Schools opened
నిర్వహణ
వీరా గుడిపల్లి
సమన్వయం
శివునూరి లలితాకృష్ణ
సహకారం
మెరుగు మధు
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు
*************
కవివరుల జాబితా
1.ఇంద్రవత్ రాహుల్ గారు
2.కోరాడ నరసింహారావు గారు
3. డాక్టర్ ఆంజనేయులు గారు
4.వీరా గుడిపల్లి
5.శ్రీమతి నారాయణ భాగ్యలక్ష్మి గారు
6.వీరా గుడిపల్లి
7.స్వర్ణ సమత గారు
8.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
9.శివునూరి లలితా కృష్ణ గారు
10.సునంద వురిమిళ్ళ గారు
11.రాపోలు అరుణా స్వామి గారు
12.మర్రి జయశ్రీ గారు
13.వల్లాల విజయ లక్ష్మి గారు
**************
కవితా గానం... అలరించింది
బడులు తెరిచారు.
సమకాలీన అంశం పై స్పందించి
చక్కని... కవితలు అందించారు
కొన్ని మెటఫర్స్, సిమిలీస్
మన కవులు కవయిత్రులు
అసామాన్యమైన విధంగా స్పందించారు.
పట్టించుకుంటే, పనిగా చదివితే
కవిత్వాన్ని ప్రేమిస్తే......
వీరి కవన శైలికి.. సలాం చేయాల్సిందే....
.... వీరా గుడిపల్లి
**************
పిల్లలు లేని ఊహలో
.... ఇంద్రవత్ రాహుల్ గారు
లెక్కల చిట్టాలు
బిల్లు బుక్కుల బూజులు
..... కోరాడ గారు
ఈ ఆనందం యెవరికి
.... డాక్టర్ ఆంజనేయులు గారు
ఇంట్లో ఉండి
కబుర్లకై తపన
....నారాయణ భాగ్యలక్ష్మి గారు
డస్టర్ డస్ట్ బట్టి పోయింది
..... స్వర్ణ సమత గారు
బోసి బోయిన పాఠశాల ముఖద్వారం
... డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
ఎలాగైతేనేం
నన్నూ నా పిల్లల్ని కలిపింది
... శివునూరి లలితాకృష్ణ గారు
పాఠశాలలు తెరిచారనే
శుభవార్త.. అణువణువునా సంబురం
.... సునంద వురిమిళ్ళ గారు
బడి తెరిచారు
ప్రార్థనా గీతం లేకుండా
.... రాపోలు అరుణా స్వామి గారు
కరోనాకు బంధీఐన భూగోళం
..... మర్రి జయశ్రీ గారు
......
వచన కవితకు సొబగులద్దిన
కవి వరులకు... సలాం
...... కవితా గానం
**********************
[28/08, 8:01 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
============
అంశం : పాఠశాలలు తెరిచారు
తేది : 28/08/2020
🇮🇳 *పాఠశాలలు తెరిచారు*🇮🇳
బడి గంట మ్రోగింది
పిల్లలు సంతోషంతో
గంతులు వేశారు
ఒజ్జలు బాధ్యతతో
తమ బడికి వెళ్లారు
ఐదు నెలల నుండి ఉన్న
బడిని శుభ్రం చేసిన వేళా
అందరూ ఒకరినొకరు
ఆప్యాయతంగా మాట్లాడుకుంటూ
తమ పనులు పూర్తి చేసుకొని
ఆనందంగా కలిసి తింటూ
పిల్లలు లేని ఊహల్లో
ఉండి పోతూ అందుకే
పిల్లలు దేవుళ్ళు పిల్లలు
ఉంటేనే ఆనందం, సంతోషం...
*ఇంద్రావత్ రాహుల్*
*కొత్తపేట్*
*నిజామాబాద్*
2
9848054079..
[28/08, 8:10 PM] Korada: కవితాగానం
అంశం: - కవిత
పాఠశాలలుతెరిచారు
కోరాడ నరసింహా రావు ;వేదమంత్రాల్లా
**************
హమ్మయ్య....!
వెధవకరోనా...వస్తేరానీ....!జనాలు ఛస్తే చావనీ...!! గానీ...
ఈ స్వయం నిర్బంధ పు సంకెళ్లను త్రెంచి అవతలపారేయొచ్చు
ఆవారా ఐపోయిన
పిల్లల్లో ఎన్నాళ్లకు మళ్ళీ చదువుల హు షారు మొదలౌతోంది!
మూగబోయిన బడి గంటమళ్ళీఎన్నాళ్లకు
వొళ్ళువిరుచుకుని ...
గణ-గణ మంటోంది!
జీత,బత్తేలు లేక...
ఇన్నాళ్లూ నా నా అగ చాట్లూపడ్డ ప్రయివేట్
టీచర్లు మదిలోమళ్ళీ
ఎన్నాళ్లకు ఆశల పూలు మొగ్గతొడుగు
తున్నాయ్....!
ఇన్నాళ్లూబోసిపోయిన బడిఆవరణమళ్ళీ
ఎన్నాళ్లకు ముసి ముసి నవ్వులతో ...
మల్లెతోటలామారిపో యింది...!
ఇన్నాళ్లూ ఆదాయం
లేకపోయినా...అద్దె+
కరెంట్కట్టక తప్పని యాజమా న్యాలు
చిరు నవ్వులతో...
లెక్కలచిట్టాలు...,బిల్లుబుక్కులబూజులు
దులిపేసి...కొత్త పెళ్లి కూతుళ్ళలాముస్తాబులు అవుతూ...
వున్నవి...!
తరగతి గదుల లో...
పాఠాలు.... వేద మంత్రాల్లా శ్రా వ్యం గా వినిపిస్తున్నవి !!
****************
.......కోరాడ.
