్న
మా రంగుపై తెల్లబూటు
మరకలేందన్న
మా గుండెలపై
శ్వేత
గునపాలెందుకన్న
ఆగ్రహాల ఉప్పెనలో
మూగ శిలలై
సరిచేయని తప్పులపై
చరిత్రై నిలబడిన
జాతివివక్ష
మచ్చలలో
మురికిపట్టిన
చరిత్రై
కూలుతున్న
విగ్రహాలు
మానవత చిగురించనిదే
సమానత సాధించనిదే
నిలబడలేవు....!!
_-రవికుమార్ కంచి_
🙏💐.
♾️👤♾️.
99
[09/08, 6:20 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 09.08.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
9494345594,
హైదరాబాద్,
శీర్షిక:
*'సుక్కలు'.*
కవిత సంఖ్య:
9️⃣9️⃣.
✨🍻✨
సంపాదించే స్తోమత లేదు
కాసులు వచ్చే పరిస్థితి లేదు
కూసుంటె కూడు తినే అవకాశం లేదు
పరుగెత్తితే పైకమిచ్చే పనిలేదు
కుటుంబం పోషించలేక ఒకడు
అలసిన శరీర బాధల మరిచేందుకు ఒకడు
మత్తుకు బానిసై మరొకడు
కూడు ఉన్నా లేకున్నా
ప్రసాదం తిన్నా పస్తులున్నా
గుడిసె ఉన్నా లేకున్నా
దిక్కన్నా లేకున్నా
పక్కున్నా లేకున్నా
సుక్క దిగాల్సిందేనా
సుక్కలు
కనపడాల్సిందేనా
మద్యం మత్తులో భవిష్యత్తు చిత్తు
కావాల్సిందేనా
ధూమపానం హానికరం
మద్యపానం
హానికరమని
మొత్తుకున్నా మత్తు దిగని వైనం
దిగజారి సానిటైజర్
కూడా వదలని దైన్యం
ప్రాణం పోయే భయం కన్నా
మత్తులో గమ్మత్తులే
ప్రాణమా
_రవికుమార్ కంచి_
🌸🌻
100
~~~~~~😕~~~~~~
[09/08, 6:21 AM] Kanchi Ravi Kumar Poet Ks44: 09.08.20.
వీరాస్ కవిసమయం,
రవికుమార్ కంచి (44),
ఉపాధ్యాయులు,
9494345594,
హైదరాబాద్,
శీర్షిక:
*'అడవే ఇది'..!?*
కవిత సంఖ్య:
1️⃣0️⃣0️⃣.
🦁🐅🌱🐺🐲
అడవే ఇది....
కౄర మృగాలే తప్ప
మానవతేది
మనిషి జాడేది
అడవే ఇది...
ఆవులు కన్పిస్తే
పంజా
విసురుతున్నయ్
పులులు ఈగలై
ముసురుతున్నయ్
అడవే ఇది...
లేడి పిల్లలు
చెంగున ఎగిరి
గంతేసినా
వెంటాడి గొంతుబట్టి
రక్తం తాగేస్తున్నయ్
అడవే ఇది...
అంగబలం
మందబలముంటే తప్ప
ఎదురుపోటు
తిరుగుబాటు చేస్తే
తప్ప
జీవించలేని దైన్యం
అడవే ఇది...
బలముండి దోచుకున్నవాడు
దొరవుతున్నాడు
బలహీనుడు
నిజాయితీగ
ఉంటూ
బక్కచిక్కి
బలవుతున్నాడు
అడవే ఇది...
ఏండ్ల కొలది
భారత దేశం నా
మాతృభూమి
భారతీయులందరు
నా సహోదరులని
ముక్తసరి పాటలే
తప్ప
ఆ సోదరభావమెక్కడ
ఆ అభిమానాలెక్కడ
మానవతెక్కడ.
_*- రవికుమార్ కంచి*_
🌻🌸
➖➖🙂➖➖
Comments
Post a Comment