[28/08, 8:15 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: పాఠశాల**
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు
పాఠశాలలు తెరిచారు
పంతుళ్ల కు కష్టాలు మొదలయ్యాయి
ఇప్పుడు వర్క్షీట్లను సమర్పించు
ప్రతిరోజు పంతుళ్ల
హాజరు పార్టీలను చూసుకొని ప్రభుత్వం విద్యాశాఖకు పంపించాలి
badulu తీర్చారని సంబురం ఎవరికి ఉంది
కానీ నీ ఆన్లైన్ లో వివిధ ఛానల్లో ఎవరు వింటున్నారో ఎవరికీ తెలియదు కొద్దిమందికి దిగువ మధ్యతరగతి వాళ్లకి తప్ప పేదవారికి టీవీలు లేనే లేదు
ఇప్పుడు ఆన్లైన్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి
అందరూ చూస్తున్నారో లేదో ఎవరికీ తెలియదు
ఒక ఐదు ఆరు నెలల తర్వాత పాఠశాలలు కళాశాల పరిస్థితి కూడా ఇదే
పాఠాలు వినే వారందరూ వినని వారు ఎందరో ఎవరికి తెలుసు చెప్పడం మన బాధ్యత వినకపోతే వాళ్ల కర్మ
పాఠశాలలు తెరిచారు ఆన్లైన్ కష్టాలు మొదలయ్యాయి
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు భువనగిరి ఖమ్మం 7702537453 కష్టాలు మొదలయ్యాయి
4
ఇది వీరా గుడిపల్లి కవిత
28082020
Schools opened
*******************
దేశమంటే మట్టి కాదోయ్
గురజాడ మా అడుగు జాడ
ఆన్లైన్ లోకంలో
అర్థం మారిందా
బడి పంతులు లాప్ టాప్ లో
పిల్లల జాడలు
Zoom లో
తల్లి దండ్రుల తాపత్రయం
జియో మీట్ యాప్ లో సన్నిహిత సలహాలు
గూగుల్ మీట్ సమావేశంలో అధికారుల ఆదేశాలు
అడివై ఎదిగిన ప్రాంగణాల్లో
శాంతి కుటీరపు మౌనయోగులైన ఉపాధ్యాయుల మనసంతా దేవులాట
అయోమయం ఐతే కావచ్చు
అంతా భ్రాంతై కన్పించొచ్చు
యూ ట్యూబ్ అబద్దం కాదు...
రేపటి పాఠశాలలు తెరుచుకున్నాయి.
మూడో కన్ను కథ గాదని ఋజువై పోయింది
పాఠశాలలు తెరిచారు
పాఠశాలలు తెరుచుకున్నాయి
పిల్లలు తెరలపై
పంతుల్లకు
కనీసం కనిపిస్తున్నారు
Schools opened
...... వీరా గుడిపల్లి
5
కవితా గానం
29.8.20
నారాయణ భాగ్యలక్ష్మి
అంశం: పాటశాలలు తెరిచారు
కవితా శీర్షిక:
పిల్లలకు పండుగ
***************
పాఠశాల తెరిచారంటే
పిల్లలకు పండుగ సంబరం
కువ కువ రావాల వచ్చివాలే
గూటిలోని పక్షిపిల్లలాగా
బిర బిర బిరా పరుగుల
గంప కింద కోడి పిల్లలాగా
పిల్లలదంత ఒకటే పరుగు
తమ బంగారు నేస్తం బడి వైపు
మేతకు వెళ్ళిన ఆవు కోసం
లేగదూడ ఎదురుచూపులా
పూల తేనే కోసం తుమ్మెదల్లా
వంసంతం రాకకై కోయిలల్లా
బుట్ట గౌనుల చిట్టి పాపలు
బుడిబుడి నడకల చిన్ని బాబులు
పప్పు బెల్లాల తాయిలాలకై
ముందు వరసలో నిలుచున్న తీరుగ
బడిగంట కొట్టగానే గుడిగంట సడిలా
గల గల పారే సెలయేరుల్లా
కిల కిల నవ్వుల
పసిడి బాల్యపు పువ్వులు
మరో కొత్త బంగారు లోకంలో
అడుగిడుతున్న అందమైన
ఆనందాల అనుభూతి
సహజంగా పిల్లలకి బడి అంటే కష్టం
సెలవులంటే భలే సంబరం
కానీ నేడు
ఈ లాక్ డోన్ పుణ్యమా అని
ఇంట్లో ఉండి ఉండి మొహం మొత్తి
తమ బడి నేస్తాల కబుర్లులకై తపనలు
ఇన్నాళ్లు బోసిపోయిన
బడి తల్లి తలుపులు ఆదరంగా తెరచి
బడి గుడి ఒడి లోకి ఆహ్వానిస్తున్నాయి
నల్లబల్లల శుద్ధ ముక్కలు పలకా బలపం చిన్నారుల ఆత్మీయ స్పర్శకై..
ఆతృతగా ఎదురుచూస్తున్నాయి..
అందుకేనేమో
బడి అంటే అమ్మ ఒడి
అదే ఆ దేవుని గుడి ఇదే స్వచ్ఛమైన
గుడి బడి సమ్మెళనపు ఘంట సవ్వడి
6
ఇది వీరా గుడిపల్లి కవిత
29082020
ఇంటికొచ్చిన బడి
********************
మాయా దర్పణం
మాకు పాఠాలు చెబుతుంది
పాఠశాలకు పోవద్దంటుంది
మాస్టార్లు మా ఇంటి ముందు
మాస్కులతో నిలుచున్నారు
వర్క్ షీట్స్ వారి చేతుల్లో
సందేహాలకే సందేహం వస్తుంది
పాజిటివ్ అంటేనే భయం
అందరికీ నెగెటివ్ రావాలనే కోరిక
నాడు వద్దని చెప్పిన మొబైల్
కొనాల్సిందేనని కోరుతున్నారు
అప్పుడు తప్పన్నారు
ఇప్పుడు తప్పదంటున్నారు
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికామాటలాడమన్న బద్దెన యాదికొస్తుండు
బడి యాడుంది
నేనేడుంటె అక్కడనే
మిరప చేనుకు ముందు పెడుతుంటే
మెన్సురేషన్ పాఠం వస్తుందని
మొబైల్ లో చూడమని మాథ్స్ టీచర్ ఫోన్
ఇప్పుడు నేనో వీఐపీని
వీరా గుడిపల్లి లెక్కల సార్
విజయా మేడమ్ ఫిజిక్స్
తెలుగు బాలయ్య సార్
హిందీ భాస్కర్ రెడ్డి గారు
ఇంగ్లీష్ వినమని కరుణా మేడం
నేను ఫోన్ ఎత్తేదాక చేస్తూనే ఉంటారు
మా అమ్మ నాయినకు పెద్ద సారు
ఒకటే ఫోన్లు
సదువేందోగని సార్లైతె సాంతం ఫోన్లతోనే
బడికి బోయేది ఇదివరకు
గిప్పుడు
బడి మాయింటికి వచ్చింది
నా సుట్టు దిరుగుతుంది
.......... కాలం
యెప్పుడు ఒక్కతీరుగుంటాది.
సదుకుంట యెంత కష్టమైన
....... వీరా గుడిపల్లి
7
[30/08, 8:20 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*30/08/2020*
*పాఠ శాలలు తెరిచారు*
పాఠ శాలలు తెరిచారు,కానీ
మూగ బోయిన బెల్లు,
మోగుతున్న సెల్లు,
నల్ల బల్ల నల్ల పూస అయింది,
తెల్ల మొహం వేసి చూస్తుంది,
సుద్దముక్క సూ ద్ధామంటే
దాక్కుంది,
డ స్ట రేమో డస్ట్ పట్టి పోయింది,
బెంచీలు ఓ మూలన మూలుగు తున్నయ్,
ఆయ మ్మ పని లేక ఓ దగ్గర
కూలపడ్డది,
పెద్ద సార్ల తిప్పలేమో పెద్దవి,
టీచర్ల బాధలు వర్ణించ నలవి
కానివి,
పొరగాండ్లకు ఫోన్లు ఇయ్యద్ధనిరి,
ఇపుడేమో కొనియ్యమనవటిరి,
టీ.వి పాఠాలు మొద లాయే
టీచర్ల కేమో పాట్లు మొదలయ్యే,
విసిత్ర స దువులు,
వింతైన పాఠాలు,
పిల్లల చేతుల ల్ల పొద్దంతా
ఫోన్లు,
ఏ సబ్జెక్ట్ అర్థం కాక విద్యార్థి
తిక మక,
పాఠ శాల పాఠాలు లేక,
హాజరు లేదు , మిడ్డే మీల్స్
లేదు,
ఎన్నో ఏండ్లకు విస్తు పోయిన
పాఠ శాలలు,
పాఠ శాలలు తె రిచారు కానీ,
పిల్లలు లేని ఆ పాఠశాల
మో డు బారిన వృక్షమైంది.
నందన వనం లా ఉన్న
నా పాఠశాల,
నవ్వుల పువ్వులు లేని
నవీన ప్రాంత మై ,వెల వెల పోతోంది.
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
8
[30/08, 8:21 PM] Balloori Umadevi Poetess: 30/8/20
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం: పాఠశాలలు తెరిచారు
బడిలు తెరిచారన్న సంబరమే కానీ
హాజరు ఎంతంటుందో ఎవరికెరుక
పంతుళ్ల కేమో తప్పదిది కానీ
బాలబాలికల సంఖ్య తగ్గు నేమో
బోసి పోయిన పాఠశాల ముఖద్వారము
వెలుగులీనుచుండె సరికొత్తగా నేడు
ప్రార్థనా గీతంతో ప్రారంభమగుచు
సరికొత్త కొత్త ఉత్సాహం నింపు నికపైన
అమ్మ ఒడి లాంటి బడి కేగ పిల్లలు
పలక బలపాలతో సంసిద్ధులై నారు
బయటికి వెళ్లకుండా బందీలుగా ఉన్న చిన్నారులకు ఇప్పుడు రెక్కలు వచ్చినట్లు
పురివిప్పి ఆడేటి మయూరమ్ముల వలె నవ్వుతూ తుళ్ళుతూ బడికి వస్తారు జీతాలు లేక కాలమ్ము గడిపిన
ప్రైవేటు బడిపంతుళ్ళమోములు
పొద్దు తిరుగుడు పువ్వుల్లె వికసించు
గుడి వంటి బడి ఇది బాలబాలికలరా
చదువులమ్మను కొలువు వేళకు సరిగా
జాగు చేయక రండు వడివడిగ మీరు.
9.
పాఠశాలలు తెరిచారు
*బళ్ళు తెరుచుకున్నాయి*
*విడిచి పెట్టిన ఇళ్లలా.....*
ఆకులతో అలుముకున్న ఆవరణలో
అడుగుపెట్టింది మొదలు
ఊపిరాడనివ్వని ఉభయ కుశలోపరి సందళ్లు..
మోగే బడిగంట లేకుండా
తెల్ల బోయిన నల్ల బల్లలతో.....
సెల్లుతోనే మూన్నాళ్లు గడచిపోయాయి
మూగగా
పాఠశాల సంసిద్ధత
పునాది పునశ్చరణ ప్రణాళికలు పురుడు పోసుకున్నాయి
ఇప్పుడు
చరవాణి సానిటైజర్ లతో
చేతి నిండా...పనే
డిజిటల్ కంటెంట్ తో కంటినిండా ...
తరగతి గదులఅల్లరంతా
పదిలంగా సెల్లు లోకి వచ్చేసింది
ఉపాధ్యాయులే అడ్మిన్స్
మొన్నటి వరకు వొద్దన్నవే
వాడమని.....
బుద్ధిగా చూడమని...
ఇంటింటికి ఇంటర్నెట్
ఉండాలని...
స్వార్థమే
రేపటి భవితకు పరమార్థమని
నేడు నేర్పాలి కొత్త పాఠాలు
తప్పని సరై
శ్వాస పై కన్నేసి
కసిగా శాసిస్తున్న కరోనా
పిల్లలపాలిట శాపమై కన్నీళ్లు తెప్పిస్తుంది
వదలబొమ్మాళీ... అంటూ
అందరికి ఎంతో కొంత మర్యాద చేస్తుంది
వచ్చిన వారికి చుక్కల్లో లెక్కలు చూపిస్తూ..
రాని వారికి
ఊపిరాడనివ్వట్లేదు మాస్కులు ముసుగుల్తో..
ఎట్టకేలకు పుణ్యం కట్టుకుంది
ఎలాగైతేనేం
*ఏదో ఒకలా నన్నూ....*
*నా పిల్లల్ని కలిపింది*
10
[30/08, 9:00 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ::30-08-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం:: పాఠశాలలు తెరిచారు
*********************
పక్షులు వాలని చెట్టులా
వేదననగా నిరీక్షిస్తున్న ప్రాంగణం!
కేరింతల సవ్వడి లేక మూగబోయిన బడిగంట!
చదువుల మకరందం నింపుకున్న అక్షర పూదోట!
చిన్నారుల కోసం మనసంతా
కళ్ళు చేసుకొని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చిందని అణువణువూ సంబురం!
పాఠశాలలు తెరిచారనే శుభవార్తను మింగేసిన కరోనా..
అమ్మో బడికొద్దు !ఇంటికే బడి!
ఆన్ లైన్ లో పాఠాలు అంటున్న ప్రభుత్వం!
అశని పాతంలా తగిలిన దెబ్బకు
తెరుచుకున్న పాఠశాల తెల్లమొహం వేసింది!
శిశిరం వీడని బడి
మూగబోయిన బడిగంట..
దిక్కుతోచని స్థితిలో ఉపాధ్యాయులు
నిత్యం పాఠశాలకు వెళుతూ..
ఈ కరోనా గ్రహణం ఎప్పుడు వీడేనో..
బడి బాలల అనుబంధం ఎప్పుడు వెలుగులు పంచేనో..
11
[30/08, 9:00 PM] Rapolu Aruna Siripuram Poet: *కవితాగానం*
అంశం: పాఠశాలలు తెరిచారు
శీర్షిక: *కరోనామాయ*
మాయదారి మహమ్మారి
ఎలా వచ్చిందో
అసలెందుకు వచ్చిందో
చిన్నా పెద్దల నందరినీ
గడగడ లాడించేస్తూ
విద్యా వ్యవస్థనంతా
అతలాకుతలం చేస్తూ
మాయదారి మహమ్మారి
ఎలా వచ్చిందో
బడులైతే తెరిచారు
తప్పని పరిస్థితుల్లో
పిల్లల కవాతు లేదు
ప్రార్థనా గీతాల్లేవు
క్రీడా మైదానంలో
పచ్చిక బయళ్ళ మీదను
మచ్చికగా నాడుకొనే
చిచ్చర పిడుగులు లేరు
తరగతి గదులన్నీ
వెలవెల బోతున్నై
పిల్లల అల్లరి నడుమ న
*సైలెన్స్*అరుపులు లేవు
బడిబాటలో కనిపించే
కోలాహలమే లేదు
కళ తప్పిన ఆకాశంలా
కనిపించేదంతాశూన్యం
ఆన్లైన్ క్లాసులు అంటూనే
మొదలు పెట్టారు కానీ
మనసు పెట్టివినేవారు ఎందరో
సాంకేతిక సౌకర్యం
అందరికీ ఉందొలేదో
తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు
ఇది విషమ పరీక్షే
మళ్లీ మునుపటి రోజులు
ఇంకా ఎన్నాళ్లకో
మాయదారి మహమ్మారి ఎందుకొచ్చిందో
✍ రాపోలు అరుణాస్వామి,
12
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..పాఠశాలలు తెరిచారు
ఊహించని విపత్తుతో
ప్రపంచమే అల్లకల్లోలం
అన్ని రంగాలు కుదేలయ్యే
ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్న మయ్యే
భూగోళమే కరోనకు బందీ అయ్యేనే
సడలించిన ఆంక్షలతో
పాఠశాలలు తెరచుకున్నాయి
కానీ ఏం లాభం
పాఠశాల పూదోటలో విహరించే
విద్యార్థి గువ్వల సందడి లేక
తరగతి గదులన్నీ బోసిపోయి
బడిగంట మూగ నోము నోస్తూ
బడి కళ తప్పి పోయి
ఉపాధ్యాయుల ఉత్సాహం పోయి
చేసేదిలేక
ప్రభుత్వ ఆజ్ఞలను పాటిస్తూ
కరోన ను ఎదురొక్కొనేందుకు సిద్ధమై
విద్యార్థుల భవిష్యత్హును నష్టపోవద్దని
కదిలారు సైనికులై
ఆన్ లైన్ తరగతుల ఫలాలు ఎందరికి లాభం చేకూర్చునో
ఉపాధ్యాయుల కృషి ఫలించాలనే కోరుకుందాం
కరోన పీడ విరగడై
విద్యార్థులు బడి బాట పట్టే శుభదినం రావాలని కోరుకుందాం
సిరిపురం,8328277215
13.
శీర్షిక:*బడులు తెరిచారు*
---------****************---------
ప్రపంచప్రతినిధులకు ఎర్రతివాచీ పరచి
మతసమావేశాలకు సైతం అనుమతినిచ్చి
లెక్కలులేని వలసలను లెక్కలేనటు తలచి
బక్కప్రాణులను వీడనిచిక్కుల్లో విడిచి
చాలా దేశాల్లో కరోనా విజృంభిస్తున్న వేళల
మన విమానాల ద్వారా వాళ్ళను రానిచ్చి
దేశంలో ఒక్కకరోనా కేసైనా నమోదవ్వక
మునుపు అకస్మాత్తుగా అన్ని మూసి
పూర్తి లాక్ డౌన్ ను నిర్బంధంగా విధించి
ప్రజలు సంసిద్ధులుగా లేరని తెలిసినా
లాక్డౌన్ ను పొడిగిస్తూ వలసజీవుల ఉసురుతీసి
కరోనాకేసులు విపరీతంగా పెరుగుతున్నవేళల
అన్ని తలుపులు తెరచి రికార్డ్ స్థాయిలో నమోదవుతుంటే
పట్టనట్లుండటమేగాక బడిగుడి తలుపులు తెరచిరి
జనాభాలో ప్రథమ స్థానానికి ప్రయత్నిస్తున్నట్లే
కరోనాకేసుల్లో కూడా రికార్డ్ ల కోసమే కాబోలు
*చిన్నారిదేవుళ్ళు లేని ఆ అక్షరకోవెళ్ళు*
*నేడు జీవం లేని భౌతిక నిర్మాణాలు*
*పిల్లల గోలలు లేని పాఠశాలలు*
*పాట మరచి మూగబోయిన కోయిలలు*
పిల్లలకోడిలా పిల్లల మధ్యే గడిపే నేను
పుస్తకాలకోసo బడికొచ్చి నను వెతికి
చుట్టుముట్టిన పిల్లలతో 'దూరం దూరం'
అనటానికి ప్రాణం విలవిలలాడింది
డిజిటల్ క్లాస్సెస్ చూసి అర్థం చేసుకోగలిగే
ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే స్థితా వారిది?
ఎపుడు పోతుంది ఈ భయంకర పరిస్థితి?
ఎపుడు నెలకొనేనో సాధారణ జీవనస్థితి?
:వల్లాల *విజయలక్ష్మి*
ఆలేరు
వీరా గుడిపల్లి
సమన్వయం
శివునూరి లలితాకృష్ణ
సహకారం
మెరుగు మధు
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు
*************
కవివరుల జాబితా
1.ఇంద్రవత్ రాహుల్ గారు
2.కోరాడ నరసింహారావు గారు
3. డాక్టర్ ఆంజనేయులు గారు
4.వీరా గుడిపల్లి
5.శ్రీమతి నారాయణ భాగ్యలక్ష్మి గారు
6.వీరా గుడిపల్లి
7.స్వర్ణ సమత గారు
8.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
9.శివునూరి లలితా కృష్ణ గారు
10.సునంద వురిమిళ్ళ గారు
11.రాపోలు అరుణా స్వామి గారు
12.మర్రి జయశ్రీ గారు
13.వల్లాల విజయ లక్ష్మి గారు
**************
కవితా గానం... అలరించింది
బడులు తెరిచారు.
సమకాలీన అంశం పై స్పందించి
చక్కని... కవితలు అందించారు
కొన్ని మెటఫర్స్, సిమిలీస్
మన కవులు కవయిత్రులు
అసామాన్యమైన విధంగా స్పందించారు.
పట్టించుకుంటే, పనిగా చదివితే
కవిత్వాన్ని ప్రేమిస్తే......
వీరి కవన శైలికి.. సలాం చేయాల్సిందే....
.... వీరా గుడిపల్లి
**************
పిల్లలు లేని ఊహలో
.... ఇంద్రవత్ రాహుల్ గారు
లెక్కల చిట్టాలు
బిల్లు బుక్కుల బూజులు
..... కోరాడ గారు
ఈ ఆనందం యెవరికి
.... డాక్టర్ ఆంజనేయులు గారు
ఇంట్లో ఉండి
కబుర్లకై తపన
....నారాయణ భాగ్యలక్ష్మి గారు
డస్టర్ డస్ట్ బట్టి పోయింది
..... స్వర్ణ సమత గారు
బోసి బోయిన పాఠశాల ముఖద్వారం
... డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
ఎలాగైతేనేం
నన్నూ నా పిల్లల్ని కలిపింది
... శివునూరి లలితాకృష్ణ గారు
పాఠశాలలు తెరిచారనే
శుభవార్త.. అణువణువునా సంబురం
.... సునంద వురిమిళ్ళ గారు
బడి తెరిచారు
ప్రార్థనా గీతం లేకుండా
.... రాపోలు అరుణా స్వామి గారు
కరోనాకు బంధీఐన భూగోళం
..... మర్రి జయశ్రీ గారు
......
వచన కవితకు సొబగులద్దిన
కవి వరులకు... సలాం
...... కవితా గానం
**********************
[28/08, 8:01 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
============
అంశం : పాఠశాలలు తెరిచారు
తేది : 28/08/2020
🇮🇳 *పాఠశాలలు తెరిచారు*🇮🇳
బడి గంట మ్రోగింది
పిల్లలు సంతోషంతో
గంతులు వేశారు
ఒజ్జలు బాధ్యతతో
తమ బడికి వెళ్లారు
ఐదు నెలల నుండి ఉన్న
బడిని శుభ్రం చేసిన వేళా
అందరూ ఒకరినొకరు
ఆప్యాయతంగా మాట్లాడుకుంటూ
తమ పనులు పూర్తి చేసుకొని
ఆనందంగా కలిసి తింటూ
పిల్లలు లేని ఊహల్లో
ఉండి పోతూ అందుకే
పిల్లలు దేవుళ్ళు పిల్లలు
ఉంటేనే ఆనందం, సంతోషం...
*ఇంద్రావత్ రాహుల్*
*కొత్తపేట్*
*నిజామాబాద్*
2
9848054079..
[28/08, 8:10 PM] Korada: కవితాగానం
అంశం: - కవిత
పాఠశాలలుతెరిచారు
కోరాడ నరసింహా రావు ;వేదమంత్రాల్లా
**************
హమ్మయ్య....!
వెధవకరోనా...వస్తేరానీ....!జనాలు ఛస్తే చావనీ...!! గానీ...
ఈ స్వయం నిర్బంధ పు సంకెళ్లను త్రెంచి అవతలపారేయొచ్చు
ఆవారా ఐపోయిన
పిల్లల్లో ఎన్నాళ్లకు మళ్ళీ చదువుల హు షారు మొదలౌతోంది!
మూగబోయిన బడి గంటమళ్ళీఎన్నాళ్లకు
వొళ్ళువిరుచుకుని ...
గణ-గణ మంటోంది!
జీత,బత్తేలు లేక...
ఇన్నాళ్లూ నా నా అగ చాట్లూపడ్డ ప్రయివేట్
టీచర్లు మదిలోమళ్ళీ
ఎన్నాళ్లకు ఆశల పూలు మొగ్గతొడుగు
తున్నాయ్....!
ఇన్నాళ్లూబోసిపోయిన బడిఆవరణమళ్ళీ
ఎన్నాళ్లకు ముసి ముసి నవ్వులతో ...
మల్లెతోటలామారిపో యింది...!
ఇన్నాళ్లూ ఆదాయం
లేకపోయినా...అద్దె+
కరెంట్కట్టక తప్పని యాజమా న్యాలు
చిరు నవ్వులతో...
లెక్కలచిట్టాలు...,బిల్లుబుక్కులబూజులు
దులిపేసి...కొత్త పెళ్లి కూతుళ్ళలాముస్తాబులు అవుతూ...
వున్నవి...!
తరగతి గదుల లో...
పాఠాలు.... వేద మంత్రాల్లా శ్రా వ్యం గా వినిపిస్తున్నవి !!
****************
.......కోరాడ.
[28/08, 8:15 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: పాఠశాల**
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు
పాఠశాలలు తెరిచారు
పంతుళ్ల కు కష్టాలు మొదలయ్యాయి
ఇప్పుడు వర్క్షీట్లను సమర్పించు
ప్రతిరోజు పంతుళ్ల
హాజరు పార్టీలను చూసుకొని ప్రభుత్వం విద్యాశాఖకు పంపించాలి
badulu తీర్చారని సంబురం ఎవరికి ఉంది
కానీ నీ ఆన్లైన్ లో వివిధ ఛానల్లో ఎవరు వింటున్నారో ఎవరికీ తెలియదు కొద్దిమందికి దిగువ మధ్యతరగతి వాళ్లకి తప్ప పేదవారికి టీవీలు లేనే లేదు
ఇప్పుడు ఆన్లైన్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి
అందరూ చూస్తున్నారో లేదో ఎవరికీ తెలియదు
ఒక ఐదు ఆరు నెలల తర్వాత పాఠశాలలు కళాశాల పరిస్థితి కూడా ఇదే
పాఠాలు వినే వారందరూ వినని వారు ఎందరో ఎవరికి తెలుసు చెప్పడం మన బాధ్యత వినకపోతే వాళ్ల కర్మ
పాఠశాలలు తెరిచారు ఆన్లైన్ కష్టాలు మొదలయ్యాయి
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు భువనగిరి ఖమ్మం 7702537453 కష్టాలు మొదలయ్యాయి
4
ఇది వీరా గుడిపల్లి కవిత
28082020
Schools opened
*******************
దేశమంటే మట్టి కాదోయ్
గురజాడ మా అడుగు జాడ
ఆన్లైన్ లోకంలో
అర్థం మారిందా
బడి పంతులు లాప్ టాప్ లో
పిల్లల జాడలు
Zoom లో
తల్లి దండ్రుల తాపత్రయం
జియో మీట్ యాప్ లో సన్నిహిత సలహాలు
గూగుల్ మీట్ సమావేశంలో అధికారుల ఆదేశాలు
అడివై ఎదిగిన ప్రాంగణాల్లో
శాంతి కుటీరపు మౌనయోగులైన ఉపాధ్యాయుల మనసంతా దేవులాట
అయోమయం ఐతే కావచ్చు
అంతా భ్రాంతై కన్పించొచ్చు
యూ ట్యూబ్ అబద్దం కాదు...
రేపటి పాఠశాలలు తెరుచుకున్నాయి.
మూడో కన్ను కథ గాదని ఋజువై పోయింది
పాఠశాలలు తెరిచారు
పాఠశాలలు తెరుచుకున్నాయి
పిల్లలు తెరలపై
పంతుల్లకు
కనీసం కనిపిస్తున్నారు
Schools opened
...... వీరా గుడిపల్లి
5
కవితా గానం
29.8.20
నారాయణ భాగ్యలక్ష్మి
అంశం: పాటశాలలు తెరిచారు
కవితా శీర్షిక:
పిల్లలకు పండుగ
***************
పాఠశాల తెరిచారంటే
పిల్లలకు పండుగ సంబరం
కువ కువ రావాల వచ్చివాలే
గూటిలోని పక్షిపిల్లలాగా
బిర బిర బిరా పరుగుల
గంప కింద కోడి పిల్లలాగా
పిల్లలదంత ఒకటే పరుగు
తమ బంగారు నేస్తం బడి వైపు
మేతకు వెళ్ళిన ఆవు కోసం
లేగదూడ ఎదురుచూపులా
పూల తేనే కోసం తుమ్మెదల్లా
వంసంతం రాకకై కోయిలల్లా
బుట్ట గౌనుల చిట్టి పాపలు
బుడిబుడి నడకల చిన్ని బాబులు
పప్పు బెల్లాల తాయిలాలకై
ముందు వరసలో నిలుచున్న తీరుగ
బడిగంట కొట్టగానే గుడిగంట సడిలా
గల గల పారే సెలయేరుల్లా
కిల కిల నవ్వుల
పసిడి బాల్యపు పువ్వులు
మరో కొత్త బంగారు లోకంలో
అడుగిడుతున్న అందమైన
ఆనందాల అనుభూతి
సహజంగా పిల్లలకి బడి అంటే కష్టం
సెలవులంటే భలే సంబరం
కానీ నేడు
ఈ లాక్ డోన్ పుణ్యమా అని
ఇంట్లో ఉండి ఉండి మొహం మొత్తి
తమ బడి నేస్తాల కబుర్లులకై తపనలు
ఇన్నాళ్లు బోసిపోయిన
బడి తల్లి తలుపులు ఆదరంగా తెరచి
బడి గుడి ఒడి లోకి ఆహ్వానిస్తున్నాయి
నల్లబల్లల శుద్ధ ముక్కలు పలకా బలపం చిన్నారుల ఆత్మీయ స్పర్శకై..
ఆతృతగా ఎదురుచూస్తున్నాయి..
అందుకేనేమో
బడి అంటే అమ్మ ఒడి
అదే ఆ దేవుని గుడి ఇదే స్వచ్ఛమైన
గుడి బడి సమ్మెళనపు ఘంట సవ్వడి
6
ఇది వీరా గుడిపల్లి కవిత
29082020
ఇంటికొచ్చిన బడి
********************
మాయా దర్పణం
మాకు పాఠాలు చెబుతుంది
పాఠశాలకు పోవద్దంటుంది
మాస్టార్లు మా ఇంటి ముందు
మాస్కులతో నిలుచున్నారు
వర్క్ షీట్స్ వారి చేతుల్లో
సందేహాలకే సందేహం వస్తుంది
పాజిటివ్ అంటేనే భయం
అందరికీ నెగెటివ్ రావాలనే కోరిక
నాడు వద్దని చెప్పిన మొబైల్
కొనాల్సిందేనని కోరుతున్నారు
అప్పుడు తప్పన్నారు
ఇప్పుడు తప్పదంటున్నారు
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికామాటలాడమన్న బద్దెన యాదికొస్తుండు
బడి యాడుంది
నేనేడుంటె అక్కడనే
మిరప చేనుకు ముందు పెడుతుంటే
మెన్సురేషన్ పాఠం వస్తుందని
మొబైల్ లో చూడమని మాథ్స్ టీచర్ ఫోన్
ఇప్పుడు నేనో వీఐపీని
వీరా గుడిపల్లి లెక్కల సార్
విజయా మేడమ్ ఫిజిక్స్
తెలుగు బాలయ్య సార్
హిందీ భాస్కర్ రెడ్డి గారు
ఇంగ్లీష్ వినమని కరుణా మేడం
నేను ఫోన్ ఎత్తేదాక చేస్తూనే ఉంటారు
మా అమ్మ నాయినకు పెద్ద సారు
ఒకటే ఫోన్లు
సదువేందోగని సార్లైతె సాంతం ఫోన్లతోనే
బడికి బోయేది ఇదివరకు
గిప్పుడు
బడి మాయింటికి వచ్చింది
నా సుట్టు దిరుగుతుంది
.......... కాలం
యెప్పుడు ఒక్కతీరుగుంటాది.
సదుకుంట యెంత కష్టమైన
....... వీరా గుడిపల్లి
7
[30/08, 8:20 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*30/08/2020*
*పాఠ శాలలు తెరిచారు*
పాఠ శాలలు తెరిచారు,కానీ
మూగ బోయిన బెల్లు,
మోగుతున్న సెల్లు,
నల్ల బల్ల నల్ల పూస అయింది,
తెల్ల మొహం వేసి చూస్తుంది,
సుద్దముక్క సూ ద్ధామంటే
దాక్కుంది,
డ స్ట రేమో డస్ట్ పట్టి పోయింది,
బెంచీలు ఓ మూలన మూలుగు తున్నయ్,
ఆయ మ్మ పని లేక ఓ దగ్గర
కూలపడ్డది,
పెద్ద సార్ల తిప్పలేమో పెద్దవి,
టీచర్ల బాధలు వర్ణించ నలవి
కానివి,
పొరగాండ్లకు ఫోన్లు ఇయ్యద్ధనిరి,
ఇపుడేమో కొనియ్యమనవటిరి,
టీ.వి పాఠాలు మొద లాయే
టీచర్ల కేమో పాట్లు మొదలయ్యే,
విసిత్ర స దువులు,
వింతైన పాఠాలు,
పిల్లల చేతుల ల్ల పొద్దంతా
ఫోన్లు,
ఏ సబ్జెక్ట్ అర్థం కాక విద్యార్థి
తిక మక,
పాఠ శాల పాఠాలు లేక,
హాజరు లేదు , మిడ్డే మీల్స్
లేదు,
ఎన్నో ఏండ్లకు విస్తు పోయిన
పాఠ శాలలు,
పాఠ శాలలు తె రిచారు కానీ,
పిల్లలు లేని ఆ పాఠశాల
మో డు బారిన వృక్షమైంది.
నందన వనం లా ఉన్న
నా పాఠశాల,
నవ్వుల పువ్వులు లేని
నవీన ప్రాంత మై ,వెల వెల పోతోంది.
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
8
[30/08, 8:21 PM] Balloori Umadevi Poetess: 30/8/20
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం: పాఠశాలలు తెరిచారు
బడిలు తెరిచారన్న సంబరమే కానీ
హాజరు ఎంతంటుందో ఎవరికెరుక
పంతుళ్ల కేమో తప్పదిది కానీ
బాలబాలికల సంఖ్య తగ్గు నేమో
బోసి పోయిన పాఠశాల ముఖద్వారము
వెలుగులీనుచుండె సరికొత్తగా నేడు
ప్రార్థనా గీతంతో ప్రారంభమగుచు
సరికొత్త కొత్త ఉత్సాహం నింపు నికపైన
అమ్మ ఒడి లాంటి బడి కేగ పిల్లలు
పలక బలపాలతో సంసిద్ధులై నారు
బయటికి వెళ్లకుండా బందీలుగా ఉన్న చిన్నారులకు ఇప్పుడు రెక్కలు వచ్చినట్లు
పురివిప్పి ఆడేటి మయూరమ్ముల వలె నవ్వుతూ తుళ్ళుతూ బడికి వస్తారు జీతాలు లేక కాలమ్ము గడిపిన
ప్రైవేటు బడిపంతుళ్ళమోములు
పొద్దు తిరుగుడు పువ్వుల్లె వికసించు
గుడి వంటి బడి ఇది బాలబాలికలరా
చదువులమ్మను కొలువు వేళకు సరిగా
జాగు చేయక రండు వడివడిగ మీరు.
9.
పాఠశాలలు తెరిచారు
*బళ్ళు తెరుచుకున్నాయి*
*విడిచి పెట్టిన ఇళ్లలా.....*
ఆకులతో అలుముకున్న ఆవరణలో
అడుగుపెట్టింది మొదలు
ఊపిరాడనివ్వని ఉభయ కుశలోపరి సందళ్లు..
మోగే బడిగంట లేకుండా
తెల్ల బోయిన నల్ల బల్లలతో.....
సెల్లుతోనే మూన్నాళ్లు గడచిపోయాయి
మూగగా
పాఠశాల సంసిద్ధత
పునాది పునశ్చరణ ప్రణాళికలు పురుడు పోసుకున్నాయి
ఇప్పుడు
చరవాణి సానిటైజర్ లతో
చేతి నిండా...పనే
డిజిటల్ కంటెంట్ తో కంటినిండా ...
తరగతి గదులఅల్లరంతా
పదిలంగా సెల్లు లోకి వచ్చేసింది
ఉపాధ్యాయులే అడ్మిన్స్
మొన్నటి వరకు వొద్దన్నవే
వాడమని.....
బుద్ధిగా చూడమని...
ఇంటింటికి ఇంటర్నెట్
ఉండాలని...
స్వార్థమే
రేపటి భవితకు పరమార్థమని
నేడు నేర్పాలి కొత్త పాఠాలు
తప్పని సరై
శ్వాస పై కన్నేసి
కసిగా శాసిస్తున్న కరోనా
పిల్లలపాలిట శాపమై కన్నీళ్లు తెప్పిస్తుంది
వదలబొమ్మాళీ... అంటూ
అందరికి ఎంతో కొంత మర్యాద చేస్తుంది
వచ్చిన వారికి చుక్కల్లో లెక్కలు చూపిస్తూ..
రాని వారికి
ఊపిరాడనివ్వట్లేదు మాస్కులు ముసుగుల్తో..
ఎట్టకేలకు పుణ్యం కట్టుకుంది
ఎలాగైతేనేం
*ఏదో ఒకలా నన్నూ....*
*నా పిల్లల్ని కలిపింది*
10
[30/08, 9:00 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ::30-08-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం:: పాఠశాలలు తెరిచారు
*********************
పక్షులు వాలని చెట్టులా
వేదననగా నిరీక్షిస్తున్న ప్రాంగణం!
కేరింతల సవ్వడి లేక మూగబోయిన బడిగంట!
చదువుల మకరందం నింపుకున్న అక్షర పూదోట!
చిన్నారుల కోసం మనసంతా
కళ్ళు చేసుకొని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చిందని అణువణువూ సంబురం!
పాఠశాలలు తెరిచారనే శుభవార్తను మింగేసిన కరోనా..
అమ్మో బడికొద్దు !ఇంటికే బడి!
ఆన్ లైన్ లో పాఠాలు అంటున్న ప్రభుత్వం!
అశని పాతంలా తగిలిన దెబ్బకు
తెరుచుకున్న పాఠశాల తెల్లమొహం వేసింది!
శిశిరం వీడని బడి
మూగబోయిన బడిగంట..
దిక్కుతోచని స్థితిలో ఉపాధ్యాయులు
నిత్యం పాఠశాలకు వెళుతూ..
ఈ కరోనా గ్రహణం ఎప్పుడు వీడేనో..
బడి బాలల అనుబంధం ఎప్పుడు వెలుగులు పంచేనో..
11
[30/08, 9:00 PM] Rapolu Aruna Siripuram Poet: *కవితాగానం*
అంశం: పాఠశాలలు తెరిచారు
శీర్షిక: *కరోనామాయ*
మాయదారి మహమ్మారి
ఎలా వచ్చిందో
అసలెందుకు వచ్చిందో
చిన్నా పెద్దల నందరినీ
గడగడ లాడించేస్తూ
విద్యా వ్యవస్థనంతా
అతలాకుతలం చేస్తూ
మాయదారి మహమ్మారి
ఎలా వచ్చిందో
బడులైతే తెరిచారు
తప్పని పరిస్థితుల్లో
పిల్లల కవాతు లేదు
ప్రార్థనా గీతాల్లేవు
క్రీడా మైదానంలో
పచ్చిక బయళ్ళ మీదను
మచ్చికగా నాడుకొనే
చిచ్చర పిడుగులు లేరు
తరగతి గదులన్నీ
వెలవెల బోతున్నై
పిల్లల అల్లరి నడుమ న
*సైలెన్స్*అరుపులు లేవు
బడిబాటలో కనిపించే
కోలాహలమే లేదు
కళ తప్పిన ఆకాశంలా
కనిపించేదంతాశూన్యం
ఆన్లైన్ క్లాసులు అంటూనే
మొదలు పెట్టారు కానీ
మనసు పెట్టివినేవారు ఎందరో
సాంకేతిక సౌకర్యం
అందరికీ ఉందొలేదో
తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు
ఇది విషమ పరీక్షే
మళ్లీ మునుపటి రోజులు
ఇంకా ఎన్నాళ్లకో
మాయదారి మహమ్మారి ఎందుకొచ్చిందో
✍ రాపోలు అరుణాస్వామి,
12
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..పాఠశాలలు తెరిచారు
ఊహించని విపత్తుతో
ప్రపంచమే అల్లకల్లోలం
అన్ని రంగాలు కుదేలయ్యే
ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్న మయ్యే
భూగోళమే కరోనకు బందీ అయ్యేనే
సడలించిన ఆంక్షలతో
పాఠశాలలు తెరచుకున్నాయి
కానీ ఏం లాభం
పాఠశాల పూదోటలో విహరించే
విద్యార్థి గువ్వల సందడి లేక
తరగతి గదులన్నీ బోసిపోయి
బడిగంట మూగ నోము నోస్తూ
బడి కళ తప్పి పోయి
ఉపాధ్యాయుల ఉత్సాహం పోయి
చేసేదిలేక
ప్రభుత్వ ఆజ్ఞలను పాటిస్తూ
కరోన ను ఎదురొక్కొనేందుకు సిద్ధమై
విద్యార్థుల భవిష్యత్హును నష్టపోవద్దని
కదిలారు సైనికులై
ఆన్ లైన్ తరగతుల ఫలాలు ఎందరికి లాభం చేకూర్చునో
ఉపాధ్యాయుల కృషి ఫలించాలనే కోరుకుందాం
కరోన పీడ విరగడై
విద్యార్థులు బడి బాట పట్టే శుభదినం రావాలని కోరుకుందాం
సిరిపురం,8328277215
13.
శీర్షిక:*బడులు తెరిచారు*
---------****************---------
ప్రపంచప్రతినిధులకు ఎర్రతివాచీ పరచి
మతసమావేశాలకు సైతం అనుమతినిచ్చి
లెక్కలులేని వలసలను లెక్కలేనటు తలచి
బక్కప్రాణులను వీడనిచిక్కుల్లో విడిచి
చాలా దేశాల్లో కరోనా విజృంభిస్తున్న వేళల
మన విమానాల ద్వారా వాళ్ళను రానిచ్చి
దేశంలో ఒక్కకరోనా కేసైనా నమోదవ్వక
మునుపు అకస్మాత్తుగా అన్ని మూసి
పూర్తి లాక్ డౌన్ ను నిర్బంధంగా విధించి
ప్రజలు సంసిద్ధులుగా లేరని తెలిసినా
లాక్డౌన్ ను పొడిగిస్తూ వలసజీవుల ఉసురుతీసి
కరోనాకేసులు విపరీతంగా పెరుగుతున్నవేళల
అన్ని తలుపులు తెరచి రికార్డ్ స్థాయిలో నమోదవుతుంటే
పట్టనట్లుండటమేగాక బడిగుడి తలుపులు తెరచిరి
జనాభాలో ప్రథమ స్థానానికి ప్రయత్నిస్తున్నట్లే
కరోనాకేసుల్లో కూడా రికార్డ్ ల కోసమే కాబోలు
*చిన్నారిదేవుళ్ళు లేని ఆ అక్షరకోవెళ్ళు*
*నేడు జీవం లేని భౌతిక నిర్మాణాలు*
*పిల్లల గోలలు లేని పాఠశాలలు*
*పాట మరచి మూగబోయిన కోయిలలు*
పిల్లలకోడిలా పిల్లల మధ్యే గడిపే నేను
పుస్తకాలకోసo బడికొచ్చి నను వెతికి
చుట్టుముట్టిన పిల్లలతో 'దూరం దూరం'
అనటానికి ప్రాణం విలవిలలాడింది
డిజిటల్ క్లాస్సెస్ చూసి అర్థం చేసుకోగలిగే
ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే స్థితా వారిది?
ఎపుడు పోతుంది ఈ భయంకర పరిస్థితి?
ఎపుడు నెలకొనేనో సాధారణ జీవనస్థితి?
:వల్లాల *విజయలక్ష్మి*
ఆలేరు
Comments
Post a Comment